AP 10th Class Telugu 7th Lesson Questions and Answers చేజారిన బాల్యం

Access to the AP 10th Class Telugu Guide 7th Lesson చేజారిన బాల్యం Questions and Answers are aligned with the curriculum standards.

చేజారిన బాల్యం AP 10th Class Telugu 7th Lesson Questions and Answers

చదవండి ఆలోచించి చెప్పండి.

ప్రతి శిశువూ కొన్ని సహజ వారసత్వ లక్షణాలతో ఒక నిర్దిష్ట సాంఘిక ఆర్థిక భావావేశ వాతావరణంలో జన్మిస్తాడు. ఆ పైన అధికారిక శక్తులూ సంస్థలూ అతన్ని తమకి అనుగుణంగా తయారు చేసుకుంటాయి. నేను నా తండ్రి నుంచి నిజాయితీనీ, ఆత్మక్రమశిక్షణనీ అందిపుచ్చుకున్నాను. మా అమ్మ నుంచి మంచితనంలో నమ్మకాన్నీ, సానుభూతీనీ అందుకున్నాను. నాతో పాటే నా ముగ్గురు సోదరులూ, నా సోదరీను.

కానీ జలాలుద్దీన్, షంషుద్దీన్‌లతో నేను గడిపిన సమయమే నా బాల్యంలోని అద్వితీయతకూ, నా తదనంతర జీవితంలోని మార్పుకీ కారణమనాలి. జలాలుద్దీన్లో, షంషుద్దీన్లో కనవచ్చిన సహజాత ప్రజ్ఞ ఏ పాఠశాలల్లోనూ ఏ తర్ఫీదు వల్లా పొందలేని వివేకం. అది భాషకి అతీతంగా ప్రపంచం పట్ల స్పందించగల నేర్పు. అనంతరకాలంలో, నా జీవితంలో ప్రకటితమైన సృజనాత్మకతకి నా బాల్యం వారి సాహచర్యంలో గడవడమే కారణమని నిస్సంకోచంగా’ చెప్పగలను. – ఒక విజేత ఆత్మకథ

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
అబ్దుల్ కలాం తండ్రి మంచి అంది పుచ్చుకున్నదేమిటి?
జవాబు:
కలామ్ తన తండ్రి నుండి నిజాయితీని, ఆత్మ క్రమశిక్షణనీ అందిపుచ్చుకొన్నాడు.

ప్రశ్న 2.
అబ్దుల్ కలాం బాల్యంలో తల్లి మంచి అందుకున్నదేమిటి?
జవాబు:
కలామ్ తన తల్లి నుండి మంచితనంలో నమ్మకాన్నీ, సానుభూతినీ అందుకొన్నాడు.

AP 10th Class Telugu 7th Lesson Questions and Answers చేజారిన బాల్యం

ప్రశ్న 3.
బాల్యంలో ఎవరితో గడిపిన సమయం తన జీవితంలోని మార్పుకి కారణమని కలాం పేర్కొన్నాడు ?
జవాబు:
తన బాల్యంలో జలాలుద్దీన్, షంషుద్దీన్‌లతో తాను గడిపిన సమయమే తన జీవితంలోని మార్పుకి కారణమని కలాం పేర్కొన్నాడు.

ఇవి చేయండి

అవగాహన – ప్రతిస్పందన

ఆ) కింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. రాయండి.

ప్రశ్న 1.
వీర్రాజుకు బాల్యం ఎప్పుడు గుర్తొస్తుంది?
జవాబు:
తను రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడో, సాయంత్రం వర్షం వస్తుంటే ఊళ్లోకి వెళ్లలేక గదిలో కూర్చొని, కిటికీలోంచి వెనక వీథిలోకి చూస్తున్నప్పుడో, పుట్టినరోజు నాడో వీర్రాజుకు తప్పనిసరిగా బాల్యం గుర్తుకు వస్తుంది.

ప్రశ్న 2.
రామ్మూర్తి మాస్టారి గురించి చెప్పండి.
జవాబు:
రామ్మూర్తి మాష్టారు వృద్ధులు, వీర్రాజు గారి ఇంటికి వెనుక వీధిలో ఉండేవారు. ప్రయివేట్లు చెప్పేవారు. సుమారు ఇరవైమంది ప్రయివేటు పిల్లలు ఉండేవారు. కేవలం చదువే కాక ఇతర విషయాలు కూడా చెప్పేవారు. శతక పద్యాలు కూడా చెప్పేవారు. పెద్ద బాలశిక్ష చదివించేవారు, ఎక్కాలు చదివించేవారు, పంచతంత్ర కథల వంటి జంతువుల కథలు కూడా చెప్పేవారు.

ప్రశ్న 3.
మాస్టారు బొమ్మలు వెయ్యమన్నప్పుడు వీర్రాజు ఏయే బొమ్మలు వేశాడు?
జవాబు:
మాస్టారు బొమ్మలు వెయ్యమన్నప్పుడు వీర్రాజు “విమానం బొమ్మ, ఇల్లు బొమ్మ, కిరసనాయిలు బుడ్డి దీపం బొమ్మ” వేశాడు.

ప్రశ్న 4.
వీర్రాజుకు కళాఖండాల సేకరణ పట్ల అభిరుచి ఎలా కలిగింది?
జవాబు:
వీర్రాజు గారికి కళాఖండాల పట్ల సేకరణ పట్ల చాలా అభిరుచి కలిగింది. వీర్రాజు గారి పెదనాన్న గారి అమ్మాయి గది బాగుండేది. ఆ గది నిండా బొమ్మలే ఉండేవి. అవి ప్లాస్టిక్కుని, చెక్కవి, ఇత్తడివి, గాజువి, పింగాణివి. చిన్న చిన్న ఆటబొమ్మలు గది గోడల మీద పెట్టెల మీద ఉండేవి. కొంచెం ఖాళీ కూడా ఆ గదిలో ఉండేది కాదు. పిల్లల్ని ఆ గదిలోకి రానిచ్చేవారు కాదు. కిటికీ లోంచి కానీ, తలుపు రెక్కల సందులోంచి కానీ ఆ బొమ్మలను చిన్నతనంలో వీర్రాజుగారు చూసేవారు. ఆ ఆసక్తే కాలక్రమేణా ఆయనకు కళాఖండాల సేకరణ పట్ల అభిరుచి కలగడానికి కారణమయింది.

ఆ) కింది గద్యాన్ని చదివి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

AP 10th Class Telugu 7th Lesson Questions and Answers చేజారిన బాల్యం 1
నేను స్కూల్ వర్క్ ఎందుకు చేస్తున్నానో చాలా కాలం నుంచి నాకు తెలియదు. యుద్ధం ఆగడం కనుచూపుమేరలో ఎక్కడా కనిపించడం లేదు. సెప్టెంబర్ లో గాని యుద్ధం ఆపకపోతే నేను రెండేళ్లు వెనకబడాల్సి వస్తుంది. నేను స్కూల్ వర్క్ కొనసాగించాలని, జర్నలిస్ట్ కావాలని నిర్ణయించుకొన్నాను. నేను రాయగలనని నాకు తెలుసు. నావి కొన్ని కథలు బాగున్నాయి. నా డైరీ ఎక్కువగా జీవితానికి దగ్గరగా ఉంది. కానీ నాకు నిజంగా సృజన ఉందో లేదో చూడాలి. ఈ వాస్ డ్రీమ్ అనేది నా మొదటి జానపద కథ. బాగుంది కానీ మొత్తం మీద అదేమంత గొప్పది కాదు. నాకు నేనే మంచి విమర్శకురాలిని. ఏది బాగుందో ఏది బాగుండలేదో నాకు తెలుసు, నువ్వు రాస్తే తప్ప రాయడంలో ఉన్న ఆనందం, సంతోషం ఎంత బాగుంటుందో నీకు అర్ధం కాదు. నేను బొమ్మలు వేయలేనని ఎప్పుడూ బాధపడేదాన్ని, కానీ ఇప్పుడు రాయగలనన్న సంతోషం ఎంతో ఉంది.

ఒకవేళ నాకు పుస్తకాలు రాయడానికి, పేపర్లో వ్యాసాలు రాయడానికి తగిన శక్తి లేకపోతే నాకోసం రాసుకుంటాను. కానీ అంతకంటే ఎక్కువ సాధించాలని నా కోరిక. చాలామందిలాగా వృథాగా బతకడం నాకు ఇష్టం లేదు. నేను అందరికీ ఉపయోగపడాలి. నేను ఇప్పుడు వాళ్లను కలుసుకోలేకపోయినా సరే…… నేను నా చావు తర్వాత కూడా బతకాలి. అందుకే నేను ఈ బహుమతి ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతగా ఉంటాను. నేను రాస్తున్నప్పుడు నా గురించి అన్నీ దులిపేసుకుంటాను. నాకు విచారం పోతుంది. నాకు ధైర్యం వస్తుంది. కానీ ఒకటే పెద్ద ప్రశ్న. నేను ఎప్పటికైనా ఒక గొప్ప రచన చేయగలనా? జర్నలిస్ట్ కాని, రచయిత గాని అవగలనా? నేను అలాగే ఆశిస్తాను. నా ఆలోచనల్ని, ఆదర్శాల్ని రాత రూపంలో పెట్టగలను.

(రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలు యూదుల్ని తుదముట్టిస్తున్నప్పుడు 14 ఏళ్ల అన్నా ఫ్రాంక్ కుటుంబం రహస్య జీవితం గడపాల్సి వచ్చింది. గాలి, వెలుతురు సరిగ్గా లేని ఒక ఇరుకు గదిలో వాళ్లు గడిపారు. ఆ కాలంలో 1942-44 వరకు ఆమె రాసుకున్న డైరీ ప్రపంచ ప్రసిద్ధి చెందింది). – అన్నా ఫ్రాంక్ డైరీ 1944 ఏప్రిల్ 5 నుంచి

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
ఫ్రాంక్ కోరిక ఏమిటి?
జవాబు:
జర్నలిస్టు కావాలనేది ఫ్రాంక్ కోరిక.

AP 10th Class Telugu 7th Lesson Questions and Answers చేజారిన బాల్యం

ప్రశ్న 2.
ఫ్రాంక్ రాసిన కథ పేరు ఏమిటి?
జవాబు:
ఈవాస్ డ్రీమ్ అనే ఫ్రాంక్ రాసిన కథ.

ప్రశ్న 3.
ఫ్రాంక్ ఎలా బతకాలని నిర్ణయించుకుంది?
జవాబు:
అందరికీ ఉపయోగపడేలా బతకాలని ప్రాంక్ నిర్ణయించుకొంది.

ప్రశ్న 4.
గద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
ఫ్రాంక్ కు ఇష్టం లేనిది ఏమిటి?

ఇ) కింది గద్యాన్ని చదివి, జవాబులు రాయండి.

AP 10th Class Telugu 7th Lesson Questions and Answers చేజారిన బాల్యం 2
మా నాన్నని తలుచుకోగానే నా కళ్ళ ముందుకు వచ్చే దృశ్యం కలం, కాగితాలు పట్టుకొని ఆయన ఎప్పుడూ రాసుకుంటూ ఉండడం. మేము కొంచెం పెద్దయ్యాక ఆయన మాకు రాత్రిళ్ళు ఆకాశంలో నక్షత్రాలని, గ్రహాలను చూపించి వాటి పేర్లు చెప్పేవాళ్ళు. ఒక చిన్న సైజు టెలిస్కోపును కూడా ఆయన ఇంట్లోనే తయారు చేశారు. సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు ఎలా ఏర్పడతాయో నా చిన్నతనంలోనే వివరించారు. మా ఇంట్లో ఇంగ్లీషు అమెరికన్, రష్యన్ రచయితల ప్రసిద్ధ గ్రంథాలు ఉండేవి. ఖగోళశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు, మానవ పరిణామం గురించిన పుస్తకాలు, ఈజిప్ట్ మాయా నాగరికత గురించిన పుస్తకాలు అన్ని మాకు అందుబాటులో ఉండేవి. వాటిని చదివే వాళ్ళం.

చీమల గురించి, లిపి పుట్టుపూర్వోత్తరాల గురించి ఎన్ని వందలసార్లు చదివామో లెక్కేలేదు. ఎప్పుడైనా ఫలానా పుస్తకం చదివావా? అని అడిగేవారు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేసే విషయం ఏమిటంటే ‘నాన్న’ ఈ పని చెయ్యి ఇది చదువు అని ఎన్నడూ మాతో అనలేదు. ముఖ్యంగా పదహారేళ్లు వచ్చాక ఏదైనా చెప్పాలంటే సూచించేవారు తప్ప ఎప్పుడూ ఏదీ బలవంతానా మాచేత చేయించలేదు. ఆయన నుంచి నేను నేర్చుకున్న ముఖ్యమైన విషయాలలో ఇది 1 కూడా ఒకటి. ఎప్పుడూ ఎవరిమీదా మన అభిప్రాయాన్ని రుద్దకూడదు. బలవంతంగా రుద్దడం వల్ల తాత్కాలిక ఫలితాలు ఉంటాయేమో కానీ పిల్లల వ్యక్తిత్వాలు సమగ్రతను సాధించలేవని తండ్రి కొడవటిగంటి కుటుంబరావు గురించి శాంతా సుందరి చెప్పారు. – ద్వా.నా. శాస్త్రి (సంకలనం చేసిన “మా నాన్నగారు” గ్రంథం నుంచి)

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
తండ్రిని తలుచుకోగానే శాంతా సుందరికి కనిపించే దృశ్యం ఏమిటి?
జవాబు:
తండ్రిని తలుచుకోగానే శాంతా సుందరి కళ్ల ముందు కలం, కాగితాలు పట్టుకొని ఆయన ఎప్పుడూ రాసుకుంటూ ఉన్న దృశ్యమే కనిపించేది.

ప్రశ్న 2.
శాంతా సుందరికి చిన్నప్పుడు తండ్రి ఏమి వివరించేవాడు?
జవాబు:
సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు ఎలా ఏర్పడతాయో శాంతాసుందరికి చిన్నతనంలోనే ఆమె తండ్రి వివరించారు.

ప్రశ్న 3.
తండ్రి నుండి శాంతా సుందరి ఏం నేర్చుకుంది?
జవాబు:
పదహారేళ్ల పిల్లలకు ఏదైనా చెప్పాలంటే సూచించాలి తప్ప ఎప్పుడూ ఏదీ బలవంతాన వారిచేత చేయించకూడదు. అనేది శాంతాసుందరి తండ్రి నుండి చేర్చుకొంది.

ప్రశ్న 4.
పై గద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
శాంతాకుమార్కితండ్రి గారి పేరేమిటి?

ఈ) కింది వాక్యాలకు అర్థ సందర్భములు రాయండి.

ప్రశ్న 1.
మాటిమాటికీ మారాం చేయడానికి నువ్వింకా చిన్నపిల్లాడివేననుకుంటున్నావా?
జవాబు:
అర్ధం : మళ్ళీమళ్ళీ నువ్వు ఆ విధంగా గారాబం (మొండి పట్టుదల) చేయడానికి నీవింకా చిన్నపిల్లవాడి వనుకుంటున్నావా అని అర్థం.
సందర్భం: తన బాల్యం గురించి ఆలోచిస్తూ మరాం చేస్తున్న సందర్భంలో తండ్రి కోప్పడిన సందర్భంలో తండ్రి రచయితతో పలికిన వాక్యమిది.

ప్రశ్న 2.
ఎంత అమాయకమైన రోజులవి.
జవాబు:
అర్ధం: బాల్యపురోజులు ఎటువంటి మాయలేనివి కదా అని అర్థం.
సందర్భం : రచయిత తన బాల్యం అయిపోయిందని అనుకొంటూ తన బాల్యపు రోజులను తలచుకొంటూ తనలో తాననుకొనిన వాక్యమిది.

ఉ) కింది ప్రశ్నలకు ఏకవాక్య సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘చేశారిన బాల్యం’ ఏ గ్రంథంలోనిది?
జవాబు:
శీలా వీర్రాజు గారు రచించిన ‘కలానికి ఇటూ అటూ’ అనే వ్యాస సంపుటి నుండి చేజారిన బాల్యం నుండి గ్రహించబడింది.

ప్రశ్న 2.
వీర్రాజుగారు తొలి బహుమతి ఎవరి చేతుల మీదుగా అందుకున్నారు?
జవాబు:
వీర్రాజుగారు తొలి బహుమతిని డాక్టర్ గరికపాటి రాజారావుగారి చేతుల మీదుగా అందుకున్నారు.

ప్రశ్న 3.
వీర్రాజుగారితో చేతివ్రాత పత్రిక తీసుకొద్దామని ఎవరన్నారు?
జవాబు:
చేతివ్రాత పత్రిక తీసుకొద్దామని వీర్రాజు గారితో ప్రకాశరావు, అప్పారావు అనే బాల్యమిత్రులు అన్నారు.

వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
వీర్రాజు గారికి కళాఖండాల సేకరణ పట్ల అభిరుచి ఎలా కలిగింది?
జవాబు:
వీర్రాజు గారి పెదనాన్న గారు, వీర్రాజు గారు పక్కపక్కనే ఉండేవాళ్ళు. వీర్రాజు గారి పెద్దమ్మకి ఒక అక్క ఉంది. ఆవిడ భర్త చనిపోయిన తర్వాత ఎవరూ లేక చెల్లెలు ఇంటికి వచ్చింది. ఆమెకు ప్రత్యేకంగా ఒక గది ఉండేది. ఆ గదినిండా బొమ్మలే. అవి ప్లాస్టిక్కువి, చెక్కవి, ఇత్తడివి, గాజువి, పింగాణీవి. చిన్న చిన్న ఆటబొమ్మలు గది గోడల మీదా, పెట్టెల మీదా ఒక్క అరడుగైనా ఖాళీ లేకుండా అంతటా నిండి ఉండేవి. పిల్లల్ని ఎవరినీ ఆ గదిలోకి రానిచ్చేది కాదు. కిటికీలోంచో, కొద్దిగా తీసిన తలుపు రెక్కల ఖాళీలోంచో బొమ్మలు చూసి వీర్రాజు ఆశ్చర్యపోయేవాడు. ఆ ఆసక్తే ఆ తర్వాత్తర్వాత వీర్రాజుకు కళాఖండాల సేకరణ పట్ల అభిరుచి కలగడానికి ప్రేరణ నిచ్చింది.

AP 10th Class Telugu 7th Lesson Questions and Answers చేజారిన బాల్యం

ప్రశ్న 2.
వీర్రాజు చిత్రకారుడు కావడానికి పునాదులు బాల్యంలో ఎలా ఏర్పడ్డాయో వివరించండి.
జవాబు:
వీర్రాజు చిత్రకారుడు కావడానికి బాల్యంలో పునాదులు పడ్డాయి. ప్రయివేటు మాష్టారు రామ్మూర్తిగారు పాఠాలు చెప్పడం అయిపోయాక చిన్నతనంలో వీర్రాజుగారిని బొమ్మలు వేయమన్నారు. విమానం, ఇల్లు, కిరసనాయిలు దీపం బొమ్మలు వేశారు. ఆ బొమ్మలను మాష్టారు మెచ్చుకొన్నారు. ఆ బొమ్మలు తల్లిదండ్రులకు చూపించారు. వాళ్లు మెచ్చుకొన్నారు. అప్పటి నుండి వీర్రాజుగారికి బొమ్మలు వేయడంలో ఉత్సాహం పెరిగింది. బొమ్మల పోటీలలో పాల్గొనేవారు.

తూర్పుగోదావరి జిల్లా విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో జరిగిన ఆర్ట్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించిన రాజారావు గారి చిత్రానికి ప్రథమ బహుమతి వచ్చింది.

ప్రశ్న 3.
మిత్రులతో కలిసి వీర్రాజు చేతివ్రాత పత్రికను ఎలా నిర్వహించాడు?
జవాబు:
వీర్రాజు గారు ఆరో, ఏడో చదివేటప్పుడు ఆయన బాల్యమిత్రులు ప్రకాశరావు, అప్పారావు పిల్లల కోసం నెలనెలా ఒక చేతివ్రాత తీసుకొద్దాం అనుకొన్నారు. చందమామ, బాల, పాపాయి పత్రికలలోని రచనలనే అటుఇటూ మార్చి కొత్తవి ప్రకాశరావు, వీర్రాజు తయారు చేసేవారు. అప్పారావు దస్తూరీ బాగుంటుంది. అందుచేత అవి అందంగా రాసే పని అతనిది. పుస్తకాలలో బొమ్మలు కూడా వేసేవారు. ఆ పుస్తకాలను కుట్టి గోదావరి ఒడ్డున రామకృష్ణా మిషన్ వారి రీడింగ్ రూమ్‌లో పెట్టేవారు. కానీ ఐదారు సంచికలతో ఆ ప్రయత్నం ఆగిపోయింది.

ఆ) కింది ప్రశ్నలకు ఎనిమిది నుండి పది వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
పారం ఆధారంగా వీర్రాజుగారు బాల్యాన్ని గుర్తు చేసుకున్న విధానాన్ని సంక్షిప్తంగా రాయండి.
జవాబు:
వీర్రాజుగారు తాను పుట్టిన పెరిగిన ఊరిని విడిచిపెట్టి వచ్చేసి 36 ఏళ్లయింది. ఆ ఊరిని విడిచిపెట్టే నాటికే ఆయన బాల్యం గడిచి పదేళ్లయింది. ఆయనకు తన బాల్యం అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ అప్పుడప్పుడు చిన్నపిల్లాడిలా అయిపోతుంటాడు. అలాగే కొంతసేపు ఆ బాల్యంలోనే ఉండిపోతే బాగుండుననుకొనేవాడు. కాని, ఆ కల చెదిరిపోయేది. మళ్లీ వాస్తవంలోకి వచ్చేవాడు.

ఎప్పుడైనా రైల్లో ప్రయాణం చేసేటపుడు తన బాల్యం గుర్తొచ్చేది. సాయంత్రం పూట వర్షం వస్తుంటే ఊళ్లోకి వెళ్లలేక గదిలో కూర్చొని కిటికీలోంచి వెనుక వీథిలోకి చూస్తున్నపుడో వీర్రాజుకు తన బాల్యం గుర్తుకు వచ్చేది. పుట్టిన రోజు నాడైతే తప్పనిసరిగా గుర్తుకు వచ్చేది తన బాల్యం.

ప్రశ్న 2.
వీర్రాజు గారి సాహిత్యాభిరుచిని వివరించండి.
జవాబు:
వీర్రాజుగారి సాహిత్యాభిరుచికి కూడా బాల్యంలోనే బీజాలు పడ్డాయి. ఆయన ఆరో, ఏడో చదివేటప్పుడు వ్రాత పత్రికను తీసుకురావాలనే కోరిక బాల్యమిత్రులు ప్రకాశరావు, అప్పారావులు కూడా చెప్పారు. అప్పారావు దస్తూరీ బాగుంటుంది. చందమామ, బాల, పాపాయి పత్రికలు చదివి, ఆ రచనలను అటు ఇటు మార్చి తయారుచేసే పని వీర్రాజు, ప్రకాశరావులది, అవి రాసే పని అప్పారావుది, వాటిలో బొమ్మలు కూడా వేసేవారు. అవి రామకృష్ణా మిషన్ రీడింగు రూములో పెట్టేవారు.

వీర్రాజు గారి సాహిత్యాభిరుచికి ఇది తొలిమెట్టు. తర్వాత ఆయనలో పుస్తకాలు చదివే లక్షణం కొనసాగుతూ వచ్చింది. బాల్యమిత్రుడు ప్రకాశరావు దగ్గర నుండి పుస్తకాలు తెచ్చుకొని చదువుకొనేవాడు లేదా లైబ్రరీకి వెళ్లి చదువుకొనేవాడు. ఆ చదివే గుణమే రాసే అభిరుచిలోకి పరిణామం చెందింది.

ప్రశ్న 3.
వీర్రాజుగారి సృజనాత్మకశక్తిని గురించి రాయండి.
జవాబు:
వీర్రాజు గారి సృజనాత్మక శక్తి అద్భుతమైనది. ఆయన చిన్నతనంలోనే మంచి మంచి బొమ్మలు వేశారు. గరికపాటి రాజారావు గారంతటి వారిచేత బహుమతిని అందుకొన్నారు. చిన్నతనం నుండీ సృజనాత్మకతతో విమానం, ఇల్లు, కిరసనాయిలు దీపం వంటి బొమ్మలు వేశారు.

ఆయన 7వ తరగతి చదివే రోజులలోనే చేతివ్రాత ప్రతి తయారుచేసి రామకృష్ణ మఠంలోని రీడింగ్ రూమ్‌లో ఉంచారు. అది క్రమేణా పుస్తకాలు చదివే అలవాటుకు దారి తీసింది. తన బాల్యమిత్రుడు ప్రకాశరావు వద్ద తెచ్చుకొని చదివేవారు. కొన్ని పుస్తకాలు లైబ్రరీ నుండి తెచ్చుకొని చదివేవారు. ఆ చదవడం అనేది క్రమేణా రాసే అలవాటుకు దారి
తీసింది.

సమాధి, మబ్బు తెరలు, రంగుటద్దాలు, ఊరు వీడ్కోలు చెప్పింది, మనసులో కుందె మొదలైన కథా సంపుటాలు రచించారు. కొడిగట్టిన సూర్యుడు, కిటికీ కన్ను, ఎర్రడబ్బా రైలు, పడుగుపేకల మధ్య జీవితం మొదలైన కవితా సంపుటాలను వెలువరించారు. మైనా, కరుణించని దేవత, వెలుగురేఖలు మొదలైన నవలలు రచించారు. మైనా నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది.

వీర్రాజు గారి సృజనాత్మక శక్తి వల్లనే ఇవన్నీ సాధ్యమయ్యాయి.

ఇ) కింది ప్రశ్నలకు సృజనాత్మకంగా సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
మీ అభిరుచులేమిటి? మీ చదువును, అభిరుచులను ప్రోత్సహించిన వారి గురించి రాయండి.
జవాబు:
ఛందోబద్ధమైన పద్యాలు వ్రాయాలనేది నా అభిరుచి. దీనిని నెరవేర్చుకోవడానికి గణాలు, యతులు, ప్రాసలు అన్నీ తెలుసుకొన్నాను. మా గురువుగారు కొక్కెర గడ్డ కామశాస్త్రిగారు చాలా ప్రోత్సహించారు. పద్య ఛందస్సుకు సంబంధించిన ప్రతి విషయం ఎంతో ఓర్పుగా, నేర్పుగా చెబుతారు. నేను తప్పుగా రాస్తే పకపకా నవ్వుతారు. ఇది ఇలా కాదమ్మా! ‘క కారానికీ చ కారానికీ యతి ఎలా చెల్లుతుంది ?’ అంటారు తప్ప కోప్పడరు. నీ చేత అవధానం చేయించాలిరా అంటారు. రోజూ సమస్య, వర్ణన, దత్తపదీ ఇచ్చి రాయిస్తారు. నేను ఎప్పటికైనా మా గురువుగారి మాట నిలబెడతాను. అవధానాలు చేస్తాను. నా పద్య రచన విషయంలో మా తాతగారు, అమ్మ, నాన్నల ప్రోత్సాహం కూడా చాలా ఎక్కువ, నేను అవధానిని కావాలని మీరు కూడా ఆశీర్వదించండి.

AP 10th Class Telugu 7th Lesson Questions and Answers చేజారిన బాల్యం

ప్రశ్న 2.
మీరు చూసిన చిత్రకళా ప్రదర్శన గురించి పత్రికకు ఒక వ్యాసం రాయండి.
జవాబు:
మార్చి 2న విజయవాడలో డ్రీమ్ వర్క్స్ ఆర్ట్ గ్యాలరీ, అనంత్ డైమండ్స్, కె.ఎల్. యూనివర్శిటీ సంయుక్తంగా కె.యల్ యూనివర్శిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయస్థాయి చిత్రకళా ప్రదర్శనను చూసాను. మనసులోని భావాలను బయట ప్రపంచానికి తెలియజేయడానికి చిత్రలేఖనం ఉపయోగపడుతుందని ముఖ్య అతిథి లక్ష్మీకాంత రెడ్డిగారు అన్నారు. సౌత్ ఇండియాలోని 6 రాష్ట్రాల నుండి సుమారు 200 మంది చిత్రకారులు, శిల్పులు, కార్టూనిస్టులు పాల్గొన్నారు.

మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కళాకారులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో అత్యుత్తమమైన చిత్రాలను, శిల్పాలను కార్టూన్లను చూసాము. ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలైతే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జాతీయస్థాయి పోటీలలో పాల్గొన్న పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థులకు నిర్వహించిన చిత్రలేఖనం పోటీలలో విజేతలకు -అతిథులు బహుమతులు అందజేసారు.

సాయంత్రం జరిగిన ముగింపు సభలో నేను కూడా అభినందనలు అందుకున్నాను.

భాషాంశాలు

పదజాలం

ఆ) కింది ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి, సొంతవాక్యాలు రాయండి.

1. పిల్లలు నిష్కల్మషంగా ఉంటారు.
నిష్కల్మషం = నిర్మలం, చెడు నుండి విముక్తి.
సొంతవాక్యం : వేసవిలో ఆకాశం నిర్మలంగా ఉంది.

2. మంచి ప్రవర్తనకు చిన్నతనంలోనే బీజం పడాలి.
బీజం = విత్తనం, బలం, మూలం
సొంతవాక్యం : విత్తనం ఒక్కటైతే మొక్క మరొకటి రాదు కదా!

3. కష్టపడి చదివితే ఉత్తరోత్తరా అభివృద్ధి ఉంటుంది.
ఉత్తరోత్తర = ఇకమీద, రాబోయే కాలం, ముందు ముందు
సొంతవాక్యం : ముందు ముందు ఈపాటి వానలు కూడా పడవేమో!

ఆ) ఇచ్చిన పదాలకు కింది వాక్యాలలో పర్యాయ పదాలను గుర్తించి రాయండి.
ఏడాది, హృదయం, వర్షం, ఈప్సితము

1. ఒక అబ్దం వర్షాలు పడితే మరో సంవత్సరం వర్షాలు తగ్గుతాయి.
జవాబు:
ఏడాది – అబ్దం, సంవత్సరం.

2. డెందమునకు శాంతి అవసరం. అప్పుడు ఎదకి హాయిగా ఉంటుంది.
జవాబు:
హృదయం – డెందము, ఎద.

3. ఈ సంవత్సరం వానలు ముమ్మరంగా పడ్డాయి. ఆ వృష్టి వల్ల వాగులు పొంగిపొర్లాయి.
జవాబు:
వర్షం – వాన, వృష్టి

4. కోరిక నెరవేరాలంటే కష్టపడాలి. అప్పుడే ఆ కాంక్ష తీరుతుంది.
జవాబు:
ఈప్సితము – కోరిక, కాంక్ష.

ఇ) కింది ప్రకృతి, వికృతులను జతపరచండి.
AP 10th Class Telugu 7th Lesson Questions and Answers చేజారిన బాల్యం 3
1. ఆసక్తి (ఆ) అ) కండ / గండ్ర
2. తంత్రం (ఇ) ఆ) ఆసత్తి
3. చిత్రం (ఈ) ఇ) తంతు
4. ఖండం (అ) ఈ) చిత్తరువు

ఈ) కింది వాక్యాలలో జాతీయాలను గుర్తించి, వివరించి రాయండి.
AP 10th Class Telugu 7th Lesson Questions and Answers చేజారిన బాల్యం 4

1. అతడు చేయి తిరిగిన రచయిత
జాతీయం : చేయి తిరిగిన
వివరణ : ఒక పనిలో బాగా సమర్థత గలిగిన వారి గురించి వివరిస్తూన్న సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.
సొంత వాక్యం : నలుడు చేయి తిరిగిన వంటవాడు.

2. జీవితం చేజారిపోనీయకూడదు.
జాతీయం : చేజారిపోవు
వివరణ : నిర్లక్ష్యం, అజాగ్రత్త, అదృష్టం కలిసిరాకపోవడం మొదలైన కారణాల చేత ఒకదానిని కోల్పోయిన సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.
సొంత వాక్యం: ఆలస్యంగా వెళ్లడం వలన అతనికి బంగారం లాంటి ఉద్యోగం చేజారిపోయింది.

3. చీకూచింతా లేని జీవితమే జీవితం
జాతీయం : చీకుచింతా
వివరణ : ఏ బాధా లేని జీవితం గడిపేవారి గురించి వివరించే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.
సొంత వాక్యం : చీకూ చింతా లేని రాముని జీవితంలో కైక నిప్పులు పోసింది.

4. ఉన్నత జీవితానికి మూలబీజాలు బాల్యంలోనే నాటాలి.
జాతీయం : మూలబీజం
వివరణ : ఒకడు నేటి స్థితిలో ఉండడానికి ప్రధాన కారణం వివరించే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.
సొంత వాక్యం: రాముని పరాక్రమానికి మూల బీజం విశ్వామిత్రుని యాగ సంరక్షణ రూపంలో పడింది.

వ్యాకరణాంశాలు

ఆ) కింది పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.
AP 10th Class Telugu 7th Lesson Questions and Answers చేజారిన బాల్యం 5
1. అప్పుడప్పుడు : అప్పుడు + అప్పుడు – ఆమ్రేడిత సంధి
2. దీపాలు : దీపము + లు = లు,ల,న,ల సంధి
3. ఎప్పుడైన : ఎప్పుడు + ఐన = ఉత్వసంధి
4. దశాబ్దం : దశ + అబ్దం = సవర్ణదీర్ఘ సంధి
5. గర్వపడు : గర్వము + పడు = పడ్వాది సంధి

AP 10th Class Telugu 7th Lesson Questions and Answers చేజారిన బాల్యం

ఆ) కింది పదాలను కలిపి, సంధి పేరు రాయండి.
AP 10th Class Telugu 7th Lesson Questions and Answers చేజారిన బాల్యం 6
1. తల్లి + తండ్రి : తల్లిదండ్రులు = గ,స,డ,ద,వా దేశ సంధి
2. ఇన్ని + ఏళ్ళు : ఇన్నేళ్ళు = ఇత్వసంధి
3. పుస్తకము + లు : పుస్తకాలు = లు,ల,న,ల సంధి
4. చిన్న + అప్పుడు : చిన్నప్పుడు = అత్వసంధి
5. సాహిత్య + అభిమానం : సాహిత్యాభిమానం = సవర్ణదీర్ఘ సంధి

ఇ) కింది సమాసపదాలకు విగ్రహుత్యాలు రాసి, సమాసం పేర్లు రాయండి.
AP 10th Class Telugu 7th Lesson Questions and Answers చేజారిన బాల్యం 7
1. సాహిత్యాభిరుచి : సాహిత్యము నందు అభిరుచి – సప్తమీ తత్పురుష సమాసం
2. చేతిరాత : చేతితో రాత – తృతీయా తత్పురుష సమాసం
3. నిష్కల్మషము : కల్మషము లేనిది – నఞ్ తత్పురుష సమాసం
4. నాలుగుదిక్కులు : నాలుగు అను సంఖ్య గల దిక్కులు – ద్విగు సమాసం

ఈ) కింది విగ్రహ వాక్యాలను సమాసపదాలుగా మార్చి, సమాసం పేర్లు రాయండి.
AP 10th Class Telugu 7th Lesson Questions and Answers చేజారిన బాల్యం 8
1. చిన్నదైన పిల్ల : చిన్నపిల్ల – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
2. బద్దం కానిది : అబద్ధం – నఞ్ తత్పురుష సమాసం
3. శక్తి మరియు సామర్ధ్యము : శక్తిసామర్థ్యాలు – ద్వంద్వ సమాసం
4. మాయకము కానిది : అమాయకము – నఞ్ తత్పురుష సమాసం
5. బాల్యము నందలి మిత్రులు : బాల్యమిత్రులు – సప్తమీ తత్పురుష సమాసం

ఉ) ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు

“నువ్వింకా చిన్న పిల్లవాడివి” అని నాన్న అన్నాడు.
నువ్వింకా చిన్నపిల్లవాడివని నాన్న అన్నాడు.
ఈ రెండింటిని అనుకరణ లేక అనుకృతి వాక్యాలు అంటారు. రెండు వాక్యాలలోనూ తేడా ఉంది. మొదటి వాక్యంలో మరొకరు చెప్పిన వాక్యాన్ని యధాతథంగా అనుకరించడం ఉంది. రెండవ వాక్యంలో విషయాన్ని లేదా అభిప్రాయాన్ని మాత్రమే అనుకరించడం ఉంది. మొదటి వాక్యంలో “చిన్నపిల్లవాడివి” అని ఉంటే, రెండవ వాక్యంలో ‘చిన్నపిల్లవాడివని’ అని కనిపిస్తుంది. మొదటి వాక్యాన్ని ప్రత్యక్ష అనుకృతి అని, రెండవ వాక్యాన్ని పరోక్ష అనుకృతి అని అంటారు.

ప్రత్యక్ష అనుకృతి పరోక్ష అనుకృతిగా మారినప్పుడు కొన్ని మార్పులు వచ్చాయి చూశారు కదా.. ఈ రెండిట్లో “అని” అనేది అనుకారకం. అంటే అనుకరిస్తున్నట్లు చెప్పే పదం. ఇప్పుడు ఈ రెండు వాక్యాల స్వభావాన్ని ఈ కింది విధంగా చెప్పవచ్చు.

ప్రత్యక్షానుకృతి :

ఇతరులు చెప్పిన విషయాన్ని లేక తను చెప్పిన విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా అనుకరించి చెప్పడం.
ఉదాహరణ :
1)“నేను రాను” అని రవి రాజుతో అన్నాడు.
2) కోడి “కొక్కురోకో” అని కూస్తుంది.
3) “వ్యక్తికి బహువచనం శక్తి” అని అన్నాడు శ్రీశ్రీ.

పరోక్షానుకృతి : అనుకరించిన దానిలో విషయాన్ని, అభిప్రాయాన్ని మాత్రమే అనుకరించడం. అనుకారకం: “అని” అనుకారక పదం కొన్ని సందర్భాలలో లోపించవచ్చు కూడా.
ఉదాహరణ :
1) వ్యక్తికి బహువచనం శక్తని అన్నాడు శ్రీశ్రీ.
2) నీవు ఎక్కదలచిన ట్రైను జీవితకాలం లేటని అరుద్ర అన్నాడు.
3) తాను రానని రవి రాజుతో అన్నాడు.
4) కోడి కొక్కురోకోమని కూస్తుంది.

ప్రాజెక్టు పని

* ప్రముఖుల ఆత్మకథలు, జీవితచరిత్రలు చదివి వాటిలో వారి బాల్య జీవిత ఘట్టాలను సేకరించండి.
జవాబు:
గాంధీజీ :
గాంధీజీ పూర్తి పేరు మోహన్‌దాస్ కరమ్ చంద్ గాంధీ. ఆయన 1869 అక్టోబరు 2న గుజరాత్‌లోని పోర్ బందర్లో జన్మించారు. పుతలీబాయి, కరంచంద్ గాంధీలు ఆయన తల్లిదండ్రులు. వారిది ఆచారాలు బాగా పాటించే కుటుంబం. గాంధీని చిన్నతనంలో మోనియా అనేవారు.

గాంధీ చిన్నతనంలో మాంసం తిన్నాడు. అది వారి ఆచారానికి విరుద్ధం, తల్లికి అబద్ధం చెప్పవలసి వస్తోందని జీవితంలో మాంసం తినకూడదని నిర్ణయించుకొన్నాడు, పాటించాడు. బంగారు కడియపు ముక్కను దొంగిలించి అమ్మాడు. అది తన తండ్రికి చీటీలో రాసి తన తప్పు ఒప్పుకొన్నాడు. జీవితంలో మళ్లీ దొంగతనం చేయలేదు. అబద్ధం ఆడలేదు. గాంధీ గారి జీవితం ఎంతోమందికి ఆదర్శం.

2) అంబేద్కర్ :
14. 4. 1891న భారతదేశంలోని మోవ్‌లో జన్మించారు. తండ్రి పేరు రామ్ మలోజీ సక్పాల్, తల్లి పేరు భీమాబాయి సక్పాల్, తల్లి మరణించింది. కుటుంబం 1897లో ముంబైకి మారింది. అక్కడ అంబేద్కర్ ఎల్ఫిన్ స్టోన్ హైస్కూల్లో చేరారు. 15 సంవత్సరాల వయస్సులోనే తొమ్మిదేళ్ల బాలిక రమాబాయిని పెళ్లి చేసుకొన్నారు.

తను పాఠశాలలో చదివే రోజులలో అంటరానితనానికి గురి అయ్యాడు. కుండలో నీరు కూడా ముంచుకొని త్రాగ నిచ్చేవారు కాదు. గోనెపట్టాపై కూర్చుని చదువుకొనేవాడు. ఎన్ని అవమానాలు ఎదురైనా తట్టుకొని నిలబడ్డాడు. చక్కగా చదువుకొన్నాడు. బరోడా మహారాజు అందించిన స్కాలర్షిప్ చదువుకొన్నాడు. భారత రాజ్యాంగ రచనా కమిటి అధ్యక్ష స్థాయి వరకు తన స్వశక్తితో ఎదిగి, ఎందరికో ఆదర్శంగా నిలిచారు.

3) లాల్‌బహదూర్ శాస్త్రి :
శాస్త్రి పూర్తి పేరు లాల్‌బహదూర్ శ్రీవాస్తవ, అక్టోబర్ 2, 1904న ఉత్తరప్రదేశ్‌లోని మొఘల్ సరాయిలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు రామదులారి దేవి, శరద్ ప్రసాద్ శ్రీవాస్తవ దంపతులు. శాస్త్రికి 18 నెలల వయస్సులో తండ్రి మరిణించాడు. అప్పటి నుండి ఆ కుటుంబం ఆయన తల్లి, మేనమామ, బంధువుల సహాయంతో బ్రతికింది. చదువులలో శాస్త్రిగారు మేటి. అత్మాభిమానం కలవాడు. చురుకైనవాడు. ఆయన 10వ తరగతి చదివేటప్పుడే గాంధీజీ, పండిట్ మదన మోహన్ మాలవ్యాల ఉపన్యాసాలకు ఆకర్షితుడయ్యాడు. కాంగ్రెస్ పార్టీ వాలంటీర్ గా చేరాడు. సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగస్వామి అయ్యాడు. చదువుకు స్వస్తి చెప్పాడు. లోక్ సేవక్ మండల్ సభ్యునిగా చేరాడు. హరిజనుల జీవితాలను మెరుగుపరచడానికి పోరాడాడు.

జీవితమంతా నీతి, నిజాయితీ, ఆత్మాభిమానాలతో గడుపుతూ ప్రధానమంత్రి స్థాయి వరకు ఎదిగారు. ఎందరో దేశ భక్తులకు శాస్త్రిగారు ఆదర్శపురుషులు.

AP 10th Class Telugu 7th Lesson Questions and Answers చేజారిన బాల్యం

పాఠాంత పద్యం

కం॥ జారిపోయిన ప్రతి నిమేషమ్ము గూడ
బ్రతుకు నందు భాగము పంచికొనును కీర
దీపమున్నప్పుడే యిల్లు దిద్దుకొంచు
మించిపోనీరు సమయమ్ము మంచివారు – బొద్దులూరు నారాయణరావు

భావం : కాలం విలువ తెలిసిన ఉత్తములు ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయిని పొందుతారు. దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను నిజం చేస్తారు. సమయాన్ని వృథా కానీయరు.

సూక్తి: “మనకు లభించే చిన్న అవకాశాలే భవిష్యత్తులో ఉన్నత శిఖరాల్ని చేరుస్తాయి”. బెంజమిన్ ఫ్రాంక్లిన్

అదనపు భాషాంశాలు

పర్యాయపదాలు

బాల్యం : పసివయసు, చిన్నతనం, శైశవం
అబద్దం : అసత్యం, అన్నతం, కల్ల, బొంకు
మారం : మంకుతనం, గారాబంతో కూడిన పట్టుదల
సేకరణ : సమీకరించు, పోగుచేయు
నిజం : సత్యం, యథార్థం
వర్షం : వాన జల్లు
కిటికి : గవాక్షం, జాలకం, జాలం, మూషం, వాతాయనం, సోరణగండ్లు, సోరణం
కల : స్వప్నము, ఆదర్శనం, స్వాపము, స్వపము, సంవేశము
వీధి : దారి మార్గం
ఏడాది : సంవత్సరం, ఏడు, వత్సరం, అబ్దం, సాలు
గుర్తు : గురుతు, జ్ఞాపకం
దిగులు : భయం, గుండె అదురు, అధైర్యం
కుటుంబం : కాపురం, సంసారం, పెండ్లాము, బిడ్డలు మొదలగువారు
గర్వం : డాబు, గరానా, అహం, పొగరు, నిక్కు, టెక్కు
తృప్తి : తనివి, సంతృప్తి, తనుపు
పునాది : మూలబంధం, అడుగుమట్టు, లోతు నుండి గోడ కట్టుటకు భూమిలో త్రవ్వుపల్లము
ఆసక్తి : ఇష్టం, అనురాగం
దీపం : దివ్వె, జ్యోతి, దీపిక, వెలుగు, కాంతి
బొమ్మ : చిత్రం, చిత్తరువు
అభిరుచి : కోరిక ఎక్కువ ప్రీతి, ఆసక్తి
వాట : భాగం, వంతు, పాలు, సర్గ, లాట
అద్దం : దర్పణం, ముకురం, ఆదర్శము
సరదా : వినోదం, ఇష్టం
విద్యార్థి : అభ్యాసకుడు, పాఠితుడు, మాణవకుడు
ఆసక్తి : అభిరుచి, ఆసక్తి
ఎండ : వేడి, సూర్యరశ్మి, అతపము, ఉష్ణము, సూర్యకాంతి
ముచ్చట : సంగతి, విషయం / అందం, మనోహరం
బీజం : విత్తనం విత్తు, బీజకం
చేతివ్రాత : హస్తాక్షరం, చేతితో వ్రాసినది, దస్తూరి
దస్తూరి : చేతివ్రాత, రాత, లేఖనం, రాయడం
సంచిక : సంపుటి, చిన్నపుస్తకం, సంచయ
పరిణామం : మార్పు, కొత్తగా ఏర్పడిన పరిస్థితి, మారురూపు
నడవడిక : నడవడి, నడత, ప్రవర్తన
శక్తి : బలం, బలిమి, సత్తువ
దుకాణం : కొట్టు, అంగడి, పసారం
బహుమతి : బహుమానం, పారితోషికం
ప్రథమ : తొలి, మొదట
ప్రభావం : మహిమ, శక్తి
సడలు : వదులు, ఊడు, జారు, వీడు, సట
ఒదుగు : దాగు, ముడిగియుండు
చేయితిరుగు : పదునెక్కు, నైపుణ్యం పొందు
సన్నిహితం : దగ్గరిది, సమీపం
క్షమ : ఓర్పు, సహనం, మన్నింపు
సాహిత్యం = వాఙ్మయం, సారస్వతం, సాహిత

నానార్థాలు

అబద్ధం = అసత్యం, దోషం
విధి = పని, బ్రహ్మ, దురదృష్టం. నియమం
మూలబీజం = ఆరంభం, ఆధారం
ఊగిసలాడు = ఆందోళనపడు, సంకోచించు
పరిణామం = మార్పు, అభివృద్ధి
వికాసం = విస్తరించడం, తెలివి, ఆనందం
పోత = కరిగిన, పోయుట
గుమాస్తా = లెక్కలు రాసేవాడు, సహాయకుడు
అంతరం = నడుమ, తేడా, లోపల
కల = స్వప్నం, కళ, శిల్పం
వీథి = మార్గం, ఇండ్ల వరుస, ఏకాంక నాటకం
దిగులు = గుండె అదురు, భయం
కుటుంబం = కాపురం, గృహం, జాతి, బంధువు, సమూహం
పునాది = నేలలో తవ్విన పల్లపు ప్రదేశం, ఆధారం
తంత్ర = తంతు, మగ్గం, సిద్ధాంతం, క్షుద్రపూజ, ఉపాయం
అభిరుచి = ఇష్టం, కాంతి, అత్యాసక్తి
పరిణామం = మార్పు, క్షేమం, జీర్ణక్రియ
ప్రథమ = మొదటిది, ముఖ్యము, ప్రథమపురుష, ప్రథమావిభక్తి, పాడ్యమి
సడలు = జారు, బద్ధకం
ఒదగు = దాగిఉండు, వినమ్రుడగు
కాలం = సమయం, మృత్యువు, యముడు, శివుడు
క్షమ = ఓర్పు, నేల, యుక్తం

AP 10th Class Telugu 7th Lesson Questions and Answers చేజారిన బాల్యం

ప్రకృతి – వికృతులు

ప్రకృతి – వికృతి
కళ – కల
హృదయం – ఎద
వీథి – వీది
ప్రయాణం – పయనం
తంత్ర – తంతు
బ్రహ్మ – బొమ్మ
ఆసక్తి – ఆసత్తి
అబ్ద – అద్ద
పత్రిక – పత్తిరాకు
సంచియ – సంచిక
శక్తి – సత్తి
మూష – మూస
పుస్తకం – పొత్తం
ముత్యం – ముత్తెం

వ్యుత్పత్త్యర్థాలు

విధి = ప్రపంచమును రూపొందించువాడు – బ్రహ్మ
తృప్తి = కోరిక లేకపోవడం – తనివి
ప్రథమ = శ్రేష్ఠమైనది – ఉత్తమం

జాతీయాలు

చేయి తిరిగిన = నైపుణ్యం సాధించు
చేజారిపోవు = గడచిపోవు
చీకూచింతా = బాధలు
మూలబీజాలు = ఆరంభాలు
ఊగిసలాడు = అటూ ఇటూ తోచని / తేలనిస్థితి
పెద్దమ్మ = దరిద్రదేవత జ్యేష్ఠాదేవి
గోరంతలు కొండంతలు చేయు = చిన్నదాన్ని పెద్దగా చేయు
వానాకాలం చదువులు = అరకొర చదువులు

సంధులు

పెద్దమ్మ = పెద్ద + అమ్మ – అత్వ సంధి
అరడుగు = అర + అడుగు – అత్వసంధి
ఎన్నెన్నో = ఎన్ని + ఎన్నో – ఇత్వసంధి
ఒకరికొకరం = ఒకరికి + ఒకరం – ఇత్వసంధి
నాకెందుకో = నాకు + ఎందుకో – ఉత్వసంధి
రోజులవి = రోజులు + అవి – ఉత్వసంధి
అరడుగైనా = అరడుగు + ఐనా – ఉత్వసంధి
మనసైనా = మనసు + ఐనా – ఉత్వసంధి
అక్కడక్కడ = అక్కడ + అక్కడ – ఆమ్రేడిత సంధి
పద్యాలు = పద్యము + లు – లు,ల,న,ల సంధి
అంతరాలు = అంతరము + లు – లు,ల,న,ల సంధి
మధ్యాహ్నం = మధ్య + అహ్నం – సవర్ణదీర్ఘ సంధి
విద్యార్థి = విద్య + ఆర్థి – సవర్ణదీర్ఘ సంధి
సాహిత్యాభిరుచి = సాహిత్య + అభిరుచి – సవర్ణదీర్ఘ సంధి
ప్రత్యేకత = ప్రతి + ఏకత – యణాదేశ సంధి

AP 10th Class Telugu 7th Lesson Questions and Answers చేజారిన బాల్యం

సమాసాలు

మధ్యాహ్నం = అహ్నము మధ్య భాగం – ప్రథమాతత్పురుష సమాసం
చిత్రకారుడు = చిత్రములను గీయువాడు – ద్వితీయాతత్పురుష సమాసం
చేతివ్రాత = చేతితో వ్రాత – తృతీయాతత్పురుష సమాసం
చేతివ్రాత పత్రిక = చేతివ్రాతతో రాసిన పత్రిక – తృతీయాతత్పురుష సమాసం
నా బాల్యం = నా యొక్క బాల్యం – షష్ఠీతత్పురుష సమాసం
నీతి శతకాలు = నీతికి సంబంధించిన శతకాలు – షష్ఠీతత్పురుష సమాసం
అస్తి పంపంకాలు = ఆస్తి యొక్క పంపకాలు – షష్ఠీతత్పురుష సమాసం
అభిప్రాయభేదాలు = అభిప్రాయమునకు సంబంధించిన భేదాలు – షష్ఠీతత్పురుష సమాసం
వీథి దీపం = వీథి అందలి దీపం – సప్తమీతత్పురుష సమాసం
అర్ధణా = అణాలో అర్థభాగం – ప్రథమా తత్పురుష సమాసం
ఎనిమిది వీథులు = ఎనిమిది సంఖ్య గల వీథులు – ద్విగు సమాసం
చీకూచింతా = చీకు మరియు చింత – ద్వంద్వ సమాసం
పుట్టినరోజు = పుట్టినదైన రోజు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం.
మధ్యతరగతి కుటుంబం = మధ్యతరగతియైన కుటుంబం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం.
చిన్నపిల్ల = చిన్నదైన పిల్ల – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
చిన్న నిచ్చెన = చిన్నదైన నిచ్చెన – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
మూలబీజాలు = మూలమైన బీజాలు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

రచయిత పరిచయం

పేరు : శీలా వీర్రాజు

తల్లిదండ్రులు : వీరభద్రమ్మ, సూర్యనారాయణ

జననం : 22.04.1939న రాజమండ్రిలో జన్మించారు.

రచనలు : “సమాధి, మబ్బు తెరలు, రంగుటద్దాలు, ఊరు వీడ్కోలు చెప్పింది, మనసులో కుంచె, మొదలైన కథా సంపుటాలు, మైనా, కరుణించని దేవత, వెలుగు రేఖలు మొదలైన నవలలు వ్రాశారు. కొడిగట్టిన సూర్యుడు, కిటికీ కన్ను, ఎర్రడబ్బా రైలు, పడుగు పేకల మధ్య జీవితం మొదలైన కవితా సంపుటాలను రచించారు.

బహుమతి : 1969లో ‘మైనా’ నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.

ప్రత్యేకతలు : రచయితగా, కవిగా, చిత్రకారుడుగా ప్రసిద్ధుడు. ఈ పాఠం శీలా వీర్రాజు వ్యాస సంపుటి ‘కలానికి ఇటూ, అటూ నుండి గ్రహించబడింది. వారు 1.6.2022న స్వర్గస్తులయ్యారు.

కఠినపదాలకు అర్థాలు

పేజీ – 77:

బాల్యం = పసివయసు (మొదటి వయోవస్థ), చిన్నతనం, శైశవం
అబద్ధం = అసత్యం, అనృతం, నిజంకానిది, కల్లమాట, బొంకు, దోషం, తప్పు
విధి = పని, బ్రహ్మ, తప్పనిది
ఏడాది = సంవత్సరం
దిగులు = భయం, బాధ
అమాయకం = కల్లాకపటం (మోసం) తెలియకుండుట
నిష్కల్మషం = స్వచ్ఛమైన, నిర్మలం
చీకూచింతా = బాధలు
చెయ్యిజారిపోవు = గడచిపోవు
మాటిమాటికీ = తరచుగా, మళ్ళీ మళ్ళీ, పదేపదే
మారం = మంకుతనం, గారాబంతో కూడిన పట్టుదల
చితికిపోయిన మధ్యతరగతి కుటుంబం = ఆర్థిక పరిస్థితులు సరిగాలేనికుటుంబం
కల = స్వప

పేజీ-78:

తృప్తి = తనివి, సంతోషం
మూలబీజం = ఆరంభం, ఆధారం, తొలిప్రయత్నం
పునాది = ఆధారం, మూలం
బట్టిపట్టు = అర్ధం తెలుసుకోకుండా కంఠస్థం చేయు
వల్లెవేయు = మరల మరల చదువు, బట్టీపట్టు
పంచతంత్ర కథలు = మిత్రలాభం, మిత్రభేదం, కాళోలూతీయం, లుబ్ధనాశం, అసంప్రేక్షకారిత్వం
బహుశా = సాధారణంగా
చేయితిరుగు = పదునెక్కు, నైపుణ్యం సాధించు
వైధవ్యం = భర్త చనిపోయిన స్త్రీ పొందు స్థితి (బొట్టు, పూలు మొదలైనవి – పెట్టుకోకుండా ఉండుట)
దామెర్ల రామారావు = భారతీయ ప్రముఖ చిత్రకారుడు
ఆసక్తి = ఇష్టం, అనురాగం
కళాఖండం = కళాకారుని అద్భుతమైన సృష్టి
సేకరణ = సమీకరించు, పోగుచేయు
ఆస్తి = కూడబెట్టిన ధనం
పంపకం = పంచుట
ముచ్చట = కోరిక
ఊగిసలాడు = ఆందోళనపడు, సంకోచించు

ఆలోచించండి- చెప్పండి

ప్రశ్న 1.
ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండు కదా! అని రచయిత ఎందుకు అనుకున్నాడు?
జవాబు:
రచయితకు తన బాల్యం అంటే ఇష్టం. తాను పెద్దవాడు. అవుతున్నకొద్దీ తన బాల్యానికి తాను దూరం జరిగి పోతున్నాననే దిగులు ఎక్కువవుతోంది. అందుచేతనే తన బాల్యం రోజులు మళ్లీ వస్తే బాగుండుననుకొన్నాడు.

ప్రశ్న 2.
వీధిలో కిరసనాయిలు దీపాలు ఎందుకు వెలిగించ వలసి వచ్చింది?
జవాబు:
రాత్రులందు వీథులలో తిరిగే వారికి దారి కనబడడానికి వీధులలో కిరసనాయిలు దీపాలు వెలిగించి పెట్టేవారు.

పేజీ – 79

మిత్రుల = స్నేహితులు
చెట్టూచేమ = చెట్లు అను అర్ధమున వాడబడు జంట పదం
పరోక్షం = ఎదుటలేనిది
దస్తూరి = చేతిరాత
ముత్యాల కోవ = ముత్యాల హారం
అణా = ఒక రూపాయిలో పదహారోవంతు (ఆరు పైసలు)
తొలిమెట్టు = మొదటి సోపానం
సంచిక = చిన్నపుస్తకం
వానాకాలపు చదువు = అంతంత మాత్రపు చదువు
పరిణామం = మార్పు, అభివృద్ధి
సృజనాత్మక = నిర్మాణాత్మకమైన
అభిరుచి = ఇష్టం
విశ్వాసం = నమ్మకం
నడవడిక = ప్రవర్తన
వికాసం = విస్తరించడం, తెలివి, ఆనందం, ప్రకాశం
శక్తి = బలం
సామర్థ్యం = పని చక్కగా చేయగల నేర్పు, సమర్థత
చేనేత = చేతితో నేసిన నేత
మూస = ద్రవ్యాలను వేడి చేయుటకు ఉపయోగించు చిన్న పాత్ర
పోత = పోయుట, కరిగిన
గుమాస్తా = లెక్కలు రాసేవాడు, సహాయకుడు
ఆధ్వర్యం = నిర్వహణ
అనుభవం = ప్రత్యక్ష జ్ఞానం, విషయాన్ని అర్థం చేసుకొనుట
నా మట్టుకు = నా వరకు
దశాబ్దం = 10 సంవత్సరాలు
పెనవేయు = అల్లుకొను
ఆత్మీయం = ప్రియం
గోరంతలు కొండతలు చేయడం = చిన్న విషయాల్ని పెద్దదిగా చేయడం

ఆలోచించండి- చెప్పండి.

ప్రశ్న 1.
మీరు బొమ్మలు వేయడానికి కథలు, కవితలు, పాటలు రాయడానికి ఎప్పుడైనా ప్రయత్నించారా? వాటి గురించి చెప్పండి.
జవాబు:
నేను బొమ్మలు వేయడానికి చాలాసార్లు ప్రయత్నించాను. నా బొమ్మలను మా డ్రాయింగ్ మాస్టారు చాలా మెచ్చు కొంటారు. మా అమ్మ, నాన్న, అక్క అయితే చెప్పక్కర్లేదు. చాలా మెచ్చుకొంటారు. మా మండలంలో పెట్టిన బొమ్మల పోటీలో నాకు ప్రథమ బహుమతి వచ్చింది.

కథలు, కవితలు, పాటలు కూడా రాస్తాను. మా తెలుగు ఉపాధ్యాయులు మంచి మంచి సలహాలిస్తారు. ఎప్పటికైనా మంచి కథలు, కవితలు, పాటలు కూడా రాస్తాను. బహుమతులు గెలుచుకొంటాను.

ప్రశ్న 2.
వీర్రాజు చదువుకోవడానికి వాడే గది ఎలాంటిది?
జవాబు:
వీర్రాజు వాడుకొనే గది వీధి వైపు ఉండేది. ఆ గదికి ఆకుపచ్చని, ఎర్రని అద్దాల రెక్కలున్న కిటికీలు ఉండేవి. చిన్నప్పుడు ఆ రంగురంగుల అద్దాల్లోంచి వీథిలో వచ్చే పోయే జనాల్ని సరదాగా చూసేవారు. ఆ అల కిటికీ లోంచి ఎండపడి రంగులు గది నిండా పరచుకొనేవి, అందుకే ఆ గది అంటే వీర్రాజుకు ఇష్టం, తన చదువు కొందుకు ఆ గదినే వాడుకొనేవాడు.

ప్రశ్న 3.
బాల్య మిత్రులను ఎందుకు వదులుకోలేము?
జవాబు:
స్నేహం స్నేహం కోసమే చేయడం ఒక్క బాల్యంలోనే ఉంటుంది. కనుక బాల్య మిత్రులను వదులుకోలేము. తర్వాత కాలక్రమంలో ఏర్పడే స్నేహాలు అవసరార్థం ఏర్పడతాయి తప్ప, వాటిలో గట్టిదనం ఉండదు.

ప్రశ్న 4.
స్నేహం కలకాలం నిలబడాలంటే ఏం చేయాలి?
జవాబు:
స్నేహం కలకాలం నిలవాలంటే స్వార్ధం ఉండకూడదు. రహస్యాలు కాపాడాలి. స్నేహితుని మంచి గుణాలను మెచ్చుకోవాలి. ఆపదలో ఉన్న స్నేహితులను ఆదుకోవాలి.

ప్రశ్న 5.
వానాకాలం చదువు అంటే మీకేమి అర్థం అయింది?
జవాబు:
“వానాకాలం చదువు” అంటే అతంత మాత్రం చదువు అని అర్థం. పూర్వం సరైన పాఠశాలలు లేవు. వీథి అరుగుల మీదనో, చిన్న చిన్న పాఠలలోనో, వాకిట్లోనో బదులు ఉండేవి. వానాకాలంలో వర్షం వస్తే ఐడికి సెలవే. చదువులు ఉండేవి కావు. వానాకాలంలో ఎక్కువ సెలవులు తక్కువ చదువులు ఉండేవి. అందుచేతనే సరిగ్గా లేని చదువుల విషయంలో వానాకాలం చదువులు అనే పేరు వచ్చింది.

AP 10th Class Telugu 7th Lesson Questions and Answers చేజారిన బాల్యం

పేజీ – 80:

సడలిపోక = వదలక, వీడిపోనీక
సన్నిహితం = దగ్గరిది, సమీపం
కాలం కాటేయు = ప్రాణం తీయు
అభిప్రాయ భేదం = మాటతో ఏకీభవించకపోవడం
అంతరం = నడుమ, తేడా
గోరంతలు కొండంతలుగా = చిన్న విషయాన్ని అధికం చేసి చెప్పడం
జారిపోయిన = గడిచిపోయిన

Leave a Comment