These AP 6th Class Science Important Questions 11th Lesson నీడలు – ప్రతిబింబాలు will help students prepare well for the exams.
AP Board 6th Class Science 11th Lesson Important Questions and Answers నీడలు – ప్రతిబింబాలు
6th Class Science 11th Lesson 2 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
కాంతి అవసరం ఏమిటి?
జవాబు:
వస్తువులను చూడటానికి మనకు కాంతి అవసరం.
ప్రశ్న 2.
కాంతి జనకం అంటే ఏమిటి?
జవాబు:
కాంతిని ఇచ్చే పదార్థాన్ని కాంతి జనకం లేదా కాంతి వనరుగా పిలుస్తారు.
ప్రశ్న 3.
నీడలు ఎప్పుడు ఏర్పడతాయి?
జవాబు:
అపారదర్శక వస్తువులు కాంతి మార్గాన్ని అడ్డుకున్నప్పుడు నీడలు ఏర్పడతాయి.
ప్రశ్న 4.
నీడను ఏర్పరచటానికి మనకు ఏమి అవసరం?
జవాబు:
కాంతి మరియు వస్తువుతో పాటు, అపారదర్శక వస్తువు యొక్క నీడను పొందటానికి తెర అవసరం.
ప్రశ్న 5.
మీరు నీడ ద్వారా దాని రంగును తెలుసుకుంటారా?
జవాబు:
నీడలను చూడటం ద్వారా వస్తువుల రంగును నిర్ణయించలేము.
ప్రశ్న 6.
కాంతి ఎలా ప్రయాణిస్తుంది?
జవాబు:
కాంతి సరళరేఖ మార్గంలో ప్రయాణిస్తుంది.
ప్రశ్న 7.
కాంతి ఎప్పుడు పరావర్తనం చెందుతుంది?
జవాబు:
ఏదైనా వస్తువు మీద పడినప్పుడు కాంతి పరావర్తనం చెందుతుంది.
ప్రశ్న 8.
కాంతి సరళరేఖ మార్గంలో ప్రయాణిస్తుందని ప్రజలకు ఎలా తెలుసు?
జవాబు:
నీడల ఆకారాలను గమనించడం ద్వారా కాంతి సరళరేఖ మార్గంలో ప్రయాణిస్తుందని ప్రజలు తెలుసుకున్నారు.
ప్రశ్న 9.
మనం చీకటిని, చీకటిలో వస్తువులను స్పష్టంగా చూడలేకపోతున్నాము. ఎందుకు?
జవాబు:
చీకటిలో సరిపడినంత కాంతి ఉండదు కావున వస్తువులను మనం చూడలేము.
ప్రశ్న 10.
విద్యుత్తు లేనప్పుడు మనం వస్తువులను చూడలేము. ఎందుకు?
జవాబు:
విద్యుత్తు లేనప్పుడు కాంతి ఉండదు కాబట్టి మనం వస్తువులను చూడలేము.
ప్రశ్న 11.
కాంతి ఉన్నప్పుడు మనం వస్తువులను చూడగలం. ఎందుకు?
జవాబు:
వస్తువులపై పడిన కాంతి పరావర్తనం చెంది కళ్ళను చేరుతుంది కాబట్టి మనం వస్తువులను చూడగలుగుతాము.
ప్రశ్న 12.
కాంతి లేకపోవడం వలన మనం ఎందుకు వస్తువులను చూడలేము?
జవాబు:
కాంతి దృష్టికి మూలం. కాంతి లేకుండా మనం దేనినీ చూడలేము.
ప్రశ్న 13.
నీడను ఏర్పరచటానికి షరతులు ఏమిటి?
జవాబు:
నీడను పొందడానికి మనకు కాంతి, అపారదర్శక వస్తువు మరియు తెర అవసరం.
6th Class Science 11th Lesson 4 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
మనం వస్తువులను ఎలా చూడగలం?
జవాబు:
కాంతి జనకాల నుండి, కాంతి వస్తువుపై పడుతుంది.
- వస్తువు నుండి కాంతి పరావర్తనం చెందుతుంది.
- పరావర్తనం చెందిన కాంతి కంటిని చేరుతుంది.
- కంటి ద్వారా మనకు దృష్టి జ్ఞానం కలుగుతుంది.
- కళ్ళు మరియు వస్తువు మధ్య ఎటువంటి ఆటంకాలు లేనప్పుడు వస్తువు కనిపిస్తుంది.
ప్రశ్న 2.
కాంతి ప్రసరణ ఆధారంగా వస్తువులను మీరు ఎలా వర్గీకరిస్తారు?
జవాబు:
- కాగితం, అట్ట, కలప, ఇనుము మొదలైన పదార్థాలు కాంతిని అనుమతించవు. ఈ వస్తువులు నీడలను ఏర్పరుస్తాయి. వీటిని అపారదర్శక పదార్థాలు అంటారు.
- గాజు మరియు గాలి వంటి పదార్థాలు కాంతిని వాటి గుండా వెళ్ళడానికి అనుమతిస్తాయి. అందువల్ల మనం వీటి నీడలను పొందలేము. ఇటువంటి పదార్థాలను పారదర్శక పదార్థాలు అంటారు.
- పాలిథీన్ కవర్ మరియు నూనె కాగితం వంటి పదార్థాలు పాక్షికంగా కాంతిని అనుమతిస్తాయి. వాటి నీడలు అస్పష్టంగా ఉంటాయి. వాటిని పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారు.
ప్రశ్న 3.
తోలుబొమ్మలాట గురించి రాయండి.
జవాబు:
తోలుబొమ్మల ఆట మన సాంప్రదాయ కళారూపాలలో ఒకటి.
- ఈ తోలు బొమ్మలను జంతు చర్మాలతో చేస్తారు.
- వీటితో తెరపై నీడలు వేసి ఆటలాడిస్తారు.
- దీనితో పాటు కథ వివరించబడుతుంది.
- ఈ కళను ఉపయోగించడం ద్వారా రామాయణం మరియు మహా భారతం వంటి ప్రాచీన ఇతిహాసాలు ప్రదర్శించబడతాయి.
ప్రశ్న 4.
అపారదర్శక మరియు పారదర్శక పదార్థాల మధ్య గల భేదం తెలపండి.
జవాబు:
అపారదర్శక పదార్థాలు | పారదర్శక పదార్థాలు |
1) కాంతిని తమగుండా అనుమతించవు. | 1) కాంతిని తమగుండా అనుమతిస్తాయి. |
2) వీటి ద్వారా వస్తువులను చూడలేము. | 2) వీటి ద్వారా వస్తువులను చూడగలము. |
3) నీడలను ఏర్పరచుతాయి. | 3) నీడలను ఏర్పరచవు. |
4) ఉదా : బల్ల, కుర్చీ | 4) ఉదా : గాజు, గాలి |
ప్రశ్న 5.
నీడను రూపొందించడానికి కాంతి జనకం మరియు అపారదర్శక వస్తువు సరిపోతుందా? మీరు దీనిని అంగీకరిస్తున్నారా?
జవాబు:
లేదు, నేను పై వ్యాఖ్యతో ఏకీభవించను. ఒక వస్తువు యొక్క నీడను రూపొందించడానికి కాంతి మరియు అపారదర్శక వస్తువు మాత్రమే సరిపోవు. వీటితో పాటు, మనకు తెర కూడా అవసరం.
ప్రశ్న 6.
ఒక వస్తువు నీడను పరిశీలించడం ద్వారా మనం దాని ఆకారాన్ని తెలుసుకోవచ్చా?
జవాబు:
- వస్తువు యొక్క నీడను గమనించడం ద్వారా మనం దాని ఆకారాన్ని ఊహించవచ్చు.
- కానీ ఇది ఎల్లప్పుడూ సరైనదని చెప్పలేము.
- కొన్ని సార్లు నీడ, వస్తువు ఆకారానికి భిన్నంగా ఉండవచ్చు.
- కాంతి జనక స్థానం మరియు వస్తువు యొక్క ఆకారం బట్టి నీడ ఆకారం మారిపోతుంది.
ప్రశ్న 7.
పిన్‌హోల్ కెమెరా అంటే ఏమిటి?
జవాబు:
- పి హోల్ ద్వారా మనం వస్తువుల ప్రతిబింబాన్ని గమనించవచ్చు.
- ఇది కాంతిపై పనిచేసే చిన్న పరికరం.
- వస్తువు యొక్క ప్రతిబింబం తెరపై చిన్నదిగా, తలక్రిందులుగా ఏర్పడుతుంది.
- కాంతి యొక్క ఋజు మార్గ ప్రయాణాన్ని కూడా దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు.
ప్రశ్న 8.
స్పి ల్ కెమెరా ద్వారా ఒక చెట్టు చూడండి. మీరు ఏమి చూస్తున్నారు?
జవాబు:
నేను పిన్‌హోల్ కెమెరా ద్వారా చెట్టును గమనించినప్పుడు
- ప్రతిబింబం చిన్నదిగా ఉంది.
- ఇది తెరపై విలోమంగా అంటే తిరగబడి ఉంది.
- ఇది రంగులు కలిగి ఉంది.
- మరియు దగ్గరగా కనిపిస్తుంది.
ప్రశ్న 9.
పిన్‌హోల్ కెమెరాలో రెండు రంధ్రాలు చేస్తే ఏమి జరుగుతుంది?
జవాబు:
- కెమెరాలో మనం రెండు రంధ్రాలు చేస్తే, ఆ ప్రతిబింబం స్పష్టంగా లేదని నేను గ్రహించాను.
- కానీ ఇది రెండు ప్రతిబింబాలను ఏర్పరుస్తుండటం ఆశ్చర్యంగా ఉంది.
ప్రశ్న 10.
ప్రతిరోజూ అద్దంలో ముఖాన్ని చూసుకొంటాము కదా ! అద్దంలో ఉన్నది నీడా లేదా ప్రతిబింబమా? మీరు దానిని ఎలా నిర్ణయిస్తారు?
జవాబు:
- అద్దంలో మనం చూసేది ఒక ప్రతిబింబం.
- నీడలు రంగులో ఉండవని మనకు తెలుసు. కాని ప్రతిబింబానికి వస్తువు యొక్క రంగులు ఉంటాయి.
- నీడ వస్తువు యొక్క రూపు రేఖలను మాత్రమే చూపిస్తుంది కాని ఒక ప్రతిబింబము పూర్తి వస్తువును చూపిస్తుంది.
- అద్దంలో ఉన్న ప్రతిబింబం రంగును కలిగి ఉంది మరియు పూర్తి వస్తువును చూపుతుంది. కనుక ఇది ప్రతిబింబం.
ప్రశ్న 11.
నీడలు మరియు ప్రతిబింబాల మధ్య వ్యత్యాసాలను మరియు పోలికలను తెలపండి.
జవాబు:
పోలికలు :
- నీడ మరియు ప్రతిబింబం కాంతికి సంబంధించినవి.
- కాంతి లేకుండా రెండూ కనిపించవు.
వ్యత్యాసాలు :
- ప్రతిబింబం మరియు నీడ మధ్య ఉన్న ముఖ్యమైన వ్యత్యాసం ఏమిటంటే, ప్రతిబింబం ఒక వస్తువు యొక్క కాంతి కిరణాలు పరావర్తనం లేదా వక్రీభవనం చెందటం వలన ఏర్పడుతుంది.
- నీడ ఒక అపారదర్శక వస్తువు కాంతి కిరణాలను అడ్డుకున్నప్పుడు ఏర్పడే చీకటి ఆకారం.
- ప్రతిబింబం అనే పదం సాధారణంగా నిజమైన వస్తువు యొక్క దృశ్యాన్ని సూచిస్తుంది. నీడ ఆకారాన్ని మాత్రమే చూపిస్తుంది.
- ఒక ప్రతిబింబం రంగురంగులుగా ఉంటుంది. నీడ నలుపు రంగులో ఉంటుంది.
ప్రశ్న 12.
మీరు నీడ మరియు ప్రతిబింబానికి మధ్య గల భేదాన్ని డ్రాయింగ్ ద్వారా చూపించగలరా?
జవాబు:
అవును. నీడలు మరియు ప్రతిబింబాల మధ్య వ్యత్యాసాన్ని డ్రాయింగ్ ద్వారా చూపించగలము
- ప్రతిబింబాలకు మొత్తం చిత్రాన్ని గీయవచ్చు మరియు రంగును ఉపయోగించవచ్చు.
- నీడలకు అంచులు మాత్రమే గీస్తాము మరియు నలుపు రంగుతో నింపుతాము.
6th Class Science 11th Lesson 8 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
నీడను ఏర్పరచటానికి తెర అవసరం అని నీవు ఎలా నిరూపిస్తావు?
జవాబు:
లక్ష్యం : నీడను ఏర్పరచటానికి తెర అవసరం అని నిరూపించటం
కావలసిన పరికరాలు :
టార్చ్, ఆకు, చీకటి గది, డ్రాయింగ్ షీట్ లేదా అట్ట
విధానం :
- టార్చ్ మరియు ఆకుతో చీకటి గదిలోకి ప్రవేశించండి.
- టార్చ్ కాంతిని ఆకుపై కేంద్రీకరించండి.
- ఆఱకు మరియు టార్చ్ కి మధ్య దూరం 30 సెం.మీ. ఉండేటట్లు చూడండి.
- ఇప్పుడు నీడ గోడపై ఏర్పడుతుంది.
- ఇప్పుడు టార్చ్ ను ఆకు క్రింద 30 సెం.మీ. దూరంలో ఉంచండి.
- ఇప్పుడు పైకప్పు మీద నీడ ఏర్పడుతుంది.
- రాత్రిపూట బహిరంగ ప్రదేశంలో (బయట) అదే కృత్యం చేయండి.
- ఇప్పుడు మనం నీడను కనుగొనలేము.
- ఆకుకు పైన 1 మీటర్ దూరంలో డ్రాయింగ్ షీట్ లేదా ప్లాంక్ ఉంచండి.
- ఇప్పుడు మనం డ్రాయింగ్ షీట్ పై నీడను కనుగొనవచ్చు.
- నీడలు ఏర్పడటానికి తెర అవసరం అని దీనిని బట్టి అర్థమవుతుంది.
నిర్ధారణ :
నీడలు ఏర్పడటానికి తెర అవసరమని నిరూపించబడింది.
ప్రశ్న 2.
స్పి ల్ కెమెరా తయారీ ప్రక్రియను వివరించండి.
జవాబు:
ఉద్దేశము :
పినహోల్ కెమెరాను తయారు చేయడం.
పదార్ధములు :
ఒక పివిసి పైపు, (సుమారు 8 సెం.మీ. వ్యాసం మరియు పొడవు 30 సెం.మీ.)
మరొక పివిసి పైపు (సుమారు 7 సెం.మీ. వ్యాసం మరియు పొడవు 20 సెం.మీ.)
ఒక బ్లాక్ డ్రాయింగ్ షీట్, నూనె, రెండు రబ్బరు బ్యాండ్లు, ఒక పిన్ మరియు షీట్
(మీరు పివిసి పైపులను పొందలేకపోతే, మందపాటి కాగితాన్ని తీసుకొని గొట్టాలను ఏర్పరచటానికి దాన్ని చుట్టండి) (గొట్టాల వ్యాసం మరియు పొడవు పైపులకు ఇచ్చిన విధంగానే ఉండాలి)
విధానం :
- నల్ల కాగితం ముక్కను కత్తిరించి పెద్ద పివిసి పైపు యొక్క ఒక చివర ఉంచి రబ్బరు బ్యాండ్ తో కట్టండి.
- సన్నని పివిసి పైపు యొక్క ఒక చివర తెల్ల కాగితాన్ని ఉంచండి.
- దీన్ని రబ్బరు బ్యాండ్ తో కట్టండి. ఇప్పుడు పిన్ సహాయంతో బ్లాక్ పేపర్ క్యాప్ మధ్యలో రంధ్రం చేయండి.
- తెల్ల కాగితంపై 2 నుండి 3 చుక్కల నూనె వేయండి, తద్వారా అది అపారదర్శకంగా మారుతుంది.
- పెద్ద పైపులోకి సన్నని పైపును చొప్పించండి. మీ పి హోల్ కెమెరా సిద్ధంగా ఉంది.
పనిచేయు విధానం :
- పినల్ కెమెరా ముందు వెలిగించిన కొవ్వొత్తిని అమర్చండి.
- సన్నని పైపు తెరపై కొవ్వొత్తి యొక్క స్పష్టమైన చిత్రాన్ని పొందడానికి సన్నగా – ఉన్న పైపును ముందుకు మరియు వెనుకకు జరపండి.
- ఏర్పడిన ప్రతిబింబాన్ని సన్నని పైపు వెనుక నుండి గమనించాలి.
పరిశీలన :
కొవ్వొత్తి యొక్క మంట తెరపై తలక్రిందులుగా కనిపిస్తుంది. ఇది కొవ్వొత్తి నీడ కాదు. ఇది దాని , ప్రతిబింబం.
ప్రశ్న 3.
పినహోల్ కెమెరాలోని ప్రతిబింబం ఎందుకు తలక్రిందులుగా ఏర్పడుతుంది?
జవాబు:
- కొవ్వొత్తి మంట నుండి వచ్చే కాంతి ప్రతి బిందువు నుండి అన్ని దిశలలో నేరుగా ప్రయాణిస్తుంది.
- కాని కొన్ని నిర్దిష్ట దిశలలో వచ్చే కాంతి మాత్రమే దాని పిన్ హోల్ ద్వారా కెమెరాలోకి ప్రవేశిస్తుంది.
- మంట పై భాగంలో ఉన్న కాంతి నేరుగా తెర దిగువ వైపుకు వెళుతుంది.
- మరియు మంట దిగువన ఉన్న కాంతి నేరుగా తెర పైభాగానికి వెళుతుంది.
- ఈ విధంగా, ప్రతి పాయింట్ నుండి ఒక నిర్దిష్ట దిశలో వచ్చే కాంతి మంట, పిన్‌హోల్ లోకి ప్రవేశించగలదు.
- మరియు ఇతర దిశలలో వెళ్ళే కాంతి బ్లాక్ షీట్ ద్వారా నిరోధించబడుతుంది.
- ఇది తలక్రిందుల ప్రతిబింబం ఏర్పడటానికి దారితీస్తుంది.
- పిన్ హోల్ కెమెరా తెరపై తలక్రిందుల ప్రతిబింబం ఏర్పడటం ఆ కాంతి సరళ రేఖ మార్గంలో ప్రయాణాన్ని వివరిస్తుంది.
AP Board 6th Class Science 11th Lesson 1 Mark Bits Questions and Answers నీడలు – ప్రతిబింబాలు
I. బహుళైచ్ఛిక ప్రశ్నలు
కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.
1. కింది వాటిలో ఏది కాంతి వనరు కాదు?
A) సూర్యుడు
B) కొవ్వొత్తి
C) పంకా
D) ట్యూబ్ లైట్
జవాబు:
C) పంకా
2. పిన హోల్ కెమెరాలో ఏమి లేదు?
A) తెర
B) కటకం
C) ఆయిల్ పేపర్
D) ట్యూబ్
జవాబు:
B) కటకం
3. పిన్పల్ కెమెరాలో కటకంలా పనిచేయునది
A) రంధ్రం
B) తెర
C) ట్యూబ్
D) ఆయిల్ పేపర్
జవాబు:
A) రంధ్రం
4. పిన్పల్ కెమెరాలో ఎన్ని పైపులు ఉన్నాయి?
A) 2
B) 3
C) 4
D) 1
జవాబు:
A) 2
5. పిన్పల్ కెమెరాలో చిత్ర పరిమాణం
A) పెద్దది
B) చిన్నది
C) సమానం
D) పొడవు
జవాబు:
B) చిన్నది
6. కింది వాటిలో దేనికి రంగులు లేవు?
A) వస్తువు
B) ప్రతిబింబము
C) నీడ
D) ఛాయాప్రతిబింబము
జవాబు:
C) నీడ
7. కింది వాటిలో ఏది పూర్తి ప్రతిబింబం చూపిస్తుంది?
A) బంతి
B) గాజు
C) లైటు
D) అద్దం
జవాబు:
D) అద్దం
8. నీడను ఏర్పరచటానికి అవసరం లేనిది ఏది?
A) కాంతి
B) వస్తువు
C) తెర
D) గాజు
జవాబు:
D) గాజు
9. భిన్నమైన దానిని కనుగొనండి.
A) బంతి
B) పెట్టే
C) గాజు
D) సంచి
జవాబు:
C) గాజు
II. ఖాళీలను పూరించుట కింది ఖాళీలను పూరింపుము.
1. ఏదైనా ……………… పై కాంతి పడినప్పుడు, అది తిరిగి వెనుకకు మరలుతుంది.
2. కాంతి జనకానికి ఉదాహరణ ……………..
3. నూనె కాగితం మరియు గరుకు గాజు…………….. పదార్థాలు.
4. ………………. పదార్థాలు నీడలు ఏర్పరచలేవు.
5. ………….. నీడలతో వివరించే కథా విధానం.
6. నూనె కాగితం పిన్‌హోల్ కెమెరాలో …………… పనిచేస్తుంది.
7. పినహోల్ కెమెరాలో ప్రతిబింబం ………………
8. ……………. వస్తువు యొక్క రూపురేఖలను మాత్రమే చూపిస్తుంది.
9. సాధారణ అద్దంలో మనం …………… చూస్తాము.
10. వస్తువులను చూడటానికి …………….. అవసరం.
11. ……………… వస్తువులు నీడలను ఏర్పరుస్తాయి.
జవాబు:
- వస్తువు
- సూర్యుడు
- అపారదర్శక
- పారదర్శక
- తోలుబొమ్మలాట
- తెర
- విలోమం
- నీడ
- ప్రతిబింబం
- కాంతి
- అపారదర్శక
III. జతపరుచుట
కింది వానిని జతపరుచుము.
1.
Group – A | Group – B |
ఎ) కాంతి పారదర్శకము | 1) కొవ్వొత్తి |
బి) కాంతి అపారదర్శకము | 2) నూనె కాగితం |
సి) కాంతి జనకము | 3) రాయి |
డి) పాక్షిక పారదర్శకం | 4) అద్దం |
ఇ) పరావర్తనం | 5) గాలి |
జవాబు:
Group – A | Group – B |
ఎ) కాంతి పారదర్శకము | 5) గాలి |
బి) కాంతి అపారదర్శకము | 3) రాయి |
సి) కాంతి జనకము | 1) కొవ్వొత్తి |
డి) పాక్షిక పారదర్శకం | 2) నూనె కాగితం |
ఇ) పరావర్తనం | 4) అద్దం |
2.
Group – A | Group – B |
ఎ) ప్రతిబింబం | 1) ఆకారం |
బి) పరావర్తనం | 2) పెద్దదిగా చూపును |
సి) పి హోల్ కెమెరా | 3) నునుపైన తలం |
డి) భూతద్దం | 4) తలక్రిందుల ప్రతిబింబం |
ఇ) నీడ | 5) సాధారణ అద్దం |
జవాబు:
Group – A | Group – B |
ఎ) ప్రతిబింబం | 5) సాధారణ అద్దం |
బి) పరావర్తనం | 3) నునుపైన తలం |
సి) పి హోల్ కెమెరా | 4) తలక్రిందుల ప్రతిబింబం |
డి) భూతద్దం | 2) పెద్దదిగా చూపును |
ఇ) నీడ | 1) ఆకారం |
మీకు తెలుసా?
మన సంప్రదాయ కళారూపాలలో తోలుబొమ్మలాట ఒకటి. ఇందులో కొన్ని బొమ్మల నీడలను తెరమీద ఏర్పరుస్తూ వివిధ రకాల కథలను, గాథలను ప్రదర్శిస్తుంటారు.