AP 8th Class Physical Science Important Questions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్

These AP 8th Class Physical Science Important Questions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్ will help students prepare well for the exams.

AP Board 8th Class Physical Science 7th Lesson Important Questions and Answers నేలబొగ్గు మరియు పెట్రోలియమ్

8th Class Physics 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్ 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
తరగని శక్తి వనరులను నిర్వచించి, ఉదాహరణలు రాయండి.
జవాబు:
శక్తి వనరులను ఉపయోగిస్తే తరిగిపోతాయి, కాని వాటిని పునరుత్పత్తి చేయబడే శక్తి వనరుల్ని తరగని శక్తి వనరులు అంటారు.
ఉదా : సౌరశక్తి, వాయుశక్తి, జలశక్తి మరియు బయోమాస్ శక్తి.

ప్రశ్న 2.
తరిగిపోయే శక్తి వనరులను నిర్వచించి, ఉదాహరణలు రాయండి.
జవాబు:
శక్తి వనరులను ఉపయోగిస్తే తరిగిపోయి, తిరిగి ఉత్పత్తి చేయలేని శక్తి వనరులను తరిగిపోయే శక్తి వనరులు అంటారు.
ఉదా : నేలబొగ్గు, పెట్రోలియం , సహజ వనరులు.

ప్రశ్న 3.
బయోడీజిల్ తరగని శక్తి వనరు, దీనిని ఎలా తయారు చేస్తారు?
జవాబు:
వృక్ష తైలాలు లేదా జంతువుల కొవ్వులను వివిధ రసాయన చర్యలకు గురిచేసి బయోడీజిల్ ను తయారుచేస్తారు.

ప్రశ్న 4.
అధిక మొత్తంలో బయోడీజిల్ తయారుచేస్తే ఏర్పడే నష్టం ఏమిటి?
జవాబు:
బయోడీజిల్ తరగని శక్తి వనరు. బయోడీజిల్ ను అధిక మొత్తంలో ఉత్పత్తి చేయాలంటే వ్యవసాయ యోగ్యమైన భూమి అవసరం. ఎక్కువ మొత్తంలో బయోడీజిల్ కొరకు వ్యవసాయం చేస్తే ముందు కాలంలో ఆహార కొరత ఏర్పడవచ్చును.

ప్రశ్న 5.
పదార్థ శాస్త్రం అనగానేమి?
జవాబు:
పదార్థాల గురించి వివరించే విజ్ఞానశాస్త్ర శాఖను ‘పదార్థ శాస్త్రం’ అంటారు.

AP 8th Class Physical Science Important Questions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్

ప్రశ్న 6.
సహజ వనరులు అనగానేమి?
జవాబు:
మనం ఉపయోగిస్తున్న పదార్థాలు ప్రకృతిలోని వివిధ వనరుల నుండి ఉత్పన్నమైన వాటిని ‘సహజ వనరులు’ అంటారు.

ప్రశ్న 7.
సహజ వనరులకు కొన్ని ఉదాహరణలు రాయండి.
జవాబు:
నేల, నీరు, గాలి మొదలగునవి.

ప్రశ్న 8.
బారెల్ అనగానేమి?
జవాబు:
159 లీటర్ల ఘనపరిమాణాన్ని ఒక బారెల్ అంటారు.

ప్రశ్న 9.
బారెల్ దేనికి ఉపయోగిస్తారో తెల్పండి.
జవాబు:
చమురు పరిశ్రమలో బారెల్ ను ప్రమాణంగా కొలుస్తారు.

ప్రశ్న 10.
మన చుట్టూ ఉండే గాలి ఎప్పుడైనా పూర్తిగా దొరక్కుండా పోయే అవకాశం ఉందా?
జవాబు:
గాలి అనేది తరగని వనరు. గాలి ఎప్పటికైనా అందుబాటులో ఉంటుంది.

ప్రశ్న 11.
ఎప్పుడైనా మనకు ప్రకృతిలో నీరు పూర్తిగా దొరక్కుండా పోయే అవకాశం ఉందా?
జవాబు:
నీరు తరగని వనరు. కావున ఎప్పటికీ నీరు దొరుకుతుంది.

ప్రశ్న 12.
మానవ చర్యల వల్ల ఏ వనరులు తరిగిపోతున్నాయి?
జవాబు:
నేలబొగ్గు, పెట్రోలియమ్ ల పరిమితమైన నిల్వలు ఉన్నాయి. ఈ వనరులను నిరంతరం మానవులు వినియోగించడం వల్ల ఈ వనరులు తరిగిపోతున్నాయి.

ప్రశ్న 13.
నేలబొగ్గు, పెట్రోలియమ్ అపరిమితమైన నిల్వలు మనకు అందుబాటులో ఉన్నాయా?
జవాబు:
నేలబొగ్గు, పెట్రోలియంల పరిమితమైన నిల్వలు మాత్రమే ఉన్నాయి.

ప్రశ్న 14.
CNG వాయువు అనగానేమి?
జవాబు:
అత్యధిక పీడనాల వద్ద సంపీడనం చెందించిన సహజ వాయువును సంపీడత సహజ వాయువు (Compressed Natural Gas) అంటారు.

ప్రశ్న 15.
CNG వాయువు ఉపయోగాలు వ్రాయండి.
జవాబు:
CNG వాయువును వాహనాలలో ఇంధనంగా మరియు విద్యుత్ ఉత్పత్తిలో ఉపయోగిస్తారు.

ప్రశ్న 16.
నేలబొగ్గును గాలిలో మండించినపుడు ఏర్పడు వాయువు ఏది?
జవాబు:
కార్బన్ డై ఆక్సైడ్ (CO2)

ప్రశ్న 17.
కార్బోనైజేషన్ అనగానేమి?
జవాబు:
నేలబొగ్గును గాలి తగలకుండా 500°C నుండి 1000°C వరకు వేడిచేయడాన్ని కార్బోనైజేషన్ అంటారు.

AP 8th Class Physical Science Important Questions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్

ప్రశ్న 18.
నేలబొగ్గును కార్బోనైజేషన్ చేస్తే ఏయే పదార్థాలు ఏర్పడతాయి?
జవాబు:
నేలబొగ్గును కార్బోనైజేషన్ చేస్తే కోక్, కోల్ తారు మరియు కోల్ గ్యాస్లు ఏర్పడును.

ప్రశ్న 19.
కోక్ అనగానేమి?
జవాబు:
నేలబొగ్గును కార్బోనైజేషన్ చేయగా ఏర్పడు దృఢమైన, నల్లని సచ్ఛిద్ర పదార్థమును కోక్ అంటారు.

ప్రశ్న 20.
కోక్ ఉపయోగాలు వ్రాయండి.
జవాబు:
ఇది కార్బన్ యొక్క స్వచ్ఛమైన రూపం. కోక్ ను స్టీలు మరియు లోహ సంగ్రహణలో ఉపయోగిస్తారు.

ప్రశ్న 21.
కోల్ తారు ఏ విధంగా ఏర్పడును?
జవాబు:
నేలబొగ్గును కార్బోనైజేషన్ చేయగా, దుర్వాసన గల నల్లటి చిక్కనైన ద్రవమును కోల్ తారు అంటారు.

ప్రశ్న 22.
కోల్ గ్యాస్ ఏ విధంగా ఏర్పడునో తెల్పండి.
జవాబు:
నేలబొగ్గును కార్బోనైజేషన్ చేయగా ఏర్పడు వాయువును కోల్ గ్యాస్ అంటారు.

ప్రశ్న 23.
కోల్ గ్యాస్ ఉపయోగాలు రాయండి.
జవాబు:
కోల్‌ గ్యాసను పరిశ్రమలలో ఇంధనంగా ఉపయోగిస్తారు.

ప్రశ్న 24.
పెట్రో రసాయనాలు అనగా నేమి?
జవాబు:
పెట్రోలియం మరియు సహజ వాయువుల నుండి పొందే ఉపయుక్తకరమైన పదార్థాలను పెట్రో రసాయనాలు అంటారు.

ప్రశ్న 25.
నిత్య జీవితంలో పెట్రో రసాయనాల ఉపయోగాలు రెండింటిని పేర్కొనండి.
జవాబు:
పెట్రో రసాయనాల నుండి డిటర్జంటులు, కృత్రిమ దారాలు, ప్లాస్టిక్ లను తయారు చేస్తారు.

ప్రశ్న 26.
భూతాపం (గ్లోబల్ వార్మింగ్) అనగానేమి?
జవాబు:
ఇంధనాలను మండించడం వలన విడుదలయ్యే కార్బన్ డై ఆక్సైడ్ వాతావరణంలో మార్పులకు మరియు తద్వారా భూమి వేడి ఎక్కుటను భూతాపం లేదా గ్లోబల్ వార్మింగ్ అంటారు.

ప్రశ్న 27.
భారతదేశంలో సహజ వాయువుల నిల్వలు ఎక్కడ ఉన్నాయి?
జవాబు:
త్రిపుర, ముంబయి, కృష్ణా, గోదావరి డెల్టా మరియు జైసల్మేర్లలో గ్యాస్ నిల్వలు ఉన్నాయి.

ప్రశ్న 28.
నేలబొగ్గులోని రకాలను తెల్పండి.
జవాబు:

  1. 96% కార్బన్ గల నేలబొగ్గును ఆంత్ర సైట్ బొగ్గు అంటారు. ఇది శ్రేష్ఠమైన బొగ్గు.
  2. 65% కార్బన్ గల నేలబొగ్గును బిట్యుమినస్ బొగ్గు అంటారు.
  3. 38% కార్బన్ గల నేలబొగ్గును లిగ్నెట్ బొగ్గు అంటారు.

AP 8th Class Physical Science Important Questions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్

ప్రశ్న 29.
బొగ్గును మరియు పెట్రోలియంలను ఎలా సంరక్షించుకోవాలి?
జవాబు:
బొగ్గు మరియు పెట్రోలియమ్ వినియోగాన్ని రెండు రకాలుగా తగ్గించగలుగుతాం.

  1. ఈ వనరులపై ఆధారపడకుండా అభివృద్ధి చెందుటకు ఉపయోగపడు విభిన్న నమూనాను అనుసరించడం.
  2. ఈ వనరుల వినియోగంలో జరిగే వ్యర్థాలను పూర్తిగా తగ్గించడం.

ప్రశ్న 30.
అడవుల్ని నరికివేశారనుకోండి, చెట్లు తిరిగి పెరగడానికి ఎంత కాలం పడుతుంది?
జవాబు:
పూర్తిస్థాయిలో అడవులు ఏర్పడాలంటే కనీసం 50 నుండి 100 సంవత్సరాలు పడుతుంది.

ప్రశ్న 31.
పెట్రోలియం, సహజ వాయువు వంటి ఇంధన వనరులను పొదుపు చేయవలసిన అవసరం ఉంది. దీనిపట్ల ప్రజలలో అవగాహన కలిగించుటకు ఒక నినాదాన్ని వ్రాయండి.
జవాబు:
నేటి ఇంధన పొదుపు – రేపటి భవితకు మదుపు.

ప్రశ్న 32.
పెట్రోలియం ఒక సంక్లిష్ట మిశ్రమం. దానిలోని అనుఘటకాలను వేరు చేయుటకు అనుసరించు విధానం ఏది?
జవాబు:
అంశిక స్వేదనం.

8th Class Physics 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్ 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
నేలబొగ్గు ఏర్పడే విధానం వివరించండి.
జవాబు:
తేమ ఉండే లోతట్టు ప్రాంతాలలో విస్తారమైన దట్టమైన అడవులలో చెట్లు కొన్ని ప్రకృతి వైపరీత్యాలైన వరదలు, తుఫాన్లు మరియు భూకంపాల వల్ల భూమిలోనికి కూరుకుపోయి కాలక్రమంలో మట్టిచే కప్పబడతాయి. మట్టి లోపల ఉండే జీవ పదార్థం ఒత్తిడి పెరుగుతుంది. అలాగే అత్యధిక ఉష్ణోగ్రత పీడనం వల్ల జీవ పదార్థాల అవశేషాలు కార్బోనైజేషన్, ప్రక్రియకులోనై నెమ్మదిగా కొన్ని బిలియన్ల సంవత్సరాలలో నేలబొగ్గుగా ఏర్పడుతుంది.

ప్రశ్న 2.
బయోడీజిల్ ఉపయోగాలు వ్రాయండి.
జవాబు:

  1. బయోడీజిల్ ను డీజిల్ ఇంజన్లలో ఉపయోగిస్తారు మరియు విద్యుత్ తయారీలో ఉపయోగించవచ్చును.
  2. బయోడీజిల్ కాలుష్యరహిత ఇంధనం.

ప్రశ్న 3.
కోల్ తారుతో ఏ ఏ పదార్థాలను ఉత్పత్తి చేయవచ్చునో తెల్పండి.
జవాబు:

  1. కోల్ తారు దాదాపు 200 పదార్థాల మిశ్రమము.
  2. కోల్ తారును అంశిక స్వేదనము చేయడం ద్వారా బెంజీన్, టోలిన్, నాఫ్తలీన్, ఫినాల్, క్రిమిసంహారకాలు, మందులు, పేలుడు పదార్థాలు, రంగులు, కృత్రిమ దారాలు, ఫోటోగ్రాఫిక్ పదార్థాలు, ఇంటి పై కప్పులు మరియు పరిమళ పదార్థాలు మొదలగునవి పొందవచ్చును.

AP 8th Class Physical Science Important Questions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్

ప్రశ్న 4.
మన చుట్టూ ఉండే ఈ వనరులు ఎల్లప్పుడూ ఇలాగే అందుబాటులో ఉంటాయా?
జవాబు:

  1. మన చుట్టూ ఉండే తరగని వనరులు ఎల్లపుడు ఇలాగే అందుబాటులో ఉంటాయి.
    ఉదా : సౌరశక్తి, గాలి, పవనశక్తి, అలలశక్తి, జలశక్తి.
  2. మనచుట్టూ ఉండే తరిగిపోయే వనరులు ఎల్లపుడు ఇలాగే అందుబాటులో ఉండవు.
    ఉదా : నేలబొగ్గు, పెట్రోలియమ్.

8th Class Physics 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్ 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
పెట్రోల్ తయారీ విధానాన్ని వివరించండి.
జవాబు:
శుద్ధి చేయబడిన ముడిచమురు (పెట్రోలియం)ను స్వేదన స్థంభము ద్వారా అంశిక స్వేదనము చేయుట ద్వారా పెట్రోల్ ను పొందవచ్చును. స్వేదన స్థంభములో వేరు వేరు ఉష్ణోగ్రతల వద్ద వేరు వేరు అంశీభూతాలు ద్రవీభవనం చెందుటకు వేరు వేరు తొట్లు ఉంటాయి.
AP 8th Class Physical Science Important Questions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్ 1

అంశిక స్వేదనము :

  1. శుద్ధి చేయబడిన ముడిచమురును ఇనుప తొట్టిలో వేసి 400°C వరకు వేడిచేస్తారు. ఇందులో గల ఘటకాలన్నీ బాష్పీభవనము చెందుతాయి. ఆస్ఫాల్ట్ అనే ఘన పదార్థము మాత్రమే తొట్టిలో మిగిలిపోతుంది.
  2. పై ప్రక్రియలో ఏర్పడిన బాష్పాలు అంశిక స్వేదన స్థంభము గుండా ప్రవహిస్తూ చల్లబడతాయి.
  3. అంశిక స్వేదన స్థంభము పొడవైన స్థూపాకార పాత్ర. ఇందులో అడ్డంగా అమర్చిన స్టీలు చిప్పలుంటాయి. ఒక్కొక్క చిప్పకు ఒక పొగ గొట్టం ఉంటుంది. ప్రతి చిప్పా వదులుగా ఉండే ఒక మూతను కలిగి ఉండును.
  4. స్వేదన స్థంభములోనికి పెట్రోలియం బాష్పాలు పైకి వెళ్లే కొద్దీ క్రమంగా చల్లబడుతాయి. ఈ క్రమంలో అధిక బాష్పీభవన ఆస్ఫాల్ట్ స్థానము గల అంశీ భూతాలు త్వరగా చల్లబడి స్వేదన స్థంభములో అడుగు భాగంలో గల చిప్పలలో ద్రవీభవనం పెట్రోల్ తయారుచేయుట పారఫిన్ వాక్స్ చెందుతాయి.
  5. అల్ప బాష్పీభవన ఉష్ణోగ్రత గల అంశీభూతాలు స్వేదన స్థంభపు పై భాగాన గల తొట్టెలలో ద్రవీభవనం చెందుతాయి.
  6. 40°C – 70 °C ఉష్ణోగ్రత వద్ద ద్రవీభవనం చెందిన అంశీభూతం పెట్రోల్ గా ఏర్పడును.

ప్రశ్న 2.
వివిధ అవసరాలను తీర్చే కలప కోసం తొందరగా అడవుల్ని నరికివేశారనుకోండి, ఏం జరుగుతుంది?
జవాబు:

  1. అడవుల్ని నరకడం వలన వర్షపాతం తగ్గుతుంది.
  2. వాతావరణంలో ఆక్సిజన్ శాతం తగ్గుతుంది.
  3. మృత్తికా క్రమక్షయం జరుగుతుంది.
  4. అడవి జంతువులు క్రమంగా అంతరించిపోతాయి.
  5. నీటిపారుదల కాలువలు, నదీ మార్గాలు పూడుకుపోవడం వలన వరదలు వచ్చినపుడు పంటలు, ఆస్తి నష్టం మరియు భూసారం తగ్గుతుంది.
  6. అడవులు నరికివేత వలన గ్రీన్‌హౌస్ ప్రభావము ఏర్పడుతుంది.
  7. అడవి ఉత్పత్తులు తగ్గిపోతాయి.
  8. అడవులు నరికివేత వలన గ్లోబల్ వార్మింగ్ ఏర్పడి భూగోళం ఉష్ణగోళంగా మారుతుంది.

ప్రశ్న 3.
మన నిత్య జీవితంలో వివిధ రంగాలలో పెట్రోరసాయనాల వినియోగం ఏ విధంగా ఉన్నాయో వ్రాయండి.
జవాబు:
i) వ్యవసాయ రంగంలో పెట్రో రసాయనాల ఉపయోగాలు :

  1. ప్లాస్టిక్ గొట్టాలు, పెట్టెలు, బుట్టలు తయారుచేస్తారు.
  2. వ్యవసాయ పనిముట్లు తయారుచేస్తారు.
  3. ఎరువుల తయారీలో ఉపయోగిస్తారు.

ii) పారిశ్రామిక రంగంలో పెట్రోరసాయనాల ఉపయోగాలు :

  1. కార్లు, మరపడవల తయారీలో ఉపయోగిస్తారు.
  2. సమాచార ప్రసార పరికరాల తయారీలో ఉపయోగిస్తారు.
  3. నిర్మాణ సామాగ్రి పరికరాల తయారీలో ఉపయోగిస్తారు.
  4. కాగితపు పరిశ్రమలో ఉపయోగిస్తారు.
  5. బెలు, తోలు పట్టీల తయారీలో ఉపయోగిస్తారు.
  6. టైర్ల తయారీలో ఉపయోగిస్తారు.

iii) గృహ, ఇతర రంగాలలో పెట్రోరసాయనాల ఉపయోగాలు :

  1. వైద్య పరికరాల తయారీకి ఉపయోగిస్తారు.
  2. దుస్తులు, పరుపుల తయారీలో ఉపయోగిస్తారు.
  3. కాళ్ళకు వేసుకునే సాక్సుల తయారీలో ఉపయోగిస్తారు.
  4. గృహోపకరణాల పెయింట్ల తయారీలో ఉపయోగిస్తారు.
  5. డ్రైక్లీనింగ్ ద్రవాలు తయారుచేస్తారు.
  6. కృత్రిమ దారాలు, సౌందర్య సాధనాలు తయారుచేస్తారు.
  7. ఔషధాలు తయారుచేస్తారు.
  8. పాలిష్ చేసే ద్రవాలు తయారుచేస్తారు.

AP 8th Class Physical Science Important Questions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్

ప్రశ్న 4.
నేలబొగ్గును వేడిచేయు ప్రయోగమును ప్రదర్శించుటకు కావలసిన పరికరాలు ఏమిటి? ప్రయోగపు పరికరముల అమరికను చూపే పటమును గీయండి.
జవాబు:
కావలసిన పరికరాలు;
పరీక్ష నాళికలు – 2, రబ్బరు బిరడాలు, స్టాండులు – 2, వాయు వాహకనాళాలు, జెట్ నాళం, బుస్సెన్ జ్వాలకం.
AP 8th Class Physical Science Important Questions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్ 2

8th Class Physics 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్ 1 Mark Bits Questions and Answers

బహుళైచ్ఛిక ప్రశ్నలు

1. భావన (A) : నేలబొగ్గు మరియు పెట్రోలియంలు తరిగిపోయే శక్తి వనరులు.
కారణం (R) : భూమిలో నేలబొగ్గు మరియు పెట్రోలియంలు పరిమిత నిల్వ మాత్రమే కలదు. మరియు వాటి తయారీకి చాలా ఏళ్ళు పడుతుంది.
A) A మరియు R లు సరియైనవి. A ను R సమర్థిస్తున్నది
B) A మరియు R లు సరియైనవి కానీ A ను R సమర్థించదు
C) A తప్పు, R ఒప్పు
D) A ఒప్పు, R తప్పు
జవాబు:
A) A మరియు R లు సరియైనవి. A ను R సమర్థిస్తున్నది

2. పెట్రోలియం నుండి వివిధ ఉత్పత్తులను క్రింది పద్దతి ద్వారా వేరు చేస్తారు.
A) స్వేదనం
B) అంశిక స్వేదనం
C) విద్యుత్ విశ్లేషణ
D) పైవన్నియు
జవాబు:
B) అంశిక స్వేదనం

3. జతపర్చుము.
a) నాఫ్తలీన్, కృత్రిమ అద్దకాలు, పై కప్పు వేసే పదార్థాలు P) పెట్రోలియం
b) స్టీల్ తయారీ, లోహ సంగహణ Q) కోతారు
c) కిరోసిన్, గాసోలిన్, LPG R) కోక్
A) a- Q, b – P, c – R
B) a – R, b – P, c – Q
C) a – P, b – Q, c – R
D) a – Q, b – R, c – P
జవాబు:
D) a – Q, b – R, c – P

4. క్రింది వానిలో సరికాని వాక్యం ఏది?
P: నేడు నేల బొగ్గును ప్రధానంగా విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొరకు వినియోగిస్తున్నారు.
Q: 4000 సంవత్సరాలకు పూర్వమే ఆస్ఫాల్ట్ వినియోగం బాబిలోన్ వారికి తెలుసు.
R : పూర్వం ‘పెట్రోలియంను పడవలలో నీరు చొరబడకుండా చేయడానికి వినియోగించేవారు.
A) P
B) Q
C) R
D) ఏదీకాదు
జవాబు:
D) ఏదీకాదు

5. క్రిందివానిలో పర్యావరణానికి హాని చేయనిది
A) సహజవాయువు
B) కోల్ తారు
C) కోక్
D) పెట్రోలియం
జవాబు:
A) సహజవాయువు

6. C.N.G అనగా
A) Compressed Natural Gas
B) Composition of Natural Gas
C) Crude Natural Gas
D) Carbon Nitrogen Gas
జవాబు:
A) Compressed Natural Gas

AP 8th Class Physical Science Important Questions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్

7. క్రింది వానిలో నేలబొగ్గు ఉత్పన్నం కానిది
A) కోక్
B) కోల్ గ్యాస్,
C) CO2
D) ఏదీకాదు
జవాబు:
D) ఏదీకాదు

8. తరగని శక్తి వనరు : పవనశక్తి : : తరిగిపోయే శక్తి వనరు : …?…
A) సౌరశక్తి
B) అలల శక్తి
C) నేలబొగ్గు
D) అణుశక్తి
జవాబు:
C) నేలబొగ్గు

9. క్రింది వానిలో దుర్వాసన గలది
A) కోక్
B) కోల్ తారు
C) ఆస్ఫాల్ట్
D) కోల్ గ్యాస్
జవాబు:
B) కోల్ తారు

10. P: కోల్ తారుకి దుర్వాసన ఉండదు.
Q : కోల్ తారుని పరిమళ ద్రవ్యాల తయారీలో వాడుతారు. సరియైన వాక్యం
A) P
B) Q
C) P, Qలు రెండూ కాదు
D) P, Qలు రెండూ
జవాబు:
D) P, Qలు రెండూ

11. ఈ క్రింది నేలబొగ్గులలో శ్రేష్ఠమైనది.
A) బిటుమినస్ బొగ్గు
B) లిగ్నెట్ బొగ్గు
C) ఆంత్ర సైట్ బొగ్గు
D) పీట్ బొగ్గు
జవాబు:
C) ఆంత్ర సైట్ బొగ్గు

12. నేలబొగ్గును ఈ క్రింది ఉష్ణోగ్రత వద్ద కార్బో నైజేషన్ చేస్తారు.
A) 5,000°C
B) 1,000°C
C) 100°C
D) 10,000°C
జవాబు:
B) 1,000°C

13. ఈ క్రింది వానిలో సహజ వనరు కానిది
A) నేలబొగ్గు
B) పెట్రోలియం
C) విద్యుత్ శక్తి
D) సౌరశక్తి
జవాబు:
C) విద్యుత్ శక్తి

14. ఈ క్రింది వానిలో శిలాజ ఇంధనం కానిది
A) CNG వాయువు
B) LPG గ్యాస్
C) పెట్రోల్
D) హైడ్రోజన్
జవాబు:
D) హైడ్రోజన్

15. నేలబొగ్గును కార్బోనైజేషన్ చేయునపుడు ఏర్పడువాయువు
A) LPG వాయువు
B) కోల్ గ్యాస్
C) CNG వాయువు
D) మీథేన్ వాయువు
జవాబు:
B) కోల్ గ్యాస్

16. కేలమైట్ ఖనిజం నీటిలో కరగడం వలన ఏర్పడునది
A) గాజు
B) బంకమన్ను
C) లోహము
D) ప్లాస్టికు
జవాబు:
B) బంకమన్ను

17. చమురును కొలుచుటకు ఉపయోగించే ప్రమాణము
A) బారెల్
B) లీటరు
C) క్యూసెక్కులు
D) ఘనపు మీటర్లు
జవాబు:
A) బారెల్

AP 8th Class Physical Science Important Questions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్

18. విషరహితమైన సాంప్రదాయేతర జీవ ఇంధనం
A) పెట్రోల్
B) బయోడీజిల్
C) డీజిల్
D) కిరోసిన్
జవాబు:
B) బయోడీజిల్

19. ఎక్కువగా థర్మల్ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ శక్తి తయారుకు ఉపయోగించే ఇంధనం
A) నేలబొగ్గు
B) పెట్రోలియం
C) సహజ వాయువు
D) కలప
జవాబు:
A) నేలబొగ్గు

20. పదార్థాల గురించి వివరించే విజ్ఞానశాస్త్ర శాఖ
A) రసాయనశాస్త్రం
B) భౌతికశాస్త్రం
C) పదార్థశాస్త్రం
D) అన్నియూ
జవాబు:
C) పదార్థశాస్త్రం

21. శక్తి వనరులు ఉపయోగిస్తే తరిగిపోవునవి
A) తరగని శక్తి వనరులు
B) తరిగిపోవు శక్తివనరులు
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
B) తరిగిపోవు శక్తివనరులు

22. నేలబొగ్గు, పెట్రోలియం, సహజవాయువులు దీనికి ఉదాహరణలు.
A) తరగని శక్తి వనరులు.
B) తరిగిపోవు శక్తి వనరులు
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
B) తరిగిపోవు శక్తి వనరులు

23. ఉపయోగిస్తే తరిగిపోయి మరల ఉత్పత్తి చేయగలిగేవి
A) తరగని శక్తి వనరులు
B) తరిగిపోవు శక్తి వనరులు
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
A) తరగని శక్తి వనరులు

24. సౌరశక్తి, వాయు శక్తి, జలశక్తి దీనికి ఉదాహరణలు.
A) తరగని శక్తి వనరులు
B) తరిగిపోవు శక్తి వనరులు
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
A) తరగని శక్తి వనరులు

25. ప్రస్తుతం మనము వినియోగిస్తున్న సౌరశక్తి, పవనశక్తి, అలల శక్తిల యొక్క వినియోగ శాతము
A) 12%
B) 13%
C) 10%
D) 15%
జవాబు:
C) 10%

26. 1950 సం॥ వరకు విద్యుదుత్పతిలో ముఖ్య వనరు
A) నీరు
B) నేలబొగ్గు
C) యంత్రాలు
D) చెప్పలేము
జవాబు:
B) నేలబొగ్గు

27. ఖనిజాలు
A) సహజ వనరులు
B) తరగని సహజ వనరులు
C) తరిగిపోవు సహజవనరులు
D) అన్నియూ
జవాబు:
A) సహజ వనరులు

AP 8th Class Physical Science Important Questions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్

28. ప్రస్తుతము నేలబొగ్గును విరివిగా దీని ఉత్పత్తికి వాడుచున్నారు.
A) పెట్రోలియం
B) విద్యుత్
C) రెండింటికీ
D) ఏదీకాదు
జవాబు:
B) విద్యుత్

29. ఈ క్రింది వాటిలో ఖనిజము
A) ఫెట్రోల్
B) డీజిల్
C) కిరోసిన్
D) పెట్రోలియం
జవాబు:
D) పెట్రోలియం

30. పూర్వకాలంలో బాబిలోనియా గోడల నిర్మాణంలో వాడిన పెట్రోలియం ఉత్పన్న రకము
A) LPG
B) హైడ్రోజన్
C) ఆస్ఫాల్ట్
D) జీవ ఇంధనం
జవాబు:
C) ఆస్ఫాల్ట్

31. ఈ క్రింది వాటిలో మన పూర్వీకులు దీపాలలో ఇంధనంగా, పడవలలో నీరు జొరబడకుండా చేయుటకు, సాంప్రదాయ చికిత్సలకు వాడిన ఖనిజ వనరు
A) పెట్రోల్
B) డీజిల్
C) కిరోసిన్
D) పెట్రోలియం
జవాబు:
D) పెట్రోలియం

32. ఈ క్రింది ఖనిజ వనరులలో పెట్రోలియంతోపాటు సమాన విలువ గలది
A) CNG
B) LPG
C) కిరోసిన్
D) సహజవాయువు
జవాబు:
D) సహజవాయువు

33. 19 వ శతాబ్దంలో ముఖ్యమైన ఇంధన వనరు
A) పెట్రోలు
B) కిరోసిన్
C) నీరు
D) నేలబొగ్గు
జవాబు:
D) నేలబొగ్గు

34. ఈ క్రింది వాటిలో పురాతనమైన ఉష్ణ మరియు కాంతి వనరు
A) పెట్రోల్
B) డీజిల్
C) కిరోసిన్
D) నేలబొగ్గు
జవాబు:
D) నేలబొగ్గు

35. వంట చెరకు నుండి లభించు బొగ్గు
A) కట్టెబొగ్గు
B) నేలబొగ్గు
C) బిట్యూమినస్
D) ఏదీకాదు
జవాబు:
A) కట్టెబొగ్గు

36. మన రాష్ట్రంలో సహజ వాయువు నిక్షేపాలు
A) కృష్ణా-గోదావరి డెల్టా
B) ఉభయగోదావరి డెల్టా
C) పెన్నా-మంజీర డెల్టా
D) చెప్పలేము
జవాబు:
A) కృష్ణా-గోదావరి డెల్టా

37. క్రింది వాటిలో నేలబొగ్గు ఉత్పన్నము కానిది
A) కోల్ తార్
B) కోల్ వాయువు
C) సున్నము
D) ఏదీకాదు
జవాబు:
C) సున్నము

38. పెట్రోలియం ఒక
A) సరళ మిశ్రమం
B) సంక్లిష్ట మిశ్రమం
C) సమ్మేళన మిశ్రమం
D) లఘు మిశ్రమం
జవాబు:
B) సంక్లిష్ట మిశ్రమం

39. సహజ వాయువును అత్యధిక పీడనాల వద్ద నిల్వ ఉంచుటను ఏమంటారు ?
A) సంపీడిత సహజ వాయువు
B) ద్రవీకృత సహజ వాయువు
C) బ్యూటేన్
D) A మరియు B
జవాబు:
A) సంపీడిత సహజ వాయువు

40. పెట్రోలియంను వివిధ అంశీ భూతాలుగా వేరుచేయు ప్రక్రియ
A) అంశిక స్వేదనం
B) విద్యుత్ విశ్లేషణము
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
A) అంశిక స్వేదనం

AP 8th Class Physical Science Important Questions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్

41. పెట్రోలియపు అంశిక స్వేదన ప్రక్రియలో వెలువడు ప్రథమ అంశీభూతము
A) పెట్రోలు
B) కిరోసిన్
C) డీజిల్
D) మైనము
జవాబు:
B) కిరోసిన్

42. పెట్రోలియం అనునది సహజంగా శుద్ధ రూపంలో దొరుకు ప్రాంతము
A) అభేద్యమైన రాళ్ళ మధ్యన
B) నీరు
C) ఇసుక
D) బొగ్గు
జవాబు:
A) అభేద్యమైన రాళ్ళ మధ్యన

43. భారతదేశంలో క్రిందనున్న ఏ ప్రాంతంలో వాయువు ఏర్పడదు?
A) త్రిపుర
B) జైసల్మీర్
C) బొంబాయి
D) ఢిల్లీ
జవాబు:
D) ఢిల్లీ

44. ఈ క్రింది వాటిలో నేలబొగ్గు నుండి పొందలేని అంశీభూతం
A) కోక్
B) కోల్ తారు
C) కోల్ గ్యాసు
D) LPG
జవాబు:
D) LPG

45. నేలబొగ్గును గాలిలో మండించినప్పుడు ప్రధానంగా విడుదలగు వాయువు
A) CO2
B) CO
C) O3
D) O2
జవాబు:
A) CO2

46. క్రింది వాటిలో నల్లని సచ్ఛిద్ర, దృఢమైన పదార్థము
A) కోక్
B) కోల్ తార్
C) కోల్ గ్యాసు
D) LPG
జవాబు:
A) కోక్

47. ఈ క్రింది వాటిలో కార్బన్ యొక్క స్వచ్ఛమైన రూపం
A) కోక్
B) కోల్ తారు
C) కోల్ గ్యాస్
D) CNG
జవాబు:
A) కోక్

48. లోహాల సంగ్రహణలో మరియు స్టీలు తయారీలో ఉపయోగించునది
A) కోక్
B) కోల్ తారు
C) కోల్‌ గ్యాస్
D) CNG
జవాబు:
A) కోక్

49. ఈ క్రింది వాటిలో నల్లని చిక్కనైన ద్రవము
A) కోక్
B) కోల్ తారు
C) కోల్ గ్యాస్
D) CNG
జవాబు:
B) కోల్ తారు

50. నాఫ్తలీన్ గోళీల తయారీలో వాడు పదార్థము
A) కోక్
B) కోల్ తారు
C) కోల్ గ్యాస్
D) CNG
జవాబు:
B) కోల్ తారు

51. కృత్రిమ అద్దకాలు, ఔషధాలు, పరిమళ ద్రవ్యాలు, ప్రేలుడు పదార్థాల తయారీలో వాడు పదార్థము
A) కోక్
B) కోతారు
C) కోల్ గ్యాస్
D) CNG
జవాబు:
B) కోతారు

52. నేలబొగ్గు నుంచి కోకను పొందుటకు జరుపు ప్రక్రియలో ఉత్పత్తగు ఉత్పన్నం
A) కోక్
B) కోతారు
C) కోల్ గ్యాస్
D) CNG
జవాబు:
C) కోల్ గ్యాస్

53. అంశిక స్వేదనము ద్వారా ఉత్పన్నమగు ఉత్పన్నాలు
A) కోక్, కోల్ తారు, కోల్ గ్యాస్
B) పెట్రోల్, డీజిల్, కిరోసిన్
C) పారాఫిన్ మైనం, బిట్యూమినస్
D) సంపీడిత సహజ వాయువు
జవాబు:
B) పెట్రోల్, డీజిల్, కిరోసిన్

54. అన్ని శిలాజ ఇంధనాలు
A) తరగని ఉత్పన్నాలు
B) తరిగిపోవు ఉత్పన్నాలు
C) పెట్రోలియం ఉత్పన్నాలు
D) అన్నియు
జవాబు:
C) పెట్రోలియం ఉత్పన్నాలు

55. కేవలం గృహ, పారిశ్రామిక ఇంధనంగానే కాక ఎరువుల తయారీలో కూడా ఉపయోగించు పదార్థము
A) LPG
B) CNG
C) సహజ వాయువు
D) ఏదీకాదు
జవాబు:
C) సహజ వాయువు

56. కింది వాటిలో పెట్రోలియం మరియు సహజ వాయువుల నుండి పొందు ఉపయుక్తకరమైన పదార్థములు
A) పెట్రోలియం
B) పెట్రోరసాయనాలు
C) సహజ వాయువు
D) ద్రవీకృత వాయువు
జవాబు:
B) పెట్రోరసాయనాలు

57. క్రింది వాటిలో దేనిని డిటర్జెంటులు, కృత్రిమ దారాలు, ప్లాస్టిక్స్ తయారీలో వాడతారు?
A) పెట్రోలియం
B) పెట్రోరసాయనాలు
C) సహజ వాయువు
D) ద్రవీకృత వాయువు
జవాబు:
B) పెట్రోరసాయనాలు

58. క్రింది వాటిలో “ద్రవ బంగారం” అని పిలువబడునది
A) పెట్రోలు
B) పెట్రోలియం
C) కిరోసిన్
D) సహజవాయువు
జవాబు:
B) పెట్రోలియం

AP 8th Class Physical Science Important Questions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్

59. పాలిస్టర్, నైలాన్, అక్రిలిక్, పాలిథిన్ల తయారీలో వాడు ముడిపదార్ధము
A) పెట్రోలియం
B) పెట్రోరసాయనాలు
C) సహజ వాయువు
D) LPG
జవాబు:
B) పెట్రోరసాయనాలు

60. జీవ పదార్థం భూమిలోపలికి కూరుకుపోవడం వల్ల అధిక పీడన .మరియు ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల ఏర్పడు పదార్థము
A) పెట్రోలు
B) పెట్రోలియం
C) బొగ్గు
D) సహజవాయువు
జవాబు:
C) బొగ్గు

61. నేలబొగ్గు అధిక మొత్తంలో కార్బన్ ను కల్గివుండడం చేత జీవపదార్థం బొగ్గుగా మారే నెమ్మదైన ప్రక్రియ ఏది?
A) కార్బోనైజేషన్
B) పాశ్చ్యూరైజేషన్
C) విద్యుత్ విశ్లేషణం
D) ఏదీకాదు
జవాబు:
A) కార్బోనైజేషన్

62. పెట్రోలియం ఈ క్రింది జీవి అవశేషాల వలన ఏర్పడును.
A) ప్లాంక్టన్
B) ఆస్ఫాల్ట్
C) కేలినైట్
D) కట్టెబొగ్గు
జవాబు:
A) ప్లాంక్టన్

63. ఈ క్రింది వాటిలో జీవుల యొక్క మృత అవశేషాల నుండి తయారు అయ్యేది
A) సహజ వాయువు
B) కిరోసిన్
C) LPG
D) పెట్రోల్
జవాబు:
A) సహజ వాయువు

64. ఈ క్రింది వాటిలో జీవుల యొక్క మృత అవశేషాల నుండి తయారు కానిది
A) నేలబొగ్గు
B) పెట్రోలియం
C) సహజ వాయువు
D) బంకమన్ను
జవాబు:
D) బంకమన్ను

65. నేలబొగ్గులో ప్రధానంగా ఉండు పదార్థం
A) ఆక్సిజన్
B) హైడ్రోజన్
C) కార్బన్
D) నైట్రోజన్
జవాబు:
C) కార్బన్

66. హైడ్రోకార్బన్ సమ్మేళనాల ప్రారంభ పదార్థములు
A) హైడ్రోజన్
B) కార్బన్
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
C) A మరియు B

67. ఈ క్రింది వానిలో తరిగిపోవు ఇంధన వనరు
A) బొగ్గు
B) పెట్రోలియం
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
C) A మరియు B

AP 8th Class Physical Science Important Questions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్

68. సాక్సుల తయారీలో వాడునది
A) పెట్రోరసాయనం
B) పెట్రోలియం
C) డీజిల్
D) పెట్రోల్
జవాబు:
A) పెట్రోరసాయనం

69. క్రింది పటంలో ఉత్పత్తగు సహజ వనరు
AP 8th Class Physical Science Important Questions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్ 3
A) పవన శక్తి
B) పెట్రోలియం
C) నేలబొగ్గు
D) ఏదీకాదు
జవాబు:
A) పవన శక్తి

70. పై పటంలో ఏర్పడు వనరు
A) తరిగిపోవు వనరు
B) తరగిపోని వనరు
C) చెప్పలేము
D) ఏదీకాదు
జవాబు:
B) తరగిపోని వనరు

71. అడవులను పూర్తిగా నరికివేసిన తిరిగి అడవి సంపదను పొందుటకు పట్టు కాలము
A) దాదాపు 10 సం||లు
B) దాదాపు 25 సం||లు
C) దాదాపు 50 సం||లు
D) దాదాపు 150 సం||లు
జవాబు:
C) దాదాపు 50 సం||లు

72. క్రింది వాటిలో ఏది సరిగా జతపరచబడినది?

Group – A Group – B
1. C.N.G. వాయువు A) క్రొవ్వొత్తులు
2. కిరోసిన్ B) వాహనాల ఇంధనం
3. ఫారాఫిన్ వాక్స్ C) ఇంటి పైకప్పుల తయారీ
4. కోక్ D) వంట ఇంధనం
5. కోల్ తారు E) లోహాల సంగ్రహణ

A) 1-b, 2-d, 3-e, 4-a, 5-c
B) 1 – b, 2-e, 3-2, 4-d, 5-c
C) 1-b, 2-c, 3 – a, 4-d, 5-e
D) 1-b, 2-d, 3-a, 4-e, 5-c
జవాబు:
D) 1-b, 2-d, 3-a, 4-e, 5-c

73. క్రింది వానిలో వాయు ఇంధనం
A) LPG
B) పెట్రోల్
C) నేలబొగ్గు
D) డీజిల్
జవాబు:
A) LPG

74. 1) సౌరశక్తి ii) పెట్రోలియం iii) పవనశక్తి iv) జలశక్తి పై వానిలో తరగని శక్తి వనరు
A) i) మాత్రమే
B) i) మరియు iii)
C) i), ii) మరియు iii)
D) i), iii) మరియు iv)
జవాబు:
B) i) మరియు iii)

75. ఈ పదార్థం కోల్ తార్ నుండి తయారు చేయబడదు.
A) నాఫ్తలీన్
B) అద్దకాలు
C) చక్కెర
D) క్రిమిసంహారకాలు
జవాబు:
C) చక్కెర

76. కార్బన్ యొక్క స్వచ్ఛమైన రూపం
A) కోల్
B) చార్కొల్
C) కోక్
D) పై అన్నీ
జవాబు:
D) పై అన్నీ

77. కింది వానిలో సరికాని వాక్యము
A) కార్బొనైజేషన్ వల్ల కోల్ ఏర్పడుతుంది
B) CNG కంటే LPG మేలైన ఇంధనం
C) ప్లాంక్టన్ వలన పెట్రోలియం ఏర్పడుతుంది
D) పెట్రో రసాయనం వల్ల అనేక లాభాలున్నాయి.
జవాబు:
D) పెట్రో రసాయనం వల్ల అనేక లాభాలున్నాయి.

78. కింది వానిలో ఏది పరిశుభ్రమైన ఇంధనంగా పరిగణించబడుతుంది?
A) పెట్రోల్
B) డీజిల్
C) ఆవు పిడక
D) హైడ్రోజన్ వాయువు
జవాబు:
D) హైడ్రోజన్ వాయువు

AP 8th Class Physical Science Important Questions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్

79. క్రింది ఖాళీని సారూప్యతను బట్టి సరైన పదంతో పూర్తి చేయండి.
కార్బన్ డై ఆక్సైడ్ : భూతాపం :: ……….. : నాసియా.
A) సల్ఫర్ డై ఆక్సెడ్
B) పెయింట్ల నుండి విడుదలయ్యే విష పదార్థం
C) ఆక్సిజన్
D) హైడ్రోజన్
జవాబు:
B) పెయింట్ల నుండి విడుదలయ్యే విష పదార్థం

80. క్రింది వానిలో పెట్రోరసాయనం కానిది
AP 8th Class Physical Science Important Questions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్ 4
జవాబు:
C

81. శక్తి వనరులను ఉపయోగించుకుంటూ పోతే కొంత కాలానికి అవి తరిగిపోతాయి. అయితే క్రింది వానిలో ఏది తరగని శక్తి వనరు?
A) CNG వాయువు
B) పెట్రోలియం
C) పవనశక్తి
D) నేలబొగ్గు
జవాబు:
C) పవనశక్తి

82. a) ఉతికిన బట్టలు ఆరుటకు సౌరశక్తి ఉన్నా వాషింగ్ మెషీన్లో డ్రైయర్ వాడడం
b) కొద్దిదూరాలను కూడా నడవకుండా పెట్రోల్ బైకులను వాడడం
పై రెండు విషయాలు దేనిని గురించి తెలియజేస్తున్నాయి?
A) ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకం
B) ఇంధన వనరుల ఉపయోగం
C) ఇంధన వనరుల దుర్వినియోగం
D) శిలాజ ఇంధనాల వాడకం
జవాబు:
C) ఇంధన వనరుల దుర్వినియోగం

83. శిలాస ఇంధనమైన నేలబొగ్గు ద్వారా లభించే ఉప ఉత్పన్నాలు
A) కోక్, కోల్ తారు, కోల్ వాయువు
B) కోతారు, బొగ్గు, కోక్
C) కోక్, కోల్ వాయువు, పెట్రోల్
D) బొగ్గు, కోక్, కోల్ వాయువు
జవాబు:
A) కోక్, కోల్ తారు, కోల్ వాయువు

84. సాధారణంగా శిలాజ ఇంధనాలు పర్యావరణానికి హాని కలిగిస్తాయి. కానీ పర్యావరణానికి హాని కలిగించని శిలాజ ఇంధనం
A) పెట్రోలియం
B) సహజ వాయువు
C) కలప
D) నేలబొగ్గు
జవాబు:
B) సహజ వాయువు

85. జతపరచండి.

a) నేలబొగ్గు i) ప్లాంక్టన్
b) పెట్రోలియం ii) అంశిక స్వేదనం
c) పెట్రోల్ iii) కార్బో నైజేషన్

A) a-iii, b-i, c-ii
B) a- i, b-ii, c-iii
C) a-ii, b-iii, c-i
D) a-iii, b-ii, c-i
జవాబు:
A) a-iii, b-i, c-ii

86. ఒక్కసారిగా పెట్రోలియం మరియు నేలబొగ్గు లేకుండాపోతే ఏమి జరుగుతుందో ఊహించండి.
A) మనం ఉపయోగిస్తున్న వాహనాలు నిరుపయోగమవుతాయి.
B) బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు మూతపడతాయి.
C) గాలి కాలుష్యం తగ్గవచ్చును.
D) పైవన్నియూ
జవాబు:
D) పైవన్నియూ

87. నేను నేలబొగ్గు నుండి తయారవుతాను. నేను ఉక్కు తయారీలో ఉపయోగపడతాను. నేనెవరిని?
A) కోల్ గ్యాస్
B) కోక్
C) కోల్ తార్
D) ఆస్పాట్
జవాబు:
B) కోక్

88. నేల నుండి : నేలబొగ్గు : : కట్టెనుండి : …………….
A) కట్టె బొగ్గు
B) దీపపు మసి
C) ఆస్ఫాల్ట్
D) బూడిద
జవాబు:
A) కట్టె బొగ్గు

89. నేలబొగ్గు : …………. : : పెట్రోలియం : ప్లాంక్టన్
A) అంశిక స్వేదనం
B) కార్బోనైజేషన్
C) శిలాజ ఇంధనం
D) పెట్రోకెమికల్
జవాబు:
B) కార్బోనైజేషన్

90. ప్రక్కన చూపిన ప్రయోగంలో పరిశీలించవలసినది
AP 8th Class Physical Science Important Questions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్ 5
A) బొగ్గు వాయువు మండుట
B) పెట్రోల్ మండుట
C) కోక్ వాయువు మండుట
D) బొగ్గు ,తయారవుట
జవాబు:
A) బొగ్గు వాయువు మండుట

91. పై ప్రయోగంలో మొదటి – రెండవ పరీక్ష నాళికలలో వాయువులు ఇలా ఉంటాయి.
A) మొదటి పరీక్షనాళిక – గోధుమ – ఎరుపు వాయువు రెండవ పరీక్ష నాళిక – నల్లని వాయువు
B) మొదటి పరీక్ష నాళిక-గోధుమ-నలుపురంగు వాయువు రెండవ పరీక్ష నాళిక – రంగులేని వాయువు
C) మొదటి పరీక్షనాళిక – రంగులేని వాయువు రెండవ పరీక్ష నాళిక-గోధుమ-నలుపు రంగు వాయువు
D) పైవేవీ కాదు
జవాబు:
B) మొదటి పరీక్ష నాళిక-గోధుమ-నలుపురంగు వాయువు రెండవ పరీక్ష నాళిక – రంగులేని వాయువు

AP 8th Class Physical Science Important Questions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్

92. పై ప్రయోగంలో వినియోగించే పదార్థం
A) బొగ్గుపొడి
B) సల్ఫర్ పొడి
C) నాప్తలీన్ పొడి
D) చెక్కపొడి
జవాబు:
A) బొగ్గుపొడి

93. P) పరీక్ష నాళికలో నేలబొగ్గు పొడిని తీసుకుని బిగించి దాని ద్వారా వాయువాహకనాళం అమర్చండి.
Q) పరీక్ష నాళిక నుండి గోధుమ – నలుపు రంగు వాయువు వెలువడింది.
R) పరీక్ష నాళికను నీటితో నింపి స్టాండుకు బిగించాలి.
S) జెట్ నాళం మూతి వద్ద తెల్లని మంటను గమనించవచ్చు.
సై వాక్యాలను ప్రయోగ విధానంలో సరియైన విధానంలో అమర్చగా
A) Q – R – S – P
B) P – R-Q – S
C) P – S – Q – R
D) P – Q – R – S
జవాబు:
B) P – R-Q – S

94. నాణ్యమైన నేలబొగ్గును వేడిచేస్తే వెలువడే వాయువు మండుతుందని నిరూపించే ప్రయోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
a) గట్టి పరీక్షనాళికలు తీసుకోవాలి
b) బున్సెన్ జ్వాలకానికి దూరంగా ఉండాలి.
c) పరీక్ష నాళికను చేతితో పట్టుకొని వేడిచేయాలి
A) a మరియు b మాత్రమే
B) a మరియు c మాత్రమే
C) a, b మరియు c లు సరైనవి
D) a మాత్రమే
జవాబు:
A) a మరియు b మాత్రమే

95. A) దట్టమైన అడవులలో చెట్లు కూలిపోవుట
B) అధిక ఉష్ణోగ్రత, పీడనాలకు గురి అవుట
C) కార్బోనైజేషన్ జరిగి నేలబొగ్గు ఏర్పడుట
D) చెట్ల ఆకులు, కొమ్మలు మట్టితో కప్పబడుట
పై వాక్యాలను ఒక క్రమంలో రాయుము.
A) A → B → D → C
B) D → B → C → A
C) A → D → B → C
D) B → A → C → D
జవాబు:
C) A → D → B → C

96. క్రింది వానిలో శిలాజ ఇంధనానికి సంబంధించినది
A) సోలార్ విద్యుత్
B) పవన విద్యుత్
C) థర్మల్ విద్యుత్
D) జల విద్యుత్
జవాబు:
C) థర్మల్ విద్యుత్

97.

పదార్థం ఎలా లభ్యమవుతుంది?
గాజు ఇసుకను ఇతర పదార్థాలతో కరిగించి, క్రమంగా చల్లార్చడం వలన
బంకమన్ను కేలినైట్ (Kaolinite) ఖనిజం నీటిలో  కలవడం వల్ల
కలప ఎండినచెట్ల నుంచి
ప్లాస్టిక్లు పెట్రో రసాయనాల నుంచి
లోహాలు వాటి ధాతువుల నుంచి

ప్లాస్టిక్ కుర్చీలు, టేబుళ్ళు క్రింది పదార్థంతో తయారవుతాయి.
A) పెట్రో రసాయనాలు
B) నేలబొగ్గు
C) సహజవాయువు
D) చెట్లు
జవాబు:
A) పెట్రో రసాయనాలు

98.
AP 8th Class Physical Science Important Questions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్ 6
నేలబొగ్గుని క్రింది వానిని తయారుచేయడానికి వినియోగిస్తారు.
A) నాఫ్తలీన్
B) పెయింట్లు
C) కిరోసిన్
D) A మరియు B
జవాబు:
D) A మరియు B

99.
AP 8th Class Physical Science Important Questions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్ 7
పైకప్పు పదార్థాలు, నాప్తలిన్, క్రిమి సంహారకమందు
‘X’ అనునది
A) కోక్
B) కోల్ తారు
C) ఫారాఫినాక్స్
D) ఆస్ఫాల్
జవాబు:
B) కోల్ తారు

100. క్రింది వానిలో వేరుగా ఉన్న దానిని గుర్తించుము.
AP 8th Class Physical Science Important Questions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్ 8
జవాబు:
D

→ క్రింది పట్టికను పరిశీలించి క్రింది ప్రశ్నలకు సరియైన సమాధానం గుర్తించండి.
AP 8th Class Physical Science Important Questions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్ 9

101. పై పట్టిక మనకు తెలియజేసే అంశం
A) ప్రతి సంవత్సరానికి శక్తి వినియోగం పెరుగుటను సూచిస్తుంది.
B) ప్రతి సంవత్సరానికి శక్తి లేమిశాతం పెరుగుటను సూచిస్తుంది.
C) ప్రతి సంవత్సరానికి శక్తి లేమిశాతంలో తగ్గుదలను సూచిస్తుంది.
D) ప్రతి సంవత్సరానికి శక్తి అవసరాలు పెరుగుటను సూచిస్తుంది.
జవాబు:
B) ప్రతి సంవత్సరానికి శక్తి లేమిశాతం పెరుగుటను సూచిస్తుంది.

102. 1993వ సంవత్సరానికి, 1996వ సంవత్సరానికి శక్తి లేమిలో గల తేడా శాతం
A) 0.3
B) 0.8
C) 1.1
D) 11
జవాబు:
All

AP 8th Class Physical Science Important Questions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్

→ పెట్రోలియంను అంశిక స్వేదనం చేయడం ద్వారా అందులోని అంశీభూతాలను వేరు పరుస్తారు. వివిధ ఉష్ణోగ్రతల వద్ద వివిధ పదార్థాలు ఏర్పడతాయి. పెట్రోలియం నుండి మొదటిగా వేరు చేయబడిన అంశీభూతం కిరోసిన్. ఆస్పాట్ అనే పదార్థం అడుగున మిగిలిపోతుంది. ఇవే కాకుండా పెట్రోల్, డీసిల్, మొదలగు వాటిని పెట్రోలియం నుండి పొందవచ్చును.

103. పెట్రోలియం అంశిక స్వేదనంలో మొదటిగా వేరు చేయబడిన అంశీభూతం
A) డీసిల్
B) కిరోసిన్
C) ఆస్ఫాల్ట్
D) పెట్రోల్
జవాబు:
B) కిరోసిన్

104. అంశిక స్వేదన ప్రక్రియలో చివరకు మిగిలిపోయే పదార్థం
A) డీసిల్
B) పెట్రోల్
C) ఆస్ఫాల్ట్
D) కిరోసిన్
జవాబు:
C) ఆస్ఫాల్ట్

105.
AP 8th Class Physical Science Important Questions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్ 10
పైన ఇచ్చిన పటం దేనిని సూచిస్తుంది?
A) డ్రిల్లింగ్
B) అంశిక స్వేదనం
C) మైనింగ్
D) క్రొమటోగ్రఫీ
జవాబు:
B) అంశిక స్వేదనం

106.
AP 8th Class Physical Science Important Questions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్ 11
పై పటంలో తప్పుగా గుర్తించినది?
A) a
B) b
C) c
D) d
జవాబు:
A) a

107.
AP 8th Class Physical Science Important Questions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్ 12
పై పటంలో భాగం ‘a’
A) జెట్ నాళం
B) వాయువాహక నాళం
C) పరీక్షనాళిక
D) వాయు సంగ్రహణ నాళం
జవాబు:
B) వాయువాహక నాళం

108. X సూచించు భాగము
AP 8th Class Physical Science Important Questions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్ 13
A) నేల బొగ్గు పొడి
B) మైనం
C) పెట్రోలియం
D) నీరు
జవాబు:
A) నేల బొగ్గు పొడి

109. ‘నల్ల బంగారం’ అని దీనికి పేరు.
A) పెట్రోల్
B) నేలబొగ్గు
C) కోల్ తారు
D) పెట్రోలియం
జవాబు:
B) నేలబొగ్గు

110. పెట్రోలియం మనకు అందించడంలో క్రింది వాటి పాత్ర అభినందనీయం.
A) ప్లాంక్టన్
B) డెంగ్యూ క్రిమి
C) సముద్ర నక్షత్ర తాబేళ్ళు
D) పెన్సిలిన్
జవాబు:
A) ప్లాంక్టన్

111. లలిత బొగ్గునుండి తయారైన కొన్ని గోళీలను బట్టల మధ్యలో, కీటకాల నుండి రక్షణ కొరకు ఉంచింది. అవి
A) వ్యాజ్ లిన్
B) నాఫ్తలీన్
C) మైనం
D) రంగులు
జవాబు:
B) నాఫ్తలీన్

112. గ్లోబల్ వార్మింగ్ కు కారణం
A) O2
B) CO2
C) N2
D) H2O
జవాబు:
B) CO2

113. థర్మల్ విద్యుత్ తయారీ కేంద్రాల నుండి వెలువడే ఈ క్రింది పదార్థాలు చాలా ప్రమాదకరం.
a) పాదరసం
b) సెలీనియం
c) ఆర్సెనిక్
d) సీసం
A) a, b
B) b, c, d
C) c, d
D) a, b, c, d
జవాబు:
D) a, b, c, d

AP 8th Class Physical Science Important Questions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్

114. ఈ క్రింది చెప్పిన పరిసర ప్రాంతాలలో నివసించే వారికి అనారోగ్య సమస్యలు వస్తాయి.
A) సౌరవిద్యుత్ కేంద్రాలు
B) థర్మల్ విద్యుత్ కేంద్రాలు
C) జల విద్యుత్ కేంద్రాలు
D) A మరియు C
జవాబు:
B) థర్మల్ విద్యుత్ కేంద్రాలు

115. మనం నిత్యం వినియోగించే ‘ముఖానికి రాసుకొనే క్రీము’, ‘గ్రీజు’, ‘క్రొవ్వొత్తి’ లాంటివి క్రింది పెట్రోకెమికల్ నుండి తీస్తారు.
A) నేలబొగ్గు
B) కోక్
C) ఫారిఫిక్స్
D) పెట్రోల్
జవాబు:
C) ఫారిఫిక్స్

116. క్రింది వానిలో ఏది విషపదార్థం కాని, తరగిపోని ఇంధనం?
A) బయోడీజిల్
B) పెట్రోల్
C) L.P.G.
D) అన్నియూ
జవాబు:
A) బయోడీజిల్

117. జతపర్చుము.
a) డ్రైక్లీనింగ్ ద్రవం ( ) i) నేలబొగ్గు
b) కృత్రిమ అద్దకం ( ) ii) సహజవాయువు
c) C.N.G. ( ) iii) పెట్రోలియం
A) a-iii, b-i, c-ii
B) a-iii, b-ii, c-i
C) a-i, b-iii, c-ii
D) a-ii, b-i, c-iii
జవాబు:
A) a-iii, b-i, c-ii

118. పెట్రోలియం ఒక శిలాజ ఇంధనం మరియు ఇది ఒక తరిగిపోయే శక్తి వనరు. ఈ ఇంధన వనరును సద్వినియోగ పరుచుకొనుటకు చేయవలసినది.
a) ఇంధన వనరుల దుర్వినియోగాన్ని తగ్గించాలి.
b) తరిగే ఇంధన వనరుల వాడకాన్ని నిలిపివేయాలి.
c) ప్రత్యామ్నాయ ఇంధన వనరులను అభివృద్ధి పరచాలి.
A) a & b
B) a & c
C) a, b & c
D) a మాత్రమే
జవాబు:
B) a & c

మీకు తెలుసా?

పవనాలు ఒక ముఖ్యమైన సహజవనరు. పవన శక్తిని వినియోగించి కొన్ని వేల సంవత్సరాల నుండి పడవలు, ఓడలు నడుస్తున్నాయి. మొక్కజొన్నలను పిండిగా మార్చడానికి, ఉప్పు తయారీలో సముద్రపు నీటిని పైకి పంపుచేయడానికి పవన శక్తితో నడిచే గాలి మరలను వినియోగించేవారు.
AP 8th Class Physical Science Important Questions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్ 3

బయోడీజిల్ – ఒక ప్రత్యామ్నాయ ఇంధన వనరు :

AP 8th Class Physical Science Important Questions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్ 14
ముఖ్యమైన సాంప్రదాయేతర శక్తి వనరులలో జీవ ఇంధనాలు (Bio fuels) ఒకటి, ఇవి విషపూరితమైనవి కావు (Non-toxic) మరియు పునరుత్పత్తి (renewable) చేయగలిగేవి. నేడు ఉపయోగిస్తున్న డీజిల్ కు ప్రత్యామ్నాయ ఇంధనంగా జీవ ఇంధనమైన బయోడీజిల్ ను ఉపయోగించవచ్చు. పెట్రోలియం లేదా ముడి చమురు (crude oil) కు బదులుగా జీవ సంబంధ పదార్థాల నుండి ఇది తయారవుతుంది. సాధారణంగా బయోడీజిల్ ను వృక్ష తైలాలు లేదా జంతువుల క్రొవ్వులను వివిధ రసాయన చర్యలకు గురిచేసి తయారు చేస్తారు. ఇది సురక్షితమైనది. మరియు దీనిని డీజిల్ ఇంజన్లలో ఉపయోగించవచ్చు. కాని బయోడీజిల్ ఉత్పత్తికి అధిక శాతంలో వ్యవసాయయోగ్యమైన భూమి అవసరం. ఇది ముందు కాలంలో ఆహార కొరతకు దారితీయవచ్చు.

AP 8th Class Physical Science Important Questions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్ 15
ఈ రోజు మనం వాహనాలలో ఉపయోగిస్తున్న పెట్రోల్, డీజిల్ వంటివి పెట్రోలియం అనే ఖనిజం నుండి పొందుతున్నాం. పూర్వ చారిత్రక యుగం నుండి పెట్రోలియం గురించి మానవునికి తెలుసు. 4000 సంవత్సరాలకు భూపటలం పూర్వమే బాబిలోనియాలో గోడలు, గోపురాల నిర్మాణంలో అస్ఫాల్డ్ (Asphalt) అనే పెట్రోలియం ఉత్పన్నాన్ని ఉపయోగించారు. పెట్రోలియం వెలికితీయడానికి చైనావారు తోతైన బావులు తవ్వినట్లు పురాతన చైనా గ్రంథాల ద్వారా తెలుస్తుంది. అయితే మన పూర్వికులు పెట్రోలియంతో ఏం చేసేవారు? ఆ రోజులలో దీపాలలో ఇంధనంగా, పడవల్లో నీరు జొరబడకుండా చేయడానికి, సాంప్రదాయ చికిత్సలకి పెట్రోలియంను ప్రధానంగా ఉపయోగించేవారు. శాస్త్ర, సాంకేతిక రంగాలలో జరిగిన అభివృద్ధి వల్ల ఇంజన్లు నడపడానికి పెట్రోరసాయనాలు, పెట్రోల్ వంటివి తయారుచేయడం పెట్రోలియం ప్రాముఖ్యతని మనం గుర్తించాం.

AP 8th Class Physical Science Important Questions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్

సహజ వాయువుకు ప్రత్యామ్నాయాలు – సాంప్రదాయేతర గ్యాస్ వనరులు :

సాంప్రదాయేతర గ్యాస్ వనరులు సహజవాయువు వలె ప్రాచీనమైనవి కావు. మనదేశంలో సాంప్రదాయేతర గ్యాస్ వనరులైన నేలబొగ్గు పొరలలో ఉండే మీథేన్ మరియు గ్యాస్ హైడ్రేట్లను అపరిమితంగా కలిగి ఉంది. కాని సరియైన సాంకేతిక పరిజ్ఞానం లేని కారణంగా ఇవి వ్యాపారాత్మకంగా ఉత్పత్తి చేయగలిగే దశలో లేవు. భవిష్యత్తులో తైల యుగం (Oil Era) అంతమవుతుందని ఊహిస్తే మన శక్తి డిమాండను అధిగమించడానికి సాంప్రదాయేతర గ్యాస్ వనరులను ఉత్పత్తి చేయడం మాత్రమే మార్గం అవుతుంది.

Leave a Comment