These AP 8th Class Physical Science Important Questions 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం will help students prepare well for the exams.
AP Board 8th Class Physical Science 12th Lesson Important Questions and Answers నక్షత్రాలు – సౌరకుటుంబం
8th Class Physics 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం 1 Mark Important Questions and Answers
ప్రశ్న 1.
ధృవ నక్షత్రం ఎక్కడ కనిపిస్తుంది?
జవాబు:
ధృవ నక్షత్రం భూభ్రమణ అక్షానికి సూచీగా పైవైపు కనిపిస్తుంది.
ప్రశ్న 2.
ఉత్తరాయనం అనగానేమి?
జవాబు:
సూర్యుడు ఉదయించే స్థానం రోజురోజుకి ఉత్తర దిక్కుగా కదులుటను ఉత్తరాయనం అంటారు.
ప్రశ్న 3.
ప్రాంతీయ మధ్యాహ్నవేళ అనగానేమి?
జవాబు:
ఏ సమయంలో వస్తువుకు అతి తక్కువ పొడవు నీడ ఏర్పడుతుందో ఆ సమయాన్ని ఆ ప్రదేశం యొక్క “ప్రాంతీయ మధ్యాహ్నవేళ” అంటారు.
ప్రశ్న 4.
దక్షిణాయనం అనగానేమి?
జవాబు:
సూర్యుడు ఉదయించే స్థానం రోజురోజుకి దక్షిణ దిక్కుగా కదులుటను దక్షిణాయనం అంటారు.
ప్రశ్న 5.
నీడ గడియారము ద్వారా సమయాన్ని కచ్చితంగా కొలవలేము. ఎందుకు?
జవాబు:
సూర్యుడు ఉత్తర-దక్షిణ దిశలలో (ఉత్తరాయనం, దక్షిణాయనం) కదలడం వల్ల నీడల పొడవులు రోజురోజుకి మారుతున్నాయి. కాబట్టి నీడ గడియారము ద్వారా సమయాన్ని కచ్చితంగా కొలవలేము.
ప్రశ్న 6.
చంద్రకళలు ఏర్పడడానికి కారణం ఏమిటి?
జవాబు:
చంద్రుడు ఆకాశంలో తాను కనిపించిన ప్రదేశంలో మళ్ళీ కనిపించడానికి ఒక రోజు కంటే దాదాపు 50 నిమిషాలు ఎక్కువ సమయం పడుతుంది. ఇదే చంద్రకళలు ఏర్పడడానికి కారణం.
ప్రశ్న 7.
చంద్రకళలు అనగానేమి?
జవాబు:
చంద్రుని ఆకారంలో కలిగే మార్పులను చంద్రకళలు అంటారు.
ప్రశ్న 8.
చంద్రగ్రహణం అనగానేమి?
జవాబు:
చంద్రుని కొంతభాగమో లేక పూర్తిగానో భూమి యొక్క నీడ చేత కప్పివేయబడినట్లు కనబడుతుంది. దీనినే చంద్రగ్రహణం అంటారు.
ప్రశ్న 9.
సూర్యగ్రహణం అనగానేమి?
జవాబు:
ఒక్కొక్కసారి సూర్యుడు పూర్తిగానో, పాక్షికంగానో, చంద్రునితో కప్పివేయబడినట్లవుతుంది. దీనినే సూర్యగ్రహణం అంటారు.
ప్రశ్న 10.
విశ్వం అనగానేమి?
జవాబు:
అనేక కోట్ల గెలాక్సీల సముదాయాన్ని విశ్వం అంటారు.
ప్రశ్న 11.
పాలపుంత (Milky way) అనగా నేమి?
జవాబు:
మనం ఉండే గెలాక్సీని పాలపుంత అంటారు.
ప్రశ్న 12.
గ్రహాల పరిభ్రమణ కాలం అనగానేమి?
జవాబు:
ఒక గ్రహం సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి పట్టే కాలాన్ని పరిభ్రమణ కాలం అంటారు.
ప్రశ్న 13.
గ్రహాల భ్రమణ కాలం అనగానేమి?
జవాబు:
ఒక గ్రహం తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి పట్టే కాలాన్ని భ్రమణ కాలం అంటారు.
ప్రశ్న 14.
గ్రహాలు అనగానేమి?
జవాబు:
సూర్యుని చుట్టూ తిరిగే ఎనిమిది అంతరిక్ష వస్తువులను గ్రహాలు అంటారు.
ప్రశ్న 15.
కృత్రిమ ఉపగ్రహాలు అనగానేమి?
జవాబు:
భూమి (గ్రహాల) చుట్టూ తిరిగే మానవ నిర్మిత అంతరిక్ష వస్తువులను కృత్రిమ ఉపగ్రహాలు అంటారు.
ప్రశ్న 16.
సూర్యునికి అతి దగ్గరగా, దూరంగా ఉన్న గ్రహాలేవి?
జవాబు:
- సూర్యునికి అతి దగ్గరగా ఉండే గ్రహం బుధుడు.
- సూర్యునికి అతి దూరంగా ఉండే గ్రహం నెప్ట్యూన్.
ప్రశ్న 17.
అంతర గ్రహాలు అని వేటిని అంటారు?
జవాబు:
బుధుడు, శుక్రుడు, భూమి, అంగారక గ్రహాలను అంతర గ్రహాలు అంటారు.
ప్రశ్న 18.
బాహ్య గ్రహాలు అని వేటిని అంటారు?
జవాబు:
గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్లను బాహ్య గ్రహాలు అంటారు.
ప్రశ్న 19.
అంతరిక్షం నుండి భూమిని చూసినపుడు నీలి-ఆకుపచ్చ రంగులో ఎందుకు కనిపిస్తుంది?
జవాబు:
భూమి పైనున్న నేల మరియు నీటివల్ల కాంతి వక్రీభవనం చెందటం వలన అంతరిక్షం నుండి చూసినపుడు భూమి నీలి ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది.
ప్రశ్న 20.
తూర్పు నుండి పడమరకు తిరిగే గ్రహాలు ఏవి?
జవాబు:
శుక్రగ్రహం, యురేనస్.
ప్రశ్న 21.
యురేనస్ గ్రహం సూర్యుని చుట్టూ దొర్లుతూ పరిభ్రమిస్తున్నట్లు కనిపిస్తుంది. కారణం ఏమిటి?
జవాబు:
యురేనస్ గ్రహం అక్షం అత్యధికంగా వంగి ఉండటం కారణంగా అది తన చుట్టూ తాను తిరగడం అనేది దొర్లుతూ ఉన్నట్లుగా కనిపిస్తుంది.
ప్రశ్న 22.
ఆస్టరాయిడ్లు అని వేటిని అంటారు?
జవాబు:
కుజుడు, బృహస్పతి, గ్రహ కక్ష్యల మధ్యగల విశాలమైన ప్రదేశంలో అనేక ,చిన్న చిన్న వస్తువులు సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. వీటిని ఆస్టరాయిడ్లు అంటారు.
ప్రశ్న 23.
తోకచుక్కలు అనగానేమి?
జవాబు:
అంతరిక్షం నుండి పడే కొన్ని శకలాలు సూర్యుని చుట్టూ పొడవైన దీర్ఘవృత్తాకార కక్ష్యలలో తిరుగుతాయి. వీటినే తోకచుక్కలు అంటారు.
ప్రశ్న 24.
ఉల్కలు అనగానేమి?
జవాబు:
బయటి అంతరిక్షం నుంచి పడిపోతున్న రాళ్ళు మరియు ఖనిజాలను ఉల్కలు అంటారు.
ప్రశ్న 25.
సౌర కుటుంబంలో గ్రహాలు కాకుండా మిగిలిన ఇతర అంతరిక్ష వస్తువులను తెల్పండి.
జవాబు:
ఆస్టరాయిడ్లు, తోకచుక్కలు మరియు ఉల్కలు.
ప్రశ్న 26.
అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం ఏది?
జవాబు:
శని గ్రహానికి అత్యధిక ఉపగ్రహాలు కలవు. ఇప్పటి వరకు కనుగొన్న ఉపగ్రహాల సంఖ్య 53.
ప్రశ్న 27.
కొన్ని కృత్రిమ ఉపగ్రహాల పేర్లు రాయండి.
జవాబు:
1. ఆర్యభట్ట 2. Insat 3. Irs 4. కల్పన -I 5. Edusat.
ప్రశ్న 28.
అంతరిక్ష వస్తువులు తూర్పు నుండి పడమరకు కదులుతున్నట్లు కనబడుతుంది. ఎందుకు?
జవాబు:
భూమి తన అక్షం చుట్టూ పడమర నుండి తూర్పునకు భ్రమణం చెందుతుంది. కాబట్టి అంతరిక్ష వస్తువులు తూర్పు నుండి పడమరకు కదులుతున్నట్లు కనబడతాయి. నిజానికి అంతరిక్ష వస్తువులు కదలవు.
ప్రశ్న 29.
మన రాష్ట్రంలో నీడ గడియారం ఎక్కడ తయారుచేయబడినది? రాయండి.
జవాబు:
మన రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో గల ‘అన్నవరం’లో సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో నీడ గడియారం తయారుచేయబడినది.
ప్రశ్న 30.
ఈ క్రింది పట్టికను గమనించండి.
గ్రహం పేరు | అంతర / బాహ్య గ్రహం | ప్రత్యేక నామం |
శుక్రుడు | అంతర గ్రహం | వేగుచుక్క / సాయంకాలం చుక్క |
కుజుడు | అంతర గ్రహం | అరుణ గ్రహం |
శుక్రుని వేగుచుక్క / సాయంకాల చుక్క అని అంటారు. ఎందుకు?
జవాబు:
కొన్ని సార్లు తూర్పువైపు సూర్యోదయం కన్నా ముందుగా కనిపించుట వలన వేగుచుక్క అని, కొన్ని సార్లు పడమర వైపు సూర్యాస్తమయం తరువాత కనిపించడం వలన సాయంకాలం చుక్క అని అంటారు.
8th Class Physics 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం 2 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
నక్షత్రాలు పగటిపూట కనబడవు ఎందుకో తెల్పండి.
జవాబు:
- నక్షత్రాలు భూమి నుండి చాలా దూరంలో ఉంటాయి కాబట్టి నక్షత్రాలు చుక్కలవలె రాత్రిపూట కనబడతాయి.
- పగటిపూట నక్షత్రాలు కనబడవు. ఎందుకంటే పగటిపూట సూర్యకాంతి చాలా ఎక్కువగా ఉండుట వలన.
ప్రశ్న 2.
సూర్యగ్రహణాలు ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
సూర్యగ్రహణాలు 4 రకాలు. అవి :
- సంపూర్ణ సూర్యగ్రహణం
- పాక్షిక సూర్యగ్రహణం
- వలయాకార సూర్యగ్రహణం
- మిశ్రమ సూర్యగ్రహణం
ప్రశ్న 3.
చంద్రగ్రహణాలు ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
చంద్రగ్రహణాలు 3 రకాలు అవి :
- సంపూర్ణ చంద్రగ్రహణం
- పాక్షిక చంద్రగ్రహణం
- ప్రచ్ఛాయ / ఉపచ్ఛాయ చంద్రగ్రహణం.
ప్రశ్న 4.
చంద్రయాన్-1 యొక్క ముఖ్య ఉద్దేశ్యాలు ఏమిటి?
జవాబు:
- చంద్రునిపై నీటి జాడను వెదకడం.
- చంద్రునిపై పదార్థ మూలకాలను తెలుసుకోవడం.
- హీలియం-3 ను వెదకడం, చంద్రుని యొక్క త్రిమితీయ ‘అట్లాస్’ను తయారుచేయడం.
- సౌరవ్యవస్థ ఆవిర్భావానికి సంబంధించిన ఆధారాలను వెదకడం.
ప్రశ్న 5.
శాటిలైట్ (ఉపగ్రహాల)కు, గ్రహాలకు మధ్య భేదాలు రాయండి.
జవాబు:
శాటిలైట్ (ఉపగ్రహాలు) | సంగ్రహాలు |
1) ఉపగ్రహాలు గ్రహాల చుట్టూ పరిభ్రమిస్తాయి | 1) గ్రహాలు సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తాయి. |
2) ఉపగ్రహాలు నెమ్మదిగా పరిభ్రమిస్తాయి. | 2) గ్రహాలు ఉపగ్రహాల కంటే వేగంగా పరిభ్రమిస్తాయి. |
ప్రశ్న 6.
సూర్యుడిని నక్షత్రంగా గుర్తించుటకు గల కారణాలు ఏమిటి?
జవాబు:
- సూర్యుడు శక్తి వనరు.
- సూర్యుడు నిరంతరం మండుతూ ఉష్ణాన్ని. కొంతిని విడుదల చేస్తుంది.
- సూర్యుని జీవితకాలం ఎక్కువగా ఉండుట. సూర్యుడు 5 బిలియన్ల సంవత్సరాల క్రితం నుండి మండుతూ ఉంది.
ఇంకా 5 బిలియన్ల సంవత్సరాలు మండుతుంది.
ప్రశ్న 7.
భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది? ఆ నక్షత్రం చుట్టూ తిరిగే ఏవైనా రెండు గ్రహాల పేర్లను తెల్పండి.
జవాబు:
- భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు.
- బుధుడు, శుక్రుడు.
8th Class Physics 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం 4 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
నక్షత్రాలకు, గ్రహాలకు మధ్యగల భేదాలను రాయండి.
జవాబు:
నక్షత్రాలు | గ్రహాలు |
1) నక్షత్రాలు స్వయం ప్రకాశితాలు. | 1) గ్రహాలు స్వయం ప్రకాశితాలు కావు. |
2) ఇవి లెక్కపెట్టలేనన్ని గలవు. | 2) గ్రహాలను లెక్కించవచ్చును. |
3) నక్షత్రాలు పరిమాణంలో పెద్దగా ఉంటాయి. | 3) గ్రహాలు పరిమాణంలో నక్షత్రాల కంటే చిన్నగా ఉంటాయి. |
4) నక్షత్రాలు కదలవు. | 4) గ్రహాలు నక్షత్రాల చుట్టూ పరిభ్రమిస్తాయి. |
ప్రశ్న 2.
ఉల్కలు, ఉల్కాపాతముల మధ్య భేదాలను రాయండి.
జవాబు:
ఉల్కలు | ఉల్కాపాతము |
1) ఉల్కలు భూమిని చేరకముందే పూర్తిగా మండి కాంతిని ఇస్తాయి. | 1) ఉల్కాపాతము పూర్తిగా మండకముందే భూమిని చేరుతుంది. |
2) ఇవి తక్కువ పరిమాణంలో ఉంటాయి. | 2) వీటి పరిమాణం ఎక్కువగా ఉంటుంది. |
3) ఇవి భూమిని నష్టపరచవు. | 3) ఇవి భూమిని ఢీకొట్టి గోతులను ఏర్పరుస్తాయి. |
ప్రశ్న 3.
సూర్యగ్రహణం అనగా నేమి? అవి ఎన్నిరకాలు? వాటిని వివరించండి.
జవాబు:
చంద్రుని నీడ భూమిపై పడటం వల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుం. సూర్యగ్రహణాలు 4 రకాలు అవి :
- సంపూర్ణ సూర్యగ్రహణం
- పాక్షిక సూర్యగ్రహణం
- వలయాకార సూర్యగ్రహణం
- మిశ్రమ సూర్యగ్రహణం
1) సంపూర్ణ సూర్యగ్రహణం :
భూమిపై నుండి చూసినపుడు చంద్రుడు, సూర్యుని పూర్తిగా ఆవరించినట్లయితే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది.
2) పాక్షిక సూర్యగ్రహణం :
చంద్రుని వలన ఏర్పడే నీడ యొక్క అంచు భాగంలో ఉండే పలుచని నీడ భూమిపై పడినపుడు పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది.
3) వలయాకార సూర్యగ్రహణం :
సూర్యుడు భూమికి మధ్యగా చంద్రుడు ప్రయాణిస్తూ సూర్యుని దాటి వెళ్తున్నపుడు సూర్యుని మధ్యలో కొంతమేరకు మాత్రమే చంద్రుడు ఆవరించి, సూర్యుడు ప్రకాశవంతమైన వలయం వలె కనబడటాన్ని వలయాకార సూర్యగ్రహణం అంటాం.
4) మిశ్రమ సూర్యగ్రహణం :
వలయాకార సూర్యగ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణంగా మార్పు చెందటాన్ని మిశ్రమ సూర్యగ్రహణం అంటారు. ఇది చాలా అరుదుగా సంభవిస్తుంది.
ప్రశ్న 4.
చంద్రగ్రహణం అనగానేమి? అవి ఎన్ని రకాలు? వాటిని వివరించండి.
జవాబు:
భూమి యొక్క నీడ చంద్రునిపై పడినపుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది పౌర్ణమి రోజున మాత్రమే సంభవిస్తుంది.
చంద్రగ్రహణాలు 3 రకాలు అవి :
- సంపూర్ణ చంద్రగ్రహణం
- పాక్షిక చంద్రగ్రహణం
- ప్రచ్ఛాయ / ఉపచ్ఛాయ చంద్రగ్రహణం.
1) సంపూర్ణ చంద్రగ్రహణం :
మనకు కనిపించే చంద్రుని ఉపరితలాన్ని పూర్తిగా భూమి నీడ కప్పివేస్తే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
2) పాక్షిక చంద్రగ్రహణం :
మనకు కనిపించే చంద్రుని ఉపరితలంలో కొంత భాగాన్ని భూమి నీడ కప్పివేస్తే పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
3) ప్రచ్ఛాయ./ ఉపచ్ఛాయ చంద్రగ్రహణం :
భూమి నీడ, యొక్క అంచులలో ఉండే పలుచని నీడ ప్రాంతం (భూమి యొక్క ప్రచ్ఛాయ / ఉపచ్ఛాయ) చంద్రునిపై పడటం వలన ఈ గ్రహణం ఏర్పడుతుంది.
ప్రశ్న 5.
సౌర కుటుంబంలోని వివిధ గ్రహాల గురించి వివరించండి.
జవాబు:
1) బుధుడు (Mercury)
- బుధుడు సూర్యునికి అతి దగ్గరగా ఉన్న ఉపగ్రహం.
- సౌర కుటుంబంలో అతిచిన్న గ్రహం.
- సూర్యోదయానికి కొద్ది సమయం ముందుగానీ, సూర్యాస్తమయం వెంటనేగానీ, దిజ్మండలానికి దగ్గరలో బుధుడ్ని చూడవచ్చును.
- దీని ఒక పరిభ్రమణానికి 88 రోజులు పడుతుంది.
2) శుక్రుడు (Venus)
- సూర్యుని నుండి రెండవ గ్రహం.
- భూమికి అతిదగ్గరలో గల గ్రహం.
- గ్రహాలలో కెల్లా అతి ప్రకాశవంతమైనది. దీనిని వేగుచుక్క లేదా సాయంకాల చుక్క అంటారు.
- తన అక్షం చుట్టూ తూర్పు నుండి పడమరకు తిరుగుతుంది.
- దీని పరిభ్రమణానికి 225 రోజులు పడుతుంది.
3) భూమి (Earth)
- సౌర కుటుంబంలోని గ్రహాలన్నింటిలోకి జీవాన్ని కలిగి ఉన్న గ్రహం భూమి.
- భూమిపై జీవం పుట్టడానికి, మనగలగడానికి ప్రత్యేక పర్యావరణ పరిస్థితులను కలిగి ఉన్నది.
- హానికరమైన (u.v) కాంతి నుండి జీవులను రక్షించడానికి ఓజోన్ పొర భూమిపై ఆవరించబడి ఉన్నది.
- భూమి ఒక్క చంద్రుణ్ణి మాత్రమే ఉపగ్రహంగా కలిగి వుంది.
- దీని ఒక పరిభ్రమణానికి 365.25 రోజులు పడుతుంది.
4) కుజుడు లేదా అంగారకుడు (Mars)
- ఇది సూర్యుని నుండి 4వ గ్రహం.
- ఇది ఎరుపు రంగులో కనబడడంచేత దీనిని ‘అరుణగ్రహం’ అంటారు.
- అంగారకుడికి రెండు సహజ ఉపగ్రహాలు కలవు.
- దీని పరిభ్రమణానికి 687 రోజులు పడుతుంది.
5) గురుడు లేదా బృహస్పతి (Jupiter)
- సౌర కుటుంబంలో ఇది అతి పెద్ద గ్రహం.
- ఇవి తనచుట్టూ తాను అతివేగంగా తిరుగుతుంది.
- దీనికి 50 ఉపగ్రహాలు ఉన్నాయి.
- దీనిచుట్టూ ప్రకాశవంతమైన వలయాలు ఉన్నాయి.
- దీని ఒక పరిభ్రమణానికి 4331 రోజులు పడుతుంది.
6) శని (Saturn)
- శని గ్రహం పెద్ద గ్రహాలలో రెండవది.
- ఇది పసుపు వర్ణంలో కనిపిస్తుంది.
- దీని చుట్టూ ఉన్న వలయాలను టెలిస్కోపు ద్వారా చూడవచ్చును.
- దీనికి 53 ఉపగ్రహాలు ఉన్నాయి.
- దీని పరిభ్రమణానికి 29. 5 సంవత్సరాలు పడుతుంది.
7) యురేనస్ (Uranus)
- ఇది సూర్యుని నుండి 7వ గ్రహం.
- దీనిని అతి పెద్ద టెలిస్కోప్ సహాయంతో మాత్రమే చూడగలం.
- ఇది శుక్రగ్రహం వలె తనచుట్టూ తాను తూర్పు నుండి పడమరకు తిరుగుతుంది.
- దీని భ్రమణాక్షం వంపు కారణంగా తనచుట్టూ తాను తిరగడం అనేది దొర్లుతున్నట్లుగా కనిపిస్తుంది.
- దీని పరిభ్రమణానికి 84 సంవత్సరాలు పడుతుంది.
8) నెఫ్యూన్ (Neptune)
- ఇది సూర్యుని నుండి 8వ గ్రహం.
- దీనిపై అత్యల్ప ఉష్ణోగ్రత (38°C) ఉంటుంది.
- దీని ఒక పరిభ్రమణానికి 165 సంవత్సరాలు పడుతుంది.
ప్రశ్న 6.
ఉల్కలకు, తోకచుక్కలకు గల భేదాలు రాయండి.
జవాబు:
ఉల్కలు | తోకచుక్కలు |
1) అంతరిక్షం నుండి కిందకు పడిపోతున్న రాళ్ళు మరియు ఖనిజాలు. | 1) అంతరిక్షం నుండి పడేకొన్ని శకలాలు. సూర్యుని చుట్టూ పొడవైన దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగును. |
2) ఇవి భూమి వాతావరణంలోకి ఎక్కువ వేగంతో ప్రవేశించి మండుతూ, వెలిగిపోతాయి. | 2) సూర్యుని వేడి వలన ఉత్పత్తి అయిన వాయువులు మండి ప్రకాశిస్తూ తోకవలె కన్పిస్తాయి. |
3) భూమిపై పడి గోతులను ఏర్పరుస్తాయి. | 3) హేలీ అనే శాస్త్రవేత్త కనుగొన్న తోకచుక్కకు హేలీ తోకచుక్క అని పేరు పెట్టారు. |
ప్రశ్న 7.
తోక చుక్కల గురించి వివరించండి.
జవాబు:
- అంతరిక్షం నుండి పడే కొన్ని శకలాలు సూర్యుని చుట్టూ పొడవైన దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరిగే వాటిని తోక చుక్కలు అంటారు.
- తోక చుక్కల పరిభ్రమణ కాలం చాలా ఎక్కువగా ఉంటుంది.
- తోకచుక్క సాధారణంగా కాంతివంతమైన తల మరియు తోక కలిగి ఉన్నట్లుగా కనబడుతుంది.
- తోకచుక్క సూర్యుని సమీపిస్తున్న కొలదీ దానితోక పొడవు పెరుగుతుంది. ,దీని తోక ఎల్లప్పుడూ సూర్యుని వ్యతిరేక – దిశలో ఉంటుంది.
- హేలీ అనే ఖగోళ శాస్త్రజ్ఞుడు కనుగొన్న హేలీ తోకచుక్క 76 సంవత్సరాలకు ఒకసారి మనకు కనిపిస్తుంది. 1986లో చూశాము. మరల 2062 సంవత్సరంలో కనబడుతుంది.
ప్రశ్న 8.
ఉల్కలను వివరించండి.
జవాబు:
- అంతరిక్షం నుండి భూమివైపు వేగంగా కిందకు పడిపోయే రాళ్ళను, ఖనిజాలను ఉల్కలు అంటారు.
- ఇవి భూ వాతావరణంలో చొరబడిన చిన్న వస్తువులు.
- ఇవి అత్యంత వేగంగా ప్రయాణిస్తుండటం వలన భూవాతావరణం యొక్క ఘర్షణ కారణంగా బాగా వేడెక్కి మండిపోయి ఆవిరైపోతాయి.
- ఇవి వెలుగుచున్న చారలవలె కనిపించి మాయమవుతాయి.
- కొన్నిసార్లు ఉల్కలు అతి పెద్దగా ఉండటం వల్ల మండి ఆవిరయ్యేలోపే భూమిని చేరుతాయి.
- భూమిని చేరి, ఢీ కొట్టి గోతులను కలుగచేస్తాయి.
- భూమిపై పడే ఉల్కను ఉల్కాపాతము అంటారు.
- సౌర కుటుంబం ఏయే పదార్థాలతో ఏర్పడిందో తెలుసుకొనుటకు ఉల్కాపాతాలు శాస్త్రవేత్తలకు ఉపయోగపడతాయి.
ప్రశ్న 9.
కింది పట్టికను అధ్యయనం చేసి ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. అతి తక్కువ మరియు గరిష్ట సంఖ్యలో చంద్రుళ్ళను కలిగిన గ్రహాలు ఏవి?
జవాబు:
- అతి తక్కువ చంద్రుళ్ళు గల గ్రహం : బుధుడు .
- అతి ఎక్కువ చంద్రుళ్ళు గల గ్రహం : శని
2. పై వాటిలో అత్యంత వేడియైన గ్రహం ఏది? ఎందుకు?
జవాబు:
బుధుడు. బుధుడు సూర్యునికి దగ్గరగా ఉంటుంది.
3. అంతర, బాహ్య గ్రహాలకు ఒక్కొక్క ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
అంతర గ్రహాలు : బుధుడు (లేదా) భూమి (లేదా) అంగారకుడు.
బాహ్య గ్రహాలు : బృహస్పతి (లేదా) శని (లేదా) నెప్ట్యూన్.
4. ఏ గ్రహం యొక్క ఉపగ్రహం భూమి యొక్క సహజ ఉపగ్రహం కంటే పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది.
జవాబు:
బృహస్పతి లేదా శని ఉపగ్రహం
8th Class Physics 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం 1 Mark Bits Questions and Answers
బహుళైచ్ఛిక ప్రశ్నలు
I. సరియగు జవాబును ఎంచుకోండి.
1. ఈ కింది వానిలో సౌర కుటుంబంలో లేనిది
A) గ్రహం
B) గెలాక్సీ
C) తోకచుక్క
D) ఉల్కలు
జవాబు:
B) గెలాక్సీ
2. హేలీ తోకచుక్క …..కు ఒకసారి కనిపిస్తుంది.
A) 76 నెలలు
B) 76 సంవత్సరాలు
C) 56 నెలలు
D) 56 సంవత్సరాలు
జవాబు:
B) 76 సంవత్సరాలు
3. సప్తర్షి మండలం (Ursa Minar) అనునది
A) నక్షత్రం
B) నక్షత్రరాశులు
C) గ్రహాలు
D) గ్రహాల సముదాయం
జవాబు:
B) నక్షత్రరాశులు
4. ఈ కింది వానిలో అత్యధిక ఉపగ్రహాలు గల గ్రహమేది?
A) బృహస్పతి
B) శని
C) బుధుడు
D) కుజుడు
జవాబు:
B) శని
5. చిన్న చిన్న గుంపుల ఆకారాలను, వివిధ జంతువుల, మనుషుల ఆకారాలు గల వక్షత్రాల సముదాయాన్ని …………. అంటారు.
A) నక్షత్రరాశులు
B) గెలాక్సీ
C) ఆస్టరాయిడ్స్
D) సౌర కుటుంబం
జవాబు:
A) నక్షత్రరాశులు
6. సూర్యునిచుట్టూ పొడవైన దీర్ఘవృత్తాకార కక్ష్యలలో తిరిగే అంతరిక్ష వస్తువు (శకలాలు) లను …….. అంటారు.
A) తోకచుక్కలు
B) ఉల్కలు
C) గ్రహాలు
D) ఆస్టరాయిడ్స్
జవాబు:
A) తోకచుక్కలు
7. కుజుడు, బృహస్పతి మధ్య సూర్యుని చుట్టూ తిరిగే అంతరిక్ష వస్తువు (శకలాలు) లను …… అంటారు.
A) శాటిలైట్స్
B) తోకచుక్కలు
C) ఆస్టరాయిడ్స్
D) ఉల్కలు
జవాబు:
C) ఆస్టరాయిడ్స్
8. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం
A) ధృవ నక్షత్రం
B) మకరము
C) ఒరియన్
D) సూర్యుడు
జవాబు:
D) సూర్యుడు
9. ఈ కింది వానిలో దేనిని వేగుచుక్క లేదా సాయంకాల చుక్క అంటారు.
A) శుక్రుడు
B) కుజుడు
C) బృహస్పతి
D) బుధుడు
జవాబు:
A) శుక్రుడు
10. మనం ఉండే గెలాక్సీని …….. అంటారు.
A) 24 గంటలు
B) 24 గంటల కంటే తక్కువ
C) 24 గంటల 50 నిమిషాలు
D) ఏదీకాదు
జవాబు:
C) 24 గంటల 50 నిమిషాలు
11. ఈ కింది వానిలో గ్రహం కానిది
A) కుజుడు
B) శని
C) బృహస్పతి
D) సప్తర్షి మండలం
జవాబు:
D) సప్తర్షి మండలం
12. సూర్యుని నుండి దూరంగా ఉన్న గ్రహం
A) యురేనస్
B) బృహస్పతి
C) నెప్ట్యూన్
D) శని
జవాబు:
C) నెప్ట్యూన్
13. ఈ కింది రోజున చంద్రుని మనం చూడలేము
A) అమావాస్య రోజు
B) పౌర్ణమి రోజు
C) అష్టమి రోజు
D) నవమి రోజు
జవాబు:
A) అమావాస్య రోజు
14. ఒక అమావాస్యకు మరొక అమావాస్యకు మధ్యకాలం
A) 15 రోజులు
B) 29 రోజులు
C) 28 రోజులు
D) 14 రోజులు
జవాబు:
C) 28 రోజులు
15. ధృవ నక్షత్రాన్ని ఈ కింది వాటి సహాయంతో గుర్తించవచ్చును.
A) సప్తర్షి మండలం
B) శర్మిష్టరాశి
C) ఒరియన్
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
16. కదలకుండా ఉన్నట్లు కనబడే నక్షత్రం
A) శుక్రుడు
B) ధృవ నక్షత్రం
C) ఒరియన్
D) శర్మిష్టరాశి
జవాబు:
B) ధృవ నక్షత్రం
17. M లేదా W ఆకారంలో గల నక్షత్ర రాశి
A) సప్తర్షి మండలం
B) శర్మిష్టరాశి
C) ఒరియన్
D) లియో (సింహరాశి)
జవాబు:
B) శర్మిష్టరాశి
18. సౌర కుటుంబంలో అతిచిన్న గ్రహం
A) బుధుడు
B) శుక్రుడు
C) కుజుడు
D) యురేనస్
జవాబు:
A) బుధుడు
19. ఈ కింది వానిలో ఉపగ్రహం
A) భూమి
B) చంద్రుడు
C) బుధుడు
D) శుక్రుడు
జవాబు:
B) చంద్రుడు
20. భూమి యొక్క ఆత్మభ్రమణం
A) తూర్పు నుండి పడమరకు
B) పడమర నుండి తూర్పునకు
C) ఉత్తరం నుండి దక్షిణానికి
D) దక్షిణం నుండి ఉత్తరానికి
జవాబు:
B) పడమర నుండి తూర్పునకు
21. చంద్రుడు ఆకాశంలో తను కనిపించిన ప్రదేశంలో మళ్ళీ కనిపించడానికి పట్టే సమయం
A) భూ గెలాక్సీ
B) సూర్య గెలాక్సీ
C) పాలపుంత
D) సప్తర్షి మండలం
జవాబు:
C) పాలపుంత
22. సూర్యోదయానికి కొద్ది సమయంగానీ సూర్యాస్తమయం వెంటనే గానీ, దిజ్మండలానికి దగ్గరలో కనబడే గ్రహం
A) శుక్రుడు
B) బుధుడు
C) కుజుడు
D) శని
జవాబు:
B) బుధుడు
23. వేగుచుక్క (morning star), సాయంకాల చుక్క (Evening star) అని పిలిచే గ్రహం
A) బుధుడు
B) శుక్రుడు
C) కుజుడు
D) శని
జవాబు:
B) శుక్రుడు
24. అరుణగ్రహం పేరు గల గ్రహం
A) కుజుడు
B) గురుడు
C) శని
D) యురేనస్
జవాబు:
A) కుజుడు
25. ఈ మధ్యకాలంలో ……… గ్రహంపై నీరు ఉన్నట్లు కనుగొనబడినది.
A) కుజుడు
B) గురుడు
C) శని
D) శుక్రుడు
జవాబు:
A) కుజుడు
26. సౌర కుటుంబంలో అతి పెద్ద గ్రహం
A) బుధుడు
B) శుక్రుడు
C) బృహస్పతి
D) కుజుడు
జవాబు:
C) బృహస్పతి
27. భూమిపై నిట్టనిలువుగా ఉంచబడిన ఏ వస్తువు యొక్క “అతితక్కువ పొడవైన” నీడైనా ఎల్లప్పుడూ చూపు దిక్కులు
A) ఉత్తరం
B) దక్షిణం
C) ఉత్తర-దక్షిణలు
D) తూర్పు-పడమరలు
జవాబు:
C) ఉత్తర-దక్షిణలు
28. ఏ సమయంలో వస్తువుకు అతి తక్కువ పొడవు నీడ ఏర్పడుతుందో ఆ సమయాన్ని ఆ ప్రదేశం యొక్క …….. వేళ అంటారు.
A) మధ్యాహ్న
B) ఉదయపు
C) సాయంకాలపు
D) అర్ధరాత్రి
జవాబు:
A) మధ్యాహ్న
29. పూర్వకాలంలో ప్రజలు దీని ఆధారంగా కాలాన్ని లెక్కించేవారు.
A) సూర్యుని బట్టి
B) చంద్రుని బట్టి
C) వస్తు నీడలను బట్టి
D) వస్తు పొడవులను బట్టి
జవాబు:
C) వస్తు నీడలను బట్టి
30. సూర్యోదయ సమయంలో సూర్యుడు రోజురోజుకీ దక్షిణ దిక్కుగా కదులుతున్నట్లు అనిపిస్తే అది
A) సంవత్సరం
B) దక్షిణాయనం
C) ఉత్తరాయనం
D) సంపూర్ణ సూర్యోదయం
జవాబు:
B) దక్షిణాయనం
31. సూర్యోదయ సమయంలో సూర్యుడు రోజురోజుకీ ఉత్తర దిక్కుగా కదులుతున్నట్లు అనిపిస్తే అది
A) సంవత్సరం
B) దక్షిణాయనం
C) ఉత్తరాయనం
D) సంపూర్ణ సూర్యోదయం
జవాబు:
C) ఉత్తరాయనం
32. మన రాష్ట్రంలోని ఏకైక నీడ గడియారం గల జిల్లా
A) పశ్చిమ గోదావరి
B) తూర్పు గోదావరి
C) విశాఖపట్నం
D) చిత్తూరు
జవాబు:
B) తూర్పు గోదావరి
33. మన రాష్ట్రంలోని ఏకైక నీడ గడియారం గల ప్రాంతం
A) అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణం
B) తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం
C) శ్రీకాకుళం సూర్యదేవుని ఆలయ ప్రాంగణం
D) విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ప్రాంగణం
జవాబు:
A) అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణం
34. చిత్తూరు జిల్లా అక్షాంశ డిగ్రీ పూర్ణాంక విలువ
A) 19
B) 13
C) 14
D) 15
జవాబు:
B) 13
35. పశ్చిమగోదావరి, కృష్ణా, మహబూబ్ నగర్ జిల్లాల అక్షాంశ డిగ్రీ పూర్ణాంక విలువ
A) 14
B) 15
C) 16
D) 17
జవాబు:
C) 16
36. శ్రీకాకుళం, విజయనగరం, మెదక్, నిజామాబాద్, ( కరీంనగర్, వరంగల్ జిల్లాల అక్షాంశ డిగ్రీ పూర్ణాంక విలువ
A) 16
B) 17
C) 18
D) 19
జవాబు:
C) 18
37. ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లాల అక్షాంశ డిగ్రీ పూర్ణాంక విలువ
A) 15
B) 17
C) 18
D) 19
జవాబు:
A) 15
38. చంద్రుని ఆకారం ప్రతిరోజూ మారుతూ ఉండటంను …………. అంటారు.
A) చంద్ర ఆకారాలు
B) చంద్రుని కళలు
C) చంద్రుని రూపాలు
D) ఏదీకాదు
జవాబు:
B) చంద్రుని కళలు
39. ఆకాశంలో సూర్యోదయం సంభవించిన ఒక నిర్ణీత ప్రదేశంలోకి.మళ్ళీ సూర్యుడు రావడానికి పట్టుకాలం
A) 22 గంటలు
B) 21 గంటలు
C) 24 గంటలు
D) 25 గంటలు
జవాబు:
C) 24 గంటలు
40. చంద్రుని ఉపరితలం పూర్తిగా కన్పించు రోజు
A) అమావాస్య
B) పౌర్ణమి
C) చెప్పలేము
D) ఏదీకాదు
జవాబు:
B) పౌర్ణమి
41. ఈ రోజున సూర్యుడు, చంద్రుడు భూమికి ఒకేవైపున ఉంటారు.
A) పౌర్ణమి
B) అమావాస్య
C) చంద్రగ్రహణం
D) ఏదీకాదు
జవాబు:
B) అమావాస్య
42. ఈ రోజున సూర్యుడు, చంద్రుడు భూమికి చెరోవైపున ఉంటారు.
A) పౌర్ణమి
B) అమావాస్య
C) సూర్యగ్రహణం
D) ఏదీకాదు
జవాబు:
A) పౌర్ణమి
43. చంద్రునిపై మానవుడు అడుగుపెట్టిన సంవత్సరం
A) 1968
B) 1967
C) 1969
D) 1950
జవాబు:
C) 1969
44. మనదేశం చంద్రుని పైకి పంపిన మొదటి ఉపగ్రహం పేరు
A) చంద్రయాన్ -1
B) చంద్రయాన్ – 2
C) చంద్రయాన్ – 3
D) ఏదీకాదు
జవాబు:
A) చంద్రయాన్ -1
45. క్రింది వాటిలో చంద్రయాన్-1 ముఖ్య ఉద్దేశ్యాలలో ఒకటి కానిది
A) నీటి జాడను వెదకడం
B) పదార్థ మూలకాలను తెలుసుకోవడం
C) హీలియం-3 ను వెదకడం
D) చంద్రునిపై ముసలమ్మ జాడను కనుగొనడం
జవాబు:
D) చంద్రునిపై ముసలమ్మ జాడను కనుగొనడం
46. వీరి నీడ భూమిపై పడుట వలన సూర్యగ్రహణం ఏర్పడును.
A) చంద్రుడు
B) సూర్యడు
C) భూమి
D) చెప్పలేము
జవాబు:
A) చంద్రుడు
47. సూర్యగ్రహణం ………………… రోజు మాత్రమే సంభవించును.
A) అమావాస్య
B) పౌర్ణమి
C) 15వ
D) ఏదీకాదు
జవాబు:
A) అమావాస్య
48. భూమిపై నుండి చూసినపుడు చంద్రుడు, సూర్యుని పూర్తిగా ఆవరించినట్లయితే ఈ రకపు సూర్యగ్రహణం ఏర్పడును.
A) సంపూర్ణ
B) పాక్షిక
C) వలయాకార
D) మిశ్రమ
జవాబు:
A) సంపూర్ణ
49. చంద్రుని పలుచని నీడ (ఉపచ్ఛాయ/ప్రచ్ఛాయ)లు భూమిపై పడినపుడు ఏర్పడు సూర్యగ్రహణ రకము
A) సంపూర్ణ
B) పాక్షిక
C) వలయాకార
D) మిశ్రమ
జవాబు:
B) పాక్షిక
50. సూర్యుని మధ్యలో కొంతమేర మాత్రమే చంద్రుడు ఆవరించినపుడు ఏర్పడు సూర్యగ్రహణ రకము
A) సంపూర్ణ
B) పాక్షిక
C) వలయాకార
D) మిశ్రమ
జవాబు:
C) వలయాకార
51. వలయాకార సూర్యగ్రహణం సంపూర్ణ సూర్య గ్రహణంగా మార్పు చెందుటను …….. గ్రహణం అంటారు.
A) సంపూర్ణ
B) పాక్షిక
C) వలయాకార
D) మిశ్రమ
జవాబు:
D) మిశ్రమ
52. ఈ క్రింది వాటిలో అరుదుగా ఏర్పడు సూర్యగ్రహణం మధ్య పనిచేయు బలం
A) సంపూర్ణ
B) పాక్షిక
C) వలయాకార
D) మిశ్రమ
జవాబు:
D) మిశ్రమ
53. భూమి యొక్క నీడ వీరిపై పడుట వలన చంద్రగ్రహణం ఏర్పడును.
A) చంద్రుడు
B) సూర్యడు
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
A) చంద్రుడు
54. చంద్రుని ఉపరితలంను భూఛాయ పూర్తిగా కప్పివేసిన ఏర్పడు చంద్రగ్రహణం రకము
A) సంపూర్ణ
B) పాక్షిక
C) ప్రచ్ఛాయ
D) ఉపచ్ఛాయ
జవాబు:
A) సంపూర్ణ
55. చంద్రుని ఉపరితలంను భూఛాయ కొంత భాగాన్ని మాత్రమే కప్పివేస్తే ఏర్పడు చంద్రగ్రహణ రకము
A) సంపూర్ణ
B) పాక్షిక
C) ప్రచ్ఛాయ
D) ఉపచ్ఛాయ
జవాబు:
B) పాక్షిక
56. భూమి ప్రచ్ఛాయ వలన ఏర్పడు చంద్రగ్రహణ రకము
A) సంపూర్ణ
B) పాక్షిక
C) ప్రచ్ఛాయ
D) ఉపచ్ఛాయ
జవాబు:
C) ప్రచ్ఛాయ
57. భూమి ఉపచ్ఛాయ వలన ఏర్పడు చంద్రగ్రహణ రకము
A) సంపూర్ణ
B) పాక్షిక
C) ప్రచ్చాయ
D) ఉపచ్చాయ
జవాబు:
D) ఉపచ్చాయ
58. నక్షత్రాల గుంపును ……. అంటారు.
A) రాశి
B) గెలాక్సీ
C) విశ్వం
D) చెప్పలేము
జవాబు:
A) రాశి
59. లక్షలు, కోట్లు నక్షత్రాలు గల పెద్ద గుంపులను ………. అంటారు
A) రాశి
B) గెలాక్సీ
C) విశ్వం
D) చెప్పలేము.
జవాబు:
B) గెలాక్సీ
60. అనేక కోట్ల గెలాక్సీలు దీనిలో కలవు.
A) రాశి
B) గెలాక్సీ
C) విశ్వం
D) చెప్పలేము
జవాబు:
C) విశ్వం
61. నక్షత్రాల కదలికలను తెలుసుకొనుటకు మనం తెలుసుకొని ఉండవలసినవి
A) ధృవ నక్షత్రం
B) సప్తర్షి మండలం
C) శర్మిష్ట రాశి
D) అన్నియూ
జవాబు:
D) అన్నియూ
62. ధృవ నక్షత్రం నిలకడగా వున్నట్లు కన్పించుటకు కారణం
A) భూభ్రమణ అక్షంకు పైవైపుననే ఉండుట వలన
B) భూభ్రమణ అక్షంకు క్రిందివైపుననే ఉండుట వలన
C) భూభ్రమణ అక్షంకు కుడివైపుననే ఉండుట వలన
D) భూభ్రమణ అక్షంకు ఎడమవైపుననే ఉండుట వలన
జవాబు:
A) భూభ్రమణ అక్షంకు పైవైపుననే ఉండుట వలన
63. సౌరకుటుంబంలోని సూర్యునికి, అంతరిక్ష వస్తువుల
A) గురుత్వాకర్షణ
B) అయస్కాంత
C) విద్యుత్
D) ప్రేరిత
జవాబు:
A) గురుత్వాకర్షణ
64. ఈ క్రింది వాటిలో అత్యంత ఉష్ణం మరియు కాంతిని నిరంతరంగా వెదజల్లునది
A) శుక్రుడు
B) బుధుడు
C) సూర్యుడు
D) భూమి
జవాబు:
C) సూర్యుడు
65. ఒక గ్రహం సూర్యుని చుట్టూ , ఒకసారి తిరుగుటకు పట్టుకాలంను ……… అంటారు.
A) భ్రమణకాలం
B) పరిభ్రమణకాలం
C) ఆత్మభ్రమణకాలం
D) ఏదీకాదు
జవాబు:
B) పరిభ్రమణకాలం
66. ఒక గ్రహం తనచుట్టూ తాను ఒకసారి తిరగడానికి పట్టు కాలంను ….. అంటారు.
A) భ్రమణకాలం
B) పరిభ్రమణకాలం
C) ఆత్మభ్రమణకాలం
D) ఏదీకాదు
జవాబు:
A) భ్రమణకాలం
67. ఏ అంతరిక్ష వస్తువైనా మరొక దానిచుట్టూ తిరుగుతూ ఉంటే దానిని …….. అంటాము.
A) గ్రహశకలం
B) ఉపగ్రహం
C) తోకచుక్క
D) ఏదీకాదు
జవాబు:
B) ఉపగ్రహం
68. భూమికి గల సహజ ఉపగ్రహం
A) చంద్రయాన్-1
B) చంద్రయాన్-2
C) చంద్రుడు
D) చంద్రయాన్-3
జవాబు:
C) చంద్రుడు
69. గ్రహాలలోకెల్లా భూమికి దగ్గరగా ఉన్న గ్రహం
A) బుధుడు
B) శుక్రుడు
C) బృహస్పతి
D) కుజుడు
జవాబు:
B) శుక్రుడు
70. ఈ క్రింది వాటిలో ఉపగ్రహాలు లేనిది
A) బుధుడు
B) శుక్రుడు
C) బృహస్పతి
D) కుజుడు
జవాబు:
B) శుక్రుడు
71. సౌరకుటుంబంలోని గ్రహాలలోకెల్లా జీవం కల్గిన గ్రహం
A) బుధుడు
B) శుక్రుడు
C) భూమి
D) కుజుడు
జవాబు:
C) భూమి
72. అంతరిక్షం నుండి చూచినపుడు భూమి నీలి – ఆకుపచ్చ రంగులో కన్నించుటకు గల కారణము
A) కాంతి వక్రీభవనం
B) కాంతి పరావర్తనం
C) అయస్కాంత ప్రభావం
D) అన్నియూ
జవాబు:
A) కాంతి వక్రీభవనం
73. గ్రహాలలోకెల్లా ఎరుపు రంగులో ఉండు గ్రహం
A) కుజగ్రహం
B) బుధగ్రహం
C) శుక్రగ్రహం
D) బృహస్పతి
జవాబు:
A) కుజగ్రహం
74. గురుగ్రహ పరిమాణం భూమి పరిమాణంకు ……. రెట్లు.
A) 1200
B) 1300
C) 1400
D) 1500
జవాబు:
B) 1300
75. గురుగ్రహ ద్రవ్యరాశి భూ ద్రవ్యరాశికి ……. రెట్లు.
A) 300
B) 350
C) 318
D) 250
జవాబు:
C) 318
76. ఈ క్రింది గ్రహాలలో పసుపు వర్ణంలో ఉండు గ్రహం
A) గురుడు
B) భూమి
C) శని
D) నెప్ట్యూన్
జవాబు:
C) శని
77. ఈ క్రింది వాటిలో అంతర గ్రహాలకు చెందనిది
A) భూమి
B) బుధుడు
C) శని
D) శుక్రుడు
జవాబు:
C) శని
78. ఈ క్రింది వాటిలో బాహ్య గ్రహాలకు చెందనిది
A) గురుడు
B) శని
C) కుజుడు
D) యురేనస్
జవాబు:
C) కుజుడు
79. ఈ క్రింది వాటిలో అధిక ఉపగ్రహాలు గలవి
A) అంతర గ్రహాలు
B) బాహ్య గ్రహాలు
C) సూర్యుడు
D) చెప్పలేము
జవాబు:
B) బాహ్య గ్రహాలు
80. ఈ క్రింది వాటిలో చుట్టూ వలయాలను కల్గి ఉన్నవి
A) అంతర గ్రహాలు
B) బాహ్య గ్రహాలు
C) సూర్యుడు
D) చెప్పలేము
జవాబు:
B) బాహ్య గ్రహాలు
81. క్రింది గ్రహాలలో సౌరకుటుంబం నుండి తొలగించబడిన గ్రహం
A) గురుడు
B) యురేనస్
C) నెప్ట్యూన్
D) ప్లూటో
జవాబు:
D) ప్లూటో
82. క్రింది పటంలో చూపబడిన సౌర వస్తువులు
A) ఆస్టరాయిడ్లు
B) తోకచుక్కలు
C) ఉల్కలు
D) ఉల్కాపాతాలు
జవాబు:
A) ఆస్టరాయిడ్లు
83. క్రింది వాటిలో సూర్యుని చుట్టూ అతి దీర్ఘవృత్త కక్ష్యలలో పరిభ్రమించేవి
A) ఆస్టరాయిడ్లు
B) తోకచుక్కలు
C) ఉల్కలు
D) ఉల్కాపాతాలు
జవాబు:
B) తోకచుక్కలు
84. భారతదేశం మొదటిసారిగా ప్రయోగించిన ఉపగ్రహం
A) INSAT
B) IRS
C) ఆర్యభట్ట
D) EDUSAT
జవాబు:
C) ఆర్యభట్ట
85. సూర్యుని వ్యాసము కి.మీలలో
A) 13, 92,000
B) 12,756
C) 14, 92,000
D) 13,90,000
జవాబు:
A) 13, 92,000
86. i) భూమి యొక్క నీడ చంద్రునిపై పడిన పౌర్ణమి రోజు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.
ii) చంద్రుని నీడ భూమిపై పడిన పౌర్ణమి రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుంది.
A) (i) మాత్రమే సత్యం
B) (ii) మాత్రమే సత్యం
C) (i), (ii) లు రెండు సత్యమే
D) (i), (ii) లు రెండు అసత్యమే
జవాబు:
A) (i) మాత్రమే సత్యం
87. చంద్రునిపై పరిశోధనలకుగాను చంద్రయాన్-1 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం
A) జపాన్
B) భారత్
C) రష్యా
D) ఇంగ్లాండ్
జవాబు:
B) భారత్
88. “బుధునిపై జీవరాశి లేదు” ఇందుకు గల కారణాలు గుర్తించండి.
A) ఎక్కువ వేడి ఉండటం.
B) భూభాగం లేకుండా అంతా నీరు ఉండుట.
C) ఉపగ్రహాలు లేకపోవడం.
D) పూర్తిగా మంచుతో కప్పబడి ఉండుట.
జవాబు:
A) ఎక్కువ వేడి ఉండటం.
89. గ్రూప్-Aలోని గ్రహాలను, గ్రూప్-Bలోని ప్రత్యేకతలతో జతపరచండి.
గ్రూప్-A గ్రూప్-B
P) అంగారకుడు X) అతి పెద్ద గ్రహం
Q) శుక్రుడు Y) అరుణ గ్రహం
R) బృహస్పతి Z) వేగుచుక్క
A) P-Y, Q-X, R-Z
B) P-Y, Q-Z, R-X
C) P-2, Q-X, R-Y
D) P-2, Q-Y, R-X
జవాబు:
B) P-Y, Q-Z, R-X
90. భూమి కొంత వంగి చలించడం వలన కలిగే ప్రభావం
A) తుపానులు
B) రాత్రి పగలు
C) ఋతువులు
D) గ్రహణాలు
జవాబు:
C) ఋతువులు
91. భూమి, అంగారకుడికి మధ్య ఒక కొత్త గ్రహాన్ని కనుగొంటే దాని యొక్క పరిభ్రమణ కాలం
A) అంగారకుడి పరిభ్రమణ కాలం కన్నా తక్కువ.
B) అంగారకుడి పరిభ్రమణ కాలం కన్నా ఎక్కువ.
C) అంగారకుడి పరిభ్రమణ కాలానికి సమానం.
D) భూమి యొక్క పరిభ్రమణ కాలం కన్నా తక్కువ.
జవాబు:
A) అంగారకుడి పరిభ్రమణ కాలం కన్నా తక్కువ.
92. భూమిపై నుండి చూసినపుడు సూర్యుడు తూర్పు నుండి పడమర వైపు కదిలినట్లు అనిపిస్తాడు. దీని అర్థం భూమి ఏ దిశ నుండి ఏ దిశకు తిరుగుతుంది.
A) తూర్పు నుండి పడమరకు
B) పడమర నుండి తూర్పుకు
C) ఉత్తరం నుండి దక్షిణానికి
D) దక్షిణం నుండి ఉత్తరానికి
జవాబు:
B) పడమర నుండి తూర్పుకు
93. అంతరిక్ష నౌకలకు అమర్చే “హీట్ షీల్డ్” యొక్క క్రింది ఏ ఉపయోగాన్ని నీవు అభినందిస్తావు?
A) హీట్ షీల్డ్ అంతరిక్ష నౌకను ఆకర్షనీయంగా చేసుంది.
B) హీట్ షీల్డ్ అంతరిక్షనౌకను తేలికగా చేస్తుంది.
C) హీట్ షీల్డ్ అంతరిక్షనౌకను వేగాన్ని తగ్గిస్తుంది.
D) హీట్ షీల్డ్ ఘర్షణ వలన జనించే ఉష్ణాన్ని నిరోధిస్తుంది.
జవాబు:
D) హీట్ షీల్డ్ ఘర్షణ వలన జనించే ఉష్ణాన్ని నిరోధిస్తుంది.
II. జతపరచుము
1)
Group – A | Group – B |
1. బుధుడు | A) అత్యధిక ఉపగ్రహాలు గల గ్రహం |
2. బృహస్పతి | B) తూర్పు నుండి పడమరకు ఆత్మభ్రమణం చేసే గ్రహం |
3. శని | C) అతి పెద్ద గ్రహం |
4. నెప్ట్యూన్ | D) అతిచిన్న గ్రహం |
5. శుక్రుడు | E) సూర్యుని నుండి అత్యధిక దూరంలో గల గ్రహం |
జవాబు:
Group – A | Group – B |
1. బుధుడు | D) అతిచిన్న గ్రహం |
2. బృహస్పతి | C) అతి పెద్ద గ్రహం |
3. శని | A) అత్యధిక ఉపగ్రహాలు గల గ్రహం |
4. నెప్ట్యూన్ | E) సూర్యుని నుండి అత్యధిక దూరంలో గల గ్రహం |
5. శుక్రుడు | B) తూర్పు నుండి పడమరకు ఆత్మభ్రమణం చేసే గ్రహం |
2)
Group – A | Group – B |
1. చంద్రకళలు | A) వస్తువు యొక్క అతి తక్కువ పొడవైన నీడ చూపించే దిశ |
2. సూర్యగ్రహణం | B) వస్తువు యొక్క అతి తక్కువ పొడవైన నీడ ఏర్పడినపుడు సమయం |
3. చంద్రగ్రహణం | C) అమావాస్య రోజు ఏర్పడును |
4. ఉత్తర-దక్షిణ దిక్కులు | D) చంద్రుని ఆకారంలో మార్పులు |
5. ప్రాంతీయ మధ్యాహ్నవేళ | E) పౌర్ణమిరోజు ఏర్పడును |
జవాబు:
Group – A | Group – B |
1. చంద్రకళలు | D) చంద్రుని ఆకారంలో మార్పులు |
2. సూర్యగ్రహణం | C) అమావాస్య రోజు ఏర్పడును |
3. చంద్రగ్రహణం | E) పౌర్ణమిరోజు ఏర్పడును |
4. ఉత్తర-దక్షిణ దిక్కులు | A) వస్తువు యొక్క అతి తక్కువ పొడవైన నీడ చూపించే దిశ |
5. ప్రాంతీయ మధ్యాహ్నవేళ | B) వస్తువు యొక్క అతి తక్కువ పొడవైన నీడ ఏర్పడినపుడు సమయం |
3)
Group – A | Group – B |
1. గెలాక్సీ | A) సూర్యుడు ఉండే గెలాక్సీ |
2. విశ్వం | B) గ్రహాలు, తోకచుక్కలు, ఆస్టరాయిడ్లు, ఉల్కలు మొదలగునవి |
3. పాలపుంత | C) వివిధ జంతువుల, మనుషుల మరియు చిన్న చిన్న ఆకారాలు గల నక్షత్రాలు |
4. సౌర కుటుంబం | D) అనేక కోట్ల నక్షత్రాల సమూహం |
5. నక్షత్రరాశులు | E) అనేక కోట్ల గెలాక్సీల సముదాయం |
జవాబు:
Group – A | Group – B |
1. గెలాక్సీ | D) అనేక కోట్ల నక్షత్రాల సమూహం |
2. విశ్వం | E) అనేక కోట్ల గెలాక్సీల సముదాయం |
3. పాలపుంత | A) సూర్యుడు ఉండే గెలాక్సీ |
4. సౌర కుటుంబం | B) గ్రహాలు, తోకచుక్కలు, ఆస్టరాయిడ్లు, ఉల్కలు మొదలగునవి |
5. నక్షత్రరాశులు | C) వివిధ జంతువుల, మనుషుల మరియు చిన్న చిన్న ఆకారాలు గల నక్షత్రాలు |
మీకు తెలుసా?
మన రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో గల ‘అన్నవరం’లోని సత్యన్నారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో నీడ గడియారం తయారు చేయబడి ఉంది.
2008 అక్టోబర్ 22న మన దేశం చంద్రుని గురించి అనేక విషయాలు తెలుసుకునేందుకు చంద్రయాన్ – 1 (చంద్రునికి ఉపగ్రహం)ను ప్రయోగించింది.
చంద్రయాన్-1 యొక్క ముఖ్య ఉద్దేశాలు :
- చంద్రునిపై నీటి జాడను వెదకడం
- చంద్రునిపై పదార్థ మూలకాలను తెలుసుకోవడం
- హీలియం -3ను వెదకడం
- చంద్రుని యొక్క త్రిమితీయ ‘అట్లాస్’ను తయారు చేయడం.
- ‘సౌరవ్యవస్థ’ ఆవిర్భావానికి సంబంధించిన ఆధారాలను వెదకడం.
చంద్రయాన్-1ను ప్రయోగించడం ద్వారా చంద్రునికి ఉపగ్రహాలను పంపిన 6 దేశాలలో ఒకటిగా మన దేశం అవతరించింది. చంద్రయాన్-1 చంద్రునిపై ఏయే విషయాలు కనుగొందో వార్తాపత్రికలు, ఇంటర్నెట్ లో వెదికి తెలుసుకోండి.
2006 ఆగస్టు 25 నాటి వరకు మన సౌర కుటుంబంలో గ్రహాలు 9 అని చెప్పుకునే వాళ్లం. అప్పటి 9వ గ్రహం ‘ఫ్లూటో’. అంతర్జాతీయ అంతరిక్ష సమాఖ్య (International Astronomical Union) 26వ జనరల్ అసెంబ్లీలో ప్లూటోను గ్రహం కాదు అని నిర్ణయించడం జరిగింది. ఎందుకనగా ఫ్లూటో “క్లియర్డ్ ద నైబర్‌హుడ్” (తోటి గ్రహాల కక్ష్యలకు ఆటంకం కలిగించరాదు) అన్న నియమాన్ని ఉల్లంఘిస్తున్నది. ఇది కొన్ని కొన్ని సందర్భాలలో నెప్ట్యూన్ కక్ష్యలోకి ప్రవేశిస్తున్నది.