AP 10th Class Telugu 8th Lesson Questions and Answers జీవని

Access to the AP 10th Class Telugu Guide 8th Lesson జీవని Questions and Answers are aligned with the curriculum standards.

జీవని AP 10th Class Telugu 8th Lesson Questions and Answers

చదవండి ఆలోచించి చెప్పండి.

అది 2021వ సంవత్సరం. టోక్యో పారా ఒలింపిక్ 50 మీటర్ల షూటింగ్ క్రీడాపోటీ ఫైనల్ జరుగుతోంది. జనంతో కిక్కిరిసిన స్టేడియంలోకి చక్రాల కుర్చీపై ఓ మహిళ తొణకని ఆత్మస్థైర్యంతో ప్రవేశించింది. ఆ పోటీలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. అప్పటికే 10 మీ. ఎయిర్ రైఫిల్‌లో బంగారు పతకాన్ని సాధించింది. ఆ మహిళే ‘అవని లేఖరా’. ఒకే పారా ఒలింపిక్స్‌లో రెండు పతకాలను భారతదేశానికి అందించిన ఏకైక మహిళ ఆమె. తన పదకొండు సంవత్సరాల వయస్సులో జరిగిన కారు ప్రమాదంలో రెండు కాళ్ళు కోల్పోయి అంగవైకల్యం పొందినా!

అధైర్య పడలేదు. తన చదువును కొనసాగిస్తూనే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తనకిష్టమైన షూటింగ్ అకాడమిలో చేరి శిక్షణ పొందింది. షూటింగ్ విభాగంలో మనదేశానికి స్వర్ణ పతకం అందించిన ‘అభినవ్ బింద్రాను’ ఆదర్శంగా తీసుకుంది. అదే విభాగంలో రాణించి 2021లో రాజీవ్ ఖేల్త్న అవార్డును, 2022లో రాష్ట్రపతి చేతుల మీదుగా ‘పద్మశ్రీ’ అవార్డుని అందుకుని ఎందరికో ఆదర్శంగా నిల్చింది. జీవితంలో ఏదైనా సాధించడానికి సంకల్ప బలం ఉండాలే కాని శారీరక వైకల్యం ఎంతమాత్రం అడ్డుకాదని (పత్రిక వార్త) నిరూపించింది.

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
అవని లేఖరా ఘనత ఏమిటి?
జవాబు:
అవని లేఖరా షూటింగ్ విభాగంలో మనదేశానికి స్వర్ణపతకం అందించింది. రాజీవ్ ఖేల్ రత్న, పద్మశ్రీలను అందుకొంది.

ప్రశ్న 2.
అవని లేఖరా ఎవరిని ఆదర్శంగా తీసుకుంది?
జవాబు:
అవని లేఖరా ‘అభినవ్ బింద్రా’ను ఆదర్శంగా తీసుకుంది.

AP 10th Class Telugu 8th Lesson Questions and Answers జీవని

ప్రశ్న 3.
పై పేరా నుండి మీరేం గ్రహించారు?
జవాబు:
సంకల్ప బలం ఉంటే శారీరక వైకల్యాన్ని అధిగమించి దేనినైనా సాధించవచ్చు. దీనికి ఉదాహరణ ‘అవని లేఖరా’ అని గ్రహించాం.

ఇవి చేయండి

అవగాహన ప్రతిస్పందన

ఆ) కింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి. రాయండి.

ప్రశ్న 1.
కథలో మీకు నచ్చిన సంఘటన గురించి మాట్లాడండి.
జవాబు:
కథలో గారడీ సంఘటన నాకు బాగా నచ్చింది. ఎందుకంటే గారడీలో 5 సంవత్సరాల అమ్మాయి పొడవైన గౌను వేసింది. అద్భుతమైన విన్యాసాలు చేసింది. సాహసకృత్యాలు చేసింది. వాటితో లలితను ఉత్తేజపరిచింది. ఒక ఐదు. సంవత్సరాల గారడీ అమ్మాయి తన చేష్టల ద్వారా పరిణతి చెందిన ఒక 30 సంవత్సరాల మహిళకు స్పూర్తిగా నిలవడం. నాకు నచ్చింది.

ప్రశ్న 2.
‘పిల్లల ప్రపంచంలో వ్యతిరేక ఆలోచనలు ఉండవు’ ఈ వాక్యంపై మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు:
పిల్లల ప్రపంచంలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే ఆలోచనలు ఉండవు. ఎక్కువకు వ్యతిరేక పదం తక్కువ, ఎక్కువ వారికి వ్యతిరేక భావన తక్కువ వారిపై ఉంటుంది. కాని, అటువంటి భావన పిల్లల ప్రపంచంలో ఉండదు. అలాగే అందమైన వారిని ఆదరణగాను, అందంగా లేని వారిని నిరాదరణగాను చూడరు. నా వాళ్లు, పైవాళ్లు అనే భావం ఉండదు. మా కులం, మరో కులం, మా మతం, మరో మతం ఇలాంటి అనారోగ్యకరమైన పట్టింపులేవీ పిల్లలలో ఉండవు. అందుకే ఎటువంటి కల్మషాలూ లేకుండా పిల్లలంతా హాయిగా కలిసి మెలిసి ఆడుకొంటారు.

ఆ) పద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
క. పరనారీ సోదరుఁ డై
పరధనముల కాసపడక పరులకుహితుఁ డై
పరులుదనుఁ బొగడ నెగడక
బరులలగిన నలుగ నతఁడు! పరముడు సుమతీ!

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
పరస్త్రీలతో ఎలా నడుచుకోవాలి?
జవాబు:
పరస్త్రీలతో సోదరునివలె నడుచుకోవాలి.

ప్రశ్న 2.
దేనికి ఆశపడకూడదు?
జవాబు:
పరధనానికి ఆశపడకూడదు.

ప్రశ్న 3.
ఉత్తముడు ఎవరు?
జవాబు:
పరులు పొగిడినా పొంగిపోనివాడు, పరులు అలిగినా అలగనివాడు ఉత్తముడు.

AP 10th Class Telugu 8th Lesson Questions and Answers జీవని

ప్రశ్న 4.
పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
పరులకు ఎటువంటివాడై ఉండాలి?

ఇ) కింది గద్యం చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

ముద్దు ముద్దుగా వచ్చిరాని మాటలు మాట్లాడుతూ గుండ్రంగా కళ్ళు తిప్పుతూ, ఇంటిల్లిపాదికి ఎంతో ఆనందాన్ని కలిగించే రెండేళ్ల పాపకు భయంకరమైన జ్వరం వచ్చింది. ఆ జ్వరంలో రోజుల తరబడి మత్తుగా ఏవేవో కలవరిస్తూ తల్లిదండ్రులను డాక్టర్లను కూడా ఎంతో కంగారు పెట్టింది. కొన్నాళ్లకు ఆమె ఆరోగ్యం బాగుపడింది కానీ వినికిడి శక్తి శ్రీ మాట్లాడే శక్తి కోల్పోయింది. అంధురాలైంది. ఆమె తల్లిదండ్రులు కొంతకాలం తరువాత చెవిటి, మూగ పిల్లలకు ఏ పాఠాలు చెప్పే ఉపాధ్యాయుని వద్దకు ఆ పాపను తీసుకెళ్లారు. ఆయన పాపను పరీక్షించి మీ పాప చాలా చురుకైంది ప్రోత్సహిస్తే తెలివితేటలు అభివృద్ధి చేసుకోగలదు మంచి డాక్టర్ని సంప్రదిస్తే కనీసం మాట్లాడగలుగుతుంది. అయితే!

ఎల్లవేళలా ఆమెను అంటిపెట్టుకునే టీచర్ ఉంటే మంచిది అని సలహా ఇచ్చాడు. వారు ఓ టీచర్ని ఏర్పాటు చేశారు. ఆమె సహాయంతో ఆ అమ్మాయి బాగా చదువుకుంది. సహకార గుణం అలవర్చుకోవడం ద్వారా అందరిని ఆకర్షించడం మొదలుపెట్టింది. బ్రెయిలీ లిపిని నేర్చుకుని అనేక పరీక్షల్లో పాస్ అయింది. అదే లిపి ద్వారా విరామ సమయంలో! అనేక సంగతులను లోక వ్యవహారాలను తెలుసుకొని ఎంతో విజ్ఞానం సంపాదించింది. తనలాంటి అంధుల సంక్షేమం కోసం పాటుపడాలని దీక్ష పూనింది. కొన్నాళ్ల తర్వాత ఆమెకు మాట వచ్చింది. దీంతో ప్రజల్లోకి వెళ్లి అంధుల శ్రేయస్సు కోసం పాటుపడవలసిందిగా ప్రసంగాలు చేసింది. అవి ప్రజలకు బాగా నచ్చాయి. అంధులకు జీవితం మీద విశ్వాసం కలిగించింది. ఆమె ఎవరో కాదు తను పట్టిన దీక్ష కోసం జీవితాన్నే పణంగా పెట్టిన హెలెన్ కెల్లర్. – ఆదర్శ బాల్యం

ప్రశ్నలు- జవాబులు

ప్రశ్న 1.
హెలెన్ కెల్లర్ అంగవైకల్యానికి కారణమేమిటి?
జవాబు:
భయంకరమైన జ్వరమే హెలెన్ కెల్లర్ అంగవైకల్యానికి కారణం.

ప్రశ్న 2.
ఉపాధ్యాయుడు ఏమని సలహా ఇచ్చారు?
జవాబు:
ఎప్పుడూ ఒక టీచర్ హెలెన్ కెల్లర్‌ను అంటిపెట్టుకొని ఉండేలా చూసుకోమని ఉపాధ్యాయుడు సలహా ఇచ్చాడు.

ప్రశ్న 3.
హెలెన్ విరామ సమయంలో ఏమి చేసేది?
జవాబు:
హెలెన్ విరామ సమయంలో బ్రెయిలీ లిపితో అనేక విషయాలను, లోక వ్యవహారాలను తెలుసుకొని ఎంతో విజ్ఞానం సంపాదించింది.

ప్రశ్న 4.
హెలెన్ అంధుల కోసం ఏమి చేసింది?
జవాబు:
హెలెన్ ప్రజలలోకి వెళ్లి అంధుల శ్రేయస్సు కోసం పాటుపడమని కోరింది. అంధులకు జీవితం మీద విశ్వాసం కలిగించింది.

ఈ) కింది వాక్యాలకు అర్థ సందర్భాలను రాయండి.

ప్రశ్న 1.
ఈ ఒక్క కలను సఫలం చెయ్యి తండ్రి!
జవాబు:
పరిచయం: ఈ వాక్యం డా॥ వి. చంద్రశేఖర రావు గారు రచించిన ‘జీవని’ కథల సంపుటి నుండి గ్రహింపబడిన ‘జీవని’ పాఠంలోనిది.

సందర్భం: గర్భ నిర్ధారణ కోసం ఆసుపత్రికి వెళ్లిన లలితను డాక్టర్ పరీక్షిస్తున్న సమయంలో తన గర్భం నిలబడేలా చేయమని భగవంతుని ప్రార్థిస్తూ తనలో తాననుకొనిన వాక్యమిది.

భావం: బిడ్డను కనాలనే కలను నెరవేర్చమని భగవంతుని ప్రార్థిస్తోందని భావం.

ప్రశ్న 2.
వారు కూడా మామూలు మనిషిలా బతకగలరు.
జవాబు:
పరిచయం: ఈ వాక్యం డా॥ వి. చంద్రశేఖర రావు గారు రచించిన ‘జీవని’ కథల సంపుటి నుండి గ్రహింపబడిన ‘జీవని’ పాఠంలోనిది.

సందర్భం: లలిత తన కూతురు ‘జీవని’కి టీకా వేసి బస్సులో తీసుకొనివస్తున్న సమయంలో ‘విశ్వనాథం’ అనే వృద్ధుడు తన కుమార్తె ‘ప్రమోదిని’ కూడా ‘జీవని’ వంటిదే అని చెబుతున్న సందర్భంలో పల్కిన వాక్యమిది.

భావం: ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు కొంత చేయూతనిస్తే మామూలు మనుషులు లాగే బ్రతకగలరని భావం.

ప్రశ్న 3.
ఈ శుభాకాంక్షలు మీకే ఇది మీ విజయమే!
జవాబు:
పరిచయం : ఈ వాక్యం డా॥ వి. చంద్రశేఖర రావు గారు రచించిన ‘జీవని’ కథల సంపుటి నుండి గ్రహింపబడిన ‘జీవని’ పాఠంలోనిది.

సందర్భం : జీవని వేసిన ‘అమ్మ’ అనే పెయింటింగ్ కి సోవియట్ లాండ్ చిల్డ్రన్స్ పెయింటింగ్స్ అవార్డు వచ్చిందని పాఠశాల సిబ్బంది లలితకు చెబుతూ ఉన్న సందర్భంలో పలికిన వాక్యమిది.

భావం : ‘జీవని’ చిత్రానికి వచ్చిన బహుమతి లలిత పడిన కష్టం వలన వచ్చినదేనని భావం.

AP 10th Class Telugu 8th Lesson Questions and Answers జీవని

ఉ) కింది ప్రశ్నలకు ఏకవాక్య సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
జీవని పెయింటింగ్ కి ఏ అవార్డు వచ్చింది?
జవాబు:
జీవని పెయింటింగ్ కి ‘సోవియట్ లాండ్ చిల్డ్రన్స్ పెయింటింగ్స్’ అవార్డు వచ్చింది.

ప్రశ్న 2.
విశ్వనాథం గారు జీవని కోసం ఏం చేశారు?
జవాబు:
విశ్వనాథం గారు జీవని వ్యక్తిత్వ వికాసానికి మంచి ప్రయోగాలు చేశారు. మంచి సూచనలు, సలహాలు ఇచ్చారు.

ప్రశ్న 3.
జీవని చదువుతో పాటు ఎందులో అభివృద్ధి సాధించింది?
జవాబు:
జీవని చదువుతో పాటు తనకు ఇష్టమైన బొమ్మలను గీయడంలో కూడా అభివృద్ధి సాధించింది.

వ్యక్తీకరణ సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
జీవని తనకు ఇష్టమైన అంశాలపట్ల ఎలా స్పందించేదో రాయండి.
జవాబు:
జీవనికి ఆకాశమంటే ఇష్టం. నీలిమబ్బు ఇష్టం. పక్షుల గుంపులంటే ఇష్టం. ఆకాశం వైపు చేతులు చాచి ఓ…. ఓ…. అంటూ పాటలు పాడేది. రోడ్డుపైన చిన్న అలికిడైనా బయటకు వచ్చి చూసేది. పొద్దుట కాన్వెంటు పిల్లలను చూసి, వాళ్ల అల్లరి చూసి ఆనందపడేది. ఏ…. ఏ…. ఏ…. అంటూ అరిచేది. తన భాషలో వారికి శుభాకాంక్షలు చెప్పేది. సాయంకాలం ఆటలాడే పిల్లలను ఆసక్తిగా చూసేది. వారివైపు చేతులూపేది. ఆటలలోని మాధుర్యాన్ని తనకూ పంచమని అభ్యర్ధనా పూర్వకంగా చూసేది.

ప్రశ్న 2.
ప్రత్యేక అవసరాలు గల పిల్లల గురించి విశ్వనాథం అభిప్రాయాలు రాయండి.
జవాబు:
ఈ లోకంలో ‘జీవని’ వంటి ప్రత్యేక అవసరాలు గల పిల్లలు చాలామంది ఉంటారని విశ్వనాథంగారి అభిప్రాయం. వారిని తీర్చిదిద్దాలనే ఓర్పు, పట్టుదల, దీక్ష ఉన్నవారు తక్కువ. తన కుమార్తె ‘ప్రమోదిని’ కూడా ప్రత్యేక అవసరాలున్న అమ్మాయే. అటువంటి పిల్లలకు చేయూతనిస్తే వారుకూడా మామూలు మనుషులులాగా జీవించగలరని విశ్వనాథంగారి అభిప్రాయం. జీవితం అంటే కాస్త వెలుగూ, కాస్త చీకటి ఉంటుందని ఆయన అభిప్రాయం.

ప్రశ్న 3.
లలిత జీవని కోసం తరగతి ఉపాధ్యాయినిని ఏమని అర్థించింది?
జవాబు:
జీవని ఎంత నేర్చుకొంది అనికాక నేర్చుకోవడానికి ఎంత తపన పడుతోందో గమనించమని టీచర్లను లలిత కోరింది. జీవనిని ఒక ఛాలెంజ్ గా తీసుకోమని అర్థించింది. మానసికంగా వెనుకబడ్డ పిల్లల్ని కూడా ఓపికతో, అనురాగంతో, వారిలో ఆత్మస్థైర్యం నింపి, ముందుకు నడిపించాలని కోరింది. వారి అభివృద్ధికి తోడ్పడమని అభ్యర్థించింది. జీవని తల్లిగా కాకుండా మార్పును కోరే మహిళగా అర్థిస్తున్నట్లు లలిత టీచర్లకు చెప్పారు. జీవని ప్రత్యేక అవసరాలు గల పాప అనీ, ఆమెపై ప్రత్యేక శ్రద్ధ చూపమనీ, జీవనిని నిరుత్సాహపరచవద్దని టీచర్లను లలిత అభ్యర్థించింది.

ఆ) కింది ప్రశ్నలకు ఎనిమిది నుండి పది వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘జీవని’ పాఠం ఆధారంగా మీరు గ్రహించిన విషయాలను సొంత మాటల్లో రాయండి.
జవాబు:
ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు సహాయం చేయాలి. వారిని ప్రోత్సాహపరచాలి. వారిలోని ప్రతిభను గుర్తించాలి. అభినందించాలి. ప్రోత్సహించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులే ఈ పాత్ర పోషించాలి. పాఠశాలలోని ఉపాధ్యాయులు కూడా ఓర్పుతో, నేర్పుతో వ్యవహరించాలి. ప్రత్యేక అవసరాలున్న పిల్లల పట్ల సమాజంలోని ప్రతి వ్యక్తి బాధ్యతతో వ్యవహరించాలి. అటువంటి పిల్లల పరిస్థితిని బట్టి వైద్యులను కలవాలి. మనస్తత్వ శాస్త్రవేత్తలను కలవాలి. అవసరమైతే మందులు వాడాలి.

తప్పదంటే చిన్న చిన్న ఆపరేషన్లు కూడా చేయించాలి. తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు మొదలైనవారంతా చాలా ఓర్పుతో, నేర్పుతో తీర్చిదిద్దితే ప్రత్యేక అవసరాలున్న పిల్లలు కూడా కొంత కాలానికి మామూలువారిగా తయారౌతారు. ఎవరూ సాధించలేని అద్భుతాలు సాధిస్తారు. ఆదర్శంగా నిలుస్తారు. మనదేశ కీర్తి, ప్రతిష్ఠలు పెంచుతారు అని ఈ పాఠం ద్వారా గ్రహించాను.

AP 10th Class Telugu 8th Lesson Questions and Answers జీవని

ప్రశ్న 2.
జీవనిని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో తల్లి పాత్రను వివరించండి.
జవాబు:
జీవనిని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో తల్లి పాత్రే కీలకం అయినది. తన అత్త, ఆడబిడ్డ, భర్త ఇలా కుటుంబంలోని వారెవరూ పట్టించుకోలేదు. అయినా ఆ పరిస్థితులు లలితలో పట్టుదలను, మొండితనాన్ని పెంచాయి. లక్ష్యాన్ని సాధించడానికే జీవించే సైనికురాలిలా ఇంటికి చేరింది. జీవని గురించి తన భర్తతో విభేదించింది.

గారడీ అమ్మాయి విన్యాసాలు చూసి ఉత్తేజితమయింది. ఆ అయిదేళ్ల అమ్మాయిని స్ఫూర్తిగా తీసుకొంది. కష్టపడి నేర్పితే తన బిడ్డ కూడా తన జీవితానికి అవసరమైనవి నేర్చుకొంటుందనే నమ్మకం ఏర్పరచుకొంది.

ఒకరోజు జీవనికి టీకా వేయించుకొని వస్తూ బస్సెక్కింది. నిండుగా ఉన్న బస్సులో విశ్వనాథం అనే వృద్ధుడు పరిచయమయ్యాడు. ఆయన తమ కుమార్తె ‘ప్రమోదిని’ కూడా ప్రత్యేక అవసరాలు కల అమ్మాయే అని చెప్పాడు. తను, తన భార్య ఆ అమ్మాయిని తీర్చిదిద్దినట్లు చెప్పాడు. ఆమెను 10వ తరగతి చదివించినట్లు చెప్పాడు. జీవని లాంటి పిల్లలు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారని చెప్పాడు.

విశ్వనాథంగారు గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్త, జీవని వ్యక్తిత్వ వికాసానికి ఆయన చేస్తున్న ప్రయోగాలు పాప పెంపకానికిచ్చే సూచనల ఫలితంగా జీవనిలో మార్పులు వచ్చాయి. అడుగులు వేస్తోంది. జీవని ముఖంలో అపూర్వమైన తేజస్సు కనిపించింది. పిల్లల వైపు చూస్తూ చేతులు చాపేది. చేతులు ఊపేది. ఆ మార్పులు లలితకు గొప్ప ఆనందం కల్గించాయి.

జీవని పిల్లలతో ఆడుతున్న ‘పెళ్లి’ ఆట లలిత తన పోరాటంలో సాధించిన గొప్ప తొలి విజయం.

విశ్వనాథంగారి సూచనతో జీవనిని పాఠశాలలో వేసింది లలిత. అక్కడి ఉపాధ్యాయుల కంప్లెంట్ విని, జీవనిని కొంచెం ఓర్పుతో, నేర్పుతో అభివృద్ధి పరచమని కన్నీటితో అభ్యర్థించింది. చదువుతోబాటు జీవని బొమ్మలనూ గీసేది. చివరకు అద్భత విజయం సాధించింది జీవని. అది ఒక తల్లిగా లలిత సాధించిన విజయమని పాఠశాల ఉపాధ్యాయులు అన్నమాట అక్షర సత్యం.

జీవని వేసిన ‘అమ్మ’ పెయింటింగ్‌కు సోవియట్ లాండ్ చిల్డ్రన్స్ పెయింటింగ్స్ అవార్డు వచ్చింది. అది దక్షిణ భారత దేశంలో జీవని ఒక్కదానికే వచ్చింది. జీవని ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా తనకు ప్రేరణ, విజయకారణం తన సర్వస్వం అమ్మే అని చెప్పింది. ఒక తల్లికి ఇంతకంటే గొప్ప సర్టిఫికేట్ ఏముంటుంది? ఎవరిస్తారు? అందుకే జీవనిని తీర్చిదిద్దడంలో తల్లి పాత్ర అత్యద్భుతం.

ఇ) కింది ప్రశ్నలకు సృజనాత్మకంగా జవాబులు రాయండి.

ప్రశ్న 1.
పాఠంలోని సన్నివేశాల ఆధారంగా లలిత, విశ్వనాథం లేదా లలిత మరియు తరగతి ఉపాధ్యాయుల మధ్య చర్చను సంభాషణ రూపంలో రాయండి.
జవాబు:
సంభాషణ – 1
విశ్వనాథం: పాపను నేను ఎత్తుకుంటాను. నాకివ్వమ్మా! బస్ దిగేటప్పుడు ఇస్తాను.

లలిత : థ్యాంక్సండీ! పాపను ఇస్తారా!

విశ్వనాథం : ఇంటి దాకా ఆహ్వానించవా!

లలిత : రండి.

విశ్వనాథం : ఈ క్షణం నువ్వు నాకెంతో సన్నిహితమైన దానివనిపిస్తోంది. ఎందుకంటే నువ్వు అనుభవిస్తున్న ఈ స్ధితిని నేను, నా భార్య అనుభవించాము. జీవని లాంటి పిల్లలకు ఈ ప్రపంచంలో కొదవలేదు. మీలాంటి తల్లులే అరుదు. మేము కూడా ఇరవై సంవత్సరాల క్రితమే జీవని లాంటి పాపకు జన్మనిచ్చాం.

లలిత : పాప పేరు?

విశ్వనాథం : ప్రమోదిని. ఆమెను ఒక సైనికురాలిగా పెంచాం, చదివించాం. ఇలాంటి పిల్లలకు చేయూతనిస్తే వారు కూడా మామూలు మనిషిలా బతకగలరని నిరూపించాలన్నదే మా ఆరాటం. మేము కన్న కలలు నిజమయ్యాయి. జీవితం అంటే కాస్త వెలుగూ, కాస్త చీకటి అన్నట్టు.

లలిత : మీ మాటల్లో మా పట్ల అనురాగం కనబడుతోంది. జీవని పాలిట జ్ఞానదీపంలా ఉన్నారు.

విశ్వనాథం : అదేం లేదమ్మా. జీవని ఆత్మీయుల లిస్టులో నన్ను కూడా చేర్చుకో. జీవని ఎదుగుదలకు అవసరమయ్యే సహాయ, సహకారాలు మా నుంచి ఎప్పుడూ ఉంటాయి.

లలిత : అలాగే నండి. మీరిచ్చే సూచనలు, పాప చేత చేయించే ఎక్సర్సైజులు ఫలితంగా జీవనిలో మార్పులు వస్తున్నాయి.

విశ్వనాథం : ఇక, జీవనిని పాఠశాలలో చేర్చించండి.

లలిత : అలాగేనండి.

సంభాషణ – 2

టీచర్ : లలితగారు! మీ జీవని “అ, ఆ లు రాయమంటే ఆకాశాన్ని, మబ్బుల్ని గీస్తుంది. ఎ,బి,సి,డి,లు రాయమంటే చెట్లనీ, ఎగిరే పక్షుల్ని గీస్తుంది. పాప బడిలో చేరి సంవత్సరం అయింది. ఇంకా వర్ణమాల రాలేదు.

లలిత : ఎంత నేర్చుకుంది అని కాక నేర్చుకోవడానికి ఎంత పెనుగులాడుతోందో గమనించండి. నెమ్మదిగానే దాని మస్తిష్కం గ్రహిస్తుంది. వందలకొద్ది పిల్లలకు మీరు విద్య నేర్చి ఉంటారు. కానీ జీవని లాంటి పాప తటస్థపడి ఉండదు. జీవనిని ఛాలెంజ్ గా తీసుకోండి. మానసికంగా వెనుకబడిన పిల్లల్ని ఓపికతో, అనురాగంతో, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి ముందుకు నడిపిద్దాం. జీవని తల్లిగా కాదు, మార్పును కోరే మహిళగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. తనపై ప్రత్యేక శ్రద్ధ చూపండి. తనను నిరుత్సాహపరచకండి. ప్లీజ్!

ప్రధానోపాధ్యాయురాలు : లలితగారు! మీ అమ్మాయిని ఇంక ప్రత్యేకంగా చూస్తాం. మీతోపాటు మేము కూడా జీవనికి ఇష్టమైన రంగంలో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాం. పాప బాధ్యత మణిభూషణ్ మేడమ్‌కు అప్పచెబుతున్నాం. ఆమెకు పిల్లలన్నా, పెయింటింగ్ అన్నా ఇష్టం.
లలిత : థ్యాంక్యూ! మేడమ్.

స్కూల్ స్టాఫ్ : శుభాకాంక్షలు లలితగారు. జీవని పెయింటింగ్ కి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. ఈ శుభాకాంక్షలు మీకే. ఇది మీ విజయమే.

ప్రశ్న 2.
మీ పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు నీవు ఎలా తోడ్పడతావు?
జవాబు:
మా పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు నేను చేదోడు వాదోడుగా ఉంటాను. వాళ్లు రేంప్ నుండి ఎక్కేటప్పుడు సహాయం చేస్తాను. స్నేహంగా ఉంటాను. వాళ్లు రాయడానికి ఇబ్బంది పడుతుంటే నేనే వాళ్ల నోట్సులు రాస్తాను. వాళ్లకేదైనా అర్థం కానివి ఉంటే నేను అర్థమయ్యేలా చెబుతాను.

నేను తెచ్చుకొన్న టిఫిన్ వాళ్లకీ పెడతాను. వ్యాయామం పీరియడ్‌లో నేను వాళ్లతోనే చుక్కలాట, రాముడు సీత వంటి ఆటలు ఆడతాను. రోజూ చాలా కథలు చెప్పుకొంటాం. జోక్స్ వేసుకొని నవ్వుకొంటాం. కథల పుస్తకాలు చదువుకొంటాం. నేనే కాదు మా పాఠశాలలో పిల్లలందరం అలాగే ఉంటాం. మా ఆటలతో, పాటలతో, కథలతో వాళ్లని ఉత్తేజపరుస్తాం. ఆనందపరుస్తాం. వాళ్ల లోపాలని వాళ్లెప్పుడో మరచిపోయారు. అందరం సమానమే అనే భావనే మా అందరిదీ.

భాషాంశాలు

పదజాలం

అ) కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి, సొంతవాక్యాలు రాయండి.

1. గారడివారు రకరకాల విన్యాసాలు చేస్తారు.
విన్యాసాలు = ప్రదర్శనలు
సొంతవాక్యం : ప్రతి ఏటా సర్కస్ ్వరు రకరకాల ప్రదర్శనలు ఇస్తారు.

2. వెన్నెల రాకతో అంధకారం తొలగిపోయింది.
అంధకారం = చీకటి
సొంతవాక్యం కరెంట్ రావడంతో గదిలో చీకటి పోయింది.

3. సంజీవరాయశర్మ జన్మాంధుడైనా ఆత్మస్థైర్యంతో గణితావధానాలు చేశారు.
ఆత్మస్థైర్యం = సమస్యలను తట్టుకొనే ధీమా.
సొంతవాక్యం ఆటలు ఆడితే సమస్యలను తట్టుకొనే ధీమా కలుగుతుంది.

4. పిల్లలు వేణువును ఊదుతూ ఆనందిస్తున్నారు.
వేణువు = పిల్లనగ్రోవి
సొంతవాక్యం : కృష్ణుడు పిల్లనగ్రోవి ఊదితే లోకం పరవశించేది.

5. కొందరిలో లేశము అయినా జాలిగుణం ఉండదు.
లేశము = కొంచెం
సొంతవాక్యం : ఉన్నదానిలో కొంచెం ఐనా దానం చేయాలి.

AP 10th Class Telugu 8th Lesson Questions and Answers జీవని

ఆ) కింది వాక్యాలలోని పర్యాయపదాలు గుర్తించి రాయండి.

ప్రశ్న 1.
సుధ కోసం పాల సముద్రం చిలికారు. ఫలితంగా పీయూషం దక్కింది. దేవతలు అమృతం త్రాగడం వలన అమరులు అయ్యారు.
జవాబు:
సుధ, పీయూషం, అమృతం

ప్రశ్న 2.
అనాథల క్షుధ తన ఆకలిగా భావించి ఆ క్షుత్తు తీర్చేవాడే మహాత్ముడు.
జవాబు:
క్షుధ, ఆకలి, క్షుత్తు

ప్రశ్న 3.
రవి తామరలకు బంధువు. సూర్యుని రాకతో అవి వికసిస్తాయి. భానుడు అంటే వాటికిష్టం.
జవాబు:
రవి, సూర్యుడు, భానుడు

ప్రశ్న 4.
జీవని చిత్రలేఖనంలో శిక్షణ తీసుకుంది. అభ్యాసం వల్ల చిత్రాలు గీయగల్గింది. నిరంతర తర్ఫీదుతో బహుమతి సాధించింది.
జవాబు:
శిక్షణ, అభ్యాసం, తర్ఫీదు

ప్రశ్న 5.
మనిషికి మంచి కోరికలుండాలి. ఆ కాంక్షల కోసం కష్టపడి పనిచేయాలి. అప్పుడే ఆశలు నెరవేరుతాయి.
జవాబు:
కోరిక, కాంక్ష, ఆశ, ఆకాంక్ష

ఇ) కింది పదాలను సరియైన నానార్థాలతో జతపరచండి.
AP 10th Class Telugu 8th Lesson Questions and Answers జీవని 1
1. ఉదరము (ఆ) అ) మేఘము, చీకటి, అజ్ఞానం
2. విన్యాసము (ఇ) ఆ) పొట్ట, యుద్ధం, నడుము
3. అమృతం (ఈ) ఇ) ఉంచుట, చక్కని ప్రదర్శన, రచన
4. మబ్బు (అ) ఈ) సుధ, పాలు, ముక్తి

ఈ) కింది పదాలకు సరైన వ్యుత్పత్త్యర్థాలతో జతపరచండి.
AP 10th Class Telugu 8th Lesson Questions and Answers జీవని 2
1. ఆకాశం (ఆ) అ) అజ్ఞానాంధకారం తొలగించే వాడు (ఉపాధ్యాయుడు)
2. అమృతం (ఇ) ఆ) దీనియందంతట సూర్యచంద్రులు ప్రకాశించుదురు (గగనం)
3. విశ్వనాథుడు (ఈ) ఇ) మరణాన్ని పొందింపనిది / కలిగింపనిది (సుధ)
4. గురువ (అ) ఈ) విశ్వానికి నాథుడు (శివుడు)

ఉ) కింది వాక్యాలలోని ప్రకృతి – వికృతులను గుర్తించి, పట్టికలో రాయండి.

1. హిమగిరి దృశ్యం అపూర్వం. అది నన్ను అబ్బుర పరిచింది.
2. ఆకాశంలో పక్షి ఎగురుతోంది. పక్కికి రెక్కలే బలం.
3. వైద్యులు ఆరోగ్య రక్షకులు, వెజ్జులు దైవంతో సమానులు,
4. ఈ భవన నిర్మాణం ఆశ్చర్యం గొల్పుచున్నది. చూసే వారందరు అచ్చెరువునొందు చున్నారు.
5. అర్ధరాత్రి వేళ బయటకు వెళ్ళకూడదు. అద్దమరేయి ఇంటిలో ఉండడమే ఉత్తమం.
AP 10th Class Telugu 8th Lesson Questions and Answers జీవని 3
ప్రకృతి – వికృతి

1. అపూర్వం – అబ్బురం
2. పక్షి – పక్కి
3. వైద్యులు – వెజ్జులు
4. ఆశ్చర్యం – అచ్చెరువు
5. అర్ధరాత్రి – అద్దమరేయి

ఈ) కింది జాతీయాలను వివరించండి.
గుసగుసలు, మారుమ్రోగుట, మనసులో ముల్లు, చేజారిపోవు

1. గుసగుసలు
వివరణ: వినపడీ వినపడనట్లు మాట్లాడుకొంటున్న సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.
సొంతవాక్యం : గురువుగారు నల్లబల్లపై వ్రాసిన తప్పులను చూసి విద్యార్థులు గుసగుసలాడుతున్నారు.

2. మారు మ్రోగుట
వివరణ: అదేపనిగా ఎక్కువగా ప్రచారమైన సందర్భంలో మారుమ్రోగుట అనే జాతీయం ఉపయోగిస్తారు.
సొంతవాక్యం శ్రీరాముడు చేసిన శివధనుర్భంగం లోకమంతా మారుమ్రోగింది.

3. మనసులో ముల్లు
వివరణ : భరించలేక, ఎవరికీ చెప్పుకోలేక, మనసులో ఇమడక ఉండే బాధ గురించి చెప్పే సందర్భంలో మనసులో ముల్లు అనే జాతీయం ఉపయోగిస్తారు.
సొంతవాక్యం : మయసభలో ద్రౌపది నవ్వు దుర్యోధనుని మనసులో ముల్లులా బాధించింది.

4. చేజారిపోవు
వివరణ : కొంచెం పొరపాటుతో మంచి అవకాశం కోల్పోయిన సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.
సొంతవాక్యం : కొద్ది ఆలస్యం వలన పరీక్ష వ్రాసే అవకాశం చేజారిపోయింది.

AP 10th Class Telugu 8th Lesson Questions and Answers జీవని

వ్యాకరణాంశాలు

అ) కింది పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.
AP 10th Class Telugu 8th Lesson Questions and Answers జీవని 4
1. సైనికురాలు : సైనిక + ఆలు = రుగాగమ సంధి
2. ప్రత్యేకం : ప్రతి + ఏకం = యణాదేశ సంధి
3. కుటుంబమంతా : కుటుంబము + అంతా = ఉత్వసంధి
4. ఎండుటాకు : ఎండు + ఆకు = టుగాగమ సంధి
5. అవయవాలు : అవయవము + లు = లు,ల,న,ల సంధి

ఆ) కింది పదాలను కలిపి, సంధి పేరు రాయండి.
AP 10th Class Telugu 8th Lesson Questions and Answers జీవని 5
1. మరి + ఒక : మరొక (ఇత్వసంధి)
2. అప్పుడు + అప్పుడు : అప్పుడప్పుడు (ఆమ్రేడిత సంధి)
3. అవసరము + ఐన : అవసరమైన (ఉత్వసంధి)
4. తగిలిన + అంత : తగిలినంత (అత్వసంధి)

విసర్గ సంధి

1. సంస్కృత పదాల మధ్య విసర్గ మీద తరచు సంధి జరుగుతూంటుంది. అది వేరువేరు రూపాలుగా ఉండటం గమనిద్దాం.
కింది ఉదాహరణలు విడదీసి చూడండి.
అ) శిరోరత్నం
ఆ) తపోబలం
ఇ) పయోనిధి
ఈ) వచోనిచయం

* పై పదాలను విడదీస్తే – ఈ కింది విధమైన మార్పులు జరిగాయి గమనించండి..
AP 10th Class Telugu 8th Lesson Questions and Answers జీవని 6

* కింది పదాలు కలిపి, మార్పును గమనించండి.
AP 10th Class Telugu 8th Lesson Questions and Answers జీవని 7
అ) తపః + శక్తి = తపశ్శక్తి
ఆ) చతుః + షష్టి = చతుష్షష్టి
ఇ) నభః + సుమం = భస్సుమం

పదాలను కలుపగా వరుసగా తపశ్శక్తి, చతుష్షష్టి, నభస్సుమం అనే రూపాలు ఏర్పడ్డాయి కదా!
(విసర్గమీద శ, ష, స లు ద్విత్వాలుగా మారడం గమనించండి)

* కింది పదాలను విడదీయండి.
AP 10th Class Telugu 8th Lesson Questions and Answers జీవని 8
అ) యశః కాయము = యశః + కాయము
ఆ) తపఃఫలము = తపః + ఫలము

* ‘స’ కారం (స్) విసర్గరూపంగా ప్రయోగిస్తారు. అందుకే నమస్కారం, శ్రేయస్కరం, వనస్పతి మొదలయిన సందర్భాల్లో మార్పులేదు.

* కింది పదాలను కలిపి, మార్పును గమనించండి.
AP 10th Class Telugu 8th Lesson Questions and Answers జీవని 9
AP 10th Class Telugu 8th Lesson Questions and Answers జీవని 10

* కింది పదాలు విడదీయండి.
AP 10th Class Telugu 8th Lesson Questions and Answers జీవని 11
AP 10th Class Telugu 8th Lesson Questions and Answers జీవని 12

* కింది పదాలు విడదీయండి.
AP 10th Class Telugu 8th Lesson Questions and Answers జీవని 13 AP 10th Class Telugu 8th Lesson Questions and Answers జీవని 14
పై ఉదాహరణలన్నీ పరిశీలించిన మీదట విసర్గ సంధి ఆరు విధాలుగా ఏర్పడుతున్నదని తెలుస్తున్నది.
i) అకారాంత పదాల విసర్గకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు (క, చ, ట, త, ప, ఖ, ఛ, ఠ, థ, ఫ) శ, ష, స లు గాక మిగతా అక్షరాలు పరమైనప్పుడు, విసర్గ లోపించి ‘అ’ కారం ‘ఓ’ కారంగా మారుతుంది.
ii) విసర్గకు శ, ష, స లు పరమైనప్పుడు శ, ష, స లు ద్విత్వాలుగా మారుతాయి.
iii) విసర్గ మీద క, ఖ, ప, ఫ లు వస్తే మార్పురాదు (సంధి ఏర్పడదు).
iv) అంతః, దుః చతుః, ఆశీః, పునః మొదలైన పదాల విసర్గ రేఫ (ర్) గా మారుతుంది.
v) ఇస్, ఉస్ల విసర్లకు క, ఖ, ప, ఫ ‘పరమైతే విసర్గ ‘ష’ కారంగా మారుతుంది.
vi) విసర్గకు చ, ఛలు పరమైతే ” కారం, ట, ఠ లు పరమైతే ‘ష’ కారం; త, థ లు పరమైతే ‘స’ కారం వస్తాయి.

ఇ) కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేరు రాయండి.
AP 10th Class Telugu 8th Lesson Questions and Answers జీవని 15

1. ఐదు నెలలు = ఐదు సంఖ్య గల నెలలు – ద్విగు సమాసం
2. మృదుమధురం = మృదువును, మధురమును – విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం
3. జ్ఞానదీపం = జ్ఞాన మనెడి దీపం – రూపక సమాసం
4. అనూహ్యం = ఊహ్యం కానిది – నజ్ తత్పురుష సమాసం
5. పిల్లల ప్రపంచం = పిల్లల యొక్క ప్రపంచం – షష్ఠీ తత్పురుష సమాసం
అలంకారం – క్రమాలంకారం / యధా సంఖ్యాలంకారం.

* కింది ఉదాహరణల ద్వారా క్రమాలంకారాన్ని అవగాహన చేసుకోండి.

శత్రువుని మిత్రుని విపత్తుని జయింపుము రంజింపుము భంజింపుము.
పై ఉదాహరణ పరిశీలిస్తే శత్రువు, మిత్రుడు, విపత్తు అనే మూడు పదాలు ఉన్నాయి. వరుసగా జయింపుము, రంజింపుము, భంజింపుము అనేవి కూడా ఇచ్చారు. ఇప్పుడు మూడింటికి వరుసగా మూడు కలిపితే శత్రువుని జయింపుము, మిత్రుని రంజింపుము, విపత్తుని భంజింపుము అని ఏర్పడతాయి. ఈ విధముగా చెప్పడాన్ని క్రమాలంకారం అంటారు.

లక్షణం: వస్తు క్రమాన్ని పాటిస్తూ అదే వరుస క్రమంలో అన్వయాన్ని చెప్పడాన్ని క్రమాలంకారం అంటారు.

AP 10th Class Telugu 8th Lesson Questions and Answers జీవని

* కింది వాక్యాలను పరిశీలించి అలంకారాన్ని గుర్తించండి.

ప్రశ్న 1.
గజకచ్ఛపమూషికంబులు వన లబిలములందు ప్రవేశించాయి.
జవాబు:
ఇచ్చిన వాక్యంలో క్రమాలంకారం ఉంది.
లక్షణం: వస్తు క్రమాన్ని పాటిస్తూ అదే వరుసక్రమంలో అన్వయాన్ని చెప్పడాన్ని క్రమాలంకారం అంటారు. సమన్వయం: గజము, కచ్ఛపము (తాబేలు), మూషికము అనేవి వస్తు క్రమం. వనం (అడవి), జలం, బిలంలలో ప్రవేశించడం అన్వయం.
అంటే గజము వనంలోకి ప్రవేశించింది. (1. గజము 1. వనం)
కచ్ఛపము జలంలోకి ప్రవేశించింది. (2. కచ్చపం – 2. జలం)
మూషికము బిలం (కన్నం)లోకి ప్రవేశించింది. (3. మూషికం – 3. బిలం)
ఈ విధంగా 1. గజం, 2. కచ్ఛపం, 3. మూషికం అనేవి 1. వనం, 2. జలం, 3. బిలంలోకి ప్రవేశించాయి అని క్రమాలంకారంలో చెప్పడం వలన ఇచ్చినది క్రమాలంకారం.

ప్రశ్న 2.
సూర్యచంద్రులు దివారాత్రములకు అధిపతులు,
జవాబు:
ఇచ్చిన వాక్యంలో క్రమాలంకారం ఉంది.
లక్షణం : వస్తు క్రమాన్ని పాటిస్తూ అదే వరుసక్రమంలో అన్వయాన్ని చెప్పడాన్ని క్రమాలంకారం అంటారు.
సమన్వయం: 1. సూర్యుడు, 2. చంద్రుడు అనేవి 1. దివమునకు, 2. రాత్రమునకు అని క్రమంలో అధిపతులని చెప్పడం వలన ఇచ్చినది క్రమాలంకారం.

ఈ) కింది సామాన్య వాక్యాలను, సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.

ప్రశ్న 1.
రేష్మ ఆసుపత్రికి వెళ్ళింది. రేష్మ పరీక్షలు చేయించుకుంది.
జవాబు:
రేష్మ ఆసుపత్రికి వెళ్ళి, పరీక్షలు చేయించుకుంది.

ప్రశ్న 2.
విశ్వనాథం జీవని ఇంటికి వచ్చాడు. విశ్వనాథం జీవనికి సహాయం చేశాడు.
జవాబు:
విశ్వనాథం జీవని ఇంటికి వచ్చి, సహాయం చేశాడు.

ప్రశ్న 3.
పిల్లలందరూ ఒకచోట చేరారు. పిల్లలందరూ బొమ్మలతో ఆడుకుంటున్నారు.
జవాబు:
పిల్లలందరూ ఒకచోట చేరి, బొమ్మలతో ఆడుకుంటున్నారు.

ప్రశ్న 4.
ఆమె పాపకు చేయూతనిచ్చింది. ఆమె పాపను చక్కగా పెంచింది.
జవాబు:
ఆమె పాపకు చేయూత నిచ్చి, చక్కగా పెంచింది.

ప్రశ్న 5.
జీవని చిత్రాలెన్నో గీసింది. జీవని ప్రధమ బహుమతి పొందింది.
జవాబు:
జీవని అమ్మచిత్రం గీసి, ప్రథమ బహుమతి పొందింది.

ఉ) కింది వాక్యాలు చదవండి. అవి ఏ రకమైన వాక్యాలో రాయండి.
AP 10th Class Telugu 8th Lesson Questions and Answers జీవని 16 AP 10th Class Telugu 8th Lesson Questions and Answers జీవని 17

1. పాపాయి నడవగలదు.
జవాబు:
సామర్థ్యార్థక వాక్యం

2. పిల్లలూ మీరందరూ ఆడుకోవచ్చు.
జవాబు:
అనుమత్యర్థక వాక్యం

3. వాన వస్తుందో! రాబో
జవాబు:
సందేహార్ధక వాక్యం

4. ఆహా! ఆ చిత్రం ఎంత బాగుందో!
జవాబు:
ఆశ్చర్యార్థక వాక్యం

5. వర్షాలు కురవక పంటలు పండలేదు.
జవాబు:
హేత్వర్థక వాక్యం

ప్రాజెక్టు పని

ప్రత్యేక అవసరాలు కలిగిన వ్యక్తుల్లో పేరొందిన వారి జీవిత వివరాలు సేకరించి, తరగతి గదిలో చర్చించండి.
ఉదా : రాగతి పండరి, లక్కోజు సంజీవరాయ శర్మ, లూయీ బ్రెయిల్, హెలెన్ కెల్లర్, సుధాచంద్రన్.
జవాబు:
1. రాగతి పండరి :
రాగతి పండరీబాయి 22.7.1965న విశాఖపట్టణంలో జన్మించారు. శాంతకుమారి, గోవిందరావు దంపతులు ఆమె తల్లిదండ్రులు. ఆమె చదువు ఇంటివద్దనే సాగింది. పోలియో కారణంగా శారీరకంగా చలాకీగా తిరగలేకపోయేవారు. అఖందకీర్తి ప్రతిష్ఠలనార్జించిన ఏకైక మహిళా కార్టూనిస్టు రాగతి పండరీబాయి,

తెలుగు వ్యంగ్య చిత్రకళారంగంలో చాలా మంచిపేరు తెచ్చుకొన్నారు. ఆ రంగంలో అగ్రగణ్యులైన బాపు, జయదేవ్, బాబుల సరసన నిలబడగల స్థాయికి అనతికాలంలోనే చేరుకొన్నారు. ఈ మంచి పేరుకు వెనుక ఆమె అకుంఠిత దీక్ష, వ్యంగ్య చిత్రకళ మీద ఎనలేని ప్రేమ, నిరంతర పరిశ్రమ ఉన్నాయి.

ఆమె మాటలలో చెప్పాలంటే, ‘జీవితంలో వేదనని కాసేపు పక్కకు పెట్టి, నిండుగా నవ్వగలిగే శక్తినిచ్చే కార్టూన్లు, మనిషికి గ్లూకోజ్ దోసు లాంటివి.’

ఏవిధమైన భయం లేకుండా తాను కార్టూన్లు గీయాలన్న కోరిక, స్ఫూర్తి, కార్టూనిస్టు జయదేవ్ కలుగజేశారని చెబుతుంది. జయదేవ్ కూడా రాగతి పండరి తన శిష్యురాలని చెప్పుకొంటాడు.

ఆమె ఈ రంగంలో అనేక బహుమతులు, ప్రశంసలు అందుకొన్నారు. తన 49వ ఏట 2015 ఫిబ్రవరి 19న కన్నుమూశారు.

2. లక్కోజు సంజీవరాయశర్మ (22.11.1907 – 2.12.1997) :
ఈయన స్వగ్రామం కడపజిల్లా కల్లూరు నివాసి. ప్రపంచంలో ఆరువేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి. ఈయన తల్లి నాగమాంబ, తండ్రి పెద్ద పుల్లయ్య. ఆది లక్షమ్మ ఈయన భార్య. ఈయనకు ఒక మగ, ఇద్దరు ఆడపిల్లలు. ఈయన వయోలిన్ వాయిస్తూ ఉండగా గణితంలో లెక్కలు అప్పటికప్పుడు చెప్పేవాడు. అవధానంలో పుట్టిన తేది ఇస్తే అది ఏ వారము అయిందో చెప్పడం ఒక అంశం. కాని ఈ విషయంలో సంజీవరాయశర్మకు ఒక ప్రత్యేకత ఉంది. అంటే పుట్టిన తేదీ సమయము, ప్రదేశము చెప్పగానే దానికి సంబంధించిన తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం, వర్జ్యము, రాశి కూడా చెప్పి కొంతవరకు జాతకం కూడా చెప్పేవాడు.

ఈయనకు 1996లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ఇచ్చి గౌరవించింది. 1959లో అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్, ప్రధానమంత్రి శ్రీ జవహర్లాల్ నెహ్రూ లాంటి పెద్దల ముందు తన ప్రతిభను ప్రదర్శించి ప్రశంసలందుకున్నారు. అనేకచోట్ల తిరిగి ఆరువేల ప్రదర్శనలిచ్చారు.

3. లూయీ బ్రెయిలీ (4.1,1809 61,1852) :
ఈయన పారిస్ దగ్గరలోని “క్రూవే” గ్రామంలో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు మోనిక్ బ్రెయిలీ, సైమన్ రెన్ బ్రెయిలీ. బాల్యంలో ప్రమాదవశాత్తూ రెండు కళ్ళను కోల్పోయి తన 4వ ఏట పూర్తిగా గుడ్డివాడయ్యాడు. 1784లో పారిసెల్ వాలైంటైన్ హ్యూ ప్రారంభించిన అంధుల పాఠశాలకు బ్రెయిల్ చదువుకోవడానికి వెళ్ళాడు. బ్రెయిల్ అసాధారణ ప్రతిభాసామర్థ్యాలు గల వ్యక్తిగా రాణించి, అప్పటికి అమలులో ఉన్న “లైన్లైపు” పద్ధతిలో చదువుకుని 17 సం॥రాల వయస్సులోనే అదే స్కూలులో ప్రొఫెసరుగా నియమించబడ్డాడు.

20 సం||రాల యువకుడైన బ్రెయిల్ తన నూతన పద్ధతి సిద్ధాంతీకరించాడు. మరి 5 సంవత్సరాల పరిశోధనలో బ్రెయిల్ తన పద్ధతిలో సంపూర్ణత సాధించాడు. అరుచుక్కలను వివిధ రకాలుగా ఉపయోగించడం వల్ల బ్రెయిలీ మొత్తం అక్షరాలను రూపొందించాడు. ఇది విప్లవాత్మకమైన మార్పు. అరుపాయింట్లు వివిధ రకాలుగా వాడి మొత్తం ఇంగ్లీషు అక్షరాలన్నీ పలికేటట్లు చేశాడు. ఒక చుక్క నుండి ఆరు చుక్కలలోనే మొత్తం అక్షరాలన్నీ తయారు చేశాడు. ఈ విధంగా మొత్తం భాషకు 250 గుర్తులు ఈ ఆరుచుక్కలలో బ్రెయిల్ రూపొందించాడు. ఈ రకంగా గ్రుడ్డివారు బ్రెయిల్లో వ్రాయగలరు, చదవగలరు. వారికి ఇతరుల సహాయం అక్కరలేదు. 1916లో అమెరికా దీనిని ఆమోదించింది.

4. హెలెన్ కెల్లర్ :
హెలెన్ కెల్లర్ జూన్ 27, 1880లో అమెరికాలో జన్మించింది. ఈమె 19 నెలల వయస్సులో అనారోగ్యంతో తన దృష్టిని మరియు వినికిడిని కోల్పోయింది. ఆమె స్పెషల్ ప్రధాన స్రవంతి పాఠశాలలో విద్యను అభ్యసించింది. ఆమె రాడ్ క్లిఫ్ కాలేజీ ఆఫ్ హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని సంపాదించిన మొదటి చెవిటి వ్యక్తి.

హెలెన్ కెల్లర్ అంధులకు, బధిరులకు, మూగవారికి వారధిగా, వికలాంగుల ఉద్యమ సారథిగా ప్రపంచస్థాయిలో పేరొంది ఎందరికో స్ఫూర్తి నిచ్చారు.

ఈమె జూన్ 1, 1968లో మరణించింది. అప్పటికి ఆమె వయస్సు 87 సంవత్సరాలు. చిన్నతనంలోనే పెద్ద జబ్బు చేసి, చూపు, వినికిడి, మాట పోగొట్టుకొని పూర్తి వికలాంగురాలైన ఈమె ఎందరికో ఆదర్శవంతంగా నిలిచి స్ఫూర్తినిచ్చింది.

5. సుధాచంద్రన్ :
సుధాచంద్రన్ ఒక భారతీయ భరతనాట్య నృత్యకారిణి. నటి. తాను 1981 జూన్ నెలలో తమిళనాడులోని “త్రిచీ” వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కాలును కోల్పోయినప్పటికీ కృత్రిమ కాలుతో నాట్య ప్రదర్శనలు ఇచ్చి అందరినీ విస్మయపరిచిన నృత్యకారిణి.’ ఈవిడ తెలుగులో మయూరి సినిమాతో తన నట ప్రస్థానాన్ని ప్రారంభించి అనేక సినిమా టెలివిజన్ ధారావాహికలలో నటించారు.

పాఠ్యాంత పద్యం

మ. పలుకంజాలుదు రర్షయుక్తముగ గీర్వాణంబు ముత్యాలదం
దలరీతిన్ లిఖియింపఁగాఁ గలరు గ్రంథ శ్రేణి నుద్యోగమున్
నలువంగాఁగల రెట్టి లోపముల నైనం గానరానిక యీ
వెలఁతల్నేర్వగరాని విద్యగలదే ? నేర్పొపుఁజొప్పించినన్
– గౌరావఝల రామకృష్ణ సీతారామ సోదర కవులు (సుమహారం ఖండకావ్యం)

భావం : స్త్రీలలో సహజ ప్రతిభ ఉంటుంది. సంస్కృత భాషను ఉచ్చారణ దోషం లేకుండా అర్థవంతంగా మాట్లాడగలరు. ముత్యాల వంటి స్వచ్ఛమైన భావాలతో గ్రంథాలు రాయగలరు. ఏమరుపాటు లేకుండా అన్ని పనులూ చేయగలరు. చక్కగా నేర్పితే స్త్రీలు నేర్చుకోలేని విద్య ఏదీ ఉండదు.
సూక్తి : వట్టి మాటలు చెప్పడం కంటే చేయూత నిచ్చే చేతులు మిన్న – అబ్దుల్ కలాం.

అదనపు భాషాంశాలు.

పర్యాయపదాలు

సఫలం : విజయవంతం, సార్థకం
అశ : అస, దిక్కు
మధురం : తియ్యన, తీపి
ఆలస్యం : జాగు, విలంబం
గర్భవతి : చూలాలు, నిండుమనిషి, సూలు
అరుదు : అపురూపం, అరిది
వికృతం : అసహ్యం, వికారమైనది
నిర్ణయ : జాలి లేని, క్రూరత్వం
భాంగం : కుండ, కడవ
స్పర్శ : తాకడం, తగలడం
మేరా : హద్దు, ఎల్ల
షికారు : నడక, సంచారము
ఒంటరి : ఏకాకి, ఒంటిగాడు
మొండితనం : మూర్ఖత్వం, పెంకితనం
లక్ష్మ : గురి, పూనిక
తిరస్కారం : నిరాకారం, తృణీకారం, అనాదరము
ధారబోసి : ఇచ్చు, విడుచు
ఆవహించు : సోకు, రప్పించు
ప్రసక్తి : ప్రస్తావన, ప్రసంగం
గారడి : ఇంద్రజాలం, కనికట్టు
శిక్షణ : అధ్యాపనం, అభ్యాసం
సందేశం : సమాచారం, వార్త
అనురాగం : అనురక్తి, కూరిమి
ఆహ్వానం : పిలుపు, హూతి
పెంపకం : పోషణం, పెంచుట
ఊపిరి : శ్వాస, ఊర్పు
గుంపు : సమూహం, బృందం
అలికిడి : చప్పుడు, ధ్వని
హడావుడి : తొందర, వేగిరపాటు
అల్లరి : గొడవ, గలాట
అభ్యర్థన : విన్నపం, విజ్ఞప్తి
కోలాహలం : సందడి, పెద్దరొద
చప్పట్లు : కరతాళము, చర్చరి, కేకసలు
గేలి : ఎగతాళి, పరిహాసం
సాదరం : ఆదరం, మర్యాద
శ్రద్ధ : ఆసక్తి, సడ్డ
అతిథి : అపరిచితుడు, పరదేశి
మౌనం : నిశ్శబ్దం, ఆభాషణం, అవాక్కు
ద్వేషం : శత్రుత్వం, వైరం
సర్వస్వం : సమస్తం, మొత్తం
ఆప్యాయత : ప్రేమ, ఆదరం
లజ్ఞ : సిగ్గు, త్రప, వ్రీడ, బిడియం
నిరాశ : ఆసలేమి, నిస్పృహ, నిస్సహాయత, నైరాశ్యం
పిడుగు : అశని, నిర్వాతం, దంభోళి
చంక : కక్ష్య, బాహుమూలం, చంకిలి

AP 10th Class Telugu 8th Lesson Questions and Answers జీవని

నానార్థాలు

మధురం : తియ్యన, ఇంపైన
అరుదు : అపురూపం, ఆశ్చర్యం
లక్ష్యం : గురి, లెక్క
ధారబోయు : దానమిచ్చు, విడుచు
గారడి : ఇంద్రజాలం, మోసం
ఆవహించు : కలిగించు, ప్రవేశపెట్టు
సందేశం : సమాచారం, ఆజ్ఞ
దీక్ష : పట్టుదల, మంత్రోపదేశం
వృద్ధుడు : ముసలివాడు, తెలిసినవాడు, పెద్ద
అనుభూతి : భావన, అనుభవం
సత్వం : బలం, స్వభావం
ఊపిరి : శ్వాస, గాలి, ప్రాణం
తృప్తి : తనివి, తర్పణం
అల్లరి : సందడి, గొడవ
మాధుర్యం : తీపు, కావ్యగుణం
ఫిర్యాదు : నేరం మోపడం, విన్నపం
మస్తిష్కం : తల, మెదడు, భూమి
ఓపిక : శక్తి, సహనం
శ్రద్ధ : ఆసక్తి, అక్కర
అతిథి : అపరిచితుడు, విందు
పరిచయం : ఎరుక, స్నేహం
తరుణం : సమయం, కుబ్జపుష్పం, ఆముదం చెట్టు
ఆశ : ఆస, వ్యాప్తి, దిక్కు, అగ్ని
ఆలస్యం : జాగు, అజాగ్రత్త, సోమరితనం, మాంద్యం
అవయవం : అంగం, సాధనం, ఒక తర్క గ్రంథం
కుంభం : కడవ, పాత్ర, నగ
కాలం : సమయం, నలుపు, మృత్యువు
స్పర్శ : ముట్టుకొను, అనుభూతి
మేరా : గౌరవం, హద్దు
షికారు : సంచారం, వేట
ఆశ్రమం : నివాసం, మఠం

ప్రకృతి – వికృతి

లజ్జ – లజ్జా
ఆశ – ఆస
పిటక – పిడుగు
స్త్రీ – ఇంతి
మృదు – మెతువు
గారుడ – గారడి
అద్భుతం – అబ్బురం
వృద్ధ – పెద్ద
దీపం – దివ్వె
ప్రయాణం – పయనం
పక్షి – పక్కి
ఆకాశం – ఆకసం
కేళి – గేలి
అపూర్వ – అపురూపం, అబ్బురం
శ్రద్ధ – సడ్డ
స్నిగ్థ – నిద్దా
మిరా – మేర
కక్ష్య – చంక

వ్యుత్పత్యర్థములు

తరుణం – యౌవనం కలది – యువతి
మృదు – కోమలమైనది – సుకుమారం
తృప్తి – కోరిక లేకపోవడం – తనివి
అతిథి – తిథి వార నక్షత్రాలు చూడకుండా వచ్చేవాడు – పరదేశి
ఆకాశం – దీని యందంతట సూర్యచంద్రులు ప్రకాశిస్తారు – గగనం
అమృతం – మరణాన్ని కలిగింపనిది – సుధ
విశ్వనాథుడు – విశ్వానికి నాథుడు – శివుడు
గురువు – అజ్ఞానాంధకారం తొలిగించేవాడు – ఉపాధ్యాయుడు

జాతీయాలు అర్థాలు

గుసగుసలు – రహస్యంగా మాటలాడుకొనుట
మారుమ్రోగుట – గొప్పగా చెప్పుకొనుట
మనసులో ముల్లు – తొలగించలేని బాధ
చేజారిపోవు – దొరకకుండా పోవు
పిడుగుపాటు – ఊహించని దెబ్బ
పాలు పంచుకోవడం – తోడుగా నిలబడడం
కొయ్యబారిపోవు – శరీరం కట్టె వలె బిగుసుకు పోవడం

సంధులు

ఇంకొక – ఇంక + ఒక – అత్వ సంధి
అదంతా – అది + అంతా – ఇత్వ సంధి
అలికిదైనా – అలికిడి + ఐనా – ఇత్వ సంధి
ఇదంతా – ఇది + అంతా – ఇత్వ సంధి
పైకెత్తి – పైకి + ఎత్తి – ఇత్వ సంధి
ఏదైనా – ఏది + ఐనా – ఇత్వ సంధి
కుటుంబమంతా – కుటుంబము + అంతా – ఉత్వ సంధి
పేరేంటి – పేరు + ఏంటి – ఉత్వ సంధి
నాకెంతో – నాకు + ఎంతో – ఉత్వ సంధి
లేశమైనా – లేశము + ఆడే – ఉత్వ సంధి
ఆటలాడే – ఆటలు + ఐనా – ఉత్వ సంధి
ఎండుటాకులు – ఎండు + ఆకులు – టుగాగమ సంధి
దీనురాలు – దీన + ఆలు – రుగాగమ సంధి
ధారబోసి – ధార + పోసి – సరళాదేశ సంధి
ఒక్కొక్క – ఒక్క + ఒక్క – ఆమ్రేడిత సంధి
అవయవాలు – అవయవము + లు – లు,ల,న,ల సంధి
విన్యాసాలు – విన్యాసము + లు – లు,ల,న,ల సంధి
మహాద్భుతం – మహా + అద్భుతం – సవర్ణదీర్ఘ సంధి
సాదరం – స + ఆదరం – సవర్ణదీర్ఘ సంధి
ప్రత్యేకత – ప్రతి + ఏకత – యణాదేశ సంధి
ప్రత్యక్షం – ప్రతి + అక్షం – యణాదేశ సంధి
నిరాశ – నిః(ర్) + ఆ – విసర్గ సంధి
నిర్దయ – నిః(ర్) + దయ – విసర్గ సంధి
నిరుత్సాహం – నిః(ర్) + ఉత్సాహం – విసర్గ సంధి

AP 10th Class Telugu 8th Lesson Questions and Answers జీవని

సమాసములు

శాస్త్రవేత్త – శాస్త్రమును తెలిసినవాడు – ద్వితీయా తత్పురుష సమాసం
అమృతభాండం – అమృతంతో కూడిన భాండం – తృతీయా తత్పురుష సమాసం
సాహసకృత్యాలు – సాహసంతో కూడిన కృత్యాలు – తృతీయా తత్పురుష సమాసం
పిల్లల ప్రపంచం – పిల్లల యొక్క ప్రపంచం – షష్ఠీ తత్పురుష సమాసం
ప్రసవయాతన – ప్రసవం యొక్క యాతన – షష్ఠీ తత్పురుష సమాసం
సూర్యనేత్రం – సూర్యుని యొక్క నేత్రం – షష్ఠీ తత్పురుష సమాసం
కనురెప్పల తలుపులు – కనురెప్పలు అనెడి తలుపులు – రూపక సమాసం
జ్ఞానదీపం – జ్ఞానము అనెడి దీపం – రూపక సమాసం
మృదుమధురం – మృదువైనది, మధురమైనది – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
మహాద్భుతం – గొప్పదైన అద్భుతం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
తియ్యని కలలు – తియ్యనైన కలలు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
కొత్త ఆలోచనలు – కొత్తవైన ఆలోచనలు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
చిన్నపాప – చిన్నదైన పాప – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
మహాపోరాటం – గొప్పదైన పోరాటం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
వెకిలి నవ్వు – వెకిలి నవ్వు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
స్నిగ్ధహాసం – స్నిగ్ధమైన హాసం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
స్వర్గలోకం – స్వర్గం అను పేరు గల లోకం – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
ఆశనిరాశలు – ఆశ నిరాశ – ద్వంద్వ సమాసం
రూపు రేఖలు – రూపు, రేఖ – ద్వంద్వ సమాసం
నిర్లజ్జ – లజ్ఞ లేనిది – అవ్యయీభావ సమాసం
నిర్దయ – దయలేనిది – అవ్యయీభావ సమాసం
నిరుత్సాహం – ఉత్సాహం లేనిది – అవ్యయీభావ సమాసం
అమాయకత్వం – మాయకత్వం కానిది – నఞ్ తత్పురుష సమాసం
అనూహ్యం – ఊహించనిది – నఞ్ తత్పురుష సమాసం
పదినిముషాలు – పది సంఖ్య గల నిముషాలు – ద్విగు సమాసం
మూడు నెలలు – మూడు సంఖ్య గల నెలలు – ద్విగు సమాసం
తొమ్మిది నెలలు – తొమ్మిది సంఖ్య గల గంటలు – ద్విగు సమాసం

రచయిత పరిచయం

రచయిత పేరు : డా. వి. చంద్రశేఖరరావు

తల్లిదండ్రులు : మహాలక్ష్మి, దేవసహాయం దంపతులు.

జననం : 13.04.1950న ప్రకాశం జిల్లాలో జన్మించారు.

రచనలు : జీవని, మాయాలాంతరు, ద్రోహవృక్షం, లెనిన్స్ మొదలైన కథా సంపుటాలు, నల్లమిరియం చెట్టు, ఐదుహంసలు, ఆకుపచ్చని దేశం నవలలు రాశారు.

బహుమతులు : జీవని కథ 1991లో ఆకాశవాణిలో నాటకంగా ప్రసారమైంది. అది జాతీయ స్థాయిలో ఉత్తమ
నాటకంగా బహుమతి పొందింది.

ప్రత్యేకత : చంద్రశేఖర్ గారు కథా శిల్పంలో నూతన ఒరవడి సృష్టించారు. వీరి జీవని’ కథల సంపుటి నుండి ప్రస్తుత పాఠం గ్రహించబడింది. వీరు 8.7.2017న స్వర్గస్తులయ్యారు.

పదాలు – అర్థాలు

పేజీ – 87

స్వప్నం = కల
నిర్లజ్జ = సిగ్గు లేకుండి
దాడి = దండయాత్ర
అధికారం = హక్కు
తరుణం = సమయం
సఫలం = ఫలవంతం
దీనం = దరిద్రం
కంపించడం = వణకడం
మృదువు = మెత్తన
మధురం = ప్రియం
పాలు = భాగం
పిడుగుపాటు = పిడుగుపడినట్లు
వికృతం = అందంలేని
అవయవాలు = అంగాలు
లోపం = లోటు
నిర్దయ = కఠినత్వం
భాండం = కడవ
లేబర్ రూమ్ = పురుళ్లగది
సమయం = కాలం
చెంప = బుగ్గ
ప్రసవయాతన = పురిటిబాధ
స్పర్శ = తాకిడి
మేర = భాగం (ప్రాంతం)
రాగలీనం = రాగంతో కలియడం
ఆడబిడ్డ = ఆడపడుచు
అనుమతి = అనుజ్ఞ
మొండితనం = మారం
పట్టుదల = పంతం
లక్ష్యం = గమ్యం

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
లలిత ఎలాంటి నిర్ణయం తీసుకుంది?
జవాబు:
పుట్టబోయే బిడ్డ మెదడు పెరగకపోవచ్చు. వికృతమైన రూపం ఉండవచ్చు. అవయవాల లోపం కూడా ఉండవచ్చు అని డాక్టర్లు చెప్పారు. అసలు బిడ్డలు లేక పోవడం కంటే ఏదో ఒక బిడ్డను కనాలనే లలిత నిర్ణయించుకొంది.

ప్రశ్న 2.
లలితకు తాను ఒంటరిని అని ఎందుకు అనిపించింది?
జవాబు:
లలితకు అమ్మాయి పుట్టింది. కాని, ఆమె భర్త, ఆడపడుచు, అత్తగారు ఎవ్వరూ ఆ తల్లీ బిడ్డలను పట్టించుకోలేదు. ఆ సమయంలోనే తను ఒంటరిననే భావం లలితకు కల్గింది.

AP 10th Class Telugu 8th Lesson Questions and Answers జీవని

పేజీ – 88,89:

ఆశ్రమం = ఆశ్రయం ఇచ్చే స్థలం
తిరస్కారం = అనాదరము
ద్వేషం = పగ
సర్వస్వం = అన్నీ
ధారపోయడం = దానం చేయడం
ప్రసక్తి = ప్రస్తావన
మాంత్రికురాలు = మంత్రగత్తె
విన్యాసం = ప్రదర్శన
కృత్యం = పని
శిక్షణ = తర్ఫీదు
పైసలు = డబ్బులు
స్టేజి = బస్సు ఆగేచోటు
సన్నిహితం = స్నేహం
కొదవ = తక్కువ
సత్త్వం = బలం
వెదురుబొంగు = వెదురు కర్ర
లేశం = కొంచం
అంధకారం = చీకటి
అలికిడి = అలజడి

ఆలోచించండి- చెప్పండి

ప్రశ్న 1.
గారడీ ఆట ద్వారా లలిత ఎటువంటి స్పూర్తి పొందింది?
జవాబు:
ఎవరైనా ఏదైనా సాధించాలంటే శిక్షణ, తపస్సు లాంటి పట్టుదల అన్నింటికంటె ముఖ్యంగా అవసరమని లలిత గ్రహించింది. కష్టపడి నేర్పితే తన పాప కూడా తన జీవితానికి అవసరమైనవి నేర్చుకొంటుందని అదే దీక్ష, పట్టుదల తనలో ఉండాలనే స్ఫూర్తిని గారడీ ఆట చూసి
లలిత పొందింది.

ప్రశ్న 2.
విశ్వనాథం ఎవరు? జీవని ఎదుగుదలకు ఆయనెలా తోడ్పడ్డాడు?
జవాబు:
విశ్వనాథం బస్సులో లలితను ఆప్యాయంగా పలక రించిన వృద్ధుడు. జీవని ఎదుగుదలకు అవసరమయ్యే సహాయ, సహకారాలు అందించాడు.

పేజీ – 89 – 91

కొయ్యబారిపోవడం = బిగుసుకుపోవడం
అపురూపం = అపూర్వం
కోలాహలం = హడావిడ
గేలి = వేళాకోళం
సాదరం = ఆదరంతో
బాహువులు = చేతులు
వర్ణము = అక్షరము
పెనుగులాడు = గింజుకొను
మస్తిష్కం = మెదడు
తటస్థపడు = ఎదురగు
ఆత్మస్థైర్యం = మానసిక స్థిరత్వం
అర్థించడం = ప్రాధేయపడడం
నిరుత్సాహ = ఉత్సాహం లేకపోవడం
ఉద్వేగం = ఆవేశం
భూషణం = అలంకారం
ఓదార్పు = బుజ్జగింపు
అనూహ్యం = ఊహాతీతం
స్నిగ్ధహాసం = మందహాసం
పరిమితి = హద్దు, అవధి
నేత్రం = కన్ను
ఆహ్లాదం = ఆనందం
ప్రత్యక్షం = కనబడడం
శ్రీవారు = భర్త

ఆలోచించండి- చెప్పండి

ప్రశ్న 1.
లలిత ఉపాధ్యాయులతో చెప్పిన మాటలను బట్టి మీరేం గ్రహించారు?
జవాబు:
సమాజం సంపాదించిన విజ్ఞానం, నాగరికత అందరికీ పంచాలి. ఆధునిక జీవితంలోని మాధుర్యం అందు కోవాలి. మానసికంగా వెనుకబడ్డ పిల్లల్ని కూడా ఓపికతో, అనురాగంతో, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి ముందుకు నడిపించాలి. వారి అభివృద్ధికి తోడ్పడాలని
గ్రహించాం.

AP 10th Class Telugu 8th Lesson Questions and Answers జీవని

ప్రశ్న 2.
జీవనిలో వచ్చిన మానసిక మార్పులు ఏవి?
జవాబు:
కళ్లలో అమాయకత్వం పోయింది. ఆలోచన స్థిరపడు తోంది. వెకిలి నవ్వుకు బదులు స్నిగ్ధహాసం వచ్చింది. పరిమితమైన మాటల్ని స్వేచ్ఛగా మాట్లాడేస్థాయికి ఎదిగింది. చదువుతోబాటు తనకిష్టమైన బొమ్మల్ని గీయడంలో అభివృద్ధి సాధించింది. పైవన్నీ జీవనిలో వచ్చిన మానసిక మార్పులు.

Leave a Comment