AP 10th Class Telugu 4th Lesson Important Questions ఉపన్యాస కళ

These AP 10th Class Telugu Important Questions 4th Lesson ఉపన్యాస కళ will help students prepare well for the exams.

ఉపన్యాస కళ AP Board 10th Class Telugu 4th Lesson Important Questions and Answers

అవగాహన – ప్రతిస్పందన

1. ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

“మాట్లాడే శక్తిని మాత్రం వదిలేసి, నా సర్వస్వం దోచుకున్నా నేను విచారించను. నా వాక్కుతో నేను పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకోగలను” ఆక్స్ఫర్డ్ శబ్దకోశకారుడు ‘డేనియల్ వెబర్’ అన్నాడు.
“నువ్వు నాకో బలమైన శబ్దం ఇవ్వు. నేను నేను ఈ ప్రపంచాన్నే ఊపేస్తాను” ప్రపంచ ప్రఖ్యాత రచయిత ‘జోసఫ్ ‘కాన్రాడే’ అన్నాడు.

పై వాక్యాలు, శబ్ద శక్తి, అంటే మానవుడి వాక్కు ఎంత మహత్తరమైనదో తెలియజేస్తున్నాయి. ఈ వాక్కే మానవుడ్ని ఇతర ప్రాణుల నుండి వేరుజేసి, సృష్టిలో మహోత్కృష్ట స్థానాన్ని ప్రసాదించింది. ఈ వాక్కు సూత్రాన్ని పట్టుకొని మనిషి, మనీషి అయి, రాతియుగం నుంచి ఈనాటి అణుయుగంలోకి ప్రవేశించాడు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
డేనియల్ తనకు ఏమి వదిలేయమన్నాడు?
జవాబు:
డేనియల్ తనకు మాట్లాడే శక్తిని వదిలేయమన్నాడు.

ప్రశ్న 2.
తన వాక్కుతో తానేం చేయగలనని డేనియల్ అన్నాడు?
జవాబు:
తన వాక్కుతో తాను పోగొట్టుకొన్నవన్నీ తిరిగి సంపాదించుకోగలనని అన్నాడు.

ప్రశ్న 3.
కాన్ డే ఏం కావాలన్నాడు?
జవాబు:
కాన్రాడే బలమైన శబ్దం కావాలన్నాడు.

ప్రశ్న 4.
పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
డేనియల్ వెబ్స్టర్ ఎవరు?

AP 10th Class Telugu 4th Lesson Important Questions ఉపన్యాస కళ

2. ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

ఇది పుట్టుకతో వచ్చే కళ ఎలా అవుతుంది? కృషి, సాధన పట్టుదల వుంటే ఎవరైనా వక్తలు కాగలరు. అయితే వాళ్లందరూ మహావక్తలు కాలేరు. ఏ రంగంలోనైనా జగత్ప్రసిద్ధులు కొందరు వుంటారు. వారిలో ఆ ప్రతిభ అమోఘం. అయితే కృషిచేసి ప్రశంసలను అందుకొన్న. అబ్రహాం లింకన్, రూజ్వెల్ట్, చర్చిల్ మొదలైన వారు ఎంతో కృషిచేసి, ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ మహావక్తలుగా తమను తామే తీర్చిదిద్దుకున్నారు. వీరంతా కూడా వేదికలు ఎక్కిన మొదటి రోజుల్లో మాట్లాడటానికి ఇబ్బందిపడినవారే. ప్రేక్షకుల అపహాస్యానికి గురి అయిన వాళ్లే. అందువల్ల కొందరే వక్తలు కాగలరు అనే భావంతో అసలు ప్రయత్నమే చెయ్యనివారు ఒకటి రెండు ప్రయత్నాలలో మనసు బాధచెంది…. ఆ ప్రయత్నం విరమించుకున్నవారు పొరపాటు చేశారనే భావించాలి.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
వక్త కావడానికి ఏం కావాలి?
జవాబు:
వక్త కావాలంటే కృషి, పట్టుదల, సాధన కావాలి.

ప్రశ్న 2.
ఒక మహావక్త పేరు వ్రాయండి.
జవాబు:
చర్చిల్ ఒక మహావక్త.

ప్రశ్న 3.
మహావక్తలను ఎవరు తయారు చేస్తారు?
జవాబు:
తమను తామే మహావక్తలుగా తయారు చేసుకొన్నారు.

ప్రశ్న 4.
పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
అపహాస్యానికి ఎవరు గురయ్యారు?

3. ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

చర్చిల్ వక్తగా గుర్తింపు పొందాక కూడా చాలా కాలం వరకు, మాట్లాడవలసిన విషయాన్ని మననం చేసుకునేవాడు. అద్దం ముందు నిలబడి మహా సభలో జనం ముందు నిలబడి మాట్లాడినట్టే తన గదిలో ప్రాక్టీస్ చేసేవాడు. కనుక ఏ పుట్టలో ఏముందో? ఏ బుర్రలో ఏ ప్రతిభ మరుగున పడి వుందో? అందుకే ప్రజాహిత కార్యక్షేత్రంలో పాల్గొనే ప్రతివారూ గొప్ప వక్త కావడానికి కృషి చెయ్యాలి. కొందరికి కొద్ది శ్రమతోనే విలక్షణమైన వాగ్విధానం అబ్బుతుంది. వారే మహావక్తలు అవుతారు. కృషి చేసిన ప్రతి వక్తి ఉపన్యాసం ఇచ్చే ధోరణిని సాధించవచ్చును. ప్రజాహిత రంగంలో విజయం సాధించాలన్నా, ఆ రంగంలో ఉన్నతోన్నత శిఖరాలను అందుకోవాలన్నా గొప్ప వక్త అయి వుండాలి.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
ప్రజాహిత రంగంలో విజయం సాధించాలంటే ఏం ఉండాలి?
జవాబు:
ప్రజాహిత రంగంలో విజయం సాధించాలంటే వక్త అయి ఉండాలి.

ప్రశ్న 2.
ఉత్తమ వక్త కావాలంటే ఏం చెయ్యాలి?
జవాబు:
ఉత్తమ వక్త కావాలంటే కృషి చెయ్యాలి.

ప్రశ్న 3.
తన గదిలో ఎవరు ప్రాక్టీస్ చేసేవారు?
జవాబు:
తన గదిలో చర్చిల్ ప్రాక్టీస్ చేసేవారు.

ప్రశ్న 4.
పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
ప్రజాహిత రంగంలో విజయం సాధించాలన్నా, ఆ రంగంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలన్నా మానవుడు ఎటువంటి వాడై ఉండాలి? (లేదా) వక్త అంటే ఎవరు?

4. ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

కొందరు మంచి వక్త కావాలనే ఉబలాటంతో గొప్ప వక్తల్ని అనుకరిస్తారు. అందువల్ల ప్రయోజనం? అతడు గొంతెత్తగానే ఎవర్ని అనుకరిస్తున్నాదో ప్రేక్షకులకు తెలిసిపోతుంది. అంతే సభలో కలకలం ప్రారంభం అవుతుంది. చౌకబారు అనుకరణలని నవ్వుకుంటారు. అసలు అసలే, నకిలీ సకిలేయే గదా? మనం మనంగా ఉన్నపుడే మనకు ప్రత్యేక స్థానం వుంటుంది. అత్యంత నైపుణ్యంతో చేయబడి అచ్చంగా గులాబిపువ్వే అనే భ్రమకలిగించే కాగితం పువ్వులో, గులాబీలో వుండే సుగంధాన్ని నింపగలమా? అందుకే అనుకరణ మంచిది కాదు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
అనుకరణ మంచిదా? కాదా?
జవాబు:
అనుకరణ మంచిది కాదు.

ప్రశ్న 2.
కాగితం గులాబీకి, నిజం గులాబీకి తేడా ఏమిటి?
జవాబు:
కాగితం గులాబీకి సువాసన ఉండదు. నిజం గులాబీకి సువాసన ఉంటుంది.

ప్రశ్న 3.
‘మనకు ప్రత్యేక స్థానం ఎప్పుడు ఉంటుంది?
జవాబు:
మనం మనంగా ఉంటేనే మనకు ప్రత్యేక స్థానం ఉంటుంది.

ప్రశ్న 4.
పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
అనుకరణ ప్రేక్షకులకు తెలుస్తుందా?

AP 10th Class Telugu 4th Lesson Important Questions ఉపన్యాస కళ

5. ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

వేదిక- కొన్ని పాటించవలసిన రీతులు: వేదిక మీద హుందాగా ప్రవర్తించాలి. అనేక వేల కళ్లు అతణ్ని గమనిస్తుంటాయనే విషయం విస్మరించరాదు. వేదిక మీద ఎబ్బెట్టుగా ప్రవర్తించే వక్త, శ్రోతల దృష్టిలో ముందుగానే చులకనైపోతాడు. అతడి వంతు వచ్చినప్పుడు అధ్యక్షుడు అతడి పేరు చెప్పగానే సభాసదుల్లో గుసగుసలు, చిరునవ్వులు కన్పిస్తాయి. అది చూసి వక్త కొంచెం తికమకపడక తప్పదు. అది అంతటితో ఆగుతుందని చెప్పలేము. వక్త అపహాస్యం పాలయి, ఉపన్యాసం ముగించకుండానే కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడవచ్చును. అందుకే వేదిక మీద ఆశీనులైన వక్తలు సమయ సందర్భాలకు అనుకూలంగా దుస్తులు ధరించాలి. శ్రోతలు చూడగానే వక్త వ్యక్తిత్వాన్ని అంచనా కట్టడానికి ప్రయత్నిస్తారు. శ్రోతల గౌరవాన్ని ముందుగానే పోగొట్టుకున్న వక్త చెప్పేది ఎవరూ వినరు. సాదా దుస్తుల్లో హుందాగా తయారు కావచ్చు..

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
వేదికపైన ఎలా ప్రవర్తించాలి?
జవాబు:
వేదికపైన హుందాగా ప్రవర్తించాలి.

ప్రశ్న 2.
సభలో గుసగుసలు చూసి వక్త ఏం చేస్తాడు?
జవాబు:
సభలో గుసగుసలు చూసి వక్త తికమకపడతాడు.

ప్రశ్న 3.
వక్త అపహాస్యం పాలయినపుడేం చేయాలి?
జవాబు:
వక్త అపహాస్యం పాలయినపుడు తన ఉపన్యాసం పూర్తి చేయకుండానే కూర్చోవాలి.

ప్రశ్న 4.
పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
వక్త చెప్పేది శ్రోతలు ఎప్పుడు వినరు?

6. ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

కుర్చీలో కూర్చుని వెనక్కు ముందుకు వూగడం, కుర్చీలో కదలడం, గురి పెట్టినట్లు ఒక వైపు ప్రేక్షకుల్నే చూస్తూ కూర్చోవడం లేక నేలచూపులు చూడడం లేదా పైకప్పుకేసి చూడడం, దిక్కులు చూడడం. నోరంతా తెరిచేసి ఆవలించడం (ఆవలింత వస్తే ఏం చెయ్యాలి అంటారా? చేతిరుమాలో, చెయ్యో అడ్డుపెట్టుకుని, ప్రేక్షకుల దృష్టిలో పడకుండా ఆవలింతను దాచవచ్చును) వక్త ప్రేక్షకుల్లో కూర్చుని వున్న తన సన్నిహితులను చూసి చెయ్యి వూపడం (అలాచేస్తే ముందువరసలో కూర్చున్న ప్రేక్షకులు గిర్రున తలలు వెనక్కు తిప్పిచూస్తారు. ఆసక్తి మరోవైపుకు తిరుగుతుంది). కుర్చీలో తల వెనక్కు వాల్చి, కాళ్లు ముందుకు చాచి పడక కుర్చీ భంగిమను పెట్టడం, కుర్చీలో నిటారుగా ఊపిరి బిగపట్టినట్టు బిర్రబిగుసుకొని కూర్చోవడం, కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం ఇవి సభామర్యాదకు భంగం కలిగించే అంశాలు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
చెయ్యి ఎప్పుడు అడ్డు పెట్టుకోవాలి?
జవాబు:
ఆవలింత వచ్చినపుడు చెయ్యి అడ్డు పెట్టుకోవాలి.

ప్రశ్న 2.
సభలో స్నేహితుని చూసి వక్త చేయి ఊపవచ్చా?
జవాబు:
సభలో స్నేహితుని చూసి వక్త చేయి ఊపకూడదు.

ప్రశ్న 3.
సభా మర్యాదకు భంగం కలిగించే అంశమేది?
జవాబు:
కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం సభా మర్యాదకు భంగం కలిగించే అంశం.

ప్రశ్న 4.
పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
వక్త దిక్కులు చూడడం మంచిదా?

7. ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రారంభం : తన ఉపన్యాసం ప్రారంభించడానికి లేచివచ్చి మైకు దగ్గర నిలబడే లోపల శ్రోతలలో కలకలం వున్నట్లయితే వెంటనే ఉపన్యాసం ప్రారంభించకూడదు. కొన్ని క్షణాలు మౌనంగా నిల్చొని ప్రేక్షకులను చూడాలి. వెంటనే కలకలం ఆగిపోతుంది. ప్రేక్షకుల దృష్టి వక్త మీద పడుతుంది. అప్పుడు ప్రసన్న వదనంతో ఓ చిరునవ్వు ప్రేక్షకుల మీదకు విసిరి వక్త తన ఉపన్యాసం ప్రారంభించాలి.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
ప్రేక్షకులలో కలకలం’ ఉంటే ఏం చేయాలి?
జ. ప్రేక్షకులలో ‘కలకలం’ ఉంటే వక్త వెంటనే ఉపన్యాసం ప్రారంభించకూడదు.

ప్రశ్న 2.
వక్త మౌనంగా ఏం చేయాలి?
జవాబు:
వక్త మౌనంగా, ప్రేక్షకులను చూడాలి.

ప్రశ్న 3.
ఉపన్యాసం ప్రారంభించే ముందు ఏం చేయాలి?
జవాబు:
ఉపన్యాసం ప్రారంభించే ముందు వక్త చిరునవ్వు నవ్వాలి.

ప్రశ్న 4.
పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
ఉపన్యాసకుడి వదనం ఎలా ఉండాలి?

8. ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

అధ్యక్షుడ్ని సంబోధించేటప్పుడు తలతిప్పి అతడి వైపుచూడాలి. వేదిక మీద వున్న అందర్నీ పేరుపేరునా సంబోధించడం అనవసరం. సంబోధించినా ప్రతి వ్యక్తినీ తలతిప్పి చూడక్కర్లేదు. ప్రేక్షకుల్ని సంబోధించే ముందు ఓ క్షణం మౌనం వహించాలి. ప్రేక్షకుల్ని ఆకట్టుకునే చిట్కాల్లో ఇది అన్నిటికంటే మంచి చిట్కా, ఒక ప్రధానమైన అంశం నుంచి మరో అంశంలోకి వెళ్లబోయే ముందు ఓ క్షణం ఆగడం మంచిది. వేదిక మీది నుంచి ఎవర్నీ అతిగా పొగడకూడదు. అతిశయోక్తులు అపహాస్యానికి, దారితీస్తాయి.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
వక్త ప్రతి వ్యక్తినీ తలతిప్పి చూడాలా?
జవాబు:
వక్త ప్రతి వ్యక్తినీ తలతిప్పి చూడనక్కర్లేదు.

ప్రశ్న 2.
మంచి చిట్కా ఏది?
జవాబు:
ప్రేక్షకుల్ని సంబోధించే ముందు వక్త ఓ క్షణం మౌనం పాటించాలి.

ప్రశ్న 3.
తలతిప్పి అధ్యక్షుడిని ఎప్పుడు చూడాలి?
జవాబు:
అధ్యక్షుడిని సంబోధించేటపుడు వక్త తలతిప్పి అధ్యక్షుడిని చూడాలి.

ప్రశ్న 4.
పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
అపహాస్యానికి ఏవి దారి తీస్తాయి?

AP 10th Class Telugu 4th Lesson Important Questions ఉపన్యాస కళ

9. ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

విషయ ప్రతిపాదన సూటిగా వుండాలి. వాచకం స్పష్టంగా వుండాలి. స్వరంలో ఆరోహణ, అవరోహణలుండాలి. గీత గీచినట్టు ఒక మాటను ఒరుసుకొని మరొకమాట దొర్లుతూ వుంటే ప్రేక్షకుల వీనులకు ఇంపుగా వుండదు. స్వర స్థాయిని కూడా సభనుబట్టి నిర్ణయించుకొనాలి. మధ్యమస్థాయి ఉత్తమమైనది. విషయం క్లిష్టమైనది అయి ప్రేక్షకుల కుతూహలాన్ని ఆకర్షించలేకపోతే మధ్య చమత్కారాలు వదలాలి. పెద్దల సూక్తుల్ని చెప్పాలి. ఉదహరించిన సూక్తి లేక కవితాచరణం ఎవరిదో వక్తకు తెలిసి వుండాలి. ఒక పేరుకు మరొక పేరు చెబితే రసాభాస అయే ప్రమాదం వుంది. కొందరి ఉపన్యాసంలో నేను నా అంటూ స్వోత్కర ఎక్కువ ఉంటుంది. తన గురించి తనే చెప్పుకుంటూ వుంటే ప్రేక్షకుల్లో చాలా మంది ముసిముసిగా నవ్వుకుంటారు. అలాగే వేదిక మీద నున్న ఏ వ్యక్తి గురించైనా అనవసరంగా మాట్లాడడం వల్ల, అతిగా పొగడడం వల్ల కూడా ఇలాంటి ప్రమాదమే ఉంటుంది. మాట్లాడవలసిన విషయాన్ని సేకరించిన తర్వాత ముఖ్యాంశాలను క్రమబద్ధంగా చెప్పాలి.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
విషయ ప్రతిపాదన ఎలా ఉండాలి?
జవాబు:
విషయ ప్రతిపాదన సూటిగా ఉండాలి.

ప్రశ్న 2.
స్వరంలో ఉండవలసినవేవి?
జవాబు:
స్వరంలో ఆరోహణ, అవరోహణలుండాలి.

ప్రశ్న 3.
ప్రేక్షకుల వీనులకు ఇంపుగా ఉండనిదేది?
జవాబు:
గీత గీచినట్టు ఒక మాటను ఒరుసుకొని మరొక మాట దొర్లుతూ ఉంటే ప్రేక్షకుల వీనులకు ఇంపుగా ఉండదు.

ప్రశ్న 4.
చమత్కారాలు ఎప్పుడు వదలాలి?
జవాబు:
విషయం క్లిష్టమైనది అయి, ప్రేక్షకుల కుతూహలాన్ని ఆకర్షించలేకపోతే మధ్య చమత్కారాలు వదలాలి.

10. ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

ఉపసంహారం: వక్త మాట్లాడుతున్నప్పుడు శ్రోతలు చప్పట్లు కొడ్తారు. అవి ప్రశంసా పూర్వకంగా వస్తున్న చప్పుట్లో లేక “ఇక చాల్లే కూర్చో” అని హెచ్చరించే చప్పట్లో తెలుసుకోవాలి. అలా కాకుండా శ్రోతల ప్రతిస్పందనతో సంబంధం లేకుండా మైకు వదలని వారిని శ్రోతలే చివరకు మొరటుగా ప్రవర్తించి కూర్చునేలా చేస్తారు. అప్పుడు మనసు చిన్నబుచ్చుకొని, ముఖం చింతాక్రాంతం చేసుకొని, నీరసంగా కుర్చీలో కూలబడే కంటే ముందుగానే శ్రోతల ‘ప్రతిస్పందనకు అనుకూలంగా, ఉపన్యాసం ముగించడం మంచిదని తెలుసుకుంటాడు.

అనుభవం గల వక్త. కొందరు ‘వక్తలు మాట్లాడుతూ ఉంటే అనేకసార్లు వారి ఉపన్యాసం ముగిసిందనే అపోహ శ్రోతలకు కలుగుతుంది. మళ్లీ వెంటనే మరో అంశాన్ని అందుకొనడమో లేక అదే అంశాన్ని సాగదీయడమో చేస్తుంటారు. శ్రోతలు అసహనంగా కూర్చొంటారు. కొందరు మైకు దొరికితే చాలు వదలలేరు. వారిని మైకాసురులనీ, మైకోమానియా గాళ్లనీ, వారు ఉపన్యాసం యివ్వడానికి లేస్తున్నపుడే ప్రేక్షకుల్లో నుంచి మాటలు విన్పిస్తాయి. తెలివైన వక్త శ్రోతల ఆసక్తిస్థాయి పడిపోకముందే తన, ఉపన్యాసం ముగిస్తాడు. ఉదాహరణలు క్లుప్తంగా ఉండాలి. అతిశయోక్తులు వీలయినంతవరకు లేకుండా…. చూసుకోవడమే. తెలివైన పని.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
అంశాన్ని సాగదీస్తే ఏమౌతుంది?
జవాబు:
అంశాన్ని సాగదీస్తే ప్రేక్షకులు అసహనం చెందుతారు.

ప్రశ్న 2.
ఉపన్యాసం ఎప్పుడు ముగించాలి?
జవాబు:
ప్రేక్షకుల ఆసక్తి స్థాయి పడిపోకముందే ఉపన్యాసం ముగించాలి.

ప్రశ్న 3.
ప్రేక్షకుల చప్పట్ల భావన ఎవరు తెలుసుకోవాలి?
జవాబు:
ప్రేక్షకులు చప్పట్ల భావన వక్త తెలుసుకోవాలి.

ప్రశ్న 4.
పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
అనుభవం గల వక్త ఏం తెలుసుకొంటాడు?

11. ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

ఊతపదాలు : కొందరికి కొన్ని’ కొన్ని ఊతపదాలు తరచుగా పడుతుంటాయి. ఆ విషయంలో వక్త జాగ్రత్తపడాలి. ఉదాహరణకు ‘అన్నమాట’ అనే పదాన్ని చాలామంది ముఖ్యంగా స్త్రీలు తమ ఉపన్యాసాల్లో ఊతపదంగా వాడతారు. “నన్నేమో ఈ సభకు కార్యదర్శి, పిలవడానికి వచ్చాడన్నమాట. అప్పుడు నేను వేరే పనుల వత్తిడి వలన వెంటనే ఒప్పుకోలేదన్నమాట” అంటూ ప్రారంభిస్తారు. రెండు నిమిషాలు శ్రోతలు భరిస్తారు. ఆ తరువాత వాక్యం ముగియబోయేటపుడు ‘అన్నమాట’ అంటూ శ్రోతలు కూడా ఊతం ఇస్తారు. దాంతో నవ్వులు – ఏకాగ్రత చెదిరిపోవడం – మధ్యలోనే ఉపన్యాసం ముగించడం జరుగుతుంది. మరికొన్ని ఊతపదాలు ‘ఇన్నింటికీ నేను చెప్పదల్చుకునేదేమంటే’ ‘అంచేత’ ‘విషయం’ లాంటి ఊతపదాల అలవాటును అదుపులో పెట్టుకోవాలి.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
స్త్రీలు ఎక్కువ వాడే ఊతపదమేది?
జవాబు:
‘అన్నమాట’ అనేది స్రీలు ఎక్కువ వాడే ఊతపదం.

ప్రశ్న 2.
వక్త దేనిని అదుపులో పెట్టుకోవాలి?
జవాబు:
ఊత పదాల అలవాటును వక్త అదుపులో పెట్టుకోవాలి.

ప్రశ్న 3.
ఊత పదాలను శ్రోతలు ఎంతసేపు భరిస్తారు?
జవాబు:
ఊత పదాలను శ్రోతలు రెండు నిముషాలు భరిస్తారు.

ప్రశ్న 4.
పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
వక్త ఏ విషయంలో జాగ్రత్త పడాలి?

AP 10th Class Telugu 4th Lesson Important Questions ఉపన్యాస కళ

12. ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

కొన్ని మాటల్ని కొత్తగా వేదికను ఎక్కిన వారు జాగ్రత్తగా పలకాలి. ఉదా: ‘ప్రసంగించడం’ అనబోయి ‘ప్రసవించడం’ అనే ప్రమాదం వుంది. అలాగే ‘పరిణామం’- ‘పరిమాణం’ ఆవిష్కరించడానికి బదులుగా ‘బహిష్కరించడం’.

సమయం : కొందరు మైకు దొరికితే వదలరు. తన తర్వాత మాట్లాడే వారెందరున్నారనే ఆలోచన కూడా వుండదు. అనర్గళంగా మాట్లాడే శక్తి వుంది కదా అని మొత్తం కేటాయించిన సమయంలో సగం సమయాన్ని తానే వినియోగించుకోకూడదు. గొప్పవత్తులు ఎప్పుడూ ‘షార్ట్ అండ్ స్వీట్ గానే మాట్లాడతారు. శ్రోతల ప్రశంసలను పొందుతారు. ఉపసంహారం ప్రతిభావంతంగా చేసిన వక్త శ్రోతల అభిమానాన్ని ఎక్కువగా చూరగొంటాడు. ముగించి గిర్రున తిరిగి, గలగల కుర్చీ దగ్గరకు నడిచి అమ్మయ్య గట్టెక్కాను అన్నట్లుగా కుర్చీలో కూలబడకూడదు. చిరునవ్వుతో కృతజ్ఞతలు చెప్పి శ్రోతల నుండి “సెలవు తీసుకుంటున్నట్లు వారికేసి ఓ క్షణం చూసి, తన సీటుకు వెళ్లాలి.”

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
‘పరిమాణం’ అనేది దేనికి బదులుగా వాడతారు?
జవాబు:
‘పరిమాణం’ అనేది ‘పరిణామం’ కి బదులుగా వాడతారు.

ప్రశ్న 2.
గొప్ప వక్తలు ఉపన్యాసంలో పాటించే చిట్కా ఏమిటి?
జవాబు:
గొప్ప వక్తలు ఉపన్యాసంలో ‘షార్ట్ అండ్ స్వీట్’ చిట్కాను పాటిస్తారు.

ప్రశ్న 3.
శ్రోతల అభిమానం ఎక్కువ చూరగొనేదెవరు?
జవాబు:
ఉపసంహారం ప్రతిభావంతంగా చేసిన వక్త శ్రోతల అభిమానం ఎక్కువ చూరగొంటారు.

ప్రశ్న 4.
పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
వక్త ఉపన్యాసం ముగించాక ఏం చేయాలి?

అపరిచిత గద్యాలు

1. క్రింది లేఖను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

అగ్రహారం,
28.8.2017,

ప్రియ మిత్రుడు మూర్తిగారికి,
ఉభయ కుశలోపరి. మీ ఉత్తరం అందినది. సంగతులు తెలిసినవి. మీకు మీ పొరుగువారికి స్థలం సరిహద్దు విషయమై తగాదా వచ్చినదని మీరు లేఖలో వ్రాసియున్నారు. తగవు ఎప్పుడూ మంచిది కాదు. తగవులు తలయెత్తినప్పుడు మనశ్శాంతి కోల్పోతాము. సుఖశాంతులు కరువవుతాయి. అందువలన తగవులు వచ్చినప్పుడు వాటిని పెంచుకోడానికి ప్రయత్నించ కూడదు. గ్రామపెద్దలను మధ్యవర్తులుగా పెట్టుకొని తగవు పరిష్కరించుకొనేందుకు కృషి చేయాలి. అట్లుగాక తగవును పెంచుకొని న్యాయస్థానమును ఆశ్రయించినచో మనకు ధన నష్టమగుటయే కాక, కాలము వృథా అగును. అందువలన ఎప్పుడును తగవును పెంచుకోడానికి ప్రయత్నించకూడదు. నా సహాయ సహకారాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఎప్పటి కప్పుడు విషయాలు తెలియపర్చండి. శాంతికోసం ప్రయత్నించండి.

ఇట్లు,
మీ ప్రియమిత్రుడు,
రామకృష్ణ.

చిరునామా:
టి.ఎస్.ఎన్. మూర్తి,
వేమవరం, తూర్పుగోదావరి జిల్లా.

ప్రశ్నలు – జవాబులు

అ) ఉత్తరం ఎవరు ఎవరికి వ్రాశారు?
జవాబు:
రామకృష్ణ తన మిత్రుడు టి.యస్.ఎన్ మూర్తిగారికి ఉత్తరం వ్రాశారు.

ఆ) ఉత్తరంలో దేనిని గూర్చి ప్రస్తావన ఎక్కువగా ఉంది?
జవాబు:
ఉత్తరంలో తగాదా మంచిది కాదని, పరిష్కరించుకోవాలనే ప్రస్తావన ఎక్కువగా ఉంది.

ఇ) న్యాయస్థానానికి వెళ్తే ఏమవుతుంది?
జవాబు:
న్యాయస్థానానికి వెళ్తే ధన నష్టము కలుగును మరియు కాలము వృథా అగును.

ఈ) పై లేఖలో దేని కోసం ప్రయత్నించమని సూచించారు?
జవాబు:
పై లేఖలో శాంతికోసం ప్రయత్నించమని సూచించారు.

2. ఈ క్రింది పేరాను చదివి, ప్రశ్నలకు తగిన సమాధానములు రాయండి.

పొదుపు మానవ జీవితానికి అత్యవసరము. పొదుపు లేని మానవుడు దారం తెగిన గాలిపటం వంటివాడు. పొదుపు చేయకుండా అడ్డుపడే వాటిల్లో అతి ముఖ్యమైనవి కోరికలు. ఇవి మానవుణ్ణి మానసికంగా బలహీనుణ్ణి చేస్తాయి. ధనం, జలం, భాషణం మొదలగు వాటిలో పొదుపు పాటించడం ద్వారా అభివృద్ధిని సాధించవచ్చు. పొదుపును నిర్లక్ష్యం చేస్తే అప్పులు చేయక తప్పదు. అప్పు చేయడం వలన మనం వ్యక్తిత్వాన్ని కోల్పోతాము.

ప్రశ్నలు – జవాబులు

అ) పొదుపులేని మానవుణ్ణి దేనితో పోల్చారు?
జవాబు:
దారం తెగిన గాలిపటంతో పోల్చారు.

ఆ) అప్పు చేయడం వలన దీనిని కోల్పోతాము?
జవాబు:
వ్యక్తిత్వాన్ని కోల్పోతాము.

ఇ) ఏయే విషయాల్లో పొదుపు పాటించాలి?
జవాబు:
ధనం, జలం, భాషణం మొదలగు వాటిలో పొదుపు పాటించాలి.

ఈ) పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
అర్థవంతమైన ప్రశ్న ఏదైనను వ్రాసిన మార్కు ఇవ్వవచ్చు.

AP 10th Class Telugu 4th Lesson Important Questions ఉపన్యాస కళ

3. ‘ప్రకటన’ను చదివి తగిన జవాబులు రాయండి.

పత్రికా ప్రకటన

2015-16లో నిర్వహించబడిన పదవతరగతి పబ్లిక్ పరీక్షలలో జిల్లా నుండి ఉత్తమ గ్రేడులు సాధించిన 40 మంది విద్యార్థినీ, విద్యార్థులు మేధాపురస్కారము నిమిత్తము ఎంపిక చేయబడి యున్నారు. ఎంపిక కాబడిన వారికి ఈ విషయం ఇదివరలో తెలియజేయడమైనది.

కావున సంబంధిత విద్యార్థులు తమ తల్లిదండ్రులతో మార్కుల జాబితా, హాల్ టిక్కెట్టు నకళ్ళు తీసుకుని ది. 12.12.2016 శనివారం మేధా సేవాసమితి, కృష్ణలంక, విజయవాడ వారి కార్యాలయము నందు మ. 2 గం||లకు హాజరు కావలయును. అదే రోజు సా. 6 గం॥లకు జరిగే సభలో విద్యార్థులకు మేధా పురస్కారములు అందజేయబడునని తెలియజేయడమైనది.

ప్రశ్నలు – జవాబులు

అ) ప్రకటన ఎవరు ఇచ్చారు?
జవాబు:
మేధా సమితి, కృష్ణలంక విజయవాడ వారు ప్రకటన ఇచ్చారు.

ఆ) మేధా పురస్కారము ఎవరికి ఇస్తారు?
జవాబు:
2015-16లో పదవ తరగతి పరీక్షలలో జిల్లా నుండి ఉత్తమ గ్రేడులు సాధించిన 40 మంది విద్యార్థులకు మేధా పురస్కారాలు ఇస్తారు.

ఇ) కృష్ణలంక ఎక్కడ ఉంది?
జవాబు:
కృష్ణలంక విజయవాడలో ఉంది.

ఈ) పురస్కారము ఇచ్చే తేదీ ఏది?
జవాబు:
తేది 12-12-2016, శనివారం నాడు.

4. కింది గద్యభాగాన్ని చదవండి. కింద ఇచ్చిన నాలుగు వాక్యాలలోని తప్పొప్పులను గుర్తించి, బ్రాకెట్లలో రాయండి.

“అంతరించిపోతున్న తెలుగుభాషా సంస్కృతులకు పునరుజ్జీవనం కల్పించుటకై రంగంలోకి దిగిన కందుకూరి పూర్తి సంఘసంస్కరణ దృక్పథంతో పనిచేశారు. ఒకే రంగాన్ని ఎంచుకోకుండా, సంఘంలో అపసవ్యంగా సాగుతున్న పలు అంశాలవైపు దృష్టిని సారించాదాయన. ప్రధానంగా స్త్రీల అభ్యున్నతిని కాంక్షించిన మహామనీషిగా వాళ్ళ చైతన్యం కోసం అనేక రచనలు చేశారు. చంద్రమతి చరిత్ర, సత్యవతి చరిత్ర వంటివి అందులో కొన్ని వారి బ్రహ్మవివాహం నాటకం, పెద్దయ్య గారి పెళ్ళి పేరుతో, వ్యవహార ధర్మబోధిని ప్లీడర్ నాటకం పేరుతోనూ, ప్రసిద్ధి పొందాయి.

వాక్యాలు :
అ) కందుకూరి పూర్తిపేరు వీరేశలింగం పంతులు. (ఒప్పు)
ఆ) చంద్రమతి చరిత్ర కందుకూరి రాసిన గొప్ప నాటకం. (తప్పు)
ఇ) సంఘంలోని సవ్యమైన అంశాలపై దృష్టి సారించాడాయన. (తప్పు)
ఈ)కందుకూరి గొప్ప సంఘసంస్కర్త. (ఒప్పు)

5. కింది పేరా చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.

జీవావరణం మీద, పర్యావరణం మీద మనుష్యులు ఇంత కక్ష కట్టారెందుకో? ఇలా ఉన్న చెట్లన్నింటినీ నరికేసుకుంటూ పోతే, చివరికి మనిషికి మిగిలేదేమిటి? అయినా ఇప్పటికే అనుభవిస్తున్నారు కదా! గ్రీన్ హౌజ్ ఎఫెక్టునీ అన్న దర్బాలనీ, ఆధునిక కాలుష్యకారక సమస్యలన్నింటికీ చెట్లు నరికివేతే కారణమని, ఈ మానవమేధావుల్ తేల్చి చెబుతారు. మళ్ళీ ఉన్న చెట్లన్నింటినీ నరికి భవనాలూ, నగరాలూ నిర్మిస్తారు. వాళ్ళ అభివృద్ధి ఎటు పోతోందో వాళ్ళకే అర్థం కావడం లేదు.

ప్రశ్నలు – జవాబులు

అ) కాలుష్యానికి కారణం ఏమిటి?
జవాబు:
కాలుష్యానికి కారణం చెట్లు నరికివేత.

ఆ) మానవులు చెప్పేదే చేస్తున్నారా?
జవాబు:
లేదు. మనుషులు జీవావరణ, పర్యావరణాలపై కక్ష కట్టారు.

ఇ) మానవుల అభివృద్ధి జీవావరణానికి మేలు చేస్తోందా?
జవాబు:
మానవుల అభివృద్ధి జీవావరణానికి మేలు చేయడం లేదు.

ఈ) చెట్లు లేకపోతే ఏమౌతుంది?
జవాబు:
చెట్లు లేకపోతే 1) గ్రీన్ హౌజ్ ఎఫెక్టు 2) ఆమ్ల దర్పాలు కలుగుతాయి.

6. కింది అంశాన్ని చదివి, ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి.

లేఖ

ప్రియమిత్రుడు జస్వంతు,

ఉభయ కుశలోపరి. నీ ఉత్తరం అందింది. అందులో నీవు చదివిన పుస్తకం గురించి రాశావు. చాలా సంతోషం. ఇటీవల నేను కూడా ఒక మంచి పుస్తకం చదివాను. పరవస్తు చిన్నయసూరిగారి ‘నీతి చంద్రిక’ చదివాను. దానిలో స్నేహ ధర్మాన్ని ఎంతో చక్కగా చెప్పారాయన. సజ్జన సాంగత్యం వల్ల కలిగే లాభాలు, దుర్జన సాంగత్యం వల్ల కలిగే నష్టాలను పాత్రల ద్వారా చెప్పిన విధం అద్భుతం. చక్కని నీతులు కథల రూపంలో చెప్పి మనలో పరివర్తనకు బాటలు వేశారు. చిన్నయసూరి. బాగా చదువుతావని ఆశిస్తూ.

ఇట్ల,
నీ ప్రియమిత్రుడు,
ఫణిరామ్.

ప్రశ్నలు – జవాబులు

అ) లేఖ ఎవరు, ఎవరికి రాశారు?
జవాబు:
ఫణి-జస్వంతక్కు

ఆ) లేఖలో ఏ గ్రంధం గురించి చెప్పబడింది?
జవాబు:
నీతిచంద్రిక

ఇ) ఈ గ్రంథంలో సూరి ఏమి చెప్పారు?
జవాబు:
స్నేహధర్మాన్ని

ఈ) ఎవరి సాంగత్యం నష్టాన్ని కల్గిస్తుంది?
జవాబు:
దుర్జన సాంగత్యం

AP 10th Class Telugu 4th Lesson Important Questions ఉపన్యాస కళ

7. ఈ కింది కరపత్రం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

స్త్రీలు మాతృదేవతలు

ప్రియ సోదరులారా !
స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం. అంతేకాదు మన భారతీయ ధర్మం. “యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః” అని చెప్పిన పెద్దల మాటను మరువద్దు, ‘అమ్మ, అక్క, చెల్లి, భార్య, కూతురు’ ఇలా ఎన్నో రూపాలతో స్త్రీ శక్తి నిన్ను శక్తిమంతుణ్ణి చేస్తుంది. మాటలతో చెప్పి, చేతలలో చేయలేనపుడు ఆ జన్మ వ్యర్థం. స్త్రీల పట్ల నేటి వరకు ఎన్నో అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. జరుపుతూనే ఉన్నాము. ఇలా ఒక స్త్రీ పట్ల సమాజంలోని తోటి వ్యక్తి అమర్యాదగా ప్రవర్తించడం మన తల్లిని తలదించుకొనే పరిస్థితి తేవడం ఎంతవరకు సబబు? ఆలోచన ఎందుకు నశిస్తోంది? నీవు ఎప్పటికీ ఇలాగే ఉంటావా? నీ చెల్లితో, నీ భార్యకో, నీ కూతురుకో జరిగినప్పుడు కూడా ఇలాగే నిర్లక్ష్య ధోరణితోనే ఉంటావా? లేకపోతే నేను ఎట్లా అయినా ఉంటాను. నా వాళ్ళ జోలికి వస్తే మాత్రం ఊరుకోనంటావా? చూడు మిత్రమా! కాలం మారింది. స్త్రీలలో కూడా చైతన్యం వచ్చింది. వాళ్ళూ ధైర్యంగా సమస్యను ఎదుర్కొనే స్థితికి చేరారు. బుద్ధి తెచ్చుకున్నావా సరే! లేకపోతే పరిస్థితి నీకు అనుకూలంగా ఉండదు. తస్మాత్ జాగ్రత్తా. ఇంత పరిస్థితి ఎందుకు? హాయిగా ఒక సోదరుడిగా, స్నేహితుడిగా తోడు నిలు. స్త్రీ లోకమే ఛత్రం పడుతుంది. రాఖీ కట్టించుకుంటే కాదు. భయంతో రాజీ పడకుండా అవకాశమున్నంతవరకు తోడు నిలవాలి. అమ్మ జాతికి బలం ఇవ్వాలి. ఆలోచించండి! వారి స్వేచ్ఛకు అడ్డం కాకండి.

ఇట్లు,
అమ్మ ఒడిన ఒదిగిన పిల్లల సంఘం.

ప్రశ్నలు – జవాబులు

అ) పై పేరాలోని సూక్తి ఏది?
జవాబు:
యత్రనార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః

ఆ) స్త్రీ ఎన్ని రూపాలలో పురుషుడికి తోడుగా ఉంటుంది?
జవాబు:
తల్లి, అక్క, చెల్లి, భార్య, కూతురు.

ఇ) తల్లి తలదించుకొనే పని ఏది?
జవాబు:
స్త్రీ పట్ల అమర్యాదగా ప్రవర్తించడం.

ఈ) స్త్రీ లోకం నీకు ఛత్రం ఎప్పుడు పడుతుంది?
జవాబు:
స్త్రీలతో సోదరుడిలా, స్నేహితుడిలా ప్రవర్తించినపుడు.

వ్యక్తీకరణ సృజనాత్మకత

ఆ) ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘వ్యాసం’ సాహిత్య ప్రక్రియను తెల్పుము.
జవాబు:
ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని పూర్వాపరాలను చర్చిస్తూ, విశ్లేషణాత్మకంగా విస్తరించి రాయడమే వ్యాసం. దీనిలో ఉపోద్ఘాతం, విషయ విస్తరణ, ముగింపు వంటివి ప్రధానాంగాలుగా ఉంటాయి. వ్యాసంలోని విషయాన్ని బట్టి చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, శాస్త్ర, వైజ్ఞానిక, సాహిత్య, తాత్విక, ఆధ్యాత్మిక మొదలైన విభాగాలుగా విభజించవచ్చు.

ప్రశ్న 2.
మాట్లాడే శక్తిని గురించి ఎవరేమన్నారు? (లేదా) మానవుడి వాక్కు ఎంత మహత్తరమైనదో తెల్పుము.
జవాబు:
“మాట్లాడే శక్తిని మాత్రం వదిలేసి, నా సర్వస్వం దోచుకున్నా నేను విచారించను. నా వాక్కుతో నేను పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకోగలను.” ఆక్స్ఫర్డ్ శబ్దకోశకారుడు డేనియల్ వెబ్స్టర్’ అన్నాడు.

“నువ్వు నాకో బలమైన శబ్దం ఇవ్వు. నేను ఈ ప్రపంచాన్నే ఊపేస్తాను” ప్రపంచ ప్రఖ్యాత రచయిత ‘జోసఫ్ కాన్రాడే’ అన్నాడు.

ప్రశ్న 3.
“మహా వక్తలుగా తమను తామే తీర్చిదిద్దుకున్నారు”. ఎవరు ? తెల్పుము.
జవాబు:
కృషి, సాధన, పట్టుదల ఉంటే ఎవరైనా వక్తలు కాగలరు. ఏ రంగంలోనైనా జగత్ప్రసిద్ధులు కొందరు ఉంటారు. వారిలో ఆ ప్రతిభ అమోఘం. అట్టివారిలో కృషి చేసి ప్రశంసలను అందుకున్న అబ్రహాం లింకన్, రూజ్వెల్ట్, చర్చిల్ మొదలైనవారు. వీరు ఎంతో కృషి చేసి, ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ మహావక్తలుగా తమను తామే తీర్చిదిద్దుకున్నారు.

ప్రశ్న 4.
చర్చిల్ వక్తగా ఎలా గుర్తింపు పొందాడు? (లేదా) చర్చిల్ చేసిన కృషి ఎట్టిది?
జవాబు:
చర్చిల్ ఎలాగైనా జనం ముందు మాట్లాడడం అలవాటు చేసుకున్నాడు. ఎన్నోసార్లు జనం ముందు ఇబ్బంది కలిగించే పరిస్థితులకు గురి అయ్యాడు. దాంతో అతనికి పట్టుదల పెరిగింది. గొప్ప వక్త కావాలనుకున్నాడు. చాలా శ్రమించాడు. మాట్లాడగల శక్తి ప్రతి మానవునికి ఉంటుంది. అయితే ఆ వాక్కును చర్చిల్ సానబట్టాడు. చివరకు అతను అనుకున్నది సాధించాడు. ఈనాడు గొప్ప వక్తగా చర్చిల్ను ప్రపంచం గుర్తించింది.

ప్రశ్న 5.
ప్రజాహిత రంగంలో విజయం సాధించాలంటే ఏమి చెయ్యాలి?
జవాబు:
ప్రజాహిత రంగంలో విజయం సాధించాలంటే ముందుగా మాట్లాడవలసిన విషయాన్ని మననం చేయాలి. అద్దం ముందు నిలబడి మహాసభలో జనం ముందు నిలబడి మాట్లాడినట్లే తన గదిలో ప్రాక్టీసు చేయాలి. అందుకే ప్రజాహిత కార్యక్షేత్రంలో పాల్గొనే ప్రతివారూ గొప్పవక్త కావడానికి కృషి చెయ్యాలి. అలా శ్రమ చేస్తే విలక్షణమైన వాగ్విధానం అబ్బుతుంది. వారే మహావక్తలు అవుతారు. కృషి చేసిన ప్రతి వక్త ఉపన్యాసం ఇచ్చే ధోరణిని సాధించవచ్చు. ప్రజాహిత రంగంలో విజయం సాధించాలన్నా, ఆ రంగంలో ఉన్నతోన్నత శిఖరాలను అందుకోవాలన్నా గొప్ప వక్త అయితే విజయం సాధించవచ్చు.

AP 10th Class Telugu 4th Lesson Important Questions ఉపన్యాస కళ

ప్రశ్న 6.
అనుకరణ ఎందుకు మంచిది కాదు?
జవాబు:
కొందరు మంచి వక్త కావాలనే ఉబలాటంతో గొప్ప వక్తల్ని అనుకరిస్తారు. అందువల్ల ప్రయోజనం లేదు. ఆ వక్త గొంతెత్తగానే ఎవర్ని అనుకరిస్తున్నాడో ప్రేక్షకులకు తెలిసిపోతుంది. అంతే సభలో కలకలం ప్రారంభమవుతుంది. చౌకబారు అనుకరణలని నవ్వుకుంటారు. మనం మనంగా ఉన్నప్పుడే మనకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అత్యంత నైపుణ్యంతో చేయబడి అచ్చంగా గులాబీ పువ్వే అని భ్రమ కలిగించే కాగితం పువ్వులో, గులాబీలో ఉండే సుగంధాన్ని నింపగలమా? అందుకే అనుకరణ మంచిది కాదు.

ప్రశ్న 7.
సభాకంపం అంటే ఏమిటి’? ఎందుకు కల్గుతుంది?
జవాబు:
సభాకంపం అంటే సభలో మాట్లాడడానికి కొత్తగా వచ్చినపుడు భయం కల్గడం, ఒళ్ళంతా చెమటలు పట్టడం జరుగుట వల్ల మాట్లాడలేకపోవుట. ఏం విషయం చెప్పాలో తెలియక పడిపోతుంటారు. అంతకముందు అనుభవం లేకపోవుట, చెప్పవలసిన విషయాన్ని ప్రాక్టీస్ చేయకపోవుట. వేదిక మీద కొత్తగా ప్రసంగించవలసి వచ్చినపుడు నూటికి తొంభై తొమ్మిది మంది ఈ సభాకంపం భరించక తప్పడం లేదు.

ప్రశ్న 8.
వేదిక మీద పాటించవలసిన రీతులు ఏవి?
జవాబు:
వేదిక మీద హుందాగా ప్రవర్తించాలి. అనేక వేల కళ్ళు అతణ్ని గమనిస్తుంటాయనే విషయం విస్మరించరాదు. వేదిక మీద ఎబ్బెట్టుగా ప్రవర్తించే వక్త, శ్రోతల దృష్టిలో ముందుగానే చులకనై పోతాడు. అతడి వంతు వచ్చినపుడు అతడి పేరు చెప్పగానే సభా సదుల్లో గుసగుసలు, చిరునవ్వులు కన్పిస్తాయి. అది చూసి వక్త కొంచెం తికమక పడక తప్పదు. అప్పుడు వక్త అపహాస్యం పాలయి ఉపన్యాసం ముగించకుండానే కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వేదిక మీద ఆశీసులైన వక్తలు సమయ సందర్భాలకు అనుకూలంగా దుస్తులు ధరించాలి.

ప్రశ్న 9.
వేదిక మీద వక్త ప్రవర్తనలో కొన్ని లోపాలను రాయండి. (లేదా) సభా మర్యాదకు భంగం కలిగించే అంశాలేవి?
జవాబు:
కుర్చీలో కూర్చుని వెనక్కు, ముందుకు ఊగడం, కుర్చీలో కదలడం, గురిపెట్టినట్లు ఒకవైపు ప్రేక్షకుల్నే చూస్తూ కూర్చోవడం లేక నేల చూపులు చూడడం లేదా పై కప్పు కేసి చూడడం, దిక్కులు చూడడం, నోరంతా తెరిచేసి ఆవలించడం. (ఆవలింత వస్తే ఏం చెయ్యాలి అంటారా? చేతి రుమాలో, చెయ్యో అడ్డుపెట్టుకుని, ప్రేక్షకుల దృష్టిలో పడకుండా ఆవలింతను దాచవచ్చు). వక్త ప్రేక్షకుల్లో కూర్చుని ఉన్న తన సన్నిహితులను చూసి చెయ్యి ఊపడం, కుర్చీలో తల వెనక్కు వాల్చి, కాళ్ళు ముందుకు దాచి పడక కుర్చీ భంగిమను పెట్టడం, కుర్చీలో నిటారుగా ఊపిరి బిగపట్టినట్టు బిర్ర బిగుసుకొని కూర్చోవడం, కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం ఇవి సభా మర్యాదకు భంగం కలిగించే అంశాలు.

ప్రశ్న 10.
వేదికపైన ఉపన్యాసాన్ని ఎలా ప్రారంభించాలి?
జవాబు:
వేదికపైన ఉపన్యాసం ప్రారంభించడానికి లేచివచ్చి మైకు దగ్గర నిలబడే లోపల శ్రోతలలో కలకలం వున్నట్టయితే వెంటనే ఉపన్యాసం ప్రారంభించకూడదు. కొన్ని క్షణాలు మౌనంగా నిల్చొని ప్రేక్షకులను చూడాలి. వెంటనే కలకలం ఆగిపోతుంది. ప్రేక్షకుల దృష్టి వక్త మీద పడుతుంది. అప్పుడు ప్రసన్న వదనంతో ఓ చిరునవ్వు ప్రేక్షకుల మీదకు విసిరి తన ఉపన్యాసం ప్రారంభించాలి.

ప్రశ్న 11.
ఊతపదం అంటే ఏమిటి? వీటిని ఎందుకు అదుపులో పెట్టాలి?
జవాబు:
ఊతము అంటే ఆధారము.. ఊతపదం అంటే తనకు ఆధారమైన పదం. కొందరికి ఊతపదాలు తరచుగా పడుతూంటాయి. అంటే ఒకే పదం మాట్లాడేటప్పుడు పదే పదే పడుతుంటాయి. ఈ విషయంలో వక్త జాగ్రత్తపడాలి. ఉదాహరణకు “నన్నేమో ఈ సభకు కార్యదర్శి పిలవడానికి వచ్చాడన్నమాట. అపుడు నేను వేరే పనుల వత్తిడి వలన వెంటనే ఒప్పు కోలేదన్నమాట” అంటూ ప్రారంభిస్తారు. “అన్నమాట” అంటూ శ్రోతలు కూడా ఊతం ఇస్తారు. మరికొన్ని ఊతపదాలు “ఇన్నింటికీ నేను చెప్పదల్చుకునేదేమంటే” – “అంచేత” “అసలు విషయం” లాంటి ఊతపదాల అలవాటును అదుపులో పెట్టుకోవాలి.

ఆ) ఈ క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
ఉపన్యాస ఉపసంహారం ఎలా ఉండాలి?
జవాబు:
ఉపసంహారం ప్రతిభావంతంగా ఉండాలి. తనకు కేటాయించిన సమయం పూర్తవుతుంటే ప్రసంగం ముగించాలి. శ్రోతల, ప్రవర్తనను బట్టి అవసరమైతే తక్కువ సమయంలోనే ఉపన్యాసం ముగించాలి. ఉపన్యాసం ముగిసిందనే అభిప్రాయం శ్రోతలకు కలిగినపుడు మరో అంశంలోకి వెళ్లకూడదు. చెప్పేదానిని సాగదీయకూడదు. ఇష్టం లేకపోయినా ఉపన్యాసం ముగించాలి. మైకాసురుడు, మైకోమానియాగాడు అనే బిరుదులను ప్రేక్షకులు ఇవ్వకముందే ఉపన్యాసం ముగించాలి. శ్రోతల ఆసక్తి స్థాయి పడిపోకముందే ఉపన్యాసం ముగించాలి. ఉదాహరణలు క్లుప్తంగా చెప్పాలి. అతిశయోక్తులు లేకుండా చూసుకోవాలి. శ్రోతల స్థాయిని బట్టి, పరిస్థితిని బట్టి ఉపన్యాసం ముగించాలి.

ప్రశ్న 2.
ఉపన్యాసంలో విషయ ప్రతిపాదన ఎలా ఉండాలి?
జవాబు:
ఉపన్యాసంలో విషయ ప్రతిపాదన సూటిగా ఉండాలి. మాటతీరు స్పష్టంగా ఉండాలి. తెచ్చిపెట్టుకొన్నట్లు ఉండకూడదు. విషయం క్లిష్టంగా ఉంటే చమత్కారాలతో, సామెతలతో, కథలతో, ఉదాహరణలతో, సూక్తులతో విషయాన్ని అర్థమయ్యేలా తేటతెల్లం చేయాలి. ఏదైనా పద్యమో, కవితో చెబితే రచయిత గురించి కూడా చెబితే బాగుంటుంది. సరిగ్గా తెలియకపోతే రచయిత పేరు ప్రస్తావించకూడదు.

వక్త ఎప్పుడూ తన గురించి తాను చెప్పుకోకూడదు. వేదిక మీద ఉన్న ఏ వ్యక్తి గురించి అనవసరంగా మాట్లాడకూడదు. అతిగా పొగడకూడదు. అంశాలన్నీ ఒక క్రమపద్ధతిలో చెప్పాలి. ప్రశంసాపూర్వకంగా శ్రోతలు చప్పట్లు కొడితే చిరునవ్వుతో స్వీకరించాలి. సాధారణంగా ఇతరులు చెప్పిన విషయాలను ఖండించకపోవడమే మంచిది.

AP 10th Class Telugu 4th Lesson Important Questions ఉపన్యాస కళ

ఇ) కింది అంశాల గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.

ప్రశ్న 1.
ఒక వక్త చెప్పిన అంశాలు నీకు బాగా నచ్చితే, ఆ అంశాల గురించి మీ మిత్రునకు లేఖ వ్రాయండి.
జవాబు:

కడవ
X X X X X,

ప్రియమైన రఘుకు,
నీ స్నేహితుడు వెంకటేశ్ వ్రాయు లేఖ.
ఇక్కడ మేమంతా క్షేమం. అక్కడ మీరంతా క్షేమమని తలచెదను.
నేను, నిన్న మా ఇంటి దగ్గర ఆడిటోరియంలో ప్రసాద్ గారి ఉపన్యాసం విన్నాను. ఆయన ఒక్కసారిగా చాలా పద్యాలు సొంతంగా చెబుతారని మా నాన్నగారు చెప్పారు. ఆయన శిష్యులు కూడా అలా చెప్పేస్తారుట.
గురువుల గురించి చెప్పారు. కౌరవ, పాండవుల గురువు ద్రోణాచార్యుడని చెప్పారు. ద్రోణుడు గురుదక్షిణగా ద్రుపదుని బంధించి తెమ్మన్నాడు. అర్జునుడు తెచ్చాడు అని చెప్పారు.
అలాగే కృష్ణుడు, సాందీపుని దగ్గర చదువుకొన్నాడు. గురుదక్షిణగా ఆయన తన బిడ్డను బతికించమన్నాడుట. అందుచేత కృష్ణుడు యుద్ధం ఆపడానికి ప్రయత్నించాడుట.
గురువులు శిష్యుల పట్ల చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలని చెప్పారు. మధ్యమధ్యలో మంచి మంచి జోక్స్ కూడా చెప్పారు. సుమారు 3 గంటల సేపు చెప్పారు. ఉపన్యాసం అప్పుడే అయిపోయిందా ? అనుకొన్నాం.
నువ్వు కూడా పండితుల ఉపన్యాసాలకు వెళ్లు.
ఉంటాను మరి.

ఇట్లు,
నీ మిత్రుడు,
కె. వెంకటేష్.

చిరునామా :
పి. రఘు,
S/o. వెంకటరావు గారు, టైలర్,
పి.ఆర్.జి. డిగ్రీ కళాశాల ప్రక్కన,
తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా.

 

ప్రశ్న 2.
మీ పాఠశాలకు ఉపన్యాసం ఇవ్వడానికి వచ్చిన వారిని ఇంటర్వ్యూ చేయడానికి ప్రశ్నావళి తయారుచేయండి.
జవాబు:

  1. నమస్కారమండీ! తమరి పేరును ఒకసారి మా విద్యార్థులకు చెబుతారా?
  2. మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఉపన్యాసాలు ఇస్తున్నారు?
  3. మాకు వేదిక మీద మాట్లాడాలంటే భయం. మరి మీకు భయం ఉండదా?
  4. మీకు ఉపన్యాసాలు చెప్పాలనే కోరిక ఎలా కలిగింది?
  5. మీ ఉపన్యాసాలు విని మంచిగా మారిన వారెవరైనా ఉన్నారా?
  6. ఉపన్యాసం చెప్పడానికి ముందు మీరెలా ప్రిపేరవుతారు?
  7. మీరు మొదటి ఉపన్యాసం ఎక్కడ చెప్పారు?
  8. మీరు మొదటి ఉపన్యాసం ఏ విషయం మీద చెప్పారు?
  9. మీకు అన్ని విషయాలెలా గుర్తుంటాయి?
  10. బాగా మాట్లాడాలంటే ఎలాగో మా విద్యార్థులకు చెబుతారా?
  11. మాకు మీరిచ్చే సందేశం ఏమిటి?

ప్రశ్న 3.
ఒక ఉపన్యాసం విన్న ఇద్దరు విద్యార్థుల సంభాషణ వ్రాయండి.
జవాబు:
రవి : నిన్న ఉపన్యాసం బాగుంది కదా!
కవి : ఔనురా! నేనూ అదే చెబుదాం అనుకొంటున్నా!
రవి : ఆయన అన్ని విషయాలెలా గుర్తుపెట్టుకొన్నాడో?
కవి : అది కాదురా! ఎన్ని పద్యాలు చెప్పేశాడో!
రవి : మనం రెండు పద్యాలే చదవలేం కదా!
కవి : మధ్యలో భలే జోక్స్ చెప్పారురా!
రవి : జుట్టు ఊడకుండా ఉండాలంటే! ఏమన్నాడు?
కవి : గుండు కొట్టించుకోమన్నాడు.
రవి : భారతం, రామాయణం, భాగవతం అన్నిటిలో పద్యాలు, కథలు, ధర్మాలు, న్యాయాలు అన్నీ చెప్పేస్తున్నాడు.
కవి : నిజంగా అలాంటి పండితునికి చేతులెత్తి నమస్కరించాలిరా!
రవి : నిజమేరా! నిజంగానే ఆయన సరస్వతీ పుత్రుడు.
కవి : మళ్లీ ఎప్పుడైనా ఉపన్యాసం ఉంటే చెప్పరా!
రవి : తప్పకుండా చెబుతా! వెడదాం. బై.
కవి : ఓ.కే. బై.

భాషాంశాలు (పదజాలం వ్యాకరణాంశాలు)

కింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి.

అర్థాలు

అ) గీత గీసిన పదానికి అర్థం రాయండి.

1. ఎంత శక్తి ఉన్నా అందరితో గొడవ పెట్టుకోకూడదు.
జవాబు:
బలం

2. దుర్వ్యసనాలు ఉన్నవారు సర్వస్వం కోల్పోతారు.
జవాబు:
అన్నీ

3. అనవసరంగా విచారించడం మంచిది కాదు.
జవాబు:
బాధపడడం

4. మన వాక్కు మంచిదైతే హక్కులు వస్తాయి.
జవాబు:
మాట

5. రామునికి మహత్తరమైన శక్తి ఉంది.
జవాబు:
గొప్పదైన

6. గొప్పవారికి కోరకుండానే ఉత్కృష్ట స్థానం లభిస్తుంది.
జవాబు:
ఉన్నత

7. అందరికీ అన్నిటిలో ప్రావీణ్యత ఉండదు.
జవాబు:
నైపుణ్యం

8. వక్తృత్వం అనేది ఒక కళ.
జవాబు:
ఉపన్యసించడం

9. కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు.
జవాబు:
ప్రయత్నం

10. అనవసరమైన ఉబలాటం అనర్ధాలకు దారితీస్తుంది.
జవాబు:
ఆత్రుత

11. తాము గొప్పవాళ్లమనే భ్రమలో కొందరు బతుకుతారు.
జవాబు:
భ్రాంతి

12. ఎవ్వరికీ చులకన కాకూడదు.
జవాబు:
లోకువ

13. సభలో ఆశీనులు అందరూ సామాన్యులు కారు.
జవాబు:
కూర్చొన్నవారు

14. ప్రేక్షకులు ఆనందించేలా ఉపన్యసించాలి.
జవాబు:
చూసేవారు

15. మంచి సన్నిహితులు మన మేలు కోరతారు.
జవాబు:
స్నేహితులు

16. తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు.
జవాబు:
దిశ

17. అందరితో మర్యాదగా ప్రవర్తించాలి.
జవాబు:
గౌరవం

18. ఎవరి పనులకు భంగం కల్గించకూడదు.
జవాబు:
ఆటంకం

19. తిన్నగా వెడితే గుడి వస్తుంది.
జవాబు:
నిదానంగా

20. ప్రతి అంశం అధ్యయనం చేయాలి.
జవాబు:
విషయం

AP 10th Class Telugu 4th Lesson Important Questions ఉపన్యాస కళ

ఆ) గీత గీసిన పదానికి సరియైన అర్థాన్ని గుర్తించండి.

21. కోడి రామ్మూర్తి పెద్ద వస్తాడు.
అ) వీరుడు
ఆ) రాజు
ఇ) అధికారి
ఈ) మల్లయోధుడు
జవాబు:
ఈ) మల్లయోధుడు

22. కొమ్మలు కాయల బరువుతో వంగాయి.
అ) భారం
ఆ) సంఖ్య
ఇ) సైజు
ఈ) సైజు, సంఖ్య
జవాబు:
అ) భారం

23. ఒక క్షణంలో ప్రమాదం జరగవచ్చు.
అ) గంట
ఆ) రోజు
ఇ) సెకను
ఈ) మలుపు
జవాబు:
ఇ) సెకను

24. ఎంత చప్పుడు చేసినా సింహం భయపడదు.
అ) గొడవ
ఆ) శబ్దం
ఇ) సంభాషణ
ఈ) యుద్ధం
జవాబు:
అ) గొడవ

25. పాము రావడంతో వేదిక వద్ద కలకలం మొదలయింది.
అ) అలజడి
ఆ) ఆశ్రుత
ఇ) వినికిడి
ఈ) జరజర
జవాబు:
అ) అలజడి

26. వక్తల మీద ప్రేక్షకుల దృష్టి ఉంటుంది.
అ) కోసం
ఆ) అభిమానం
ఇ) చూపు
ఈ) ప్రేమ
జవాబు:
ఇ) చూపు

27. ఎప్పుడూ వదనంలో చిరునవ్వు ఉండాలి.
అ) నాలుక
ఆ) ముఖం
ఇ) తల
ఈ) అందం
జవాబు:
ఆ) ముఖం

28. అందరికీ పేరు పేరునా నమస్కరించనవసరం లేదు.
అ) ఇంటి పేరు
ఆ) ఊరు
ఇ) వీధి
ఈ) నామం
జవాబు:
ఈ) నామం

29. అతి ఎక్కడా పనికిరాదు.
అ) ఎక్కువ
ఆ) తక్కువ
ఇ) కొత
ఈ) అంత
జవాబు:
అ) ఎక్కువ

30. ఎవరి సంగతి ఎవరికి తెలుసు?
అ) ధనం
ఆ) విషయం
ఇ) ఆస్తి
ఈ) రహస్యం
జవాబు:
ఆ) విషయం

పర్యాయపదాలు

అ) గీత గీసిన పదానికి పర్యాయపదాలు రాయండి.

31. కర్రతో జంతువులను తోలుతారు.
జవాబు:
కొయ్య, పుల్ల, కోల

32. కలతల వలన దూరం పెరుగుతుంది.
జవాబు:
దవ్వు, కెళవు మేర

33. ధర్మము చివరకు విజయము సాధిస్తుంది.
జవాబు:
తుద, కొన

34. ఉపకారం చేయడానికే మన చేతులు ఉన్నాయి..
జవాబు:
కరములు, హస్తములు

35. శక్తికి మించిన బరువు ఎత్తకూడదు.
జవాబు:
భారము, బారకము, మోపు

36. మంచిని వదలక చేయాలి.
జవాబు:
విడువక, వీడక

37. కొందరు వింతగా ప్రవర్తిస్తారు.
జవాబు:
విచిత్రము, చిత్రము, చోద్యము

38. చప్పుడు చేయడం వలన ఇబ్బంది పడతారు.
జవాబు:
ధ్వని, శబ్దము

39. శ్రోత మంచిని గ్రహించాలి.
జవాబు:
వినువాడు, శ్రవణుడు.

40. సన్నిహితులు మేలు కోరతారు.
జవాబు:
స్నేహితులు, మిత్రులు

41. అవయవాలలో తల శ్రేష్ఠమైనది.
జవాబు:
శిరసు, శీరము, మస్తకము

42. ఆసక్తి లేని పని చేయలేము.
జవాబు:
ఇష్టము, అపేక్ష, అశ

43. ఎవరి పనికి భంగం కలిగించకూడదు.
జవాబు:
ఆటంకం, అడ్డం, ఆతంకం

44. కాలు ఊపడం గౌరవం కాదు.
జవాబు:
అంఘ్ర, పాదము, పదము

45. కొందరు వస్తాదులా ఊహించుకుంటారు.
జవాబు:
ఉస్తాడు, మల్లు, మాసటి

46. వదనంలో చిరునవ్వు ఉండాలి.
జవాబు:
ముఖము, మొగము

47. వేదిక మీద పెద్దలు ఉంటారు.
జవాబు:
వేది, అరుగు, తిన్నె

48. ఎవరికీ ఏ అపోహ కల్గించకూడదు.
జవాబు:
భ్రమ, అనుమానం, ఊహ

49. మొరటుగా ప్రవర్తించకూడదు.
జవాబు:
మూర్ఖత్వం, కఠినత్వం

50. అన్నీ మనకు అనుకూలంగా ఉండవు.
జవాబు:
అనువు, తగిన

AP 10th Class Telugu 4th Lesson Important Questions ఉపన్యాస కళ

ఆ) గీత గీసిన పదానికి సరియైన పర్యాయపదాలు గుర్తించండి.

51. తెలుగు నేర్చుకొంటే సరళంగా ఉంటుంది.
అ) తేలిక, సులువు
ఆ) బరువు, కఠినం
ఇ) చులకన, లోకువ
ఈ) లోకువ, అణకువ
జవాబు:
అ) తేలిక, సులువు

52. పండితుడు గౌరవార్హుడు.
అ) జ్ఞాని, ఉపాధ్యాయుడు
ఆ) ఒజ్జ, గురువు
ఇ) విద్వాంసుడు, బుధుడు
ఈ) గురుడు, గురువు
జవాబు:
ఇ) విద్వాంసుడు, బుధుడు

53. ప్రసవించడం అంటే ప్రాణాలతో చెలగాటం.
అ) కను, ప్రసవించు
అ) పుట్టు, జన్మించు
ఇ) జననం, పుట్టుక
ఈ) కను, కన్ను
జవాబు:
అ) కను, ప్రసవించు

54. సంఘం నుండి బహిష్కరించడం నేరం.
అ) వెలితి, లోటు
ఇ) గెంటు, కంటు
ఆ) కలత, గొడవ
ఈ) గెంటడం, వెలివేయడం
జవాబు:
ఈ) గెంటడం, వెలివేయడం

55. కొందరు అనర్గళంగా ఉపన్యసిస్తున్నారు.
అ) అర్గళం, గళం
ఆ) ధారాళం, అడ్డులేని
ఇ) ధార, తీరు
ఈ) ఏకధార, ఒక్కటే
జవాబు:
ఆ) ధారాళం, అడ్డులేని

56. మంచివారి వినియోగం సమాజానికి అవసరం.
అ) ఉపయోగం, అపయోగం
ఆ) ప్రయోగం, యోగం
ఇ) ఉపయోగం, ప్రయోజనం
ఈ) యోగం, యుగం
జవాబు:
ఇ) ఉపయోగం, ప్రయోజనం

57. మంచి సమయం చూసి పని ప్రారంభించాలి.
అ) టైము, రైము
ఆ) కాలం, కాయం
ఇ) ప్రజ్ఞ, ప్రతిజ్ఞ
ఈ) కాలం, ప్రొద్దు
జవాబు:
ఈ) కాలం, ప్రొద్దు

58. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి.
అ) గృహం, సదనం
ఆ) మేడ, గది
ఇ) మేడ, మిద్దె
ఈ) వరండా, గది
జవాబు:
అ) గృహం, సదనం

59. మంచి ప్రవర్తన కలిగి ఉండాలి.
అ) నడక, నడత
ఆ) నడత, వర్తన
ఇ) మాట, పలుకు
ఈ) పని, మాట
జవాబు:
ఆ) నడత, వర్తన

60. ఉపన్యాసం ముగింపు బాగుండాలి.
అ) సంహారం, సంతు
ఆ) కనుక, అందుకు
ఇ) ఉప సంహారం, అంతం
ఈ) అనంతం, సంతు
జవాబు:
ఇ) ఉప సంహారం, అంతం

ప్రకృతి వికృతులు

అ) గీత గీసిన పదానికి సరియైన ప్రకృతి పదం రాయండి.

61. దక్షిణ దెస యమస్థానం.
జవాబు:
దిక్కు

62. అందరితో మరియాదగా ప్రవర్తించాలి.
జవాబు:
మర్యాద

63. మన బరువు ఇతరులపై మోపకూడదు.
జవాబు:
భారము

64. పట్టుదల ఉంటే కర్జము నెరవేరుతుంది.
జవాబు:
కార్యము

65. మాటని బట్టి గారవము పెరుగుతుంది.
జవాబు:
గౌరవము

66. పెద్దల మాట చద్దిమూట.
జవాబు:
వృద్ధు

67. నన్నయ్య మొదటి కయి.
జవాబు:
కవి

68. అంచ అందమైన పక్షి.
జవాబు:
హంస

69. ఆసత్తి గల వృత్తినే చేపట్టాలి.
జవాబు:
ఆసక్తి

70. ఇంతి ఎంతైనా సాధిస్తుంది.
జవాబు:
స్త్రీ

AP 10th Class Telugu 4th Lesson Important Questions ఉపన్యాస కళ

ఆ) గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.

71. శబ్దం చేయవద్దు.
అ) సద్దు
ఆ) చది
ఇ) శపథం
ఈ శదం
జవాబు:
అ) సద్దు

72. యత్నంలో లోపం ఉండకూడదు.
అ) యతనం
ఆ) జత్న
ఇ) జతనం
ఈ) జత
జవాబు:
ఇ) జతనం

73. ప్రజ నిర్ణయమే గొప్పది.
అ) జనం
ఆ) పజ
ఇ) పజ్జ
ఈ) పంజ
జవాబు:
ఆ) పజ

74. పిల్లల నవ్వు నిష్కల్మషంగా ఉంటుంది.
అ) హాసం
ఆ) దరహాసం
ఇ) హాసన
ఈ) నగవు
జవాబు:
అ) హాసం

75. మంచి దృష్టి ఉండాలి.
అ) దిష్టి
ఆ) ద్రుష్టి
ఇ) దీపి
ఈ) చేష్ట
జవాబు:
అ) దిష్టి

నానార్థాలు

అ) గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి.

76. ఈ ప్రపంచంలో మా ప్రపంచం చిన్నది.
జవాబు:
భూలోకం, సంసారం

77. కొందరి గొంతులో అమృతం ఉన్నట్లు గొంతు బాగుంటుంది.
జవాబు:
కంఠం, కంఠధ్వని

78. ప్రతిభ లో చదివితే ప్రతిభ వికసిస్తుంది.
జవాబు:
కాంతి, బుద్ధి

79. గుర్తుపెట్టుకొనే లక్షణం ఉంటే లక్షణం తొందరగా వస్తుంది.
జవాబు:
స్వభావం, వ్యాకరణం

80. వస్తువు ధర చౌక కదా అని చౌకగా చూడకూడదు.
జవాబు:
తక్కువ, తేలిక

81. అచ్చంగా ఉన్నా దుప్పటి అచ్ఛంగా ఉంది.
జవాబు:
దట్టం, నిర్మలం

82. వడ్డీకి అశిస్తే సలు కూడా అసలులో కలుస్తుంది.
జవాబు:
మూలధనం, బురద

83. నకిలీగా ప్రవర్తిస్తే నకిలీ గౌరవం దొరుకుతుంది.
జవాబు:
వెకిలి, నాసిరకం

84. కొందరు దేవుని అతిని అతిగా చేస్తారు.
జవాబు:
పూజ, అధికం

85. వేదిక వేదిక మీద కూర్చుంది.
జవాబు:
ధర్మరాజు భార్య, తిన్నె

86. దృష్టి బాగుంటే దృష్టి బాగుంటుంది.
జవాబు:
కన్ను, చూపు

87. కన్ను విరిగిపోవటం నా కన్నుతో చూసాను.
జవాబు:
బండి చక్రం, నేత్ర

88. మంచి ప్రవర్తన మంచి ప్రవర్తనను సృష్టిస్తుంది.
జవాబు:
నడత, ఆచారం

89. పిల్లల బరువు భరించటం బరువు.
జవాబు:
భారము, ఆవశ్యకము

90. మంచి ప్రారంభము మన ప్రారంభమును నెరవేరుస్తుంది.
జవాబు:
ఆరంభము, ప్రయత్నము.

AP 10th Class Telugu 4th Lesson Important Questions ఉపన్యాస కళ

ఆ) గీత గీసిన పదానికి సరైన నానార్థాలు గుర్తించండి.

91. నా పద్య పాదాలు సరస్వతి పాదాలు.
అ) పదాలు, శబ్దాలు
అ) అడుగులు, అక్షరాలు
ఇ) చరణాలు, కాళ్ళు
ఈ) కాళ్ళు, వేళ్ళు
జవాబు:
ఇ) చరణాలు, కాళ్ళు

92. గౌరవము ఉపసంహారము కాకుండానే ఉపన్యాసం ఉపసంహారం చేయాలి.
అ) నాశనము, ముగించుట
ఆ) మొదలు, తుద
ఇ) చివర, చిట్ట చివర
ఈ) నాశనము, ధ్వంసము
జవాబు:
అ) నాశనము, ముగించుట

93. పేరును బట్టి పేరు రాదు.
అ) నామము, నామధేయము
ఆ) కీర్తి, ఖ్యాతి
ఇ) ఆనందం, సంతోషం
ఈ) నామము, కీర్తి
జవాబు:
ఈ) నామము, కీర్తి

94. తల నుండి పడితే తల పగులుతుంది.
అ) కొండ, శిరస్సు
ఆ) మేద, మస్తకం
ఇ) ఎత్తు, శిరస్సు
ఈ) చెట్టు, తల
జవాబు:
ఇ) ఎత్తు, శిరస్సు

95. కవి మంచి కవి.
అ) వాల్మీకి, కవిత్వము చెప్పువాడు.
ఆ) ఉపాధ్యాయుడు, గురువు
ఇ) బృహస్పతి, శుక్రుడు
ఈ) రవి, శశి
జవాబు:
అ) వాల్మీకి, కవిత్వము చెప్పువాడు

96. పెద్దలు అందరూ పెద్దలు కాదు.
అ) గురువు, ఉపాధ్యాయులు
ఆ) వృద్ధులు, గొప్పవారు.
ఇ) తండ్రి, తాత
ఈ) అధ్యక్షుడు, ఉపన్యాసకుడు
జవాబు:
ఆ) వృద్ధులు, గొప్పవారు

97. ఆమె స్వరము చదివే స్వరము బాగుంది.
అ) పాట, గొంతు
ఆ) అకారాదులు (అచ్చులు), కంఠధ్వని
ఇ) పద్యం, రాగం
ఈ) రాగం, తాళం
జవాబు:
ఆ) అకారాదులు (అచ్చులు), కంఠధ్వని

98. సరళం సరళంగా పలకాలి.
అ) అక్షరం తేలిక
ఆ) అచ్చు తేలిక
ఇ) గజడదబలలో ఒకటి, తేలిక
ఈ) కచటతపలలో ఒకటి, తేలిక
జవాబు:
ఇ) గజడదబలలో ఒకటి, తేలిక

వ్యుత్పత్త్యర్థాలు

అ) గీత గీసిన పదానికి వ్యుత్పత్యర్థం రాయండి.

99. హాస్యం చాలామంది మెచ్చుకొంటారు.
జవాబు:
జనులను నవ్వించునది (హాస్యరసం)

100. వర్తనం మంచిది కావాలి.
జవాబు:
దీనిచేత వర్తింతురు (ప్రవర్తన)

101. పాటకు స్వరం అందం.
జవాబు:
తనంతట తానే ప్రకాశించేది (స్వరం)

102. ప్రసవం కాగానే తల్లి ఆనందించింది.
జవాబు:
కనుట (పురుడు)

103. శిష్యుని ఉత్కర్ష గురువుకు ఆనందం.
జవాబు:
ఉన్నతంగా పొందించుట (దొడ్డతనం)

104. గురువుపై కృతజ్ఞత చూపాలి.
జవాబు:
చేసిన మేలు గుర్తు పెట్టుకోవడం. (కృతజ్ఞత)

105. ప్రసన్న వదనులై ఉండాలి.
జవాబు:
ప్రకృష్టముగా మనసును పొందునది. (నిర్మలం)

106. ఏకాగ్రతతో చదివితే ఏదైనా వస్తుంది.
జవాబు:
ఎరుకదగిన వస్తువు (ఏకాయనం)

AP 10th Class Telugu 4th Lesson Important Questions ఉపన్యాస కళ

ఆ) గీత గీసిన పదానికి సరైన వృత్పత్తరాన్ని గుర్తించండి.

107. జవాబు కంటే ప్రశ్న కష్టం.
అ) అడగటం (ప్రశ్న)
ఆ) చెప్పడం (ప్రశ్న)
ఇ) ఎరుగగోరి అడుగుట (పృచ్ఛ)
ఈ) సమాధానం రాబట్టుట (ప్రశ్న)
జవాబు:
ఇ) ఎరుగగోరి అడుగుట (పృచ్ఛ)

108. శక్తి కలవాడు గొప్పవాడు కాదు.
అ) దీనిచేత శక్తుడగును (బలిమి)
ఆ) దీనిచేత పౌరుషం పెరుగును (బలం)
ఇ) దీనిచేత గౌరవం పెరుగును (దిటవు)
ఈ) దీనిచేత ధనం పెరుగును (దృఢము)
జవాబు:
అ) దీనిచేత శక్తుడగును (బలిమి)

జాతీయాన్ని గుర్తించడం

వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి విడిగా రాయండి.

109. గురువు ఆదేశాలను సుగ్రీవాజ్ఞగా భావించాలి.
జవాబు:
సుగ్రీవాజ్ఞ

110. పంటల దిగుబడి తగ్గినందున రైతుల గుండెలు బరు వెక్కాయి.
జవాబు:
గుండెలు బరువెక్కుట

111. పెద్దల ఆశీస్సులే మనకు శ్రీరామరక్ష.
జవాబు:
శ్రీరామరక్ష

112. ప్రతి జీవి కాలధర్మం చెందాల్సిందే.
జవాబు:
కాలధర్మం

113. దురలవాట్లు కబంధ హస్తాల వంటివి.
జవాబు:
కబంధ హస్తాలు

114. వలస కూలీలు పనులు దొరకక బాధపడుతూ కడుపులు మార్చుకొంటున్నారు.
జవాబు:
కడుపులు మాడ్చుకొను

జాతీయము – సందర్భము

ఈ జాతీయాన్ని ఏ అర్థంలో/ సందర్భంలో ఉపయో గిస్తారో రాయండి.

115. చెవినిల్లు కట్టుకుని పోరుట
జవాబు:
ఒకే విషయాన్ని పదే పదే చెప్పిన సందర్భంలో “చెవినిల్లు కట్టుకుని పోరు” అనే జాతీయం ఉపయోగిస్తారు.

116. నిమ్మకు నీరెత్తినట్లు
జవాబు:
ఏమి జరిగినా; ఎంత కష్టమొచ్చినా ఆదుర్దా పడకుండా స్థిమితంగా ఉండే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

117. పురిట్లో సంధి కొట్టడం.
జవాబు:
పురుడు వచ్చి బిడ్డ పుట్టగానే సంధిరోగం రావడం అనగా పని ప్రారంభించగానే విఘ్నం కలగడం అనే సందర్భంలో దీన్ని ఉపయోగిస్తారు.

118. దిగాలు పడిపోవు.
జవాబు:
నిరుత్సాహపడు అనే సందర్భంలో దీన్ని ఉపయోగిస్తారు.

119. ఉన్నదంతా ఊడ్చుకుపోవడం
జవాబు:
పూర్తిగా నష్టం కలిగిందని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

120. చిరకాల రక్ష
జవాబు:
ఎల్లప్పుడూ వెంట ఉండి కాపాడేది అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

121. కాలధర్మం చెందడం
జవాబు:
మరణించడం అనే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.

AP 10th Class Telugu 4th Lesson Important Questions ఉపన్యాస కళ

122. మంచినీళ్ళ ప్రాయం
జవాబు:
ధారాళంగా ఖర్చు చేసే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

సంధి పదాలను విడదీయడం

గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి.

123. సమాధానాలు తప్పులు లేకుండా వ్రాయాలి.
జవాబు:
సమాధానము + లు

124. లోపాలు లేని మనిషి ఉండడు.
జవాబు:
లోపము + లు

125. భయానికి గురై మరణించాడు.
జవాబు:
గురి + ఐ

126. సాధ్యమైనంత వరకు తప్పు చేయకూడదు.
జవాబు:
సాధ్యము + ఐనంత

127. రోజూ ఐనంత పనిచేయాలి.
జవాబు:
ఐన + అంత

128. మంచి మాట్లాడుతున్న వారిని ప్రోత్సహించాలి.
జవాబు:
మాట్లాడుతు + ఉన్న

129. చెప్పాలనుకున్నది భయపడకుండా చెప్పాలి.
జవాబు:
చెప్పాలి + అనుకున్నది.

130. పుస్తకంలోని అంశాలు అన్నీ చదవాలి.
జవాబు:
అంశము + లు

సంధి పదాలను కలవడం

సంధి పదాలను కలిపి రాయండి.

131. రాణించాలి + అనుకుంటే
జవాబు:
రాణించాలనుకుంటే

132. అమ్మ + అయ్య
జవాబు:
అమ్మయ్య

133. గట్టు + ఎక్కాను
జవాబు:
గట్టెక్కాను

134. ఉంటున్న + అట్లు
జవాబు:
ఉంటున్నట్లు

135. వారు + ఎందరు
జవాబు:
వారెందరు

136. ఉన్నారు + అనే
జవాబు:
ఉన్నారనే

137. మొదలు + ఐనవి
జవాబు:
మొదలైనవి.

138. అనన్ + పోయి
జవాబు:
అనఁబోయి

139. పండితుడు + ఐనా
జవాబు:
పండితుడైనా

AP 10th Class Telugu 4th Lesson Important Questions ఉపన్యాస కళ

140. వినాలి + అని
జవాబు:
వినాలని

సంధి నామాలు

గీత గీసిన పదం ఏ సంధికి చెందినదో గుర్తించండి.

141. నువ్వు అనేది ఏమంటే ఏం చెప్పను?
అ) అత్వసంధి
ఆ) ఉత్వసంధి
ఇ) ఇత్వసంధి
ఈ) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
ఇ) ఇత్వసంధి

142. మంచి పదాలు వ్రాయాలి.
అ) సవర్ణదీర్ఘ సంధి
ఆ) లు,ల,న,ల సంధి
ఇ) ఇత్వసంధి
ఈ) అత్వసంధి
జవాబు:
ఆ) లు,ల,న,ల సంధి

143. తెలియనిది లేదన్న పద్ధతి మంచిది కాదు.
అ) ఉత్వసంధి
ఆ) అత్వసంధి
ఇ) ఇత్వసంధి
ఈ) గుణసంధి
జవాబు:
అ) ఉత్వసంధి

144. అనవసరంగా అతిశయోక్తులు ప్రయోగించకూడదు.
అ) సవర్ణదీర్ఘ సంధి
ఆ) అత్వసంధి
ఇ) ఉత్వసంధి
ఈ) గుణసంధి
జవాబు:
ఈ) గుణసంధి

145. తెలివి ఉన్నపుడు వినియోగించుకోవాలి.
అ) అత్వసంధి
అ) ఇత్వసంధి
ఇ) ఉత్వసంధి
ఈ) సరళాదేశ సంధి
జవాబు:
అ) అత్వసంధి

146. నాటకం రసాభాస అయింది.
అ) గుణసంధి
ఆ) సవర్ణదీర్ఘ సంధి
ఇ) అత్వసంధి
ఈ) ఉత్వసంధి
జవాబు:
ఆ) సవర్ణదీర్ఘ సంధి

147. నీవు అనేదేమి?
అ) అత్వసంధి
ఆ) ఇత్వసంధి
ఇ) ఉత్వసంధి
ఈ) లు,ల,న,ల సంధి
జవాబు:
ఆ) ఇత్వసంధి

148. నన్నేమో నువ్వనవచ్చా?
అ) అత్వసంధి
ఆ) ఇత్వసంధి
ఇ) గుణసంధి
ఈ) ఉత్వసంధి
జవాబు:
ఈ) ఉత్వసంధి

149. టి.వి. లో ఉపన్యాసాలు బాగున్నాయి.
అ) అత్వసంధి
ఆ) ఉత్వసంధి
ఇ) లు,ల,న,ల సంధి
ఈ) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
ఇ) లు,ల,న,ల సంధి

150. అయినంత చదువూ చదవాలి.
అ) అత్వసంధి
ఆ) ఇత్వసంధి
ఇ) ఉత్వసంధి
ఈ) ఆమ్రేడిత సంధి
జవాబు:
అ) అత్వసంధి

విగ్రహవాక్యాలు

గీత గీసిన పదానికి విగ్రహవాక్యం రాయండి.

151. మంచివక్త అందరి మెప్పు పొందుతాడు.
జవాబు:
మంచి(వాడు) ఐన వక్త

152. కాగితం పువ్వు ఎప్పటికీ సహజ పుష్పానికి సాటిరాదు.
జవాబు:
కాగితంతో పువ్వు

153. మల్లెలు సుగంధం వెదజల్లుతున్నాయి.
జవాబు:
మంచిదైన గంధం

154. సభాకంపం తగ్గించుకోవాలి.
జవాబు:
సభను (చూసి) కంపం

155. మానవుడు శబ్దశక్తిని గ్రహించాలి.
జవాబు:
శబ్దం యొక్క శక్తి

156. మొదటి వేదిక మధురానుభూతినిస్తుంది.
జవాబు:
మొదటిదైన వేదిక

157. సభ ప్రారంభం అయ్యింది.
జవాబు:
గొప్పదైన ఆరంభం

158. అధ్యక్షునికి సభలో ప్రత్యేకస్థానం ఉంటుంది.
జవాబు:
ప్రత్యేకమైన స్థానం

159. వక్తను వెయ్యి కళ్లు గమనిస్తాయి.
జవాబు:
వెయ్యి సంఖ్య గల కళ్లు

160. శ్రోతల దృష్టిలో వక్త గొప్పవాడు.
జవాబు:
శ్రోతల యొక్క దృష్టి

161. కొంచెం తికమక కు కంగారు పడకూడదు.
జవాబు:
కొంచెం అయిన తికమక

162. వక్త వ్యక్తిత్వం శ్రోతలు పసిగడతారు.
జవాబు:
వక్త యొక్క వ్యక్తిత్వం

163. సమయ సందర్భాలు తెలుసుకొని మాట్లాడాలి.
జవాబు:
సమయమును, సందర్భమును

164. పరిస్థితులు అనుకూలం అతే సాధించవచ్చు.
జవాబు:
కూలముననుసరించి

AP 10th Class Telugu 4th Lesson Important Questions ఉపన్యాస కళ

165. సాదాదుస్తులు కూడా చాలా బాగుంటాయి.
జవాబు:
సాదా అయిన దుస్తులు

సమాస నామాలు

గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.

166. పడకకుర్చీ వృద్ధులకు బాగుంటుంది.
అ) చతుర్థీ తత్పురుష
ఆ) ద్వితీయా తత్పురుష
ఇ) తృతీయా తత్పురుష
ఈ) బహువ్రీహి
జవాబు:
అ) చతుర్థీ తత్పురుష

167. రెండు పాదాలు శుభ్రంగా కడుక్కోవాలి.
అ) ద్వంద్వం
ఆ) ద్విగువు
ఇ) పంచమీ తత్పురుష
ఈ) బహువ్రీహి
జవాబు:
ఆ) ద్విగువు

168. దుష్టులను కొంచెం దూరం పెట్టాలి.
అ) విశేషణ పూర్వపద కర్మధారయం
ఆ) షష్ఠీ తత్పురుష
ఇ) నఞ తత్పురుష
ఈ) విశేషణ ఉత్తరపద కర్మధారయం
జవాబు:
అ) విశేషణ పూర్వపద కర్మధారయం

169. మన రెండు చేతులు మంచికే వినియోగించాలి.
అ) బహువ్రీహి
ఆ) షష్ఠీ తత్పురుష
ఇ) విశేషణ పూర్వపద కర్మధారయం
ఈ) ద్విగు సమాసం
జవాబు:
ఈ) ద్విగు సమాసం

170. ఆ డొంకలో వింత చప్పుళ్లు వస్తున్నాయి.
అ) విశేషణ ఉత్తరపద కర్మధారయం
ఆ) విశేషణ పూర్వపద కర్మధారయం
ఇ) బహువ్రీహి
ఈ) ద్విగువు
జవాబు:
అ) విశేషణ పూర్వపద కర్మధారయం

171. విషయ ప్రతిపాదన కచ్చితంగా ఉండాలి.
అ) ద్వితీయా తత్పురుష
అ) తృతీయా తత్పురుష
ఇ) ప్రథమా తత్పురుష
ఈ) చతుర్థీ తత్పురుష
జవాబు:
అ) ద్వితీయా తత్పురుష

172. వక్త మైకు దగ్గర నిలబడాలి.
అ) ప్రథమా తత్పురుష
ఆ) ద్వితీయా తత్పురుష
ఇ) షష్ఠీ తత్పురుష
ఈ) పంచమీ తత్పురుష
జవాబు:
ఇ) షష్ఠీ తత్పురుష

173. నేత పోతే కొన్ని క్షణాలు మౌనం పాటించాలి.
అ) ప్రథమా తత్పురుష
ఆ) షష్ఠీ తత్పురుష
ఇ) ద్విగు
ఈ) విశేషణ పూర్వపద కర్మధారయం
జవాబు:
ఈ) విశేషణ పూర్వపద కర్మధారయం

174. చిరునవ్వుతో మాట్లాడాలి.
అ) విశేషణ పూర్వపద కర్మధారయం
ఆ) షష్ఠీ తత్పురుష
ఇ) బహువ్రీహి
ఈ) ద్వంద్వం
జవాబు:
అ) విశేషణ పూర్వపద కర్మధారయం

AP 10th Class Telugu 4th Lesson Important Questions ఉపన్యాస కళ

175. ఊత పదాలు గౌరవం తగ్గిస్తాయి.
అ) తృతీయా తత్పురుష
ఆ) పంచమీ తత్పురుష
ఇ) చతుర్థీ తత్పురుష
ఈ) షష్ఠీ తత్పురుష
జవాబు:
ఇ) చతుర్థీ తత్పురుష

ఆధునిక వచనాలు

కింది వాక్యాలకు సరియైన ఆధునిక వచనాన్ని గుర్తించండి.

176. కథలో లోపములు ఉండినవి.
అ) కథ యందు లోపములు ఉన్నాయి.
ఆ) కథను లోపంబులు ఉన్నాయి.
ఇ) కథ యందు లోపమ్ములు ఉన్నాయి.
ఈ) కథలో లోపాలు ఉన్నాయి.
జవాబు:
ఈ) కథలో లోపాలు ఉన్నాయి.

177. నోరంతయును తెరచుట యోగ్యము గాదు.
అ) నోరంతా తెరవడం యోగ్యం కాదు.
ఆ) నోరంతయున్ దెరచుట యోగ్యంబుగాదు.
ఇ) నోరంతయు దెరచుట యోగ్యము కాదు.
ఈ) నోరంతయున్ తెరచుటయు యోగ్యంబుగారు.
జవాబు:
అ) నోరంతా తెరవడం యోగ్యం కాదు.

178. కొన్ని అంశములు పరిహరించవలయు.
అ) కొన్ని అంశంబులు పరిహరించవలె.
అ) కొన్ని అంశమ్ములు పరిహరించవలెన్.
ఇ) కొన్ని అంశాలు పరిహరించాలి.
ఈ) కొన్ని యంశములు పరిహరింపవలయున్.
జవాబు:
ఇ) కొన్ని అంశాలు పరిహరించాలి.

179. ఉపన్యాసము ప్రారంభము బాగుండవలయును.
అ) ఉపన్యాసమ్ము ప్రారంభంబు బాగుండవలెన్.
ఆ) ఉపన్యాసంబు ప్రారంభమ్ము బాగుండవలయు.
ఇ) ఉపన్యాసమున్ ప్రారంబంబున్ బాగుండవలెన్.
ఈ) ఉపన్యాసం ప్రారంభం బాగుండాలి.
జవాబు:
ఈ) ఉపన్యాసం ప్రారంభం బాగుండాలి.

180. మౌనముగా నిలువబడి యుండవలెన్.
అ) మౌనమ్ముగా నిలువంబడి యుండవలె.
ఆ) మౌనంగా నిల్చొని ఉండాలి.
ఇ) మౌనంబుగా నిల్వబడి యుండవలయు.
ఈ) మౌనమ్ముగ నిల్వబడియు నుండవలె.
జవాబు:
ఆ) మౌనంగా నిల్చొని ఉండాలి.

181. ప్రతి విషయమున ధర్మము పాటించవలె.
అ) ప్రతి విషయంబున ధర్మము పాటించవలెన్.
ఆ) ప్రతి విషయంబున ధర్మంబు పాటించవలె.
ఇ) ప్రతి విషయమ్మున ధర్మమ్ము పాటించవలయు.
ఈ) ప్రతి విషయంలో ధర్మం పాటించాలి.
జవాబు:
ఈ) ప్రతి విషయంలో ధర్మం పాటించాలి.

182. ఉపన్యాసము ముగిసియున్నది.
అ) ఉపన్యాసం ముగిసింది.
ఆ) ఉపన్యాసంబు ముగిసినది.
ఇ) ఉపన్యాసమ్ము ముగిసినది.
ఈ) ఉపన్యాసమున్ ముగిసినది.
జవాబు:
అ) ఉపన్యాసం ముగిసింది.

183. ఊతపదములు వదలిపెట్టవలయును.
అ) ఊత పదంబులు వదలి పెట్టవలె.
ఆ) ఊతపదాలు వదలవలెన్.
ఇ) ఊత పదాలు వదలాలి.
ఈ) ఊత పదమ్ములు వదలవలయున్.
జవాబు:
ఇ) ఊత పదాలు వదలాలి.

వ్యతిరేకార్థక వాక్యాలు

ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం రాయండి.

184. మాట్లాడే శక్తిని వదలండి.
జవాబు:
మాట్లాడే శక్తిని వదలకండి.

185. అవి వాక్కు శక్తిని తెలియజేస్తున్నాయి.
జవాబు:
అవి వాక్కు శక్తిని తెలియజేయడం లేదు.

186. అణుయుగంలోకి ప్రవేశించాం.
జవాబు:
అణుయుగంలోకి ప్రవేశించలేదు.

187. నేను ఉపన్యాసం ఇస్తాను.
జవాబు:
నేను ఉపన్యాసం ఇవ్వను.

188. కొందరు వక్తలు ఊతపదాలు ఉపయోగిస్తారు.
జవాబు:
కొందరు వక్తలు ఊతపదాలు ఉపయోగించరు.

189. ప్రతి వ్యక్తీ గొప్ప వక్త కాగలదు.
జవాబు:
ప్రతి వ్యక్తి గొప్ప వక్త కాలేదు.

190. కొందరు వక్తలు అపహాస్యానికి గురౌతారు.
జవాబు:
కొందరు వక్తలు అపహాస్యానికి గురికారు.

191. పట్టుదల పెరిగింది.
జవాబు:
పట్టుదల పెరగలేదు.

192. ప్రేక్షకుల దృష్టి వక్త మీద పడుతుంది.
జవాబు:
ప్రేక్షకుల దృష్టి వక్త మీద పడదు.

AP 10th Class Telugu 4th Lesson Important Questions ఉపన్యాస కళ

193. వెంటనే కలకలం ఆగిపోవచ్చు.
జవాబు:
వెంటనే కలకలం ఆగిపోకపోవచ్చు.

వ్యతిరేకార్థక క్రియలు

కింది క్రియా పదాలలో వ్యతిరేకార్థక క్రియను గుర్తించండి.

194. అ) చెప్పి
ఆ) చెప్పక
ఇ) చెబితే
ఈ) చెబుతూ
జవాబు:
అ) చెప్పుక

195. అ) నవ్వి
ఆ) నవ్వుతూ
ఇ) నవ్వక
ఈ) నవ్వితే
జవాబు:
ఇ) నవ్వక

196. అ) మూల్గక
ఆ) మూళి
ఇ) మూల్గితే
ఈ) మూల్గుతూ
జవాబు:
అ) మూల్గక

197. అ) పట్టి
ఆ) పట్టుతూ
ఇ) పట్టితే
ఈ) పట్టక
జవాబు:
ఈ) పట్టక

198. అ) మాని
ఆ) మానక
ఇ) మానితే
ఈ) మానుతూ
జవాబు:
ఆ) మానక

199. అ) దొర్లక
ఆ) దొర్లి
ఇ) దొర్లితే
ఈ) దొర్లుతూ
జవాబు:
అ) దొర్లక

200. అ) ఈది
ఆ) ఈదక
ఇ) ఈదితే
ఈ) ఈదుతూ
జవాబు:
ఆ) ఈదక

201. అ) పాడి
ఆ) పాడుతూ
ఇ) పాడక
ఈ) పాడితే
జవాబు:
ఇ) పాడక

202. అ) ఊడి
ఆ) ఊడుతూ
ఇ)ఊడితే
ఈ) ఊడక
జవాబు:
ఈ) ఊడక

203. అ) మాడక
ఆ) మాడుతూ
ఇ) మాడితే
ఈ) మాడి
జవాబు:
అ) మాడక

సంక్లిష్ట వాక్యాలు

ఇవి ఏ రకమైన సంక్లిష్టవాక్యాలో రాయండి.

204. కొందరిని బాగా మాట్లాడినా మెచ్చుకోరు.
జవాబు:
అప్యర్థకం

205. ఉపన్యాసం బాగా ఇస్తే మెచ్చుకొంటారు.
జవాబు:
చేదర్థకం

206. పండితులు ఉపన్యాసాలిస్తూ గౌరవం పొందుతారు.
జవాబు:
శత్రర్థకం

207. కొందరు ఉపన్యాసం బాగా ఇచ్చి డబ్బు తీసుకొంటారు.
జవాబు:
క్త్వార్థకం

208. ఊతపదాలు ఉపయోగిస్తే బాగోదు.
జవాబు:
చేదర్థకం

209. జనం వచ్చినా వక్త రాలేదు.
జవాబు:
అప్యర్థకం

210. జనం వచ్చి వెళ్లిపోయారు.
జవాబు:
క్వార్ధకం

211. కొందరు చెబుతూ నిద్రపోతారు.
జవాబు:
శత్రర్థకం

212. వాడు చెప్పినా ఎవ్వరూ వినరు.
జవాబు:
అష్యర్ధకం

AP 10th Class Telugu 4th Lesson Important Questions ఉపన్యాస కళ

213. వీడు చెబితే వింటారు.
జవాబు:
చేదర్థకం

కర్మణి వాక్యాలు

సరియైన కర్మణి వాక్యాన్ని గుర్తించండి.

214. వక్త మైకు గట్టిగా పట్టుకొన్నాడు.
అ) వక్త చేత మైకు పట్టుకోబడింది.
ఆ) వక్త చేత మైకు గట్టిగా పట్టుకోబడింది.
ఇ) మైకు చేత వక్త పట్టుకోబడ్డాడు.
ఈ) మైకు చేత వక్త గట్టిగా పట్టుకోబడ్డాడు.
జవాబు:
ఆ) వక్త త మైకు గట్టిగా పట్టుకోబడింది.

215. ఆయన ప్రయత్నం విరమిస్తాడు.
అ) ఆయన చేత ప్రయత్నం విరమించబడుతుంది.
ఆ) ఆయన చేత ప్రయత్నం విరమించబడింది.
ఇ) ఆయన చేత ప్రయత్నం విరమించబడుతోంది.
ఈ) ఆయన చేత ప్రయత్నం విరమించబడదు.
జవాబు:
అ) ఆయన చేత ప్రయత్నం విరమించబడుతుంది.

216. ఆయన నిజం చెప్పగలడు.
అ) ఆయన చేత నిజం చెప్పబడింది.
ఆ) ఆయన చేత నిజం చెప్పబడును.
ఇ) ఆయన చేత నిజం చెప్పబడుతోంది.
ఈ) ఆయన చేత నిజం చెప్పబడగలదు.
జవాబు:
ఈ) ఆయన చేత నిజం చెప్పబడగలదు.

217. నన్ను వారు ఇబ్బంది పెట్టారు.
అ) నేను వారి ఇబ్బంది పెట్టారు.
ఆ) నా చేత వారు ఇబ్బంది పెట్టబడ్డారు.
ఇ) నేను, వారు ఇబ్బంది పెట్టబడ్డాం.
ఈ) వారి చేత నేను ఇబ్బంది పెట్టబడ్డాను.
జవాబు:
ఈ) వారి చేత నేను ఇబ్బంది పెట్టబడ్డాను.

218. వర్త ప్రతిభను పొగడవచ్చు.
అ) వద్ద చేత ప్రతిభ పొగడబడవచ్చు.
ఆ) ప్రతిభ చేత వక్త పొగడబడవచ్చు.
ఇ) వక్త, ప్రతిభ పొగడబడవచ్చు.
ఈ) జనం చేత వక్త ప్రతిభ పొగడబడవచ్చు.
జవాబు:
అ) వక్ష చేత ప్రతిభ పొగడబడవచ్చు.

219. వక్త నిర్ణయాన్ని మేము కాదనము.
అ) మా చేత వక్త నిర్ణయం కాదనబడదు.
ఆ) వక్త చేత మా నిర్ణయం కాదనబడదు.
ఇ) వక్త నిర్ణయం చేత మేము కాదనబడము.
ఈ) మా నిర్ణయం వక్త చేత కాదనబడును.
జవాబు:
అ) మా చేత వక్త నిర్ణయం కాదనబడదు.

220. వాక్కు మానవుని అలరిస్తుంది.
అ) మానవుని వాక్కు అలరించబడుతుంది.
ఆ) మానవుని చేత వాక్కు అలరించబడుతుంది.
ఇ) వాక్కు చేత మానవుడు అలరించబడతాడు.
ఈ) మానవ వాక్కు అలరించబడును.
జవాబు:
ఇ) వాక్కు చేత మానవుడు అలరించబడతాడు.

221. వక్త మనసును జనం బాధపెట్టారు.
అ) వక్త మనసు చేత జనం బాధ పెట్టబడ్డారు.
ఆ) జనం మనసు వక్త చేత బాధపెట్టబడింది.
ఇ) జనము వక్త మనసు చేత బాధపెట్టారు.
ఈ) జనం చేత వక్త మనసు బాధ పెట్టబడింది.
జవాబు:
ఈ) జనం చేత వక్త మనసు బాధ పెట్టబడింది.

222. వక్త తనను తాను తీర్చిదిద్దుకొన్నాడు.
అ) వక్త తన చేత తాను తీర్చిదిద్దుకొనబడ్డాడు.
ఆ) తన వక్త తన చేత తీర్చిదిద్దుకొనబడ్డాడు.
ఇ) వక్త తనంతతాను తీర్చిదిద్దుకొనబడడు.
ఈ) వక్త తన చేత తాను తీర్చిదిద్దుకొనబడడు.
జవాబు:
అ) వక్త తన చేత తాను తీర్చిదిద్దుకొనబడ్డాడు.

223. అతను అనుకొన్నది సాధించాడు.
అ) అనుకొన్నది అతని చేత సాధించబడింది.
ఆ) అనుకొన్నదాని చేత అతను సాధించబడ్డాడు.
ఇ) సాధించినది అతని చేత అనుకొనినదే.
ఈ) అనుకొన్నదే అతని చేత సాధించబడింది.
జవాబు:
అ) అనుకొన్నది అతని చేత సాధించబడింది.

వాక్య రకాలు

ఇవి ఏ రకమైన సామాన్య వాక్యాలో రాయండి.

224. మీ ఊరు?
జవాబు:
ప్రశ్నార్థకం

225. ఆహా! ఏమి అందం!
జవాబు:
ఆశ్చర్యార్థకం

226. మీరు రావచ్చు.
జవాబు:
అనుమత్యర్ధకం

227. అక్కడకు వెళ్లవద్దు.
జవాబు:
నిషేధార్థకం

228. వాడు తప్పక వస్తాడు.
జవాబు:
నిశ్చయార్థకం

229. అందరూ రండి.
జవాబు:
అనుమత్యర్ధకం

230. వాడు వస్తాడో రాడో!
జవాబు:
సందేహార్థకం

231. దయచేసి కాపాడండి.
జవాబు:
ప్రార్థనార్థకం

232. అతను ఉపన్యాసం చెప్పగలదు.
జవాబు:
సామర్థ్యార్థకం

233. అతన్ని నేనే ఉపన్యాసకునిగా ఉత్సాహపరిచాను.
జవాబు:
ప్రేరణార్ధకం

234. నీవు కలకాలం కీర్తి నార్జించు..
జవాబు:
ఆశీరార్థకం

235. తను రాసుకొని ఉపన్యాసం ఇచ్చాడు.
జవాబు:
ఆత్మార్థకం

236. వేదికను అలంకరించవచ్చు.
జవాబు:
అనుమత్యర్థకం

AP 10th Class Telugu 4th Lesson Important Questions ఉపన్యాస కళ

237. రేవు అతను వస్తాదా?
జవాబు:
ప్రశ్నార్థకం

వాక్య రకాలు

ఇవి ఏ రకమైన సామాన్య వాక్యాలో గుర్తించండి.

238. అందరూ వేదిక పైకి రావద్దు.
అ) విధ్యర్థకం
ఆ) నిషేధార్థకం
ఇ) సందేహార్ధకం
ఈ) అనుమత్యర్థకం
జవాబు:
ఆ) నిషేధార్థకం

239. ఎవ్వరైనా మాట్లాడవచ్చు.
అ) విధ్యర్ధకం
ఆ) నిశ్చయార్థకం
ఇ) అనుమత్యర్థకం
ఈ) ప్రార్థనార్థకం
జవాబు:
ఈ) ప్రశ్నార్థకం

240. ప్రతీదీ తప్పక చదవాలి.
అ) నిశ్చయార్థకం
ఆ) విధ్యర్థకం
ఇ) ప్రార్ధనార్థకం
ఈ) ఆత్మార్థకం
జవాబు:
అ) నిశ్చయార్థకం

241. పల్లెలు బాగుంటాయా?
అ) ప్రశ్నార్థకం
ఆ) ఆత్మార్థకం
ఇ) విధ్యర్ధకం
ఈ) ఆశ్చర్యార్థకం
జవాబు:
అ) ప్రశ్నార్థకం

242. ఆహా! ఆయన ఉపన్యాసం ఎంత బాగుందో!
అ) అప్యర్థకం
ఆ) ఆశ్చర్యార్ధకం
ఇ) నిశ్చయార్థకం
ఈ) ఆత్మార్థకం
జవాబు:
ఆ) ఆశ్చర్యార్థకం

243. నా ఉపన్యాసం నచ్చిందో! లేదో!
అ) సందేహార్థకం
ఆ) విధ్యర్ధకం
ఇ) నిశ్చయార్ధకం
ఈ) ప్రార్ధనార్థకం
జవాబు:
అ) సందేహార్ధకం

244. దయచేసి శ్రద్ధగా వినండి.
అ) నిశ్చయార్ధకం
ఆ) అశీరార్ధకం
ఇ) విధ్యర్థకం
ఈ) ప్రార్థనార్థకం
జవాబు:
ఈ) ప్రార్థనార్థకం

245. నా ఉపన్యాసం విన్న ఈ ఊరు చల్లగా ఉండాలి.
అ) ప్రార్ధనార్థకం
ఆ) ఆశీరాద్ధకం
ఇ) విధ్యర్థకం
ఈ) నిశ్చయార్ధకం
జవాబు:
ఆ) ఆశీరార్ధకం

246. నేను తప్పక వింటాను.
అ) నిశ్చయార్థకం
ఆ) సందేహార్ధకం
ఇ) విధ్యర్థకం
ఈ) ఆశీరార్ధకం
జవాబు:
అ) నిశ్చయార్థకం

AP 10th Class Telugu 4th Lesson Important Questions ఉపన్యాస కళ

247. తను చెప్పుకొంటూ వింటున్నాడు.
అ) సామర్థ్యార్థకం
ఆ) విధ్యర్థకం
ఇ) ఆత్మార్థకం
ఈ) ఆశీరర్ధకం
జవాబు:
ఇ) ఆత్మార్ధకం

Leave a Comment