Access to the AP 10th Class Telugu Guide 4th Lesson ఉపన్యాస కళ Questions and Answers are aligned with the curriculum standards.
ఉపన్యాస కళ AP 10th Class Telugu 4th Lesson Questions and Answers
చదవండి – ఆలోచించి చెప్పండి.
మనసులోని భావాన్ని ఎదుటి వారికి తెలియజేసే మాధ్యమం మాట. మాటకున్న శక్తి గొప్పది. అది అవతలివారిని మెప్పించగలదు, నొప్పించగలదు, ఆపదలనుండి తప్పించగలదు. మాట మరీ మితంగా ఉండకూడదు. అలా అని అమితంగా కూడా ఉండకూడదు. ఆచితూచి మాట్లాడటం అంత సులభమేమీ కాడు. అందుకే మాట్లాడబోయే ముందర మాటలను మనసుతో జల్లించి బయటకు ప్రకటించమని చెప్తోంది ఋగ్నేదం. మధురమైన మాటతో ఎవరినైనా ఆకట్టుకోవచ్చు అంటాడు ప్రఖ్యాత కవి తులసీదాసు.
భౌతికమైన అలంకరణలు ముఖ్యం కాదని వాగ్భూషణమే అసలైన అలంకారం అంటాడు భర్తృరి. చక్కా మాట్లాడటం ఒక సద్గుణం. ఇది హనుమంతుడి దగ్గర పుష్కలంగా ఉందని రాముడే స్వయంగా చెప్పాడు. చక్కగా మాట్లాడటం వల్ల స్నేహితులు పెరుగుతారు. బంధువులు ఆనందిస్తారు. అనుబంధాలు పెరుగుతాయి. అనురాగం పెంపొందుతుంది. కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. మాట్లాడటం ఒక కళ. శబ్దశక్తి తెలససినపానికే ఈ కళ కరతలామలకమవుతుంది. మాటకారి అందరికీ ఆప్తడు అవుతాడు. — పత్రిక వార్త
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
మాట మహిమ ఎటువంటిది ?
జవాబు:
మాటకున్న శక్తి గొప్పది. అది అవతలివారిని మెప్పించగలదు, నొప్పించగలదు, ఆపదల నుండి తప్పించగలదు.
ప్రశ్న 2.
ఆచితూచి మాట్లాడటం అంటే ఏమిటి ?
జవాబు:
ఆచితూచి మాట్లాడడం అంటే చాలా జాగ్రత్తగా మాట్లాడడం అని అర్థం. ‘ఆచి’ అంటే ‘ఆన్చి’ ప్రతి అక్షరం స్పష్టంగా పలకడం. ‘తూచి’ అంటే తూకం వేసినట్లుగా ఆ సందర్భానికి ఎన్ని పదాలు, ఏ మోతాదులో సరిపోతాయో కచ్చితంగా అన్నే పదాలు ప్రయోగించి మాట్లాడడం, అంటే అంతకంటే ఎక్కువ కాని, తక్కువ కాని పదాలు ఏ్రయోగించకుండా ఉండడం అని పెద్దలు చెబుతారు.
ప్రశ్న 3.
చక్కగా మాట్లాడటం వల్ల కలిగే లాభాలు ఏమిటి ?
జవాబు:
చక్కగా మాట్లాడడం వల్ల చాలా లాభాలున్నాయి. చక్కగా మాట్లాడితే గౌరవం పెరుగుతుంది, స్నేహితులు పెరుగుతారు, విలువ పెరుగుతుంది. ఇంకా అనేక లాభాలు ఉన్నాయి.
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
మనిషికి మనీషికి తేడా ఏమిటి?
జవాబు:
మనిషి అంటే సామాన్యుడు. మామూలు మనిషి. మనీషి అంటే మేధావి. తెలివైన వాడు.
ప్రశ్న 2.
వాక్కును సానపెట్టడం అంటే ఏమిటి?
జవాబు:
వాక్కును సానపెట్టడం అంటే మాటలలో ఉండే దోషాలను నివారించుకోవటం. మాటలలో తడబాటును, ఉచ్ఛారణ దోషాలను, యాసను, కంఠధ్వనిని సరిచేసు కొని సభకు అనుగుణంగా, ఆకర్షణీయంగా, చమత్కార భరితంగా ఉపన్యాసం తయారు చేసుకోవటం.
ప్రశ్న3.
చర్చిల్కు గొప్ప వక్తగా గుర్తింపు ఎలా వచ్చింది?
జవాబు:
చర్చిల్ గొప్ప వక్తగా గుర్తింపు పొందడానికి చాలా కృషి చేసాడు. చాలాసార్లు జనం ముందు ఇబ్బంది పడ్డాడు. అందువలన పట్టుదల పెరిగింది. తను గాప్ప వక్త కావాలని నిర్ణయించుకున్నాడు. చాలా (శ్రమ పడ్డాడు. తన మాటకు వదును పెట్టాడు. “అుకున్నది సాధించాడు. గొప్ప వక్త అయ్యాడు.ఆలోచించండి – చెప్పండి
ఇవి చేయండి
అవగాహాన-ప్రతిస్పందన
అ) పాఠం ఆధారంగా కింది అంశాలపై మాట్లాడండి.
ప్రశ్న 1.
సాధన చేయడం ద్వారా మంచి వక్తగా మారవచ్చా? చర్చించండి
జవాబు:
సాధన చేయడం డ్వారా మంచి వక్తగా మారవచ్చును. ఉపన్యాసం చెప్పడం ప్రారంభించిన మొదటి రోజులలో అనేక ఇద్భందులు ఎడురౌతాయి. వాటిని అధిగమించే ప్రయత్నంలో చాలా తప్పులు జరగవచ్చు.
తనను తాను ప్రశ్నించుకొని పరిశీలించుకోవడం డ్వారా వాటిని పరిష్కరించుకోవచ్చును. సథలోని స్నేహాతులు, పెద్దలు, బంధువులు, అనుభవజ్ఞుల ద్వారా తన లోపాలను సవరించుకొని ఉత్తమ వక్తగా ఎదగవచ్బును. ఆత్మపిశ్వాసం పెంచుకోవాలి.
“నిజం చెప్పనా ? …. ఎలాగోలా జనం ముందు మాట్లాడడం అలవాటు చేసుకొన్నాను. ఎన్నోసార్లు జనం ముందు. ఇబ్రంది కలిగే పరిస్ఫితులు ఏర్పడ్డాయి. డాంతో పట్టుదల పెరిగింది. నా వాక్కుకు సానటట్టాను. అనుకొన్నది సాధించాను.” అని చర్చిల్ అన్నాడు. ఆయన ప్రపంచం చేత గొప్ప వక్తగా గుర్తించణడ్డాడు.
అబ్రహాం లింకన్, రూజ్షెల్ట్, చర్చిల్ మొదలైనపారు ఎంతో. కృషి చేసి ఎన్నో అడ్డంకులను ఎదుర్కాంటూ మహా వక్తలుగా తమను తామే తీర్చిదిద్దుకొస్నారు. ఆందుచేత సాధన చేయడం చ్వారా మంచి వక్తగా తయారుకావచ్చు.
ప్రశ్న 2.
ఊత పదాలు కేవలం వ్యర్థ పదలేనా? వాటి వల్ల వచ్చే లాభనష్టాలను చర్చించండి
జవాబు:
ఊతపదాలు అనవసరంగా సందర్భ శుద్ధి లేకుండా ఏ్రయోగిస్తే అవి వ్రర్ధపడాలే. అవి తేలికైన పడాలైతే అవి నష్టాన్నే తెస్తాయి. కొంతమంది ‘లర్రమయంందా’ అంటారు. “నేను నిన్న మా ఈమ్ముడి పెన్ను తీసుకాని ఏ్రాసుకొన్నాను. అర్థహయంండా?” అంటే అంములో అర్థం కావలసినదేమీ లేదు కనుక ఆ పదం ఈ వధంగా అనవసరంగా ప్రయోగిస్తే ఆ ఉపన్యాసకుడు నవ్పులపాలు కాక తప్పదు. ఈ విధంగా ఊతపదాలు నష్టం కల్గిస్తాయు.
ఒక ప్రసిద్ధ ఉపన్యాసకుడికి “అప్పుడేమో” అనేది ఊతపదం. అది పదే పదే ప్రయోగించినా ఎవ్వరూ ఆటపట్టించరు. అదెలాగో చూడ్దాం. ఆయన విరాటపర్వం చెబుతున్నాడు. “కీచకుడు ద్రౌపదిని చూశాడు. అప్పుడేమో (్రౌపది కూడా ఆయనను చూసింది. ఆమె ఒక్కసారి ఫయపడిపోయింది. అప్పుడేమో చిగురుటాకులా వణకిపోయింది. వాడు అప్పుడేమో గర్జించాడు. డానితో ఆమెకు గుండె దడ దడ లాడింది. అప్పుడేమో ఆ సభ మొత్తం స్తంభించిపోయింది…” ఇలా సాగుతుంది.
ప్రముఖమైన వక్తలు “ధర్మసూక్ష్యం”, “ఇదౌక పెద్ద రహస్యం”, “ఎలా పట్టుకోపాలంటే”, “ఒక ఉదాహరణ చెబుతాను” ఇలాంటి ఊతపదాలు ప్రయోగిస్తారు. సాధారణ (పేక్షకుల స్థాయిని మించి ఉపస్యాసం సాగుతుంటే ఊతపదాలు దారకవు సరికదా ! ఆపన్యాసానికి అందం తెస్తాయి. ఉ ఉస్యాసకుని గౌరహాన్ని పెంచుతాయి. అందుచేత ఉతపడాలు కవవం వ్యర్థ పడాలు కాదు. పాఠకులలో ఆసక్తిని పెంచుతాయి.
ఆ) కింది ఉపన్యాసాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
ప్రఖ్యాత శాస్తవేత్త ఐన్ స్టిన్ తన పరిశోధనను గురించి వివరించేందుకు ఒక నగరానికి ప్రయాణమయ్యాడు. ఆ రోజున ఆయనకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో నీరసంగా ఉన్నాడు. ఈ విషయాన్ని గ్రహించిన డైవర్ చాలా శశర్ధాభక్తులతో “అయ్లా! ఇవాళ సభను రద్దు చేయవచ్చు కదా!” అని అడిగాడు.
అందుకు ఐన్ స్టిన్ “ఎప్పుడో ఒప్పుకున్న కార్యక్రమం ఇది. ఎక్కువమంది ఎదురు చూస్తుంటారు. వాళ్ళను నిరాశపరచడానికి మనసొప్పడం లేదు” అని జవాబిచ్చారు. అయినప్పటికీ వాహనచోదకునికి మనసొప్పలేదు. ఒక ఉపాయాన్ని చెప్పాడు. “అయా్యా! ఒక విషయం చెప్పాలని ఉంది, కోపగించుకోరు కదా! చాలా సంవత్సరాలుగా మీతోపాటువస్తూ, మీ ఉపన్యాసాల నెన్నింటినో విన్నాను. మనం వెళ్తున్నది కొత్త ఊరు. అక్కడున్నవాళ్ళకు మీరెలా వుంటారనే విషయం తెలియదు కదా! మీరు విశశాంతి తీసుకోండి. మీకు బదులుగా నేను, మీవలెనే నటిస్తూ ఉపన్యసిస్తాను. ఏమంటారయ్యా?”
ఐన్స్టీన్కు ఈ ఉపాయం నచ్చింది. ఆయన వాహనచోదకుని టోపీని తలకు పెట్టుకుని โపేక్షకుల మధ్ల విశాంతిగా కూర్చోగా, వాహనచోదకుడు అత్యంత ఆత్మవిశ్వాసంతో ఉపన్యసించాడు. అతని ఉపన్యాసాన్ని వింటున్న ఐన్స్టీన్ అబ్బురపడ్డాడు. సభకు వచ్చిన వారెవ్వరికీ సందేహం తలెత్తలేదు. అయినప్పటికీ, అకస్మాత్తుగా, ఎదురుచూడని విధంగా ఒక ఆచార్యుని రూపంలో సమస్య ఎదురైంది. ఆ ఆచార్యుడు ఒక క్లిష్టమైన వైజ్ఞానిక విషయాన్ని గురించిన సందేహాన్ని, సుదీర్ఘమైన ప్రశ్నరూపంలో అడిగి, అందుకు తగిన వివరణ ఇవ్వమంటూ అభ్యర్థించాడు.
కాసేపు స్తబ్దంగా ఉండిపోయిన వాహనచోదకుడు, కాస్తంత సర్దుకొని “ఇదేమంత పెద్ద విషయం కాదు ఆచార్యా. ఇందుకు సంబంధించిన వివరణను చివరి వరుసలో కూర్చున్న మా వాహనచోదకుడు కూడ చెప్పగలడు”అని అన్నాడు. తన వాహనచోదకుని యొక్క సమయస్ఫూర్తి సామర్థ్లాన్ని చూసి అచ్చెరువొందిన ఐన్స్టీన్, మెల్లగా వేదికపైకి చేరుకుని ఆ ప్రశ్నకు తగిన వివరణను ఇచ్చాడు. – మాసపత్రిక సౌజన్యంతో
ప్రశ్నలు – జవాబులు :
ప్రశ్న1.
ఐన్స్టీన్ ఉపన్యాసం రద్దు చేయకపోవడానికి కారణం ఏమిటి ?
జవాబు:
ఎదురుచూస్తున్న జనాన్ని నిరాశపరచడం ఇష్టం లేక, ఎప్పుడో ఒప్పుకొన్నది కనుక ఆ ఉపన్యాసం రద్దు చేయలేదు.
ప్రశ్న 2.
సమయస్ఫూర్తి అంటే ఏమిటి ?
జవాబు:
సమయస్ఫూర్తి అంటే సమయానికి తగినట్లుగా చాకచక్యంగా వ్యవహరించి సమస్య నుండి బయటపడడం.
ప్రశ్న 3.
ఐన్స్టీన్ ఎందుకు ఆశ్చర్యపడ్డాడు ?
జవాబు:
ఆచార్యుడు అడిగిన ప్రశ్నకు జవాబు తెలియకపోయినా తన డ్రైవరు కంగారు పడకుండా తనను డ్రైవరుగా పరిచయం చేసి సమాధానం చెప్పించినందుకు ఐన్స్టీన్ ఆశ్చర్యపడ్డాడు. డ్రైవర్ తెలివి, సమయస్ఫూర్తి ఐన్స్టీన్ న్ను అబ్బుర పరిచింది.
ప్రశ్న 4.
ఉపన్యాసకుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి ?
జవాబు:
ఉపన్యాసకునికి సమయస్ఫూర్తి, చమత్కారం, సామర్థ్యం, ధారాళమైన వాక్కు, ఆత్మవిశ్వాసం ఉండాలి.
ఇ) కింది గద్యం చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
మీలో ప్రతివాడున్నుమహొన్నతిని పొంది తీరవలెను. విధేయత, సంసిద్ధత, కార్యదీక్ష – అను ఈ మూడును మీరు కలిగియున్నచో ఇక మీ యభివృద్ధికి ప్రపంచమున ఎవరును అడ్డుపడజాలరు. ఆవేశముచే, తొందరపాటుచే ఏ కార్యమున్ను సాధింపబడదు. పవిత్రత, సహనము, పట్టుదల అను ఈ మూడును కార్యసిద్ధికి, విజయమునకు అత్యావశ్యకములు. అయితే (ప్రేమ వానియన్నింటికంటెను ముఖ్యమైనది.
అనంతకాలము మీదే, ఇక లేనిపోని తొందర యేల? బలహీనతయే సమస్త ఆపదలకును ఏకైక కారణము. బలహీనులము గనుకనే అసత్యమాడుట, దొంగిలించుట, ఇతరాపరాధములు చేయుుట సంభవించుచున్నది. మనకు బలహీనతను కల్పించునదేదియు లేనిచో, ఇక మనకు మరణము లేదు, దుఃఖము లేదు.
సత్యము, పవిత్రత, నిస్స్వార్థత – అను ఈ సుగుణములు కలవానిని అణగద్రొక్కగల సామర్థ్యము ముల్లోకములందెవనికిని లేదు. జగత్తంతయు ఎదురు తిరిగి నిలిచినను ఈ సుగుణములు కలవాడు ఒంటరిగా వారినందరిని ఎదిర్చి నిలువగలుగును. లెమ్ము! ధైర్యవంతుడవై, బలవంతుడవై నిలువుము! బాధ్యతనంతను నీ మీదనే పెట్టుకొనుము. మరియు నీ విధికి నీవే కారణభూతుడవని యెరుగుము.
నీకు కావలసిన బలమంతయు, సహాయమంతయు నీయందే కలదు. కాబట్టి నీ భవిష్యత్తును నీవే నిర్మించుకొనుము. బలమే జీవనము. బలహీనతయే మరణము. బలహే సుఖము. బలహీనతయే దుఃఖము. అభివృద్ధికరములై లోకోపకారకములైనట్టి గొప్ప భావములనే బాల్య కాలము నుండియు మీ మనంబున ప్రవేశింపజేయండి. — వివేకానంద సింహనాదము
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
మనం అఖివృద్ధి చెండాలంటే ఏం కలిగి ఉండాలి ?
జవాబు:
మనం అభివృద్ధి చెందాలంటే విధేయత, సంసిద్ధత, కార్యదీక్ష కలిగి ఉండాలి.
ప్రశ్న 2.
కార్యసిద్ధికి అవసరమైనని ఏపి ?
జవాబు:
పవిత్రత, సహనము, పట్టుదల అనే మూడూ కార్యసిద్ధికి అవసరం.
ప్రశ్న 3.
బాల్లదదశ నుండి ఎటువంటి భావములను మనసులో ప్రవేశింప చేయాలి ?
జవాబు:
అభివృద్ధికరములై లోకోపకారములైనట్టి గొప్ప భావాలనే బాల్యదశ నుండి మనసులో ప్రవేళింప చేయాలి.
ప్రశ్న 4.
ఫై పేరా ఆథారంగా ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
ముల్లోకాలలో ఎవరైనా ఎవరినీ అణగద్రొక్కలేరు ?
ఈ) కింది వానికి సందర్భసహిత వాక్యాలు రాయండి.
ప్రశ్న 1.
నా వాక్కుతో నేను పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకోగలను
జవాబు:
పరిచయం : ఈ వాక్యం వాసిరెడ్డి సీతాదేవి రచించిన సాహిత్య, సామాజిక వ్యాససంపుటి నుండి గ్రహింపబడిన ‘ఉపన్యాస కళ’ అను పాఠంలోనిది.
సందర్భం : రచయిత్రి ఘాట యొక్క గొప్పదనాన్ని వివరిస్తున్న సందర్భంలో ఆక్స్ఫర్డ్ శబ్ద కోశకారుడు డేన్యల్ వెబ్స్టర్ పలికిన ఈ వాక్యాన్ని ప్రస్తావించారు.
భావం : తన మాటతో తాను పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకోగలనన తత్మవిశ్వాసంతో డేనియల్ జెబ్స్టర్ ఉన్నాడని భావము.
ప్రశ్న 2.
మాట్లాడగల శక్తి ప్రతి మానవుడికి ఉంది. ఆ వాక్కును నేను సాన పట్టాను.
జవాబు:
పరిచయం : ఈ వాక్యం వాసిరెడ్డి సీతాదేవి రచించిన సాహిత్య, సామాజిక వ్యాససంపుటి నుండి గ్రహింపబడిన ‘ఉపన్యాస కళ’ అను పాఠంలోనిది.
సందర్భం : వక్తల గురించి, వక్తృత్వం గురించి వివరిస్తూ రచయిత్రి వివరిస్తున్న సందర్భంలో చర్చిల్ అన్న మాటను ఉటంకించిన వాక్యమిది.
భావం : తన ఉపన్యాస కళను మెరుగుపరుచుకొనే క్రమంలో చర్చిల్ తన మాటకు పదును పెట్టుకొన్నాడని భావం.
ప్రశ్న 3.
తెలివైన వక్త శ్రోతల ఆసక్తి స్థాయి పడిపోక ముందే తన ఉపన్యాసం ముగిస్తాడు.
జవాబు:
పరిచయం : ఈ వాక్యం వాసిరెడ్డి సీతాదేవి రచించిన సాహిత్య, సామాజిక వ్యాససంపుటి నుండి గ్రహింపబడిన ‘ఉపన్యాస కళ’ అను పాఠంలోనిది.
సందర్భం : ఉపన్యాస ఉపసంహారం గురించి వివరిస్తున్న సందర్భంలో రచయిత్రి చెప్పిన వాక్యమిది.
భావం : ఉపన్యాసం ఇచ్చేటపుడు ప్రేక్షకుల ఆసక్తిని గమనించాలి. వారి ఆసక్తి తగ్గిపోకముందే ఉపన్యాసం ముగించాలని భావం.
ఈ) కింది వానికి సందర్భసహిత వాక్యాలు రాయండి.
ప్రశ్న 1.
వక్త వేదికపై ఎలా ప్రవర్తించాలి ?
జవాబు:
వక్త వేదికపై సభాకంపం లేకుండా హుండాగా ఏ్రవర్తించాలి.
ప్రశ్న 2.
తెలివైన వక్త తన ఉపన్యాసాన్ని ఎప్పుడు ముగిస్తాడు ?
జవాబు:
తెలివైన వక్త శోతల ఆసక్తి స్థాయి పడిపోకముందే తన ఉపన్యాసం ముగిస్తాడు.
ప్రశ్న 3.
ఉపన్యాసంలో ప్రేక్షకులను ఆకట్టుకునే చిట్కాఏది ?
జవాబు:
ఉపన్యాసంలో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగాను, గంఖీరంగాను, సభాకంపం లేకుండా ఉపన్యసించాలి.
వ్యక్తీకరణ -సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి
ప్రశ్న 1.
సభాకంపం అంటే ఏమిటి? దాన్ని ఎలా పోగొట్టుకోవాలి ?
జవాబు:
సభాకంపం అంటే సభలో మాట్లాడేటపుడు వచ్చే వణుకు. సభాకంపం పోవాలంటే ఉపన్యాసకుడు ఆత్మ విశ్వాసంతో ఉండాలి. ఆచితూచి మాట్లాడాలి. అనవసర విషయాలు ప్రస్తావించకూడదు. రచయిత ఎవరో తెలియని పద్యపాదాలను ప్రస్తావించకూడదు. ధైర్యంగా, ఆత్మ విశ్వాసంతో మాట్లాడితే సభాకంపం దానంతట అదే పోతుంది.
ప్రశ్న 2.
వక్త ఎప్పుడు అపహాస్యం పాలవుతాడు ?
జవాబు:
వేదిక మీద నుండి ఉపన్యాసకుడు ఎవర్నీ అతిగా పొగడకూడదు. అతిశయోక్తులు ప్రయోగించకూడదు. అది అపహాస్యానికి దారి తీస్తాయి. ఉపన్యాసకుడు తన గురించి తాను చెప్పుకొన్నా అపహాస్యానికి దారి తీస్తుంది. ఇతర వక్తల అభిప్రాయాలను ఖండించవలసి వస్తే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే అది కూడా అపహాస్యానికి గురి అవుతుంది. ఊత పదాలు ఎక్కువగా ప్రయోగించకూడదు. అలా ప్రయోగిస్తే కూడా ఉపన్యాసకుడు అపహాస్యం పాలవుతాడు.
ప్రశ్న 3.
ఉపన్యాసం ఎప్పుడు రసాభాస అవుతుంది ?
జవాబు:
తనకు ముందు మాట్లాడిన వారి ఉపన్యాసంలోని కొన్ని అభిప్రాయాలను ఖండించవలసి వచ్చినపుడు జాగ్రత్తగా ఖండించాలి. అది కూడా తప్పదనుకుంటేనే. అంతేకానీ ఆ వక్త మీద ఈ వక్తకు ఏదో అక్కసు ఉందనీ, ఇది ఇలా వెళ్ళగక్కుతున్నాడనీ శ్రోతలు భావించేలా చెయ్యకూడదు. ఎందుకంటే ముందు మాట్లాడిన వక్త అభిమానులు శ్రోతలలో ఉంటే వారు రెచ్చిపోతారు. దాని వలన ఆ సభ రసాభాస కావచ్చు.
ఆ) కింది ప్రశ్నలకు ఎనిమిది నుండి పది వాక్యాలలో జవాబులు రాయండి
ప్రశ్న 1.
ఉపన్యాసంలో భాష ఎలా ఉంటే బాగుంటుంది?
జవాబు:
ఉపన్యాసంలో భాష సరళంగా ఉండాలి. అందరికీ అర్థమయ్యేలా ఉండాలి. పాండిత్య ప్రకర్ష ప్రదర్శించకూడదు. పెద్ద పెద్ద పదాలు ప్రయోగించకూడదు. ఆధ్యాత్మిక ప్రసంగాలలో అటువంటివి చెల్లవచ్చు. కొన్ని సామాన్యమైన సభలలో అవి రుచించవు. బహిరంగ సభలలో జన సామాన్య వ్యావహారిక భాషనే వాడాలి.
శ్రోతలకు కావలసినది విషయం తప్ప భాష కాదు. కంగారులో ‘ప్రసంగించడం’ అనబోయి ‘ప్రసవించడం’ ‘పరిణామం’ అనబోయి ‘పరిమాణం’ అనకూడదు. భాష విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. జాతీయాలు, సామెతలు, లోకోక్తులు మొదలైనవి ప్రయోగిస్తే శ్రోతలు శ్రద్ధగా వింటారు. పలికే భాష స్పష్టంగా పలకాలి.
ప్రశ్న 2.
మంచి వక్తగా ఎదగాలంటే ఏం చేయాలో పాఠం ఆధారంగా రాయండి.
జవాబు:
మంచి వక్తగా ఎదగాలంటే సభాకంపం ఉండకూడదు. కృషి, సాధన, పట్టుదల ఉండాలి. అబ్రహాం లింకన్, రూజ్వెల్ట్, చర్చిల్ మొదలైన వారి గురించి అధ్యయనం చేయాలి. అటువంటి పెద్దల అనుభవాలను ఆకళింపు చేసుకోవాలి. వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి.ఇతర వక్తల్ని అనుకరించకూడదు. వేదిక మీద హుందాగా ప్రవర్తించాలి. సమయ, సందర్భాలకు తగిన దుస్తులు ధరించాలి. మైకు ముందు నించున్నపుడు కూడా హుందాగా ప్రవర్తించాలి.
శ్రోతల కలకలం తగ్గాక ఉపన్యాసం ప్రారంభించాలి. ఎవరినీ అతిగా పొగడకూడదు. అతిశయోక్తులు ప్రయోగించక పోవడం మంచిది. తనను తాను అనర్హుడనని కించపరుచుకోకూడదు. విషయ ప్రతిపాదన సూటిగా ఉండాలి. తనను తాను పొగుడుకోకూడదు. స్వవిషయాలు చెప్పుకోకపోవడం మంచిది.
తన ముందు మాట్లాడిన వక్తల అభిప్రాయాలను ఖండించకపోవడం మంచిది. ఖండించవలసి వస్తే చాలా జాగ్రత్తగా ఎవ్వరి మనసుకూ నొప్పి తగలకుండా సున్నితంగా చెప్పీ చెప్పనట్లు సూచనప్రాయంగా ఖండించాలి. శ్రోతల ఆసక్తి తగ్గిపోకముందే ఉపన్యాసం ముగించాలి. ఇంటికి వచ్చాక తన ఉపన్యాసం జరిగిన తీరును, ప్రేక్షకుల స్పందనను సమీక్షించుకోవాలి. లోపాలను సవరించుకోవాలి.
ప్రశ్న 3.
కొత్తగా ఉపన్యాసం చేసిన వ్యక్తి ఇంటికి వచ్చాక తనను తాను ప్రశ్నించుకోవాల్సిన అంశాలేమిటి?
జవాబు:
కొత్తగా ఉపన్యాసం చేసిన వ్యక్తి ఇంటికి వచ్చాక తనను తాను ప్రశ్నించుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి అవి :
- తను వేదిక మీద ఎలా ప్రవర్తించాడో ప్రశ్నించుకోవాలి.
- తను కూర్చొన్న తీరును గురించి ప్రశ్నించుకోవాలి.
- తన గొంతు మైకుకు సరిగా ఎడ్జెస్టు చేసుకొన్నాడో, లేదో ప్రశ్నించుకోవాలి.
- శ్రోతల మధ్య-వక్త మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పరచుకొన్నాడో, లేదో ఆలోచించుకోవాలి,
- ముగింపు సమయం గురించి కూడా ప్రశ్నించుకోవాలి.
- అనుకొన్న అంశాలన్నీ చెప్పగలిగాడో, లేదో ఆలోచించుకోవాలి.
- విషయాలు చెప్పడం ఎందుకు మరచిపోయాడో తర్కించుకోవాలి.
- తన ఉపన్యాసం సాగుతుంటే శ్రోతల ప్రవర్తన గురించి కూడా ప్రశ్నించుకోవాలి.
- ఉపన్యాసం పూర్తి కాగానే తను కూర్చొన్న తీరు గురించి కూడా ప్రశ్నించుకోవాలి.
- శ్రోతలు అసహనం వ్యక్తం చేశారో ? లేదో ? ఎందుకో ? ప్రశ్నించుకోవాలి.
- తను ఉపయోగించిన పదజాలం, భాష గురించి కూడా ఆలోచించుకోవాలి.
ఇ) కింది అంశాల గురించి సృజనాత్మకంగా/ ప్రశంసిస్తూ రాయండి
ప్రశ్న 1.
స్వాతంత్య్రదినోత్సవ సందర్భంగా మిమ్మల్ని ఉపన్యాసం ఇవ్వమని అడిగారు. ఆ ఉపన్యాస ప్రతిని ఎలా సిద్ధం చేస్తారో తెల్పండి.
జవాబు:
స్వాతంత్య్రదినోత్సవ ప్రసంగం – 2024
సభా సరస్వతికి నమస్కారం. అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. 1947లో బ్రిటిష్ వలస పాలన నుండి మనదేశం స్వాతంత్య్రం పొందింది. దీని గుర్తుగా ప్రతి సంవత్సరం ఆగస్టు 15న భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రతీ భారతీయుడు ఆనందంగా జరుపుకునే జాతీయ పండుగ ఇది. ఎందరో మహనీయులు స్వాతంత్య్ర పోరాటంలో తమ జీవితాలను తృణప్రాయంగా విడిచిపెట్టారు. మహాత్మాగాంధీజీ శాంతి, అహింసల ద్వారా మాత్రమే స్వాతంత్య్రం తెచ్చుకోగలమని చెప్పి దేశ ప్రజలందరినీ ఉత్తేజపరచారు. అనేక ప్రాంతాలలో అనేకమంది నాయకులు తయారయ్యారు.
శాంతి, అహింస అనే ఆయుధాలతో దేశ ప్రజల ఆగ్రహం బ్రిటిష్ ప్రభుత్వంపై పెల్లుబికింది. ఎందరో నాయకులు, సామాన్య ప్రజలు స్వాతంత్ర్యం కోసం అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు. లాఠీ దెబ్బలు తిన్నారు. జైళ్ళల్లో మగ్గారు. ప్రాణాలను కూడా విడిచారు. అల్లూరి సీతారామరాజు, భగత్సింగ్, మంగళ్ పాండే మొదలైన వారు సాయుధ పోరాటం చేసి బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్ళు పరిగెత్తించారు.
ఈ విధంగా ఎంతోమంది త్యాగధనుల ఉద్యమ ఫలితంగా మనకు స్వాతంత్య్రం వచ్చింది. మనమీవేళ ఇంత స్వేచ్ఛగా ఇక్కడ సభ జరుపుకుంటున్నామంటే వారి పుణ్యమే. మన జెండా నీడలో, దేశ సార్వభౌమాధికారంలో, మన రాజ్యాంగ రక్షణలో మనం స్వేచ్ఛగా జీవిస్తున్నందుకు స్వాతంత్య్ర సమరయోధులందరికీ, నివాళులర్పించి ఈ స్వాతంత్య్ర వేడుకలను ఆనందంగా, ఉత్సాహంగా, మనంగా జరుపుకుందాం. మరొక్కమారు అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో భారత్ మాతాకి జై !
జైహింద్.
ప్రశ్న 2.
మీ పాఠశాల విద్యార్థికి వక్తృ్వ పోటీలో జిల్లాస్థాయి బహుమతి వచ్చింది. అతనిని అభినందిస్తూ అభినందన పత్రం రాయండి.
జవాబు:
అభినందన పత్రం
వక్తృత్వ పోటీలలో జిల్లాస్థాయి బహుమతి గెలుచుకొన్న శారదా!! నీకు అభినందనలు.
నీ గొంతు కోకిల గొంతు. నీకు వచ్చిన బహుమతికి నీ గొంతు ప్రధానపాత్ర పోషించింది.
నీ తెలివి అత్యద్భుతం. మంచి మంచి జాతీయాలు, సామెతలు ప్రయోగించావు.
నువ్వు నిల్చున్న తీరు, నీవు ధరించిన దుస్తులు, నీ ముఖ కవళికలు అన్నీ. న్యాయమూర్తులకు నచ్చాయి. నువ్వు మన పాఠశాలకు మంచి పేరు తెచ్చావు. నీతో మేం చదువుకొంటున్నందుకు గర్వంగా ఉంది. నిన్ను మరొక్కసారి అఫినందిస్తున్నాం. ఇది నీ విజయానికి గుర్తుగా మన విద్యార్థులందరూ కలసి ఇస్తున్న అఫినందన పత్రం.
ఇట్లు,
10వ తరగతి విద్యార్థులు.
భాషాంశాలు
పదజాలం
అ) కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి వాటితో వాక్యాలు రాయండి.
జవాబు:
1. కఠిన పదాలకు శబ్దకోశంలో అర్థాలు ఉంటాయి.
శబ్దకోశం = నిఘంటువు
సొంతవాక్యం : సూర్యరాయంధ్ర నిఘంటువు చాలా పెద్దది.
2. ఎవ్వరినీ అపహోస్యం చేయకూడదు.
అపహాస్యం = వేళాకోళం
సొంతవాక్యం : పెద్దలను వేళాకోళం చేయకూడదు.
3. తెలివికి సానపట్టు సాధనాలు పుత్తకాలు.
సానపట్టు = పదునుపెట్టు
సొంతవాక్యం : చిక్కు సమస్యలను చక్కకి పద్యాలతో పరిష్కరిస్తూ అవధాని మెదడుకు పడునుపెడుతున్నారు.
4. సభలో ఆశీనులగువారు సభామర్యాద పాటించాలి.
ఆశీనులగ = కూర్చిన్నవారు
సొంతపాక్యం : కూర్చొన్నుారు లేచి బస్సులో వృద్ధులకు సీటివ్వాలి.
ఆ) కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు పర్యాయపదాలు రాయండి
జవాబు:
1. మనీష ఉన్నవాడిని మనీషి అంటారు.
మనీషి = విద్వాంసుడు, పండితుడు, ప్రాజ్ఞుడు, బుద్ధిమంతుడు
2. శత్రువుల కుత్తుకలను ఖండించారు.
కుత్తుక = గొంతు, కంఠం, అఱ్ఱు, కంధరము, గళము, గ్రీవం
3. వక్త మాట్లాడుతున్నప్పుడు శ్రోతలు చప్పట్లు కొడతారు.
పక్త = ఉపన్యాసకుడు, ప్రవక్త, మాటగాడు, వదుడు, వాదకుడు
4. పెద్దలు వేదికపై ఆశీనులైనారు.
వేదిక = అరుగు, జగతి, స్కందము, వేది, తిన్నె
ఇ) పాఠం ఆధారంగా కింది జాతీయాలు ఏ సందర్భాల్లో వాడతారో వివరించండి.
జవాబు:
1. సాసబట్కు : చాలా అభ్యాసం చేసి తెలివిని గాని, ఏదైనా ఒక కళను గాని అభివృద్ధి చేసుకొన్న సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.
2. ఏ పుట్టలో ఏముండో : ఎవరి మనసులో ఏ ఆలోచన ఉందో తెలుసుకోలేమన్న సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.
3. సేల చూపులు చూడటం : తప్పు చేసి దొరికిపోయిన వారి గురించి వివరించే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.
వ్యాకరణాంశాలు
అ) కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.
జవాబు:
1. ఏడేళ్ళు : ఏడు+ ఏళ్ళు = ఉత్వసంధి
2. మహోత్కృష్ట : మహా + ఉత్కృష్ట = గుణసంధి
3. ఎవరన్నారు : ఎవరు + అన్నారు ఉత్వసంధి
4. పొందాలనుకుంటారు : పొందాలని + అనుకుంటారు = ఇత్వ సంధి
5. కదిలినప్పుడు : కదిలిన + అప్పుడు = అత్వసంధి
ఆ) కింది పదాలను కలిపి సంధి పేరు రాయండి.
జవాబు:
1. ఉన్న + ఉన్నత : ఉన్నతోన్నత = గుణిసంధి
2. అతి + అంత : అత్యంత = యణాదేశసంధి
3. ఉత్తమము + ఐనది : ఉత్తమమైనది = ఉత్వసంధి
4. స్వ + ఉత్కర్ష : స్వోత్కర్ష = గుణసంధి
ప్రాతాదిసంధి :
కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలను పరిశీలించండి.
ప్రక్కన ఉన్న ఉదాహరణలలో మొదటి పదంలో మొదటి అచ్చు మీద ఉన్నటువంటి అక్షరాలన్నీ లోపించాయి. మిగిలిన ఆ మొదటి అక్షరం తరువాత పదంతో కలవడం గమనించారు కదూ! దీనికి సూత్రాన్ని చూద్దాం.
సూత్రం: సమాసంబునం బ్లాతాఁదుల శాలియచ్చుమీందివర్ణంబుల కెల్లలోపంబు బహుళంబుగా నగు.
ప్రాతాడులు: ప్రాత, లేత, క్రొత్త, క్రిందు, పువ్వు, మీడు, కెంపు, చెన్ను మొదలగునవి. ఈ సూత్రంవల్ల లోపించిన పదాలకు ‘నుగాగమ’, ‘సరళాదేశ’ మొదలగు ప్రుర్రియలు జరగడం ద్వారా తుదిరూపాలు వస్తాయి.
ఇ) కింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాయండి.
జవాబు:
1. శబ్దశక్తి : శబ్దము యొక్క శక్తి
2. కార్యక్షేత్రం : కార్యమనెడి క్షేత్రం
3. సమయసందర్భాలు : సమయమును, సందర్భమును
4. వింతచప్పుడు : వింతయైన చప్పుడు
5. సభాకంపం : సభయందు కంపము
ఈ) కింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి, సమాసం పేరు రాయండి
జవాబు:
1. గులాబీపువ్వు : గులాబీ అను పేరుగల పువ్వు (సంభావనా పూర్వపద కర్మధారయం)
2. పజాహితం : ప్రజల యొక్క హితం (షష్తీతత్పురుష సమాసం)
3. ప్రసన్నవదనం : ప్రసన్నమైన వదనం (విశేషణ పూర్వపద కర్మధారయము)
4. కవితాచరణం : కవితకు చరణం (షష్ఠీ తత్పురుష సమాసం)
5. రెండు నిమిషాలు : రెండైన నిమిషాలు (ద్విగు సమాసం)
ఉ) కింది వాక్యాలు ఏ రకమైన వాక్యాలో గుర్తించి రాయండి
ప్రశ్న1.
నేను వేదిక మీద ఎలా ప్రవర్తించాను ?
జవాబు:
ప్రశ్నార్థక వాక్యం
ప్రశ్న 2.
అలవాటును అదుపులో పెట్టుకోవాలి.
జవాబు:
విధ్యర్థక వాక్యం
ప్రశ్న3.
ముందు మాట్లాడిన వక్త అథిమానులు శ్రోతల్లో ఉండవచ్చునేమో.
జవాబు:
సందేహార్థక వాక్యం
ప్రశ్న 4.
అది ప్రయత్నిస్తే వచ్చేది కాదా ?
జవాబు:
ప్రశ్నార్థక వాక్యం
ఊ) ఈ పాఠంలో ప్రశ్నార్థక వాక్యాలను గుర్తించి రాయండి
1. వక్తృత్వ ప్రావీణ్యత ఒక వరమా ?
2. ఏ పట్టలో ఏముందో?
3. ఏ బుర్రలో ఏ ఏ్రతిధ మరుగున పడి ఉందో ?
4. సళలో మాట్లాడడానికి భయపడే వాళ్ళు పిరికివాళ్ళా?
ప్రాజెక్టుపని
తమ ఉపన్యాసాలతో జాతి ప్రజలను ఉత్తేజితం చేసిన ప్రముఖ వ్యక్తుల వివరాలు సేకరించండి.
ఉదా:
1. స్వామి వివేకానంద
2. అబ్దుల్ కలాం
3. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
4. సరోజినీ నాయుడు మొదలగు వారు.
1) స్వామి వివేకానంద :
అసలు పేరు : నరేంద్రనాథ్ దత్తా
జననం : 1863 జనవరి 12న కలకత్తాలో
తల్లిదండులు : భువనేశ్వరీ దేవి, విశ్వనాథ్ దత్తా
గురువు : రామకృష్ణ పరమహంస
వ్యవస్థాపన రామకృష్ణ మిషన్ (1897), రామకృష్ణ మఠం
సాహాత్య రచనలు : రాజ, కర్మ, ఈక్తి, జ్ఞాన యోగాలు, నా యజమాని, అనేక ఉపన్యాసాలు.
శిష్యులు : అశోకానంద, విరజానంద, పరమానంద, అలసింగ పెరుమాళ్, అభయానంద, సోదరి నివేదిత, స్వామి సదానంద
కొటేషన్స : లేవండి, మేల్కొలపండి, లక్ష్యాన్ని చేరుకొనే వరకు ఆగండి.
మరణం : 4.07.1902.
2) అబ్దుల్ కలాం :
జననం : 15.10.1931 రామేశ్వరం, మద్రాసు [పెసిడన్సీ, ప్రిటిష్ ఇండియా చనురు సెయింట్ జోసఫ్ కాలేజ్, తిరుచిరాపల్లి, MIT – మర్రాసు
తల్లిదండులు : ఆశియమ్మ, జైనులబ్దీన్ మరకయాక్
పని : 1970 – 1990 మధ్య కలాం పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) మరియు SLV-II ప్రాజెక్టులను అభివృద్ధి చేశారు. జూలై 1992 నుండి డిసెంబరు 1999 వరకు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గననజేషన్ యొక్క ప్రధానమంత్రి మరియు సెక్రటరీకి ప్రధాన సలహాడారుగా పనిచేశారు. 1998లో, కార్డియాలజిస్ట్ సోమరాజుతో కలిసి, కలాం తక్కువ ఖర్చుతో కూడిన కరోనరీ స్టెంట్ను అభివృద్ధి చేశారు.
రచనలు : ఇండియా 2020, మై స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్.
గౌరహాలు 40 విశ్వవిద్యాలయాల నుండి 7 గౌరవ డాక్టరేట్లందుకొన్నారు. పద్మభూషణ్, పద్మ విభూషణ్, భారతరత్న ఇంకా అనేక అవార్డులందుకొన్నారు. భారత రాష్ఝపరతిగా 2002 నుండి 2007 వరకు పనిచేశారు. షిల్లాంగ్లో 27.07:2015న తన 83వ ఏట స్వర్రస్తులయ్యారు.
3. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
దుగిరాల గోపాలకృష్ణయ్య :
జననం : 2.6.1889న కృష్ణాజిల్లాలోని పెనుగంచిప్రోలు
బిరుదు – ఆంధ్రరత్న
చడు : M.A. ఎడిన్ బర్గ్ విశ్వవిద్యాలయం
ప్రత్యేకతలు : కవి, వక్త, గేయ రచయిత, తత్తవేత్త, గాయకుడు
తల్లిదండ్రులు : సీతమ్మ, కోదండరామస్వామి
ఉద్యమాలు : హోూ్రూల్, సహాయ నిరాకరణ మొ॥వి, చీరాల పేరాల ఉద్యమం.
10.6.1928న తన 39వ ఏట స్వర్ఠస్తులయ్యారు:
4. సరోజినీ నాయుడు మొదలగు వారు.
జనసం : 13.2.1879న హైదరాబాద్లో జన్మించారు.
తల్లిదండ్రులు : వరదసుందరి, అఘోరనాథ ఛటోపాధ్యాయ
జీవిత భాగస్వామి : గోవిందరాజులు నాయుడు
పిల్లలు : ఐదుగురు
వృత్తి : రాజకీయ కార్యకర్త, కవయిత్రి
బిరుదులు : నైటింగేల్ ఆఫ్ ఇండియా (భారత కోకిల), బుల్బుల్-ఎ-హింద్
రచనలు : గీతాలు, గోల్డెన్ థ్రెషోల్డ్, ఇన్ ది బజార్స్ ఆఫ్ హైదరాబాద్
ఉద్యోగం 1947లో యునైటెడ్ ప్రావిన్సెస్కు గవర్నర్ అయ్యారు. 2.3.1949న తన 70ఎ ఏట స్వర్గస్తులయ్యారు.
పాఠాంత పద్యం
మ. నిరయంబైన, నిబంధమైన, ధరణీ నిర్మూలనంబైన, దు
ర్మరణం బైనc, గులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో
హరుఁ డైనన్, హరి ఋైన, నీరజభవుం డభ్యాగతుం డైన నౌఁ
దిరుగన్ నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్య! వే ఱేటికిన?? – బమ్మెర హోతన
భావం: (గురువైన శుక్రాచార్యా!) బుద్ధిమంతుడా! నరకం వస్తే రానీ, ఎవరైనా చెరసాలలో బంధిస్తే బంధించనీ, రాజ్యం పోతే పోనీ, భయంకరమైన చావు వస్తే రానీ, వంశం అంతరించి హోతే పోనీ, నిజం! ఇందులో ఏది వచ్చినా జరిగినా సరే! అడగడానికి వచ్చినవాడు సాక్షాత్తు ఆ శివుడుౖనా, విష్ణువైన, బ్రహ్మదేవుడైన సరే నేను ఇచ్చిన మాట తప్పను.
సూక్తి : “గొప్ప పనులు చేయటానికి మొదట ఆత్మవిశ్వాసం అవసరం”. – ఐ. జాన్సన్
అదనపు భాషాంశాలు
పర్యాయపదాలు
శక్తి : బలము, చేవ, ప్రాణము, శౌర్యము
పాక్కు : భాష, భాషితము, బాస, వాణి
సృష్టి అభిసర్రము, కల్పనము, సర్గము, సృజన వక్త ప్రవక్త, ప్రాణసముడు, వడుడు, వాగ్ని, మాటకాడు
అపహాస్యము : పరిహాసము, అపహాసము, ఎగతాళి, గేలి
వక్తృత్వము : ప్రాగల్మ్యము, ప్రియప్రాయము
శబ్డకోశము : నిఘంటువు, అభిదానము, కోశము, పదనిధి
ఏ్రసంగము : ఉపస్యాసము, దోస్యము, మండి, ముచ్చటింపు, సుద్ది
నైపుణ్యము : నేర్పు, కౌశల్యము, చాతుర్యము, ప్రావీణ్యము
నానార్థాలు
శక్తి – బలము, సత్తువ, తోమరము, పార్వతి
వక్త – మాటకాడు, ఉపన్యాసకుడు
ప్రసంగము – ఆసక్తి, ప్రాప్తి, వ్యాప్తి, ఉపన్యాసము
ప్రకృతి – వికృతులు
ప్రకృతి – వికృతి
శక్తి. – సత్తి
శబ్దము – సద్దు
విషయం – విసయం
గౌరవము – గారవము
నిర్మలము – నిచ్చము
భాష – బాస
వాక్ – వాయి
స్థానము – తానము
దృష్టి – దిష్టి
గర్భము – కడుపు
నిలయము – నెలవు
న్యాయము – నాయము
సంధులు
1. సవర్జదీర్ఘ సంథి :
రసాభాస – రస + ఆభాస
చింతాక్రాంతం – చింత + ఆక్రాంతం
మేౖకాసురులు – మైక + అసురులు
కవితాచరణం – కవిత + ఆచరణం
సూక్తులు – సు + ఉక్తులు
ముఖ్యాంశాలు – ముఖ్య + అంశాలు
భాషాంశాలు – భాష + అంశాలు
దేవాలయము – దేవ + ఆలయము
2. గుణసంధి :
అతిశయోక్తులు – అతిశయ + ఉక్తులు
స్వోత్కర్ష – స్వ + ఉత్కర్ష
ఉన్నతోన్నత – ఉన్నత + ఉన్నత
మహోత్కృష్ట – మహా + ఉత్కృష్ట
సమాసాలు
1. విశేషణ పూర్వపద కర్థధారయము :
మహోత్కృష్ట – గొప్పదైన ఉత్కషష్ట
మహోవక్తలు – గొప్పవారైన వక్తలు
ఉన్నతోన్నత – ఉన్నతమైన ఉన్నతము
అతిశయోక్తులు – అతిశయమైన ఉక్తులు
సూక్తులు – మంచివైన ఉక్తులు
ముఖ్యాంశాలు – ముఖ్యమైన అంశాలు
2. షష్టి తత్పురుష సమాసం :
స్వోత్కర్ష – తన యొక్క ఉత్కర్ష
శబ్ద శక్తి – శబ్దుము యొక్క శక్తి
3. ద్విగు సమాసం :
మూడు క్షణాలు – మూడైన క్షణాలు
రెండు ప్రయత్నాలు – రెండైన ప్రయత్నాలు
రెండు నిముషాలు – రెండైన నిముషాలు
4. సంభావసా పూర్వపడ కర్మధారయము :
వ్యావహారిక భాష – వ్యావహారికమను పేరు గల భాష
రచయిత్రి పరిచయం
పేరు : వాసిరెడ్డి సీతాదేవి
జననం : 15-12-1933న గుంటూరు జిల్లా చేట్రోలులో జన్మించారు.
తల్లిడండ్రులు : రంగనాయకమ్మ, రాఘవయ్య
చడుపు : 5వ తరగతి, హిందీ ఎమ్.ఎ.
రచనలు : 39 నవలలు, 100 కి పైగా కథలు.
ఉద్యోగం : జవహర్ బాల భవన్ డైరెక్టరుగా పనిచేశారు.
ప్రత్యేకతలు : ఈమె నవలలు దూరదర్శన్లో సీరియల్స్గా, సినిమాలుగా వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం 5 సార్లు అందుకొన్నారు. ఈమెను ఆండ్ర పెర్ల్బక్ అని పలలుస్తారు. ఆమె 13.04.2007న పరమపదించారు. ప్రస్తుత పాఠ్యాంశం సీతాదేవిగారి సాహిత్య, సామాజిక వ్యాస సంపుటి నుండి గ్రహించబడింది.
పెర్ల్బక్ : “సాయి ఝంఝ” అనే చైనా నామంతో పరిచితురాలు. ఈమె అమెరికన్ రచయిత్రి, నవలా రచయిత్రి. ఈమెకు 1938వ సంవత్సరంలో సాహిత్యంలో నోబెల్ బహుమతి వచ్చింది.
ప్రక్రియ-వ్యాసం
ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని పూర్వాపరాలను చర్చిస్తూ, విశ్లేషణాత్మకంగా విస్తరించి రాయడమే వ్యాసం. దీనిలో ఉపోద్ఘాతం, విషయ విస్తరణ, ముగింపు వంటివి ప్రధానాంగాలుగా ఉంటాయి. వ్యాసంలోని విషయాన్ని బట్టి చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, శాస్త్ర, వైజ్ఞానిక, సాహిత్య, తాత్విక, ఆధ్యాత్మిక మొదలైన విభాగాలుగా విభజించవచ్చు.
ఉద్దేశం
విద్యార్థి వ్యక్తిత్వనిర్మాణంలో మాట చాలా ముఖ్యమైనది. ఉపన్యాసం అందులో ఒక భాగం. సభాకంపం నుండి బయటపడి మాటతీరు మెరుగుపరచుకోవటం అవసరం. విద్యార్థులలో సంభాషణననెపుణ్యం పెంచడం ద్వారా నలుగురిలో చక్కగా మాట్లాడేలా చేయడం ఈ పాఠం ఉద్దేశం.
కఠనపదాలకు అర్థాలు
శక్తి = బలం
సర్వస్వం = అన్నీ
విచారించడం = బాధపడడం
వాక్కు = మాట
శబ్దం = పదం
మహత్తరం = గొప్పదనం
ప్రాణ = జీవి
మహోత్మృష్టం = చాలా ఉన్నతం
స్థానం = చోటు
ప్రసాదించడం = ఇవ్వడం
సూతం = దారం, తాడు
వక్త = ఉపన్యాసకుడు ఇవ్వడం
వక్తృత్వం = ఉపన్యాసం ఇవ్వడం
ప్రావీణ్యత = నైపుణ్యం
కృషి = ప్రయత్నం
సాధన = అభ్యాసం
అమోఘం = చాలా బాగుంది
ప్రశంస = పొగడ్త
అడ్డంకి = ఆటంకం
వేదిక = వేది
అపహాస్యం = వేళాకోళం
పొరపాటు = తప్పు
నిజం = సత్యం
ఇబ్బంది = ఇకాటం
శమించడం = కష్టపడడం
సానబట్టు = పదును పట్టు
గుర్తింపు = ఖ్యాతి
మననం = స్మరణం
ప్రతిభ = నైపుణ్యం
హితము = మేలు
క్షేతం = భూమి
విలక్షణం = వైవిధ్యం
వాగ్వధధానం = మాట్లాడే పద్ధతి
అబ్బు = అలవడు
ఉన్నత శిఖరం = గొప్ప స్థితి
ఉబలాటం = ఉత్సాహం
ప్రయోజనం = ఉపయోగం
గొంతెత్తడం = మాట్లాడే ప్రయత్నం
అనుకరణ = అనుసరణ
ప్రేక్షకులు = చూసేవారు
కలకలం = గందరగోళం
అచ్చం = మూస
ఝమ =భాంతి
సుగంధం = సువాసన
సభాకంపం = సభలో మాట్లాడేటప్పుడు వచ్చే ఒణుకు
విజయం = గెలుపు
రీతి =పద్ధతి
విస్మరించడం =మరచిపోవడం
హుందా =గౌరవమైన గంభీరత
ఎష్బెట్టు =ఇబ్బంది
చులకన =లోకువ
తికమక =తొటుపులు
పాలు =వశం
ఆశీనులు =కూర్చొన్నవారు
అనుకూలం = తగినట్లు
ఆసక్తి = ఇష్టం
భంగం = ఆటంకం
అంశం = విషయం
ప్రారంథం = మొదలు
ప్రతిపాదన = తెలుపుట
మానం = మాట్లాడకపోవడం
దృష్టి = చూపు
ప్రసన్నం = ప్రశాంతం
వదనం = పుఖం
సంబోధన = పిలుపు
చిట్కా = చిన్న విషయం
పొగడడం = స్తుతించం
అతిశయోక్తి = బాగా ఎక్కువ చేసి చెప్పడం
అర్హత = యోగ్యత
హంసపాదు = ప్రాతలో తప్పు ఉన్నచోట ఉంచే
హంసపాదం ఆకారంలో ఉండే గుర్తు
స్వరం = గొంతు ధ్వని
ఆరోహణ = క్రింది నుండి పైకి
అవరోహణ = ఎక్కువ నుండి తక్కువ
వీనులు = చెవులు
ఇంపు = ఇష్టం
స్థాయి = స్థితి
క్లిష్టం = చిక్కు
కుతూహలం = ఉత్కంఠ
రసాభాస = నవ్వులపాలు
చరణం = పద్యపాదం
ఉత్కర్ష = పొగడ్త
అతి = ఎక్కువ
ఖండించడం = కాదనడం
వెళ్లగక్కు = వెలిబుచ్చు
మొరటు = కఠినం
చింతా(క్రాంతం = బాధతో నిండడం
ఏకా(గ్త = బుద్ధి కుశలత
అదుపు = కట్టడి
ప్రక్ష = ఉన్నతం
సరళం = తేలిక
వ్యావహారిక భాష = జనం మాట్లాడుకొనే భాష
రాణించడం = ప్రకాశించడం
ప్రవర్తన = నడత