These AP 7th Class Telugu Important Questions 10th Lesson ప్రకటన will help students prepare well for the exams.
AP State Syllabus 7th Class Telugu 10th Lesson Important Questions and Answers ప్రకటన
7th Class Telugu 10th Lesson ప్రకటన Important Questions and Answers
I. అవగాహన – ప్రతిస్పందన
కింది పరిచిత గేయాన్ని చదివి, ఇవ్వబడిన ప్రశ్నలకు – జవాబులు రాయండి.
1. “ప్రజలు తండోపతండాలుగా విరగబడుతున్నారు
కంగారుతో భయంతో గుసగుసలాడుతున్నారు
కావ్యచర్చలు కళాలయాలు ఆకర్షించటం లేదు
స్వార్థజీవనులు గభాలున రొమ్ములు బాదుకుంటున్నారు
సిద్ధాంతాలు చర్చలు ఎవరూ చేయడం లేదు
సిరా యింకకుండానే ఎగ్రిమెంట్లు చింపేస్తున్నారు”
ప్రశ్నలు – జవాబులు :
అ) ఎవరు ఎలా విరగబడుతున్నారు?
జవాబు:
ప్రజలు తండోపతండాలుగా విరగబడుతున్నారు.
ఆ) ఎందుకు గుసగుసలాడుతున్నారు?
జవాబు:
కంగారుతో, భయంతో గుసగుసలాడుతున్నారు.
ఇ) ప్రజల్ని ఆకర్షించనివేవి?
జవాబు:
కావ్యచర్చలు, కళాలయాలు ప్రజల్ని ఆకర్షించడం లేదు.
ఈ) ఎవరు రొమ్ములు బాదుకుంటున్నారు?
జవాబు:
స్వార్థ జీవనులు గభాలున రొమ్ములు బాదు కుంటున్నారు.
2. “అపార కృపాతరంగితాలైన నయనాంచలాలు
ఆనందం జాలువారే స్నిగ్ధ దరహాస పరిమళాలు
సంస్కారపు కేశపాశంలో తురిమిన అనురాగపు గులాబి
సదా ప్రజాహితైషిణి సుభాషిణి గర్వంలేని రాణి
కల్లనీ క్రౌర్యాన్ని కాలుష్యాన్ని తిరస్కరిస్తుంది
తెల్లని పావురాల్ని సరదాగా ఎగరేస్తుంది.
చల్లని తల్లి చక్కని చెల్లి ఆమె పేరు శాంతి”
ప్రశ్నలు – జవాబులు :
అ)’ ‘దయతో కూడిన కనుగొలకులు’ అని భావం వచ్చే గేయపంక్తి ఏది?
జవాబు:
‘అపార కృపాతరంగితాలైన నయనాంచలాలు’ – అనే గేయపంక్తి పై భావాన్ని ఇస్తుంది.
ఆ) శాంతి రాణి సద్గుణాలు పేర్కొనండి.
జవాబు:
శాంతిరాణి ఎప్పుడూ ప్రజల మేలును కోరుతుంది. చక్కగా మాట్లాడుతుంది. ఆమె గర్వం లేని రాణి.
ఇ) శాంతి రాణి వేటిని ఎగరేస్తుంది?
జవాబు:
శాంతి రాణి, తెల్లని పావురాల్ని సరదాగా ఎగరేస్తుంది. ..
ఈ) శాంతి కేశపాశంలో ఏమి అలంకరించుకొంది?
జవాబు:
శాంతి తన కొప్పులో, ప్రేమ గులాబిని అలంక రించుకొంది.
ఈ క్రింది అపరిచిత పద్యాలను చదివి, ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. గిరులందు మేరు వౌదువు
సురలందున నింద్రుఁ డౌదువు చుక్కలలోనన్
బరమాత్మ చంద్రుఁ డౌదువు
నరులందున నృపతి వోదు నయమున కృష్ణా.
ప్రశ్నలు :
అ) గిరులలో శ్రీ కృష్ణుడే మౌతాడు?
జవాబు:
గిరులలో శ్రీకృష్ణుడు మేరువు.
ఆ) సురలలో ఇంద్రుడెవరు?
జవాబు:
సురలలో ఇంద్రుడు శ్రీకృష్ణుడు
ఇ) చుక్కలలో చంద్రుడెవరు?
జవాబు:
శ్రీకృష్ణుడు చుక్కలలో చంద్రుడు.
ఈ) నరులలో రాజు ఎవరు?
జవాబు:
నరులలో రాజు శ్రీకృష్ణుడు.
2. ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండుఁ
జూడఁ జూడ రుచుల జాడవేరు
పురుషులందుఁ బుణ్య పురుషులు వేరయా
విశ్వదాభిరామ ! వినుర వేమ !
ప్రశ్నలు :
అ) ఉప్పు – కర్పూరం ఎలా ఉంటాయి?
జవాబు:
ఉప్పు – కర్పూరం పైకి చూడటానికి తెల్లగా ఒకే విధంగా ఉంటాయి.
ఆ) ఉప్పు – కర్పూరం రుచి ఎలా ఉంటాయి?
జవాబు:
ఉప్పు – కర్పూరం చప్పరించి చూస్తే రుచులు వేరుగా ఉంటాయి.
ఇ) మానవులు ఎలా ఉంటారు?
జవాబు:
మానవులందరూ ఒకేలా ఉంటారు.
ఈ) మానవులు ఎలాంటివారో ఎలా తెలుస్తుంది?
జవాబు:
మానవుల గుణాల్ని బట్టి మంచివారెవరో, చెడ్డ వారెవరో తెలిసిపోతుంది.
3. తన కోపమే తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌఁ
తన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు, తథ్యము సుమతీ!
ప్రశ్నలు:
అ) మనకు ఏమిటి శత్రువు?
జవాబు:
మన కోపమే మనకు శత్రువు.
ఆ) శాంతము ఎటువంటిది?
జవాబు:
శాంతము రక్షించేది.
ఇ) స్వర్గము ఎలా ఉంటుంది?
జవాబు:
సంతోషంగా ఉంటే స్వర్గంలా ఉంటుంది.
ఈ) దుఃఖం ఎటువంటిది?
జవాబు:
దుఃఖము నరకము వంటిది.
4. కంటికి తెప్ప విధంబున
బంటుగ దాయనుచు నన్నుఁ బాయక నెపుడున్
జంటను నీవుండుటచే
కంటకనుగు పాపములను గడిచితి కృష్ణా.
ప్రశ్నలు:
అ) మనం ఎవరికి బంటులము?
జవాబు:
మనం కృష్ణునికి బంటులము.
ఆ) కృష్ణుడు మనల్ని ఎలా కాపాడుతాడు?
జవాబు:
కృష్ణుడు మనల్ని కంటి టెప్పలా కాపాడుతాడు.
ఇ) మనం ఎటువంటి పాపాలను దాటుతాం?
జవాబు:
మనం ముండ్ల వంటి పాపాలను దాటుతాం.
ఈ) మనకు ఎవరి అండ గొప్పది?
జవాబు:
మనకు శ్రీకృష్ణుని అండ గొప్పది.
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత
ప్రశ్న 1.
పాఠం చిత్రం చూడండి. దీని ఆధారంగా పాఠంలోని విషయాన్ని ఊహించండి.
జవాబు:
పాఠంలో రెండు చిత్రాలున్నాయి. మొదటి చిత్రంలో సైనికులు యుద్ధం చేస్తున్నారు. ప్రజలు నేలమీదికి ఒరిగిపోతున్నారు. ఫిరంగులు పేలుస్తున్నారు. తుపాకులతో కాలుస్తున్నారు. యుద్ధ భీభత్సానికి భయపడి శాంతి దేవత రెక్కలు కట్టుకొని దూరంగా పారిపోతూ ఉంది. పాఠంలో విషయం : కవి యుద్ధాలు మంచివి కావని, శాంతి కావాలని ఈ పాఠంలో చెప్తూ ఉంటాడు.
ప్రశ్న2.
‘చల్లని తల్లి చక్కని తల్లి’ అని శాంతిని ఉద్దేశిస్తూ “ప్రకటన’ కవితను రచించిన కవిని గురించి రాయండి.
జవాబు:
దేవరకొండ బాలగంగాధర తిలక్ ప్రకటన కవితను రాశాడు. ఈ కవిత ఆయన రచించిన ‘అమృతం కురిసిన రాత్రి’ అనే కవితా సంకలనంలోది. తిలక్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా మండపాక గ్రామంలో 1921లో జన్మించాడు. ఈయన. అమృతం కురిసిన రాత్రి, గోరువంకలు, తిలక్ కథలు రచించాడు. 1971లో ఈయన అమృతం కురిసిన రాత్రి అనే కవిత సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది.
7th Class Telugu 10th Lesson ప్రకటన 1 Mark Bits
III. భాషాంశాలు
పదాలు – అర్ధాలు :
సూచన : ఈ కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థం గుర్తించండి.
1. సాగరంలో అలలు ఎగసి పడుతున్నాయి.
ఎ) కాలువ
బి) నది
సి) సముద్రం
డి) చెరువు
జవాబు:
సి) సముద్రం
2. శాంతికి గుర్తుగా కపోతాలను ఎగరవేద్దాం.
ఎ) చిలుక
బి) ఎలుక
సి) పావురం
డి) గ్రద్ధ
జవాబు:
సి) పావురం
3. ఆనందం జాలువారే దరహాస పరిమళాలు ఇవే.
ఎ) కాంతులు
బి) సువాసనలు
సి) మధురిమలు
డి) కెరటాలు
జవాబు:
బి) సువాసనలు
4. అడుగు జాడల్ని కూపీ తియ్యండి.
ఎ) గుర్తు
బి) ఆరా
సి) పరిశీలన
డి) అడ్డు
జవాబు:
బి) ఆరా
5. పారావారంలో రత్నాలు ఉంటాయి.
ఎ) సముద్రం
బి) కూపం
సి) చెరువు
డి) నీరు
జవాబు:
ఎ) సముద్రం
6. సముద్రంలో తరంగాలు ఉంటాయి.
ఎ) నీరు
బి) అలలు
సి) రత్నాలు
డి) తీరాలు
జవాబు:
బి) అలలు
7. పిల్లల దరహాసం చూడ ముచ్చటగా ఉంది.
ఎ) అందం
బి) దుఃఖం
సి) ఆకారం
డి) చిరునవ్వు
జవాబు:
డి) చిరునవ్వు
8. కల్ల పలుకరాదు.
ఎ) అబద్ధం
బి) అనాగరికం
సి) అన్యాయం
డి) అసంబద్ధం
జవాబు:
ఎ) అబద్ధం
పర్యాయపదాలు :
9. దేవాలయంలో దేవుడి విగ్రహాలుంటాయి. కోవెలలో నేడు పూజలు చేస్తారు.
పై వాక్యాలలో సమానార్థక పదాలను గుర్తించండి.
ఎ) దేవాలయం, దేవుడు
బి) కోవెల, పూజలు
సి) విగ్రహాలు, కోవెల
డి) దేవాలయం, కోవెల
జవాబు:
డి) దేవాలయం, కోవెల
10. సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) కన్ను, చెవి
బి) నేత్రము, కన్ను
సి) నయనము, నాసిక
డి) కన్ను, ముక్కు
జవాబు:
బి) నేత్రము, కన్ను
11. గూఢచారులు రహస్యంగా కూపీ లాగుతారు-వాళ్ళు ఆరా తీయడంలో నేర్పరులు. పై వాక్యాల్లో సమానార్థకాలు గుర్తించండి.
ఎ) గూఢచారులు, కూపీ
బి) ఆరా, నేర్పరులు
సి) కూపీ, ఆరా
డి) రహస్యం, కూపీ
జవాబు:
సి) కూపీ, ఆరా
12. పూల పరిమళం అద్భుతం. గీత గీసిన పదానికి పర్యాయ పదాలను గుర్తించండి
ఎ) పసందు, పనస
బి) సుగంధం, సువాసన
సి) సుగంధం, సున్నితం
డి) లావు, తావి
జవాబు:
బి) సుగంధం, సువాసన
13. భక్తులపై కృప చూపాలి. గీత గీసిన పదానికి పర్యాయ పదాలను గుర్తించండి.
ఎ) దయ, కరుణ
బి) హితం, హితం
సి) దయ, నిర్దయ
డి) అహితం, కరుణ
జవాబు:
ఎ) దయ, కరుణ
14. దేవాలయంలో ఉన్నాను. గీత గీసిన పదానికి పర్యాయ పదాలను గుర్తించండి.
ఎ) గుడి, గుడిసె
బి) మందిరం, మాయ
సి) కోవెల, గుడి
డి) కోవెల, కోనేరు
జవాబు:
సి) కోవెల, గుడి
15. సముద్రం అందమైనది. గీత గీసిన పదానికి పర్యాయ పదాలను గుర్తించండి.
ఎ) అంబుధి, అంతరం
బి) నిధి, నిరవధి
సి) అమృతం, అంతరిక్షం
డి) సాగరం, జలధి
జవాబు:
డి) సాగరం, జలధి
16. జలం మానవులకు ప్రాణాధారం. గీత గీసిన పదానికి పర్యాయ పదాలను గుర్తించండి.
ఎ) ఉదకం, కాసారం
బి) క్షీరం, సుధ
సి) నీరు, వారి
డి) గరశం, గంగ
జవాబు:
సి) నీరు, వారి
ప్రకృతి – వికృతులు :
17. నదిలోని నీరంలో చెట్లు ఉన్నాయి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) నీరు
బి) జలధి
సి) వారి
డి) జలం
జవాబు:
ఎ) నీరు
18. నేను రోజూ దేవాలయం దగ్గరకు వెడతాను – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
ఎ) కోవెల
బి) దేవళం
సి) గుడి
డి) ఆలయం
జవాబు:
బి) దేవళం
19. నేను నిత్యము తోటకు వెడతా – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
ఎ) నిత్తెం
బి) నిత్తము
సి) నిచ్చలు
డి) నేడు
జవాబు:
సి) నిచ్చలు
20. నా మిత్రుడు సంద్రంలోకి దూకుతానన్నాడు – గీత గీసిన పదానికి ప్రకృతిని గుర్తించండి.
ఎ) సంద్రము
బి) పారావారము
సి) సముద్రం
డి) ఉదధి
జవాబు:
సి) సముద్రం
21. సముద్ర తీరములో వెదకండి – గీత గీసిన పదం వికృతిని గుర్తించండి.
ఎ) దరి
బి) తీరం
సి) గట్టు
డి) తీర్థం
జవాబు:
ఎ) దరి
22. మానవులు కార్యం చేపట్టాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) కరిజము
బి) కరియం
సి) కర్ణం
డి) కరము
జవాబు:
సి) కర్ణం
23. పక్షి ఎగిరింది – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) పచ్చ
బి) పక్కి
సి) గచ్చ
డి) పచ్చి
జవాబు:
బి) పక్కి
24. ఆహారం స్వీకరించాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) ఆయారం
బి) ఆరామం
సి) ఓగిరం
డి) ఆకారం
జవాబు:
సి) ఓగిరం
వ్యతిరేక పదాలు :
సూచన : ఈ కింది వాక్యాల్లో గీత గీసిన పదానికి వ్యతిరేకపదాన్ని గుర్తించండి.
25. ప్రజలు నీతి మార్గంలో నడవాలి.
ఎ) అవినీతి
బి) పరనీతి
సి) సునీతి
డి) అనునీతి
జవాబు:
ఎ) అవినీతి
26. ప్రజలు కష్టం పొందరాదు.
ఎ) సుకష్టం
బి) అనంతం
సి) వికష్టం
డి) సుఖం
జవాబు:
డి) సుఖం
27. అందరు శాంతి పొందాలి.
ఎ) ప్రశాంతి
బి) విశాంతి
సి) అశాంతి
డి) అనుశాంతి
జవాబు:
సి) అశాంతి
28. పెద్దలు గర్విగా ఉండరు.
ఎ) సుగర్వి
బి) నిగర్వి
సి) పరగర్వి
డి) అనుగర్వి
జవాబు:
బి) నిగర్వి
29. నేను ఏ విషయమైనా జాగ్రత్తగా పరిశీలిస్తాను.
ఎ) అజాగ్రత్తగా
బి) శ్రద్ధగా
సి) రహస్యంగా
డి) అశ్రద్ధగా
జవాబు:
ఎ) అజాగ్రత్తగా
30. వాడు నిర్భయంగా యుద్ధం చేస్తాడు.
ఎ) అభయం
బి) సభయం
సి) భయంగా
డి) భయంతో
జవాబు:
సి) భయంగా
31. స్వార్థంతో జీవించకు. పరోపకారం చెయ్యి.
ఎ) అస్వార్థం
బి) నిస్స్వార్థం
సి) స్వార్థరహితం
డి) ఉపకారం
జవాబు:
బి) నిస్స్వార్థం
32. మీకు అనంగీకారం అయితే మేము వెడతాం.
ఎ) అంగీకారం
బి) అంగీకృతి
సి) ఇష్టం
డి) అయిష్టం
జవాబు:
ఎ) అంగీకారం
సంధులు :
33. ‘ఊరూరు‘ – గీత గీసిన పదాన్ని విడదీయండి.
ఎ) ఊర్ + ఊరు
బి) ఊరు + ఉరు
సి) ఊరు + ఊరు
డి) ఊర + ఊరు
జవాబు:
సి) ఊరు + ఊరు
34. ఆహాహా – గీత గీసిన పదం ఏ సంధి?
ఎ) వృద్ధి సంధి
బి) ఆమ్రేడిత సంధి
సి) సవర్ణదీర్ఘ సంధి
డి) అత్వసంధి
జవాబు:
బి) ఆమ్రేడిత సంధి
35. ‘అనురాగపు గులాబి‘ – గీత గీసిన పదాన్ని . విడదీయండి.
ఎ) అనురాగం + గులాబి
బి) అనురాగపు + గులాబి
సి) అనురాగము + గులాబి
డి) అనురా + గపు గులాబి
జవాబు:
సి) అనురాగము + గులాబి
36. ద్విరుక్తము యొక్క పరిరూపాన్ని ఏమంటారు?
ఎ) ఆమ్రేడితం
బి) శబ్దపల్లవం
సి) త్రికం
డి) ధాత్వరం
జవాబు:
ఎ) ఆమ్రేడితం
37. ఎంతెంత జరగాలి – దీనిని విడదీయండి.
ఎ) ఎంతె + ఎంతె
బి) ఎంత + ఎంత
సి) ఎంతు + ఎంత
డి) ఎంత + ఇంత
జవాబు:
బి) ఎంత + ఎంత
38. సవర్ణదీర్ఘసంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) ఎందుకెంత
బి) ఊరూరు
సి) దేవాలయం
డి) పుణ్యాలోకం
జవాబు:
సి) దేవాలయం
39. యుగ + అంతం – దీనిని కలిపి రాయడం గుర్తించండి.
ఎ) యుగేంతం
బి) యుగంతం
సి) యుగౌంతం
డి) యుగాంతం
జవాబు:
డి) యుగాంతం
40. ఉత్వసంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) ఏమేమి
బి) మరిది
సి) అత్తటి
డి) తరంగితాలైన
జవాబు:
డి) తరంగితాలైన
సమాసాలు :
41. ‘ప్రజాపారావారం’ – గీత గీసిన సమాసానికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) ప్రజలు అనే పారావారం
బి) ప్రజలు, పారావారం
సి) ప్రజలు పారావారంగా కలది
డి) ప్రజల యొక్క పారావారం
జవాబు:
ఎ) ప్రజలు అనే పారావారం
42. ‘అనురాగపు గులాబి‘ – గీత గీసిన ‘ పదం ఏ సమాసం?
ఎ) షష్ఠీ తత్పురుష
బి) రూపక సమాసం
సి) ద్వంద్వ సమాసం
డి) ద్విగు సమాసం
జవాబు:
బి) రూపక సమాసం
43. ‘నయనాంచలాలు‘ – గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.
ఎ) షష్ఠీ తత్పురుష
బి) ద్వంద్వ సమాసం
సి) ద్విగు సమాసం
డి) బహుప్రీహి సమాసం
జవాబు:
ఎ) షష్ఠీ తత్పురుష
44. హితైషిణి – దీనికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) జానపదునితో జాబు వ్రాయించుకొనెను
బి) జానపదుడు జాబు వ్రాసుకొనలేదు
సి) జాబు వ్రాయించుకొనలేదు ఎవరితోను
డి) జానపదుడు జాబు రాయలేదు
జవాబు:
ఎ) జానపదునితో జాబు వ్రాయించుకొనెను
45. ‘కృప చేత తరంగితం – దీనిని సమాస పదం గుర్తించండి.
ఎ) అనుకృప తరంగితం
బి) కృపా తరంగితం
సి) ప్రతికృప తరంగితం
డి) తరంగిత కృప
జవాబు:
బి) కృపా తరంగితం
46. షష్ఠీ తత్పురుషకు ఉదాహరణను గుర్తించండి.
ఎ) విద్యాహీనుడు
బి) దొంగభయం
సి) కళాలయాలు
డి) కార్యనిపుణుత
జవాబు:
సి) కళాలయాలు
47. దేవాలయం వెళ్ళారు – విగ్రహవాక్యాన్ని గుర్తించండి.
ఎ) దేవతల ఆలయం
బి) దేవుని యొక్క ఆలయం
సి) దేవుని కొరకు ఆలయం
డి) దేవతల కొరకు ఆలయం
జవాబు:
బి) దేవుని యొక్క ఆలయం
48. సముద్ర తీరాలు – దీనికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) సముద్రాల చేత తీరాలు
బి) సముద్రము కొరకు తీరాలు
సి) సముద్రము యొక్క తీరాలు
డి) సముద్రము నందు తీరాలు
జవాబు:
సి) సముద్రము యొక్క తీరాలు
వాక్య ప్రయోగాలు :
49. పల్లెలు కనువిందు చేస్తాయి – దీనికి వ్యతిరేకార్థక వాక్యం ఏది?
ఎ) పల్లెలు కన్నుల విందుగా ఉంటాయి
బి) ఉండవచ్చు పల్లెలు కనువిందుగా
సి) పల్లెలు కనువిందు చేయవు
డి) పరీక్షలో తప్పినా మరోసారి రాయవచ్చు
జవాబు:
సి) పల్లెలు కనువిందు చేయవు
50. పల్లెలో వర్షం కురిసింది – దీనికి వ్యతిరేకార్థక వాక్యం ఏది?
ఎ) పల్లెల్లో వర్షం తప్పక కురవకూడదు
బి) పల్లెల్లో వర్షం కురవలేదు
సి) పల్లెల్లో వర్షం కురవాలి
డి) పల్లెల్లో వర్షం కురవకపోవచ్చు
జవాబు:
బి) పల్లెల్లో వర్షం కురవలేదు
51. జానపదుడు జాబు రాశాడు – దీనికి వ్యతిరేకార్థక వాక్యం ఏది?
ఎ) హితాన్ని కోరునది
బి) హితము నందు కోరునది
సి) హితం వలన కోరునది
డి) హితం చేత కోరునది
జవాబు:
డి) హితం చేత కోరునది
52. చిరకాల కోరిక తీరింది – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
ఎ) చిరకాల కోరిక తీరలేదు
బి) చిరకాల కోరిక తీరకూడదు
సి) చిరకాల కోరిక తీరకుండదు.
డి) చిరకాల కోరిక తీరకపోవచ్చు
జవాబు:
ఎ) చిరకాల కోరిక తీరలేదు
53. రావడం ఆలస్యం కాలేదు . – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
ఎ) రావడం ఆలస్యం కాకపోవచ్చు
బి) రావడం ఆలస్యం కాకూడదు
సి) రావడం ఆలస్యం అయింది
డి) రావడం ఆలస్యం కావచ్చు
జవాబు:
సి) రావడం ఆలస్యం అయింది
54. సైకిలు దొరికింది. దొంగ దొరకలేదు – దీనికి సంయుక్త వాక్యం గుర్తించండి.
ఎ) సైకిలు దొరక్కపోయినా దొంగ దొరికాడు
బి) దొంగ, సైకిలు దొరికాయి
సి) సైకిలు దొరికింది కాని దొంగ దొరకలేదు
డి) దొంగతో పాటు సైకిలు దొరికింది
జవాబు:
సి) సైకిలు దొరికింది కాని దొంగ దొరకలేదు
55. పరీక్షలు బాగా రాశాడు. పరీక్ష తప్పాడు – దీనికి సంయుక్త వాక్యం గుర్తించండి.
ఎ) పరీక్షలు బాగా రాశాడు గాని తప్పాడు
బి) పరీక్షలు బాగా రాయకపోవడం వల్ల తప్పాడు
సి) పరీక్షలు బాగా రాస్తే పరీక్ష తప్పాడు
డి) పల్లెలు విందు చేస్తాయి కన్నుల విందువుగా
జవాబు:
ఎ) పరీక్షలు బాగా రాశాడు గాని తప్పాడు
56. పిల్లలు పల్లెలకు వెళ్ళవచ్చు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) ప్రార్థనార్థక వాక్యం
బి) అనుమత్యర్థక వాక్యం
సి) అభ్యర్థక వాక్యం
డి) ప్రశ్నార్థక వాక్యం
జవాబు:
బి) అనుమత్యర్థక వాక్యం
57. రైతులు పండించగలరు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) విధ్యర్థక వాక్యం
బి) శత్రర్థక వాక్యం
సి) సామర్థ్యార్థక వాక్యం
డి) హేత్వర్థక వాక్యం
జవాబు:
సి) సామర్థ్యార్థక వాక్యం
58. పల్లెలకు మేలు కలుగుగాక – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) అప్యర్థక వాక్యం
బి) హేత్వర్థక వాక్యం
సి) నిశ్చయార్థక వాక్యం
డి) ఆశీర్వార్థక వాక్యం
జవాబు:
డి) ఆశీర్వార్థక వాక్యం
59. నదులలోని నీరు ప్రవహించును – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) నిషేధార్థక వాక్యం
బి) తద్ధర్మార్థక వాక్యం
సి) ప్రశ్నార్థక వాక్యం
డి) విధ్యర్థక వాక్యం
జవాబు:
బి) తద్ధర్మార్థక వాక్యం
60. మీరు వెళ్ళాల్సిందే – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) విధ్యర్థక వాక్యం
బి) నిషేధాక వాక్యం
సి) అప్యర్థక వాక్యం
డి) తద్ధర్మార్థక వాక్యం
జవాబు:
ఎ) విధ్యర్థక వాక్యం
61. ఆహా ! ఎంత బాగుంది ! – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) నిషేధక వాక్యం
బి) నిశ్చయార్థక వాక్యం
సి) ఆశ్చర్యార్థక వాక్యం
డి) ఆత్మార్థక వాక్యం
జవాబు:
సి) ఆశ్చర్యార్థక వాక్యం
విభక్తి ప్రత్యయాలు – భాషాభాగాలు – పురుషలు :
62. విద్యతో హీనుడు – గీత గీసిన పదం ఏ విభక్తి ప్రత్యయం?
ఎ) తృతీయ
బి) సప్తమి
సి) షష్ఠీ
డి) చతుర్థీ
జవాబు:
ఎ) తృతీయ
63. ఫలితంను పొందాలి – గీత గీసిన పదం ఏ విభక్తి ప్రత్యయం?
ఎ) ప్రథమా
బి) సప్తమీ
సి) షష్ఠీ
డి) ద్వితీయ
జవాబు:
డి) ద్వితీయ
64. సాగరంలో నీరు ఉంది – గీత గీసిన పదం ఏ విభక్తి?
ఎ) ద్వితీయా విభక్తి
బి) సప్తమీ విభక్తి
సి) ప్రథమా విభక్తి
డి) షష్ఠీ విభక్తి
జవాబు:
డి) షష్ఠీ విభక్తి
65. వారు ఇంటికి వెళ్ళారు – గీత గీసిన పదం ఏ భాషాభాగ, ప్రత్యయం?
ఎ) సర్వనామం
బి) క్రియ
సి) విశేషణం
డి) అవ్యయం
జవాబు:
ఎ) సర్వనామం
66. ఆహా ! భళా ! ఎంత మధురం – గీత గీసిన పదం ఏ భాషాభాగ, పదం?
ఎ) నామవాచకం
బి) క్రియ
సి) అవ్యయం
డి) విశేషణం
జవాబు:
సి) అవ్యయం
67. మీరు అన్నం తిన్నారా? – గీత గీసిన పదం ఏ పురుషకు చెందినది?
ఎ) మధ్యమ పురుష
బి) ప్రథమ పురుష
సి) అధమ పురుష
డి) ఉత్తమ పురుష
జవాబు:
ఎ) మధ్యమ పురుష
68. ఉత్తమ పురుషకి చెందిన ప్రత్యయాలను గుర్తించండి.
ఎ) వాడు, వారు
బి) నీవు, మీరు
సి) నేను, మేము
డి) కలరు, కలది
జవాబు:
సి) నేను, మేము
69. నేను వచ్చాను – గీత గీసిన పదం ఏ పురుష ప్రత్యయం?
ఎ) ప్రథమ పురుష
బి) అధమ పురుష
సి) మధ్యమ పురుష
డి) ఉత్తమ పురుష
జవాబు:
డి) ఉత్తమ పురుష
సొంతవాక్యాలు:
సూచన : క్రింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
70. తండోపతండాలు : జాతరకు ప్రజలు తండోపతండాలుగా విరగబడి వచ్చారు.
71. గుసగుసలాడు : బడిలో అందరూ కృష్ణయ్యను చూసి ఎందుకో గుసగుసలాడుతున్నారు.
72. రొమ్ములు బాదుకొను : తన పిల్లవాడు పోయాడని, కాంతమ్మ రొమ్ములు బాదుకొని ఏడ్చింది.
73. విరగపడు: విపక్ష నాయకులు ప్రభుత్వంపై విమర్శలతో విరగపడుతున్నారు.
74. పరీక్షించండి : విద్యార్థుల ప్రతిభను నిశితంగా పరీక్షించండి.
75. నిరూపిస్తున్నది : ధర్మం సత్యాన్ని నిరూపిస్తున్నది.
76. ఆకర్షించడం : నాయకులు వాగ్దానాలతో ప్రజలను ఆకర్షించడం అనుసరించారు.
77. విరుచుకుపడు : సముద్రంలో అలలు విరుచుకు పడుతున్నాయి.
78. నిస్వార్థం : నాయకులు నిస్వార్థంతో పనిచేయాలి.
79. పరిమళం : మల్లెపూల పరిమళం అందరిని ఆకట్టుకుంటుంది.