These AP 10th Class Telugu Important Questions 7th Lesson చేజారిన బాల్యం will help students prepare well for the exams.
చేజారిన బాల్యం AP Board 10th Class Telugu 6th Lesson Important Questions and Answers
అవగాహన – ప్రతిస్పందన
1. ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
నేను పుట్టి పెరిగిన ఊరిని విడిచిపెట్టి వచ్చేసి ముప్ఫై ఆరేళ్ళయ్యింది. ఆ ఊరిని విడిచిపెట్టే నాటికే బాల్యం నా నుంచి పారిపోయి పదేళ్ళయ్యింది. నా బాల్యం అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ నేను అప్పుడప్పుడు చిన్నపిల్లవాడిని అయిపోతుంటాను. అబద్దం కాదు…. నిజంగానే! నేను చిన్నవాడిని అయిపోతుంటాను. అలాంటప్పుడు, యింకా అలానే మరికొంత సేపు ఆ బాల్యంలోనే వుండిపోతే బాగుండుననిపిస్తుంది. కల కదా, ఎక్కువసేపు వుండనివ్వదు. చటుక్కున కల చెదిరిపోయి మళ్ళీ నా అసలు వయసులోకి వచ్చేస్తుంటాను. ఎప్పుడైనా రైలు ప్రయాణం చేస్తున్నప్పుడో, సాయంత్రంపూట వర్షం వస్తుంటే వూళ్ళోకి వెళ్ళలేక గదిలో కూచుని కిటికీలోంచి వెనక వీథిలో చూస్తున్నప్పుడో, పుట్టినరోజు నాడో నాకెందుకో విధిగా బాల్యం గుర్తుకు వస్తూనే వుంటుంది – ఏ ఏడాది కా ఏడాది బాల్యానికి నేను దూరం జరిగిపోతున్నాననే దిగులు వల్లనో ఏమో మరి! ఆ రోజులు మళ్ళీవస్తే బాగుండును కదా! అని కూడా అనుకుంటాను.
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
రచయితకు చాలా ఇష్టమైనదేది?
జవాబు:
రచయితకు తన బాల్యమంటే ఇష్టం.
ప్రశ్న 2.
రచయిత సొంత ఊరు విడిచి ఎన్నేళ్లయింది?
జవాబు:
రచయిత సొంతూరు విడిచి 36 ఏళ్లయింది.
ప్రశ్న 3.
రైలు ప్రయాణంలో ఏం గుర్తుకు వచ్చేది?
జవాబు:
రైలు ప్రయాణంలో తన బాల్యం గుర్తుకు వచ్చేది.
ప్రశ్న 4.
పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
రచయిత ఏవి మళ్లీ రావాలని కోరుకున్నాడు?
2. ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఎంత అమాయకమైన రోజులవి! ఎంత చక్కని రోజులవి! ఆట పాటల్తో, ఆనందంగా, హాయిగా, నిష్కల్మషంగా, ఏ చీకూ చింతా లేకుండా గడిచిపోయాయి. చూస్తూ చూస్తుండగానే బాల్యం చెయ్యిజారిపోయింది! “మాటిమాటికీ నువ్వు అలా మారం చేయడానికి నువ్వింకా చిన్నపిల్లవాడివే ననుకుంటున్నావా” అని నాన్న కోప్పడినప్పుడే నేను బాల్యాన్ని దాటుకుని వచ్చేసానని అర్థమైంది. చితికిపోయిన మధ్యతరగతి కుటుంబంలో బాల్యం ఎలా గడుస్తుందో అలానే గడిచింది నాకునూ, బాల్యాన్ని తలచుకుని గర్వపడే ప్రత్యేకతలేవీ నాకు లేవు.
కానీ యీనాడు నన్ను నేను చూసుకుని గర్వపడడానికీ, తృప్తిపడడానికీ కారణమైన మూలబీజాలు మాత్రం నా బాల్యంలోనే వున్నాయి. నేను చిత్రకారుడిని కావడానికీ, సాహితీవేత్తను అవడానికీ ఆ రోజుల్లోనే పునాదులు పడ్డాయి. నాకు యింకా గుర్తుంది… చిన్నప్పుడు మా యింటికి వెనకవీథిలో రామ్మూర్తిగారని ఒక ముసలాయన ప్రయివేట్లు చెప్తుండేవారు. ఒక రూపాయి ఫీజు. అక్కడ ట్యూషనుకు వచ్చేవాళ్లు సుమారు ఇరవైమంది పిల్లలుండేవారు. వాళ్ళల్లో నేనూ ఒకడిని, నాది ఎలిమెంటరీ స్కూలు చదువు, బడినించి రాగానే ప్రయివేటుకి వెళ్ళేవాడిని. రాత్రి చీకటిపడేవరకు స్కూలు పుస్తకాల పాఠాలే కాకుండా ఇతర విషయాలుకూడా చెప్తుండేవారు. పెద్ద బాలశిక్ష చదివించేవారు. నీతి శతకాల్లో పద్యాలు బట్టీపట్టించేవారు. ఎక్కాలు వల్లెవేయించేవారు. జంతువుల కథలు, బహుశా పంచతంత్ర కథలు కావచ్చు, చెప్పేవారు.
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
తండ్రి కోప్పడడంతో రచయితకు ఏమి అర్థమైంది?
జవాబు:
తండ్రి కోప్పడడంతో తను తన బాల్యాన్ని దాటుకొని వచ్చేసినట్టు రచయితకు అర్ధమయ్యేది.
ప్రశ్న 2.
రచయిత బాల్యంలో గర్వపడిఎవి?
జవాబు:
రచయిత బాల్యంలో గర్వపడేవేవీ లేవు.
ప్రశ్న 3.
ప్రయివేట్లో ఏ కథలు చెప్పేవారు?
జవాబు:
ప్రయివేట్లో జంతువుల కథలు చెప్పేవారు.
ప్రశ్న 4.
పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
ప్రయివేట్లో ఏవి బట్టీ పట్టించేవారు?
3. ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఒక రోజున పాఠాలు చెప్పడం అయిపోయాక, యింకా చీకటి పడలేదు కదా! అని బొమ్మలు వెయ్యమన్నారు. నేను విమానం బొమ్మ, ఇల్లు బొమ్మ, కిరసనాయిలు బుడ్డిదీపం బొమ్మా వేసాను. యుద్ధం రోజులు, తరచుగా ఆకాశంలో కాస్త కిందనించి విమానాలు ఎగురుతుండగా చూసినందువల్లనో ఏమో! అది వేసాను. మా ప్రయివేటు చెప్పే అరుగు ఎదురుగా రోడ్డుమీద కిరసనాయిలు వీధి దీపం వుంది. అప్పుడే ఒకాయన చిన్ననిచ్చెనతో వచ్చి బుద్ధి దీపంలో కిరసనాయిలు వేసి వెళ్ళడం చూసినందువల్ల మనసులో ఆ రూపం మెదిలి దానిబొమ్మ వేసాను. ఆ రోజుల్లో మావూళ్ళో పెద్ద పెద్ద రోడ్లలో మాత్రమే కరెంటు దీపాలు ఉండేవి. మిగతా వీధులన్నిట్లో కిరసనాయిలు దీపాలే.
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
ప్రయివేటు చెప్పే అరుగు ఎదురుగా ఏమి ఉంది?
జవాబు:
ప్రయివేటు చెప్పే అరుగు ఎదురుగా కిరసనాయిలు దీపం ఉంది.
ప్రశ్న 2.
కరెంటు దీపాలు ఎక్కడ ఉండేవి?
జవాబు:
కరెంటు దీపాలు పెద్ద పెద్ద రోడ్లలో మాత్రమే ఉండేవి.
ప్రశ్న 3.
రచయిత వీధిలో ఏ దీపం ఉండేది?
జవాబు:
రచయిత వీథిలో కిరసనాయిలు దీపం ఉండేది.
ప్రశ్న 4.
పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
రచయిత కిరసనాయిలు దీపం బొమ్మ ఎందుకు వేశాడు?
4. ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఆ రోజున నేను వేసిన బొమ్మలకి నాకు ఫస్టు మార్కు వేసారు. బాగా వేసానని మెచ్చుకున్నారు. పలక మీద వేసిన ఆ బొమ్మలు చెరిగిపోకుండా జాగ్రత్తగా యింటికి తీసుకెళ్ళి మా అమ్మానాన్నలకు చూపించాను. వాళ్ళూ బాగున్నాయన్నారు. నేను బొమ్మలు బాగా వేస్తాను. గాబోలు అనుకున్నాను. అప్పటినుంచి అప్పుడప్పుడు యింటి దగ్గర క్లాసు పుస్తకాల్లోని బొమ్మల్ని కాపీ చేసి వేస్తుండేవాడ్ని. పలక మీద బలపంతో వేస్తుండే వాడినల్లా, కాగితం మీద పెన్సిలుతో వేయడం మొదలెట్టాను. కొంతకాలానికి చేయి తిరిగింది. ఆ తరువాత వాటర్ కలర్ బొమ్మలు, దామెర్ల రామారావు ఆర్ట్ గేలరీవారు హైస్కూలు విద్యార్థుల కోసం నిర్వహించే పోటీలలో పాల్గొనడాలు జరిగేవి.
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
రచయితను ఎందుకు మెచ్చుకొన్నారు?
జవాబు:
బొమ్మ బాగా వేశాడని రచయితను మెచ్చుకొన్నారు.
ప్రశ్న 2.
బొమ్మ చూసి తల్లిదండ్రులేమన్నారు?
జవాబు:
బొమ్మ చూసి తల్లిదండ్రులు బాగుందన్నారు.
ప్రశ్న 3.
బొమ్మలను ఎక్కడ నుండి కాపీ చేసేవాడు?
జవాబు:
బొమ్మలను తన క్లాసు పుస్తకం నుండి కాపీ చేసేవాడు.
ప్రశ్న 4.
పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
బొమ్మల పోటీలు ఎవరు నిర్వహించారు?
5. ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
మా పెదనాన్నగారు, మేము పక్కపక్కనే వుండేవాళ్ళం. మా పెద్దమ్మకి ఒక అక్క వుండేది. ఆమెకి చిన్నప్పుడే వైధవ్యం సంభవించి, తల్లిదండ్రులు చనిపోతే మా పెద్దమ్మ యింటికే వచ్చిచేరింది. పిల్లలు లేరు. ఆమెకు ప్రత్యేకంగా ఒక గది వుండేది. ఆ గదినిండా బొమ్మలే, ప్లాస్టిక్కువి, చెక్కవి, ఇత్తడివి, గాజువి, పింగాణీవి చిన్నచిన్న ఆటబొమ్మలు గది గోడలమీద, పెట్టెలమీద ఒక్క అరడుగైనా ఖాళీ లేకుండా అంతటా నిండివుండేవి. పిల్లల్ని ఎవరిని ఆ గదిలోకి రానిచ్చేది కాదు. కిటికీలోంచో, కొద్దిగా తీసిన తలుపు రెక్కల ఖాళీలోంచో బొమ్మలు చూసి ఆశ్చర్యపోతుండేవాళ్ళం. ఆ ఆసక్తి ఆ తర్వాత్తర్వాత నాకు కళాఖండాల సేకరణపట్ల అభిరుచి కలగడానికి కారణం.
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
ప్రత్యేక గదిలో ఉండే ఆమె రచయితకేమవుతుంది?
జవాబు:
ప్రత్యేక గదిలో ఉండే ఆమె రచయితకు పెద్దమ్మే అవుతుంది.
ప్రశ్న 2.
గది నిండా ఏమి ఉండేవి?
జవాబు:
గది నిండా బొమ్మలుండేవి.
ప్రశ్న 3.
రచయిత ఆశ్చర్యానికి కారణమేమిటి?
జవాబు:
గదిలో బొమ్మలు చూసి రచయిత ఆశ్చర్యపడేవాడు.
ప్రశ్న 4.
పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
గదిలోకి పిల్లలనెందుకు రానిచ్చేవారు కాదు?
6. ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
బాల్యంలోని యీ సంఘటనలూ, దృశ్యాలే నాలో ఒక చిత్రకారుడు తయారు కావడానికి కారణం అయివుండవచ్చు. వీటికి తోడు మా వూరిని ఆనుకుని విశాలంగా పరచుకుని ప్రవహించే జీవనది గోదావరి, దాని మీద ఊగిసలాడుతూ కదిలే పడవలూ, రంగురంగుల ఆకాశం, ఊరి చుట్టూ అల్లుకుపోయిన చెట్లూ చేమలూ – ఇవన్నీ పరోక్షంగా నాలో చిత్రకళ పట్ల ఆసక్తి కలగడానికి బాల్యంలో దోహదం చేసివుండొచ్చు.
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
రచయిత ఊరి ప్రక్క ఏ నది ఉండేది?
జవాబు:
రచయిత ఊరి పక్క గోదావరి నది ఉండేది.
ప్రశ్న 2.
ఊరి చుట్టూ ఏమి ఉండేవి?
జవాబు:
ఊరి చుట్టూ చెట్లూ చేమలూ ఉండేవి.
ప్రశ్న 3.
ఆకాశం ఎలా కనబడేది?
జవాబు:
ఆకాశం రంగు రంగులలో కనబడేది.
ప్రశ్న 4.
పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
పడవలెలా ఉండేవి?
7. ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
సాహిత్యానికి సంబంధించి కూడా నాలో బాల్యంలోనే బీజాలు పడ్డాయి. మిషనరీ స్కూల్లో ఆరో తరగతో, ఏడో తరగతో చదువుకొంటున్న రోజులు. మా యింటిదగ్గరే వుండే ప్రకాశరావు, అప్పారావు అనే బాల్యమిత్రులు పిల్లలకోసం నెలనెలా ఒక చేతివ్రాత పత్రిక తీసుకువద్దాం అన్నారు. చందమామ, బాల, పాపాయి అనే పత్రికలు చదివి అందులో లాంటి రచనలు అటూయిటూ మార్చి కొత్తది తయారుచేసే పని ప్రకాశరావుదీ, నాదీ. అప్పారావు దస్తూరీ ముత్యాల కోవలాగ వుంటుంది. గనుక, వాటిని చందమామ పత్రికసైజు కాగితాల మీద అందంగా రాసే పని అతనిది.
లోపల అక్కడక్కడ చిన్నచిన్న బొమ్మలు వేసి, అట్టమీద బొమ్మ రంగుల్లో వేసి పుస్తకంగా కుట్టి గోదావరి ఒడ్డున రామకృష్ణా మిషన్ వారి రీడింగ్ రూంలో పెట్టేవాళ్ళం. కొన్నినెలలు అలా చేయగలిగాం. అందుకోసం మాఊళ్ళోని పిచ్చిపుల్లయ్య’ కొట్లో అర్ధణాకీ, అనాకీ పాతవి పిల్లల పత్రికలు కొని తెచ్చి చదవవలసి వచ్చేది. బాల్యంలో నాలో సాహిత్యాభిరుచికి అది తొలిమెట్టు. అయిదో ఆరో సంచికలతో మా ప్రయత్నం ఆగిపోయినా, ఆ తర్వాత పుస్తకాలు చదివే లక్షణం కొనసాగుతూ వచ్చింది. మా యింట్లో పుస్తకాలు కొనే అలవాటు లేదు. మా తల్లిదండ్రులిద్దరిదీ వానాకాలపు చదువే.
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
వ్రాత పత్రిక ఎవరి కోసం
జవాబు:
వ్రాత పత్రిక పిల్లల కోసం.
ప్రశ్న 2.
పత్రిక తయారుచేసే పని ఎవరిది?
జవాబు:
పత్రిక తయారుచేసే పని రచయిత, ప్రకాశరావులది.
ప్రశ్న 3.
పత్రిక వ్రాత పని ఎవరిది?
జవాబు:
పత్రిక వ్రాత పని అప్పారావుది.
ప్రశ్న 4.
పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
వాళ్ల గ్రామంలోని కొట్టు ఎవరిది?
8. ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఎనిమిది వీథులతో కూడిన మా పేటలో తొంభై అయిదు శాతంమంది చేనేత కుటుంబాలవారే. వృత్తిపని చేసుకునేవారూ, ప్రతివీథిలోనూ అయిదారు చొప్పున వెలసిన మూసల (క్రూసిబుల్స్) కంపెనీల్లోనూ, ఇత్తడి, అల్యూమినియం పోతపాత్రల్ని తయారు చేసే కంపెనీల్లోనూ పనిచేసేవారూ సగంకన్న ఎక్కునే వుండేవారు. మిగిలినవారు బట్టల దుకాణాల్లో గుమాస్తాలుగా పనిచేస్తుండేవారు. అప్పట్లో చదువుకునేవారు చాలా తక్కువ. అంతా శ్రామిక వర్గమే. నా పద్నాలుగో ఏట తూర్పు గోదావరి జిల్లా విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో జరిగిన మహాసభల సందర్భంగా ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టారు. అందులో ప్రదర్శించిన నా చిత్రానికి ప్రథమ బహుమతి రావడం, డాక్టర్ గరికపాటి రాజారావుగారి చేతులమీదుగా ఆ బహుమతిని అందుకోవడం, అదే నా తొలి బహుమతి కావడం నాకో కొత్త అనుభవం.
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
ఆ వీధిలోని వారు వృత్తి ఏమిటి?
జవాబు:
ఆ వీధిలోని వారు చేసేది చేనేత వృత్తి.
ప్రశ్న 2.
గ్రామంలో ఎక్కువమంది ఏ వర్గం
జవాబు:
గ్రామంలో ఎక్కువమంది శ్రామిక వర్గం.
ప్రశ్న 3.
రచయితకు బహుమతి దేనికి వచ్చింది?
జవాబు:
రచయితకు చిత్రానికి బహుమతి వచ్చింది.
ప్రశ్న 4.
పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
రచయితకు బహుమతి ఎన్ని సంవత్సరాల వయస్సులో వచ్చింది?
9. ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఇప్పటి నాకూ, నా బాల్యానికి మధ్య నాలుగున్నర దశాబ్దాల దూరం వుంది. ఇన్నేళ్ళలో దేశసామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో ఎన్నో మార్పులు వచ్చాయి. నాలోనూ ఎన్నో మార్పులు వచ్చాయి. ఎన్నెన్నో ప్రభావాలు నా మీద పడ్డాయి. కొత్తకొత్త అభిరుచులు ఏర్పడ్డాయి. కొత్తమిత్రులు ఏర్పడ్డారు. అయినా బాల్యమిత్రుల్ని నేను వదులుకోలేదు. వాళ్ళు నన్ను వదిలేయలేదు. నా మట్టుకు నాకు బాల్యంలో పెనవేసుకున్న స్నేహాలే ఇప్పటికీ ఏమాత్రం -సడలిపోకుండా అలాగే కొనసాగుతూ వస్తున్నాయనిపిస్తుంది. స్నేహం స్నేహం కోసమే చేయడం ఒక్క బాల్యంలోనే వుంటుందని నేను అనుకుంటూ వుంటాను.
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
రచయితకు బాల్యం పోయి ఎన్ని సంవత్సరాలయింది?
జవాబు:
రచయితకు బాల్యం పోయి 45 సంవత్సరాలయింది.
ప్రశ్న 2.
స్నేహం కోసం స్నేహం చేసేవారివరు
జవాబు:
స్నేహం కోసం స్నేహం చేసేవారు బాల్య స్నేహితులు.
ప్రశ్న 3.
ఏ మాత్రం సడలని స్నేహలేవి?
జవాబు:
బాల్య స్నేహాలు ఏ మాత్రం సడలని స్నేహాలు.
ప్రశ్న 4.
పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
రచయిత ఎవర్ని వదులుకోలేదు?
10. ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఎంతో ఆత్మీయంగా, సన్నిహితంగా కలిసిమెలిసి వున్న చిన్ననాటి మిత్రులు నలుగురిలో ఒకరిని కాలం కాటేసింది. ముగ్గురు మిగిలారు. నాతోపాటు నలుగురం. ఎప్పుడోగాని మేం కలుసుకోం. కాని కలుసుకున్నప్పుడు మాత్రం మళ్ళీ చిన్నపిల్లలమైపోయి చాలా స్వచ్ఛమైన మనసుతో, నిష్కల్మషమైన చూపులతో, ఆత్మీయతతో, అభిమానంతో ఒకరి హృదయాల్లోకి ఒకరం ఒదిగిపోతాం. ఈ మధ్యకాలంలో ఏర్పడిన అభిప్రాయభేదాలు కాని, అంతరాలుకాని మాకు అడ్డుగా నిలవ్వు. ఒకరి లోపాల్ని ఒకరం తేలిగ్గా క్షమించుకోగలుగుతాం. ఎందుకోగాని ఆ తర్వాత ఏర్పడిన స్నేహాల్లో యిది కనిపించడం లేదు. ఒకరికొకరం ఎంత సన్నిహితంగా వచ్చినా, ఒకరికొకరం ఆప్యాయతల్ని ఎంతగా యిచ్చి పుచ్చుకుంటున్నా ఒకరి లోపాలు ఒకరికి గోరంతలు కొండంతలుగా అనిపించడమూ, ఒకర్ని ఒకరం తేలిగ్గా క్షమించలేకపోవడమూ గమనించాను.
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
ఎవరిని కాలం కాటేసింది?
జవాబు:
ఒక మిత్రుని కాలం కాటేసింది.
ప్రశ్న 2.
రచయిత బాల్య స్నేహితులెంతమంది?
జవాబు:
రచయిత బాల్య స్నేహితులు నలుగురు.
ప్రశ్న 3.
ఆత్మీయతతో కూడిన స్నేహమేది?
జవాబు:
బాల్య స్నేహమే ఆత్మీయతతో కూడిన స్నేహం.
ప్రశ్న 4.
పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
ఏ స్నేహంలో తేలిగ్గా క్షమించుకోవడం ఉండదు?
అపరిచిత గద్యాలు
1. కింది లేఖను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
విజ్జేశ్వరం, గౌరవనీయులైన మున్సిపల్ కమిషనర్ గారికి, ఇట్లు, చిరునామా: |
ప్రశ్నలు – జవాబులు
అ) నీరు రోడ్ల మీదకు రావడానికి కారణమేమిటి?
జవాబు:
మురుగు కాలువలను శుభ్రం చేయకపోవడం వలన కాలువలు నిండి రోడ్లపైకి మురికినీరు వస్తుంది.
ఆ) దోమల వల్ల ఏ సమస్య వచ్చే అవకాశం ఉంది?
జవాబు:
దోమల వల్ల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
ఇ) ఈ లేఖను ఎవరు ఎవరికి రాశారు?
జవాబు:
ఈ లేఖను రాఘవయ్య, మున్సిపల్ కమిషనర్ గారికి రాశాడు.
ఈ) పై లేఖ ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
వ్యర్థ పదార్థాలను రోడ్లమీద వదిలేయడం వల్ల పరిసరాలు ఏ విధంగా మారుతున్నాయి?
2. కింది పేరాను చదివి, దిగువన ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.
సాహితీ సృజనలో అంతర్జాతీయ కీర్తి నందుకొన్న మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్, కవిగా, రచయితగా, తత్త్వవేత్తగా, సంగీతజ్ఞుడిగా, చిత్రకారుడిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు. వీరి పేరు వినగానే చప్పున స్ఫురించేవి ‘జనగణమన గీతం’, ‘గీతాంజలి’. జనగణమన గీతం భారత జాతీయ గీతంగా గుర్తింపబడింది. బంగ్లాదేశ్ జాతీయ గీతం కూడా వీరి లేఖిని నుండి వెలువడినదే. ఇలా రెండు జాతీయ గీతాలనందించిన కవిగా, అపూర్వ చరిత్రను సృష్టించారు. “శాంతి నికేతన్’ పేరున ఆదర్శ విద్యాలయా స్థాపించి, ‘గురుదేవుడు’ గా కీర్తింపబడ్డారు.
ప్రశ్నలు – జవాబులు
అ) అంతర్జాతీయ కీర్తినందుకొన్న భారతీయ మహాకవి ఎవరు?
జవాబు:
అంతర్జాతీయ కీర్తినందుకొన్న భారతీయ మహాకవి “రవీంద్రనాథ్ ఠాగూర్'”.
ఆ) ఏ రెండు దేశాలకు ఠాగూర్ జాతీయ గీతాలను అందించాడు?
జవాబు:
భారత్, బంగ్లాదేశ్లకు ఠాగూర్ జాతీయ గీతాలను అందించాడు.
ఇ) రవీంద్రనాథ్ ఠాగూర్ నెలకొల్పిన విద్యాసంస్థ ఏది?
జవాబు:
రవీంద్రనాథ్ ఠాగూర్ ‘శాంతి నికేతన్’ అనే విద్యాసంస్థను నెలకొల్పాడు.
ఈ) రవీంద్రుని ప్రసిద్ధ రచనలు రెండింటిని రాయండి.
జవాబు:
రవీంద్రుడు 1) గీతాంజలి 2) జనగణమన గీతం రచించాడు.
3. కింది పేరాను చదివి, ప్రశ్నలకు సమాధానములు రాయండి.
పద్యనాటక రచయితలలో ప్రత్యేకస్థానాన్ని అందుకున్న వారు, తిరుపతి వేంకట కవులు. వీరు 1) దివాకర్ల తిరుపతి శాస్త్రి 2) చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి, వీరు శతావధానులు, తమ అవధానాలతో వీరు ఆంధ్రదేశం అంతా పర్యటించి, సాహిత్య ప్రపంచంలో నూతనోత్తేజాన్ని కలిగించారు. వీరి అవధానాలతో స్ఫూర్తి పొందిన ఎందరో వ్యక్తులు సాహిత్యరంగంలో అడుగిడి కృషి చేశారు. ఆధునికాంధ్ర సాహిత్యంలో వీరికి ఎందరో లబ్ధ ప్రతిష్ఠులైన శిష్యులున్నారు. విశ్వనాథ, వేటూరి, కాటూరి, పింగళి వారలు వీరి శిష్యులే. వీరు రచించిన పాండవోద్యోగ విజయ బాటకాలకు లభించిన ప్రసిద్ధి ఇంతింతనరానిది. పశువులకాపరి నుండి పండితుల వరకు అందరి నాల్కలపై వీరి పద్యాలు నాట్యం చేస్తున్నాయి.
ప్రశ్నలు – జవాబులు
అ) తిరుపతి వేంకట కవులు ఎవరు?
జవాబు:
తిరుపతి వేంకట కవులు జంట కవులు. వీరు 1) దివాకర్ల తిరుపతి శాస్త్రి 2) చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి.
ఆ) వీరు సాహిత్య రంగంలో నూతనోత్తేజాన్ని దేని ద్వారా కల్పించారు?
జవాబు:
వీరు అవధానాల ద్వారా సాహిత్యరంగంలో నూతనోత్తేజాన్ని కలిగించారు.
ఇ) వీరి ప్రసిద్ధికెక్కిన నాటకాలు ఏవి?
జవాబు:
‘పాండవోద్యోగ విజయాలు’ అనే వీరి నాటకాలు ప్రసిద్ధి పొందాయి.
ఈ) వీరి శిష్యులలో ఇద్దరిని పేర్కొనండి.
జవాబు:
వీరి శిష్యులలో 1) విశ్వనాథ సత్యనారాయణ 2) వేటూరి ప్రభాకరశాస్త్రి ప్రసిద్ధులు.
4. కింది పేరా చదివి, అర్థవంతమైన నాలుగు ప్రశ్నలు రూపొందించండి.
గాంధీ మహాత్ముడు పోరుబందరులో జన్మించాడు. అక్కడ అతని బాల్యంలో చదువు ఏ మాత్రమూ సాగలేదు. అతని తండ్రి పోరుబందరు నుండి రాజకోట వచ్చి కొత్త ఉద్యోగంలో చేరాడు. అక్కడ గాంధీ విద్యార్థి జీవితం ప్రారంభం అయింది. అతడు ముందుగా సబర్బను స్కూలులోను, ఆ తరువాత హైస్కూలులోను చేరి చదువుకున్నాడు. విద్యార్థి దశలో అతను ఎక్కువ బిడియంతో ఉండి ఎవరితోను కలిసిమెలిసి ఉండేవాడు కాదు. ఒకనాడు పరీక్షాధికారి అయిదు “మాటలు చెప్పి వాటి వర్ణక్రమాన్ని వ్రాయమన్నారు. వాటిలో కెటిల్ అనే మాటను గాంధీ తప్పుగా వ్రాశాడు.
జవాబులు:
అ) గాంధీ ఎక్కడ జన్మించాడు?
ఆ) అతడు ఏయే స్కూళ్లల్లో చదువుకున్నాడు?
ఇ) విద్యార్థి దశలో అతను ఎలా ఉండేవాడు?
ఈ) అతడు పరీక్షలో దేనిని తప్పుగా వ్రాశాడు?
5. కింది పేరా చదివి, అర్థవంతమైన నాలుగు ప్రశ్నలు రూపొందించండి.
“కవిత్వం, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, శిల్పం – ఈ ఐదింటిని లలిత కళలంటారు. ఈ కళల్లో కృష్ణదాయలకు తగినంత చొరవ ఉండేది. ఆయన ఆస్థానంలో కవులు, గాయకులు, నాట్యకారులు, చిత్రకారులు, శిల్పులు ఉండేవారు. వారు తమ తమ కళలను అద్భుతరీతిలో ప్రదర్శించి రాయల మన్ననలందుకొనేవారు. కళలు మానవుని హృదయాన్ని స్పందింపజేసే స్వభావం కలవి. కళలను ఆనందించలేనివాడు రాయి లాగే జడుడని చెప్పవచ్చు.”
జవాబులు:
అ) లలితకళలేవి?
ఆ) కవులు రాయల మన్ననలందుకొనడానికి గల కారణమేమి?
ఇ) కళలను ఆనందించలేని వాడు రాయి లాగే జడుడు అంటే అర్థం ఏమిటి?
ఈ) సంగీతం పాడేవారిని గాయకులంటారు. అలాగే చిత్రాలను వేసే వారిని ఏమంటారు?
వ్యక్తీకరణ సృజనాత్మకత
అ) ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
చేజారిన బాల్యం పాఠ్య రచయిత గురించి వ్రాయండి.
జవాబు:
శీలా వీర్రాజు రాజమండ్రిలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు వీరభద్రమ్మ, సూర్యనారాయణ, ఆయన రచయితగా, చిత్రకారుడుగా తనదైన ముద్ర వేశారు. సమాధి, మబ్బుతెరలు, రంగుటద్దాలు, ఊరు వీడ్కోలు చెప్పింది, మనసులో కుంచె, మొదలైన కథా సంపుటాలు, కొడిగట్టిన సూర్యుడు, కిటికీ కన్ను, ఎర్రడబ్బా రైలు, పడుగుపేకల మధ్య జీవితం మొదలైన కవితా సంపుటాలను, మైనా, కరుణించని దేవత, వెలుగురేఖలు మొదలైన నవలలలను రాశారు. వీరు ‘శీలావీ ‘గా సుపరిచితుడు. 1969లో ‘మైనా’ నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
ప్రశ్న 2.
‘చేజారిన బాల్యం’ పాఠ్య ప్రక్రియను గురించి రాయండి.
జవాబు:
ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని పూర్వాపరాలను చర్చిస్తూ, విశ్లేషణాత్మకంగా విస్తరించి రాయడమే వ్యాసం, దీనిలో ఉపోద్ఘాతం, విషయ విస్తరణ, ముగింపు వంటివి ప్రధానాంగాలుగా ఉంటాయి. వ్యాసంలోని విషయాన్ని బట్టి చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, శాస్త్ర, వైజ్ఞానిక, సాహిత్య, తాత్విక, ఆధ్యాత్మిక మొదలైన విభాగాలుగా విభజించవచ్చు.
ప్రశ్న 3.
బాల్యపు రోజుల గురించి రచయిత అభిప్రాయం ఏమిటి?
జవాబు:
బాల్యపు రోజులు మళ్లీ వస్తే బాగుండుననుకొనేటంత తియ్యని రోజులు, ఆ రోజులు ఎవ్వరికైనా మధుర జ్ఞాపకాలే, చాలా అమాయకపు రోజులవి. ఎంతో చక్కని రోజులవి, ఆటపాటల్తో హాయిగా, ఆనందంగా, నిష్కల్మషంగా, ఏ చీకూ చింతా లేకుండా గడచిపోయిన రోజులవి. చూస్తూ ఉండగానే బాల్యం ఇట్టే గడిచిపోతుంది. ఆ రోజులు ఇట్టే ఐపోతాయి.
రచయితకు మాత్రం తనను తాను చూసుకొని గర్వపడడానికి, తృప్తిపడడానికి కారణమైన మూలబీజాలు మాత్రం తన బాల్యంలో పడ్డాయి అని ఆయన అభిప్రాయం. తను చిత్రకారుడు కావడానికీ, సాహితీవేత్త కావడానికి పునాదులు బాల్యంలోనే పడ్డాయి అని ఆయన నిశ్చితాభిప్రాయం.
ప్రశ్న 4.
రచయిత గ్రామస్తుల గురించి వ్రాయండి.
జవాబు:
రచయిత పేటలో 8 వీధులున్నాయి. వారిలో 95% చేనేత కుటుంబాలవారే. చేనేత వృత్తి చేసేవారే. ప్రతి వీథిలోనూ శ్రామికులే ఎక్కువ. మూసల కంపెనీలలోనూ, ఇత్తడి, అల్యూమినియం పోత పాత్రల్ని తయారుచేసే కంపెనీల్లోనూ పేటలో సగం కంటే ఎక్కువమంది పనిచేసేవారు. మిగిలినవారు బట్టల దుకాణాల్లో గుమాస్తాలుగా పనిచేసేవారు. వారి పేటలో చదువుకొన్నవారు తక్కువమంది. అవి కూడా వానాకాలం చదువులే. అస్సలు చదువుకోనివారే ఆ పేటలో ఎక్కువమంది ఉన్నారు. అందరూ సమానమైన వారే కనుక బహుశా కలిసిమెలిసే ఉండి ఉంటారు.
ఆ) ఈ క్రింది ప్రశ్నకు 8 లేదా 10 వాక్యాల్లో సమాధానం రాయండి.
ప్రశ్న 1.
దామెర్ల రామారావు మరియు డాక్టర్ గరికపాటి రాజారావుల గురించి మీకు తెల్సింది రాయండి.
జవాబు:
1) దామెర్ల రామారావు (1897 మార్చి 8 – 1925 జూన్ 6) ఒక భారతీయ చిత్రకారుడు. రాజమండ్రిలో జన్మించిన ఈయన మేనమామ ప్రోత్సాహంతో చిన్నతనం నుంచి చిత్రకళలో ప్రవేశం పొందాడు. ఆస్వాల్డ్ కూల్డ్రే అనే ఆంగ్లేయుడు ఈయనలోని ప్రతిభను గుర్తించి మరింతగా సానబెట్టాడు. భారతదేశంలోని పలు సంస్థానాల రాజులు ఈయన చిత్రకళను ప్రశంసించారు. 1923లో రాజమండ్రిలో చిత్రకళా పాఠశాలను స్థాపించి యువకులకు శిక్షణ ఇచ్చాడు. 28 ఏళ్ళకే కన్నుమూశాడు. ఈయన పేరు మీదగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చిత్రకళామందిరాన్ని నడుపుతోంది.
2) డాక్టర్ గరికపాటి రాజారావు (5.2.1915 – 8.9.1963) తెలుగు సినిమా దర్శకుడు. నాటకరంగ ప్రముఖుడు. ఆంధ్రప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు. ఈ ప్రజానాట్యమండలి ద్వారా అనేక మంది ప్రతిభావంతమైన కళాకారులు పరిచయమయ్యారు. వృత్తిరీత్యా వైద్యుడైన రాజారావు ఉచితంగా వైద్యసేవలు అందించాడు. మందులు కూడా ఉచితంగా ఇచ్చేవారు. విజయవాడ, రాజమండ్రిలోనూ ప్రజావైద్యశాల నిర్వహించాడు. దేవిక, అల్లురామలింగయ్య, సంగీత దర్శకులు మోహన్దాస్, టి. చలపతిరావు, నృత్యదర్శకుడు వేణుగోపాల్, రచయితలు సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు, బుర్రకథ కళాకారుడు షేక్ నాజర్లు వంటి ప్రతిభావంతులైన కళాకారులు ప్రజానాట్యమండలి .. ద్వారా పరిచయమయ్యారు.
ఇ) కింది అంశాల గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.
ప్రశ్న 1.
స్నేహం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ అందరినీ స్నేహంగా ఉండమని కోరుతూ ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:
స్నేహాన్ని కాపాడదాం
మిత్రమా! ఆగు! నేను చెప్పేది విను!
ఆపదలలో ఆదుకొనేవాడు మిత్రుడే!
నీ రహస్యాలను కాపాడేవాడు మిత్రుడా!
నీ బాగును మనసారా కోరుకొనేవాడు మిత్రుడే
నీ విజయాలకు పొంగిపోయేవాడు మిత్రుడే
అలాంటి మిత్రుడు డబ్బుకు లొంగడు.
బెదిరింపులకు భయపడడు.
కష్టపెడితే కరిగిపోడు.
కానీ, స్నేహానికి మాత్రం దాసుడౌతాడు.
అటువంటి స్నేహితులను వదులుకోవద్దు.
అందరం ఒకరినొకరు అర్థం చేసుకొంటేనే స్నేహాలు నిలబడతాయి. ‘స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం’ అన్నాడొక సినీకవి. ‘అల్లాయే దిగివచ్చి, ఏమి కావాలంటే మిద్దెలొద్దు! మేడలొద్దు! ఒక్క నేస్తం చాలంటాను’ అన్నాడొక చెలికాడు.
స్నేహ హస్తం చాచుదాం! స్నేహంగా జీవించుదాం!!
ప్రతులు : 10,000
ఇట్లు, సహృదయ మిత్రమండలి,
మామిడి కుదురు.
2. మీకు తెలిసిన ఆదర్శవంతులైన స్నేహితుల గురించి వివరిస్తూ మిత్రునకు లేఖ వ్రాయండి.
జవాబు:
తిరుపతి, ప్రియమైన స్వాతికి, కుచేలుడికి సంతానం, పేదరికం, కష్టాలు ఎక్కువ. ఏనాడూ తినడానికి తిండి కూడా సరిగ్గా ఉండేది కాదు. ఒకరోజు ఆయన భార్య ఆయనను శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్లి ధనం అడగమంటుంది. ఇష్టం లేకపోయినా ప్రయాణమయ్యాడు. కొంగున గుప్పెడు అటుకులతో, కుచేలుని అల్లంత దూరాన చూసిన శ్రీకృష్ణుడు పరుగు పరుగున వెళ్లాడు. ఆహ్వానించాడు, తన హంస తూలికా తల్పంపై కూర్చోబెట్టాడు. ఎన్నో కబుర్లు చెప్పేసుకున్నారు. కుచేలుడు తెచ్చిన అటుకులను కృష్ణుడు ఆనందంగా తిన్నాడు. కుచేలుడు డబ్బులడగలేదు. తిరుగు ప్రయాణమయ్యాడు. కృష్ణుడూ మాట్లాడలేదు. అమేయమైన సంపదలు ప్రసాదించాడు. వారి స్నేహానికి ధనం అడ్డుకాదు, కులాలు అంతరం సృష్టించలేదు. హెూదాలు గుర్తించలేదు. అది నిష్కల్మషమైన బాల్య స్నేహం, అలా ఉంటే అందరూ ఎంత బాగుంటుందో! కదా! ఇట్లు, చిరునామా : |
భాషాంశాలు (పదజాలం వ్యాకరణాంశాలు)
కింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి.
అ) గీత గీసిన పదానికి అర్థం రాయండి.
1. ప్రతి ఏడు వర్షాలు వస్తాయి.
జవాబు:
సంవత్సరం
2. బాల్యం అంటే అందరికీ ఇష్టమే.
జవాబు:
చిన్నతనం
3. నేను అబద్ధం చెప్పవద్దంటాను.
జవాబు:
అసత్యం
4. ప్రతివారికీ కల వస్తుంది.
జవాబు:
స్వప్నం
5. ప్రతి పుట్టినరోజుకీ ఒక సంవత్సరం వయసు పెరుగుతుంది.
జవాబు:
ప్రాయం
6. కోనసీమకు రైలు లేదు.
జవాబు:
ధూమ శకటం
7. వర్షంలో ఆడుకోవడం సరదాగా ఉంటుంది.
జవాబు:
వాన
8. చదువుకోవడం పిల్లల విధి.
జవాబు:
కర్తవ్యం
9. పిల్లలు మారం చేస్తారు.
జవాబు:
గారాబం
10. కోపం వలన ఆరోగ్యం పాదౌతుంది.
జవాబు:
క్రోధం
ఆ) గీత గీసిన పదానికి సరియైన అర్థాన్ని గుర్తించండి.
11. ఎవరి కుటుంబం వారిది.
అ) ప్రపంచ
ఆ) లోకం
ఇ) బంధుత్వం
ఈ) సంసారం
జవాబు:
ఈ) సంసారం
12. గర్వం ఉండకూడదు.
అ) పొగరు
ఆ) కోపం
ఇ) ద్వేషం
ఈ) కల్మషం
జవాబు:
అ) పొగరు
13. సమాజాన్ని సాహితీవేత్తలు బాగుచేయగలరు.
అ) కవి
ఆ) పండితుడు
ఇ) సాహిత్యం తెలిసినవాడు.
ఈ) పద్యం అల్లేవాడు
జవాబు:
ఇ) సాహిత్యం తెలిసినవాడు.
14. మంచిని గుర్తు పెట్టుకోవాలి.
అ) మరపు
ఆ) ఆలోచన
ఇ) జ్ఞాపకం
ఈ) తెలివి
జవాబు:
ఇ) జ్ఞాపకం
15. మనిషికి బాల్యమే పునాది వేస్తుంది.
అ) ఆధారం
ఆ) బలం
ఇ) శక్తి
ఈ) ధనం
జవాబు:
అ) ఆధారం
16. తాడిచెట్టు సుమారు 30 అడుగులు పొడవు ఉంది.
అ) కచ్చితంగా
ఆ) ఇంచుమించు
ఇ) మచ్చుకి
ఈ) కొలత
జవాబు:
ఆ) ఇంచుమించు
17. వీధి బడిలో వీర్రాజు గారు చదివారు.
అ) పాఠశాల
ఆ) కళాశాల
ఇ) యూనివర్శిటీ
ఈ) అరుగు
జవాబు:
అ) పాఠశాల
18. మంచి విషయం వినాలి.
అ) అంశ
ఆ) అంశం
ఇ) అంకుశం
ఈ) అంచ
జవాబు:
ఆ) అంశం
19. చీకటిలో ప్రయాణం మంచిది కాదు.
అ) తమము
ఆ) తేమరు
ఇ) తామర
ఈ) తాము
జవాబు:
అ) తమము
20. ఆ బొమ్మ బాగుంది.
అ) దృశ్యం
ఆ) రంగు
ఇ) చిత్రం
ఈ) తోట
జవాబు:
ఇ) చిత్రం
పర్యాయపదాలు
అ) గీత గీసిన పదానికి పర్యాయ పదాలు రాయండి.
21. మిత్రుడు ఆపదలో ఆదుకొంటాడు.
జవాబు:
స్నేహితుడు, సఖుడు
22. చందమామ వెన్నెల కురిపిస్తోంది.
జవాబు:
శశి, నెలవంక
23. అతని చేతి వ్రాత బాగుంటుంది.
జవాబు:
లేఖనం, లిపి, దస్తూరీ
24. కొత్త పుస్తకాలు మంచి వాసన వస్తాయి.
జవాబు:
నవ, నవీనం, నూతనం
25. మంచి ముత్యాలు ధరిస్తే అందం, ఆరోగ్యం వస్తుంది.
జవాబు:
ముత్తెములు, మౌక్తికాలు
26. ముత్యాల కోవ అందంగా ఉంటుంది.
జవాబు:
దండ, వారం, మాలిక
27. గోదావరి ఒడ్డు పాడిపంటలతో అలరారుతుంది.
జవాబు:
తీరము, దరి
28. ప్రకృతి అందం వర్ణనాతీతం.
జవాబు:
సొగసు, సోయగం
29. తెలుగు నెలలు నోటికి రావాలి.
జవాబు:
ద్విపక్షము, మాసము, శ్రామము
30. మంచి లక్షణం బాల్యంలోనే నేర్చుకోవాలి.
జవాబు:
గుణము, స్వభావము
ఆ) గీత గీసిన పదానికి సరియైన పర్యాయపదాలు గుర్తించండి.
31. తొలి చినుకులోనే వాన ముమ్మరం తెలుస్తుంది.
అ) మొదలు, ప్రారంభం
ఆ) తుద, మొదలు
ఇ) కొన, కోన
ఈ) చివర, చిట్టచివర
జవాబు:
అ) మొదలు, ప్రారంభం
32. కాలం ఎప్పుడూ ఒకేలాగ ఉండదు.
అ) సమయం, నలుపు
ఆ) సమయం, ప్రొద్దు
ఇ) ఉదయం, రాత్రి
ఈ) సంధ్య, సందె
జవాబు:
ఆ) సమయం, ప్రొద్దు
33. చదువు జీవితంలో మంచి పరిణామం తెస్తుంది.
అ) కొలత, కొలుచు
ఆ) కలత, కలచు
ఇ) మార్పు, కొత్త స్థితి
ఈ) రూపు, రూపం
జవాబు:
ఇ) మార్పు, కొత్త స్థితి
34. గురువులపై విశ్వాసం ఉండాలి.
అ) గౌరవం, మర్యాద
ఆ) ప్రేమ, అభిమానం
ఇ) మైత్రి, స్నేహం
ఈ) సమ్మకం, నమ్మిక
జవాబు:
ఈ) నమ్మకం, నమ్మిక
35. విద్యార్థి నడవడికలో చదువు మార్పును తెస్తుంది.
అ) నడవడి, నడత
ఇ) మడత, పిడత
ఆ) నడక, నడత
ఈ) కడ, కడు
జవాబు:
అ) నడవడి, నడత
36. మంచి కంటె చెడుకు విస్తరణ ఎక్కువ.
అ) ఖ్యాతి, కీర్తి
ఆ) వ్యాప్తి, వ్యాపనం
ఇ) సంకోచం, వ్యాకోచం
ఈ) అల్లరి, హడావుడి
జవాబు:
ఆ) వ్యాప్తి, వ్యాపనం
37. విద్య వలన వికాసం పెరుగుతుంది.
అ) గౌరవం, గారవం
ఆ) హోదా, పదవి
ఇ) వికసనము, తెలివి
ఈ) ఓర్పు, నేర్పు
జవాబు:
ఇ) వికసనము, తెలివి
38. శక్తికి సరిపడ పని చేయాలి.
అ) బలం, బలిమి
ఆ) కలం, కలిమి
ఇ) చలం, చెలిమి
ఈ) హలం, వల
జవాబు:
అ) బలం, బలిమి
39. ఏదో వృత్తి చేసుకొని బ్రతకాలి.
అ) పని, గని
ఇ) చని, కని
ఆ) వని, అని
ఈ) జీవనోపాయం, జీవనోపాధి
జవాబు:
ఈ) జీవనోపాయం, జీవనోపాధి
40. ఇత్తడి పాత్ర వాడుక తగ్గింది.
అ) గుండిగ, బాణలి
ఆ) గిన్నె, తిన్నె
ఇ) చెంబు, గ్లాసు
ఈ) కంచం, మంచం
జవాబు:
అ) గుండిగ, బాణలి
ప్రకృతి వికృతులు
అ) గీత గీసిన పదానికి సరియైన ప్రకృతి పదం రాయండి.
41. మంచి జతనము మానకూడదు.
జవాబు:
యత్నము
42. మంచి గొనము కలిగి ఉండాలి.
జవాబు:
గుణము
43. యువజనం సత్తువతో ఉండాలి.
జవాబు:
శక్తి
44. చెమటతో సాధ్యం కానిది లేదు.
జవాబు:
శ్రమ
45. తూరుపు తెల్లవారగానే పక్షుల కిలకిలలు మొదలౌతాయి.
జవాబు:
తూర్పు
ఆ) గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
46. మంచి స్నేహం లిలబెట్టుకోవాలి.
అ) నెయ్యము
ఆ) మైత్రి
ఇ) సఖ్యం
ఈ) చెలిమి
జవాబు:
అ) నెయ్యము
47. అందరి హితము కోరుకోవాలి.
అ) హేతువు
ఆ) మేలు
ఇ) ఇత
ఈ) మంచి
జవాబు:
ఇ) ఇతవు
48. మంచి హృదయం కలిగి ఉండాలి.
అ) గుండె
ఆ) ఎద
ఇ) మనసు
ఈ) మది
జవాబు:
ఆ) ఎద
49. స్నేహితులను దూరం పెట్టకు.
అ) దవ్వు
ఆ) దగ్గర
ఇ) సుదూరం
ఈ) ప్రక్క
జవాబు:
అ) దవ్వు
నానార్థాలు
అ) గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి.
50. నేడు సామాన్యులు కూడా విమానం ఎక్కుతారు. విమానంలో ఉండేవారూ ఎక్కుతారు.
జవాబు:
వ్యోమయానము, చక్రవర్తి సౌధం
51. అక్క ఎవరికైన అక్క.
జవాబు:
పెద్ద సోదరి, పూజ్య శ్రీ
52. పెద్దమ్మను చూస్తే పెద్దమ్మ పారిపోతుంది.
జవాబు:
పెద తల్లి, దరిద్ర దేవత
53. గదిలో గది ఉన్నాడు.
జవాబు:
ఇంటిలోని అర, విష్ణువు
54. బొమ్మను చూసి బొమ్మ ముడివేస్తావేం?
జవాబు:
ప్రతిమ, బొమముడి
55. ఇల్లు ఇల్లు కోసమే.
జవాబు:
గృహం, కుటుంబం
56. ఆ దీపం దగ్గరగా దీపం పెట్టవద్దు.
జవాబు:
తీగ, దివ్వె
57. పెట్టె తీసుకుని పెట్టెలోకి ఎక్కు
జవాబు:
పీటిక, రైలు డబ్బా
58. తమలపాకులలోకి చెక్క ఆ చెక్క మీద ఉంది.
జవాబు:
వక్క, బిల్ల చెక్కు
59. గాజుతో చేసిన గాజు మెరుస్తోంది.
జవాబు:
ఒక రకమైన మట్టి, చేతికి ధరించే గాజు
ఆ గీత గీసిన పదానికి సరైన నానార్థాలు గుర్తించండి.
60. ఖాళీ సీసాలో నీరు ఖాళీ
అ) నీరు, నిండు
ఆ) పాలు, కొంచెం
ఇ) ఉత్తది, ఆక్రమింపబడినది
ఈ) అందం, నిండైనది.
జవాబు:
ఇ) ఉత్తది. ఆక్రమింపబడినది
61. నా రెక్కతో పక్షి రెక్క బాగు చేసాను.
అ) చేయి, పక్షము
ఆ) రెక్క డొక్క
ఇ) ప్రక్క తిక్క
ఈ) పక్షము, రక్షణ
జవాబు:
అ) చేయి, పక్షము
62. ఆస్తి మీద ఎక్కువ ఆస్తి పనికిరాదు.
అ) తోట, పన్ను
ఆ) కూడబెట్టిన ధనము, ఇష్టము
ఇ) ఇల్లు, గృహము
ఈ) అసలు, వడ్డీ
జవాబు:
ఆ) కూడబెట్టిన ధనము, ఇష్టము
63. పెదనాన్న వాటాకు దక్షిణం వాటా వచ్చింది.
అ) సొమ్ము, తోట
ఆ) ధనము, బంగారం
ఇ) భాగం, వెండి
ఈ) భాగం, ఇంటిలోని భాగం
జవాబు:
ఈ) భాగం, ఇంటిలోని భాగం
64. సూర్యుని రంగు తెలుగు రంగు కలిగి ఉంది.
ఆ) కాంతి, వర్ణం
ఆ) కాంతి, ఎరుపు
ఇ) వెలుగు, తెలుపు
ఈ) కిరణం, నారింజ
జవాబు:
ఆ) కాంతి, వర్గం
వ్యుత్పత్యర్థాలు
అ) గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్ధం రాయండి.
65. తృప్తి కలవాడు ధన్యుడు.
జవాబు:
తనియుట (తర్పణం)
66. యద్ధం వలన నష్టమే జరుగుతుంది.
జవాబు:
పోరుట (రణం)
67. ఆ చిత్రం చూసి ఆశ్చర్యం కలిగింది.
జవాబు:
ఆస్వాదించుటకు యోగ్యమైనది. (విస్మయం)
68. గోదావరి నదీ తీరం అందమైనది.
జవాబు:
మ్రోయునది (సోత్రస్సు)
69. దామెర్ల రామారావు చిత్రము బాగుంది.
జవాబు:
దీనియందు అన్ని రంగులు కూర్పబడును. (బొమ్మ)
ఆ) గీత గీసిన పదానికి సరైన వ్యుత్పత్వర్థాన్ని గుర్తించండి.
70. మంచి మిత్రుడు బంగారంతో సమానం.
అ) స్నేహించువాడు (సఖుడు)
ఆ) ప్రేమించువాడు (ప్రియుడు)
ఇ) ఇష్టపడేవాడు (సఖుడు)
ఈ) కోప్పడేవాడు (కోపి)
జవాబు:
అ) స్నేహించువాడు (సఖుడు)
71. కుక్కకు విశ్వాసము ఎక్కువ.
అ) దీనిచేత ఆనందిస్తారు (వైరం)
ఆ) దీనిచేత బాధపడతారు (స్నేహం)
ఇ) దీనిచేత ఊరడిల్లుదురు (నమ్మకం)
ఈ) దీనిచేత శాంతి కల్గును. (నమ్మిక)
జవాబు:
ఇ) దీనిచేత ఊరడిల్లుదురు (నమ్మకం)
72. ఎవరి శక్తి వారిది.
అ) దీనిచేత శక్తుడౌను (బలం)
ఆ) దీనిచేత ధనికుడగును (పరాక్రమం)
ఇ) దీనిచేత అన్నీ వచ్చును (గుణం)
ఈ) దీని చేత కండ పెరుగును (బలిమి)
జవాబు:
అ) దీనిచేత శక్తుడౌను (బలం)
73. మనుష్యుడు మానవత్వం మరువకూడదు.
అ) మంచివాడు (నరుడు)
ఆ) ఆలోచన కలవాడు (మనుజుడు)
ఇ) బలం కలవాడు (బలవంతుడు)
ఈ) మనువు యొక్క కొడుకు (నరుడు)
జవాబు:
ఈ) మనువు యొక్క కొడుకు (నరుడు)
74. ఉపాధ్యాయ వృత్తి వలన సమాజాన్ని బాగుచేయవచ్చు.
అ) దీనిచేత వర్తించును.
ఆ) దీనిచే సుఖించును.
ఇ) దీనిచేత ధనం వచ్చును.
ఈ) దీనిచేత కీర్తి వచ్చును.
జవాబు:
అ) దీనిచేత వర్తించును.
జాతీయాన్ని గుర్తించడం
వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి విడిగా రాయండి.
75. కాలం కాటేసింది.
జవాబు:
అకాల మరణానికి గురైన వారి గురించి వివరించే సందర్భంలో (లేదా) అనుకోకుండా ప్రమాదవశాత్తూ మరణం కలిగిన నందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.
సొంతవాక్యం : మొన్ననే మా బంధువు ఒకరిని కాలం కాటేసింది.
76. గోరంతలు కొండంతలు
జవాబు:
చిన్న విషయాన్ని కూడా చాలా పెద్దదిగా చేసి చెబుతున్న సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.
సొంతవాక్యం : కొంతమందికి గోరంతలు కొండం తలుగా చెప్పడం అలవాటు.
జాతీయము సందర్భము
ఈ జాతీయాన్ని ఏ అర్థంలో / సందర్భంలో ఉపయో గిస్తారో రాయండి.
77. వానాకాలం చదువులు.
జవాబు:
గట్టిగా నేర్చుకోని చదువు అనే అర్థంలో, అరకొరగా సాగిన చదువును గురించి చెప్పే సందర్భంలో దీనిని ఉపయోగిస్తారు.
78. గోరంతలు కొండంతలు
జవాబు:
చిన్న విషయాన్ని పెద్దది చేసి చెప్పే సందర్భంలో ఈ పదాన్ని ప్రయోగిస్తారు.
సంధి ప్రదాలను విడదీయడం
గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి.
79. గురువుల ప్రభావాలు శిష్యులపై ఉంటాయి.
జవాబు:
ప్రభావము + లు
80. మంచిరోజులు వస్తున్నాయనిపించింది.
జవాబు:
వస్తున్నాయి + అనిపించింది
81. కీర్తి శాశ్వతంగా ఉంటుందని అంటారు.
జవాబు:
ఉంటుంది + అని
82. ఈ పాట ఎప్పుడో విన్నాను.
జవాబు:
ఎప్పుడు + ఓ
83. ఇతరులలో లోపాలు వెతకడం మంచిది కాదు.
జవాబు:
లోపము + లు
84. ఒకరికొకరం సహాయం చేసుకోవాలి.
జవాబు:
ఒకరికి + ఒకరం
85. మంచి మిత్రుడే కొండంత బలం.
జవాబు:
కొండ + అంత
86. మంచి మనసైనా ఇమ్మని దేవుని ప్రార్థించాలి.
జవాబు:
మనసు + ఐనా
87. మధ్యాహ్నం ఎండ బాగా పెరిగింది.
జవాబు:
మధ్య + అహ్నం
88. హృదయాలలో అనురాగం ఉండాలి.
జవాబు:
హృదయము + లలో
సంధి పదాలను కలవడం
సంధి పదాలను కలిపి రాయండి.
89. ప్రతి + ఏకం
జవాబు:
ప్రత్యేకం
90. అప్పుడు + అప్పుడు
జవాబు:
అప్పుడప్పుడు
91. స్వచ్ఛము + ఐన
జవాబు:
స్వచ్చమైన
92. సృజన + ఆత్మక
జవాబు:
సృజనాత్మక
93. విషయము + ల
జవాబు:
విషయాల
94. అయిదు + ఆరు
జవాబు:
అయిదారు
95. వానాకాలము + చదువు
జవాబు:
వానాకాలపు చదువు
96. అర్థ + అణా
జవాబు:
అర్ధణా
97. ముత్యము + ల
జవాబు:
ముత్యాల
98. మా + ఇల్లు
జవాబు:
మాయిల్లు
సంధి నామాలు
గీత గీసిన పదం ఏ సంధికి చెందినదో గుర్తించండి.
99. నేను బడిలో చేరి పదేళ్లు పూర్తయింది.
అ) అత్వసంధి
ఆ) ఉత్వసంధి
ఇ) ఇత్వ సంధి
ఈ) లు,ల,న,ల సంధి
జవాబు:
ఇ) ఇత్వసంధి
100. నేను అప్పుడప్పుడు సినిమాకు వెడతాను.
అ) ఆమ్రేడిత సంధి
ఆ) అత్వసంధి
ఇ) ఉత్వసంధి
ఈ) విసర్గ సంధి
జవాబు:
అ) ఆమ్రేడిత సంధి
101. ఎప్పుడైనా అల్లరి చేయడం తప్పు,
అ) అత్వసంధి
ఆ) ఉత్వసంధి
ఇ) ఇత్వ సంధి
ఈ) లు,ల,న,ల సంధి
జవాబు:
ఆ) ఉత్వసంధి
102. ఉన్నప్పుడు పదిమందికీ పెట్టాలి.
అ) ఉత్వసంధి
ఆ) ఇత్వసంధి
ఇ) ఆమ్రేడిత సంధి
ఈ) అత్వసంధి
జవాబు:
ఈ) అత్వసంధి
103. తల్లిదండ్రులు గర్వపడే పనులు చేయాలి.
అ) అత్వసంధి
ఆ) పడ్వాది సంధి
ఇ) లు,ల,న,ల సంధి
ఈ) ఉత్వ సంధి
జవాబు:
ఆ) పడ్వాది సంధి
104. విమానాలు భలే ఎగురుతాయి.
అ) లు,ల,న,ల సంధి
ఆ) ఉత్వసంధి
ఇ) ఇత్వ సంధి
ఈ) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
అ) లు,ల,న,ల సంధి
105. విద్యార్థి క్రమశిక్షణతో ఉండాలి.
అ) గుణసంధి
ఆ) సవర్ణదీర్ఘ సంధి
ఇ) అత్వసంధి
ఈ) ఉత్వసంధి
జవాబు:
ఆ) సవర్ణదీర్ఘ సంధి
106. పూర్వం చాలామందివి వానాకాలపు చదువులే.
అ) సవర్ణదీర్ఘ సంధి
ఆ) అత్వసంధి
ఇ) పుంప్వాదేశ సంధి
ఈ) ఉత్వసంధి
జవాబు:
ఇ) పుంప్వాదేశ సంధి
107. మా యింటికి రండి.
అ) యణాదేశ సంధి
ఆ) అత్వసంధి
ఇ) ఇత్వ సంధి
ఈ) యడాగమం
జవాబు:
ఈ) యడాగమం
108. నిర్ణయం తీసుకోవాల్సినపుడు ఊగిసలాడుతూ ఉండ
అ) ఉత్వసంధి
అ) ఇత్వసంధి
ఇ) అత్వసంధి
ఈ) లు,ల,న,ల సంధి
జవాబు:
అ) ఉత్వసంధి
విగ్రహవాక్యాలు
గీత గీసిన పదానికి విగ్రహ వాక్యం రాయండి.
109. నాకు అక్షరాభ్యాసం జరిగి పదేళ్లు అయింది.
జవాబు:
పది సంఖ్య గల ఏళ్లు
110. నా బాల్యం అంటే నాకిష్టం.
జవాబు:
నా యొక్క బాల్యం
111. చిన్నపిల్లవాడు అంటే అందరికీ ముద్ద
జవాబు:
చిన్న అయిన పిల్లవాడు
112. గాంధీగారెప్పుడూ అబద్ధం ఆడలేదు.
జవాబు:
బద్ధం కానిది
113. రైలు ప్రయాణం చౌకయింది.
జవాబు:
రైలులో ప్రయాణం
114. పసి పిల్లలు అమాయకముగా ఉంటారు.
జవాబు:
మాయకము కానిది
115. ప్రవర్తనకు మూల బీజాలు బాల్యంలో ఉంటాయి.
జవాబు:
మూలమైన బీజాలు
116. కడిమిళ్ల వారు మంచి సాహితీవేత్త.
జవాబు:
సాహిత్యమును గూర్చి తెలిసినవాడు.
117. పంచతంత్ర కథలు బాగుంటాయి.
జవాబు:
పంచతంత్రాలతో కథలు.
118. వీర్రాజుగారు విమానం బొమ్మ వేశారు.
జవాబు:
విమానం అను పేరు గల బొమ్మ
సమాన నామాలు
గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.
119. మనసు నిష్కల్మషంగా ఉండాలి.
అ) షష్ఠీ తత్పురుష
ఆ) పంచమీ తత్పురుష
ఇ) నఞ్ తత్పురుష
ఈ) బహువ్రీహి
జవాబు:
ఇ) నఞ్ తత్పురుష
120. ఒకరి లోపాలు ఒకరు సరిదిద్దాలి.
అ) షష్ఠీ తత్పురుష
ఆ) సప్తమీ తత్పురుష
ఇ) చతుర్థీ తత్పురుష
ఈ) తృతీయా తత్పురుష
జవాబు:
అ) షష్ఠీ తత్పురుష
121. ఎందుకో ఇరవై మంది పిల్లలు స్కూలుకు రాలేదు.
అ) ద్వంద్వం
ఆ) షష్ఠీ తత్పురుష
ఇ) ద్విగువు
ఈ) సప్తమీ తత్పురుష
జవాబు:
ఇ) ద్విగువు
122. మధ్యాహ్నం ఎండలో తిరగవద్దు.
అ) ద్వితీయా తత్పురుష
ఆ) ప్రథమా తత్పురుష
ఇ) చతుర్థీ తత్పురుష
ఈ) పంచమీ తత్పురుష
జవాబు:
ఆ) ప్రథమా తత్పురుష
123. ఎండలకు చెట్టూ చేమలు మండిపోయాయి.
అ) ద్విగువు
ఆ) షష్ఠీ తత్పురుష
ఇ) పంచమీ తత్పురుష
ఈ) ద్వంద్వం
జవాబు:
ఈ) ద్వంద్వం
124. నేను చిన్న నిచ్చెన కొన్నాను.
అ) విశేషణ ఉత్తరపద కర్మధారయం
ఆ) విశేషణ పూర్వపద కర్మధారయం
ఇ) షష్ఠీ తత్పురుష
ఈ) పంచమీ తత్పురుష
జవాబు:
ఆ) విశేషణ పూర్వపద కర్మధారయం
125. విద్యార్థులు చదువు మీదే దృష్టి పెట్టాలి.
అ) ద్వితీయా తత్పురుష
ఆ) ప్రథమా తత్పురుష
ఇ) పంచమీ తత్పురుష
ఈ) షష్ఠీ తత్పురుష
జవాబు:
అ) ద్వితీయా తత్పురుష
126. పిల్లల పత్రిక బొమ్మలతో నిండి ఉంటుంది.
అ) ప్రథమా తత్పురుష
ఆ) చతుర్థీ తత్పురుష
ఇ) షష్ఠీ తత్పురుష
ఈ) ద్వితీయా తత్పురుష
జవాబు:
ఆ) చతుర్థీ తత్పురుష
127 ముత్యాల కోవ అందంగా ఉంటుంది.
అ) ప్రథమా తత్పురుష
ఆ) ద్వితీయా తత్పురుష
ఇ) తృతీయా తత్పురుష
ఈ) చతుర్థీ తత్పురుష
జవాబు:
ఇ) తృతీయా తత్పురుష
128. దీపం బొమ్మ బాగుంది.
అ) విశేషణ పూర్వపద కర్మధారయం
ఆ) ద్విగువు
ఇ) బహువ్రీహి
ఈ) సంభావనా పూర్వపద కర్మధారయం
జవాబు:
ఈ) సంభావనా పూర్వపద కర్మధారయం
ఆధునిక వచనాలు
ఈ వాక్యానికి సరియైన ఆధునిక వచనాన్ని గుర్తించండి.
129. మా యూరిని విడిచ్చి పెట్టితిని.
అ) మా యూరు విడిచి పెట్టాను.
ఆ) మా యూరును విడిచి పెట్టాను.
ఇ) మా ఊరున్ విడిచి పెట్టియుంటిని.
ఈ) మా ఊరు విడిచిపెట్టాను.
జవాబు:
ఈ) మా ఊరు విడిచిపెట్టాను.
130. బాల్యము పారిపోయినది.
అ) బాల్యం పారిపోయింది.
ఆ) బాల్యము పారిపోయినది.
ఇ) బాల పారిపోయినది.
ఈ) బాల్యమున్ బారిపోయి యున్నది.
జవాబు:
అ) బాల్య పారిపోయింది.
131. బాల్యము అంటే ఇష్టము.
అ) బాల్యమ్ము అంటే ఇష్టము.
ఆ) బాల్యంబంటే ఇష్టంబు.
ఇ) బాల్యమనిన నిష్టము.
ఈ) బాల్యం అంటే ఇష్టం.
జవాబు:
ఈ) బాల్యం అంటే ఇష్టం.
132. ఇది అబద్ధము గాదు. నిజము.
అ) ఇది యబద్ధమ్మగాదు నిజమ్ము.
ఆ) ఇది అబద్ధం కాదు నిజం.
ఇ) ఇదియు నబద్ధము గాదు నిజంబు.
ఈ) ఇదియు నబద్ధమ్ము గాదు నిజమ్ము.
జవాబు:
ఆ) ఇది అబద్దం కాదు నిజం.
133. కల చెదిరిపోయినది.
అ) కలయు జెదిరి పోయినది.
ఆ) కల చెదిరింది.
ఇ) కలయును చెదిరినది.
ఈ) కలయును జెదిరినది.
జవాబు:
ఆ) కల చెదిరింది.
134. వర్షము వచ్చుచున్నది.
అ) వర్షమ్ము వచ్చుచునున్నది.
ఆ) వర్షంబు వచ్చుచున్నది.
ఇ) వర్షం వస్తోంది.
ఈ) వర్షము వచ్చుచును నున్నది.
జవాబు:
ఇ) వర్షం వస్తోంది.
135. బాల్యము గుర్తుకు వచ్చుచున్నది.
అ) బాల్యం గుర్తొస్తోంది.
ఆ) బాల్యంబు గుర్తు వచ్చుచున్నది.
ఇ) బాల్యమును గుర్తుకు వచ్చుచున్నది.
ఈ) బాల్యమ్ము గుర్తు వస్తోంది.
జవాబు:
అ) బాల్యం గుర్తొస్తోంది.
136. బాల్యము జారిపోయింది.
అ) బాల్యమ్ము జారిపోయినది.
ఆ) బాల్యమున్ జారిపోయినది.
ఇ) బాల్యం జారిపోయింది.
ఈ) బాల్యంబు జారిపోయినది.
జవాబు:
ఇ) బాల్యం జారిపోయింది.
137. ఆనందముగా గడచినవి.
అ) ఆనందంబుగా గడచినవి.
ఆ) ఆనందమ్ముగా గడిచినవి.
ఇ) ఆనందంబుగానే గడచి యున్నవి.
ఈ) ఆనందంగా గడిచాయి.
జవాబు:
ఈ) ఆనందంగా గడిచాయి.
138. బాల్యములోనే మూలములునున్నవి.
అ) బాల్యంలోనే మూలాలున్నాయి.
ఆ) బాల్యంబులోనే మూలములునున్నవి.
ఇ) బాల్యమ్ములోనే మూలంబులున్నవి.
ఈ) బాల్యములోను మూలమ్ములున్నవి.
జవాబు:
అ) బాల్యంలోనే మూలాలున్నాయి.
వ్యతిరేకార్థక వాక్యాలు
ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం రాయండి.
139. బాల్యం అందరికీ సుఖాల నిలయం.
జవాబు:
బాల్యం అందరికీ సుఖాల నిలయం కాదు.
140. అందరూ బొమ్మలు వేయగలరు.
జవాబు:
అందరూ బొమ్మలు వేయలేరు.
141. కొందరికే బాల్యం గుర్తొస్తుంది.
జవాబు:
కొందరికే బాల్యం గుర్తు రాదు.
142: రచయిత ఈ పాఠం ఒక్కటే రాశారు.
జవాబు:
రచయిత ఈ పాఠం ఒక్కటే రాయలేదు.
143. కొందరి పుట్టినరోజులు గొప్పవి.
జవాబు:
కొందరి పుట్టినరోజులు గొప్పవి కావు.
144. బాల్యం దాటాం.
జవాబు:
బాల్యం దాటలేదు.
145. దినపత్రిక తయారుచేశారు.
జవాబు:
దినపత్రిక తయారు చేయలేదు.
146. దుకాణాల్లో మాత్రమే పనిచేయాలి.
జవాబు:
దుకాణాల్లో మాత్రమే పనిచేయక్కర్లేదు.
147. గ్రామమంతా శ్రామిక వర్గమే.
జవాబు:
గ్రామమంతా శ్రామిక వర్గం కాదు.
148. నాకు బహుమతి వచ్చింది.
జవాబు:
నాకు బహుమతి రాలేదు.
వ్యతిరేకార్థక క్రియలు
కింది క్రియా పదాలలో వ్యతిరేకార్థక క్రియను గుర్తించండి.
149. అ) సుఖించి
ఆ) సుఖిస్తూ
ఇ) సుఖించక
ఈ) సుఖిస్తే
జవాబు:
ఇ) సుఖించక
150. అ) వేసి
ఆ) వేయక
ఇ) వేస్తే
ఈ) వేస్తూ
జవాబు:
ఆ) వేయక
151. అ) గుర్తించక
ఆ) గుర్తించి
ఇ) గుర్తిస్తే
ఈ) గుర్తిస్తూ
జవాబు:
అ) గుర్తించక
152. అ) రాసి
ఆ) రాస్తే
ఇ) రాస్తూ
ఈ) రాయక
జవాబు:
ఈ) రాయక
153. అ) దాటి
ఆ) దాటితే
ఇ) దాటక
ఈ) దాటుతూ
జవాబు:
ఇ) దాటక
154. అ) చేసి
ఆ) చేస్తూ
ఇ) చేయక
ఈ) చేస్తే
జవాబు:
ఇ) చేయక
155. అ) శ్రమించక
ఆ) శ్రమిస్తే
ఇ) శ్రమిస్తూ
ఈ) శ్రమించి
జవాబు:
అ) శ్రమించక
156. అ) వచ్చి
ఆ) రాక
ఇ) వస్తే
ఈ) వస్తూ
జవాబు:
ఆ) రాక
157. అ) కుట్టక
ఆ) కుట్టి
ఇ) కుడితే
ఈ) కుడుతూ
జవాబు:
అ) కుట్టక
158. అ) ముడితే
ఆ) ముడుతూ
ఇ) ముట్టి
ఈ) ముట్టక
జవాబు:
ఈ) ముట్టక
సంక్లిష్ట వాక్యాలు
ఇది ఏ రకమైన సంక్లిష్టవాక్యమో రాయండి.
159. బొమ్మ వేసినా గుర్తుంపు రాలేదు.
జవాబు:
అప్యర్థకం
160. పాఠం చెబుతూ ఉన్నారు.
జవాబు:
శత్రర్థకం
161. ఇంటికి వెళ్లి వచ్చాడు.
జవాబు:
క్వార్ధకం
162. పేరు వస్తే డబ్బు అదే వస్తుంది.
జవాబు:
చేదర్థకం
163. ఎన్ని చెప్పినా వినిపించుకోలేదు.
జవాబు:
అప్యర్ధకం
కర్మణి వాక్యాలు
సరియైన కర్మణి వాక్యాన్ని గుర్తించండి.
164. రచయిత బొమ్మ వేసాడు.
అ) బొమ్మ రచయిత చేత వేయబడింది.
ఆ) రచయిత చేత బొమ్మ వేయబడును.
ఇ) రచయితచే బొమ్మ వేయబడదు.
ఈ) రచయిత చేత బొమ్మ వేయబడుతోంది.
జవాబు:
అ) బొమ్మ రచయిత చేత వేయబడింది.
165. రచయిత బాల్యం మరచిపోలేదు.
అ) రచయిత చేత మరచిపోబడింది.
ఆ) రచయిత చేత మరచిపోబడలేదు.
ఇ) రచయిత చేత మరచిపోబడును.
ఈ) రచయిత చేత మరచిపోబడునా?
జవాబు:
ఆ) రచయిత చేత మరచిపోబడలేదు.
166. మనం ఎన్నో మార్పులు చూస్తాం.
అ) ఎన్నో మార్పులు మన చేత చూడబడ్డాయి.
ఆ) ఎన్నో మార్పులు మన చేత చూడబడగలవు.
ఇ) ఎన్నో మార్పులు మన చేత చూడబడతాయి.
ఈ) ఎన్నో మార్పులు మన చేత చూడబడవు.
జవాబు:
ఇ) ఎన్నో మార్పులు మన చేత చూడబడతాయి.
167. రచయితను అందరూ పొగిడారు.
అ) రచయిత చేత అందరూ పొగడబడ్డారు.
ఆ) రచయిత చేత అందరు పొగడబడతారు.
ఇ) అందరి చేత రచయిత పొగడబడ్డాడు.
ఈ) అందరి చేత రచయిత పొగడబడును.
జవాబు:
ఇ) అందరి చేత రచయిత పొగడబడ్డాడు.
168. రచయిత అధ్యయనం చేశాడు.
అ) అధ్యయనం రచయిత చేత చేయబడింది.
ఆ) అధ్యయనం రచయిత చేత చేయబడును.
ఇ) అధ్యయనం రచయిత చేత చేయబడదు.
ఈ) అధ్యయనం రచయిత చేత అగును.
జవాబు:
అ) అధ్యయనం రచయిత చేత చేయబడింది.
169. ప్రకాశరావు పత్రిక రాయగలడు.
అ) ప్రకాశరావు చేత పత్రిక రాయబడు.
ఆ) ప్రకాశరావు చేత పత్రిక రాయబడగలదు.
ఇ) ప్రకాశరావు చేత పత్రిక రాయబడదు.
ఈ) ప్రకాశరావు చేత పత్రిక రాయబడునా?
జవాబు:
ఆ) ప్రకాశరావు చేత పత్రిక రాయబడగలదు.
170. అతను పుస్తకాలు చదువుతాడు.
అ) అతని చేత పుస్తకాలు చదువబడగలవు.
ఆ) అతని చేత పుస్తకాలు చదువబడెను.
ఇ) అతని చేత పుస్తకాలు చదువబడవు.
ఈ) అతని చేత పుస్తకాలు చదువబడును.
జవాబు:
ఈ) అతని చేత పుస్తకాలు చదువబడును.
171. వారు మా ప్రయత్నం ఆపారు.
అ) వారి చేత మా ప్రయత్నం ఆపబడింది.
ఆ) వారి చేత మా ప్రయత్నం ఆపబడును.
ఇ) వారి చేత మా ప్రయత్నం ఆపబడుతోంది.
ఈ) వారి చేత మా ప్రయత్నం ఆపబడగలదు.
జవాబు:
అ) వారి చేత మా ప్రయత్నం ఆపబడింది.
172. ఆమె పూలు కోస్తోంది.
అ) ఆమె చేత పూలు కోయబడును.
ఆ) ఆమె చేత పూలు కోయబడుతున్నాయి.
ఇ) ఆమె చేత పూలు కోయబడతాయి.
ఈ) ఆమె చేత పూలు కోయబడగలవు.
జవాబు:
ఆ) ఆమె చేత పూలు కోయబడుతున్నాయి.
173. అతను బస్సు నడిపాడు.
అ) అతని చేత బస్సు నడపబడింది.
ఆ) అతని చేత బస్సు నడపబడును.
ఇ) అతని చేత బస్సు నడపబడగలదు.
ఈ) అతని చేత బస్సు నడపబడుతోంది.
జవాబు:
అ) అతని చేత బస్సు నడపబడింది.
వాక్య రకాలు
ఇవి ఏ రకమైన సామాన్య వాక్యాలో రాయండి.
174. అందరూ చిత్రలేఖనం నేర్చుకోండి.
జవాబు:
విధ్యర్థకం
175. ప్రయివేటు నుండి బయటకు వెళ్లవద్దు.
జవాబు:
నిషేధార్థకం
176. నిన్న నువ్వెందుకు రాలేదు?
జవాబు:
ప్రశ్నార్థకం
177. సరైన పెన్సిలు కాదు కాబట్టి బొమ్మ సరిగ్గా రాలేదు.
జవాబు:
హేత్వర్థకం
178. నేను బొమ్మ వేసుకొంటున్నాను.
జవాబు:
ఆత్మార్థకం
179. అతను స్నేహాలను కచ్చితంగా నిలబెట్టుకొంటాడు.
జవాబు:
నిశ్చయార్థకం
180. అబ్బ! నా స్నేహితుడు ఎంత మంచి జోకు వేశాడో!
జవాబు:
ఆశ్చర్యార్థకం
181. అతను కవిత రాస్తాడో! రాయడో!
జవాబు:
సందేహార్థకం
182. మీరు తప్పక చదవగలరు.
జవాబు:
సామర్థ్యార్థకం
183. మీరిక సినిమా చూడవచ్చు.
జవాబు:
అనుమత్యర్థకం
వాక్య రకాలు
ఇవి ఏ రకమైన సామాన్య వాక్యాలో గుర్తించండి.
184. దయచేసి తరగతి గదిలోకి నడవండి.
అ) అనుమత్యర్థకం
ఆ) ప్రార్థనార్థకం
ఇ) అప్యర్థకం
ఈ) విధ్యర్థకం
జవాబు:
ఆ) ప్రార్థనార్థకం
185. కలకాలం కళాకారులు చల్లగా వర్ధిల్లాలి.
అ) ఆశీరర్థకం
ఆ) విధ్యర్థకం
ఇ) నిశ్చయార్థకం
ఈ) ఆశ్చర్యార్థకం
జవాబు:
అ) ఆశీరర్థకం
186. నాకు మా అక్క బొమ్మలు వేయడం నేర్పింది.
అ) నిశ్చయార్థకం
ఆ) విధ్యర్థకం
ఇ) ఆశీరర్థకం
ఈ) ప్రేరణార్థకం
జవాబు:
ఈ) ప్రేరణార్థకం
187. మీరెప్పుడైనా వెళ్లవచ్చు.
అ) అనుమత్యర్థకం
ఆ) ప్రేరణార్థకం
ఇ) అప్యర్థకం
ఈ) నిషేధార్థకం
జవాబు:
అ) అనుమత్యర్థకం
188. ఆయన డాక్టరో! లాయరో!
అ) సందేహార్థకం
ఆ) ప్రశ్నార్థకం
ఇ) విధ్యర్థం
ఈ) ఆశ్చర్యార్థకం
జవాబు:
అ) సందేహార్థకం
189. నన్ను తాగనడు.
అ) సందేహార్థకం
ఆ) విధ్యర్థకం
ఇ) నిషేధార్థకం
ఈ) చేదర్థకం
జవాబు:
ఇ) నిషేధార్థకం
190. రాముని అడవులకు వింటారా?
అ) ప్రశ్నార్థకం
ఆ) విధ్యర్థకం
ఇ) సందేహార్థకం
ఈ) ఆశ్చర్యార్థకం
జవాబు:
అ)ప్రశ్నార్థకం
191. శీఘ్రమేద కల్యాణ ప్రాప్తిరస్తు!
అ) విధ్యర్థకం
ఆ) ప్రార్థనార్థకం
ఇ) నిషేధార్థకం
ఈ) ఆశీరర్థకం
జవాబు:
ఈ) ఆశీరర్థకం
192. గాంధీ మహాత్ముని సందేశం పాటించండి.
అ) అప్యర్థకం
ఆ) ప్రార్థనార్థకం
ఇ) విధ్యర్థకం
ఈ) ఆశ్చర్యార్థకం
జవాబు:
ఆ) ప్రార్థనార్థకం
193. దయచేసి చెదును నివారించండి.
అ) విధ్యర్థకం
ఆ) ప్రార్థనార్థకం
ఇ) అనుమత్యర్థకం
ఈ) ఆశ్చర్యార్థకం
జవాబు:
ఆ) ప్రార్థనార్థకం