These AP 10th Class Telugu Important Questions 5th Lesson జలియన్ వాలా బాగ్ will help students prepare well for the exams.
జలియన్ వాలా బాగ్ AP Board 10th Class Telugu 5th Lesson Important Questions and Answers
అవగాహన – ప్రతిస్పందన
కింది పరిచిత పద్యాలను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. అట్టిశౌర్యంబు వెచ్చించి ఆవహమున
విజయ మార్జించి వచ్చిన వీరవరులు
భారతీయులు వట్టిసేవకు లటంచుఁ
జెప్ప నోరాడెనే విదేశీయులార?
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
ఆవహము అంటే ఏమిటి?
జవాబు:
ఆవహము అంటే ‘యుద్ధం’ అని అర్థం.
2. విదేశీయులు అంటే ఎవరు?
జవాబు:
విదేశీయులు అంటే ఆంగ్లేయులు.
3. ‘నోరాడెనే’ పదం విడదీయండి.
జవాబు:
నోరు + ఆడెనే
4. పద్యంలో ‘సేవకులు’ ఎవరని చెప్పబడింది?
జవాబు:
పద్యంలో సేవకులు అంటే భారతీయులని చెప్పబడింది.
2. కలికిఁ జెలికాఁడు యమునకు వలపుకాఁడు
మోసములకు ఠావు, విరోధములకు ప్రోవు
దుర్గుణంబులకాణాచి తులువ, బూచి
ఈ చికాకుల నించె మా యించెతేఁడు
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
పద్యంలో ఆంగ్లేయుడికి స్నేహితుడు ఎవరు?
జవాబు:
ఆంగ్లేయుడికి స్నేహితుడు కలిపురుషుడు.
ప్రశ్న 2.
ఆంగ్లేయుడి బుద్ధి ఎలాంటిది?
జవాబు:
ఆంగ్లేయుడి బుద్ధి కుటిలమైనది.
ప్రశ్న 3.
ప్రాణాలను హరించేవాడెవడు?
జవాబు:
ప్రాణాలను హరించేవాడు యముడు.
ప్రశ్న 4.
ఆంగ్లేయుడు ఎవరిని మోసం చేశాడు?
జవాబు:
ఆంగ్లేయుడు భారతీయుల్ని మోసం చేశాడు.
3. వేల ప్రజల తుపాకుల పాలు జేసి
కోసి, ప్రాణార్థములు లాగి వేసినారు
తెలిసి పంజాబు పరువును దీసినారు
కలుషమని జంకఁబోక రాకాసిమూక.
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
‘ప్రాణార్థములు’ ఏ ససమాసం?
జవాబు:
రూపక సమాసం
ప్రశ్న 2.
‘రాకాసిమూక’ అని కవి ఎవరిని అన్నాడు?
జవాబు:
ఆంగ్లేయులు
ప్రశ్న 3.
‘పాపం’ అనే అర్థం ఉన్న పదం పద్యంలో గుర్తించండి.
జవాబు:
కలుష
ప్రశ్న 4.
‘పాలు’ నానార్థాలు రాయండి.
జవాబు:
క్షీరం, అమృతం, భాగం
వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) ఈ క్రింది ప్రశ్నకు నాలుగైదు వాక్యాల్లో సమాధానం రాయండి.
ప్రశ్న 1.
‘జలియన్ వాలాబాగ్’ పాఠ్యభాగ కవి ‘డాక్టర్ ఉమర్ ఆలీషా’ గురించి రాయండి.
జవాబు:
- ‘జలియన్ వాలాబాగ్’ పాఠ్యభాగ రచయిత డాక్టర్ ఉమర్ ఆలీషా.
- ఈయన తూర్పుగోదావరి జిల్లా (ప్రస్తుతం కాకినాడ జిల్లా) పిఠాపురంలో జన్మించారు.
- రచనలు : మణిమాల, అనసూయాదేవి, చంద్రగుప్త, విషాద సౌందర్యం మొదలైన నాటకాలు, ఖండకావ్యాలు, బ్రహ్మవిద్యావిలాసం, సూఫీ వేదాంత దర్శము, మహమద్ రసూల్ వారి చరిత్ర మొదలగు పద్య గ్రంథాలు, ఈశ్వరుడు, మహమ్మద్ వారి చరిత్ర, సాధన పథం మొదలగు గద్య రచనలు, ఏకాంకికలు, ప్రహసనాలు, నవలలు, కథల సంగ్రహం, అనువాదాలు మొదలగు రచనలు చేశారు.
- బిరుదులు, పురస్కారాలు: ఈయన ‘పండిట్’, ‘మౌల్వీ’ బిరుదులు పొందారు. ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా గౌరవ డాక్టరేట్తో సత్కరించింది.
ఆ) ఈ క్రింది ప్రశ్నకు 8 నుండి 10 వాక్యాల్లో జవాబు రాయండి.
ప్రశ్న 1.
ఆంగ్ల కిరీట రక్షణకై భక్తి, శ్రద్ధలతో సాగిన భారతీయ సైనికుడు, ఆంగ్లేయులపై పోరాటానికి ఎందుకు రక్తం దించాడు?
జవాబు:
1600 సంవత్సరంలో వ్యాపారం అనే పేరుతో భారతదేశంలోకి అడుగుపెట్టిన ఆంగ్లేయులు, భారత్లోని సిరిసంపదలను చూసి అసూయ చెందారు. విద్య, సేవ, వ్యాపారం అనే వంక పెట్టి భారతదేశంలో అడుగుపెట్టిన బ్రిటీష్ వాళ్ళు ‘ఇంతింతై వటుడింతై అన్న చందాన మనపై పెత్తనం చేసే స్థాయికి వచ్చారు. ఈ ఘటన….. ఒక ఒంటె గుదారంలో తలపెట్టి లోపలికి వచ్చేందుకు అనుమతి కోరిన కథను గుర్తు చేస్తుంది. ‘అతిథిదేవోభవ’ అన్న మాటకు విలువనిచ్చిన మన భారతీయ సంస్కృతిని చేతకాని తనంగా భావించారు ఆంగ్లేయులు, విద్యావంతుల్ని చేయడం, ఉద్యోగలివ్వడం, వ్యాపారాలలో భాగస్వాములను చేయడం… ఇవన్నీ మనం ఆంగ్ల కిరీట రక్షణకై భక్తి, శ్రద్ధలతో పనిచేయడానికి కారణమయ్యాయి. కానీ ఆంగ్లేయుల ‘విభజించుపాలించు’ అన్న విధానం, మత వ్యాప్తి, మన సంపద కొల్లగొట్టడం, తమ అధికారం కోసం చేసిన మారణహోమాలు ఇవన్నీ భారతీయుల సహనాన్ని పరీక్షించాయి. ఎదురు తిరిగితే చంపడమే, ఈ దమన కాండను భారతీయులు జీర్ణించుకోలేక ఆంగ్లేయులపై పోరాడారు. రక్తాన్ని చిందించారు.
ఇ) కింది అంశాల గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.
ప్రశ్న 1.
స్వాతంత్య్ర సమరయోధుల స్పూర్తిదాయక నినాదాలు రాయండి.
జవాబు:
- వందేమాతరం – బంకించంద్ర చటోపాధ్యాయ
- జై జవాన్, జై కిసాన్ – లాల్ బహుదూర్ శాస్త్రి
- డూ ఆర్ డై – మహాత్మాగాంధీ
- ఇంక్విలాబ్ జిందాబాద్ – భగత్ సింగ్
- సత్యమేవ జయతే – మదన్ మోహన్ మాలవ్య
- సైమన్ కమీషన్ గోబ్యాక్ – లాలాలజపతిరాయ్
- సారే జహాసే అచ్చా – మహమ్మద్ ఇక్బాల్
- తుమ్ మురేఖ ఖూన్దే, మై తుమ్మే ఆజాదీ దుంగా – నేతాజీ.
ప్రశ్న 2.
ఆంగ్లేయుల పాలన గురించి మీ మిత్రుడికి లేఖ రాయండి.
జవాబు:
బందరు, X X X X X. ప్రియమైన మిత్రుడు లీలాకృష్ణకు, ఇట్లు, చిరునామా : |
భాషాంశాలు (పదజాలం వ్యాకరణాంశాలు)
కింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి.
అలంకారాలు
ఈ క్రింది వాక్యాల్లోని అలంకారాన్ని గుర్తించి రాయండి.
1. దుఃఖసముద్రము భారతీయ హృద్ధ్వారము సొచ్చియగ్ని వలె జ్వాలలు వీచుచున్న దెంతయున్.
జవాబు:
ఈ పద్యపాదంలో రూపకాలంకారం, ఉపమాలంకారాలున్నాయి.
2. భారతవీరయోధు లౌకపాటె నిరంకుశ శాసనాగ్ని, సంస్కారము చేసినారు.
జవాబు:
ఈ పద్యపాదంలో రూపకాలంకారం కలదు.
3. హర్యక్షము రీతి వైరిగణ కుంభానీకముల్ చీల్చి.
జవాబు:
ఈ పద్యపాదంలో ఉపమాలంకారం, రూపకాలంకారాలున్నాయి.
4. జలియనుబాగులో జనులఁ జంపిన రక్తము వర్షపాతముంబలెఁబ్రవహించె.
జవాబు:
ఈ పద్యపాదంలో ఉపమాలంకారం ఉంది.
5. ప్రళయపయోధముల్ గురియు భంగి ఫరంగి పిరంగి గుండ్ల గుండెలదర……
జవాబు:
ఈ పద్యపాదంలో ఉపమాలంకారం ఉన్నది.
గణవిభజన పద్యపాదం పేరు
కింది పద్య పాదానికి గురులఘువులు గుర్తించి, గణ విభజన చేసి, ఏ పద్య పాదమో రాయండి.
1. పౌరుల శస్త్ర శాస్త్రముల పద్దతి నేరని వారి సాధుసం
జవాబు:
ఇది ఉత్పలమాల పద్యపాదం.
2. ప్రళయ పయోధముల్ గురియు భంగి ఫరంగి పిరంగి గుండ్ల గుం
జవాబు:
ఇది చంపకమాల పద్యపాదం.
3. ఆహారంబున కంగలార్పఁదు, రణవ్యాపార పారాయణం.
జవాబు:
ఇది శార్దూల పద్యపాదం.
4. జలియనుబాగులో జనులఁజంపిన రక్తము వర్షపాతముం
జవాబు:
ఇది చంపకమాల పద్యపాదం.
అర్థాలు
అ) గీత గీసిన పదానికి అర్థం రాయండి.
1. భారతవీరయోధులొకపాటి నిరంకుశ శాసనాగ్ని సంస్కారము చేసినారు.
జవాబు:
కఠిన వైఖరి
2. హూణ కిరాట పుళిందులేడ?
జవాబు:
ఆంగ్లదేశము
3. దీనిని చూసి పరిపంథి నృపాలురు నవ్వుతున్నారు.
జవాబు:
శత్రువు
4. జల్యనువాలబాగులో దూరి వధించెను.
జవాబు:
చంపెను
5. హర్యక్షము రీతి.
జవాబు:
సింహం
ఆ) గీత గీసిన పదానికి సరియైన అర్థాన్ని గుర్తించండి.
6. ఒకచోట నీహార నికరంపురాలపై అవళించు.
అ) పరువు
ఆ) పూలు
ఇ) మంచు
ఈ) వాన
జవాబు:
ఇ) మంచు
7. ఆవహమున విజయమార్జించి వచ్చిన వీరవరులు భారతీయులు.
అ) ఆట
ఆ) యుద్ధం
ఇ) జీవితం
ఈ) పరీక్ష
జవాబు:
ఆ) యుద్ధం
8. ఈ అఘమూరకే విడువదు.
అ) పుణ్యం
ఆ) దానం
ఇ) ప్రేమ
ఈ) పాపం
జవాబు:
ఈ) పాపం
9. కయ్యాలను పెంచిన కఠినతముడు.
అ) గొడవ
ఆ) స్నేహం
ఇ) బంధం
ఈ) జీతం
జవాబు:
అ) గొడవ
10. మోసములకు ఠావు.
అ)రాజు
ఆ) స్థానం
ఇ) తోడు
ఈ) రక్షణ
జవాబు:
ఆ) స్థానం
పర్యాయపదాలు
అ) గీత గీసిన పదానికి పర్యాయపదాలు రాయండి.
11. భారతీయ హృదయ ద్వారము సొచ్చి.
జవాబు:
మనసు, చిత్తం
12. గాలము మీన జాలమున యొనరించినరీతి.
జవాబు:
చేప, మత్స్యం
13. ప్రభంజనుడు భారతవీరుడు.
జవాబు:
ధీరుడు, పోటరి
14. ఉన్న ఉదకముల్ ద్రావి.
జవాబు:
నీరు, జలం
15. ప్రళయ ప్రయోధముల్ గురియు భంగి.
జవాబు:
మేఘం, మబ్బు
ఆ) గీత గీసిన పదానికి సరియైన పర్యాయ పదాలు గుర్తించండి.
16. దేహ పంజరము డిల్లఁగ జలైదరీతి మార్చినన్.
అ) మేను, దాహం
ఆ) ఒడలు, మెడలు
ఇ) కాయం, ఖాయం
ఈ) శరీరం, తనువు
జవాబు:
ఈ) శరీరం, తనువు
17. రక్తము వర్షపాతముంబలె ప్రవహించె.
అ) శోణం, కుంకుమ
ఆ) నెత్తురు, రాగి
ఇ) రుధిరం, నెత్తురు
ఈ) ఎరుపు, నల్ల
జవాబు:
ఇ) రుధిరం, నెత్తురు
18. ప్రళయము వచ్చెనో.
అ) మృత్యువు, బ్రతుకు
ఆ) కల్పాంతం, యుగాంతం
ఇ) నాశనం, నశ్యం
ఈ) ఉత్పాతం, ఉక్కుపాదం
జవాబు:
ఆ) కల్పాంతం, యుగాంతం
19. జంకఁబోక రాకాసి మూక.
అ) రాక్షసి, రక్కసి
ఆ) అసుర, సుర
ఇ) దైత్య, భృత్య
ఈ) దానవ, మానవ
జవాబు:
అ) రాక్షసి, రక్కసి
20. శుద్ధాంత కాంతలఁజొచ్చి, కొప్పులఁబట్టి
అ) పవిత్రస్థలం, క్షేత్రం
ఆ) రాణిమందిరం, ఇల్లు
ఇ) అంతఃపురం, రాణివాసం
ఈ) భవనం, నిలయం
జవాబు:
ఇ) అంతఃపురం, రాణివాసం
ప్రకృతి – వికృతులు
అ) గీత గీసిన పదానికి సరియైన ప్రకృతి వదం రాయండి.
21. కాటకంబనెడు రక్కసిని దెచ్చినపంద.
జవాబు:
రాక్షసి
22. కయ్యాలను పెంచిన కఠినతముడు.
జవాబు:
కలహం
23. దుర్గుణంబుల కాణాచి, తులువ, బూచి.
జవాబు:
భూతం
24. కాజేయుధనంబు వడ్డి గ్రసియించినరీతి.
జవాబు:
వృద్ధి
ఆ) గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
25. శస్త్రశాస్త్రముల పద్ధతి నేరనివారి.
అ) గ్రంథం
ఆ) శాసనం
ఇ) విద్దియ
ఈ) చట్టము
జవాబు:
ఈ) చట్టము
26. ఆహారంబునకు అంగలార్చడు.
అ) అన్నం
ఆ) బువ్వ
ఇ) ఓగిర
ఈ) బోనం
జవాబు:
ఇ) ఓగిర
27. మా భారత వీరయోధులు ఒకపాటె.
అ) వీరు
ఆ) జోదు
ఇ) శూరు
ఈ) యోదు
జవాబు:
ఆ) జోదు
28. సందేహం బందక ఆత్మరక్తమొలికించెన్ భారతీ సైనికుడు.
అ) సందియం
ఆ) అనుమానం
ఇ) సంశయం
ఈ) సెంక
జవాబు:
అ) సందియం
29. అగ్నివలె జ్వాలలు వీచుచున్న దెంతయున్.
అ) నిప్పు
ఆ) జ్వాల
ఇ) అగ్గి
ఈ) రవ్వ
జవాబు:
ఇ) అగ్గి
నానార్థాలు
అ) గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి.
30. ఈ అఘం ఊరకే విడువదు.
జవాబు:
పాపం, దుఃఖం
31. సాధు సంసారులఁబట్టి డయ్యరు.
జవాబు:
ముని, మంచివాడు, తగినది
32. హృదయ ద్వారము సొచ్చె.
జవాబు:
వాకిలి, ఉపాయం
33. డయ్యరు పిశాచము జల్యనువాలబాగులో దూరి వధించె.
జవాబు:
దెయ్యం, పిల్లి
34. రౌలటు శాసనంబు సమరంబున గెల్చిన.
జవాబు:
ఆజ్ఞ, శాస్త్రం
ఆ) గీత గీసిన పదానికి సరైన నానార్థాలు గుర్తించండి.
35. వైరి గజ కుంభానీకముల్ చీల్చి.
అ) ఏనుగు, కరి
ఆ) మూర, మూడడుగులు
ఇ) ఏనుగు, మూడడుగుల కొలత
ఈ) లావు, ఏనుగు
జవాబు:
ఇ) ఏనుగు, మూడడుగుల కొలత
36. హర్యక్షము రీతి వైరిగజ కుంభానీకముల్ చీల్చి.
అ) ఒక రాశి, శాఖ
ఆ) ఏనుగు కుంభస్థలం, కుండ
ఇ) కుండ, దుత్త
ఈ) ఏనుగు నుదురు, వెదురు
జవాబు:
ఆ) ఏనుగు కుంభస్థలం, కుండ
37. భారతవీర కోటి రణ పాండితి.
అ) సంఖ్యావిశేషం, అంచు
ఆ) వింటికొన, అల్లెత్రాడు
ఇ) అనంతం, శూన్యం
ఈ) వందలక్షలు, లక్షలు
జవాబు:
అ) సంఖ్యావిశేషం, అందు
38. ఒక చోట నీహార నికరంపురాల పైఁబవళించు.
అ) సమూహం, నిధి
ఆ) సమూహం, గుంపు
ఇ) నిధి నిక్షేపం
ఈ) సరాసరి, సరిగా
జవాబు:
అ) సమూహం, నిధి
39. వేల ప్రజల తుపాకుల పాలు జేసి.
అ) వంతు, వాట
ఆ) క్షీరం, భాగం
ఇ) పయస్సు, హవిస్సు
ఈ) అమృతం, సుధ
జవాబు:
ఆ) క్షీరం, భాగం
వ్యుత్పత్త్యర్థాలు
అ) గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్థం రాయండి.
40. రౌలటు శాసనంబు సమరంబున గెల్చిన దాని.
జవాబు:
మరణంతో కూడినది – యుద్ధం
41. పరిపంధి నృపాలురు నువ్వునట్టుల
జవాబు:
బంధించువాడు – శత్రువు
42. ప్రళయ పయోధములు వలె తుపాకీ గుండ్ల వాన కురిసింది.
జవాబు:
నీటిని ఇచ్చునది మబ్బు
ఆ) గీత గీసిన పదానికి సరైన వ్యుత్పత్త్యర్థాన్ని గుర్తించండి.
43. శత్రువులనే ఏనుగుల కుంభస్థలాలను హర్యక్షములా చీల్చి పోరాటం సాగించాడు.
అ) కపిలవర్ణము కల కాళ్ళు కలది – సింహం
ఆ) కపిలవర్ణము కల కన్నులు కలది – సింహం
ఇ) కపిలవర్ణం కల కళ్ళు కలది – ఏనుగు
ఈ) కపిలవర్ణం కల చర్మం కలది – సింహం.
జవాబు:
ఆ) కపిలవర్ణము కల కన్నులు కలది – సింహం
44. భారతవీర యోధులోకపాటె.
అ) యుద్ధం చేయువాడు – సైనికుడు
ఆ) యుద్ధం చేయనివాడు – బంటు
ఇ) యుద్ధం చేద్దాములే అనేవాడు వీరుడు
ఈ) యుద్ధం వద్దనేవాడు – జోదు
జవాబు:
అ) యుద్ధం చేయువాడు – సైనికుడు
45. ఉదకము తాగి జీవిస్తాడు.
అ) నీరు తాగి జీవిస్తాడు – మానవుడు
ఆ) మంచినీరుగా ఉండునది – జలం
ఇ) ద్రవమై ఉండునది – నీరు
ఈ) కరుగు స్వభావం కలది – పానీయం
జవాబు:
ఇ) ద్రవమై ఉండునది – నీరు
జాతీయాన్ని గుర్తించడం
కింది వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి విడిగా రాయండి.
46. ఆహారంబునకంగలార్చదు రణ వ్యాపార పారాయణుండు.
జవాబు:
అంగలార్పు
47. బానిసత్వము నుగ్గు పాలఁబోసినదోషి,
జవాబు:
ఉగ్గుపాలుబోసి
జాతీయము – సందర్భము
కింది జాతీయాన్ని ఏ అర్థంలో / సందర్భంలో ఉపయోగిస్తారో రాయండి.
48. ‘గతిమాలి’
జవాబు:
‘దిక్కుమాలిన’ అనే అర్థంలో ఈ పదాన్ని ఉపయోగిస్తారు.
49. ‘దేహీ అను’
జవాబు:
‘యాచించు’, ‘ఇవ్వమని అడుగు’ అను అర్థంలో ఈ పదం ప్రయోగిస్తారు.
సంధి పదాలను విడదీయడం
గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి.
50. నిరంకుశ శాసనాగ్ని సంస్కారము చేసినారు.
జవాబు:
శాసన + అగ్ని
51. జయధ్వజమెత్తినట్టి మా భారత వీర యోధులు.
జవాబు:
ధ్వజము + ఎత్తిన
52. తద్రుధిర ధారలు భోరునఁ బొర్లి పారఁగన్.
జవాబు:
తత్ + రుధిర
53. అరిప్రభంజనుడు భారతవీరుఁడు మాటలేటికిన్.
జవాబు:
మాటలు + ఏటికిన్
54. రణము రేబవలు సలిపి.
జవాబు:
రే + పవలు
55. ఆసవపాన దుర్వ్యసన సంసక్తుఁడై.
జవాబు:
దుః + వ్యసన
సంధి పదాలను కలపడం
కింది సంధి పదాలను కలిపి రాయండి.
56. పాలన్ + పోసిన
జవాబు:
పాలఁబోసిన
57. కాటకంబు + అనెడు
జవాబు:
కాటకంబనెడు
58. కవట + ఆకులను
జవాబు:
కవటాకులను
59. నిః + అపరాధులు
జవాబు:
నిరపరాధులు
60. మానభంగము + చేసి
జవాబు:
మానభంగముజేసి
61. కొప్పులన్ + పట్టి
జవాబు:
కొప్పులఁబట్టి
62. వాక్ + వాదం
జవాబు:
వాగ్వాదం
63. ఉద్యత్ + భక్తి
జవాబు:
ఉద్యద్భక్తి
సంధి నామాలు
గీత గీసిన పదం ఏ సంధికి చెందినదో గుర్తించండి.
64. సీతజాతికి నీతియటంచు నున్నదే.
అ) యడాగమసంధి
ఆ) యణాదేశసంధి
ఇ) అత్వసంధి
ఈ) ఇత్వసంధి
జవాబు:
అ) యడాగమసంధి.
65. తద్రుధిర ధారలు భోరునఁబొర్లి పారఁగన్,
అ) శ్చుత్వ సంధి
ఆ) జత్త్వ సంధి
ఇ) దుగాగమ సంధి
ఈ) రుగాగమ సంధి
జవాబు:
ఆ) జత్త్వ సంధి
66. హర్యక్షము రీతి వైరిగణజకుంభానీకముల్ చీల్చె.
అ) గసడదవాదేశ సంధి
అ) సవర్ణదీర్ఘ సంధి
ఇ) యణాదేశ సంధి
ఈ) త్రిక సంధి
జవాబు:
ఇ) యణాదేశ సంధి
67. నీహార నికరంపురాలపైఁబవళించు.
అ) రుగాగమ సంధి
ఆ) అత్వసంధి
ఇ) విసర్గ సంధి
ఈ) పుంప్వాదేశ సంధి
జవాబు:
ఈ) పుంప్వాదేశ సంధి
68. అనవహన దుర్వ్యసన సంసక్తుండై.
అ) విసర్గ సంధి”
ఆ) రుగాగమ సంధి
ఇ) యడాగమ సంధి
ఈ) యణాదేశ సంధి
జవాబు:
ఆ) విసర్గ సంధి
విగ్రహవాక్యాలు
గీత గీసిన పదానికి విగ్రహవాక్యం రాయండి.
69. దుఃఖసముద్రం భారతీయ హృదయ ద్వారాల్లోకి ప్రవేశించింది.
జవాబు:
దుఃఖమనెడి సముద్రం
70. ఘోరరణం లో శత్రువులతో పోరాడి విజయం కోసం నెత్తురోదారు.
జవాబు:
ఘోరమైన రణం
71. మీనజాలమును పట్టే కాలంలా ఆ చట్టాన్ని డయ్యర్ ప్రయోగించాడు.
జవాబు:
మీనముల యొక్క జాలము
72. భారతవీరుల శౌర్యపరాక్రమాలతో యూరపుదేశం ఊగిపోయింది.
జవాబు:
ద్వంద్వ సమాసం
73. రుధినధారలు ఉవ్వెత్తున పొంగిపొర్లి ప్రవహిస్తున్నాయి.
జవాబు:
షష్ఠీతత్పురుష సమాసం
సమాన నామాలు
గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.
74. వైరిగజ కుంభానీకముల్ చీల్చి సందేహంబందక.
అ) బహువ్రీహి సమాసం
ఆ) రూపక సమాసం
ఇ) నఞ తత్పురుష సమాసం
ఈ) అవ్యయీభావ సమాసం
జవాబు:
ఆ) రూపక సమాసం
75. యుద్ధ సమయంలో ఒక్కోసారి రేబవలు మంచురాళ్ళపై నిద్రిస్తాడు.
అ) ద్వంద్వ సమాసం
ఆ) ద్విగు సమాసం
ఇ) రూపక సమాసం
ఈ) బహువ్రీహి సమాసం
జవాబు:
అ) ద్వంద్వ సమాసం
76. భారతీయుల పట్ల మీరు చేసిన పాపఫలం అనుభవించక తప్పదు.
అ) షష్ఠీ తత్పురుష సమాసం
ఆ) చతుర్థీ తత్పురుష సమాసం
ఇ) పంచమీ తత్పురుష సమాసం
ఈ) తృతీయా తత్పురుష సమాసం
జవాబు:
అ) షష్ఠీ తత్పురుష సమాసం
77. లేత ఆకులు లాంటి పసిపిల్లలను తీవ్రంగా హింసించాడు.
అ) విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం
ఆ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఇ) ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం
ఈ) ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం
జవాబు:
ఆ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
78. వారి ఆర్తనాదాలు దిక్కులంతటా ప్రతిధ్వనిస్తున్నాయి.
అ) ద్వంద్వ సమాసం
ఆ) సంభావనా పూర్వపద కర్మధారయం సమాసం
ఇ) అవ్యయీభావ సమాసం
ఈ) రూపక సమాసం
జవాబు:
ఇ) అవ్యయీభావ సమాసం
ఆధునిక వచనాలు
కింది వాక్యాలకు సరియైన ఆధునిక వచనాన్ని గుర్తించండి.
79. దుఃఖసముద్రము భారతీయ హృద్వారము సొచ్చి.
అ) దుఃఖసముద్రం భారతీయ హృదయ ద్వారాల్లోకి ప్రవేశించి
ఆ) దుఃఖసంద్రం భారతీయ గుండె తలుపుల్లోకి వచ్చి
ఇ) దూకలి సంద్రం భారతీయ ఎద తలుపుల్లోకి చేరి
ఈ) కన్నీరు మున్నీరు భారతీయ ఎడద కవాటాల్లోకి అడుగుపెట్టి
జవాబు:
అ) దుఃఖసముద్రం భారతీయ హృదయ ద్వారాల్లోకి ప్రవేశించి
80. నీతియటంచు నున్నదే.
అ) నీతి అనేది లేదా?
ఆ) నీతి అనేది ఉందా?
ఇ) నీతి అనేది అక్కర లేదా?
ఈ) నీతి అనేది ఉండనవసరం లేదా?
జవాబు:
ఆ) నీతి అనేది ఉందా?
81. బొర్లి పారఁగన్.
అ) పొంగిపొర్లాయి.
ఆ) పొర్లిపోతున్నాయి.
ఇ) పార్లి ప్రవహిస్తున్నాయి.
ఈ) పొర్లి ప్రవహిస్తాయి.
జవాబు:
ఇ) పార్లి ప్రవహిస్తున్నాయి.
82. ఆత్మరక్తమొలికించెన్.
అ) ఆత్మల రక్తం ఒలికించెను.
ఆ) ఆత్మ రక్తము ఒలికించెను.
ఇ) తను రక్తాన్ని ధారబోసెను.
ఈ) తన రక్తాన్ని చిందించెను.
జవాబు:
ఈ) తన రక్తాన్ని చిందించెను.
83. పోరున్ వెన్నిచ్చి పాఅఁడు.
ఆ) యుద్ధంలో వెనుతిరిగి పారిపోడు.
ఆ) యుద్ధం వెనుతిరిగి చేస్తాడు.
ఇ) యుద్ధంలో వెన్నెముక చూపడు.
ఈ) రణరంగంలో పిరికి పారిపోతాడు.
జవాబు:
అ) యుద్ధంలో వెనుతిరిగి పారిపోడు.
వ్యతిరేకార్థక వాక్యాలు
కింది వాక్యాలకు వ్యతిరేకార్థక వాక్యం రాయండి.
84. జలియన్ వాలాబాగ్ లో సమావేశమయ్యారు.
జవాబు:
జలియన్ వాలాబాగ్ లో సమావేశం కాలేదు.
85. శత్రువుపై భారతవీరుడు విజృంభించాడు.
జవాబు:
శత్రువుపై భారతవీరుడు విజృంభించలేదు.
86. శత్రువుల వైపుకు వెళ్ళడు.
జవాబు:
శత్రువుల వైపుకు వెళతాడు.
87. ఈ పాపం ఊరికే పోదు.
జవాబు:
ఈ పాపం ఊరికే పోతుంది.
88. పాపాత్ముడు ఆంగ్లేయుడు.
జవాబు:
పాపాత్యుడు కాడు ఆంగ్లేయుడు.
వ్యతిరేకార్థక క్రియలు
కింది క్రియా పదాలలో వ్యతిరేకార్థక క్రియను గుర్తించండి.
89. అ) వెళ్ళడు
ఆ) వెళ్ళి
ఇ) వెళతాడు
ఈ) వెళుతూ
జవాబు:
అ) వెళ్ళడు
90. అ) పొంగి
ఆ) పొంగక
ఇ) పొంగుతూ
ఈ) పొంగుతున్న
జవాబు:
ఆ) పొంగక
91. అ) చీల్చి
ఆ) చీల్చగలడు
ఇ) చీలుస్తూ
ఈ) చీల్చక
జవాబు:
ఈ) చీల్చక
92. ఆ) సృష్టించి
ఆ) సృష్టిస్తూ
ఇ) సృష్టించక
ఈ) సృష్టించేసి
జవాబు:
ఇ) సృష్టించక
93. అ) తీసింది
ఆ) తీయక
ఇ) తీస్తూ
ఈ) తీసి
జవాబు:
ఆ) తీయక
సంక్లిష్ట వాక్యాలు
ఇవి ఏ రకమైన సంక్లిష్టవాక్యాలో రాయండి.
94. తన సైనికులచే కాల్చి చంపించాడు.
జవాబు:
క్త్వార్థక వాక్యం,
95. నడుచుకుంటూ వెళ్ళే వారిని కిందకు తోశాడు.
జవాబు:
శత్రర్థక వాక్యం
96. నీళ్ళు తాగి జీవిస్తాడు.
జవాబు:
క్త్వార్థక వాక్యం
97. ప్రజలంతా ఏకమైతే విజయం వరిస్తుంది.
జవాబు:
చేదర్థక వాక్యం
కర్మణి వాక్యాలు
సరియైన కర్మణి వాక్యాన్ని గుర్తించండి.
98. తన రక్తాన్ని చిందించాడు.
అ) అతనే రక్తాన్ని చిందించెను.
ఆ) అతనిచే రక్తం చిందించబడింది.
ఇ) రక్తం చిందించింది అతడే.
ఈ) తన రక్తాన్ని ఎందుకు చిందించాడు.
జవాబు:
ఆ) అతనిచే రక్తం చిందించబడింది.
99. హృదయ ద్వారాల్లోకి ప్రవేశించింది.
అ) హృదయ ద్వారాల్లోకి ప్రవేశించబడింది.
ఆ) హృదయ ద్వారాల్లోకి వెళ్లబడింది.
ఇ) ఎద ద్వారాల్లోకి ప్రవేశించబడుతుంది.
ఈ) ప్రవేశించబడుతుంది హృదయద్వారాల్లోకి
జవాబు:
అ) హృదయ ద్వారాల్లోకి ప్రవేశించబడింది.
100. స్త్రీల గౌరవానికి భంగం కలిగింది.
అ) స్త్రీల గౌరవానికి భంగం కల్గించకు.
ఆ) స్త్రీల గౌరవం భంగపడింది.
ఇ) స్త్రీల గౌరవానికి భంగం కలిగించబడింది.
ఈ) స్త్రీలను అగౌరపరచారు.
జవాబు:
ఇ) స్త్రీల గౌరవానికి భంగం కలిగించబడింది.
101. భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.
అ) భారతీయులు ప్రాణాలు కోల్పోవబడినారు.
ఆ) భారతీయులే ప్రాణాలు తీసేయబడ్డారు.
ఇ) భారతీయుల వల్ల ప్రాణాలు కోల్పోవబడింది.
ఈ) భారతీయుల ప్రాణాలు తీయబడ్డాయి.
జవాబు:
అ) భారతీయులు ప్రాణాలు కోల్పోవబడినారు.
102. భారతీవీరుడు విజృంభించాడు.
అ) భారతవీరుడు విజృంభించబడగలడు.
ఆ) భారతవీరుడు విజృంభించబడతాడు.
ఇ) భారతవీరుడు విజృంభించబడినాడు.
ఈ) భారతవీరుడి కొరకు విజృంభించబడింది.
జవాబు:
ఇ) భారతవీరుడు విజృంభించబడినాడు.
వాక్య రకాలు
ఇవి ఏ రకమైన సామాన్య వాక్యాలో రాయండి.
103. ఆ యూరపు దేశమెక్కడ?
జవాబు:
ప్రశ్నార్థక వాక్యం
104. ఈ శ్వేత జాతికి అసలు నీతి ఉందా?
జవాబు:
ప్రశ్నార్థక వాక్యం
105. భారతీయులు యుద్ధావేశంతో శత్రువులను చీల్చి చెండాడారు.
జవాబు:
సామర్థ్యార్థక వాక్యం
106. మీరు చేసిన పాపఫలితం అనుభవించక తప్పదు.
జవాబు:
నిశ్చయార్థక వాక్యం
107. ఏదో వినాశం సంభవిస్తుందేమోనని కొందరు భావించారు.
జవాబు:
సందేహార్థక వాక్యం
108. మీరు అల్లరి చేయవద్దు.
జవాబు:
నిషేధార్థక వాక్యం
109. మంచి మార్కులు తెచ్చుకున్న నీకు శుభాకాంక్షలు.
జవాబు:
ఆశీరార్థక వాక్యం
110. ఆహా ! భారతీయుల పోరాటం ఏమని పొగడాలి.
జవాబు:
ఆశ్చర్యార్థక వాక్యం
111. భారతీయుడు ఒక్కోసారి రాత్రింబవళ్ళు మంచురాళ్ళపై నిద్రిస్తాడు.
జవాబు:
సామర్థ్యార్థక వాక్యం
112. ఓ ఆంగ్లేయుడా! నీ ఆటలు కట్టిపెట్టు.
జవాబు:
నిషేధార్థక వాక్యం
వాక్య రకాలు
ఇవి ఏరకమైన సామాన్య వాక్యాలో గుర్తించండి.
113. శత్రువుల చేతికి చిక్కినా దాసోహమనలేదు.
అ) అప్యర్థకం
ఆ) క్త్వార్థకం
ఇ) ప్రశ్నార్థకం
ఈ) చేదర్థకం
జవాబు:
అ) అప్యర్థకం
114. ఘోర యుద్ధంలో కూడా భారతీయుడు ఎక్కడా అలసి పోలేదు.
అ) ప్రశ్నార్ధకం
ఆ) సామర్థ్యార్థకం
ఇ) నిషేధార్థకం
ఈ) అనుమత్యర్థకం
జవాబు:
ఆ) సామర్ధ్యార్థకం
115. ఈ పాపం ఊరికేపోదు.
అ) ఆశ్చర్యార్థకం
ఆ) ఆశీరార్థకం
ఇ) నిశ్చయార్థకం
ఈ) ప్రశ్నార్థకం
జవాబు:
ఇ) నిశ్చయార్థకం
116. ఎక్కువ వానలతో పంటలు మునిగిపోయాయి.
అ) హేత్వర్థకం
ఆ) అనుమత్యర్థకం
ఇ) ప్రశ్నార్థకం
ఈ నిషేధార్థకం
జవాబు:
అ) హేత్వర్థకం
117. సాయి పద్యం రాయగలడు.
అ) నిశ్చయార్థకం
ఆ) సామర్థ్యార్థకం
ఇ) విద్యర్థకం
ఈ) ఆశీరార్ధకం
జవాబు:
ఆ) సామర్థ్యార్థకం
118. పేదవారికి ఆర్ధికంగా సాయం చేయండి.
అ) ప్రశ్నార్థకం
ఆ) హేత్వర్థకం
ఇ) విద్యర్థకం
ఈ) అనుమత్యర్థకం
జవాబు:
ఇ) విద్యర్థకం
119. మీరు ఊరికి వెళ్ళవచ్చు.
అ) ఆశ్చర్యార్థకం
ఆ) నిషేధార్ధకం
ఇ) అప్యర్థకం
ఈ) అనుమత్యర్థకం
జవాబు:
ఈ) అనుమత్యర్థకం
120. భారతవీరుల పోరాటం చేత స్వాతంత్య్రం సాధించబడింది.
అ) అప్యర్థకం
ఆ) సామర్ధ్యార్థకం
ఇ) నిశ్చయార్థకం
ఈ) ప్రశ్నార్ధకం
జవాబు:
ఆ) సామర్థ్యార్థకం