These AP 10th Class Telugu Important Questions 9th Lesson రాజధర్మం will help students prepare well for the exams.
రాజధర్మం AP Board 10th Class Telugu 9th Lesson Important Questions and Answers
అవగాహన – ప్రతిస్పందన
క్రింది పరిచిత పద్యాలను చదివి, ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
1. ధనముఖ్యము కేవల మే
పనికిన్ రాష్ట్ర గలిగి పలువురు ప్రభువుల్
పని సేయక తద్వశ్యం
బునకు నలోభానృశంస్యముల్ ఋతము జెలుల్
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
ఏ పనికైనా ఏది ముఖ్యము కాదు?
జవాబు:
ఏ పనికైనా ధనము ముఖ్యము కాదు.
ప్రశ్న 2.
కొంత మంది అధికారులు ఎలా పని చేస్తారు?
జవాబు:
కొంత మంది అధికారులు ఆసక్తితో పని చేస్తారు.
ప్రశ్న 3.
అధికారుల పట్ల రాజు ఎలా ఉండాలి?
జవాబు:
రాజు అధికారుల పట్ల పిసినారితనం, క్రూరత్వం కల్గి ఉండరాదు. మిత్రత్వం కలిగి ఉండాలి.
ప్రశ్న 4.
ఋతము కలిగి ఉండవలసినవాడు ఎవరు?
జవాబు:
ఋతము కలిగి ఉండవలసినవాడు రాజు.
2. దేశవైశాల్య మర్థసిద్ధికిని మూల
మిల యొకింతైన గుంట కాల్వలు రచించి
నయము పేదకు నరిఁ గోరునను నొసంగి
ప్రబలఁ జేసిన నర్ధ ధర్మములు పెరుఁగు
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
అర్థసిద్ధికి మూలమేది?
జవాబు:
దేశ వైశాల్యము అర్ధసిద్ధికి మూలము.
ప్రశ్న 2.
గుంటలు, కాల్వలు ఎవరు నిర్మించాలి?
జవాబు:
గుంటలు, కాల్వలు రాజు నిర్మించాలి.
ప్రశ్న 3.
పేదవారు చెల్లించే ఏఏ పన్నులు తగ్గించాలి?
జవాబు:
పేదవారు డబ్బు రూపంలో, పంట రూపంలో చెల్లించే పన్నులు తగ్గించాలి.
ప్రశ్న 4.
ధర్మార్ధములు రాజుకు ఎప్పుడు సిద్ధిస్తాయి?
జవాబు:
పేదవారు ఆర్థికస్థితి మెరుగుపరచినపుడు.
3. ప్రజల విసి చన్నం బిలువ కప్పుసులఁ గొలుచు
నమ్మి యిండ్లింధనంబున కాయె ననెడు
కలని నక్కెన యధికారి గలనృపతికి
నేడుదీవులు గొన్న సమృద్ధి లేదు
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
అలిసిపోయి రాజ్యాన్ని విడిచిపోయేవారు ఎవరు?
జవాబు:
అలిసిపోయి రాజ్యాన్ని విడిచిపోయేవారు ప్రజలు.
ప్రశ్న 2.
చెడ్డ అధికారులు ఎలా ఉంటారు?
జవాబు:
రాజ్యాన్ని విడిచిపోయిన ప్రజలు పశువులను, ధాన్యాలను అమ్ముకుని, వారి ఇంటి కలపను వంట చెరకుగా వాడుకోవచ్చని సంతోషిస్తారు.
ప్రశ్న 3.
చెడ్డ అధికారిని కవి ఎవరితో పోల్చారు?
జవాబు:
చెడ్డ అధికారిని కవి యుద్ధభూమిలో శవాలను పీక్కు తినే నక్కతో పోల్చారు.
ప్రశ్న 4.
చెడ్డ అధికారి గల రాజు పరిస్థితి ఎలా ఉంటుంది?
జవాబు:
చెడ్డ అధికారి గల రాజు ఏడు ద్వీపాలకు అధిపతి అయినా అతని సంపదలు నిలువవు.
4. కన్నొకటి నిద్రవోఁ బెఱకంట జాగ
రంబు గావించు భూరుహాగ్రంబు మీఁది
యచ్ఛభల్లంబుగతి భోగ మనుభవించు
నెడను బహిరంతరరులపై దృష్టివలయు
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
ఎలుగుబంటి చెట్టుపై పడుకొని ఏమి చేస్తుంది?
జవాబు:
ఎలుగుబంటి చెట్టుపై పడుకొని, ఒక కన్ను మూసి నిద్రపోతున్నా, రెండవ కన్ను తెరచి మెలకువగా ఉంటుంది.
ప్రశ్న 2.
రాజు ఎవరిలా జాగ్రత్తగా ఉండాలి?
జవాబు:
రాజు ఎలుగుబంటిలా జాగరూకతతో ఉండాలి.
ప్రశ్న 3.
భోగములు అనుభవించేవారు ఎవరు?
జవాబు:
భోగములు అనుభవించేవారు రాజ్య పాలకులు.
ప్రశ్న 4.
రాజు ఎవరిపై దృష్టి ఉంచాలి?
జవాబు:
రాజు ఇంటా, బయట ఉన్న శత్రువులపై దృష్టి ఉంచాలి.
5. హదను వచ్చుదాఁక నపరాధిపై రోష
మాఁగి చెఱుపవలయు హదను వేచి
లక్ష్యసిద్ధిదాఁక లావున శర మాఁగి
కాఁడ విడుచు వింటి వాఁడు వోలె
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
రాజు అపరాధి విషయంలో ఎలా ఉండాలి?
జవాబు:
రాజు అపరాధిని వెంటనే దండించరాదు. సమయం వచ్చేదాకా వానిపై కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.
ప్రశ్న 2.
విలుకాడు బాణం ఎలా వేస్తాడు?
జవాబు:
గురి కుదిరిందో లేదో చూసుకుని విలుకాడు బాణం వేస్తాడు.
ప్రశ్న 3.
అపరాధిని దండించుటకు రాజు ఎవరిలా ఉండాలని కవి అన్నారు?
జవాబు:
అపరాధిని దండించుటకు రాజు విలుకానివలె ఉండాలని కవి అన్నారు.
ప్రశ్న 4.
పై పద్యాన్ని వ్రాసిన కవి ఎవరు?
జవాబు:
పై పద్యాన్ని వ్రాసిన కవి శ్రీకృష్ణదేవరాయలు.
6. పట్టున విసువక ర
క్షాపరుడవు గమ్ము ప్రజల చక్కి విపన్నుల్
గూపెట్టిన విని తీర్చుము :
కాపురుషులమీద నిడకు కార్యభరంబుల్
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
విసుగక రక్షాపరుడుగా ఎవరు ఉండాలి?
జవాబు:
విసుగక రక్షాపరుడుగా రాజు ఉండాలి.
ప్రశ్న 2.
ఆపదలో ఉన్న ప్రజలు ఆశ్రయించినప్పుడు రాజు ఏమి చేయాలి?
జవాబు:
ఆపదలో ఉన్న ప్రజలు ఆశ్రయించినప్పుడు రాజు వారి బాధలు శ్రద్ధగా విని, పోగొట్టాలి.
ప్రశ్న 3.
కాపురుషులు అనగా ఎవరు?
జవాబు:
కాపురుషులు అనగా చెడ్డవారు.
ప్రశ్న 4.
పనులు భారాన్ని రాజు ఎవరికి అప్పగించరాదు?
జవాబు:
పనుల భారాన్ని రాజు చెడ్డవాళ్ళకి అప్పగించరాదు.
7. మొదలఁ బెనిచి పిదపఁ గుదియింప నెవ్వాఁడుఁ
దనదు తొంటిహీన దశఁ దలంపఁ
డలుగుఁ గాన శీల మరయుచుఁ గ్రమ వృద్ధిఁ
బెనిచి వేళవేళఁ బనులుఁ గొనుము
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
అధికారుల స్థాయిని నిర్ణయించే విషయంలో రాజు ఎలాంటి జాగ్రత్త వహించాలి?
జవాబు:
ముందు గొప్ప స్థాయిలో ఉన్నవారిని తరువాత వారి స్థాయిని తగ్గించరాదు.
ప్రశ్న 2.
గొప్ప స్థాయిలో ఉన్నవారి స్థాయి తగ్గిస్తే ఏమవుతుంది?
జవాబు:
అటువంటి వారు తమ స్థాయిని తగ్గించినందుకు పాలకుడిని ద్వేషిస్తారు.
ప్రశ్న 3.
అధికారుల స్థాయిని పెంచుతూ రాజు ఏమి చేయాలి?
జవాబు:
అధికారుల స్థాయిని పెంచుతూ, సమయానికి తగినట్లుగా పనులు చేయించుకోవాలి.
ప్రశ్న 4.
ఈ పద్యం ఏ పాఠం లోనిది?
జవాబు:
ఈ పద్యం ‘రాజధర్మం’ పాఠంలోనిది.
8. మొదలనె యొరుదల కానిం
జెదరంగా నాడకాత్మఁ జింతింపు పదిం
బదిగ మృష యేని మఱి విడు
ముదస్తుఁగాఁ గాక యుండ నొక్క మతమునన్
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
రాజ సన్నిహితులలో ఎక్కువగా ఎవరు ఉంటారు?
జవాబు:
చాడీలు చెప్పేవారు.
ప్రశ్న 2.
చాడీలు చెప్పేవారిని రాజు ఏమి చేయాలి?
జవాబు:
వారిని వెంటనే దండించరాదు. వారు చెప్పేవి అబద్ధమో, నిజమో పరీక్షించాలి.
ప్రశ్న 3.
అబద్ధము చెప్పారని తెలిసిన వారిని రాజు ఏమి చేయాలి?
జవాబు:
వారిని ఉద్యోగము నుండి తొలగించకుండా, ప్రమాదం లేనిచోట్ల నియమించాలి.
ప్రశ్న 4.
రాజు ఎవరిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి?
జవాబు:
చాడీలు చెప్పేవారిని
9. హితులు హితాహితులు సదా
హితులునునై రాజు నెడల నీటు
క్షితి ననుచరు లుందురు సం
తతమున్ మఱి వారిఁ దెల్పెదన్ విను మనఘా
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
ఈ పద్యంలో రాజును ఏ విధంగా సంబోధించారు?
జవాబు:
అనఘా (పుణ్యాత్ముడా)
ప్రశ్న 2.
రాజు దగ్గర ఎన్ని రకాల అనుచరులుంటారు?
జవాబు:
మూడు రకాలు.
ప్రశ్న 3.
రాజానుచరులు ఎవరెవరు?
జవాబు:
హితులు, హితాహితులు, అహితులు.
ప్రశ్న 4.
‘వారిఁ దెల్పెదన్ విను మనఘా’ అని ఎవరు ఎవరితో అన్నారు?
జవాబు:
యామునాచార్యులు తన కుమారునితో అన్నారు.
10. పాత్రభూతు లెస్సఁ బరికించి యతఁడడు
గకయునొకఁడు సెప్ప కయు మునుపుగఁ
బనసపండ్లు దిగిన పరిగ స్వప్నము గన్న
నెఱిగ నొసఁగి వెఱఁగు పఱుచు టొప్పు
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
రాజు ఎటువంటి వానిని పరికించాలి?
జవాబు:
చిత్తశుద్ధి కలవాడిని (పాత్రభూతుని)
ప్రశ్న 2.
చిత్తశుద్ధితో పనిచేసే వానికి రాజు ఎలాంటి ఉపకారం – చేయాలి?
జవాబు:
అతడు అడగకుండానే ఎవరు చెప్పకుండానే ఊహకంద నంత సొమ్ము ఒక్కసారిగా ఇవ్వాలి.
ప్రశ్న 3.
పనసపండ్లు దిగిన పరిగ’ అంటే అర్థమేమిటి?
జవాబు:
పూతపూయకుండా, ఏ సూచన ముందు ఉండకుండా, ఉన్నట్టుండి పిందెలు పుట్టి, ఒక్కసారిగా పుష్కలంగా పనస పళ్ళను ఇచ్చిన విధంగా అని అర్ధం.
ప్రశ్న 4.
రాజు చేసిన మేలు పాత్రభూతునికి ఎలా అనిపించాలి?
జవాబు:
కలగన్నట్లుగా ఉండాలి. సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తాలి.
వ్యక్తీకరణ సృజనాత్మకత
అ) ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.
1. ప్రబంధ ప్రక్రియ గురించి రాయండి.
(లేదా)
‘రాజధర్మం’ పాఠ్యభాగ ప్రక్రియ గురించి రాయండి.
జవాబు:
ప్రకృష్టమైన బంధం కలది ప్రబంధం. పురాణేతిహాసాల నుండి ఏదైనా చిన్న కథాంశాన్ని గ్రహించి కవులు, అష్టాదశ వర్ణనలతో పెంచి, పోషించి స్వతంత్ర కావ్యంగా రాయబడేది ప్రబంధం. కథా వస్తువు ఆద్యంతం ఉంటుంది. కథకు, పాత్ర పోషణకు, భావ సంపదకు తగినస్థానం ఉంటుంది.
ప్రశ్న 2.
రాజధర్మం పాఠ్యభాగ కవి జీవిత విశేషాలను వ్రాయుము.
జవాబు:
‘రాజధర్మం’ పాఠ్యభాగ కవి శ్రీకృష్ణదేవరాయలు. ఈయన 16వ శతాబ్దానికి చెందినవారు. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన తుళువ వంశ ప్రభువు. సంస్కృత, ఆంధ్ర, కన్నడ భాషలలో పండితుడు. సంస్కృత భాషలో మదాలస చరిత్ర, సత్యవధూప్రీణనము, జ్ఞాన చింతామణి, రసమంజరి మొదలైన మధుర కావ్యాలు, తెలుగులో ‘ఆముక్త మాల్యద’ ప్రబంధాన్ని రచించారు. సాహితీ సమరాంగణ సార్వభౌముడు, మూరు రాయర గండడు, ఆంధ్రభోజుడు ఆయన బిరుదులు.
ప్రశ్న 3.
గొప్ప స్థాయిలో ఉన్న వారిని తరువాత వారి స్థాయిని ఎందుకు తగ్గించరాదు?
జవాబు:
ఎంత మంచివాడినైనా ముందు గొప్ప స్థాయిలో ఉంచి తర్వాత అతని స్థాయిని తగ్గించరాదు. అలా చేస్తే గతంలోని తన తక్కువ స్థితిని గుర్తించడు. తన స్థాయిని తగ్గించినందుకు పాలకుడిని ద్వేషిస్తాడు. కనుక అతని ప్రవర్తనను గమనిస్తూ, క్రమంగా అతని స్థాయిని పెంచుతూ సమయానికి తగ్గట్లుగా పనులు చేయించుకోవాలి.
ప్రశ్న 4.
చాడీలు చెప్పేవారి విషయంలో రాజు ఎలా ప్రవర్తించాలి?
జవాబు:
రాజు దగ్గర ఉండే కొందరు సన్నిహితులు కూడా ఎప్పుదూ చాడీలు చెపుతుంటారు. వాళ్ళను వెంటనే బెదిరించి, తిట్టి దూరం చేసుకోకూడదు. వాళ్ళ మాటలు నిజమో, కాదో బాగా పరీక్షించాలి. అబద్ధమే చెబుతున్నారని తేలినా వెంటనే ఉద్యోగం నుంచి తొలగించరాదు. ప్రమాదం లేని చోట వాళ్ళను నియమించి, ఒక కంట కనిపెడుతూ ఉండాలి.
ఆ) ఈ క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాల్లో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
మంత్రిని నియమించే విషయంలో రాజు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏవి?
జవాబు:
రాజుకు తగిన మంత్రి అవసరం. మంత్రిని ఏర్పాటు చేసే విషయంలో రాజు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గుణవంతుడైన వానిని మంత్రిగా నియమించాలి. తగిన మంత్రి దొరక్కపోతే రాజు తానే రాజనీతిని అనుసరించి పనులు చేసుకోవాలి. ఆ పనులు అయినా, కాకపోయినా ధనబలాలు ఉంటాయి. కనుక ఇబ్బంది ఉండదు. అలా కాకుండా గుణహీనుడైన వాడిని మంత్రిని చేస్తే, అతడు రాజుకు లోబడి ఉండడు. పైగా రాజే అతనికి లోబడి ఉండాలి. అటువంటి మంత్రి గుమ్మడి కాయంత ముత్యం లాంటివాడు. గుమ్మడి కాయంత ముత్యము అంటే ధరించడానికి వీలుకానంత పెద్ద ముత్యము. గుమ్మడి కాయంత ముత్యాన్ని ధరించినవాడు దానిని మోయలేక ఎలా బాధపడతాడో, గుణహీనుడ్డి మంత్రిగా చేస్తే రాజు కూడా అలా బాధపడతాడు. కావున అతడు ప్రమాదకరమైనవాడు. మంత్రి లేకుండా అయినా రాజ్యము నడుస్తుంది. కాని గుణహీనుణ్ణి మాత్రం మంత్రిని చేయకూడదు.
ప్రశ్న 2.
రాజు తెలుసుకోవలసిన విషయాలను ఎలా తెలుసుకోవాలి? దానివల్ల రాజుకు కలిగే ప్రయోజనాలేవి?
జవాబు:
రాజు ఎప్పుడూ నీతిమార్గాన్ని వదలకూడదు. రాజ్యక్షేమాన్ని కోరే రాజు అన్ని విషయాలను తెలుసుకోవాలి. తెలుసుకోవలసిన విషయాలలో ముప్పాతిక భాగం తానే స్వయంగా స్వశక్తితో తెలుసుకోవాలి. మిగిలిన పావుభాగాన్ని ఆప్తమిత్రుల ద్వారా తెలుసుకోవాలి. అప్పుడతడు నీతి పరుడవుతాడు. తన ఇష్టానుసారం అంతా జరగాలన్న ఆహాన్ని విడిచి పెడతాడు. తనకు ఆపదలు కలిగినప్పుడు పారిపోడు. సేవకులను తీవ్రంగా శిక్షించదు. ప్రజల కష్టాలు విని, వారి బాధలు తీర్చుతాడు. అందరికీ హితునిగా కనిపిస్తూ నేర్పుగా ఉంటాడు. చిత్తశుద్ధిగా పనిచేసే హితులకు గుర్తింపు ఇస్తాడు. అధికారుల పట్ల క్రూరత్వం ప్రదర్శించడు. సత్ప్రవర్తన, నిబద్ధత, మిత్రత్వం కల్గి ఉంటాడు. సుఖంగా రాజ్యమేలుతాడు.
ఇ) కింది అంశం గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.
ప్రశ్న 1.
రాజు ఎలుగుబంటిలా ఉండాలని, అధికారులు శవాలు పీక్కుతినే నక్కల్లా ఉండకూడదని చదివావు కదా. దీనిపై నీ అభిప్రాయం నీ స్నేహితుడు/స్నేహితురాలికి లేఖ రాయి.
జవాబు:
స్నేహితురాలికి లేఖ నందిగామ, ప్రియమైన శ్రీవల్లికి, ఇట్లు, చిరునామా: |
భాషాంశాలు (పదజాలం వ్యాకరణాంశాలు)
కింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి.
అలంకారాలు
క్రింది వాక్యాల్లోని అలంకారాన్ని గుర్తించి రాయండి.
1. కాడ విడుచు వింటివాఁడు వలె.
జవాబు:
ఈ వాక్యంలో ఉపమాలంకారం కలదు.
2. యుద్ధభూమిలో శవాలను పీక్కుతినే నక్కలాంటి పాలకుడు ఏడు ద్వీపాలకు అధిపతి అయినా అతని సంపదలు నిలవవు.
జవాబు:
ఈ వాక్యంలో లోకోక్తి అలంకారం ఉంది.
గణవిభజన పద్యపాదం పేరు
క్రింది పద్యపాదాలకు గురులఘువులు గుర్తించి, గణ విభజన చేసి, పద్యం పేరు రాయండి.
1. నీతిం దాన తలంచి చేయఁ బనిగా నీ కాకపోనీ బల
జవాబు:
ఇది శార్దూల వృత్త పద్యపాదము.
2. ఎఱుఁగ నగున్ స్వశక్తి నవనీతుఁడు నాలుగుపాళ్ళు మూఁదు పా
జవాబు:
ఇది చంపకమాల వృత్త పద్యపాదం.
3. హితులు భిషగ్రహజ్ఞబుధ బృందకవీంద్ర పురోహితు ర్హితా
జవాబు:
ఇది చంపకమాల వృత్త పద్యపాదం,
అర్ధాలు
అ) గీత గీసిన పదానికి అర్థం రాయండి.
1. బలవ్రాతార్థాధ్యత నెమ్మి నుండ.
జవాబు:
సమూహం
2. ధన ముఖ్యము కేవలమే పనికిన్ రాధాస్థ కలిగి పలువురు.
జవాబు:
ఆసక్తి
3. మొదలనె యొరుదల కానిం జెదరంగా నాడకు.
జవాబు:
చాడీలు చెప్పుట
4. ఇల ఒకింతైన గుంట కాల్వలు రచించుము.
జవాబు:
భూమి
5. కలని నకైన అధికారి.
జవాబు:
యుద్ధభూమి
అ) గీత గీసిన పదానికి సరియైన అర్థాన్ని గుర్తించండి.
6. ఎఱుఁగ నగున్ స్వశక్తిన్ అవనీశుఁడు.
అ) బ్రాహ్మణుడు
ఆ) రాజు
ఇ) దైవం
ఈ) మనిషి
జవాబు:
ఆ) రాజు
7. అచ్ఛభల్లంబు గతి భోగమనుభవించుము.
అ) ఎలుక
ఆ) ఏనుగు
ఇ) ఎలుగుబంటి
ఈ) పావురం
జవాబు:
ఇ) ఎలుగుబంటి
8. హదను వచ్చు దాఁక.
అ) సమయం
ఆ) వర్ణం
ఇ) కాంతి
ఈ) చుట్టం
జవాబు:
అ) సమయం
9. కాఁడ విడుచు వింటివాఁడు వోలె.
అ) తొడిమ
ఆ) బాణం
ఇ) చేయి
ఈ విల్లు
జవాబు:
ఆ) బాణం
10. స్వప్నము గన్న వెఱిగ నొసఁగు.
అ) నిజము
ఆ) ధర్మము
ఇ) న్యాయము
ఈ) కల
జవాబు:
ఈ) కల
పర్యాయపదాలు
అ) గీత గీసిన పదానికి పర్యాయపదాలు రాయండి.
11. కాపురుషుల మీద నిడకు కార్యభరంబులు.
జవాబు:
పని, కర్జము
12. వేళ వేళఁ బనులుఁ గొనుము.
జవాబు:
సమయం, తఱి
13. గుమ్మడి కాయ యంత యగు ముత్తెంబై.
జవాబు:
కూశ్మాండం, కూష్మాండం, శ్రీపర్ణి
14. ధన ముఖ్యము కేవలము ఏ పనికిన్ రాదు.
జవాబు:
సంపద, పైకం
ఆ) గీత గీసిన పదానికి సరియైన పర్యాయపదాలు గుర్తించండి.
15. సుహృత్తతి తెల్పునొక్క పాలెఱుగనగు.
అ) శ్రేయోభిలాషి, వైరి
ఆ) ఆప్తుడు, స్నేహితుడు
ఇ) మిత్రుడు, శత్రువు
ఈ) హితుడు, మనసు
జవాబు:
ఆ) ఆప్తుడు, స్నేహితుడు
16. కన్నొకటి నిద్రపోవు.
అ) తూగు, మోగు
ఆ) కూరుకు, ఇరుకు
ఇ) కునికిపాటు, కనుమోడ్పు
ఈ నిదుర, స్వప్నం
జవాబు:
ఇ) కునికిపాటు కనుమోడ్పు
17. పెఱకంట జాగరంబు గావించు.
అ) ఇతర, అన్యము
ఆ) పర, స్వ
ఇ) భిన్న, హారం
ఈ) వేరు, కాండం
జవాబు:
అ) ఇతర అన్యము
18. భూరుహాగ్రంబు మీద నిద్రవోవు.
అ) క్షితిజం, నీరజ
ఆ) చెట్టు, వృక్షం
ఇ) వారిజం, విటపం
ఈ) నళినీ, మహీరుహం
జవాబు:
ఆ) చెట్టు, వృక్షం
19. భిషక్, గ్రహజ్జ, బుధ బృంద కవీంద్ర, పురోహితులు రాజుకు హితులు.
అ) రోగహారి, రోగి
ఆ) ఆయుర్వేది, వేత్త
ఇ) వైద్యుడు, వెజ్జు
ఈ) కామందు, హరి
జవాబు:
ఇ) వైద్యుడు, వెజ్జు
ప్రకృతి – వికృతులు
అ) గీత గీసిన పదానికి సరియైన ప్రకృతి పదం రాయండి.
20. గుమ్మడికాయ యంత యగు ముత్తెంబు.
జవాబు:
ముక్తా / మౌక్తికము
21. బలవ్రాతార్థాధ్యత నెయ్యము నుండ.
జవాబు:
స్నేహము
22. గుమ్మడికాయ
జవాబు:
కూష్మాండ
23. ఇలను ఒకింతైన గుంట కాల్వలు రచించు.
జవాబు:
గర్త
24. పేదకు నరిఁగోరునను నొసంగి,
జవాబు:
వ్యర్ధ
ఆ) గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
25. బహిరంతరరులపై దృష్టి వలయు.
అ) దిస్టి
ఆ) కన్ను
ఇ) చూపు
ఈ) నేత్రం
జవాబు:
అ) దిస్టి
26. అచ్ఛభల్లంబుగతి భోగము అనుభవించు.
అ) సుఖం
ఆ) బోగము
ఇ) భాగ్యం
ఈ) బాగము
జవాబు:
ఆ) బోగము
27. కవీంద్ర, పురోహితులు హితులు,
అ) కావ్యకర్త
ఆ) శుక్రుడు
ఇ) కయి
ఈ) వాల్మీకి
జవాబు:
ఇ) కయి
28. చతురవృత్తిన్ చరించుట నీతి జేనికిన్.
అ) నేర్పు
ఆ) చదుర
ఇ) తెలివి
ఈ) బుద్ధి
జవాబు:
ఆ) చదుర
29. లక్ష్య సిద్ధి దాఁక.
అ) లెక్క
ఆ) గుఱి
ఇ)లక్షణం/లచ్చి
ఈ) లచ్చ
జవాబు:
అ) లెక్క
నానార్థాలు
అ) గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి.
30. కాపురుషుల మీద నిడకు కార్యభరంబులు.
జవాబు:
పని, హేతువు, గర్భాధానం
31. తొంటి హీనదశను తలపడు.
జవాబు:
తక్కువ, నీచం
32. వృద్ధిఁ బెనిచి వేళ వేళఁ బనులుఁ గొనుము.
జవాబు:
సమృద్ధి, కాంతి, ధనం
33. ప్రబలఁ జేసిన సర్థ ధర్మములు పెరుఁగు.
జవాబు:
పుణ్యం, న్యాయం
34. ఎఱుఁగనగున్ స్వశక్తి.
జవాబు:
బలం, ఆయుధం, పార్వతి
ఆ) గీత గీసిన పదానికి సరైన నానార్థాలు గుర్తించండి.
35. చతుర వృత్తిన్ చరించుట నీతి ఱేనికిన్.
అ) విధానం, విధి.
ఆ) న్యాయం, హక్కు
ఇ) అందం చందం
ఈ) నిజాయితీ, తీపి
జవాబు:
ఆ) న్యాయం, హక్కు
36. కలని నక్కైన అధికారి.
అ) రణం, సమరం
ఆ) జ్ఞానం, అజ్ఞానం
ఇ) యుద్ధం, గ్రహించుట
ఈ) అని, క్షేత్రం
జవాబు:
ఇ) యుద్ధం, గ్రహించుట
37. లెస్సన్ పరికించు.
అ) సులభం, తేలిక
ఆ) అందం, ఆనందం
ఇ) బాగా, మేలుకొను
ఈ) క్షేమం, యోగ్యం
జవాబు:
ఈ) క్షేమం, యోగ్యం
38. పనసపండ్లు దిగిన చందాన.
అ) ఒక చెట్టు, వేదభాగం
ఆ) చెట్టు, వృక్షం
ఇ) వేదం, మంత్రం
ఈ) పిక్క, గింజ
జవాబు:
అ) ఒక చెట్టు, వేదభాగం
39. కాడ విడుచు వింటివాఁడు వోలె.
అ) పిలక, పైభాగం
ఆ) తొడిమ, బాణం
ఇ) మొక్క అంటు
ఈ) వేరు, కాండం
జవాబు:
ఆ) తొడిమ, బాణం
వ్యుత్పత్త్యర్థాలు
అ) గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్థం రాయండి.
40. రాజుకు అలోభం, నృశంస్యము ఉండకూడదు.
జవాబు:
హింసను కోరునది – క్రూరత్వం
41. పేదవారి ఆర్థిక స్థితిని మెరుగుపరిస్తే ధర్మ, అర్థములు సిద్ధిస్తాయి.
జవాబు:
లోకాన్ని ధరించునది – పుణ్యం
42. అచ్ఛభల్లము వలె పాలకుడు శత్రువులపై ఒక కన్ను వేసి ఉంచాలి.
జవాబు:
ఎదురైవచ్చి హింసించునది – భల్లూకం
ఆ) గీత గీసిన పదానికి సరైన వ్యుత్పత్త్వర్ణాన్ని గుర్తించండి.
43. గుణహీనుడైన మంత్రి వల్ల రాజుకు కూడా బాధే.
అ) బుద్ధిలో బృహస్పతి (గురువు)
ఆ) బుద్ధి సహాయకుడు (సచివుడు)
ఇ) నైపుణ్యం కలవాడు (నేర్పరి)
ఈ) మంతనాలు చేయువాడు (మంగలి)
జవాబు:
ఆ) బుద్ధి సహాయకుడు (సచివుడు)
44. కవులు, పురోహితులు వీరంతా రాజు మేలు కోరేవారు.
అ) కవిత్వం రాయువాడు – కావ్యకర్త
ఆ) కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడు – శ్రీశ్రీ
ఇ) కలానికి పని చెప్పేవాడు – కవి
ఈ) లోక వ్యవహారాలను రాసేవాడు – రచయిత
జవాబు:
అ) కవిత్వం రాయువాడు – కావ్యకర్త
45. వీళ్ళెప్పుడూ రాజు మేలు కోరరు.
అ) పాలన చేయువాడు – రేడు
ఆ) శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ చేసేవాడు – ప్రభువు
ఇ) ప్రజలను రంజింప చేయువాడు – నృపతి
ఈ) భోగాలను అనుభవించేవాడు భోగి
జవాబు:
ఇ) ప్రజలను రంజిల్ల చేయువాడు – నృపతి
46. చతుర వృత్తిఁ జరించుట నీతి ఱేనికిన్.
అ) కథలలో చివర రాసేది – సూక్తి
ఆ) మనం పాటించనిది – పద్ధతి
ఇ) పురాణాలలో ఉండేది – ధర్మం
ఈ) బహిక, ఆముష్మిక ఉపాయాలను చెప్పునది – న్యాయం
జవాబు:
ఈ) బహిర ఆముష్మిక ఉపాయాలను చెప్పునది న్యాయం
జాతీయాన్ని గుర్తించడం
కింది వాక్యాల్లోని జాతీయాన్ని గుర్తించి విడిగా రాయండి.
47. “పనస పండ్లు దిగిన” ఈ జాతీయాన్ని ఏ అర్థంలో! సందర్భంలో ఉపయోగిస్తారో రాయండి.
జవాబు:
“అకస్మాత్తుగా కలుగుట” అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.
48. ఎవరి దగ్గరా చేతులు నలుపుకొంటూ దీనంగా ఉంద కూడదు.
జవాబు:
చేతులు నలుపుకొను
49. పెద్దల ఆశీస్సులే మనకు శ్రీరామరక్ష.
జవాబు:
శ్రీరామరక్ష
50. ఆరునూరైనా పెళ్ళి చేసుకోనని భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు.
జవాబు:
ఆరునూరైనా
51. సమాజంలో తేనెపూసిన కత్తిలాంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలి.
జవాబు:
తేనెపూసిన కత్తి
52. శ్రీకృష్ణదేవరాయలు పండితులకు అగ్రతాంబూలం ఇచ్చారు.
జవాబు:
అగ్రతాంబూలం
జాతీయము – సందర్భము
ఈ జాతీయాన్ని ఏ అర్థంలో / సందర్భంలో ఉపయో గిస్తారో రాయండి.
53. కన్నుల పండుగ
జవాబు:
అందరికీ అత్యంత ఆనందాన్ని కల్గించే విషయాన్ని వివరించే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.
54. కాలికి బుద్ధి చెప్పు
జవాబు:
తప్పు చేసి భయపడి పారిపోయే వ్యక్తుల గురించి వివరించే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.
55. వెన్ను చూపుట
జవాబు:
పరాక్రమవంతులకు ఉండకూడని లక్షణాలను వివరించే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.
56. కత్తి మీద సాము
జవాబు:
కష్టతరమైన, సాధ్యం కాని పనుల గురించి వివరించే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు.
సంధి పదాలను విడదీయడం
గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి.
57. ఏ పనికిన్ రాధాస్థ గలిగి.
జవాబు:
రాదు + ఆస్థ
58. ప్రజలఁజేసిన నర్ధ ధర్మములు పెరుఁగు.
జవాబు:
ప్రబలన్ + చేసిన
59. ఇండ్లింధనంబు కాయెననెడు కలని నక్క.
జవాబు:
ఇండ్ల + ఇంధనంబు
60. భోగమనుభవించు నెదను.
జవాబు:
భోగము + అనుభవించు
61. హితులు భిషగ్థ్రహజ్ఞ బుధ బృంద కవీంద్ర పురోహితులు,
జవాబు:
భిషక్ + గ్రహజ్ఞ
సంధి పదాలను కలపడం
సంధి పదాలను కలిపి రాయండి.
62. నిః + ఆగ్రహం
జవాబు:
నిరాగ్రహం
63. పదిన్ + పదిగ
జవాబు:
పది పదిగ
64. యౌన్ + చుమీ
జవాబు:
యౌఁజుమీ
65. నీతిన్ + తాన
జవాబు:
నీతిందాన
66. ఏ + తఱిణి
జవాబు:
ఎత్తటి
67. మృష + ఏని
జవాబు:
మృషయేని
68. వాడు + పోతే
జవాబు:
వాడువోలే
69. బలవ్రాత + అర్థ + ఆధ్యత
జవాబు:
బలవ్రాతార్థాధ్యత
సంధి నామాలు
గీత గీసిన పదం ఏ సంధికి చెందినదో గుర్తించండి.
70. ఎవ్వాడుఁ దనదు తొంటి హీనదశఁ దలంపఁడు.
అ) త్రిక సంధి
ఆ) పడ్వాది సంధి
ఇ) రుగాగమ సంధి
ఈ) ఉత్త్వ సంధి
జవాబు:
అ) త్రిక సంధి
71. గుమ్మడికాయ యంత యగు ముత్తెంబై.
అ) అత్వ సంధి
ఆ) యడాగమ సంధి
ఇ) సవర్ణదీర్ఘ సంధి
ఈ) గసడదవాదేశ సంధి
జవాబు:
ఆ) యడాగమ సంధి
72. పలువురు ప్రభువుల్ పని సేయక.
అ) చువర్ణలోప సంధి
ఆ) సరళాదేశ సంధి
ఇ) గసడదవాదేశ సంధి
ఈ) యణాదేశ సంధి
జవాబు:
ఇ) గసడదవాదేశ సంధి
73. కలని సక్కైన అధికారి.
అ) ఇత్వ సంధి
ఆ) ఉత్వ సంధి
ఇ) వృద్ధి సంధి
ఈ) అత్వ సంధి
జవాబు:
ఈ) అత్వ సంధి
74. ఎఱుఁగ నగున్ స్వశక్తిన్ అవనీశుఁడు నాలుగుపాళ్ళ మూడు
అ) అత్వ సంధి
ఆ) సవర్ణదీర్ఘ సంధి
ఇ) గుణ సంధి
ఈ) వృద్ధి సంధి
జవాబు:
ఆ) సవర్ణదీర్ఘ సంధి
75. బహిరంతరరులపై దృష్టి వలయు.
అ) సవర్ణదీర్ఘ సంధి
ఆ) రుగాగమ సంధి
ఇ) విసర్గ సంధి
ఈ) అత్వ సంధి
జవాబు:
ఇ) విసర్గ సంధి
విగ్రహవాక్యాలు
గీత గీసిన పదానికి విగ్రహవాక్యం రాయండి.
76. దేశవైశాల్యము అర్ధ సిద్ధికిని మూలం.
జవాబు:
దేశము యొక్క వైశాల్యం
77. స్వశక్తితో తెలియని విషయాలను తెలుసుకోవాలి.
జవాబు:
తనదైన శక్తి
78. కన్నొకటి నిద్రవోఁ బైఱకంట జాగరంబు గావించు.
జవాబు:
పెఱయైన కంట
79. పాళ్చెఱుఁగక మోచినట్టి పనికిష్ట సుహృత్తతి దెల్చఁనొక్క పాలెఱుఁగ నగును.
జవాబు:
సుహృత్తుల యొక్క తతి
80. ధనార్జనాది నృపకృత్య నియుక్తులు, హితాహితులు.
జవాబు:
ధనము యొక్క ఆర్జన
సమాస నామాలు
గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.
81. ఏడుద్వీపాలకు అధిపతి అయినా అతని సంపదలు నిలవవు.
అ) ద్వంద్వ సమాసం
ఆ) ద్విగు సమాసం
ఇ) బహువ్రీహి సమాసం
ఈ) వ తత్పురుష సమాసం
జవాబు:
ఆ) ద్విగు సమాసం
82. రాజు ఎప్పుడూ నీతిమార్గాన్ని వదలకూడదు.
అ) విశేషణ పూర్వపద కర్మధారయం
ఆ) విశేషణ ఉత్తరపద కర్మధారయం
ఇ) షష్ఠీ తత్పురుష సమాసం
ఈ) రూపక సమాసం
జవాబు:
అ) విశేషణ పూర్వపద కర్మధారయం
83. రెండవ వారు హితాహితులు.
అ) షష్ఠీ తత్పురుష
ఆ) రూపక సమాసం
ఇ) ద్వంద్వ సమాసం
ఈ) బహువ్రీహి సమాసం
జవాబు:
ఇ) ద్వంద్వ సమాసం
84. అవనీశుడు తానే స్వయంగా స్వశక్తితో తెలుసుకోవాలి.
అ) ద్వంద్వం
ఆ) బహువ్రీహి సమాసం
ఇ) విశేషణ పూర్వపద కర్మధారయం
ఈ) షష్ఠీ తత్పురుష సమాసం
జవాబు:
ఆ) బహువ్రీహి సమాసం.
85. పనసపండ్లు దిగిన విధంగా పాలకుడు, హితులను గౌరవించాలి.
అ) ఉపమాన పూర్వపద కర్మధారయం
ఆ) విశేషణ పూర్వపద కర్మధారయం
ఇ) బహువ్రీహి సమాసం
ఈ) సంభావనా పూర్వపద కర్మధారయం
జవాబు:
ఈ) సంభావనా పూర్వపద కర్మధారయం
ఆధునిక వచనాలు
ఈ వాక్యానికి సరియైన ఆధునిక వచనాన్ని గుర్తించండి.
86. కాపురుషుల మీద నిధకు కార్యభరంబుల్.
అ) చెడ్డవాళ్ళకు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించకూడదు
ఆ) చెడిన వారికి ముఖ్యమైన కార్యక్రమాలు అప్పగించకూడదు
ఇ) కాపురుషులపై కార్య భారములను ఇడకు.
ఈ) కాపురుషులందు గొప్ప పనులను ఉంచకు.
జవాబు:
ఇ) కాపురుషులపై కార్య భారములను ఇడకు.
87. ఎఱుఁగనగున్ స్వశక్తిన్.
అ) స్వశక్తితో ఎరుగనగును.
ఆ) సొంత ప్రజ్ఞతో తెలుసుకోవాలి.
ఇ) స్వశక్తి చల్ల ఎగురనగును.
ఈ) సొంత బలంతో గ్రహించాలి.
జవాబు:
అ) స్వశక్తితో ఎరుగనగుని
88. చతుర వృత్తిఁ జరించుట నీతి ఱేనికిన్.
అ) రాజునకు నేర్పు చేత నడుచుకొనుట తగినది.
ఆ) రాజుకు చతురవృత్తితో చరించుట నీతి కదా.
ఇ) రాజుకు తగినది నీతిగా నడుచుకొనుట.
ఈ) నేర్పుగా నడుచుకొనుట రాజు పని కదా.
జవాబు:
ఆ) రాజుకు చతురవృత్తితో చరించుట నీతి కదా.
వ్యతిరేకార్థక వాక్యాలు
ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం రాయండి.
89. అతడు రాజుకు లోబడి ఉండడు.
జవాబు:
అతడు రాజుకు లోబడి ఉంటాడు.
90. ఏ పనైనా కేవలం ధనంతోనే సాధ్యం కాదు.
జవాబు:
ఏ పనైనా కేవలం ధనంతోనే సాధ్యం.
91. క్రూరత్వం ఉండకూడదు.
జవాబు:
క్రూరత్వం ఉండాలి.
92. ధర్మార్థాలు సిద్ధిస్తాయి.
జవాబు:
ధర్మార్థాలు సిద్ధించవు.
93. సేవకులను తీవ్రంగా శిక్షించదు.
జవాబు:
సేవకులను తీవ్రంగా శిక్షిస్తాడు.
వ్యతిరేకార్థక క్రియలు
కింది క్రియా పదాలలో వ్యతిరేకార్థక క్రియను గుర్తించండి.
94. అ) విని
ఆ) వినక
ఇ) పెనిచి
ఈ) విడు
జవాబు:
ఆ)వినక
95. అ) రచించి
ఆ) చేసి
ఇ) అమ్మి
ఈ) చెప్పుక
జవాబు:
ఈ) చెప్పక
96. అ) ఒసగి
ఆ) పరికించి
ఇ) వదలక
ఈ) కొని
జవాబు:
ఇ) వదలక
97. అ) తిట్టక
ఆ) మూసి
ఇ) అనుభవిస్తూ
ఈ) ఉంచి
జవాబు:
అ) తిట్టక
సంక్లిష్ట వాక్యాలు
ఇది ఏ రకమైన సంక్లిష్టవాక్యాలో రాయండి.
98. వారు చెప్పినవి శ్రద్ధగా విని, వారి బాధ పోగొట్టాలి.
జవాబు:
క్వార్థక వాక్యం
99. అతని ప్రవర్తనను గమనిస్తూ, అతని స్థాయిని పెంచుతూ పనులు చేయించుకోవాలి.
జవాబు:
శత్రర్ధక వాక్యం
100. గుణహీనుణ్ణి మంత్రిని చేస్తే, అతడు రాజుకు లోబడి ఉండడు.
జవాబు:
చేదర్థక వాక్యం
101. వారిని బెదిరించి, తిట్టి, దూరం చేసుకోవద్దు.
జవాబు:
క్యార్థక వాక్యం
102. వారిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి.
జవాబు:
శత్రర్థక వాక్యం
103. పైకి అందరికీ హితునిగా కనిపిస్తూ, నేర్పుగా ఉండాలి.
జవాబు:
శత్రర్థక వాక్యం
104. చిత్తశుద్ధిగా పనిచేస్తూ, రాజ్యానికి మేలు చేసే హితుణ్ణి రాజు గుర్తించాలి.
జవాబు:
శత్రర్థక వాక్యం
కర్మణి వాక్యాలు
సరియైన కర్మణి వాక్యాన్ని గుర్తించండి.
105. పన్ను తగ్గించాలి.
అ) పన్ను తగ్గించలేను.
ఆ) పన్ను తగ్గించబడాలి.
ఇ) పన్ను తొలిగించాలి.
ఈ) పన్ను తగ్గించకూడదు.
జవాబు:
ఆ) పన్ను తగ్గించబడాలి.
106. సుఖంగా రాజ్యం ఏలుతాడు.
అ) సుఖంగా రాజ్యం ఏలుతాడా?
ఆ) సుఖంగా ఏలగలడు.
ఇ) సుఖంగా రాజ్యం ఏలబడతాడు.
ఈ) ఏలడు రాజ్యం సుఖంగా.
జవాబు:
ఇ) సుఖంగా రాజ్యం ఏలబడతాడు.
107. రాజు తప్పు చేసినవాణ్ణి దండించాలి.
అ) రాజు చేత తప్పు చేసినవారు దండించబడాలి.
ఆ) రాజు దండించబడాలి.
ఇ) రాజు, తప్పు చేసినవారు దండించబడాలి.
ఈ) తప్పు చేత రాజు దండించబడాలి.
జవాబు:
అ) రాజు చేత తప్పు చేసినవారు దండించబడాలి.
108. కోపం అదుపులో ఉంచాలి.
అ) కోపం అదుపులో ఉందా?
ఆ) కోపం అదుపులో ఉండకూడదు.
ఇ) కోపం అదుపు తప్పుతోంది.
ఈ) కోపం అదుపులో ఉంచబడాలి.
జవాబు:
ఈ) కోపం అదుపులో ఉంచబడాలి.
109. పాలకుడు దోషిని శిక్షించాలి.
అ) పాలకుడే దోషి చేత శిక్షించబడాలి.
ఆ) పాలకుని చేత దోషి శిక్షించబడాలి.
ఇ) పాలకుడు దోషి చేత శిక్షంచబడకూడదు.
ఈ) పాలకుడు శిక్షించేది దోషినే.
జవాబు:
ఆ) పాలకుని చేత దోషి శిక్షించబడాలి.
110. పాలకుడు హితులను గౌరవించాలి.
అ) పాలకుని చేత హితులు గౌరవించబడాలి.
ఆ) పాలకుని యొక్క హితులు గౌరవించబడాలి.
ఇ) పాలకుని వలన హితులు గౌరవించబడాలి.
ఈ) పాలకుని కొరకు హితులు గౌరవించబడాలి.
జవాబు:
అ) పాలకుని చేత హితులు గౌరవించబడాలి.
వాక్య రకాలు
ఇవి ఏ రకమైన సామాన్య వాక్యాలో రాయండి.
111. గుణహీనుణ్ణి మాత్రం మంత్రిని చేయకు.
జవాబు:
నిషేధార్ధక వాక్యం
112. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.
జవాబు:
విద్యర్థక వాక్యం
113. ఎదుటివారు అబద్దమే చెబుతున్నారని తేలినా వారిని ఉద్యోగం నుండి తొలగించకండి.
జవాబు:
అష్యర్థక వాక్యం
114. ఆహా! ఆ రాజెంత దయార్ద్ర హృదయుడు.
జవాబు:
ఆశ్చర్యార్థక వాక్యం
115. మంచి మాటలతో పిల్లలను సరైన దారిలో పెట్టాలి.
జవాబు:
ప్రేరణార్థక వాక్యం
116. అంతా తన ఇష్ట ప్రకారం జరగాలన్న అహాన్ని విడిచి పెట్టాలి.
జవాబు:
విధ్యర్థక వాక్యం
117. నేను చక్కగా పాలన చేయగలను.
జవాబు:
సామర్థ్యార్థక వాక్యం
వాళ్ళ రకాలు
ఇవి ఏ రకమైన సామాన్య వాక్యాలో గుర్తించండి.
118. రాజు ఎప్పుడూ నీతిమార్గాన్ని వీడకూడదు.
అ) అప్యర్థకం
ఆ) విధ్యర్థకం
ఇ) సందేహార్థకం
ఈ) హేత్వర్థకం
జవాబు:
ఆ) విధ్యర్థకం
119. వీరు రాజు మేలు కోరుతూనే ఇతరుల ప్రలోభాలకు లోనై అహితులుగా మారుతారు.
అ) హేత్వర్ధకం
ఆ) నిశ్చయార్ధకం
ఇ) ప్రశ్నార్థకం
ఈ) ప్రేరణార్ధకం
జవాబు:
అ) హేత్వర్ధకం
120. బాణాన్ని ఎప్పుడంటే అప్పుడు విడువకు.
అ) విధ్యర్ధకం
అ)సామర్ధ్యార్థకం
ఇ) నిషేధార్థకం
ఈ) ప్రశ్నార్థకం
జవాబు:
ఇ) నిషేధార్థకం
121. రాజుకు తగిన మంత్రి అవసరం.
అ) ప్రేరణార్ధకం
ఆ) ఆశీరార్ధకం
ఇ) ఆశ్చర్యార్థకం
ఈ) నిశ్చయార్థకం
జవాబు:
ఈ) నిశ్చయార్థకం
122. రాజు సత్ప్రవర్తన, నిబద్ధత కలిగి ఉండాలి.
అ) విధ్యర్ధకం
ఆ) ఆశీరార్ధకం
ఇ) ప్రేరణార్ధకం
ఈ) నిషేధార్థకం
జవాబు:
అ) విధ్యర్థకం
123. గురి కుదిరిందో, లేదో చూసుకొని విలుకాడు బాణం వేస్తాడు.
అ) అప్యర్థకం
ఆ) సామర్థ్యార్థకం
ఇ) సందేహార్ధకం
ఈ) భావార్ధకం
జవాబు:
ఆ) సామర్థ్యార్థకం
124. పనసకు ఉన్నట్టుండి పిందెలు పుడతాయి.
అ) సామర్ధ్యార్థకం
ఆ) నిశ్చయార్ధకం
ఇ) ఆశ్చర్యార్థకం
ఈ) ఆశీరార్థకం
జవాబు:
ఇ) ఆశ్చర్యార్థకం
125. నేను పిసినారితనంతో, క్రూరత్వంతో ఉండను.
అ) ప్రేరణార్ధకం
ఆ) సామర్థ్యార్థకం
ఇ) ప్రశ్నార్ధకం
ఈ) నిశ్చయార్ధకం
జవాబు:
ఈ) నిశ్చయార్ధకం