These AP 6th Class Science Important Questions 6th Lesson అయస్కాంతంతో సరదాలు will help students prepare well for the exams.
AP Board 6th Class Science 6th Lesson Important Questions and Answers అయస్కాంతంతో సరదాలు
6th Class Science 6th Lesson 2 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
పిన్ హోల్డర్ మూత యొక్క పై కప్పుకు పిన్స్ ఎందుకు అతుక్కుంటాయి?
జవాబు:
పిన్ హెల్డర్ మూత యొక్క పై కప్పుకు అయస్కాంతం అమర్చబడి ఉంటుంది. అందువలన పిన్స్ మూతకు అతుక్కొని ఉంటాయి.
ప్రశ్న 2.
సహజ అయస్కాంతాలను ‘లీడింగ్ స్టోన్స్’ అని ఎందుకు పిలుస్తారు?
జవాబు:
సహజ అయస్కాంతాలను దిశను కనుగొనడానికి ఉపయోగిస్తారు, కాబట్టి వాటిని ‘లీడింగ్ స్టోన్’ లేదా ‘లోడ్ స్టోన్’ అని కూడా పిలుస్తారు.
ప్రశ్న 3.
అయస్కాంతం యొక్క ఏ భాగము నుండి ఇనుప రజను తొలగించటం కష్టంగా ఉంటుంది?
జవాబు:
అయస్కాంతము యొక్క చివరి భాగాలైన ధ్రువాల నుండి ఇనుప రజను తొలగించడం కష్టంగా ఉంటుంది.
ప్రశ్న 4.
అయస్కాంతం యొక్క ఏ ధర్మం ఉపయోగించి దిక్సూచి తయారు చేస్తారు?
జవాబు:
అయస్కాంతం యొక్క దిశా ధర్మం ఆధారంగా దిక్సూచి తయారు చేస్తారు.
ప్రశ్న 5.
అయస్కాంత దిక్సూచితో మనం తీసుకోవలసిన ప్రధాన జాగ్రత్త ఏమిటి?
జవాబు:
అయస్కాంత దిక్సూచిని అయస్కాంతానికి దూరంగా ఉంచాలి.
ప్రశ్న 6.
అయస్కాంతాన్ని రెండు ముక్కలుగా చేస్తే ఏమి జరుగుతుంది?
జవాబు:
అయస్కాంతాన్ని రెండు ముక్కలు చేస్తే ప్రతి ముక్క రెండు ధృవాలను ఏర్పర్చుకొని స్వతంత్ర అయస్కాంతాలుగా పనిచేస్తాయి.
ప్రశ్న 7.
వ్యర్థ పదార్థాల నుంచి లోహపు ముక్కలను ఎలా వేరు చేస్తావు?
జవాబు:
ఇనుము, ఉక్కు వంటి పదార్థాలను అయస్కాంతం ఆకర్షిస్తుంది, కావున అయస్కాంతం ఉపయోగించి వ్యర్థ పదార్థాల నుంచి లోహపు ముక్కలను వేరు చేస్తాను.
ప్రశ్న 8.
అయస్కాంతం ఉపయోగించి నీవు పడమర దిక్కుఎలా కనుగొంటావు?
జవాబు:
అయస్కాంతం దిశాధర్మం వల్ల ఉత్తర, దక్షిణ ధ్రువాలను చూపిస్తుంది. దానివలన నేను పడమర దిక్కును కనుక్కొంటాను.
ప్రశ్న 9.
ఒక వడ్రంగి పనిచేస్తూ ఇనుప మేకులను, స్కూలను, చెక్కపొట్టులో కలిపేశాడు. అతడికి నీవు ఏ విధంగా సహాయం చేయగలవు?
జవాబు:
అయస్కాంతం ఉపయోగించి ఇనుప మేకులను, స్కూలను చెక్క పొట్టు నుంచి సులభంగా వేరు చేస్తాను.
ప్రశ్న 10.
అయస్కాంత ప్రేరణ అంటే ఏమిటి?
జవాబు:
అయస్కాంతానికి దగ్గరగా ఉండటం వల్ల ఒక అయస్కాంత పదార్థం, అయస్కాంత ధర్మాన్ని పొందినట్లయితే . దానిని అయస్కాంత ప్రేరణ అంటారు.
ప్రశ్న 11.
అయస్కాంతానికి సరైన పరీక్ష ఏమిటి?
జవాబు:
అయస్కాంతానికి సరైన పరీక్ష వికర్షణ.
ప్రశ్న 12.
అయస్కాంతాల దిశాత్మక ధర్మం అంటే ఏమిటి?
జవాబు:
స్వేచ్ఛగా వ్రేలాడదీసిన అయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర మరియు దక్షిణ దిశలలో నిలబడుతుంది. అయస్కాంతాల యొక్క ఈ ధర్మాన్ని దిశాత్మక ధర్మం అంటారు.
ప్రశ్న 13.
విద్యుదయస్కాంత రైళ్లు ఏ సూత్రంపై పనిచేస్తాయి?
జవాబు:
విద్యుదయస్కాంత రైలు వికర్షణ సూత్రంపై పనిచేస్తుంది. వికర్షణను ఉపయోగించి అయస్కాంత వస్తువులను గాలిలో తేలేలా చేయవచ్చు.
ప్రశ్న 14.
గుర్రపునాడ అయస్కాంతం యొక్క రేఖాచిత్రాన్ని గీయండి.
జవాబు:
6th Class Science 6th Lesson 4 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
అయస్కాంత, అనయస్కాంత పదార్థాలు అనగానేమి?
జవాబు:
అయస్కాంతం చేత ఆకర్షించబడే పదార్థాలను అయస్కాంత పదార్థాలు అంటారు.
ఉదా : ఇనుము, ఉక్కు, నికెల్.
అయస్కాంతం చేత ఆకర్షింపబడని పదార్థాలను అనయస్కాంత పదార్థాలు అంటారు.
ఉదా : ప్లాస్టిక్, పేపరు.
ప్రశ్న 2.
అయస్కాంతం యొక్క ఏ భాగాల్లో ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది? దీనిని ఎలా నిర్ధారిస్తారు?
జవాబు:
అయస్కాంతం రెండు చివర ప్రాంతాలను ధృవాలు అంటారు. ఈ ధృవాలలో ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. అయస్కాంతాన్ని ఇనుప రజనులో ఉంచినపుడు ధృవాల వద్ద అధిక రజను ఉండటం గమనించవచ్చు.
ప్రశ్న 3.
అయస్కాంత ధ్రువాలు ఎప్పుడు ఆకర్షించుకుంటాయి?
జవాబు:
అయస్కాంతంలో రెండు రకాల ధృవాలు ఉంటాయి. వీటిని N మరియు S అంటారు. వేరువేరు ధ్రువాల మధ్య ఆకర్షణ ఉంటుంది. అంటే N – S ధ్రువాల మధ్య ఆకర్షణ ఉంటుంది.
ప్రశ్న 4.
అయస్కాంత ధ్రువాలు ఎప్పుడు వికర్షించుకుంటాయి?
జవాబు:
అయస్కాంతంలో రెండు రకాల ధృవాలు ఉంటాయి. వీటిని N మరియు S అంటారు. ఒకే రకమైన ధృవాల మధ్య వికర్షణ ఉంటుంది. అంటే N – N, S – S ధృవాల మధ్య వికర్షణ ఉంటుంది.
ప్రశ్న 5.
ఈ క్రింది పట్టిక పూరించండి.
ధృవాలు | వాటి పేరు | పరిశీలన |
ఉత్తరం – దక్షిణం | ఆకర్షణ | |
ఉత్తరం – ఉత్తరం | సజాతి ధృవాలు | |
దక్షిణం – ఉత్తరం | ఆకర్షణ |
జవాబు:
ధృవాలు | వాటి పేరు | పరిశీలన |
ఉత్తరం – దక్షిణం | విజాతి ధృవాలు | ఆకర్షణ |
ఉత్తరం – ఉత్తరం | సజాతి ధృవాలు | వికర్షణ |
దక్షిణం – ఉత్తరం | విజాతి ధృవాలు | ఆకర్షణ |
ప్రశ్న 6.
దండాయస్కాంతం యొక్క పటం గీసి, ధృవాలు గుర్తించండి.
జవాబు:
ప్రశ్న 7.
అయస్కాంత దిక్సూచి యొక్క ఉపయోగం ఏమిటి?
జవాబు:
- దిశలను కనుగొనడానికి అయస్కాంత దిక్సూచి ఉపయోగించబడుతుంది.
- ఇది ఎక్కువగా ఓడలు మరియు విమానాలలో ఉపయోగించబడుతుంది.
- పర్వతారోహకులు, సైన్యం మరియు ప్రజలు కూడా తెలియని ప్రదేశంలో దారి తప్పిపోకుండా ఒక దిక్సూచిని వాడతారు.
- దిక్సూచి అయస్కాంత దిశా ధర్మం ఆధారంగా పని చేస్తుంది.
ప్రశ్న 8.
అయస్కాంతాలతో ప్రయోగాలు చేయడానికి రజనీకి కొంత ఇనుప రజను అవసరం. వాటిని ఎలా సేకరించాలో ఆమెకు తెలియదు. ఇనుప రజను సేకరించే విధానాన్ని వివరించడం ద్వారా ఆమెకు సహాయం చేయండి.
జవాబు:
- అయస్కాంతాల ప్రయోగాలలో మనం ఇనుప రజను మళ్లీ మళ్లీ ఉపయోగించాలి.
- ఇసుక కుప్పలో ఒక అయస్కాంతాన్ని ఉంచి తిప్పడం ద్వారా మనం వీటిని సేకరించవచ్చు.
- ఇసుకలో ఉన్న చిన్న ఇనుము ముక్కలు అయస్కాంతానికి అంటుకుంటాయి.
- మనకు ఇసుక దొరకకపోతే మట్టి నేలలో కూడా ప్రయత్నించవచ్చు.
ప్రశ్న 9.
విజాతి ధృవాల మధ్య ఆకర్షణ, సజాతి ధృవాల మధ్య వికర్షణను ఎలా నిరూపించగలరు?
జవాబు:
- రెండు దండాయస్కాంతాలను తీసుకోండి.
- దండాయస్కాంతం యొక్క దక్షిణ ధృవం మరొక దండాయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువానికి దగ్గరగా తీసుకురండి. అవి వికర్షించుకొంటాయి.
- ఇప్పుడు దండాయస్కాంతం యొక్క ఉత్తర ధృవం మరొక దండాయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువానికి దగ్గరగా తీసుకురండి. అవి వికర్షించుకొంటాయి.
- దీనిని బట్టి ఒకే రకమైన ధృవాలు వికర్షించుకొంటాయి అని నిర్ధారించవచ్చు.
- ఇప్పుడు దండాయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువం మరొక దండాయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువానికి తీసుకురండి. అవి రెండు ఆకర్షించుకొంటాయి. దీనిని బట్టి విభిన్న ధృవాలు వికర్షించుకొంటాయి అని నిర్ధారించవచ్చు.
ప్రశ్న 10.
అయస్కాంతము తన లక్షణాలు ఎలా కోల్పోతుంది?
జవాబు:
- అయస్కాంతాలు వేడి చేయబడినా లేదా ఎత్తు నుండి పడిపోయినా లేదా సుత్తితో కొట్టినా వాటి లక్షణాలను కోల్పోతాయి.
- సెల్ ఫోన్, కంప్యూటర్, డి.వి.డిల దగ్గర ఉంచినప్పుడు అయస్కాంతాలు వాటి లక్షణాలను కోల్పోతాయి.
- అయస్కాంతాలను సరిగా నిల్వ చేయకపోతే తన లక్షణాలను కోల్పోయేలా చేస్తుంది.
ప్రశ్న 11.
అయస్కాంతాలను సరిగా నిల్వ చేయటం కోసం సూచనలు చేయండి.
జవాబు:
అయస్కాంతాలను సరైన విధానంలో భద్రపరచకపోతే, అవి వాటి స్వభావాన్ని కోల్పోతాయి. దండాయస్కాంతాలను భద్రపరిచేటప్పుడు వాటిని జతలుగా, వాటి విజాతి ధృవాలు ఒకవైపుకు ఉండేలా ఉంచాలి. ఈ రెండింటి మధ్యలో చెక్క ముక్కను ఉంచాలి. రెండు చివరలా మృదువైన ఇనుప ముక్కలను ఉంచాలి. గుర్రపు నాడ ఆకారపు అయస్కాంతానికి దాని రెండు ధృవాలను కలుపుతూ మృదువైన ఇనుప ముక్కను ఉంచవచ్చు.
ప్రశ్న 12.
సస్పెన్షన్ రైలు అంటే ఏమిటి? ఇది ఏ సూత్రంపై పనిచేస్తుంది?
జవాబు:
వికర్షణను ఉపయోగించడం ద్వారా మనం అయస్కాంత వస్తువులను గాలిలో తేలేలా చేయవచ్చు. విద్యుత్ అయస్కాంత రైలు అదే సూత్రంపై ఎగిరే రైలు పనిచేస్తుంది. విద్యుత్ అయస్కాంత రైలును సస్పెన్షన్ రైలు లేదా ఎగిరే రైలు (Maglev train) అని కూడా పిలుస్తారు. దీనికి డీజిల్ లేదా పెట్రోల్ అవసరం లేదు. ఈ సాంకేతికత, అత్యంత వేగవంతమైన రైళ్లను నడపడానికి అయస్కాంత ఆకర్షణ, వికర్షణ యొక్క ధర్మాన్ని ఉపయోగిస్తుంది. ఈ విద్యుదయస్కాంత రైలు అయస్కాంత లేవిటేషన్ సూత్రంపై పనిచేస్తుంది. అంటే వికర్షణను ఉపయోగించి అయస్కాంత వస్తువును గాలిలో నిలపటం.
ప్రశ్న 13.
సహజ అయస్కాంతాలు మరియు కృత్రిమ అయస్కాంతాల మధ్య తేడాలను వ్రాయండి.
జవాబు:
సహజ అయస్కాంతాలు | కృత్రిమ అయస్కాంతాలు |
1. ఇవి ప్రకృతిలో సహజంగా సంభవిస్తాయి. | 1. ఇవి మానవ నిర్మిత అయస్కాంతాలు. |
2. వీటిని వాటి ధాతువు నుండి పొందవచ్చు. | 2. ఇనుము వంటి అయస్కాంత పదార్థాల అయస్కాంతీకరణ ద్వారా వీటిని పొందవచ్చు. |
3. వీటికి ఖచ్చితమైన ఆకారం లేదు. | 3. రౌండ్, రింగ్, డిస్క్, హార్స్ షూ మొదలైన వివిధ ఆకారాలలో వీటిని తయారు చేస్తారు. |
4. వీటిని సీసపు రాళ్ళు లేదా అయస్కాంత శిలలు అంటారు. | 4. వీటి ఆకారాలను బట్టి, తయారీ విధానం బట్టి పేరు పెట్టారు. |
6th Class Science 6th Lesson 8 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
అయస్కాంతాల ఆవిష్కరణ కథను వివరించండి.
జవాబు:
- సుమారు 2500 సంవత్సరాల క్రితం గ్రీకు భాషలో మెగ్నీషియా అనే ప్రాంతంలో, మాగ్నస్ అనే గొర్రెల కాపరి నివసించేవాడు.
- ఒక రోజు తన మేకలు గడ్డి మేసుకుంటూ ఉండగా, అతను తన ఇనుప నాడా కలిగిన కర్ర మరియు ఇనుప మేకులు కొట్టబడిన చెప్పులు ఆ రాతిపై ఉంచి ఒక బండపై పడుకున్నాడు.
- అతను మేల్కొన్నప్పుడు, తన ఇనుప నాడా కలిగిన కర్ర రాయి మీద నిటారుగా నిలబడి ఉన్నట్లు అతను కనుగొన్నాడు. అతని ఇనుప మేకులు గల చెప్పులు కూడా రాయి మీద అతుక్కుపోయాయి.
- ఈ మాయాజాలం చూడటానికి గ్రామం మొత్తం అక్కడ సమావేశమైంది.
- ఈ సంఘటన గురించి ప్రజలు ఆశ్చర్యపోయారు. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను వివిధ మార్గాల్లో వ్యక్తం చేశారు.
- ప్రజలు దీనిని మాగ్నస్ కర్రను మాత్రమే కాకుండా, ఇనుముతో తయారు చేసిన అన్ని ఇతర వస్తువులను కూడా ఆకర్షిస్తుందని గమనించారు.
- ఈ రకమైన రాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కనుగొనబడ్డాయి.
- ఈ అయస్కాంత శిలలకు ‘అయస్కాంతాలు’ అని పేరు పెట్టారు మరియు ఈ ధాతువును మాగ్నస్ పేరు మీద ‘మాగ్నెటైట్’ అని పిలుస్తారు.
ప్రశ్న 2.
అయస్కాంత లక్షణాలపై చిన్న నివేదిక రాయండి.
జవాబు:
- అయస్కాంతాలు అయస్కాంత పదార్థాలను ఆకర్షిస్తాయి.
- అయస్కాంతం ఎల్లప్పుడూ రెండు ధృవాలను కలిగి ఉంటుంది. వీటి ఆకర్షణ సామర్థ్యం అయస్కాంతాలలోని ఇతర భాగాల కంటే ఎక్కువగా ఉంటుంది.
- అయస్కాంతము యొక్క అయస్కాంతాలను ఉత్తర మరియు దక్షిణ ధృవాలు అంటారు.
- సజాతి ధృవాలు (N – N, S – S) ఒకదానినొకటి వికర్షించుకోగా, విజాతి ధృవాలు (N – S, S – N) ఆకర్షించుకొంటాయి.
- స్వేచ్ఛగా వ్రేలాడతీసిన అయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర-దక్షిణ దిశలో నిలుస్తుంది.
- అయస్కాంతాలను వేడి చేయటం లేదా ఎత్తు నుండి పడవేయటం లేదా సుత్తితో కొట్టడం వల్ల వాటి లక్షణాలను కోల్పోతాయి.
ప్రశ్న 3.
దండాయస్కాంతం రెండు ధృవాలను కలిగి ఉందని మీరు ఎలా నిరూపించగలరు?
జవాబు:
లక్ష్యం :
దండాయస్కాంతం రెండు ధృవాలను కలిగి ఉందని నిరూపించడం
అవసరమైన పదార్థాలు :
ఇనుప రజను, కాగితం, దండాయస్కాంతం
విధానం :
కొంత ఇనుప రజనును ఒక కాగితంపై పరచండి. ఈ కాగితం క్రింద దండాయస్కాంతం ఉంచండి.
పరిశీలన :
ఏకరీతిలో వ్యాపించిన ఇనుప రజను దగ్గరికి వచ్చి కాగితం యొక్క రెండు చివరలలో పోగవటం గమనించవచ్చు. ఈ రెండు ప్రదేశాల మధ్య కొంత దూరంలో చెల్లాచెదురైన ఇనుప రజను గీతలుగా అమరి కనిపిస్తుంది.
ఫలితం :
దీనిని బట్టి దండాయస్కాంతం చివరలు అయస్కాంతం మధ్య భాగం కంటే ఎక్కువ ఇనుప రజనును ఆకర్షిస్తాయి. ఈ కృత్యం ద్వారా, ప్రతి దండాయస్కాంతం ఎల్లప్పుడూ రెండు చివరలను కలిగి ఉంటుందని మనం నిర్ధారించగలము. దీని ఆకర్షణ సామర్థ్యం దాని ఇతర భాగాల కంటే ఎక్కువ. ఈ చివరలను అయస్కాంతం యొక్క ధృవాలు అంటారు.
ప్రశ్న 4.
దండాయస్కాంతం యొక్క దిశాత్మక ధర్మాన్ని మీరు ఎలా ప్రదర్శించవచ్చు?
జవాబు:
లక్ష్యం : దండాయస్కాంతం యొక్క దిశాత్మక ధర్మాన్ని ప్రదర్శించడం.
అవసరమైన పదార్థాలు :
దండాయస్కాంతం, దారము, స్టాండ్ మరియు రంగు.
విధానం :
దండాయస్కాంతంను మధ్యలో కట్టిన దారము సహాయంతో స్వేచ్ఛగా వ్రేలాడతీయాలి. అయస్కాంతం అటు ఇటు తిరిగి చివరకు ఉత్తర-దక్షిణ దిశలో నిలబడుతుంది. ఉత్తరం వైపు ఉన్న అయస్కాంత చివరి భాగాన్ని రంగుతో గుర్తించండి. ఇప్పుడు అయస్కాంతాన్ని కొద్దిగా కదిలించి, మళ్ళీ కొంత సమయం వేచి ఉండండి.
పరిశీలన :
అయస్కాంతాలు ఎల్లప్పుడూ ఉత్తర-దక్షిణ దిశలలో నిలబడతాయి. ప్రతి సందర్భంలో రంగుతో గుర్తించబడిన ధృవము ఉత్తరం వైపు చూపుతుంది.
ఫలితం : గుర్తించబడిన ధృవమును అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం అంటారు. మరొక ధృవాన్ని, దక్షిణ దిశను సూచించే అయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువం అంటారు. అయస్కాంతాల యొక్క ఈ ధర్మాన్ని దిశా ధర్మం అంటారు.
ప్రశ్న 5.
మీ ప్రాంతంలో అందుబాటులో ఉన్న వివిధ రకాల అయస్కాంతాలను గీయండి.
జవాబు:
ప్రశ్న 6.
దిక్సూచి నిర్మాణము, పని చేయు విధానంను తెలపండి.
జవాబు:
అయస్కాంత దిక్సూచి నిర్మాణము :
- దిక్సూచి వృత్తాకారంలో ఉండే పలుచని రేకు డబ్బా.
- దీని అడుగు భాగాన ఉత్తరం (N), దక్షిణం (S), తూర్పు (E), పడమర (W) దిక్కులను తెలియబరిచే అక్షరాలు రాసి ఉంటాయి.
- అడుగుభాగం మధ్యలో గల సన్నని మొనపై స్వేచ్ఛగా, గుండ్రంగా తిరిగేట్లుగా పలుచని అయస్కాంత సూచి అమర్చి ఉంటుంది.
- ఈ మొత్తం అమరికమీద పలుచని పారదర్శకపు గాజుబిళ్లతో డబ్బా మూసేసి ఉంటుంది. (పటం చూడండి)
ఉపయోగించే విధానము :
- ఏ ప్రదేశంలో దిక్కులను తెలుసుకోవాలో అక్కడ ఈ దిక్సూచిని ఉంచితే అందులోని అయస్కాంత సూచి ఉత్తర, దక్షిణ దిక్కులను సూచిస్తూ ఆగుతుంది.
- అప్పుడు దిక్సూచిని గుండ్రంగా తిప్పుతూ దాని అడుగుభాగంలో రాసివున్న N, S అక్షరాలు, అయస్కాంత సూచిక కొనల వద్దకు చేరేటట్లు చేయాలి.
- దిక్సూచిలో అయస్కాంత సూచిక ఉత్తరధృవాన్ని తెలుసుకోడానికి వీలుగా ఆ కొనకు ప్రత్యేకమైన రంగువేసి ఉంటుంది. (పటంలో చూడండి)
- అప్పుడు ఆ ప్రదేశంలో ఉత్తర, దక్షిణ దిక్కులు తెలుస్తాయి.
- ఆ తర్వాత వాటి మధ్య తూర్పు, పడమరలను కూడా మనం గుర్తించవచ్చు.
దిక్సూచి ఉపయోగాలు :
- ఏ ప్రదేశంలోనైనా దిక్కులను తెలుసుకోడానికి మనం ఈ దిక్సూచిని వాడుతాం.
- ఎక్కువగా దీన్ని ఓడలలోనూ, విమానాలలోనూ వాడతారు.
- అదే విధంగా పర్వతారోహకులు, మిలటరీ జవాన్లు కూడా కొత్త ప్రదేశాలలో ప్రయాణించవలసిన మార్గపు దిక్కును తెలుసుకోడానికి విరివిగా ఉపయోగిస్తారు.
AP Board 6th Class Science 6th Lesson 1 Mark Bits Questions and Answers అయస్కాంతంతో సరదాలు
I. బహుళైచ్ఛిక ప్రశ్నలు
కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.
1. ఈ క్రింది వానిలో సహజ అయస్కాంతము
A) రాక్ స్టోన్
B) లోడ్ స్టోన్
C) బంగారం
D) ఏదీ కాదు
జవాబు:
B) లోడ్ స్టోన్
2. ఈ క్రింది వానిలో ఏది అయస్కాంతము చేత ఆకర్షించబడదు?
A) ఇనుము
B) అయస్కాంతం
C) బంగారం
D) నికెల్
జవాబు:
C) బంగారం
3. అయస్కాంతం చేత ఆకర్షింపబడని పదార్థాలను ఏమంటారు?
A) అయస్కాంత పదార్థాలు
B) అనయస్కాంత పదార్థాలు
C) ధృవము
D) అన్నీ
జవాబు:
B) అనయస్కాంత పదార్థాలు
4. స్వేచ్ఛగా వేలాడతీయబడిన అయస్కాంతం ఏ దిక్కును చూపిస్తుంది?
A) తూర్పు, పడమర
B) పడమర, ఉత్తరం
C) ఉత్తరం, తూర్పు
D) ఉత్తరం, దక్షిణం
జవాబు:
D) ఉత్తరం, దక్షిణం
5. అయస్కాంత ధృవాల సంఖ్య
A) 3
B) 1
C) 2
D) 4
జవాబు:
C) 2
6. ప్రాచీన కాలంలో నావికులు దిక్కులు తెలుసుకోవటానికి దేనిని ఉపయోగించేవారు?
A) చెక్క
B) క్లాత్
C) రాయి
D) సహజ అయస్కాంతం
జవాబు:
D) సహజ అయస్కాంతం
7. జాతి ధ్రువాలు
A) ఆకర్షించుకుంటాయి
B) వికర్షించుకుంటాయి
C) A & B
D) ఏదీకాదు
జవాబు:
B) వికర్షించుకుంటాయి
8. అయస్కాంతంలోని ఏ ధృవాలు ఆకర్షించుకుంటాయి?
A) సతి ధ్రువాలు
B) విజాతి ధ్రువాలు
C) రెండూ
D) ఏదీకాదు
జవాబు:
B) విజాతి ధ్రువాలు
9. సహజ అయస్కాంత ఆకారాన్ని గుర్తించండి.
A) దండ
B) డిస్క్
C) సూది
D) ఖచ్చితమైన ఆకారం లేదు
జవాబు:
D) ఖచ్చితమైన ఆకారం లేదు
10. దేనిని టి.విలు, సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలి?
A) ప్లాస్టిక్
B) చెక్క
C) తీగ
D) అయస్కాంతం
జవాబు:
D) అయస్కాంతం
11. అయస్కాంతంచే ఆకర్షించే పదార్థాలను ఏమంటారు?
A) అనయస్కాంత పదార్థాలు
B) అయస్కాంత పదార్థాలు
C) ప్లాస్టిక్ పదార్థాలు
D) చెక్క
జవాబు:
B) అయస్కాంత పదార్థాలు
12. కింది వాటిలో ఏది అయస్కాంతం ద్వారా ఆకర్షించబడుతుంది?
A) చెక్క ముక్క
B) సాదా పిన్స్
C) ఎరేజర్
D) ఒక కాగితపుముక్క
జవాబు:
B) సాదా పిన్స్
13. అయస్కాంతాలను ఏమి చేసినపుడు వాటి లక్షణాలను కోల్పోతాయి?
A) ఉపయోగించినపుడు
B) నిల్వ చేసినపుడు
C) వేడిచేసినపుడు
D) శుభ్రం చేసినపుడు
జవాబు:
C) వేడిచేసినపుడు
14. దిక్సూచిని తయారుచేయటానికి అయస్కాంతము యొక్క ఏ ధర్మము ఉపయోగపడుతుంది?
A) జంట నియమం
B) ధృవ నియమం
C) దిశా ధర్మం
D) ప్రేరణ
జవాబు:
C) దిశా ధర్మం
15. దిక్కులు తెలుసుకోవటానికి ఉపయోగించే పరికరము
A) ఇనుప కడ్డీ
B) బంగారం
C) దిక్సూచి
D) దండాయస్కాంతం
జవాబు:
C) దిక్సూచి
16. అనయస్కాంత పదార్థానికి ఉదాహరణ
A) కాగితం
B) ఇనుము
C) ఉక్కు
D) నికెల్
జవాబు:
A) కాగితం
17. అయస్కాంతం యొక్క ధాతువు
A) కార్నలైట్
B) మాగ్న టైట్
C) అయస్కాంత ప్రేరణ
D) అనయస్కాంత డిప్
జవాబు:
B) మాగ్న టైట్
18. అయస్కాంతాన్ని వేడిచేస్తే అది
A) విరిగిపోతుంది
B) కరిగిపోతుంది
C) అయస్కాంతత్వం కోల్పోతుంది
D) రంగు మారుతుంది.
జవాబు:
C) అయస్కాంతత్వం కోల్పోతుంది
19. విద్యుదయస్కాంత రైలు ఏ సూత్రంపై పనిచేస్తుంది?
A) అయస్కాంత ఆకర్షణ
B) దిశా ధర్మము
C) అయస్కాంత ప్రేరణ
D) అయస్కాంత లెవిటేషన్
జవాబు:
D) అయస్కాంత లెవిటేషన్
20. “అయస్కాంతం” పేరు ….. పేరు మీద పెట్టబడింది.
A) గ్రీస్
B) మాగ్నస్
C) మెగ్నీషియా
D) మాగ్నెటైట్
జవాబు:
B) మాగ్నస్
21. సరైన వ్యాఖ్యను గుర్తించండి.
X) అయస్కాంతాలు సెల్ ఫోన్ దగ్గర ఉంచినప్పుడు వాటి లక్షణాలను కోల్పోతాయి.
Y) సెల్ ఫోన్ అయస్కాంతం దగ్గర ఉంచినప్పుడు అయస్కాంత క్షేత్రం ద్వారా ప్రభావితమవుతుంది.
A) X మాత్రమే సరైనది
B) Y మాత్రమే సరైనది
C) రెండూ సరైనవి
D) రెండూ తప్పు
జవాబు:
C) రెండూ సరైనవి
II. ఖాళీలను పూరించుట కింది ఖాళీలను పూరింపుము.
1. లోడ్ స్టోన్ ………….. అయస్కాంతం.
2. మానవ నిర్మిత అయస్కాంతాలను ………. అంటారు.
3. …………. అయస్కాంతం యొక్క ధాతువు.
4. ఇనుప ముక్కను అయస్కాంతంగా మార్చే పద్ధతిని ……………. అంటారు.
5. ఆకర్షించే సామర్థ్యం ఒక అయస్కాంతం యొక్క …………. వద్ద అధికము.
6. అయస్కాంతాల యొక్క ………….. ధర్మం ఆధారంగా దిక్సూచి అభివృద్ధి చేయబడింది.
7. ……………. కనుగొనడానికి ఒక దిక్సూచి ఉపయోగించబడుతుంది.
8. అయస్కాంత పదార్థం దగ్గర ఒక అయస్కాంతం ఉండటం వల్ల అయస్కాంతంగా మారే ధర్మాన్ని ………… అంటారు.
9. ఒక వసువు దండాయస్కాంతం యొక్క ఒక ధ్రువం ద్వారా ఆకర్షించబడి, దాని మరొక ధృవం ద్వారా వికర్షించబడితే, అది ఒక ………….
10. ఒక వస్తువు దండాయస్కాంతం యొక్క రెండు ధ్రువాలచే ఆకర్షించబడి, ఏ ధ్రువంతోను వికర్షించ బడకపోతే, అది ఒక ……………
11. ఒక వస్తువు అయస్కాంతం ద్వారా ఆకర్షించబడక లేదా దాని ద్వారా వికరించబడకపోతే, అది ఒక ………………..
12. ………… వలన అయస్కాంతాలు వాటి లక్షణాలను కోల్పోతాయి.
13. అయస్కాంతాలు …………. దగ్గర ఉంచినప్పుడు వాటి లక్షణాలను కోల్పోతాయి.
14. విద్యుదయస్కాంత రైలును ………… అని కూడా పిలుస్తాము.
15. విద్యుదయస్కాంత రైలు ………….. ధర్మాన్ని ఉపయోగించి నడుస్తుంది.
జవాబు:
- సహజ
- కృత్రిమ అయస్కాంతాలు
- మాగ్నెటైట్
- అయస్కాంతీకరణ
- ధృవాలు
- దిశాధర్మం
- దిక్కులు
- అయస్కాంత ప్రేరణ
- అయస్కాంతం పదార్థం
- అయస్కాంత పదార్థం
- అనయస్కాంత పదార్ధం
- వేడి చేయటం
- టీవీలు, సెల్ ఫోన్లు
- ఎగిరే రైలు
- వికర్షణ
III. జతపరుచుట
కింది వానిని జతపరుచుము.
1.
Group – A | Group – B |
ఎ) మాగ్నెటైట్ | 1) ఉత్తర – దక్షిణ |
బి) లీడింగ్ స్టోన్ | 2) అయస్కాంతానికి మరో పేరు |
సి) అయస్కాంత ధ్రువాలు | 3) దిక్కులు చూపించేది |
డి) కంపాస్ | 4) అయస్కాంతంగా ప్రవర్తించడం |
ఇ) అయస్కాంత ప్రేరణ | 5) అయస్కాంతం కనుగొన్న ప్రదేశం |
జవాబు:
Group – A | Group – B |
ఎ) మాగ్నెటైట్ | 5) అయస్కాంతం కనుగొన్న ప్రదేశం |
బి) లీడింగ్ స్టోన్ | 2) అయస్కాంతానికి మరో పేరు |
సి) అయస్కాంత ధ్రువాలు | 1) ఉత్తర – దక్షిణ |
డి) కంపాస్ | 3) దిక్కులు చూపించేది |
ఇ) అయస్కాంత ప్రేరణ | 4) అయస్కాంతంగా ప్రవర్తించడం |
2.
Group – A | Group – B |
ఎ) సజాతి ధృవాలు | 1) N |
బి) విజాతి ధృవాలు | 2) S |
సి) అయస్కాంత ధృవాలు | 3) ఆకర్షించుకుంటాయి |
డి) దక్షిణ ధృవం | 4) వికర్షించుకుంటాయి |
ఇ) ఉత్తర ధృవం | 5) అధిక ఆకర్షణ |
జవాబు:
Group – A | Group – B |
ఎ) సజాతి ధృవాలు | 4) వికర్షించుకుంటాయి |
బి) విజాతి ధృవాలు | 3) ఆకర్షించుకుంటాయి |
సి) అయస్కాంత ధృవాలు | 5) అధిక ఆకర్షణ |
డి) దక్షిణ ధృవం | 2) S |
ఇ) ఉత్తర ధృవం | 1) N |
3.
Group – A | Group – B |
ఎ) సహజ అయస్కాంతం | 1) విజాతి ధృవాలు |
బి) ఆకర్షణ | 2) లోడ్ స్టోన్ |
సి) అనయస్కాంత | 3) హార్స్ షూ అయస్కాంతం |
డి) కృత్రిమ అయస్కాంతం | 4) సజాతి ధృవాలు |
ఇ) వికర్షణ | 5) ప్లాస్టిక్ |
జవాబు:
Group – A | Group – B |
ఎ) సహజ అయస్కాంతం | 2) లోడ్ స్టోన్ |
బి) ఆకర్షణ | 1) విజాతి ధృవాలు |
సి) అనయస్కాంత | 5) ప్లాస్టిక్ |
డి) కృత్రిమ అయస్కాంతం | 3) హార్స్ షూ అయస్కాంతం |
ఇ) వికర్షణ | 4) సజాతి ధృవాలు |