AP 8th Class Social Important Questions Chapter 15 చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం

These AP 8th Class Social Important Questions 15th Lesson చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం will help students prepare well for the exams.

AP Board 8th Class Social 15th Lesson Important Questions and Answers చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం

ప్రశ్న 1.
పిల్లల పట్ల పెద్దల ప్రవర్తన ఎలా ఉండాలి? భద్రత దృష్ట్యా కొన్ని సూచనలు చేయండి.
జవాబు:
పిల్లల పట్ల పెద్దలు ప్రేమ పూర్వకంగా మరియు స్నేహభావంతో మెలగాలి. పిల్లల చదువుల విషయంలో వారికి ఒక స్నేహితుడిలాగ అవగాహన కలిగించి వారు సరియైన దారిని ఎంచుకునే లాగ ప్రోత్సహించాలి. వారు ఏ చిన్న తప్పు చేసినా దాన్ని పెద్దది చేసి చూపకుండ వారు చేసిన తప్పును సరిదిద్ది మరలా వారు దానిని చేయకుండా చూడాలి. వారికి చదువు ఒక్కటే కాదు ఆటలు, పాటలు అనేవి కూడా వారి జీవన విధానంలో ప్రధానమని ప్రోత్సహించాలి. పిల్లలకు పెద్ద వారిని గౌరవించడం నేర్పాలి. వారు టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగిస్తున్నారో గమనించాలి. పిల్లలకు లోకజ్ఞానమును నేర్పించాలి. వారికి వాహనములను నడపడం పట్ల మరియు రోడ్డు భద్రత అంశాల మీద అవగాహన కలిగించాలి. సోషల్ మీడియాను పిల్లలు సరియైన దారిలో ఉపయోగించేలాగ చూడాలి.

AP 8th Class Social Important Questions Chapter 15 చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం

ప్రశ్న 2.
నిన్ను ఒకరు వేధిస్తున్నారని ఊహించుకోండి. దానికి సంబంధించి అన్ని వివరాలను పొందుపరుస్తూ పోలీస్ అధికారికి . ఫిర్యాదు రాయండి.
జవాబు:

మహరాజశ్రీ, విజయవాడ వటౌన్ పోలీస్ స్టేషన్ S.I. గారి దివ్య సుముఖమునకు పంజాగుట్ట కాలనీవాసురాలిని మరియు దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుచున్న ‘నేహ’ అనే విద్యార్థిని చేసుకుంటున్న విన్నపము.

అయ్యా ,
గతకొంతకాలంగా నేను పాఠశాలకు నడచి వెళ్తున్న సమయంలో మా వీధిలోని కొంతమంది పనిచేయకుండా ఖాళీగా ఉన్న యువకులు టీజింగ్ చేయడం మొదలు పెట్టారు. ఇంటి దగ్గర పెద్దవారికి చెప్తే వారు వచ్చి ఆ యువకులను మందలించగా కొన్ని రోజులు బాగానే ఉన్నారు. మరలా ఒక నెల రోజుల నుండి టీజింగ్ చేయడమే కాకుండా, అసభ్య పదజాలమును వాడటం, నా వెనకాల స్కూలుదాగ రావడం చేస్తున్నారు. దీని వలన నా చదువు దెబ్బతింటుంది. నాకు పాఠశాలకు వెళ్ళాలంటే భయము వేస్తుంది. కావున దయ ఉంచి మీరు నన్ను వారి బారీ నుండి కాపాడవలసినదిగా ప్రార్థిస్తున్నాను.
కృతజ్ఞతలతో,

ఇట్లు
తమ విధేయురాలు,
నేహ.

అడ్రసు :
నేహ
D/O. శ్రీనివాసరావు
పంజా సెంటర్
4వ నెంబరు వీధి
133-1/11

ప్రశ్న 3.
గ్రామాలలో / కుటుంబాలలో తరచు తగాదాలు ఎందుకు వస్తాయి? దానికి కారణాలు ఏవి? అవి రాకుండా ఉందాలంటే మన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రావాలి?
జవాబు:
గ్రామస్తులు ఒకరితో ఒకరు కలసిమెలిసి ఉంటారు. ఇంకొకరి విషయాలలో వారి అనుమతి లేకుండానే తలదూరుస్తారు. ‘వ్యక్తిగతం’ అనేదాన్ని విస్మరిస్తారు. కావున తగాదాలు వస్తాయి. కాబట్టి వారు పట్టణ/నగర నాగరికతను అలవరుచుకుంటే మంచిది.

ప్రశ్న 4.
ఈ క్రింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులిమ్ము.

బెయిలు :
రవిది క్రిమినల్ కేసు కాబట్టి నేరారోపణ పత్రం (చార్జిషీటు దాఖలు చేసిన తరవాత లాకప్ లో నిర్బంధించారు. క్రిమినలు కేసులలో నిందితులను జైలులో ఉంచుతారు. అయితే ఇది శిక్షకాదు. ఇది నేర విచారణలో దోహదపడటానికి, లేదా నిందితుడు సాక్ష్యాలను కనుమరుగు చేయకుండా ఉండటానికి, లేదా సాక్షులను బెదిరించకుండా ఉండటానికి ఉద్దేశించినది. పోలీసు లాకప్ లో కొన్ని రోజులు ఉన్న తరువాత రవి కుటుంబం బెయిలు కోసం న్యాయస్థానంలో దరఖాస్తు చేసుకుంది. హత్య, లంచగొండితనం, దోపిడీ వంటి నేరాలు మోపబడిన వ్యక్తికి బెయిలు దొరకకపోవచ్చు. బెయిలు పొందటానికి న్యాయస్థానంలో కొన్ని హామీలు ఇవ్వాలి. ఈ హామీ ఆస్తులు కావచ్చు లేదా పూచీకత్తుగా నిలబడే వ్యక్తి కావచ్చు. బాండు కావచ్చు. అడిగినప్పుడు న్యాయస్థానంలో నిందితుడు హాజరు అవుతాడని బాండు హామీ ఇస్తుంది. బెయిలు మంజూరు చేయాలో, లేదా నిరాకరించాలో న్యాయస్థానంలో న్యాయమూర్తి నిర్ణయిస్తారు.
అ) రవిని ఎందులో నిర్బంధించినారు?
జవాబు:
రవిని లాకప్ లో నిర్బంధించినారు.

ఆ) క్రిమినల్ కేసులలో నేర విచారణలో దోహదపడటానికి ఏం చేస్తారు?
జవాబు:
నిందితులను జైలులో ఉంచుతారు.

ఇ) బెయిలు కోసం ఎవరికి దరఖాస్తు చేశారు?
జవాబు:
న్యాయస్థానంలో దరఖాస్తు చేశారు.

ఈ) బెయిల్ పొందడానికి న్యాయస్థానంలో ఏమి ఇవ్వాలి?
జవాబు:
న్యాయస్థానంలో కొన్ని హామీలు ఇవ్వాలి.

ఉ) బెయిల్ ను ఎవరు మంజూరు చేస్తారు?
జవాబు:
న్యాయమూర్తి

AP 8th Class Social Important Questions Chapter 15 చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం

ప్రశ్న 5.
ఈ క్రింది పేరాను చదివి జవాబులిమ్ము.

ఇంతకు ముందు అధ్యాయాలలో మనం భారతదేశ రాజ్యాంగం గురించి చదువుకున్నాం. రాజ్యాంగంలో ముఖ్యమైన అంశం కార్యనిర్వాహక, న్యాయ, శాసన అధికారాలను వేరు చేయటం. దీని అర్థం ఒక రంగంలో మిగిలిన రంగాలు అంటే ఉదాహరణకు న్యాయ రంగంలో శాసన, కార్యనిర్వాహక రంగాలు జోక్యం చేసుకోలేవు. న్యాయస్థానాలు ప్రభుత్వ అధీనంలో లేవు. ప్రభుత్వం తరపున పని చేయవు.

పోలీసులు కూడా న్యాయరంగంలో భాగం కాదు. వాళ్లు కార్యనిర్వాహక రంగానికి చెందినవాళ్లు. గత సంవత్సరం మీరు జిల్లాస్థాయి పరిపాలన గురించి చదివారు. జిల్లాస్థాయిలో కలెక్టరు మాదిరిగా శాంతి, భద్రతల నిర్వహణకు జిల్లాస్థాయి ప్రభుత్వ పోలీసు అధికారి ఉంటాడు. రాష్ట్ర ప్రభుత్వంలోని హోం మంత్రిత్వశాఖ కింద పోలీసుశాఖ పనిచేస్తుంది.
అ) రాజ్యాంగంలో ముఖ్యమైన అంశం ఏది?
జవాబు:
రాజ్యాంగంలో ముఖ్యమైన అంశం కార్యనిర్వాహక, న్యాయ, శాసన అధికారాలను వేరుచేయడం.

ఆ) న్యాయస్థానాలు ఎవరి ఆధీనంలో లేవు?
జవాబు:
న్యాయస్థానాలు ప్రభుత్వ ఆధీనంలో లేవు.

ఇ) పోలీసులు ఏ రంగానికి చెందినవారు?
జవాబు:
పోలీసులు కార్యనిర్వాహక రంగానికి చెందినవారు.

ఈ) పోలీసుశాఖ ఎవరి క్రింద పనిచేస్తుంది?
జవాబు:
రాష్ట్ర ప్రభుత్వంలోని హోంమంత్రిత్వశాఖ కింద పోలీసుశాఖ పనిచేస్తుంది.

Leave a Comment