AP 8th Class Physical Science Important Questions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు

These AP 8th Class Physical Science Important Questions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు will help students prepare well for the exams.

AP Board 8th Class Physical Science 11th Lesson Important Questions and Answers కొన్ని సహజ దృగ్విషయాలు

8th Class Physics 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
భూకంపం ద్వారా విడుదలయ్యే విధ్వంస శక్తిని దేనితో కొలుస్తారు?
జవాబు:
భూకంపం ద్వారా విడుదలయ్యే విధ్వంస శక్తిని “భూకంప లేఖిని” లేదా “భ్రామక పరిమాణ స్కేలు’ ద్వారా కొలుస్తారు.

ప్రశ్న 2.
రెండు వస్తువులు ఒకే ఆవేశం కలిగి ఉంటే ఏం జరుగుతుంది? తెల్పండి.
జవాబు:
రెండు వస్తువులు ఒకే ఆవేశం కలిగి ఉంటే వాటి మధ్య వికర్షణ బలం ఉంటుంది.

ప్రశ్న 3.
రెండు వస్తువులు వేరు వేరు ఆవేశాలు కలిగి ఉంటే ఏం జరుగుతుందో తెల్పండి?
జవాబు:
రెండు వస్తువులు వేరు వేరు ఆవేశాలు కలిగి ఉంటే వాటి మధ్య ఆకర్షణ బలం ఉంటుంది.

ప్రశ్న 4.
వస్తువుకున్న ఆవేశాన్ని గుర్తించడానికి ఏ పరికరం ఉపయోగిస్తారు?
జవాబు:
ఒక వస్తువు ఆవేశాన్ని గుర్తించడానికి విద్యుదర్శినిని ఉపయోగిస్తారు.

ప్రశ్న 5.
సహజ దృగ్విషయాలు అని వేటిని అంటారు?
జవాబు:
వరదలు, తుపాన్లు, వడగండ్ల వర్షం, మెరుపులు, ఉరుములు, భూకంపాలు, సునామీలు మరియు అగ్ని పర్వతాలు పేలడం వంటివి సంభవించే వాటిని సహజ దృగ్విషయాలు అని అంటారు.

AP 8th Class Physical Science Important Questions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు

ప్రశ్న 6.
విద్యుత్ ఆవేశ బలాల సూత్రాలను రాయండి.
జవాబు:

  1. సజాతి ఆవేశాల మధ్య వికర్షణ బలాలు ఉంటాయి.
  2. విజాతి ఆవేశాల మధ్య ఆకర్షణ బలాలు ఉంటాయి.

ప్రశ్న 7.
ఆవేశం గల ఒక వస్తువును ఆవేశం లేని వస్తువు దగ్గరకు తీసుకొస్తే ఆకర్షణకు గురి అవుతుంది. ఎందుకు?
జవాబు:
ఆవేశం గల ఒక వస్తువును ఆవేశం లేని వస్తువు దగ్గరకు తీసుకు వస్తే ఆవేశం లేని వస్తువుపై, వ్యరేక ఆవేశం ప్రేరేపింపబడి అది ఆకర్షణకు గురవుతుంది.

ప్రశ్న 8.
ఒక వస్తువుపై ఆవేశం ఉన్నదో లేదో గుర్తించడానికి ఏ ధర్మం సరియైనది?
జవాబు:
ఒక వస్తువుపై ఆవేశం ఉన్నదో లేదో గుర్తించడానికి వికర్షణ ధర్మం సరియైనది.

ప్రశ్న 9.
భూకంప తరంగాలు అనగానేమి?
జవాబు:
భూ అంతర్భాగంలో కదలికలు భూ ఉపరితలంపై తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ తరంగాలను భూకంప తరంగాలు అంటారు.

ప్రశ్న 10.
భూకంప తరంగాలను దేని ద్వారా గుర్తిస్తారు?
జవాబు:
భూకంప తరంగాలను భూకంప లేఖిని ద్వారా గుర్తిస్తారు.

ప్రశ్న 11.
ఉత్తర భారతదేశంలో భూకంప ప్రభావిత ప్రాంతాలు ఏవి?
జవాబు:
భారతదేశంలో కాశ్మీర్, పశ్చిమ మరియు మధ్య హిమాలయాలు, ఈశాన్య ప్రాంతాలు, కచ్ తీరం. రాజస్థాన్. గంగా పరీవాహక ప్రాంతాలు అత్యంత భూకంప ప్రభావిత ప్రాంతాలు.

ప్రశ్న 12.
భూమిలో ఎన్ని పొరలు ఉంటాయి? అవి ఏవి?
జవాబు:
భూమిలో ముఖ్యంగా మూడు పొరలు ఉంటాయి. అవి :

  1. భూపటలం
  2. ప్రావారం
  3. భూకేంద్రం.

భూకేంద్రంలో రెండు పొరలు ఉంటాయి. అవి :

  1. అంతర్ భూకేంద్రం,
  2. బాహ్య భూకేంద్రం

ప్రశ్న 13.
భూకంప ప్రభావిత ప్రాంతాలు అనగానేమి?
జవాబు:
భూమి లోపల గల పలకల కదలిక వల్ల కొన్ని ప్రాంతాలలో భూకంపాలు తరచుగా రావడానికి అవకాశం ఉంటుంది. భూ ఉపరితలంపై ఈ పలకలకు దరిదాపుల్లో ఉండే ఈ బలహీన ప్రాంతాలను సెస్మిక్ ప్రాంతాలు లేదా భూరు ప్రభావిత ప్రాంతాలు అంటారు.

ప్రశ్న 14.
తటిద్వాహకం అనగానేమి?
జవాబు:
పిడుగుల (మెరుపు) ల నుండి పెద్ద పెద్ద భవనాలను, కట్టడాలను రక్షించడానికి ఉపయోగించే దానిని తటిద్వాహకం అంటారు.

AP 8th Class Physical Science Important Questions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు

ప్రశ్న 15.
కాగితంతో రుద్దిన రబ్బరు బెలూనను చిన్న కాగితపు ముక్కల దగ్గరకు తీసుకువచ్చినపుడు నీవు గమనించిన కిషయాలు ఏమిటి?
జవాబు:

  1. రబ్బరు బెలూన్ కాగితం ముక్కలను ఆకర్షించును.
  2. రబ్బరు బెలూన్ కాగితం ముక్కలపై ప్రభావం చూపదు.

8th Class Physics 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
ఏదైనా ఒక వస్తువును ఆవేశపరచడానికి మూడు పద్ధతులను రాయండి.
జవాబు:

  1. ఒక వస్తువును మరొక వస్తువుతో రాపిడికి గురిచేయడం వలన ఆవేశపరచవచ్చును.
  2. ఒక వస్తువును ఆవేశం గల వస్తువు దగ్గరకు తెచ్చినపుడు ఆ వస్తువులో ఆవేశం ప్రేరేపించడం వలన ఆవేశ పరచవచ్చును.
  3. ఒక వస్తువుకు, ఆవేశ వస్తువును తాకించడం వలన ఆవేశం గల వస్తువు నుండి ఆ వస్తువులోకి ఆవేశం బదిలీ అగుట వలన ఆవేశ పరచవచ్చును.

ప్రశ్న 2.
భ్రామక పరిమాణ స్కేలు గురించి కొన్ని ఉపయోగాలు రాయండి.
జవాబు:

  1. భ్రామక పరిమాణ స్కేలు భూకంప తీవ్రతను కొలుచుటకు ఉపయోగిస్తారు.
  2. భూకంపాలను భ్రామక పరిమాణ స్కేలు ద్వారా కచ్చితంగా నిర్ధారించవచ్చును.
  3. ఈ పద్ధతి రిక్టర్ స్కేలు పద్ధతి కంటే ఉన్నతమైనది.

ప్రశ్న 3.
భూకంపాలు ఏ విధంగా ఏర్పడతాయో తెల్పండి.
జవాబు:
భూమి ఉపరితలంలో ఒకే పొరగా లేదు. ఇది విడివిడి ముక్కలుగా ఉంటుంది. ఈ ముక్కలను పలకలు అంటారు. ఈ పలకలు నిరంతర చలనంలో ఉంటాయి. ఒక పలక మరొక పలకను ఢీకొన్నప్పుడు కాని, రెండింటి మధ్య రాపిడి జరిగినప్పుడు కాని భూ పటలంలో కదలికలు వస్తాయి.

భూ అంతర్భాగంలో జరిగే ఇటువంటి కదలికలు భూ ఉపరితలంలో భూకంపాలను ఏర్పరుస్తాయి.

AP 8th Class Physical Science Important Questions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు

ప్రశ్న 4.
ఒక వస్తువుపై ఆవేశము ఉన్నదో లేదో గుర్తించడానికి “ఆకర్షణ ధర్మం” సరైనది కాదు. ఎందుకో వివరించండి.
జవాబు:

  1. ఒక తటస్థ వస్తువును, ఆవేశ వస్తువు వద్దకు తీసుకొనివస్తే ఆకర్షిస్తుంది.
  2. ఒక ఆవేశ వస్తువును, దాని వ్యతిరేక ఆవేశ వస్తువు వద్దకు తీసుకొనివస్తే ఆకర్షిస్తుంది.
  3. ఒక వస్తువుపై ఆవేశం ఉన్నదో లేదో తెలుసుకొనుటకు ఆవేశం గల వస్తువు దగ్గరకు తీసుకొనివస్తే ఆకర్షించినట్లైతే ఆ వస్తువుపై తటస్థ ఆవేశం లేదా వ్యతిరేక ఆవేశం మాత్రమే ఉండాలి. కాని తటస్థ ఆవేశమా, వ్యతిరేక ఆవేశమా అని కచ్చితంగా చెప్పలేము. కాబట్టి “ఆకర్షణ ధర్మం” సరియైనది కాదు.

ప్రశ్న 5.
తటిద్వా హకం (Lightning conductor) అనగానేమి? ఇది భవనాలను ఎలా రక్షిస్తుంది?
జవాబు:

  1. పిడుగుల (మెరుపు)ల నుండి పెద్ద పెద్ద భవనాలను, కట్టడాలను రక్షించడానికి ఉపయోగించే దానిని తటిద్వాహకం అంటారు.
  2. భవనం కన్నా కొద్దిగా ఎత్తుగా ఉండే లోహపు కడ్డీని భవన నిర్మాణ సమయంలోనే గోడలో అమర్చుతారు.
  3. లోహపు కడ్డీ ఒక చివర గాలిలో ఉంటుంది. రెండవ చివరను భూమిలోకి పాతుతారు.
  4. భవనం కంటే లోహపుకడ్డీ ఎత్తులో ఉంటుంది కనుక అది మేఘాలకు దగ్గరగా ఉండటం వల్ల ఇది మొదట ఆవేశాన్ని స్వీకరిస్తుంది.
  5. ఇది మంచి విద్యుత్ వాహకం కనుక భవనానికి ఎటువంటి నష్టం జరగకుండా ఆవేశాన్ని భూమికి చేరవేస్తుంది.

ప్రశ్న 6.
భూకంపాలు ఏ విధంగా ఏర్పడుతాయో వివరించండి.
జవాబు:

  1. భూమి ఉపరితలంలో ఒకే పొరగా లేదు. ఇది విడివిడి ముక్కలుగా ఉంటుంది.
  2. ఈ ముక్కలను పలకలు అంటారు.
  3. ఈ పలకలు నిరంతర చలనంలో ఉంటాయి.
  4. ఒక పలక మరో పలకను ఢీకొన్నప్పుడు కాని, రెండింటి మధ్య రాపిడి జరిగినపుడు కాని భూ పటలంలో కదలికలు వస్తాయి.
  5. భూ అంతర్భాగంలో జరిగే ఇటువంటి కదలికలు భూ ఉపరితలంలో భూకంపాలను ఏర్పరుస్తాయి.

ప్రశ్న 7.
భ్రామక పరిమాణ స్కేలును వివరించండి.
జవాబు:

  1. భ్రామక పరిమాణ స్కేలు భూకంప తీవ్రతను కొలుచుటకు ఉపయోగిస్తారు.
  2. ఇది భూ ఉపరితలం వద్ద వచ్చే విస్తాపనంతో సంబంధం లేకుండా భూ అంతర్భాగంలో గల పలకల విస్తాపనంపై ఆధారపడి పనిచేస్తుంది.
  3. భూకంపాలను భ్రామక పరిమాణ స్కేలు ద్వారా కచ్చితంగా నిర్ధారించవచ్చును.
  4. ఈ పద్ధతి రిక్టర్ స్కేలు పద్ధతి కంటే ఉన్నతమైనది.

ప్రశ్న 8.
భూకంప ప్రమాద పటం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని జోన్లను వివరించండి.
జవాబు:

  1. భూకంప ప్రమాద పటం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు 2, 3 జోన్లలో ఉన్నాయి.
  2. ఆంధ్రప్రదేశ్ ఆగ్నేయ ప్రాంతంలోని చిత్తూరు, వై.ఎస్.ఆర్.కడప, నెల్లూరు మరియు కృష్ణా, గోదావరి మైదాన ప్రాంతాలు 3వ జోన్లో ఉన్నాయి.
  3. హైదరాబాద్ నగరం 2వ జోన్లో ఉన్నది.

8th Class Physics 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
ఒక వస్తువు ప్రేరణ వలన ఆవేశపరచడానికి, ఆవేశం గల వాహకం ద్వారా ఆవేశపరచడానికి మధ్యగల భేదాలను రాయండి.
జవాబు:

ప్రేరణ వలన ఆవేశపరచడం ఆవేశం గల వాహకం ద్వారా ఆవేశపరచడం
1) తటస్థ ఆవేశం గల వస్తువు వద్దకు ఆవేశం గల వస్తువును తీసుకొని వస్తే ప్రేరణ వలన తటస్థ ఆవేశం గల వస్తువుపై ఆవేశం ఏర్పడుతుంది. 1) తటస్థ ఆవేశం గల వస్తువుకు ఆవేశం గల వస్తువును తాకించినపుడు (స్పర్శలో) తటస్థ ఆవేశం గల వస్తువుపై ఆవేశం ఏర్పడుతుంది.
2) ఇది తాత్కాలికమైనది. 2) ఇది శాశ్వతమైనది.
3) తటస్థ ఆవేశ వస్తువుపై ఆవేశ పరచడానికి ఉపయోగించిన వస్తువు ఆవేశానికి వ్యతిరేకమైన ఆవేశం ఏర్పడుతుంది. 3) తటస్థ ఆవేశం గల వస్తువుపై, ఆవేశపరచడానికి ఉపయోగించిన వస్తువు ఆవేశం ఏర్పడుతుంది.

ప్రశ్న 2.
మెరుపులు, ఉరుములు ఏ విధంగా ఏర్పడునో వివరించండి.
జవాబు:

  1. గాలిలో మేఘాలు ప్రయాణించేటప్పుడు గాలిలో కణాలతో ఘర్షణ వల్ల మేఘాలు ఆవేశపూరితం అవుతాయి.
  2. మేఘాల ఉపరితలాలు చాలా పెద్దవి కనుక ఈ ఉపరితలాలపై ఆవేశం చాలా ఎక్కువ మొత్తంలో నిలువ ఉంటుంది.
  3. ఒక ఆవేశపూరిత మేఘం దగ్గరగా మరొక మేఘం వచ్చినపుడు అది రెండవ మేఘంపై వ్యతిరేక ఆవేశాన్ని ప్రేరేపింపజేస్తుంది.
  4. ఈ మేఘాలపై గల ఆవేశం ఒక మేఘం నుండి మరొక మేఘం పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కానీ మేఘాల మధ్య గాలి విద్యుత్ బంధకంగా పనిచేస్తుంది.
  5. మేఘాలపై అధిక మొత్తంలో పోగుపడిన ఆవేశాల బదిలీని గాలి విద్యుత్ బంధకం అయినప్పటికీ నిరోధించలేదు.
  6. అధిక ధన, ఋణ ఆవేశాలు గల మేఘాల మధ్య విద్యుత్ ఉత్సర్గం జరిగి పెద్ద ఎత్తున వెలుగుతో పాటు ధ్వని ఉత్పత్తి అవుతుంది.
  7. ఏర్పడే వెలుగును మెరుపు అని, వెలువడే ధ్వనిని ఉరుము అని అంటారు.

ప్రశ్న 3.
వివిధ రిక్టర్ స్కేలు అవధుల విలువలకు భూకంప ప్రభావం ఏ విధంగా ఉంటుందో రాయండి.
జవాబు:

రిక్టర్ స్కేలు అవధులు భూకంప ప్రభావం
3.5 కన్నా తక్కువ భూకంప లేఖిని నమోదుచేస్తుంది. కానీ మనం గుర్తించలేం.
3.5 నుండి 5.4 అప్పుడప్పుడు గుర్తించగలం, విధ్వంసం పెద్దగా ఉండదు.
5.5 నుండి 6.0 భవనాలకు కొద్దిపాటి నష్టం జరుగుతుంది. నాణ్యతలేని నిర్మాణాలు ఎక్కువ దెబ్బతినే అవకాశం ఉంది.
6.1 నుండి 6.9 100 కిలోమీటర్ల వైశాల్యంలో తీవ్రత ఉంటుంది.
7.0 నుండి 7.9 పెద్ద భూకంపాలు. ఇవి జరిగినపుడు ఆస్తి మరియు ప్రాణ నష్టం అధికంగా జరుగుతుంది.
8 కన్నా ఎక్కువ అతి పెద్ద భూకంపాలు. వందల కిలోమీటర్ల వైశాల్యంలో ప్రభావం ఉంటుంది. తీవ్రమైన విధ్వంసం జరుగుతుంది.

ప్రశ్న 4.
తరచుగా భూకంపాలు వచ్చే ప్రాంతాలలో భవన నిర్మాణంలో మరియు భూకంప నష్ట తీవ్రతను తగ్గించుటకు తీసుకోవలసిన జాగ్రత్తలను రాయండి.
జవాబు:

  1. భవన నిర్మాణాల సలహాలకై ఇంజనీర్లను, ఆర్కిటెక్ట్ ను సంప్రదించాలి.
  2. భూకంపాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలలో మట్టి, కలప వినియోగించి నిర్మాణాలు చేయాలి.
  3. భవనాల పై భాగం తేలికగా ఉంటే అవి పడినపుడు నష్టం తక్కువగా ఉంటుంది.
  4. ఇంటి గోడలకు అల్మరాలను ఏర్పాటుచేయడం మంచిది. అవి త్వరగా పడిపోవు.
  5. గోడలకు వేలాడదీసిన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. భూకంప సమయంలో అవి మీద పడే అవకాశం ఉంది.
  6. భూకంపాలు వచ్చిన సందర్భంలో అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. అందువల్ల విద్యుత్ పరికరాలు, తీగలు నాణ్యమైనవి వినియోగించాలి. పెద్ద భవనాలలో అగ్నిప్రమాద నిరోధక పరికరాలను ఏర్పాటు చేసుకోవాలి.

AP 8th Class Physical Science Important Questions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు

ప్రశ్న 5.
భారతదేశంలో గతంలో వచ్చిన భూకంపాలు ఎక్కడ వచ్చాయో వివరించండి.
జవాబు:

  1. డిసెంబరు 26, 2004లో వచ్చిన సునామి వలన అండమాన్ మరియు నికోబార్‌లో పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది.
  2. ఉత్తర కాశ్మీర్ లోని ఉరి, తంగదర్ పట్టణాలలో అక్టోబరు 8, 2005న సంభవించిన భూకంపం భారతదేశంలో అతి పెద్దది.
  3. జనవరి 26,2001లో గుజరాత్ లోని భుజ్ జిల్లాలో పెద్ద భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత 7.7 రిక్టరు స్కేలు నమోదు చేసింది.
  4. మే 22, 1997లో మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత 6గా రిక్టర్ స్కేలు నమోదు చేసింది.
  5. సెప్టెంబర్ 30, 1993లో మహారాష్ట్రలోని లాతూర్ (కిల్లరి) లో భూకంపం వచ్చింది.

ప్రశ్న 6.
భూకంప తీవ్రతను కొలిచే పరికరం యొక్క పటాన్ని గీయుము. ఇందులో ఉపయోగించే స్కేలు పేరు తెలుపుము.
జవాబు:
AP 8th Class Physical Science Important Questions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు 1
భూకంప తీవ్రతను కొలిచే పరికరంలో ఉపయోగించే స్కేలు : రిక్టర్ స్కేలు.

ప్రశ్న 7.
“భూకంపాల వలన వరదలు, కొండ చరియలు విరిగి పడటం మరియు సునామిలు రావడం వంటివి జరుగుతాయి. డిసెంబర్ 26, 2004 నాడు హిందూ మహాసముద్రంలో సునామి వచ్చింది. దీని వల్ల తూర్పు తీరప్రాంతం తీవ్ర ఆసి, ప్రాణ నష్టం సంభవించింది.” ఈ సమాచారం ఆధారంగా క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. సునామీ సంభవించడానికి కారణమేమి?
జవాబు:
భూకంపాలు

2. తీవ్ర సునామీ సంభవించినపుడు ఏమి జరుగుతుంది?
జవాబు:
భారీ వర్షాలు, వరదలు, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది.

3. భూకంపాన్ని గుర్తించుటకు ఉపయోగించే పరికరం ఏది? దానిలోని ప్రధాన భాగాలేవి?
జవాబు:
భూకంప లేఖిని (సిస్మో గ్రాఫ్) లేదా భూకంప దర్శిన్ని (సిస్మో స్కోప్)
ముఖ్య భాగాలు : గుండ్రంగా తిరిగే డ్రమ్, లోలకం, అయస్కాంతం, తీగ.

4. భూకంప తీవ్రతను సూచించు స్కేలు 8 దాటితే దాని ప్రభావం ఎలా ఉంటుంది?
జవాబు:
తీవ్ర నష్టం (100 కి.మీ.ల విస్తీర్ణంలో)

8th Class Physics 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు 1 Mark Bits Questions and Answers

బహుళైచ్ఛిక ప్రశ్నలు

I. సరియగు జవాబును ఎంచుకోండి.

1. ఏ శాస్త్రవేత్త, ఏ సంవత్సరంలో వెంట్రుకలు బట్టలను ఆకర్షించటం మరియు ఆకాశంలో మెరుపులూ రెండూ ఒకే దృగ్విషయమని తెలియజేశాడు?
A) 1762 రూథర్ ఫర్డ్
B) 1752 బెంజిమన్ ఫ్రాంక్లిన్
C) 1772 ఫారడే
D) 1782 జాన్ డాల్టన్
జవాబు:
B) 1752 బెంజిమన్ ఫ్రాంక్లిన్

2. భూమిలోని పలకల కదలికల వలన లేదా ఢీకొనుట వలన …………. ఏర్పడును.
A) భూకంపాలు
B) అగ్నిపర్వతాల ప్రేలుడు
C) పిడుగుపాటు
D) ఉరుములు
జవాబు:
A) భూకంపాలు

3. భారతదేశంలో అతిపెద్ద భూకంపం ఇక్కడ సంభవించింది.
A) గుజరాత్ లోని భుజ్ జిల్లాలో
B) ఆంధ్రప్రదేశ్ లోని ఆదిలాబాద్ జిల్లాలో
C) ఉత్తర కాశ్మీర్ లోని ఉరితంగదర్ పట్టణాలలో
D) మధ్యప్రదేశ్ లోని ఉత్తర ప్రాంతంలో
జవాబు:
C) ఉత్తర కాశ్మీర్ లోని ఉరితంగదర్ పట్టణాలలో

AP 8th Class Physical Science Important Questions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు

4. ఆవేశం కలిగి ఉన్న వస్తువు నుండి భూమికి ఆవేశాలను బదిలీ చేసే ప్రక్రియను ……. అంటారు.
A) ఎర్తింగ్
B) మెరుపులు
C) ఉరుములు
D) ఏదీకాదు
జవాబు:
A) ఎర్తింగ్

5. భూకంప తీవ్రతను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం
A) భూకంప స్కేలు
B) రిక్టరు స్కేలు
C) ఐరన్ స్కేలు
D) టేపు
జవాబు:
B) రిక్టరు స్కేలు

6. భూకంప తీవ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం ………….
A) భూకంపలేఖిని
B) రిక్టర్ స్కేలు
C) ఎర్తింగ్
D) పైవన్నీ
జవాబు:
A) భూకంపలేఖిని

7. ఈ కింది వానిలో సహజ దృగ్విషయం కానిది
A) భూకంపం
B) తుపాన్
C) ఉరుములు, మెరుపులు
D) ఎర్తింగ్
జవాబు:
D) ఎర్తింగ్

8. వస్తువులను ఒకదానితో మరొకటి రుద్దడం వలన ఏర్పడే ఆవేశాల సంఖ్య
A) 2
B) 1
C) 3
D) 4
జవాబు:
A) 2

9. సునామి అంటే అర్థం
A) భూకంపం
B) తుపాను
C) సముద్రం అడుగున భూకంపం
D) సముద్రం అడుగున అగ్నిపర్వతం పేలుట
జవాబు:
D) సముద్రం అడుగున అగ్నిపర్వతం పేలుట

10. భూమి నుండి ఉత్పత్తి అయ్యే తరంగాలను ……….. అంటారు.
A) భూకంప తరంగాలు
B) మైక్రో తరంగాలు
C) రేడియో తరంగాలు
D) X-తరంగాలు
జవాబు:
A) భూకంప తరంగాలు

11. ఆవేశపూరిత వస్తువు పరీక్షించడానికి ఉపయోగపడే ధర్మం
A) ఆకర్షణ
B) వికర్షణ
C) ఆకర్షణ మరియు వికర్షణ
D) ఏదీకాదు
జవాబు:
B) వికర్షణ

12. రెండు వస్తువులు ఒకదానితో మరొకటి రుద్దినపుడు ఆ వస్తువులపై ఏర్పడే ఆవేశాలు
A) సమానంగా ఉండే ఒకే రకమైన ఆవేశాలు
B) సమానంగా ఉండే వేరు వేరు ఆవేశాలు
C) అసమానంగా ఉండే ఒకే రకమైన ఆవేశాలు
D) అసమానంగా ఉండే వేరు వేరు ఆవేశాలు
జవాబు:
B) సమానంగా ఉండే వేరు వేరు ఆవేశాలు

13. రిక్టరు స్కేలు విలువ ……. గా ఉన్నప్పుడు భూకంప లేఖిని నమోదు చేస్తుంది కాని మనం గుర్తించలేము
A) 3.5 నుండి 5.4
B) 5. 5 నుండి 6.00
C) 3. 5 కన్నా తక్కువ
D) 8 కన్నా ఎక్కువ
జవాబు:
C) 3. 5 కన్నా తక్కువ

AP 8th Class Physical Science Important Questions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు

14. …………… వరకు రిక్టరు స్కేలు విలువ ఉంటే ఆస్తి మరియు ప్రాణనష్టం అధికంగా ఉంటుంది. దీనిని పెద్ద భూకంపాలు అంటారు.
A) 5. 5 నుండి 6.0
B) 6.1 నుండి 6.9
C) 7.0 నుండి 7.9
D) 3.5 నుండి 5.4
జవాబు:
C) 7.0 నుండి 7.9

15. ఒక వస్తువు ఆవేశపరచే పద్ధతులు ………
A) రాపిడి (రుద్దడం) వలన
B) ప్రేరణ వలన
C) వాహకం ద్వారా
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

16. ఉరుములు, మెరుపులు వచ్చే సందర్భంలో సురక్షితమైన ప్రదేశం
A) తక్కువ ఎత్తుగల ఇల్లు
B) ఎత్తైన భవనం
C) పొడవైన చెట్టు
D) టాప్ లేని కారులో ప్రయాణించడం
జవాబు:
A) తక్కువ ఎత్తుగల ఇల్లు

17. ఉరుములు, మెరుపులు వచ్చే సందర్భంలో సురక్షితం కాని ప్రదేశం
A) తక్కువ ఎత్తుగల ఇల్లు
B) పొట్టి చెట్టు
C) ఎలక్ట్రికల్, టెలిఫోన్ స్తంభాల దగ్గర నిలబడటం
D) ఏదీకాదు
జవాబు:
C) ఎలక్ట్రికల్, టెలిఫోన్ స్తంభాల దగ్గర నిలబడటం

18. భూకంపం వచ్చినపుడు భూమి కంపించిన సమయాన్ని గుర్తించేది
A) భూకంపలేఖిని
B) భూకంప దర్శిని
C) భ్రామపరిమాణ స్కేలు
D) రిక్టర్ స్కేలు
జవాబు:
B) భూకంప దర్శిని

19. భూకంపాలను ……….. ద్వారా కచ్చితంగా నిర్ధారించవచ్చును.
A) రిక్టర్ స్కేలు
B) భ్రామక పరిమాణ స్కేలు
C) మీటరు స్కేలు
D) పైవన్నీ
జవాబు:
B) భ్రామక పరిమాణ స్కేలు

20. ఇంటి లోపల ఉన్నప్పుడు భూకంపం వచ్చిన సందర్భంలో రక్షించుకోవడం కోసం
A) పొడవైన వస్తువులను గట్టిగా పట్టుకోవడం
B) మంచంపై పడుకోవడం
C) బల్ల కిందకు వెళ్ళడం
D) పైవన్నీ
జవాబు:
C) బల్ల కిందకు వెళ్ళడం

21. సీమగుగ్గిలంను ఉన్నితో రుద్దిన తర్వాత అది వెంట్రుకలను ఆకర్షించునని గుర్తించిన వారు
A) సిక్కులు
B) యూరోపియన్లు
C) అమెరికన్లు
D) గ్రీకులు
జవాబు:
D) గ్రీకులు

AP 8th Class Physical Science Important Questions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు

22. విద్యుత్ ఆవేశాల లక్షణాల విషయంలో
A) ప్లాస్టిక్ స్కేలును తలపై రుద్దితే అది చిన్న చిన్న కాగితం ముక్కలను ఆకర్షించడం
B) పొడిజుట్టుతో ప్లాస్టిక్ స్కేలును రుద్దిన అది చిన్న చిన్న కాగితం ముక్కలను ఆకర్షించకుండుట
C) గాలితో నిండిన బెలూనను బట్టతో రుద్దిన అది కాగితం ముక్కలను ఆకర్షించుట
D) స్ట్రాను నునుపైన గోడకు గాని, బట్టలకు గాని అది కాగితం ముక్కలను ఆకర్షించుట
జవాబు:
B) పొడిజుట్టుతో ప్లాస్టిక్ స్కేలును రుద్దిన అది చిన్న చిన్న కాగితం ముక్కలను ఆకర్షించకుండుట

23. ఉన్ని గుడ్డతో రుద్దిన బెలూన్, ఉన్నిగుడ్డతో రుద్దిన మరో బెలూనన్ను …….
A) ఆకర్షించును
B) వికర్షించును
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
B) వికర్షించును

24. పాలిథిన్ కాగితంతో రుద్దిన రీఫిల్ అదే కాగితంతో రుద్దిన మరో రీఫిల్ ను ………..
A) ఆకర్షించును
B) వికర్షించును
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
B) వికర్షించును

25. ఉన్నిగుడ్డతో రుద్దిన బెలూన్, పాలిథిన్ కాగితంతో రుద్దిన రీఫిల్ ను ……….
A) ఆకర్షించును
B) వికర్షించును
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
A) ఆకర్షించును

26. విజాతి అయస్కాంతాల ధృవాలు
A) ఆకర్షించును
B) వికర్షించును
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
A) ఆకర్షించును

27. సజాతి అయస్కాంతాల ధృవాలు
A) ఆకర్షించును
B) వికర్షించును
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
B) వికర్షించును

28. ఒకే రకమైన రెండు ఆవేశాలు
A) ఆకర్షించును
B) వికర్షించును
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
B) వికర్షించును

29. విభిన్నాలైన రెండు ఆవేశాలు
A) ఆకర్షించును
B) వికర్షించును
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
A) ఆకర్షించును

30. వలయంలో విద్యుత్ ప్రవాహం …… కదలికను తెలుపును.
A) ఆవేశాల
B) ప్రోటానుల
C) న్యూట్రానుల
D) ఏదీకాదు
జవాబు:
A) ఆవేశాల

31. దీనినుపయోగించి వస్తువు ఆవేశాన్ని కల్గి ఉన్నది లేనిది తెలుసుకోవచ్చును
A) దిక్సూచి
B) థర్మోకోల్ బంతి
C) విద్యుదర్శిని
D) ఏదీకాదు
జవాబు:
C) విద్యుదర్శిని

32. వస్తువుపై గల ఆవేశాలు భూమికి బదిలీ అయ్యే పద్ధతిని ………. చేయటం అంటాము.
A) మెరుపు
B) ఉరుము
C) ఎర్తింగ్
D) ఆవేశము
జవాబు:
C) ఎర్తింగ్

AP 8th Class Physical Science Important Questions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు

33. గాలిలో మేఘాలు ప్రయాణించేటప్పుడు, గాలిలోని కణాలతో ఈ క్రింది ప్రక్రియ వలన ఆవేశపూరితం అవుతాయి.
A) బలం
B) శక్తి రుద్దిన
C) ఘర్షణ
D) స్థానభ్రంశం
జవాబు:
C) ఘర్షణ

34. ఒక ఆవేశపూరిత మేఘానికి దగ్గరగా మరొక మేఘం వచ్చినప్పుడు అది రెండవ మేఘంపై ……. ఆవేశాన్ని ప్రేరేపింపజేయును.
A) సమాన
B) వ్యతిరేక
C) తుల్య
D) ఏదీకాదు
జవాబు:
B) వ్యతిరేక

35. రెండు మేఘాల మధ్య గాలి …….. వాహకంగా పని చేయును.
A) అథమ విద్యుత్
B) ఉత్తమ విద్యుత్
C) మధ్యమ విద్యుత్
D) ఋణ విద్యుత్
జవాబు:
A) అథమ విద్యుత్

36. మెరుపులు ఏర్పడు ప్రక్రియను………….. అంటారు.
A) విద్యుత్ ఉత్సర్గం
B) విద్యుత్ ప్రవాహం
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
A) విద్యుత్ ఉత్సర్గం

37. కింది వాటిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వచ్చు సందర్భంలో సురక్షితం కాని ప్రదేశం
A) టాప్ లేని వాహనాల్లో ప్రయాణించటం
B) ల్యాండ్ లైన్ ఫోన్లలో మాట్లాడడం
C) టి.వి., కంప్యూటర్ వంటి పరికరాలు వాడటం
D) పైవన్నియూ
జవాబు:
D) పైవన్నియూ

38. తటిద్వాహకాలను వీటి రక్షణ కొరకై భవనాల్లో అమర్చుతారు
A) పిడుగుల నుండి
B) భూకంపాల నుండి
C) తుపానుల నుండి
D) ఆవేశాల నుండి
జవాబు:
A) పిడుగుల నుండి

39. క్రింది వాటిలో సహజ దృగ్విషయాల విషయంలో విభిన్నమైనది
A) మెరుపులు, ఉరుములు
B) వరదలు, తుపానులు
C) భూకంపాలు
D) ఋతుపవనాలు
జవాబు:
D) ఋతుపవనాలు

40. భూ పొరలలో అన్నింటికన్నా పెద్దది
A) భూపటలం
B) భూప్రావారం
C) అంతర కోర్
D) బాహ్య కోర్
జవాబు:
A) భూపటలం

41. భుజ్, కాశ్మీర్‌లో వచ్చిన భూకంప తీవ్రత విలువ
A) < 6.5
B) < 7.5
C) > 7.5
D) > 6.5
జవాబు:
C) > 7.5

42. సెస్మిక్ తరంగాలను దీని ద్వారా గుర్తిస్తారు
A) థర్మామీటరు
B) భూకంపలేఖిని
C) విద్యుద్దర్శిని
D) ఉత్సర్గ నాళం
జవాబు:
B) భూకంపలేఖిని

AP 8th Class Physical Science Important Questions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు

43. ‘భూకంప తీవ్రతను కచ్చితంగా కొలుచు పరికరం
A) భూకంపలేఖిని
B) భ్రామక పరిమాణ స్కేలు
C) విద్యుద్దర్శిని
D) థర్మామీటరు
జవాబు:
B) భ్రామక పరిమాణ స్కేలు

44. భూకంప ప్రమాద పటం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని 3వ జోన్ కి చెందు ప్రాంతము
A) కృష్ణా, గోదావరి మైదానం
B) కడప, చిత్తూరు
C) నెల్లూరు
D) అన్నియూ
జవాబు:
D) అన్నియూ

45. ఈ క్రింది వానిలో భూకంపాలు రాని ఖండం
A) అమెరికా
B) ఆసియా
C) ఆస్ట్రేలియా
D) ఏదీలేదు
జవాబు:
C) ఆస్ట్రేలియా

46. రిక్టర్ స్కేల్ ను కనుగొన్నవారు
A) ఛార్లెస్ లూయీస్
B) జేమ్స్ ఛార్లెస్
C) ఛార్లెస్ రిక్టర్
D) ఛార్లెస్ రెపో
జవాబు:
C) ఛార్లెస్ రిక్టర్

47. ఈ క్రింది భూకంప జోన్లో తీవ్ర ప్రమాదకరమైనది
A) 1వ జోన్
B) 3వ జోన్
C) 7వ జోన్
D) 5వ జోన్
జవాబు:
D) 5వ జోన్

48. సునామీల యొక్క వేగం సముద్ర అంతర్భాగంలో ………….. వద్ద ఏర్పడును.
A) 700
B) 600
C) 800
D) 900
జవాబు:
C) 800

49. సముద్రంలో ఏర్పడు భూకంపంకు గల పేరు
A) సునామీ
B) తుపాను
C) వాయుగుండం
D) భూకంపం
జవాబు:
A) సునామీ

AP 8th Class Physical Science Important Questions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు

50. ర్యాపిడ్ అనే సెట్ డిజాస్టర్‌కు ఉదాహరణ
A) సునామీ
B) తుపాను
C) వాయుగుండం
D) భూకంపం
జవాబు:
D) భూకంపం

51. మన దేశంలో భూకంప తీవ్రత జోన్-8 లోనికి చెందు ప్రాంతము
A) ఉత్తరప్రదేశ్
B) హిమాలయాల చుట్టూ ప్రాంతం
C) గుజరాత్
D) కాశ్మీర్
జవాబు:
B) హిమాలయాల చుట్టూ ప్రాంతం

52. భారతదేశ రాష్ట్రాల్లో తుపానులకు అధికంగా గురయ్యే రాష్ట్రం
A) ఒడిశా
B) అస్సోం
C) గుజరాత్
D) ఆంధ్రప్రదేశ్
జవాబు:
A) ఒడిశా

53. పశ్చిమ తీరంలో తుపాన్లకు గురయ్యే రాష్ట్రం
A) ఒడిశా
B) అస్సోం
C) గుజరాత్
D) ఆంధ్రప్రదేశ్
జవాబు:
C) గుజరాత్

54. బెలూన్ ప్లాస్టిక్ కాగితంతో రుద్ది, చిన్న కాగితం ముక్కల వద్దకు తెచ్చినప్పుడు ఏమి పరిశీలిస్తావు?
A) బెలూన్ కాగితం ముక్కలను ఆకర్షిస్తుంది.
B) బెలూన్ కాగితం ముక్కలను ఆకర్షించదు.
C) బెలూన్ పగిలిపోతుంది.
D) బెలూన్ పరిమాణంలో మార్పు వస్తుంది.
జవాబు:
A) బెలూన్ కాగితం ముక్కలను ఆకర్షిస్తుంది.

55. ప్లాస్టిక్ స్కేలును ప్లాస్టిక్ కాగితంతో రుద్ది చిన్న కాగితం ముక్కల వద్దకు తీసుకొని వస్తే అవి ఆకర్షించబడతాయి.
A) స్థావర విద్యుత్ బలం
B) అయస్కాంత బలం
C) గురుత్వాకర్షణ బలం
D) జ్వలన ఉష్ణోగ్రత
జవాబు:
A) స్థావర విద్యుత్ బలం

56. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం సంభవించునపుడు సురక్షిత ప్రదేశం
1) బహిరంగ ప్రదేశాలలో ప్రయాణించడం.
2) పొడవాటి వృక్షాల కింద నిలబడడం.
3) విద్యుత్ స్థంబాల వద్ద నిలబడడం.
4) కిటికీలు మూసిన కారులో కూర్చోవడం.
A) 1 మాత్రమే
B) 1 & 4
C) 2 & 3
D) 1 మాత్రమే
జవాబు:
A) 1 మాత్రమే

57. రేవతి ఒక రబ్బరు బెలూన్ ను ఉన్ని గుడ్డతోను, రీఫిలను పాలిథీన్ తోను రుద్దినది. తర్వాత బెలూనను రీఫిల్ వద్దకు తెచ్చినపుడు సరైన పరిశీలన
A) రీఫిల్ వికర్షించును
B) రీఫిల్ ఆకర్షించును
C) బెలూన్ మరియు రీఫిల మధ్య బలం పనిచేయదు.
D) చెప్పలేము.
జవాబు:
B) రీఫిల్ ఆకర్షించును

58. రెండు విద్యుదావేశం చెందిన వస్తువులను దగ్గరగా తెచ్చినపుడు అవి
A) ఆకర్షించుకోవచ్చు
B) వికర్షించుకోవచ్చు
C) ఆకర్షించుకోవచ్చు లేదా వికర్షించుకోవచ్చు
D) ఏ విధమైన ప్రభావం ఉండదు.
జవాబు:
C) ఆకర్షించుకోవచ్చు లేదా వికర్షించుకోవచ్చు

59. భూమి యొక్క బాహ్య పొరను కింది విధంగా చెప్తారు
A) భూపటలం (మాంటిల్)
B) బాహ్య కేంద్రం
C) భూప్రావరం (క్రస్ట్)
D) అంతర కేంద్రం
జవాబు:
A) భూపటలం (మాంటిల్)

60. భూకంపానికి కారణమైన భూమి యొక్క ఫలకము
A) భూపటలం
B) భూప్రావరం
C) భూఅంతర కేంద్రం
D) భూ బాహ్య కేంద్రం
జవాబు:
B) భూప్రావరం

AP 8th Class Physical Science Important Questions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు

61. కింది వానిలో ఏది సునామీకి కారణం కాదు?
A) సముద్రం అడుగున అతి పెద్ద కేంద్రక విస్పోటనం
B) భూకంపం
C) అగ్నిపర్వతం విస్పోటనం.
D) పిడుగు
జవాబు:
D) పిడుగు

62. రాజేష్ ఒక బెలూనను ఊది దాని చివర ముడివేశాడు. ఒక కాగితాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి గచ్చు పై వేసాడు. తర్వాత బెలూనను ఒక చేతితో బాగా రుద్ది కాగితం ముక్కల వద్దకు తెచ్చాడు. అపుడు కాగితం ముక్కలను బెలూన్ ఆకర్షించింది. ఆ కృత్యం చేయడం వలన రాజేష్ క్రింది విషయాన్ని తెలుసుకున్నాడు.
i)స్పర్శాబలం పనిచేయాలంటే వస్తువులు ఒకదాని కొకటి తాకనవసరం లేదు.
ii) బెలూనను కాగితంతో రుద్దినపుడు దాని ఉపరితలం విద్యుదావేశం పోతుంది.
iii) క్షేత్రబలం పనిచేయాలంటే వస్తువులు ఒకదాని కొకటి తాకనవసరం లేదు.
A) ii మాత్రమే సరైనది
B) i మరియు ii మాత్రమే సరైనవి
C) ii మరియు iii మాత్రమే సరైనవి
D) i మాత్రమే సరైనది
జవాబు:
C) ii మరియు iii మాత్రమే సరైనవి

II. జతపరచుము.

Group – A Group – B
1 భూకంపం A) భూకంపం సంభవించిన సమయాన్ని గుర్తించేది
2. సునామి B) భూకంప తీవ్రతను నిర్ధారిస్తుంది
3. రిక్టర్ స్కేలు C) భూకంప తరంగాలను లెక్కగట్టేది.
4. భూకంప లేఖిని D) భూమి కంపించడాన్ని
5. భూకంపదర్శిని E) సముద్రాల అడుగున భూకంపం రావడాన్ని

జవాబు:

Group – A Group – B
1 భూకంపం D) భూమి కంపించడాన్ని
2. సునామి E) సముద్రాల అడుగున భూకంపం రావడాన్ని
3. రిక్టర్ స్కేలు B) భూకంప తీవ్రతను నిర్ధారిస్తుంది
4. భూకంప లేఖిని C) భూకంప తరంగాలను లెక్కగట్టేది.
5. భూకంపదర్శిని A) భూకంపం సంభవించిన సమయాన్ని గుర్తించేది

AP 8th Class Physical Science Important Questions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు

2)

Group – A Group – B
1. సజాతి, ఆవేశాలు A) ఒక వస్తువుపై ఆవేశం ఉన్నదో లేదో తెలుసుకొనుటకు
2. విజాతి ఆవేశాలు B) వస్తువుపై గల ఆవేశాలను భూమికి చేర్చుట
3. ఎర్తింగ్ C) ఉరుములు, పిడుగుల నుండి భవనాలను రక్షించడం
4. విద్యుదర్శిని D) ఆకర్పించుకొంటాయి
5. తటిద్వాహకం E) వికర్షించుకొంటాయి.

జవాబు:

Group – A Group – B
1. సజాతి, ఆవేశాలు D) ఆకర్పించుకొంటాయి
2. విజాతి ఆవేశాలు E) వికర్షించుకొంటాయి.
3. ఎర్తింగ్ B) వస్తువుపై గల ఆవేశాలను భూమికి చేర్చుట
4. విద్యుదర్శిని A) ఒక వస్తువుపై ఆవేశం ఉన్నదో లేదో తెలుసుకొనుటకు
5. తటిద్వాహకం C) ఉరుములు, పిడుగుల నుండి భవనాలను రక్షించడం

Leave a Comment