These AP 6th Class Social Important Questions 5th Lesson సంచార జీవనం నుండి స్థిర జీవనం will help students prepare well for the exams.
AP Board 6th Class Social 5th Lesson Important Questions and Answers సంచార జీవనం నుండి స్థిర జీవనం
ప్రశ్న 1.
వేట, ఆహార సేకరణ సులభమైన విషయంగా నీవు భావిస్తున్నావా? అవును/కాదు. మీ జవాబును సమర్థించుము.
జవాబు:
ఈ వేట, ఆహార సేకరణ అంత సులభమైన విషయం కాదు. చెట్లు లేదా మొక్కల ద్వారా ఆహార సేకరణ చేయాలంటే వాటి భాగాలలో దేన్ని తింటారో తెలిసి ఉండాలి. పండ్లు ఏ కాలంలో పక్వానికి వస్తాయో తెలియాలి. వేటాడటానికి, ఆ ప్రాంతంలో సంచరించే జంతువులు, పక్షుల అలవాట్లు, జీవన విధానం వేటగాళ్ళకు తెలిసి ఉండాలి. వేటాడే సమయంలో అప్రమత్తత చురుకుదనం, ఏకాగ్రత ఉండాలి. ఈ విషయాలను ఆది మానవులు తమ పూర్వీకుల నుండి పాటల రూపంలో, కథల రూపంలో తెలుసుకునేవారు. వాటిని తమ సంతతికి తెలియ
జేసేవారు, ఆది మానవులు జంతు చర్మాలను, ఆకులను దుస్తులుగా వాడేవారు.
ప్రశ్న 2.
ఆది మానవులు సంచార జీవనం గడపటానికి కారణమేమిటి?
జవాబు:
ఆది మానవులు సంచార జీవనం గడిపేవారని మనం తెలుసుకున్నాం. ఒక ప్రాంతంలో మొక్కల ద్వారా, జంతువుల ద్వారా లభించే ఆహారం పూర్తిగా అయిపోయేంత వరకు వారు అక్కడే ఉండి తర్వాత ఆహారం కొరకు మరొక ప్రాంతానికి వెళ్ళేవారు. సాధారణంగా వివిధ కారణాల వల్ల జంతువులు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలస వెళుతుంటాయి. ఆహార అన్వేషణలో భాగంగా ఆది మానవులు వాటిని వేటాడుతూ వెళ్లేవారు. కొన్ని ప్రత్యేక కాలములోనే చెట్లు పండ్లనిస్తాయి. తమ మనుగడ కోసం, ఆహార సేకరణలో భాగంగా ఆది మానవులు పండ్లు దొరికే ప్రాంతానికి వెళ్లేవారు. మానవులు, జంతువులు, మొక్కలు జీవించడానికి నీరు అవసరం. వేసవి కాలంలో నీటి వనరులయిన సరస్సులు, కుంటలు, నదులు, ఎండిపోతాయి. కావున నీరు లభించే ప్రాంతానికి ఆది మానవులు వలస వెళ్లేవారు.
ప్రశ్న 3.
అది మానవులు నిప్పును దేనికి ఉపయోగించారు?
జవాబు:
ఆది మానవులు నిప్పును కనుగొన్నారు. నిప్పుతో ఆహారాన్ని వండుకొని తినే విధానానికి నాంది పలికింది. క్రూర మృగాలను తరిమివేయడానికి, తాము నివసించే గుహలలో వేడిని, వెలుగును నింపడానికి, చెక్కను గట్టిపరచి ఉపయోగించడానికి నిప్పు వారికి ఉపయోగపడింది. ఈ విధంగా నిప్పు ఆది మానవులకు అనేక విధాలుగా – ఉపయోగపడింది. కావున వారు నిప్పును పవిత్రంగా భావించారు.
ప్రశ్న 4.
ఆది మానవుల గురించి మనం ఎలా తెలుసుకోగలం?
జవాబు:
పురావస్తు తవ్వకాలలో లభించిన (దొరికిన) పనిముట్లు ద్వారా మనం ఆది మానవుల గురించి తెలుసుకోవచ్చు. వారు రాళ్లతోను, కర్రలతోనూ, ఎముకలతోనూ తయారు చేసిన పనిముట్లను విస్తృతంగా ఉపయోగించారు. ఈ పరికరాలను వారు జంతువుల చర్మం తీయడానికి, చర్మం శుభ్రం చేయడానికి ఉపయోగించారు. రాతి పనిముట్లను జంతువుల నివాసం ఎముకలు కోయడానికి వాడారు. భూమిలో నుంచి ఆహారంగా ఉపయోగించే దుంపలను, వేర్లను తవ్వి తీయడానికి ఈ పరికరాలను ఉపయోగించారు. జంతువుల వేటకు విల్లు, అంబులను (ధనుస్సు, బాణాలను) తయారు చేసుకొన్నారు. ఈ పరికరాలతో వారి వేట సులువుగా సాగేది.
ప్రశ్న 5.
పురావస్తు శాస్త్రవేత్తలు అంటే ఎవరు? ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలోని గుహల ప్రత్యేకత ఏమిటి?
జవాబు:
ప్రాచీన కాలంలో ప్రజలు నివసించిన ప్రదేశాలలో నేలను తవ్వినప్పుడు దొరికిన పురాతన సామగ్రి, ఎముకలు, పాత్రలు, భవనాలు, అవశేషాలను అధ్యయనం చేసేవారిని ‘పురావస్తు శాస్త్రవేత్తలు’ అంటారు. పురావస్తు శాస్త్రజ్ఞులు కర్నూలు జిల్లా గుహలలో ఆది మానవులకు చెందిన అనేక రాతి పనిముట్లను కనుగొన్నారు. ఈ జిల్లాలో బేతంచర్ల, బనగానపల్లె ప్రాంతాలలో కొన్ని వందల గుహలు ఉన్నాయి. విశ్రాంతి తీసుకోవడానికి, రాతి పనిముట్లను దాచుకోవడానికి ఈ గుహలను ఆదిమానవులు కొన్నివేల సంవత్సరాలు ఉపయోగించారు.
జంతువుల ఎముకలు, రాతి పనిముట్లు ముఖ్యంగా సూక్ష్మరాతి పరికరాలు, ఎముకలతో చేసిన పనిముట్లని, ఈ గుహలలో పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఎముకలతో చేసిన’ పనిముట్లు ఈ గుహలలో తప్ప భారత ఉపఖండంలో ఎక్కడా దొరకలేదు.
ప్రశ్న 6.
ఆది మానవుల చిత్రకళ గురించి నీకు ఏమి తెలుసు?
జవాబు:
ఆది మానవులు గుహలలోనూ, రాతి స్థావరాలలోనూ నివసించేవారు. గుహల గోడలపై, రాతిస్థావరాలపై ఆది మానవులు జంతువులను, వారు వేటాడే సంఘటనలనూ చిత్రించారు. వారు కొన్ని రకాల రంగు రాళ్లను పిండి చేసి, జంతువుల కొవ్వును కలిపి చిత్రాలు వేయడానికి అవసరమైన రంగులను తయారు చేసుకునేవారు. చిత్రించడానికి వెదురు కుంచెలను ఉపయోగించేవారు.
ప్రశ్న 7.
ఆది మానవుల కాలంలో ఏది వ్యవసాయానికి నాంది పలికింది?
జవాబు:
క్రమంగా పచ్చదనం విస్తరించడంతో ఏ ప్రాంతాలలో ఆహారానికి అనువైన మొక్కలు పెరుగుతున్నాయో, విత్తనా నుంచి కొత్త మొక్కలు ఎలా మొలకెత్తుతున్నాయో మానవులు, పరిశీలన చేయడం ప్రారంభించారు. తమకు కావలసిన గింజలను ఏరుకొని, వాటిని విత్తి, ఆహారపు మొక్కలుగా పండించడం క్రమక్రమంగా నేర్చుకున్నారు. ఇది వ్యవసాయానికి నాంది పలికింది. మానవులు వరి, గోధుమ, బార్లీ, పప్పులు, పెసలు, సెనగ, మునగ పంటలను పండించారు.
ప్రశ్న 8.
ఆది మానవులు సంచార జీవనం నుండి స్థిర జీవనంను ఎందుకు ఏర్పరచుకున్నారు?
జవాబు:
ఆది మానవులు వ్యవసాయం చేసే సమయంలో కొన్ని విషయాలు గమనించారు. విత్తనాల నుండి మొక్కలు రావడం, వాటి నుండి పంట చేతికి రావడానికి కొన్ని రోజులు, కొన్ని వారాలు, కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలు పడుతుందని గమనించారు. పంటలకు నీరు పెట్టడానికి, జంతువులు, పక్షుల నుండి వాటిని : కాపాడటానికి పంట పండే ప్రదేశాలలో ప్రజలు నివాసం ఏర్పరచుకున్నారు.
ప్రశ్న 9.
వ్యవసాయ, పశుపోషకులు ఉపయోగించిన పనిముట్ల గురించి వివరంగా తెల్పండి.
జవాబు:
ఆనాటి వ్యవసాయదారులకు అడవులను చదును చేయడానికి పనిముట్లు అవసరమయ్యాయి. వీటిని నవీన రాతి పనిముట్లుగా పురావస్తు శాస్త్రవేత్తలు అంటారు. ఆనాటి వ్యవసాయ దారులు అనువైన రాతిని మరొక రాతిపై సాన పెట్టడం ద్వారా గొడ్డళ్లు లాంటి పరికరాలను తయారు చేసుకొన్నారు. ఇలా సాన పెట్టిన గొడ్డళ్ళకు కొయ్య పెట్టి బిగించేవారు. వీటితో చెట్లను నరికేవారు. ఈ కొత్త రాతి పనిముట్లతో వ్యవసాయం చేసిన కాలాన్ని నవీన శిలాయుగం లేదా కొత్త రాతి యుగం అంటారు. రుబ్బురోలు, రోకలితో ధాన్యంను మరియు ఇతర మొక్కల ఉత్పత్తులు దంచేవారు.