AP 10th Class Telugu Model Paper Set 10 with Solutions

Effective utilization of AP 10th Class Telugu Model Papers Set 10 can significantly boost overall exam scores.

AP SSC Telugu Model Paper Set 10 with Solutions

విద్యార్థులకు సూచనలు :

  1. ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు ఉంటాయి.
  2. ప్రశ్న పత్రం చదువుకోవడానికి 15 ని.లు, జవాబులు రాయడానికి 3 గం||లు సమయం ఉంటుంది.
  3. ప్రశ్నలన్నింటికీ సమాధానాలు సమాధాన పత్రంలోనే రాయాలి.
  4. సమాధానాలు గుండ్రంగా, స్పష్టంగా రాయాలి.

విభాగం – I
I. అవగాహన – ప్రతిస్పందన (24 మార్కులు)

1. ఈ క్రింది పరిచిత పద్యాలలో ఒకదానిని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబిమ్ము. (1 × 8 = 8మా)
భావమెట్టులుండెఁ బలుకట్టిడై యుండు
పలుకు లెట్టి వైనఁబనులు నట్లు
పనులననుసరించి ఫలములు చేకూరు
పాపభయ విభంగ భావలింగ !

ప్రశ్నలు :
అ) మాటలకు మూలమైనది ఏది?
జవాబు:
మాటలకు మూలమైనది మనసులో భావం.

ఆ) పనులు దేనిననుసరించి ఉంటాయి?
జవాబు:
పనులు మాటకు అనుసరించి ఉంటాయి.

ఇ) ఫలితాలకు ఆధారమైనవి ఏవి?
జవాబు:
ఫలితాలకు ఆధారమైనవి పనులు.

ఈ) పద్యం ఆధారంగా ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
ఏమి ఉంటే ఫలితాలు చేకూరుతాయి ?

(లేదా)
హితులు హితాహితులు సదా
హితులునునై రాజు నెడల నిటు త్రివిధమునన్
క్షితి ననుచరు లందురు సం
తతమున్ మఱి వారిఁ దెల్వెదన్ విను మనఘా!

ప్రశ్నలు :
ఉ) ఈ పద్యంలోని మాటలు ఎవరు ఎవరితో అన్నారు?
జవాబు:
యామునాచార్యులు రాజకుమారునితో అన్న మాటలివి.

ఊ) రాజు వద్ద ఉండే మూడు రకాల అనుచరులెవరు?
జవాబు:
హితులు, హితాహితులు, అహితులు.

ఋ) ఎప్పటికి కీడు తలపెట్టని అనుచరులెవరు?
జవాబు:
ఎప్పటికి కీడు తలపెట్టని అనుచరులు హితులు.

ౠ) పద్యం ఆధారంగా ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
సదా రాజు మేలును కోరేవారు ఎవరు ?

AP 10th Class Telugu Model Paper Set 9 with Solutions

2. కింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (8 మా.)
కొందరు మంచి వక్త కావాలనే ఉబలాటంతో గొప్ప వక్తల్ని అనుకరిస్తారు. అందువల్ల ప్రయోజనం ? అతడు గొంతెత్తగానే ఎవర్ని అనుకరిస్తున్నాడో ప్రేక్షకులకు తెలిసిపోతుంది. అంతే సభలో కలకలం ప్రారంభం అవుతుంది. చౌకబారు అనుకరణలని నవ్వుకుంటారు. అసలు అసలే నకిలీ నకిలేయే గదా ? మనం మనంగా ఉన్నపుడే మనకు ప్రత్యేక స్థానం వుంటుంది. అత్యంత నైపుణ్యంతో చేయబడి అచ్చంగా గులాబిపువ్వే అనే భ్రమ కలిగించే కాగితం పువ్వులో, గులాబీలో వుండే సుగంధాన్ని నింపగలమా ? అందుకే అనుకరణ మంచిది కాదు.

ప్రశ్నలు :
అ) కొందరు గొప్ప వక్తల్ని ఎందుకు అనుకరిస్తారు?
జవాబు:
కొందరు మంచి వక్త కావాలనే ఉబలాటంతో గొప్ప వక్తల్ని అనుకరిస్తారు.

ఆ) మనకు ప్రత్యేక స్థానం ఎప్పుడు ఉంటుంది?
జవాబు:
మనం మనంగా ఉంటేనే మనకు ప్రత్యేక స్థానం ఉంటుంది.

ఇ) కాగితం పువ్వులో దేనిని నింపలేము?
జవాబు:
కాగితం గులాబి పువ్వులో, గులాబి పువ్వులో ఉండే సుగంధాన్ని నింపలేము.

ఈ) గద్యం ఆధారంగా ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
వక్త కావాలంటే ఏం చేయాలి?

3. రామాయణం నుండి ఇచ్చిన కింది వాక్యాలు ఏయే కాండములకు చెందినవో వాక్యరూపంలో రాయండి. (8 మా.)
అ) ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంది మారీచుని స్థితి.
జవాబు:
ఈ వాక్యం రామాయణంలోని అరణ్యకాండంలోనిది.

ఆ) లంకను కాల్చాక హనుమంతుడు సముద్రంలో తోకను చల్లార్చుకున్నాడు.
జవాబు:
ఈ వాక్యం రామాయణంలోని సుందరకాండంలోనిది.

ఇ) శ్రీరామ పట్టాభిషేక మహోత్సవము కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంది.
జవాబు:
ఈ వాక్యం రామాయణంలోని అయోధ్యకాండంలోనిది.

ఈ) తాటక వధతో దుష్టసంహారానికి పూనుకున్నాడు రాముడు.
జవాబు:
ఈ వాక్యం రామాయణంలోని బాలకాండంలోనిది.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత
విభాగం -II (44 మార్కులు)

కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి. (3 × 4 = 12 మా)
4. ‘ప్రకృతి సందేశం’ పాఠ్యభాగ కవి వై.సి.వి. రెడ్డి గారి జీవిత విశేషాలను తెలియజేయండి.
జవాబు:

  1. ప్రకృతి సందేశం’ పాఠ్యభాగ రచయిత వై.సి.వి. రెడ్డి గారి పూర్తి పేరు యమ్మనూరు చిన వెంకట రెడ్డి
  2. ఈయన వై.యస్.ఆర్. (కడప) జిల్లాలో బోనాల గ్రామంలో జన్మించారు.
  3. లక్ష్మమ్మ, కొండారెడ్డి వీరి తల్లిదండ్రులు.
  4. వీరు 1926లో జన్మించి 1989లో స్వర్గస్తులైనారు.
  5. వీరి రచనల్లో ముఖ్యమైనవి ‘తొలకరి చినుకులు’, మేనక, రంభ, సింధూర రేఖ, దక్షిణ నీలము, వైజయంతి, పారిజాతం మొదలైన కావ్యాలు.

5. “నాటకం” ప్రక్రియను వివరించండి.
జవాబు:
దశవిధ రూపకాల్లో నాటకమే ఉత్తమమైనదని సద్విమర్శకుల అభిప్రాయం. “కావ్యేషు నాటకం రమ్యం” అని మన అలంకారికులు చెప్పడాన్ని బట్టి ప్రక్రియలన్నింటిలోనూ నాటకమే గొప్పదని చెప్పవచ్చు. సమస్త సాహితీ ప్రక్రియలు సమాహారం నాటకం. ఇతర సాహిత్య ప్రక్రియల లక్షణాలు ఇందులో ఇమిడిపోయి ఉండడం వల్ల నాటక ప్రక్రియ అగ్రస్థానం పొందింది. నటుల చేత ప్రదర్శింపబడేది నాటకం. నాటకంలో నాలుగు నుండి పదిపరకు అంకాలు ఉంటాయి. నాటకంలో సంభాషణలకి, అభినయానికి, నటుల హాప, భావ ప్రదర్శనకి అవకాశం ఉంటుంది. దీనిలో రసపోషణ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది.

AP 10th Class Telugu Model Paper Set 9 with Solutions

6. “భరతుడు” పాత్ర స్వభావాన్ని రాయండి.
జవాబు:
కైక యందు దశరథ మహారాజుకు జన్మించాడు. కైక రాజ్యాధికారం చేపట్టమని కోరినా శ్రీరామ పాదుకలకు పట్టాభిషేకం చేశాడు. తల్లిని కూడా దూషించాడు. రాజ్యంపై కోరిక లేనివాడు. కేవలం శ్రీరాముని సేవించడానికే జన్మించాననుకొనే పుణ్యపురుషుడు.

క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాల్లో జవాబులు రాయండి. (4 × 8 = 32 మా)
7. జలియన్ వాలా బాగ్ దురంతాన్ని సవివరంగా తెల్పండి.
జవాబు:
భారత స్వాతంత్ర్యోద్యమాన్ని అణచివేయడంలో భాగంగా బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ వేలాది మంది భారతీయుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాడు. భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ‘జలియన్ వాలాబాగ్’ దురంతం అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా నిలిచింది. పంజాబ్ రాష్ట్రంలో అమృతసర్లోని ఒక ఉద్యానవనం జలియన్ వాలాబాగ్. 1919 ఏప్రిల్ 13న పంజాబీలు జరుపుకునే ‘వైశాఖీ’ పండుగ వేడుక చూసేందుకు వచ్చిన ప్రజలు జలియన్ వాలా బాగ్ బహిరంగ సభ జరుగుతుండటంతో అక్కడకు చేరుకున్నారు. తన ఆదేశాలను ధిక్కరించారని బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ నిరాయుధులైన ప్రజలపై కాల్పులు జరపాల్సిందిగా తన సైనికులను ఆదేశించాడు.

స్త్రీలు, పురుషులు, పిల్లలపై విచక్షణారహితంగా 1650 రౌండ్లు కాల్పులు జరిపారు. ప్రజలు తప్పించుకోగలిగే అవకాశాలు అక్కడ ఏ మాత్రం లేవు. ఈ దుర్ఘటనలో 379 మందికి పైగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వేలాదిమంది గాయపడ్డారు. స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఈ ఉదంతం ఒక విషాదదినంగా, చీకటిరోజుగా మిగిలిపోయింది. మరణించిన వారి రక్తం ఏరులై పారింది. తలలు తెగిన శరీరాలతో నిలిచిన ప్రాణాలతో పోరాడుతున్న వారి ఆర్తనాదాలు దిక్కులంతా ప్రతిధ్వనిస్తున్నాయి. తిరుగుబాట్లను అణచడానికి బ్రిటిష్ వారు ‘రౌలట్ చట్టాన్ని’ ప్రవేశపెట్టారు. చేపల సమూహాన్ని పట్టే గాలంలా ఆ చట్టాన్ని డయ్యర్ జలియన్ వాలా బాగ్ ప్రయోగించాడు. దుర్మార్గంగా ఎంతో మంది అమాయకుల ప్రాణాలను తీశాడు.

(లేదా)
‘యుద్ధ విజేత’ పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
కవిపరిచయం : ఈ ప్రశ్న నేతల ప్రతాప్ కుమార్ రచించిన’యుద్ధ విజేత’ అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడింది.
సారాంశం : ‘యుద్ధం’లో గెలుపు, ఓటమిలు ఉంటాయి. యుద్ధంలో గెలుపు ఎవరో ఒకరి పక్షాన నిలుస్తుంది.

మరో పక్షం ఓడిపోతుంది. ఒక్కోసారి ఎందుకూ కొరగాని వాడు కూడా యుద్ధంలో గెలుస్తాడు. కానీ యుద్ధంలో విజేత అయిన వాడికంటే యుద్ధాన్ని జయించనివాడే నిజమైన విజేత అవుతాడు. కాలం గడిచిపోయినా అలాంటి వారిని ప్రజలు ఎప్పటికీ హృదయ విజేతగా గుర్తు పెట్టుకుంటారు.

బలహీనుడి మీద బలవంతుడు గెలుస్తాడు. బలవంతుడి దగ్గర పటిష్ఠమైన సైన్యం, తగినంత సంపద ఉంటాయి. బలవంతుడు యుద్ధాన్ని మంచి తెలివితో, ప్రణాళికతో చేస్తాడు. ఇలాంటి వాళ్లు అలాంటివి ఏమీ తెలియని వారి బలహీనులపై గెలవడం విజయం కాదు. యుద్ధం ముసుగులో ఇరుపక్షాలు రణరంగంలోకి దూకిన తరువాత బలమైన ప్రత్యర్థి విజయగర్వాన్ని చూపుతాడు. ఇలాంటివారు ఉన్మాదులుగా లోక నాశనానికి కారణం అవుతున్నారు. మనిషికి, మనిషికి మధ్య యుద్ధం మొదలయ్యాక ‘సాటి మనిషి’ని కూడా శత్రువుగా భావించవలసి వస్తుంది.

యుద్ధం కారణంగా పచ్చగా ఉన్న నేల, రక్త పంకిలంగా మారుతుంది. రాజ్యంపై కాంక్ష, రాణివాసం పట్ల వ్యామోహం, పదవుల కోసం ఆరాటం, తన పౌరుష ప్రదర్శన మొదలైన కారణాల వలన ‘యుద్ధం’ అనే పిచ్చిని బుర్రలోకి ఎక్కించుకున్నారు. మానవజాతి నాశనానికి కారణమౌతున్నారు. యుద్ధం కారణంగా మరణాన్ని త్వరగా చవి చూడాల్సి వచ్చింది. రాజ్య విస్తరణ కోసమో, శత్రుదేశమనో బూచిగా చూపి, ఇప్పుడు యుద్ధాలలో బాంబులను ప్రవేశపెడుతున్నారు. గతంలో బాణాలతో ప్రాణాలు తీసేవాళ్లు. ఇప్పుడు యుద్దమంటే ఒకరినొకరు చంపుకోవడంగా మారింది.

మానవజాతికి నివాసయోగ్యమైన భూమిని మాంసపు ముద్దలుగా మార్చేస్తున్నారు. యుద్ధం అభం శుభం తెలియని, అమాయక బాలల మోముపై చిరునవ్వుల్ని చెరిపేసింది. విచ్చుకున్న పూలను కోసి పారేస్తున్నారు. ఎగిరే పక్షుల రెక్కలు విరిచేస్తున్నారు. మేఘాలను చూసి సంబరపడి, పురివిప్పి ఆడే నెమళ్ళ కాళ్లు తొలగిస్తున్నారు. చక్కగా ఆడుకుంటున్న జింక పిల్లల కాళ్లు సరికేస్తున్నారు. ఇలా సమస్త జీవులకు నివాసయోగ్యంగా ఉన్న అందమైన ప్రకృతిని పాడుచేయడమే యుద్ధంగా భావించవలసిన పరిస్థితి దాపురించింది.

మానవజాతిని, ప్రకృతిని, సమస్త లోకాన్ని వినాశనం చేసే యుద్ధమనే ఆటలో గెలవడం వీరత్వం కాదు. ఆ పశు స్వభావం. యుద్ధం చేయడం పౌరుషం అనిపించుకోదు. అశోకుడు కొన్ని వేలమంది చావుకు కారణమై యుద్ధంలో గెలిచినప్పటికీ పశ్చాత్తాప హృదయంతో యుద్ధాలు చేయడం మానేశాడు. యుద్దాన్ని తిరస్కరించి సిద్ధార్థుడు భార్యా బిడ్డలను, రాజ్యాన్ని త్యాగం చేసి, ప్రజల హృదయాలను గెలిచి నిజమైన విజేతగా నిలిచాడు. అసలైన విజయం ఏమిటో, విజేత ఎవరో నిరూపించాడు.

8. ఎల్లమ్మకు, రచయిత్రికి గల అనుబంధం గురించి రాయండి.
జవాబు:
ఎల్లమ్మ గంప నెత్తిన పెట్టుకుని పండ్ల వ్యాపారం చేస్తూండేది. ఆ విధంగా తరచూ రచయిత్రి ఇంటికి వెళ్తూ ఉండేది. తనకు అవసరం ఉన్నా లేకున్నా రచయిత్రి పండ్లు కొనేది. రచయిత్రి ఇంట్లో అప్పుడప్పుడు ఎల్లమ్మ పనులు చేస్తూండేది. రచయిత్రి ఇంట్లో ఎల్లమ్మ భోజనం చేస్తూండేది. తనకు వచ్చిన కష్ట సుఖాలను ఎల్లమ్మ రచయిత్రితో చెప్పుకునేది. క్రమంగా రచయిత్రి కుటుంబసభ్యురాలైంది. రచయిత్రి అభిమానాన్ని, ఆప్యాయతను పొందింది ఎల్లమ్మ. నిస్స్వార్థ పరురాలైన ఎల్లమ్మకు, రచయిత్రికి విడదీయరాని బంధం కల్గింది. అనురాగమూర్తి అయిన రచయిత్రి, ఎల్లమ్మకు మమతానురాగాలను పంచింది.

(లేదా)
కొత్తగా ఉపన్యాసం చేసిన వ్యక్తి ఇంటికి వచ్చాక తనను తాను ప్రశ్నించుకోవాల్సిన అంశాలేమిటి?
జవాబు:
కొత్తగా ఉపన్యాసం చేసిన వ్యక్తి ఇంటికి వచ్చాక తనను తాను ప్రశ్నించుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి అవి:

  1. తను వేదిక మీద ఎలా ప్రవర్తించాడో ప్రశ్నించుకోవాలి.
  2. తను కూర్చొన్న తీరును గురించి ప్రశ్నించుకోవాలి.
  3. తన గొంతు మైకుకు సరిగా ఎడ్జెస్టు చేసుకొన్నాడో, లేదో ప్రశ్నించుకోవాలి.
  4. శ్రోతల మధ్య-వక్త మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పరచుకొన్నాడో, లేదో ఆలోచించుకోవాలి.
  5. ముగింపు సమయం గురించి కూడా ప్రశ్నించుకోవాలి.
  6. అనుకొన్న అంశాలన్నీ చెప్పగలిగాడో, లేదో ఆలోచించుకోవాలి.
  7. విషయాలు చెప్పడం ఎందుకు మరచిపోయాడో తర్కించుకోవాలి.
  8. తన ఉపన్యాసం సాగుతుంటే శ్రోతల ప్రవర్తన గురించి కూడా ప్రశ్నించుకోవాలి.
  9. ఉపన్యాసం పూర్తి కాగానే తను కూర్చొన్న తీరు గురించి కూడా ప్రశ్నించుకోవాలి.
  10. శ్రోతలు అసహనం వ్యక్తం చేశారో ? లేదో ? ఎందుకో ? ప్రశ్నించుకోవాలి.
  11. తను ఉపయోగించిన పదజాలం, భాష గురించి కూడా ఆలోచించుకోవాలి.

9. రామాయణ ప్రాశస్త్యాన్ని గురించి రాయండి.
జవాబు:
మానవ జీవన మూలాలకు రామాయణం మణిదర్పణం. అందువల్లనే కొండలు, సముద్రాలు ఉన్నంతవరకూ రామాయణము లోకంలో ఉంటుందని బ్రహ్మగారు చెప్పారు. రామాయణం శాశ్వతత్వాన్ని సంపాదించుకున్న కావ్యము. ‘రామాయణం’ అంటే రాముని మార్గము. శ్రీరాముడు సత్యవాక్య పరిపాలకుడై ధర్మమార్గంలో ప్రజారంజకంగా పరిపాలించాడు. శ్రీరాముడు నడచిన నడత ధర్మబద్ధం.

-మానవ జీవితాన్ని సంస్కరించగల కావ్యం రామాయణం. మానవ హృదయాల నుండి ఎన్నటికీ చెరగని కథ రామాయణం. ఇందులో అమ్మానాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురువుపై భక్తి, శిష్యులపై ప్రేమ, స్నేహఫలం, ధర్మబలం వంటి జీవిత సంబంధాలను రామాయణం పట్టి చూపిస్తుంది.

“వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, జీవనకారుణ్య భావం, ప్రకృతి లాలన వంటి జీవిత పార్శ్వాలకు రామాయణం మణిదర్పణం. రామాయణం ఆచరణ ప్రధానమైన కావ్యం. సీతారాముల వంటి ఆదర్శనాయికానాయకుల చరిత్ర ఇది. “రామో విగ్రహవాన్ ధర్మః” అనే గొప్పమాట మారీచుని వంటి దుష్ట రాక్షసుని నోటి నుండి మహర్షి వాల్మీకి పలికించాడు. రామాయణం ఆదికావ్యం. ఇటువంటి కావ్యం ప్రపంచ సాహిత్యంలో “నభూతో నభవిష్యతి”.

(లేదా)
‘లంకాదహనం’ వర్ణించండి.
జవాబు:
సీతాదేవి దర్శనంతో ప్రధాన కార్యం ముగిసింది హనుమంతునికి. రావణుడు, అతని సైన్యపు శక్తి సామర్థ్యాలను కూడా తెలుసుకోవాలనిపించింది. అందుకు ఆశోకవనాన్ని ధ్వంసం చేయడమే మార్గంగా భావించాడు. అనుకున్నంతా చేశాడు కపివీరుడు. రాక్షస స్త్రీలు పరుగుపరుగున వెళ్ళి లంకేశునికీ విషయం చెప్పారు. రావణుడు ఎనభైవేల మంది రాక్షసులను పంపాడు.  నుమంతుడు వాళ్ళను మట్టుపెట్టాడు. తనపైకి వచ్చిన జంబుమాలిని, మంత్రిపుత్రులేడుగురిని రావణుడి సేనాపతులైదుగురిని, అక్షకుమారుణ్ణి అంతమొందించాడు.

చివరకు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి హనుమంతుణ్ణి బంధించాడు. బ్రహ్మవరంచేత అది హనుమంతునిమీద క్షణకాలమే పనిచేస్తుంది. అయినా తాను దానికి కట్టుబడి ఉన్నట్లు నటించాడు హనుమంతుడు. రావణుని ముందు ప్రవేశపెట్టారతన్ని. రావణుడడుగగా తాను రామదూతనని చెప్పాడు. శ్రీరాముని పరాక్రమమెలాంటిదో సభాముఖంగా చాటాడు. సహించలేని రావణుడు హనుమంతుణ్ణి చంపమని ఆజ్ఞ ఇచ్చాడు. దూతను చంపడం భాష్యం కాదన్నాడు విభీషణుడు. ఇతర పద్ధతుల్లో దూతను దండించవచ్చునన్నాడు.

హనుమంతుని తోకకు నిప్పంటించి లంకంతా కలయ దిప్పమన్నాడు రావణుడు. బట్టలతో హనుమంతుని తోకను చుట్టారు. నూనెతో తడిపారు. తోకకు నిప్పు పెట్టి ఊరంతా ఊరేగిస్తున్నారు. హనుమంతుడు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాడు. విభీషణుని భవనం తప్ప లంకంతా నిప్పుపెట్టాడు. అందుకే ‘(సీతను) చూసిరమ్మంటే (లంకను) కాల్చివచ్చాడని ‘ సామెత పుట్టింది. లంకలో హాహాకారాలు మిన్నుముట్టాయి.

AP 10th Class Telugu Model Paper Set 9 with Solutions

10. కౌశికుడు – ధర్మవ్యాధుల వృత్తాంతాన్ని సంభాషణ రూపంలో రాయండి.
జవాబు:
ధర్మవ్యాధుడు : ఓ కౌశిక మహర్షీ ! నమస్కారము. నీవు నన్ను సర్వజ్ఞుడవంటూ అభినందించావు. కృతజ్ఞతలు. రా! మా యింటికి వెళ్లాం!

కాశిక మహర్షి : సంతోషం, పద !

ధర్మవ్యాధుడు : ఓ మహర్షీ ! వీరే నా తల్లిదండ్రులు,

కాశిక మహర్షి : అయ్యా ! పాదాభివందనాలు.

ధర్మవ్యాధుడు : చూడు మహర్షీ ! వా తల్లిదండ్రులకు సేవ చేయడం వల్ల మాత్రమే నాకు గొప్ప జ్ఞానం లభించింది. నా తల్లిదండ్రులే నా పాలిటి దేవతలు. వేఱు దేవతల గురించి నాకు తెలియదు. ఇలా సేవ చేయడం వల్ల వేదాధ్యయనం, యజ్ఞులు, వ్రతాలు చేసిన ఫలితం వస్తుంది.

కాశిక మహర్షి : జ్ఞానుల చేత ఆరాధింపబడే ఓ ధర్మవ్యాధుడా ! నీ ధర్మమార్గం సాటిలేనిది.

ధర్మవ్యాధుడు : ఓ కౌశిక మహర్షీ ! నీవు నా వద్దకు ఒక పతివ్రత పంపగా వచ్చావు.

కాశిక మహర్షి : అవును. ధర్మాన్ని గురించిన జ్ఞానాన్ని పొందాలని భావిస్తున్నాను.

ధర్మవ్యాధుడు : నువ్వంటే నాకిష్టం లేదు. ఎందుకంటే వృద్ధులైన నీ తల్లిదండ్రులను వదిలి, వేదాధ్యయనం నిమిత్తం నీ తల్లిదండ్రుల అనుమతి లేకుండా వెళ్ళిపోయావు. ఈ కఠినమైన నీ ప్రవర్తన నాకు నచ్చలేదు.

కాశిక మహర్షి : వేదాధ్యయనం నిమిత్తం వెళ్ళాను. కాని నీవు చెప్పినట్లు అలా ఆలోచన చేయలేదు.

ధర్మవ్యాధుడు : నీవు విడిచి వెళ్ళిన మరుక్షణం నీ కోసం తల్లిదండ్రులు గుండెలు పగిలిపోయేటట్లుగా ఏడ్చి ఏడ్చి అంథులయ్యారు. ఇప్పటికైనా నీవు వెళ్ళి వారి దుఃఖాగ్నిని చల్లార్చు.

కాశిక మహర్షి : ఓ పుణ్యాత్ముడా ! నీవు చెప్పిన మాటలు సరైనవి. శ్రేష్ఠమైనవి. మేలు కలిగించేవి. వాటిని శ్రద్ధగా విన్నాను. తప్పక ఆచరిస్తాను. తల్లిదండ్రులను సేవించి తరిస్తాను.

(లేదా)
కష్టాలకు కుంగిపోకుండా ధైర్యంగా మెలగాలని తెలియజేస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

తిరుపతి,
XXXXX.

ప్రియమైన మిత్రునకు నమస్కారాలు.!
నేను క్షేమం. నీవు క్షేమమని తలుస్తాను. మా తాతగారు *మానవ జీవితం ఎలా సార్థక్యం పొందాలని” చాలా బాగా వివరించి చెప్పారు. మానవుడు ఎప్పుడూ ధైర్యంగా ఉండాలని విశ్లేషించాడు. ఎందుకంటే “ధైర్యే సాహసే లక్ష్మీ” అని ఆర్యోక్తి, కష్టాలైనా, సుఖాలైనా మానవులకే కల్గుతాయి. అంతేకాని మిగిలిన వాటికి కలుగవు కదా ! “ఫలించిన వృక్షమునకే జాతి దెబ్బలు” అన్నట్లు మానవులకే బాధలు. వాటిని తట్టుకుని ధైర్యంగా నిలబడ్డవాడే మనిషి, అందువల్ల మానవుడు కష్టాలకు కుంగకూడదు. సుఖాలకు పొంగకూడదు. స్థిత ప్రజ్ఞతతో ప్రవర్తించినపుడు నిజమైన మనిషిగా కీర్తిని పొందుతాడని మా తాతగారు చెప్పారు. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం కల్గింది. నేను కూడా అలాగే ప్రవర్తిస్తానని మా తాతకు మాట ఇచ్చాను. నీవు కూడా ఈ విషయాలను పూర్తిగా అవగాహన చేసుకుని నీ స్పందనను తెలియజేయగలవని ఆశిస్తున్నాను. వెంటనే ఉత్తరం వ్రాయి.

ఉంటా.

ఇట్లు,
నీ మిత్రుడు,
కె. శ్రీవత్స.

చిరునామా :
టి.పి. శ్రీనాథ్, 10వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూలు,
పెనమకూరు (పోస్ట్),
(వయా) ఉయ్యూరు, 521165.

విభాగం-III
III. భాషాంశాలు (పదజాలం – వ్యాకరణాంశాలు) (32 మార్కులు)

కింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి. ( 9 × 2 = 18 మా).
11. సుదతీ నూతన మదనా
మడనాగ తురంగ పూర్ణమణిమయ సదనా
(పై పద్య పాదాలలోని అలంకారాన్ని గుర్తించి, పేరు లక్షణం రాయండి.)
జవాబు:
ఈ పద్య పాదాల్లో ముక్తపదగ్రస్తలంకారం ఉంది.
లక్షణం: ఒక పద్యపాదంగానీ, వాక్యంగానీ ఏ పదంతో పూర్తవుతుందో అదే పదంతో తర్వాత పాదం/వాక్యం మొదలవుతుంది. దీన్నే ముక్తపదగ్రస్త అలంకారం అంటారు.

12. ప్రళయ పయోడముల్ గురియు భంగి ఫరంగి వీరంగి గుండ్ల గుం
(గురులఘువులు గుర్తించి, గణవిభజన చేసి, పద్యం పేరు రాయండి.)
జవాబు:
AP 10th Class Telugu Model Paper Set 9 with Solutions- 10

13. అ) వెన్నెల రాకతో అంధకారం తొలగిపోయింది.
(గీత గీసిన పదానికి సరైన అర్థం రాయండి.) (1 మా)
జవాబు:
చీకటి

ఆ) మృషలు చెప్పేవాడిని ఎవరూ నమ్మరు.
(గీత గీసిన పదానికి సరియైన అర్థాన్ని గుర్తించండి.) (1 మా)
అ) పొగడ్తలు
ఆ) నిజాలు
ఇ) అబద్ధాలు
ఈ) హాస్యాలు
జవాబు:
ఇ) అబద్ధాలు

14. అ) వహ్నితో ఆటలు ఆడకూడదు.
(గీత గీసిన పదానికి పర్యాయపదాలు రాయండి.) (1 మా)
జవాబు:
అగ్ని, అనలము, అంగారకము

ఆ) ఆకాశంలో పక్షులు బృందంగా ఎగురుతున్నాయి.
(గీత గీసిన పదానికి సరియైన పర్యాయపదాలు గుర్తించండి.) (1 మా)
అ) నీరు జలం
ఆ) శరీరం
ఇ) సంఘం
ఈ) తనువు
జవాబు:
ఇ) సంఘం

AP 10th Class Telugu Model Paper Set 9 with Solutions

15. అ) “గరువము” విడిచి పెట్టుట మంచిది.
(గీత గీసిన పదానికి సరైన ప్రకృతి పదం రాయండి.) (1 మా)
జవాబు:
గర్వము

ఆ) సంపదలు స్థిరము కావు.
(గీత గీసిన పదానికి సరైన వికృతి పదం గుర్తించండి.) (1 మా)
అ) తిరము
ఆ) తరము
ఇ) తీరము
ఈ) దరి
జవాబు:
అ) తిరము

16. అ) ఆ చెట్టు కొమ్మకు పూలు పూశాయి.
(గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి.) (1 మా)
జవాబు:
స్త్రీ, శాఖ

ఆ) గురువును గౌరవించడం మన విధి.
(గీత గీసిన పదానికి సరైన నానార్థాలు గుర్తించండి.) (1 మా)
అ) విష్ణువు – సింహం
ఆ) తండ్రి – బృహస్పతి
ఇ) వృద్ధుడు – గొప్పవాడు
ఈ) స్నేహితుడు – సూర్యుడు
జవాబు:
ఆ) తండ్రి – బృహస్పతి

17. అ) మండోదరి మహా పతివ్రత.
(గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్థం రాయండి.) (1 మా)
జవాబు:
మగని సేవించుటే వ్రతముగా కలది – సాధ్వి

ఆ) పురోహితుడు వివాహ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు.
(గీత గీసిన పదానికి సరైన వ్యుత్పత్త్యర్థాన్ని గుర్తించండి.) (1 మా)
అ) విశ్వానికి నాథుడు (శివుడు)
ఆ) మరణం లేనివాడు (వేల్పు)
ఇ) పురమునకు హితము చేయువాడు (బ్రాహ్మణుడు)
ఈ) భూమిని పాలించువాడు (రాజు)
జవాబు:
ఇ) పురమునకు హితము చేయువాడు (బ్రాహ్మణుడు)

18. అతడు చేయి తిరిగిన రచయిత,
(వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి విడిగా రాయండి.) (2 మా)
జవాబు:
చేయి తిరిగిన

19. “వెన్నుచూపు” – ఈ జాతీయాన్ని ఏ అర్థంలో/సందర్భంలో ఉపయోగిస్తారో రాయండి. (2 మా)
జవాబు:
పరాక్రమవంతులకు ఉండకూడని లక్షణాలను వివరించే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.

AP 10th Class Telugu Model Paper Set 9 with Solutions

కింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి. (14 × 1 = 14 మా)
20. నీవు కష్టపడు. ఫలితం దక్కుతుంది.
(గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి.) (1 మా)
జవాబు:
కష్టం + పడు

21. దీపము + లు (సంధి పదాలను కలిపి రాయండి.) (1 మా)
జవాబు:
దీపాలు

22. వరదలు ప్రజలకు అత్యంత దుఃఖాన్ని కలిగించాయి.
(గీత గీసిన పదం ఏ సంధికి చెందినదో గుర్తించండి.) (1 మా)
అ) వృద్ధిసంధి
ఆ) గుణసంధి
ఇ) యణాదేశ సంధి
ఈ) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
ఇ) యణాదేశ సంధి

23. ప్రతి దినము వ్యాయామం చేయాలి.
(గీత గీసిన పదానికి విగ్రహవాక్యం రాయండి.) (1 మా)
జవాబు:
దినము + దినము

24. ప్రజలందరు ధర్మపథములో పయనించాలి.
(గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.) (1 మా)
అ) బహువ్రీహి సమాసం
ఆ) ద్వంద్వ సమాసం
ఇ) ద్విగు సమాసం
ఈ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
జవాబు:
ఈ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

25. మతములన్నియు ఒక్క మమతకై పుట్టినవి.
(ఈ వాక్యానికి సరైన ఆధునిక వచనాన్ని గుర్తించండి.) (1 మా)
అ) మతములు అన్ని ఒక్క మమత కోసము పుట్టాయి.
ఆ) మతాలు అన్ని ఒక్క మమతకై పుట్టినవి.
ఇ) మతాలు అన్నీ ఒక్క మమత కోసమే పుట్టాయి.
ఈ) మతాలు అన్నియు నొక్క మమత ఓసం పుట్టినవి.
జవాబు:
ఆ) మతాలు అన్ని ఒక్క మమతకై పుట్టినవి.

26. ఆ చిత్రాన్ని చూసి అందరూ మెచ్చుకున్నారు.
(ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం రాయండి.) (1 మా)
జవాబు:
ఆ చిత్రాన్ని చూసి ఎవరూ మెచ్చుకోలేదు.

27. కింది వాటిలో వ్యతిరేకార్థక క్రియాపదాన్ని గుర్తించండి.
అ) మాట్లాడితే
ఆ) మాట్లాడక
ఇ) మాట్లాడుతూ
ఈ) మాట్లాడి
జవాబు:
ఆ) మాట్లాడక

28. జీవని చిత్రాలెన్నో గీచింది. జీవని ప్రథమ బహుమతిని పొందింది.
(ఈ సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యంగా మార్చి రాయండి.) (1 మా)
జవాబు:
జీవని చిత్రాలెన్నో గీచి ప్రథమ బహుమతి పొందింది. 29. ఈ – వైద్యం వైద్యునిచే చేయబడింది.

29. వైద్యుడు వైద్యం చేశాడు. (సరైన కర్మణి వాక్యాన్ని గుర్తించండి.) (1 మా)
అ) వైద్యం వైద్యుడు చేయించాడు.
ఇ) వైద్యం చేయించుకోవాలి.
ఆ) వైద్యం చేయబడుతుంది.
ఈ) వైద్యం వైద్యునిచే చేయబడింది.
జవాబు:
ఈ) వైద్యం వైద్యునిచే చేయబడింది.

30. “నేను వస్తాను” అని శర్మ శాస్త్రితో అన్నాడు.
(ప్రత్యక్ష వాక్యాన్ని పరోక్ష వాక్యంగా మార్చి రాయండి.) (1 మా)
జవాబు:
తాను వస్తానని శర్మ శాస్త్రితో అన్నాడు.

31. అమ్మా ! మీరెందుకలా విచారిస్తారు?
(ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో రాయండి.) (1 మా)
జవాబు:
ప్రశ్నార్ధక వాక్యం

32. ఆంజనేయుడు సముద్రాన్ని దాటగలడు.
(ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో గుర్తించండి.) (1 మా)
అ) సామర్ధ్యార్ధకం
ఆ) ఆశ్చర్యార్థకం
ఇ) నిషేధార్థకం
ఈ) ప్రార్థనార్థకం
జవాబు:
అ) సామర్ధ్యార్ధకం

33. తల్లిదండ్రుల మనస్సు నొప్పించవద్దు.
(ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో రాయండి.) (1 మా)
జవాబు:
నిషేధార్థక వాక్యం

Leave a Comment