Access to the AP 10th Class Telugu Guide 2nd Lesson బతుకు గంప Questions and Answers are aligned with the curriculum standards.
బతుకు గంప AP 10th Class Telugu 2nd Lesson Questions and Answers
చదవండి ఆలోచించి చెప్పండి.
1884వ సంవత్సరంలో మా నాయన గారి ఆకస్మిక మరణంతో నా జీవితంలో ఓక పెద్ద అగాధం ఏర్పడింది. ఆ స్థితిలో కుటుంబ భారం అంతా మా తఫ్ గారి మీద పడింది. ఈ సంసారం ఓోషించడానికి ఆమెకు ఉన్న సాధనాలు కూడా కొరత పడిటోయాయి. మా అమ్మగారికి కుటుంబ ధవిష్యత్తు విషయమై అత్రుత హెచ్రయింది. మా మేనమామలపై ఆధారపడటం ఇష్టం లేదు.
ఇంగ్లీషు చడువు చదివించాలన్న మా నాన్నగారి కోరికను సఫలం చేయాలని సంకల్పించుకుంది. ఒంగోలులో హోటల్ పెట్టి వచ్చే ఆడాయంతో మా చదువు సాగించడానికి ఆమె నిర్ణయించుకుంది. ఆ 8ోజుల్లో హూటకూళ్ళ ఇల్లు పెట్టుకున్న వారిని సంఘంలో చులకనగా చూసేఖారు. కానీ ఒకరి కుటుంబం మీద ఆధారపడటం కన్నా నలుగురికి అన్నం పెట్టి జీవించడమే గౌరవప్రదం అని మా అమ్ముగారు నిర్ఱయించుకుంది. ఎలాగైనా నాలుగు కాలాలపాటు (శమపడి ఈ పిల్లల్ ప్యాజకుల్ని చేస్తే తన కష్టాలు గట్టెక్కుతాయని ఆమె నమ్ముకం.
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
ప్రకాశం తఫ్లిగారి ఎటువంటి పల్థితులు ఎదురయాయ్యా ?
జవాబు:
ప్రకాశం గారి తండ్రి ఆకస్మిక మరణంతో కుటుంఙ భారమంతా ప్రకాశం గారి తల్లి పీద పడింది.
ప్రశ్న 2.
ప్రకాశం తల్లిగారు ఏం నర్ణయించుకున్నారు ?
జవాబు:
ఒంగోలులో హెూాటల్ పెళ్టి వచ్చే ఆదాయంతో పిల్లల చదువు సాగించడానికి ఆమె నిర్ణయించుకుంది.
ప్రశ్న 3.
పిల్లల అఖిమ్ధి కోసం తల్లిడండులు పడే శ్రమను గురించి చెప్పండి.
జవాబు:
పిల్లల అభివృద్ధి కోసం తల్లిదండ్రులు అనేక కష్టాలు అనుథవిస్తారు. కూలి పని చేస్తారు. పదిమంది ఇళ్ళల్లో పాచిపని చేస్తారు. చిన్న చిన్న హోటళ్ళు పెర్టి కష్టపడతారు.
ఆలోచించండి – చెప్పండి
ప్రశ్న 1.
ఎల్లష్మృ తన భర్ర గురించి ఏం చెప్పింది ?
జవాబు:
ఎల్లమ్మ తన భర్తకు యాక్సిడెంట్ జరిగింది. లారీ డ్రైర్గగా పనిచేస్తున్న తన భర్తకు హైదరాబాదు నుండి వస్తున్న లారీని దిప్పరు గుద్దింది. దాంతో అతనికి కాళ్ళు, చేతులకు, తలకు బలమైన దెబ్బలు తగిలాయి. ఆసుపత్రిలో కట్లుకట్టి కుట్లేసి పరుండబెట్టారని ఎల్లమ్మ చెప్పింది.
ప్రశ్న 2.
ఎల్లన్మ దుకఖానికి కారణమేమిటి ?
జవాబు:
ఎల్లమ్మను తన ఫర్త వదిలేసి ఎక్కడకో వెళ్ళిపోయాడు. పుట్టిందికి వెళ్ళాలంటే అక్కడ జరుగుబాటు లేదు. తన అత్తను కూడా తనే చూడాల్సి వచ్చింది. గర్భవతిగా ఉన్న ఎల్లమ్మ కూలీ పనికి వెళ్ళలేకపోయింది. అందువల్ల దుఃఖించింది.
ఆలోచించండి – చెప్పండి
ప్రశ్న 1.
ఎల్లమ్మకు పండ్లు అమ్మవలసిన అవసరం ఎందుకు వచ్చింది?
జవాబు:
గర్భవతిగా ఉన్న ఎల్లమ్మ ఉదరపోషణార్థం కూలి పనికి వెళ్ళలేకపోయేది. అందువల్ల ఎల్లమ్మకు పండ్లు అమ్మ వలసిన అవసరం కల్గింది.
ప్రశ్న 2.
ఎల్లమ్మ పనిచేసి డబ్బు తీసుకోకపోవడానికి కారణమేమిటి?
జవాబు:
ఎల్లమ్మ పనిచేసి డబ్బు తీసుకోకపోవడానికి కారణం రచయిత్రి మీదున్న అభిమానం.
ఆలోచించండి – చెప్పండి
ప్రశ్న 1.
పిల్లల కోసం పడే శ్రమ గురించి ఎల్లమ్మ ఏం చెప్పింది?
జవాబు:
మనిషి పుట్టుక పుట్టి కష్టం అనుకుంటే ఎలా ? కష్టం తోనే మనం తింటున్నాం. మన పిల్లలకి పెడుతున్నాం. మనం ఆశశయయంచినోళ్ళకి ఇంత పెడుతున్నాం. ఇంత కంటే తృష్తి ఎక్కడుంది ? అని పిల్లల కోసం పడే శశమను గురించి ఎల్లమ్మ చెప్పింది.
ప్రశ్న 2.
ఎల్లమ్మగురించిన ఆలోచనలు రచయిత్రిని ఎందుకు గందరగోళ పరిచాయి ?
జవాబు:
ఎల్లమ్మ గురించిన ఆలోచనలు రచయిత్రిని గందరగోళ్ పరిచాయి. తన చుట్టూ ఎందరో ఉన్నారు. వాళ్ళను చూస్తే ఎప్పుడూ కలిసినా ఏదో వెలితిగానే మాట్లాడ ఆారు. వాళ్ళ జవీతమంతా అళాంతే అలుముకుందని బాధపడిపోతారు. ఏనాడూ సుఖమన్నమాట, ఆనంద మన్నమాట తన దరిడాపులకు రానివ్వని ఎల్లమ్మ ఎప్పుడూ బాధహడినట్లు గాని, వాటి గురించి ఆలోచించి నట్లుగాని కనిపించలేదు. ఆ క్షణం ఎల్లమ్మ వాళ్రందరి కంటీ ఎంతో ఎత్తులో ఉన్నట్లు కనిపించింది.
అవగాహన – ప్రతిస్పందన
ఇవి చేయండి
అ) కింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి.
ప్రశ్న 1.
పాఠంలో మీకు సచ్చిన స్ననవేశాన్ను గుర్చి మాట్లాడండి.
జవాబు:
పాఠంలో నాకు నచ్చిన సన్నిేేశం పిల్లల కోసం పడే శ్రమ గురించి ఎల్లమ్మ చెప్పిన సమాధానం. ఎల్లమ్ము ఓక త్యాగమూర్తి. తల్లిగా తన బాధ్యతను విస్మరించక చాలా చక్కూా నిర్వర్తించింది. మనిషి పుట్టుక పుట్టి కష్టం అనుకుంటే ఎలా ? కష్హంతోనే మనం తింటఎన్నాం. మన పిల్లలకి పెడుతున్నాం. మనల్ని ఆశ్రయించినోళ్ళకి ఇంత పెడుతున్నాం. ఇంత కంటే తృప్తి ఎక్కడుంటుంది.” అని అన్న మాటల్లో మనిషి యొక్క కర్తవ్యాన్ని, బాధ్యతను వివరించింది.
ప్రశ్న 2.
పాఠానక ‘బతుకు గంప’ శిర్షిక సరిపోతుదా ? ఎందుకు ?
జవాబు:
పాఠానికి “ఐతుకు గంప” శిర్షిక సరిపోతుంది. ఎందుకంటే ఎల్లమ్మ జీవితమే దీనికి ఉడాహరణ. మనిష యొక్క కర్తవ్యాన్ని, బాధ్యతను విక్లేషించి తన అనుధవం డ్వారా చూపింది. కుటుంబ బాధ్యతకై ఎలాగ్రననా కష్టపడి సంపాదించి తనపై ఆధారపడ్డవారిని పోషించడం తన కర్తవ్యమని ఎల్లమ్మ చెప్పింది.
ఆ) కింది అపరిచిత పద్యాన్ని చదివి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
చం. గనిమల తుంగకున్ గరిక కాడలకల్లిన సాలెగూళ్ళస
న్నని పటికంపుమంచుపడి నాణెపు ముత్తెసరాల పోలికం
గనుగొన రమ్యమయ్య్ రవికాంతులc దేలుచు నిట్టి భావమో
హనపు నిసర్గ శిల్పముల హాలిక! త్రొక్కక దాటి పొమ్మికన్
ప్రశ్నలు – జవాబులు :
ప్రశ్న 1.
ముత్యాల సరంలా ఏం కనబడింది ?
జవాబు:
సాలెపురుగు కట్టిన గూడులోని సన్నని దారాలపై మంచు పడి ముత్యాల సరంలా కనబడుతోంది.
ప్రశ్న 2.
కవి రైతుకి ఏమని చెప్పాడు ?
జవాబు:
సూర్య కిరణాలతో ప్రకాశించే నిసర్గ శిల్పాల వంటి మంచు బిందువులను తొక్కకుండా వెళ్ళమని కవి రైతుకి చెప్పాడు.
ప్రశ్న 3.
సాలెగూడు వేటికి అల్లింది ?
జవాబు:
తుంగ, గరిక కాడలకు సాలెగూడు అల్లింది.
ప్రశ్న 4.
పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
పై పద్యాన్ని వ్రాసిన కవి ఎవరు ?
ఇ) కింది అపరిచిత గద్యాన్ని చదివి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఎక్కడో పరాయి దేశం నుంచి వచ్చిన ఆంగ్లేయులు మనపై అధికారం చెలాయిస్తూ మన దేశసంపదను ఎందుకు కొల్లగొట్టాలి? సమాజంలో కొంతమంది పెద్ద భవంతుల్లో, మరికొందరు మురికి కూపాల్లాంటి గుడిసెల్లోనే ఎందుకుండాలి? అని అతిచిన్న వయసులోనే ఒకవైపు దేశ స్థితిని, మరోవైపు పేదల బ్రతుకుల్ని, ప్రజల మధ్య వున్న అంతరాల గురించి ఆలోచించేవాడు.
తాను స్వాతంత్య్య ఉద్యమంలో పాల్గొని, ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల ఆనాడు విద్యార్థులకు ఇచ్చే ఉపకార వేతనాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిలిపేసింది. తన చదువుకు, జీవనానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధైర్యపడలేదు. ఖాళీ సమయాల్లో బట్టల షాపుల్లో, పండ్లతోటల్లో, హూూటల్లో, పనిచేసి డబ్బు సంపాదించేవారు. ఆ డబ్బుతో తన చదువు కొనసాగిస్తూనే కుటుంబానికి సహాయపడేవారు.
ఆనాటి పరిస్థితుల్లో భారతదేశంలో ఉండి ఉన్నతవిద్యను అళ్యసించడం సాధ్యం కాదని భావించాడు. అందుకోసం అమెరికా వెళ్ళి ఆర్థికశాస్తంలో యం.ఎ పూర్తిచేశాడు. ఈ ఉన్నత విద్యకు మన దేశీయులు ఎందరో ఆర్థిక సహాయం చేశారు. తరువాతి కాలంలో ఆర్థికశాస్తంలో ఎనలేని కీర్తి గడించారు. భారతదేశంలో అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. అతడే సర్వోదయ ఉద్యమనాయకుడిగా, భారతమాత ముద్దుబిడ్డగా, లోక్నాయక్గా పేరుగాంచిన జయ(ప్రకాష్ నారాయణ గారు. —- ఆదర్శ హాల్యం
ప్రశ్నలు- జవాబులు :
ప్రశ్న 1.
జయప్రకాష్ నారాయణ చిన్నతనంలో ఏయే విషయాలు గురించి ఆలోచించేవారు ?
జవాబు:
జయప్రకాష్ నారాయణ చిన్నతనంలో ఒకవైపు దేశ స్థితిని, మరోవైపు పేదల బ్రతుకుల్ని, ప్రజల మధ్య ఉన్న అంతరాల గురించి ఆలోచించేవారు.
ప్రశ్న 2.
తన ఉపకార వేతనం ఆగిపోవడానికి కారణమేంటి ?
జవాబు:
తాను స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని, ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల ఉపకార వేతనం ఆగిపోయింది.
ప్రశ్న 3.
నారాయణగారు తన ఆర్థిక ఇబ్బందులను ఎలా దాటగలిగారు ?
జవాబు:
నారాయణగారు ఖాళీ సమయాల్లో బట్టల షాపుల్లో, పండ్ల తోటల్లో, హెూటల్లో పనిచేసి డబ్బు సంపాదించేవారు. ఈ విధంగా తన ఆర్థిక ఇబ్బందులను దాటాడు.
ప్రశ్న 4.
పేరా ఆధారంగా అర్థవంతమైన ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
సర్వోదయ ఉద్యమ నాయకుడిగా, భారతమాత ముద్దుబిడ్డగా, లోక్ నాయక్ గా పేరు గాంచిన వ్యక్తి ఎవరు ?
ఈ) కింది వాటికి అర్థసందర్భాలు రాయండి.
ప్రశ్న 1.
అయితే నీవిట్లా వచ్చావేమే?
జవాబు:
పరిచయము : ఈ వాక్యము మూలింటి చంద్రకళ రచించిన ఆమె కథల నుండి స్వీకరించబడిన ‘బతుకు గంప’ అను పాఠంలోనిది.
సందర్భము : తన భర్తకు యాక్సిడెంట్ జరిగిందని చెప్తూ ఏడుస్తూ ఉన్న ఎల్లమ్మతో రచయిత పల్కిన సందర్భము. భావము : నువ్వు ఎందుకు ఇక్కడకు వచ్చావు ? అని భావం.
ప్రశ్న 2.
వారితో ఎప్పుడు కలిసినా ! వెలితిగానే మాట్లాడుతారు.
జవాబు:
పరిచయము : ఈ వాక్యము మూలింటి చంద్రకళ రచించిన ఆమె కథల నుండి స్వీకరించబడిన ‘బతుకు గంప’ అను పాఠంలోనిది.
సందర్భము : తన చుట్టూ ఉన్న వారిని గురించి మాట్లాడుతూ, రచయిత చెప్పిన సందర్భము.
భావము : తన చుట్టూ ఉన్న వారితో ఎప్పుడు కలసి మాట్లాడినా ఏదో లోపం ఉన్నట్లుగా మాట్లాడతారని భావము.
ఉ) పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు ఏకవాక్య సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
‘సాయిలు’ ఎవరు ?.
జవాబు:
ఎల్లమ్మకు దొరికిన బిడ్డ పేరు సాయిలు.
ప్రశ్న 2.
ఎల్లమ్మ లాంటి వ్యక్తుల గురించి రచయిత్రి ఏమన్నది ?
జవాబు:
ఏనాడు సుఖమన్నమాట, ఆనందమన్నమాట తన దరిదాపులకు రానివ్వని ఎల్లమ్మ ఎప్పుడూ బాధపడినట్లుగాని, వాటి గురించి ఆలోచించినట్లుగానీ ఎల్లమ్మ కనిపించలేదు అని రచయిత్రి అన్నది.
ప్రశ్న 3.
రచయిత్రికి ఎల్లమ్మతో పరిచయం ఎలా ఏర్పడింది ?
జవాబు:
పండ్లు అమ్ముకుంటూ ఉన్న ఎల్లమ్మ దగ్గర రచయిత్రి పండ్లు కొనేది. ప్రతిరోజూ కొనేది. క్రమంగా వారిరువురి పరిచయం బలపడింది.
వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
ఎల్లమ్మ జీవనం కోసం ఏ వృత్తిని అనుసరించింది ?
జవాబు:
ఎల్లమ్మ భర్తకు యాక్సిడెంట్ జరిగింది. ఇల్లు గడవాలంటే భర్త గాని, భార్య గాని పని చేయాలి. కూలిపని చేద్దామంటే ఎల్లమ్మకు కడుపులో బిడ్డ, సంకలో బిడ్డ. ఆమెకు వంగి లేవడం కష్టంగా ఉండేది. అందుచేత ఎల్లమ్మ పండ్ల గంపను నెత్తిన పెట్టుకుని వీధీధి తిరిగి అమ్ముకుంటూ జీవనం సాగించేది.
ప్రశ్న 2.
రచయిత్రి ఎల్లమ్మలో గుర్తించిన గొప్పలక్షణాలు ఏవి ?
జవాబు:
ఎల్లమ్మ కష్టజీవి. ఓర్పు కలది. తెలివి తేటలతో పండ్ల వ్యాపారం చేస్తూ, జీవనం సాగించేది. ఒక పిల్లవాడు దొరికితే వాణ్ని పెంచి పెద్ద చేసింది. కుటుంబం కోసం కష్టపడింది. కలుపుగోలుతనం కలది. అభిమానవంతురాలు. ఎవరైనా అకారణంగా డబ్బులిస్తే తీసుకోదు. బాధ్యత కలది.
ప్రశ్న 3.
బాల్య వివాహాల వలన నష్టాలు తెలపండి.
జవాబు:
బాల్య వివాహాల వలన అన్నీ నష్టాలే. చదువు దెబ్బతింటుంది. అనవసరమైన బాధ్యతలు నెత్తి మీద పడతాయి. అభివృద్ధి ఉండదు. శక్తికి మించిన చాకిరీ వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. తెలివితేటలు కూడా వృద్ధి చెందవు.
పిల్లలు కూడా పుడితే ఇంక చెప్పనక్కర్లేదు. ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. చట్ట ప్రకారం కూడా బాల్య వివాహం నేరం. బాల్య వివాహం చేసిన తల్లిదండ్రులను, బంధువులను, చేయించిన పురోహితుని కూడా అరెస్ట్ చేస్తారు. కఠిన కారాగార జైలు శిక్షను విధిస్తారు. అంత ప్రమాదకరమైంది బాల్య వివాహం.
ఆ) కింది ప్రశ్నలకు ఎనిమిది నుండి పది వాక్యాలలో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
‘బతుకు గంప’ పాఠ్యభాగ సారాంశాన్ని సంక్షిప్తంగా సొంతమాటల్లో రాయండి. .
జవాబు:
ఎల్లమ్మ కష్టజీవి. తన కుటుంబ భారాన్నంతా ఎల్లమ్మే మోసేది. తన మంచితనంతో ఊళ్ళోవాళ్ళందర్ని ఆకట్టుకునేది. ఆ విధంగా రచయిత్రి యింటికి వస్తూండేది. ఎల్లమ్మ పండ్ల వ్యాపారం చేసేది. అవసరం ఉన్నా లేకపోయినా రచయిత్రి పండ్లు కొనేది. రచయిత్రి ఇంట్లో అప్పుడప్పుడు ఎల్లమ్మ పని చేస్తూండేది. అప్పుడప్పుడు రచయిత్రి ఇంట్లో భోజనంచేస్తూండేది.
రచయిత్రితో తన కష్టసుఖాలను చెప్పుకునేది. ఆ విధంగా రచయిత్రి ఇంట్లో ఎల్లమ్మ కుటుంబ సభ్యురాలైంది. ఏటి వరదలో ఎవరో బిడ్డ కొట్టుకు వస్తే, ఆ బిడ్డను ఎల్లమ్మ సాకింది. దయార్ధ హృదయురాలు ఎల్లమ్మ. ఏనాడు సుఖమన్న మాట, ఆనందమన్న మాట తన దరిదాపులకు రానివ్వని ఎల్లమ్మ బాధపడినట్లుగాని, వాటి గురించి ఆలోచించినట్లుగాని కనిపించలేదు. బ్రతుకు కొఱకు గంపనెత్తుకుని వీధి వీధి తిరుగుతూ పండ్లను అమ్ముకుంటూ జీవనం సాగించింది. యాక్సిడెంట్ జరిగిన భర్తను, పిల్లలను పోషించుకొంటూ జీవిస్తున్న ఎల్లమ్మ ధన్యురాలైంది.
ప్రశ్న 2.
పాఠం ఆధారంగా ఎల్లమ్మ వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి.
జవాబు:
ఎల్లమ్మ వ్యక్తిత్వం చాలా గొప్పది. తన కుటుంబ బ్రతుకుల కొఱకు గంపను నెత్తిన పెట్టుకొని పండ్ల వ్యాపారం చేస్తూ, జీవనం సాగిస్తున్న స్వశక్తిపరురాలు, తన కుటుంబాన్ని పోషించడం తన బాధ్యతగా గుర్తించిన నిస్స్వార్థపరురాలు. భర్తకు ఆపద వస్తే ఆదుకున్న అర్ధాంగి.
ఏటి వరదలో ఎవరో బిడ్డ కొట్టుకు వస్తే కాపాడి చేయూత నిచ్చి పోషించిన దయార్ధ హృదయురాలు. రచయితకు తన కష్టసుఖాలను చెప్పి గుండె బరువును దించుకునేది. రచయితతో పరిచయం ఏర్పడ్డాక వారి కుటుంబ సభ్యురాలైంది. అంత మంచి మనసున్న అనురాగమూర్తి.
ప్రశ్న 3.
ఎల్లమ్మకు, రచయిత్రికి గల అనుబంధం గురించి రాయండి.
జవాబు:
ఎల్లమ్మ గంప నెత్తిన, పెట్టుకుని పండ్ల వ్యాపారం చేస్తూండేది. ఆ విధంగా తరచూ రచయిత్రి ఇంటికి వెళ్తూ ఉండేది. తనకు అవసరం ఉన్నా లేకున్నా రచయిత్రి పండ్లు కొనేది. రచయిత్రి ఇంట్లో అప్పుడప్పుడు ఎల్లమ్మ పనులు చేస్తూండేది. రచయిత్రి ఇంట్లో ఎల్లమ్మ భోజనం చేస్తూండేది.
తనకు వచ్చిన కష్ట సుఖాలను ఎల్లమ్మ రచయిత్రితో చెప్పుకునేది. క్రమంగా రచయిత్రి కుటుంబసభ్యురాలైంది. రచయిత్రి అభిమానాన్ని, ఆప్యాయతను పొందింది ఎల్లమ్మ. నిస్స్వార్థ పరురాలైన ఎల్లమ్మకు, రచయిత్రికి విడదీయరాని బంధం కల్గింది. అనురాగమూర్తి అయిన రచయిత్రి, ఎల్లమ్మకు మమతానురాగాలను పంచింది.
ఇ) కింది ప్రశ్నలకు సృజనాత్మకంగా సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
పాఠం ఆధారంగా ఎల్లమ్మ, రచయిత్రిల మధ్య చర్చను సంభాషణ రూపంలో రాయండి.
జవాబు:
ఎల్లమ్మ : పండ్లమ్మో ….. పండ్లు. పండ్లమ్మో…… పండ్లు.
రచయిత్రి : హేం
హేఁ ……. అమ్మీ. పండ్లమ్మి
ఎల్లమ్మ : అమ్మగారూ
దండాలమ్మా !
రచయిత్రి : ఏమే ఎల్లమ్మా ! ఎక్కడకు వెళ్ళావే ! ఇంతకాలం కనబడటం లేదు. అదేమిటే అలా ఉన్నావు ?
ఎల్లమ్మ : అవునమ్మా ! ఏం చెప్పనమ్మా ! మా ఆయనకు యాక్సిడెంట్ జరిగింది.
రచయిత్రి : ఎప్పుడయింది ? ఏం జరిగింది ?
ఎల్లమ్మ : ఏమోనమ్మా నాక్కూడా సరిగ్గా తెల్వదు. లారీ డ్రైవర్గా పనిచేస్తా వుండె. నాలుగురోజులకు ముందు ఏదో లోడుతో పోయాడంట. హైదరాబాద్ దగ్గర ఎదురుగా వస్తోన్న టిప్పర్ గుద్దిందంట. మా ఆయనకు కాలిరిగిపోయిందంట.
రచయిత్రి : అయితే నువ్విట్లా వచ్చావేమే ?
ఎల్లమ్మ : రాక సేసేదేముందమ్మా …… లెక్క కావద్దూ.
ఇల్లు చూసి పోదామని వస్తినమ్మా !
నేనెక్కడ సచ్చానో అనుకుంటారని ఇట్టా తెలిసినోళ్ళ
రచయిత్రి : జాగ్రత్త ! ఎల్లమ్మా! ఏదైనా అవసరం వస్తే వచ్చి అడుగు.
ఎల్లమ్మ : అలాగే నమ్మా ! వెళ్ళొస్తా !
ప్రశ్న 2.
కష్టాలకు కుంగిపోకుండా ధైర్యంగా మెలగాలని తెలియజేస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:
తిరుపతి,
X X X X X.
ప్రియమైన మిత్రునకు నమస్కారాలు !
నేను క్షేమం. నీవు క్షేమమని తలుస్తాను. మా తాతగారు “మానవ జీవితం ఎలా సార్థక్యం పొందాలని” చాలా బాగా వివరించి చెప్పారు. మానవుడు ఎప్పుడూ ధైర్యంగా ఉండాలని విశ్లేషించాడు. ఎందుకంటే “ధైర్యే సాహసే లక్ష్మీ” అని ఆర్యోక్తి. కష్టాలైనా, సుఖాలైనా మానవులకే కల్గుతాయి. అంతేకాని మిగిలిన వాటికి కలుగవు కదా ! “ఫలించిన వృక్షమునకే జాతి దెబ్బలు” – అన్నట్లు మానవులకే బాధలు.
వాటిని తట్టుకుని ధైర్యంగా నిలబడ్డవాడే మనిషి. అందువల్ల మానవుడు కష్టాలకు కుంగకూడదు. సుఖాలకు పొంగకూడదు. స్థిత ప్రజ్ఞతతో ప్రవర్తించినపుడు నిజమైన మనిషిగా కీర్తిని పొందుతాడని మా తాతగారు చెప్పారు. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం కల్గింది. నేను కూడా అలాగే ప్రవర్తిస్తానని మా తాతకు మాట ఇచ్చాను. నీవు కూడా ఈ విషయాలను పూర్తిగా అవగాహన చేసుకుని నీ స్పందనను తెలియజేయగలవని ఆశిస్తున్నాను.
వెంటనే ఉత్తరం వ్రాయి.
ఇట్లు, నీ మిత్రుడు,
కె. శ్రీవత్స.
చిరునామా :
టి.పి. శ్రీనాథ్, 10వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూలు,
పెనమకూరు (పోస్ట్),
(వయా) ఉయ్యూరు,
521165.
భాషాంశాలు పదజాలం
అ) కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంతవాక్యాలు రాయండి
1. అతిథికి ఏ వెలితి లేకుండా చూసుకోవాలి.
వెలితి = తక్కువ
సొంతవాక్యం : మహాత్ములను ఎప్పుడూ తక్కువ అంచనా వేయరాదు.
2. నిరాశ్రయులకు ఆశ్రయం ఇచ్చి కాపాడడం మన ధర్మం.
ఆశ్రయం = ఆధారం
సొంతవాక్యం : జీవులకు నీరే ప్రాణాధారం.
3. రవి పొద్దస్తమానం క్రికెట్ ఆడుతున్నాడు.
పొద్దస్తమానం = ఎప్పుడూ
సొంతవాక్యం : విద్యార్థులు ఎప్పుడూ అబద్ధం ఆడరాదు.
4. తుఫాను బీభత్సం నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే స్తిమితపడుతున్నారు.
స్తిమితపడు = కుదుటపడు
సొంతవాక్యం : రాముకు ఉద్యోగం రావడంతో కుదుటపడ్డాడు.
5. మదర్ థెరిస్సా దిక్కులేని వారెందరికో సేవలు చేసింది.
దిక్కు= దెస
సొంతవాక్యం : తూర్పు దెసన సూర్యుడు ఉదయిస్తాడు.
ఆ) కింది వాక్యాలు చదివి, పర్యాయపదాలను గుర్తించి రాయండి.
ప్రశ్న 1.
సంపాదించిన సొమ్మును కొంత దాచి పెట్టడం మంచిది. ధనం అవసరానికి ఉపయోగపడుతుంది. వృద్ధి చేసిన డబ్బుతో ఎన్ని మంచి పనులైనా చేయవచ్చు.
జవాబు:
సొమ్ము, ధనం, డబ్బు.
ప్రశ్న 2.
ఝషం నీటిలో జీవిస్తుంది. చేప మొప్పలతో గాలి పీల్చుకుంటుంది. మత్స్యం తోకాడించి దిశను మార్చుకుంటుంది.
జవాబు:
ఝషం, చేప, మత్స్యం.
ప్రశ్న 3.
దేహం అలసిపోయేలా కష్టిస్తే, ఒళ్ళంతా చెమట పట్టి, శరీర మలినం పోతుంది.
జవాబు:
దేహం, ఒళ్ళు, శరీరం.
ప్రశ్న 4.
ప్రభాతవేళ పల్లె మేల్కొంటోంది. ఉదయాన్నే రైతులు పనులకు సిద్ధమయ్యారు. పొద్దుటపూట పొలాలకు వెళ్ళి, పనులు చేయసాగారు.
జవాబు:
ప్రభాతం, ఉదయం, ప్రొద్దుటపూట
ఇ) కింది పదాలు చదివి వాటికి సరిపోయే నానార్థాలతో జతపరచండి.
జవాబు:
1. బతుకు (ఆ) కాపురం, కుటుంబం, పుట్టుక
2. సంతానం (ఇ) జీవనం, స్థితి, జరుగుబాటు
3. సంసారం (అ) బిడ్డ, ఒక కల్పవృక్షం, కులం
ఈ) కింది ప్రకృతి పదాలకు సరైన వికృతి పదాలను వెతికి రాయండి.
(బంతి, కస్తి, మొరకు, సుగము, మోము, రాతిరి)
జవాబు:
1. ముఖం = మోము
2. పంక్తి = బంతి
3. కష్టం = కస్తి
4. మూర్ఖుడు = మొరకు
5. సుఖము = సుగము
6. రాత్రి = రాతిరి
ఉ) కింది జాతీయాలను వివరించి రాయండి.
జవాబు:
1. వీధిపాలు చేయు : నాశనం చేసే పరిస్థితిని వివరించే సందర్భంలో ఉపయోగిస్తారు.
2. ఊపిరి పీల్చుకొను : నిశ్చింతగా ఉన్నాడని చెప్తూ వివరించే సందర్భంలో ఉపయోగిస్తారు.
వ్యాకరణాంశాలు
అ) కింది పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.
జవాబు:
1. పుణ్యాత్ముడు : పుణ్య + ఆత్ముడు (సవర్ణదీర్ఘ సంధి)
2. విషయమంతా : విషయము + అంతా (ఉత్వసంధి)
3. ఇంకెవరికి : ఇంక + ఎవరికి (అత్వసంధి)
4. ఉన్నదేదో : ఉన్నది + ఏదో (ఇత్వసంధి)
ఆ) కింది పదాలు కలిపి, సంధి పేరు రాయండి.
జవాబు:
1. పోదాము + అనుకుంటే : పోదామనుకుంటే (ఉత్వసంధి)
2. స్నానము + లు : స్నానాలు (లు,ల,న,ల సంధి)
3. ఏమి + ఐనది : ఏమైనది (ఇత్వసంధి)
4. అక్కడ + అక్కడ : అక్కడక్కడ (ఆమ్రేడితసంధి)
5. జీవితము + అంత : జీవి (ఉత్వసంధి)
ఇ) కింది పదాలకు విర్రహ వాక్యాలు రాసి, సమాసం పేర్లు రాయండి.
జవాబు:
1. పదిరోజులు : పదైన రోజులు (ద్విగు సమాసం)
2. కాళ్ళుసేతులు : కాళ్ళును, చేతులును (ద్వంద్వ సమాసం)
3. తెల్లముఖం : తెల్లనైన ముఖం (విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం)
4. అసాధారణం : సాధారణం కానిది (నఞ తత్పురుష సమాసం)
5. చిన్నబిడ్డ : చిన్నదైన బిడ్డ (విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం)
అవ్యయీభావ సమాసం
కింది సమాస పదాలను, వాటి విగ్రహవాక్యాలను పరిశీలించండి.
అ) యథావిధి — విధి యెట్లో అట్లు
ఆ) ఆబాలగోపాలం — బాలుర నుండి గోపాలుర వరకు
ఇ) అనువర్షం — వర్షముననుసరించి
వీటి అన్నిటి లోను పూర్వపదాలు గమనిస్తే అవి అవ్యయాలు అని గ్రహించవచ్చు.
ఇవి సాధారణంగా.
అను, యథా, ఆ, ప్రతి, స, పరి, అప, సహ, ఉప మొదలైనవి…ఇక్కడ పూర్వపద ప్రాధాన్యం ఉంటుంది. లింగ, వచన, విభక్తులు లేని అవ్యయం పూర్వపదంగా ఉంటుంది. ఈ సమాసంను అవ్యయీభావ సమాసం అంటారు.
ఈ) కింది పదాలకు విగ్రహవాక్యాలను రాయండి.
అనుకూలం, యథాశక్తి, ప్రతిమాసం, ప్రతిదినం, ఉపవనం, సకుటుంబం
1. అనుకూలం : కూలాన్ని అనుసరించి – అవ్యయీభావ సమాసం
2. యథాశక్తి : శక్తిని అతిక్రమించక – అవ్యయీభావ సమాసం
3. ప్రతిమాసం : మాసము, మాసము – అవ్యయీభావ సమాసం
4. ప్రతి దినం : దినము, దినము – అవ్యయీభావ సమాసం
5. ఉపవనం : వనానికి సమీపం – అవ్యయీభావ సమాసం
6. సకుటుంబం : కుటుంబంతో సహా – అవ్యయీభావ సమాసం
అలంకారం-ఛేకానుప్రాసాలంకారం.
1. నేడు ధర ధర బాగా పెరిగిపోంతుంది.
2. ఈ ఏడు ఏడు రోజులపాటు ఏతం చేయాలి.
పై వాక్యాలను పరిశీలిస్తే ధర, ధర, ఏడు, ఏడు అనే సమాన అక్షరాలు ఉన్న పదాలు పక్కపక్కనే అర్థభేదంతో ఉన్నాయి కనుక ఇది ఛేకానుప్రాసాలంకారం.
లక్షణం: సమాన వర్ణాలు గల పదాలు అర్థభేదం కలిగి వెంటవెంటనే (అవ్యవధానంగా) ప్రయోగించబడితే దానిని ఛేకానుప్రాసాలంకారం అంటారు.
ఉ) కింది వాక్యాల్లో ఉన్న అలంకారాన్ని గుర్తించి, లక్షణం రాయండి.
ప్రశ్న 1.
గోరువంక వంక చూసెను.
జవాబు:
ఈ వాక్యంలో వంక, వంక అనే సమాన అక్షరాలు ఉన్న పదాలు పక్క పక్కనే అర్థభేదంతో ఉన్నాయి. కనుక ఇది ఛేకానుప్రాస.
ప్రశ్న 2.
సమస్యల సాధనకు నారి నారి బిగించింది.
జవాబు:
ఈ వాక్యంలో నారి, నారి అనే సమాన అక్షరాలు ఉన్న పదాలు పక్క పక్కనే అర్థ భేదంతో ఉన్నాయి. కనుక ఇది ఛేకానుప్రాస.
ప్రశ్న 3.
సుందర దరహాస రుచులు.
జవాబు:
ఈ వాక్యంలో దర – దర అనే సమాన అక్షరాలు ఉన్న పదాలు పక్క పక్కనే అర్థ భేదంతో ఉన్నాయి. కనుక ఇది ఛేకానుప్రాస.
ప్రశ్న 4.
రాజా ! నీది శుభంకర కరం.
జవాబు:
ఈ వాక్యంలో కర – కరం అనే సమాన అక్షరాలు ఉన్న పదాలు పక్క పక్కనే అర్థ భేదంతో ఉన్నాయి. కనుక ఇది ఛేకానుప్రాస.
ప్రశ్న 5.
ఆ కొమ్మ కొమ్మవంచి పూలు కోసెను.
జవాబు:
ఈ వాక్యంలో కొమ్మ, కొమ్మ అనే సమాన అక్షరాలు ఉన్న పదాలు పక్క పక్కనే అర్థ భేదంతో ఉన్నాయి. కనుక ఇది ఛేకానుప్రాస.
ఊ) కింది కర్తరి వాక్యాలను, కర్మణి వాక్యాలుగా మార్చి రాయండి.
1. ఎల్లమ్మ పండ్లను అమ్మింది. — పండ్లు ఎల్లమ్మ చేత అమ్మబడినవి.
2. ఆమె బిడ్డను చదివించింది. — బిడ్డ ఆమె చేత చదివించబడింది.
3. వైద్యుడు వైద్యం చేశాడు. — వైద్యం వైద్యుడి చేత చేయబడింది.
4. అతడు కండక్టర్ ఉద్యోగం చేశాడు. — కండక్టర్ ఉద్యోగం అతని చేత చేయబడింది.
5. వారు పిల్లవాడిని కాపాడారు. — పిల్లవాడు వారిచేత కాపాడబడ్డాడు.
ఋ) కింది వాక్యాలు చదివి, అది ఏ రకమైన వాక్యాలో రాయండి.
1. అతడికి మంచి జరుగుగాక ! — ఆశీర్వార్థక వాక్యం
2. ఇటువైపు నీవు రావద్దు. — వ్యతిరేకార్థక వాక్యం
3. ఎల్లమ్మ ఆ పని చేయగలదు. — సామర్థ్యార్థక వాక్యం
4. మీరు మా ఇంటికి రావచ్చు. — అనుమత్యర్థక వాక్యం
5. పదిరోజులుగా నీవు ఎక్కడికి వెళ్ళావు ? — ప్రశ్నార్థక వాక్యం
6. అందరూ బడికి వెళ్ళండి. — విధ్యర్థక వాక్యం
ప్రాజెక్టు పని
తమ కుటుంబ ఆర్థికస్థితులను అధిగమించి, జీవిత లక్ష్యాన్ని సాధించిన వారి విషయాలను సేకరించి తరగతిగదిలో ప్రదర్శించండి. ఉదా : చిలకమర్తి లక్ష్మీనరసింహం, డా.బి.ఆర్.అంబేద్కర్, అబ్దుల్ కలాం.
జవాబు:
1) చిలకమర్తి లక్ష్మీనరసింహం (1867 1946) : ఆంధ్రదేశంలో మొట్టమొదటి జాతీయోద్యమ పేరును గడించిన మహనీయుడు – ఒక రచయితగా, పాత్రికేయుడుగా, ఉపన్యాసకుడుగా, సంఘ సంస్కర్తగా, సత్యాన్వేషిగా, దేశభక్తుడుగా సకలాంధ్రులకు ఉపాదేయమై చిరస్మరణీయుడైన చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు 1867 సం॥లో సెప్టెంబరు 26న జన్మించారు. వీరి తల్లి వెంకటరత్నమ్మ, తండ్రి వెంకన్న. వీరి స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లాలోని వీరవాసరం. వీరి అసలు పేరు పున్నయ్య.
ఈయన ప్రాథమిక విద్యను వీరవాసరంలోనే అభ్యసించాడు. 1881వ సం॥రం దిగువ నాల్గవ తరగతి (అనగా ఈనాటి ఏడవ తరగతికి సమానం)లో ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణుడైనాడు. 1882 సం॥రం నర్సాపురంలోని మాధ్యమిక పాఠశాలలో చేరాడు. గణితశాస్త్రమందు వెనుకబడ్డాడు.
అందుచేత మామూలుగానే ఉత్తీర్ణుడయ్యాడు. 1885 సం॥రం రాజమండ్రిలో మెట్రిక్యులేషన్ చేరాడు. 1887 సం॥రం విక్టోరియా రాణి పాలన స్వర్ణోత్సవాల సందర్భంగా పద్యాలు వ్రాసి వేరొకరితో చదివించాడు. ఆ పద్యాలు విన్న కందుకూరి వీరేశలింగం పంతులు, వడ్డాది సుబ్బారాయుడు, వావిలాల వాసుదేవశాస్త్రి ప్రశంసించారు.
చిన్నతనంలోనే దృష్టిమాంద్యం ఏర్పడటం వల్ల వీరిని “ఆంధ్రా మిల్టన్”గా పండితులు వ్యవహరిస్తుండేవారు. “భరత ఖండంబు చక్కని పాడియావు” అనే జాతీయ ప్రబోధాత్మకమైన గీతం వీరిదే. మొట్టమొదటి జాతీయోద్యమ కవిగా వీరిని విమర్శకులు పేర్కొంటున్నారు. వీరు పురాణగాథలనే ఎక్కువగా ఇతివృత్తాలుగా గ్రహించారు. వీరికి “కళాప్రపూర్ణ” అనే బిరుదు 1943 సం॥లోను, ఆంధ్రా మిల్టన్, ఆంధ్రా స్కాట్ అను బిరుదులిచ్చి సత్కరించారు.
వీరు తొలినాటకం కీచక వధ. వీరు భాసుని నాటకాలన్నీ తెనిగించారు. నాటక రచనలో సంప్రదాయ పద్ధతులనే పాటించారు. రంగ విభజన లేదు. ఎక్కువగా వీర రస ప్రధానంగా రాశారు. మొదట గద్య నాటకాలే రచించినా సమాజ ధోరణిని అనుసరించి నటుల తృప్తి కోసం తర్వాత పద్యాలు చేర్చారు. గయోపాఖ్యానం ఆ రోజుల్లోనే లక్ష ప్రతులకు పైగా అమ్ముడు పోయినట్లు తెలుస్తున్నది.
1894లోనే వీరు నవలా రచనకు ఉపక్రమించి సుమారుగా పద్నాలుగు నవలలు రాశారు. చింతామణి పత్రిక జరిపిన నవలల పోటీలలో వీరు ప్రథమ బహుమతులను నాలుగుసార్లు స్వీకరించారు. 1894లో రామచంద్ర విజయానికి, 1896లో హేమలతకు, 1897లో అహల్యాబాయికి, 1898లో కర్పూర మంజరికి ప్రథమ బహుమతులు వచ్చాయి.
1928 మార్చిలో వీరి షష్ఠిపూర్తి ఉత్సవం రాజమండ్రిలో జరిగింది. ఆ సందర్భంలో వీరి సంపూర్ణ గ్రంథావళి పది సంపుటాలుగా వెలువరించారు. 1944లో వీరి స్వీయ చరిత్రను ఆంధ్రాభ్యుదయ రచయితల సంఘం ప్రచురించింది. వీరి రచనా శైలి విలక్షణమైనది. పద్య రచన ధారాశుద్ధితో భావ శబలతతో సాగింది. మొదటి నాగభూషణ శర్మ, ముక్తేవి భారతి, భమిటిపాటి సచ్చిదానందమూర్తి ప్రభృతులు వీరిని గురించి పరిశోధన చేసి గ్రంథాలు ప్రచురించారు. ఇటువంటి మహనీయుడు 1946 సం॥రం ఏప్రిల్ 17న మరణించారు.
2) డా.బి.ఆర్. అంబేద్కర్ (1891-1956) : నవభారత రాజ్యాంగ నిర్మాణ రథసారథిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘ సంస్కర్తగా, మహా మేధావిగా, విశ్వ విఖ్యాతుడైన డా॥ భీమారావు అంబేద్కర్ 1891 సం॥రం ఏప్రిల్ 14వ తేదీన మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో, మందన్ గాడ్ పట్టణానికి దగ్గరున్న అంబావాడే గ్రామంలో మెహర్ కులానికి చెందిన రాంజీ సక్పాల్, భీమాబాయి అను దంపతులకు 14వ సంతానంగా జన్మించాడు.
మొదట ఈయనకు పెట్టిన పేరు భీమారావ్. వీరి యింటి పేరు అంబావాడర్. పాఠశాల్లో ఉపాధ్యాయుడు ఇతనిని అంబేద్కర్ అనే పేరుతో పిలిచేవాడు. ఆ పేరే తర్వాత స్థిరపడింది. సంపాదన కొరకు తండ్రికి సహకరిస్తూ, తీరిక వేళల్లో కూలిపని చేస్తూ, బళ్ళో చదువుకుంటూ ఉండేవాడు. క్రమంగా అలా కష్టపడి చదివి 1907 సం॥మున మెట్రిక్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. తర్వాత సంస్కృతం చదువుకోవాలని ఆశించాడు. కులం అడ్డు వచ్చింది. ఇష్టం లేకున్నా పర్షియన్ భాష చదివాడు.
16వ ఏటనే ఇతనికి రమాబాయితో వివాహం జరిగింది. బరోడా మహారాజు శాయాజీరావ్ గైక్వాడ్ ఇచ్చిన 25 రూపాయల విద్యార్థి వేతనంతో 1912వ సం||మున బి.ఏ. పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. పై చదువులు చదవాలన్న పట్టుదల వల్ల ఉద్యోగంలో చేరలేదు. మహారాజుకు తన కోరికను తెలిపాడు. విదేశంలో చదువు పూర్తి చేసిన తర్వాత బరోడా సంస్థానంలో పదేళ్ళు పనిచేసే షరతుపై 1913వ సం||మున మహారాజు గారి ఆర్థిక సహాయం అందుకుని కొలంబియా విశ్వ విద్యాలయంలో చేరాడు.
1915 సం॥మున M.A. ను 1916 సం॥మున Ph.D. డిగ్రీలను సంపాదించాడు. ఆనాటి సిద్ధాంత వ్యాసమే పదేళ్ళ తర్వాత “The Evolution of Provincial Finances in British India (ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్సెస్ ఇన్ బ్రిటిష్ ఇండియా) అన్న పేరుతో ప్రచురింపబడింది. 1917వ సం॥ మున డా॥ అంబేద్కర్ స్వదేశానికి తిరిగి వచ్చాడు. అప్పటికి అతనికి 27 సం॥రాలు. అస్పృశ్యుడొకడు అంత గొప్పపేరు సంపాదించుకోవడం ఆనాటి అగ్రవర్ణాల వారికి ఆశ్చర్యం కలిగింది.
మహారాజుగారి మిలటరీ కార్యదర్శి అయ్యాడు. కానీ ఆఫీసులో నౌకర్లు కాగితాలు, ఫైళ్ళు ఆయన బల్లపై ఎత్తి వేశారు. 32 సం||రాల వయస్సులో డా॥ అంబేద్కర్ బార్ ఎట్లా (Barat Law) ను, లండన్ విశ్వవిద్యాలయం నుండి D.S.C పట్టాలను పొందాడు. స్వయంకృషి, ఆత్మవిశ్వాసం మానవుని మనుగడకు అత్యంతావశ్యకాలు. అందరి వలెనే మనమూ అన్నీ చేయగలం అన్న ధైర్యాన్ని నిమ్న జాతులలో కలిగించడమే అంబేద్కర్ లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో ఆయన కృతకృత్యుడైనాడు. న్యాయశాస్త్రవేత్తగా, సంఘ సంస్కర్తగా, మహామేథావిగా ఖ్యాతి నొంది, డా॥ అంబేద్కర్ 1956 సం॥మున డిశంబరు 6న మరణించాడు.
3) అబ్దుల్ కలాం (1931-2015) : అబ్దుల్ కలాం 1931వ సం॥రం అక్టోబరు 15వ తేదీన తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించాడు. ఇతని పూర్తి పేరు అవుల్ పకీర్ జైనులబ్దిన్ అబ్దుల్ కలాం. ఇతని తల్లి ఆశియమ్మ ఇతని తండ్రి జైనులబ్దిన్. నిరుపేద కుటుంబం. ఇతను కలెక్టరు కావాలని తండ్రి కలలు కనేవాడు. ఇతనికి హిందూ ధర్మ సాంప్రదాయాలు అంటే చాలా ఇష్టం. ఇతను బాల్యం నుండే మత సహనం లౌఖికవాదం అలవర్చుకున్నాడు. బాల్యంలోనే ఇతను వార్తా పత్రికలను అమ్మి తండ్రికి సహాయపడేవాడు.
అబ్దుల్ కలాంను పై చదువులు చదివించాలని తండ్రి పరితపించేవాడు. తన దరిద్రం కొడుకుపై పడకూడదని వ్యధ చెందేవాడు. కొడుకును రామనాథపురం ప్రాథమిక పాఠశాల్లో చేర్పించాడు. చదువుతూనే కలాం తల్లిదండ్రులకు సహకరించేవాడు. నుతసహనం, జాతి సమైక్యత, జీవలోక కారుణ్యం మున్నగు సుగుణాల్ని అలవరచుకున్నాడు. అంతేకాక ఒక లక్ష్యాన్ని, గమ్యాన్ని చిన్నతనంలోనే రూపొందించుకున్నాడు. శాస్త్ర సాంకేతిక అభ్యాస విధానాన్ని, నిర్దిష్టమైన ఆలోచనా పద్ధతిని అలవాటు చేసుకున్న కలాం ఇంజనీరింగ్ చదవాలన్న ఆశయాన్ని దృఢంగా నిశ్చయించుకున్నాడు.
మద్రాసులోని M.I.T. కళాశాల్లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశాడు. అత్యంత శ్రద్ధతో విస్తృతమైన శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని సంపాదించుటకై అన్వేషిస్తూ జ్ఞానాన్ని సమీకరించుకున్నాడు. విమానాల నిర్మాణాలు, వాటిలోని లోటుపాట్లు, నిర్వహణ ఏరో డైనమిక్ డిజైనింగ్ వాటిలో వస్తున్న మార్పులు మున్నగు అంశాలపై సమగ్రమైన అవగాహనను సంపాదించుకున్నాడు. అంతేగాక M.I.T. కోర్సులో భాగంగా తన సహ ఉపాధ్యాయులతో కలిసి చిన్నతరహా యుద్ధ విమాన కల్పనా బాధ్యతల్ని స్వీకరించి దిగ్విజయంగా ఆ ప్రాజెక్టును పూర్తి చేశాడు.
1958 సం||లో ఇంజనీరింగ్ పూర్తికాగానే సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంటుగా ఢిల్లీలోని రక్షణ మంత్రిత్వశాఖ ఉద్యోగంలో చేరాడు. ఇతను అంతరిక్ష పరిశోధనా కమిటీ రాకెట్ ఇంజనీర్ నియామకానికి నిర్వహించిన ఇంటర్వ్యూలో సెలక్టయి విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ తుంబాలో రాకెట్ ఇంజనీర్గా నియమింపబడ్డాడు. ఉపగ్రహాలను ప్రయోగించే శాటిలైట్ లాంచ్ వెహికల్ లాంటి రాకెట్ విజయవంతం కావడానికి కీలకపాత్ర వహించాడు. ఇతని సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం అబ్దుల్ కలాంను ఏరోస్పేస్ డైనమిక్ అండ్ డిజైన్ గ్రూఫ్ డైరక్టర్గా నియమించింది.
1982 – 1992 మధ్య కలాం పర్యవేక్షణలో ప్రతి ప్రయోగం ఫలప్రదమైంది. ఇతని నేతృత్వంలో అగ్ని, పృథ్వి, ఆకాశ్, నాగ్, త్రిశూల్, పినాక రూపకల్పన చేయబడి విజయవంతంగా పరీక్షించబడ్డాయి. ఇతని సేవలను గుర్తించిన 30 యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లను ఇచ్చి గౌరవించాయి.
భారత ప్రభుత్వం ఇతనిని పద్మశ్రీ, పద్మభూషణ్ భారతరత్న వంటి పురస్కారాలతో గౌరవించింది. ఇతని దేశ సేవను, త్యాగనిరతిని గుర్తించి మొట్టమొదటగా రాజకీయేతర వ్యక్తి అయిన అబ్దుల్ కలాంను భారత రాష్ట్రపతిగా ఎన్నుకోవడం ముదావహం. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా భారతదేశానికి నిరుపమానమైన సేవలందించిన అబ్దుల్ కలాం 27 జూలై 2015న షిల్లాంగ్లో కన్ను మూశారు.
పాఠ్యాంత పద్యం
ఉ. “ఆఁకలి బాధచేఁ జెమట లాఅని గాసికి నోర్చి ప్రాణముల్
పోకడపెట్టు వారి శ్రమమున్ రుధిరమ్ము గడించి యీయఁగా
చేకుఱినట్టి యర్థము లిసీ యని రోయకటుల్ భుజింతు వ
న్నా ! కృపమాలి ఘోరకలు షాక్తతఁ దుచ్ఛములైన భోగములో” — పింగళి కాటూరి కవులు
భావం : అన్నా ! ఆకలితో ఒళ్ళంతా చెమటలు పడుతూ నీరసంగా ఉన్న పేదవాడు తన రక్తాన్ని, చెమటను చిందించి ప్రాణాలను పణంగా పెట్టి సృష్టించిన సంపదలివి. శ్రమదోపిడితో మలిన పడిన ఆ సంపదలను అసహ్యించుకోకుండా విలాసంగా అనుభవిస్తున్నావు. ఇది నీ వంటి వాడికి తగదు. స్వార్థం విడిచిపెట్టి సమాజం పట్ల బాధ్యతగా ప్రవర్తించు అని నందుడుకి బుద్ధుడు చెప్పాడు.
సూక్తి : ‘కింద పడ్డానని ఆగిపోకు తిరిగి ప్రయత్నం చేస్తే విజయం నీదే. — అబ్దుల్ కలాం
విశేషాంతాలు-తెలుగు మాండలికాలు:
నేటి తెలుగులో భాషామండలాలు వృత్తిపద పరిశోధన ఆధారంగా తెలుగునాడును నాలుగు భాషా మండలాలుగా విభజించవచ్చని తేలంంది. అవి:
(1) పూర్వమండలం (కళింగదేశం: (శ్రీకాకుళం విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలు),
(2) దక్షిఐమండలం (రాయలసీమ, నెల్లూరు, ఏ్రకాశం జిల్లాలు),
(3) ఉత్తరమండలం (తెలంగాణా మహబూబ్నగర్, ఖమ్ము, జిల్లాల్లో కోస్తా రాయలసీమలను ఆనుకొన్న ఆయా భాషామండలాల్లో కలుస్తాయి.),
(4) మధ్యమండలం (ఉభయ గోదావరులు, గుంటూరు, కృష్ణాజిల్లాలు). ఈకింది వృత్తిపదాల్లో ఆయా మండలాలకే పరిమతమైన విలక్షణ శబ్దాలు సూచించబడ్డాయి.
సూచన: మీ ప్రాంతంలో పలికే కొన్ని పదాలను ఇతర ప్రాంతాలలో ఎలా పిలుస్తారో తెలుసుకొని రాయండి.
అదనవు భాషాంశాలు
పర్యాయపదాలు
ఉదయము : సూర్యోదయము, ఉదితి, పొడుపు, ప్రొద్వు పొడుపు
ఆలోచనము : అన్వవేక్ష, అస్వీక్ష, చింతన, తలంపు, తలపు, యోచన
ఏథి : తెరువు, వాటిక, వాడకట్టు, సందు
పరిచయము : ఎఱుక, పరిచితి, మాలిమి, హాసన, విభావమ
మనసు : ఉద్దేశము, లక్ష్యము, గుఱి, పూనిక, భావము, సంకల్పము
తలుపు : అరళము, అలారము, కవాటము, పలుగీడి
నిమిషము : నిముసము, నిమేషము, ఱప్పపాటు కాలము
ఉపిరి : గాలి, అనిలము, ఎదచూలి, జీవనము, తమ్మెర, ప్రాణము, పయ్యెర, వాతము
అక్క : అగ్రజ, అగ్రభువు, అత్తిక, అప్ప, అవంతి, పూర్పజ
రోజు : దినము, అహము, ఆయత్తి, తేది, దివము, దివసము, నాడు, పూట, ఏొద్కు, వాసరము, వేళ
అన్న : అగ్రజుడు, అగ్రజన్ముడు, అగ్రభువు. అగ్రిముడు, పూర్వజుడు, పెద్దపాడు
ఇల్లు : శృహము, గీము, అగారము, గేహము, నికేతనము, నిలయము, నివాసము, నిశాంతము, సదనము
పెళ్ళి : విపాహము, హ8ణయము, ఉడ్వాహము
సాకు : పోషించు, పరిపోషంచు, పెంచు, పెంపు, ఏ్రోచు, భరించు, మనుచు, మనుపు, సాదు
హుట్టుక : అథినిష్పత్తి, అత్మలాభము, అవిర్యావము, ఉత్పత్తి, ఉత్పాదము, జననము, జన్మము, సంభూతి, సముద్ధుము
ఎందు : భోజనము, సత్కారము, విఘనము,సాదము, సాపాటు, బువ్వ, కుడుపు, కూడు
వినోదము : కైళము, వింత, విహృతి
నానార్థాలు
వీథ – తెరువు, చోటు
పరాచయము – ఎఱుక, స్నేహము
మనసు – కోరిక, (పేమ, ఏకాగ్రత, ఉద్దేశము
ఉపిరి – గాలి, ఉచ్ఝాసము, ప్రాణము
అక్క – స్రీ, అప్ప
సాకు – పోషించు, కారణము, నెపము
విండు – సంతోషము, భోజనము, సంతర్బణ. చుట్టము, అతిథి
ప్రకృతి – వికృతులు
ప్రకృతి – వికృతి
స్నానము – తానము
గుర్తు – గుఱుతు
శబ్దము – సద్దు
నిమిషము
నిమేషము – నిముసము
రూపాయి – రూక
బుద్ధి – బుద్ది
ప్రాణము – పానము
ముఖము – మొగము
మూర్ఖుడు – మొఱకు
రాత్రి – రేయి, రాతిరి
కష్టం – కస్తి
ఉదయము – & ఒవవ
కారణం – కతనం
పంక్తి – పది, బంతి
పండ – పేడి
వ్యాపారము – బేహారము
అంబ – అమ్మ
ఆసక్తి – ఆసత్తి
చదువు – సదువు
సుఖము – సుకము, సుగము
స్థలము – తలము
సంధులు
1. అత్వ సంధి :
లేచినప్పటి – లేచిన + అప్పటి
ఎల్లమ్మ – ఎల్ల + అమ్మ
ఉబ్బినట్షు – ఉబ్బిన + అట్లు
ఇంకేమి – ఇంక + ఏమి
ఇంకెవరికి – ఇంక + ఎవరికి
కోల్సోయినట్లు – కోల్సోయిన + అట్లు
2. లు,ల,న,ల సంధి :
స్నానాలు – స్నానము + లు
నిముషాలు – నిముషము + లు
సంబంధాలు – సంబంధము + లు
వినోదాలు – వినోదము + లు
3. ఉత్వ సంధి :
వర్షనుకొన్నా – వద్దు + అనుకొన్నా
ఆలోచనలన్నీ – ఆలోచనలు + అన్నీ
నాలుగేళ్లు – నాలుగు + ఏళ్లు
జుట్టంతా – జుట్టు + అంతా
నాకేమీ – నాకు + ఏమీ
లేదమ్మా – లేదు + అమ్మా
ఎప్పుడయింది – ఎప్పుడు + అయింది
లేదంట – లేదు + అంట
వచ్చామేమే- వచ్చావు + ఏమే
కదమ్మా – కదు + అమ్మా
నేనెక్కడ – నేను + ఎక్కడ
అవునమ్మా – అవును + అమ్మా
ఉన్నాడట – ఉన్నాడు + అట
నేనింట్లో – నేను + ఇంట్లో
కొడుకంటీ – కొడుకు + అంటే
నీకంత – నీకు + అంత
జీవితమంతా – జీవితము + అంతా
వాళ్షందరూ – వాళ్లు + అందరూ
4. ఇత్వసంధి :
తనదైన – తనది + ఐన
వెలితనిపించి – వెలితి + అనిపించి
లేనట్షు – లేని + అట్లు
ఏముంది – ఏమి + ఉంది
పోయిందమ్మా – పోయింది + అమ్మా
పడిందని – పడింది + అని
అక్కడికక్కడ – అక్కడికి + అక్కడ
పడుంటే – పడి + ఉంటో
అదేమో – అది + ఏమో
జరిగేదేమో – జరిగిది + ఏమో
పోతుందని – పోతుంది + అని
పడుంటాడు – పడి + ఉంటాడు
ఇన్నేళ్షూ – ఇన్ని + ఏళ్షు
ఏమివ్వమంటావు – ఏమి + ఇవ్వమంటావు
ఏమైంది – ఏమి + ఐంది
5. ఆక్రేడిత సంధి :
ఏవేవి – ఏవి + ఏవి
ఎక్కడక్కడ – ఎక్కడ + ఎక్కడ
సమాసాలు
1. షష్తీ తత్పురుష సమాసం :
మా ఆయన – మా యొక్క ఆయన
మా అక్క – మొక్క అక్క
నా పెళ్లి – నాక్క పెళ్లి
ఎటుపక్కన – ఏటికి పక్కన
మా ఉరు – మొక్క ఊరు :
ఇంటోదోవ – ఇంటికి దోవ
వాళ్ష సొంతం – వాళ్లకు సొంతం
2. తృతీయా తత్పురుష సమాసం :
పప్పు అన్నం – పప్పుతో అన్నం
3. నఇ తత్ఫురుష సమాసం :
అశాంతి – శాంతి కానిది
4. ద్వంద్వ సమాసం :
దరిదాపులు – దరియును, దాపుయును
5. విశేషణ పూర్వపద కర్మథారయ సమాసం :
పెద్ద దెబ్బు – పెద్దదైన దెబ్ణ
రెండోదాన్ని – రెండవదైన దాన్ని
జానెడు తాడు – జానెడైన తాడు
పెద్ద వ్యాపారం – పెద్దదైన వ్యాపారం
పసుపుతాడు – పసుపు (రంగు)దైన తాడు
పక్కూరు – పక్కదైన ఊరు
ఎన్నిరోజులు – ఎన్నియైన రోజులు
ఎంత వయసు – అంతయైన వయసు
చనననషిడ్డలు – చిన్నయైన బిడ్డలు
6. ద్కిగు సమాసం :
నాలుగేళ్లు – నాలుగు సంఖ్య గల ఏళ్లు
పదిరోజులు – పది సంఖ్య గల రోజులు
మూడు నిముషాలు – మూడు సంఖ్య గల నిముషాలు
నాలుగు రోజులు – నాలుగు సంఖ్య గల రోజులు
పదివెలు – పది సంఖ్య గల వేలు
ఆరేళ్లు – అరు సంఖ్య గల ఏళ్లు
పధ్నాలుగుమంది – పధ్నాలుగు సంఖ్య గల మంది
ఏభైరూపాయిలు – ఏభై సంఖ్య గల రూపాయిలు
7. సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం:
ఈత పుల్లలు – ఈత అను పేరు గల పుల్లలు
8. అవ్యయీభావ సమాసం:
ప్రతిరోజు – రోజు రోజు
9. చతుర్థీ తత్పురుష సమాసం :
వంటిల్లు – వంట కొరకు ఇల్లు
రచయిత్రి పరిచయం
పాక్యభాగం : బతుకు గంప
గ్రహింపబడిన గ్రంథం : రచయిత్రి కథల నుండి గ్రహింపబడింది.
రచయిత్రి : మూలింటి చంద్రకళ
కాలం : 20 శతాబ్దం
రచనలు : థర్త రామకృష్ణగారి సహకారంతో కథలు, కథానికలు రాశారు. వీటిలో ముఖలె ప్రయాణం, బతుకుగంప, ఒక రైతు కథ. ఇవిగాక భానుమతి రామకృష్ష గారి కథలకు”, మునిమాణిక్లం నరసింహరావు గారి “కాంతం కథలకు” రేడియో ప్రసంగాలు.
జననీ జనకులు : రాజగోపాల్, విమలమ్మ
జన్మస్థలం : చిత్తూరు జిల్లా ‘అరగొండ’ (గ్రామం
ప్రక్రియ – కథానిక
తెలుగు సాహిత్యంలో నేడు ‘కథ కథానిక’ అనేవి పర్యాయపదాలుగా మారిపోయాయి. కథానిక వచన ప్రక్రియ. వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని లేదా సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. క్లుప్తత దీని ప్రధాన లక్షణం. పాత్రలు, నేపథ్యము, కథనము, జీవిత వాస్తవ చిత్రణ, కంఠస్వరం కథానికలో ముఖ్యమైన అంశాలు.
ఉద్దేశం
మానవ జీవితంలో కష్టసుఖాలు సహజం. సుఖాలకు పొంగిపోకూడదు. కష్టాలకు భయపడిపోకూడదు. కష్టాలు వచ్చినపుడే గుండె దిటవు చేసుకోవాలి. ధైర్యంగా సమస్యలను ఎదుర్కోవాలి. ఉన్నంతలో ఆనందంగా జీవించాలి. మనిషికి మనిషే తోడు. కష్టాలలో ఉన్నవారికి చేయూత నివ్వాలి. మానవత్వం విడిచి పెట్టకూడదు. మనిషి మనిషిగా జీవించాలని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం.
కఠిన పదాలకు అర్థాలు
వెలితి = తక్కువ
మెదిలాయి = గుర్తుకువచ్చాయి
శబ్దం = ధ్వని
ఫోరున ఏడ్చుట = పెద్దగా దుఃఖించుట
పండ పెట్టిండు = పడుకో పెట్టుట
యీదిలో = వీథిలో
సదువు = చదువు
లెక్క = ఫైసలు
పసుపుతాడెయుట = పెళ్ళి చేయుట
సాలుకొనే = మానేశాడు
సాకాల్సి వచ్చె = పోషించాల్సి వచ్చింది
మాగేర్లో = మా వాళ్ళల్లో
మళ్లీ పాయె = మళ్ళీ వెళ్ళిపోయాడు
ఈదీదీ = వీథ వీథికి
పల్లల్ని సాకితి = పిల్లల్ని కాపాడుకొంటి
పిలకాయలకి = పల్లలకు
బిత్తరఫోవుట = ఆశ్చర్యపడుట
అలుముకొనుట = క్రమ్ముకొనుట
పానం = ప్రాణం
వెలితి = తక్కువ
మెదిలాయి = గుర్తుకువచ్చాయి
శబ్దం = ధ్వని
ఫోరున ఏడ్బుట = పెద్డగా దుఃఖించుట
పండ పెట్టిండు = పడుకోపెట్టుట
యూదిలో= వీథిలో
సదువు = చదువు
లెక్క = పైసలు
పసుపుతాడెయుట = పెళ్ళి చేయుట
సాలుకొనే = మానేశాడు
సాకాల్సి వచ్చె = పోషించాల్సి వచ్చింది
మాగేర్లో = మా వాళ్ళల్లో
మళ్లీ పాయె = మళ్ళీ వెళ్ళిపోయాడు
ఈదీదీ = వీథి వీథికి
పిల్లల్ని సాకితి = పిల్లల్న్ కాపాడుకొంటి
పిలకాయలకి = పిల్లలకు
బిత్తరపోవుట = ఆశ్చర్లపడుట
అలుముకొనుట = క్రమ్ముకొనుట
పానం = ప్రాణం