AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers శతక మాధుర్యం

Access to the AP 10th Class Telugu Guide 3rd Lesson శతక మాధుర్యం Questions and Answers are aligned with the curriculum standards.

శతక మాధుర్యం AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers

చదవండి ఆలోచించి చెప్పండి.

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers 1

ఆ.వె. జ్ఞానుల చరితము వీనుల న
నానుచు సత్పురుష గోష్ఠి ననఘంబనుచున్
బూనుము; ధర్మపథంబును
దానెరిగినయంత; మరువదగదు కుమారా! — పక్కి అప్పల నరసయ్య

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers శతక మాధుర్యం

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
నుంచి వారితో స్నేహం వలన ఫలితం ఏమిటి ?
జవాబు:
మంచి వారితో స్నేహం వలన పుణ్యం లభిస్తుంది.

ప్రశ్న2.
దేనిని మరువకూడదు ?
జవాబు:
ధర్మ మార్గాన్ని మరువకూడదు.

ప్రశ్న 3.
ఇలాంటి పద్యాలు మనకు వేటిని బోధిస్తాయి ?
జవాబు:
ఇలాంటి పద్యాలు మనకు భక్తిని, నీతులను, లోకరీతిని, ఉత్తమ జీవిత పద్ధతులను బోధిస్తాయి.

అవగాహన-ప్రతిస్పందన

ఇవి చేయండి

అ) కింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి, రాయండి.

ప్రశ్న1.
పాఠంలోని పద్యాలను రాగ, భావయుక్తంగా పాడండి.
జవాబు:
మీ ఉపాధ్యాయుని అనుసరించండి.

ప్రశ్న2.
పారంలో మీకు నచ్చిన పద్యాలు ఏవి ? అవి ఎందుకు నచ్చాయో చెప్పండి.
జవాబు:
నాకు “పలుచని భాస్కరా !” అనే పద్యం చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇది దృష్టాంత అలంకారంతో ఉన్నది. పద్యభావాన్ని ఉదాహరణ పూర్వకంగా చక్కగా అర్థమయ్యేలా చెప్పారు. నీచుడు పల్కినట్లుగా కఠినపదాలను అన్యాయంగా గొప్పవారు పలకరు. ఎందుకంటే వెలితి కుండ తొణికినట్లుగా నిండుకుండ తొణకదు. ఈ పద్యంలో
నీ వెలితి కుండతో పోల్చారు. అలాగే గొప్పవాడిని నిండుకుండతో పోల్చారు.

నాకు నచ్చిన రెండో పద్యం “మాతృభాష కుప్పుసామి” అనే పద్యం. ఎందుకంటే మాతృభాష మీదా, మాతృదేశం మీదా అభిమానం లేనివాడు మనిషి కింద లెక్కింపదగినవాడు కాదు. పక్షులకు, జంతువులకూ కూడా తమ జాతిపై అభిమానం ఉంటుంది. ఈ రోజులలో పరాయి దేశాలపైనా, పరాయి భాషలపైనా మోజు పెరిగిపోతుంది. అది తప్పని చెబుతూ బోధించే పద్యం కాబట్టి నాకు చాలా నచ్చింది.

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers శతక మాధుర్యం

ప్రశ్న3.
మంచి గుణాలు కలవాడు ఎలా మాట్లాడుతాడు ?
జవాబు:
మంచి గుణాలు కలవాడు నీచుడిలా మాట్లాడడు. కఠినంగా మాట్లాడడు. అన్యాయంగా మాట్లాడడు. చక్కగా ఇతరుల మనసు నొప్పించకుండా మాట్లాడతాడు. నిండుకుండలా గుంభనంగా ఉంటాడు.

ప్రశ్న 4.
వేటిపై మమతను కలిగి ఉండాలి ?
జవాబు:
మన మాతృభాషపైనా, మన మాతృదేశంపైనా మమతను కలిగి ఉండాలి.

ఆ) కింది పద్యాన్ని చదవండి. పద్య భావం రాయండి.

తే.గీ. సద్గురువు చేయునుపదేశ సారములను
యెంత యజ్ఞానమైనను నిట్టై పోవు
మంచి వైద్యుడిచ్చేడి చిన్ని మాత్ర చేత
దారుణం బగు రోగంబు తలఁగునట్లు — చిలకమర్తి లక్ష్మీనరసింహం

భావం: మంచి గురువు చేసే ఉపదేశం వలన ఎంత అజ్ఞానం ఐనా ఇట్టే పోతుంది. మంచి వైద్యుడు ఇచ్చే చిన్న మాత్ర వలన ఎంత గడ్డురోగమైనా తగ్గిపోతుంది కదా !

ఇ) కింది గద్యం చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

మగధ దేశమునందలి దుర్గమను పట్టణము కలదు. అందు మహావిభవ సంపన్నుఁడయి శుభదత్తుఁడను వైశ్యుఁడు గలఁడు. అతఁడు సంతానము లేనివాఁడు కాఁబట్టి తన ధన మారామ తటాకాది ప్రతిష్టల వెచ్చించుచు నా పట్టణములో ! నొక దేవళము జీర్ణమై యుండఁగా జూచి కారువులను రావించి తగిన వేతనములు నియమించి దానిఁ గట్ట నియోగించెను.

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers 2

వారు దానిఁ గట్టుచుండఁగా నొకనాఁడు చేవదూలము అంపముచేఁ గోయించుచునది సుకరముగా వ్రీల్చుటకు. సూత్రధారుఁడక్కడక్కడ మ్రాని మేకులు దిగఁగొట్టి మధ్యాహ్న భోజనార్ధము కూలి వాండ్రును దానును బోయెను. అప్పు | డాపరిసరతరువులందుఁ దిరుగుచున్న కోఁతులు దేవాలయము దాపునకు వచ్చి ప్రాకారములు ప్రాఁకుచుఁ బ్రాఁత శ్రీ మహీరుహముల మీఁదికిఁ గుప్పించి దాఁటుచు బండ్లిగిలించుచు, వెక్కిరించుచు, గిలకిలా రావములు గావించుచు నొండొంటితోఁ బోరుచు, ఫలములు భక్షించుచు, మధువు లానుచు స్వాభావిక చపల భావముతోఁదిరుగుచుండెను.

ఒక ముసలిమల్లు కాలచోదితమై చేవదూలము డాసి యెక్కి దానినెఱియలోఁ దనముష్కము వ్రేలం గూర్చుండి యందు బిగియఁ గొట్టిన కొయ్య మేకు రెండు చేతులతోఁ జిక్కఁబట్టి బలిమితో నూడఁబెఱికి యానెరియలో వ్రేలు ముష్కము చదియుటఁ జేసి తోలుచుఁ గాలధర్మము నొందెను. కాఁబట్టి జోలిమాలిన పనికిఁ బోరాదు

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers శతక మాధుర్యం

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
శుభదత్తుడికి ఉన్న కొరత ఏమిటి ?
జవాబు:
సంతానం లేకపోవడమే అతనికి ఉన్న కొరత.

ప్రశ్న 2.
ముసలి కోతి ఏం చేసింది ?
జవాబు:
ముసలి కోతి చేవ దూలపు పగులులో తన ముష్కం వ్రేలాడదీసి మేకు పీకింది. ఆ పగులు మూసుకుపోవడంతో
ముష్కం నలిగి మరణించింది.

ప్రశ్న 3.
ఈ పేరాలోని నీతి ఏమిటి ?
జవాబు:
జోలిమాలిన పనికి పోరాదనేది ఈ పేరాలోని నీతి.

ప్రశ్న 4.
పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
సూత్రధారుడెక్కడికి వెళ్లాడు ?

ఈ) కింది వాటికి అర్థ సందర్భములు రాయండి.

ప్రశ్న 1.
పనుల ననుసరించి ఫలములు చేకూరు.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం దార్ల సుందరీమణి రచించిన భావలింగ శతకం నుండి గ్రహింపబడిన ‘శతక మాధుర్యం’ అనే పాఠం నుండి గ్రహింపబడినది.
సందర్భం : భావాన్ని బట్టి మాట, మాటను బట్టి పని, పనిని బట్టి ఫలితం చేకూరుతుందని చెబుతూ రచయిత్రి పల్కిన వాక్యమిది.
భావము : పనులను బట్టి ఫలితాలు వస్తాయి.

ప్రశ్న 2.
మాతృభాష యందు మాతృదేశము నందు మమత లేనివాడు మనుజుఁడగునే.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం త్రిపురనేని రామస్వామి చౌదరి గారు రచించిన కుప్పుసామి శతకం నుండి గ్రహించబడిన
‘శతక మాధుర్యం’ పాఠ్యాంశంలోనిది.
సందర్భం : మానవులకు, పక్షులకు, జంతువులకు గల బుద్ధి కూడా లేదని చెబుతూ కవి పలికిన వాక్యమిది.
భావము : మాతృభాష మీదా, తన దేశం మీదా అభిమానం లేనివాడు మనిషే కాదని భావం.

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers శతక మాధుర్యం

ఉ) కింది ప్రశ్నలకు ఏకవాక్య సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
ముక్తకం అంటే ఏమిటి ?.
జవాబు:
ముక్తకం అంటే ఏ పద్యానికి ఆ పద్యం ప్రత్యేక భావం కలిగి ఉండడం. పద్యాల మధ్య అన్వయం, భావం కొనసాగింపు లేకపోవడం.

ప్రశ్న 2.
కవి హరిహరనాథుని ఏమి ఇమ్మని కోరాడు ?
జవాబు:
అది కావాలి, ఇది కావాలని తాపత్రయపడే మనసుకు ఏకాగ్రతను ప్రసాదించమని హరిహరనాథుని కవి కోరాడు.

ప్రశ్న 3.
సజ్జన సాంగత్యం ఏం చేస్తుంది ?
జవాబు:
సజ్జన సాంగత్యం వలన దుర్జనునకు కూడా మంచి లక్షణాలు వస్తాయి. సేవాతత్వం అలవడుతుంది.

వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
సంస్కారుల గొప్పదనం ఏమిటి ?
జవాబు:
సంస్కారులకు సహజశక్తి ఉంటుంది. వారు సత్యస్థాపనకై జన్మిస్తారు. మంచి స్వభావాలు వ్యాపింపచేస్తారు. ధర్మ సంస్థాపన కోసం జన్మిస్తారు.

ప్రశ్న2.
సత్ఫలితాలు పొందాలంటే ఏం చేయాలి ?
జవాబు:
మన భావం ఏదైతే అదే మాట్లాడాలి. మన మాట ఎలా ఉంటే పని అలాగే ఉండాలి. మన పనులను బట్టే మంచి ఫలితాలు వస్తాయి. అంటే త్రికరణ (మనసు, మాట, పని) శుద్ది ఉంటేనే మంచి ఫలితాలు వస్తాయి.

ప్రశ్న 3.
ధీరోత్తముల లక్షణాలు ఏవి ?
జవాబు:
నీతివేత్తలు ఐన నిపుణులు నిందించినా, పొగిడినా, సంపదలు ఉన్నా, పోయినా, మరణమే కలిగినా ధీరగుణం గల ఉత్తములు నీతిని తప్పరు. కీర్తిని తెచ్చే దానిని విడవరు.

ఆ) కింది ప్రశ్నలకు ఎనిమిది నుండి పది వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
విద్యావంతులు ఎటువంటి గుణాలను కలిగి ఉంటారు ?
జవాబు:
పరాక్రమం వలన జన్మ సాఫల్యం కలుగుతుంది. శాంతం వల్ల ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మాభిమానమే గొప్ప సంపద. తప్పు చేయడానికి సిగ్గుపడే బ్రతుకే అమరత్వాన్ని ఇస్తుంది. వినయంతో కూడిన మాట అన్నిటినీ, అందరినీ వశం చేస్తుంది. ఆచారమే గొప్ప బలం. దానం చేయడం అంటే రేపటికి దాచుకోవడమే. మంచివారితో స్నేహం సౌఖ్యాన్ని ఇస్తుంది. అందుకే విద్యావంతులు పైన చెప్పిన గుణాలు అన్నీ కలిగి ఉంటారు.

ప్రశ్న 2.
వ్యక్తుల నిత్య జీవితంలో నైతిక విలువల అవసరాన్ని తెలపండి.
జవాబు:
వ్యక్తుల నిత్యజీవితంలో నైతిక విలువలు చాలా అవసరం. ఎందుకంటే నైతిక విలువలు కలవారు తప్పులు చేయరు. ఎవ్వరినీ మోసం చేయరు. అనవసరమైన గొడవలు పెట్టుకోరు. న్యాయంగా మాట్లాడతారు. ధర్మం తప్పి ప్రవర్తించరు. ఎవ్వరినీ నొప్పించేలా మాట్లాడరు. తాము ఒకవేళ తెలియక తప్పు చేసినా వెంటనే గుర్తిస్తారు. సరిదిద్దుకొంటారు. అసత్యాలు మాట్లాడరు. అందరూ ఇలాగే ఉంటే సమాజంలో ప్రశాంతత ఉంటుంది. అనవసర గొడవలుండవు. అందరూ నిర్భయంగా బ్రతకవచ్చు.

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers శతక మాధుర్యం

ప్రశ్న 3.
పాఠం ఆధారంగా పది నీతి. వాక్యాలు రాయండి.
జవాబు:
1. నారు పోసినవాడు నీరు పోయక పోడు..
2. ప్రకృతిని నమ్ముకో – ఆనందాన్ని జుర్రుకో.
3. అల్పుడెపుడు పల్కు అన్యాయపు మాటలు – సజ్జనుండు పల్కు న్యాయసూత్రాలు.
4. ధర్మ సంస్థాపన కోసం ఎవరో పుడతారనుకోకు – నీవే ధర్మాత్ముడవుకా.
5. అన్నీ నీలోనే ఉన్నాయని తెలుసుకో !
6. ఆరు నూరైనా – గొప్పవారు నీతి తప్పరు.
7. మూర్ఖుడికి గర్వం – పండితునికి నిగర్వం సహజం.
8. మనసు, మాట, పని ఒకటైతే సాధ్యం కానిది లేదు.
9. నీ భాషను, నీ దేశాన్ని అభిమానించడం పశుపక్ష్యాదులను చూసైనా నేర్చుకో..
10. మనసును అదుపులో పెట్టుకోవాలి.
11. మంచివాడి స్నేహం చేస్తే దుర్గుణాలు పోతాయి.
12. విద్వాంసులు మంచి గుణాలు విడువరు. అవే వారికి రక్ష.

ఇ) కింది ప్రశ్నలకు సృజనాత్మకంగా జవాబులు రాయండి.

ప్రశ్న1.
మీ పాఠశాలలో నిర్వహించే పద్యాల పోటీలో విద్యార్థులందరూ పాల్గొనాలని కోరుతూ ఒక ప్రకటన రాయండి.
జవాబు:

ఆహ్వానం

విషయం: పద్యాల పోటీ
అర్హత : కోనసీమ జిల్లాలోని 6 నుండి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు అందరూ.
వేదిక : శ్రీనంద్ టెక్నో స్కూల్, అమలాపురం.’
సమయం : ఉదయం 9 గం|| నుండి సాయంత్రం 5 గం॥ వరకు.
తేది : 29, 08. 2004 (తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా)
బహుమతులు :
ప్రథమ బహుమతి : 2,000/-
ద్వితీయ బహుమతి : 1,500/-
తృతీయ బహుమతి : 1,000/-
గమనిక : పాల్గొను వారందరికీ భోజన సదుపాయం కలదు. పోటీలో పాల్గొను విద్యార్థులు స్టడీ సర్టిఫికెట్ తప్పని సరిగా తెచ్చుకోవాలి.

ప్రశ్న 2.
పాఠంలో మీకు నచ్చిన ఏదైనా పద్యభావానికి తగిన నీతి కథ / గేయం / కవిత రాయండి.
జవాబు:
పలుచని ………….. భాస్కరా ! (28వ పేజీలోని 1వ పద్యానికి కథ)
రామాపురం అనే గ్రామంలో భీమయ్య, సోమయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండేవారు. భీమయ్య అన్నగారు. సోమయ్య తమ్ముడు. ఊళ్లో ఎవరి ఇంట్లో అశుభం జరిగినా అన్నగారే వెళ్లేవాడు. వారిని ఓదార్చి, పలకరించి వచ్చేవాడు. శుభకార్యాలకైతే ఇద్దరూ వెళ్లేవారు. అందరూ భీమయ్యనే ఎక్కువగా పలకరించేవారు. ఇది సోమయ్యకు నచ్చలేదు.

ఇటుపైన ఎవరింట్లో అశుభం జరిగినా తనే వెడతానన్నాడు. ఒకసారి తనతో వచ్చి పలకరించే పద్ధతి తెలుసుకోమని భీమయ్య చెప్పాడు. ఇష్టం లేకపోయినా సోమయ్య ఒప్పుకొన్నాడు. వాళ్ల వీథిలో సుబ్బయ్య గారి తల్లి మరణించింది. అన్నదమ్ములిద్దరూ పలకరించడానికి వెళ్లారు. అన్నగారు. “అయ్యయ్యో ! ఎంత కష్టం వచ్చిందండీ సుబ్బయ్య గారూ !

ఆమె మీకే కాదండీ నాకూ అమ్మలాగే అనిపించేవారు. నాకేమిటి ఊరందరికీ ఆవిడ తల్లిలాగే అనిపించేది. మీరే కాదు ఊరంతా తల్లిని కోల్పోయినట్లే బాధపడుతున్నాం .” అని మాట్లాడి ఓదార్చాడు. ఇంటికి వచ్చేటపుడు పలకరించే పద్ధతి తెలిసిందా అని అడిగాడు. తానేం తెలివి తక్కువవాడిని కానని కటువుగా చెప్పాడు సోమయ్య.

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers శతక మాధుర్యం

ఒక నెల పోయాక సుబ్బయ్యగారి భార్య పోయింది. సోమయ్య పలకరించడానికి వెళ్లాడు. “అయ్యయ్యో ఎంత కష్టం వచ్చిందండీ సుబ్బయ్యగారూ ! ఆమె మీకే కాదండీ నాకూ భార్య లాగే అనిపించేవారు. నాకేమిటి ఊరందరికీ ఆవిడ భార్య లాగే అనిపించేది. మీరే కాదు ఊరంతా భార్యను కోల్పోయినట్లే బాధపడుతున్నాం…..” అని అన్నగారి మాటలనే కాపీ కొట్టాడు. ఎక్కడలేని కోపంతో సుబ్బయ్య గారు సోమయ్యను చితక్కొట్టారు. మళ్లీ పరామర్శల జోలికి వెళ్లలేదు పాపం సోమయ్య.

(లేదా)
గేయం

మాతృభాష ……. కుప్పుసామి. (29వ పేజీలోని 8వ పద్య భావానికి గేయం)
మాతృభాషకు జేజేలు – మాతృభూమికి జేజేలు.
అమ్మ పాలకంటే కమ్మనైన భాషరా !
అమ్మఒడి కంటే చల్లనైన భూమిరా ! ॥ మాతృభాషకు ॥
అమ్మ ప్రేమతోడ పాడు పాట మాతృభాషరా !
నాన్న రక్షలోని దన్ను ‘నిచ్చు శక్తి మాతృభూమిరా ! ॥ మాతృభాషకు ॥
చెలిమి తోడ మెలగు జనుల కలిమి మన భాషరా !
బలిమితో అరుల కురులు వేయు భూమిరా ! ॥ మాతృభాషకు ॥

(లేదా)
కవిత

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers శతక మాధుర్యం

నీతిప్రౌఢ …………… ధీరోత్తముల్ – 29వ పేజీలోని 5వ పద్యానికి కవిత.

తప్పకు తప్పకు నీతిని నీవు
చెప్పిన నెవ్వరు గొప్పలు వినకు
కుప్పలు తెప్పలుగా సంపద రానీ గుప్పెడు మిగలక డబ్బులు పోనీ
ఇప్పుడె చప్పున ప్రాణం పోనీ
తప్పకు తప్పకు న్యాయం నీవూ !

భాషాంశాలు

పదజాలం

అ) కింది వాక్యాలలో ఎరుపు రంగు ఉన్న పదాలకు అర్థాలు రాయండి.

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers 3
జవాబు:
1. మంచి చెప్పినా దృప్తుడు వినడు.
దృప్తుడు = గర్విష్టి

2. పండితుని ఖ్యాతి ప్రపంచమంతటా విస్తరిస్తుంది.
ఖ్యాతి = కీర్తి

3. విష్ణువు తల్పం ఆదిశేషుడు.
తల్పం = పాన్పు

4. కానలలో క్రూరమృగాలు ఉంటాయి.
కాన = అడవి

5. పగటికి రాజు భాస్వంతుడు.
భాస్వంతుడు = సూర్యుడు

ఆ) కింది పదాలకు పర్యాయపదాలు రాయండి.

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers 4
జవాబు:
1. పండితుడు = బుధుడు, విద్వాంసుడు
2. భుజగం = పాము, ఫణి
3. కరి = ఏనుగు, గజము
4. పక్షి = ఖగము, పులుగు
5. హరి = విష్ణువు, శౌరి

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers శతక మాధుర్యం

ఇ) కింది పదాలకు నానార్థాలు రాయండి.

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers 5
జవాబు:
1. ధర = భూమి, ఖరీదు
2. శ్రీ = లక్ష్మీదేవి, సంపద
3. వారి = నీరు, పంచదార
4. పదము = పాదం, శబ్దం
5. మిత్రుడు = స్నేహితుడు, సూర్యుడు

ఈ) కింది పదాలకు వ్యుత్పత్యర్థాలు రాయండి.

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers 14
జవాబు:
1. భాస్కరుడు = కాంతిని కలుగుజేయువాడు – సూర్యుడు
2. భుజగము = కుటిలముగా ఓోవునది – సర్పము
3. ఈశ్వరుడు = స్వభావము చేతనే ఐశ్వర్యము కలవాడు – శవుడు
4. హస్తి = హస్తము (తొండము) కలది – ఏనుగు

ఉ) కింది ప్రకృతి వికృతులను జతపరచండి

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers 6
జవాబు:
1. చంద్రుడు ( ఆ ) అ) సామి
2. నిత్యము ( ఉ ) ఆ) చందురుడు
3. స్వామి ( అ ) ఇ) అంచ
4. హంస ( ఇ ) ఈ) దమ్మము
5. ధర్మము ( ఈ ) ఉ) నిచ్చలు

వ్యాకరణాంశాలు

అ) కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers 7
జవాబు:
1. నిష్ఠురోక్తులు : నిష్ఠుర + ఉక్తులు = గుణసంధి
2. జేంకటేశ : వేంకట + ఈశ = గుణసంధి
3. అవ్వారి : ఆ + వారి = త్రికసంధి
4. మనుజూడగునే : మనుజుడు + అగును +ఏ = ఉత్వసంధి
5. ధీరోత్తముడు : ధీర + ఉత్తముడు = గుణసంధి

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers శతక మాధుర్యం

ఆ) కింది పదాలను కలిపి, సంధి పేరు రాయండి.

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers 8

అనునాసిక సంధి:

కింది పదాలను గమనించండి.

వాక్ + మయము = వాజ్మయము
రాట్ + మహేంద్రవరం = రాణ్మృహంద్రవరం
జగత్ + నాథుడు = జగన్నాథుడు
అప్ + మయము = అమ్మయము

పై వాటిలో మొదటి పదాల చివర క,చ,ట,త,ప లు (వర్గ(్రథమాక్షరాలు) ఉన్నాయి. రెండవ పదం మొదట ‘న’ గాని ‘మ’, గాని ఉన్నాయి. అలా ఉన్నపుడు సంధి జరిగి ఆయా వర్గ అనునాసికాక్షరాలు ఆదేశంగా వస్తాయి. దానిని అనునాసిక సంధి అంటారు.

ఇలా ఉన్నపుడు సంధి కలిసి ఆయా వర్గాల అనునాసికాలు అంటే

క వర్గ అనునాసికం – ఒ
చ వర్గ అనునాసికం – ఇ
ట వర్గ అనునాసికం – ణ
త వర్గ అనునాసికం – న
ప వర్గ అనునాసికం – మ

ఆదేశంగా వస్తాయి. అంటే వర్గ ప్రథమాక్షరాలకు బదులుగా ఆయా వర్గానునాసికాలు వస్తాయి. అందుకే దీనికి అనునాసిక సంధి అని పేరు పెట్టారు.

ఈ సంధికి సూత్రం : వర్గ ప్రథమాక్షరాలకు న,మ లు పరమైతే ఆయా వర్గానునాసికాలు ఆదేశంగా వస్తాయి.
అపుడు : వాజ్మయం (క కారానికి బదులు ‘జ’ అనే అనునాసికం)
రాణ్మహేంద్రవరం (ట కారానికి బదులు ‘ణ’ అనే అనునాసికం)
జగన్నాథుడు (త కారానికి బదులు ‘న’ అనే అనునాసికం)
అమ్మయము (ప కారానికి బదులు ‘మ’ అనే అనునాసికం)

ఇ) కింది పదాలను కలిపి రాయండి.

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers 9
జవాబు:
1. జగత్ + నివేశ : జగన్నివేశ (అనునాసిక సంధి)
2. దిక్ + మండలము : దిఙ్మండలము (అనునాసిక సంధి)
3. రాట్ + మణి : రాణ్మృణి (అనునాసిక సంధి)

ఈ) కింది సమాస పదాలకు విగ్రహవాక్యం రాసి, సమాసం పేరు రాయండి.

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers 10
జవాబు:
1. శౌర్యలక్ష్మి : శౌర్యమనెడు లక్ష్మి – (రూపక సమాసం)
2. ప్రతిదినము : దినము దినము – (అవ్యయాభావ సమాసం)
3. బ్రతుకుదెరువు : బ్రతుకు కొఱకు తెరువు – (చతుర్థీ తత్పురుష సమాసం)
4. సజ్జనన సంగతి : సజ్జనులతో సంగతి – (తృతీయా తత్పురుష సమాసం)
5. గురుతర బాధ్యత : గురుతరమైన బాధ్యత – (విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం)

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers శతక మాధుర్యం

అలంకారములు

వృత్తను(ప్రాసాలంకారం
వవరణ: ఒకటి గానీ అంతకంటే ఎక్కువ గానీ హల్లులు పలుమార్లు వాక్యంలో గానీ పద్యపాదాలలో గానీ వచ్చి శబ్ద చమత్కారం కలిగిస్తే దానిని వృత్త్ననుప్రాసాలంకారం అంటారు.
ఉదా : భేరికా దాండదడాండదాండ నినదంబులజాండము నిండ
పై పద్యాన్ని గమనించినపుడు ‘డ’ అనే హల్లు పలుమార్లు ఆవృత్తి కావటం వలన ఇది వృత్త్నుప్రాసాలంకారం అవుతుంది.

ఉ) కింది పద్యపాదం/వాక్యాలలోని అలంకారాలను గుర్తించండి.

ప్రశ్న 1.
అక్షరజ్ఞానం లేని నిరక్షరకుక్షి ఈక్షితిలో ప్రత్యక్షముగా కష్టముల పాలగును.
జవాబు:
ఈ వాక్యములో వృత్తనుప్రాసాలంకారం ఉంది.
సమన్వయం : పై వాక్యమును గమనిస్తే “క్ష” కారం అనే హల్లు పలుమార్లు ఆవృత్తి కావటం వల్ల వృత్తను(ప్రాసాలంకారమైంది.

ప్రశ్న 2.
ఇదికాదదియనునదికా
దిదియను నిది నదియు వదిలి యెదియో వదరన్
వదలని ముదములఁ బొదలగ
నదవదపడి చెదరి యెడఁద హరిరనాథా
జవాబు:
ఈ పద్యంలో వృత్తనుప్రాసాలంకారముంది.
సమన్వయం : పై పద్యంలో “ద” కారమనే హల్లు పలుమార్లు ఆవృత్తి కావటం వల్ల వృత్యనుస్రాసాలంకారమైంది.

ప్రశ్న 3.
లక్ష భక్ష్యములు భక్షించే లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా?
జవాబు:
ఈ వాక్యంలో వృత్యనుప్రాసాలంకారముంది.
సమన్వయం : పై వాక్యంలో “క్ష” కారం అనే హల్లు పలుమార్లు ఆవృత్తి కావటం వల్ల వృత్యనుుర్రాసాలంకారమైంది.

దృష్టాంతాలంకారము:

కింది వాక్యమును పరిశీలించండి.
పెరుగును యింత చిలికినా వెన్ననే ఇస్తుంది. అలాగే మంచివారిని యింత బాధించినా మంచే చేస్తారు. ఇందులో మంచివారిని పెరుగుతో పోల్చారు. ఇక్కడ రెండు వాక్యముల యందు వేరువేరు ధర్మాలు చెప్పబడ్డాయి. ఇలా ఉపమాన ఉపమేయాల యొక్క వేరువేరు ధర్మాలను బింబప్రతిబింబ భావంతో చెప్తే అది దృష్టాంతాలంకారము.
జవాబు:
కొన్ని దృష్టాంతాలంకార ఉడాహరణలను గుర్తించి రాయండి.
పెరుగును ఎంత చిలికినా వెన్ననే ఇస్తుంది.
అలాగే మంచివారిని ఎంత బాధించిసా మంచే చేస్తారు.
ఈ రెండు వాక్యాలలో వేరు వేరు ధర్మాలు చెప్పారు.
మంచివారిని పెరుగుతో పోల్చారు.
మంచితనాన్ని వెన్నతో హోల్చారు.

కాని, రెండింటి ధర్మాలూ వేరు, అయినా ఒకదానికి దృష్టాంతంగా మరొక విషయం చెప్పారు. ఆ ధర్మాలను బింబ ప్రతిబింబ భావంతో చెప్పారు. కనుక దీనిని దృష్టాంతాలంకారం అంటారు.

లక్షణం : ఉపమాన ఉపమేయాల వేరు వేరు ధర్మాలను బింబ ప్రతిబింబ భావంతో చెబితే డానిని దృష్టాంతాలంకారం అంటారు.

కొన్ని దృష్షాంతాలంకార ఉడాహరణలను గుర్తించి రాయండి.

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers శతక మాధుర్యం

ప్రశ్న 1.
పలుచని నీచమానపుడు ……………. భాస్క్రు!
జవాబు:
అనే పద్యంలో దృష్టాంతాలంకారం ఉంది….
లక్షణం : ఉపమాన ఉపమేయాల వేరు వేరు ధర్మాలను బింబ ప్రతిబింబ భావంతో చెబితే దానిని దృష్టాంతాలంకారం అంటారు.

సమన్వయం : నీచ మానవుని వెలితి కుండతో పోల్చారు. గుణవంతుని నిండుకుండతో పోల్చరు. కాని, ఉపమాన, ఉపమేయాల ధర్మాలు వేరు. అయినా ఒకదానికి ఒకది బింబ ప్రతిబింబ భావంతో చెప్పారు. కనుక ఇచ్చిన పద్యంలో ద్షాంతాలంకారం ఉంది.

ఛందన్సు

కింది ఉదాహరణ ద్వారా తేటగీతి పద్య లక్షణాలను తెలుసుకుందాం.

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers 15
ఈ పద్యపాదంలో ఒక సూర్యగణం (గల), రెండు ఇంద్ర (సల, సల) గణాలు, రెండు సూర్య (గల, న) గణాలు ఉన్నాయి. మొత్తం 5 గణాలున్నాయి. 5వ గణం మొదటి అక్షర(స-సా)మునకు యతి చెల్లింది.

ఋ) తేటగీతి పద్య లక్షణాలు

1. తేటగీతి ఉపజాతికి చెందిన పద్యం.
2. ఇందులో నాలుగు పాడాలుంటాయి.
3. ప్రతిపాదంలో వరుసగా ఒక సూర్య గణం, రెండు ఇంద్రగణాలు, రెండు సూర్య గణాలు ఉంటాయి.
4. ప్రతి పాదంలో నాలుగవ గణంలోని మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది.
5. యతిలేని చోట ప్రాసయతి చెల్లుతుంది.
6. ప్రాసనియమము లేదు.

బూ) పాఠంలో ఐదు, ఆరు, పది పద్యాల పాదాలకు గురులఘువులు గుర్తించి గణవిభజన చేసి లక్షణాలు రాయండి.

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers 16

ఇది ఈర్దూల పద్య పాదము.
యత : 1 – 13వ అక్షరము.
1వ పాదం : నీ – నిం ; 2వ పాదం : ఖ్లా – గా ; 3వ పాదం : ఘూ – గా ; 4వ పాదం : నీ – ని
ప్రాస : రెండవ అక్షరము “తి – తిం – తం – తి”

లక్షణము :
1. శార్దూల పద్యమునందు నాల్గు పాదాలుంటాయి.
2. ప్రతి పాదమునందు మ,స,జ,స,త,త,గ అనే గణాలు వరుసగా ఉంటాయి.
3. పాదాది అక్షరానికి అ పాదంలోని 13వ అక్షరానికి యతిమైత్రి చెల్లుతుంది.
4. ప్రాస నియమము కలదు. ప్రాసయతి చెల్లదు.
5. శార్దూల పద్యపాదంలో మొదటి గురువును రెండు లఘువులను చేసినచో అది మత్తేధ పద్యపాదమవుతుంది.

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers 17
AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers 18

ఇది చంపకమాల పద్యపాదము.
యతి : 1 – 11వ అక్షరము.
1వ పాదం : తె – దృ ; 2వ పాదం : దె – తిన్ ; 3వ పాదం : జ్ట్ర – స ; 4వ పాదం : తె – తిం
ప్రాస : రెండవ అక్షరము “లి-లి-ల-లి”

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers శతక మాధుర్యం

లక్షణము :
1. చంపకమాల పద్యము నందు నాలుగు పాదాలుంటాయి.
2. ప్రతి పాదమునందు న, జ, ఫ, జ, జ, జ, ర అనే గణాలు వరుసగా ఉంటాయి.
3. పాడాది అక్షరానికి ఆ పాదంలోని 11వ అక్షరానికి యతిమైత్రి చెల్లుతుంది.
4. ప్రాస నియమము కలదు. ప్రాసయతి చెల్లదు.
5. చంపకమాల పద్యప్చోదము నందు మొదటి రెండు లఘువులను ఒక గురువు చేసినచో అది ఉత్పలమాల పద్య పాదమవుతుంది.

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers 19

ఇది మత్తేభ పద్యపాదము.
యతి : 1 – 14వ అక్షరము.
1వ పాదం : ధ-త్+సం ; 2వ పాదం : బ-స్+వం ; 3వ పాదం : త-ద్రం ; 4వ పాదం : ప-ల్+పా
ప్రాస : రెండవ అక్షరము “ర-ర-ర-ర”

లక్షణము :
1. మత్తేభ పద్యము నందు నాలుగు పాదాలుంటాయి.
2. ప్రతి పాదమునందు స,థ,ర,న,మ,య,వ అనే గణాలు వరుసగా ఉంటాయి.
3. పాదాది అక్షరానికి ఆ పాదంలోని 14వ అక్షరానికి యతిమైత్రి చెల్లుతుంది.
4. ప్రాస నియమము కలదు. ప్రాసయతి చెల్లదు.
5. మత్తేభ పద్యపాదము నందు మొదటి రెండు లఘువులను ఒక గురువు చేస్తే అది శార్దూల పద్యపాదమవుతుంది.

ప్రాజెక్టుపని

ఈ పాఠంలోని శతకకవుల కవి కాలాదుల పట్టికను తయారుచేసి ప్రదర్శించండి.

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers 20

చ. అరిగెడు కాల మెవ్వరికి నాపగ శక్యముగాదు ముందుగా
నరిగిన కాలమున్ మరల నందుట సాధ్యముగాదు దైవమే
కరణి విధించునో యటులె కర్మము సాగు నటంచు పెద్దలం
దురు పురుష ప్రయత్నమున దోడ్పడు దైవమటండ్డు కొందరున్. — గెడ్డాపు సత్యం

భావం: “కదిలిపోతున్న కాలాన్ని ఆపడం ఎవరి తరం కాదు. అలాగే ముందు వెళ్లిపోయిన కాలాన్ని మళ్లీ అందుకోవడం ఎప్పటికీ సాధ్యం కాదు. దేవుడు ఎలా జరగాలని నిర్ణయిస్తే అలాగే జరుగుతుందని పెద్దలంటారు. మానవ ప్రయత్నం డ్వారా తోడ్పాటు అందించడమే దైవత్వమని అంటారు” అని కవి కాలం విలువను తెలియజెప్పారు. కాలాన్ని అనుసరించి జరిగే పరిణామాలను, వాటిని మనుషులు స్వీకరించే విధానాల్లో ఉండే వైవిధ్యాన్ని వెల్లడించారు.

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers శతక మాధుర్యం

సూక్తి : సత్యానికి, సన్మార్గానికి మించిన మతం లేదు. — గాంధీ

పద్యాలు – ప్రతిపదార్థాలు – భావాలు

1. చ. పలుచని నీచమానవుఁడు పాటిఁ దలంపక నిష్ఠురోక్తులం
బలుకుచునుండుఁగాని మతిభాసురుఁడైన గుణ ప్రపూర్ణుఁ డ
ప్పలుకులc బల్కఁబోవఁడు నిబద్ధిగ నెట్లన వెల్తికుండ దాఁ
దొలఁకుచు నుండుఁగాని మఱి దొల్కునె నిండుఘటంబు భాస్కరా!

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers 21

ప్రతిపదార్ధం :

భాస్కరా = ఓ సూర్యదేవా !
పలుచని = అల్పుడైన
నీచమానవుడు = నీచుడు
పాటిన్ = న్యాయం గురించి
తలంపక = ఆలోచించక
నిష్ఠుర + ఉక్తులన్ = కఠినపు మాటలను
పలుకుచు ఉండున్ = మాట్లాడుతూ ఉంటాడు
కాని = అంతేకాని
మతిభాసురుడు+ఐన = తెలివితో ప్రకాశించే
గుణ = మంచి గుణాలతో
ప్రపూర్ణుడు = నిండినవాడు
ఆ + పలుకులన్ = అటువంటి కఠినపు మాటలను
పల్కన్ = అనడానికి
పోవడు = సిద్ధపడడు
నిబద్ధిగన్ = నిజంగా
ఎట్లు + అన = ఎలాగంటే
వెల్తికుండ = కొద్దిగా వెలితి ఉన్న కుండ
తాన్ = తనంత తానే.
తొలకుచు = తొణుకుతూ (దానిలో నీరు)
ఉండున్ + కాని = ఉంటుంది కాని
నిండు ఘటంబు = నిండా (నీరు) ఉన్న కుండ
మఱి + తొల్కునె = తొణుకుతుందా ? (తొణకదు)

భావం : ఓ సూర్యదేవా ! నిండా (నీరు) ఉన్న కుండ తొణకదు. కానీ, కాద్దిగా వెలితిగా ఉన్న కుండ తొణుకుతుంది కదా ! అలాగే జ్ఞాని కఠినప మాటలు అన్యాయంగా మాట్లాడడు. కానీ, నీచుడు న్యాయం గురించి ఆలోచించకుండా పరుషంగా మాట్లాడతాడు.

2. శా. లేవో గానలఁ గందమూల ఫలముల్, లేవో గుహల్తోయముల్
లేవో యేఱ్లం బల్లవాస్తరణముల్ లేవో సదాయాత్మలో
లేవో నీవు విరక్తుల న్మనుప జాలింబొంది భూపాలురన్
సేవల్సేయఁగఁబోదు రేలొకో జనుల్ శ్రీరీకాళహస్తీశ్వరా! — ధూర్జటి

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers 22

ప్రతిపదార్ధం :

“శ్రీకాళహస్తి+ఈశ్వరా = శ్రీ, కాళ, హస్తులకు ముక్తిని ప్రసాదించి శ్రీకాళహస్తిలో వెలసిన పరమేశ్వరా!
కానలన్ = అడవులలో
కందమూల = దుంపలు
ఫలముల్ = పండ్లు
లేవు + ఓ = లేవా ? (ఉన్నాయి కదా!)
గుహల్ = కొండ గుహలు
లేవు + ఓ = లేవా ? (ఉన్నాయి కదా!)
ఏఱులన్ = నదులలో
తోయముల్ = నీళ్లు
పల్లవ + ఆస్తరణముల్ = పరచుకొన్న చిగుళ్లు
లేవు + ఓ = లేవా ? (ఉన్నాయి కదా !)
నీవు = నీవు (శివుడవు)
విరక్తులన్ = సన్న్యాసులను
మనుపన్ + చాలిన్ + పొంది = బ్రతికించ గలవాడవై
సదా = ఎల్లప్పుడు
ఆత్మలో = మనసులో
లేవు + ఓ = లేవా ? (ఉన్నావు కదా !)
ఐనా భూపాలురన్ = రాజులకు
సేవల్ + చేయగన్ = సేవలు చేయడానికి
జనుల్ = మానవులు
పోదురు + ఏల + ఒకో = ఎందుకు వెడతారో !

భావం : (శ్రీకాళహస్తీశ్వరా! ఈ అడవులలో తినుటకు కందమూల ఫలములు (పండ్లు) లేవా అన్నచో ఉన్నాయి. నివసించడానికి గుహలు ఉన్నాయి. త్రాగడానికి నదులలో నీరు ఉంది. మనసులో నీవున్నావు అనే ధైర్యం కలవారందరిని నీవు రక్షించి మోక్షాన్ని ఇస్తున్నావు. కానీ మానవులు దాసులై రాజులను సేవించడానికి ఎందుకు తరలిపోతున్నారు?

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers శతక మాధుర్యం

3. ఆ.వె. సత్య శీల ధర్మ సంస్థాపనార్థమై
యుగయుగాల పుట్టువొందు చుంద్రు
సహజ శక్తి గలుగు సంస్కారు లిలలోన
కాళికాంబ! హంస! కాళికాంబ — పోతులూరి వీరబ్రహ్మం

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers 23

ప్రతిపదార్ధం :

కాళిక + అంబ = ఓ కాళికా మాతా!
హంస = పరమాత్మ స్వరూపిణివైన
కాళిక+అంబ = ఓ కాళికా మాతా!
సత్య = సత్యము
శీల = (మంచి) స్వభావం
ధర్మ = ధర్మమును
సంస్థాపన + అర్థము + ఐ = నెలకొల్పడానికై
ఇలలోన = ఈ భూమిపై
సహజ శక్తి గలుగు = సహజమైన పటుత్వం ఉన్న
సంస్కారులు = మంచి ప్రవర్తన కలవారు
యుగయుగాల = చాలాకాలం నుండి
పుట్టువు + ఒందు – చుంద్రు = జన్మలెత్తుతున్నారు

భావం : ఓ కాళికాంబా! సత్యం(నిజం), శీలం(స్వభావం), ధర్మం అనే వాటిని తిరిగి స్థాపించటానికి ప్రతియుగంలోనూ వివేకం, విచక్షణ, సహజశక్తులు కలిగిన సంస్కారులు భూమిపై పుడుతూనే ఉంటారు.

4. ఆ.వె. భూమిలోనబుట్టు భూసారమెల్లను.
తనువులోన బుట్టు తత్త్యమెల్ల.
శమములోన బుట్టు సర్వంబు తానేను.
విశ్వదాభిరామ వినురవేమ! — వేమన

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers 24

ప్రతిపదార్ధం :

విశ్వద + అభిరామ = విశ్వ సృష్టి చేసిన అభిరామా!
వేమ = ఓ వేమనా!
వినుర = వినరా!
భూసారము = భూమి యొక్క బలం
ఎల్లను = అంతా
భూమిలోనన్ = భూమిలోనే
పుట్టు = పుడుతుంది
తత్వవు = జ్ఞానం
ఎల్ల = అంతా
తనువులోన్: = శరీరంలోసే
పుట్టు = పుడుతుంది
సర్వంబు మొత్తమంతా
తానౌను = తనకు తానే
శయములోన్ = కష్టపడడంలోనే
పుట్టు = పుడుతుంది

భావం : ఓ వేమా! భూమి యొక్క శక్తి అంతా భూమి నుంచే పుడుతుంది. అలాగే జ్ఞానం శరీరం(ఆత్మ)నుండే జనిస్తుంది. కష్టపడితేనే అన్నీ సాధ్యం అవుతాయి. ప్రపంచం నుంచే చరాచర జీవకోటి అంతా జన్మిస్తుంది. (శయ నుంచే సర్వసంపదలు వస్తాయి. శరమయే అన్నిటికీ మూలం.

5. శా. నీతి ప్రౌఢ విహారులైన నిపుణుల్ నిందింపనీ మెచ్చనీ,
ఖ్యాతిం జెందిన సంపదల్ నిలువనీ గాఢంబుగా సాగనీ
ఘాతం బప్పుడ పొందనీ నియతమైఁ గానీ యుగాంతంబునన్
నీతి శ్లాఘ్యపదంబు దప్పరు గదా నిత్యంబు ధీరోత్తముల్. — ఏనుగు లక్ష్మణకవి

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers 25

ప్రతిపదార్ధం :

నీతి ప్రౌఢ విహారులు + ఐన = గొప్ప నీతిమంతులైన
నిపుణుల్ = నేర్పరులు
నిందింపనీ = తిట్టనీ
మెచ్చనీ = ఏొగడనీ
ఖ్యాతి + చెందిన = కీర్తిని పొందిన
సంపదల్ = ఐశ్వర్యాలు
నిలువనీ = నిలబడనీ
గాఢంబుగా = దట్టంగా (ఎక్కువగా)
సాగనీ = పోనీ
అప్పుడ = అప్పుడే
ఘాతంబు = కీడు
పొందనీ = కలగనీ
యుగ+అంతంబునన్ = యుగము పూర్తయ్యేటప్పుడు
నియతము +ఐ =తప్పనిది (మరణం) జరగడం
కానీ = అవ్వనీ
ధీర + ఉత్తముల్ = థైర్యం కలవారు (గొప్పవారు)
నిత్యంబు = ఎల్లప్పుడూ
నీతి శ్లాఘ్యపదము = నీతి చేత పొగడబడిన స్థితిని
తప్పరు + కదా = విడిచి పెట్టరు కదా !

భావం : నీతివేత్తలు పొగిడినా, నిందించినా, సంపదలు నిలిచినా, పోయినా మరణం అప్పుడే వచ్చినా లేదా ఎప్పుడో ప్రళయ కాలంలో కలిగినా ధీరులు న్యాయ మార్నాన్ని దాటి ఒక్క అడుగైనా ముందుకు వేయరు.

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers శతక మాధుర్యం

6. చ. తెలివి యొకింత లేనియెడc దృప్తఁడనై కరిభంగి సర్వమున్
దెలిసితి నంచు గర్వితమతిన్ విహరించితిఁ దొల్లియిప్పుడు
జ్జ్యలమతు లైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై
తెలియనిహాఁడనై మెలఁగితిం గతమయ్యె నితాంత గర్వమున్ — ఏనుగు లక్ష్మణకవి

ప్రతిపదార్ధం :

తాల్లి = మొదట్లో
తిలివి = జ్ఞానం
ఒక + ఇంత = కొద్దిగా కూడా
లేని + ఎడ = లేనప్పుడు
దృప్పడను + ఐ = గర్వం కలవాడినై
కరిథంగి = ఏనుగులా
సర్వమున్ = అంతా
తిలిసితి + అంచు = తెలుసుకొన్నానంటూ
గర్వితమతిన్ = గర్వపు బుద్ధితో
విహరించితిన్ = సంచరించాను
ఇప్పుడు = నేడు
ఉజ్జ్రల మతులు+ఐన = ఏ్రకాశించే జ్ఞానం గల
పండితుల సన్నిధిని = విద్వాంసుల దగ్గర
ఇంచుక = కొద్దిగా
భోధశాలిని + ఐ = తెలుసుకొన్న వాడినై
తెలియనివాడను + ఐ = ఏమీ తెలియదని తెలుసుకొన్నవాడనై
మెలగితిన్ = ప్రవర్తించాను
నితాంత = అధికమైన
గర్వమున్ = గర్వం కూడా
గతము + అయ్యో = గడచిపోయినది అయ్యింది

భావం : ఇంతకు పూర్వం నాకు తెలివి కొద్దిగా కూడా లేనప్పుడు. అన్నీ తెలిసిన వాడిలా గర్వంతో మదించిన ఏనుగులా ఏ్రవర్తించాను. కానీ ఇపుడు పండితుల వల్ల కొన్ని విషయాలు తెలుసు కొనడంతో నాకు తెలిసినది తక్కువే అని అసలు ఏమి తెలియదు అని గ్రహించి ఇపుడు గర్వం వదిలి వినయంతో ఫ్రవర్తిస్తున్నాను.

7. ఆ వె. భావమెట్టులుండె బలుకట్టిదై యుండు
పలుకు లెట్టి వైనఁబనులు నట్లు
పనులననుసరించి ఫలములు చేకూరు
పాపభయ విభంగ భావలింగ! — దార్ల సుందరీమణి

ప్రతిపదార్ధం :

పాప భయ = పాపం వలన కలిగే యాన్ని
విథంగ = అడ్డుకొనేవాడా!
భావలింగ = భావలింగ స్వామీ
భావము = భావం
ఎట్టులు + ఉండె = ఎలా ఉంటే
పలుకు = మాట
అట్టిది + ఐ = అలా
ఉండు = ఉంటుంది
పలుకులు = మాటలు
ఎట్టివి + ఐనన్ = ఎలాంటివైతే
పనులు = పనులు కూడా
అట్లు = అలాగే ఉంటాయి
పనులను = కార్యాలను
అనుసరించి = వెన్నంటి
ఫలములు = ప్రయోజనాలు
చేకూరు = సమకూరుతాయి

భావం : పాపాలను, భయాన్ని తొలగించేహాడా! ఓ భావలింగా! మనసులో ఆలోచనలను బట్టి మాట్లాడే మాటలు వుంటాయి. మాటలెలా ఉంటాయో చేసే పనులు అలాగే ఉంటాయి. పనులను బట్టి ఫలితం ఉంటుంది.

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers శతక మాధుర్యం

8. ఆ వె. మాతృభాషయందు మాతృదేశమునందు
మమత లేనిఖాఁడు మనుజుఁడగునె?
తగని మమతయుండు మృగ పక్షిజాతికిఁ
గూడc దెలియలేవె కుప్పసామి! — త్రిపురనేని రామస్వామి చౌదరి

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers 26

ప్రతిపదార్ధం :

కుప్పసామి = ఓ కుప్పు సామీ !
మాతృష + అందు = తన మాతృభాషపై
మాతృదేశము+అందు = తన దేశం మీద
మమత లేనివాడు = ప్రేమ లేని వ్యక్తి
మనుఙుcడు + అగునె = మానవుడాతాడా ?
మృగ = జంతు
పక్షి. = పులుగు
జాతికిన్ + కూడ = జాతులకు కూడా
తగని = చాలా
మమత + ఉండు = ఏపేమ ఉంటుంది
తెలియలేవె = తెలుసుకో

భావం : ఓ కుప్పుసామీ! తన భాషపై, తన దేశంపై (పేమలేనివాడు మనిషేనా?జంతువులకు, పక్షులకు కూడా తమ జాతిపై అభిమానం ఉంటుంది కదా! (మనిషి తన భాషపైనా, దేశముపైనా ఖచ్చితంగా మమకారం కలిగి ఉండాలని భావం)

9. కం. ఇది కాదదియను, నదికా
దిది యను, నిది యదియు వదలి యెదియో పదరున్
వదలని ముదములc బొదలగ
నదవదపడి చెదరి యెడఁద హరిహరనాథా! — షేక్ మహమ్మద్ హుస్సేన్

ప్రతిపదార్ధం :

హరిహర నాథా! = ఓ హరిహర నాథా!
ఇదికాదు+అది+అను = ఇది కాదది అంటూ
అది కాదు+ఇది+అను = అది కాదిది అంటూ
ఇది + అదియు వదలి = రెండూ వదిలేసి
వదలని ముదములన్ = విడువని ఆనందాలతో
పొదలగ = వృద్ధి చెందగా
ఎడద =మనసు
అదవదపడి =కలత చెంది
చెదరి =ఏకాగ్రత పాడైపోగా
ఏదియో =ఏమిటిటో
వదరున్ =వాగుతుంది

భావం : ప్రభో! మనసుకు ఏకాగ్రత కుదరడం లేదు. ఇది కాదు అది కావాలి అనిపిస్తుంది. కానీ అంతలోనే అది వద్దు ఇది కావాలి అనిపిస్తుంది. మరలా ఇది కాదు, అది కాదు ఇంకేదో కావాలనిపిస్తుంది. ఎన్నో అనుమానాలతో ఏదీ నిర్ణయించుకోలేక మనసు కలతపడుతుంది నాకు ఉన్నదానితో తృప్తి పడే వివేకం కలిగించు.

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers శతక మాధుర్యం

10. మ. ధరలో నెంతటి దుర్జనుండయిన సత్సంగప్రభావంబుచే
బరసేవా పరతంత్ర చిత్తుడగు భాస్వంతుడు తోడై నిరం
తర మిత్రత్వ మొసంగుటంగద సముద్రం బిచ్చునవ్వారిగా
పరమ స్వాదుజలంబులన్ భుజగ తల్పా! వేంకటాద్రీశ్వరా! — గాడేపలి సీతారామమూరి

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers 27

ప్రతిపదార్ధం :

భుజగ తల్పా ! = సర్పం (ఆదిశేషువు) పాన్పుగా కలవాడా!
వేంకట+అద్రి+ఈశ్వరా ! = వేంకటాచలంపై వెలసిన ప్రభూ!
ధరలోన = ఈ భూమి మీద
ఎంతటి = ఎంత
దుః+జనుండు+అయిన= దుర్మార్గుడైనా
సత్సంగ = మంచిహారి స్నేహం
ప్రభావంచేన్ = శ్రుభావం వలన
పరసేవా = ఇతరులకు సేవ చేయడం వలన
పరతంత్ర = ఇతరులకు అధీనమైన
చిత్తుడు + అగు = మనసు కలవాడౌతాడు ఎలాగంటే
ఖాస్వంతుండు = సూర్యుడు
తోడు + = సహాయుడై
నిరంతర = ఎడతెగని
మిత్రత్వంబు = స్నేహ స్వభావం
ఒసంగుటన్ + కద = ఇవ్వడం వలన కదా !
సముద్రంబు = సాగరం
పరమ స్వాదు జలంబులన్ =మంచినీటిని
అవ్వారిగా = అధికంగా
ఇచ్చును =ఇస్తుంది

భావం : ఓ వేంకటాద్రీశ్వరా !ఈ లోకంలో ఎంత చెడ్డవాడైనా సజ్జనుల సాంగత్యంతో ఇతరులకు సేవ చేయాలని ఆలోచిస్తాడు. అది ఎలాగంటే సూర్యుని యొక్క నిరంతర స్నేహం వల్ల సముద్రం మనకు మబ్బుల ద్వారా తీయని జలాలను అందిస్తుంది కదా!

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers శతక మాధుర్యం

11. సీ. శౌర్యంబు గలుగుట జన్మసాఫల్యంబు,
శాంత మాత్మవివేక సాధనంబు
మానంబు దనకును మహనీయ సంపద,
సిగ్గుతో బ్రతుకు సంజీవనంబు
సవినయవచనంబు సర్వవశ్యకరంబు,
వెలయునాచారంబు పెనుబలంబు
దానంబు సేయుట తన కది దాఁచుట,
సజ్జనసంగతి సౌఖ్యమొసఁగు

తే.గీ గాన బుధులీ గుణంబులు మానకెపుడు,
తగిలి మిమ్ముభజింతురు తలఁచితలఁచి
కలితలక్ష్మీశ! సర్వజగన్నివేశ!
విమల రవికోటిసంకాశ! వేంకటేశ! — తాళ్ళపాక పెద్దతిరుమలాచార్యులు

ప్రతిపదార్ధం :

కలిత = లెక్కింపబడిన
లక్ష్మి + ఈశ = లక్ష్మీపతీ!
సర్వజగత్ + నివేశ = లోకమంతా వ్యాపించిన వాడా!
విమల = స్వచ్ఛమైన
రవికోటి = సూర్యుల సమూహంతో
సంకాశ = ప్రకాశించేపాడా!
వేంకట + ఈశ = వేంకటేశ్వర స్వామీ !
శౌర్యంబు = పరాక్రమం
కలుగుట = కలిగి ఉండడం
జన్మసాఫల్యంబు = జన్మ సఫలం కావడానికి కారణం
శాంతము = శాంతంగా ఉండడం
ఆత్మ వివేక సాధనంబు = ఆత్మజ్ఞ్జానం కలగడానికి పనిముట్టు
మానంబు = ఆత్మాఫిమానం కలిగి ఉండడం
తనకును = తనకు
మహనీయ = గొప్పదైన
సంపద = ఐర్యం
సిగ్గుతో = (తప్పు చేయడానికి) సిగ్గుపడుతూ
బ్రతుకు = బ్రతికే జీవితం
సంజీవనంబు = గొప్ప (బ్రతుకు
సవినయ వచనంబు = వినయంతో కూడిన మాట
సర్వవశ్యకరంబు = అన్నిదినీ, అందరినీ వశం చేసే సాధనం
వెలయు = ప్రకాశించే
ఆచారంబు = ఆచారం
పెనుబలంబు = గొప్ప బలం
దానంబు = దానం
చేయుట = చేయడం
అది = ఆ దానం చేసినది
తనకు = తన కోసం
దాచుట = ఫద్రపరచుకోవడమే
సత్ + జన = మంచిపారి
సంగతి = స్నేహం (కలయిక)
సౌఖ్యము + ఒసగు = సౌఖ్యాన్ని ఇస్తుంది
కాన = కనుక
బుధులు = పండితులు
ఈ గుణంబులు = లక్షణాలు
ఎప్పుడు = పమయంలోనూ
మానక = విడిచెట్టక
తగిలి = మిమ్ము చేరి
తలచి తలచి = పదే పదే మిమ్ము స్మరిస్తూ
ఫజింతురు = సేవిస్తారు

భావం :  అంతట వ్యాపించినవాడా! లక్ష్మీదేవిని కలిగినవాడా! (శ్రేష్ఠమైన కాంతితో ప్రకాశించేహాడా! ఓ వేంకటేశా! పరాక్రమం, శక్తి కలిగి ఉండటం వల్ల జన్మకు ప్రయోజనం చేకూరినట్లే. శాంతమును కలిగి ఉంటే తనలో తాను మంచి చెడులను విచారించుకోవచ్చు.

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers శతక మాధుర్యం

తనపై తాను గౌరవాన్ని కలిగి ఉండడం జీవితంలో గొప్ప సంపద వంటిది. లజ్జను కలిగి జీవించడం సంజీవనం వంటిది. వినయంతో కూడినమాట అందరిని ఆఫ్తలను చేస్తుంది. ఆచారాన్ని పాటించడం గొప్ప బలాన్ని ఇస్తుంది. తనకున్నదాన్ని త్యాగం చేయడం దాచుకున్న సంపదతో సమానమైనది. మంచి వారితో కలిసి మాట్లాడడం నిజమైన సుఖం. విద్యావంతులు ఈ గుణాలను వదిలి పెట్టరు. ఎల్లప్పుడూ భగవంతుని భక్తితో సేవిస్తూ ఉంటారు.

అదనవు భాషాంశాలు

పర్యాయపదాలు

గుణము : స్వభావము, అంతః ప్రకృతి, అంతము, తత్తము, ధర్మము, పాడి, భావము, శీలము, సత్వము, స్వరూపము
పలుకు : మాట, ఆభాషణము, ఆలాపనము, ఉక్తి, నుడి, భాషణము, వచనము, వచస్సు, వాక్కు, వాణి
భాస్కరుడు : సూర్యుడు, అంబరీషుడు, అంశుపతి, అంశుమాలి, అరుణ కిరణుడు, అరుణుడు
తోయము : నీళ్ళు, అంభువు, అంభస్సు, ఉదకము, జలము
పల్లవము : చిగురు, కీసలము, కిసలయము, ప్రవాళము
భూపాలుడు : రాజు, అధిపతి, అధీశుడు, అవనీపతి, క్షత్రియుడు, చక్రవర్తి, ధవుడు, నృపాలుడు
శ్రీ : సంపద, ఆస్తి, ఐశ్వర్యము, కలిమి, భాగ్యము, హిరణ్యము, లక్ష్మి
కాళము : పాము, అహి, ఉరగము, పన్నగము
హస్తి : ఏనుగు, కరి, అనేకపము, కరేణువు, వేదండము
సత్యము : ఋతము, నిక్కము, నిజము, వాస్తవము
శీలము : స్వభావము, అంతఃప్రకృతి, తత్త్వము, స్వరూపము
యుగము : యుగ్మము, యుగళి, జంట, జోడు
హంస : అంచ, కలకంఠము, కలహంస, చక్రాంగము, మరాళము, రాజహంస
భూమి : పుడమి. అవని, పృథ్వి, ధరణి
తనువు : శరీరము, కాయము, దేహము
నిత్యము : ఎల్లప్పుడు, అనవరతము, అవిరతము, అహర్నిశము, నిచ్చలు, నిరంతరము, శాశ్వతము
పండితుడు : అభిజ్ఞుడు, కవి, కోవిదుడు, ప్రజ్ఞాలుడు, ప్రాజ్ఞుడు, విద్వాంసుడు, విశారదుడు
నితాంతము : అధికము, అక్కజము, అదనము, అనయము, అనల్పము, అపారము, అపరిమితము
గర్వము : అంతర్మదము, అహంకారము, అహము, కావరము, గీర్వాణము, పొగరు
మాత : తల్లి, అంబ, అప్ప, అమ్ట్, జనని, జనయు(త్రి
దేశము : అథిరాజ్యము, పుడమి, ప్రదేశము, మండలము, రాజ్యము, రాష్యুము, సాయ్రాజ్యము
మృగము : కీలాలము, ఖేలి, చతుష్పదము, చతుష్పాదము, జంతువు, జన్యువు, పశువు, పసరము
పక్ష : అనేకజము, ఖగము, గువ్వ, నగౌకసము, ద్విజము, నీడజము, పతగము, పలలుగు, వాజి, విహంగము, విహ్యసయు, పిట్ట
శౌర్ము : ఉపక్రమము, తేజము, పరాక్రమము, మగతనము, విక్రమము, పిర్యము, సోమము
శాంతము : శమము, శాంతి, ప్రశాంతము
డానము : అంహతి, అర్పణము, ఈవి, (ప్రదానము, దాయము, వితరణము, దత్తము
సౌఖ్యము : సుఖము, ఆనందము, ఖలాసా.

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers శతక మాధుర్యం

నానార్థాలు

గుణము – స్వభావము, అల్లెత్రాడు
పలుకు – స్తుతించు, అపనింద, నిందించు, ఆఖ్ఞ, ముక్కు, మాట, చెప్పు, విఠ్య, టోధించు, రచించు
భాస్కరుడు – సూర్యుడు, అగ్నిదేవుడు, శూరుడు, శళవుడు
ఫలము – పండు, బుడ్డ, ప్రయోజనము, ఉద్దేశము, పంట
తోయము – నీరు, పరివారము, సమయము
పల్లవచు – ఆకు, చిగురు, ముంజేయి
శ్రీ – లక్ష్మి, సంపద, ఎషము, సాలెపురుగు
సత్యుు – నీళ్ళు, బలము, నిజము, అప్పు
చీలము – స్వభావము, అందము, అభ్లాసము
ధర్మము – స్వభావము, న్యాయము, పుణ్యము, విల్లు, అచారము
మాత – ఆవ, తల్లి, పొలము, లక్ష్మి, పార్వతి
దేశము – ఉరు, మండలము, చోటు
మృగషు – పశువు, గజభేదములు, జింక
పక్షి – విహాయసము, బాణము
శౌర్యహు – బలము, తేజము
దానము – కపోలమదము, ఎితరణము, పరిపాలనము
సాఖ్యము – సుఖము, తృష్తి

వ్యుత్పత్త్యర్ధములు

భాస్కరుడు – కాంతి కలుగజేయువాడు – సూర్యుడు
భూపాలుడు – భూమిని పరిపాలించువాడు – రాజు
ఈశ్వరుడు – స్వభావము చేతనే ఐశ్వర్యము కలవాడు – శివుడు
ధూర్జజి – భారమైన జటలు కలవాడు. నలుపు, ఎరుపు కలిసిన వన్నె కలవాడు – ఈశ్వరుడు
భాస్వంతుడు – ప్రకాశించువాడు – సూర్లుడు
ఘుజగతల్ – భుజగమే (పాము) పాన్పుగా కలవాడు – విష్ణువు
ముతుడు – సర్వభూతముల యందు స్నేహయక్తుడు – స్నేహితుడు, సూర్యుడు
సముడ్రము – చంద్రోదయము వలన వృద్ధి పొందునది, అంతటను సంతోషము నిచ్చునది. ఈశ్వరాజ్ఞతో కూడుకొని ఉండునది – సాగరము
రవికోటి సంకాశుడు – భారమైన కాంతితో ప్రకాశించేవాడు – భగవంతుడు

ప్రకృతి – వికృతులు

గుణము – గొనము
పండితుడు – పంతులు
శక్తి – సత్తి
హంస – అంచ
నిత్యము – నిచ్చలు
పండితుడు – పామరుడు
భాష – బాస
స్వామి – సామి
ప్రకృతి – వికృతి
మతి – మది
సత్యము – సత్తెము
ధర్మము – దమ్మము
ధూమి – బూమి
గర్వము – గరువము
ఫలము – పండు
పక్షి – పక్కి
సముద్రము – సంద్రము

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers శతక మాధుర్యం

సంధులు

1. సపర్ణదీర్ఘ సుధి :

శ్రీకాళహస్తీశ్యరా – శీీకాళహస్తి + ఈశ్వరా
కాళాకాంబ – కాళిక + అంబ
సంస్థాపసార్రము – సంస్థాపన + అర్థము
విశ్వదాఖిరామ – విశ్వద + అభిరామ
యుగాంతంబు – యుగ + అంతంబు
సతతాంత – నిత + అంత
పేంకటాద్రీశ్యరా – వేంకట+అద్రి+ఈశ్వరా
లక్ష్మీశ – లక్ష్మి + ఈశ

2. గుఙసంథి :

నిష్తురోక్తులు – నిష్ఠుర + ఉక్తులు
ధీరోత్తముల్ – ధీర + ఉత్తముల్
వేంకటేశ – వేంకట + ఈశ

3. అనునాసిక సంథ :

జగన్నివాస – జగత్ + నివాస

4. ఉత్యసంధి :

భూసారమెల్లను – భూసారము + ఎల్లను
తానౌను – తాను + ఔను
తత్త్వమెల్ల – తత్త్వము + ఎల్ల
విహారులైన – విహారులు + ఐన
నియతమై – నియతము + ఐ
దృప్తుడనై – దృప్తుడను + ఐ
గతమయ్యె – గతము + అయ్యె
భాపమెట్టులుండె – భావము + ఎట్టులుండె
మనుజుఁడగునె – మనుజుడు + అగునె
ఇచ్బును్యారిగా – ఇచ్చును + అవ్వారిగా
వెలయుసాచారంబు – వెలయును + ఆచారంబు
సౌఖ్యమొసగు – సౌఖ్యము + ఒసగు
మాసకెపుడు – మానకు + ఎపుడు
పుట్టువొందు – పుట్టువు + ఒందు

5. యడాగమ సంథి :

తొల్లియిప్పుడు – తొల్లి + ఇప్పుడు
సడాయాత్మ – సదా + ఆత్మ
వదలియోదియో – వదలి + ఎదియో

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers శతక మాధుర్యం

సమాసాలు

1. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము :

నీచమానవుడు – నీచుడైన మానవుడు
నిష్యురోక్తులు – నిష్ఠురమైన ఉక్తులు
నిండు ఘటము – నిండైన ఘటము
స్వాదు జలంబులు – స్వాదువైన జలంబులు
పెనుబలము – పెను (పెద్దది) యెన బలము
సర్వజగన్నివేశ – సర్వమైన జగన్నివేశ
సహజశక్తి – సహజమైన శక్తి
ధీరోత్తములు – ధీరులైన ఉత్తములు
శ్లాఘ్యుపదషు – శ్లాఘ్యుమైన పదము

2. సంభావన పూర్వపద కర్మధారయ సమాసము :
కుప్పుస్వామి – కుప్పు అను పేరు గల స్వామి
కాళికాంబ – కాళిక అను పేరు గల అంబ
వేంకటాద్రి – వేంకట అను పేరు గల అద్రి

3. షష్ఠీ తత్పురుష సమాసం :

యుగాంతము – యుగము యొక్క అంతము
కరిభంగి – కరి యొక్క భంగి
జన్మసాఫల్యము – జన్మ యొక్క సాఫల్యము
ఆత్మ వివేకము – ఆత్మ యొక్క వివేకము
సజ్ఞన సంగతి – సజ్జనుల యొక్క సంగతి
లక్ష్మీశ – లక్ష్మికి ఈశుడు
భూసారము – భూమి యొక్క సారము

4. బహువ్రీహా సమాసం :

భుజగతల్పా – భుజగమే తల్పముగా కలవాడు

5. ద్వంద్వ సమాసం :

కందమూల ఫలములు – కందమూలములు, ఫలములును
గుహల్తోయములు – గుహలును, తోయములును
సత్యశీల ధర్మాలు – సత్యమును, శీలమును, ధర్మమును

6. తృతీయా తత్పురుష సమాసం :

గుణప్రపూర్ణుడు – గుణము చేత’ ప్రపూర్ణుడు
మతి భాస్కరుడు – మతి చేత భాస్కరుడు

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers శతక మాధుర్యం

పరిచయం

1. మారద వెంకయ్య క్రీ.శ. 1550-1600 మధ్య కాలానికి చెందిన కవి. వీరు భాస్కరశతకం రచించారు. ఈ శతకం ఉదాహరణ హూర్వకమైన నీతిబోధలతో కొనసాగుతుంది. ఇది తెలుగులో వచ్చిన మొదటి దృష్టాంత శతకం.

2. ధూర్జటి 16వ శతాబ్దానికి చెందినవారు. శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజకవులలో ధూర్జటి ఒకరు. (శ్రీకాళహస్తీశ్వర శతకం, శ్రీకాళహస్తి మాహాత్యం రచించారు.

3. పోతులూరి వీర(బ్రహ్మేంద్రస్వామి 17వ శతాబ్దానికి చెందిన కవి. కడప జిల్లావాసి. కాలజ్ఞానం, కాళికాంబసప్తశతి, సిద్ధగురుటోధ, వీరకాళికాంబ శతకం వంటి రచనలు చేశారు.

4. వేమన క్రీ. శ 1652-1730 మధ్యకాలానికి చెందిన కవి అని పరిశోధకుల అభిప్రాయం. ఈయన శశీ సత్యసాయి జిల్లా కటారుపల్లిలో సిద్ధి పొందారు. విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో ఆటవెలది ఛందంలో పద్యాలను రచించారు.

5. 6 ఏనుగు లక్ష్మణకవి క్రీ. శ. 1720-1780. కాకినాడ జిల్లా పెడ్దాడ గ్రామవాసి. భర్తృహరి సంస్కృతంలో రాసిన “సుభాషిత త్రిశతె’ని సుభాషిత రత్నావళి పేరుతో తెలుగులోకి అనువదించారు. వీరు రామేశ్వరమాహాత్యం, విశ్వామిత్ర చరిత్ర, గంగామాహాత్మృం, రామవిలాసం వంటి రచనలు చేశారు.

7. శ్రీమతి దార్ల సుందరీమణి : 19వ శతాబ్ది కవయిత్రి. పల్నాడు జిల్లాలోని చర్లగుడిపాడులో జన్మించారు. 1833 ల6 భావలింగ శతకం రచించారు.

8. త్రిపురనేని రామస్వామి చౌదరి : క్రీ. శ 1887-1943. కృష్ణాజిల్లా అంగలూరులో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. కుప్పుస్వామి శతకం, సూతపురాణం, ఖూని, రాణా ప్రతాప్ వంటి రచనలు చేశారు.

9. షేక్ మహమ్మ్ర హుస్సేన్ : 20 శ శతాబ్దానికి చెందిన కవి. ఏలూరు జిల్లా దొరసానిపాడు గ్రామంలో జన్మించారు. హరిహరనాథ శతకం వంటి రచనలు చేశారు.

10. గాడేపల్లి సీతారామ మూర్తి : క్రీ. శ 1935-2018. బాపట్ల జిల్లా అద్దంకి నివాసి. ఈయన 20వ శతాబ్దానికి చెందినవారు. వేంకటాద్రీశ్వర శతకం, అశ్వత్థామ, సుందరోత్పల రామాయణం వంటి రచనలు చేశారు.

11. తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు క్రీస్తుశకం 1460-1548 మధ్య కాలానికి చెందిన కవి. పదకవితా పితామహుడైన తాళ్లపాక అన్నమాచార్యుని రెండవ కుమారుడు. సుదర్శన రగడ, వేంకటేశ శతకము, వేంకటేశ్వర వచనాలు, ఆధ్యాత్మ సంకీర్తనలు వంటి రచనలు చేశారు.

AP 10th Class Telugu 3rd Lesson Questions and Answers శతక మాధుర్యం

ప్రక్రియ – శతకం

నూరు పద్యాల రచనను శతకం అంటారు. శతకాలలో నూరు నుండి నూట ఎనిమిది పద్యాలు ఉంటాయి. శతకానికి మకుటం ప్రధానంగా ఉంటుంది. మకుటం అంటే కిరీటం. ఇది శతకపద్యాలలో ప్రతిపద్యం చవర ఉంటుంది. ఇది పదంగా గాని, అర్ధపాదంగా గాని, పాదంగా గాని, పాదద్వయంగా గాని ఉండవచ్చు. శతకపద్యాలు ముక్తకాలు. అంటే ఏ పద్యానికదే స్వతంత్ర భావంతో ఉంటుంది.

ఉద్దేశం

శతక పద్యాలు జీవన నైపణ్యాలను ప్రణోధిస్తాయి. ఈ పద్యాల ద్వారా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా, లోకజ్ఞానం కలఖారిగా తీర్చిదిద్ది, వారిలో నైతిక విలువలు పెంపొందింపజేయడమే ఈ పాఠం ఉద్దేశం

Leave a Comment