These AP 10th Class Telugu Important Questions 3rd Lesson శతక మాధుర్యం will help students prepare well for the exams.
శతక మాధుర్యం AP Board 10th Class Telugu 3rd Lesson Important Questions and Answers
అవగాహన – ప్రతిస్పందన
ఈ క్రింది పరిచిత పద్యాలను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. సత్య శీల ధర్మ సంస్థాపనార్థమై
యుగయుగాల పుట్టు వొందు చుంద్రు
సహజ శక్తి గలుగు సంస్కారు లిలలోన
కాళికాంబ! హంస! కాళికాంబ!
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
యుగయుగాల పుట్టేవారెవరు?
జవాబు:
యుగయుగాల పుట్టేవారు సంస్కారులు.
ప్రశ్న 2.
సంస్కారుల శక్తి ఎటువంటిది?
జవాబు:
సంస్కారుల శక్తి సహజమైనది.
ప్రశ్న 3.
సంస్కారులు ఎందుకు పుడతారు?
జవాబు:
సత్య, శీల, ధర్మ సంస్థాపన కోసం సంస్కారులు పుడతారు.
ప్రశ్న 4.
పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
పై పద్యంలో రెండుసార్లు ప్రయోగించిన పదమేది?
2. భూమిలోనబుట్టు భూసారమెల్లను
తనువులోన బుట్టు తత్త్వమెల్ల
శ్రమములోన బుట్టు సర్వంబు తానేను
విశ్వదాభిరామ వినురవేమ!
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
అన్నీ దేనిలోంచి పుడతాయి?
జవాబు:
అన్నీ శ్రమలోంచి పుడతాయి.
ప్రశ్న 2.
తత్త్వం ఎక్కడ పుడుతుంది?
జవాబు:
తత్త్వం తనువులో పుడుతుంది.
ప్రశ్న 3.
భూసారం ఎక్కడ పుడుతుంది?
జవాబు:
భూసారం భూమిలోంచే పుడుతుంది.
ప్రశ్న 4.
పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
పై పద్యంలో పేర్కొన్న వాటిలో గొప్పదేది?
3. భావమెట్టులుందె బలుకట్టిదై యుండు
పలుకు లెట్టివైనంబనులు నట్లు
పనులననుసరించి ఫలములు చేకూరు
ప్రాపభయ విభంగ భావలింగ!
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
పాప భయాన్ని పోగొట్టేదెవరు?
జవాబు:
పాప భయాన్ని భావలింగేశ్వర స్వామి పోగొడతాడు.
ప్రశ్న 2.
మాట దేనిననుసరించి ఉంటుంది?
జవాబు:
భావాన్ని అనుసరించి మాట ఉంటుంది.
ప్రశ్న 3.
ఫలితాలు దేన్ని బట్టి వస్తాయి?
జవాబు:
పనులను బట్టి ఫలితాలు వస్తాయి.
ప్రశ్న 4.
పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
పై పద్యంలో ప్రధానమైనది ఏది?
4. మాతృభాషయందు మాతృదేశమునందు
మమత లేనివాఁడు మనుజుఁడగునె ?
తగని మమతయుండు మృగ పక్షిజాతికిఁ
గూడఁ దెలియలేవె కుప్పుసామి!
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
వేటిపై ప్రేమ ఉండాలి?
జవాబు:
మాతృభాష, మాతృభూమిపై ప్రేమ ఉండాలి.
ప్రశ్న 2.
మనుజుఁడగునె ? అంటే ఏమిటి ?
జవాబు:
మనిషి కాదు అని అర్థం.
ప్రశ్న 3.
పై పద్యంలో సంబోధన పదమేది?
జవాబు:
పై పద్యంలో ‘కుప్పుస్వామి’ సంబోధన పదం.
ప్రశ్న 4.
పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
మృగాలకు, పక్షులకు వేటిపై మమత ఉంటుంది?
5. ఇది కాదదియను, నదికా
దిది యను, నిది యదియు వదలి యెదియో పదరున్
వదలని ముదములఁ బొదలగ
నదవదపడి చెదరి యెడఁద హరిహరనాథా!
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
ఇది కాదని ఏది కావాలంటుంది?
జవాబు:
ఇది కాదని అది కావాలంటుంది.
ప్రశ్న 2.
అది, ఇది కాదని ఏది కావాలంటుంది?
జవాబు:
అది, ఇది కాదని ఏదో కావాలంటుంది.
ప్రశ్న 3.
ఏది చెదిరిపోతోంది?
జవాబు:
మనసు చెదిరిపోతోంది.
ప్రశ్న 4.
పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
పై పద్యంలో దేని గురించి చెప్పారు?
వ్యక్తీకరణ సృజనాత్మకత
ఆ) ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
మారద వెంకయ్యను గురించి తెల్పండి.
జవాబు:
మారద వెంకయ్య 16వ శతాబ్దపు కవి. ఈయన ‘భాస్కర శతకాన్ని’ రచించాడు. ఈ శతకం ఉదాహరణ పూర్వకమైన నీతి కథలతో కొనసాగుతుంది. ఇది తెలుగులో వచ్చిన దృష్టాంత శతకం.
ప్రశ్న 2.
ధూర్జటిని గురించి రాయండి.
జవాబు:
ధూర్జటి కవి 16వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవులలో ఒకడు. ఈయన శ్రీకాళహస్తి మాహాత్మ్యము, శ్రీకాళహస్తీశ్వర శతకము అను గ్రంథాలు రచించాడు.
ప్రశ్న 3.
“కాళికాంబ హంస కాళికాంబ” – ఈ శతాకాన్ని రచించినదెవరు? ఆయన గూర్చి తెల్పండి.
జవాబు:
“కాళికాంబ హంస కాళికాంబ” – అన్న మకుటం గల శతకాన్ని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రచించాడు. ఈయన -17వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన కడప జిల్లా నివాసి. ఈయన కాలజ్ఞానం, కాళికాంబ సప్తశతి, సిద్ధ గురుబోధ, వీర కాళికాంబ శతకం వంటి రచనలు చేశారు.
ప్రశ్న 4.
వేమన కవిని గురించి రాయండి.
జవాబు:
వేమన 17వ శతాబ్దపు కవి. ఈయన శ్రీ సత్యసాయి జిల్లా కటారుపల్లిలో సిద్ధి పొందారు. “విశ్వదాభిరామ వినురవేమ” అనే మకుటంతో ఆటవెలది ఛందంలో పద్యాలను రచించారు.
ప్రశ్న 5.
ఏనుగు లక్ష్మణకవి గురించి రాయండి.
జవాబు:
ఏనుగు లక్ష్మణకవి 18వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన కాకినాడ జిల్లా పెద్దాడ గ్రామవాసి. భర్తృహరి సంస్కృతంలో రాసిన “సుభాషిత త్రిశతి”ని సుభాషిత రత్నావళి పేరుతో తెలుగులోకి అనువదించారు. వీరు రామేశ్వర మాహాత్మ్యం, విశ్వామిత్ర చరిత్ర, గంగా మాహాత్మ్యం, రామవిలాసం వంటి రచనలు చేశారు.
ప్రశ్న 6.
‘పాప భయ విభంగ భావలింగ’ ఈ మకుటంతో రాసిన పద్యం ఏ శతకంలోనిది? కవి ఎవరు? వారిని గూర్చి తెల్పండి.
జవాబు:
ఈ మకుటంతో రాసిన పద్యం ‘భావలింగ శతకం’లోనిది. ఈ శతకాన్ని శ్రీమతి దార్ల సుందరీమణి అను కవయిత్రి రాసింది. ఈమె 19వ శతాబ్దపు కవయిత్రి. పల్నాడు జిల్లాలోని చర్లగుడిపాడులో జన్మించారు. 1833లో ఈ శతకాన్ని రాశారు.
ప్రశ్న 7.
త్రిపురనేని రామస్వామి చౌదరిని గూర్చి రాయండి.
జవాబు:
త్రిపురనేని రామస్వామి చౌదరి 19వ శతాబ్దపు కవి. విమర్శకుడు. కృష్ణాజిల్లా అంగలూరులో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. ఈయన కుప్పుసామి శతకం, సూత పురాణం, ఖూని, రాణాప్రతాప్ వంటి రచనలు చేశారు.
ప్రశ్న 8.
షేక్ మహమ్మద్ హుస్సేన్ ను గూర్చి రాయండి.
జవాబు:
ఈయన 20వ శతాబ్దపు కవి. ఏలూరు జిల్లా దొరసానిపాడు గ్రామంలో జన్మించారు. హరిహరనాథ శతకం వంటి రచనలు .
చేశారు.
ప్రశ్న 9.
తాళ్ళపాక పెద్ద తిరుమలాచార్యులను గురించి తెల్పండి.
జవాబు:
ఈయన 15వ శతాబ్దం ఉత్తరార్థానికి చెందిన కవి. పద కవితా పితామహుడైన తాళ్ళపాక అన్నమాచార్యుని రెండవ కుమారుడు. సుదర్శన రగడ, వేంకటేశ శతకము, వేంకటేశ్వర వచనాలు, ఆధ్యాత్మ సంకీర్తనలు వంటి రచనలు చేశారు.
ప్రశ్న 10.
గాడేపల్లి సీతారామమూర్తి గురించి తెల్పండి.
జవాబు:
గాడేపల్లి సీతారామమూర్తి గారు 20వ శతాబ్దపు కవి. ఈయన బాపట్ల జిల్లా అద్దంకి నివాసి. ఈయన వేంకటాద్రీశ్వర శతకం, అశ్వత్థామ, సుందరోత్పల రామాయణము వంటి రచనలు చేశారు.
ప్రశ్న 11.
సద్గుణాలతో ఉన్న మంచివాని గొప్పదనం ఏమిటి ? కవి చెప్పిన దృష్టాంతాన్ని వివరించండి.
జవాబు:
వెలితి కుండ తొణుకుతుంది గానీ నీరు నిండుగా ఉన్న కుండ తొణకదు. అలాగే మంచిగుణం లేని నీచుడు న్యాయాన్ని గురించి ఆలోచించకుండా కఠినమైన మాటలు మాట్లాడతాడు. సద్గుణాలతో ఉండే మంచివాడు అలాంటి పరుషమైన మాటలు మాట్లాడడు.
ప్రశ్న 12.
ప్రజలు రాజులను సేవించడానికి ఎందుకు తరలిపోతున్నారని ధూర్జటి పొందిన ఆవేదన ఎట్టిది?
జవాబు:
ప్రజలకు కావలసిన కందమూల ఫలాలు అడవులలో సమృద్ధిగా ఉన్నాయి. నివసించడానికి గుహలున్నాయి. త్రాగుటకు నదులలో నీరున్నది. ధైర్యం పొందడానికి మనసులలో నీవున్నావు కదా! నీవు రక్షించి మోక్షం ఇస్తుండగా ప్రజలు గ్రహించకుండా నీచమైన రాజులును సేవించడానికి వెడుతున్నారు అని కవి ఆవేదన చెందాడు.
ప్రశ్న 13.
పోతులూరి వీరబ్రహ్మం ఏమని కాళికాదేవిని స్తుతించాడు?
జవాబు:
అమ్మా! కాళికాంబా! సత్యం (నిజం), శీలం (స్వభావం), ధర్మం అనే వాటిని తిరిగి స్థాపించటానికి ప్రతియుగంలోనూ వివేకం, విచక్షణ, సహజ శక్తులు కలిగిన సంస్కారులు భూమిపై పుడుతున్నారని చెప్తూ ప్రార్థించి స్తుతించాడు.
ప్రశ్న 14.
“శ్రమయే అన్నిటికీ మూలం” ఎందువలన?
జవాబు:
భూమి యొక్క శక్తి అంతా భూమి నుంచే పుడుతుంది. అలాగే జ్ఞానం శరీరం (ఆత్మ) నుంచే జనిస్తుంది. కష్టపడితేనే అన్నీ సాధ్యం అవుతాయి. ప్రపంచం నుంచే చరాచర జీవకోటి అంతా జన్మిస్తుంది. శ్రమ నుంచే సర్వ సంపదలు వస్తాయి. కనుక శ్రమయే అన్నిటికీ మూలం.
ప్రశ్న 15.
ధీర గుణం కలవారి గుణం ఎట్టిది?
జవాబు:
నీతివేత్తలు పొగడినను, నిందించినను, సంపదలు నిలిచినను, పోయినను, మరణము అప్పుడే కలిగినను, కల్పాంతమునకు కలిగినను ధీరగుణం కలవారు న్యాయమార్గాన్ని ఎన్నడునూ దాటిపోరు.
ప్రశ్న 16.
వినయవంతుని లక్షణమేమిటి?
జవాబు:
పూర్వం తెలివి ఉన్నప్పుడు అన్నీ తెలిసినవాడిలా, గర్వంతో మదించిన ఏనుగులా ప్రవర్తించాను. కానీ ఇప్పుడు పండితుల వల్ల కొన్ని విషయాలు తెలుసుకొనడంతో నాకు తెలిసినది తక్కువే అని అసలు ఏమీ తెలియదు అని గ్రహించి ఇపుడు గర్వం వదిలి వినయంతో ప్రవర్తిస్తున్నాను.
ప్రశ్న 17.
సజ్జన సాంగత్యం ఎట్టిది?
జవాబు:
ఈ లోకంలో ఎంత చెడ్డవాడైనా సజ్జనుల సాంగత్యంతో ఇతరులకు సేవ చేయాలని ఆలోచిస్తాడు. అది ఎలాగంటే సూర్యుని యొక్క నిరంతర స్నేహం వల్ల సముద్రం మనకు మబ్బుల ద్వారా తీయని జలాలను అందిస్తుంది.
ఆ) ఈ క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాల్లో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
నీచుని వెలితి కుండతోనూ, ఉత్తముని నిండుకుండతోనూ ఎందుకు పోల్చారు ?
జవాబు:
నీచునికి తెలిసినది తక్కువ. అయినా అదే విషయాన్ని వ్యక్తీకరించి చెబుతాడు. వానిలోని న్యాయం, ధర్మం, సందర్భం గురించి ఆలోచించడు. కఠినంగా మాట్లాడతాడు. తనకు ఆశ్రయమిచ్చిన వారికి, గొప్పవారికి ఇబ్బంది కలిగిస్తాడు. వృథాగా అగౌరవం పొందుతాడు.
వెలితి కుండ కూడా తనలోని పదార్థాన్ని తొణుకుతూ, బయటకు చిమ్ముతుంది. తనను మోసేవారికి అసౌకర్యం కలిగిస్తుంది. చివరకు జారిపోయి నేలపాలవుతుంది. అందుకే నీచుని వెలితికుండతో పోల్చారు.
ఉత్తముడు కంగారుపడడు. అనవసరంగా మాట్లాడడు. ఎవరికీ ఇబ్బంది కలిగించడు. తన గౌరవాన్ని పోగొట్టుకోడు. కుదుపులు వచ్చినా సహిస్తారు.
నిండుకుండ తొణకదు. దానిని భరించే వారికి ఇబ్బంది కల్గించదు. చిన్న చిన్న కుదుపులకు తొణకదు. అందుకే ఉత్తముని నిండుకుండతో పోల్చారు.
ప్రశ్న 2.
రాజులను సేవించ వద్దని ధూర్జటి ఎందుకన్నాడు?
జవాబు:
సాధారణంగా కూడు, గూడు, గుడ్డ లేనివారే ఇతరులను ఆశ్రయిస్తారు. వారి దగ్గర పని చేస్తారు. వినయ, విధేయతలతో ఉంటారు. రాజు అంటే పరిపాలకుని కూడా కూడు, గూడు, గుడ్డ కోసమే ఆశ్రయిస్తారు. కొందరైతే పదవుల కోసం, విలాసాల కోసం ఆశ్రయిస్తారు. రాజులను సేవిస్తారు. పొగుడుతారు. నిందలు భరిస్తారు.
జానెడు పొట్ట కోసం, బారెడు పక్క కోసం ఎవరినో ఆశ్రయించి వాళ్ల సేవ చేయక్కర్లేదంటాడు ధూర్జటి. మనకు కావలసినవన్నీ ఉచితంగా ప్రకృతిలో దొరుకుతాయి.
కడుపు నింపుకోవడానికి షడ్రసోపేతమైన విందు భోజనం అక్కర్లేదు. దుంపలు, పళ్లు చాలు. నివసించడానికి పెద్ద పెద్ద భవంతులు అక్కలేదు. ప్రకృతిలోని కొండగుహలు చాలు. నీరు సెలయేళ్లలో, నదులలో దొరుకుతాయి. ధైర్యం చెప్పడానికి ఆ పరమేశ్వరుడే ఉన్నాడు.
కాబట్టి రాజుల నాశ్రయించి ఆత్మగౌరవం పోగొట్టుకోవద్దని ధూర్జటి అంటాడు.
ప్రశ్న 3.
పాండిత్యం ఉన్నప్పటికీ, లేనప్పటికీ తేడా ఏమిటి?
జవాబు:
పాండిత్యం అంటే తెలివిలినప్పుడు మూర్ఖత్వం పెరుగుతుంది. మూర్ఖత్వం ఉన్నవారు ఎవ్వరి మాటా వినరు. తమకు తెలియనిది తెలుసుకోరు. తమకు తెలిసినది కొంచమైనా చాలా తెలుసుననుకొంటారు. గర్వంతో ఉంటారు. తామే గొప్పవారనుకొంటారు. ఎవ్వరినీ లెక్కచేయరు.
గొప్ప పండితుల దగ్గర చదువుకొంటే, వారు అనేక విషయాలు చెబుతారు. అవి వింటుంటే తనకు తెలియనివి చాలా ఉన్నాయని తెలుస్తుంది. ఇంకా ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది. ఇంకా చదువుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి అంటే పండితుల వద్ద వినయంగా ప్రవర్తించాలి. గర్వం వదలాలి. మూర్ఖత్వం పోవాలి. అప్పుడు తన తెలివి తక్కువతనం తెలుస్తుంది. అనేక విషయాలు తెలుసుకొనే కొద్దీ అజ్ఞానం, అహంకారం, గర్వం, మూర్ఖత్వం పోతాయి. తన గురించి తాను తెలుసుకొంటాడు. తనకేమీ తెలియదనీ, తెలుసుకోవలసినది చాలా ఉందని తెలుసుకొంటాడు.
ఇ) కింది అంశాల గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.
ప్రశ్న 1.
శతక సాహిత్యం చదవమని ప్రబోధిస్తూ మీ మిత్రునికి ఒక లేఖ వ్రాయండి.
జవాబు:
ఏలూరు, X X X X X. ప్రియమైన మాధురికి, ఇక్కడ మేమంతా క్షేమం. అక్కడ మీరంతా క్షేమం అని తలచెదను. ఈ విధంగా శతకమాధుర్యం చాలా బాగుంటుంది. నువ్వు కూడా శతక సాహిత్యం చదువు. లోకం పోకడ తెలుస్తుంది. సమాధానం వ్రాయి. ఇట్లు, చిరునామా : |
ప్రశ్న 2.
మీ పాఠశాలలో జరిగే తెలుగు భాషాదినోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఒక శతక కవిని ఇంటర్వ్యూ చేయడానికి ప్రశ్నావళిని తయారుచేయండి.
జవాబు:
- నమస్కారమండీ! దయచేసి తమరి పేరు చెబుతారా?
- మీ కలం పేరేమిటి?
- మీరిప్పటి వరకూ ఎన్ని శతకాలు రాశారు?
- మీకేమైనా అవార్డులు, రివార్డులు వచ్చాయా?
- మీరు శతకాలు కాకుండా ఇంకేమైనా రాశారా?
- మీరు శతక సాహిత్యం వైపు ఎలా ఆకర్షితులయ్యారు?
- మీరు శతకాలేమైనా సీస పద్యాలలో వ్రాశారా?
- మీ గురువు గారు ఎవరు?
- దేశభక్తి శతకాలేమైనా వ్రాశారా?
- మీరు మా విద్యార్థులకేమైనా సందేశం ఇస్తారా?
భాషాంశాలు (పదజాలం వ్యాకరణాంశాలు)
కింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి.
అలంకారాలు
ఈ క్రింది వాక్యాల్లోని అలంకారాన్ని గుర్తించి రాయండి.
1. అక్షర జ్ఞానం లేని నిరక్షరకుక్షి ఈ క్షితిలో ప్రత్యక్షముగా కష్టముల పాలగును.
జవాబు:
వృత్త్యనుప్రాసాలంకారం
2. “ఇది కాదదియను, నది కా
దిదియను, నిదియదియు వదలి యెదియో పదరున్”
జవాబు:
వృత్త్యనుప్రాసాలంకారం
3. లక్ష్య భక్ష్యములు భక్షించే లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా!
జవాబు:
వృత్త్యనుప్రాసాలంకారం
గణవిభజన – పద్యపాదం పేరు
కింది పద్య పాదానికి గురులఘువులు గుర్తించి, గణ విభజన చేసి, ఏ పద్య పాదమో రాయండి.
4. మునివరనీవు శిష్యగ ణముంగొని చయ్య నరమ్ము విశ్వనా
జవాబు:
ఇది చంపకమాల పద్యపాదము.
5. నీతి ప్రౌఢ విహారులైన నిపుణుల్ నిందింపనీ మెచ్చనీ
జవాబు:
ఇది శార్దూల పద్యపాదము.
6. ధరలో నెంతటి దుర్జనుండయిన సత్సంగ ప్రభావంబుచే
జవాబు:
ఇది మత్తేభ పద్యపాదము.
7. వాసనలేని పువ్వుబుధ వర్గములేని పురంబుభక్తివిశ్వా
జవాబు:
ఇది ఉత్పలమాల పద్యపాదము.
అర్థాలు
అ) గీత గీసిన పదానికి అర్థం రాయండి.
1. విమల మైన నీటిని త్రాగాలి.
జవాబు:
స్వచ్ఛం
2. రవి లేనిదే వెలుగులేదు.
జవాబు:
సూర్యుడు
3. సభకు జనకోటి వెడలింది.
జవాబు:
సమూహం
4. రావణుడు వందమంది రాక్షసులకు సంకాశము.
జవాబు:
సమానం
5. లక్ష్మీశుడు నిత్య పూజలందుకొంటాడు.
జవాబు:
శ్రీహరి
6. గాంధీజీ కీర్తి కవితము.
జవాబు:
లెక్కించదగినది
7. అనామకుని భజించుట అనవసరం.
జవాబు:
సేవించుట
8. మంచిని తలచినచో ఆనందం కల్గుతుంది.
జవాబు:
స్మరణ
9. మంచి గుణములు అలవరచుకోవాలి.
జవాబు:
లక్షణం
10. బుధులు పొగడ్తలకు లొంగరు.
జవాబు:
పండితులు
11. సజ్జనులు అధిక సంపాదన ఆశించరు.
జవాబు:
మంచివారు
12. మంచివారి సంగతి మంచి చేస్తుంది.
జవాబు:
స్నేహం
13. పెను బలం ఉందని గర్వించకూడదు.
జవాబు:
ఎక్కువ
14. అనవసర వచనాలు వివాదాలకు దారి తీస్తాయి.
జవాబు:
మాటలు
15. ప్రాణం కంటే మానం గొప్పది.
జవాబు:
గౌరవం
16. సాధనం ఏదీ లేకపోతే నట్టు ఎలా ఊడుతుంది?
జవాబు:
పనిముట్టు
17. వివేకం లేనివాడు విసిగిస్తాడు.
జవాబు:
తెలివి
18. అర్జునుని శౌర్యం సాటిలేనిది.
జవాబు:
పరాక్రమం
19. పల్లవము చెట్టుకు అందం.
జవాబు:
గురు
20. సదా చదువుకోవాలి.
జవాబు:
ఎల్లప్పుడు
ఆ) గీత గీసిన పదానికి సరియైన అర్థాన్ని గుర్తించండి.
21. మంచి వారి మిత్రత్వం వీడకూడదు.
అ) వైరం
ఆ) స్నేహం
ఇ) బంధుత్వం
ఈ) ప్రక్క ఇల్లు
జవాబు:
ఆ) స్నేహం
22. స్వాదుజలం మాత్రమే త్రాగాలి.
అ) డబ్బా నీరు
ఆ) నూతి నీరు
ఇ) మంచి నీరు
ఈ) గంగాజలం
జవాబు:
ఇ) మంచి నీరు
23. ముదమును ధనంతో కొనలేము.
అ) గాలి
ఆ) నీరు
ఇ) ఆకాశం
ఈ) సంతోషం
జవాబు:
ఈ) సంతోషం
24. పక్షికి ఆహారం, నీరు ఇవ్వాలి.
అ) జంతువు
ఆ) విహంగం
ఇ) ఈగ
ఈ) హంస
జవాబు:
ఆ) విహంగం
25. మంచి పని అడ్డుకోకూడదు.
అ) కార్యం
ఆ) కరణం
ఇ) కారణం
ఈ) గని
జవాబు:
అ) కార్యం
26. గర్వం పనికిరాదు.
అ) బలం
ఆ) శక్తి
ఇ) సత్తువ
ఈ) పొగరు
జవాబు:
ఈ) పొగరు
27. ఇంచుక కూడా తప్పు చేయకూడదు.
అ) చాలా
ఆ) కొంచెం
ఇ) అంత
ఈ) ఇంత
జవాబు:
ఆ) కొంచెం
28. పండితులు గౌరవార్హులు.
అ) గురువులు
ఆ) తెలుగు ఉపాధ్యాయులు
ఇ) పెద్దలు
ఈ) విద్యాంసులు
జవాబు:
ఈ) విద్యాంసులు
29. వినాయకునికి తొల్లి పూజ చేస్తారు.
అ) చివర
ఆ) తుద
ఇ) మొదటి
ఈ) సదా
జవాబు:
ఇ) మొదటి
30. సాయంసంధ్యతో పగలు అంతం అవుతుంది.
అ) మొదలు
ఆ) ఆర్తి
ఇ) ముగింపు
ఈ) అనంతం
జవాబు:
ఇ) ముగింపు
31. పిల్లలను ఘాతములుతో లొంగదీయాలనుకోవడం అవివేకం.
అ) మాటలు
ఆ) తిట్లు
ఇ) పొగడ్తలు
ఈ) దెబ్బలు
జవాబు:
ఈ) దెబ్బలు
32. మంచిప్రవర్తన వలన ఖ్యాతి పెరుగుతుంది.
అ) కీర్తి
ఆ) డబ్బు
ఇ) హాోదా
ఈ) పదవి
జవాబు:
అ) కీర్తి
33. భూమి పై ఉన్న అన్ని జీవులూ సమానమే.
అ) ఆకాశము
ఆ) నింగి
ఇ) నీరు
ఈ) నేల
జవాబు:
ఈ)నేల
34. అనవసరంగా నింద చేయకూడదు.
అ) పొగడ్త
ఆ) తిట్టు
ఇ) దెబ్బ తిట్టు
ఈ) యుద్ధం
జవాబు:
ఆ) తిట్టు
35. ధీరులు దేనికీ భయపడరు.
అ) ధైర్యవంతులు
ఇ) మునులు
ఆ) వీరులు
ఈ) దేవతలు
జవాబు:
అ) ధైర్యవంతులు
పర్యాయపదాలు
అ) గీత గీసిన పదానికి పర్యాయపదాలు రాయండి.
36. బాగా చదివితే ఉపాధ్యాయులు మెచ్చుకొంటారు.
జవాబు:
పొగుడుతారు, నుతి చేస్తారు.
37. మంచి పనులు చేస్తే ఖ్యాతి వస్తుంది.
జవాబు:
కీర్తి, పేరు
38. సంపద శాశ్వతంగా ఉండదు.
జవాబు:
విభూతి, ఐశ్వర్యం
39. మంచి వారి స్నేహం గాఢంగా ఉంటుంది.
జవాబు:
దట్టంగా, దళసరిగా
40. నిత్యము జ్ఞానార్జన చేయాలి.
జవాబు:
ఎల్లప్పుడు, సదా
41. చదువు వలన తెలివి పెరుగుతుంది.
జవాబు:
మేధ, జ్ఞానం
42. కరి శాకాహారి.
జవాబు:
ఏనుగు, గజం
43. పులి పంజా ఘాతము గట్టిగా తగిలింది.
జవాబు:
దెబ్బ, హతి
44. దైవం నియతం.
జవాబు:
సత్యమైనది, యథార్థమైనది
45. నేను పార్కులో విహరించితి.
జవాబు:
తిరిగాను, సంచరించాను.
46. తొల్లి కథలే నేటి చరిత్రలు.
జవాబు:
మొదటి, తొలి
47. పండితులు అనుమాన నివృత్తి చేస్తారు.
జవాబు:
విద్వాంసులు, బుధులు
48. దైవ సన్నిధిలో ఉంటే భయం ఉండదు.
జవాబు:
సమీపం, చేరువ
49. ఇంచుక కూడా తప్పు చేయకూడదు.
జవాబు:
కొంచెం, కొద్దిగా
50. గురువు బోధ వలన అజ్ఞానం పోతుంది.
జవాబు:
బోధించుట, ఉపదేశించుట
51. మంచిగా మెలగుట ఉత్తముల లక్షణం.
జవాబు:
ప్రవర్తించుట, వర్తించుట
52. గతం భవిష్యత్తుకు పునాది.
జవాబు:
గడచినది, భూతకాలం
53. అన్నమయ్యకు భక్తి నితాంతము.
జవాబు:
ఎక్కువ, అధికము
54. గర్వము పనికిరాదు.
జవాబు:
మదము, పొగరు
55. పిల్లి కూడా పులి భంగి ఉంటుంది.
జవాబు:
విధము, పగది
ఆ) గీత గీసిన పదానికి సరియైన పర్యాయపదాలు గుర్తించండి.
56. మంచి భావంతో మాట్లాడాలి.
అ) తాత్పర్యం, సారాంశం
ఆ) స్వభావం, గుణం
ఇ) మనసు, మతి
ఈ హృదయం, గుండె
జవాబు:
అ) తాత్పర్యం, సారాంశం.
57. పలుకు వలననే గౌరవాగౌరవాలు కలుగుతాయి.
అ) ముక్క, సకలం
ఆ) చెక్క, ముక్క
ఇ) మాట, వాణి
ఈ) మూట, డబ్బు
జవాబు:
ఇ) మాట, వాణి
58. మంచి పనికి మంచి ఫలము కలుగుతుంది.
అ) పండు, ఫలితం
ఆ) ఫలితం, ప్రయోజనం
ఇ) లాభం, ధనం
ఈ) గౌరవం, ఆదరణ
జవాబు:
ఆ) ఫలితం, ప్రయోజనం
59. తెలిసీ పాపం చేయకూడదు.
అ) పుణ్యం, సుకృతం
ఆ) కష్టం, నష్టం
ఇ) సుఖం, దుఃఖం
ఈ) దురితం, దోషం
జవాబు:
ఈ) దురితం, దోషం
60. మాతను మించిన దైవం లేదు.
అ) తల్లి, అమ్మ
ఆ) అమ్మ, నాన్న
ఇ) నవ్వు, హాస్యం
ఈ) చిక్కు, సంకటం
జవాబు:
అ) తల్లి, అమ్మ
61. డొక్కా సీతమ్మగారు అందరిపై మమత కురిపించింది.
అ) ప్రేమ, జాలి
ఆ) ప్రేమ, ఆప్యాయత
ఇ) అన్నం, ఆహారం
ఈ) అమృతం, పీయూషం
జవాబు:
ఆ) ప్రేమ, ఆప్యాయత
62. సృష్టిలో మనుజుడు తెలివైనవాడు.
అ) మనిషి, నరుడు
ఆ) మర్త్యుడు, మహర్షి
ఇ) దనుజుడు, దానప్పుడు
ఈ) కొడుకు, కుమారుడు
జవాబు:
అ) మనిషి, నరుడు
63. మృగములను కాపాడాలి.
అ) జంతువు, జంత్రి
ఆ) లేడి, పులి
ఇ) మేక, గొర్రె
ఈ) జంతువు, పసరము
జవాబు:
ఈ) జంతువు, పసరము
64. పక్షిని వేటాడడం మహాపాపం.
అ) ఖగము, జగము
ఆ) పులుగు, ఖగం
ఇ) పులుగు, పులి
ఈ) చిలుక, పిచ్చుక
జవాబు:
ఆ) పులుగు, ఖగం
65. వదరు బోతుకు విలువ ఉండదు.
అ) వాగుడు, ఎక్కువ మాట్లాడు
ఆ) మాట, పలుకు
ఇ) త్రాగు, మద్యం
ఈ) కల్లు, సారా
జవాబు:
అ) వాగుడు, ఎక్కువ మాట్లాడు
66. మదిలో ముదమును వదలకు.
అ) సంతసం, సంతాపం
ఆ) తెలివి, ఆలోచన
ఇ) హ్లాదం, ఆహ్లాదం
ఈ) భక్తి, ఆరాధన
ఆ) ఫలితం, ప్రయోజనం
జవాబు:
ఇ) హ్లాదం, ఆహ్లాదం
67. అడవదపడి నిర్ణయాలు తీసుకోకూడదు.
అ) కలతపడి, ఆందోళనపడి
ఆ) కోపం, క్రోధం
ఇ) సుత, సుంత
ఈ) కూత, కోత
జవాబు:
అ) కలతపడి, ఆందోళనపడి
68. ఎడద విశాలంగా ఉండాలి.
అ) గుండె, కాలేయం
ఆ) చేయి, హస్త
ఇ) హృదయం, ఎద
ఈ) ఉదరము, పొట్ట
జవాబు:
ఇ) హృదయం, ఎద
69. కోరిన కోర్కెలు తీర్చేవాడు హరుడు.
అ) హరి, హరుడు
ఆ) విధి, విరించి
ఇ) విష్ణువు, శౌరి
ఈ) శివుడు, రుద్రుడు
జవాబు:
ఈ) శివుడు, రుద్రుడు
70. లక్ష్మీనాథుడు హరి.
అ) పతి, భర్త
ఆ) పత్ని, భర్త
ఇ) మగడు, మగాడు
ఈ) సతి, పతి
జవాబు:
అ) పతి, భర్త
ప్రకృతి – వికృతులు
అ) గీత గీసిన పదానికి సరియైన ప్రకృతి పదం రాయండి.
71. మనిసి దురాశను విడవాలి.
జవాబు:
మనుజుడు
72. మదిలో మంచి ఆలోచన చెయ్యాలి.
జవాబు:
మతి
73. మనిషికి గొనము పేరు తెస్తుంది.
జవాబు:
గుణము
74. కుణ్ణములు పూర్వము వాడేవారు.
జవాబు:
కుండ
75. గడ్డ కూరగా గాని, వేపుడుగా గాని బాగుంటుంది.
జవాబు:
కంద
76. మామిడిపండు రుచిగా ఉంటుంది.
జవాబు:
ఫలము
77. గొబలో సింహం ఉండవచ్చు.
జవాబు:
గుహ
78. సిరి కోసం తప్పు చేయకూడదు.
జవాబు:
శ్రీ
79. అంచ అందమైన పక్షి.
జవాబు:
హంస
80. అత్తి భూమిపై తిరిగే పెద్ద జంతువు.
జవాబు:
హస్తి
81. ఈసుడు ఐశ్వర్య ప్రదాత.
జవాబు:
ఈశ్వరుడు
82. సత్తెమునే పలకాలి.
జవాబు:
సత్యము
83. దమ్మము తప్పకూడదు.
జవాబు:
ధర్మము
84. పిల్లలకు అల్లరి సాజము.
జవాబు:
సహజము
ఆ) గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
85. అంబను మించిన దైవం లేదు.
అ) అమ్మ
ఆ) అక్క
ఇ) పార్వతీ దేవి
ఈ) లలితాదేవి
జవాబు:
అ) అమ్మ
86. కాళికను జాతరలో చూస్తాము.
అ) కాలం
ఆ) కాహళిక
ఇ) కలికి
ఈ) కలికం
జవాబు:
ఆ) కాహళిక
87. శక్తి కలవాడు ఏదైనా సాధిస్తాడు.
అ) శక్తి
ఆ) ఆసత్తి
ఇ) సత్తి
ఈ) శకితి
జవాబు:
ఇ) సత్తి
88. భూమిలో పంటలు పండుతాయి.
అ) భూమి
ఆ) భూ
ఇ) భువి
ఈ) భూధరం
జవాబు:
అ) బూమి
89. శ్రమ అనారోగ్యాలను రూపుమాపుతుంది.
అ) శమ
ఆ) సరమ
ఇ) శరము
ఈ) చెమట
జవాబు:
ఈ) చెమట
90. భక్తులు భగవంతుని గాఢముగా నమ్ముతారు.
అ) గాటము
ఆ) గటము
ఇ) దృఢము
ఈ) దిటవు
జవాబు:
అ) గాటము
91. సింహ ఘాతముతో ఒక మనిషి మరణించాడు.
అ) ఘతము
ఆ) గతము
ఇ) గాతము
ఈ) గత్యంతరం
జవాబు:
ఇ) గాతము
92. ప్రౌడ దేనినైనా సాధించగలదు.
అ) ప్రౌఢి
ఆ) ప్రోడ
ఇ) ప్రౌఢత్వం
ఈ) ప్రఢి
జవాబు:
ఆ) ప్రోద
93. నియతము గలవారు ధన్యులు.
అ) నియమము
ఆ) నీమం
ఇ) నిత్యం
ఈ) నీతము
జవాబు:
ఈ) నీతము
94. ధీరుడు దేనికీ భయపడదు.
అ) దిట్టడు
ఆ) దిటవు
ఇ) దిట్టు
ఈ) ధీటు
జవాబు:
అ) దిట్టడు
95. గర్వం మనిషిని నశింప చేస్తుంది.
అ) గారం
ఆ) గారవం
ఇ) గరువము
ఈ) గౌరవం
జవాబు:
ఇ) గరువము
96. తెలుగు పండితుడు పద్యం చెప్పారు.
అ) పంతులు
ఆ) ఇండి
ఇ) పండి
ఈ) విదుడు
జవాబు:
అ) పంతులు
97. మంచి భాష నేర్చుకోవాలి.
అ) భష
ఆ) బాస
ఇ) బస
ఈ) బస్సు
జవాబు:
బాస
98. మృగము అడవిలోనే స్వేచ్ఛగా బతుకుతుంది.
అ) మకాం
ఆ) మఖము
ఇ) మెకము
ఈ) మక్కె
జవాబు:
ఇ) మెకము
99. పక్షిని వేటాడడం తప్పు,
అ) పకియ
ఆ) పకిషి
ఇ) పక్షం
ఈ) పక్కి
జవాబు:
ఈ) పక్కి
నానార్థాలు
అ) గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి.
100. దాశరథీ శతకములో పద్యములు శతకం ఉన్నాయి.
జవాబు:
నూరు పద్యాల రచన, వంద,
101. ఈ పలుచని పుస్తకంలో మానవుల పలుచన కు చెందినవి ఉన్నాయి.
జవాబు:
సన్నని, వెలితిదనం
102. ఆ మానవుడు కొత్త మానవుడు జన్మకు కారణం.
జవాబు:
నరుడు, శిశువు
103. పెద్దలు పాటి తప్పురు కనుక అందరికీ వారే పాటి.
జవాబు:
న్యాయం, ప్రమాణం
104. పిల్లలు బాగుండాలని అమృతలపు అదే తలపు ఏ తల్లి దైన.
జవాబు:
ఆలోచన, కోరిక
105. నిష్ఠురం గా మాట్లాడినా ఫరవాలేదు కాని నిష్ఠురం పలకకూడదు.
జవాబు:
కఠినం, అమంగళ వచనం
106. ఉక్తి కరుణ ఉంటే మంచి ఉక్తి పలుకుతాం.
జవాబు:
సరస్వతీ దేవి, మాట
107. రాముని గుణము మంచిది కనుక ధనస్సు గుణము లాగాడు.
జవాబు:
లక్షణం, అల్లెత్రాడు.
108. పూర్ణము తనలో పూర్ణము బనదే లోకం.
జవాబు:
సమస్తం, నిందైన
109. కవి పలుకు మిఠాయి పలుకులా ఉంది.
జవాబు:
మాట, ముక్క
110. ఎప్పుడు వెలితి పడే స్వభావం వ్యక్తికి వెలితి.
జవాబు:
న్యూనత, పూర్ణము కానిది
111. తొలకు కుండ తొలకుట జరగదు.
జవాబు:
తొణకు, అతిశయించుట
112. ఘటమును ఘటముతో పోలుస్తారు.
జవాబు:
శరీరం, కుండ
113. ఆకాశంలో భాస్కరుడు భాస్కరుడు లా మండుతున్నాడు.
జవాబు:
సూర్యుడు, అగ్ని
114. కాన అంటూ కథ చెబుతూ కాన కు తీసుకొని వచ్చాడు.
జవాబు:
కనుక, అడవి
115. మూల నక్షత్రంలో మొక్క మూల తొడిగింది.
జవాబు:
ఒక నక్షత్రం పేరు, వేరు
116. గుహ ఉన్నవాడెవడూ గుహలో దూరదు.
జవాబు:
బుద్ధి, కొండబిలం
117. ఈ తోయము మొక్కలకు తోయము పోయాలి.
జవాబు:
తడవ, నీరు
118. మనదేశంలో ఏరులు ఏరుట సరదాగా ఉంటుంది.
జవాబు:
నది, ఎన్ను
119. చెట్టు పల్లవము పల్లవముగా ఉంది.
జవాబు:
చిగురు, విరివి
ఆ) గీత గీసిన పదానికి సరైన నానార్థాలు గుర్తించండి.
120. ఆత్మ ఉన్న వారికి ఆత్మ తత్వం తెలుస్తుంది.
అ) బుద్ధి, జీవుడు
ఆ) డబ్బు, పదవి
ఇ) మనసు, ప్రేమ
ఈ) భయం, దెయ్యం
జవాబు:
అ) బుద్ది, జీవుడు
121. శ్రీ కోసం శ్రీని వదులుకోకూడదు.
అ) సంపద, సరస్వతి
ఆ) డబ్బు, కోపం
ఇ) కీర్తి, సమయం
ఈ) పదవి, ధైర్యం
జవాబు:
అ) సంపద, సరస్వతి
122. ఈశ్వరుడు అందరికీ ఈశ్వరుడు.
అ) శివుడు, దైవం
ఆ) శివుడు, రక్ష
ఇ) శివుడు, ప్రభువు
ఈ) విష్ణువు, ఆధారం
జవాబు:
ఇ) శివుడు, ప్రభువు
123. సత్యంలో సత్యం పలికేవారు.
అ) నిజం, నిక్కం
ఆ) కృతయుగం, నిజం
ఇ) యుగం, కాలం గురించి
ఈ) నేడు, అసత్యం
జవాబు:
ఆ) కృతయుగం, నిజం
124. మంచి శీలము గల వారు శీలముతో ఉంటారు.
అ) స్వభావం, మంచినడత
ఆ) గుణం, ఆనందం
ఇ) అనుభవం, బాధ
ఈ) కారణం, జగతి
జవాబు:
అ) స్వభావం, మంచినడత
125. ధర్మం వీడకపోతే ధర్మం లభిస్తుంది.
అ) విధి, లాభం
ఆ) ఆట, జయం
ఇ) ప్రయత్నం, ఫలితం
ఈ) న్యాయం, పుణ్యం
జవాబు:
ఈ) న్యాయం, పుణ్యం
126. యుగములు నాలుగైతే రెండు యుగములు.
అ) కృతాది, జత
ఆ) అంకెలు, జత
ఇ) రెండు, ఎనిమిది
ఈ) మూడు, ఆరు
జవాబు:
అ) కృతాది, జత
127. శక్తి ఉన్నవారు శక్తి పూజలు, నైవేద్యాలు చేయగలరు.
అ) సమయం, కాళిక
ఆ) బలం, పార్వతీదేవి
ఇ) డబ్బు, వినాయకుడు
ఈ) మందిరం, లక్ష్మి
జవాబు:
ఆ) బలం, పార్వతీదేవి
128. హంస వంటి ప్రాణం ఉన్నపుడే హంసను పూజించాలి.
అ) లక్ష్మి జీవం
ఆ) పక్షి తల్లి
ఇ) దైవం
ఈ) అంచ, పరమాత్మ
జవాబు:
ఈ) అంచ, పరమాత్మ
129. కాళిక రంగు కాళిక.
అ) పార్వతి, నలుపు
ఆ) లక్ష్మి, తెలుపు
ఇ) సరస్వతి, తెలుపు
ఈ) కొండ, ఎరుపు
జవాబు:
అ) పార్వతి, నలుపు
130. అంబ రోజూ అంబను పూజిస్తుంది.
అ) అమ్మ, దైవం
ఆ) అత్త, గుడి
ఇ) అమ్మ, పార్వతీదేవి
ఈ) అక్క, అమ్మవారు
జవాబు:
ఇ) అమ్మ, పార్వతీదేవి
131. మనకు భూమి లేని చోట భూమి ఎలా కొనగలం?
అ) పుడమి, అవని
ఆ) సిరి, అవని
ఇ) సంపద, ధర
ఈ) చోటు, నేల
జవాబు:
ఈ) చోటు, నేల
132. మన తత్త్వం మంచిదైతే ఆ తత్త్వం మనలోనే ఉంటాడు.
అ) స్వభావం, పరమాత్మ
ఆ) ఆలోచన, ఆనందం
ఇ) ఊహ, విజయం
ఈ) డబ్బు, పాలకుడు
జవాబు:
అ) స్వభావం, పరమాత్మ
133. శ్రమ చేస్తే శ్రమ పడుతుంది.
అ) ఆలోచన, సిరి
ఆ) కష్టం, సంపద
ఇ) కష్టం, చెమట
ఈ) సుఖం, కష్టం
జవాబు:
ఇ) కష్టం, చెమట
వ్యుత్పత్త్యర్థాలు
అ) గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్థం రాయండి.
134. తోయము ప్రాణం నిలబెడుతుంది.
జవాబు:
రక్షించునది (జలం)
135. తోటకు మంచు ఆస్తరణము ఐనది.
జవాబు:
కప్పబడునది (కంబళి)
136. ఆత్మలో దైవాన్ని ధ్యానించాలి.
జవాబు:
సంసారము నందే ఎప్పుడూ చరించువాడు. (పురుషుడు)
137. శ్రీని హరి పెండ్లాడెను.
జవాబు:
విష్ణువు నాశ్రయించునది (లక్ష్మి)
138. తప్పులు చేసి శ్రీని సంపాదించకూడదు.
జవాబు:
జనుల నాశ్రయించునది (సంపద)
139. సత్యమునే పలకాలి.
జవాబు:
సత్పురుషుల యందు పుట్టునది. (నిజము).
140. శీలమును బట్టి గౌరవం పెరుగుతుంది.
జవాబు:
లెప్పగా నడచుట, (స్వభావం)
141. మన ధర్మము మనను కాపాడుతుంది.
జవాబు:
విశ్వమును ధరించునది. (పుణ్యం)
142. కాళికను అర్చించాలి.
జవాబు:
నల్లని రూపం కలది. (పార్వతీదేవి)
143. హంస మానస సరోవరంలో ఉంటుంది.
జవాబు:
చరింతునది. (అంచ)
144. దేవతల కంటే అంబ గొప్పది.
జవాబు:
బాలురచే పిలువబడునది. (తల్లి)
145. భూమిని మనమే కాపాడుకోవాలి.
జవాబు:
ఉదకం వలన పుట్టును. (ధర)
146. తనువులో ప్రాణం ఉండగానే ధర్మం ఆచరించాలి.
జవాబు:
ఆహారము చేత విస్తారము చేయబడునది. (శరీరం)
147. ఉన్నత స్థితి అందరి చేత నితాంతము.
జవాబు:
మిక్కిలి కాంక్షించునట్టిది. (అతిశయమైన క్రియ)
148. ధీరులు దేనికీ భయపడరు.
జవాబు:
ధైర్యం కలవారు. (వీరులు)
ఆ) గీత గీసిన పదానికి సరైన వ్యుత్పత్త్వర్ణాన్ని గుర్తించండి.
149. శ్రీరాముడు ఉత్తముడు.
అ) గొప్పవాడు (ప్రముఖుడు).
ఆ) మంచి గుణాలు కలవాడు. (ప్రధానుడి)
ఇ) మిక్కిలి ఉత్కృష్టమైనవాడు. (అనుత్తముడు)
ఈ) కోరదగినవాడు (వరణీయుడు)
జవాబు:
ఇ) మిక్కిలి ఉత్కృష్టమైనవాడు (అనుత్తముడు)
150. సింహమునకు కరి వైరి అని పేరు.
అ) కరము (తొండం) కలది (ఏనుగు)
ఆ) గజానికి ఒక అడుగు వేసేది (గజము)
ఇ) కాళ్లు కలది (హస్తి)
ఈ) కుంభం కలది (కుంభి)..
జవాబు:
అ) కరము (తొండం) కలది (ఏనుగు)
151. జగన్నాథ పండితుడు ముంగందవాసి.
అ) దోషం తెలిసినవాడు (దోషజ్ఞుడు)
ఆ) సర్వం నెరిగినవాడు (విద్వాంసుడు)
ఇ) చాతుర్యము చేత వర్ణించువాడు (బుధుడు)
ఈ) ఎరుగువాడు (లేదా) బుద్ధి గలవాడు (కోవిదుడు)
జవాబు:
ఈ) ఎరుగువాడు (లేదా) బుద్ధి గలవాడు (కోవిదుడు)
152. మంచి భాష నేర్చుకోవాలి.
అ) భాషింపబడునది (బ్రాహ్మీ)
ఆ) భరతునిచే తేబడినది (భాష)
ఇ) దీనిని పలుకుదురు (గీర్వాణి)
ఈ) పలుకబడునది (వాణి)
జవాబు:
అ) భాషింపబడునది (బ్రాహ్మీ)
153. హరుడు అభిషేక ప్రియుడు.
అ) మన్మథుని సంహరించినవాడు (సురహరుడు)
ఆ) మూడు కన్నులు కలవాడు (ముక్కంటి)
ఇ) కంఠము నందు నలుపు కలవాడు (నీలకంఠుడు)
ఈ) ప్రళయకాలమున సర్వం హరించేవాడు (లేదా) భక్తుల పీడను హరించువాడు (శివుడు)
జవాబు:
ఈ) ప్రళయకాలమున సర్వం హరించేవాడు (లేదా) భక్తుల పీడను హరించువాడు (శివుడు)
154. కౌశికుడు పక్షిని బాధించాడు.
అ) ఱెక్కలు కలది (పులుగు)
ఆ) ఎగిరేది (విహంగం)
ఇ) ఆకాశంలో పోయేది (విహంగము)
ఈ) గుడ్లు పెట్టేది (నీడజము)
జవాబు:
అ) ఱెక్కలు కలది (పులుగు)
155. ధర ధర పెరిగింది.
అ) శిఖరములు కలది (ధర)
ఆ) తనలో బంగారం కలది (వసుధ).
ఇ) విశ్వమును ధరించునది (భూమి)
ఈ) విశ్వమును భరించునది (విశ్వంభర)
జవాబు:
ఇ) విశ్వమును ధరించునది (భూమి)
156. భాస్వంతుడు తూర్పున ఉదయించెను.
అ) కిరణములు కలవాడు (సూర్యుడు)
ఆ) కాంతులు కలవాడు (రవి)
ఇ) సప్త అనే గుర్రం కలవాడు (హరి)
ఈ) పూజింపబడువాడు (అర్యుడు)
జవాబు:
ఆ) కాంతులు కలవాడు (రవి)
157. నదులకు భర్త సముద్రము అంటారు.
అ) చంద్రోదయమున మిక్కిలి వృద్ధి పొందేది (లేదా) అంతటా సంతోషాన్నిచ్చేది (లేదా) ఈశ్వరాజ్ఞతో కూడుకొని ఉండేది (సాగరం).
ఆ) నీటికి నిధి (నీరధి)
ఇ) జలములకు నిధి (జలధి)
ఈ) వనములకు నిధి (వనధి)
జవాబు:
అ) చంద్రోదయమున మిక్కిలి వృద్ధి పొందేది. (లేదా) అంతటా సంతోషాన్నిచ్చేది (లేదా) ఈశ్వరాజ్ఞతో కూడుకొని ఉండేది (సాగరం)
158. జలము వృథా చేయరాదు.
అ) దాహం తీర్చేది (నీరు)
ఆ) ప్రవహించేది (వారి)
ఇ) ఘనీభవించేది (సలిలం)
ఈ) ఎత్తు పల్లాలను కలిపేది (నీరము)
జవాబు:
ఘనీభవించేది (సలిలం)
జాతీయాన్ని గుర్తించడం
వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి విడిగా రాయండి.
159. వాడొక వెల్తి కుండ.
జవాబు:
వెల్లికుండ,
160. ఆమె నిండు కుండలా తొణకదు. బెణకదు.
జవాబు:
నిండుకుండ
జాతీయము సందర్భము
ఈ జాతీయాన్ని ఏ అర్థంలో / సందర్భంలో ఉపయో గిస్తారో రాయండి…
161. వెల్తికుండ
జవాబు:
అనవసరంగా అనవసరమైన విషయాలు మాట్లాడే వారి -గురించి చెప్పే సందర్భంలో ఈ జాతీయం ఉపయో గిస్తారు.
162. నిండుకుండ
జవాబు:
ఎంత కష్టం వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఎవ్వరికీ ఏమీ చెప్పకుండా, లోకువ కాకుండా గంభీరంగా ఉండే వారి గురించి వివరించే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.
సంధి పదాలను విడదీయడం
గీత గీసిన పదాలను విడదీసి రాయండి.
163. పాటిఁదలపక మాట్లాడకూడదు.
జవాబు:
పాటిన్ + తలపక
164. విష్ఠురోక్తులు పలకకూడదు.
జవాబు:
నిష్ఠుర + ఉక్తులు
165. మంచివైన ఉక్తులంబలుకుచు కీర్తి పొందారు.
జవాబు:
ఉక్తులన్ + పలుకుచు
166. మంచి మాటలు పలుకుచునుండు వారే మహాత్ములు.
జవాబు:
పలుకుచు + ఉండు
167. దుష్టుని మతి భాసురుడైనవాడు లెక్కించదు.
జవాబు:
భాసురుడు + ఐన
168. దుష్టుడు చెడు పలికినా, అప్పులుకులకు భయపడకూడదు.
జవాబు:
ఆ + పలుకు
169. పల్లెకు పల్లవాస్తరణములు స్వాగతించాయి.
జవాబు:
పల్లవ + ఆస్తరణములు
170. పెద్దల సేవల్సేయగ సంశయించకూడదు.
జవాబు:
సేవల్ + చేయగ
171. కొందరు తప్పులను పదే పదే చేస్తారు ఏలొకో!
జవాబు:
ఏల + ఒకో
172. ధూర్జటి శ్రీకాళహస్తీశ్వరా అని ప్రార్ధించాడు.
జవాబు:
శ్రీకాళహస్తి + ఈశ్వరా
173. ధర్మ సంస్థాపనార్థం శ్రీకృష్ణుడు జన్మించాడు.
జవాబు:
సంస్థాపన + అర్థం
174. కాలికాంబ మన కష్టాలు తీరుస్తుంది.
జవాబు:
కాళిక + అంబ
175. వేమన విశ్వదాభిరామ అనే పదం ప్రతి పద్యంలో ప్రయోగించాడు.
జవాబు:
విశ్వద + అభిరామ
176. తెలివియొకింత లేనివాళ్లకే గర్వం ఎక్కువ.
జవాబు:
తెలివి + ఒకింత
177. కొందరు ఒకింత ఐనా మంచిగా మాట్లాడరు.
జవాబు:
ఒక + ఇంత
178. దేవుని సన్నిధిలో పాపాలు చేస్తే మరీ తప్పు పొందుతారు.
జవాబు:
సత్ + నిధి
179. నడత ఎట్టిదైతే బ్రతుకు అట్టిదై ఉంటుంది.
జవాబు:
అట్టిది + ‘ఐ’
180. ధీరోత్తములు దేనికీ భయపడరు.
జవాబు:
ధీర + ఉత్తములు
181. మంచివాడు చెడును పల్కఁబోవడు.
జవాబు:
పల్కన్ + పోవడు
182. చిన్న పిల్లలు అది కాదిది కావాలని పేచీ పెడతారు.
జవాబు:
కాదు + ఇది
సంధి పదాలను కలపడం
సంధి పదాలను కలిపి రాయండి.
183. వేంకట + ఈశ
జవాబు:
వేంకటేశ
184. జగత్ + నివేశ
జవాబు:
జగన్నివేశ
185. లక్ష్మి + ఈశ
జవాబు:
లక్ష్మీ.
186. మానక + ఎపుడు
జవాబు:
మానకెపుడు
187. సౌఖ్యము + ఒసగు
జవాబు:
సౌఖ్యమొసగు
188. దానంబు + చేయుట
జవాబు:
దానంబు సేయుట
189. మానంబు + తనకు
జవాబు:
మానంబుదనకు
190. శౌర్యంబు + కలుగుట
జవాబు:
శౌర్యంబుగలుగుట
191. శాంతము + ఆత్మ
జవాబు:
శాంతమాత్మ
192. చిత్తుడు + అగు
జవాబు:
చిత్తుడగు
సంధి నామాలు
గీత గీసిన పదం ఏ సంధికి చెందినదో గుర్తించండి.
193. మంచిగా ఉండుఁగాని మోసగాడు మోసగాడే.
అ) గుణసంధి
ఆ) సరళాదేశ సంధి
ఇ) సవర్ణదీర్ఘ సంధి
ఈ) ఉత్వసంధి
జవాబు:
ఆ) సరళాదేశ సంధి
194. వెల్తికుండ తాఁదొలకుచునుండు.
అ) ఉత్వసంధి
ఆ) సరళాదేశ సంధి
ఇ) నుగాగమ సంధి
ఈ) అనునాసిక సంధి
జవాబు:
ఇ) నుగాగమ సంధి
195. పల్లెటూరులో పల్లవాస్తరణములు కన్పించాయి.
అ) లు,ల,న,ల సంధి
ఆ) సవర్ణదీర్ఘ సంధి
ఇ) గుణసంధి
ఈ) అత్వసంధి
జవాబు:
ఆ) సవర్ణదీర్ఘ సంధి
196. తప్పులు మాట్లాడడం ఏలొకో.
అ) అత్వసంధి
ఆ) ఉత్ససంధి
ఇ) ఇత్వసంధి
ఈ) లు,ల,న,ల సంధి
జవాబు:
అ) అత్వసంధి
197. దుష్టుడు మమజుడగునే.
అ) అత్వసంధి
ఆ) ఇత్వసంధి
ఇ) గుణసంధి
ఈ) ఉత్వసంధి
జవాబు:
ఈ) ఉత్వసంధి
198. ఇదియదియు వదలవద్దు.
అ) అత్వసంధి
ఆ) ఇత్వసంధి
ఇ) యడాగమం
ఈ) యణాదేశ సంధి
జవాబు:
ఇ) యడాగమం
199. అన్నమయ్య వేంకటాద్రీశ్వరా అని కీర్తించాడు.
అ) సవర్ణదీర్ఘ సంధి
ఆ) గుణసంధి
ఇ) ఇత్వసంధి
ఈ) అత్వసంధి
జవాబు:
అ) సవర్ణదీర్ఘ సంధి
200. భక్తులు వేంకటేశ! అని ఆర్తిగా పిలుస్తారు.
అ) అత్వసంధి
ఆ) ఇత్వసంధి
ఇ) గుణసంధి
ఈ) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
ఇ) గుణసంధి
201. సజ్జనులు గొప్పవారు.
అ) జశ్వసంధి
ఆ) శ్చుత్వసంధి
ఇ) ష్టుత్వసంధి
ఈ) విసర్గసంధి
జవాబు:
ఆ) శ్చుత్వసంధి
202. దానంబు సేయుట మంచిది.
అ) సరళాదేశ సంధి
ఆ) అత్వసంధి
ఇ) గసడదవాదేశ సంధి
ఈ) లు,ల,న,ల సంధి
జవాబు:
ఇ) గసడదవాదేశ సంధి
విగ్రహవాక్యాలు
గీత గీసిన పదానికి విగ్రహవాక్యం రాయండి.
203. మానవ జీవితాన్ని తీర్చిదిద్దేది శతకమాధుర్యం.
జవాబు:
శతకము నందలి మాధుర్యం
204. నీచమానవుడు స్నేహానికి అనర్హుడు.
జవాబు:
నీచమైన మానవుడు
205. ఎవ్వరినీ నిష్ఠురోక్తులు ఆడకూడదు.
జవాబు:
నిష్ఠురమైన ఉక్తులు
206. మతిఖాసురుడు గౌరవార్హుడు.
జవాబు:
మతి చేత భాసురుడు
207. గాంధీజీ గుణప్రపూర్ణుడు.
జవాబు:
గుణముల చేత ప్రపూర్ణుడు
208. నిండుఘటంబు తొణకదు.
జవాబు:
నిండైన ఘటంబు
209. మునులు కొందరు కందమూల ఫలములు తింటారు.
జవాబు:
కందములును, మూలములును, ఫలములును
210. భూపాలుర పాలన నేడు లేదు.
జవాబు:
భూమిని పాలించువారు.
211. సహజశక్తి తో పోరాడాలి.
జవాబు:
సహజమైన శక్తి
212. కాళికాంబ లోకపావని.
జవాబు:
కాళిక అనుపేరుగల అంబ.
213. భూసారం భూమిలోనే పుడుతుంది.
జవాబు:
భూమి యందలి సారం.
214. యుగాంతం చేసేది శివుడే.
జవాబు:
యుగం యొక్క అంతం.
215. గర్వితమతి వలన నాశనం తప్పదు.
జవాబు:
గర్వితమైన మది.
216. జ్ఞానం పెరగాలంటే పండిత సన్నిధి ఉండాలి.
జవాబు:
పండితుల యొక్క సన్నిధి
217. భావలింగా! పాపాలు నశింపచేయి.
జవాబు:
భావము నందలి లింగా (శివ)
సమాన నామాలు
గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.
218. మాతృభాషను మించిన భాషలేదు.
అ) అవ్యయీభావ సమాసం
ఆ) షష్ఠీ తత్పురుష సమాసం
ఇ) పంచమీ తత్పురుష సమాసం
ఈ) రూపక సమాసం
జవాబు:
ఆ) షష్ఠీ తత్పురుష సమాసం
219. కుప్పుసామి అనేది శతక మకుటం.
అ) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
ఆ) షష్ఠీ తత్పురుష సమాసం
ఇ) పంచమీ తత్పురుష సమాసం
ఈ) ద్వితీయా తత్పురుష సమాసం
జవాబు:
అ) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
220. మంచిని చేయనివాడు దుర్జనుడు.
అ) షష్ఠీ తత్పురుష
ఆ) పంచమీ తత్పురుష
ఇ) విశేషణ ఉత్తరపద కర్మధారయం
ఈ) విశేషణ పూర్వపద కర్మధారయం.
జవాబు:
ఈ) విశేషణ పూర్వపద కర్మధారయం.
221. వేంకటాద్రిపై వెంకన్న వెలసెను.
అ) తృతీయా తత్పురుష సమాసం
ఆ) ద్వితీయా తత్పురుష సమాసం
ఇ) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
ఈ) అవ్యయీభావ సమాసం
జవాబు:
ఇ) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
222. శ్రీ మహావిష్ణువును భుజగతల్పుడు అంటారు.
అ) బహువ్రీహి సమాసం
ఆ) ద్వితీయా తత్పురుష సమాసం
ఇ) ప్రథమా తత్పురుష సమాసం
ఈ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
జవాబు:
అ) బహువ్రీహి సమాసం
223. సజ్జనులకు పాండిత్యమే మహనీయ సంపద.
అ) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
ఆ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఇ) బహువ్రీహి సమాసం
ఈ) రూపక సమాసం
జవాబు:
ఆ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
224. గొప్పవారికి సవినయ వచనం సామాన్యం.
అ) ప్రథమా తత్పురుష
ఆ) బహువ్రీహి
ఇ) తృతీయా తత్పురుష
ఈ) పంచమీ తత్పురుష
జవాబు:
ఇ) తృతీయా తత్పురుష
225. మానవునకు విద్యయే పెనుబలంబు.
అ) బహువ్రీహి సమాసం
ఆ) అవ్యయీభావ సమాసం
ఇ) ద్వంద్వ సమాసం
ఈ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
జవాబు:
ఈ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
226. సజ్జనసంగతి సౌఖ్యం ఇస్తుంది.
అ) షష్ఠీ తత్పురుష
ఆ) ద్వితీయా తత్పురుష
ఇ) బహువ్రీహి
ఈ) సప్తమీ తత్పురుష
జవాబు:
అ) షష్ఠీ తత్పురుష
227. లక్ష్మీళ! కాపాడవయ్య!
అ) ద్వితీయా తత్పురుష సమాసం
ఆ) బహువ్రీహి సమాసం
ఇ) షష్ఠీ తత్పురుష సమాసం
ఈ) పంచమీ తత్పురుష సమాసం
జవాబు:
ఇ) షష్ఠీ తత్పురుష సమాసం
ఆధునిక వచనాలు
ఈ వాక్యానికి సరియైన ఆధునిక వచనాన్ని గుర్తించండి.
228. పాటి దలంపక నిష్ఠురోక్తులంబలుకు.
అ) పాటినిందలపక నిష్ఠురోక్తిబలుకు.
ఆ) పాటి తల్చక నిష్టురమైన ఉక్తులు పల్కుతాడు.
ఇ) పాటి దలపక నిష్ఠురోక్తినిన్ బలుకు.
ఈ) పాటి దలపక నిష్ఠురోక్తులనున్ బల్కు.
జవాబు:
ఆ) పాటి తల్చక నిష్టురమైన ఉక్తులు పల్కుతాడు.
229. అప్పలుకులు బల్కఁబోవడు.
అ) అప్పులుకులు బలడు.
ఆ) అప్పులుకులన్ బల్కు బోవడు.
ఇ) ఆ పలుకులు పల్కపోడు.
ఈ) ఆ పలుకులున్ బల్కబోడు.
జవాబు:
ఇ) ఆ పలుకులు పల్కపోడు.
230. నిండు ఘటంబు దొల్కునె.
అ) నిండు ఘటమ్ము దొల్మన్.
ఆ) నిండు ఘటమున్ దొల్కున.
ఇ) నిండు ఘటము దొల్కున.
ఈ) నిండు ఘటం తొల్కునె.
జవాబు:
ఈ) నిండు ఘటం తొల్కునె.
231. సేవల్సేయగ బోదురేలొకో.
అ) ఏలొకో సేవల్సేయగ బోదురు.
ఆ) సేవలు చేయడానికి పోతారెందుకో.
ఇ) సేవలున్ జేయగ పోదురేల?
ఈ) సేవలును జేయగన్ బోదురేలన్.
జవాబు:
ఆ) సేవలు చేయడానికి పోతారెందుకో.
232. యుగయుగాల పుట్టువొందు చుందు.
అ) యుగయుగమ్ముల పుట్టెదరు.
ఆ) యుగయుగంబుల పుట్టెదరు.
ఇ) యుగయుగాలలో పుడతారు.
ఈ) యుగయుగంబులన్ పుట్టువొందుచుందేరు.
జవాబు:
ఇ) యుగయుగాలలో పుడతారు.
233. శ్రమములోన బుట్టు సర్వంబు.
అ) శ్రమలో సర్వం పుడుతుంది.
ఆ) శ్రమంబున బుట్టును సర్వమున్.
ఇ) శ్రమమ్మున బుట్టు, సర్వంబున్.
ఈ) శ్రమంబునన్ బుట్టు సర్వమ్మున్.
జవాబు:
అక్రమలో సర్వం పుడుతుంది.
234. ఘాతంబప్పుడ పొందనీ.
అ) ఘాతమ్మప్పుడ పొందనీ
ఆ) ఘాతమునప్పుడు బొందనీ
ఇ) ఘాతమ్మునప్పుడ బొందని
ఈ) ఘాతం అప్పుడ పొందనీ
జవాబు:
ఈ) ఘాతం అప్పుడ పొందనీ
235. తెలివి యొకింత లేని యెడ.
అ) తెలివి ఒకింత లేనప్పుడు
ఆ) తెలివియు నొకింత లేనియెడన్
ఇ) తెలియునొకింత లేని యెడ
ఈ) తెలివి యొక్కింత లేని యెడ
జవాబు:
అ) తెలివి ఒకింత లేనప్పుడు
వ్యతిరేకార్థక వాక్యాలు
కింది వాక్యాలకు వ్యతిరేకార్థక వాక్యాలు రాయండి.
236. నిష్ఠురోక్తులు పల్కుతున్నారు.
జవాబు:
నిష్ఠురోక్తులు పలకడంలేదు.
237. పాటి తల్చరు.
జవాబు:
పాటి తల్చెదరు.
238. పలుకులు పల్కబోవడు.
జవాబు:
పలుకులు పల్కబోతాడు.
239. కందమూల ఫలాలు ఉన్నాయి.
జవాబు:
కందమూల ఫలాలు లేవు.
240. భూపాలురకు జాలి ఎక్కువ.
జవాబు:
భూపాలురకు జాలి ఎక్కువ ఉండదు.
241. యుగయుగాల పుడతారు.
జవాబు:
యుగయుగాల పుట్టరు.
242. భూసారం దొరికింది.
జవాబు:
భూసారం దొరకలేదు.
243. తత్వం పుడుతుంది అంటారు.
జవాబు:
తత్వం పుడుతుంది అనరు.
244. నిపుణులు నిందించారు.
జవాబు:
నిపుణులు నిందించలేదు.
245. నిపుణులు మెచ్చుకొన్నారు.
జవాబు:
నిపుణులు మెచ్చుకోలేదు.
246. యుగాంతం తప్పదంటారు.
జవాబు:
యుగాంతం తప్పదనరు.
247. తెలివి కొద్దిగా కూడా లేదు.
జవాబు:
తెలివి కొద్దిగానైనా ఉంది.
248. గర్వంతో విహరించాను.
జవాబు:
గర్వంతో విహరించలేదు.
249. నాకు గర్వం పోయింది.
జవాబు:
నాకు గర్వం పోలేదు.
250. ఫలాలు చేకూరుతాయి.
జవాబు:
ఫలాలు చేకూరవు.
వ్యతిరేకార్థక క్రియలు
కింది క్రియా పదాలలో వ్యతిరేకార్థక క్రియను గుర్తించండి.
251. అ) తిట్టి
ఆ) తిట్టక
ఇ) తిడుతూ
ఈ) తిడితే
జవాబు:
ఆ) తిట్టక
252. అ) పోక
ఆ) పోయి
ఇ) పోతూ
ఈ) పోతే
జవాబు:
అ) పోక
253. అ) ఎగిరి
ఆ) ఎగిరితే
ఇ) ఎగరక
ఈ) ఎగురుతూ
జవాబు:
ఇ) ఎగరక
254. అ) కాలుస్తూ
ఆ) కాలిస్తే
ఇ) కాల్చి
ఈ) కాల్చక
జవాబు:
ఈ) కాల్చక
255. అ) పడితే
ఆ) పడక
ఇ) పడుతూ
ఈ) పడి
జవాబు:
ఆ) పడక
256. అ) పోయక
ఆ) పోసి
ఇ) పోస్తే
ఈ) పోస్తూ
జవాబు:
అ)పోయక
257. అ) తవ్వి
ఆ) తవ్వుతూ
ఇ) తవ్వక
ఈ) తవ్వితే
జవాబు:
ఇ) తవ్వక
258. అ) వ్రాసి
ఆ) వ్రాస్తే
ఇ) వ్రాస్తూ
ఈ) వ్రాయక
జవాబు:
ఈ) వ్రాయక
259. అ) ఇచ్చి
ఆ) ఇవ్వక
ఇ) ఇస్తే
ఈ) ఇస్తూ
జవాబు:
ఆ) ఇవ్వక
260. అ) త్రాగక
ఆ) త్రాగి
ఇ) త్రాగితే
ఈ) త్రాగుతూ
జవాబు:
అ) త్రాగక
సంక్లిష్ట వాక్యాలు
ఇవి ఏ రకమైన సంక్లిష్ట వాక్యాల్లో రాయండి.
261. పురుగులు వచ్చి పంటను తినేశాయి.
జవాబు:
క్త్వార్థకం
262. చెరువుకు గండి పడి ఊళ్లోకి నీరు వచ్చింది.
జవాబు:
క్త్వార్థకం
263. ఆమె వంట చేస్తూ పాఠం చెబుతోంది.
జవాబు:
శత్రర్థకం
264. సత్యం చెబితే కీర్తి పెరుగుతుంది.
జవాబు:
చేదర్థకం
265. నవ్వితే అందంగా ఉంటారు.
జవాబు:
చేదర్థకం
కర్మణి వాక్యాలు
సరియైన కర్మణి వాక్యాలను గుర్తించండి.
266. వారిని నిపుణులు నిందించారు.
అ) వారు నిపుణుల చేత నిందించబడ్డారు.
ఆ) నిపుణులు వారిచేత నిందించబడ్డారు.
ఇ) నిపుణులు, వారు నిందించబడ్డారు.
ఈ) నింద చేత వారు నిపుణులయ్యారు.
జవాబు:
అ) వారు నిపుణుల చేత నిందించబడ్డారు.
267. శతక పద్యాలను కవులు బాగా వ్రాశారు.
అ) శతక పద్యాల చేత కవులు బాగా వ్రాయబడ్డారు.
అ) కవులు శతకపద్యాలు వ్రాశారు.
ఇ) కవుల చేత శతకపద్యాలు బాగా వ్రాయబడ్డాయి.
ఈ) కవుల చేత వ్రాయబడ్డాయి.
జవాబు:
ఇ) కవుల చేత శతకపద్యాలు బాగా వ్రాయబడ్డాయి.
268. జనులు రాజులను, సేవిస్తారు.
అ) రాజుల చేత జనులు సేవించబడ్డారు.
ఆ) జనుల చేత రాజులు సేవించబడ్డారు.
ఇ) జనుల చేత రాజులు సేవించబడరు.
ఈ) రాజులు జనుల చేత సేవించబడతారు.
జవాబు:
ఈ రాజులు జనుల చేత సేవించబడతారు.
269. భగవంతుడు భక్తులను కాపాడతాడు.
అ) భగవంతుని చేత భక్తులు కాపాడబడ్డారు.
ఆ) భగవంతుని చేత భక్తులు కాపాడబడతారు.
ఇ) భక్తుల చేత భగవంతుడు కాపాడబడతాడు.
ఈ) భక్తులను భగవంతుడు కాపాడబడ్డాడు.
జవాబు:
ఆ) భగవంతుని చేత భక్తులు కాపాడబడతారు.
270. కాళికాంబ వరాలను ఇచ్చింది.
అ) వరాలు కాళికాంబ చేత ఇవ్వబడతాయి.
ఆ) వరాలు కాళికాంబ చేత ఇవ్వబడ్డాయి.
ఇ) వరాలు కాళికాంబ చేత ఇవ్వబడుతున్నాయి.
ఈ) పరాలు కాళికాంబ చేత ఇవ్వబడగలవు.
జవాబు:
ఆ) వరాలు కాళికాంబ చేత ఇవ్వబడ్డాయి.
271. ధీరోత్తములు నీతి తప్పరు.
అ) నీతి ధీరోత్తముల చేత తప్పుబడును.
ఆ) నీతి ధీరోత్తముల చేత తప్పబడింది.
ఇ) ధీరోత్తముల చేత నీతి తప్పబడదు.
ఈ) నీతి ధీరోత్తముల చేత తప్పుబడుతోంది.
జవాబు:
ఇ) ధీరోత్తముల చేత నీతి తప్పబడదు.
272. మన పనులు ఫలాలను చేకూరుస్తాయి.
అ) ఫలాలు మన పనుల చేత చేకూర్చబడతాయి.
ఆ) ఫలాలు పనుల చేత చేకూర్చబడును.
ఇ) ఫలాలు మన పనుల చేత చేకూర్చబడ్డాయి.
ఈ) ఫలాలు మన పనుల చేత చేకూర్చును.
జవాబు:
అ) ఫలాలు మన పనుల చేత చేకూర్చబడతాయి.
273. మనిషి తన భాషను అభిమానించాలి.
అ) తన భాష మనుషుల చేత అభిమానించబడాలి.
ఆ) తమ భాష మనుషుల చేత అభిమానించబడాలి.
ఇ) మనిషి చేత తన భాష అభిమానించబడాలి.
ఈ) మనిషి చేత తన భాష అభిమానించబడింది.
జవాబు:
ఇ) మనిషి చేత తన భాష అభిమానించబడాలి.
274. మంచివారు దుర్జనుని మారుస్తారు.
అ) మంచివారి చేత దుర్జనులు మార్చబడతారు.
ఆ) దుర్జనులు మంచి వారి చేత మార్చబడతారు.
ఇ) దుర్జనులు మంచివాడి చేత మార్చబడతారు.
ఈ) దుర్జనుడు మంచి వారిచేత మార్చబడతాడు.
జవాబు:
ఈ) దుర్జనుడు మంచి వారిచేత మార్చబడతాడు.
275. సముద్రం మేఘాలను తయారుచేస్తోంది.
అ) మేఘాలు సముద్రం చేత తయారు చేయబడుతున్నాయి.
ఆ) సముద్రంచేత మేఘం తయారు చేయబడుతుంది.
ఇ) సముద్రం చేత మేఘాలు తయారు చేయబడతాయి.
ఈ) సముద్రం చేత మేఘాలు తయారుచేయబడ్డాయి.
జవాబు:
అ) మేఘాలు సముద్రం చేత తయారు చేయబడుతున్నాయి.
వాక్య రకాలు
ఇవి ఏ రకమైన సామాన్య వాక్యాలో రాయండి.
276. మీరు శతక మాధుర్యం చవి చూశారా?
జవాబు:
ప్రశ్నార్ధకం
277. ఆహా! భాస్కర శతక మాధుర్యం ఎంత బాగుందో!
జవాబు:
ఆశ్చర్యార్థకం
278. యుగయుగాలలో గొప్పవారు పుడతారో! పుట్టరో!
జవాబు:
సందేహార్ధకం
279. కాళికాంబను ప్రార్థించవచ్చు.
జవాబు:
అనుమత్యర్థకం
280. అందరూ శతక పద్యాలు చదవండి.
జవాబు:
విధ్యర్ధకం
281. సంస్కారం విడిచి పెట్టవద్దు.
జవాబు:
నిషేధార్థకం
282. దయచేసి పద్యాలు వినండి.
జవాబు:
ప్రార్థనార్థకం
283. శతక పద్యాలు మీరు చదవగలరు.
జవాబు:
సామర్థ్యార్థకం
284. పద్యం కలకాలం వర్థిల్లుగాక!
జవాబు:
ఆశీరార్ధకం
285. ధర్మం స్థాపించాలి కాబట్టి సజ్జనులు పుట్టారు.
జవాబు:
హేత్వర్ధకం
వాక్య రకాలు
ఇవి ఏరకమైన సామాన్య వాక్యాలో గుర్తించండి.
286. భక్తుల మనసులలో భగవంతుడుండగలడు.
అ) సామర్థ్యార్థకం
ఇ) ప్రార్థనార్థకం
ఇ) విద్యర్థకం
ఈ) నిషేధార్ధకం
జవాబు:
అ) సామర్థ్యార్థకం
287. నేను తప్పక పద్యాలు చదువుతాను.
అ) ఆశ్చర్యార్ధకం
ఆ) విధ్యర్థకం
ఇ) నిశ్చయార్ధకం
ఈ) ప్రశ్నార్ధకం
జవాబు:
ఇ) నిశ్చయార్థకం
288. మా ఉపాధ్యాయులు మంచి కథతో ఉత్తేజ పరిచారు.
అ) నిశ్చయార్థకం
ఆ) ప్రేరణార్థకం
ఇ) విధ్యర్థకం
ఈ) ఆశ్చర్యార్థకం
జవాబు:
ఈ) ఆశ్చర్యార్థకం
289. నేను కూడబలుక్కొని చదువుకొన్నాను.
అ) ప్రేరణార్ధకం
ఆ) విధ్యర్థకం
ఇ) నిశ్చయార్థకం
ఈ) ఆత్మార్థకం
జవాబు:
ఈ) ఆత్మార్థకం
290. కలకాలం ధర్మం వర్థిల్లుగాక!
అ) నిశ్చయార్థకం
ఆ) ఆశీరార్థకం
ఇ) విధ్యర్థకం
ఈ) ఆత్మార్థకం
జవాబు:
ఆ) ఆశీరార్ధకం
291. దయచేసి నా మాట వినండి.
అ) ఆశీరార్ధకం
ఆ) ప్రార్థనార్థకం
ఇ) విధ్యర్థకం
ఈ) ఆత్మార్థకం
జవాబు:
ఆ) ప్రార్ధనార్థకం
292. ఆహా! ఎంత బాగా చెప్పావో!
అ) ఆశ్చర్యార్థకం
ఆ) అనుమత్యర్థకం
ఇ) ప్రేరణార్ధకం
ఈ) నిషేధార్థకం
జవాబు:
అ) ఆశ్చర్యార్ధకం
293. పద్యాలెందుకు చదవరు?
ఆ నిషేధార్థకం
ఇ) నిశ్చయార్థకం
ఆ) విధ్యర్థకం
ఈ) ప్రశ్నార్థకం
జవాబు:
ఈ) ప్రశ్నార్థకం
294. మేము చదవగలం.
అ) ఆశ్చర్యార్థకం
ఆ) సామర్థ్యార్థకం
ఈ) విధ్యర్ధకం
ఇ) నిశ్చయార్థకం
జవాబు:
ఆ) సామర్థ్యార్థకం
295. మీరిక విశ్రాంతి తీసుకోవచ్చు.
అ) అనుమత్యర్ధకం
ఆ) విధ్యర్థకం
ఇ) సామర్థ్యార్థకం
ఈ) ఆశ్చర్యార్థకర్
జవాబు:
అ) అనుమత్యర్థకం