These AP 10th Class Telugu Important Questions 2nd Lesson బతుకు గంప will help students prepare well for the exams.
బతుకు గంప AP Board 10th Class Telugu 2nd Lesson Important Questions and Answers
అవగాహన – ప్రతిస్పందన
1. ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఎందుకో ఉదయం లేచినప్పటి నుంచీ ఏ పనీ చెయ్యాలనిపించడం లేదు. పిల్లలు వాళ్లంత వాళ్లు స్నానాలు చేసి ఉన్నదేదో తిని స్కూలుకెళ్లారు. వంట ఏం చేశానో ఏమో… పండించే కాసంత క్యారియర్లో పెట్టి ఇచ్చాను. మా ఆయన కూడా ఆఫీసుకు వెళ్లిపోయాడు. ఎక్కడ వస్తువులు అక్కడే పదున్నాయి. పిల్లలు ఎక్కడ తీసేసిన బట్టలు అక్కడే ఉన్నాయి. ఏ పనీ చెయ్యాలనిపించడం లేదు. ఎంత వద్దనుకున్నా ఎల్లమ్మే గుర్తుకు వస్తోంది. ఆలోచనలన్నీ ఎల్లమ్మ చుట్టే తిరుగుతున్నాయి. కారణం తెలీడంలేదు. ఎప్పుడో నాలుగేళ్ల క్రితం అనుకుంటా……..
ఈత పుల్లల గంపలో ఎంతో అందంగా పండ్లు అమర్చుకొని తనదైన యాసతో ‘పండ్లమ్మో….’ అంటూ అరుస్తూ మా వీధిలోకి వచ్చింది. ఆ రోజు ఎల్లమ్మను నేనే పిలిచానో, తనే వచ్చిందో గుర్తుకు రావడం లేదు. అప్పట్నుంచి ప్రతిరోజూ తను రావడం అవసరం ఉన్నా లేకున్నా ఎల్లమ్మ దగ్గర పండ్లు కొనుక్కోవడం జరుగుతూ ఉంది. పండ్లు కొనుక్కోవడంతో మొదలైన ఎల్లమ్మతో పరిచయం ఎలా బలపడిందో ఇప్పుడు స్పష్టంగా చెప్పలేను.
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
రచయితకు గుర్తు వచ్చిందెవరు?
జవాబు:
ఎల్లమ్మ
ప్రశ్న 2.
వీధిలో ఎల్లమ్మ ఏమని అరుస్తోంది?
జవాబు:
వీథిలో ఎల్లమ్మ తనదైన యాసతో ‘పండ్లమ్మో’ అని అరుస్తోంది.
ప్రశ్న 3.
అవసరం ఉన్నా లేకున్నా ఎల్లమ్మ దగ్గర పండ్లుకొనేదెవరు?
జవాబు:
రచయిత్రి
ప్రశ్న 4.
రచయిత ఆలోచనలు ఎవరి చుట్టూ తిరుగుతున్నాయి?
జవాబు:
ఎల్లమ్మ చుట్టూ
2. ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఒకరోజు ఎల్లమ్మ రాకపోతే ఏదో వెలితనిపించేది. అలాంటిది పది రోజులు కనిపించక పోయేసరికి ఏవేవో ఆలోచనలు మనసులో మెదిలాయి. ఏ పనీ చెయ్యాలని అనిపించలేదు. ఎల్లమ్మని గురించే ఆలోచిస్తూ కూర్చున్నాను. అంతలో ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. వెళ్లి తలుపు తీశాను. ఎదురుగా ఎల్లమ్మే వుంది. ఎప్పటిలా కనిపించడంలేదు. ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బినట్లున్నాయి. జుట్టంతా చిందరవందరగా ఉంది. ఎప్పుడు తినిందో! ఏమో! నిలబడ్డానికి కూడా ఓపిక లేనట్లుంది.
‘అదేంటే అలా వున్నావు’ అన్నాను మామూలుగానే, ‘ఇంకేముందమ్మా.. అంతా అయిపోయిందమ్మా… అంటూ భోరున ఏద్పడం మొదలెట్టింది. నాకేమీ అర్థం కాలేదు. రెండు మూడు నిమిషాలు తెల్లముఖం వేశాను. ఎల్లమ్మని ఎట్లా ఓదార్చాలో అర్ధంగాకుంది. ఒక గ్లాసు మంచి నీళ్లు ఇచ్చి తాగమని చెప్పి నెమ్మదిగా ‘ఏం జరిగిందో చెప్పవే’ అన్నాను. ఎల్లమ్మ, ఏడుస్తూనే ఉంది. వంటింట్లో కెళ్లి కాఫీ కలిపి తెచ్చి ఇచ్చాను. కాఫీ తాగింది. కొంచెం స్తిమితపడిందనిపించింది. ‘ఇప్పుడు చెప్పవే’ అన్నాను.
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
ఎల్లమ్మ రాకపోతే రచయితకు ఏమనిపించింది?
జవాబు:
ఎల్లమ్మ రాకపోతే రచయితకు వెలితనిపించింది.
ప్రశ్న 2.
ఎవరిని గురించి ఆలోచిస్తూ రచయిత కూర్చుంది?
జవాబు:
ఎల్లమ్మను గురించి ఆలోచిస్తూ రచయిత కూర్చుంది.
ప్రశ్న 3.
‘అదేంటే అలా వున్నావు’ అని రచయిత ఎవర్ని అడిగింది?
జవాబు:
ఎల్లమ్మను
ప్రశ్న 4.
రచయితకు ఎల్లమ్మను చూడగానే ఏమనిపించింది?
జవాబు:
తెల్లముఖం వేసింది.
3. ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
‘ఏమీ లేదమ్మా! మా ఆయనకు యాక్సిడెంట్ అయ్యింది. ‘ఎప్పుడయింది. ఏం జరిగింది’ నెమ్మదిగా అడిగాను. ‘ఏమోనమ్మా నాక్కూడా సరిగ్గా తెల్వదు. లారీ డ్రైవర్ చెవి చేసే వుండి. నాలుగు రోజులకు ముందు ఏదో లోడుతో పోయాడంట. హైదరాబాద్ దగ్గర ఎదురుగా వస్తోన్న టిప్పర్ గుద్దిందంట. మా ఆయనకు కాలిరిగిపోయిందంట. క్లీనర్ అక్కడికక్కడే సచ్చిపోయినాడంట. మా.. ఆయన తెలివితప్పి పడుంతో ఎవ్వరో ఆసుపత్రిలో చేర్పించినారంట. అదేమో కేసవుతుందంటున్నారు. కాళ్లకు, చేతులకు, తలకు పెద్ద దెబ్బలే తగిలాయంట. ఆసుపత్రిలో కట్లు కట్టి కుట్టేసి పండ పెట్టిండ్రు.
పానానికి భయం లేదంట… మాటల మధ్యలో ఏడుస్తూనే చెప్పింది. ‘అయితే నువ్విట్లా వచ్చావేమే’ అడిగాను. రాక సేసేదేముందమ్మా… లెక్కకావద్దూ. శానా అయితుందట కదమ్మా! … పిల్లల పేర్ల మీద నెలనెలా తిని తినకా వందొంద రూపాయలు చాన్నాల్లుగా కడతా వుంటి. అదో పదివేలున్నాయి. అవి తీసుకెళ్లాలని ఇట్లా ఊర్లోకొస్త్రి, అట్టే రానారోజులు అయింది కదా! నేనెక్కడ సచ్చానో అనుకుంటారని ఇట్టా తెలిసినోళ్ల ఇల్లు చూసి పోదామని వస్తినమ్మా’ అని తను చెప్పదల్చుకున్నదంతా అయిపోయిందని గట్టిగా వూపిరి పీల్చుకొంది.
ఎల్లమ్మతో ఏం మాట్లాడాలో అర్థంకాక అలాగే కాస్సేపు మౌనంగా ఉండిపోయాను. “ఏం సేతు… అంతా నా… ఖర్మ… ‘ఖర్మ’ అంటూ ఎల్లమ్మ మళ్ళీ చెప్పడం మొదలు పెట్టింది. “నాకు ఆరేళ్లుంటాయనుకుంటానమ్మా…. మా యీదిలో పిల్లలో ఆడుకుంటాంటి. ఎవరో మా యింటికాడ నలుగురు కూస్తోంది. చేపల కోసం మా అయ్యి కాడికి వచ్చింద్రను కుంటి. మళ్లీ వారం తాలాక తెలిసె పెత్తనానికి వచ్చిండ్రని……
ఎవరికీ….. ‘ఇంకెవరికి….. నాకేనమ్మా!’ ‘నీకా… అవునమ్మా. మా అయ్యకేమో మేము పద్నాలుగు మందిమి, నాపై నున్న అక్కలకు, అన్నలకు పెళ్లిలయ్య, నలుగురు ఎలాగూ పోయారట. మిగిలిన నలుగురిలో నేను రెండోదాన్ని నా కన్నా పెద్దదానికి అప్పటికే పెళ్లి కుదిరిందట. మా అక్కను చూడ్డానికి వచ్చిన వాళ్లలో మా ఆయనా ఉన్నాడట. ఆయనకు నేను నచ్చానట. పెళ్లిలో పెళ్లి చేసేద్దాం అనుకున్నారట. జానెడు తాడు, యాభై రూపాయల చీరతో నా పెళ్లి అయిపోయింది. నా మా అయ్యికి సదువు లేదు. పెద్ద వ్యాపారమూ లేదు. పిల్లలేమో ఇంటి నిండావుంటిమి.
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
యాక్సిడెంట్ జరిగిందెవరికి?
జవాబు:
ఎల్లమ్మ భర్తకు
ప్రశ్న 2.
ఎల్లమ్మ భర్త ఏం చేస్తుంటాడు?
జవాబు:
ఎల్లమ్మ భర్త లారీ డ్రైవరు.
ప్రశ్న 3.
తెలిసినోళ్ళు ఏమనుకుంటారని ఎల్లమ్మ రచయితతో అంది?
జవాబు:
నేనెక్కడ సచ్చానో అనుకుంటారని ఇట్టా తెలిసినోళ్ళ ఇల్లు చూసి పోదామని వస్తినమ్మా! అని ఎల్లమ్మ రచయితతో అంది.
ప్రశ్న 4.
ఎల్లమ్మ పెళ్ళి ఖర్చు ఎంత?
జవాబు:
ఎల్లమ్మ పెళ్ళి ఖర్చు జానెడు తాడు, 50 రూపాయల చీరతో జరిగింది.
4. ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
మొదట్నుంచీ చేపలు పట్టే బతుకుతుండ్రి. అప్పుడు “తినడానికి బాగా జరిగేదేమో, మా ఎక్కులకు అన్నలకు కొద్దో గొప్పో వున్నోళ్ల సంబంధాలే తెచ్చి చేసిరి. మాకాడ కొచ్చేసరికి పూట గడవడం కష్టమాయె, అక్క పెళ్లికెలాగూ అవి ఇవి కొని బంతిబువ్వ పెట్టాల కదా ? పనిలో పని అయిపోతుందని నా మెల్లోనూ పసుపు తాడేసేసిరి. కళ్లు తుడుచుకుంటూ” ఎల్లమ్మంది.
“ఎందుకు ఎల్లమ్మా ఏడుస్తావన్నా” ఇంకేమనాలో తోచక. ఎందుకేందమ్మా ?…. వాడికేం బుద్ధి పుట్టేనో ఇంటికి రావడమే సాలుకొనే, ఏం తినాలో తెలీకపోయె. మా అమ్మ కాడికి పోదామనుకుంటే వాళ్లకి జరిగేదే కష్టంగా ఉండె. మా అత్తని కూడా నేనే సాకాల్సి వచ్చె. ఏ పని చెయ్యాలో తెలవకపోయే, కూలికి పోదామంటే కడుపులో బిడ్డ వుండే. వంగి లేవడం కష్టంగా వుండె. అప్పుడు మాగేర్లో చానామంది పండ్లమ్ముకునే బతుకుతుండ్రి. వాళ్లలో పడి ఇట్లా చిన్నగా పండ్లమ్మబడితి. అట్లే పెద్దోడు పుట్టె, మళ్లీ పక్కూర్లో వున్నాడంటే బతిమిలాడి పిలసకొస్తే, కొద్దికాలం వుండే. మళ్ళీ ఏమొచ్చనో ఏమో మళ్లీ పాయ. ఇల్లే నమ్మా సంకలో బిడ్డ, కడుపులో బిడ్డ నెత్తిన గంప పెట్టుకోని ఈదీదీ తిరిగి పిల్లల్ని సాకితి. ఇట్లా ఇన్నేళ్లూ యీ బతుకీడిస్తే, పిలకాయలకి పనిచేసే వయసొచ్చె. ఏదో పనికిపోయి బతుకుతార్లే అనుకుంటి. ఇదో ఇట్లా వచ్చి పడే ఆపద. ఏం చేయాలో అర్థంకాలేదమ్మా !
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
ఎల్లమ్మ కుటుంబం జీవనాధారం ఏమిటి?
జవాబు:
చేపలు పట్టుట
ప్రశ్న 2.
ఎల్లమ్మ పెళ్ళి ఎవరి పెళ్ళిలో కలిపి చేశారు?
జవాబు:
ఎల్లమ్మ పెళ్ళి అక్క పెళ్ళితోపాటు కలిపి చేశారు.
ప్రశ్న 3.
ఎల్లమ్మ కూలిపని ఎందుకు చేయలేక పోయింది?
జవాబు:
ఎల్లమ్మ కడుపులో బిడ్డ ఉండడం వల్ల కూలిపనికి వెళ్ళలేక పోయింది.
ప్రశ్న 4.
ఎల్లమ్మ ఎలా జీవిస్తోంది?
జవాబు:
ఎల్లమ్మ పండ్ల వ్యాపారం చేస్తూ జీవిస్తోంది.
5. ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
కనీసం అమ్మవాళ్లు కూడా అయ్యో మల్లా, వూర్లోవాళ్లు ఏమీ అని అనకపోయిరి. పోతే పోయినాడు లేమ్మ… వాడు బాగుండి నువ్వు సుఖపడింది లేదు అనబట్టిరి. అయినా పాడు పానం వూరుకోలేదమ్మా. ఎంతైనా పుస్తెకట్టినోడు.. సంపాయించి పెట్టకపోతే పాయ, మగదిక్కుగానైనా… ఇంట్లో పడుంటాడు. ఆయనకీ ఇంకొక బిడ్డ అని అంత ముద్దేస్తే సరే. నలుగురిలో అంత బొట్టెట్టుకొని తిరగచ్చు. పిల్లలపై ప్రేమ లేకుంటే పాయ. కన్నోడున్నాడనుకుంటారు కదా! అని ‘పండ్లమ్మి కూడబెట్టిన పైసలు ఎత్తుకొని పోతుండానమ్మా’ అంటూ కళ్ళు తుడుచుకుని ఇంట్లో.. చిందరవందరగా పడున్న సామాన్లు సర్ది, ఉన్న నాలుగిన్నెలు కడిగి “అంగ వస్త్రానమ్మా… నాలుగు దినాల తర్వాత మళ్లీ కనబడతానమ్మా!” అంటూ చెప్పి చాలా సాధారణంగా వెళ్లి పోయింది.
ఎల్లమ్మ వెళ్లి పోయినా ఆలోచనలు ఎల్లమ్మ చుట్టే తిరుగుతున్నాయి. ఇన్నేళ్ల తన పరిచయంలో ఏనాడూ తను బాధ పడుతున్నట్లుగాని, తనేదో కోల్పోయినట్లుగాని కనపడలేదు. ఎప్పుడూ ఎండలో గంప మోసి మోసి అలిసిపోయినట్లు కనిపించేది. మూడేళ్ల క్రితం అనుకుంటా ఒకరోజు జ్వరంతో పడుకోనున్న నన్ను చూసి ‘ఏమైందమ్మాని ఆప్యాయంగా పలకరించి, ఇంట్లో పనంతా ఎవరు చేస్తారమ్మా’ అని అడిగింది. “జ్వరం తగ్గాక నేనే చేసుకోవాలి” అన్నాను. ‘బలేవారమ్మా ఒళ్లు అట్లా పెట్టుకుని ఎట్లా చేసుకుంటారు. నేను చేస్తాలే అని ఇల్లంతా కనువు కొట్టి, బండలు తుడిచి, అంట్లు తోమి, పిల్లలు వారం రోజులుగా, విడిచిన బట్టలన్నీ శుభ్రంగా ఉతికి ఆరేసింది. ‘ఏమివ్వమంటావే’ అన్నాను. కళ్లనిండా నీళ్లు పెట్టుకుంది. ‘ఏమైందే ?’ అన్నాను కంగారుగా.
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
ఎల్లమ్మను వదిలేసి వెళ్ళిపోయిందెవరు?
జవాబు:
ఎల్లమ్మను వదిలేసి ఆమె భర్త వెళ్ళిపోయాడు.
ప్రశ్న 2.
ఎల్లమ్మ సంపాయించిన సొమ్ము ఎవరు ఎత్తుకొని పోయారు?
జవాబు:
ఎల్లమ్మ సంపాయించిన సొమ్మును ఆమె భర్త ఎత్తుకొని పోయేవాడు.
ప్రశ్న 3.
ఎల్లమ్మ ఎవరి ఇంట్లో సామాన్లు సర్ది, గిన్నెలు కడిగింది?
జవాబు:
ఎల్లమ్మ రచయిత ఇంట్లో సామాన్లు సర్ది, గిన్నెలు కడిగింది.
ప్రశ్న 4.
ఎల్లమ్మ ఎవరికి జ్వరం వస్తే చూడటానికి వచ్చింది?
జవాబు:
ఎల్లమ్మ రచయితకు జ్వరం వస్తే చూడటానికి వచ్చింది.
6. ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
“ఏమీ లేదమ్మా… డబ్బుదేముంది? ఒక గంట సేపు గంప నెత్తిన పెట్టుకొని రెండు వీధులు తిరిగితే నా కూలి వచ్చేస్తాది. రోజుకో ఇరవై రూపాయలు మిగిలితే ఆ రోజు పండగే. అంత పప్పు అన్నం తింటాం”. కానీ నీలాగ వచ్చినపుడల్లా ‘ఎల్లమ్మా’ అని ప్యాయంగా ఎవరు పిలుస్తారు. అట్లా పిలిస్తే నాకెంతో ఆనందంగా ఉంటుందమ్మా… ఎన్ని రోజులు – నువ్వు తినే కూడు పెట్టింటావు. ఒక పూట నేనింట్లో పనిజేస్తే దానికి నువ్వు డబ్బులివ్వాలా? ఏదో అవసరం గనక చేస్తిని…” అంది. ఎల్లమ్మ మాటలకి బిత్తరపోయాను. ఆ రోజు నుంచి ఎల్లమ్మ మా ఇంట్లో ఒక మనిషిగా కలిసిపోయింది. ఎప్పుడూ తనెనుక ఇంత గతముందని చెప్పింది కాదు.
‘ఒక రోజు మాటల మధ్యలో ‘నా కొడుక్కి బాగాలేదమ్మా’ అంది. ‘నీకంత వయసొచ్చిన కొడుకున్నాడా ఎల్లమ్మా’ అన్నాను. కొడుకంటే….. కొడుకేనమ్మా… పదైదేండ్ల కిందట సంగతమ్మ ఇది. మా వూరు ఏటిపక్కన వుంది గదా !… ఆ ఏటి వరదలో ఎవరో బిడ్డ కొట్టుకొచ్చాడు. చేపల వేటకు పోయిన మావూరోళ్ళు ఆ బిడ్డను కాపాడి గట్టు మీద కూర్చో బెట్టారు. అక్కడ చాలామంది వున్నారు. ఈ బిడ్డను తమతో తీసుకుపోడానికి ఎవరు ముందుకు రాలేదు. అప్పుడు నేను కడుపుతో వున్నా ! చూస్తా చూస్తా బిడ్డను ఎట్లా దిక్కులేని బిడ్డలా వదిలేసేదని ఇంటికెత్తికొస్తి. నా బిడ్డలతో సమానంగా పెంచితి. వానికి నేను పెట్టిన పేరు సాయిలు. నా బిడ్డలతో పాటు వాడిని కూడా పది వరకు సదివిస్తే చూస్తా, చూస్తా వుండగానే వాడు పెరిగి పెద్దదయ్యె, ఇప్పుడు మా వూరిలో బస్సు కండక్టరు ఉద్యోగం చేస్తున్నాడమ్మా! అంటూ ఏడుస్తూ తన్ను తాను తిట్టుకుంటూ ఇంటిదోవ పట్టింది.
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
ఎల్లమ్మ పండ్ల వ్యాపారంతో రోజుకు ఎంత సంపాయిస్తుంది?
జవాబు:
రోజుకు ఇరవై రూపాయలు.
ప్రశ్న 2.
‘ఎల్లమ్మా’ అని ఇంత ఆప్యాయంగా ఎవరు పిలుస్తారు?
జవాబు:
రచయిత్రి
ప్రశ్న 3.
రచయిత్రి ఇంట్లో ఒక మనిషిగా కలిసిపోయిందెవరు?
జవాబు:
ఎల్లమ్మ
ప్రశ్న 4.
ఎల్లమ్మ ఎవరిని పెంచుకుంది?
జవాబు:
సాయిలు
7. ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఎల్లమ్మ వెళ్లిన దోవ తట్టి చూస్తూ నిలబడ్డాను. ఇంచుమించు ఎల్లమ్మతోపాటు ఎంతో మంది పండ్లమ్ముకునే బతుకుతున్నారు. వాళ్ల బతుకులూ ఇల్లే వుంటాయేమో… ఎంత కష్టపడుతూ ఉంటారో… జానెడు పొట్ట కోసం కడుపున పుట్టిన బిడ్డల కోసం రెక్కలు ముక్కలు చేసుకొని పొద్దస్తమానం కష్టం చేస్తూనే ఉంటారు. ఇంట్లో ఎప్పుడన్నా అంత లద్యో అంత మైసూరుపాక, అంత కారం బూందీవో చేతిలో పెడితే కొంగునకట్టుకుంటుంది. ‘ఎందుకు తినవే’ అంటే ‘సిన్నబిడ్డలకి ఎవరు పెడతారమ్మా! అంటుంది.
‘ఇంత పని చేస్తావ్ నీకు శ్రమ అనిపించదా’ అని ఎప్పుడైనా అడిగితే ‘బలేవారమ్మా !… మనిషి పుట్టక పుట్టి కష్టం అనుకుంటే ఎలా ? కష్టంతోనే మనం తింటున్నాం. మన పిల్లలకి పెడుతున్నాం. మనల్ని ఆశ్రయించినోళ్లకి ఇంత పెడుతున్నాం. ఇంతకంటే తృప్తి ఎక్కడుంది ?’ అంటుంది.
ఎల్లమ్మ వెళ్ళిపోయినా ఎల్లమ్మని గురించిన ఆలోచనలు నన్ను గందరగోళపరుస్తూనే ఉన్నాయి. నా చుట్టూ ఎందరో ఉన్నారు. లెక్చరర్ నీరజ, బ్యాంక్ క్లర్క్ వసుంధర, టీచర్ సునీత, పార్వతి.. పద్మ…. హరిత… ఇంకా ఎందరో ఉన్నారు. ఆర్ధికంగా వాళ్ళకి ఏ ఇబ్బందులూ లేవు. ఖరీదైన చీరలే కడతారు. ఖరీదైన మనుషుల్లానే కనపడతారు. విందులు, వినోదాలు అంటూ ఎక్కడెక్కడికో వెళ్లి వస్తుంటారు. ఎప్పుడు కలిసినా ఏదో వెలితిగానే మాట్లాడతారు. ఏవేవో వాళ్లు వూహించుకున్నవి వాళ్ల సొంతం కాలేదని వాళ్ల జీవితమంతా అశాంతే అలుముకుందని బాధపడిపోతారు. ఏనాడూ సుఖమన్న మాట, ఆనందమన్న మాట తన దరిదాపులకు రానివ్వని ఎల్లమ్మ ఎప్పుడూ బాధపడినట్లు గాని, వాటి గురించి ఆలోచించినట్లుగాని కనిపించలేదు.
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
ఎల్లమ్మ ఏ విధంగా కష్టపడుతోంది?
జవాబు:
ఎల్లమ్మ జానెడు పొట్ట కోసం కడుపున పుట్టిన బిడ్డల కోసం రెక్కలు ముక్కలు చేసుకొని పొద్దస్తమానం కష్టం చేస్తూనే ఉంటుంది.
ప్రశ్న 2.
రచయిత్రి ఎల్లమ్మకు ఏమేమి పెడుతుండేది?
జవాబు:
లడ్లు, మైసూరుపాకు, కారంబూంది.
ప్రశ్న 3.
ఇంత పని చేస్తావ్ నీకు శ్రమ అనిపించదా! అని రచయిత ఎవర్ని అడిగింది?
జవాబు:
ఎల్లమ్మను
ప్రశ్న 4.
పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
రచయిత్రి తన పరిసరాలను గూర్చి ఏమనుకున్నది.
అపరిచిత గద్యాలు
1. కింది పేరా చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
వారానికో రోజు ఉపవాసం చేయడం మంచిది. క్రమం తప్పకుండా ఉపవాసం చేసేవాళ్లు ఆరోగ్యంగా ఉంటారు. వీటికి కారణాలను అట్లాంటాలోని జార్జియా స్టేట్ విశ్వవిద్యాలయ పరిశోధకులు వివరించారు. ఉపవాసం చేయడం వల్ల బీటా హైడ్రాక్సీ బ్యుటిరేట్ అనే కీటోన్ ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల వృద్ధాప్యం దరిచేరదని యౌవనోత్తేజంతో ఉంటారని కూడా చెబుతున్నారు. అంతేకాకుండా వయసుతోపాటు వచ్చే హృద్రోగం, క్యాన్సర్, అల్జీమర్స్ వంటివి రావడం కూడా తగ్గుతుందని చెబుతున్నారు.
ప్రశ్నలు – జవాబులు
అ) ఉపవాసాలపై పరిశోధన చేసిన వారెవరు?
జవాబు:
ఉపవాసాలపై అట్లాంటాలోని జార్జియా స్టేట్ విశ్వవిద్యాలయ పరిశోధకులు పరిశోధన చేశారు.
ఆ) ఉపవాసం నెలకు ఎన్ని రోజులు చేయడం మంచిది?
జవాబు:
ఉపవాసం నెలకు నాలుగు లేక ఐదురోజులు చేయడం మంచిది.
ఇ) వృద్ధాప్యాన్ని దరిచేరనీయనిదేది?
జవాబు:
బీటా హైడ్రాక్సీ బ్యుటరేట్ అనే కీటోన్ వృద్ధాప్యం దరిచేరనీయదు.
ఈ) పై పేరా ఆధారంగా ఒక ప్రశ్నను తయారుచేయండి.
జవాబు:
ఎవరు ఆరోగ్యంగా ఉంటారు?
2. కింది గద్యాన్ని చదివి, దిగువన ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.
గోల్కొండ పాదుషాలలో ఇబ్రహీం కుతుబ్షాషా విద్యాసియుడు. ఈతని ఆస్థానములో కవులు, పండితులు హిందువులలో, మహమ్మదీయులలో ఉండిరి. విద్యా గోష్ఠి సాగుచుండెను. పాదుషావారు పండితులను బాగుగా సన్మానించుచుండిరి. ఇబ్రహీం కుతుబ్షా చాలాకాలం విజయనగరము నందు రాజాదరణమున పెరిగిన వాడగుటచే ఆంధ్రభాషా మాధుర్యమును గ్రోలినవాడు. ఆంధ్రభాషయందు అభిమానము గలిగి ఆంధ్రకవులను సత్కరించుచుండెను.
అద్దంకి గంగాధర కవి ‘తపతీ సంవరణోపాఖ్యాన కావ్యము’ను రచించి, ఈ పాదుషాకు అంకితమిచ్చియున్నాడు. ఇబ్రహీం పాదుషా సేనానియైన అమీర్ ఖాన్ మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్యమైన యయాతి చరిత్రమునకు కృతి భర్త.
ప్రశ్నలు- జవాబులు
ఆ) విద్యాప్రియుడయిన గోల్కొండ చక్రవర్తి ఎవరు?
జవాబు:
విద్యాప్రియుడయిన గోల్కొండ నవాబు ‘ఇబ్రహీం కుతుబ్షాషా,
ఆ) ఇబ్రహీం కుతుబ్షాకు తెలుగుభాషా మాధుర్యము ఎలా తెలిసింది?
జవాబు:
ఇబ్రహీం కుతుబ్షా చాలాకాలం విజయనగరంలో రాజాదరణలో పెరిగాడు. అందువల్ల ఆయనకు ఆంధ్రభాషా మాధుర్యము తెలిసింది.
ఇ) తపతీ సంవరణోపాఖ్యానమును అంకితముగొన్న ప్రభువు ఎవరు?
జవాబు:
తపతీ సంవరణోపాఖ్యానాన్ని ‘ఇబ్రహీం కుతుబ్షాషా’ అంకితం తీసుకొన్నాడు.
ఈ) యయాతి చరిత్రను అంకితం పొందినది ఎవరు?
జవాబు:
యయాతి చరిత్రను ఇబ్రహీం కుతుబ్షా సేనాని అమీరాఖాన్ అంకితం పొందాడు.
3. కింది గద్యాన్ని చదివి, దిగువనిచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.
“విద్యారణ్యుల వారి ఆశీర్వాదంతో సంగమ వంశరాజులు విజయనగర సామ్రాజ్యాన్ని క్రీ.శ. 1335లో స్థాపించారు. వీరు కళలను పోషిస్తూ, కవులను ఆదరిస్తూ, ఆశ్రితులకు అగ్రహారాలు ఇస్తూ క్రీ.శ. 1485 దాకా పాలించారు. ఈ వంశంలోని కడపటి రాజులు అతి దుర్బలులై అవినీతిపరులుగా మారినందువల్ల వీరి కొలువులోనే ఉన్న దండనాయకుడు సాళువ నరసింహరాయలు సామ్రాజ్యాన్ని సంరక్షించడానికి క్రీ.శ. 1485లో అధికారాన్ని హస్తగతం చేసుకొని వజ్ర సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతడు తాళ్ళపాక అన్నమయ్యగారిని సత్కరించి సంకీర్తనలను ప్రోత్సహించాడు. పిల్లలమఱి పిన వీరయ్యను పోషించి కృతి పుచ్చుకున్నాడు.
ప్రశ్నలు – జవాబులు
ఆ) సంగమరాజులు ఎవరి ప్రోత్సాహంతో ఎప్పుడు, ఏ రాజ్యం స్థాపించారు?
జవాబు:
సంగమరాజులు విద్యారణ్య స్వామి ప్రోత్సాహంతో క్రీ.శ. 1336లో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు.
ఆ) సంగమ వంశరాజులు పాలించిన సామ్రాజ్యం ఏది?
జవాబు:
సంగమ వంశీయులు పాలించిన రాజ్యం విజయనగర సామ్రాజ్యం.
ఇ) సాళువ నరసింహరాయలు ఎవరు? ఎప్పుడు అతడు విజయనగర సామ్రాజ్య పాలకుడయ్యాడు?
జవాబు:
సాళువ నరసింహరాయలు సంగమ వంశరాజుల దండనాయకుడు. ఇతడు క్రీ.శ. 1485లో విజయనగర పాలకుడయ్యాడు.
ఈ) పిల్లలమఱి పినవీరయ్యను పోషించిన ప్రభువు ఎవరు?
జవాబు:
పిల్లలమర్రి పినవీరయ్యను సాళువ నరసింహరాయలు పోషించాడు.
4. కింది గద్యాన్ని చదివి, నాలుగు ప్రశ్నలను తయారుచేయండి.
తెలుగు సాహిత్యంలోని పంచకావ్యాల్లో మనుచరిత్రను మొట్టమొదట లెక్కపెడతారు. ఆంధ్రప్రబంధ కవులలో ప్రథమపూజ అల్లసాని పెద్దన గారికే చేస్తారు. ఆదికవులు, కవిబ్రహ్మలు, ప్రబంధ పరమేశ్వరులు, కవి సార్వభౌములు మొదలైన’ ఆజానుబాహులు ఎందరున్నా, మన సాహితీ రంగంలో ఒక జానెడు ఎత్తుగా కనిపించే జాణ ఆంధ్రకవితా పితామహ బిరుదాంకితులు అల్లసాని పెద్దనగారే. దీనికి కారణం కృష్ణరాయలవారు అందరికన్నా పెద్దనగారికి పెద్దపీట వేయడమే కాదు. ఆయన సహజంగా ఉన్నతుడు. దానికి కారణం ఆయనలో పూర్వకవుల శుభలక్షణాలన్నీ కేంద్రీకృతం అయ్యాయి. ప్రశ్నలు:
అ) తెలుగు పంచకావ్యాల్లో మొదట లెక్కపెట్టదగిన కావ్యం ఏది?
ఆ) ఆంధ్ర ప్రబంధ కవులలో ఎవరిని శ్రేష్ఠునిగా గౌరవిస్తారు?
ఇ) ‘ఆంధ్రకవితా పితామహుడు’ అనే బిరుదు పొందిన కవి ఎవరు?
ఈ) పెద్దన కవి సహజంగా ఉన్నతుడు కావడానికి కారణం ఏమిటి?
5. ఈ కింది కరపత్రం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఆచార్య దేవోభవ సంఘంలో మానవుల అభివృద్ధికి తల్లిదండ్రుల తర్వాత గురువులే ప్రధానపాత్ర వహిస్తారు. అందుకే మన ఉపనిషత్తులు ‘ఆచార్యదేవోభవ’ అని గురువును దైవంగా సేవించమని చెప్పాయి. గురువులు తమకు అప్పగించిన విద్యార్థులకు ఎంతో కష్టపడి విద్యను బోధిస్తారు. వారిని విద్యావంతులుగా తీర్చి దిద్దుతారు. అందువల్ల విద్యార్థులూ, వారి తల్లిదండ్రులూ గురువులను గౌరవించాలి. అందుకే సర్. యస్. రాధాకృష్ణన్ గారు తన పుట్టిన రోజును అధ్యాపక దినోత్సవంగా జరుపుకోమని చెప్పారు. ఆనాడు ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానిస్తారు. అమరావతి ఇట్లు, |
ప్రశ్నలు – జవాబులు
ఆ) మానవుల అభివృద్ధికి ప్రధానపాత్ర వహించే వారిలో మొదటి వారెవరు?
జవాబు:
మానవుల అభివృద్ధికి ప్రధానపాత్ర వహించే వారిలో మొదటివారు తల్లిదండ్రులు.
ఆ) విద్యార్థులు తన గురువులనెందుకు గౌరవించాలి?
జవాబు:
గురువులు ఎంతో కష్టపడి విద్యావంతులుగా తీర్చిదిద్దుతారు కాబట్టి విద్యార్థులు తమ గురువులను గౌరవించాలి.
ఇ) ఉపాధ్యాయులు ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి?
జవాబు:
ఉపాధ్యాయులు సర్.యస్. రాధాకృష్ణన్ను ఆదర్శంగా తీసుకోవాలి.
ఈ) పై కరపత్రానికి తగిన ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
‘ఆచార్య దేవోభవ’ అని ఎందుకు అన్నారు?
6. ఈ కింది కరపత్రం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
పత్రికా పఠనం విద్యార్థులారా ! భావిభారత నిర్దేశకులారా! పత్రికలు చదవండి. నిరంతరం ప్రపంచంలో జరుగుతున్న మార్పులను తెలుసుకోండి. పత్రిక పేరు ఏదైనా కావచ్చు, ప్రపంచ పరిజ్ఞానం ప్రధానం. టీ.వీ.ల మోజులో చదువుకు దూరం కాకండి. పాఠ్యపుస్తకాలలో పరిజ్ఞానానికి, దినపత్రికలలోని విశ్లేషణాత్మక పరిజ్ఞానం తోడైతే వ్యాఖ్యానించగల నేర్పు కలుగుతుంది. రోజూ క్రమం తప్పక పత్రికలు చదవండి. నిత్య నూతన విజ్ఞాన కాంతులతో విరాజిల్లండి. ఇట్లు, |
ప్రశ్నలు జవాబులు
అ) విద్యార్థికి విశ్లేషణాత్మక పరిజ్ఞానం వేటి ద్వారా కల్గుతుంది?
జవాబు:
దినపత్రికలు.
ఆ) విద్యార్థులు వేటి మోజులో పడకూడదు?
జవాబు:
టీ.వీ.ల మోజులో
ఇ) పత్రిక ఏదైనా ప్రధానమైనది మనకు ఏది?
జవాబు:
ప్రపంచ పరిజ్ఞానం.
ఈ) ఈ కరపత్రం విద్యార్థులకు ఏం చెప్పదల్చుకున్నది, ఒక్కమాటలో చెప్పండి.
జవాబు:
రోజూ పత్రికలు చదువమని
వ్యక్తీకరణ సృజనాత్మకత
అ) ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
‘కథానిక’ సాహిత్య ప్రక్రియను తెల్పుము.
జవాబు:
తెలుగు సాహిత్యంలో నేడు “కథ – కథానిక” అనేవి పర్యాయపదాలుగా మారిపోయాయి. కథానిక వచన ప్రక్రియ. వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని లేదా సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. క్లుప్తత దీని ప్రధాన లక్షణం. పాత్రలు, నేపథ్యము, కథనము, జీవిత వాస్తవ చిత్రణ, కంఠస్వరం కథానికలో ముఖ్యమైన అంశాలు.
ప్రశ్న 2.
“బతుకు గంప” పాఠం ఉద్దేశం ఏమిటి ?
జవాబు:
మానవ జీవితంలో కష్టసుఖాలుంటాయి. కష్టాలు వచ్చినపుడు వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి. మనకు ఉన్నంతలో తృప్తిగా జీవించాలి. తోటివారికి చేయూతనందించాలి. మనిషికి మనిషే తోడు. మానవత్వమే జీవిత పరమార్థం అని చెప్పడం ఈ పాఠం ఉద్దేశం.
ప్రశ్న 3.
తన పెళ్ళి గురించి ఎల్లమ్మ రచయిత్రితో ఏమని చెప్పింది?
జవాబు:
తన పెళ్ళి గురించి ఎల్లమ్మ రచయిత్రితో- అవునమ్మా ! మా అయ్యకేమో మేము పద్నాలుగుమందిమి. నా పై ఉన్న అక్కలకు అన్నలకు పెళ్ళిళ్లయినాయి. నలుగురు పోయారు. మిగిలిన నలుగురిలో నేను రెండవదాన్ని. నాకన్నా పెద్దడానికి అప్పటికే పెళ్ళి కుదిరిందట. మా అక్కను చూడ్డానికి వచ్చిన వాళ్ళలో మా ఆయన ఉన్నాడట. ఆయనకు నేను నచ్చానట. పెళ్ళిలో పెళ్ళి చేసేద్దాం అనుకున్నారుట. జానెడు తాడు, యాభై రూపాయల చీరతో నా పెళ్ళి అయిపోయింది.
ప్రశ్న 4.
ఎల్లమ్మ రచయిత్రి ఇంట్లో ఎందుకు పని చేసింది?
(లేదా)
” ఎల్లమ్మ వెళ్ళిపోయినా ఆలోచనలు ఎల్లమ్మ చుట్టే తిరుగుతున్నాయి” అని రచయిత్రి ఎందుకన్నది?
జవాబు:
“ఎల్లమ్మ వెళ్ళిపోయినా ఆలోచనలు ఎల్లమ్మ చుట్టే తిరుగుతున్నాయి అని రచయిత్రి అన్నది. ఇన్నేళ్ళ తన పరిచయంలో ఏనాడూ తను బాధపడుతున్నట్లుగాని, తనేదో కోల్పోయినట్లుగాని కనబడలేదు. ఎప్పుడూ ఎండలో గంప మోసి మోసి అలసిపోయినట్లు కనిపించేది. ఒకరోజు జ్వరంతో పడుకోనున్న రచయిత్రిని చూసి “ఏమైందమ్మా” అని ఆప్యాయంగా పలకరించింది. ఆ తర్వాత ఎల్లమ్మ ఇంట్లో కెళ్ళి కసువుకొట్టి, బండలు తుడిచి, అంట్లుతోమి, పిల్లలు వారం రోజులుగా విడిచిన బట్లన్నీ శుభ్రంగా ఉతికి ఆరేసింది.
ప్రశ్న 5.
రచయిత్రి డబ్బులిస్తానంటే ఎల్లమ్మ ఎందుకు తీసుకోలేదు?
(లేదా)
ఎల్లమ్మ రచయిత్రితో డబ్బులు వద్దని ఎందుకన్నది?
(లేదా)
ఎల్లమ్మ మాటలకి రచయిత్రి ఎందుకు బిత్తరపోయింది?
జవాబు:
కళ్ళనిండా నీళ్ళు పెట్టుకున్న ఎల్లమ్మతో రచయిత్రి ఏమివ్వమంటావే అని పల్కింది. డబ్బుదేముంది ? ఒక గంటసేపు గంప నెత్తిన పెట్టుకొని రెండు వీధులు తిరిగితే నా కూలి వచ్చేస్తాది. రోజుకో ఇరవై రూపాయలు మిగిలితే ఆ రోజు పండగే. అంత పప్పు అన్నం తింటాం. కానీ నీలాగ వచ్చినప్పుడల్లా ‘ఎల్లమ్మా’ అని ఇంత ఆప్యాయంగా ఎవరు పిలుస్తారు. అట్లా పిలిస్తే నాకెంతో ఆనందంగా ఉంటుందమ్మా ఎన్ని రోజులు నువ్వు తినే కూడు పెట్టుంటావు. ఒకపూట నేనింట్లో పనిజేస్తే దానికి నువ్వు డబ్బులివ్వాలా ? ఏదో అవసరం గనుక చేసిని అని పల్కి డబ్బులు తీసుకోలేదు. ఎల్లమ్మ అన్న ఈ మాటలకు రచయిత్రి బిత్తరపోయింది.
ప్రశ్న 6.
ఎల్లమ్మ పాత్ర స్వభావాన్ని తెల్పండి.
జవాబు:
ఎల్లమ్మ అభిమానవంతురాలు. కష్టజీవి. ఎవర్నీ చేయి చాచి అకారణంగా డబ్బులు అడగదు. ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకోదు. త్యాగశీలి. పరోపకార పరాయణురాలు. ఏనాడూ సుఖమన్న మాట, ఆనందమన్నమాట తన దరి దాపులకు రానివ్వని ఎల్లమ్మ ఎప్పుడూ బాధపడినట్లుగాని, వాటి గురించి ఆలోచించినట్లుగాని కనిపించదు.
ఆ) ఈ క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాల్లో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
ఎల్లమ్మ భర్తకు యాక్సిడెంట్ ఎలా జరిగింది? వివరింపుము. (లేదా) రచయిత్రితో ఎల్లమ్మ తన భర్త గురించి ఏమని చెప్పింది?
జవాబు:
ఒక గ్లాసు మంచినీళ్ళు ఎల్లమ్మకిచ్చి తాగమని చెప్పి నెమ్మదిగా ‘ఏం జరిగిందో చెప్పవే’ అని రచయిత్రి అన్నది. ఎల్లమ్మ ఏడుస్తూనే ఉంది. వంటింట్లో కెళ్ళి కాఫీ కలిపి తెచ్చి ఇచ్చింది. ఇప్పుడు చెప్పనే అని రచయిత్రి అడిగింది.
ఏమీ లేదమ్మా! మా ఆయనకు యాక్సిడెంట్ అయ్యింది. లారీ డ్రైవర్గా పనిచేస్తా ఉన్నాడు. నాలుగురోజులకు ముందు హైదరాబాద్ దగ్గర వస్తోన్న టిప్పర్ గుద్దింది. మా ఆయనకు కాలిరిగిపోయింది. క్లీనర్ అక్కడికక్కడే సచ్చిపోయినాడు. ఆయన తెలివి తప్పి పడుంటే ఎవ్వరో ఆసుపత్రిలో చేర్పించారుట. కాళ్ళకు, చేతులకు, తలకు పెద్ద దెబ్బలే తగిల్నాయి. ఆసుపత్రిలో కట్లు కట్టి, కుట్టేసి పడుకోబెట్టారు. ప్రాణానికి ఆభయంలేదు. మాటల మధ్యలో ఏడుస్తూనే చెప్పింది. అయితే నువ్విట్లా వచ్చావేమే అని రచయిత్రి అడిగింది. వెంటనే ఎల్లమ్మ రాక చేసేదేముందమ్మా! లెక్క కావద్దు. శానా అయితుందట. పిల్లల పేర్ల మీద నెలనెలా తిని తినకా వందొంద రూపాయలు చాన్నాల్లుగా కడతా ఉంటి. అదో పదివేలున్నాయి. అవి తీసుకు వెళ్ళాలని ఊర్లోకొస్తి నేనెక్కడ సచ్చానో అనుకుంటారని ఇట్టా తెలిసినోళ్ళ ఇల్లు చూసిపోదామని వస్తినమ్మా అని ఎల్లమ్మ చెప్పింది.
ప్రశ్న 2.
తన కుటుంబ పరిస్థితులను గురించి ఎల్లమ్మ రచయిత్రితో ఏం చెప్పింది?
జవాబు:
తన కుటుంబ పరిస్థితుల గురించి ఎల్లమ్మ ఏడుస్తూ రచయిత్రితో ఈ విధంగా చెప్పింది. నా మొగుడికి ఏం బుద్ధి పుట్టేనో ఇంటికి రావడమే మానేశాడు. ఏం తినాలో తెలీకపోయె. మా అమ్మ కాడికి పోదామనుకుంటే వాళ్ళకి జరిగేదే కష్టంగా ఉంది. మా అత్తను కూడా నేనే సాకాలి. ఏ పని చెయ్యాలో తెలవకపోయె. కూలికి పోదామంటే కడుపులో బిడ్డ ఉంది. వంగిలేవడం కష్టంగా ఉంది. అపుడు మా గేర్లో చానామంది పండ్లమ్ముకునే బతుకుతున్నారు.
వాళ్ళలో పడి ఇట్లా చిన్నగా పండ్లమ్ముతున్నాను. అట్లే పెద్దోడు పుట్టాడు. మళ్ళీ పక్కూర్లో ఉన్నాడంటే బతిమిలాడి పిలుచుకువచ్చా. కొద్దికాలం ఉన్నాడు. మళ్ళీ ఏమొచ్చెనో ఏమో మళ్ళీ వెళ్లిపోయాడు. ఇల్లేనమ్మా సంకలో బిడ్డ, కడుపులో బిడ్డ. నెత్తిన గంప పెట్టుకొని వీధిధి తిరిగి పిల్లల్ని సాకుతున్నాను. ఇదే విధంగా యీ బతుకు ఈడుస్తున్నాను. పిల్లకాయలకి పనిచేసే వయసు వచ్చింది. ఏదో పనికి పోయి బతుకుతార్లే అనుకున్నాను. ఇదిగో ఇట్లా ఆపద వచ్చిపడింది. ఏం చెయ్యాలో అర్ధం కాలేదమ్మా అని ఎల్లమ్మ చెప్పింది.
ప్రశ్న 3.
సాయిలు ఎవరు? అతని గురించి తెల్పుము.
జవాబు:
సాయిలు ఎల్లమ్మ పెంచి పెద్ద చేసిన బిడ్డ. ఏటి వరదలో ఎవరో బిడ్డ కొట్టుకు వచ్చాడు. చేపల వేటకు వెళ్ళిన వారు ఈ బిడ్డను కాపాడి గట్టు మీద కూర్చోబెట్టారు. ఆ సమయంలో ఎల్లమ్మ గర్భవతి. చూస్తా చూస్తా బిడ్డను ఎట్లా దిక్కులేని బిడ్డలా వదిలేసేదని ఇంటికి తీసుకువచ్చింది ఎల్లమ్మ. తన బిడ్డలతో సమానంగా ఎల్లమ్మ పెంచింది. ఎల్లమ్మ అతనికి సాయిలు అను పేరు పెట్టింది. తన బిడ్డలతో పాటు సాయిలును కూడా పదివరకు చదివించింది. పెద్దవాడైన సాయిలు వూరిలో బస్సు కండక్టరు ఉద్యోగం చేస్తున్నాడు. అతను తగాదాలకు వెళ్ళదు. ఎవ్వరిళ్ళకు పోడు, అతని పనేదో అతను చూసుకునే వాడు. అటువంటి బిడ్డను ఎల్లమ్మ అనరాని మాటలని కర్రతో కొట్టింది. అయినా ఎల్లమ్మను ఏమనకుండా బయటికి వెళ్ళిపోయాడు.
ప్రశ్న 4.
తన చుట్టూ ఉన్న పరిసరాలను గూర్చి రచయిత్రి ఏమనుకున్నది?
జవాబు:
ఎల్లమ్మ వెళ్ళిపోయినా ఎల్లమ్మని గురించిన ఆలోచనలు రచయిత్రిని గందరగోళపరుస్తూనే ఉన్నాయి. రచయిత్రి చుట్టూ ఎందరో ఉన్నారు. లెక్చరర్ నీరజ, బ్యాంక్ క్లర్కు వసుంధర, టీచర్ సునీత, పార్వతి, పద్మ, హరిత ఇంకా ఎందరో ఉన్నారు. ఆర్థికంగా వాళ్ళకి ఏ ఇబ్బందులూ లేవు. ఖరీదైన చీరలే కడతారు. ఖరీదైన మనుషుల్లానే కనపడతారు. విందులు, వినోదాలు అంటూ ఎక్కడెక్కడికో వెళ్ళి వస్తుంటారు. ఎప్పుడు కలిసినా ఏదో వెలితిగానే మాట్లాడతారు. ఏవేవో వాళ్ళు ఊహించుకున్నవి. వాళ్ళ సొంతం కాలేదని వాళ్ళ జీవితమంతా అశాంతే అలముకుందని బాధపడిపోతారు. ఏనాడూ సుఖమన్న మాట, ఆనందమన్న మాట తన దరిదాపులకు రానివ్వని ఎల్లమ్మ ఎప్పుడూ బాధపడినట్లు గాని, వాటి గురించి ఆలోచించినట్లుగాని కనిపించలేదు. ఆ క్షణం ఎల్లమ్మ వాళ్ళందరి కంటే ఎంతో ఎత్తులో ఉన్నట్లు కనిపించింది.
ఇ) కింది అంశం గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.
ప్రశ్న 1.
మంచితనాన్ని మెచ్చుకోమని ప్రబోధిస్తూ ఒక కరపత్రం తయారు చేయండి.
జవాబు:
మెచ్చుకో! మీరు గమనించారా? ఇట్లు, |
భాషాంశాలు (పదజాలం వ్యాకరణాంశాలు)
కింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి.
అర్ధాలు
అ) గీత గీసిన పదానికి అర్థం రాయండి.
1. ఆలోచనలు మనసులో మెదిలాయి.
జవాబు:
గుర్తుకువచ్చాయి
2. నా మెళ్ళో పసుపుతాడేశారు.
జవాబు:
పెళ్ళిచేయుట
3. నా పానం బాగుండలేదు.
జవాబు:
ప్రాణము
4. నాకు మువ్వురు పిలకాయలు కలిగారు.
జవాబు:
పిల్లలు
ఆ) గీత గీసిన పదానికి సరియైన అర్థాన్ని గుర్తించండి.
5. రచయితకు కపోతములను పెంచడమంటే ఇష్టం.
అ) పావురాలు
ఆ) సింహాలు
ఇ) పక్షులు
ఈ) పందులు
జవాబు:
అ) పావురాలు
6. ఎల్లమ్మ ఈదీది తిరిగి పండ్లు అమ్మేది.
అ) ఈరిగాడు
ఆ) వీధీధి
ఇ) పట్టణము
ఈ గ్రామము
జవాబు:
ఆ) వీధీధి
7. ఎల్లమ్మ మాటలకు రచయిత్రి బిత్తరపోయింది.
అ) ఆనందపడుట
ఆ) ఏడ్పుట
ఇ) ఆశ్చర్యపడుట
ఈ) దుఃఖించుట
జవాబు:
ఇ) ఆశ్చర్యపడుట
8. మాగేర్లో పండ్ల వ్యాపారం చేసేవాళ్ళు ఎక్కువ.
అ) మా ఇంట్లో
ఆ) మా గ్రామంలో
ఇ) మా బజార్లో
ఈ) మా వాళ్ళల్లో
జవాబు:
ఈ) మా వాళ్ళల్లో
9. అమ్మా! నేను జీవించాలంటే లెక్క కావాలిగదా!
అ) పైసలు
ఆ) కుండపెంకులు
ఇ) ధాన్యము
ఈ) కాయలు
జవాబు:
అ) పైసలు
10. నాలుగువైపులు మంచు అలముకున్నది.
అ) పరుగెత్తుట
ఆ) క్రమ్ముకొనుట
ఇ) సంతోషపడుట
ఈ) ఏదీకాదు
జవాబు:
ఆ) క్రమ్ముకొనుట
11. మొన్న నా మొగుడు వచ్చాడు. నేడు మళ్ళీపాయె.
అ) చూశాడు
ఆ) సంతోషించాడు
ఇ) మళ్ళీ వెళ్ళిపోయాడు
ఈ) వస్తాడు
జవాబు:
ఇ) మళ్ళీ వెళ్ళిపోయాడు.
పర్యాయపదాలు
అ) గీత గీసిన పదానికి పర్యాయపదాలు రాయండి.
12. ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేవాలి.
జవాబు:
సూర్యోదయము, ఉదితి, పొడుపు
13. మంచి ఆలోచన చేసిన తర్వాత పనులు చేయాలి.
జవాబు:
అన్వవేక్ష, చింతన, తలంపు
14. ఎల్లమ్మ రచయిత్రితో పరిచయం చేసుకుంది.
జవాబు:
ఎఱుక, పరిచితి, మాలిమి
15. ఎల్లమ్మ మనసు కల్మషం లేనిది.
జవాబు:
ఉద్దేశము, లక్ష్యము, గుణి
16. రాము రాగానే రాధ తలుపు వేసింది.
జవాబు:
అరళము, అలారము, కవాటము
ఆ) గీత గీసిన పదానికి సరియైన పర్యాయపదాలు గుర్తించండి.
17. ప్రతి నిమిషము విలువైనది.
అ) నిముసము, నిమేషము
ఆ) నిరాశ, నిస్పృహ
ఇ) నిశ్చింత, నిర్మానుష్యము
ఈ) నైరాశ్యం, నైతికం
జవాబు:
అ) నిముసము, నిమేషము
18. ఎల్లమ్మ ఊపిరి పీల్చుకుంది.
అ) ఊసులు, ఊయల
ఆ) గాలి, ప్రాణము
ఇ) అలిపిరి, ఊపిరి
ఈ) వాయువు, పాయువు
జవాబు:
ఆ) గాలి, ప్రాణము
19. నేనే మా అత్తగార్ని సాకుచుంది.
అ) పిండిచేయు, ప్రేమించు
ఆ) తాపము, పాపము
ఇ) పోషించు, పెంచు
ఈ) శాపము, శాసనము
జవాబు:
ఇ) పోషించు, పెంచు
20. మేము విందు భోజనానికి వెళ్ళాము.
అ) పొందు, మందు
ఆ) కూడు, గూడు
ఇ) విందు, సందు
ఈ) భోజనము, సత్కారము
జవాబు:
ఈ) భోజనము, సత్కారము
21. మేము వినోదము కొఱకు సినిమాకు వెళ్ళాము.
అ) కైళము, వింత
ఆ) వినూత్నం, ప్రయత్నం
ఇ) సంత, పుంత
ఈ) శైలికి, కూళ
జవాబు:
అ) కైళము, వింత
ప్రకృతి – వికృతులు
అ) గీత గీసిన పదానికి సరియైన ప్రకృతి పదం రాయండి.
22. నదీ తానము చాలా గొప్పది.
జవాబు:
స్నానము
23. రాముకు వాళ్ళమ్మ గుఱుతుకు వచ్చింది.
జవాబు:
గుర్తు
24. ప్రతి నిముసమును వృథా చేయరాదు.
జవాబు:
నిమిషము
25. రూకను వృథా చేయరాదు.
జవాబు:
రూపాయి
26. అమ్మ మనకు ప్రత్యక్ష దైవము.
జవాబు:
అంబ
ఆ) గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
27. ఎల్లమ్మ కష్టం చేసి జీవించింది.
అ) కస్తి
ఆ) ఆస్తి
ఇ) పుస్తె
ఈ) వస్తి
జవాబు:
ఆ) కస్తీ
28. ప్రతి పనికి కారణం ఉంటుంది.
అ) భరణం
ఆ) కతనము
ఇ) పనితనము
ఈ) రతనము
జవాబు:
ఆ) కతనము
29. ప్రతి వ్యక్తికి చదువు అవసరము.
అ) నుదురు
ఆ) వధువు
ఇ) సదువు
ఈ) మధువు
జవాబు:
ఇ) సదువు
30. ప్రాణము కన్న మానము మిన్న.
అ) గానము
ఆ) వాన
ఇ) తానము
ఈ) పానము
జవాబు:
ఈ) పానము
31. మూర్ఖుడు చాలా మొండివాడు.
అ) మొఱకు
ఆ) కఱకు
ఇ) చెఱకు
ఈ) మూధుడు
జవాబు:
అ) మొఱకు
నానార్థాలు
అ) గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి.
32. మా వీథిలో దేవాలయాలు ఎక్కువ.
జవాబు:
తెరువు, చోటు
33. ఎల్లమ్మ రచయిత్రితో పరిచయం ఏర్పడింది.
జవాబు:
ఎఱుక, స్నేహము
34. ఎల్లమ్మ మనసు కల్మషం లేనిది.
జవాబు:
కోరిక, ప్రేమ, ఉద్దేశము
35. ఎలమ్మకు ఊపిరి లేచి వచ్చింది.
జవాబు:
గాలి, ప్రాణము
ఆ) గీత గీసిన పదానికి సరైన నానార్థాలు గుర్తించండి.
36. ఎల్లమ్మకు అక్కతో పాటు పెళ్ళి జరిగింది.
అ) స్త్రీ, అప్పు
ఆ) అత్త, అయ్య
ఇ) అలరు, వగరు
ఈ) వలపు, తలపు
జవాబు:
అ) స్త్రీ, అప్పు
37. సాయిలను ఎల్లమ్మ సాకింది.
అ) పూత, కూత
ఆ) పోషించు, కారణము
ఇ) పీత, కూత
ఈ) దూషించు, శోషించు
జవాబు:
ఆ) పోషించు, కారణము
38. లత విందు భోజనానికి వెళ్ళింది.
అ) పొందు, ముందు
ఆ) సందు, రోడ్డు
ఇ) సంతోషము, సంతర్పణ
ఈ) నెపము, తపము
జవాబు:
ఇ) సంతోషము, సంతర్పణ
వ్యుత్పత్త్యర్థాలు
అ) గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్థం రాయండి.
39. ధరాధరము లలో శీతాద్రి గొప్పది.
జవాబు:
ధరను ధరించునది – పర్వతం
40. పారాశర్యుడు వేద విభజన చేసెను.
జవాబు:
పరాశర మహర్షి కుమారుడు వ్యాసుడు
41. కేసరి అడవికి రాజు.
జవాబు:
సింహం
42. వచ్చిన వారికి పాద్యము నీయాలి.
జవాబు:
పాదాలు కడుగుకొందుకు ఉపయోగించే నీరు ఉదకం
ఆ) గీత గీసిన పదానికి సరైన వ్యుత్పత్వరాన్ని గుర్తించండి.
43. అర్థ్యము సూర్యునకు సమర్పించాలి.
అ) పూజకు తగిన నీరు – తీర్ధము
ఆ) స్నానం చేసే నీరు జలము
ఇ) త్రాగే నీరు – మంచినీళ్ళు
ఈ) శుభ్రంచేసే నీరు ఉదకము
జవాబు:
అ) పూజకు తగిన నీరు – తీర్ధము
44. వనజముల వంటి అక్షులు కలది.
అ) అడవికి రాజు సింహం
ఆ) నీటిలో పుట్టినది పద్మం
ఇ) నీటిలో పెరిగినది – పువ్వు
ఈ) నీటిలో కలిసేది – అందము
జవాబు:
ఆ) నీటిలో పుట్టినది పద్మం
45. గురుడు శిష్యుల మేలు కోరతాడు.
అ) పాఠం చెప్పేవాడు – ఉపాధ్యాయుడు
ఆ) మంచి చెప్పేవాడు – ఒజ్జ
ఇ) గౌరవం పొందేవాడు – మాష్టారు.
ఈ) అజ్ఞానాంధకారం నశింపచేసేవాడు – ఉపాధ్యాయుడు
జవాబు:
ఈ) అజ్ఞానాంధకారం నశింపచేసేవాడు – ఉపాధ్యాయుడు
46. దాశరథి రావణుని సంహరించెను.
అ) దశరథుని కుమారుడు – రాముడు
ఆ) అయోధ్యకు రాజు – రాఘవుడు
ఇ) సీతకు భర్త – సీతాపతి
ఈ) కౌశల్య కుమారుడు – లక్ష్మణాగ్రజుడు
జవాబు:
అ) దశరథుని కుమారుడు – రాముడు
జాతీయాన్ని గుర్తించడం
వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి విడిగా రాయండి.
47. మన ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి కంకణం కట్టుకుంది.
జవాబు:
కంకణం కట్టుకొను.
48. దొంగలు బంగారపు కొట్లో వ్యాపారుని కంట్లో కారం కొట్టి నగలనపహరించారు.
జవాబు:
కంట్లో కారం కొట్టి
49. వాళ్ళకేంటి? వాళ్ళు ఆస్తిపరులు, కడుపులో చల్ల కదలకుండా హాయిగా ఉన్నారు.
జవాబు:
కడుపులో చల్ల కదలకుండా
50. దుర్మార్గులతో సహవాసం కత్తిమీద సాము వంటిది.
జవాబు:
కత్తిమీద సాము
జాతీయము – సందర్భము
ఈ జాతీయాన్ని ఏ అర్థంలో / సందర్భంలో ఉపయోగిస్తారో రాయండి.
51. కడుపుకొట్టు
జవాబు:
ఒకరు మరొకర్ని బాధపెట్టి సొమ్మును అన్యాయంగా తీసుకున్న సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.
52. కడుపున కాయకాచు
జవాబు:
సంతానం పొందినవారి విషయంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.
53. హనుమంతుని ముందు కుప్పిగంతులు వేయు.
జవాబు:
పెద్దల ముందు అతిగా ప్రవర్తించే వారి విషయంలో ఈ సందర్భాన్ని ఉపయోగిస్తారు.
సంధి పదాలను విడదీయడం
గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి.
54. ఎందుకు ఎల్లమ్మా ఏడుస్తావు?
జవాబు:
ఎల్ల + అమ్మా
55. వాడికేం బుద్ధి పుట్టిందో
జవాబు:
వాడికి + ఏం
56. ఎంతైనా పుస్తె కట్టినోడు.
జవాబు:
ఎంత + ఐనా
57. ఆయనకీ ఇంకొక బిడ్డ.
జవాబు:
ఇంక + ఒక
58. అంత ముద్దేస్తే సరి.
జవాబు:
ముద్ద + ఏస్తే
59. మూడేళ్ళక్రితం అనుకుంటా
జవాబు:
మూడు + ఏళ్ళ
60. ఎంతో మంది పండ్లమ్ముకునే బతుకుతున్నారు.
జవాబు:
పండ్లు + అమ్ముకునే
61. ఆనందమన్నమాట తన దరిదాపులకు రానీయదు.
జవాబు:
ఆనందము + అన్నమాట
62. ఎల్లమ్మ వాళ్ళందరికంటే ఎంతో ఎత్తులో ఉంది.
జవాబు:
వాళ్ళు + అందరికంటే
63. నాకు ఆరేళ్ళుంటాయనుకుంటానమ్మా.
జవాబు:
ఆరు + ఏళ్ళు
సంధి పదాలను కలవడం
సంధి పదాలను కలిపి రాయండి.
64. అది + ఏంటే
జవాబు:
అదేంటే
65. నాకు + ఏమీ
జవాబు:
నాకేమీ
66. లేదు + అమ్మా
జవాబు:
లేదమ్మా
67. పోయాడు + అంట
జవాబు:
పోయాడంట
68. నువ్వు + ఇట్లా
నువ్విట్లా
69. నేను + ఎక్కడ
జవాబు:
నేనెక్కడ
70. ఆరు + ఏళ్ళు
జవాబు:
ఆరేళ్ళు
71. ఎల్ల + అమ్మ
జవాబు:
ఎల్లమ్మ
72. నాలుగు + ఏళ్ళు.
జవాబు:
నాలుగేళ్ళు
73. ఆ + అమ్మ
జవాబు:
ఆయమ్మ
సంధి నామాలు
గీత గీసిన పదం ఏ సంధికి చెందినదో గుర్తించండి.
74. నాకేమి అర్థం కాలేదు.
అ) ఉత్వసంధి
ఆ) ఇత్వ సంధి
ఇ) యడాగమ సంధి
ఈ) రుగాగమ సంధి
జవాబు:
అ) ఉత్వసంధి
75. నేనెక్కడ సచ్చానో అనుకుంటారని ఇట్లా వచ్చా.
అ) సవర్ణదీర్ఘ సంధి
ఆ) ఉత్వసంధి
ఇ) అత్వసంధి
ఈ) ఇత్వసంధి
జవాబు:
ఆ) ఉత్వసంధి
76. అదేమో కేసవుతుందంటున్నారు.
అ) అత్వసంధి
ఆ) ఉత్వసంధి
ఇ) ఇత్వసంధి
ఈ) పడ్వాది సంధి
జవాబు:
ఇ) ఇత్వసంధి
77. యాక్సిడెంట్ ఎప్పుడయింది?
అ) ఇత్వసంధి
ఆ) అత్వసంధి
ఇ) సవర్ణదీర్ఘ సంధి
ఈ) ఉత్ససంధి
జవాబు:
ఈ) ఉత్వసంధి
78. మాయిదిలో పిల్లల్లో ఆడుకుంటాంటి.
అ) యడాగమ సంధి
ఆ) ఉత్వసంధి
ఇ) ఇత్వసంధి
ఈ) అత్వసంధి
జవాబు:
అ) యడాగమ సంధి
విగ్రహవాక్యాలు
గీత గీసిన పదానికి విగ్రహవాక్యం రాయండి.
79. ఈతపుల్లల గంపలో పండ్లు ఉన్నాయి.
జవాబు:
ఈత అను పేరు గల పుల్లలు.
80. యాభై రూపాయల చీరతో నా పెళ్ళి అయిపోయింది.
జవాబు:
యాభై సంఖ్య గల రూపాయలు
81. మూడు నిమిషాలు తెల్లముఖం వేశాను.
జవాబు:
తెల్లనైన ముఖం
82. జానెడు పొట్ట కోసం కష్టపడ్డాను.
జవాబు:
జానెడైన పొట్ట
83. గంప నెత్తిన పెట్టుకుని రెండు వీథులు తిరిగాను.
జవాబు:
రెండు సంఖ్య గల వీథులు
సమాన నామాలు
గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.
84. మూడు నిమిషాలు తెల్లముఖం వేశాను.
అ) ద్విగువు
ఇ) బహువ్రీహి
ఆ) ద్వంద్వము
ఈ) విశేషణ పూర్వపద కర్మధారయము
జవాబు:
అ) ద్విగువు
85. నాలుగు రోజులకు ముందు ఏదో లోడుతో పోయాడంట.
అ)ద్వంద్వం
ఆ) ద్విగువు
ఇ) బహువ్రీహి
ఈ) విశేషణ పూర్వపద కర్మధారయము
జవాబు:
ఆ) ద్విగువు
86. జానెడు పొట్ట కోసం కష్టపడ్డాను.
అ) ద్విగువు
ఆ) షష్ఠీ తత్పురుషము
ఇ) విశేషణ పూర్వపద కర్మధారయము
ఈ) విశేషణ ఉత్తరపద కర్మధారయము
జవాబు:
ఇ) విశేషణ పూర్వపద కర్మధారయము
87. కాళ్ళు పేతులు కూడగట్టుకుని పనిచేస్తానమ్మ.
అ) ద్విగువు
ఆ) సప్తమీ తత్పురుషము
ఇ) ద్వంద్వము
ఈ) బహువ్రీహి
జవాబు:
ఈ) బహువ్రీహి
88. నేడు సమాజంలో అశాంతిగా ఉంటోంది.
అ) నఞ్ తత్పురుషము
ఆ) బహువ్రీహి
ఇ) ద్వంద్వము
ఈ) సప్తమీ తత్పురుషము అ-సత్ తత్పురుషము
జవాబు:
అ) నఞ్ తత్పురుషము
89. ఏటి ప్రక్కన మావూరు ఉంది కదా!
అ) ద్విగువు
ఆ) షష్ఠీ తత్పురుషము
ఇ) ద్వంద్వమ
ఈ) బహువ్రీహి
జవాబు:
ఆ) షష్ఠీ తత్పురుషము
ఆధునిక వచనాలు
ఈ వాక్యానికి సరియైన ఆధునిక వచనాన్ని గుర్తించండి.
90. దుర్మతికి నిహముంబరముఁ గలదే
అ) దుర్మతికి ఇహంపరం కలదే.
ఆ) దుర్మతికి నిహముంబరము కలదు.
ఇ) దుర్మతికి నిహము లేదు పరము కలదు.
ఈ) దుర్మతికి నిహము ఉంది పరము లేదు.
జవాబు:
అ) దుర్మతికి ఇహంపరం కలదే.
91. అక్కడనున్న నౌకరులందరునూ నవ్వారు.
ఆ) అక్కడనున్న నౌకరులందరునూ నవ్వలేదు.
ఆ) అక్కడున్న నౌకర్లంతా నవ్వారు.
ఇ) అక్కడనున్న నౌకరులంతా దుఃఖించారు.
ఈ) అక్కడున్న నౌకరులందరునూ నవ్వలేదు.
జవాబు:
ఆ) అక్కడున్న నౌకర్లంతా నవ్వారు.
92. అందమైన మేఘముల సందునఁ గనెను.
ఆ) అందమైన మేఘముల సందులో కన్నాడు.
ఆ) అందమైన మేఘాల సందులో చూడలేదు.
ఇ) అందమైన మేఘాల సందులో చూశాడు.
ఈ) అందమైన మేఘముల సందున కన్నాడు.
జవాబు:
ఇ) అందమైన మేఘాల సందులో చూశాడు.
93. అసత్య భాషణంబును చితంబె?
అ) అసత్య భాషణం ఉచితమే అవుతుంది.
ఆ) అసత్య భాషంబు ఉచితంబు కాదు.
ఇ) అసత్య భాషంబు ఉచితమా?
ఈ) అసత్య భాషణం ఉచితమా?
జవాబు:
ఈ) అసత్య భాషణం ఉచితమా?
94. దిక్కులను, చుక్కలను చూచెను.
అ) దిక్కుల్నీ, చుక్కల్నీ చూసెను.
ఆ) దిక్కుల్నీ మరియు చుక్కల్నీ చూడలేదు.
ఇ) దిక్కులను, చుక్కలను చూడలేదు.
ఈ) దిక్కులను చుక్కల్నీ చూశాడు.
జవాబు:
అ) దిక్కుల్నీ, చుక్కల్నీ చూసెను.
వ్యతిరేకార్థక వాక్యాలు
ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం రాయండి.
95.ఇల్లాలు తన పేరు మరచిపోయింది.
జవాబు:
ఇల్లాలు తన పేరు మరువలేదు.
96. రాముడు సీతను ఆదరించాడు.
జవాబు:
రాముడు సీతను ఆదరించలేదు.
97. చలికాలం అంటే నాకిష్టం.
జవాబు:
చలికాలం అంటే నాకిష్టంలేదు.
98. రాజు రేపు వస్తాడు.
జవాబు:
రాజు రేపు రాడు.
99. మీరంతా సినిమాకి వెళ్ళండి.
జవాబు:
మీరంతా సినిమాకి వెళ్ళవద్దు.
వ్యతిరేకార్థక క్రియలు
కింది క్రియా పదాలలో వ్యతిరేకార్థక క్రియను గుర్తించండి.
100. అ) చూశాడు
ఆ) చూడలేదు
ఇ) చూసి
ఈ) చూస్తున్నాడు.
జవాబు:
ఆ) చూడలేదు
101. అ) వచ్చాడు.
ఆ) వస్తున్నాడు.
ఇ) రాలేదు
ఈ) వచ్చి
జవాబు:
ఇ) రాలేదు
102. అ) లేదు.
ఆ) ఉంది.
ఇ) ఉంటుంది
ఈ) ఉందనుకుంటా
జవాబు:
అ) లేదు.
103. అ) చేశాడు
ఆ) చేస్తాడు
ఇ) చేసి
ఈ) చేయలేదు
జవాబు:
ఈ) చేయలేదు
104. అ) తినలేదు
ఆ) తింటూ
ఇ) తిని
ఈ) తింటాడు
జవాబు:
అ) తినలేదు
105. అ) రాశాడు
ఆ) రాయలేదు.
ఇ) రాస్తూ
ఈ) రాస్తున్నాడు.
జవాబు:
ఆ) రాయలేదు.
సంక్లిష్ట వాక్యాలు
ఇది ఏ రకమైన సంక్లిష్టవాక్యమో రాయండి.
106. కారు విఎచ్చంది కాని బంధువులు రాలేదు.
జవాబు:
సంయుక్త వాక్యం
107. అంతా తెలివైనవారే.
జవాబు:
హేత్వర్థక వాక్యం
108. వర్షాలు కురిసినా చెఱువులు నిండలేదు.
జవాబు:
అప్యర్థక వాక్యం
109. సీతకు ఆటలు, పాటలు వచ్చాయి.
జవాబు:
సంయుక్త వాక్యం
110. రాధ పాట వింటూ పని చేస్తోంది.
జవాబు:
శత్రర్థక వాక్యం
కర్మణి వాక్యాలు
సరియైన కర్మణి వాక్యాన్ని గుర్తించండి.
111. కవిత రోత పాటలను పాడదు.
అ) రోత పాటలు కవిత చేత పాడబడవు.
ఆ) రోత పాటలు కవిత పాడుతూంటుంది.
ఇ) రోత పాటలు కవిత పాడలేదు.
ఈ) కవిత రోత పాటలను పాడుతుంది.
జవాబు:
అ) రోత పాటలు కవిత చేత పాడబడవు.
112. భర్త భార్యను గౌరవించాలి.
అ) భర్త భార్యను గౌరవించకూడదు.
ఆ) భార్య భర్త చేత గౌరవించబడాలి.
ఇ) భార్యభర్తలిరువురూ గౌరవించబడాలి.
ఈ) భర్త భార్య చేత గౌరవించబడాలి.
జవాబు:
ఆ) భార్య భర్త చేత గౌరవించబడాలి.
113. రమేష్ భారతాన్ని చదివాడు.
అ) భారతం చేత రమేష్ చదివాడు.
ఆ) భారతం చేత చదివించబడింది రమేష్.
ఇ) భారతం రమేష్ చేత చదవబడింది.
ఈ) రమేష్ భారతం చదవబడలేదు.
జవాబు:
ఇ) భారతం రమేష్ చేత చదవబడింది.
వాళ్ళ రకాలు
ఇవి ఏ రకమైన సామాన్య వాక్యాలో రాయండి.
114. నీవెందుకు వచ్చావు?
జవాబు:
ప్రశ్నార్థక వాక్యం
115. నీవు పాడవద్దు.
జవాబు:
నిషేధార్థక వాక్యం
116. నేను తప్పక చదువుతాను.
జవాబు:
నిశ్చయార్థక వాక్యం
117. స్వామీ! నన్ను రక్షించు.
జవాబు:
ప్రార్థనార్థక వాక్యం
118. రాము చదవగలడు.
జవాబు:
సామర్థ్యార్థక వాక్యం
119. మీరు రావద్దు.
జవాబు:
నిషేధార్థక వాక్యం
120. నీవు ఈ రాయిని ఎత్తగలవు.
జవాబు:
సామర్థ్యార్థక వాక్యం
121. భగవంతుడా! నన్ను కాపాడు.
జవాబు:
ప్రార్థనార్థక వాక్యం
122. ఆహా ! ఈ పద్మాల చెరువు ఎంత బాగుంది.
జవాబు:
ఆశ్చర్యార్థక వాక్యం
123. మీరు వెళ్ళవచ్చు.
జవాబు:
అనుమత్యర్థక వాక్యం
వాక్య రకాలు
ఇవి ఏ రకమైన సామాన్య వాక్యాలో గుర్తించండి.
124. ఈ రోజు జీతం వస్తోందో? రాదో?
అ) సందేహార్థకం
ఆ) ప్రార్థనార్థకం
ఇ) అనుమత్యర్థకం
ఈ) ప్రశ్నార్థకం
జవాబు:
అ) సందేహార్ధకం
125. ఏరా! నువ్వెందుకు చదవలేదు?
అ) సందేహార్థకం
ఆ) ప్రశ్నార్థకం
ఇ) అనుమత్యర్థకం
ఈ) ప్రార్ధనార్థకం
జవాబు:
ఆ) ప్రశ్నార్ధకం
126. సీత కీర్తనలను బాగా పాడగలదు.
అ) ప్రశ్నార్థకం
ఆ) ప్రార్థనార్థకం
ఇ) సామర్థ్యార్థకం
ఈ) ఆశీరర్థకం
జవాబు:
ఇ) సామర్థ్యార్థకం
127. చిరంజీవులారా! సుఖంగా జీవించండి!
అ) సామర్థ్యార్థకం
ఆ) ప్రార్థనార్థకం
ఇ) ప్రశ్నార్థకం
ఈ) ఆశీరర్థకం
జవాబు:
ఈ) ఆశీరర్ధకం
128. దయచేసి మీరు పాట పాడండి.
అ) ప్రార్ధనార్థకం
ఆ) విద్యర్థకం
ఇ) నిశ్చయార్థకం
ఈ) అనుమత్యర్ధకం
జవాబు:
అ) ప్రార్థనార్థకం
129. వాడు చదవక మార్కులు రాలేదు.
అ) చేదర్థకం
ఆ) హేత్వర్థకం
ఇ) సామర్థ్యార్థకం
ఈ) ఆశీరర్ధకం
జవాబు:
ఆ) హేత్వర్థకం
130. అందరూ వెళ్ళండి.
అ) విధ్యర్థకం
ఆ) అప్యర్థకం
ఇ) అనుమత్యర్థకం
ఈ) ఆశీరర్థకం
జవాబు:
ఇ) అనుమత్యర్థకం
131. కలకాలం వర్ధిల్లు!
అ) విధ్యర్థకం
ఆ) అప్యర్థకం
ఇ) ప్రార్థనార్థకం
ఈ) ఆశీరర్థకం
జవాబు:
ఈ) ఆశీరర్థకం