AP 10th Class Telugu 6th Lesson Important Questions ప్రకృతి సందేశం

These AP 10th Class Telugu Important Questions 6th Lesson ప్రకృతి సందేశం will help students prepare well for the exams.

ప్రకృతి సందేశం AP Board 10th Class Telugu 6th Lesson Important Questions and Answers

వ్యక్తీకరణ సృజనాత్మకత

అ) ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘ప్రకృతి సందేశం’ పాఠ్యభాగ రచయిత వై.సి.వి. రెడ్డి గారిని గురించి రాయండి.
జవాబు:

 1. ‘ప్రకృతి సందేశం’ పాఠ్యభాగ రచయిత వై.సి. వి. రెడ్డి గారి పూర్తి పేరు యమ్మనూరు చిన వెంకట రెడ్డి.
 2. ఈయన వై.యస్.ఆర్. (కడప) జిల్లాలో బోనాల గ్రామంలో జన్మించారు.
 3. లక్ష్మమ్మ, కొండారెడ్డి వీరి తల్లిదండ్రులు.
 4. వీరు 1926లో జన్మించి 1989లో స్వర్గస్తులైనారు.
 5. వీరి రచనల్లో ముఖ్యమైనవి ‘తొలకరి చినుకులు’, మేనక, రంభ, సింధూర రేఖ, దక్షిణ నీలము, వైజయంతి, పారిజాతం మొదలైన కావ్యాలు.

ప్రశ్న 2.
మానవులకు మేఘాలు ఇచ్చే సందేశం ఏమిటి?
జవాబు:
ఆకాశంలో తమని తాము మరచి తిరుగుతున్న అందమైన మేఘాలు పర్వత శిఖరాలను కౌగిలించుకుంటున్నాయి. కొండ కోనలలో నిండుగా పూలు పూచిన తీగలు చెట్లను అల్లుకుంటున్నాయి. ఇవి మానవులంతా ఐకమత్యంతో ఉండాలని గొప్ప ఉపదేశాన్ని ఇస్తున్నాయి.

ప్రశ్న 3.
నెమళ్ళు మనుషులంతా ఎలా సాగిపోవాలని సందేశాన్నిస్తున్నాయి?
జవాబు:
మబ్బు పట్టిన వేళ ఆనందంతో నెమళ్ళు పురివిప్పి నాట్యమాడుతున్నాయి. కొండలపై నుండి దూకుతూ, మలుపులు తిరుగుతూ, వయ్యారంగా సాగే సెలయేటి కన్యలకు చిరుగాలులు ఆటపాటలు నేర్పుతున్నాయి. ఇవి ఈ మనుషులంతా స్వేచ్ఛ, సమతామమతలతో సాగిపోవాలని సందేశాన్నిస్తున్నాయి.

ప్రశ్న 4.
మతాలు ఎందుకు పుట్టాయి? దేని కొరకు?
జవాబు:
ప్రజలందరికీ ప్రేమానురాగాలను పంచడానికే మతాలన్నీ పుట్టాయి. కానీ కొందరు కుటిలబుద్ధితో మతగ్రంథాలు చెప్పే విషయాలకు వక్రభాష్యాలు చెప్పి, ఎన్నో ఎత్తులు, జిత్తులు వేసి, మతాల మధ్య చిచ్చుపెట్టి ఎందరి చావులకో కారణమైనారు. ఇలాంటివి ఇక్కడ ఇకమీదట సాగవని హెచ్చరిస్తున్నాయి. ఆకాశంలో నీలిమేఘాలు కింద అందంగా ఎగిరే పక్షులు, రాత్రనక, పగలనక కష్టపడే కార్మికులు, కర్షకులు కలిసి ఈ ప్రపంచంలో సమానత్వం సాధించాలని శాంతి సౌఖ్యాలను నెలకొల్పాలని కోరుతున్నారు.

ప్రశ్న 5.
‘గేయ కవిత’ సాహిత్య ప్రక్రియను తెల్పుము.
జవాబు:
గేయ కవిత పాడడానికి, లయబద్ధంగా చదవడానికి వీలైనది. గేయంలో లేదా గేయ కవితలో శబ్ద సంబంధమైన లయ ఉంటుంది. అందువల్ల గాన యోగ్యంగా ఉంటుంది. గేయంలో మాత్రాగణాలుంటాయి. దీనిలో ఏ వస్తువునైనా వర్ణించి చెప్పవచ్చు.

AP 10th Class Telugu 6th Lesson Important Questions ప్రకృతి సందేశం

ప్రశ్న 6.
ఏవి మానవుల జీవనగమనానికి దారులు చూపిస్తున్నాయో తెల్పుము.
జవాబు:
చీమలు ఎన్నో కష్టాలకు ఓర్చి, కలసికట్టుగా తిండి గింజలను సేకరిస్తున్నాయి. తేనెటీగలు ప్రతి పువ్వు నుండి తేనెను సేకరించి కూడబెట్టి ఇతరులకు (మానవులకు) పంచుతున్నాయి. ఇవి క్రమశిక్షణ, కలసికట్టుగా ఉండాలని, మానవాళికి చెబుతున్నాయి. కొండల మధ్య లోయలలో పుట్టి వ్యాపిస్తున్న ఎర్రని కాంతి కొమ్మలలో, రెమ్మలలో అందాలు చిందిస్తూ అరవిరసిన పువ్వుల సువాసన ఒక కవితలా సాగిపోతూ మానవుల జీవన గమనానికి చక్కటి దారులను చూపిస్తున్నాయి.

ఆ) ఈ క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
ప్రకృతిలో పక్షులు మనుషులకు దృష్టాంతంగా చూపి ఏమని సందేశమిస్తున్నాయి?
జవాబు:
తుమ్మెదలకు పర్వత సానువుల్లోని అద్దాల వంటి నిర్మలమైన సరస్సులలో విచ్చుకుంటున్న తామరలు సంతోషాలను పంచుతున్నాయి. వసంత కాలంలో అశగా తిరుగుతున్న కోకిలలకు మామిడిచెట్లు లేక మావిచిగురులను అందిస్తున్నాయి. ఇవి ఒకరికొకరు సహకరించుకోవడమే మన సంస్కృతి అనే గొప్ప సందేశాన్నిస్తున్నాయి.

ఆకాశంలో తమని తాము మరచి తిరుగుతున్న అందమైన మేఘాలు పర్వత శిఖరాలను కౌగిలించుకుంటున్నాయి. కొండ కోనలలో నిండుగా పూలు పూచిన తీగలు చెట్లను అల్లుకుంటున్నాయి. ఇవి మానవులంతా ఐకమత్యంతో ఉండాలని గొప్ప ఉపదేశాన్ని ఇస్తున్నాయి.

మన్మథుడి వాహనమైన రామచిలుకలు తమ ఆకుపచ్చని రెక్కలు విప్పి ఎగురుతూ ఆకాశమనే స్త్రీ కన్నులలో కాంతి నింపుతున్నాయి. అన్యోన్యమైన లకుముకి పిట్టల జంట అనురాగంతో గుసగుసలాడుతూ కొమ్మలపై నివసిస్తున్నాయి. ఇవి పరస్పరం ప్రేమానురాగాలతో జీవించాలని ప్రజలకు సందేశాన్ని ఇస్తున్నాయి.

మబ్బు పట్టిన వేళ ఆనందంతో నెమళ్ళు పురివిప్పి నాట్యమాడుతున్నాయి. కొండలపై నుండి దూకుతూ, మలుపులు తిరుగుతూ వయ్యారంగా సాగే సెలయేటి కన్యలకు చిరుగాలులు ఆటపాటలు నేర్పుతున్నాయి. ఇవి మనుషులంతా స్వేచ్ఛ, సమత, మమతలతో సాగిపోవాలని సందేశాన్నిస్తున్నాయి.

ప్రశ్న 2.
ప్రకృతిలో జరుగు ప్రతి అంశాలను వివరిస్తూ సౌందర్యాన్ని వర్ణించి చెప్పండి.
జవాబు:
ప్రకృతిలోని వివిధ ఋతువుల్లో వచ్చే మార్పులను వర్ణించడం వల్ల మనసుకు కలిగే ఆనందం చెప్పలేనిది. వసంత ఋతువు ఋతువుల రాణి. చెట్లు వసంత ఋతువులో చిగురిస్తాయి. లేత చిగుళ్ళను తిని కోకిలలు గొంతెత్తి మధురంగా, పాడతాయి. వర్ష ఋతువులో వర్షాలు కురిసి వాగులు, వంకలు పొంగి పొర్లుతూ శోభాయమానంగా ఉంటాయి. శరదృతువులో చంద్రుడు నీలాకాశంలో అందంగా ప్రకాశిస్తుంటాడు. హేమంత ఋతువులో మంచుతో ప్రకృతి ఎంతో అందంగా ఉంటుంది.

శిశిర ఋతువులో చెట్లన్నీ ఆకులను రాలుస్తూ పండుటాకులతో ప్రకృతి ఎంతో అందంగా ఉంటుంది. ఆయా సందర్భాలలో వచ్చే మార్పులను వర్ణించడం వల్ల ప్రకృతిలో జరిగే మార్పులను ఆస్వాదించాలని పిస్తుంది. పిండారబోసినట్లుండే వెన్నెలను, వర్షం కురిశాక వచ్చే ఇంద్రధనుస్సును, చిగురించిన చెట్లను చూసినప్పుడు పొందే అనుభూతి అద్భుతమైనది.

దిక్కులు అనే కొమ్మలతో, వెలుగులీనే చుక్కలు అనే పూలతో ఆకాశం పెద్ద చెట్టులాగా కన్పిస్తుంది. ఆ పూలను అందుకోవడానికి కిరణాలు అనే తన చేతులను పొడవుగా జూపుతూ చంద్రుడు పైపైకి వస్తాడు.

పాల సముద్రం నుంచి పుట్టిన వెన్నెల ఉప్పొంగి దిక్కులన్నింటినీ ముంచెత్తుతుంది. అప్పుడు చంద్రబింబం శేషపానుపు లాగా ఉంది. చంద్రునిలోని మచ్చ ఆ పాన్పు మీద పడుకున్న విష్ణువులాగా ఉంది.

వెన్నెలలో కలువపూలు రేకులు విచ్చుకుని వాలిపోయిన కేసరాలు తిరిగి బలంగా నిలుచున్నాయి. పుప్పొడి మీద తేనెలు పొంగి పొరలి తుమ్మెదలకు విందు చేశాయి. కమ్మని సువాసనలు చుట్టూ వ్యాపించాయి.

వెన్నెల వర్షంలో చంద్రకాంత శిలలు కరిగిపోయాయి. ఎగిరే చకోర పక్షుల రెక్కలను తాకుతూ కలువపూలపై వ్యాపించింది వెన్నెల, స్త్రీల మనోహరమైన చిరునవ్వులను అధికం చేస్తూ దిక్కులను ముంచెత్తుతూ అంతటా వ్యాపించింది వెన్నెల.

అందంగా, గంభీరంగా సమున్నతంగా విస్తరించింది వెన్నెల. రాత్రి అనే ఆలోచన రానీయక, చీకటి ఎక్కడా కనబడనీయక కళ్ళకు అమృతపు జల్లులాగా, శరీరానికి మంచి గంధం పూతలాగా, మనసుకు ఆనంద తరంగంలాగా వెన్నెల హాయిని కలిగిస్తుంది.

ఉదయకాలంలో ప్రకృతి ఒడిలో ఎంతో అందంగా, శోభాయమానంగా పల్లెసీమలుంటాయి. ఉదయాన్నే కోడి కూతలు, పక్షుల కిలకిలా రావాలు, పొలం పనులకు వెళ్ళే ఎద్దుల గంటలు, స్త్రీలు తమ ఇళ్ళ ముందు వేసే రంగవల్లులు ఎంతో అందంగా ఉంటాయి. నులి వెచ్చని సూర్య కిరణాలు శరీరాన్ని తాకుతున్నప్పుడు. ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. రాత్రిపూట మంచు చెట్ల ఆకులపైన, పచ్చగడ్డి మైదానాల మీద పడుతుంది.

దానిపై సూర్యకిరణాలు పడినప్పుడు కనపడే అందం వర్ణనాతీతం. దట్టమైన చీకటి వల్ల అష్టదిక్కులు, ఆకాశం, భూమి తేడా తెలుసుకోలేనట్లుగా కలిసిపోయాయి. అపుడు విశ్వమంతా కాటుక నింపిన బరిణెలాగా నల్లగా కన్పిస్తుంది. ఈ విధంగా ప్రకృతిలో ప్రతి అణువు మానవుని కొరకు సహాయం చేస్తున్నాయి. ప్రకృతి లేనిదే మానవ మనుగడ లేదు. కనుక ప్రకృతితో మానవుడు మమేకమై జీవిస్తున్నాడు. అటువంటప్పుడు మనవులంతా ఒకటే అని ఎందుకు భావించరు?

AP 10th Class Telugu 6th Lesson Important Questions ప్రకృతి సందేశం

ఇ) కింది అంశాల గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.

ప్రశ్న 1.
ప్రకృతి పరిరక్షణకు కొన్ని నినాదాలు రాయండి.
జవాబు:

 1. ప్రకృతి భగవంతుని వరం – కాపాడుకోకపోతే ప్రశ్నార్ధకమవుతుంది భావితరం.
 2. ఒక్క చెట్టునైనా పెంచుదాం – ప్రకృతి అందాల్ని అందరికీ పంచుదాం.
 3. ప్రశాంత వాతావరణం మానవ జీవనానికి శాశ్వత ఆభరణం
 4. త్యాగ భావమునకు తరువులే గురువులు – ప్రకృతిని రక్షించుకుంటే రావులే కరువులు
 5. ఆధునిక సౌకర్యాల కన్నా ప్రశాంత ప్రకృతి మిన్న
 6. ఆరోగ్యమే మహాభాగ్యం – ప్రకృతి మానవ సౌభాగ్యం
 7. కాలుష్యాలను అరికడదాం – ప్రకృతి మాతకు గుడి కడదాం.
 8. పక్షులకు ఆహారం, నీరు అందించు
 9. పరిసరాల కాలుష్యాన్ని నివారించు – జాతి సంపదను రక్షించు ఆరోగ్యాన్ని అందరికీ పంచు
 10. ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించలేమా? చిత్తశుద్ధితో కాలుష్యాన్ని నివారించలేమా?
 11. పశుపక్ష్యాదుల నుంచి కొంతైనా నేర్చుకుందాం – మన జీవన విధానాన్ని మార్చుకుందాం.
 12. అంతరించిపోతున్న ప్రకృతి శోభ మేల్కొనకపోతే తప్పుడు మానవాళికి క్షోభ.

ప్రశ్న 2.
మీకు నచ్చిన ఒక ప్రకృతి దృశ్యాన్ని వర్ణిస్తూ రాయండి.
జవాబు:
సూర్యోదయం : తూర్పువైపు ఆకాశంలోకి ఉదయమే చూస్తే ఎర్రగా కనిపిస్తుంది. అప్పటి వరకూ కోళ్ళు కూస్తూ ఉంటాయి. నక్షత్రాలు ఆకాశంలో వెలవెలపోతాయి. అప్పుడు పక్షులు తమ గూళ్ళ నుండి బయలుదేరి ఆహారం కోసం బారులు కట్టి ప్రయాణం చేస్తూ ఉంటాయి. పక్షులు రెక్కలు ఆడిస్తూ నేరుగా దూసుకుపోతూ ఉంటే, ఆ దృశ్యం చూడ్డానికి కళ్ళకు పండుగలా కనిపిస్తుంది.

అదే సమయానికి సూర్యకిరణాలు నేరుగా వచ్చి నేలకు తాకుతాయి. మా ఇంటి పక్క గుళ్ళో గంటలు మోగుతూ ఉంటాయి. గుడి పక్క చెరువులో సూర్యకిరణాలు పడి, తామర పూలు విచ్చుకుంటాయి. తుమ్మెదలు ఆ పద్మాలపై ఏదో రొద చేస్తూ తిరుగుతూ ఉంటాయి. సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం. సూర్యోదయం కాగానే ప్రకృతి అంతా మేలుకొని తమ తమ పనుల్లో మునిగిపోతుంది.

ప్రశ్న 3.
నీకు నచ్చిన ప్రకృతి దృశ్యాన్ని వర్ణిస్తూ ఒక కవిత రాయండి.
జవాబు:
చంద్రోదయము
1) “చెరువులో నీరు గాలికి తిరుగుచుండె
కలువపుష్పాలు వికసించి కనులు తెరిచె
పూల గంధాల మధుపాలు మురియుచుండె
చంద్రకాంతులు వ్యాపించే జగము నిండ”.

2) దివిని చుక్కల పూవులు తేజరిల్లె
రాత్రి సతికట్టె నల్లని రంగు చీర
చంద్రుని రాకకు జగమంత సంతసించె
విశ్వమంతకు వెన్నెల విందు చేసి

AP 10th Class Telugu 6th Lesson Important Questions ప్రకృతి సందేశం

భాషాంశాలు (పదజాలం వ్యాకరణాంశాలు)

కింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి..

అర్ధాలు

అ) గీత గీసిన పదానికి అర్థం రాయండి.

1. ఆ సరోవరంలో తామరలున్నాయి.
జవాబు:
కొలను

2. ముకురంలో నా బింబం కన్పిస్తోంది.
జవాబు:
అద్దం

3. విరులదండను స్వామి మెడలో వేశారు.
జవాబు:
పువ్వులు

4. వసంత ఋతువు రాగానే పికములు అల్లరి చేస్తాయి.
జవాబు:
కోయిలలు

5. ఆమె మంజుల గానాలను విన్పిస్తోంది.
జవాబు:
మృదువైన

6. గగనమంతా మేఘాలు క్రమ్ముకున్నాయి.
జవాబు:
ఆకాశము

7. వలరాజు వసంతంలో వచ్చి విజృంభిస్తాడు.
జవాబు:
మన్మథుడు

8. ఆహా! ఇప్పుడు చక్కని తెమ్మెరలు వస్తున్నాయి.
జవాబు:
గాలులు

9. స్వాతంత్య్రం కోసం గాంధీ దీక్ష వహించాడు.
జవాబు:
పట్టుదల

AP 10th Class Telugu 6th Lesson Important Questions ప్రకృతి సందేశం

ఆ) గీత గీసిన పదానికి సరియైన అర్ధాన్ని గుర్తించండి.

10. అందాల చిందించు అరవిరుల నెత్తావి.
అ) సువాసన
ఇ) అరవీరులు
ఆ) దుర్వాసన
ఈ) అందము
జవాబు:
అ) సువాసన

11. స్వార్థం కోసం నేడు నాయకులు సమరాలు చేస్తున్నారు.
అ) సంతోషము
ఆ) యుద్ధాలు
ఇ) స్నేహాలు
ఈ) ద్రోహాలు
జవాబు:
ఆ) యుద్ధాలు

12. నింగిలో ఇంద్రధనుస్సు కన్పిస్తోంది.
అ) దిక్కు
ఆ) సముద్రం
ఇ) ఆకాశం
ఈ) నది
జవాబు:
ఇ) ఆకాశం

13. కర్షకులు లేనిదే దేశమే లేదు.
అ) సేవకులు
ఆ) స్నేహితులు
ఇ) శత్రువులు
ఈ) రైతులు
జవాబు:
ఈ) రైతులు

14. పసరు రెక్కల విప్పు వలరాజు తేజీలు.
అ) వాహనాలు
ఆ) ప్రమాణాలు
ఇ) సౌకర్యాలు
ఈ) సంతోషాలు
జవాబు:
అ) వాహనాలు

15. అతని తీరు బాగుండలేదు.
అ) వైధవ్యము
ఆ) విధము
ఇ) వెధవ
ఈ) విధవ
జవాబు:
ఆ) విధము

16. ఎవ్వరికినీ కుటిల బుద్దులుండరాదు.
అ) అందమైనది
ఆ) పనికిరానిది
ఇ) వంకరైనది
ఈ) పోయినది
జవాబు:
ఇ) వంకరైనది

17. పువ్వు పువ్వున వ్రాలి పూదేనెలందెచ్చి.
ఆ) మమత
అ) విషము
ఇ) నీర
ఈ) మకరందము
జవాబు:
ఈ) మకరందము

పర్యాయపదాలు

అ) గీత గీసిన పదానికి పర్యాయపదాలు రాయండి.

18. మా యింట్లో పెద్ద ముకురం కలదు.
జవాబు:
అద్దం, ఆదర్శము, ఆత్మదర్శము, కర్పరము

19. మా యింటి దగ్గరున్న కొండల్లో పెద్ద కందరం కలదు.
జవాబు:
గుహ, కలుగు, కుహరము

20. మా యింటి ముందు తామరల సరోవరం కలదు.
జవాబు:
కొలను, కమలిని, కాసారము

21. మా పెరట్లో పూసిన విరులతో మా దేవుణ్ని పూజిస్తాము.
జవాబు:
పువ్వులు, కుసుమాలు, సుమములు

22. పద్మాలపై తుమ్మెదలు వ్రాలాయి.
జవాబు:
ఇందిందిరములు, కలాలాపములు, మధుకరాలు

23. వసంతం వస్తే అందరికీ ఆనందమే.
జవాబు:
ఆమని, కుసుమాకరము

24. గిరిని పైకెత్తాడు బాలకృష్ణుడు.
జవాబు:
కొండ, నగము, పర్వతము

25. రాము, సీతకై మంజరి తెచ్చాడు.
జవాబు:
పూగుత్తి, కుచ్చు

26. రాధ ఎంతో మంజులంగా ఉంది.
జవాబు:
మనోహరము, అన్నువ, ఇమ్ము

27. వసంతంలో పికాలు గోల చేస్తాయి.
జవాబు:
కోయిలలు, కోకిలలు, కలకంఠాలు

28. చిరకాల మిత్రులు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు.
జవాబు:
కౌగిలింత, అంకపాళి, కౌగిలి

AP 10th Class Telugu 6th Lesson Important Questions ప్రకృతి సందేశం

ఆ) గీత గీసిన పదానికి సరియైన పర్యాయపదాలు

29. హిమాలయ శిఖరం చాలా గొప్పది.
అ) కొప్పరము, శేఖరము
ఆ) ఖరము, ఖురము
ఇ) పురము, అంతఃపురము
ఈ) మకుటము, ముకురము
జవాబు:
అ) కొప్పరము, శేఖరము

30. మేఘం లేనిదే వర్షం రాదు.
అ) అఘము, అనఘము
అంబుదము, పయోధరము
ఇ) సాగరము, సంద్రము
ఈ) గగనము, ఆకాశము.
జవాబు:
ఆ) అంబుదము, పయోధరము

31. మా పెరట్లో మల్లె లతలు బాగా అల్లుకున్నాయి.
అ) వాగు, వేగు
ఆ) నీల, లీల
ఇ) తీగ, తివ్వ
ఈ) అవ్వు, బువ్వ
జవాబు:
ఇ) లీగ, తివ్వ

32. వసంతంలో వలరాజు వీర విహారం చేస్తాడు.
అ) రాముడు, భీముడు
ఆ) నలుడు, బలుడు
ఇ) ఇంద్రుడు, చంద్రుడు
ఈ) మన్మథుడు, పంచబాణుడు
జవాబు:
ఈ) మన్మథుడు, పంచబాణుడు

33. పేదవారిపై నెమ్మి కల్గి ఉండాలి.
అ) ప్రేమ, అనుగు
అ) దోమ, భామ
ఇ) ప్రేమ, దోమ
ఈ) భామ, రమ
జవాబు:
అ) ప్రేమ, అనుగు

34. సాయం వేళల్లో తెమ్మెరలు వీస్తాయి.
అ) తుమ్మెద, తుమ్ములు
ఆ) గాలి, అనిలము
ఇ) సమయం, అసమయం
ఈ) వాలి, లాలి
జవాబు:
ఆ) గాలి, అనిలము

35. కర్షకుని కష్టం ఎవ్వరూ తీర్చలేనిది.
అ) సౌరు, సొంపు
ఆ) వాసన, సువాసన
ఇ) రైతు, కృషీవలుడు
ఈ) రైతు, రౌతు
జవాబు:
ఇ) రైతు, కృషీవలుడు

36. ఎచ్చటను సమరం పనికిరాదు. గుర్తించండి.
అ) అమరం, సమరం
ఆ) మర్మం, ధర్మం
ఇ) సూక్తి, ఉత్తి
ఈ) యుద్ధం, సంగరం
జవాబు:
ఈ) యుద్ధం, సంగరం

ప్రకృతి వికృతులు

అ) గీత గీసిన పదానికి సరియైన ప్రకృతి వదం రాయండి.

37. తూరుపు దెస మెరుస్తోంది.
జవాబు:
దిక్కు

38. విన్నాణము పెంచుకోవాలి.
జవాబు:
విజ్ఞానము

39. నిముసము కూడా వృథా చేయకు.
జవాబు:
నిమిషము

40. సంద్రం అల్లకల్లోలంగా ఉంది.
జవాబు:
సముద్రం

41. వెన్నుని భార్య లచ్చి.
జవాబు:
లక్ష్మి

AP 10th Class Telugu 6th Lesson Important Questions ప్రకృతి సందేశం

ఆ) గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.

42. మూర్ఖులు ఎవ్వరి మాటా వినరు.
అ) మూర్ఖ
ఆ) దుష్టులు
ఇ) మొరకులు
ఈ మొరాలు
జవాబు:
ఇ) మొరకులు

43. అగ్నిలో చేయి పెడితే కాలుతుంది.
అ) అగ్గి
ఆ) అగిని
ఇ) అఘ్ని
ఈ) అఘిని
జవాబు:
అ) అగ్గి

44. న్యాయమును కాపాడాలి.
అ) అన్యాయం
ఆ) అన్నేయం
ఇ) నేయం
ఈ) నాయము
జవాబు:
ఈ) నాయము

45. నా భాష నాకు గొప్పది.
అ) భక్ష
ఆ) బర్షే
ఇ) బాస
ఈ) భాస
జవాబు:
ఇ) బాస

46. మన కవుల కవిత్వం చాలా గొప్పది.
అ) కైత
ఆ) వాత
ఇ) రాత
ఈ) తాత
జవాబు:
అ) కైత

నానార్థాలు

అ) గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి.

47. మా యింట్లో నిలువెత్తు ముకురం ఉంది.
జవాబు:
పొగడ, అద్దము

48. నా శిష్యుడు మంచి మంజరిని తెచ్చి ఇచ్చాడు.
జవాబు:
పూగుత్తి, ఎఱ్ఱనేల

49. ఆమె అందము మంజులమైనది.
జవాబు:
పొదరిల్లు, మనోహరము

50. హిమాలయ శిఖరం చాలా ఎత్తైనది.
జవాబు:
శృంగము, కొన

51. ఆకాశంలో మేఘాలున్నాయి.
జవాబు:
మబ్బులు, కపోలమదములు

AP 10th Class Telugu 6th Lesson Important Questions ప్రకృతి సందేశం

ఆ) గీత గీసిన పదానికి సరైన నానార్థాలు గుర్తించండి.

52. తల్లిదండ్రులపై నెమ్మి ఉండాలి.
అ) ప్రేమ, నెమలి
ఆ) దోమ, బల్లి
ఇ) భామ, పులి
ఈ) చలి, పులి
జవాబు:
అ) ప్రేమ, నెమలి

53. సాయంకాలం వీచె తెమ్మెర చల్లగా ఉంటుంది.
అ) బమ్మెర, మరమర
ఆ) గాలి, మలయమారుతము
ఇ) రైతు, బైతు
ఈ) సౌఖ్యము, సుఖము
జవాబు:
ఆ) గాలి, మలయమారుతము

54. కర్షకుడు లేనిదే దేశమే లేదు.
అ) శని, ఘని
ఆ) చందము, విధము
ఇ) అంగారకుడు, రైతు
ఈ) న్యాయము, ధర్మము
జవాబు:
ఇ) అంగారకుడు, రైతు

55. చదువుపై దీక్ష ఉండాలి.
అ) కక్ష భిక్ష
ఇ) లలిత, కవిత
ఆ) తితిక్ష, సుభిక్ష
ఈ) పట్టుదల, ఉపనయనము
జవాబు:
ఈ) పట్టుదల, ఉపనయనము

వ్యుత్పత్త్యర్థాలు

అ) గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్ధం రాయండి.

56. కర్షకుడు దేశానికి వెన్నెముక.
జవాబు:
భూమిని దున్నువాడు – రైతు

57. వాడు ఆకాశంలో పక్షిలా ఉన్నాడు.
జవాబు:
రెక్కలు కలది – విహంగమ

58. ఆకాశం నీలి రంగులో ఉంటుంది.
జవాబు:
సూర్యాది గ్రహములచే అంతటను ప్రకాశించునది – గగనము

59. నిలువెత్తు ముకురం మా ఇంట కలదు.
జవాబు:
దీనిచే అలంకరింపబడుదురు – అద్దము

60. వసంతంలో పికము కూస్తుంది.
జవాబు:
చాటున నుండి కూయునది – కోయిల

61. వసంతంలో వలరాజు చెలరేగుతాడు.
జవాబు:
వలపునకు రాజు మన్మథుడు

AP 10th Class Telugu 6th Lesson Important Questions ప్రకృతి సందేశం

ఆ) గీత గీసిన పదానికి సరైన వృతృత్వరాన్ని గుర్తించండి.

62. పయోనిధిని హనుమ అవలీలగా దాటెను.
అ) అలల నిలయం – కడలి
ఆ) కెరటాల నిధి – సాగరం
ఇ) సాగర పుత్రులచే తవ్వబడినది – సముద్రం
ఈ) నీటికి నిలయం – శరథి
జవాబు:
ఈ నీటికి నిలయం – శరథి

63. భాస్కరుడు తీక్షణ కిరణాలు కలవాడు.
అ) వేడి కలవాడు – సూర్యుడు
ఆ) కాంతిని ఇచ్చేవాడు – రవి
ఇ) ఆకాశంలో తిరిగేవాడు – ఖగుడు
ఈ) కిరణాలు కలవాడు – ఉగ్రుడు
జవాబు:
ఆ) కాంతిని ఇచ్చేవాడు – రవి

64. ముఖము రోజూ రెండుసార్లైనా శుభ్రం చేయాలి.
అ) దీని చేత అందం వస్తుంది.
ఆ) దీని చేత మాటలు వస్తాయి.
ఇ) దీని చేత భక్ష్యం పీడింపబడును – వదనం
ఈ) దీనిలో పళ్లు అమరి ఉంటాయి.
జవాబు:
ఇ) దీని చేత భక్ష్యం పీడింపబడును – వదనం

65. వేదవ్యాసుని శిష్యుడు సూతుడు.
అ) చదివేవాడు
ఆ) శిక్షింపదగినవాడు
ఇ) ఆదుకొనేవాడు
ఈ) కొడుకు వంటివాడు
జవాబు:
ఆ) శిక్షింపదగినవాడు

జాతీయాన్ని గుర్తించడం

వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి విడిగా రాయండి.

66. తుఫాను వలన రైతుల ఆశలు నీరుగారిపోయాయి.
జవాబు:
నీరుగారిపోవు

67. చెడు వ్యసనాల వలన ఉన్నదంతా ఊడ్చుకుపోయింది.
జవాబు:
ఉన్నదంతా ఊడ్చుకుపోవుట

68. తుఫాను పంట పొలాలను నాశనం చేయడంతో రైతుల గుండెలు బరువెక్కాయి.
జవాబు:
గుండెలు బరువెక్కుట

69. మా ఉపాధ్యాయుడి ఉపదేశం కనువిప్పు కల్గించింది.
జవాబు:
కనువిప్పు

70. నిత్యావసర వస్తువుల ధరలు మిన్నంటుకొనుచున్నవి.
జవాబు:
మిన్నంటుకొనుట

జాతీయము సందర్భము

ఈ జాతీయాన్ని ఏ అర్థంలో / సందర్భంలో ఉపయోగిస్తారో రాయండి.

71. శ్రీరామరక్ష
జవాబు:
శ్రీరాముడు సీతను రక్షించినట్లు ‘సర్వ రక్షకము’ అనే సందర్భంలో దీన్ని ఉపయోగిస్తారు.

72. గుండెలు బరువెక్కడం
జవాబు:
చాలా బాధ కలిగిన సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.

73. పురిటిలోనే సంధి కొట్టడం
జవాబు:
ఏదైనా పని ప్రారంభంలోనే పాడైన సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.

74. అరచేతులపై నడిపించు
జవాబు:
ఒక వ్యక్తిని చాలా అపురూపంగా, చాలా ప్రేమగా చూసుకొనే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.

75. భగీరథ ప్రయత్నం
జవాబు:
అమోఘమైన కార్యదీక్ష అనే సందర్భంలో భగీరథ ప్రయత్నం అనే జాతీయాన్ని ఉపయోగిస్తారు.

76. నిమ్మకు నీరెత్తినట్లు
జవాబు:
ఏమి జరిగినా, ఎంత కష్టమొచ్చినా ఆదుర్దా పడకుండా స్థిమితంగా ఉండే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

77. తలకు మించిన పని
జవాబు:
అధికమైన బరువును మోస్తున్న సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

78. తూర్పుకు తిరిగి దండం పెట్టు.
జవాబు:
ఏమీ చేయలేని పరిస్థితిని వివరించే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

79. తిన్నింటి వాసాలు లెక్కపెట్టు
జవాబు:
నమ్మకంగా ద్రోహం చేసేవారి పరిస్థితిని వివరించే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

AP 10th Class Telugu 6th Lesson Important Questions ప్రకృతి సందేశం

80. తలలో నాలుక
జవాబు:
మిక్కిలి అణుకువ కల్గియున్న వాని విషయంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

సంధి పదాలను విడదీయడం

గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి.

81. అత్యంత విలువైనది కోహినూరు వజ్రం,
జవాబు:
అతి + అంత

82. అందాల చిందించు అరవిరుల నెత్తావి.
జవాబు:
నెఱ + తావి

83. సమరాలు కల్పించి చంపినారు.
జవాబు:
సమరము + లు

84. అల్లి బిల్లిగ చెట్లనల్లుకొన లతాళి.
జవాబు:
లత + ఆళి

85. సరోవరములందు తామరలు విలసిల్లుచున్నాయి.
జవాబు:
సరః + వరము

సంధి పదాలను కలపడం

సంధి పదాలను కలిపి రాయండి.

86. జరర + అరుణచ్ఛవులు
జవాబు:
జరలారుణచ్ఛవులు

87. స్వ + ఇచ్ఛ
జవాబు:
స్వేచ్ఛ

88. మనః + హరము
జవాబు:
మనోహరము

89. ముక్కులు + ఆనించు
జవాబు:
ముక్కులానించు

90. స్వేచ్ఛకు + బ
జవాబు:
స్వేచ్ఛకై

91. మధురము + ఔ
జవాబు:
మధురమౌ

AP 10th Class Telugu 6th Lesson Important Questions ప్రకృతి సందేశం

92. ఆవేశగమనములు + ఐ
జవాబు:
ఆవేశగమనములై

సంధి నామాలు

గీత గీసిన పదం ఏ సంధికి చెందినదో గుర్తించండి.

93. ఈ లతాళి ఎంత మనోహరంగా ఉంది.
అ) సవర్ణదీర్ఘ సంధి
ఆ) గుణసంధి
ఇ) వృద్ధి సంధి
ఈ) యణాదేశ సంధి
జవాబు:
అ) సవర్ణదీర్ఘ సంధి

94. జరఠారుణచ్ఛవులు కరిగిపోయెడి వేళ.
అ) గుణ సంధి
ఆ) సవర్ణదీర్ఘ సంధి
ఇ) ఉత్వ సంధి
ఈ) యడాగమ సంధి
జవాబు:
ఆ) సవర్ణదీర్ఘ సంధి

95. స్వేచ్ఛకై సమత మమత దెచ్చెనూ.
అ) సవర్ణదీర్ఘ సంధి
ఆ) పడ్వాది సంధి
ఇ) గుణ సంధి
ఈ) రుగాగమ సంధి.
జవాబు:
ఇ) గుణ సంధి

96. మధురమౌ బక్యతను కాంక్షించెరా.
అ) అత్వ సంధి
ఆ) గుణసంధి
ఇ) ఇత్వ సంధి
ఈ) ఉత్వ సంధి
జవాబు:
ఈ) ఉత్వ సంధి

97. ముక్కులానించు లకుముకి పిట్ట దంపతులు.
అ) ఉత్వ సంధి
ఆ) ఇత్వ సంధి
ఇ) టుగాగమ సంధి
ఈ) రుగాగమ సంధి
జవాబు:
అ) ఉత్వ సంధి

98. ఆ సరోవరములందు తామరలు అందంగా ఉన్నాయి.
అ) గుణ సంధి
ఆ) విసర్గ సంధి
ఇ) ఇత్వ సంధి
ఈ) ఉత్వ సంధి
జవాబు:
ఆ) విసర్గ సంధి

AP 10th Class Telugu 6th Lesson Important Questions ప్రకృతి సందేశం

99. పువ్వు పువ్వున వ్రాలి పూదేనె లందెచ్చి.
అ) పుంప్వాదేశ సంధి
ఆ) ఉత్వ సంధి
ఇ) ప్రాతాది సంధి
ఈ) సరళాదేశ సంధి
జవాబు:
ఇ) ప్రాతాది సంధి

విగ్రహావాక్యాలు

గీత గీసిన పదానికి విగ్రహవాక్యం రాయండి.

100. విద్యార్థులు ప్రతిదినం ఒక కొత్త విషయాన్ని తెల్సుకోవాలి.
జవాబు:
దినము, దినము

101. నలుదెసలు చీకట్లు ముసిరాయి.
జవాబు:
నాల్గు సంఖ్య గల దెసలు

102. గగనకాంత విలసిల్లుతోంది.
జవాబు:
గగనమనెడి కాంత

103. రైతులు కాయకష్టము చేసి జీవిస్తారు.
జవాబు:
కాయము యొక్క కష్టము

104. విద్యార్థులు ఆటపాటలందు మునిగి తేలుతారు.
జవాబు:
ఆటయును, పాటయును

105. సమతా మమతలను కలిగి మానవుడుండాలి.
జవాబు:
సమతయును, మమతయును

106. అనురాగసారంతో ఆమె వర్ధిల్లుతోంది.
జవాబు:
అనురాగము యొక్క సారము

107. నేడు మానవుల గతి దుర్భరం.
జవాబు:
మానవుల యొక్క గతి

సమాస నామాలు

గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.

108. ఎవ్వరికినీ కుటిలబుద్ధులు ఉండరాదు.
అ) విశేషణ పూర్వపద కర్మధారయము
ఆ) విశేషణ ఉత్తరపద కర్మధారయము
ఇ) ఉపమాన పూర్వపద కర్మధారయము
ఈ) సంభావనా పూర్వపద కర్మధారయము
జవాబు:
ఆ) విశేషణ పూర్వపద కర్మధారయము

109. ఆ చెట్టు క్రింద చీమలబారులున్నాయి.
అ) కర్మధారయము
ఆ) షష్ఠీ తత్పురుష సమాసం
ఇ) బహువ్రీహి సమాసం
ఈ) ద్విగు సమాసం
జవాబు:
ఆ) షష్ఠీ తత్పురుష సమాసం

110. పక్షుల మంజులగానములు ధ్వనిస్తున్నాయి.
అ) విశేషణ ఉత్తరపద కర్మధారయము
ఆ) సంభావనా పూర్వపద కర్మధారయము
ఇ) విశేషణ పూర్వపద కర్మధారయము
ఈ) ఉపమాన పూర్వపద కర్మధారయము
జవాబు:
ఇ) విశేషణ పూర్వపద కర్మధారయము

111. ప్రతి వ్యక్తికి స్వేఛ్ఛ ఉండాలి.
అ) ద్వంద్వ సమాసం
ఆ) ద్విగు సమాసం
ఇ) బహువ్రీహి సమాసం
ఈ) షష్ఠీ తత్పురుష సమాసం
జవాబు:
ఈ) షష్ఠీ తత్పురుష సమాసం

112. ఆకాశంలో మేఘమాలికలు అందంగా ఉన్నాయి.
అ) షష్ఠీ తత్పురుష సమాసం
ఆ) ద్విగు సమాసం
ఇ) కర్మధారయము
ఈ) ద్వంద్వ సమాసం.
జవాబు:
అ) షష్ఠీ తత్పురుష సమాసం

113. నేటికి మానవుల గతి మారలేదు.
అ) కర్మధారయము
ఆ) షష్ఠీ తత్పురుష సమాసం
ఇ) ద్వంద్వ సమాసం
ఈ) రూపక సమాసం
జవాబు:
ఆ) షష్ఠీ తత్పురుష సమాసం

114. గగనకాంత మనోహరంగా ఉంది.
అ) తత్పురుషము
ఆ) కర్మధారయము
ఇ) రూపక సమాసం
ఈ) ద్వంద్వ సమాసం
జవాబు:
ఇ) రూపక సమాసం

115. పిల్లల ఆటపాటలు ముచ్చటగా ఉంటాయి.
అ) రూపక సమాసం
ఆ) బహువ్రీహి సమాసం
ఇ) ద్విగు సమాసం
ఈ) ద్వంద్వ సమాసం
జవాబు:
ఈ) ద్వంద్వ సమాసం

AP 10th Class Telugu 6th Lesson Important Questions ప్రకృతి సందేశం

116. మానవుల్లో సమతామమతలుండాలి.
అ) ద్వంద్వ సమాసం
అ) ద్విగు సమాసం
ఇ) రూపక సమాసం
ఈ) తత్పురుషము
జవాబు:
అ) ద్వంద్వ సమాసం

ఆధునిక వచనాలు

ఈ వాక్యానికి సరియైన ఆధునిక వచనాన్ని గుర్తించండి.

117. చంపకవతియను పట్టణము కలదు.
అ) చంపకవతి అనే పట్టణం ఉంది.
ఆ) చంపకవతి పట్టణము కలదు.
ఇ) చంపకవతి అనే పట్టణము ఉంది.
ఈ) చంపకవతి అనే పట్టణము లేదు.
జవాబు:
అ) చంపకవతి అనే పట్టణం ఉంది.

118. ఇంక నాకిక్కడ వసింపదగును.
అ) ఇక నాకిక్కడ వసింపను.
ఆ) ఇది నాకు ఇక్కడ నివసించడం తగింది కాదు.
ఇ) ఇక నాకిక్కడ వసించడం మంచిది కాదు.
ఈ) ఇక నాకిక్కడ చోటు లేదు.
జవాబు:
ఆ) ఇది నాకు ఇక్కడ నివసించడం తగింది కాదు.

119. ధనమును బాసిన క్షణముననే లాతి వాడగును.
అ) ధనమును బాసిన క్షణముననే లాతి అవుతుంది.
ఆ) ధనమును బాసిన క్షణంలోనే లాతి అవుతుంది.
ఇ) ధనాన్ని కోల్పోయిన వెంటనే పరాయివాడు అవుతాడు.
ఈ) ధనమును కోల్పోయిన వెంటనే లాతి అవుతాడు.
జవాబు:
ఇ) ధనాన్ని కోల్పోయిన వెంటనే పరాయివాడు అవుతాడు.

120. ఆ పరివ్రాజకుడు సెప్పగా మిక్కిలి ఖిన్నుడనయితిని.
ఆ) ఆ పరివ్రాజకుడు సెప్పగా మిక్కిలి బాధపడ్డాను.
ఆ) ఆ పరివ్రాజకుడు చెప్పుగా మిక్కిలి వ్యధ చెందాను.
ఇ) ఆ పరివ్రాజకుడు సెప్పగా మిక్కిలి సంతోషించారు.
ఈ) ఆ సన్యాసి చెప్పగా విని చాలా బాధపడ్డాను.
జవాబు:
ఈ) ఆ సన్యాసి చెప్పగా విని చాలా బాధపడ్డాను.

121. ఇపుడు నా వృత్తాంతము పరులతో జెప్పికోలును యుక్తము గాదు.
అ) ఇప్పుడు నా వృత్తాంతం పరులతో చెప్పుకోవడం యుక్తం గాదు.
ఆ) ఇపుడు నా వృత్తాంతం పరులతో చెప్పడం సాధ్యం కాదు.
ఇ) ఇపుడు నా వృత్తాంతము పరులతో జెప్పడం సాధ్యమే.
ఈ) ఇప్పుడు నా వృత్తాంతము పరులతో చెప్పడమే మంచిది.
జవాబు:
అ) ఇప్పుడు నా వృత్తాంతం పరులతో చెప్పుకోవడం యుక్తం గాదు.

వ్యతిరేకార్థక వాక్యాలు

కింది వాక్యాలకు వ్యతిరేకార్థక వాక్యాలు రాయండి.

122. పిల్లలు ఆడుకుంటున్నారు.
జవాబు:
పిల్లలు ఆడుకోవడం లేదు.

123. కవిత పాట పాడుతోండీ.
జవాబు:
కవిత పాట పాడటం లేదు.

124. అన్నయ్యను చదవమని చెప్పు,
జవాబు:
అన్నయ్యను చదవమని చెప్పవద్దు.

125. రాముణ్ని పిలువు.
జవాబు:
రాముణ్ని పిలవవద్దు.

126. రాము వస్తానన్నాడు.
జవాబు:
రాము రానన్నాడు.

వ్యతిరేకార్థక క్రియలు

కింది క్రియా పదాలలో వ్యతిరేకార్థక క్రియను గుర్తించండి.

127. అ) తిని
ఆ) తినక
ఇ) తింటూ
ఈ) తింటే
జవాబు:
ఆ) తినక

128. అ) రాస్తాడు
ఆ) రాయగలడు
ఇ) రాయడ
ఈ) రాస్తున్నాడు
జవాబు:
ఇ) రాయడు

129. అ) పిలిచి
ఆ) అంటూ
ఇ) అరుస్తూ
ఈ) పిలవక
ఆ) తినక
జవాబు:
ఈ) పిలవక

130. అ) పరుగెత్తక
ఆ) పరుగెత్తి
ఇ) పరుగెడుతూ
ఈ) పరుగు
జవాబు:
అ) పరుగెత్తక

131. అ) పాడుతూ
ఆ) పాడి
ఇ) పాడక
ఈ) పాడినా
జవాబు:
ఇ) పాడక

132. అ) నిద్రించి
ఆ) నిద్రిస్తూ
ఇ) నిద్రించ
ఈ) నిద్రించక
జవాబు:
ఈ) నిద్రించక

AP 10th Class Telugu 6th Lesson Important Questions ప్రకృతి సందేశం

133. అ) తిట్టక
ఆ) తిట్టి
ఇ) తిడుతూ
ఈ) తిట్టాడు
జవాబు:
ఆ) తిట్టక

సంక్లిష్ట వాక్యాలు

ఇది ఏ రకమైన సంక్లిష్టవాక్యాలో రాయండి.

134. రాజు అన్నం తిన్నాడు.
జవాబు:
సామాన్య వాక్యం

135. సీత బజారు వెళ్ళి కూరగాయలు కొన్నది.
జవాబు:
సంక్లిష్ట వాక్యం

136. రామకృష్ణుడు, వివేకానందులు గురుశిష్యులు.
జవాబు:
సంయుక్త వాక్యం

137. రాము అన్నం తిని, సినిమా చూస్తున్నాడు.
జవాబు:
క్త్వార్థక వాక్యం

138. సీత పాట వింటూ చదువుతోంది.
జవాబు:
శత్రర్థక వాక్యం

కర్మణి వాక్యాలు

సరియైన కర్మణి వాక్యాన్ని గుర్తించండి.

139. నేను రచించిన గ్రంథం నేతాజీ చరిత్ర.
అ) నాచే రచింపబడిన గ్రంథం నేతాజీ చరిత్ర.
ఆ) నేను రచించాను నేతాజీ చరిత్ర గ్రంథం.
ఇ) నాచే రచించాను నేతాజీ చరిత్ర గ్రంథం.
ఈ) నేను రచింపబడిన గ్రంథం నేతాజీ చరిత్ర.
జవాబు:
అ) నాచే రచింపబడిన గ్రంథం నేతాజీ చరిత్ర.

140. ఆయన చెప్పింది ఇదే కదా!
అ) ఆయన చెప్పబడింది ఇదే కదా!
ఆ) ఆయనచే చెప్పబడింది ఇదే కదా!
ఇ) ఆయన చెప్పాడు కదా! ఇదే!
ఈ) ఆయనతో చెప్పింది ఇదే కదా!
జవాబు:
ఆ) ఆయనచే చెప్పబడింది ఇదే కదా!

141. రాముడు భారతాన్ని చదివాడు.
అ) రాముడు భారతం చదివించాడు.
ఆ) భారతం చదవలేదు రాముడు.
ఇ) భారతం రామునిచే చదువబడింది.
ఈ) భారతంచే రాముడు చదివాడు.
జవాబు:
ఇ) భారతం రామునిచే చదువబడింది.

వాక్య రకాలు

ఇవి ఏ రకమైన సామాన్య వాక్యాలో రాయండి.

142. లోపలకు రావచ్చును.
జవాబు:
అనుమత్యర్థక వాక్యం

143. నీవు వెయ్యేళ్ళు వర్ధిల్లుము.
జవాబు:
ఆశీరార్థక వాక్యం

144. లక్ష్మీ నరసింహా! నన్ను కాపాడు.
జవాబు:
ప్రార్ధనార్థక వాక్యం

145. వాడు చదివాడో! లేడో!
జవాబు:
సందేహార్ధక వాక్యం

146. అయ్యో! దశరథుడు మరణించాడు.
జవాబు:
ఆశ్చర్యార్ధక వాక్యం

147. ఆహా! ఈ శిల్పమెంత బాగున్నదో!
జవాబు:
ఆశ్చర్యార్థక వాక్యం

148. రవి అన్నం తిన్నాడు.
జవాబు:
సామాన్య వాక్యం

149. రమణ ప్రయాణం చేయగలడు.
జవాబు:
సామర్థ్యార్థక వాక్యం

150. రాజు సినిమా చూడబోయాడు.
జవాబు:
తుమున్నర్ధక వాక్యం

AP 10th Class Telugu 6th Lesson Important Questions ప్రకృతి సందేశం

151. మీరు ఊరు వెళ్ళండి.
జవాబు:
విధ్యర్థక వాక్యం

వాక్య రకాలు

ఇవి ఏ రకమైన సామాన్య వాక్యాలో గుర్తించండి.

152. లలిత బొమ్మ గీసి, రంగులు వేసింది.
అ) క్వార్థకం
ఆ) చేదర్థకం
ఇ) ఆశీరర్థకం
ఈ) సందేహార్ధకం
జవాబు:
అ) క్వార్థకం

153. వేపచెట్టు ఎదిగితే నీడనిస్తుంది.
అ)ఆశీరర్దకం
ఆ) వేదర్థకం
ఇ) ప్రశ్నార్థకం
ఈ) శత్రర్థకం
జవాబు:
చేదర్థకం

154. నేను మాట్లాడడం తప్పా?
అ) ఆశీరర్థకం
ఆ) చేదర్థకం
ఇ) ప్రశ్నార్థకం
ఈ) శత్రర్థకం
జవాబు:
ఇ) ప్రశ్నార్థకం

155. కృష్ణా! దయచేసి ఇటురా!
అ) ప్రశ్నార్థకం
ఆ) చేదర్థకం
ఇ) ఆశీరర్థకం
ఈ) ప్రార్థనార్ధకం
జవాబు:
ఈ) ప్రార్థనార్ధకం

156. ధర్మరాజు హస్తినాపురమునకు రాజు.
అ) నిశ్చయార్థకం
ఆ) చేదర్థకం
ఇ) ప్రశ్నార్థకం
ఈ) శత్రర్థకం
జవాబు:
అ) నిశ్చయార్థకం

157. అందరూ చదవండి.
అ) ప్రార్ధనార్థకం
ఆ) విధ్యర్థకం
ఇ) సందేహార్ధకం
ఈ) అప్యర్థకం
జవాబు:
ఆ) విధ్యర్థకం

158. ఎక్కడికి ఈ పయనం?
అ) ప్రశ్నార్థకం
ఆ) అనుమత్యర్ధకం
ఇ) సందేహార్థకం
ఈ) విధ్యర్థకం
జవాబు:
అ) ప్రశ్నార్థకం

AP 10th Class Telugu 6th Lesson Important Questions ప్రకృతి సందేశం

159. అతడు వస్తాడో! రాడో!
అ) ఆశ్చర్యార్థకం
ఆ) విధ్యర్థకం
ఇ) నిశ్చయార్థకం
ఈ) సందేహార్ధకం
జవాబు:
ఈ) సందేహార్ధకం

160. మీరు ఆడుకోవచ్చు.
అ) అనుమత్యర్థకం
ఆ) విధ్యర్థకం
ఇ) ఆశ్చర్యార్థకం
ఈ) ప్రశ్నార్థకం
జవాబు:
అ) అనుమత్యర్థకం

Leave a Comment