These AP 7th Class Telugu Important Questions 10th Lesson ప్రియ మిత్రునికి will help students prepare well for the exams.
AP Board 7th Class Telugu 10th Lesson Important Questions and Answers ప్రియ మిత్రునికి
I. అవగాహన – ప్రతిస్పందన
పరిచిత గద్యాలు
కింది పరిచిత గద్య భాగాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. మైత్రి, ప్రేమ, నిస్వార్థత వున్న మానవులంతా ఎంత దూరాన వున్నా కూడా చాలా దగ్గరిలోని వారే. వారు ఏ వయసు వారైనప్పటికీ ఒకే వయసువారు. వారు ఏ వర్ణానికి చెందినా ఒకే వర్ణము వారు. వారు ఏ దేశానికి చెందినా ఒకే దేశానికి చెందిన వారు. కులతత్వాలూ, జాతి భేదాలకు మనమంతా దూరం.
ప్రశ్నలు – జవాబులు :
అ) మనుషుల మధ్య దూరాన్ని చెరిపేవి ఏవి?
జవాబు:
మైత్రి, ప్రేమ, నిస్వార్థతలే మనుష్యుల మద్య దూరాన్ని చెరిపేవి.
ఆ) వారు ఏ దేశానికి చెందినా ఒకే దేశానికి చెందినవారు అనడంలో ఆంతర్యం ఏమిటి?
జవాబు:
స్నేహం, ప్రేమ, నిస్వార్ధతలు మనుష్యులను కలుపుతాయనేది కవి ఉద్దేశం.
ఇ) ‘కులం’ పర్యాయ పదాలు ఏవి?
జవాబు:
తెగ, జాతి
ఈ) ‘వర్ణము’ వికృతి పదతి ఏది?
జవాబు:
వన్నెము
కింది పరిచిత గద్య భాగాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
2. ఎక్కువ మంది మానవులలో సుఖాలకంటే బాధలే ఎక్కువ. మానవుని బాధల నుండి, శోకాల నుండి, దిగుళ్ళూ, చింతల నుండి తప్పించి ఆనందంవైపు మరలించటానికే అనేకమైన లలిత కళలు. సాహిత్యం , సంగీతం, నృత్యం, శిల్పం, చిత్రలేఖనం మొదలైనవి. ఏ కళ మానవుని బాధను తాత్కాలికంగానైనా తొలగించి ఆనందాన్ని ప్రసాదించజాలదో ఆ కళ కల మాత్రమే అవుతుంది.
ప్రశ్నలు – జవాబులు :
అ) మానవుని బాధను మరలించేవి ఏవి?
జవాబు:
మానవుని బాధను మరలించేవి లలితకళలు.
ఆ) ‘తాత్కాలికం’ అంటే అర్థం ఏమిటి?
జవాబు:
కొంత సమయం వరకు.
ఇ) ‘లలిత కళలు’ ఏవి?
జవాబు:
సాహిత్యం , సంగీతం, నృత్యం, శిల్పం, చిత్రలేఖనం.
ఈ) చింత – వ్యతిరేక పదం రాయండి.
జవాబు:
నిశ్చింత
అపరిచిత గద్యాలు
కింది అపరిచిత గద్యాలను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
చేతిలో అనువుగా ఒదిగి ఒక విషయానికి సంబంధించిన వివరణను ఇచ్చే కాగితాన్ని ‘కరపత్రం’ అనవచ్చు. కరపత్రం సంస్కృత పదం. చేతిలోని కాగితమని దీని అర్థం. దీన్నే ఆంగ్లంలో ‘పాంప్లెట్’ అంటారు. పదిమందికి తెలియవలసిన విషయంతో కూడుకున్నదే కరపత్రం. ఒక వ్యక్తి ఒక విషయాన్ని మరొకరికి తెలియబరచడానికి ఒక కాగితం మీద రాసి పంపవచ్చు. ఆ విషయం ఆ ఒక్క వ్యక్తికే సంబంధించినది కాక, ఎందరికో సంబంధించినది కావచ్చు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ మతస్థితులను . ప్రతిబింబించేది కావచ్చు. ఇలా రాసి పంపే కాగితాలను లేఖలు అనవచ్చు గదా ! అనిపిస్తుంది.
ప్రశ్నలు – జవాబులు :
అ) కరపత్రం అంటే ఏమిటి?
జవాబు:
చేతిలో ఒదిగి ఏదైనా విషయానికి సంబంధించి వివరణను ఇచ్చే కాగితాన్ని ‘కరపత్రం’ అంటారు.
ఆ) కరపత్రం అంటే అర్థం ఏమిటి? దీన్ని ఆంగ్లంలో ఏమంటారు?
జవాబు:
కరపత్రం అంటే చేతిలో కాగితం అని అర్థము. దీన్ని ఇంగ్లీషులో ‘పాంప్లెట్’ అంటారు.
ఇ) కరపత్రంలో విషయం దేనితో కూడుకొని ఉంటుంది?
జవాబు:
కరపత్రంలో విషయం పదిమందికీ తెలియవలసిన విషయంతో కూడి ఉంటుంది.
ఈ) కరపత్రంలో విషయం దేన్ని ప్రతిబింబిస్తుంది?
జవాబు:
కరపత్రంలో విషయం, సాంఘిక, ఆర్థిక, రాజకీయ మతస్థితులను గూర్చి ప్రతిబింబిస్తుంది.
2. లిపి వాడుకలోకి వచ్చిన తరువాత, గుడ్డముక్కల మీద, చెక్క పలకల మీద రాసేవారు. ఒక విషయాన్ని దూరప్రాంతాల వారికి పంపాలనుకున్నప్పుడు మందపాటి గుడ్డమీద రాసి దానికి ఒక పిడిని అమర్చి ఆ పిడి చుట్టూ రాత ఉన్న గుడ్డను చుట్టి పైన తాడుతో కట్టి పంపేవారు. రాజుల కాలంలో ఇది ఎక్కువగా వాడుకలో ఉండేది. ఇలాంటి గుడ్డ ఉత్తరాలు ఇప్పటికీ కొన్ని ప్రాచీన మఠాలలో ఉన్నాయని తెలుస్తోంది. చేతులలో – అందంగా అమరే ఈ గుడ్డ ఉత్తరాలను, కరపత్రాల పరిణామంలో రెండో దశగా భావించవచ్చు. ముద్రణ సౌకర్యం ఏర్పడిన తరువాత, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలలో కరపత్రాల ముద్రణ మొదలై, ప్రపంచమంతా విస్తరించింది.
ప్రశ్నలు – జవాబులు :
అ) గుడ్డ ఉత్తరాలు ఎలా పంపేవారు?
జవాబు:
గుడ్డ మీద రాసి, దానికి ఒక పిడి అమర్చి, ఆ పిడి చుట్టూ రాత గుడ్డను చుట్టి, పైన తాడుతో కట్టి, పంపేవారు.
ఆ) గుడ్డ ఉత్తరాలు ఇప్పుడు ఎక్కడ కనిపిస్తాయి?
జవాబు:
గుడ్డ ఉత్తరాలు ప్రాచీన మఠాలలో ఉన్నాయని తెలుస్తోంది.
ఇ) గుడ్డ ఉత్తరాలు కరపత్రాల పరిణామంలో ఎన్నో దశకు సంబంధించినవి?
జవాబు:
గుడ్డ ఉత్తరాలు కరపత్రాల పరిణామంలో రెండవ దశగా భావించాలి.
ఈ) కరపత్రాలు మొదట ఏయే దేశాల్లో ముద్రించబడ్డాయి?
జవాబు:
కరపత్రాల ముద్రణ, మొదట ఇంగ్లాండ్, ఫ్రాన్సు, జర్మనీ దేశాలలో జరిగింది.
3. ‘కరపత్రాల్లో విషయాలు ఉద్దేశించిన వ్యక్తులకు వెంటనే అర్థమౌతాయి. మిగిలిన వాళ్ళకు వాటిలోని భావాలు సందిగ్ధంగా ఉంటాయి. కొన్ని కరపత్రాలను ఎవరికీ తెలియనివ్వకుండా రహస్యంగా అతి తక్కువ సమయంలో ముద్రించి పంపకం చేస్తారు. అందువల్ల అచ్చు తప్పులకు, అపార్థాలకు ఎక్కువ ఆస్కారముంటుంది. కరపత్రాల్లోని విషయాలు నిజాలా ! అబద్దాలా అనే అనుమానం కలుగుతుంది. ఆధారాలు దొరికితే తప్ప, ఈ విషయాల వెనక ఉన్న వాస్తవం బయటపడదు. కొన్ని విషయాలను వార్తాపత్రికల్లో చూడనివారు కరపత్రాల్లో చూసి తెలుసుకుంటారు. కరపత్రాల్లో ఎక్కువగా వాడుకభాష ఉంటుంది. సాధారణంగా కరపత్రాలను ఉచితంగా పంపిణీ చేస్తారు. కరపత్రం మనిషి భావ ప్రకటనా స్వేచ్ఛకు సంకేతం.
ప్రశ్నలు – జవాబులు :
అ) కరపత్రాల్లో విషయాలు ఎవరికి వెంటనే అర్థమౌతాయి?
జవాబు:
కరపత్రాలలో విషయాలు, ఉద్దేశించిన వ్యక్తులకు వెంటనే అర్థం అవుతాయి.
ఆ) కరపత్రాల్లో విషయాలు ఎవరికి సందిగ్ధంగా ఉంటాయి?
జవాబు:
ఉద్దేశింపబడినవారు కాని వ్యక్తులకు, కరపత్రంలో విషయాలు సందిగ్ధంగా ఉంటాయి.
ఇ) అచ్చుతప్పులు కరపత్రాల్లో ఎందుకు వస్తూ ఉంటాయి?
జవాబు:
కరపత్రాలు రహస్యంగా, అతితక్కువ సమయంలో ముద్రించబడడం చేత అచ్చు తప్పులు వస్తాయి.
ఈ) కరపత్రం దేనికి సంకేతం?
జవాబు:
కరపత్రం మనిషి భావప్రకటనా స్వేచ్ఛకు సంకేతం.
4. జీవావరణం మీద పర్యావరణం మీద మనుష్యులు ఇంత కక్ష కట్టారెందుకో? ఇలా ఉన్న చెట్లన్నింటినీ నరికేసుకుంటూ పోతే, చివరికి మనిషికి మిగిలేదేమిటి ? అయినా ఇప్పటికే అనుభవిస్తున్నారు కదా ! గ్రీన్ హౌజ్ ఎఫెక్టునీ………. ఆమ్ల దర్పాలనీ. ఆధునిక కాలుష్యకారక సమస్యలన్నింటికీ చెట్లు నరికివేతే కారణమని, ఈ మానవ మేధావులే తేల్చి చెబుతారు. మళ్ళీ ఉన్న చెట్లన్నింటినీ నరికి భవనాలూ, నగరాలూ నిర్మిస్తారు. వాళ్ళ అభివృద్ధి ఎటు పోతోందో వాళ్ళకే అర్థం కావడం లేదు.
ప్రశ్నలు – జవాబులు :
అ) కాలుష్యానికి కారణం ఏమిటి?
జవాబు:
కాలుష్యానికి కారణం చెట్లు నరికివేత.
ఆ) మానవులు చెప్పేదే చేస్తున్నారా?
జవాబు:
లేదు. మనుషులు జీవావరణ, పర్యావరణాలపై కక్ష కట్టారు.
ఇ) మానవుల అభివృద్ధి జీవావరణానికి మేలు చేస్తోందా?
జవాబు:
మానవుల అభివృద్ధి జీవావరణానికి మేలు చేయడం లేదు.
ఈ) చెట్లు లేకపోతే ఏమౌతుంది?
జవాబు:
చెట్లు లేకపోతే a) గ్రీన్ హౌజ్ ఎఫెక్టు b) ఆమ్ల దర్పాలు కలుగుతాయి.
5. ఒకప్పుడు మానవజాతి ప్రగతికి సంకేతాలుగా భావించబడిన సాంకేతిక అద్భుతాలు ఈవేళ పర్యావరణానికి పెద్ద ప్రమాదాలుగా పరిణమిస్తున్నాయి. మన పరిశ్రమలు, కర్మాగారాలు, వాహనాలు, రకరకాల విద్యుత్ పరికరాలు పర్యావరణ కాలుష్యానికి ముఖ్యమైన కారణాలుగా ఉంటున్నాయి. వాతావరణంలో బొగ్గుపులుసు వాయువులు, గ్రీన్ హౌస్ వాయువులు ఎక్కువవుతున్నాయి. వీటి వలన తీవ్రమయిన పర్యావరణ సమస్యలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2050 నాటికి 15 మించి 35 శాతం జంతువులు నశించిపోయే ప్రమాదముందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ప్రశ్నలు – జవాబులు :
అ) వాతావరణ కాలుష్యానికి కారణమయిన వాయువేది?
జవాబు:
బొగ్గుపులుసు వాయువు
ఆ) జంతువులు ఎందుకు నశించిపోతాయి?
జవాబు:
వాతావరణ కాలుష్యం వలన
ఇ) మానవులు ఉపయోగించే వాహనాలలో కాలుష్యం కలిగించనిదేది?
జవాబు:
సైకిలు
ఈ) వాతావరణ కాలుష్య నివారణకు ఏం చేయాలి?
జవాబు:
చెట్లను ఎక్కువగా పెంచాలి.
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
లేఖారచనలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకొన్న డా. సంజీవ్ దేవ్ గురించి రాయండి.
జవాబు:
తెలుగులో ఉత్తరాల రచనలో ప్రసిద్ధి చెందినవాడు డా. సంజీవ్ దేవ్. ఈయన ప్రతి ఉత్తరం ఓ చిత్రకావ్యం. వీరి వాక్య నిర్మాణ శైలి అబ్బురపరుస్తుంది. “నిమ్మంటే నాకిష్టం, దానిమ్మంటే నాకిష్టం బొమ్మంటే నాకిష్టం, లేని అమ్మంటే నాకిష్టం” – అంటూ తన కవి హృదయాన్ని వ్యక్తపరిచాడు ఓ లేఖలో. ఆయన లేఖల్లో ఎక్కువగా వేదాంత, తాత్విక విషయాలే కనిపిస్తాయి. మరికొన్ని లేఖల్లో సంగీత, సాహిత్యాల పట్ల తన వైఖరి, ఇతర కవుల పై తన అభిప్రాయాలు కూడా కనిపిస్తాయి. “గద్యం అనేది ఆలోచన, పద్యం అనేది వేదన, సంగీతం అనేది సంవేదన” అంటూ వాటి ప్రాధాన్యతను వివరిస్తూ, ‘గద్యం అనేది భూమి, పద్యం అనేది ఆకాశం, సంగీతం అనేది ఇంద్రధనుస్సు” అని పోలుస్తాడు – ఒక లేఖలో. ఆయన ప్రతి లేఖ ఆకట్టుకునే పదబంధాలతో, సందేశాత్మక లక్ష్యంతో జనరంజకంగా కొనసాగుతాయి.
ప్రశ్న 2.
సంకల్పించుకొన్న కార్యాలు నెరవేరనపుడు మన ఆలోచన ఎలా ఉండాలని కవి సంజీవ్ దేవ్ అన్నారు?
జవాబు:
తన జీవితంలో సంకల్పించుకొన్న కార్యాలలో ఇంతవరకు నెరవేర్చిన వాటికంటే నెరవేర్చవలసినవే భవిష్యత్తులో ఎక్కువగా ఉన్నాయని కవి సంజీవ్ పేర్కొన్నారు. సకాలంలో అవి అన్నీ కాకపోయినా కొన్ని అయినా సఫలం కాగలవని ఆశిస్తానంటాడు సంజీవ్. సఫలం కాకపోయినా కూడా నిరుత్సాహపడకూడదని, నిరాశ చెందకూడదని, విచారించకూడదని కార్యాచరణ మాత్రమే ప్రధానం కాని సఫలతలూ, విఫలతలూ సమానంగా స్వీకరించాలని సంజీవ్ అంటారు.
ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
లేఖల వల్ల కలిగే ప్రయోజనాలు రాయండి.
జవాబు:
లేఖ అంటే జాబు, ఉత్తరం. ఒక చోటు నుండి మరొక చోటుకు, ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి కబుర్లనూ, వార్తలనూ, విశేషాలనూ చేరవేయడానికి ఉపయోగపడే రచనా మాధ్యమం ఉత్తరం. మానవుల మధ్య సంబంధాలకూ, దేశాల మధ్య సంబంధాలకూ ప్రాతినిధ్యం వహించే భాషా మాధ్యమం లేఖ. లేఖా రచన వ్యక్తిగత, సామాజిక జీవితాలపై ఎంతో ప్రభావం కలిగి ఉంటుంది. సందర్భ శుద్ధి, సౌజన్యత, ఆత్మీయత, యథార్థత అనేవి లేఖ ద్వారా కలిగే ప్రయోజనాలు. పెండ్లి పిలుపులు, వినతి పత్రాలు, ఫిర్యాదులు, సంపాదకీయ లేఖలు, ఆహ్వాన పత్రికలు ఇలా అనేక రకాలుగా లేఖలు మనకు ప్రయోజనాన్ని కల్గిస్తున్నాయి.
ప్రశ్న 2.
లేఖల్లో రకాలను తెలపండి.
జవాబు:
వ్యక్తిగత, సామాజిక ప్రయోజనాలననుసరించి ఉత్తరాలలో రకాలు ఏర్పడతాయి. ఉదాహరణకు వ్యక్తిగత లేఖలలో – వ్యక్తుల మధ్య సంబంధాలు వారి భావాల వ్యక్తీకరణ ప్రధాన ప్రయోజనం. వ్యాపార లేఖల్లో వివిధ వ్యాపార సంస్థల మధ్య లావాదేవీలు, లాభనష్టాలు వంటి అంశాల వ్యక్తీకరణ ప్రధానం. ఇలా విషయ ప్రాధాన్యాన్ని అనుసరించి లేఖలు 4 రకాలు. అవి –
1. వ్యక్తిగత లేఖలు
2. వ్యాపార లేఖలు
3. వ్యవహార లేఖలు
4. సాంఘిక లేఖలు అనే విభాగాలుగా ఏర్పడతాయి.
III. భాషాంశాలు
పర్యాయపదాలు
మిత్రుడు = స్నేహితుడు, సఖుడు
లేఖ = జాబు, ఉత్తరం
నమస్సులు = నమస్కారాలు, వందనాలు
అనురాగం = ప్రేమ, మమకారం
సోదరి = సహోదరి, తోబుట్టువు
అమితం = అధికం, ఎక్కువ
రాత్రి = రాతిరి, రేయి
ఆనందం = సంతోషం, మోదము
అనుభూతి = అనుభవము, అనుభుక్తి
మైత్రి = స్నేహం, సఖ్యం
కులము = వంశము, కొలము
జాతి = కులము, పుట్టుక
ప్రతిబింబం = బింబము, ప్రతిమ
ముఖము = వదనం, ఆననం
ఆకృతి = ఆకారం, రూపం
తేజం = కాంతి, తేజస్సు
సుఖం = శాంతి, సౌఖ్యము
బాధ = కష్టం, దుఃఖం
శోకం = ఏడుపు, విలపించడం
దిగులు = వేదన, బాధ
కీర్తి = యశస్సు, ప్రఖ్యాతి
ప్రకృతి – వికృతులు
రాజు – ఱేడు
సంతోషము – సంతసము
రాత్రి – రేయి
దూరము – దవ్వు
కులము – కొలము
కార్యము – కర్జము
ముఖము – మొగము
సుఖము – సుగము
చిత్రము – చిత్తరువు
విద్య – విద్దె
కీర్తి – కీరితి
జీవితము – జీతము
ఫలము – పండు
ఆశ – ఆస
వ్యతిరేక పదాలు
సంతోషం × విచారం
అవును × కాదు
దూరము × దగ్గర
అస్పష్టం × స్పష్టం
స్వప్నం × జాగ్రత్
మైత్రి × వైరం
ప్రేమ × ద్వేషం
నిస్స్వార్థం × స్వార్థం
రాత్రి × పగలు
తేజం × నిస్తేజం
ఎక్కువ × తక్కువ
సుఖము × దుఃఖము
బాధ × ఆనందం
శోకము × సంతోషం
తాత్కాలికం × శాశ్వతం
విద్య × అవిద్య
సంపద × దరిద్రం
కీర్తి × అపకీర్తి
భవిష్యత్తు × గతం
ఆశ × నిరాశ
సఫలం × విఫలం
సంధులు
ఉత్వసంధి
ఔనండీ = ఔను + అండీ
నాకంత = నాకు + అంత
స్పష్టమైన = స్పష్టము + ఐన
మానవులంతా = మానవులు + అంతా
వారయిన = వారు + అయిన
మనమంతా = మనము + అంతా
అనేకమైన = అనేకము + ఐన
అత్వసంధి
ఉన్నట్లు = ఉన్న + అట్లు
మనింటివద్ద = మన + ఇంటి వద్ద
ఇత్వ సంధి
సోదరినింక = సోదరిని + ఇంక
ఆపాలని = ఆపాలి + అని
అవన్నీ = అవి + అన్నీ
సవర్ణదీర్ఘ సంధి
ముఖాకృతి = ముఖ + ఆకృతి
కార్యాచరణ = కార్య + ఆచరణ
ఖాళీలు : క్రింది ఖాళీలను సరైన వ్యతిరేక పదాలతో పూరించండి.
1. ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. ………………… గా ఉండకూడదు. (విచారం)
2. మంచిపనులు చేస్తే తేజం పెరుగుతుంది. ……………. పోతుంది. (నిస్తేజం)
3. సుఖము, …………… సమానమే. (దుఃఖము)
4. ఏదీ శాశ్వతం కాదు. అన్నీ ……………… . (తాత్కాలికమే)
5. కీర్తి పెంచుకోవాలి. ……………….. కాదు. (అపకీర్తి)
6. ఆశతో జీవించాలి. …………….. తో కాదు. (నిరాశ)
7. ఉత్సాహంగా ఉండాలి. ……………. గా ఉండకూడదు. (నిరుత్సాహం)
8. విద్య వలన …………… పోతుంది. (అవిద్య)
9. పనిని సఫలం అయ్యేదాకా చేయాలి. ……………… వచ్చిందని ఆపకూడదు. (విఫలం)
10. స్వార్థం పనికిరాదు. ………….. గా పనిచేయాలి. (నిస్స్వార్థం)
సంధులు
1. ఔనండీ = ఔను + అండీ – ఉత్వ సంధి
2. ఉన్నట్లు = ఉన్న + అట్లు – అత్వ సంధి
3. ఆపాలని = ఆపాలి + అని – ఇత్వ సంధి
4. ముఖాకృతి = ముఖ + ఆకృతి – సవర్ణదీర్ఘ సంధి
5. కార్యాచరణ = కార్య + ఆచరణ – సవర్ణదీర్ఘ సంధి
6. మానవులంతా = మానవులు + అంతా – ఉత్వ సంధి
7. అవన్నీ = అవి + అన్నీ – ఇత్వ సంధి
8. మనింటి వద్ద = మన + ఇంటివద్ద – అత్వ సంధి
9. సోదరినింక = సోదరిని + ఇంక – ఇత్వ సంధి
10. అనేకమైన = అనేకము + ఐన – ఉత్వ సంధి
IV. బహుళైచ్ఛిక ప్రశ్నలు
1. భాషాంశాలు
అర్థాలు : ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు గుర్తించండి.
1. స్నేహితులంటే ప్రియము ఎక్కువ.
a) కష్టం
b) ఇష్టం
c) నష్టం
d) పుష్టి
జవాబు:
b) ఇష్టం
2. మా అమ్మకు ఉత్తరం వ్రాశాను.
a) జవాబు
b) బదులు
c) సఖి
d) వ్యాసం
జవాబు:
c) సఖి
3. సోదరి అంటే ఎవరికైనా ఇష్టమే.
a) స్నేహితురాలు
b) చెలియ
c) సఖి
d) తోబుట్టువు
జవాబు:
d) తోబుట్టువు
4. స్నేహితుని కంటె మించిన గ్రంథం లేదు.
a) ఎక్కువైన
b) తక్కువైన
c) ముంచిన
d) మంచి
జవాబు:
a) ఎక్కువైన
5. మొన్న నాకు మంచి స్వప్నం వచ్చింది.
a) కల
b) కలత నిద్ర
c) నిద్ర
d) దృశ్యం
జవాబు:
a) కల
6. కూచిపూడి కళాకారులు నృత్యం బాగా చేస్తారు.
a) నటన
b) ప్రదర్శన
c) నాట్యం
d) కచేరీ
జవాబు:
c) నాట్యం
7. సుఖదుఃఖాలు తాత్కాలికం.
a) శాశ్వతం
b) అశాశ్వతం
c) ఉంటాయి
d) పోతాయి
జవాబు:
b) అశాశ్వతం
8. ముందుగా బొమ్మ ఆకృతి గీయాలి.
a) ఆకారం
b) అందంగా
c) కాగితంపై
d) చక్కగా
జవాబు:
a) ఆకారం
9. అద్దంలో ప్రతిబింబం కనిపిస్తుంది.
a) ఆకారం
b) ప్రతిమ
c) రూపం
d) అందం
జవాబు:
b) ప్రతిమ
10. మంచివారి మైత్రిని విడువకూడదు.
a) స్నేహం
b) బంధుత్వం
c) చుట్టరికం
d) కలయిక
జవాబు:
a) స్నేహం
పర్యాయపదాలు : ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు పర్యాయపదాలు గుర్తించండి.
11. రాత్రి ఒంటరిగా తిరగకూడదు.
a) రేయి, రాతిరి
b) చీకటి, ఆంద్యం
c) పగలు, పవలు
d) ఏకం, అనేకం
జవాబు:
a) రేయి, రాతిరి
12. అమ్మనాన్నల అనురాగం వెలకట్టలేనిది.
a) స్నేహం, మైత్రి
b) గొప్పతనం, శక్తి
c) మమకారం, ప్రేమ
d) ఇష్టం, సఖ్యం
జవాబు:
c) మమకారం, ప్రేమ
13. ఎవరి ముఖము వారికి అందంగా కనిపిస్తుంది.
a) వదనం, వందనం
b) ఆననం, వదనం
c) ఆనం, ఆనందం
d) హస్తం, హస్తి
జవాబు:
b) ఆననం, వదనం
14. గురువులకు నమస్సులు పెట్టాలి.
a) నమస్కారాలు, వందనాలు
b) ఆశీస్సులు, దీవెనలు
c) ధనం, డబ్బులు
d) పిండివంటలు, భోజనం
జవాబు:
a) నమస్కారాలు, వందనాలు
15. దేనికీ దిగులు చెందకూడదు.
a) చెంత, చింత
b) వేదన, వేతనం
c) వేదన, బాధ
d) దుఃఖం, నవ్వు
జవాబు:
c) వేదన, బాధ
16. మంచి కీర్తి సంపాదించాలి.
a) యశస్సు, ప్రఖ్యాతి
b) డబ్బు, సంపద
c) ఆస్తి, తోట
d) చేను, పొలం
జవాబు:
a) యశస్సు, ప్రఖ్యాతి
17. మిత్రుడు కష్టాలలో ఆదుకొంటాడు.
a) స్నేహితుడు, బంధువు
b) స్నేహితుడు, సఖుడు
c) అధికారి, హెూదా కలవాడు
d) ధనవంతుడు, మిత్రుడు
జవాబు:
b) స్నేహితుడు, సఖుడు
18. అమితంగా మంచిపనులు చేయాలి.
a) తగినంత, శక్తి మేరకు
b) కొంచెం, మితం
c) ఎక్కువ, అధికం
d) మితం, హితం
జవాబు:
c) ఎక్కువ, అధికం
19. ఎప్పుడూ ఆనందంగా గడపాలి.
a) సంతోషం, మోదం
b) మోదం, మోదకాలు
c) ముద్దు, ముదం
d) హితం, మితం
జవాబు:
a) సంతోషం, మోదం
20. దేనికీ శోకం పనికిరాదు.
a) లోకం, శ్లోకం
b) ఏడ్పు, నవ్వు
c) బాధ, సుఖం
d) ఏడుపు, విలపించడం
జవాబు:
d) ఏడుపు, విలపించడం
ప్రకృతి-వికృతులు : ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు ప్రకృతి-వికృతులను గుర్తించండి.
21. రవివర్మ చిత్తరువు బాగా గీస్తాడు.
a) చిత్రము
b) చిత్తరము
c) చిత్తుప్రతి
d) చిత్తం
జవాబు:
a) చిత్రము
22. కీర్తి సంపాదించాలి.
a) కీర్ధి
b) కీర్తి
c) కిరతం
d) కీరితి
జవాబు:
d) కీరితి
23. విద్దె వలన కీర్తి పెరుగుతుంది.
a) విద్ద
b) విద్ది
c) విద్దియ
d) విద్య
జవాబు:
d) విద్య
24. పనిచేస్తే ఫలము ఉంటుంది.
a) పళ్లు
b) పండు
c) ఫలితము
d) ఫలాహారం
జవాబు:
b) పండు
25. ఎప్పుడూ ఆశను విడవకూడదు.
a) ఆష
b) ఆశయం
c) ఆస
d) ఆసరా
జవాబు:
c) ఆస
26. ఎవరి కులము వారికి గొప్ప.
a) కొలము
b) కులాయము
c) కూలము
d) కొలను
జవాబు:
a) కొలము
27. దవ్వులో ఉన్నా మానవులంతా ఒకటే.
a) దువ్వు
b) దూరము
c) దగ్గర
d) సమీపం
జవాబు:
b) దూరము
28. మొదలు పెట్టిన కార్యము విడువకూడదు.
a) కర్యము
b) క్రౌర్యము
c) కర్ణము
d) కారణం
జవాబు:
c) కర్ణము
29. ముఖము అద్దంలో చూసుకోవాలి.
a) వదనం
b) ఆననం
c) మొగము
d) ఆస్యం
జవాబు:
c) మొగము
30. ఎవరైనా సుఖమునే కోరుకొంటారు.
a) సొగసు
b) సుగము
c) శుకము
d) సౌఖ్యం
జవాబు:
b) సుగము
2. వ్యాకరణాంశాలు
ఈ క్రింది వానిని కోరిన విధంగా గుర్తించండి.
31. – పొలము అతని చేత దున్నబడెను – కర్త ఏది?
a) పొలము
b) అతను
c) దున్నడం
d) పడెను
జవాబు:
b) అతను
32. నేను వ్యవసాయమును చేస్తాను – కర్మ ఏది?
a) వ్యవసాయం
b) ను
c) నేను
d) చేస్తాను
జవాబు:
a) వ్యవసాయం
33. పంటలు పండించి ఎగుమతి చేస్తాను – అసమాపక క్రియ ఏది?
a) చేస్తాను
b) ఎగుమతి
c) పండించి
d) పంటలు
జవాబు:
c) పండించి
34. సాధారణంగా కర్మపదం పక్కనే ఉండే ప్రత్యయం?
a) యొక్క
b)డు
c) ము
d) ను లేక ని
జవాబు:
d) ను లేక ని
35. వీచెను గాలి చల్లగా బయట – కర్త ఏది?
a) వీచెను
b) గాలి
c) చల్లగా
d) బయిట
జవాబు:
b) గాలి
36. అతను స్త్రీని నిర్బంధించుట తప్పు – కర్మ ఏది?
a) అతను
b) నిర్బంధించు
c) స్త్రీ
d) తప్పు
జవాబు:
b) నిర్బంధించు
37. నేను పుస్తకమును వ్రాస్తాను – దీనిలో ‘నేను’ అనేది?
a) కర్త
b) కర్మ
c) క్రియ
d) విశేషణం
జవాబు:
a) కర్త
38. అతను పనిని నిర్లక్ష్యం చేశాడు – దీనిలో పని’ ఏమిటి?
a) కర్త
b) క్రియ
c) కర్మ
d) అవ్యయం
జవాబు:
c) కర్మ
39. క్రిందివానిలో అసమాపక క్రియను గుర్తించండి.
a) చూస్తూ
b) చేస్తాను
c) వస్తాను
d) తింటాను
జవాబు:
a) చూస్తూ
40. క్రిందివానిలో కర్మపదమును గుర్తించండి.
a) రాముడు
b) సీతను
c) అడవికి
d) పంపెను
జవాబు:
b) సీతను
41. గాలి వీచెను – ఇది ఏ రకమైన వాక్యం?
a) కర్తథకం
b) సకర్మకం
c) అకర్మకం
d) క్రియావాక్యం
జవాబు:
c) అకర్మకం
42. హనుమ సముద్రమును దాటెను – ఏ రకమైన వాక్యం?
a) అకర్మకం
b) కర్తర్ణకం
c) వాక్యం
d) సకర్మకం
జవాబు:
d) సకర్మకం
నేనివి చేయగలనా?
1. కళల గురించి చర్చించగలను. [ ఔను/ కాదు ]
2. పాఠంలోని పదాలకు అర్థాలను, పర్యాయపదాలను గుర్తించి రాయగలను. [ ఔను/ కాదు ]
3. లేఖలను చదవగలను. సొంతమాటల్లో రాయగలను. [ ఔను/ కాదు ]
4. నేను చూసిన ఒక దర్శనీయ ప్రాంతం గురించి మిత్రునికి లేఖ రాయగలను. [ ఔను/ కాదు ]
చదవండి – ఆనందించండి
గురుభక్తి
ఒకరోజు ధౌమ్యుమహర్షి ఆశ్రమంలో కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో వర్షం ఏకదాటిగా కురుస్తోంది. ఆశ్రమప్రాంతం అంతా జలమయం అయింది. వెంటనే దౌమ్యమహర్షి తన శిష్యులను దగ్గరగా పిలిచి ఇలా అన్నాడు. ‘శిష్యులారా ! మన పంట చేనుకు ప్రక్కన ఉన్న కాలవగట్టు సక్రమంగా లేకపోతే మన పంట మొత్తం నీళ్ళపాలు అవుతుంది. అదే జరిగితే మన ఆశ్రమంలో అందరూ పస్తులు ఉండాలి. ముందు మీలో ఎవరో ఒకరు వెళ్లి పంటపొలాలను చూసి రండి’ అని అన్నాడు.
గురువు మాటలకు అందరూ తలలు వంచుకొని రకరకాల కారణాలు చెప్పారు తప్ప, ఆ వర్షంలో పంటచేనుకు వెళ్లడానికి ఎవరూ సాహసించలేదు. అక్కడ ఉన్న ఆరుణి అనే శిష్యుడు లేచి “గురుదేవా ! ఆశ్రమానికి ఆహారం అందించే పంటచేను ఎలా ఉందో నేను చూసి వస్తాను” అని పంటచేను దగ్గరికి బయలుదేరాడు.
ఆరుణి పంటచేల గట్టు దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ ఒక చోట కాలవగట్టుకి చిన్న గండిపడింది. ఆ గండిలో నుంచి నీరు పంట పొలాల్లోకి ప్రవహిస్తోంది. ఆరుణి గడ్డి, రాళ్ళు, రప్పలు తెచ్చి గండికి అడ్డం వేసినా ప్రవాహం ఆగలేదు. ఆరుణి ఒక ఉపాయం ఆలోచించి చివరికి తానే గండికి అడ్డంగా పడుకున్నాడు. ప్రవాహాన్ని అడ్డుకున్నాడు.
తెల్లవారింది. ధౌమ్యుమహర్షి ఆరుణిని వెతుక్కుంటూ పంటచేను దగ్గరికి వెళ్ళాడు. అడ్డంగా పడుకున్న ఆరుణి తడిసి, చలికి వణుకుతూ అక్కడే ఉన్నాడు. మహర్షి అతని దగ్గరికి వచ్చి పరిస్థితిని చూసి ఆశ్రమానికి తీసుకెళ్లాడు. సాయంత్రానికి ఆరుణి కోలుకున్నాడు. గురువు దగ్గరికి వచ్చి నమస్కారం చేశాడు. అప్పుడు దౌమ్యమహర్షి “నీ గురుభక్తి, కార్యదీక్ష వెలకట్టలేనిది” ! అని ఆరుణిని మెచ్చుకున్నాడు. ఇదంతా చూస్తున్న మిగతా శిష్యులు సిగ్గుతో తలవంచుకున్నారు. గురువుపై భక్తి ఉన్న వాళ్లకి ఆయన చెప్పిన ఏ పనీ కష్టంగా అనిపించదు. వాళ్ళు మంచి కార్యాలు చేస్తూ, ఉత్తమశిష్యులుగా అందరి మన్ననలు పొందుతారు.
జాజిపువు నాజూకు జజాము నవకంబు
మల్లెపువ్వుల పరీమళ పరీవాహంబు – తెలుగు భాష – రాయప్రోలు సుబ్బారావు