AP 8th Class Social Important Questions Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ

These AP 8th Class Social Important Questions 12th Lesson భారత ఎన్నికల వ్యవస్థ will help students prepare well for the exams.

AP Board 8th Class Social 12th Lesson Important Questions and Answers భారత ఎన్నికల వ్యవస్థ

8th Class Social 12th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
ఎన్నికల నియమావళిని ఎవరు రూపొందిస్తారు?
జవాబు:
దేశంలో ఎన్నికలను భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ఈ సంఘం రాజకీయ పార్టీల కోసం “ఎన్నికల నియమావళి”ని రూపొందిస్తుంది.

ప్రశ్న 2.
భారతదేశం ఎన్నికల సంఘం ఎప్పుడు ఏర్పడింది?
జవాబు:
భారతదేశం ఎన్నికల సంఘం 1950, జనవరి 25న ఏర్పడింది.

ప్రశ్న 3.
సార్వజనీన ఓటుహక్కు అంటే ఏమిటి?
జవాబు:
ఎన్నికల కమీషన్ నియమావళి ప్రకారం ఎన్నికలు జరిగే సంవత్సరంలో ఆ ఏడాది జనవరి 1 నాటికి 18 సం||లు నిండినవారు కుల, జాతి, మత, లింగ, భాషాపరమైన భేదాలు లేకుండా ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. దీనినే ‘సార్వజనీన ఓటు హక్కు’ అంటారు.

ప్రశ్న 4.
ఎలక్ట్రే ట్ అంటే ఏమిటి?
జవాబు:
ఓటర్లందరినీ కలిపి ‘ఎలక్ట్రేట్’ అంటారు.

ప్రశ్న 5.
ప్రాంతీయ పార్టీగా గుర్తించాలంటే ఎన్ని ఓట్లు రావాలి?
జవాబు:
రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లలో 3% ఓట్లు లేదా 3 శాసనసభ స్థానాలు పొందితే ఎన్నికల సంఘం ఒక పార్టీని ప్రాంతీయ పార్టీగా గుర్తిస్తుంది.

AP 8th Class Social Important Questions Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ

ప్రశ్న 6.
జాతీయ పార్టీగా గుర్తింపు పొందడం ఎలా?
జవాబు:
సాధారణ ఎన్నికల్లో కనీసం 4 రాష్ట్రాలలో పోలైన ఓట్లలో 6% చొప్పున పొందిన ఓట్లు లేదా 4 వేర్వేరు రాష్ట్రాల నుండి 11 లోక్సభ సీట్లు సాధిస్తే అది జాతీయ పార్టీగా గుర్తింపు పొందుతుంది.

ప్రశ్న 7.
ఎన్నికల ప్రచారం ఎప్పుడు నిలిపివేయాలి?
జవాబు:
ఎన్నికలకు 48 గంటలకు ముందుగా ప్రచారం నిలిపివేయాలి. ఎస్ఎంన్లు కూడా నిషిద్ధం, మద్యం పంపిణీ చేయకూడదు.

ప్రశ్న 8.
ఓ రాజకీయ పార్టీ ఎలా ఆవిర్భవిస్తుంది?
జవాబు:
మన దేశంలో నిబంధనావళిని రాసుకొని ఎన్నికల కమీషన్ దగ్గర రిజిస్టర్ చేయిస్తే ఓ రాజకీయ పార్టీ ఆవిర్భవిస్తుంది.

ప్రశ్న 9.
రిటర్నింగ్ అధికారి అంటే ఎవరు?
జవాబు:
ప్రతి నియోజక వర్గంలో ఎన్నికలను నిర్వహించడానికి, పర్యవేక్షించడానికి నియమించబడే అధికారే ‘రిటర్నింగ్ అధికారి’.

ప్రశ్న 10.
ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏ స్థాయి అధికారి?
జవాబు:
పోలింగ్ బూతులో నియమించబడే అధికారి ప్రిసైడింగ్ ఆఫీసర్.

ప్రశ్న 11.
సాధారణ ఎన్నికలు అని వేటిని అంటారు?
జవాబు:
5 సం||లకు ఒకసారి దేశం లేదా రాష్ట్ర స్థాయిలో జరిగే ఎన్నికలను ‘సాధారణ ఎన్నికలు’ అంటారు.

ప్రశ్న 12.
ఉప ఎన్నికలు అని వేటిని అంటారు?
జవాబు:
ఒకటి లేదా కొన్ని ఖాళీలకు నిర్వహించే ఎన్నికలను ఉప ఎన్నికలు’ అంటారు.

ప్రశ్న 13.
మధ్యంతర ఎన్నికలు అని వేటిని అంటారు?
జవాబు:
5 సం||ల పూర్తికాలం గడవకముందే శాసనసభకు లేదా పార్లమెంటుకు ఎన్నికలు నిర్వహిస్తే వాటిని ‘మధ్యంతర ఎన్నికలు’ అంటారు.

AP 8th Class Social Important Questions Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ

ప్రశ్న 14.
NOTA అంటే ఏమిటి?
జవాబు:
None of the above

ప్రశ్న 15.
రాజకీయ పార్టీ అనగానేమి?
జవాబు:
ఉమ్మడి రాజకీయ విశ్వాసాలు, ఆసక్తులు కలిగి ఉండి రాజకీయ అధికారాన్ని సంపాదించడానికి సంఘంగా ఏర్పడిన వ్యక్తుల సముదాయాన్ని రాజకీయ పార్టీ అంటారు.

ప్రశ్న 16.
స్వతంత్ర అభ్యర్థులు అంటే ఎవరు?
జవాబు:
ఏ రాజకీయ పార్టీ తరఫున కాక వేరేగా పోటీ చేసే వారిని స్వతంత్ర అభ్యర్థులు అంటారు.

8th Class Social 12th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
ఎన్నికల కమీషన్ చిహ్నంను చిత్రించండి.
జవాబు:
AP 8th Class Social Important Questions Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ 1

ప్రశ్న 2.
టి.ఎన్. శేషన్ సిఫార్సులు ఏవి?
జవాబు:

  1. ప్రచార సమయాన్ని నామినేషన్ ఉపసంహరించుకునేందుకు నిర్ణయించిన తేదీ నుండి 14 రోజులుగా నిర్ణయించారు.
  2. ఒక అభ్యర్థి ఒకేసారి రెండు కంటే ఎక్కువ నియోజకవర్గాల నుండి పోటీ చేయరాదు.
  3. ఒక వ్యక్తి ఏదైనా నేరంలో కనీసం 2 ఏండ్లు శిక్ష అనుభవిస్తే 6 ఏండ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలి.
  4. ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థి మరణిస్తే ఎన్నిక వాయిదా వేయాలి. కానీ రద్దు చేయకూడదు.
  5. ప్రచారం పూర్తి అయిన తరువాత 48 గంటల వరకు మద్యం అమ్మకాలు నిషేధించాలి.

ప్రశ్న 3.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని ఏవేని రెండు అంశాలు వ్రాయండి.
జవాబు:

  1. పార్టీలు, అభ్యర్థులు జాతి, కుల, మత, ప్రాంతీయపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించకూడదు.
  2. ఇతర రాజకీయ పార్టీలను, అభ్యర్థులను విమర్శించేటప్పుడు ప్రజాజీవితంతో సంబంధం లేని వ్యక్తిగత దూషణలు చేయకూడదు.

ప్రశ్న 4.
దా॥ సుబ్రమణ్య స్వామి కేసు గురించి రాయండి.
జవాబు:
డా|| సుబ్రమణ్య స్వామి కేసులో 2013లో సుప్రీంకోర్టు, ఓటరు తన ఓటును వినియోగించుకున్న తరువాత తాను ఓటు వేసిన అభ్యర్థి పేరు, గుర్తు మొదలైన వివరాలతో కూడిన ముద్రిత పేపరు పొందడానికి వీలుగా ఈవీఎంలలో ఓటర్ -వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వి.వి.పి.ఏ.టి.) ఏర్పాటు చేయాలని పేర్కొంది.

ప్రశ్న 5.
ఓటరు ప్రతిజ్ఞను రాయండి.
జవాబు:
భారతదేశ పౌరులమైన మేము, ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామనీ, మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము.

AP 8th Class Social Important Questions Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ

ప్రశ్న 6.
రాజకీయ పార్టీలు ఎన్నికలలో చేయకూడనివి (ఏవేని రెండు) ఏవి?
జవాబు:

  1. అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదు. పార్టీ పనులకు పాలనాయంత్రాంగాన్ని వినియోగించకూడదు.
  2. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక ఎటువంటి గ్రాంట్లు, చెల్లింపులు చేయకూడదు, కొత్త పథకాలు ప్రకటించకూడదు. శంకుస్థాపనలు చేయకూడదు, హామీలు ఇవ్వకూడదు.

ప్రశ్న 7.
ఈ క్రింది పేరాను చదివి, ఈయబడిన ప్రశ్నలకు సమాధానములిమ్ము.
కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బంది లేరు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(6) ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్ల అనుమతితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందిని ఎన్నికల నిర్వహణ కోసం తీసుకుంటుంది. ఆ సమయంలో ఆ సిబ్బందిపై కేంద్ర ఎన్నికల సంఘానికే అధికారం ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి లేకుండా వారిని బదిలీ చేయడం లేదా పదోన్నతులు కల్పించడం వంటివి చేయకూడదు.
ప్రశ్నలు :
1) ఎన్నికల సిబ్బంది ఎందుకు అవసరం?
జవాబు:
ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సిబ్బంది అవసరం.

2) ఎన్నికల సిబ్బంది ఎవరి అధీనంలో ఉంటారు?
జవాబు:
ఎన్నికల కమిషన్ అధీనంలో ఉంటారు.

ప్రశ్న 8.
భారత రాజకీయ వ్యవస్థలో ఎన్నికల కమీషన్ ప్రముఖ పాత్ర వహిస్తుంది, కాని టి.ఎన్.శేషన్ (1990 – 1996) కాలం నుండి గణనీయమైన ప్రజాభిమానాన్ని చూరగొన్నది. శేషన్ భారత ఎన్నికల్లో అవినీతిని అంతం చేయడానికి ఎంతో ప్రయత్నం చేశారు. అతని తరువాతనే ఎన్నికల కమీషన్ అధికారాల గురించి దేశ వ్యాప్తంగా ఒక గుర్తింపు వచ్చింది.
1) T.N. శేషన్ పదవీకాలం ఏది?
జవాబు:
1990 – 1996

2) ఈ కాలం ఎందుకు ప్రజాభిమానాన్ని చూరగొంది?
జవాబు:
అవినీతిని అంతం చేయాలన్న TN శేషన్ ప్రయత్నం మూలంగా ఈ కాలం ప్రజాభిమానాన్ని చూరగొంది.

ప్రశ్న 9.
ఎన్నికలలో పొందిన ఓట్ల శాతాన్ని, బట్టి పార్టీలను ప్రాంతీయ, జాతీయ పార్టీలుగా ఎన్నికల సంఘం గుర్తిస్తుంది. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లలో 3% ఓట్లు లేదా 3 శాసనసభ స్థానాలు పొందితే ఎన్నికల సంఘం ఒక పార్టీని ప్రాంతీయ పార్టీగా గుర్తిస్తుంది. సాధారణ ఎన్నికల్లో కనీసం 4 రాష్ట్రాలలో పోలైన ఓట్లలో 6% చొప్పున పొందిన ఓట్లు లేదా 4 వేర్వేరు రాష్ట్రాల నుండి 11 లోకసభ సీట్లు సాధిస్తే అది జాతీయ పార్టీగా గుర్తింపు పొందుతుంది.
1) ఏవేని రెండు జాతీయ, ప్రాంతీయ పార్టీల పేర్లు చెప్పండి.
జవాబు:

  1. భారత జాతీయ కాంగ్రెసు
  2. భారతీయ జనతా పార్టీ
  3. తెలుగుదేశం
  4. ద్రవిడ మున్నేట్ర కజగం

2) ఒక ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఏం సాధించాలి?
జవాబు:
రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లలో 3% ఓట్లు లేదా 3 శాసనసభ స్థానాలు సాధించాలి.

AP 8th Class Social Important Questions Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ

ప్రశ్న 10.
EVM ల గురించి వ్రాయండి.
జవాబు:
AP 8th Class Social Important Questions Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ 2
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను భారతదేశంలో మొట్టమొదటగా 1989-90 దేశంలోని 16 శాసనసభా నియోజకవర్గాలలో ప్రయోగాత్మకంగా వాడారు. EVM ల విశ్వసనీయత మీద అనేక మంది సందేహాలు లేవనెత్తారు. కానీ ఎవరూ నిరూపించలేకపోయారు. అయినప్పటికీ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి భారత ఎన్నికల సంఘం ఈ EVM లలో ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్’ సౌకర్యం కల్పించడానికి నిర్ణయం తీసుకున్నది.

8th Class Social 12th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
భారత ఎన్నికల సంఘం గురించి రాయండి.
జవాబు:
భారత ఎన్నికల సంఘం 1950, జనవరి 26న ఏర్పడింది. ఇది ఒక స్వయంప్రతిపత్తి గల రాజ్యాంగ సంస్థ. తన అధికారంతో భారతదేశంలో ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించే బాధ్యత దానిపై ఉంది. ఓటర్ల జాబితాను రూపొందించి దేశంలో లోకసభ, రాజ్యసభ, రాష్ట్ర శాసన సభలు, రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహిస్తుంది.

కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బంది లేరు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(6) ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్ల అనుమతితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందిని ఎన్నికల నిర్వహణ కోసం తీసుకుంటుంది. ఆ సమయంలో ఆ సిబ్బందిపై కేంద్ర ఎన్నికల సంఘానికే అధికారం ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి లేకుండా వారిని బదిలీ చేయడం లేదా పదోన్నతులు కల్పించడం వంటివి చేయకూడదు.

ప్రశ్న 2.
ప్రధాన ఎన్నికల కమీషనర్ గురించి రాయండి.
జవాబు:
ప్రధాన ఎన్నికల కమీషనర్ : ప్రధాన ఎన్నికల అధికారి భారతదేశంలో ఎన్నికల కమీషను అధిపతి, జాతీయ మరియు రాష్ట్ర శాసనసభల ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా జరపడానికి ఇతనికి రాజ్యాంగబద్ధంగా పలు అధికారాలు ఇవ్వబడ్డాయి. ఇతను సాధారణంగా భారత సివిల్ సర్వీసుకు చెందినవాడై వుంటాడు. ఇతని పదవీ కాలం 6 సం||రాలు లేదా 65 సం||లు నిండేవరకు పదవిలో ఉంటాడు. మొదట ఎన్నికల సంఘం ఏకసభ్య సంస్థగా అనగా ఒక ప్రధాన ఎన్నికల అధికారితో మాత్రమే పనిచేసింది. దీన్ని 1993లో త్రిసభ్య సంస్థగా మారుస్తూ ఇద్దరు కమీషనర్లను అదనంగా నియమించారు.

ప్రశ్న 3.
ఎన్నికలలో రాజకీయ పార్టీల గురించి రాయండి.
జవాబు:
ఎన్నికలలో రాజకీయ పార్టీలు :
మన దేశంలో నిబంధనావళిని రాసుకొని ఎన్నికల కమీషన్ దగ్గర రిజిష్టర్ చేయిస్తే ఓ రాజకీయ పార్టీ ఆవిర్భవిస్తుంది. ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు గుర్తులను కేటాయిస్తుంది. ఎన్నికలలో పొందిన ఓట్ల శాతాన్ని బట్టి పార్టీలను ప్రాంతీయ, జాతీయ పార్టీలుగా ఎన్నికల సంఘం గుర్తిస్తుంది. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో , పోలైన ఓట్లలో 3% ఓట్లు లేదా 3 శాసనసభ స్థానాలు పొందితే ఎన్నికల సంఘం ఒక పార్టీని ప్రాంతీయ పార్టీగా గుర్తిస్తుంది. సాధారణ ఎన్నికల్లో కనీసం 4 రాష్ట్రాలలో పోలైన ఓట్లలో 6% చొప్పున పొందిన ఓటు లేదా 4 వేర్వేరు రాష్ట్రాల నుండి 11 లోక్ సభ సీట్లు సాధిస్తే అది జాతీయ పార్టీగా గుర్తింపు పొందుతుంది.

ప్రశ్న 4.
అభ్యర్థుల ప్రవర్తనా నియమావళిలోని ముఖ్యమైన అంశాలు ఏవి?
జవాబు:

  1. పార్టీలు, అభ్యర్థులు జాతి, కుల, మత, ప్రాంతీయపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించకూడదు.
  2. ఇతర రాజకీయ పార్టీలను, అభ్యర్థులను విమర్శించేటప్పుడు ప్రజాజీవితంతో సంబంధం లేని వ్యక్తిగత దూషణలు చేయవద్దు.
  3. రాజకీయ ప్రకటనల ద్వారా జాతి, కుల, మతపరమైన అభ్యర్థనలు చేయకూడదు.
  4. మసీదులు, చర్చిలు, దేవాలయాలు, ఇతర ప్రార్ధన, పవిత్ర స్థలాల్లో, పాఠశాలల్లో ఎన్నికల ప్రచారం చేయకూడదు.
  5. ఓటర్లకు లంచాలు ఇచ్చి ప్రలోభపెట్టడం గానీ, బెదిరించడం గానీ చేయకూడదు.
  6. ఒకరి స్థానంలో మరొకరిని ఓటరుగా వినియోగించరాదు.
  7. పోలింగ్ స్టేషన్‌కు 100 మీటర్ల పరిధిలో ప్రచారం నిర్వహించకూడదు.
  8. గడువు దాటాక ప్రచారం చేయకూడదు.
  9. పోలింగ్ స్టేషన్‌కు ఓటర్లను తీసుకురావడం, తిరిగి తీసుకెళ్లడం వంటివి నిషిద్ధం.
  10. ప్రశాంత జీవనం గడిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికి భంగం కలిగేలా ఇళ్ల ముందు నిరసన ప్రదర్శనలు, పికెటింగ్లు చేయడం నిబంధనలకు విరుద్ధం.
  11. అనుమతి లేకుండా ఇళ్లపై జెండాలు ఎగురవేయడం, బ్యానర్లు కట్టడం, గోడలపై నినాదాలు రాయడం, పోస్టర్లు అతికించడం వంటివి చేయరాదు.

ప్రశ్న 5.
ఎన్నికలు : కోర్టు తీర్పులు’ కు సంబంధించి ఏవేని రెండు విషయాలను రాయండి.
జవాబు:

  1. పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ కేసు 2013లో పోటీ చేస్తున్న అభ్యర్థులను కాదని వారికి ప్రతికూలంగా ఓటు వేసే అధికారం ఓటరుకు ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ తీర్పు అమలు చేయడానికి ఎన్నికల సంఘం నోటా (NOTA)ను ఏర్పాటు చేసింది.
  2. పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ కేసు 2013లో సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలకు పోటీ చేసే అభ్యర్థి నేరచరిత్ర, జీవితభాగస్వామి, పిల్లలు, ఆస్తులు, అప్పులు, విద్యార్హత మొదలైన అంశాలతో కూడిన ప్రమాణపత్రాన్ని తప్పనిసరిగా వెల్లడించాలని పేర్కొంది.

AP 8th Class Social Important Questions Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ

ప్రశ్న 6.
ఎన్నికల సమయంలో అధికార పార్టీ ఏమేమి చేయరాదు?
జవాబు:

  1. అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదు, పార్టీ పనులకు పాలనాయంత్రాంగాన్ని వినియోగించకూడదు.
  2. అధికార పర్యటనలు, పార్టీ ప్రచార పర్యటనలు రెండూ కలిపి ఉండరాదు.
  3. ప్రభుత్వ వాహనాలను ప్రచారానికి వాడరాదు.
  4. సెక్యూరిటి వాహనాలు మూడుకు మించితే దాన్ని ఎన్నికల వ్యయంలో చూపెట్టాలి.
  5. ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డ నాటి నుండి ఎన్నికల వ్యయం అమల్లోకి వస్తుంది.
  6. ప్రభుత్వ వసతి గృహాలు, ఆఫీసులు మొదలైన ప్రభుత్వ ఆస్తులు ఏవికూడా పార్టీలు, ప్రచారానికి వినియోగించకూడదు.
  7. పత్రికల్లో, టీవీల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి ప్రకటనలు ఇవ్వకూడదు.
  8. పత్రికల్లో, టీవీల్లో ఇచ్చే పార్టీ ప్రకటనలు ముందుగా ఎన్నికల సంఘానికి చూపించి అనుమతి తీసుకోవాలి.
  9. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక ఎటువంటి గ్రాంట్లు, చెల్లింపులు చేయకూడదు, కొత్త పథకాలు ప్రకటించకూడదు. శంకుస్థాపనలు చేయకూడదు, హామీలు ఇవ్వకూడదు.

ప్రశ్న 7.
ఓటింగ్ ప్రక్రియ రోజు జరిగే తంతును వివరించండి.
జవాబు:
జిల్లా ఎన్నికల అధికారులు పోలింగ్ ఏర్పాట్లను విస్తృతంగా చేస్తారు. పోలింగ్ కేంద్రాలను నెలకొల్పి పోలింగ్ స్టేషన్లలో విధులు నిర్వహించడానికి ‘ప్రిసైడింగ్ ఆఫీసర్’ను నియమిస్తారు. ఇతనికి సహాయంగా మరికొంత మందిని ‘పోలింగ్ ఆఫీసర్స్’ గా నియమిస్తారు. ఇంకొంత మందిని పర్యవేక్షణకు ప్రత్యేకంగా నియమిస్తారు. పోలింగ్ రోజున ఓటర్ల జాబితాలో పేర్లున్న ఓటర్లందరినీ ఓటు వేయడానికి అనుమతిస్తారు. ఈ ప్రక్రియలో ఓటర్లను గుర్తించడానికి పోలింగ్ ఏజెంట్లు సహాయపడతారు. ఓటుహక్కును వినియోగించుకోబోతున్నవారి ఎడమచేతి చూపుడువేలిపై చెరిగిపోని (ఇండెలిబుల్) సిరాగుర్తు పెడతారు. ఈ.వి.యం.లు కాకుండా బ్యాలెట్ డబ్బాలను వాడుతుంటే బ్యాలెట్ పత్రంలో స్వస్తిక్ (2) ముద్రవేసి, నిర్ణీత విధంగా మడిచి బ్యాలెట్ పెట్టెలో వేస్తారు.

పోలింగ్ పూర్తి అయిన తర్వాత ఈవియం/బ్యాలెట్ పెట్టెలకు సీలు వేసి ఓట్ల లెక్కింపు కేంద్రాలకు తరలిస్తారు. అక్కడ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థిని ఎన్నికైనట్లుగా ప్రకటిస్తారు.

ప్రశ్న 8.
ఎన్నికలలో ఉపయోగించే ఇండెలిబుల్ ఇంక్ గురించి రాయండి.
జవాబు:
ఎన్నికల సిరా :
AP 8th Class Social Important Questions Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ 3
ఎన్నికలలో అక్రమాలు, ద్వంద్వ ఓటింగ్ నిరోధించేందుకు చూపుడు వేలిపై చెరిగిపోని సిరాతో గుర్తు పెట్టే పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈ సిరాను ఎన్నికల కమిషన్ అన్ని పోలింగ్ కేంద్రాలకు సరఫరా చేస్తోంది. పంచాయితీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల దాకా ఈ సిరా లేనిదే ఎన్నికల తంతు ముగియదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఈ ఇంక్ వాడకం అమల్లో ఉంది. థాయ్ లాండ్, సింగపూర్, నైజీరియా, మలేషియా, దక్షిణాఫ్రికా వంటి దేశాలకు మనదేశంలో తయారయ్యే ఇండెలి బుల్ ఇంకును సరఫరా చేస్తున్నారు. మన దేశంలో మైసూరు, హైదరాబాద్ నగరాల్లో ఇండెలిబుల్ ఇంక్ తయారీ కేంద్రాలు ఉన్నాయి.

ప్రశ్న 1.
మొదటి లోకసభ ఎన్నికలు, 1952

పార్టీలు గెలుపొందిన సీట్లు
కాంగ్రెస్ 364
కమ్యూనిస్టు మరియు మిత్ర పార్టీలు 23
సోషలిస్టులు 12
కిసాన్ మజుదూర్ ప్రజాపార్టీ 9
జనసంఘ్ 3
హిందూ మహాసభ 4
రామ రాజ్య పరిషత్ 3
ఇతర పార్టీలు 30
స్వతంత్రులు 41
మొత్తం 489

ఎ. మొదటి లోకసభ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?
బి. సమానమైన సంఖ్యలో సీట్లు గెలుపొందిన పార్టీలు ఏవి?
సి. లోక్ సభ ఎన్నికల్లో రెండవ స్థానం పొందిన పార్టీ ఏది?
డి. మొదటి లోకసభ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చింది?
జవాబు:
ఎ) మొదటి లోకసభ ఎన్నికలు 1952వ సం||లో జరిగాయి.

బి) సమానమైన సంఖ్యలో సీట్లు గెలుపొందిన పార్టీలు

  1. జనసంఘ్
  2. రామరాజ్య పరిషత్

సి) లోక్ సభ ఎన్నికలలో రెండవ స్థానంలో ఉన్న పార్టీ – స్వతంత్ర అభ్యర్థులు

డి) మొదటి లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వచ్చింది.

ప్రశ్న 2.
కింది సమాచారాన్ని పరిశీలించి దిగువ ప్రశ్నలకు జవాబులివ్వండి.

లోకసభకు ఎన్నికలు జరిగిన సంవత్సరం ఓటుహక్కు ఉపయోగించుకున్న ఓటర్ల శాతం
1952 46%
1957 48%
1962 55%
1967 61%
1971 55%
1977 60%
1980 57%
1985 64%
1989 62%
1991 56%
1996 58%
1998 62%
1999 59%
2004 58%
2009 58%

ఎ) ఓటు హక్కును ఉపయోగించుకున్న ఓటర్ల శాతం సంతృప్తికరంగా ఉన్నదా? మీ అభిప్రాయం రాయండి.
బి) ఓటు హక్కును వినియోగించుకునే ఓటర్లశాతం పెరిగేటందుకు తీసుకోదగిన కొన్ని చర్యలను సూచించండి.
సి) 16వ లోకసభ ఎన్నికలు ఏ సం||లో జరిగాయి?
డి) 1977 ఎన్నికల ద్వారా ఏర్పడిన ప్రభుత్వ పాలనాకాలం గురించి మీ పరిశీలన తెలపండి.
జవాబు:
ఎ) ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లశాతం సంతృప్తికరంగా లేదు. 80% మంది ఓటర్లు అన్నా తమను పరిపాలించే నాయకులను ఎన్నుకోవాలి అనేది నా అభిప్రాయం.
బి) ఓటు హక్కును వినియోగించుకునే ఓటర్ల శాతం పెరగాలంటే ఓటర్లలో చైతన్యం తీసుకురావాలి. మరియు ఓటు యొక్క ప్రాధాన్యతను, విలువను వివరించాలి.
సి) 2014లో 16వ లోకసభ ఎన్నికలు జరిగాయి.
డి) 1977లో ఎన్నుకోబడిన ప్రభుత్వ పరిపాలనా కాలం కేవలం 3 సం||లు మాత్రమే. ఎన్నుకోబడిన పార్టీల నాయకులలో ఏకాభిప్రాయం లేకపోవడమే ప్రధాన కారణం.

ప్రశ్న 3.

సంవత్సరం ప్రాముఖ్యత
1931 కరాచీ సమావేశం
1937 బ్రిటిష్ ఇండియాలో ఎన్నికలు
1946, జులై రాజ్యాంగసభకు ఎన్నికలు
1947, ఆగష్టు 15 భారతదేశ స్వాతంత్ర్యం
1947, ఆగష్టు 29 రాజ్యాంగ రచనా సంఘం ఏర్పాటు
1949, నవంబర్ 26 రాజ్యాంగ సభచే రాజ్యాంగం ఆమోదం
1950, జనవరి 26 రాజ్యాంగం అమలులోకి రావటం
1952 తొలి సాధారణ ఎన్నికలు

పట్టికను చదివి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
1) రాజ్యాంగ సభకు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?
2) 1946 – 1950 సంవత్సరాల మధ్య జరిగిన సంఘటనలు ఏవి?
3) భారత రాజ్యాంగం ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది?
4) ఎవరి ఆమోదంతో రాజ్యాంగం అమలులోకి వచ్చింది?
జవాబు:

  1. రాజ్యాంగ సభకు ఎన్నికలు 1946, జులైలో జరిగాయి.
  2. 1946-50 సంవత్సరాల మధ్య జరిగిన సంఘటనలు
    1. రాజ్యాంగ సభకు ఎన్నికలు
    2. భారతదేశ స్వాతంత్ర్యం
    3. రాజ్యాంగ రచనా సంఘం ఏర్పాటు
    4. రాజ్యాంగ సభచే రాజ్యాంగం ఆమోదం
  3. భారత రాజ్యాంగం 1950, జనవరి 26 నుండి అమలులోనికి వచ్చింది.
  4. రాజ్యాంగ సభ ఆమోదంచే రాజ్యాంగం అమలులోకి వచ్చింది.

ప్రాజెక్టు పని:

ప్రశ్న 1.
వివిధ రాష్ట్రాలలో ప్రధాన రాజకీయ పార్టీలు, వాటి గుర్తులు, ఆయా పార్టీ నాయకులు మొదలగు వివరాలతో కూడిన ఆల్బమ్ ను తయారుచేసి తరగతి గదిలో ప్రదర్శించండి.
జవాబు:
AP 8th Class Social Important Questions Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ 4 AP 8th Class Social Important Questions Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ 5

ప్రశ్న 2.
స్వతంత్ర భారతదేశంలో లోకసభకు ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు, ప్రభుత్వం ఏర్పాటుచేసిన పార్టీలు, నిర్వహించిన ఎన్నికల సంఘం అధికారి సమాచారాన్ని సేకరించి పట్టికలో రాయండి.
జవాబు:
AP 8th Class Social Important Questions Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ 6

Leave a Comment