Access to the AP 10th Class Telugu Guide 9th Lesson రాజధర్మం Questions and Answers are aligned with the curriculum standards.
రాజధర్మం AP 10th Class Telugu 9th Lesson Questions and Answers
చదవండి ఆలోచించి చెప్పండి.
బుద్ధిమంతుండు సాధించు బుద్ధి చేత
బాహు బలుడు జయించు దోర్బలము చేత
యోగ్యుడైన నరేశుడు యుక్తి చేత
గార్యసిద్ధిని జెందును గౌరవేశ! (విదుర నీతి ద్వితీయాశ్వాసం 26 పద్యం)
ప్రశ్నలు జవాబులు
ప్రశ్న 1.
బుద్ధిబలం గొప్పదా? భుజబలం గొప్పదా?
జవాబు:
భుజబలం కంటే బుద్ధిబలమే గొప్పది.
ప్రశ్న 2.
యోగ్యుడైన రాజు ఎలా పనులు చక్కబెడతాడు?
జవాబు:
యోగ్యుడైన రాజు యుక్తితో పనులు చక్కబెడతాడు.
ప్రశ్న 3.
అనుకున్న పనిని సాధించాలంటే ఎలా ప్రయత్నించాలి?
జవాబు:
అనుకున్న పనిని సాధించాలంటే యుక్తితో ప్రయత్నించాలి.
ఇవి చేయండి
అవగాహన – ప్రతిస్పందన
ఆ) కింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. రాయండి.
ప్రశ్న 1.
కన్నొ కటి…. దృష్టి వలయు పద్య భావాన్ని సొంత మాటల్లో చెప్పండి.
జవాబు:
రాజు చాలా జాగరూకతతో ఉండాలి. ఎలుగుబంటి చెట్టుకొమ్మ మీద పడుకొని, ఒక కన్ను మూసి నిద్రపోతున్నా, రెండవ కన్ను తెరచి మెలకువగా ఉంటుంది. అదే విధంగా పాలకుడు కూడా సుఖాలు అనుభవిస్తూనే ఇంటా, బయటా ఉన్న శత్రువులపై ఒక కన్ను వేసి ఉంచాలి.
ప్రశ్న 2.
పాలకులకు, పాలితులకు మధ్య ఎలాంటి సంబంధాలు ఉండాలో తెలపండి.
జవాబు:
ప్రజలు కరువు కాటకాలతో పంటలు నష్టపోయి, బతకలేక దేశం విడిచిపోతే, అధికారులు పట్టించుకోవాలి. వాళ్ళను రప్పించి సాగుబడికి వసతులు కల్పించి, వారు కోలుకునేటట్లు చేయాలి. పేదవాడు డబ్బు రూపంలో చెల్లించే పన్నులు, పంట రూపంలో చెల్లించే పన్నులు తగ్గించాలి. వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిస్తే ధర్మార్థాలు సిద్ధిస్తాయి. ఈ విధంగా పాలకులు, పాలితుల (ప్రజలు) పట్ల వ్యవహరించాలి.
ఆ) కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
క. తన కధికుల కతిభక్తియు
మనమున నెయ్యంబు దన సమానులకును, హీ
మునియందు గృపయు జేకొని
మను జనునకు వగయు గలదె మది బరికింపన్ – నన్నెచోడుడు (కుమారసంభవము)
ప్రశ్న 1.
పాలకుడు తనకంటే గొప్పవాళ్ళతో ఎలా ఉండాలి?
జవాబు:
మానవుడు తన కంటే గొప్పవాళ్ళతో అతి భక్తితో నడుచుకోవాలి.
ప్రశ్న 2.
తనతో సమానమైన వాళ్ళతో ఎలా ఉండాలి?
జవాబు:
తనతో సమానమైన వాళ్ళతో స్నేహంతో నడవాలి.
ప్రశ్న 3.
తనకంటే తక్కువ వాళ్ళతో ఎలా ఉండాలి ?
జవాబు:
తనకంటే తక్కువ వాళ్ళ పట్ల దయ కలిగి ఉండాలి.
ప్రశ్న 4.
ఈ పద్యానికి ఒక శీర్షిక పెట్టండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘సత్ప్రవర్తన’.
ఇ) కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
తంజావూరు నాయక రాజులలో ప్రసిద్ధుడు రఘునాథ రాయలు. అతడు క్రీస్తు శకం 1600 మొదలు 1630 వరకు తంజావూరుని పాలించిన పండిత కవి. శ్రీకృష్ణదేవరాయల అంతటివాడు. శత్రువులను నిర్మూలించడంలో పరాక్రమశాలి. జనరంజకంగా దేశాన్ని పరిపాలించుటలో నేర్పుగల రాజనీతి నిపుణుడు. సహృదయులు మెచ్చేటట్లు రసభావ కవిత సంస్కృతంలో, తెలుగులో చెప్పగల విద్వత్కవి.
రఘునాథుని చతురంగ బలాలలో చేమకూర వెంకట కవి సైనిక ఉద్యోగిగా ఉండేవాడు. రాజాస్థానాలలో ఎక్కువగా తిరగడం వలన చేమకూర కవికి పలువురు ప్రభువులతో పరిచయం కలిగి వారి వారి గుణగణాలను, వైరాలను, వైషమ్యాలను, స్పర్ధలను చాలా సమీపంలో ఉండి సునిశితంగా పరిశీలించే అవకాశం దొరికింది. అందుకే తన విజయ విలాస కావ్యంలో రఘునాథుని ముఖప్రీతి కోసం ఎదుటివారిని ప్రశంసించడని మంచి చెడులను గుర్తించి ఉద్యోగులను గౌరవిస్తాడని, ఎవరైనా సహాయం కోరి వస్తే అరకొరగా కాకుండా సంపూర్ణంగా సహాయం చేస్తాడని వర్ణించాడు.
రఘునాథునికి అసాధ్యాలనుకునే కార్యాలను సాధించే నేర్పు, ఎటువంటి మహత్తర కార్యాన్నైనా బాధ్యతగా నిర్వహించే ఓర్పు ఉన్నాయి. ఒకరి సలహా లేకుండా చిత్తశుద్దిగా పనిచేసే ఉద్యోగులను సమృద్ధిగా ఆదరించేవాడు. యాచకుల కొరకు సత్రాలు కట్టించి, ప్రతిరోజు వేలమంది ప్రజలకు అన్నదానం చేయించాడు. అతనిది ప్రజానురంజకమైన పాలన అని చేమకూర వెంకట కవి అభివర్ణించాడు. – తాపీ ధర్మారావు
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
రఘునాథ రాయలను రచయిత ఎవరితో పోల్చాడు?
జవాబు:
రఘునాథ రాయలను రచయిత శ్రీకృష్ణదేవరాయలతో పోల్చాడు.
ప్రశ్న 2.
ఇతరులతో రఘునాథుని ప్రవర్తన ఎలా ఉండేది?
జవాబు:
రఘునాథుడు ముఖప్రీతి కోసం ఎదుటివారిని ప్రశంసించాడు.
ప్రశ్న 3.
యాచకుల కోసం. రఘునాథుడు ఏం చేశారు?
జవాబు:
యాచకుల కోసం రఘునాథుడు సత్రాలు కట్టించి, అన్నదానం చేయించాడు.
ప్రశ్న 4.
రఘునాథుడు తన సేవకులను ఎలా ఆదరించారు?
జవాబు:
రఘునాథుడు మంచి, చెడులను గుర్తించి ఉద్యోగులను గౌరవిస్తాడు.
ప్రశ్న 5.
చేమకూర వెంకట కవి రాజాస్థానాల్లో ఏం తెలుసుకోగలిగారు?
జవాబు:
చేమకూర వెంకట కవి రాజాస్థానాల్లోని పలువురు ప్రభువులతో పరిచయం కలిగి వారి వారి గుణగణాలను, వైరాలను, వైషమ్యాలను, స్పర్థలను చాలా సమీపంలో ఉండి, సునిశితంగా పరిశీలించాడు.
ఈ) కింది వానికి అర్ధ సందర్భాలు రాయండి.
ప్రశ్న 1.
శరమాగి కాడవిడుచు వింటివాడు వోలె
జవాబు:
అర్థము : గురి కుదిరిందో లేదో చూసుకుని బాణమును విడుచు విలుకాని వలె.
సందర్భము : తప్పు చేసినవాడిని వెంటనే దండించరాదు. పాలకుడు కోపాన్ని అదుపులో ఉంచుకుని సమయం చూసుకుని – దోషిని శిక్షించాలి అని చెప్పిన సందర్భంలోనిది.
ప్రశ్న 2.
ఏడు దీవులు గొన్న సమృద్ధి లేదు
జవాబు:
అర్ధము : ప్రజల కష్టాలను పట్టించుకోని అధికారులున్న పాలకుడు ఏడు ద్వీపాలకు అధిపతి అయినా అతని సంపదలు నిలువవు.
సందర్భము : ప్రజలు కరువు కాటకాలతో పంటలు నష్టపోయి, బతక లేక దేశం విడిచిపోతే అధికారులు పట్టించుకోవాలి. అని చెప్పిన సందర్భంలోనిది.
ప్రశ్న 3.
చతురవృత్తి జరించుట నీతి రేనికి
జవాబు:
అర్థము : రాజు అందరికీ హితునిగా కన్పిస్తూ తెలివితేటలతో నేర్పుగా నడుచుకోవాలి.
సందర్భము : రాజు దగ్గర హితులు, హితాహితులు, అహితులు అనే ముగ్గురు అనుచరులుంటారు. ఈ ముగ్గురి విషయంలో పాలకుడు హితునిగా, హితాహితునిగా, అహితునిగా ప్రవర్తిస్తూ, అందరికీ హితునిగా కనిపించాలని చెప్పిన సందర్భంలోనిది.
ప్రశ్న 4.
బహిరంతరరులపై దృష్టి వలయు
జవాబు:
అర్థము : పాలకుడు ఇంటా, బయటా ఉన్న శత్రువులపై ఒక కన్ను వేసి ఉంచాలి.
సందర్భము : ఎలుగుబంటి చెట్టు కొమ్మ మీద పడుకొని ఒక కన్ను మూసి నిద్రపోతున్నా, రెండవ కన్ను తెరచి మెలకువగా ఉన్నట్లు రాజు చాలా జాగరూకతతో ఉండాలని చెప్పిన సందర్భంలోనిది.
ఉ) క్రింది ప్రశ్నలకు ఏకవాక్య సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
ఈ పాఠం ఏ కావ్యం నుండి స్వీకరించబడింది?
జవాబు:
‘రాజధర్మం’ అను ప్రస్తుత పాఠ్యభాగం శ్రీకృష్ణదేవరాయలు రచించిన ‘ఆముక్తమాల్యద’ ప్రబంధం చతుర్ధాశ్వాసం నుండి స్వీకరించబడింది.
ప్రశ్న 2.
ముఖ్యమైన పనులను పాలకుడు ఎవరికి అప్పగించకూడదు?
జవాబు:
ముఖ్యమైన పనులను పాలకుడు, చెడ్డవాళ్ళకి అప్పగించకూడదు.
ప్రశ్న 3.
పాలకుడు దేశాన్ని ఎవరిలాగా కాపాడుకోవాలి?
జవాబు:
ఎలుగుబంటి చెట్టుకొమ్మ మీద పడుకొని, ఒక కన్ను మూసి నిద్రపోతున్నా, రెండవ కన్ను తెరచి మెలకువగా ఉండి ఏ విధంగా అయితే ఇతర క్రూర జంతువుల నుండి తన్ను తాను రక్షించుకుంటుందో, అదే విధంగా పాలకుడు చాలా జాగరూకతతో ఉండి దేశాన్ని కాపాడుకోవాలి.
వ్యక్తీకరణ సృజనాత్మకత
ఆ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
చెడ్డవారిపై ఏ భారం పెట్టకూడదు?
జవాబు:
చెడ్డవారికి ముఖ్యమైన కార్యక్రమాలను, బాధ్యతలను అప్పగించకూడదు. గుణహీనుడైన వాడిని మంత్రిని చేయకూడదు. ధనం సమీకరించే పనుల్లో చెడ్డవారిని అధికారులుగా నియమించకూడదు. చెడ్డవారిపై ప్రజాపాలనకు సంబంధించిన ఏ భారం పెట్టకూడదు. దానివల్ల ఇటు ప్రజలు, అటు రాజు నష్టపోతారు.
ప్రశ్న 2.
తప్పు చేసిన వారిని దండించే విధానం గురించి చెప్పండి.
జవాబు:
రాజు తప్పు చేసిన వాడిని వెంటనే దండించకూడదు. సమయం వచ్చేదాకా కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. చేతిలో విల్లు, బాణాలు ఉన్నాయి కదా అని బాణాన్ని ఎప్పుడంటే అప్పుడు విడువకూడదు. గురి కుదిరిందో, లేదో చూసుకుని విలుకాడు బాణం వేస్తాడు. అదేవిధంగా పాలకుడు సమయం చూసుకొని దోషిని శిక్షించాలి.
ప్రశ్న 3.
నిజాయితీగా పనిచేసే సేవకుడిని ఎలా గౌరవించాలి?
జవాబు:
నిజాయితీగా పనిచేసే సేవకుడిని పాలకుడు అకస్మాత్తుగా గౌరవించి ఆశ్చర్యం కలిగించాలి. అది ఎలా అంటే చిత్తశుద్ధిగా పనిచేస్తూ రాజ్యానికి మేలు చేసే సేవకుణ్ణి పాలకుడు గుర్తించాలి. అతడు అడగకుండానే, ఇంకొకరు చెప్పకుండానే అతని ఊహకందనంత సొమ్ము ఒక్కసారిగా ఇవ్వాలి. అది అతడు కలగన్నట్లుగా ఉండాలి. సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తాలి.
ఆ) కింది ప్రశ్నలకు ఎనిమిది లేదా పది వాక్యాలలో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
యామునాచార్యులు చెప్పిన రాజనీతి సారాంశాన్ని మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
యామునాచార్యులు చెప్పిన రాజనీతి
యామునాచార్యులు విష్ణుమూర్తి కృపకు పాత్రుడై వైష్ణవ సిద్ధాంతాన్ని ఉద్ధరించిన ఆళ్వార్లు. పూర్వం పాండ్యరాజునకు వెర్రి శైవము ముదిరి విష్ణువుపై ద్వేషముతో ఉండేవాడు. అటువంటి పాండ్యరాజును, యామునాచార్యులు తన శాస్త్ర పాండిత్యముతో జయించి అర్ధరాజ్యం గెలుచుకొన్నాడు. కొంతకాలం పాలన చేశాక, గురూపదేశంతో రాజ్యాన్ని కుమారునికి అప్పగించి, గొప్ప నాయకులుగా ఎదగడానికి అవసరమైన రాజధర్మాలను, సామర్థ్యాలను బోధించాడు.
పాలకుడు తాను ఎటువంటి కష్టాల్లో ఉన్నా విసుక్కోకుండా ప్రజలను కాపాడాలి. ముఖ్యమైన కార్యక్రమాలను, బాధ్యతలను చెడ్డవాళ్ళకు అప్పగించకూడదు. మంచివాడైన సేవకుడి ప్రవర్తనను గమనిస్తూ, క్రమంగా అతని స్థాయిని పెంచుతూ సమయానికి తగినట్లు పనులు చేయించుకోవాలి. గుణహీనుణ్ణి మంత్రిని చేయకూడదు. పాలనకు సాయంగా ఉండే అధికారులతో పిసినారితనం, క్రూరత్వం ఉండక, నిబద్ధత, మిత్రత్వం కలిగి ఉండాలి. చాడీలు చెప్పే వారిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించకుండా, ప్రమాదం లేనిచోట నియమించి, వారిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి.
పేదవాడి ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు పన్నులు తగ్గించాలి. దేశంలో చెరువులు, కాలువలు తవ్వించాలి. కరువు కాటకాలతో ప్రజలకు పంట నష్టం వస్తే, వారి సాగుబడికి వసతులు కల్పించి, కోలుకునేటట్లు చేయాలి. రాజు నీతి మార్గాన్ని వీడకూడదు. సేవకులను తీవ్రంగా శిక్షించకూడదు. సుఖాలను అనుభవిస్తూనే ఇంటా, బయటా ఉన్న శత్రువులపై ఒక కన్ను వేసి ఉంచాలి. తప్పు చేసినవాడిని వెంటనే శిక్షించకూడదు. హితులు, హితాహితులు, అహితుల పట్ల పైకి అందరికీ హితునిగా కనిపిస్తూ, నేర్పుగా ఉండాలి. నిజాయితీగా పనిచేసే సేవకులను గౌరవించి, ఊహకందనంత సొమ్ము ఇవ్వాలి.
ప్రశ్న 2.
అనుచరులు ఎన్ని రకాలుగా ఉంటారు? వారి స్వభావాలను విశ్లేషించండి.
జవాబు:
రాజు దగ్గర ఉండే అనుచరులు మూడురకాలుగా ఉంటారు. ఒకరు హితులు. వీరు ఎప్పుడూ రాజు మేలే కోరుతారు. రెండవవారు హితాహితులు. వీళ్ళు రాజు మేలు కోరుతూనే, ఇతరుల ప్రలోభాలకు లోనై అహితులుగా మారుతుంటారు. మూడవవారు అహితులు. వీరెప్పుడూ రాజు మేలు కోరరు.
వీరి స్వభావాలు : వైద్యులు, జ్యోతిషులు, పండితులు, కవులు, పురోహితులు వీరంతా రాజు మేలు కోరే హితులు. ధనం సమీకరించే పనుల్లో ఉన్న అధికారులు హితులవుతారు. ఆ ధనాన్ని దొంగిలించి, దొరికితే ఎక్కడ శిక్షిస్తాడో అన్న భయంతో రాజుకు అహితులు కూడా అవుతారు. మరికొందరు పూర్తిగా అహితులే. ఎప్పుడూ ఏదొక తప్పు చేసి దొరికి పోతుంటారు. అప్పుడు పాలకుడు చట్ట ప్రకారం వాళ్ళ సంపాదనంతా రాజ్యపరం చేస్తారు. దాంతో వాళ్ళు రాజును అదును చూసి దెబ్బతీయడానికి చూస్తారు.
ప్రశ్న 3.
ప్రజలు నష్టపోయినప్పుడు వారిని పాలకులు, అధికారులు ఎలా ఆదుకోవాలి?
జవాబు:
ప్రజలు నష్టపోయినపుడు పాలకులు, అధికారులు ఆదుకోవల్సిన విధం
ఆపదలో ఉన్నవాళ్ళు రాజును ఆశ్రయించి, తమ బాధలు చెప్పుకున్నప్పుడు వాటిని శ్రద్ధగా విని, వారి బాధ పోగొట్టాలి. పేదవాడు డబ్బు రూపంలో చెల్లించే పన్నును, పంట రూపంలో చెల్లించే పన్నును తగ్గించాలి. ప్రజలు కరువు, కాటకాలతో పంటలు నష్టపోయి, బతకలేక దేశం విడిచిపోతే, అధికారులు పట్టించుకోవాలి. వాళ్ళను రప్పించి సాగుబడికి వసతులు కల్పించి, వారు కోలుకునేటట్లు చేయాలి. అంతే తప్ప వాళ్ళు వదిలి వెళ్ళిన పశువులను, ధాన్యాలను, వాళ్ళ ఇంటి కలపను ఆశించి, యుద్ధభూమిలో శవాలను పీక్కుతినే నక్కల్లా వ్యవహరించకూడదు. ప్రజల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే విధంగా ఆలోచించాలి, ఆదుకోవాలి.
ఇ) కింది సృజనాత్మక ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
మీరు పాఠశాలకు నాయకులైతే ఏయే కార్యక్రమాలను ఏ విధంగా నిర్వహిస్తారో తెలియజేస్తూ ఒక వ్యాసం రాయండి.
జవాబు:
నేనే పాఠశాలకు నాయకుడు (వ్యాసం)
పాఠశాల నాయకత్వం : దీర్ఘకాలిక విజయాన్ని సాధించడం ద్వారా పాఠశాల కీర్తిని నిర్మించడం మరియు మెరుగుపరచడం. దీనిలోని ప్రధాన ఉద్దేశం. సమర్ధవంతమైన పాఠశాల నాయకత్వం దీర్ఘకాలిక విజయాన్ని సాధించడం ద్వారా పాఠశాల ఖ్యాతిని నిర్మించడంలో మరియు మెరుగుపరచడంలో సహాయపడుతుంది. “నిర్వహణ అనేది సరైన పనులు చేయడం గురించి పడే బాధ్యతే కాని అధికారం కాదు”. పాఠశాల నాయకత్వం అసాధారణమైన సంస్థాగత సామర్థ్యాలు, ఆరోగ్యకరమైన దృష్టి, సానుకూల దృక్పథం, అధిక అంచనాలు మరియు ఉన్నత ప్రమాణాలు కలిగి ఉన్న వ్యవస్థ.
ఇటువంటి గొప్ప పాఠశాల వ్యవస్థ యొక్క కార్యకలాపాలకు నేను జవాబుదారీతనం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. దీనిలో భాగంగా నేను నాలుగు అంశాలతో ఒక ప్రణాళిక రూపొందించాను.
- అసాధారణమైన ప్రణాళికను రూపొందించడం.
- ఆ ప్రణాళికను అమలు చేయడం.
- ప్రణాళికకు మద్దతుగా వనరులు/సాంకేతికతను అందుబాటులో ఉంచడం.
- ఉత్తమ ఫలితాలను పొందడం కోసం ఏడాది పొడవునా మొత్తం ప్రక్రియను నిర్వహించడం.
పాఠశాల అభివృద్ధి కోసం నాతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పనిచేసేలా, బాధ్యతగా నడుచుకుంటాను. ముఖ్యంగా వారి ఆలోచనలు కార్యాచరణలో పెట్టి పాఠశాల ఉన్నతికి తోడ్పడతాను. పనిని విభజించి విద్యార్థులను, వారిని లీడ్ చేయడానికి కొందరు ఉపాధ్యాయులను బృందాలుగా ఏర్పాటు చేస్తాను.
నిర్వహించు కార్యకలాపాలు : పాఠశాల మొత్తం పరిశుభ్రతను నిర్వహించడం మరియు ప్రోత్సహించడం, పిల్లలను క్రీడల్లో ఎక్కువగా పాల్గొనేలా ప్రోత్సహించడం మరియు వివిధ పోటీల్లో పాఠశాలకు ప్రాతినిధ్యం వహించడం, విద్యా కార్యక్రమాలను నిర్వహించడం, సామాజికంగా ముందుకు సాగడానికి తరగతి గది విద్యార్థులకు తోడ్పడేలా చూడడం, విద్యార్థులందరూ తప్పనిసరిగా తరగతులకు హాజరు కావడం, పాఠశాల కార్యక్రమాలలో విద్యార్థులంతా చురుకుగా పాల్గొనేలా చూడడం మొదలైనవి మా బృందాలు నిర్వహించే కార్యకలాపాలు.
ఇవన్నీ సరిగా జరుగుతున్నాయా, లేదా అనేది నేను పర్యవేక్షిస్తాను. దృఢమైన ఆత్మవిశ్వాసంతో నా పనులను నిర్వహిస్తాను. మిగతా విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తాను. మహాత్మాగాంధీ, అబ్రహంలింకన్ వంటి మహనీయుల చరిత్రలను చదివి వారి నాయకత్వ విధానాలను నేను ప్రేరణగా పొంది, మా పాఠశాలను మిగిలిన పాఠశాలలకు ఆదర్శంగా నిలుపుతాను.
ప్రశ్న 2.
మీ గ్రామ/పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రజా ప్రతినిధి సేవలను అభినందిస్తూ అభినందనపత్రాన్ని తయారు చేయండి. అభినందన పత్రం
జవాబు:
మా గ్రామ/పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రజాప్రతినిధి సేవలను అభినందిస్తూ రూపొందించిన అభినందన పత్రం.
ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకొనే ప్రజాస్వామ్యానికి ఊపిరిలూదిన ఎందరో మహనీయులకు వారసుడిగా నిల్చిన మా ప్రాంత ప్రజా ప్రతినిధి గౌరవనీయులు శ్రీ……..గారు. మంచి మాటతీరుతో ఇటు ప్రజల మన్ననలను, తాటు విమర్శకుల అభినందనలు అందుకున్న గొప్ప నాయకుడీయన. ఓట్లు వేసేవరకే ప్రజలు, ఆ తర్వాత పట్టించుకోరు నాయకులు అన్న అపవాదును తుడిచేస్తూ, నిరంతరం ప్రజల మధ్యే ఉండే మా మంచి M.L. A. మీరే. దామోదరం సంజీవయ్యగారు, పుచ్చలపల్లి సుందరయ్యగారు, బాబూ జగ్జీవన్ రామ్ గారు ఇలా ఎందరో మహనీయులను ఆదర్శంగా తీసుకొని ప్రజాసేవ చేస్తున్న మీకు అభినందనలు. ప్రజా సమస్యలే మీ సమస్యలుగా భావించి, ప్రజల కోసం అధికారులను, -మీ తోటి ప్రజా ప్రతినిధులను కలుపుకొని ప్రజల అవసరాలు తీర్చిన ప్రజా నాయకుడు మీరే. ఎన్నికల ముందు నుంచి ప్రజల్లో చైతన్యం తెచ్చారు. “ఓటును వోటు కోసం వేయద్దు. పార్టీ జెండాలు కన్నా జాతీయ జెండా మిన్న” అంటూ మీరు చెప్పిన మాటలు ఇప్పటికీ మా చెప్పుల్లో మారు మ్రోగుతున్నాయి. మీ తండ్రిగారి పేరు మీదుగా కంటి ఆసుపత్రి ఏర్పాటు చేసి ఎందరో పేదలకు కంటి చూపు అయ్యారు. మీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో గుప్త దానాలు చేశారు. పాఠశాలలు, కళాశాలలు సందర్శించి యువతను రాజకీయాల్లోకి ఆహ్వానించారు. ప్రజా చైతన్యం విద్య ద్వారానే వస్తుందని మమ్మల్నందరిని బాగా చదువుకొని, దేశసేవ కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. ఇన్ని మంచిగుణాలున్న మిమ్మల్ని సన్మానించుకోవడం, అభినందన పత్రం రాయడం మాకు సంతోషాన్ని కలిగిస్తోంది. మీరు మరోమారు మా ప్రజాప్రతినిధిగా గెలవాలని ఆశిస్తూ ఇట్ల |
భాషాంశాలు
పదజాలం
అ) కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి, ఆ అర్థాలతో వాక్యాలు రాయండి.
ఉదాహరణ : కాపురుషులకు ఏ పనులు అప్పగించరాదు.
కాపురుషుడు చెడ్డవాడు, దుష్టుడు
దుష్టుల సహవాసం పనికిరాదు.
1. మన స్వప్నం సాకారం కావడానికి బాగా కృషి చేయాలి.
స్వప్నం = కల, నిద్ర
సొంతవాక్యం : కలలు కనండి. వాటిని సాకారం చేసుకోండి.
2. ఆస్థ కలిగిన ఉద్యోగులే నిజాయితీగా పని చేస్తారు.
ఆస్థ = శ్రద్ధ, అక్కర, ఆసక్తి
సొంతవాక్యం పిల్లలకు చదువు పట్ల ఆసక్తి ఉండాలి.
3. రోగులకు భిషక్కులు చికిత్స చేసి ప్రాణం పోస్తారు.
భిషక్కులు – వైద్యులు, వెజ్జులు, చికిత్సకులు
సొంతవాక్యం : ప్రభుత్వ ఆసుపత్రులలో అనేకమంది వైద్యులు పనిచేస్తున్నారు.
4. హితులు, స్నేహితులు మన జీవితాన్ని ప్రభావితం చేస్తారు.
హితులు – స్నేహితులు, మిత్రులు
సొంతవాక్యం : కుచేలుడు, శ్రీకృష్ణుని బాల్య స్నేహితుడు.
5. మృషలు చెప్పేవాడిని ఎవరు నమ్మరు.
మృషలు = అసత్యములు, అబద్ధాలు
సొంతవాక్యం హరిశ్చంద్రుడు ఎప్పుడూ అసత్యము పలుకలేదు.
ఆ) కింది పదాలకు పర్యాయపదాలు రాసి, వాటితో వాక్యాలు రాయండి.
1. కలన = యుద్ధం, కయ్యం, కలహం, అని
కయ్యానికైనా, వియ్యానికైనా సమ ఉజ్జీలు ఉండాలి.
2. బృందం = సమూహం, గుంపు, గుమి
మనం గుంపులో గోవిందలా ఉండకూడదు.
3. క్షితి = నేల, భూమి, ధరణి
జననీ, జన్మభూమి స్వర్గం కంటే గొప్పవి.
4. వ్రతము = సమూహం, కుప్ప, మూక, మంద
రాముడు వానర సమూహంతో లంకకు చేరాడు.
ఇ) కింది పదాలకు నానార్థాలను గుర్తించి జతపరచండి.
1. వృద్ధి (అ) అ) అభివృద్ధి, వడ్డీ, సంతోషం
2. నయం (ఈ) ఆ) సత్యం, నీరు, సత్ప్రవర్తన
3. ఋతం (ఆ) ఇ) రెల్లు, బాణం, నీరు
4. కాడ (ఉ) ఈ) నీతి, మృదువు, అందం
5. శరం (ఇ) ఉ) తొడిమ, బాణం
ఈ) కింది పదాలకు వ్యుత్పత్యర్థాలు రాయండి.
1. పురోహితుడు : పురమునకు హితము చేయువాడు బ్రాహ్మణుడు
2. మంత్రి : బుద్ధి సహాయుడు / ఆలోచన కర్త – సచివుడు
3. నృశంస్యము : హింసను కోరునది – క్రూరత్వం
4. దుర్గము : అభేద్యమైనది – కోట
ఉ) కింది ప్రకృతి పదాలకు వికృతులను జతపరచండి.
1. మౌక్తికం (ఆ) అ) సత్తువ
2. పశువు (ఈ) ఆ) ముత్యం
3. ద్వీపం (ఉ) ఇ) నిదుర
4. శక్తి (అ) ఈ) పసరము
5. నిద్ర (ఇ) ఉ) దీవి
వ్యాకరణాంశాలు
అ) కింది పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.
1. ఎన్నాడు : ఏ + వాడు = త్రికసంధి
2. గుణాతీతుడు : గుణ + అతీతుడు = సవర్ణదీర్ఘ సంధి
3. ఒకింత : ఒక + ఇంత = అత్వసంధి
4. దీవులుగొన్న : దీవులు + కొన్న = గ,స,డ,ద,వా,దేశ సంధి
5. మృషయేని : మృష + పని = యడాగమ సంధి
ఆ) కింది సంధి కార్యాలను పూరించండి.
సంధి పదం | విడదీసి రాయడం | సంధి పేరు |
ఎదఁగోరు | ఎదన్ + కోరు | సరళాదేశ సంధి |
ఎఱిడి | ఏ + తఱి | త్రికసంధి |
తదంతరము | తత్ + అంతరము | జత్త్వ సంధి |
కన్నొకటి | కన్ను + ఒకటి | ఉత్వ సంధి |
వాడువోలే | వాడు + పోలే | గ,స,డ,ద, వాదేశ సంధి |
ఇ) సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేరు రాయండి.
1. హితాహితులు : హితులు మరియు అహితులు – ద్వంద్వ సమాసం
2. అర్ధ ధర్మాలు : అర్థము మరియు ధర్మము – ద్వంద్వ సమాసం
3. గుమ్మడికాయ : గుమ్మడి అను పేరు గల కాయ – సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
4. ఏడు దీవులు : ఏడు అను సంఖ్య గల దీవులు – ద్విగు సమాసం
5. చతుర వృత్తి : చతురమైన వృత్తి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఈ) కింది పట్టికలోని సమాస కార్యాలను పూరించండి.
సమాస పడం | విగ్రహవాక్యం | సమాసం పేరు |
కలని నక్క | కలని యందు నక్క | సప్తమీ తత్పురుష సమాసం |
వెఱకన్ను | పెఱయైన కన్ను | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం |
దేశ వైశాల్యం | దేశము యొక్క వైశాల్యం | షష్ఠీ తత్పురుష సమాసం |
అలోభము | లోభము కానిది | నఞ తత్పురుష సమాసం |
దుష్ట ప్రవర్తనుడు | దుష్టమైన ప్రవర్తన కలవాడు | బహువ్రీహి సమాసం |
శ్లేషాలంకారం
కింది వాక్యాన్ని గమనించండి.
రాజు కువలయానందకరుడు.
ఈ వాక్యంలో రాజు(చంద్రుడు) కువలయం(కలువ)కు ఆనందాన్ని కలిగిస్తాడు అని ఒక అర్ధం. రాజు (ప్రభువు) కువలయము(భూమి)నకు ఆనందం కలిగిస్తాడు అని మరొక అర్థం. ఇలా రాజు అంటే చంద్రుడు, ప్రభువు. కువలయం అంటే కలువ, భూమి అనే రెండర్థాలు వచ్చేలా ఈ వాక్యంలో ప్రయోగించారు. ఇలా విభిన్న అర్ధాలు కలిగిన పదాలను వాక్యంలో ప్రయోగించడాన్ని శ్లేషాలంకారం అంటారు.
లక్షణం: నానార్థాలను కలిగి ఉండే అలంకారం శ్లేషాలంకారం.
ఉ) కింది పద్య పాదాలను పరిశీలించి అలంకారం తెల్పండి.
1. లేమా! దనుజుల గెలువఁగ లేమా? నీవేల కడఁగి లేచితివిటురా? : యమకాలంకారము
2. ప్రాయము జలకల్లోల ప్రాయము : యమకాలంకారము
ఛందస్సు
కింది పద్యాపాదాలను పరిశీలించండి.
దీనిలోని గణాలను పరిశీలించండి.
ఇందులో గగ, భ, జ, స, నలం గణాలు ఉన్నాయి.
ఒకటవ పాదం, మూడవ పాదం గణాల సంఖ్య సమానంగా ఉంది. రెండవ పాదం, నాల్గవ పాదం గణాల సంఖ్య
సమానంగా ఉంటుంది.
కంద పద్యం లక్షణాలు
- ఇందులో చతుర్మాత్రా గణాలైన భ, జ, స, నల, గగ గణాలుంటాయి.
- ఒకటవ మూడవ పాదాలలోని గణాల సంఖ్య, రెండవ, నాల్గవ పాదాలలోని గణాల సంఖ్య సమానంగా ఉన్నాయి.
- ఒకటి,రెండు పాదాల్లో (3+5) 8 గణాలుంటాయి. మూడు, నాలుగు పాదాల్లో (3+5) 8 గణాలుంటాయి.
- ప్రాస ఉంటుంది.
- రెండు, నాలుగు పాదాల్లో చివరి అక్షరంగా గురువు ఉంటుంది.
- రెండు, నాలుగు పాదాల్లో 1-4 గణాల మొదటి అక్షరాలకు యతిమైత్రి చెల్లుతుంది.
- ఆరవ గణం ‘జ ‘ గణం గాని, ‘నలం’ గణం గాని ఉంటుంది.
- బేసి గణాలైన 1,3,5,7, గణాలలో ‘జ’ గణం రాకూడదు.
- మొదటి పాదం గురువుతో ప్రారంభమైతే తక్కిన పాదాలు కూడా గురువుతోను, లఘువుతో ప్రారంభమైతే తక్కిన పాదాలు లఘువుతోను ప్రారంభమవుతాయి.
పాఠ్యాంత పద్యం
ఉ. మేదుర నీతి మార్గమున మేలుని యుండెడు రాజు గల్గినన్
మేదినిలో జనంబు లెలమిన్ సుఖవృత్తిని నిద్ర గాంతు రే
బాధలు లేక మత్తుడయి పార్థివు దూరకె నిద్రవోయినన్
మోదము జెంది భూమిజనముల్ సుఖవృత్తిని నిద్ర గాంతురే. – జక్కరాజు వేంకటకవి – (ఆంధ్రకౌముందకము)
భావం: చక్కని రాజనీతి తెలిసిన పాలకుడు రాత్రి పూట కూడ ఒక కన్ను మూసి నిద్రపోయినా ఒక కన్ను తెరచి (గూఢచారులు, రక్షకభటులు పాలకునికి ఇంకొక కన్ను) ప్రజలను కాపాడుతుంటాడు. అతని రక్షణలో ప్రజలు గుండెలమీద చేతులు వేసుకుని హాయిగా నిద్రపోతారు. కానీ ప్రజలను పట్టించుకోకుండా పాలకుడు సుఖాల మైకంలో మునిగి కళ్ళు మూసుకుపోతే ప్రజలు క్షణక్షణం భయంతో కంటినిండా నిద్రకూడ పోలేరు. రాజనీతి తెలిసిన ప్రభువు పాలనలో ప్రజలు సుఖపడతారు.
సూక్తి: చెక్కు చెదరని నీతి నిజాయితీలు కలిగి ఉండటం నాయకత్వానికి మౌళిక అర్హత. – కార్లే
అదనపు భాషాంశాలు
పర్యాయపదాలు
కాపురుషుడు : చెడ్డవాడు, దుష్టుడు
కార్యము : పని, కర్ణము
హీనం : తక్కువైనది, అధమం
శీలము : మంచినడత, పవిత్ర చరిత్ర
వృద్ధి : సమృద్ధి, ఉద్ది, పెరుగుట
వేళ : సమయం, సేపు, తఱి
నీతి : న్యాయం, పాడి, ధర్మం
గుమ్మడి : కుశ్మాండం, కుష్మాండం, కుభాండం, శ్రీ పర్ణి
మంత్రి : అమాత్యుడు, సచివుడు
ముత్యము : మౌక్తికం, ముత్తెము, ఆణిముత్యం, శుక్తిమణి
ధనం : విత్తం, సొమ్ము, డబ్బు, పైకం, అర్థం
ఆస్థ : శ్రద్ధ, ఆసక్తి
ప్రభువు : రాజు, నృపుడు, భూపతి, అవనీశుడు, రేడు
మృష : అసత్యం, అబద్దం
ఇల : భూమి, నేల, ధర, క్షితి
పేద : దరిద్రుడు, బీద, దీనుడు, బికారి, నిర్భాగ్యుడు, అశక్తుడు
కలన : యుద్ధం, కయ్యం, అని
దీవి : ద్వీపము, లంక, దిబ్బ, మిట్ట
సుహృత్ : అప్తుడు, శ్రేయోభిలాషి, స్నేహితుడు, మిత్రుడు, హితుడు
నిద్ర : నిదుర, కూరుకు, కనుమోడ్పు, కునికి పాటు, తూగు
పెఱ : ఇతర, అన్యము, పర, భిన్న, వేఱు
భూరుహం : చెట్టు, వృక్షం
అచ్ఛభల్లము : ఎలుగుబంటి, ఎలుగు గొడ్డు, ఋక్షము, భల్లూకం
భోగం : సుఖం, సంతోషం
దృష్టి : చూపు, కన్ను
హదను : అదను, సమయం, సరైన కాలం, తరుణం
అపరాధి : నేరస్థుడు, దోషకారి, తప్పుచేసినవాడు
రోషము : కోపము, కినుక, ఆగ్రహం
శరము : బాణం, అంబు, అమ్ము, కాడ
వింటివాడు : విలుకాడు, అంబకాడు, ధన్వి, ధనుష్కుడు
అనఘ : నిర్మలము, నిర్దోషము
భిషక్కు : వైద్యుడు, వెజ్జు, రోగహారి
బుధుడు : విద్వాంసుడు, పండితుడు, బుధుడు
కవి : పండితుడు, కవిత్వము చెప్పేవాడు, కావ్యకర్త
పురోహితుడు : అయ్యవారు, పురోధనుడు, సూరి, పౌరోహితుడు, కుటుంబ పూజారి
చతుర : తెలివిగల, తెలివైన, నేర్పు, నిపుణత
లెస్స : క్షేమం, మేలు, బాగు, భేష్,
మునుపు : ముందు, పూర్వం, గతం, తొల్లి లోగడ, క్రితం, ఇదివరకు
పనస : కంటక ఫలం, పయోండం, ఫల వృక్షకము, మృదంగ ఫలం
స్వప్నము : కల, స్వాపము, స్వపము, స్వపనము, ఆదర్శనం
నక్క : జంబూకం, ఫేరవం, వంచకం, సృగాలం, క్రోష్ణువు, నాక్రము
నానార్థాలు
కార్యం – పని, హేతువు, గర్భాధానం
హీనం – తక్కువైనది. నీచమైనది
శీలం – మంచి నడత, నీతి, అందం, స్వభావం
వృద్ధి – సమృద్ధి, కాంతి, ధనం, సంతోషం
వేళ – సమయం, రోజు
నీతి – న్యాయం, హక్కు, విధానం, చక్కని
ఆస్థ – ఆస్థానం, ప్రయత్నం, శ్రద్ధ, ఆశ, కొలువు
అర్థం – శబ్దార్ధం, ధనం, కారణం, ప్రయోజనం, న్యాయం
ధర్మం – పుణ్యం, న్యాయం, సామ్యం, విధి
కలన – యుద్ధం, గ్రహించుట, జ్ఞానం
పెఱ – భిన్నం, శత్రువు, తేనెతుట్టె
భోగం – సుఖం, భోజనం, ధనం
దృష్టి – కన్ను, చెడ్డ చూపు, బుద్ధి, జ్ఞానం
శరం – బాణం, రెల్లుగడ్డి, నీరు
కాడ – బాణం, తొడిమ
కవి – కావ్యకర్త, పండితుడు, శుక్రుడు, వాల్మీకి
చతుర – నేర్పరి, జింక, నాల్గవ అంకె, ఏనుగు శాల
లెస్స – క్షేమం, యోగ్యం, సులభం, అందం
పనస – ఒక చెట్టు, వేద భాగం
స్వప్నం – కల, నిద్ర, చూపు
వ్యుత్పత్యర్థములు
రాజు – ప్రజలను రంజింప (ఆనందింప చేయువాడు – ప్రభువు
నీతి – బహిక, ఆముష్మిక ఉపాయములను చెప్పునద – న్యాయం
ధర్మం – లోకాన్ని ధరించేది – పుణ్యం
అచ్ఛభల్లము – ఎదురై వచ్చి హింసించునది – ఎలుగుబంటి
దృష్టి – దీనితో చూచుదురు – కన్ను
బుధుడు – శాస్త్రము తెలుసుకొనువాడు – పండితుడు
కవి – కవిత్వము రాయువాడు – పండితుడు
పురోహితుడు – శుభాశుభ వైదిక కర్మలను చేయించు వాడు – పౌరోహితుడు
మంత్రి – బుద్ధి సహాయకుడు – సచివుడు
నృశంస్యం – హింసను కోరునది – క్రూరత్వం
దుర్గం – అభేద్యమైనది – కోట
కాపురుషుడు – దుష్ట ప్రవర్తన గల పురుషుడు – దుష్టుడు
ప్రకృతి-వికృతులు
ప్రకృతి – వికృతి
వృద్ధి – ఉద్ది, వడ్డి
మంత్రి – మంత, మంతి
ముక్తా – ముత్తెము
వ్యర్థ – పేద
పర – పెర
భోగం – బోగం
దృష్టి – దిస్టి
కవి – కయి
చతుర – చదుర
పణస – పనస
కూష్మాండ – గుమ్మడి
కార్యము – కర్జము
స్నేహము – నెయ్యము
గర్త – గుంట
ధర్మము – దమ్మము
నాక, నాక్ర – నక్కు
ద్వీపం – దీవి
లక్ష్య – లెక్క
సంధులు
ఇండ్లిలంధనం = ఇండ్ల + ఇంధనం – అత్వ సంధి
నక్కైన = నక్క + ఐన – అత్వ సంధి
కన్నొకటి = కన్ను + ఒకటి – ఉత్వ సంధి
భోగమనుభవించు = భోగము + అనుభవించు – ఉత్వ సంధి
రోషమాగి = రోషము + ఆగి – ఉత్వ సంధి
శరమాగి = శరము + ఆగి – ఉత్వ సంధి
రక్షాపరుడవు గమ్ము = రక్షాపరుడవు + కమ్యు – గసడదవాదేశ సంధి
పనిసేయక = పని + చేయక – గసడదవాదేశ సంధి
ఎవ్వాడు = ఏ + వాడు – త్రికసంధ
ఎత్తఱి = ఏ + తఱి – త్రికసంధ
మొదలఁ బెనిచి = మొదలన్ + పెనిచి – సరళాదేశ సంధి
పిదపఁగుదియింపన్ = పిదపన్ + కుదింపన్ – సరళాదేశ సంధి
అలుగుఁగాన్ = అలుగున్ + కాన – సరళాదేశ సంధి
పనులుఁగొనుము = పనులున్ + కొనుము – సరళాదేశ సంధి
నీతిందాన = నీతిన్ + తాన – సరళాదేశ సంధి
చేయఁబనిగా = చేయన్ + పనిగా – సరళాదేశ సంధి
యౌఁజుమీ = యౌన్ + చుమీ – సరళాదేశ సంధి
ఆత్మఁజింతింపు = ఆత్మన్ + చింతింపు – సరళాదేశ సంధి
పదింబదిగ = పదిన్ + పదిగ – సరళాదేశ సంధి
ప్రబలఁజేసిన = ప్రబలన్ + చేసిన – సరళాదేశ సంధి
నిర్మాగ్రహం = నీః + ఆగ్రహం – విసర్గ సంధి
బహిరంతర = బహిః + అంతర – విసర్గ సంధి
అవనీశుడు = అవని + ఈశుడు – సవర్ణదీర్ఘ సంధి
భూరుహాగ్ర – భూరుహ + అగ్రం – సవర్ణదీర్ఘ సంధి
హితాహితులు = హిత + అహితులు – సవర్ణదీర్ఘ సంధి
కవీంద్ర = కవి + ఇంద్ర – సవర్ణదీర్ఘ సంధి
ధనార్జన = ధన + అర్జన – సవర్ణదీర్ఘ సంధి
గుణాతీతం = గుణ + అతీతం – సవర్ణదీర్ఘ సంధి
తద్వశం = తత్ + వశం – జస్త్వసంధి
విపదుగ్రమంద = విపత్ + ఉగ్రదండ – జస్త్వసంధి
గుమ్మడికాయ = గుమ్మడికాయ + అంత – యడాగమసంధి
మృషయేని = మృష + ఏని – యడాగమసంధి
ఒకింత = ఒక + ఇంత – అత్వ సంధి
దీవులుగొన్న = దీవులు + కొన్న – గసడదవాదేశ సంధి
వాదువోలే = వాడు + పోలే – గసడదవాదేశ సంధి
ఎదఁగోరు = ఎదన్ + కోరు – సరళాదేశ సంధి
తదనంతరము = తత్ + అనంతరము – జస్త్వసంధి
బలవ్రాతార్ధాఢ్యత = బలవ్రాత + అర్థ + ఆఢ్యత – సవర్ణదీర్ఘ సంధి
సమాసాలు
బలవ్రాతార్ధాఢ్యత – బలవ్రాతము చేత, అర్ధము చేత అధ్యత – తృతీయా తత్పురుష సమాసం
దేశ వైశాల్యం – దేశము యొక్క వైశాల్యం – షష్ఠీ తత్పురుష సమాసం
అర్థ సిద్ధి – అర్థము యొక్క సిద్ధి – షష్ఠీ తత్పురుష సమాసం
లక్ష్య సిద్ధి – లక్ష్యము యొక్క సిద్ధి – షష్ఠీ తత్పురుష సమాసం
సుహృత్తుల యొక్క తతి – షష్ఠీ తత్పురుష సమాసం
కలని నక్క – కలని అందలి నక్క లోభము కానిది – సప్తమీ తత్పురుష సమాసం
అలోభం – లోభము కానిది – నఞ్ తత్పురుష సమాసం
ఏడు దీవులు – ఏడు అను సంఖ్య గల దీవులు – ద్విగు సమాసం
నాలుగుపాళ్ళు – నాలుగు సంఖ్య గల పాళ్ళు – ద్విగు సమాసం
త్రివిధములు – మూడు అను సంఖ్య గల విధములు – ద్విగు సమాసం
హితాహితులు – హితులు, హితులు – ద్వంద్వ సమాసం
అర్థ ధర్మాలు – అర్థము, ధర్మము – ద్వంద్వ సమాసం
అవనీశుడు – అవనికి ఈశుడైనవాడు – బహువ్రీహి సమాసం
గుమ్మడికాయ – గుమ్మడి అను పేరు గల కాయ – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
పనసపండు – పనస అను పేరు గల పండు – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
స్వశక్తి – తనదైన శక్తి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
హీనదశ – హీనమైన దశ – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
పెఱకంట – పెఱయైన కంట – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
చతుర వృత్తి – చతురమైన వృత్తి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
గుణాతీతం – గుణములకు అతీతం – షష్ఠీ తత్పురుష సమాసం
ధనార్జన – ధనము యొక్క అర్జన – షష్ఠీ తత్పురుష సమాసం
కవి పరిచయం
కవి పేరు : శ్రీకృష్ణదేవరాయలు
కాలం : 16వ శతాబ్దము
వంశం : తుళువ వంశం
పాండిత్యం : సంస్కృత, ఆంధ్ర, కన్నడ భాషలలో పండితుడు.
రచనలు : మదాలస చరిత్ర, సత్యవధూప్రీణనము, జ్ఞానచింతామణి, రసమంజరి (సంస్కృత కావ్యాలు), ఆముక్త మాల్యద (తెలుగు ప్రబంధం).
బిరుదులు : సాహితీ సమరాంగణ సార్వభౌముడు, మూరురాయరగండడు, ఆంధ్రభోజుడు.
సభ : భువన విజయం (సాహితీ సభ)లో అష్టదిగ్గజ కవి పండితులను (అల్లసాని పెద్దన…..) పోషించాడు.
ప్రసిద్ధి : తెలుగు సాహిత్యంలో రాయల యుగాన్ని ‘ప్రబంధ యుగం’ అంటారు.
శైలి : రాయలవారి రచనల్లో సామాన్య జనుల జీవితాలలో కనబడే చిన్న చిన్న సంగతులే అద్భుత రసాత్మక ఆవిష్కరణలవుతాయి. రాయలు తన చిన్నతనంలో సామాన్య ప్రజల మధ్య తిరుగుతూ, వారి జీవితాలను సూక్ష్మంగా పరిశీలించడం వల్ల సహజ సుందర వర్ణనలు వారి రచనల్లో కనిపిస్తాయి.
ఈ పాఠం దేని నుండి
గ్రహించబడింది: ప్రస్తుత పాఠ్యభాగం ‘ఆముక్త మాల్యద’ లోని చతుర్థాశ్వాసం నుండి గ్రహించబడింది.
పద్యాలు – ప్రతిపదార్థ – భావాలు
1వ పద్యం:
కం. ఏ పట్టున విసువక ర
క్షాపరుడవు గమ్ము ప్రజల చక్కి విపన్నుల్
గూపెట్టిన విని తీర్పుము
కాపురుషులమీద నిడకు కార్యభరంబుల్
ప్రతిపదార్థం :
ఏ పట్టునన్ = ఏ సమయమునందును
విసువక = వేసరక
ప్రజల చక్కిస్ = జనుల పట్లను
రక్షాపరుడవు గమ్ము = రక్షణ పరతంత్రుడవగుము
విపన్నుల్ = ఆపద నొందినవారలు
కూపెట్టినన్ = మొఱపెట్టగా
విని = ఆలకించి
తీర్పుము = వారి ఆపదలను తొలగజేయుము
కార్యభరంబుల్ = గొప్ప పనులను
కాపురుషులమీదన్ = కుత్సిత జనుల యందు
ఇడకు = ఉంచకు
భావం : పాలకుడు తాను ఎటువంటి కష్టాల్లో ఉన్నా విసుక్కోకుండా ప్రజలను కాపాడాలి. ఆపదలో ఉన్న వాళ్ళు తనను ఆశ్రయించి, తమ బాధలు చెప్పుకున్నప్పుడు వాటిని – శ్రద్ధగా విని, వారి బాధ పోగొట్టాలి. ముఖ్యమైన కార్యక్రమాలను, బాధ్యతలను చెడ్డవాళ్ళకు అప్పగించకూడదు.
2వ పద్యం:
ఆ.వె. మొదలఁ బెనిచి పిదపఁ గుదియింప నెవ్వాఁడుఁ.
దనదు తొంటిఉహీన దశఁ దలంపఁ
డలుగుఁ గాన శీలమరయుచుఁ గ్రమవృద్ధిఁ
బెనిచి వేళవేళఁ బనులుఁ గొనుము
ప్రతిపదార్థం:
మొదలన్ = ప్రథమ మందు
పెనిచి = వృద్ధి చేసి
పిదపన్ = వెనుక
కుదియింపన్ = తగ్గింపగా
ఎవ్వాడున్ = ఎటువంటివాడైనను
తనదు = తనయొక్క
తొంటి హీనదశన్ = ముందటి తక్కువస్థితిని
తలంపఁడు = గుర్తించడు.
అలుగున్ + కానన్ = కోపం చూపిస్తాడు కనుక
శీలము + అరయుచున్ = అతని నడవడి గమనిస్తూ
క్రమ వృద్ధిన్ పెనిచి = క్రమంగా అతని స్థాయిని పెంచుతూ
వేళవేళన్ = సమయానికి తగినట్లుగా
పనులు గొనుము = పనులు చేయించుకోవాలి
భావం: ఎంత మంచి వాడినైనా ముందు గొప్ప స్థాయిలో ఉంచి తర్వాత అతని స్థాయిని తగ్గించకూడదు. అతను గతంలోని తన తక్కువ స్థితిని గుర్తించడు. ఇప్పుడు తన స్థాయిని తగ్గించినందుకు పాలకుడిని ద్వేషిస్తాడు. కనుక అతని ప్రవర్తనను గమనిస్తూ, క్రమంగా అతని స్థాయిని పెంచుతూ సమయానికి తగ్గట్లుగా పనులు చేయించుకోవాలి.
3వ పద్యం:
*శా. నీతిం దాన తలంచి చేయఁ బనిగా నీ కాకపోనీ బల
ప్రాతార్థాధ్యత నెమ్మి నుండ కోరుఁ బ్రోవన్మంత్రి యంచుం గుణా
తీతుం గుమ్మడికాయ యంత యగు ముత్తెంబై మనం బేర్ప న
బ్లే తా వాతనిచేతిలో బ్రతుకువాఁడే యౌఁ జుమీ మీఁదటన్
ప్రతిపదార్థం :
నీతిన్ = రాజనీతిని
తాన తలంచి = తానే ఆలోచించి
చేయన్ = రాజ్యపాలనా పనులు చేసుకోవాలి.
పనిగానీ = ఆ పనులు అయినా
కాకపోనీ = కాకపోయినా
బలవ్రాత = సేనా సమూహం చేతను
అర్థ = ధనం చేతను
అడ్యతన్ = స్వతంత్రుడై ఉండుట చేత ఇబ్బంది లేదు.
నెమ్మిన్ + ఉండక = నెమ్మదిగా ఉండక (అలా ఉండకుండా)
గుణ + అతీతున్ = గుణశూన్యుడగు
ఒరున్ = మరొక పురుషుని
మంత్రి + అంచున్ = మంత్రిని చేసి
ప్రోవన్ = పదవినివ్వగా
గుమ్మడికాయ + అంత + అగు = మోయలేని/భరించలేని అంత
ముత్తెంబు + ఐ = ముత్యము వలె
మనంబు + ఏర్పన్
అట్లే = అదే విధంగా
మనోవ్యథ సేయగా =
తాన్ = పరాధీనుడైన తాను (అనగా రాజు)
అతని చేతిలో = ఆ గుణశూన్యుడైన మంత్రి చేతిలో
మీదటన్ = వెనుకను
బ్రతుకువాడేయౌన్ + సుమీ = అతడు చెప్పినట్లు విని జీవింప వలయు సుమీ!
భావం : రాజుకు తగిన మంత్రి అవసరం. తగిన మంత్రి దొరక్కపోతే, రాజు తానే రాజనీతిని అనుసరించి పనులు చేసుకోవాలి. ఆ పనులయినా, కాకపోయినా, ధనబలాలు ఉంటాయి. కనుక ఇబ్బంది ఉండదు. అలా కాకుండా గుణహీనుడైన వాడిని మంత్రిని చేస్తే, అతడు రాజుకు లోబడి ఉండడు. పైగా రాజే అతనికి లోబడి ఉండాలి. అటువంటి మంత్రి గుమ్మడికాయంత ముత్యం లాంటివాడు. కనుక అతడు ప్రమాదకరం. మంత్రి లేకుండానైనా రాజ్యము నడుస్తుంది కానీ గుణహీనుణ్ణి మాత్రం మంత్రిని చేయకూడదు.
4వ పద్యం:
కం॥ ధనముఖ్యము కేవల మే
పనికిన్ రా దాష్ట గలిగి పలువురు ప్రభువుల్
పని సేయక తద్వశ్యం
బువకు నలో భావ శంస్యముల్ ఋతము జెలుల్
ప్రతిపదార్థం:
పలువురు = అనేకమంది
ప్రభువుల్ = అధికారులు
ఆస్థ కలిగి = అక్కరతో, ఆసక్తితో
పని సేయక = పనిచేయక
ఏ పనికిన్ = ఏ పనియైనా
కేవల ధనముఖ్యము = ధనమే ప్రధానంగా
రాదు = నెరవేరదు
తత్ + వశ్యంబునకున్ = వారిని వశపరచుకొనుటకు
అలోభ = (వారికి ధనం ఇవ్వడంలో) పిసినారితనం లేకపోవడం
అనృశంస్యములు = క్రూరత్వం లేకపోవడం
ఋతమున్ = సత్యము
చెలుల్ = స్నేహితులు (గా ఉండవలెనని భావం
భావం: ఏ పనైనా కేవలం ధనంతోనే సాధ్యం కాదు. అధికారులు సహాయం కూడా ఉండాలి. వాళ్లు ఆసక్తిగా పనిచేయడానికి తగిన వేతనం ఇవ్వాలి. వాళ్ళ పట్ల పిసినారితనం, క్రూరత్వం ఉండకూడదు. సత్ప్రవర్తన, నిబద్ధత కలిగి ఉండాలి. మిత్రత్వం కలిగి ఉండాలి.
5వ పద్యం :
కం. మొదలనె యొరుదల కానిం
బెదరంగా వాడకాత్మఁ జింతింపు పదిం
బదిగ మృష యేని మణి విడు
ముదస్తుఁగాఁ గాక యుండ,
వొక్క మతమువన్
ప్రతిపదార్థం :
ఒరుదల కానిన్ = చాడీలు చెప్పేవానిని
మొదలనె = మొదట్లోనే (వెంటనే)
చెదరంగాన్ + ఆడక = తిట్టి దూరం చేసుకోక
ఆత్మన్ = నీ మనస్సులో
పదింబదిగన్ = లెస్సగా
చింతింపుము = విచారించుకో
మృషయేని = వాని మాట అసత్యమైనా
మరి = అంతట
ఉదస్తుగాన్ కాక = వాని పని నుండి వానిని తొలగింపక
ఒక్క మతమునన్ + ఉండన్ = వేరొకచోట ఉండేట్లు
విడుము = పంపుము
భావం : కొందరు సన్నిహితులు కూడా ఎప్పుడూ దాడీలు చెపుతుంటారు. వాళ్ళను వెంటనే బెదిరించి, తిట్టి దూరం చేసుకోకూడదు. వాళ్ల మాటలు నిజమో, కాదో బాగా పరీక్షించాలి. అబద్ధమే చెబుతున్నారని తేలినా వెంటనే ఉద్యోగం నుంచి తొలగించకూడదు. ప్రమాదం లేని చోట వాళ్లను నియమించాలి. వారిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి.
6వ పద్యం :
తే. దేశ వైశాల్య మర్థసిద్ధికిని మూల
మిల యొకింతైన గుంట కాల్వలు రచించి
నయము పేదకు నరిఁ గోరునను నొసంగి
ప్రబంఁజేసిన వర్ణ ధర్మములు పెరుఁగు
ప్రతిపదార్థం:
దేశ వైశాల్యము = దేశము యొక్క విరివి (విస్తారం)
అర్ధసిద్ధికిని మూలము = ధనప్రాప్తికి కారణం
ఇల+ఒక+ఇంత+ఐన = (ఒకవేళ భూమి విస్తారంగా లేక) భూమి కొంచమైనను
గుంట, కాల్వలు = చెరువులను, పంటకాల్వలను
రచించి
పేదకున్ = పేదవానికి
ఆరిన్ = పన్ను నందు (ధన రూపంలో)
కోరునన్ = పంట రూపమందు (ధాన్య రూపంలో)
నయము = మేలు
ఒసంగి = = కలుగచేసి.
ప్రబలన్ = వృద్ధి పొందునట్లు
చేసినన్ = చేస్తే
అర్ధ ధర్మములు = ధర్మార్థములు
పెరుగున్ = వృద్ధి పొందును
భావం : దేశాన్ని విశాలం చేస్తే ఆదాయం పెరుగుతుంది. ఒకవేళ నేల చిన్నదైతే చెరువులను, కాలువలను తవ్వించాలి. పేదవాడు డబ్బు రూపంలో చెల్లించే పన్నును, పంట రూపంలో చెల్లించే పన్నును తగ్గించాలి. వాళ్ళ ఆర్థిక స్థితిని మెరుగుపరిస్తే ధర్మార్థాలు సిద్ధిస్తాయి.
7వ పద్యం:
తే. ప్రజల విసి చన్నుఁ బిలువ కప్పసులఁ గొలుచు
నమ్మి యిండ్లింధనంబున కాయె వనెడు
కలని పక్కెన యధికారి గలనృపతికి
నేడుదీవులు గొన్న సమృద్ధి లేదు
ప్రతిపదార్థం :
ప్రజలు = ప్రజలు (రైతులు)
అవిసి = కృశించి
చన్నన్ = సేద్యము మానుకొని పోగా
పిలువక = వారలను రప్పించక
ఆ + పసులన్ = వారి పశువులను
కొలుచున్ = ధాన్యమును
అమ్మి = అమ్ముకొని
ఇండ్లు = వారి ఇళ్ళు
ఇంధనములకున్ = వంట చెరుకుగా
ఆయెన్ = పనికి వస్తుంది (అని)
అనెడు = అనునట్టి / అనుకొనే
కలని నక్క + ఐన = రణరంగంలోని నక్కలా చెడు కోరే
అధికారి గల నృపతికిన్ = ఉద్యోగి గల రాజుకు
ఏడు దీవులు = భూమి అంతా
కొన్నన్ = జయించినా
సమృద్ధి లేదు = సంపద చేకూరదు (ఉండదని అర్థం)
భావం : ప్రజలు కరువు కాటకాలతో పంటలు నష్టపోయి, బతకలేక దేశం విడిచిపోతే, అధికారులు పట్టించు కోవాలి. వాళ్లను రప్పించి సాగుబడికి వసతులు కల్పించి, వారు కోలుకునేటట్లు చేయాలి. అంతే తప్ప వాళ్లు వదిలి వెళ్లిన పశు వులను, ధాన్యాలను అమ్ముకుని, వాళ్ల ఇంటి కలపను వంట చెరకుగా వాడుకోవచ్చని సంతోషించే అధికారి యుద్ధ భూమిలో శవాలను పీక్కుతినే నక్కలాంటివాడు. అటువంటి అధికారులున్న పాలకుడు ఏడు ద్వీపాలకు అధిపతి అయినా అతని సంపదలు నిలువవు.
8వ పద్యం:
చం. ఎఱుఁగ వగువ్ స్వశక్తి వవనీశుఁడు నాలుగు పాళ్ల మూఁడు. పా
ళ్లెఱుఁగక మోచినట్టిపని క్లిష్టసుహృత్తతి దెల్పఁనొక్క పా
లెయిుఁగ నగు ను యాధ్యమతి విట్లు విరాగ్రహుడైవఁ జేయు నె
త్తఱి విపదుకదండ పరతంత్రుఁడు గాక చిరంబు రాజ్యమున్
ప్రతిపదార్థం :
అవని + ఈశుడు = రాజు
నయాఢ్యమతిన్ = నీతియుక్తమైన బుద్ధితో
నాలుగు పాళ్ళన్ మూడుపాళ్ళు = తెలుసుకోవలసిన విషయాలలో ముప్పాతిక పాలు
స్వశక్తిన్ = తన సొంత ప్రజ్ఞ చేత
ఎరుఁగనగున్ = తెలుసుకోవాలి
ఎరుంగక మోచినట్టి పనికిన్ = విషయం తెలియక సంభవించిన పనిని గూర్చిన
ఒక్కపాలు = (మిగిలిన నాలుగవ భాగాన్ని
ఇష్ట సుహృత్ తతి తెల్సన్ = ఆప్త మిత్ర బృందము తెలుపగా
ఎరుగనున్ = తెలుసుకోవాలి
ఇట్లు = ఈ విధంగా తెలుసుకుంటూ
ఏ + తఱిన్ = ఏ సమయములోనైనా
నిర్ + ఆగ్రహుడు + ఐనన్ = కోపము లేనివాడై (రాజు)
విపత్ + ఉగ్రదండ = తనకు కల్గిన ఆపదకు అపరాధుల విషయమున భయంకరమైన దండన చేయుటకు
పరతంత్రుఁడు గాక = అధీనుడు గాక (దండన చేయక)
చిరంబు = చిరకాలము (చాలాకాలం)
రాజ్యమున్+చేయును = సుఖముగా రాజ్యమును ఏలును.
భావం: రాజు ఎప్పుడూ నీతి మార్గాన్ని వదలకూడదు. తెలుసుకోవలసిన విషయాల్లో ముప్పాతిక భాగం తానే స్వయంగా స్వశక్తితో తెలుసుకోవాలి. మిగిలిన పావు భాగాన్ని ఆప్తమిత్రుల ద్వారా తెలుసుకోవాలి. అప్పుడతడు నీతిపరుడవుతాడు. తన ఇష్టానుసారం అంతా జరగాలన్న అహాన్ని విడిచి పెడతాడు. తనకు ఆపదలు కలిగినప్పుడు పారిపోడు. సేవకులను తీవ్రంగా శిక్షించడు. అటువంటి పాలకుడు సుఖంగా రాజ్యమేలుతాడు.
9వ పద్యం :
తే.గీ. కన్నొకటి నిద్రవోఁ బెఱకంట జాగ
రంబు గావించు భూరుహాగ్రంబు మీఁది
యచ్ఛభల్లంబుగతి భోగ మనుభవించు
నెడను బహిరంతరరులపై దృష్టివలయు
ప్రతిపదార్ధం:
కన్ను + ఒకటి = ఒక కన్ను
నిద్ర + పోన్ = నిద్రించగా
పెఱకంటన్ = రెండవ కంటితో
జాగరంబు + కావించు = మేలుకొన్నటువంటి
భూరుహ + అగ్రంబు మీది = చెట్టు యొక్క చివరిభాగానున్న
అచ్ఛభల్లంబు గతిన్ = = ఎలుగుబంటి వలె
భోగము + అనుభవించునెడను = రాజ్య సుఖాలను అనుభవించే సమయంలో
బహిః + అంతర + అరులపై = బయట, ఇంటా ఉన్న శత్రువులపై
దృష్టి వలయున్ = ఒక కన్ను సారించాలి
భావం: రాజు చాలా జాగరూకతతో ఉండాలి. ఎలుగుబంటి చెట్టుకొమ్మ మీద పడుకొని, ఒక కన్ను మూసి నిద్రపోతున్నా, రెండవ కన్ను తెరచి మెలకువగా ఉంటుంది. అదే విధంగా పాలకుడు కూడా సుఖాలు అనుభవిస్తూనే ఇంటా, బయటా ఉన్న శత్రువులపై ఒక కన్ను వేసి ఉంచాలి.
10వ పద్యం:
ఆ.వె. హదమ వచ్చుదాఁక నపరాధిపై రోష
నూఁగి చెంబుపవలయు హదమ వేచి
లక్ష్యసిద్ధిదాఁక లావున శర మాఁగి
కాఁడ విడుచు వింటి వాఁడు వోలె
ప్రతిపదార్ధం:
హదను వచ్చు దాఁకన్ = తనకు సమయము వచ్చు వరకును
అపరాధిపైన = తప్పుచేసిన వానిమీద
రోషమున్ = కోపాన్ని
ಆఁగి = అణచుకొని
హదను వేచి = సమయాన్ని కనిపెట్టి
లక్ష్యసిద్ధి దాఁక = గురి తనకు వశము అయ్యే వరకు
లావునన్ = తన బలిమి చేత
శరము + ఆఁగి = బాణాన్ని విడువడ
కాఁడ విడుచున్ = బాణాన్ని దిగబడునట్లు వదిలే
వింటివాఁడు + పోలెన్ = విలుకాడు వలె
చెఱపవలయున్ =
భావం : రాజు తప్పు చేసిన వాడిని వెంటనే దండించ కూడదు. సమయం వచ్చేదాకా కోపాన్ని అదుపులో ఉంచు కోవాలి. చేతిలో విల్లు, బాణాలు ఉన్నాయి కదా అని బాణాన్ని ఎప్పుడంటే అప్పుడు విడువకూడదు. గురి కుదిరిందో లేదో చూసుకుని విలుకాడు బాణం వేస్తాడు. అదేవిధంగా పాలకుడు సమయం చూసుకొని దోషిని శిక్షించాలి.
విశేషం : ఈ పద్యంలో ఉపమాలంకారం ఉంది.
11 వ పద్యం :
కం. హితులు హితాహితులు సదా
హితులునువై రాజు నెడల నిటు త్రివిధమునన్
క్షితి ననచరు లుందురు సం
తతమున్ మఱి వారిఁ దెల్పెదన్ విను మనఘా
ప్రతిపదార్థం :
అనఘా = పుణ్యాత్ముడా!
రాజున్ + ఎడల = రాజుల దగ్గర
అనుచరులు = సేవకులు
సంతతమున్ = ఎప్పుడును
హితులు = ఆప్తులు
హిత + అహితులు = ఆప్తులు, ఆప్తులు కానట్టి (ఉభయ గుణాలతో)
సదా + అహితులు = ఎప్పుడూ మేలు కోరనివారు
ఇటు = అను విధంగా
త్రివిధమునన్ = మూడు రకాలుగా
క్షితిన్ + ఉందురు = ఈ భూమిపై ఉంటారు.
అనుచరులు+అందురు = అనుచరులు అంటారు
మరి = ఇంకను
వారిన్ + తెల్చెదన్ = వారి స్వరూపాలను చెబుతాను
విను = వినుము
భావం : పుణ్యాత్ముడా! రాజు దగ్గర ఉండే అనుచరులు మూడు రకాలుగా ఉంటారు. ఒకరు హితులు. వీళ్ళెప్పుడూ రాజు మేలే కోరుతారు. రెండవ వారు హితాహితులు. వీళ్లు రాజు మేలు కోరుతూనే ఇతరుల ప్రలోభాలకు లోనై అహితులుగా మారుతుంటారు. మూడవ వారు అహితులు. వీళ్లెప్పుడూ రాజు మేలు కోరుకోరు.
12వ పద్యం
చ. హితులు భిషగ్రహజ్ఞబుధబృందకవీంద్ర పురోహితుర్హితా
హితులు ధనార్జవాదినృప కృత్యనియుక్తులు, వెండి కేవలా
హితులు దశావశార్సిత సమృద్ధ రమాభరణేచ్చు, లౌటనా
హితమును నట్ల కాఁ జతుర వృత్తిఁ జరించుట వీతి ఱేనికిన్
ప్రతిపదార్థం :
భిషక్ = వైద్యులు
గ్రహజ్ఞ = జ్యోతిష్యులు
బుధబ్బంద = పండితులు
కవి + ఇంద్ర = కవులు
పురోహితులు = పురోహితులు
హితులు = (వీరంతా రాజునకు) మేలు కోరేవార
ధన + అర్థన + ఆది = ధనం సమీకరించుట మొదలగు
నృపకృత్య = రాజకార్యాలందు
నియుక్తులు = నియమింపబడిన అధికారులు
హిత + అహితులు = మేలు కోరేవారిగా, మేలు కోరని వారిగా ఉంటారు.
వెండి = మరియు
దశావత = తమ యొక్క అవస్థకు వశ్యులై
అర్పిత = రాజుకు ఇవ్వబడిన
సమృద్ధ = సమగ్రమైన, నిండైన
రమా = సంపదను
భరణ + ఇచ్చులు = తిరిగి రాబట్టుకొనుటలో కోరిక కలవారు
కేవల + అహితులు = ఎప్పుడూ శత్రువులే
ఔటన్ = ఇలా అగుట వలన
ఱేనికిన్ = రాజునకు
ఆ హితమునన్ = వారి పట్ల తాను చేసిన హితమును
అట్లకాన్ = తదనుగుణమగునట్లుగా
చతురవృత్తిని = నేర్పుచేత
చరించుట = నడుచుకొనుట
నీతి = తగినది
భావం : వైద్యులు, జ్యోతిషులు, పండితులు, కవులు, పురోహితులు వీళ్లంతా రాజు మేలు కోరే హితులు. ధనం సమీకరించే పనుల్లో ఉన్న అధికారులు హితులవుతారు. ఆ ధనాన్ని దొంగిలించి, దొరికితే ఎక్కడ శిక్షిస్తాడో అన్న భయంతో రాజుకు అహితులు కూడా అవుతారు. మరికొందరు పూర్తిగా అహితులే. ఎప్పుడూ ఏదో ఒక తప్పు చేసి దొరికి పోతుంటారు. అప్పుడు పాలకుడు చట్ట ప్రకారం వాళ్ల సంపదనంతా రాజ్యపరం చేస్తారు. దాంతో వాళ్లు రాజును అదును చూసి చెబ్బతీయడానికి చూస్తుంటారు. కనుక ఈ ముగ్గురి విషయంలో పాలకుడు హితునిగా, హితాహితునిగా, కేవలం అహితునిగా ప్రవర్తిస్తూ, పైకి అందరికీ హితునిగా కనిపిస్తూ, నేర్పుగా ఉండాలి.
13వ పద్యం
ఆ.వె. పాత్రభూతు లెస్సఁ బరికించి యతఁ డదు
గకయునొకఁడు సెప్పకయు మునుపుగఁ
బనసపండ్లు దిగిన పరిగ స్వసము గన్న
నెఱిగ నొసఁగి వెఱఁగు పఱుచు టొప్పు
ప్రతిపదార్థం:
పాత్రభూతున్ = సత్పాత్రుడైన వానిని
లెస్సన్ + పరికించి = చక్కగా తెలుసుకొని
అతఁడు = ఆ యోగ్యుడు
అడుగకయున్ = అడగకుండానే
ఒకడు + చెప్పకయున్ = ఇంకొకరు చెప్పడానికి
మునుపుగన్ = పూర్వమే
పనసపండ్లు దిగిన పరిగన్ = ఉన్నట్టే ఉండి ఒక క్షణములో పనసపండ్లు ఒకేసారి దిగిన విధంగా
స్వప్నమున్ + కన్న నెఱిగన్ = కలలో సకల వస్తుజాతములను ఒక్కసారిగా చూసిన రీతిగా
ఒసంగి = మరింతగా ఇచ్చి
వెఱగు పఱుచుట = ఆ యోగ్యుని ఆశ్చర్యపరుచుట
ఒప్పున్ = తగును.
భావం: చిత్తశుద్ధిగా పనిచేస్తూ రాజ్యానికి మేలు చేసే హితుడిని పాలకుడు గుర్తించాలి. అతడు అడగకుండానే ఇంకొకరు చెప్పుకుండానే అతని ఊహకందనంత సొమ్ము ఒక్కసారిగా ఇవ్వాలి. అది అతడు కలగన్నట్లుగా ఉండాలి. సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తాలి.