AP 7th Class Science Important Questions Chapter 2 పదార్థాల స్వభావం

These AP 7th Class Science Important Questions 2nd Lesson పదార్థాల స్వభావం will help students prepare well for the exams.

AP Board 7th Class Science 2nd Lesson Important Questions and Answers పదార్థాల స్వభావం

7th Class Science 2nd Lesson 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
యాసిడ్ అనుపదం ఏ భాష నుండి వచ్చింది?
జవాబు:
యాసిడ్ అనుపదం యాసర్ అను లాటిన్ పదం నుండి వచ్చింది. దీని అర్థం పులుపు.

ప్రశ్న 2.
ఆమ్ల పదార్థాలకు ఉదాహరణ తెలపండి.
జవాబు:
నిమ్మ, చింత, టమాట, యాపిల్, ఆమ్లాలను కల్గి ఉంటాయి.

ప్రశ్న 3.
విటమిన్ – సిను రసాయనికంగా ఏమని పిలుస్తారు?
జవాబు:
విటమిన్ – సి ను రసాయనికంగా ఆస్కార్బిక్ ఆమ్లం అంటారు.

ప్రశ్న 4.
విటమిన్ సి అధికంగా లభించే పదార్థాలు ఏమిటి?
జవాబు:
విటమిన్ సి నిమ్మజాతి పండ్లు, ఉసిరికాయలలో అధికంగా ఉంటుంది.

AP 7th Class Science Important Questions Chapter 2 పదార్థాల స్వభావం

ప్రశ్న 5.
సబ్బులు, టూత్ పేస్టు రసాయనికంగా ఏ ధర్మాన్ని కల్గి ఉంటాయి?
జవాబు:
సబ్బులు, టూత్ పేస్టు రసాయనికంగా క్షార ధర్మాన్ని కల్గి ఉంటాయి.

ప్రశ్న 6.
స్పర్శకు క్షారాలు ఎలా ఉంటాయి?
జవాబు:
స్పర్శకు క్షారాలు జారుడు స్వభావం కలిగి ఉంటాయి.

ప్రశ్న 7.
స్నానం చేసే సబ్బును దేనితో తయారు చేస్తారు?
జవాబు:
స్నానం చేసే సబ్బును పొటాషియం హైడ్రాక్సైడ్ తో తయారు చేస్తారు.

ప్రశ్న 8.
బట్టల సబ్బును దేనితో తయారు చేస్తారు?
జవాబు:
బట్టల సబ్బును సోడియం హైడ్రాక్సైడ్ తో తయారు చేస్తారు.

ప్రశ్న 9.
ఆల్కలీలు అనగా నేమి?
జవాబు:
నీటిలో కరిగే క్షారాలను ఆల్కలీలు అంటారు.

ప్రశ్న 10.
ఆల్కలీలకు ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, ఆల్కలీలకు ఉదాహరణ.

ప్రశ్న 11.
తటస్థ పదార్థాలు అనగానేమి?
జవాబు:
ఆమ్లము, క్షారము కాని పదార్థాలను తటస్థ పదార్థాలు అంటారు.

ప్రశ్న 12.
తటస్థ పదార్థాలకు ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
స్వేదనజలం, ఉప్పుద్రావణం, చక్కెర ద్రావణం మొదలైనవి తటస్థ పదార్థాలు.

ప్రశ్న 13.
సూచికలు అనగానేమి?
జవాబు:
ఆమ్ల క్షారాలను గుర్తించటంలో సహాయపడే పదార్థాలను సూచికలు అంటారు.

AP 7th Class Science Important Questions Chapter 2 పదార్థాల స్వభావం

ప్రశ్న 14.
ఋణ సూచికలు అనగా నేమి?
జవాబు:
కొన్ని పదార్థాలను ఆమ్ల, క్షార పదార్థాలతో కలిపినపుడు వాసనను ఇస్తాయి. వీటిని ఋణ సూచికలు అంటారు.
ఉదా : ఉల్లిరసం, లవంగనూనె.

ప్రశ్న 15.
ఆమ్ల క్షారాలను నిర్వచించిన శాస్త్రవేత్త ఎవరు?
జవాబు:
ఆర్జీనియస్ అను’ స్వీడన్ భౌతికశాస్త్రవేత్త ఆమ్ల క్షారాలను నిర్వచించినాడు.

ప్రశ్న 16.
లిట్మస్ కాగితం దేని నుండి తయారు చేస్తారు?
జవాబు:
లైకెన్స్ నుండి లిట్మస్ కాగితం తయారు చేస్తారు.

ప్రశ్న 17.
ఆమ్లంలో లోహపు ముక్కను వేస్తే ఏమౌతుంది?
జవాబు:
లోహపు ముక్కతో ఆమ్లాలు చర్య జరిపి హైడ్రోజన్‌ను విడుదల చేస్తాయి.

ప్రశ్న 18.
CO2 ను ఎలా నిర్ధారిస్తాము?
జవాబు:
CO2 మంటకు దోహదపడదు. మండుతున్న పుల్లను ఆర్పేస్తుంది.

ప్రశ్న 19.
తటస్థీకరణ చర్య అనగానేమి?
జవాబు:
ఆమ్లం, క్షారం మధ్య జరిగే రసాయన చర్యను తటస్థీకరణ చర్య అంటారు.

ప్రశ్న 20.
తటస్థీకరణ చర్యలో ఏమి ఏర్పడతాయి?
జవాబు:
తటస్థీకరణ చర్యలో లవణము, నీరు ఏర్పడతాయి.

AP 7th Class Science Important Questions Chapter 2 పదార్థాల స్వభావం

ప్రశ్న 21.
హైడ్రోజన్ బెలూన్ గాలిలో పైకి ఎగురుతుంది ఎందుకు?
జవాబు:
హైడ్రోజన్ గాలి కంటే తేలికైనది. అందువలన గాలిలో పైకి ఎగురుతుంది.

7th Class Science 2nd Lesson 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
మనకు లభించే కొన్ని ఆహారపదార్థాలను తెలిపి వాటిలోని ఆమ్లాల పేర్లు రాయండి.
జవాబు:

ఆహారం ఆమ్లము
1. నిమ్మకాయ సిట్రిక్ ఆమ్లం
2. చింతకాయ టార్టారిక్ ఆమ్లం
3. యాపిల్ మాలిక్ ఆమ్లం
4. టమాట ఆక్సాలిక్ ఆమ్లం
5. ఉసిరి ఆస్కార్బిక్ ఆమ్లం

ప్రశ్న 2.
నిత్య జీవితంలో ఉపయోగించే ఆమ్లాలు తెలపండి.
జవాబు:

  1. హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని,స్నానపు గదులను, టాయిలెట్లను శుభ్రం చేయటానికి వాడతాము.
  2. సల్య్ఫూరిక్ ఆమ్లాన్ని బ్యాటరీలు తయారీలో వాడతారు.
  3. కార్బోనిక్ ఆమ్లాన్ని శీతల పానీయాలు, సోడాల తయారీకి వాడతారు.
  4. ఫాటీ ఆమ్లాలను సబ్బు తయారీకి వాడతారు.

ప్రశ్న 3.
నిత్య జీవితంలో ఉపయోగించే క్షారాలను తెలపండి.
జవాబు:

  1. పొటాషియం హైడ్రాక్సైడ్ ఉపయోగించి స్నానం సబ్బును తయారు చేస్తారు.
  2. సోడియం హైడ్రాక్సైడ్ ఉపయోగించి బట్టల సబ్బు తయారు చేస్తారు.
  3. టూత్ పేస్ట్ తయారీలో అల్యూమినియం హైడ్రాక్సైడ్ వాడతారు.
  4. నేల ఆమ్లత్వాన్ని తగ్గించటానికి పొడిసున్నం లేదా పొటాషియం హైడ్రాక్సైడ్ వాడతారు.

ప్రశ్న 4.
సూచికలు, వాటి రకాలను పట్టిక రూపంలో తెలపండి.
జవాబు:

సూచిక ఉదాహరణ
1. సహజ సూచిక మందార, పసుపు
2. కృత్రిమ సూచిక మిథైల్ ఆరెంజ్
3. ఝణ సూచిక ఉల్లిరసం, వెనీలా
4. సార్వత్రిక సూచిక మిథైల్ రెడ్, బ్రోమో మిథైల్ బ్లూ

ప్రశ్న 5.
పసుపు కాగితం పట్టీ ఆమ్ల క్షార సూచికగా పనిచేస్తుందా?
జవాబు:
పసుపు కాగితం పట్టీ క్షార పదార్థాలలో ఎరుపు గోధుమ రంగుకు మారుతుంది. కాని ఆమ్లాలలో పసుపు రంగులోనే ఉంటుంది.

AP 7th Class Science Important Questions Chapter 2 పదార్థాల స్వభావం

ప్రశ్న 6.
మందార సూచిక ఎలా పని చేస్తుంది?
జవాబు:
మందార సూచిక నిమ్మరసం, వెనిగర్ వంటి ఆమ్లాలలో గులాబీరంగుకు మారును. సబ్బు మరియు సున్నపు నీరు వంటి క్షారాలలో ఆకుపచ్చగా మారును.

ప్రశ్న 7.
వివిధ సూచికలు ఆమ్ల క్షార ద్రావణాలలో ఎలా మారతాయో తెలపండి.
జవాబు:

సూచిక ఆమ్లం క్షారం
1. లిట్మస్ సూచిక నీలిరంగు ఎరుపురంగు
2. మిథైల్ ఆరంజ్ ఎరుపు పసుపు
3. ఫినాఫ్తలీన్ గులాబీరంగు
4. మందార గులాబీరంగు ఆకుపచ్చ
5. పసుపు ఎరుపు గోధుమ

ప్రశ్న 8.
మేజిషియన్సీ నిమ్మకాయను కోసి రక్తాన్ని తెప్పిస్తారు. ఎలా?
జవాబు:
మేజిషియన్లు నిమ్మకాయను చాకుతో కోసినప్పుడు అందులో నుంచి రక్తం వచ్చినట్లు నమ్మిస్తుంటారు. ఇలా చేయడం కొరకు వాళ్ళు కత్తికి ముందుగానే మిథైల్ ఆరంజ్ లేదా మందార పూల రసం వంటి సూచికతో పూతపూసి ఉంచుకుంటారు. ఆ కత్తితో నిమ్మకాయను కోసినప్పుడు చర్య జరిగి ఎర్రని నిమ్మరసం వస్తుంది.

ప్రశ్న 9.
pH స్కేలు అనగా నేమి ? దానిని ఎవరు ప్రవేశపెట్టారు?
జవాబు:
ఆమ్ల క్షారాల బలాలను pH స్కేలుతో కొలుస్తారు. ఈ స్కేలును సోరెన్ సేన్ అను శాస్త్రవేత్త కనుగొన్నాడు. దీని విలువ 0 నుండి 14 వరకు ఉంటుంది.

pH విలువ పదార్థ స్వభావం
7 కన్నా తక్కువ ఆమ్లము
7 కన్నా ఎక్కువ క్షారము
pH విలువ 7 తటస్థము

ప్రశ్న 10.
ఆమ్ల, క్షార బలాలను ఉదాహరణలో వివరించండి.
జవాబు:
చర్యాశీలత గాఢత అధికంగా ఉన్న రసాయనాలను బలమైన వాటిగా భావిస్తాము. చర్యాశీలత తక్కువగా ఉన్న రసాయనాలను బలహీనమైనవిగా భావిస్తాము.

పదార్థము ఉదా
1. బలహీన ఆమ్లం ఎసిటిక్ ఆమ్లం, సిట్రిక్ ఆమ్లం
2. బలమైన ఆమ్లం హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం
3. బలహీన క్షారం అమ్మోనియం హైడ్రాక్సైడ్
4. బలమైన క్షారం సోడియం హైడ్రాక్సైడ్

ప్రశ్న 11.
నిత్య జీవితంలో ఆమ్లాలు, క్షారాల ఉపయోగం తెలపండి.
జవాబు:
మన నిత్య జీవితంలో ఆమ్లాలు, క్షారాలు అనేక రకాలుగా ఉపయోగపడతాయి. శుభ్రపరిచే పదార్థాలుగా, తటస్థీకరణ ద్రావణాలుగా, నిలువచేయు పదార్థాలుగా, మరకలను తొలగించే పదార్థాలుగా, మందులుగా ఉపయోగపడతాయి.

AP 7th Class Science Important Questions Chapter 2 పదార్థాల స్వభావం

ప్రశ్న 12.
తటస్థీకరణ చర్యను వివరించండి.
జవాబు:
ఆమ్లము, క్షారములు ఒకదానితో ఒకటి చర్యపొందినపుడు వాటి స్వభావాలను కోల్పోతాయి. ఈ ప్రక్రియను తటస్థీకరణ చర్య అంటారు.

తటస్థీకరణ ఫలితంగా లవణము మరియు నీరు ఏర్పడతాయి.
ఆమ్లము + క్షారము → లవణము + నీరు

ప్రశ్న 13.
నిత్య జీవితంలో తటస్థీకరణ చర్యకు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:

  • ఎసిడిటీని నివారించటానికి ఉపయోగించే యాంటాసి లు క్షార పదార్థాలు. ఇవి ఆమ్లంతో చర్యపొంది తటస్థీకరణ చేయుట వలన మనకు ఉపశమనం కల్గును.
  • చీమ లేదా తేనెటీగ కుట్టినప్పుడు అది ఫార్మిక్ ఆమ్లాన్ని చర్మంలోనికి పంపిస్తుంది. దీనిని తటస్థీకరణ చేయుటకు, బేకింగ్ సోడాతో రుద్దుతారు.
  • రసాయనిక ఎరువుల వలన నేల ఆమ్లత్వం పెరిగితే సున్నం చల్లి తటస్థీకరిస్తారు.
  • మట్టి క్షారత్వం కల్గి ఉంటే పశువుల ఎరువు వాడి తటస్థీకరణం చేస్తారు.

ప్రశ్న 14.
నేల pH స్వభావం మొక్కలపై ప్రభావం చూపుతుందా? వివరించండి.
జవాబు:
మీ దగ్గరలో గల పంటపొలాన్ని సందర్శించండి. పొలం నుండి మట్టి నమూనాను సేకరించండి. ఒక బీకరులో గాలిలో ఆరిన 10 గ్రా. సేకరించిన మట్టిని వేయండి. దానికి అరలీటరు నీటిని కలిపి బాగా కలియబెట్టండి. ద్రావణాన్ని వడకట్టండి. ఇప్పుడు వడకట్టిన ద్రావణాన్ని యూనివర్సల్ సూచిక లేదా pH పేపరుతో పరీక్షించండి. ఈ పరీక్ష ద్వారా మట్టి స్వభావం తెలుస్తుంది.

ప్రశ్న 15.
భారతదేశంలో అనాదిగా పళ్ళు తోమటానికి వేప పుల్లలు వాడతారు ఎందుకు?
జవాబు:
వేప, మిస్వాక్, గానుగ పుల్లలను భారతదేశంలో అనాదిగా దంతదావనానికి వినియోగిస్తున్నాము. కారణం వాటిలో క్షార లక్షణాలు గల పదార్థాలు ఉన్నాయి. ఈ క్షారాలు నోటిలోని బ్యాక్టీరియా విడుదల చేసే ఆమ్లాలను తటస్థీకరిస్తాయి. ఇవి బ్యాక్టీరియా, ఫంగస్లను హరించడమేకాక నొప్పి నివారిణులుగా కూడా పనిచేస్తాయి.

ప్రశ్న 16.
నిత్య జీవితంలో వాడే కొన్ని ఆమ్లాలు వాటి ఉపయోగాలు పట్టిక రూపంలో రాయండి.
జవాబు:

ఆమ్లం పేరు ఉపయోగాలు
1. వెనిగర్ (అసిటిక్ ఆమ్లం) ఆహార పదార్థాల తయారీ, నిల్వ
2. సిట్రిక్ ఆమ్లం ఆహార పదార్థాల నిల్వ, శీతల పానీయాలు
3. నత్రిక్ ఆమ్లం మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లం రసాయన ఎరువులు, ‘రంగులు, అద్దకాలు మొ.నవి తయారీ
4. సల్ఫ్యూరిక్ ఆమ్లం వాహనాల బ్యాటరీలు
5. టానిక్ ఆమ్లం సిరా తయారీ మరియు తోలు పరిశ్రమలు

ప్రశ్న 17.
నిత్య జీవితంలో వాడే కొన్ని క్షారాలను, వాటి ఉపయోగాలు పట్టిక రూపంలో రాయండి.
జవాబు:

క్షారం పేరు ఉపయోగాలు
1. కాల్షియం హైడ్రాక్సైడ్ నేలలోని క్షారతను తటస్థీకరిస్తుంది. గోడల సున్నము
2. మెగ్నీషియం హైడ్రాక్సైడ్
(మిల్క్ ఆఫ్ మెగ్నీషియం)
ఆంటాసిడ్ మరియు విరోచనకారి
3. అమ్మోనియం హైడ్రాక్సైడ్ కిటికీలు మొదలగునవి శుభ్రపరచడానికి
4. సోడియం హైడ్రాక్సైడ్ పేపరు, సబ్బులు, డిటర్జెంట్ల ఉత్పత్తి కొరకు
5. పొటాషియం హైడ్రాక్సైడ్ సబ్బులు మరియు బ్యాటరీల ఉత్పత్తి కొరకు

ప్రశ్న 18.
సబ్బు ఎలా తయారు చేస్తారు ? దాని ప్రయోజనం ఏమిటి?
జవాబు:
సబ్బు అనేది క్షార స్వభావం గల లవణం. దీనిని కొబ్బరినూనె వంటి ఫ్యాటీ ఆమ్లాలను సోడియం హైడ్రాక్సైడ్ లేదా పొటాషియం హైడ్రాక్సైడ్ వంటి ఆల్కలీలకు కలిపి తయారుచేస్తారు. బట్టల సబ్బు సోడియం హైడ్రాక్సైడ్ను కలిగి ఉంటుంది. శరీర శుభ్రతకు వినియోగించే సబ్బు పొటాషియం హైడ్రాక్సైడ్ను కలిగి ఉంటుంది. జింక్ హైడ్రాక్సెడ్ అనేది ఒక క్షారం. కానీ ఆల్కలీ కాదు. దీనిని సౌందర్య సాధనాలలో వినియోగిస్తారు. అన్ని ఆల్కలీలు క్షారాలే కానీ అన్ని క్షారాలు ఆల్కలీలు కాదు.

AP 7th Class Science Important Questions Chapter 2 పదార్థాల స్వభావం

ప్రశ్న 19.
రసాయనాలను ఉపయోగిస్తున్నపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?
జవాబు:

  1. రుచి, వాసన చూడరాదు. శరీరంపై పడకుండా చూసుకోవాలి.
  2. ఆమ్లాలను సీసాల నుండి తీసేటప్పుడు డ్రాపర్లను వినియోగించాలి.
  3. ఆమ్లాలకి నీటిని కలిపేటప్పుడు తగినంత నీటిని ముందుగా బీకరులో తీసుకొని దానికి ఆమ్లాన్ని కొద్దికొద్దిగా కలపాలి.
  4. పరీక్షనాళికలను హెల్డర్లతో పట్టుకోవాలి.
  5. పదార్థాలను వినియోగించే ముందు ఆ సీసాపై వున్న సూచనలను చదవాలి.

ప్రశ్న 20.
రసాయనాల వలన శరీరం కాలినపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?
జవాబు:

  1. ప్రథమ చికిత్సను వెంటనే మొదలుపెట్టాలి.
  2. కాలిన వ్యక్తి నుండి రసాయనాలు పడిన దుస్తులను తొలగించాలి.
  3. కాలిన చోట ఎక్కువ నీటితో కడగాలి.
  4. కాలిన బొబ్బలను చిదమరాదు.
  5. వీలైనంత తొందరగా వ్యక్తిని ఆసుపత్రికి తరలించాలి.

ప్రశ్న 21.
ఆమ్ల వర్షాలు గురించి రాయండి.
జవాబు:

  1. ఆమ్ల స్వభావం కలిగిన వర్షాలను ఆమ్ల వర్షాలు అంటారు.
  2. ఆమ్ల వర్షాలకు వాయు కాలుష్యం ప్రధాన కారణం.
  3. బొగ్గు మరియు పెట్రోలును మండించినపుడు అవి SO<sub>2</sub>, NO<sub>2</sub> లను ఏర్పరుస్తాయి.
  4. ఇవి వర్షపు నీటిలో కలిసి ఆమ్లంగా మారి భూమిని చేరతాయి.
  5. వీటి వలన పంట నష్టం, చారిత్రాత్మక కట్టడాలు దెబ్బతినడం జరుగుతుంది.

7th Class Science 2nd Lesson 8 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
క్రింది ద్రావణాలను పరీక్షనాళికలలో తీసుకోండి. వీటిని 1) ఎర్ర లిట్మస్ 2) నీలి లిట్మస్ 3) మిథైల్ ఆరెంజ్ 4) ఫినాఫ్తలిన్ సూచికలతో పరీక్షించి పట్టిక రూపంలో రాయండి.
జవాబు:
AP 7th Class Science Important Questions Chapter 2 పదార్థాల స్వభావం 1

AP Board 7th Class Science 2nd Lesson 1 Mark Bits Questions and Answers పదార్థాల స్వభావం

I. బహుళైచ్ఛిక ప్రశ్నలు

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

1. క్రిందివానిలో ఆమ్ల స్వభావం లేనిది?
A) నిమ్మకాయ
B) కుంకుడుకాయ
C) ఉసిరికాయ
D) టమాట
జవాబు:
B) కుంకుడుకాయ

2. శీతల పానీయంలోని ఆమ్లం
A) సల్ఫ్యూరిక్ ఆమ్లం
B) హైడ్రోక్లోరిక్ ఆమ్లం
C) కార్బొనిక్ ఆమ్లం
D) వెనిగర్
జవాబు:
C) కార్బొనిక్ ఆమ్లం

3. సూచికలలోని రకాలు
A) 1
B) 2
C) 3
D) 4
జవాబు:
D) 4

4. ఝణ సూచికలు
A) మందార
B) ఫినాఫ్తలీన్
C) లవంగనూనె
D) మిథైల్ లెడ్
జవాబు:
C) లవంగనూనె

AP 7th Class Science Important Questions Chapter 2 పదార్థాల స్వభావం

5. లైకెన్స్ దేని తయారీలో వాడతారు?
A) లిట్మస్
B) మిథైల్ బ్లూ
C) తటస్థీకరణ
D) ఝణ సూచిక
జవాబు:
A) లిట్మస్

6. ఫినాఫ్తలీన్ చర్య చూపునది
A) ఆమ్లాలు
B) క్షారాలు
C) రెండూ
D) తటస్థ పదార్థాలు
జవాబు:
A) ఆమ్లాలు
B) క్షారాలు

7. క్రిందివానిలో బలమైన ఆమ్లము
A) సిట్రస్ ఆమ్లం
B) ఎసిటిక్ ఆమ్లం
C) సల్ఫ్యూరిక్ ఆమ్లం
D) మాలిక్ ఆమ్లం
జవాబు:
C) సల్ఫ్యూరిక్ ఆమ్లం

8. గాలి కంటే తేలికైన వాయువు
A) హైడ్రోజన్
B) నైట్రోజన్
C) ఆక్సిజన్
D) CO<sub>2</sub>
జవాబు:
A) హైడ్రోజన్

9. తటస్థీకరణ చర్యలో ఏర్పడునవి
A) లవణము
B) నీరు
C) రెండూ
D) ఆమ్లము
జవాబు:
C) రెండూ

10. లవణానికి ఉదాహరణ
A) ఉప్పు
B) సబ్బు
C) టూత్ పేస్ట్
D) లవంగనూనె
జవాబు:
A) ఉప్పు

11. జీర్ణాశయంలోని ఆమ్లం
A) సల్ఫ్యూరిక్ ఆమ్లం
B) హైడ్రోక్లోరిక్ ఆమ్లం
C) నత్రికామ్లం
D) కార్బొనిక్ ఆమ్లం
జవాబు:
B) హైడ్రోక్లోరిక్ ఆమ్లం

12. కందిరీగ కుట్టిన చోట రాసే పదార్థం
A) బేకింగ్ సోడా
B) ఉప్పు
C) సున్నం
D) పసుపు
జవాబు:
A) బేకింగ్ సోడా

13. క్షారాల pH అవధి
A) 0-14
B) 0-7
C) 8-14
D) 6-8
జవాబు:
C) 8-14

14. ఆమ్ల వర్షానికి కారణమయ్యే ఆక్సైడ్లు
A) SO2
B) NO2
C) రెండూ
D) H2SO4
జవాబు:
C) రెండూ

AP 7th Class Science Important Questions Chapter 2 పదార్థాల స్వభావం

15. మట్టి స్వభావాన్ని బట్టి రంగు మారే పుష్పాలు
A) హైడ్రాంజియా
B) బంతి
C) హైబిస్కస్
D) జాస్మిన్
జవాబు:
A) హైడ్రాంజియా

II. ఖాళీలను పూరించుట కింది ఖాళీలను పూరింపుము.

1. ……….. ఆమ్లాలు బలహీనమైన ఆమ్లాలు.
2. బ్యాటరీ తయారీలో వాడే ఆమ్లం ………….
3. రసాయనికంగా టూత్ పేస్టు ………. స్వభావం కల్గి ఉంటాయి.
4. ఆమ్లం, అనే పదం ……………….. అనే లాటిన్ పదం నుండి వచ్చినది.
5. పుల్లటి ఆహారం విటమిన్ …………….. ను కల్గి ఉంటాయి.
6. శీతల పానీయాలలో ఉండే ఆమ్లం ………….
7. …………….. జారుడు స్వభావం కల్గి ఉంటాయి.
8. నీటిలో కరిగే క్షారాలను …………….. అంటారు.
9. పదార్థాలను ఆమ్ల క్షార పదార్థాలుగా వర్గీకరించినది ……………….
10. తటస్థ పదార్థాలు …………….., …………….. .
11. ఆమ్ల క్షారాలను గుర్తించటానికి తోడ్పడునవి ……………….
12. లిట్మస్ సూచికను ……………. నుండి తయారుచేస్తారు.
13. సహజ సూచికలు …………………., ……………….. .
14. మందారం సూచిక ఆమ్లాలలో ………………. కు క్షారాలలో …………… రంగుకు మారుతుంది.
15. ఋణ సూచికలు ……………, ………………
16. ఫినాఫ్తలీన్ సూచిక క్షారాలతో …………… రంగుకు మారుతుంది.
17. రసాయనాల బలం ……………… ఆధారంగా నిర్ణయిస్తాము.
18. తటస్థ ద్రావణాల pH విలువ …………………
19. ఆమ్లాలు లోహాలతో చర్య జరిపి …………………. విడుదల చేస్తాయి.
20. ఆమ్ల క్షారాల మధ్య రసాయన చర్య …
21. పచ్చళ్ళను ………………. పాత్రలలో నిల్వ చేస్తారు.
22. మంటలను ఆర్పే వాయువు ……..
23. తటస్థీకరణంలో ఏర్పడే పదార్థాలు …………….
24. రసాయనికంగా యాంటాసిడ్లు ……………….
25. యాంటాసిడ్ లోని రసాయన పదార్థం ……………
26. తేనెటీగ కుట్టినపుడు …………………. విడుదల అవుతుంది.
27. మట్టి స్వభావం బట్టి పూలరంగులను మార్చే మొక్క
28. తాజ్ మహల్ వంటి చారిత్రాత్మక కట్టడాలు ………… వలన దెబ్బతింటున్నాయి.
29. ఆహారపదార్థాల తయారీ నిల్వకు వాడే ఆమ్లం ………
30. చర్మ సౌందర్యాలలో ఉపయోగించే క్షారం ……….
జవాబు:

  1. సహజ
  2. సల్ఫ్యూరిక్ ఆమ్లం
  3. క్షార
  4. ఏసిర్
  5. విటమిన్-సి
  6. కార్బొనిక్ ఆమ్లం
  7. క్షారాలు
  8. ఆల్కలీలు
  9. ఆర్జీనియస్
  10. మంచినీరు, ఉప్పునీరు
  11. సూచికలు
  12. లైకెన్
  13. మందార, పసుపు
  14. గులాబీరంగు, ఆకుపచ్చ
  15. ఉల్లిరసం,లవంగనూనె
  16. పింక్
  17. pH
  18. 7
  19. హైడ్రోజన్
  20. తటస్థీకరణ
  21. పింగాణి
  22. CO2
  23. లవణము, నీరు
  24. క్షారాలు
  25. మెగ్నీషియం హైడ్రాక్సైడ్
  26. పార్మిక్ ఆమ్లం
  27. హైడ్రాంజియా
  28. ఆమ్ల వర్షం
  29. వెనిగర్
  30. జింక్ హైడ్రాక్సైడ్

III. జతపరుచుట

కింది వానిని జతపరుచుము.

1.

Group – A Group – B
A) హైడ్రాంజియా 1) వాయుకాలుష్యం
B) వేప 2) నేల pH స్వభావం
C) pH స్కేలు 3) దంతధావనం
D) నత్రికామ్లం 4) ఎరువుల తయారీ
E) ఆమ్ల వర్షం 5) సోరెన్ సేన్
6) వాహనాల బ్యాటరీ

జవాబు:

Group – A Group – B
A) హైడ్రాంజియా 2) నేల pH స్వభావం
B) వేప 3) దంతధావనం
C) pH స్కేలు 5) సోరెన్ సేన్
D) నత్రికామ్లం 4) ఎరువుల తయారీ
E) ఆమ్ల వర్షం 1) వాయుకాలుష్యం

2.

Group – A Group – B
A) యాంటాసిడ్ 1) పార్మిక్ ఆమ్లం
B) కందిరీగ 2) లవణము, నీరు
C) తటస్థీకరణ 3) నీటిలో కరిగే క్షారాలు
D) ఋణ సూచిక 4) జీర్ణాశయం
5) మందార
6) లవంగనూనె

జవాబు:

Group – A Group – B
A) యాంటాసిడ్ 4) జీర్ణాశయం
B) కందిరీగ 1) పార్మిక్ ఆమ్లం
C) తటస్థీకరణ 2) లవణము, నీరు
D) ఋణ సూచిక 6) లవంగనూనె
E) ఆల్కలీలు 3) నీటిలో కరిగే క్షారాలు

Leave a Comment