AP 10th Class Telugu 8th Lesson Important Questions జీవని

These AP 10th Class Telugu Important Questions 8th Lesson జీవని will help students prepare well for the exams.

జీవని AP Board 10th Class Telugu 8th Lesson Important Questions and Answers

అవగాహన – ప్రతిస్పందన

1. ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

“ఏ క్లినిక్లో ఏ గైనకాలజిస్ట్ చేతిలో నుంచి దయగా, కరుణగా జారిన ఏ మందు ప్రభావమో ఇది” అనుకుంటూ, భయం, భయంగా వెళ్ళాను డాక్టర్ సరళ దగ్గరికి. ఆమె నన్ను పరీక్ష చేస్తున్నప్పుడు “ఈ ఒక్క కలను సఫలం చెయ్యి తండ్రీ! ఈ దీనురాలి ఈ చిన్నికోర్కెను తీర్చుదేవా!” అంటూ దేవుణ్ని దీనంగా వేడుకున్నాను. ఆశ, నిరాశల మధ్య ఎండుటాకులా కంపించి పోయానా పదినిమిషాలు, ‘కంగ్రాట్స్ లలితా’ అన్న మాటలు మృదుమధురంగా వినిపించాయి. ఆవిడ చేతుల్ని పట్టుకొని, ‘థాంక్యూ డాక్టర్! థాంక్యూ’ అంటూ ఆనందంతో పెద్దగా ఏడ్చిన సంగతి, ‘డోంట్ బి ఎమోషనల్’ అంటూనే ఆవిడ నా ఆనందంలో పాలుపంచుకోవడం.

ఇదంతా జరిగి ఇంకా మూడునెలలు కూడా కాలేదు. ఇంతలోనే పిడుగుపాటు లాంటి నిర్ణయం. ‘సారీ ! మిసెస్ లలితా!” మీకు ఈ విషయం ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఆలస్యంగా గర్భవతులయ్యే స్త్రీలలో చాలా అరుదుగా జరుగుతుందిలా. పుట్టబోయే పిల్లలు మెదడు పెరగకుండా వుంటారు. వికృతమైన రూపురేఖలు, ఒక్కోసారి ముఖ్య అవయవాలు లోపంతో పుట్టడం జరుగుతుందన్నారు డాక్టర్లు. ఎంత నిర్ణయ ? అమృతభాండాన్ని చేతిలో పెట్టినట్లే పెట్టి అంతలోనే వెనక్కు లాక్కోవడం అంటే ఇదేనేమో! బిడ్డలు లేకపోవడం కంటే ఎవరో ఒకరు అనే నిర్ణయానికి వచ్చాను.

ప్రశ్నలు – జవాబులు

అ) డాక్టరు గారి పేరేమిటి?
జవాబు:
డాక్టరు గారి పేరు సరళ.

ఆ) పుట్టబోయే పిల్లలు లోపాలతో ఎవరికి పుడతారు?
జవాబు:
ఆలస్యంగా గర్భవతులయ్యేవారికి పుట్టబోయే పిల్లలు లోపాలతో పుట్టే అవకాశాలున్నాయి.

ఇ) లలిత ఏ నిర్ణయానికి వచ్చింది?
జవాబు:
లలిత బిడ్డను కనాలనే నిర్ణయానికి వచ్చింది.

ఈ) పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
లలిత ఎవరి దగ్గర ఏడ్చింది?

AP 10th Class Telugu 8th Lesson Important Questions జీవని

2. ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

కాలం గడిచింది. నెలలు నిండాయి. లేబర్ రూము నుంచి స్ట్రెచర్ సాయంతో వార్డుకు తరలిస్తున్నారు నన్ను. ఉదయం తొమ్మిది గంటల సమయమది. వెచ్చని సూర్యకిరణం జాలిగా చెంపల్ని నిమురుతోంది. ప్రసవయాతన ముగిసి వార్డులో చేర్చిన పది నిమిషాలకు బిడ్డను తెచ్చి పక్కనే పడుకోబెట్టారు. నా ప్రక్కన మరొక ప్రాణి. ఈ ప్రపంచంలోకి వచ్చి ఇంకా పదినిమిషాలు కూడా కాలేదు. బిడ్డ స్పర్శ వెచ్చగా శరీరానికి తగులుతూ వుంటే తగిలినంతమేరా శరీరం వీణలా మారి, రాగలీనమవుతుంది. పుట్టిన బిడ్డ గురించి డాక్టర్ నా చెవి దగ్గర గుసగుసలాడింది.

స్వర్గలోకం నుండి నా ద్వారా భూమి మీదికి షికారుకు వచ్చిన దేవదూత ఆడ అయితేనేం, మగ అయితేనేం? బిడ్డను దగ్గరకు జరుపుకొని తల పైకెత్తి దాని ముఖంలోకి చూశాను నిద్ర నటిస్తుంది. కనురెప్పల తలుపుల చాటున ఏ తీయని కలలు దాగున్నాయో? రెండు గంటల తరువాత కొద్దిగా పాలు త్రాగించగలిగాను. ఆ పాప మొదటి ఆకలి తీర్చాను. అత్త, ఆడబిడ్డ, భర్త ఇలా కుటుంబమంతా వున్నా, ఎవరూ మమ్మల్ని పట్టించుకోలేదు. “అందరూ ఉన్నా నేను ఒంటరినే!” అని అనిపించింది ఆ సమయాన. ఆ సాయంత్రమే డిశ్చార్జి చెయ్యమని డాక్టర్ని అడిగాను. ఇంటికి వెళ్ళడానికి అన్నమతిచ్చారు. హాస్పటల్ నుండి బయటకు నేను వేసే ఒక్కొక్క అడుగు నాలో మొండితనాన్ని, పట్టుదలను పెంచాయి. లక్ష్యం కొరకు జీవించే సైనికురాలిలా ఇంటికి చేరాను నేను.

ప్రశ్నలు – జవాబులు

అ) పుట్టిన బిడ్డ గురించి డాక్టర్ ఏం చెప్పి ఉంటుంది?
జవాబు:
పుట్టిన బిడ్డ స్థితి గురించి డాక్టర్ చెప్పి ఉంటుంది.

ఆ) అలితను కుటుంబ సభ్యులెందుకు పట్టించుకోలేదు?
జవాబు:
లలితకు పుట్టిన బిడ్డ అంటే ఎవరికీ ఇష్టం లేదు కనుక ఆమెను కుటుంబ సభ్యులు పట్టించుకోలేదు.

ఇ) ఆమె ధైర్యంగా ఉందని చెప్పే వాక్యం వ్రాయండి.
జవాబు:
లక్ష్యం కొరకు జీవించే సైనికురాలిలా ఇంటికి చేరింది.

ఈ) పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
ఆమెను ఎవరూ పట్టించుకోకపోతే ఏమనుకొంది?

3. ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

రోజులు పరుగు పెడుతున్నాయి. ఒకరోజు నా భర్త, నా దగ్గరకు వచ్చి, “చూడు! ఈ పిల్లను మనం పెంచలేం! ఇలాంటి పిల్లల్ని పెంచడానికి బెంగుళూరులో ఆశ్రమం వుందట. పాపను అక్కడ చేర్చి, నెలకు ఇంతని పంపిద్దాం” అని ఇంకా ఏదో చెప్పబోయి నా కళ్లలోని ఎరుపు చూసి ఆగిపోయాడు. ఆయన నా కళ్లలో అంత తిరస్కారం, ద్వేషం, కోపం ఎప్పుడూ చూసి వుండడు. “ఇంకోసారి నా దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడవద్దు, ఈ పాప నా ప్రాణం! నా సర్వస్వం! ఇది నా దగ్గరే నాతోనే వుంటుంది. నా సర్వశక్తుల్ని ధారబోసి, దీన్ని పెంచుకుంటాను. అంటూ నాలో ఏదో శక్తి ఆవహించిన దానిలా మాట్లాడాను”. ఆ తరువాత ఆయన ఆ ప్రసక్తే తేలేదు. కానీ పాప దగ్గరకు రావడమే మానేశాడు.

ప్రశ్నలు – జవాబులు

అ) ఆశ్రమం ఎక్కడ ఉంది?
జవాబు:
ఆశ్రమం బెంగుళూరులో ఉంది.

ఆ) భర్త ఏదో చెప్పబోయి ఎందుకు ఆగాడు?
జవాబు:
ఆమె కళ్లలోని ఎరుపు చూసి భయపడి ఆగిపోయాడు.

ఇ) ఆమెకు ఎవరంటే ప్రాణం?
జవాబు:
ఆమెకు పాపంటే ప్రాణం.

ఈ) పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
ఎవరు శక్తి ఆవహించినట్లున్నారు?

4. ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

రెండు నెలలు తరువాత ఒక ఉదయం మా వీధిలో గారడి ఆట జరిగింది. ఆ ఆటను తల్లి, తండ్రి, కూతురు ముగ్గురు కలిసి చేస్తున్నారు. తండ్రి డప్పు వాయిస్తూ “జయమ్ము నిశ్చయమ్మురా ! భయమ్ము లేదురా !” అంటూ పాడుతున్నాడు. తల్లి హార్మోనియం వాయిస్తుంది. అద్భుతాలన్నీ కూతురే చేస్తూంది. ఆ పాపకు ఐదేళ్ళయినా వుంటాయో లేవో? పొడవైన గౌను వేసుకొని ఉంది. ఆ గౌను దాని పాదాల్ని దాటి నేలపై జీరాడుతుంది. ఆ పాపాయి నా కంటికి ఓ మాంత్రికురాల్లా అనిపించింది. ఆ ఆటలో ఆ పాపాయి చేస్తున్న విన్యాసాలు నాలో ఆశ్చర్యాన్ని కలిగించాయి. మరికొన్ని సాహస కృత్యాలు చూసి నాలో ఏదో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. ఇంత చిన్నపాప ఇన్ని అద్భుతాలు ఎలా చేయగలిగింది?

ఎవరైనా ఏదైనా సాధించాలంటే శిక్షణ, తపస్సులాంటి పట్టుదల అన్నిటికంటే ముఖ్యంగా అవసరం. నాకు ఈ సందేశం ఇవ్వడానికే ఆ ఉదయం రోడ్డుపై అవతరించిన దేవతలా తోచిందా పాప. కష్టపడి నేర్పితే నా పాపకూడా తన జీవితానికి అవసరమైన పనులు నేర్చుకుంటుంది. అలాంటి పనులను అదే దీక్ష, పట్టుదలతో నేను నేర్పలేనా? అని నా మనస్సుకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. ఆట ముగిసింది. ఆ పాప ఇంటింటికి వెళ్ళి పైసలు తీసుకుంటూ నా దగ్గరకు వచ్చి నిలబడింది. అప్పుడు ఆ పాపాయి చేతిలో పది రూపాయల నోటు పెట్టి, నీ పేరేంటి?’ అన్నాను. ‘జీవమ్మంది’. చిరునవ్వుతో ‘థాంక్యూ జీవనీ సీనియర్’ అన్నాను. అర్ధం కాని కళ్ళతో చూస్తూ వెళ్లిపోయిందా పాప. ఆ పేరు నాకూ ఇష్టమే అన్నట్లుగా లోపల జీవని జూనియర్ “కేర్ కేర్” మని ఏడుస్తుంది.

ప్రశ్నలు – జవాబులు

ఆ) ఆమెలో కొత్త ఆలోచనలు రేకెత్తించినదెవరు?
జవాబు:
గారడీ చేసే బాలిక ఆమెలో కొత్త ఆలోచనలు రేకెత్తించింది.

ఆ) ఏదైనా సాధించాలంటే అవసరమైననేవి?
జవాబు:
ఏదైనా సాధించాలంటే శిక్షణ, పట్టుదల అవసరం.

ఇ) గారడీ అమ్మాయి పేరేమిటి?
జవాబు:
గారడీ అమ్మాయి పేరు జీవమ్మ.

ఈ) పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
జీవమ్మను జీవనీ సీనియర్ అని ఎందుకంది?

AP 10th Class Telugu 8th Lesson Important Questions జీవని

5. ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

ఒక రోజు నేను పిల్లలకు వేసే టీకాల కోసం ఆసుపత్రికి వెళ్ళి వస్తున్నాను. చంకలో జీవని, భుజంపై వేలాడే హ్యాండ్ బ్యాగ్. సిటీ బస్సు నిందుగా ఉంది. ఆ జనం అరుపుల మధ్య “పాపను నాకివ్వమ్మా!” అంటూ జీవనిని అందుకున్నాడు. ఒక వృద్ధుడు. వెరిసిన జుట్టూ, కాంతివంతమైన కళ్ళూ, గొంతులో పొంగి పొర్లుతున్న అనురాగంతో జ్ఞానదీపంటా ఉన్నాడాయన. స్టేజి దగ్గర ఆయన నాతోపాటు దిగాడు. ‘థాంక్స్’ అంటూ పాపను అందుకోబోతుండగా ఇంటిదాకా ఆహ్వానించవా అన్నాడు నవ్వుతూ, ‘రండి’ అంటూ ఇంటివైపుకి దారితీశాను. సుమారు రెండు గంటలు ఆ వృద్ధుడు జీవనితో ఆప్యాయంగా గడుపుతూ, నాతో ఇలా అన్నాడు. ఈ క్షణం నువ్వు నాకెంతో సన్నిహితమైన దానివనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు అనుభవిస్తున్న ఈ స్థితిని నేను, నా భార్య అనుభవించాము.

జీవని లాంటి పిల్లలకు ఈ ప్రపంచంలో కొదవ లేదు. మీలాంటి తల్లులే అరుదు. మేము కూడా ఇరవై సంవత్సరాల క్రితమే జీవని లాంటి పాపకు జన్మనిచ్చామని, ఆ పాప పేరు ‘ప్రమోదిని’ అని, ఆమెను ఒక సైనికురాలిగా పెంచామని, పదవ తరగతి వరకు చదివించామని చెప్పారు. ఎందుకంటే ? ఇలాంటి పిల్లలకు చేయూతనిస్తే వారు కూడా మామూలు మనిషిలా బతకగలరని నిరూపించాలన్నదే మా ఆరాటం. మేము కన్న కలలు నిజమయ్యాయి అని చెప్తూ, జీవితం అంటే కాస్త వెలుగూ, కాస్త చీకటి, అన్నట్టు నా పేరు విశ్వనాథన్ తెలుగు వాణ్ణి. జీవని ఆత్మీయుల లిస్టులో నన్ను కూడా చేర్చుకో. జీవని ఎదుగుదలకు అవసరమయ్యే సహాయ, సహకారాలు మా నుంచి ఎప్పుడూ ఉంటాయి అని చెప్పాడు.

ప్రశ్నలు – జవాబులు

అ) ఈ ప్రపంచంలో ఎవరికి కొదవలేదు?
జవాబు:
ఈ ప్రపంచంలో జీవని లాంటి పిల్లలకు కొదవలేదు.

ఆ) వృద్దుని పేరేమిటి?
జవాబు:
వృద్ధుని పేరు విశ్వనాథం.

ఇ) ప్రమోదిని ఎవరు?
జవాబు:
విశ్వనాథం గారి అమ్మాయి ప్రమోదిని.

ఈ) పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
ఎవరు ఎవరిని ఇంటికి రమ్మన్నారు?

6. ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

కొద్దిగా అడుగులు వేయడం వచ్చిన తరువాత జీవని కళ్ళలో అపూర్వమైన తేజస్సు కనిపిస్తుంది. ప్రపంచాన్ని పాదాల దగ్గరకు తెచ్చుకున్నాననే తృప్తి ఏమో? జీవనికి ఆకాశమంటే యిష్టం, నీలిమబ్బు ఇష్టం. ఎక్కడికో సాగిపోయే పక్షుల గుంపులంటే యిష్టం. ఆకాశం వైపుకు చేతులు దారి, ఓ… ఓ… అంటూ పాటలు పాడుతుంది. రోడ్డుపైన ఏ చిన్న అలికిడైనా బయటికొచ్చి చూస్తుంది. పొద్దుట పూట కాన్వెంటులకు పోయే నీలగౌనుల చిన్నారులు హడావుడి.. అల్లరి చూసి ఆనందపడిపోతుంది, పి.ఏ..ఏ.. అంటూ వాళ్ళవైపు చూసి అరుస్తుంది. తన భాషలో వాళ్ళకు చెప్పే శుభాకాంక్ష లేమో? సాయంకాలం వీధినిండా గుంపులు గుంపులుగా విడిపోయి ఆటలాడే పిల్లల వైపు ఆసక్తితో చూస్తుంది. వారి వైపు చేతులూపుతుంది. ఆటలలోని మాధుర్యాన్ని తనకూ పంచమని అభ్యర్థనాపూర్వకంగా చూస్తుంది.

ప్రశ్నలు – జవాబులు

అ) ఆకాశం వైపు చూస్తూ జీవని ఏం చేసేది?
జవాబు:
ఆకాశం వైపు చూస్తూ జీవని ఓ… ఓ… అని పాటలు పాడేది.

ఆ) ఏ… ఏ… ఏ… అని అరుస్తూ ఎవరి వైపు చూసేది?
జవాబు:
ఏ… ఏ… ఏ… అని అరుస్తూ అల్లరి చేసే పిల్లల వైపు చూసేది.

ఇ) జీవనికి ఏడేవంటే ఇష్టం?
జవాబు:
జీవనికి ఆకాశం, మబ్బులు, పక్షులు అంటే ఇష్టం.

ఈ) పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
జీవని కళ్లలో ఏం కనిపిస్తోంది?

AP 10th Class Telugu 8th Lesson Important Questions జీవని

7. ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

సాధారణంగా జీవని ఒంటరిగా ఉండడం జరగదు. తప్పనిసరిగా బయటకు వెళ్ళవలసి వస్తే గేటు తాళం వేసి వెళుతుంటాను. ఒక రోజు సాయంకాలం బజారుకెళ్ళి వస్తున్నాను. ఇల్లు చేరేసరికి గేట్లు తెరిచివుంది. తాళం పగులగొట్టబడి వుంది. భయంతో కొయ్యబారి పోయాను. వణుకుతున్న పాదాలతో లోపలికి అడుగు పెట్టాను. అక్కడ అపురూపమైన దృశ్యం. పదిమంది పిల్లలు ఒక చోట చేరి, బొమ్మలతో ఆడుకుంటున్నారు. వాళ్ళ మధ్య జీవని వుంది. అది పెళ్ళి ఆట కాబోలు. జీవని చేతిలో పెళ్ళికూతురు బొమ్మ, ఇంకొక పాప చేతిలో పెళ్ళి కొడుకు బొమ్మ. మరోచోట చిన్నచిన్న గిన్నెలతో విందు భోజనం, ఆనందం, అరుపులు, కోలాహలం, చప్పట్లు, ఆ తోట, ఆ పరిసరాలు, అదంతా దేవతల రాజ్యంలా వుంది. పిల్లల ప్రపంచంలో వ్యతిరేక ఆలోచనలు వుండవు. అందుకే ముందువారు జీవనిని గేలిచేసినా, తరువాత సాదరంగా తమ బాహువులలోకి తీసుకున్నారు.

ప్రశ్నలు – జవాబులు

అ) ఆమె గేటు తాళం ఎవరు బద్దలు కొట్టి ఉంటారు?
జవాబు:
ఆమె గేటు తాళం పిల్లలు బద్దలు కొట్టి ఉంటారు.

ఆ) ఇంట్లో పిల్లలను చూస్తే ఆమెకు ఏమనిపించింది?
జవాబు:
ఇంట్లో పిల్లలను చూస్తే ఆమెకు సంతోషంగా అనిపించింది.

ఇ) పిల్లలు ఆడుకునే ఆట ఏమిటి ?
జవాబు:
పిల్లలు పెళ్ళి ఆట ఆడుకుంటున్నారు.

ఈ) పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
జీవనిని ఎవరు చేతులలోకి తీసుకున్నారు?

8. ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

విశ్వనాథంగారి సూచన మేరకు జీవనిని పాఠశాలలో చేర్పించాము కొంతకాలానికి ఆ తరగతి టీచర్ నన్ను పిలిచింది. “అ,ఆలు రాయమంటే ఆకాశాన్ని, మబ్బుల్ని గీస్తుంది. ఎబిసిడి లు రాయమంటే చెట్లనీ, ఎగిరే పక్షుల్ని గీస్తుంది. పాప బళ్ళో చేరి సంవత్సరం దాటుతోంది. ఇంతవరకు వర్ణమాల రాలేదు” జీవని గురించి టీచర్ ఫిర్యాదు. “ఎంత నేర్చుకుంది, అని కాక నేర్చుకోవడానికి ఎంత పెనుగులాడుతూందో గమనించండి. వెమ్మదిగానే దాని మస్తిష్కం గ్రహిస్తుంది. వందల కొద్ది పిల్లలకు మీరు విద్య నేర్పి ఉంటారు. కానీ జీవని లాంటి పాప మీకు తటస్థపడి ఉండదు. జీవనిని ఒక ఛాలెంజిగా తీసుకోండి. మనం సామాజికంగా వెనకబడిన వాళ్ళకు ప్రత్యేక శిక్షణ యిచ్చి, కోడి పిల్లల్ని రెక్కలచాటున పొదువుకుని పెంచుకొన్నట్లుగా పెంచుకున్నాం. ఎందుకు?

ఈ విజ్ఞానం, నాగరికత ఆధునిక జీవితంలోని మాధుర్యం అందరికి సమంగా పంచుదామనే కదా! అలాగే మానసికంగా వెనుకబడ్డ పిల్లల్ని కూడా ఓపికతో, అనురాగంతో, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి ముందుకు నడిపిద్దాం. వారి అభివృద్ధికి తోడ్పడదాం. జీవని తల్లిగా కాదు మార్పును కోరే మహిళగా మిమ్మల్ని అర్థిస్తున్నాను ‘జీవని ప్రత్యేక అవసరాలు గల పాప. తనపై ప్రత్యేక శ్రద్ధ చూపండి. తనను నిరుత్సాహపరచకండి’. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా ఉద్వేగంగా నేను చెప్పిన మాటలకు తరగతి ఉపాధ్యాయినితో పాటు పాఠశాల.. యాజమాన్యం మంచిగా స్పందించారు. జీవనిలోని ప్రత్యేకతమ గుర్తించారు. జీవనిని ‘మణిభూషన్’ అనే కొత్త టీచర్ కి. అప్పగించారు. ఆమెకు పిల్లలన్నా, పెయింటింగున్నా యిష్టం. జీవనికి ఇష్టమైన రంగంలో అభివృద్ధి చేయడానికి మీతో పాటు మేము కూడా కృషిచేస్తామని నన్ను ఓదార్చుతున్నట్టుగా చెప్పారు వారు.

ప్రశ్నలు – జవాబులు

అ) ఆమె ఎవరిని అభ్యర్థించింది?
జవాబు:
ఆమె ఉపాధ్యాయులను అభ్యర్థించింది.

ఆ) జీవనికి ఏవంటే ఇష్టం?
జవాబు:
జీవనికి బొమ్మలు గీయటం, పిల్లలు అంటే ఇష్టం.

ఇ) జీవని కొత్త టీచర్ పేరేమిటి?
జవాబు:
జీవని కొత్త టీచర్ పేరు మణిభూషణ్.

ఈ) పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
ఎవరికి ప్రత్యేక శిక్షణను ఇస్తున్నారు?

9. ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

ఆ రోజు ఆదివారం. ఆ వేళ ఆకాశం కూడా హాలిడే మూడ్లో వుంది. తూర్పున సూర్యనేత్రం ఇంకా తెరుచుకోలేదు. జీవని ఇంకా నిద్ర లేవలేదు. ఎదురు చూడని అతిథిలా కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీస్తే, జీవని స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు, క్లాస్ టీచర్ మాలినీ రావు, ఆర్ట్ టీచర్ మణిభూషణ్ మొదలైనవారు ఆహ్లాదకరమైన చిరునవ్వులతో ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యం! ఓ వైపు ఉద్వేగం ఆ క్షణం.. శుభాకాంక్షలు లలిత గారూ!

జీవని పెయింటింగ్కి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. ‘అమ్మ’ అనే తన పెయింటింగ్కి సోవియట్ లాండ్ చిల్డ్రన్స్ పెయింటింగ్స్ అవార్డు వచ్చింది. మొత్తం దక్షిణ భారతదేశంలో ఒక్కరికే వచ్చింది. అది మన జీవనికే! ఈ శుభాకాంక్షలు మీకే. ఇది మీ విజయమే! భూమి మీద భగవంతుని ప్రతినిధి అమ్మ అంటారు. అది మీ విషయంలో పూర్తిగా నిజం. జనవరి పదిన మాస్కోకి ప్రయాణం. రేపే పాస్పోర్ట్ కి అప్లై చేయండి అని చెప్పి సెలవు తీసుకున్నారు వారు. ఆ సమయాన నా ఆనందానికి అవధుల్లేవు.

ప్రశ్నలు – జవాబులు

అ) జీవని ఇంటికి ఎవరు వచ్చారు?
జవాబు:
జీవని ఇంటికి ఉపాధ్యాయులు వచ్చారు.

ఆ) జీవనికి అవార్డు తెచ్చిన పెయింటింగ్ ఏది?
జవాబు:
జీవనికి అవార్డు తెచ్చిన పెయింటింగ్ అమ్మ.

ఇ) భగవంతుని ప్రతినిధి ఎవరు?
జవాబు:
భగవంతుని ప్రతినిధి అమ్మ.

ఈ) పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
వారు ఎక్కడికి వెళ్ళాలి?

AP 10th Class Telugu 8th Lesson Important Questions జీవని

10. ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

మంగళవారం రాత్రి టీవీలో జీవనితో ఇంటర్వ్యూ. స్కూల్లో రికార్డు చేసినట్టున్నారు. శ్రీవారు హడావిడి చేస్తున్నారు. స్నేహితులను ఇంటికి పిలిచారు. ఇంట్లో పండుగ వాతావరణం. అందరికీ జీవనిని చూపించి “షీ ఈజ్ మై ‘ప్రైడ్ చైల్డ్’ అని పరిచయం చేశాడు. ఈ హడావిడిని మౌనంగా గమనిస్తున్నాను. ఎనిమిది గంటలకు ప్రోగ్రాం మొదలైంది.. ముందుగా జీవని గురించి ఆ పాఠశాల ఉపాధ్యాయులు చెప్పిన విషయాలు టి.విలో వచ్చాయి. చివరిగా జీవనితో ఇంటర్వ్యూ, వారు ఎన్ని ప్రశ్నలు వేసినా జీవని సమాధానం మౌనమే.

ప్రశ్నలు – జవాబులు

అ) ఇంటికి స్నేహితులను ఎవరు పిచ్చారు?
జవాబు:
ఇంటికి స్నేహితులను జీవని తండ్రి పిలిచాడు.

ఆ) టి.వి. లో జీవని ఇంటర్వ్యూ కంటే ముందు ఏమి వచ్చింది?
జవాబు:
జీవని ఇంటర్వ్యూ కంటే ముందుగా ఆమె గురించి ఉపాధ్యాయులు చెప్పిన విషయాలు టి.వి.లో వచ్చాయి.

ఇ) అన్ని ప్రశ్నలకు జీవని:సమాధానం ఏమిటి?
జవాబు:
అన్ని ప్రశ్నలకు జీవని సమాధానం మౌనమే.

ఈ) పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
జీవనిని స్నేహితులకు పరిచయం చేసినదెవరు?

అపరిచిత గద్యాలు

1. ఈ క్రింది పేరా చదివి, ప్రశ్నలకు తగిన సమాధానములు వ్రాయండి.

ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు వైద్యుని వద్దకు వెళ్ళడానికి ముందు రోగులకు చేసే చికిత్సను ప్రథమ చికిత్స అంటారు. ఈ విధమైన చికిత్స వల్ల రోగికి మేలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రమాదాలు జరిగినప్పుడు కాని, వ్యాధి సోకినప్పుడు కాని కంగారుపడకుండా ఈ చికిత్స నందించాలి. ప్రథమ చికిత్స తరువాత తప్పనిసరిగా వైద్యుని సంప్రదించాలి. అందుకనే ప్రథమ చికిత్స పెట్టి మనకు అందుబాటులో ఉండాలి.

ప్రశ్నలు – జవాబులు

అ) ప్రథమ చికిత్స తరువాత తప్పనిసరిగా ఏం చేయాలి?
జవాబు:
ప్రథమ చికిత్స తరువాత తప్పనిసరిగా వైద్యుని సంప్రదించాలి.

ఆ) రోగికి ఎప్పుడు మేలు జరిగే అవకాశం ఉంటుంది?
జవాబు:
ప్రథమ చికిత్స అందించడం వలన రోగికి మేలు జరిగే అవకాశం ఉంటుంది.

ఇ) ప్రథమ చికిత్స అంటే ఏమిటి?
జవాబు:
ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు వైద్యుని వద్దకు వెళ్ళడానికి ముందు రోగులకు చేసే సేవను ప్రథమ చికిత్స అంటారు.

ఈ) పై గద్యము ననుసరించి ఒక ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
ప్రమాదాలు జరిగినపుడు కాని, వ్యాధి సోకినప్పుడు కాని కంగారుపడకుండా ఏ చికిత్స చేయాలి?

2. కింది గద్యాన్ని చదివి, నాలుగు ప్రశ్నలను తయారుచేయండి.

“పింగళి వెంకయ్య గారు గతంలో మిలటరీ సర్వీసు చేసినందుకు, అప్పటి బ్రిటిష్ భారతప్రభుత్వం బెజవాడ చిట్టినగర్లో ఇచ్చిన స్థలంలో పూరిగుడిసె వేసుకొని కాలాన్ని గడిపారు. వెంకయ్య మీద భక్తిశ్రద్ధలు గల పెద్దలు డాక్టరు కె.ఎల్.రావు, జి.యన్.రాజు వంటివారు జనవరి 15వ తేదీ 1963లో సన్మానం చేసి కొంత నిధిని అందించారు. ఆ తర్వాత ఆరు నెలలకే అంటే 1963 జూలై 4న వెంకయ్య కీర్తిశేషులయ్యారు. తన మృతదేహం మీద జాతీయ పతాకాన్ని కప్పాల్సిందిగా వెంకయ్య కోరారు. శ్మశానం దగ్గర దాన్ని తీసి, రావిచెట్టుకు కట్టమన్నారు. ఆయన చివరి కోరిక నెరవేరింది.
ప్రశ్నలు:
అ) పింగళి వెంకయ్యగారు ఏ శాఖలో ఉద్యోగం చేశారు?
జ) నాటి బ్రిటిష్ భారతప్రభుత్వం, వెంకయ్య గారికి ఎక్కడ స్థలం ఇచ్చింది?
ఇ) వెంకయ్యగార్కి 1963లో సన్మానం చేసిన పెద్దలు ఎవరు?
ఈ) వెంకయ్యగారు, ఎప్పుడు కీర్తిశేషులయ్యారు?

3. కింది గద్యాన్ని చదివి, దిగువ నిచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ఉప్పు సత్యాగ్రహంలో లక్ష్మీబాయమ్మ స్త్రీలకు నాయకురాలిగా ఉండి, ‘దేవరంపాడు’ శిబిరానికి ప్రాతినిధ్యం వహించేది. ఈ శిబిరం బాగా పనిచేసిందని ప్రశంసలు పొందింది. వివిధ గ్రామాల నుండి వందలమంది సత్యాగ్రహులు ఈ శిబిరానికి వచ్చేవారు. వారిని పోలీసులు అరెస్టు చేసేవారు. అయినా స్త్రీలు భయపడక ధైర్యంగా వారినెదుర్కొన్నారు. మూడుసార్లు శిబిరాన్ని పోలీసులు చుట్టుముట్టారు. అయినా లక్ష్మీబాయమ్మ నాయకత్వంలోని స్త్రీలు జంకలేదు. సత్యాగ్రహం మానలేదు.

శ్రీమతి ఉన్నవ లక్ష్మీబాయమ్మ గుంటూరులోను, దుర్గాబాయమ్మ చెన్నపురిలోను, రుక్మిణమ్మ వేదారణ్యంలోనూ మరికొందరు స్త్రీలు భిన్న ప్రాంతాలలోనూ చూపిన సాహసోత్సాహములు, ఆంధ్రుల ప్రతిష్ఠను విస్తరింపజేశాయి, అని ఆంధ్రపత్రిక 1932లో వీరిని ప్రశంసించింది.”

ప్రశ్నలు- జవాబులు

అ) లక్ష్మీబాయమ్మ ఉప్పు సత్యాగ్రహంలో ఏ శిబిరానికి నాయకత్వం వహించింది?
జవాబు:
లక్ష్మీబాయమ్మ ‘దేవరంపాడు’ శిబిరానికి నాయకత్వం వహించింది.

ఆ) సత్యాగ్రహులు శిబిరానికి ఎక్కడ నుండి వచ్చేవారు?
జవాబు:
సత్యాగ్రహులు వివిధ గ్రామాల నుండి శిబిరానికి వచ్చేవారు.

ఇ) ఎన్నిసార్లు శిబిరాన్ని పోలీసులు చుట్టుముట్టారు?
జవాబు:
మూడుసార్లు శిబిరాన్ని పోలీసులు చుట్టుముట్టారు.

ఈ) గుంటూరు ఉప్పు సత్యాగ్రహానికి నాయకురాలు ఎవరు?
జవాబు:
శ్రీమతి ఉన్నవ లక్ష్మీబాయమ్మ గుంటూరులో నాయకత్వం వహించింది.

AP 10th Class Telugu 8th Lesson Important Questions జీవని

4. కింది గద్యాన్ని చదివి, దిగువ నిచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.

“MIT లో అబ్దుల్ కలాం ఆలోచనను ప్రొఫెసర్లు స్పాండర్, కె.ఎ.వి. పండవై, నరసింగరావు గార్లు తీర్చిదిద్దారు. వారు వారి నిశిత బోధన వల్ల ఏరోనాటిక్స్ పట్ల కలాంలోని జ్ఞానతృష్ణను మేల్కొల్పారు. క్రమంగా విస్తృత పరిజ్ఞానమును కలాం గారి మనస్సు సమీకరించుకొంది. విమాన నిర్మాణాంశాల ప్రాముఖ్యం తెలిసింది. పై ముగ్గురు ప్రొఫెసర్లు, వారి శ్రేష్ఠమైన వ్యక్తిత్వాలతో కలాంగారికి సహకరించారు.

అబ్దుల్ కలాం రెండురోజుల్లో విమాన నిర్మాణం డిజైన్ పూర్తి చేసి శ్రీనివాసన్ గారి మెప్పును పొందారు. వీడ్కోలు సభలో ప్రొఫెసర్ స్పాండర్, కలాం గారిని తనతోపాటు కూర్చో పెట్టుకొని ఫోటో తీయించుకున్నారు.

“మన విమానాన్ని మనమే తయారుచేసుకుందాం” అనే వ్యాసాన్ని తమిళంలో రాసి అబ్దుల్ కలాంగారు బహుమతిని పొందారు. కలాంగారు బెంగళూరులోని హిందూస్తాన్ ఏరోనాటికల్లో ట్రైనీగా చేరి, ఇంజన్ వోవర్ హాలింగ్లో పనిచేసి వీరు ఎంతో అనుభవాన్ని గడించారు. తరువాత వైమానిక దళంలో ఉద్యోగిగా చేరి, ఎంతో మంచి అనుభవాన్ని -గడించారు.

ప్రశ్నలు – జవాబులు

అ) MIT లో కలాం గారి ఆలోచనలను తీర్చిదిద్దిన ప్రొఫెసర్లు ఎవరు?
జవాబు:
MIT లో కలాం గారి ఆలోచనలను తీర్చిదిద్దినవారు 1) ప్రొఫెసరు స్పాండర్ 2) కె.ఎ.వి పండవై 3) నరసింగరావు గారు.

ఆ) కలాంగారి జ్ఞానతృష్ణను మేల్కొల్పిన వారు ఎవరు?
జవాబు:
‘స్పాండర్, పండవై, నరసింగరావు గారు అనే ప్రొఫెసర్లు కలాంగారిలోని జ్ఞానతృష్ణను మేల్కొల్పారు.

ఇ) కలాం గారు విమాన నిర్మాణం డిజైన్ ఎన్ని రోజుల్లో పూర్తి చేశారు?
జవాబు:
కలాంగారు విమాన నిర్మాణం డిజైన్ ను రెండురోజుల్లో పూర్తి చేశారు.

ఈ) బెంగళూరులో కలాం గారు ఏ సంస్థలో చేరి, శిక్షణను పూర్తి చేసుకున్నారు?
జవాబు:
కలాంగారు బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటికల్లో ట్రైనీగా చేరారు.

5. ఈ దిగువ సంభాషణను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

పావురం : అసలు అడవులను నాశనం చేయడం వల్లనే వర్షాలు కురవడం లేదు. పంటలు పండటం లేదు. ఎటు చూసినా కరువు, తిండికి, నీటికీ అన్నింటికీ కరవే.

కాకి : ఎక్కడ చూసినా కరవే కాదు, కాలుష్యం కూడా పెరిగింది.

పావురం : జనం పెరగడం వల్లనే ఈ కాలుష్యం, కరువు అన్నీ వస్తున్నాయి. వీటివల్లే రోగాలు కూడా వస్తున్నాయి.

నక్క : కొందరు చేసిన ద్రోహానికి అందరూ శిక్ష అనుభవిస్తున్నారు.

మనిషి : అలా అనకూడదు. మంచిది కాదు. ప్రకృతిని, అడవులను సంరక్షించుకోవాలి. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత.

ప్రశ్నలు – జవాబులు

అ) వర్షాలు ఎందుకు కురవడం లేదు?
జవాబు:
అడవులను నాశనం చేయడం వలన వర్షాలు కురవడం లేదు.

ఆ) రోగాలు ఎందువల్ల వస్తున్నాయి?
జవాబు:
జనం పెరగడం, కాలుష్యం, కరువు వలన రోగాలు వస్తున్నాయి.

ఇ) ఇందులోని నినాదం రాయండి.
జవాబు:
పర్యావరణం పరిరక్షణ అందరి బాధ్యత.

ఈ) పై సంభాషణను అనుసరించి ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
జనాభా పెరుగుదల వల్ల ఏవి సంభవిస్తున్నాయి?

6. ఈ క్రింది సంభాషణ చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
సంభాషణ

రవి : మిత్రులారా! ఈ రోజు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాను. తెలిసినవారు చెప్పండి. సరేనా. ‘మొదటి ప్రశ్న – త్రివర్ణ పతాకం రూపొందించినదెవరు?

జస్వంత్ : పింగళి వెంకయ్య

రవి : సరే. వందేమాతరం గేయకర్త ఎవరు?

సాయి : బంకించంద్ర ఛటర్జీ

రవి : అవును. ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలు ఎన్ని?

లలిత : 26

రవి : కరెక్ట్, ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు?

రాము : నరేంద్ర మోడీ

రవి : సత్యహరిశ్చంద్రీయం నాటకకర్త ఎవరు?

ఫణి : బలిజేపల్లి లక్ష్మీకాంతం

రవి : ‘నీతిచంద్రిక’ రచయిత ఎవరు?

లక్ష్మి : పరవస్తు చిన్నయసూరి

రవి : సూపర్ ! అందరూ బాగా చెప్పారు.

ప్రశ్నలు – జవాబులు

అ) ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాల సంఖ్య ఎంత?
జవాబు:
26

ఆ) బలిజేపల్లి వారి నాటకం ఏది?
జవాబు:
సత్యహరిశ్చంద్రీయం

ఇ) మన జాతీయ జెండా రూపశిల్పి ఎవరు?
జవాబు:
పింగళి వెంకయ్య

ఈ) సంభాషణలో పాల్గొన్నది ఎంతమంది?
జవాబు:
ఏడుగురు

AP 10th Class Telugu 8th Lesson Important Questions జీవని

7. కింది లేఖ చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

విజయవాడ,
25.11.2022.

గౌరవనీయ స్త్రీ శిశు సంక్షేమ శాఖమంత్రి గారికి నమస్కారములు. అయ్యా!

భారతీయ సంస్కృతి స్త్రీలకు ఉన్నత స్థానాన్ని ఇచ్చింది. “ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ సిరిసంపదలు పెంపొందుతాయి” అని పెద్దలమాట. నేటి సమాజంలో స్త్రీలు వివక్షకు, దాడులకు గురౌతున్నారు. నిర్భయ, దిశ లాంటి ఎన్ని చట్టాలున్నా ఉన్మాదుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. మీరు మంత్రిగా స్త్రీల సంక్షేమం కోసం ఎంతో శ్రమిస్తున్నారు. స్త్రీలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి చట్టాలను కఠినంగా అమలుపరిచేలా చూడవలసినదిగా అభ్యర్థిస్తున్నాము.
అభివందనములతో

ఇట్లు,
అభ్యుదయ మహిళామండలి,
పటమట లంక,
విజయవాడ.

ప్రశ్నలు – జవాబులు

అ) ఈ లేఖ ఏ తేదీన, ఎవరికి రాయబడింది?
జవాబు:
ఈ లేఖ 25.11.2022వ తేదీన, గౌరవనీయ శిశు సంక్షేమ శాఖమంత్రి గారికి రాయబడింది.

ఆ) స్త్రీల రక్షణకు ఉద్దేశించబడిన చట్టాలేవి?
జవాబు:
స్త్రీల రక్షణకు ఉద్దేశించబడిన చట్టాలు నిర్భయ, దిశ మొదలైనవి.

ఇ) భారతీయ సంస్కృతి స్త్రీలకు ఇచ్చిన స్థానం ఎలాంటిది?
జవాబు:
భారతీయ సంస్కృతి స్త్రీలకు ఉన్నత స్థానాన్ని ఇచ్చింది.

ఈ) ఈ లేఖ ఆధారంగా ఒక ప్రశ్నను తయారుచేయండి.
జవాబు:
స్త్రీలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి చట్టాలను ఎలా అమలుపరచాలి?

వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
జీవని పాఠ్యభాగ ప్రక్రియ గురించి వ్రాయండి.
జవాబు:
కథ, కథానిక అనేవి నేడు పర్యాయపదాలుగా వాడుతున్నాం. ‘కథ’ సాహిత్య ప్రక్రియ. వ్యక్తి జీవితంలోని ఒక ముఖ్య సన్నివేశాన్ని, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. క్లుప్తత దీని లక్ష్యం, పాత్రలూ, నేపథ్యం, కథనం, జీవిత వాస్తవిక చిత్రణ ఇందులో ముఖ్యాంశాలుగా కన్పిస్తాయి.

ప్రశ్న 2.
జీవనికి ఏ అవార్డు వచ్చింది? ఎందుకు? వివరించండి.
జవాబు:
జీవనికి ‘సోవియట్ లాండ్ చిల్డ్రన్స్’ పెయింటింగ్ అవార్డు వచ్చింది. జీవని వేసిన అమ్మ అనే పెయింటింగ్కి ఆ అవార్డు వచ్చింది. ఆ అవార్డు రావటానికి పూర్తిగా కారణం జీవని తల్లియైన లలితే. ఆమె జీవనిని చాలా పట్టుదలతో తీర్చిదిద్దింది. జీవని పాఠశాల ఉపాధ్యాయులను ఆమెలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించమని లలిత అభ్యర్థించింది. ఉపాధ్యాయులు కూడా ఆమె అభ్యర్ధన మేరకు జీవనిలోని ప్రజ్ఞా పాటవాలను వెలికి తీసారు. అందుకే జీవనికి అవార్డు వచ్చింది. అది జీవనికి తప్ప దక్షిణ భారతదేశంలో మరెవరికీ రాలేదు.

ప్రశ్న 3.
జీవని అభివృద్ధిలో విశ్వనాథం గారి పాత్రను వివరించండి.
జవాబు:
విశ్వనాథం గారు గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్త. ఆయన వృద్ధుడు, జ్ఞానదీపంలా ఉంటాడు. లలితకు ఆయన బస్సులో పరిచయమయ్యాడు. జీవని గురించి తెలుసుకున్నాడు. లలితకు ధైర్యం చెప్పాడు. తమ కుమార్తె ప్రమోదినిని అభివృద్ధి చేసిన విధానం చెప్పాడు. జీవని ఎదుగుదలకు అవసరమయ్యే సహాయ సహకారాలు అందిస్తానన్నాడు. విశ్వనాథం గారు ప్రతిఫలాపేక్ష లేని మనిషి ఇతరులకు సహాయం చేసే మనిషి, ఆయన తన ప్రయోగాలతో జీవని వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడ్డాడు. జీవని పెంపకంలో లలితకు అనేక సలహాలు, సూచనలు చేసాడు. వాటి వలన జీవనిలో చాలా మార్పులు వచ్చాయి. కొద్దిగా అడుగులు వేయటం నేర్చుకుంది. తన ఇష్టాలను వ్యక్తపరచేది. జీవనిని పాఠశాలలో చేర్చమని లలితకు చెప్పాడు. ఈ విధంగా జీవనికి ప్రపంచస్థాయి గుర్తింపు రావటానికి విశ్వనాథంగారే మూల కారకుడు.

ప్రశ్న 4.
జీవని పాఠ్యభాగ రచయిత గురించి వ్రాయండి.
జవాబు:
వర్ధమాన కథా రచయితలలో డా. వి. చంద్రశేఖరరావు ఒకరు. మహాలక్ష్మి, దేవసహాయం గార్లు వీరి తల్లిదండ్రులు. వీరు ప్రకాశం జిల్లాలో జన్మించారు. ‘జీవని’, మాయాలాంతరు, ద్రోహవృక్షం, లెనిన్ ప్లేస్ మొదలైన కథా సంపుటాలు. నల్లమిరియం చెట్టు, ఐదుహంసలు, ఆకుపచ్చని దేశం నవలలను రాశారు. జీవని కథ నాటకంగా రూపొంది 1991లో ఆకాశవాణిలో ప్రసారమై జాతీయ స్థాయిలో ఉత్తమ నాటకంగా బహుమతి పొందింది. వీరు కథాశిల్పంలో నూతన ఒరవడి సృష్టించారు.

AP 10th Class Telugu 8th Lesson Important Questions జీవని

ఆ) ఈ క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
జీవని తన అభిప్రాయాలను వ్యక్తీకరిస్తే ఎలా ఉంటుందో ఊహించి జీవని ఆత్మకథ వ్రాయండి.
జవాబు:
నా పేరు మీకందరికీ తెలుసు కదా! జీవని. పిల్లలు పుట్టడం అందరికీ వరమైతే నేను పుట్టడం మాత్రం మా అమ్మకి శాపమయ్యింది. ఏ ముహూర్తాన పుట్టానో గానీ నేనంటే మా మామ్మకు, నాన్నకు, అత్తకు కుటుంబంలోని వారెవ్వరికీ ఇష్టం లేదు. నా కారణంగా మా అమ్మ కూడా వాళ్ళందరికీ విరోధి అయ్యింది. అంతెందుకు నేను పుట్టడం వల్ల సమస్యలొస్తాయని డాక్టర్లే మా అమ్మకు చెప్పారు. అయినా మా అమ్మ పట్టించుకోలేదు. ఎవరి శతృత్వాలను పరిగణనలోకి తీసుకోకుండా మొండితనంగా మా అమ్మ నన్ను పెంచింది.

బెంగుళూరులో ఆశ్రమంలో వేద్దామన్న మా నాన్న మాటను తీవ్రంగా వ్యతిరేకించింది. అప్పటి నుంచి మా నాన్నెప్పుడూ నన్ను కన్నెత్తి కూడా చూడలేదు. గారడీ ఆట ఆడే అమ్మాయి ద్వారా మా అమ్మ ఉత్తేజం పొంది నన్ను పెంచింది. నాకు ఆ అమ్మాయి పేరే పెట్టింది, నేను ప్రత్యేక అవసరాలు గల అమ్మాయిగా జన్మించటానికి నేను కారణం కాదు. మా అమ్మ కారణం కాదు. మరెందుకిలా చిన్న చూపు చూసారో నాకర్ధం కాదు. విశ్వనాథం తాతయ్య గారు ఇచ్చిన సలహాలు, సూచనలు నా జీవితాన్ని మార్చాయి. మా పాఠశాల ఉపాధ్యాయులు కూడా నా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు.

నేను నిజానికి సోవియట్ లాండ్ చిల్డ్రన్స్ పెయింటింగ్స్ అవార్డ్ వస్తుందని అమ్మ బొమ్మ వేయలేదు. నా సర్వస్వం అమ్మే. నిజానికి నేను అమ్మ తయారుచేసిన బొమ్మను. చివరిగా ఒక మాట చెబుతాను. టి.వి.లో నా ఇంటర్వ్యూ వస్తుంటే మా . నాన్న చేసిన హడావుడికి నాకు బాధ. నవ్వు రెండూ వచ్చాయి. ఏనాడు నా వైపు చూడని మా నాన్న తన స్నేహితులకు నన్ను చూపించి ‘షి యీజ్ మై ప్రైడ్ చైల్డ్’ అని పరిచయం చెయ్యడమే నాకు అవార్డు రావటం కంటే వెయ్యిరెట్లు ఆశ్చర్యపరచిన సంఘటన. ఇక ఉంటాను.

ప్రశ్న 2.
జీవనిని ప్రసవించడానికి ముందు లలిత మానసికంగా పడిన వేదనను రాయండి.
జవాబు:
సమాజంలో ఆత్మస్థైర్యం కల స్త్రీల ప్రతినిధిగా లలిత పాత్రను రచయిత చక్కగా చిత్రించారు. పెళ్ళైన చాలా కాలానికి జీవని, లలిత కడుపున పడింది. ఏ గైనకాలజిస్ట్ చేతిమందు ప్రభావమోనని భావించింది. డాక్టరు సరళ, లలితను పరీక్ష చేస్తున్న సమయంలో ఈ ఒక్క కలను సఫలం చెయ్యి తండ్రీ! ఈ దీనురాలి ఈ చిన్న కోర్కె తీర్చుదేవా! అంటూ దేవుణ్ణి దీనంగా వేడుకుంది. తల్లినయ్యానన్న సంతోషం పూర్తిగా అనుభవించక ముందే పిడుగుపాటు లాంటి వార్త.

ఆలస్యంగా గర్భవతులయ్యే స్త్రీలలో చాలా అరుదుగా జరుగుతుందంటారు. అదేమిటంటే పుట్టబోయే పిల్ల మెదడు పెరగకుండా ఉంది. ఎంత నిర్దయ అమృతభాండాన్ని చేతిలో పెట్టినట్టే పెట్టి అంతలోనే వెనక్కు లాక్కోవడం అంటే ఇదేనని బాధ పడింది లలిత. బిడ్డలు లేకపోవడం కంటే ఎవరో ఒకరు అనే నిర్ణయానికి వచ్చింది లలిత. అంతలోనే ఆనందం. అంతలోనే బాధ. కలగలుపుకొన్న లలిత బిడ్డను ప్రసవించక ముందు, తర్వాత ఎంతో మానసిక ఘర్షణకు గురైంది.

ప్రశ్న 3.
పిల్లల ప్రపంచంలో వ్యతిరేక ఆలోచనలు ఉండవు అన్న మాటలను సమర్ధించే సంఘటన గురించి రాయండి.
జవాబు:
లలిత, జీవనిని ఒంటరిగా వదిలి ఎప్పుడూ బయటకు వెళ్ళదు. తప్పనిసరిగా బయటకు వెళ్ళవలసి వస్తే గేటు తాళం వేసి వెళుతుంది. అలాగే ఒకరోజు తాళం వేసి, బజారుకెళ్ళి వస్తుంది. ఇల్లు చేరేసరికి గేటు తెరిచి ఉంది. తాళం పగుల గొట్టబడి ఉంది. లలిత భయంతో, వణుకుతున్న పాదాలతో లోపలికి అడుగుపెట్టింది. అక్కడ అపురూపమైన దృశ్యం చూసింది లలిత. పదిమంది పిల్లలు ఒకచోట చేరి, బొమ్మలతో ఆడుకుంటున్నారు. వాళ్ళ మధ్య జీవని ఉంది.

అది పెళ్ళి ఆట. జీవని చేతిలో పెళ్ళికూతురు బొమ్మ. ఇంకొక పాప చేతిలో పెళ్ళికొడుకు బొమ్మ. మరోచోట చిన్న చిన్న గిన్నెలతో విందు భోజనం, ఆనందం, అరుపులు, కోలాహలం, చప్పట్లు, ఆ తోట, ఆ పరిసరాలు, అదంతా దేవతల రాజ్యంలా ఉంది. అందుకే అంటారు పిల్లల ప్రపంచంలో వ్యతిరేక ఆలోచనలు ఉండవు అని. ఆ పిల్లలంతా ముందు జీవనిని గేలి చేశారు. తరువాత సాదరంగా తమతో కలుపుకొని ఆటలు ఆడుతున్నారు.

ఇ) కింది అంశం గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.

ప్రశ్న 1.
ప్రత్యేక అవసరాలున్న పిల్లలను ప్రేమగా చేరదీయమని కోరుతూ వారి తల్లిదండ్రులకు ప్రభోదిస్తూ ఒక కరపత్రం రూపొందించండి.
జవాబు:

ఆదరించండి
తల్లిదండ్రులారా! ఆలోచించండి.
ప్రత్యేక అవసరాలున్న పిల్లలను ఓర్పుతో, నేర్పుతో తీర్చిదిద్దండి.
అనాదరణ వద్దు.
చాలామంది తల్లిదండ్రులు ఆదరిస్తారు. వారికి నమస్కారం.
చేరదీయని కొద్దిమందికే ఈ విన్నపం. మీరు వారిని జాగ్రత్తగా తీర్చిదిద్దితే వారే ఒక హెలెన్ కెల్లెర్, సంజీవరాయ్ శర్మ వంటి గొప్పవాళ్లుగా తయారుకావచ్చు. శ్రమిస్తే సాధ్యం కానిది లేదు. కష్టపడితే కానిది లేదు. ప్రయత్నిద్దాం. విజయం సాధిద్దాం.

ప్రతులు : 5000

 

ఇట్లు,
స్త్రీ శిశు సంక్షేమ శాఖ,
అమరావతి.

భాషాంశాలు

అలంకారాలు

వాక్యంలోని అలంకారాన్ని గుర్తించి రాయండి.

1. ఎదురు చూడని అతిథిలా కాలింగ్ బెల్ మ్రోగింది.
జవాబు:
ఇచ్చిన వాక్యంలో ఉపమాలంకారం ఉంది.

2. విశ్వనాధం గారు జ్ఞానదీపంలా ఉన్నారు.
జవాబు:
ఇచ్చిన వాక్యంలో రూపకాలంకారం ఉంది.

అర్ధాలు

అ) గీత గీసిన పదానికి అర్థం రాయండి.

3. ప్రశ్న అడిగిన వెంటనే సమాధానం చెప్పాలి.
జవాబు:
జవాబు

4. లక్ష్మీదేవి శ్రీవారు విష్ణువు.
జవాబు:
భర్త

5. జ్ఞానానికి అవధి ఉంది గాని అజ్ఞానానికి లేదు.
జవాబు:
హద్దు

6. విజయం సాధిస్తే ఆనందంగా ఉంటుంది.
జవాబు:
గెలుపు

7. నాకు బహుమతిని చూసి ఆహ్లాదం కలిగింది.
జవాబు:
ఆనందం

8. కొందరి హాసం వెక్కిరింతలా ఉంటుంది.
జవాబు:
నవ్వు

9. దేనికైనా పరిమితి ఉంటుంది.
జవాబు:
హద్దు

10. కాలంలో మార్పులు అనూహ్యం.
జవాబు:
ఊహకందనివి

11. ప్రతివారూ స్వేచ్ఛగా జీవించాలి.
జవాబు:
స్వాతంత్ర్యం

12. హఠాత్తుగా బిల్డింగ్ పడిపోయింది.
జవాబు:
ఆకస్మాత్తుగా

AP 10th Class Telugu 8th Lesson Important Questions జీవని

ఆ) గీత గీసిన పదానికి సరియైన అర్థాన్ని గుర్తించండి.

13. మా ఇంటి తాళం చాలా గట్టిది.
అ) బీగం
ఆ) బేగం
ఇ) భాగం
ఈ) భాగం
జవాబు:
అ) బీగం

14. కొందరు పోరాటం చేసినా ఏమీ సాధించలేరు.
ఆ) ప్రయత్నం
ఆ) యుద్ధం
ఇ) పని
ఈ) హడావుడి
జవాబు:
ఆ) యుద్ధం

15. కొందరి ముఖంలో తేజస్సు ఎక్కువ ఉంటుంది.
అ) కోపం
ఆ) నవ్వు
ఇ) కాంతి
ఈ) చిరాకు
జవాబు:
ఇ) కాంతి

16. జంతువులు గుంపుగా కదులుతాయి.
అ) వేగం
ఆ) బెదురు
ఇ) కంగారు
ఈ) సమూహం
జవాబు:
ఈ) సమూహం

17. సినిమా హీరోను చూసి జనం అరుపులు మిన్ను ముట్టాయి.
అ) నినాదాలు
ఆ) కేకలు
ఇ) అల్లరి
ఈ) చప్పళ్ళు
జవాబు:
ఆ) కేకలు

18. ప్రతిదానికి ఆరాటం పనికిరాదు.
అ) ఆతృత
ఆ) ఆందోళన
ఇ) కలవరం
ఈ) కలకలం
జవాబు:
ఆ) ఆతృత

19. తిరస్కారం చేయడం సంస్కారం కాదు.
అ) పురస్కారం
ఆ) నమస్కారం
ఇ) సంస్కారం
ఈ) అనాదరం
జవాబు:
ఈ) అనాదరం

20. ఎవరిపైనా ద్వేషం ఉండకూడదు.
అ) ప్రతీకారం
ఆ) ఉపకారం
ఇ) పగ
ఈ) స్నేహం
జవాబు:
ఇ) పగ

21. ఉదయం చల్లని గాలి వీస్తుంది.
అ) సాయంత్రం
ఆ) రాత్రి
ఇ) మధ్యాహ్నం
ఈ) ప్రొద్దున
జవాబు:
ఈ) ప్రొద్దున

22. మంచి కృత్యం చేయాలి.
అ) కాలం
ఆ) పని
ఇ) సహాయం
ఈ) వ్యాపారం
జవాబు:
ఆ) పని

పర్యాయపదాలు

అ) గీత గీసిన పదానికి పర్యాయపదాలు రాయండి.

23. ప్రతి నెల పున్నమి వస్తుంది.
జవాబు:
ద్వీపక్షము, మాసము

24. పురుగు పడి కనురెప్ప వాచింది.
జవాబు:
కందెర, రెప్ప

25. అమృతం దేవతలు తాగుతారు.
జవాబు:
సుధ, పీయూషము

26. చాలా యాతన పడి పిల్లలను పెంచుతారు.
జవాబు:
బాధ, కష్టం

27. చెవి గుసగుసలాడింది.
జవాబు:
కర్ణము, వీను

28. మా ఇల్లు స్వర్గంలా ఉంటుంది.
జవాబు:
నాకము, దివి

29. కొందరి ముఖంలో కోపం ఎక్కువ ఉంటుంది.
జవాబు:
వదనం, మొగము

30. సైనికులు లక్ష్యం కోసం జీవిస్తారు.
జవాబు:
పూనిక, సంకల్పం

31. ఎవరి ప్రాణం వారికి లిపి.
జవాబు:
ఉసురు, జీవం

AP 10th Class Telugu 8th Lesson Important Questions జీవని

ఆ) గీత గీసిన పదానికి సరియైన పర్యాయపదాలు గుర్తించండి.

32. కొన్ని విన్యాసాలు ఆశ్చర్యం కలిగిస్తాయి.
అ) చక్కని ప్రదర్శనలు, రచనములు
ఆ) గంతులు, నాట్యాలు
ఇ) పాటలు, పద్యాలు
ఈ) కర్తవ్యాలు, పనులు
జవాబు:
అ) చక్కని ప్రదర్శనలు, రచనములు

33. సాహసంతో శతృవులను ఎదుర్కోవాలి.
అ) తెగువ, తెగింపు
ఆ) ధైర్యం, నిర్భయం
ఇ) యుద్ధం రణం
ఈ) జయం, గెలుపు
జవాబు:
అ) తెగువ, తెగింపు

34. శిక్షణలో ఎవరైనా రాటు తేలుతారు.
అ) దెబ్బలు, తిట్లు
ఆ) తిట్లు, నిందలు
ఇ) అవమానాలు, తిరస్కారాలు
ఈ) తర్ఫీదు, అభ్యాసం
జవాబు:
ఈ) తర్ఫీదు, అభ్యాసం

35. ప్రతీ వృద్ధుడూ గొప్పవాడు కాదు.
అ) ముసలివాడు, పెద్దవాడు
ఆ) తాతా, మామయ్య
ఇ) అమ్మమ్మ, తాతయ్య
ఈ) ఊత కలవాడు, నడవలేనివాడు
జవాబు:
అ) ముసలివాడు, పెద్దవాడు

36. ఒక్క క్షణము కూడా వృథా చేయకూడదు.
అ) సెకను, నిమిషం
ఆ) సెకను, లిప్త
ఇ) లిప్త, గంట
ఈ) లిప్త, కాలం
జవాబు:
ఆ) సెకను, లిప్త

37. మన జన్మ సార్థకమయ్యేలా ప్రవర్తించాలి.
అ) జీవితం, బతుకు
ఆ) జీవనం, పని
ఇ) జననం, పుట్టుక
ఈ) జీవితం, జీతం
జవాబు:
ఇ) జననం, పుట్టుక

38. సైనికుడు దేశాన్ని కాపాడతాడు.
అ) జవాను, సిపాయి
ఆ) భటుడు, బంటు
ఇ) అనుచరుడు, స్నేహితుడు
ఈ) స్నేహితుడు, సన్నిహితుడు
జవాబు:
అ) జవాను, సిపాయి

39. అందరితో ఆత్మీయత కలిగి ఉండాలి.
అ) వైరం, బుద్ధి
ఆ) స్నేహం, వైరం
ఇ) దగ్గర, దూరం
ఈ) ఆదరము, ప్రేమ
జవాబు:
ఈ) ఆదరము, ప్రేమ

40. జుట్టు గురించి కొంతమంది మందులు కూడా వాడుతారు.
అ) వెంట్రుకలు, కురులు
ఆ) వీను, కన్ను
ఇ) మీను, మేను
ఈ) తాను, తను
జవాబు:
అ) వెంట్రుకలు, కురులు

41. రాముని భార్య సీత.
అ) సఖి, మఖి
ఆ) భారము, భరము
ఇ) గృహిణి, అతిథి
ఈ) సతి, పత్ని
జవాబు:
ఈ) సతి, పత్ని

ప్రకృతి వికృతులు

అ) గీత గీసిన పదానికి సరియైన ప్రకృతి పదం రాయండి.

42. సుశీల గొంతు అద్భుతంగా ఉంటుంది.
జవాబు:
కంఠము

43. మనిషికి విన్నాణము ఉండాలి.
జవాబు:
విజ్ఞానం

44. దివ్వె రోజూ పెట్టాలి.
జవాబు:
దీపం

45. పెద్ద ఒకరు వచ్చారు.
జవాబు:
వృద్ధ

46. నిక్కమునే పలకాలి.
జవాబు:
నిజము

AP 10th Class Telugu 8th Lesson Important Questions జీవని

ఆ) గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.

47. సిగ్గు లజ్జ లేకుండా ఆ పని ఏమిటి?
అ) భయం
ఆ) లజ్జా
ఇ) బిడియం
ఈ) లజ
జవాబు:
ఆ) లజ్జా

48. అంబకు నమస్కరించాలి.
అ) అబ
ఆ) ఆబ
ఇ) అమ్మ
ఈ) యమ
జవాబు:
ఇ) అమ్మ

49. నిజం మాట్లాడాలి.
అ) నిఝం
ఆ) నిజ
ఇ) నిజాయితీ
ఈ) నిక్కము
జవాబు:
ఈ) నిక్కము

50. శాస్త్రం తెలుసుకోవాలి.
అ) శాసనం
ఆ) చట్టం
ఇ) శాస్త్రి
ఈ) సత్యం
జవాబు:
ఆ) చట్టం

51. తృప్తిగా జీవించాలి.
అ) తుప్తి
ఆ) తప్పటిల్లు
ఇ) తుప్పు
ఈ) తుపుతు
జవాబు:
ఆ) తప్పటిల్లు

52. చదువుపై ఆసక్తి పెంచుకోవాలి.
అ) ఆసత్తి
ఆ) ఇష్టం
ఇ) కోరిక
ఈ) వ్యామోహం
జవాబు:
అ) ఆసత్తి

53. ఆకాశం మెరుస్తోంది.
అ) ఆకసం
ఆ) ఆకాసం
ఇ) ఆకశం
ఈ) ఆకషం
జవాబు:
అ) ఆకసం

54. అమ్మ దూరంగా ఉంది.
అ) దుర్దురము
ఆ) దురము
ఇ) దురాము
ఈ) దవ్వు
జవాబు:
ఈ) దవ్వు

55. మంచి భోజనము తినాలి.
అ) తిండి
ఆ) బోనము
ఇ) ఆహారం
ఈ) అన్నం
జవాబు:
ఆ) బోనము

56. పక్షి ఆకాశంలో ఎగురుతుంది.
అ) పక్కి
ఆ) పషి
ఇ) పస
ఈ) ఖగము
జవాబు:
అ) పక్కి

నానార్థాలు

అ) గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి.

57. ప్రాణం పీల్చి పాపే నా ప్రాణం అంది.
జవాబు:
గాలి, ఉసురు

58. శక్తిని పూజిస్తే శక్తి పెరుగుతుంది.
జవాబు:
పార్వతీ దేవి, బలం

59. నెలకు నెల ఒకసారే పూర్తిగా వస్తాడు.
జవాబు:
మాసం, చంద్రుడు

60. తలపై నిమ్మకాయ విన్యాసం చేసి నరకుట ఒక విన్యాసం.
జవాబు:
ఉంచుట, మంచి ప్రదర్శన

61. కబడ్డీ ఆటకు నాపై ఆట వేయాలా?
జవాబు:
క్రీడ, నింద

62. మంచి పేరు వస్తే ఊరీ పేరు నిలబడుతుంది.
జవాబు:
కీర్తి, నామం

63. జడదారి దారి మంచిది.
జవాబు:
ధరించువాడు, మార్గం

64. ఆ పాపకు పాప సరిగా లేదట.
జవాబు:
శిశువు, కంటిపాప

65. మంచి ప్రయోగం మంచితనానికి ప్రయోగం.
జవాబు:
ప్రయత్నం, తార్కాణం

66. సత్యం కలవాడికి శారీరక సత్యంతో పనిలేదు.
జవాబు:
సత్త్వగుణం, బలం

AP 10th Class Telugu 8th Lesson Important Questions జీవని

ఆ) గీత గీసిన పదానికి సరైన నానార్థాలు గుర్తించండి.

67. వేణువుతో వేణువు చేస్తారు.
అ) కృష్ణుడు, బొమ్మ
ఆ) మురళి, రాధ
ఇ) వెదురు, పిల్లనగ్రోవి
ఈ) కర్ర, కోల
జవాబు:
ఇ) వెదురు, పిల్లనగ్రోవి

68. ఈ ఊపిరి ఊపిరి ఆగేలా చేస్తోంది.
అ) ఎండ, శ్వాస
ఆ) వాన, ప్రాణం
ఇ) చలి, ప్రయాణం
ఈ) గాలి, వాన
జవాబు:
అ) ఎండ, శ్వాస

69. అణువులో రేణువు చాలా అణువు.
అ) పరమాణువు, చిన్న అణువు
ఆ) ఆక్సిజన్, పరమాణువు
ఇ) ఇసుక, చిన్నది
ఈ) నూక, సూక్ష్మమైనది
జవాబు:
ఈ) నూక, సూక్ష్మమైనది

70. లేశము లేశముగా ఉంటుంది.
అ) కొంచెం, స్వల్పం
ఆ) అణువు, మిక్కిలి అల్పం
ఇ) అణువు, తేలిక
ఈ) గాలి, తేలిక
జవాబు:
ఆ) అణువు, మిక్కిలి అల్పం

71. ఆకాశము గురించి ఆకాశములోకి చూస్తే తెలియదు.
అ) బ్రహ్మము, నభము
ఆ) నింగి, నేల
ఇ) శుభ్రం, అభ్రకం
ఈ) చంద్రుడు, నింగి
జవాబు:
ఆ) బ్రహ్మము, నభము

72. భాష లేనిదే భాష చేయలేము.
అ) మాట, పుస్తకం
ఆ) లిపి పుస్తకం
ఇ) అక్షరం, సందేశం
ఈ) మాట, ప్రతిజ్ఞ
జవాబు:
ఈ) మాట, ప్రతిజ్ఞ

73. పాట చెప్పే గురువు గారిల్లు పాట పెట్టారు.
అ) సంగీతం, వేలంపాట
ఆ) గేయం, నిప్పు
ఇ) గీతం, కట్టి
ఈ) గానం, విప్పి
జవాబు:
అ) సంగీతం, వేలంపాట

74. పాము అలికిడిని దాని బుస అలికిడి వల్ల తెలిసింది.
అ) పడగ, మెలికలు
ఆ) ఆకారం, కొట్టడం
ఇ) జాడ, శబ్దం
ఈ) కుబుసం, ఆకారం
జవాబు:
ఇ) జాడ, శబ్దం

75. తాళం దగ్గర తాళం వేసి ఉన్నదే మా ఇల్లు.
అ) కొట్టు, కప్పు
ఆ) తాడిచెట్టు, బీగం
ఇ) బిల్డింగ్, కష్టం
ఈ) చెరువు, గేటు
జవాబు:
ఆ) తాడిచెట్టు, బీగం.

వ్యుత్పత్త్యర్థాలు

అ) గీత గీసిన పదానికి వ్యుత్పత్యర్థం రాయండి.

76. బాహువు బలంగా ఉండాలి.
జవాబు:
బాధించునది (చెయ్యి)

77. అంధకారంలో ప్రయాణించకూడదు.
జవాబు:
లోకులను అంధులను చేయునది (చీకటి)

78. సూర్య కిరణం వేడిగా ఉంది.
జవాబు:
తమస్సును పోగొట్టేది (కాంతి)

79. ఉపాధ్యాయుడు పాఠం బాగా చెప్పారు.
జవాబు:
సమీపమును పొంది ఈతని వలన అధ్యయనం చేస్తారు. (అధ్యాపకుడు)

80. మౌనం మంచిది.
జవాబు:
ముని యొక్క వృత్తి, (మాట్లాడకుండడం)

81. శ్రీ విష్ణు సతి.
జవాబు:
విష్ణువు నాశ్రయించునది. (లక్ష్మి)

82. కృష్ణ భగవాన్ మంచి నటుడు.
జవాబు:
సంపూర్ణ మాహాత్మ్యాదులు కలవాడు (దైవం)

ఆ) గీత గీసిన పదానికి సరైన వ్యుత్పత్వర్ణాన్ని గుర్తించండి.

83. ముఖం అందంగా అలంకరించుకోవాలి.
అ) దీనిచేత భక్ష్యము పీడింపబడును. (నోరు)
ఆ) అలంకరించబడును (వదనం)
ఇ) చూడగానే కనబడును (మొహం)
ఈ) కళ్లు కలది (మొగము)
జవాబు:
ఆ) దీనిచేత భక్ష్యము పీడింపబడును. (నోరు)

84. సీత భర్త శ్రీరాముడు.
అ) భరింపబడేవాడు (పతి)
ఆ) ఆదరించేవాడు (నాథుడు)
ఇ) ఆగ్రహించేవాడు (అధిపుడు)
ఈ) భరించేవాడు (మగడు)
జవాబు:
ఈ) భరించేవాడు (మగడు)

85. సాయంత్రం బైటకు వెడదాం.
అ) చీకటిని తెచ్చేది (సంధ్య).
ఆ) దినము నంతయు పొందించేది (సాయంకాలం)
ఇ) వెలుగును నశింపచేసేది (సాయం సంధ్య)
ఈ) చీకటికి ప్రారంభం (సాయంత్రం)
జవాబు:
ఆ) దినము నంతయు పొందించేది (సాయంకాలం)

86. ఎప్పుడూ ఆనందంగా ఉండాలి.
అ) ఆనందింప చేయునది. (సంతోషం)
ఆ) విచారం పోగొట్టేది. (సంతసం)
ఇ) ఉత్సాహం పెంచేది (హ్లాదం)
ఈ) మోదకాలనిచ్చేది (మోదం)
జవాబు:
అ) ఆనందింప చేయునది. (సంతోషం)

87. ఎర్ర రక్త కణముల సంఖ్య తగ్గకూడదు.
అ) ఎర్రనిది (సూక్ష్మం)
ఆ) శక్తిని పెంచేది (అణువు)
ఇ) బలం పెంచేది (పరమాణువు)
ఈ) సంకోచమై ఉండేది (కొంచం)
జవాబు:
ఈ) సంకోచమై ఉండేది (కొంచం)

88. మంచి భాష నేర్చుకోవాలి.
అ) శాసించేది (పలుకు)
ఆ) ఆకర్షించేది (వాణి)
ఇ) భాషింపబడేది (మాట
ఈ) నిందలు తెచ్చేది (వాగుడు)
జవాబు:
ఇ) భాషింపబడేది (మాట)

89. సాధారణంగా అబద్ధం ఆడకూడదు.
అ) సమానమైన ఆధారం కలది (సొత్తైనది)
ఆ) కొలత తెచ్చేది.
ఇ) గొప్పది కానిది
ఈ) మేలు నివ్వనిది
జవాబు:
అ) సమానమైన ఆధారం కలది (పొత్తైనది)

90. నేను మధ్యలో కూర్చున్నాను.
అ) సగం కలది
ఇ) చూడబడునది
ఆ) తలంపబడునది
ఈ) చేయబడునది
జవాబు:
ఆ) తలంపబడునది

91. భోజనము తృప్తిగా తినాలి.
అ) తినకుండుట (తిండి)
ఆ) ఆకలి తీర్చేది (అన్నం)
ఇ) భుజించుట (ఆహారం)
ఈ) మింగుట (ఓగిరం)
జవాబు:
ఇ) భుజించుట (ఆహారం)

జాతీయాన్ని గుర్తించడం

వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి విడిగా రాయండి.

92. పుట్టిన బిడ్డ గురించి డాక్టరు నా చెవి దగ్గర గుసగుస లాడింది.
జవాబు:
గుసగుసలాడు

93. డోంట్ బి ఎమోషనల్ అంటూనే ఆవిడ నా ఆనందంలో పాలుపంచుకొన్నది.
జవాబు:
పాలుపంచుకొను

జాతీయము – సందర్భము

ఈ జాతీయాన్ని ఏ అర్థంలో / సందర్భంలో ఉపయో గిస్తారో రాయండి.

94. అతిథి
జవాబు:
‘తిథి, వార, నక్షత్రాలను చూసుకోకుండా వచ్చేవాడు’ అనే అర్థంలో వాడతారు.

95. కొయ్యబారిపోవు
జవాబు:
‘శరీరం కట్టెవలె బిగుసుకుపోవడం’ అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

96. పిడుగుపాటు
జవాబు:
‘ఊహించని’ దెబ్బ అనే అర్థంలో వాడతారు.

సంధి పదాలను విడదీయడం

గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి.

97. ప్రోగ్రాం మొదలైనది.
జవాబు:
మొదలు + ఐనది

98. జీవని జీవితంలో అదొక మహాద్భుతం.
జవాబు:
మహ + అద్భుతం

99. అన్ని ప్రయోగాలు ఫలించవు.
జవాబు:
ప్రయోగము + లు

100. నేను ఉన్నపుడు వింటాను.
జవాబు:
ఉన్న + అపుడు.

101. ఎండుటాకు రాలింది.
జవాబు:
ఎండు + ఆకు

102. మరొక మాట చెప్పనా?
జవాబు:
మరి + ఒక

103. ఒక్కొక్కసారి తప్పు చేస్తాం.
జవాబు:
ఒక్క + ఒక్క

104. మొన్న ఒక మాంత్రికురాలుని చూశాను.
జవాబు:
మాంత్రిక + ఆలు

105. కష్టపడి చదవాలి.
జవాబు:
కష్టము + పడి

AP 10th Class Telugu 8th Lesson Important Questions జీవని

106. పరీక్ష సమయాన పనులు పెట్టుకోకూడదు.
జవాబు:
సమయము + న

సంధి పదాలను కలవడం

సంధి పదాలను కలిపి రాయండి.

107. కుటుంబము + అంతా
జవాబు:
కుటుంబమంతా

108. తగిలిన + అంత
జవాబు:
తగిలినంత

109. నిముషము + లు
జవాబు:
నిముషాలు

110. పైకి + ఎత్తి
జవాబు:
పైకెత్తి

సంధి నామాలు

గీత గీసిన పదం ఏ సంధికి చెందినదో గుర్తించండి.

111. కష్టపడి పనిచేయాలి.
ఆ) ఉత్వసంధి
అ) పడ్వాది సంధి
ఇ) ఇత్వసంధి
ఈ) అత్వసంధి
జవాబు:
అ) పడ్వాది సంధి

112. గొప్ప సైనికురాలు గృహిణే.
అ) లు,ల,న,ల సంధి
ఆ) రుగాగమ సంధి
ఇ) విసర్గ సంధి
ఈ) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
ఆ) రుగాగమ సంధి

113. నిరాశ పనికిరాదు.
అ) రుగాగమ సంధి
ఆ) అత్వసంధి
ఇ) సవర్ణదీర్ఘ సంధి
ఈ) విసర్గసంధి
జవాబు:
ఈ) విసర్గసంధి

114. పైకెత్తి పడేశారు.
అ) అత్వసంధి
ఆ) ఇత్వసంధి
ఇ) ఉత్వసంధి
ఈ) గుణసంధి
జవాబు:
ఆ) ఇత్వసంధి

AP 10th Class Telugu 8th Lesson Important Questions జీవని

115. అద్భుతాలు జరుగుతాయి.
అ) లు,ల,న,ల సంధి
ఆ) సవర్ణదీర్ఘ సంధి
ఇ) అత్వసంధి
ఈ) ఉత్వసంధి.
జవాబు:
అ) లు,ల,న,ల సంధి

విగ్రహవాక్యాలు

గీత గీసిన పదానికి విగ్రహవాక్యం రాయండి.

116. సూర్య కిరణాలు చాలా వేడిగా ఉన్నాయి.
జవాబు:
సూర్యుని యొక్క కిరణాలు

117. విద్యార్థులు ఆత్మస్థైర్యం పెంచుకోవాలి.
జవాబు:
ఆత్మ యందు స్థైర్యం

118. మూడునెలలు వానాకాలం సాగుతోంది.
జవాబు:
మూడు సంఖ్య గల నెలలు.

119. ఆమె స్నిగ్ధహాసం బాగుంది.
జవాబు:
స్నిగ్ధమైన హాసం

120. జీవితంలో ఆశనిరాశలు తప్పవు.
జవాబు:
ఆశయును, నిరాశయును

121. విద్యే ఒక అమృతభాండం అని మరువవద్దు.
జవాబు:
అమృతంతో భాండం

122. అతని మాట మృదు మధురంగా ఉంది.
జవాబు:
మృదువును, మధురమును

123. స్పర్గలోకం పుణ్యాత్ముల నిలయం.
జవాబు:
స్వర్గమను పేరుగల లోకం

124. విద్యార్థులలో గురువు జ్ఞానదీపం వెలిగిస్తాడు.
జవాబు:
జ్ఞానమనెడి దీపం

125. భరతమాత కీర్తి అపూర్వం.
జవాబు:
పూర్వం కానిది.

సమాన నామాలు

గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.

126. నా ఆనందం ఈ రోజు మా అమ్మతో పంచుకొన్నాను.
అ) ప్రథమా తత్పురుష
ఆ) ద్వితీయా తత్పురుష
ఇ) చతుర్థీ తత్పురుష
ఈ) షష్ఠీ తత్పురుష
జవాబు:
ఈ) షష్ఠీ తత్పురుష

127. బిడ్డను కనడానికి ప్రతి తల్లీ ప్రసవ యాతన పడుతుంది.
అ) సప్తమీ తత్పురుష
ఆ) పంచమీ తత్పురుష
ఇ) షష్ఠీ తత్పురుష
ఈ) నఞ్ తత్పురుష
జవాబు:
అ) సప్తమీ తత్పురుష

128. ఎవ్వరికైనా సహాయసహకారాలు అందించాలి.
అ) ద్విగువు
ఆ) ద్వంద్వం
ఇ) నఞ్ తత్పురుష
ఈ) హువ్రీహి
జవాబు:
ఆ) ద్వంద్వం

129. సాహసకృత్యాలు చేయడానికి శిక్షణ ఉండాలి.
అ) ద్విగువు
ఆ) షష్ఠీ తత్పురుష
ఇ) విశేషణ పూర్వపద కర్మధారయం
ఈ) ద్వంద్వం
జవాబు:
ఇ) విశేషణ పూర్వపద కర్మధారయం

130. కంటిలో నీటిపొర ఏర్పడింది.
అ) తృతీయా తత్పురుష
ఆ) ద్వితీయా తత్పురుష
ఇ) బహువ్రీహి
ఈ) ద్విగువు
జవాబు:
అ) తృతీయా తత్పురుష

131. భారతదేశం అన్నింటిలోనూ ప్రపంచానికి ఆదర్శం.
అ) విశేషణ పూర్వపద కర్మధారయం
ఆ) షస్ట్రీ తత్పురుష
ఇ) సంభావనా పూర్వపద కర్మధారయం
ఈ) పంచమీ తత్పురుష
జవాబు:
ఇ) సంభావనా పూర్వపద కర్మధారయం

132. శాస్త్రవేత్త పరిశోధనలలో ఉంటాడు.
అ) ద్వితీయా తత్పురుష
ఆ) ప్రథమా తత్పురుష
ఇ) షష్ఠీ తత్పురుష
ఈ) బహువ్రీహి
జవాబు:
అ) ద్వితీయా తత్పురుష

133. ఆలోచిస్తే ఏదీ అనూహ్యం కాదు.
అ) చతుర్థీ తత్పురుష
ఆ) నఞ్ తత్పురుష
ఇ) ప్రథమా తత్పురుష
ఈ) సప్తమీ తత్పురుష
జవాబు:
ఆ) నఞ్ తత్పురుష

134. పది రూపాయిలు సంపాదించలేరు కానీ పొగరు ఎక్కువ.
అ) ద్విగువు
ఆ) ద్వంద్వం
ఇ) షష్ఠీ తత్పురుష
ఈ) పంచమీ తత్పురుష
జవాబు:
అ) ద్విగువు

AP 10th Class Telugu 8th Lesson Important Questions జీవని

135. కొందరి రూపురేఖలు బాగున్నా గుణాలు బాగోవు.
అ) ద్విగువు
ఆ) షష్ఠీ తత్పురుష
ఇ) ద్వంద్వం
ఈ) బహువ్రీహి
జవాబు:
ఇ) ద్వంద్వం

ఆధునిక వచనాలు

ఈ వాక్యానికి సరియైన ఆధునిక వచనాన్ని గుర్తించండి.

136. వీళ్లకేమి అధికారమునున్నది?
అ) వీళ్లకేం అధికారం ఉంది?
ఆ) వీళ్లకేమిటధికారంబున్నది?
ఇ) వీళ్లకునేమి యధికారమున్నది?
ఈ) వీళ్లకేయధికారమున్నది?
జవాబు:
అ) వీళ్లకేం అధికారం ఉంది?

137. దేవుడిని దీనముగా వేడుకొనియున్నాను.
అ) దేవునిని దీనమ్ముగా వేడుకొనియుంటిని.
ఆ) దేవుని దీనంబుగ వేడుకొంటిని.
ఇ) దేవుణ్ణి దీనంగా వేడుకొన్నా
ఈ) దేవుని దీనమ్ముగ వేడుకొని యున్నాను.
జవాబు:
ఇ) దేవుణ్ణి దీనంగా వేడుకొన్నా.

138. నెలలు నిండినవి.
అ) నెలలు నిండియున్నవి.
ఆ) నెలలు నిండి యుండెను.
ఇ) నెలలు నిండెను.
ఈ) నెలలు నిండాయి.
జవాబు:
ఈ) నెలలు నిండాయి.

139. శరీరము వీణవలె మారినది.
అ) శరీరంబు వీణవోలె మారినది.
ఆ) శరీరం వీణలా మారింది.
ఇ) శరీరమ్ము వీణవలె మారినది.
ఈ) శరీరము వీణ పోల్కి మారెను.
జవాబు:
ఆ) శరీరం వీణలా మారింది.

140. నిద్ర నటించుచున్నది.
అ) నిద్ర నటియించుచున్నది.
ఆ) నిద్ర నటియించునున్నది.
ఇ) నిద్ర నటిస్తోంది.
ఈ) నిద్ర నటియిస్తున్నది.
జవాబు:
ఇ) నిద్ర నటిస్తోంది.

141. మొదటి ఆకలిని దీర్చితిని.
అ) మొదటి ఆకలి తీర్చాను.
ఆ) మొదటి యాకలి దీర్చితిన్.
ఇ) మొదటి యాకలిని తీర్చితిని.
ఈ) మొదటి యాకలిని తీర్చియున్నాను.
జవాబు:
అ) మొదటి ఆకలి తీర్చాను.

142. ఇంకనూ పది నిముషములు కాలేదు.
అ) ఇంకను బది నిముషములు కాలేదు.
ఆ) ఇంకా పది నిమిషాలు కాలేదు.
ఇ) ఇంకనున్ బది నిముషమ్ములు కాలేదు.
ఈ) ఇంకా పది నిముషంబులు కాలేదు.
జవాబు:
ఆ) ఇంకా పది నిమిషాలు కాలేదు.

143. వెళ్లుటకు అనుమతినిచ్చిరి.
అ) వెళ్లుటకు ననుమతినిచ్చిది.
ఆ) వెళ్లడానికి అనుమతిచ్చారు.
ఇ) వెళ్లుటకు అనుమతించిరి.
ఈ) వెళ్లుటకు అనుమతించియుంటిరి.
జవాబు:
ఆ) వెళ్లడానికి అనుమతిచ్చారు.

144. పాపను అక్కడ చేర్చుడము.
అ) పాపను నక్కడ చేర్చెదము.
ఆ) పాప నక్కడ జేర్చెదము.
ఇ) పాప నక్కడ జేర్చి యుందము.
ఈ) పాప నక్కడ చేరుద్దాం.
జవాబు:
ఈ) పాప నక్కడ చేరుద్దాం.

AP 10th Class Telugu 8th Lesson Important Questions జీవని

145. పాప నా ప్రాణము.
అ) పాప నా ప్రాణంబు
ఆ) పాప నా ప్రాణము
ఇ) పాప నా ప్రాణం
ఈ) పాప నా ప్రాణమున్
జవాబు:
ఇ) పాప నా ప్రాణం

వ్యతిరేకార్థక వాక్యాలు

ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం రాయండి.

146. అదుగులు వేస్తోంది.
జవాబు:
అడుగులు వేయడం లేదు.

147. మాట్లాడగలదు.
జవాబు:
మాట్లాడలేదు.

148. నీలం గౌనులు ధరిస్తున్నారు.
జవాబు:
నీలం గౌనులు ధరించుట లేదు.

149. అవి శుభాకాంక్షలేమో?
జవాబు:
అవి శుభాకాంక్షలు కావేమో?

150. చేతులూపింది.
జవాబు:
చేతులూపలేదు.

151. గేటు తాళం వేసి వెళుతుంటాను.
జవాబు:
గేటు తాళం వేసి వెళుతుండను.

152. వ్యతిరేక ఆలోచనలు ఉండవు.
జవాబు:
వ్యతిరేక ఆలోచనలు ఉంటాయి.

153. బాహువులలోకి తీసుకొన్నారు.
జవాబు:
బాహువులలోకి తీసుకోలేదు.

154. జీవనిని పాఠశాలలో చేర్చాము.
జవాబు:
జీవనిని పాఠశాలలో చేర్చలేదు.

155. కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.
జవాబు:
కళ్ళలో నీళ్లు తిరగడం లేదు.

వ్యతిరేకార్థక క్రియలు

కింది క్రియా పదాలలో వ్యతిరేకార్థక క్రియను గుర్తించండి.

156. అ) చెయ్యి
ఆ) చెయ్యకు
ఇ) చేస్తే
ఈ) చేస్తూ
జవాబు:
ఆ) చెయ్యకు.

157. అ) కంపించక
ఆ) కంపించి
ఇ) కంపిస్తూ
ఈ) కంపిస్తే
జవాబు:
అ) కంపించక

158. అ) అనిపించి
ఆ) అనిపిస్తే
ఇ) అనిపించక
ఈ) అనిపిస్తూ
జవాబు:
ఇ) అనిపించక

159. అ) చేరి
ఆ) చేరితే
ఇ) చేరుతూ
ఈ) చేరక
జవాబు:
ఈ) చేరక

160. అ) జీవించక
ఆ) జీవించి
ఇ) జీవిస్తే
ఈ) జీవిస్తూ
జవాబు:
అ) జీవించక

161. ఆ) పెట్టి
ఆ) పెడితే
ఇ) పెట్టక
ఈ) పెడుతూ
జవాబు:
ఇ) పెట్టక

162. అ) తిరస్కరించి
ఆ) తిరస్కరించక
ఇ) తిరస్కరిస్తే
ఈ) తిరస్కరిస్తూ
జవాబు:
ఆ) తిరస్కరించక

163. అ) పూజించి
ఆ) పూజిస్తే
ఇ) పూజిస్తూ
ఈ) పూజించక
జవాబు:
ఈ) పూజించక

164. అ) నచ్చి
ఆ) నచ్చక
ఇ) నచ్చితే
ఈ) నచ్చుతూ
జవాబు:
ఆ) నచ్చక

AP 10th Class Telugu 8th Lesson Important Questions జీవని

165. అ) అరవక
ఆ) అరుస్తూ
ఇ) అరిస్తే
ఈ) అరుస్తా
జవాబు:
అ) అరవక

సంక్లిష్ట వాక్యాలు

ఇవి ఏ రకమైన సంక్లిష్టవాక్యాలో రాయండి.

166. జీవనిని పెంచి పెద్దచేసింది.
జవాబు:
క్వార్థకం

167. తీర్చిదిద్దితే జీవని మంచి బొమ్మ వేసింది.
జవాబు:
చేదార్థకం

168. భర్త చూడకున్నా పట్టించుకోలేదు.
జవాబు:
అప్యర్ధకం

169. జీవనిని తీర్చిదిద్దుతూ తల్లి ఆనందించింది.
జవాబు:
శత్రర్థకం

170. జీవని కథ చెప్పి స్ఫూర్తి కల్గించారు.
జవాబు:
క్వార్థకం

కర్మణి వాక్యాలు

సరియైన కర్మణి వాక్యాన్ని గుర్తించండి.

171. జీవనిని లలిత తీర్చిదిద్దింది.
అ) లలిత చేత జీవని తీర్చిదిద్దబడింది.
అ) జీవని లలిత చేత తీర్చిదిద్దబడును.
ఇ) లలిత చేత జీవని తీర్చిదిద్దబడుతోంది.
ఈ)లలిత చేత జీవని తీర్చిదిద్దబడగలదు.
జవాబు:
అ) లలిత చేత జీవని తీర్చిదిద్దబడింది.

172. జీవని చేతులూపింది.
అ) చేతులు జీవని చేత ఊపబడును.
ఆ) జీవని చేత చేతులూపబడ్డాయి.
ఇ) జీవని చేతుల చేత ఊపబడింది.
ఈ) జీవనిని చేతులూపాయి.
జవాబు:
ఆ) జీవని చేత చేతులూ పబడ్డాయి.

173. ఆమె స్ఫూర్తి పొందుతోంది.
అ) ఆమె చేత స్ఫూర్తి పొందబడును.
ఆ) ఆమె చేత స్ఫూర్తి పొందబడింది.
ఇ) ఆమె చేత స్ఫూర్తి పొందబడగలదు.
ఈ) ఆమె చేత స్ఫూర్తి పొందబడుతోంది.
జవాబు:
ఈ) ఆమె చేత స్ఫూర్తి పొందబడుతోంది.

174. విశ్వనాథం గారు సూచనలు ఇవ్వగలరు.
అ) విశ్వనాథం గారి చేత సూచనలు ఇవ్వబడగలవు.
ఆ) విశ్వనాథం గారి చేత సూచనలు ఇవ్వబడును.
ఇ) విశ్వనాథం గారి చేత సూచనలు ఇవ్వబడతాయి.
ఈ) విశ్వనాథం గారి చేత సూచనలు ఇవ్వబడవు.
జవాబు:
అ) విశ్వనాథం గారి చేత సూచనలు ఇవ్వబడగలవు.

175. తల్లి జీవనిని పెంచింది.
అ) జీవని చేత తల్లి పెంచబడింది.
ఆ) తల్లి చేత జీవని పెంచబడింది.
ఇ) జీవని చేత తల్లి పెంచబడును.
ఈ) తల్లి చేత జీవని పెంచబడును.
జవాబు:
ఆ) తల్లి చేత జీవని పెంచబడింది.

176. గారడీ అమ్మాయి స్ఫూర్తినిచ్చింది.
అ) గారడీ అమ్మాయి స్ఫూర్తి చేత ఇవ్వబడింది.
ఆ) స్ఫూర్తి గారడీ అమ్మాయి చేత ఇవ్వబడును.
ఇ) స్పూర్తి గారడీ అమ్మాయి చేత ఇవ్వబడింది.
ఈ) స్ఫూర్తి చేత అమ్మాయి ఇచ్చింది.
జవాబు:
ఇ) స్ఫూర్తి గారడీ అమ్మాయి చేత ఇవ్వబడింది.

177. జీవని చేతులు చాపుతోంది.
అ) చేతులు జీవని చేత చాపబడ్డాయి.
ఆ) జీవని చేత చేతులు చాపబడుతున్నాయి.
ఇ) జీవని చేత చేతులు చాపబడును.
ఈ) చేతులు చేత జీవని చాపబడుతోంది.
జవాబు:
అ) జీవని చేత చేతులు చాపబడుతున్నాయి.

178. ఆమెను బయటకు పిలిచారు.
అ) ఆమె బయటకు పిలవబడింది.
ఆ) ఆమె చేత బయటకు పిలవబడ్డారు.
ఇ) ఆమె చేత బయటకు పిలవబడుతుంది.
ఈ) ఆమె బయటచే పిలవబడింది.
జవాబు:
అ) ఆమె బయటకు పిలవబడింది.

179. ఆమె గురువును అర్థించింది.
అ) గురువు చేత ఆమె అర్థించబడింది.
ఆ) ఆమె చేత గురువు అర్థించబడ్డాడు.
ఇ) గురువు చేత ఆమె అర్థించబడును.
ఈ) ఆమె చేత గురువు అర్థించబడును.
జవాబు:
ఆ) ఆమె చేత గురువు అర్ధించబడ్డాడు.

AP 10th Class Telugu 8th Lesson Important Questions జీవని

180. ఆమె తాళం వేస్తోంది.
అ) ఆమె చేత తాళం వేయబడును.
ఆ) తాళం చేత ఆమె వేయబడును.
ఇ) ఆమె చేత తాళం వేయబడింది.
ఈ) ఆమె చేత తాళం వేయబడుతోంది.
జవాబు:
ఈ) ఆమె చేత తాళం వేయబడుతోంది.

వాక్య రకాలు

ఇవి ఏ రకమైన సామాన్య వాక్యాలో రాయండి.

18. ఆసుపత్రికి లలితతో ఎవరొచ్చారు?
జవాబు:
ప్రశ్నార్ధకం

182. ఆహా! అమ్మ బొమ్మ ఎంత బాగుందో!
జవాబు:
ఆశ్చర్యార్థకం

183. జీవనికి మాటలు వస్తాయో! రావో!
జవాబు:
సందేహార్ధకం

184. దయచేసి జీవని వంటి వారిని ప్రోత్సహించండి.
జవాబు:
ప్రార్ధనార్థకం

185. లలిత వంటివారు దేనినైనా సాధించగలరు.
జవాబు:
సామర్థ్యార్థకం

186. ప్రత్యేక అవసరాలు గలవారికి సహాయం చేయండి.
జవాబు:
విధ్యర్థకం

187. జీవని తండ్రి వంటి వారిని సమర్థించవద్దు.
జవాబు:
నిషేధార్ధకం

188. మీరుకూడా బొమ్మలు వేయవచ్చు.
జవాబు:
అనుమత్యర్థకం

189. సాధన చేసింది కనుక మంచి బొమ్మ వేసింది.
జవాబు:
హేత్వర్థకం

190. అమ్మా! జీవనీ! కలకాలం ఆయురారోగ్యాలతో వర్ధిల్లు.
జవాబు:
ఆశీరార్థకం

వాక్య రకాలు

ఇవి ఏ రకమైన సామాన్య వాక్యాలో గుర్తించండి.

191. వీళ్లకేం అధికారం ఉంది?
అ) ఆశ్చర్యార్థకం
ఆ) సందేహార్థకం
ఇ) ప్రశ్నార్థకం
ఈ) విధ్యర్థకం
జవాబు:
ఇ) ప్రశ్నార్థకం

192. విశ్వనాథంగారి సలహాలతో లలితకు ధైర్యం వచ్చింది.
అ) ప్రేరణార్థకం
ఆ) విధ్యర్థకం
ఇ) నిశ్చయార్థకం
ఈ) సామర్థ్యార్థకం
జవాబు:
అ) ప్రేరణార్థకం

193. తనకు తానే ధైర్యం చెప్పుకొంది.
అ) నిశ్చయార్థకం
ఆ) ప్రేరణార్థకం
ఇ) ఆశ్చర్యార్థకం
ఈ) ఆత్మార్థకం
జవాబు:
ఈ) ఆత్మార్థకం

194. లలిత తప్పక జీవనిని తీర్చిదిద్దాలనుకొంది.
అ) నిశ్చయార్థకం
ఆ) విధ్యర్థకం
ఇ) ఆశీరార్థకం
ఈ) సామర్థ్యార్థకం
జవాబు:
అ) నిశ్చయార్థకం

195. దయచేసి లలిత కల సఫలం చేయి దేవా!
అ) సామర్థ్యార్థకం
ఆ) ప్రార్థనార్థకం
ఇ) సందేహార్థకం
ఈ) అనుమత్యర్థకం
జవాబు:
ఆ) ప్రార్థనార్థకం

196. ఎన్ని రోజులు అయినా వాన తగ్గుతుందో! తగ్గదో!
అ) ప్రశ్నార్థకం
ఆ) సందేహార్థకం
ఇ) విధ్యర్థకం
ఈ) ఆశ్చర్యార్థకం
జవాబు:
ఆ) సందేహార్ధకం

197. పల్లెల్లో సుఖపడవచ్చు.
అ) ప్రశ్నార్థకం
ఆ) ఆశీరార్థకం
ఇ) విధ్యర్ధకం
ఈ) అనుమత్యర్థకం
జవాబు:
ఈ) అనుమత్యర్థకం

198. దీర్ఘసుమంగళీ భవ!
అ) ఆశీరార్థకం
ఆ) విధ్యర్థకం
ఇ) అనుమత్యర్థకం
ఈ) సందేహార్థకం
జవాబు:
అ) ఆశీరార్థకం

AP 10th Class Telugu 8th Lesson Important Questions జీవని

199. మీరు వెళ్లాలా?
అ) ఆశీరార్థకం
ఆ) ఆత్మార్థకం
ఇ) ప్రశ్నార్థకం
ఈ) విధ్యర్థకం
జవాబు:
ప్రశ్నార్థకం

200. ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలం.
అ) ఆశీరార్థకం
ఆ) విధ్యర్థకం
ఇ) అప్యర్థకం
ఈ) సామర్థ్యార్థకం
జవాబు:
ఈ) సామర్థ్యార్థకం

Leave a Comment