Access to the AP 10th Class Telugu Guide 1st Lesson ప్రత్యక్ష దైవాలు Questions and Answers are aligned with the curriculum standards.
ప్రత్యక్ష దైవాలు AP 10th Class Telugu 1st Lesson Questions and Answers
చదవండి ఆలోచించి చెప్పండి.
ఆ.వె. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు
పుట్టనేమి ? వాఁడు గిట్టనేమి?
పుట్టలోన చెదలు పుట్టదా! గిట్టదా !
విశ్వదాభిరామ వినురవేమ. —- వేమన శతకం
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న1.
పుత్రులు ఎవరి మీద దయకలిగి ఉండాలి ?
జవాబు:
తల్లిదండ్రుల మీద పుత్రులు దయ కలిగి ఉండాలి.
ప్రశ్న 2.
కవి చెదపురుగులతో ఎవరిని పోల్చాడు ? ఎందుకు ?
జవాబు:
కవి చెదపురుగులతో దయలేని పుత్రుణ్ణి పోల్చాడు. ఎందుకంటే చెదపురుగులు పుడుతుంటాయి. వెంటనే నశించి పోతుంటాయి, అలాగే తల్లిదండ్రులను చూడని పుత్రుడు ఉన్నా ఒకటే పోయినా ఒకటే.
ప్రశ్న 3.
తల్లిదండ్రుల సేవలో తరించిన మహనీయుల పేర్లు చెప్పండి.
జవాబు:
శ్రావణ కుమారుడు, పరశురాముడు, వినాయకుడు, శ్రీరాముడు మొదలైనవారు తల్లిదండ్రుల సేవలో తరించిన మహనీయులు.
అలోచించండి – చెప్పండి
ప్రశ్న1.
కుమారుని ‘అన్న’ అసి సందోధించడంలో ఔచిత్యం ఏమిటి ?
జవాబు:
కుమారుని ‘అన్న’ అని సందోధించడంలో ఔచిత్యం ఉంది. ఎందుకంటే పిన్నవారిపై పెద్దలకు ఆదరాభి మానము, అనురాగము కల్గుటచే చిన్నవారిని (పేమతో అన్నా! నాన్నా! అని పిలుస్తుంటారు. ఇది అనూచానంగా వస్తున్న సంప్రదాయం. పిల్లలపై పెద్దవారికి కల్గిన (పేమకు తార్కాణము.
ప్రశ్న2.
ధర్మవ్యాధుని తల్లిదండ్రులు ఉన్న పరిస్రితిని బట్టి నీమేం గ్రహించావు ?
జవాబు:
ధర్మవ్యాధుని తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు. ధర్మపరుడైన కుమారుడు తన తల్లిదండ్రులను సేవిస్తూ అనుక్షణం రక్షిస్తున్నాడు. ధర్మవ్యాధుని తల్లిదండులు పుణ్యాత్ములు. కనుకనే కారణజన్ముడైన కొడుకు ధర్మ వ్యాధుడు లభించాడు. తల్లిదండ్రులకు తమ కొడుకు పరిరక్షణలో ఉండటం కన్నా వేరే అదృష్టం ఏముంటుంది?
ఆలోచించి చెప్పండి
ప్రశ్న 1.
తల్లిదండ్డులను సేవించడం వల్ల కంగే ఏ్రయోజనం ఏఖిల ?
జవాబు:
తల్లిదండ్డులను సేవించడం వల్ల ఇహ-పర సౌఖ్యాలు కల్గుతాయి. వారి వంశం ఉద్ధరింపటడుతుంది. ధర్మం రక్షింపబడుతుంది.
ప్రశ్న 2.
తల్లిదండ్డులను తప్పక సేపించ శరిస్తాను అని ఎవరు ఎన్నాడు ?
జవాబు:
తల్లిదండ్డులను తప్పక సేవించి తరిస్తాను అని కౌశికుడు అన్నాడు.
ప్రశ్న 3.
ధర్మచ్యాధునికి కాళకునిలో నచ్ని అంశం ఏమిట ?
జవాబు:
కౌశికుడు తన వృద్ధులైనల్లిదండులను వదలివేయుట అనే అంశం ధర్మవ్యాధునికి (ఎవరికి) నచ్చలేదు.
అవగాహన-ప్రతిస్పందన
అ) కింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి.
ప్రశ్న 1.
కౌశికుని తల్లిదండ్రులు చూపును కోల్పోవడానికి గల కారణాలు ఏమిటో చెప్పండి ?
జవాబు:
కౌశికుని తల్లిదండ్రులు వృద్ధులు. తల్లిదండ్రుల అనుమతి తీసుకోకుండా కౌశికుడు వెడలిపోయాడు. కొడుకుపై ఎంతో ప్రేమతో జీవిస్తున్నారు. వీరికి కొడుకే ఆధారం. కౌశికుడు వెళ్ళిన మరుక్షణం అతని కోసం అతని తల్లిదండ్రులు గుండెలు పగిలిపోయేటట్లుగా ఏడ్చి ఏడ్చి అంథులయ్యారు.
ప్రశ్న 2.
ధర్మవ్యాధుని తల్లిదండ్రులు సంతోషంగా ఉండటానికి కారణమేమిటి?
జవాబు:
ధర్మవ్యాధుడు కౌశిక మహర్షిని తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. నాలుగు వైపుల నుండి సుగంధములు వెదజల్లుతున్న ఆ భవనములో ఉన్న ఉన్నత ఆసనాలపై ధర్మవ్యాధుని తల్లిదండ్రులు కూర్చుని ఉన్నారు. వారు తమకు ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తూ, నచ్చిన వస్త్రాలు, ఆభరణాలు మొదలైనవి ధరించి ఆనందంగా ఉన్నారు.
ప్రశ్న 3.
గృహస్థుడు ఎవరెవరిని పూజించాలి ?
జవాబు:
గృహస్థుడు తల్లిని, తండ్రిని, గురువును, అగ్నిని, భగవంతుని పూజించాలి. అతిథి అభ్యాగతులను ఆదరించాలి. భార్యా పిల్లలను ప్రేమతో పోషించాలి. పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించాలి. ఉన్నతంగా తీర్చిదిద్దాలి.
4. * గుర్తు గల పదాలకు ప్రతిపదార్థాలు రాయండి.
ఉదా॥ చ. అనుపమ మెట్టివారలకు వందదు ధర్మపథంబు ధాత్రిలో;
ఎను, పది వేపురందొకఁడు విశ్రుతధర్మపరాయణుండు గ
లబ్ధవో కలుగందొ సందియము; గోరి సనాతనధర్మమూఁది యె
వనికిని నీకుఁ బోలె బుధ వత్సల! యిట్లు చరింపవచ్చువే.
ప్రతిపదార్ధం :
బుధ వత్సల =పండితులచే ఆదరింపబడే ఓ ధర్మమవ్యాధుడా!
విను = ఆలకింపుము
ధాత్రిలో = భూమి యందు
ధర్మపథంబు = ధర్మమార్గం
అనుపమము = సాటిలేనిది
ఎట్టి వారలకు = ఎటువంది వారికైనా
అందదు = గ్రహించడం సాధ్యం కాదు.
విను =ఈ విషయం తెలుసుక
పదివేవురందు = పదివేలమందిలో
ఒకcడు = ఒకడైన
విశ్హుత ధర్మ పరాయణుండు= గొప్ప ధర్మ మార్గాన్నిఅనుసరించేపాడు
కల్గును + ఓ = కలుగునా? (ఉంటాడో)
కలుగండు + ఓ = కలుగడో ? (ఉండడో)
సందియము = సందేహమే ?
కోరి =ప్రయత్నించి
సనాతన ధర్మం = ఫ్రాచీనధర్మాన్ని
ఉంది = తెలిసి, గ్రహించి
ఇట్లు = విధంగా
ఎవ్వనికిని = ఎవరి అయినా (ఏ మనిషికైనా)
నీకున్ + పోలెన్ = నీవు ఆరిస్తున్న విధంగా
చరింప వచ్చునే = ప్రవర్తించడం సాధ్యమా (సాధ్యం కాదు)
* ఉ. ఎంతయు వృద్ధులై తమకు నీ వొకరుండవ తెప్ప గాఁగ న
త్యంతముదంబునన్ బ్రదుకు తల్లిని దండ్రిని నుజ్జగించి ని
శ్చింతుఁడవై సదాధ్యయనశీలత వారి యనుజ్ఞ లేక యే
కాంతము యెమ్మెయిన్ వెడలితక్కట! నీవువంబు క్రూరతన్.
ప్రతిపదార్ధం :
ఎంతయు = చాలా
వృద్ధులు + ఐ=ముదుసలి వారైన
తమకు = పారికి
నీవు + ఒకరుండవు = నువ్కొక్కడివే
తెప్ప = తరింపచేసేవాడవు
కాగ = కాగా
అతి + అంత = చాలా
ముదంబునన్ = సంతోషంతో
బ్రతుకు = జీవిస్తున్న
తల్లిని + తండ్రిని = అమ్మానాన్నలను
ఉజ్జగించి = విడచి
నిః+చింతుడవు+ఐ : = ఆలోచనలేనివాడవై
సదాధ్యయనశీలత : = వేడాద్యయనం చేయాలనే స్వభావంతో
వారి + అనుజ్ఞఞ = తల్లిదండ్రుల అనుమతి
లేక = లేకుండానే
ఈ+మెయిన్ = ఈ విధంగా
ఏకాంతము = ఓక్కడివే
అక్కట = అయ్యూ !
నీవు = నీవు
కరంబు = చాలా
క్రూరతన్ = కఠినత్వంతో
వెడితితి = ఇందిని విడేచేవు
ఆ) కింది పద్యాన్ని చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
సీ. జతనంబు మిగుల మాసములు దొమ్మిది యుద
రంబునం గరము భరంబుతోడ
భరియించి పదపడి ప్రాణసంశయ దశ
నొంది పుత్రునిఁ గాంచు నెందుఁ దల్లి;
తపములు యజ్ఞముల్ దానముల్ వ్రతములు
దేవతా సజ్జన సేవనములుఁ
గావించుఁ బుత్రుని గామించి జనకుఁడి
రుపుర పాటును సరియె తలఁపఁ;
దనయుఁగని తల్లిదండ్రులు దమకు నతఁడు
భక్తుఁడగుటకు ధర్మానురక్తుఁ డగుట
కాసపదుదురు; విను మట్టియాన సిద్ధిం
బొందఁ జేయు నతఁడ చువ్వె నందనుండు – ఎఱ్ఱన
ప్రశ్నలు- జవాబులు :
ప్రశ్న 1.
తమ పిల్లల నుండి తల్లిదండ్రులు ఏమి కోరుకుంటారు?
జవాబు:
తమ పిల్లల నుండి తల్లిదండ్రులు, కొడుకులు ధర్మాను “రక్తులవ్వాలని మరియు భక్తుడవ్వాలని కోరుకుంటారు.
ప్రశ్న 2.
సంతానం కొరకు తల్లి ఏ విధంగా కష్టపడుతుంది ?
జవాబు:
సంతానం కొరకు తల్లి నవమాసాలు మోస్తుంది. ప్రసవ వేదనను అనుభవించి ప్రాణాలను సైతం లెక్కచేయక కుమారుణ్ని ప్రసవిస్తుంది. ఆ సమయంలో ప్రాణం పోయినా పోవచ్చును. అనేక దానాలు, వ్రతాలు, యజ్ఞాలు చేయిస్తుంది. కోరికతో కుమారుణ్ని పొందుతుంది.
ప్రశ్న 3.
తపములు, యజ్ఞములు ఎవరు ? ఎందుకు చేస్తారు ?
జవాబు:
తపములు, యజ్ఞములు ధర్మకార్యాలు. కొడుకు పుట్టాలని ఈ పనులు చేస్తారు.
ప్రశ్న4.
పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
పై పద్యం ఎవరు రచించారు ?
ఇ) కింది అపరిచిత గద్యాన్ని చదివి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
కేరళకు చెందిన 17 ఏళ్ల బాలిక తన తండ్రి కోసం గొప్ప త్యాగం చేసింది. అమల్లో ఉన్న చట్టాలవల్ల ఎదురవుతున్న అడ్డంకులను న్యాయస్థానం ద్వారా తొలగించుకుని మరీ ఆమె తన తండ్రికి ప్రాణదానం చేసింది. ఆమె త్యాగనిరతిని అందరూ ప్రశంసిస్తున్నారు. కేరళలోని త్రిసూర్లో ప్రతీష్ ఒక కేఫ్ను నడుపుతున్నారు. ఆయన తీవ్రమైన కాలేయవ్యాధితో ! బాధపడుతున్నారు. ఆయనకు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయడం తప్పనిసరి అని వైద్యులు తెలిపారు. ఆయనకు కాలేయాన్ని ఇవ్వగలిగే తగిన అవయవదాత దొరకలేదు. దీంతో ఆయన కుమార్తె దేవనంద చాలా ఆవేదనకు గురైంది. తన తండ్రి కోసం తాను ఏదైనా చేయాలనుకుంది. తన కాలేయంలో కొంత భాగం ఆయనకు ఇవ్వాలని నిర్ణయించుకుంది.
అయితే ఓ మైనర్ తన అవయవాలను దానం చేయడానికి మనదేశంలో అమలులో ఉన్న చట్టాలు అనుమతించవని తెలుసుకుంది. ఇటువంటి సందర్భం గతంలో వచ్చిందని, మైనర్ అవయవదానం చేయడానికి కోర్టు అనుమతి ఇచ్చిందని ‘ తెలుసుకుని, కేరళ హైకోర్టును ఆశ్రయించింది. తన తండ్రికి తన కాలేయంలో కొంత భాగాన్ని ఇచ్చేందుకు అనుమతించాలని కోరింది.
హైకోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు చెబుతూ అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఇంతటి త్యాగానికి సిద్ధమైనందుకు ఆమెను ప్రశంసించింది.తన కాలేయాన్ని ఇచ్చేందుకు హైకోర్టు అనుమతించడంతో దేవనంద తన కాలేయం దానం చేయడానికి తగిన | స్థాయిలో ఆరోగ్యవంతంగా ఉండటం కోసం ఆహారపుటలవాట్లు పూర్తిగా మార్చుకుంది.
స్థానిక జిమ్లో క్రమం తప్పకుండా వ్యాయామం చేసింది. అలువలోని ఓ ఆసుపత్రిలో తన కాలేయాన్ని దానం చేసింది. ఆమె సాహసానికి మెచ్చుకొని శస్త్ర చికిత్సకు అయ్యే ఖర్చులను ఆసుపత్రి యాజమాన్యం ఉపసంహరించింది. ఓ వారం రోజుల తర్వాత ఆమెను ఆసుపత్రి | నుంచి ఇంటికి పంపించారు. తన తండ్రికి తన కాలేయంలో కొంత భాగం ఇవ్వడం తనకు గర్వకారణమని, సంతోషంగా ఉందని దేవనంద తెలిపారు.
ప్రశ్నలు- జవాబులు :
ప్రశ్న 1.
దేవనంద తన తండ్రి కోసం ఏం చేయాలనుకుంది ?
జవాబు:
దేవనంద తన తండ్రి కోసం కాలేయంలో కొంత భాగాన్ని ఇవ్వాలని అనుకుంది. ప్రాణదానం చేయాలనుకుంది.
ప్రశ్న 2.
హైకోర్టు దేవనందను ఎందుకు ప్రశంసించింది ?
జవాబు:
దేవనంద తన తండ్రికి తన కాలేయంలో కొంత భాగాన్ని ఇవ్వడానికి సిద్ధమైనది. ఆమె చేస్తున్న త్యాగానికి సిద్ధమైనందుకు హైకోర్టు దేవనందను ప్రశంసించింది.
ప్రశ్న 3.
దేవనందకు హాస్పిటల్ యాజమాన్యం ఏ విధంగా సహకరించింది ?
జవాబు:
దేవనంద చేస్తున్న సాహసానికి మెచ్చుకొని శస్త్రచికిత్సకు అయ్యే ఖర్చులను ఆసుపత్రి యాజమాన్యం ఉపసంహరించి.
ప్రశ్న 4.
పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
దేవనంద ఏ రాష్ట్రానికి చెందింది ?
ఈ) కింది వానికి అర్థ సందర్భములు రాయండి.
ప్రశ్న 1.
వాఁడ సూవె ధర్మాత్ముండు వసుధ మీఁద.
జవాబు:
పరిచయము : ఈ వాక్యము ఎఱ్ఱాప్రెగడ రచించిన భారతంలోని అరణ్యపర్వం 5వ అశ్వాసం నుండి గ్రహింపబడిన “ప్రత్యక్షదైవాలు” అను పాఠంలోనిది.
సందర్భము : గృహస్థ ధర్మాలను వివరిస్తూ ధర్మవ్యాధుడు కౌశికునితో పల్కిన సందర్భములోనిది.
భావము : ధర్మ కార్యాలను ఆచరించిన గృహస్థుడే నిజమైన ధర్మాత్ముడని భావము.
ప్రశ్న 2.
గురు జనములకుఁ బ్రీతిఁజేసిద ననఘా!
జవాబు:
పరిచయము : ఈ వాక్యము ఎఱ్ఱాప్రెగడ రచించిన భారతంలోని అరణ్యపర్వం 5వ ఆశ్వాసం నుండి గ్రహింపబడిన “ప్రత్యక్షదైవాలు” అను పాఠంలోనిది.
సందర్భము : తల్లిదండ్రులను తప్పక సేవించి తరిస్తాను అని కౌశికుడు, ధర్మవ్యాధునితో చెప్పిన సందర్భములోనిది.
భావము : తల్లిదండ్రులను సేవించి తరిస్తాను.
ఉ) కింది ప్రశ్నలకు ఏకవాక్య సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
ఎఱ్ఱన ఎవరి ఆస్థాన కవి?
జవాబు:
అద్దంకిని రాజధానిగా చేసుకొని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి.
ప్రశ్న 2.
ధర్మవ్యాధుని కథను ఎవరు ఎవరికి చెప్పారు ?
జవాబు:
ధర్మవ్యాధుని కథను మార్కండేయ మహర్షి ధర్మరాజుతో చెప్పాడు.
ప్రశ్న 3.
ఎవరికి సేవ చేయడం తన ధర్మం అని కౌశికుడు గ్రహించాడు?
జవాబు:
తల్లిదండ్రులకు సేవ చేయడం తన ధర్మం అని కౌశికుడు గ్రహించాడు.
ప్రశ్న 4.
ధర్మవ్యాధుని కథ ఏ గ్రంథం నుండి స్వీకరించబడింది ?
జవాబు:
ధర్మవ్యాధుని కథ మహాభారతం – అరణ్యపర్వం నుండి గ్రహింపబడింది.
వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
ధర్మవ్యాధుడు కౌశికునితో ‘తల్లిదండ్రుల సేవా విశిష్టతను’ గురించి ఏమని చెప్పాడు ?
జవాబు:
ఓ కౌశిక మహర్షీ ! నీవు నన్ను సర్వజ్ఞుడవంటూ అభినందించావు. నేను ఇంతటి విజ్ఞానాన్ని పొందడానికి మూలమైన ధర్మం ఒకటి ఉంది. ఆ ధర్మాన్ని నీ కంటికి కనిపించే విధంగా తెలియజేస్తాను. కౌశిక మహర్షిని సగౌరవంగా ధర్మవ్యాధుడు తన ఇంటిలోనికి తీసుకువెళ్ళాడు. నాలుగువైపుల నుండి సుగంధాలు వెదజల్లుతున్న ఆ భవనంలో ఉన్న ఉన్నత ఆసనాలపై ధర్మవ్యాధుని తల్లిదండ్రులు కూర్చొని ఉన్నారు. వారు తమకు ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తూ, నచ్చిన వస్త్రాలు, ఆభరణాలు మొదలైనవి ధరించి ఆనందంగా ఉన్నారు. ధర్మవ్యాధుడు తన తల్లిదండ్రుల యోగక్షేమాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సేవ చేస్తున్నాడు.
ప్రశ్న 2.
ధర్మవ్యాధుని తల్లిదండ్రులు తమ పుత్రప్రేమను ఎలా వ్యక్తీకరించారు ?
జవాబు:
నాయనా! కుమారా ! నీవంటి ఉత్తముడు కుమారుడై ఉండగా మాకేమి లోటు ఉంటుంది. నీవు పాటించే ధర్మం నిన్ను రక్షిస్తోంది. చక్కని సంపదలతో చిరకాలం జీవించగలవు. నీ ప్రవర్తన చేత మన వంశం పవిత్రమైంది. మానవుడిగా జన్మించావే గాని దేవతలలో గొప్ప దేవతవు. అనుమానం లేదు. మనస్సు, మాట, ఆచరణల చేత తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావు. ఉత్తమ గుణవంతుడవైన నీ గురించి చెప్పి, తర్వాత పరశురాముని గురించి చెప్పాలి. మరెవ్వరూ నీకు సాటిరారు అని పలికిన తల్లిదండ్రులు తమ ప్రేమను ధర్మవ్యాధుని దగ్గర వ్యక్తీకరించారు.
ప్రశ్న 3.
గృహస్థధర్మాన్ని గురించి ధర్మవ్యాధుడు ఏం చెప్పాడు ?
జవాబు:
ప్రతి గృహస్థు తమ తల్లిదండ్రులను పూజించాలి. వారికి ఇష్టమైన పనులను చేయాలి. గౌరవంతో సేవ చేయాలి. అంతేకాక పుణ్యాన్ని కోరే గృహస్థుడు తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే అయిదుగురిని పూజించి సంతోషపరచాలి. అలాంటి గృహస్థుడే ధర్మాత్ముడు.
ఆ) కింది ప్రశ్నలకు ఎనిమిది నుండి పది వాక్యాలలో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
ప్రత్యక్ష దైవాలు పాఠం సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి.
జవాబు:
ఈ సృష్టిలో మన తల్లిదండ్రులే మనకు ప్రత్యక్షదైవాలు. తల్లిదండ్రుల సేవకు మించిన ధర్మం లేదని భారతం చెస్తోంది. ధర్మవ్యాధుడు తన తల్లిదండ్రులను నిత్యము గౌరవిస్తూ, మనస్సు, మాట, ఆచరణల చేత తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాడు. ఇతని ప్రవర్తన వల్ల వారి వంశం పవిత్రమైంది.
ఇతడు పాటించే ధర్మమే ఇతన్ని రక్షిస్తోంది. ఇలా తల్లిదండ్రులను సేవించడం వల్ల వేదాధ్యయనం, యజ్ఞాలు, వ్రతాలు చేసిన ఫలితం వస్తుందని ధర్మవ్యాధుడు కౌశిక మహర్షితో చెప్పాడు. మరియు ధర్మవ్యాధుడు కౌశిక మహర్షితో ప్రజల చేత గౌరవింపబడేవాడా! వీరు నా తల్లిదండ్రులు. వీరికి సేవ చేయడం వల్ల మాత్రమే నాకు గొప్ప జ్ఞానం లభించింది. సాధారణంగా లోకంలో అందరూ కోరికతో దేవతల్ని పూజిస్తారు. నా తల్లిదండ్రులే నా పాలిటి దేవతలు. వేఱు దేవతల గురించి నాకు తెలియదు.
వీరికి రుచికరమైన పండ్లు, పూలు, గంధం, అందమైన నగలు, వస్త్రాలు, ఇష్టమైన ఆహారపదార్థాలను అందిస్తాను. నా ఆలుబిడ్డలతో కలిసి సేవ చేస్తుంటాను. ఈ భూమిపై పుణ్యాన్ని కోరే గృహస్థుడు తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే అయిదుగురిని పూజించి, సంతోషపరచాలి. అలాంటి గృహస్థుడే ధర్మాత్ముడు అని చెప్పాడు. ఆ తర్వాత కౌశిక మహర్షి చేసిన దోషాన్ని చెప్పాడు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే వాడు వ్యర్థుడు అని చెప్పి కౌశిక మహర్షిని జాగృతపఱచి కనువిప్పు కల్గించాడు. అందుచేత తల్లిదండ్రులు మనకు ప్రత్యక్షదైవాలు.
ప్రశ్న 2.
ఈ పాఠం ఆధారంగా ధర్మవ్యాధుని వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి.
జవాబు:
ధర్మవ్యాధుడు ఉత్తమ కుమారుడు. తన తల్లిదండ్రులకు నిరంతరం యోగక్షేమాలను తెలుసుకుంటూ సేవ చేసే కర్మశీలుడు. మనస్సు, మాట, ఆచరణల చేత తల్లిదండ్రులను ప్రేమించేవాడు. అందువల్ల తన తండ్రి, కొడుకైన ధర్మవ్యాధునితో ఇలా అంటాడు “నీ వంటి ఉత్తముడు కుమారుడై ఉండగా మాకేమి లోటు ఉంటుంది.
నీవు పాటించే ధర్మం నిన్ను రక్షిస్తోంది. చక్కని సంపదలతో చిరకాలం జీవించగలవు. నీ ప్రవర్తన చేత మన వంశం పవిత్రమైంది. మానవుడిగా జన్మించావే గాని దేవతలలో గొప్ప దేవతవు. అనుమానం లేదు” అని అంటాడు. కనుకనే భూమిపై పుణ్యాన్ని కోరే గృహస్థుడు తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే అయిదుగురిని పూజించి సంతోషపరచాలి. అలాంటి గృహస్థుడే ధర్మవ్యాధుడు. ధర్మ సూక్ష్మాలను, శాస్త్రాలను గ్రహించిన నిరాడంబర జీవి. సత్యవ్రతుడు, కల్మషంలేని మహామనీషి.
ప్రశ్న 3.
వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్న నేటిరోజుల్లో తల్లిదండ్రుల సేవను మించిన ధర్మం లేదు. అనే ధర్మవ్యాధుని అభిప్రాయ ప్రాధాన్యతను పాఠం ఆధారంగా వివరించండి.
జవాబు:
తల్లిదండ్రుల సేవా విశిష్టత
తల్లిదండ్రుల సేవను మించిన ధర్మం లేదు” · అని భారతం చెస్తోంది. జన్మనిచ్చిన తల్లిదండ్రులు పిల్లల పాలిట ప్రత్యక్ష దైవాలు. అంతేగాక “తల్లిదండ్రులన్న దైవ సన్నిభులురా” – అని జంధ్యాల పాపయ్యశాస్త్రి చెప్పారు. తల్లిని కష్టపెట్టకూడదు. తండ్రిని నష్టపెట్టకూడదు. నిజమైన గృహస్థుడు ధర్మాత్ముడు అవ్వాలంటే తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ ఈ అయిదుగురిని పూజించాలి.
తల్లిదండ్రులకు సేవ చేయడం వల్ల గొప్ప జ్ఞానం లభిస్తుంది. ధర్మవ్యాధుడు లాగా ఆలుబిడ్డలతో కలిసి సేవ చేస్తే వేదాధ్యయనం, యజ్ఞలు, వ్రతాలు చేసిన ఫలితం వస్తుంది. ఇది గ్రహించిన వారుంటే వృద్ధాశ్రమాలు ఉండవు. వీటి అవసరం రాదు. కనుక బాలబాలికలారా ! ఈ పాఠం చక్కగా చదివి ప్రతి ఒక్కరు ధర్మవ్యాధుని లాగా పుణ్యాత్ములు కావాలి.
ఇ) కింది ప్రశ్నలకు సృజనాత్మకంగా సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
కౌశికుడు ధర్మవ్యాధుల వృత్తాంతాన్ని సంభాషణ రూపంలో రాయండి.
జవాబు:
ఫర్మచ్రాధుడు : కౌశిక మహర్షీ ! నమస్కారము. నీవు నన్ను సర్వజ్జుడవంటూ అభినందించావు. కృతష్జజయలు. రా ! మా యింటికి వెళ్దాం|
కౌశిక మహర్షి : సంతోషం. పద!
థర్మఎాఢుడు : ఓ మహ్ష్షీ! వీరే నా తల్షిదండ్రులు.
కౌశిక మహర్షి : అయ్య ! పాడాథివందనాలు.
ధర్మవ్యాధుడు : చూడు మహర్షీ నా తల్లిదండులే నా పాలిటి దేవతలు. వేఱు దేవతల గురీంచి నాకు తెలియదు. ఇలా సేవ చేయడం వల్ల వేదాధ్యయనం, యజ్ళ్రాలు, వ్రరతాలు చేసిన ఫలితం వస్తుంది.
శాళక ముహి్షి : జ్టానుల చేత ఆరాధింపదడే ఓ ధర్మవ్యాధుడా ! నీ ధర్మమార్గం సాటిలేనిది.
ఫర్లప్యాఢుడు : ఓ కౌశి మహర్షీ! నీవు నా వద్దకు ఒక పతివ్రత పంపగా వచ్చావు.
కౌళక మహర్షి : అవును. ధర్కాన్ని గురించిన ళ్రానాన్ని పొందాలని భావిస్తున్నాను.
ధర్మవ్యాధుడు : నువ్వంటే నాకిష్టం లేదు. ఎందుకంటే వృద్ధులైన నీ తల్లిదండ్రులను వదిలి, వేదాధ్యయనం నిమిత్తం నీ తల్లిదండ్రుల అనుమతి లేకుండా వెళ్ళిపోయావు. ఈ కఠినమైన నీ ప్రవర్తన నాకు నచ్చలేదు.
కౌశిక మహర్షి : వేదాధ్యయనం నిమిత్తం వెళ్ళాను. కాని నీవు చెప్పినట్లు అలా ఆలోచన చేయలేదు.
ధర్మవ్యాధుడు : నీవు విడిచి వెళ్ళిన మరుక్షణం నీ కోసం తల్లిదండ్రులు గుండెలు పగిలిపోయేటట్లుగా ఏడ్చి ఏడ్చి అంథులయ్యారు. ఇప్పటికైనా నీవు వెళ్ళి వారి దుఃఖాగ్నిని చల్లార్చు.
కౌశిక మహర్షి : ఓ పుణ్యాత్ముడా ! నీవు చెప్పిన మాటలు సరైనవి. శ్రేష్ఠమైనవి. మేలు కలిగించేవి. వాటిని శ్రద్ధగా విన్నాను. తప్పక ఆచరిస్తాను. తల్లిదండ్రులను సేవించి తరిస్తాను.
ప్రశ్న 2.
విద్య/ ఉద్యోగాల నిమిత్తం తమకు దూరంగా ఉంటున్న పిల్లల గురించి తల్లి/తండ్రి అభిప్రాయాన్ని ఆత్మకథగా రాయండి.
జవాబు:
సత్యవతి ఆత్మకథ
నా పేరు సత్యవతి. నా భర్త ధర్మారావు. మాకు ఇద్దరు పిల్లలు, పెద్దవాడు ఆనంద్, రెండవది సుశీల. మా గ్రామం పేరు శ్రీరంగపురం, కృష్ణానదీ తీరంలో ఉంది. మాకు కొద్ది భూమి ఉంది. నా భర్త వ్యవసాయం చేస్తారు. కాని మా యిరువురి కల మా పిల్లలను విద్యావంతుల్ని చేయాలి అని. కాని మా గ్రామంలో 10వ తరగతి వరకు మాత్రమే పాఠశాల ఉంది.
చాలా చక్కగా మా పిల్లల్ని చదివిస్తున్నాము. నా భర్త చదువుకోలేదు. అందువల్ల మన పిల్లల్ని బాగా చదివించాలి. దేశానికి ఉపయోగపడాలి అని చెప్పేవారు. అందుకు నేను గర్వపడేదాన్ని. “పిల్లలు బాగుపడాలంటే వారిపైన మన ప్రేమ అంతర్గతంగా ఉండాలి” అని పదేపదే చెబుతుంటారు.
ఆ మాటలు నాకు ఎప్పుడు గుర్తుండేవి. ఇప్పుడు నా పిల్లలు ఎక్కడో పట్టణాలలో కాలేజీలో చదువుతున్నారు. వేళకు తింటున్నారో, లేదో తెలియదు. పైగా నా పిల్లలు హాస్టల్లో ఉంటున్నారు. వేళకు కాలేజీకి వెడుతున్నారో, లేదో తెలియదు. ఇంటి దగ్గర చాలా క్రమశిక్షణగా చూస్తూ, ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండేవాళ్ళం. కాని ఇపుడు వాళ్ళను హెచ్చరిస్తూ ఎవరు గమనిస్తారు. ఏ తల్లికైన పిల్లలపై ప్రేమానురాగాలు ఉంటాయి కదా ! ఈ విషయంలో నా భర్త నన్నే కేకలేస్తుంటారు. “వారిపై ఉన్న మన ప్రేమానురాగాలు పిల్లల భవిష్యత్తుకు ఆటంకం కారాదు” అని నా భర్త అంటుంటారు. మా పిల్లలు బాగా చదువుతారు. వారు గొప్ప విద్యావంతులు కావాలన్నదే నా ఆకాంక్ష.
భాషాంశాలు
పదజాలం
అ) కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి, సొంతవాక్యాలు రాయండి.
1. జనకుడు తమ పిల్లలను చక్కగా తీర్చిదిద్దాలి.
జనకుడు = తండ్రి
సొంతవాక్యం = తల్లిదండ్రులను పిల్లలు గౌరవించాలి.
2. దేవతలు అమృతం సేవించడం వల్ల అమరులు అయ్యారు.
అమరులు = మరణం లేనివారు
సొంతవాక్యం దేవతలు మరణం లేనివారు.
3. చక్కని వాక్కే మనిషికి భూషణం.
భూషణం = ఆభరణం
సొంతవాక్యం : స్త్రీలకు బంగారు ఆభరణాలంటే మక్కువ ఎక్కువ.
4. ఐ.ఏ.యస్. కావాలనే అతని చిరకాల వాంఛ నెరవేరింది.
వాంఛ = కోరిక
సొంతవాక్యం : రాము చిరకాల కోరిక కలెక్టర్ కావాలని,
5. ఆ నగరంలో హర్మ్యాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
హర్మ్యాలు = మేడలు
సొంతవాక్యం : మా గ్రామంలో పెద్దపెద్ద మేడలున్నాయి.
6. మనం ఎప్పుడూ పరుల హితమునే కోరాలి.
హితము = మేలు
సొంతవాక్యం : ఇతరులకు మేలు చేసేవాడే నిజమైన పౌరుడు.
ఆ) కింది పదాలకు పర్యాయపదాలు రాయండి.
1. పుత్రుడు = కొడుకు, కుమారుడు, తనయుడు
2. వస్త్రం = బట్ట అంబరము
3. జనని = తల్లి, అమ్మ, అంబ
4. చక్షువు = కన్ను, నయనం, నేత్రం
5. వహ్ని= అగ్ని, నిప్పు, అనలం
ఇ) కింది పదాలకు నానార్థాలు రాయండి.
1. గురువు = తండ్రి, బృహస్పతి, ఉపాధ్యాయుడు
2. అర్థం = శబ్దార్ధము, ధనము
3. ఫలం = శబ్దార్ధము, ధనము
4. బుధుడు = పండితుడు, మనీషి, చంద్రపుత్రుడు
5. వంశం = తండ్రి తాతల పరంపర, వెన్నెముక, గుంపు, కులము
ఈ) కింది పదాలకు వ్యుత్పత్యర్థాలు రాయండి.
1. ధర్మం = 1) విశ్వమును ధరించునది వేద విహితమైన కర్మ, 2) ధరించునది – పుణ్యము, ఆచారము, స్వభావము
2. బుధుడు = అన్నింటిని తెలిసినవాడు విద్వాంసుడు, వేల్పు, చంద్రసుతుడు
3. జనని = కొడుకులను కనునది – తల్లి
4. కౌశికుడు = కుశికుడను రాజు మనుమడు – విశ్వామిత్రుడు
5. వసుధ = బంగారం గర్భమందు కలిగినది – భూమి
ఉ) కింది పట్టికలో ప్రకృతి, వికృతి పదాలు ఉన్నాయి. వీటిని గుర్తించి రాయండి.
జన్నం | కార్యం | దిటవు | పుత్రుడు |
బొట్టె | యజ్ఞం | విన్నాణం | దృఢం |
విజ్ఞానం | ఎద | కర్జం | హృదయం |
ప్రకృతి — వికృతి
1. యజ్ఞం – జన్నం
2. కార్యం – కర్జం
3. దృఢం – దిటవు
4. పుత్రుడు – బొట్టె
5. విజ్ఞానం – విన్నాణం
6. హృదయం – ఎద
సంధులు:
వ్యాకరణాంశాలు
అ) కింది పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.
1. నిజంబగు : నిజంబు + అగు = ఉత్వ సంధి
2. మూలంబైనది : మూలంబు + ఐనది = ఉత్వ సంధి
3. కలదొక : కలదు + ఒక = ఉత్వసంధి
4. వేల్పులనఘ : వేల్పులు + అనఘ = ఉత్వసంధి
5. నీవొకరుండవు : నీవు + ఒకరుండవు = ఉత్వసంధి
ఆ) కింది పదాలను కలిపి, సంధి పేరు రాయండి.
1. జ్ఞాన + అర్థంబు : జ్ఞానార్ధంబు — సవర్ణదీర్ఘ సంధి
2. విజ్ఞాన + ఉన్నతి : విజ్ఞానోన్నతి — గుణసంధి
3. అతి + అంత : అత్యంత — యణాదేశ సంధి
4. ధర్మ + అత్ముడు: ధర్మాత్ముడు– సవర్ణదీర్ఘ సంధి
త్రిక సంది
ఇ) కింది పదాలను కలిపి రాయండి. సంధి జరిగిన క్రమాన్ని సూత్రాన్ని అనుసరించి గ్రహించండి.
ఉదా : ఈ + మెయి – ఇమ్మెయి
1. ఈ + మహాత్ముడు : ఇమ్మహాత్ముడు
2. ఆ + విప్రుడు : అవ్విపుడు
3. ఆ + పతివ్రత : అప్పతివ్రత
4. ఏ + మెయిన్ : ఎమ్మెయిన్
5. ఈ + కన్య : ఇక్కన్య
సూత్రములు:
1) ఆ, ఈ, ఏ లు త్రికంబు లనబడు. ఈ + మెయి
2) త్రికము మీద అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు. ఈ మ్మెయి
3) ద్విరుక్తంబగు హల్లు పరంబగునపుడు అచ్ఛికంబగు దీర్ఘంబునకు హ్రస్వంబగు. ఇమ్మెయి.
ఈ) కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేరు రాయండి.
1. జననీజనకులు : జననియును, జనకుడును — ద్వంద్వ సమాసం
2. ఫలపుష్పములు : ఫలమును, పుష్పమును — ద్వంద్వ సమాసం
3. వస్త్రభూషణములు : వస్త్రములును, భూషణములును — ద్వంద్వ సమాసం
4. భక్ష్యభోజ్యములు : భక్ష్యములును, భోజ్యములును — ద్వంద్వ సమాసం
ఉ) కింది విగ్రహవాక్యాలకు సమానపదం రాసి, సమాసం పేరు రాయండి.
1. ధర్మమైన పథము : ధర్మపథము – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
2. సనాతనమైన ధర్మం : సనాతనధర్మం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
3. మానుషుని యొక్క దేహం : మానుషదేహం – షష్ఠీ తత్పురుష సమాసం
4. శోకమనెడి వహ్ని : శోకవహ్ని – రూపక సమాసం
ఊ) అలంకారం-రూపకాలంకారం
కింది పద్యాన్ని పరిశీలించండి.
అ||వె. నీక వగచి వగచి నిర్భిన్న హృదయులై-
విగత చక్షులైరి వినవే ? వార
లరిగి యింకనైన నమ్ముదుసళ్ల యు
దగ్ర శోకవహ్ని నార్పవయ్య
పై పద్యంలో ‘శోకవహ్ని’ అనే సమాసపదం ఉంది కదా ! దానికి విగ్రహవాక్యం ‘శోకమనెడు వహ్ని’ ఇది రూపక సమాసం. అలాగే అలంకారాలలో దీనిని రూపకాలంకారం అంటారు. వహ్ని అనేది ఉపమానం, శోకం అనేది ఉపమేయం. ఇక్కడ ఉపమానధర్మాన్ని ఉపమేయంపై ఆరోపించారు. రెండిటికీ అభేదం అంటే భేదం లేనట్లు చెప్పారు కనుక ఇది రూపకాలంకారం.
ఋ) కింది వాక్యాలలో ఉన్న అలంకారాన్ని గుర్తించి, లక్షణం రాయండి.
ప్రశ్న 1.
సంసార సాగరాన్ని ఈదటం కష్టం.
జవాబు:
ఈ వాక్యంలో “సంసార సాగరం” అని ఉంది కదా! అంటే సంసార మనెడి సాగరం. సంసారం అనే ఉపమేయానికి సాగరం అనే ఉపమానానికి అభేదం చెప్పబడింది. సాగరం లక్షణాన్ని సంసారంపై ఆరోపించబడింది. కనుక ఇది
రూపకాలంకారం.
ప్రశ్న 2.
ప్రభుత్వం రైతులపై దయావర్షం కురిపించింది.
జవాబు:
ఈ వాక్యంలో “దయావర్షం” అని ఉంది కదా ! అంటే దయ అనెడి వర్షం. దయ అనే ఉపమేయానికి వర్షం అనే ఉపమానానికి అభేదం చెప్పబడింది. వర్షం లక్షణాన్ని దయపై ఆరోపించబడింది. కనుక ఇది రూపకాలంకారం.
చందస్సు
ౠ) కింది పద్యపాదాలకు గురు-లఘువులు గుర్తించి, గణవిభజన చేసి ఏ పద్యపాదమో రాయండి.
1. ఎంతయు వృద్ధులై తమకు నీవొకరుండవ తెప్పగాగన (త్యంత)
ప్రాస రెండవ అక్షరము ‘త”
ఇది ఉత్పలమాల పద్యపాదం.
లక్షణము
1) ఉత్పలమాల పద్యము నందు నాల్గు పాదాలుంటాయి.
2) ప్రతి పాదము నందును భ,ర,న,భ,భ,ర,వ అనే గణాలు వరుసగా ఉంటాయి.
3) పాదాది అక్షరానికి ఆ పాదంలోని 10వ అక్షరానికి యతిమైత్రి చెల్లుతుంది.
4) ప్రాసనియమము కలదు. ప్రాసయతి చెల్లదు.
5) ఉత్పలమాల పద్యపాదంలో మొదటి గురువును రెండు లఘువులు చేసినచో అది చంపకమాల పద్యపాదము అవుతుంది.
2. అనుపమ మెట్టి వారలకు నందదు ధర్మపథంబు ధాత్రిలో
యత – అ – న్ + అం
ప్రాస – రెండవ అక్షరము ‘ను’
ఇది చంపకమాల పద్యపాదం.
లక్షణయు :
1) చంపకమాల పద్యము నందు నాల్గు పాడాలుంటాయి.
2) ప్రతి పాదము నందును న,జ,భ,జ,జ,జ,ర అనే గణాలు వరుసగా ఉంటాయి.
3) పాడాది అక్షరానికి ఆ పాదంలోని 11వ కక్షరానికి యతిఘైర్రి చెల్లుతుంది.
4) ప్రాసనియమము కలదు. ఏ్రాసయతి చెల్లదు.
5) చంపకమాల పద్యపాదము నందు మొదటి రెండు లఘువులను ఒక గురుపును చేసినచో అది ఉత్ఎలమాల పద్యపాదము అవుతుంది.
ఎ) ఆంది ఆరగతిలా నేర్చకున్న ఆటతెలది పద్య లక్షణాలను గుర్తు చేసుకుందాం.
పద్య లక్ష్మణాలు :
1) ఆటవెలది పద్యం ఉపజాతికి చెందినది.
2) ఇందులో నాలుగు పాడాలుంటాయి.
3) 1వ, 3వ పాడాలు ఒక విధంగాను, 2వ, 4వ పాడాలు ఒక విధంగాను ఉంటాయి.
4) 1, 3 పాడాల్లో వరుసగా మూడు సూర్యగణాలు, రెండు ఇంద్రగణాలు ఉంటాయి.
5) 2,4 పాడాల్లో ఐడు సూర్యగణాలు ఉంటాయి.
6) ప్రతి పాదంలో నాల్గవ గణంలోని మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది.
7) యతిలేని చోట ప్రాసయతి చెల్లుతంది.
8) ప్రాస నియమం లేదు.
కింది పద్యభాగాన్ని గణవిభజన చేసి, లక్షణ సమన్వయం చేయండి.
ఇని ఆటవెలది పద్యపాడాలు.
లక్షణాలు :
మొదటి పాదంలో మూడు సూర్యగణాలు (గల, గల, గల), రెండు ఇంద్రగణాలు (త-భ), రెండవ పాదంలో అయిడు సూర్యగణాలు (న,గల,గల,గల,గల) ఉన్నాయి. కనుక ఇది ఆటవెలది.
1వ పాదంలో యతి “భూ – ఝూ” (నాల్గవ గణ మొదటి అక్షరము)
2వ పాదంలో యతి – “త – త” (నాల్గవ గణ మొదటి అక్షరము)
ఈ పద్యంలో ఏ్రాసా నియమం లేదు. ప్రాసయతి కలదు.
ఏ) కింది వాక్యాలను ఆధునిక వచనంలోకి మార్చి రాయండి.
ప్రశ్న 1.
ధర్మవ్యాధుండు కౌశికునితో యిట్లనియె.
జవాబు:
ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అన్నాడు.
ప్రశ్న2.
గృహంబునకు రమ్మని యతనిం దోడ్కొని చనియె.
జవాబు:
ఇంటికి రమ్మని అతన్ని తీసుకొని వెళ్లాడు.
ప్రశ్న 3.
ఇమ్మహాత్ముండు మనలన్ జూచువేడ్క నిటవచ్చె నని చెప్పిన.
జవాబు:
“ఈ మనీషి మనలను చూడాలని ఇక్కడకు వచ్చాడ”ని చెప్పాడు.
ప్రశ్న 4.
బతివ్రతపనుపునంజేసి నీవు ధర్మజ్ఞానార్థంబు నా యున్న యెడకుం జనుదెంచితివి.
జవాబు:
పతివ్రత పంపగా నీవు ధర్మాన్ని గురించి జ్ఞానం పొందాలని వచ్చావు.
ప్రాజెక్టు పని
తల్లిదండ్రుల సేవకు ప్రాధాన్యమును ఇచ్చిన శ్రవణ కుమారుడు – శ్రీరాముడు – భీష్ముడు – గరుత్మంతుడు – శివాజీ వంటి మహనీయులలో మీకు నచ్చిన ఇద్దరి వివరాలు సేకరించి రాయండి.
జవాబు:
1. శ్రవణ కుమారుడు ఒకరోజు దశరథుడు వేటకు వెళ్ళి సాయంత్రం వరకు వేటను కొనసాగిస్తుండగా సాయం సంధ్య వేళ ఓ నది ఒడ్డు నుండి విని వినబడక శబ్దం వస్తుంది. ఆ శబ్దాన్ని ఏనుగు నీరు త్రాగుతుందని తలచి బాణం సంధించి ఆ శబ్దం వచ్చిన వైపు వదలగా అది తన ముసలి తల్లిదండ్రులకు నీరు తీసుకొని వెళ్ళడానికి వచ్చిన ఓ ముని కుమారుడికి తగులుతుంది. ఆ ఏడ్పు విని దశరథుడు బాలుడైన శ్రవణ కుమారుని వద్దకు వెళ్ళి బాధపడి ఆ బాలుడు కోరగా అతని తల్లిదండ్రులకు నీరు తీసుకొని ఆశ్రమానికి వెళ్తాడు. వారికి జరిగింది వివరించగా ఆ బాలుడి వద్దకు తీసుకొని వెళ్ళమని కోరతారు. ఆ బాలునికి చితి పేర్చి ఆ బాలునితోపాటు వారు చితిలో దూకి మరణిస్తూ “నీవు కూడా మా వలెనే పుత్రశోకంతో మరణిస్తావ”ని దశరథుని శపిస్తారు.
2. శ్రీరాముడు : శ్రీరాముడు దశరథుని కుమారుడు. ఇతని తల్లి కౌసల్య. శ్రీరాముడు సుద్గుణాల రాశి. రూపంలోనూ,. గుణంలోనూ శ్రేష్ఠుడు. మహావీరుడు. మృదువుగా మాట్లాడతాడు. శరణన్న వారిని కాపాడతాడు. కోపం, గర్వం లేనివాడు. సత్యం పలికేవాడు. ఆడినమాట తప్పనివాడు. తండ్రిమాట జవదాటనివాడు. పరుల సంపదను ఆశించని వాడు. దీనులను ఆదుకునేవాడు. కాలాన్ని వృథా చేయకుండా జ్ఞానులతో, సజ్జనులతో వివిధ విషయాలను చర్చించేవాడు. వినయశీలి. తల్లిదండ్రులపట్లా, గురువులపట్లా నిశ్చల భక్తి కలవాడు. సోమరితనం, ఏమరుపాటు లేనివాడు. కళలతో ఆరితేరినవాడు. అసూయ, మాత్సర్యం లేనివాడు. ప్రజలపట్ల వాత్సల్యం కలవాడు.
3. భీష్ముడు : భీష్ముడు గంగా శంతనుల అష్టమ పుత్రుడు. ఇతడు పూర్వ జన్మలో అష్టవసువులలో ఒకడు. ప్రభాసుడను వాడు. వాని సోదరులవలె వానిని కూడా గంగా ప్రవాహంలో పడవేయకుండా శంతనుడు గంగను వారించి ఆమెను గూర్చి అప్రియాలు పలికాడు. గంగ యీ పుత్రుని, భర్తను విడచి వాని వృత్తాంతము భర్తకు చెప్పి వెళ్ళిపోయింది. భీష్ముడు వశిష్ఠుని వద్ద సకల వేదాలను, శాస్త్రాలను చదివి, అస్త్ర విద్యను పరశురాముని వద్ద నేర్చెను. శంతనుడు ఇతనికి యౌవరాజ్యాభిషేకము చేసెను.
శంతనుడు ఒకరోజు దాశరాజ పుత్రికయైన సత్యవతిని చూచి కామించి, విరహంతో బాధపడుచుండెను. భీష్ముడు తండ్రి దుఃఖ కారణాన్ని తెలుసుకుని, దాశరాజు దగ్గరకు వెళ్ళి సత్యవతిని తన తండ్రికి ఇమ్మని అడిగాడు. ఆమెకు పుట్టు పుత్రులు సింహాసనారూఢార్హులు కారని దాశరాజు. శంకించాడు..
ఆమె పుత్రులే రాజ్యమేలెడు వారని భీష్ముడు శపథము చేసాడు. అయినను దాశరాజు యొక్క భయము పోలేదు. ఇతడు కాకపోయినను ఇతని సంతతి వారేమి అవరోధము చేయుదురో అని సందేహించాడు. గంగా సూనుడు ఆ సంకోచమునకును అవకాశము లేకుండా చేశాడు. తండ్రికి అనుకున్నపని జరగాలని తలచి, తాను బ్రహ్మచర్య వ్రతాన్ని పూనాడు. ఇతని రాజ్య పరిత్యాగానికిని, బ్రహ్మచర్య వ్రత పరిగ్రహానికిని, సత్య వ్రతానికిని దేవర్షి గణాలు మెచ్చుకుని పుష్ప వర్షం కురిపించారు. దాశరాజు సంతసించి సత్యవతిని శంతనునికిచ్చి వివాహం జరిపించాడు. శంతనుడు భీష్ముణ్ని మెచ్చుకొని “భీష్మునికి స్వచ్ఛంద మరణం” వరంగా ఇచ్చాడు.
4. గరుత్మంతుడు : ఇతను ఒక పక్షి. అసూరుని సోదరుడు. ఇతని తల్లి వినత, తండ్రి కశ్యపుడు. ఇతడు అండము నుండి బైటపడగానే ఆకాశానికి ఎగిరి, తిరిగి వచ్చి తల్లికి నమస్కరించాడు. ఇతడు పుట్టినప్పటి నుండియు కద్రువ ఆనతిచ్చిన విధంగా ఆమె కుమారులకు సేవ చేయుచుండెను. తన తల్లి దాస్య విముక్తికి గల కారణం తెలుసుకున్నాడు. గరుత్మంతుడు. దేవలోకానికి వెళ్ళి అమృతం తీసుకురావడానికి ప్రయత్నించగా ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని వేశాడు.
ఇంద్రాయుధాన్ని అపహాస్యం చేయక గరుత్మంతుడు తన రెక్క నుండి ఒక ఈకను మాత్రం రాల్చుకొమ్మని చెప్పాడు. గరుత్మంతుని పర్ణములంత గట్టివి కనుక సుపర్ణుడను పేరు వచ్చింది. గరుత్మంతుని సామర్థ్యంను చూసి ఇంద్రుడు ఇతనితో స్నేహం చేసి, ఇతరులకు అమృతాన్ని ఈయవలదని చెప్పాడు. అమృతం పాములకీయగానే నా తల్లి దాస్యము తీరుతుందని చెప్పాడు. వెంటనే అమృతాన్ని తీసుకొని వెళ్ళమని చెప్పాడు గరుత్మంతుడు. గరుత్మంతునికి సర్పాలన్నీ ఆహారమవుతాయని ఇంద్రుడు వరమిచ్చాడు. గరుత్మంతుడు అమృతాన్ని తెచ్చి కాద్రవేయులకిచ్చి తల్లి దాస్యమును పోగొట్టాడు.
5. శివాజీ (19.02.1630 – 03.04.1680) : ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన “శివాజీ రాజే భోంస్లే” భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు. ఇతను పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షాహాజీ, జిజియాబాయి దంపతులకు జన్మించాడు. వీరు మహారాష్ట్రలోని వ్యవసాయం చేసుకునే భోంస్లే కులానికి చెందినవారు.
శివాజీ తల్లి జిజియాబాయి యాదవ క్షత్రియ వంశానికి చెందిన ఆడపడుచు (దేవగిరి మరాఠా యాదవరాజుల వంశము): శివాజీకి ముందు పుట్టిన వారందరూ మృతి చెందగా ఆమె పూజించే దేవత అయిన శివైపార్వతి పేరు శివాజీకి పెట్టింది. శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమిపైన, ప్రజలపైన మమకారం కలిగేటట్లు చేసింది. విద్యాబుద్ధులు నేర్పించింది. చిన్నప్పటి నుండి భారత, రామాయణ, బలిచక్రవర్తి గాథలు చెప్పి వీర లక్షణాలు మొలకింప చేసింది.
పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవం తన తల్లి వద్దనే నేర్చుకున్నాడు. తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో శివాజీ యుద్ధతంత్రాలలో నిష్ణాతుడయ్యాడు. సకల విద్యలు తెలుసుకున్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాలు మొదలుపెట్టాడు.
17 ఏళ్ళ వయసులో శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. మరో మూడేళ్ళలో కొండన, రాజఘడ్ కోటలను సొంతం చేసుకుని పూణే ప్రాంతాన్నంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. అనేక కోటలను జయించాడు.
1674 జూన్ 6న రాయఘడ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియ రాజులందరికి అధిపతిగా కీర్తిస్తూ “ఛత్రపతి” అను బిరుదును ప్రదానం చేశారు. తర్వాత మూడు వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి 1680న మధ్యాహ్నం 12 గడియలకు రాయఘడ్ కోటలో మరణించాడు.
పాఠ్యాంత పద్యాలు
తే.గీ. పసిడి పాపల మురిపించు పాఠశాల
భావి నరులకు జ్ఞానంబు భద్రపరచి
అంది యిచ్చెడి నిజమైన మందిరమ్ము
అక్షరంబుల నేర్పు దేవాలయమ్ము
భావం : స్వచ్ఛమైన మనసులు గల బాలలకు పాఠశాల ప్రేమగా అక్షరాలు నేర్పుతుంది. అది జ్ఞానాన్ని అందించి, మంచి పౌరులుగా తీర్చిదిద్దే దేవళం.
తే.గీ. తల్లి వలె బిడ్డలందరి తలను నిమిరి
వారి తలలకు ప్రేమ సాంబ్రాణి వేసి
దివ్య సౌగంధముల నింపి తేజమొసగి
ఐదు తరగతుల్ నేర్పు నధ్యాపకుండు
భావం : ఉపాధ్యాయుడు తల్లిలాగ బాలల తలలను వాత్సల్యంతో నిమిరి, చదువు నేర్పి, హృదయాలను వికసింప చేస్తాడు. నైతిక విలువల పరిమళాల తేజస్సునందిస్తాడు.
తే.గీ. తల్లియొడి నుండి కాలిడి ధరణి పైన
అడుగు వేసెడి బుజ్జాయి బడికి రాగ
అయ్యవారల చేత అ, ఆ లు గఱపి
బ్రతుకు గృహసీమకు నంపు పాఠశాల
భావం : తల్లి ఒడి దిగి బుడిబుడి అడుగులు వేస్తూ పసివాడు బడికి వస్తాడు. అది అతనికి ఉపాధ్యాయుల చేత చదువు, ‘సంస్కారం నేర్పి కొత్త జీవితాన్నిస్తుంది.
సూక్తి : మనిషి వ్యక్తిత్వానికి అతని నీతి, నిజాయితీలే గీటురాయి.
పద్యాలు – ప్రతిపదార్థాలు – భావాలు
1న పద్యం:
క. ఏ ఎమ్మెయి నుత్తమ వి
జ్ఞానోన్నతి వడయుటకు నిజం బగు మూలం
బైనది గలదొక ధర్మము
భూనుత ! యది నీకు దృష్టముగ నెఱిఁగింతున్.
భూనుత = భూమి యందలి ప్రజల చేత పొగడబడిన ఓ కౌశిక మునీ!
ఏను = నేను
ఈ + మెయిన్
ఇమ్మెయిన్ = రీతిగా
ఉత్తమ = గొప్పదైన
వజజ్నాన + ఉన్నతి
విజ్ఞానోన్నతి = గొప్ప జ్ఞానంలోని ఆధిక్యం
వడయుటకున్ = పొందటానికి
నిజంబు + అగు
నిజంబగు = సత్యమైన
మూలంబు + ఐనది
మూలంబైనది = ఆధారమయినది
ఒక ధర్మం = ఒక ధర్మం (మంచి పనులు చేయడానికి మూలమైన ఆశయానికి ధర్మం అని వ్యపదేశం)
అది = ఆ ధర్మం
నీకు = నీకు
దృష్టముగన్ = కంటికి కనిపించేటట్లుగా (ప్రత్యక్షంగా)
ఎఱిఁగింతన్ = తెలుపగలను
(ఈ పద్యానికి ఆయువు పట్టు అని చెప్పదగిన శబ్దం “దృష్టముగ”)
భావం : ఓ కౌశిక మహర్షీ ! నీవు నన్ను సర్వజ్ఞుడవంటూ అభినందించావు. నేను ఇంతటి విజ్ఞానాన్ని పొందడానికి మూలమైన ధర్మం ఒకటి ఉంది. ఆ ధర్మాన్ని నీ కంటికి కనిపించే విధంగా తెలియజేస్తాను.
2 వచనం:
వ. అభ్యంతరగృహంబునకు రమ్మని యతనిం దోడ్కొని
చని మనోహరంబై చతుశ్శాలంబై వివిధసారభసం
వాసితం బైన హర్మ్యంబునందు మహితాసనాసీనులైన
వారిం దన జననీజనకుల నభిమతాహారపరితోషితులఁ
బరమాంబరాభరణ గంధమాల్యాలంకృతమూర్తుల
నతనికిం జూపి, తానును దత్పాదప్రణామంబు సేసి,
వారలఁ గుశలం బడిగిన, నెయ్యిరువురుం బుత్తునకిట్లనిరి.
ప్రతిపదార్థం :
అభి + అంతర అభ్యంతర గృహంబునకున్ = లోపల ఉన్న గదిలోకి
రమ్ము + అని
రమ్మని = దయచేయుము అని ఆహ్వానించి
తోడ్కొని = వెంటబెట్టుకొని
చని = వెళ్ళి
మనః +హరంబు + ఐ
మనోహరంబై = మనస్సును ఆకర్షించేదై (అందమైనదై)
చతుః +శాలంబు+ఐ
చతుశ్శాలంబై = నాలుగువైపులను వాకిళ్ళు కలిగినదై
వివిధ = పెక్కు
సౌరభ = పరిమళాల చేత
సంవాసితంబు + ఐన
సంవాసితంబైన = గుభాళించేదైన
హర్మ్యంబున + అందున్
హర్మ్యంబునందున్ – మేడపై
మహిత + ఆసన + ఆసీనులు + ఐన
మహితాసనాసీనులైన = గొప్ప గద్దెలపై కూర్చొని ఉన్న వారలను
తన జననీ-జనకులను = తన తల్లినితండ్రిని
అభిమత + ఆహార – పరితోషితులన్
అభిమతాహార – పరితోషితులన్ = వారికి ఇష్టమైన ఆహారం తినటం చేత సంతృప్తి చెంది ఉన్నట్టివారలను
పరమ + అంబర + ఆభరణ
పరమాంబరాభరణ = గొప్పవైన వస్త్రాలు, ఆభరణాలు
గంధ = పరిమళ ద్రవ్యాలు
మాల్య + అలంకృత మూర్తులన్
మాల్యాలంకృత మూర్తులన్ = పువ్వులతో అలంకరింపబడిన దేహాలు కలవారలను
అతనికిన్ + చూపి
అతనికిజూపి = ఆ కౌశికుడికి చూపించి
తానును = ధర్మవ్యాధుడును
తత్ + పాద = ఆ తల్లిదండ్రుల పాదాలకు
ప్రణామంబు + చేసి
ప్రణామంబుసేసి = మ్రొక్కి
వారలన్ = వారిని
కుశలంబు = క్షేమంగా ఉన్నారా అని
అడిగినన్ = ప్రశ్నించగా
ఆ + ఇరువురున్
అయ్యిరువురున్ = ఆ తల్లిదండ్రులు ఇద్దరున్నూ
పుత్రునకున్ = కొడుకుతో (ధర్మ వ్యాధునితో)
ఇట్లు + అనిరి
ఇట్లనిరి = ఈ విధంగా అన్నారు
భావం : అంటూ ధర్మవ్యాధుడు కౌశిక మహర్షిని సగౌరవంగా తన ఇంటిలోకి తీసుకువెళ్ళాడు., నాలుగువైపుల నుండి సుగంధములు వెదజల్లుతున్న ఆ భవనములో ఉన్న.
3వ పద్యం :
అన్న! కుమార! నీ యట్టి సత్పుత్తుండు
గలుగ మా కేమిటఁ గడమ సెపుమ!
నీ చేయు ధర్మంబ నీకుఁ చోడయ్యెడుఁ
బరమాయు రర్థ సంపదలుఁ గనుము;
నీ చరిత్రంబున నిఖిలవంశముఁ బవి
త్రితమయ్యె మానుషదేహమేల
ధరియించితో కాని తత్త్వమారయఁ బర
దేవత వీవు; సందియము వలదు;
తే. వాజ్మనఃకర్మములఁ బితృవత్సలత్వ
మొక్క రూపుగఁ జలుపుచు నున్నయట్టి
సద్గుణాకరు నిన్నేన్ని జామదగ్న్యు
నొకని వెన్నంగఁ దగుఁ గాక యొరులు గలరె!
ప్రతిపదార్థం :
అన్న! = ప్రియమైన వాడా!
కుమార! = కుమారుడా !
నీ + అట్టీ
నీయట్టి = నీ వంది
సత్ + వుత్తుండు
సత్పుత్తుండు =మంచి కొడుకు
కలుగన్ = కలుగగా
మాకున్ + ఏమిటన్
మాకేమిటన్ = మాకు ఎందులో
కడమ + చెపుమ
కడమసెపుమ = కొదువ కలదో చెప్పుము. (అనగా మాకు ఎట్టి లోటును లేదు అన్నమాట)
నీ చేయు ధర్మంబు+అ
నీ చేయు ధర్మంబ = నీవు ఆచరించే ధర్మమే
నీకున్ = నీకు
తోడు + అయ్యెడున్
తోడయ్యెడున్ = సాయం ఔతుంది
పరమ + ఆయుః + అర్థ
పరమాయురర్థ = గొప్పదైన ఆయుర్దాయం (చిరకాలం బ్రతకటం)
సంపదలున్ + కనుము
సంపదలుఁగనుము = ధనం, ఐశ్వర్యాలు పొందుము
నీ చరితంబున = నీ ఏ్రవర్తన వలన
నిఖిల వంశమున్ = మన వంశం అంతయు
పవితము + అయ్యెన్
పవిత్రమయ్యెన్ = పావనం అయింది (నీవు)
మానుష దేహము = మనుజుడిగా పుట్టి మనుజుని = శరీరాన్ని
ఏల = ఎందుకు ?
ధరియించితివి + ఓ
ధరియించితివో ధరించావో
కాని = కాని
తత్త్వము = నిజము
ఆరయన్ = పరిశీలించగా
పరదేవతవు + ఈవు
పరదేవతవీవు = నీవు దేవతలలో కెల్ల గొప్ప. దేవతవు
సందియము వలదు = ఎట్టి అనుమానానికి ఆస్కారం లేదు
వాక్ + మనస్ + కర్మములన్
వాజ్మనః కర్మములన్ = త్రికరణ శుద్ధిగా (వాక్కు తోడ, మనస్సు తోడ, ఆచరణ యందును)
పితృవత్సలత్వము = తల్లిదండ్రులపై ప్రేముడి
ఒక్కరూపుగన్ = ఎడతెగకుండగ ఒకే మాదిరిగా
చలుపుచున్ + ఉన్న + అట్టి
చలుపుచునున్నయట్టి = కొనసాగిస్తూన్న
సత్ + గుణ + ఆకరున్
సద్గుణాకరున్ = మంచి లక్షణాలకు నెలవైన వాడిని
నిన్నున్ + ఎన్ని
నిన్నెన్ని = నిన్ను పరిగణనం చేసి
జామదగ్త్యున్ = జమదగ్నికొడుకు అయిన పరశురాముడిని
ఒకనిన్ = మయొకడిని
ఎన్నంగన్ + తగున్ + కాక
ఎన్నంగcదగుఁగాక = లెక్కించటం తగునె కాని
ఒరులు =ఇతరులు
కలరె =ఉన్నారా ? (లేరని భామము) }
భావం : ప్రియమైన కుమారా ! నీ వంటి ఉత్తముడు కుమారుడై ఉండగా మాకేమి లోటు ఉంటుంది. నీవు పాటించే ధర్మం నిన్ను రక్షిస్తోంది. చక్కని సంపదలతో చిరకాలం జీవించ గలవు. నీ ప్రవర్తన చేత మన వంశం పవితమైంది. మానవడిగా జన్మించావే గాని దేవతలలో గొప్ప దేవతవు. అనుమానంలేదు. మనస్సు, మాట, ఆచరణల చేత తల్లిదండ్రులను (పేమిస్తున్నావు. ఉత్తమ గుణవంతుడవైన ని గురించి చెప్పి, తర్వాత పరశు రాముని గురించి చెప్పాలి. మరెవ్వరు నీకు సాటిరారు.
4 వచనం :
వ॥ అని పలికి; రప్పుడు ధర్మవ్యాధుండు వారికిం గౌశికుం
జూపి, ‘యిమ్మహాత్ముండు మనల (జూచువేడ్కనిటవచ్చె’
నని చెప్పిన నా వృద్ధులతనికి నర్హసత్కారంబులు
గావించినం, గైకొని, యతండు వారలఁ గుశలంబడిగె;
నంత నవ్విప్రునకు లుబ్దకుండిట్లనియె.
ప్రతిపదార్థం :
అని పలికిరి = అని అన్నారు
అప్పుడు = ఆ సమయంలో
ధర్మవ్యాధుండు = ధర్మవ్యాధుడు
వారికిన = తన తల్లిదండులకు
కౌశికున్ + చూపి
కౌశికుంహి = కాశికుడిని చూపించి
ఈ మహా + ఆత్ముండు
ఇమ్మహాత్ముండు = గొప్ప ఆత్మ కలవాడైన బ్రాహ్మణుడు
మనలన్ = మనలను
చూచువేడ్కన్ = దర్శంచవలెననే చుతూహలంతో
మనలన్ = మనలను
చూచువేడ్కన్ = దర్శించవలెననే కుతూహలంతో
ఇట + వచ్చెన్
ఇటవచ్చెన్ = ఇచటికి వచ్చాడు
అని చెప్పినన్ = అ ముదుసలులు
ఆ వృద్ధులు = ఆ కౌశిడికి
అతనిక్న్ = తగిన గౌరవ మర్యాదలు
అర్హసత్కారంబులు
కావించినన్ = చేయగా
కైకొ = స్వకరించి
అతండును = అతడును (కాశికుడును)
వారలన్ = వారలను అనగా ఆ వృద్ధులను
కుశలంబు + అడిగెన్
కుశలంబడిగెన్ = యోగ క్షేమాలను గూర్చి ప్రశ్నంంచా
అంతన్ =తదుపరి
లుబ్దకుండు = ధర్మవ్యాధుడు
ఆ + వి(పునకు
అవ్వి(పునకు = ఆ బ్రాహ్మణుడితో (కాశికునకు)
ఇట్లు + అనియెన్
ఇట్లనియెన్ =విధంగా అన్నాడు
భావం : అని పలికిన తల్లిదండులకు ధర్మవ్యాధుడు కౌశికుని చూపించాడు. వారితో ఈ మహానుభావుడు మనల్ని చూడాలనే కోరికతో ఇక్కడికి వచ్చాడని చెప్పాడు. ఆ వృద్ధులు కాశికుడికి స్వాగత మర్యాదలు చేశారు. కౌశికుడు వారి యోగక్షమాలను అడిగాడు. తర్వాత ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అన్నాడు.
5వ పద్యం :
సీ. జననుత! వీరు నా జననియు జనకుండుఁ
జూవె! వీరలకు శుశ్రూష సేసి
యిట్టి పరిజ్ఞాన మేముఁ బ్రాపించితి
నమరులఁ బూజింతు రర్థి వెల్ల
వారును; నొండు దైవంబుల నెఱుఁగః నీ
వృద్ధుల నాపాలి వేల్పు లనఘ!
కమనీయ ఫలపుష్పగంధభూషణవస్త్ర
ములు మనోహరభక్ష్యభోజ్యములును
తే. వీరి కెపుడు నివేదింతు, వేడ్కఁ బుత్ర
దారసహితుండనై నియతముగ సేవ
యాచరింతును; వేదముల్ యజ్ఞములు ప్ర
తంబులుమ వీర నాకను తలఁపు దృఢము.
ప్రతిపదార్థం :
జననుత ! = ప్రజలచేత కీర్తించబడినవాడా! కౌళిక మునీ!
వీరు = ఈ పెద్దలు
నా జననియు, జనకుండున్ = నా తల్లి గారు, తండ్రి గారు
చూవె = సుమ్ము
వీరలకు = వీరికి
శుశూష = పరిచర్య
చేసి = సలిపి
ఇట్టి = ఈ విధమైన
పరిజ్ఞానము = గొప్ప జ్ఞానం
ఏనున్ = నేనును
ప్రాపించితిన్ = పొందాను
ఎల్లవారును = అందరును
అర్థిన్ = కోరికతో
అమరులన్ = దేవతలను
పూజింతురు = అర్చిస్తారు
ఒండుదైవంబులన్ = వేరే దేవతలను
ఎఱుఁగన్ = నేనెరుగను
ఈ వృద్ధులు + అ
ఈ వృద్ధుల = ఈ ముదుసలి వారే
నా పాలి వేల్పులు = నాకు లభించిన దేవతలు
అనఘ = పాపం చేయనట్టి ఓ పణ్యాత్ముడా! కమనీయ, ఫల, పషష్,, గంధ,
భూషణ, వస్త్రములు = కమ్మని పండ్లు, హూలు, పరిమళ ద్రవ్యాలు, నగలు, బట్టలు
మనః + హర – ధక్ష్య, ధోజ్యములు
మనోహర భక్ష్మ, భోజ్యములు = మనస్సుకు అనువైన తినుబండారాలు
వీరికిన్ = వీరికి
ఎపుడున్ = ఎల్లప్పుడును
నివేదింతున్ = సమర్పిస్తాను
వేడ్కన్ = కుతూహలంతో
పుత్ర, దార, సపితుండను + ఐ
పతత, దార, సపితుండనై = కొడుకులతో, భార్యతో కూడిన వాడనై
నియతముగన్ = దీక్షతో
సేవ = పరిచర్య
ఆచరింతును = చేస్తాను
వేదముల్ = వేదాలు
యజ్ఞ్రముల్ = క్రతువులు
వ్రతంబులును = నోములును
నాకున్ = నాకు
(వీరు+అ)-వీర = వీరే
అను-తలcపు = అనే ఆలోచన
దృఢము = గట్టిది
భావం : ప్రజల చేత గౌరవింపబడేవాడా ! వీరు నా తల్లిదండులు. వీరికి సేవ చేయడం వల్ల మాత్రమే నాకు గొప్ప జ్ఞానం లభించింది. సాధారణంగా లోకంలో అందరూ కోరికతో దేవతల్ని పూజిస్తారు. నా తల్లిదండ్రులే నా పాలిటి దేవతలు. వేరే దేవతల గురించి నాకు తెలియదు. వీరికి రుచికరమైన పండ్లు, పూలు, గంధం, అందమైన నగలు, వస్తాలు, ఇష్టమైన ఆహారపదార్థాలను అందిస్తాను. నా ఆలుబిడ్డలతో కలిసి సేవ చేస్తుంటాను. అలా సేవించడం వల్ల వేదాధ్యయనం, యజ్ఞాలు, వ్రతాలు చేసిన ఫలితం వస్తుంది.
6వ పద్యం :
తే, జనని జనకుఁడు సద్గురుఁడ నలుఁ డాత్ముఁ
డనఁగ నియ్యేవురును నే గృహస్థుచేత
సుగతివాంఛఁ బ్రసాదితు లగుదు రట్టి
వాఁడ నూనె ధర్మాత్ముండు వసుధమీఁద.
ప్రతిపదార్థం :
జనని = తల్లి
జనకుండు = తండ్రి
సత్ + గురుఁడు
సద్గురుcడు = మంచి గురువు
అనలుడు = అగ్ని
ఆత్ముcడు = ఆత్మ
అనఁగన్ = అని చెప్పబడెడి
ఈ + ఏవురును
ఇయ్యేవురున్ = ఈ అయిదుగురున్నూ
ఏ గృహస్థుచేతన్ = ఏ ఇంది యజమాని చేత
సుగతివాంఛన్ = పుణ్యం లభించవలెననే కోరికతో
ప్రసాదితులు + అగుదురు
ప్రసాదితులగుదురు = సంతోషం పొందించబడిసవారు అగుదురో
అట్టివాడు+అ+చూవె
అట్టివాడ సూవె = అట్టివాడే సుమా!
వసుధమీఁదన్ =భూమిపై
ధర్మ + ఆత్ముండు
ధర్మాత్ముండు = ధర్మంతో కూడిన అత్మ కలవాడు (సుకృతుడు)
భావం : ఈ భూమి.పై పణణ్యాన్ని కోరీ గృహస్థుడు- తల్లి, తండ్రి, గురువు, అగ్ని, అత్మ అనే అయిదుగురిని పూజించి సంతోషపరచాలి. అలాంది గృహస్థుడే ధర్మాత్ముడు.
7 వచనం:
వ. అని చెప్పి యిట్లనియెఁ: ‘బతీవ్రత పనుపునం జేసి
నీవు ధర్మజ్ఞానార్థంబు నాయున్నయెడకుం జనుదెంచిన
నస్పతివ్రతవలని యమగ్రహంబున నీకు వెల్లవియు
నెఱింగించితిఁగాని, నీదెస నాడు చిత్తంబు ప్రియంపడి
యుండదు; నీచేసిన యకార్యంబొక్కటి గల దడి
యెయ్యది యనిన;
ప్రతిపదార్థం :
అని చెప్పి = అని పలికి
ఇట్లు + అనియెన్
ఇట్లనియెన్ = విధంగా పలికాడు
పతివ్రత = గొప్ప ఇల్లాలి యొక్క
పనుపునన్ + చేసి
పనుపునం జేసి = నియోగం వలన
నీవు = నీవు
ధర్మ-జ్ఞాన + అర్థంబు
ధర్మ జ్ఞానార్థంబు = ధర్మాన్ని గూర్చిన జ్ఞానాన్ని పొందటానికై
నా+ఉన్న+ఎడకున్
నాయున్న యెడకున్ = నేను ఉన్నచోటికి
చనుదెంచినన్ = రాగా
ఆ + పతివ్రత వలని = ఆ మంచి ఇల్లాలి యొక్క
అనుగ్రహంబునన్ = దయ వలన
నీకున్ = నీకు
ఎల్లవియున్ = సర్వమును
ఎఱింగించితిన్ =తెలిపాను
కాని =అంతేకాని
నీ దెసన్ = నీ యెడ
నాదు – చిత్తము = నా మనస్సు
ప్రియంపడి ఉండదు = ప్రితిని చెంది యుండలేదు
నీ చేసిన = నీవు ఒనర్చిన
అకార్యంబు = చెడ్డపని
ఒక్కటి కలదు = ఒకటి ఉన్నది
అది + ఏ + అది + అనినన్
అదియెయ్యదియనినన్ = ఆ(కార్యం) ఏది అని అడిగితే
భావం : అని చెప్పి ధర్మవ్యాధుడు ఇలా అన్నాడు. కౌశిక మహర్షీ! నీవు నా వద్దకు పతివ్రత పంపగా వచ్చావు. ధర్మాన్ని గురించిన జ్ఞానాన్ని పొందాలని భావిస్తున్నావు. అమెపై ఉన్న గౌరవం కారణంగా ధర్మమార్గాన్ని వివరిస్తాను. ‘నీపై ఉన్న ఇష్టం కాదు. నువ్వాక చేయకూడని పని, చేశావు కనుక నువ్వంటే నాకిష్టం లేదు. అదేమిటంటే …….
8వ పద్యం:
*ఉ. ఎంతయు వృద్ధులై తమకు నీ వొకరుండవ తెప్ప గాఁగ్ర న
త్యంతముదంబునన్ బ్రదుకు తల్లిని దండ్రిని నుజ్జగించి ని
శ్చింతుఁడవై సదాధ్యయనశీలత వారి యనుజ్ఞ లేక యే
కాంతమ యెమ్మెయిన్ వెడలితక్కట! నీవు గరంబు క్రూరతష్
ప్రతిపదార్థం :
ఎంతయున్ = మిక్కిలి
వృద్ధులు + ఐ
వృద్ధులై = ముసలివారై
తమకున్ = మీకు
నీవు + ఒకరుండవు + అ
నీవొకరుండవ = నీవు ఒక్కడవు మాత్రమే
తెప్పకాఁగన్ = ఆధారం కాగా (తెప్ప = నదిని దాటే ఉడుపం)
అతి + అంత
అత్యంత = మిక్కిలి
ముదంబునన్ = సంతోషంతో
బ్రదుకు = జీవించే
తల్లినిన్ + తండ్రినిన్
తల్లినిదండినిన్ = తల్లిని, తండ్రిని
ఉజ్జగించి = వదలిపెట్టి
అక్కట = అయ్యూ!
నిశ్చింతుడవు + ఐ
నిశ్చింతుడవై = విచారం లేనట్టి పాడవై
సదా+అధ్యయన-శీలతన్
సదాధ్యయన-శీలతన్ = ఎల్లప్పుడును వేదాలను వల్లె వేసే స్వభావం చొప్పున
వారి + అనుజ్ఞ్ఞ – లేక
వారియనుజ్ఞ లేక = ఆ తల్లిదండుుల యొక్క అనుమతి లేకుండా
ఏక + అంతము + అ
ఏకాంతము = ఒంటరిగా.
ఏ + మెయిన్ = ఏ రీతిగా
ఎమ్మెయిన్ = నీవు
నీవు = మిక్కిలి
కరంబు = కఠినత్వంతో
క్రూరతన్ = వెళ్ళావు.
భావం : కౌశిక మహర్షీ! నీ తల్లిదండ్రులు వృద్ధులు. వారు నీ పై ఎంతో โపేమతో జీవిస్తున్నారు. వారికి నీవే ఆధారం. కాని నీవు వేదాధ్యయనం చేసి జ్ఞానాన్ని పొండాలని భావించావు. తల్లిదండ్రుల అనుమతి లేకుండా వారిని వదలిపెట్టావు. వారి స్థితిగతులను గురించి ఎలాంటి విచారణ చేయలేదు. ఈ కఠినమైన నీ ప్రవర్తన నాకు నచ్చలేదు.
9వ పద్యం :
ఆ. నీక వగచి వగచి నిర్భిన్నహృదయులై
విగతచక్షులైరి వినవె ? వారః
లరిగి యింక నైన నమ్ముదుసళ్ల యు
దగ్రశోకవహ్ని నార్పవయ్య!
ప్రతిపదార్థం :
నీకున్ + అ
నీక = నీ కోసమే
వగచివగచి = మిక్కిలి దుఃఖించి
నిర్భిన్నహృదయులు + ఐ
నిర్భిన్న హృదయులై = పగిలిన గుండెలు కలపారై
వారు = నీ తల్లిదండ్రులు
విగతచక్షులు + ఐరి
విగతచక్షులైరి = పోయిన కన్నులు కలవారు అయ్యారు. (గుడ్డివారలయ్యారు)
వినవె ? = ఆలకించవా ?
అరిగి = వెడలి
ఇంకన్ + ఐనన్
ఇంకనైనన్ = ఇక మీదటనైన
ఆ + ముదుసళ్ళ
అమ్ముదుసళ్ళ = ఆ వృద్ధుల యొక్క
ఉత్+అగ్ – ఉదగ్ =గొప్పదైన
శోకవహ్నిన్ = దుఃఖమనెడి అగ్నిని
ఆర్పవయ్య = ఉపశమింపచేయుము
భావం : నీవు విడిచి వెళ్ళిన మరుక్షణం నీ కోసం నీ తల్లిదండులుు గుండెలు పగిలిపోయేటట్లుగా ఏడ్కి ఏడ్చి అంథు లయ్యారు. ఇప్పటికైనా నీవు వెళ్ళి వారి దుఃఖన్ని చల్లార్చు.
10వ పద్యం :
నీయధ్యయనమ్మును సుకృ
తాయాసము నిష్ఫలంబులై చను గురుసే
వాయుక్తి లేక తక్కినఁ
శేయుము నాపలుకు, మేలు సేకుఱు నీకున్.
ప్రతిపదార్థం :
నీ+ధ్యయనమ్మును
నీయధ్యయనమ్మును = నీ చదువున్నూ
సుకృత+అయాసము
సుకృతాయాసము = పుణ్యాన్ని ఆర్జించటానికై పడెడి శ్రయమున్నూ
గురు సేవా యుక్తి లేక తక్కినన్ = తల్లిదండ్రుల పరిచర్య లేకపోతే
నిష్ఫలములు + ఐ :
నిష్ఫలములై = ఫలం లేనట్టివి అయి అనగా వ్యర్థాలై
చనున్ = పోతాయి
నా పలుకు చేయుము = నేను చెప్పిన విధంగా నడుచుకొనుము
నీకున్ = నీకు
మేలు = శుభం
చేకుఱున్ = కలుగుతుంది
భావం : నువ్వు సంపాదించిన విద్య గానీ, పుణ్యం కోసం నువ్వు పడే เశమగానీ, తల్లిదండ్డుల సేవ చేయకపోతే వ్యర్థమవుతాయి. కాబట్టి నేను చెప్పిన విధంగా ఆచరించు. నీకు మేలు కలుగుతుంది.
11 వచనం:
అనిన గ్రాశికుం డతని కిట్లనియె
ప్రతిపదార్థం :
అనిన్ = అని పల్కుగా
కౌశికుడు = కౌశికముని
అతనికి = దర్మ వ్యాధునితో
ఇట్లు + అనియె
ఇట్లనియె = ఈ విధంగా పల్కెను.
భావం : అది విన్న కౌశికుడు ధర్మ వ్యాధునితో ఇలా అన్నాడు.
12వ పద్యం :
క. ఇది యట్టిద నీ చెప్పిన
సదమలహితవాక్యభంగి సకలము వింటిన్;
వదలక యిమ్మెయిన చరిం
చెద గురుజవములకుఁ బ్రీతిఁ జేసెద వనఘా!
ప్రతిపదార్థం :
అనఘా ! = పాపం లేనట్టి వాడా ! (ఓ ధర్మవ్యాధుడా !)
ఇది = నీవు చెప్పింది
అట్టిది + అ
అట్టిద = అటువంటిదే, నిజమే
సత్ + అమల
సదమల = మంచివి (పవిత్రమైన), స్వచ్ఛమైనవి
హిత-వాక్యభంగి = మేలు చేకూర్చేవి అయిన
మాటల తీరు
సకలమున్ = అంతయును
వింటిన్ = ఆలకించాను
వదలక = విడిచిపెట్టక
ఈ + మెయిన్ + అ
ఇమ్మెయిన = విధంగానే
చరించెదన్ = నడుచుకుంటాను
గురుజనములకున్ = పెద్దలైన తల్లిదండులు
ప్రీతిన్ = సంతోషాన్ని
చేసెదన్ = కల్గిస్తాను
భావం : ఓ పుణ్యాత్ముడా ! నీవు చెప్పిన మాటలు సరైనవి. శేష్తమైనవి. మేలు కలిగించేవి. వాటిని కశద్ధగా విన్నాను. తప్పక ఆచరిస్తాను. తల్లిదండ్రులను సేవించి తరిస్తాను.
13వ పద్యం:
క. నాదైన భాగ్యవశమునఁ
గాదే నీతోడి చెలిమి గలిగెం, బరమా
హ్లాదమనస్కుఁడ వైతి, శు
భోదయముల కెల్ల నింక యుక్తుఁడ నైతిన్
ప్రతిపదార్థం :
నాదు + ఐన
నాదైన = నాకు సంక్రమించిన
భాగ్య-వశమునన్+కాదు+ఎ
భాగ్యవశమునcగాదె = అదృష్టం వల్లనే కదా !
నీతోడ చెలిమి= నీతో స్స్రాం
కలిగెన్ = ఏర్పడింది
పరమ + అహ్లాద
పరమాహ్లాద = మిక్కుటమైన సంతోషంతో నిండిన
మనస్కుఁడన్ + ఐతిన్
మనస్కుడనైతిన్ = మనస్సు కలవాడను అయినాను
శుభ + ఉదయములకున్ + ఎల్లన్
శుటోదయములకునెల్లన్ = మేలు కలిగించే వాటికన్నిటికిని
యుక్తుఁడను + ఐతిన్
యుక్తుcడనైతిన్ = యోగ్యుడిని అయినాను
భావం : నీతో స్నేహం కలగటం నా అదృష్టం. నా మనస్సు అమితమైన సంతోషంతో నిండింది. నాకు కలగటోయే శుభాలన్నిందికి ఇది సూచకం.
14వ పద్యం :
*చ. అనుపమ మెట్టివారలకు నందదు ధర్మపథంబు ధాత్రిలో;
విను, పది వేపురందొకఁడు విశ్రుతధర్మపరాయణుండు గ
లునొ కలుగండొ సందియము; గోరి సనాతనధర్మమూఁది యె
వ్వనికిని నీకుఁ బోలె బుధ వత్సల! యిట్లు చరింపవచ్చునే.
ప్రతిపదార్థం :
బుధవత్సల ! = జ్ఞానుల చేత ఆదరించబడడి వాడా!
విను = అలకింపుము
ధాత్రిలోన్ = లోకములో
ధర్మపథంబు = ధర్మంతో కూడిన మార్గం
అనుపమము = సాదిలేనిది
ఎట్టివారలకున్ = ఎటువంద మనుజులకు ఐనను
అందదు = దొరకదు
పదివేవురు + అందున్ + ఒక్కడు
పదివేవురందొకఁడు = పదివేలమంది మనుజులలో ఒక్కడు
విశ్రుత ధర్మ పరాయణ్చండు = కీర్తికి ఎక్కిన ధర్మ|్రతుడు అనగా ధర్మాన్నే ఎల్లప్పుడు పాదించేవాడు అనే పేరు, ప్రతిష్ఠలు అర్ష్రించినవాడు
కల్గును + ఓ
కల్లునో = కలుగునా?
కలుగండు
కలుగండో = కలుగడా?
సందియము = సంశయింపవలసింది
కోరి = పూనికతో
సనాతన ధర్మము + ఊది
సనాతన ధర్మమూది = ఏ్రాచీన కాలం నుండి
అనుస్యూతంగా ఆచరింప బడుతున్న ధర్మాన్ని తెలిసి ఝ్రహించి
ఇట్లు = ఈ విధంగా
ఏ + వనికిని
ఎవ్వనికిని = ఏ మనుజుడికి ఐనను
నీకున్ + ఓోలెన్
నీకుఁదోలెన్ అచరిస్తున్న విధాన్ని పోలి
చరింపవచ్చున్+ఏ ?
చరింపవచ్చునే = నడవడిక తీర్చిదిద్చుకొనటానికి వీలు ఉన్నదా ?
భావం : జ్ఞానుల చేత ఆరాధింపబడే ఓ ధర్మవ్యాధుడా! ధర్మమార్గం సాటిలేనిది. భూమిపై నివసించే పదివేలమందిలో ఏ ఒక్కడైనా ధర్మాచరణకు పూనుకొంటాడో, లేదో సందేహమే. నీలాగా ప్రయత్నపూర్వకంగా ధర్మాన్ ప్రమాణంగా స్వీకరించి ఆచరించేవాడు ఉండడు.
అదనపు భాషాంశాలు
పర్యాయపదాలు
ధర్మము : పాడి, దమ్మము, అభ్రేషము
నిజము : సత్యము, నిక్కము, యథార్థము
జ్ఞానము : అఫిజ్ఞ్రానము, ఎల్లక, సంభూతి
గృహము : గీము, ఇల్లు, అగారము, గేహము
సౌరథము : పరిమళము, క్రాత్తావి, గంధము, తావి, నెత్తావి
మనోహరము : అన్నువ, ఇంప, ఇమ్ము, నయగారము, రమణీయము
హర్మ్యము : మేడ, ప్రాసాదము, భవనము, మాళిగ, సౌధము
జనన : తల్లి, అమ్మ, అంబ, మాత
జనకుడు : తండ్రి, నాన్న, అప్ప, అయ్య
పుత్తుడు : కుమారుడు, కొడుకు, తనయుడు
మాల : హారము, గొలుసు, లలంతిక, సరము
సంపద : ఆస్తి, ఐశ్వర్యము, కలిమి, థాగ్యము, సొమ్ము
చరిత్ర : కథ, ఇతివృత్తము, కత, కద, చరితము
వంశము : కులము, అన్వయము, కొలము, గోత్రము, వర్గము, వర్ణము, సంతతి, స్పోతస్సు
దేహము : శరీరము, కాయము, గాత్రము
మానుషుడు : మనుష్యుడు, జనపదుడు, దేహవంతుడు, పుమాంసుడు, భూమి స్ప్క్కు, మనిషి, మనుజుడు, మానిసి
తత్వము : స్వభావము, అంతఃప్రకృతి, ప్రవృత్తి, సత్వము
సందియము : సందేహము, అనుమానము, సంశయము, శంక, వితర్కము, ఆతంకము
పాక్కు : మాట, ఉక్తి, పలుకు, భాషితము, వచనము, వాణి
మనస్సు : అంతఃకరణము, అంతరంగము, అస్వాంతము, ఎద, ఎడద, డెందము, హృదయము, స్వాంతము
కర్మము : పని, కర్జము, కార్యము, కృత్యము, క్రియ
జామదగ్ని : పరశురాముడు, ఖండ పరుశువు, భార్గవుడు, ఱృగునందనుడు
సల్కారము : గౌరవము, సన్మానము, సపర్య, సత్కృతము
విప్పడు : ట్రాహ్మణుడు, బాపడు, అగ్నిముఖుడు, ద్విజన్ముడు, ధరణీసురుడు, ధూదేవుడు
శశ్రూష : సేవ, ఉపచర్య, ఉపచారము, కైంకర్యము, సంసేవ, సపర్య
అమరులు : నిర్జరులు, దేవతలు, అజరులు, ఆదితేయులు, ఖచరులు, దివిజులు, వేల్పులు
పుషుము : పువ్వ, అలరు, కుసుమము, పువ్వారు, పూవు, ప్రసూనము, లతాంతము, సుమము, విరి
గంధము : పరిమళము, అధివాసము, క్రొత్తావి, తావి, నెత్తావి, సుహాసన, సౌగంధ్యము
భూషణము : ఆభరణము, కలాపము, తొడవు, నగ, మండనము, రవణము
వస్త్రము : అంబరము, అంశుకము, దుకూలము, పుట్టము, వలువము .
దార : భార్య, అర్ధాంగి, ఇల్లాలు, కళత్రము, గృహిణి, పెండ్లాము, రమణ, సహ ధర్మచారిణి
వాంఛ : కోరిక, అపేక్ష, ఆకాంక్ష, ఆసక్తి, కామన
వసుధ : భూమి, ధరణి, ధాత్రి, పుడమి, పృథ్వి
పతివ్రత : కొత్తడి, ధర్మచారిణి, సతి, సాధ్వి, కుల్య
అనుగ్రహము : దయ, అక్కటికము, అక్కసము, అను కంప, అనుగ్రహణము, కరుణ, సానుభూతి
వృద్ధులు : గతాయువులు, జినులు, జీనులు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, మూడుకాళ్ళ ముసళ్ళు
ముదము : సంతోషము, అభినందనము, ఆనందము, ఆహ్లాదము, ఎలమి, కౌతుకము, తోషము, నెమ్మి, పరితోషము, ప్రమోదము
చింత : దుఃఖము, అంగలార్చు, అనుశోకము, ఖేదము, శోకము, సంతాపము, వ్యథ
అధ్యయనము : అధీతి, అధ్యాయనము, అనుసంధానము, అఫ్యసనము
కూరము : వేడి, అంగారము, అక్కసము, ఉష్ణము, కాక, కృశము, తీండ్ర, తీక్ష్చు
చక్షువు : కన్ను, అంబకము, అక్షి, ఈక్షణము, దృక్కు, దృష్టి, లోచనము
అంధత్వము : గ్రుడ్డి, ఆంధ్యము
శోకము : దుఃఖము, ఏడ్పు
వహ్ని : అగ్ని, అంగారకము, అగ్గి, అనలము, ఇంగలము, ఇంగిలము
గురువు : అధ్యాపకుడు, ఉపాధ్యాయుడు
చెలిమి : స్నేహము, కూర్మి, చెలికారము, నెయ్యము, నేస్తము, (పేముడి, మైత్రి, సఖ్యము
పథము : దారి, గమథము, మార్గము
సనాతనము : తనము పురాతనము, ప్రాక్తనము, ప్రాచీనము
వత్సము : దూడ, (క్రేప), లేగ, పెయ్య
నానార్థాలు
ధర్మము – స్వభావము, న్యాయము, పుణ్యము, విల్లు, ఆచారము, యాగము
సలుము – సత్యము, విధము
సౌరథవా – ఎద్దు, స్నేహము, కుంకుమ, పరిమళము
మనోహరము – బంగారము, రమణీయము
మాల – చండాలుడు, వరుస, హారము, హూలమలాల
సంపద – ఆస్తి, లక్ష్మి
చరిత్ర – ఏ్రవర్తన, కథ
మాక్కు – మాట, వాణి
మనసు – కోరిక, ఏపేమ, ఉద్దేశము
సత్కారము – గౌరవము, ధోజనము
ఫలము – పండు, బుడ్డ, ప్రయోజనము, ఉద్దేశము, పంట, లాభము, బాణము, బాణపు ములికి, డాలు
గంధము – గర్వము, సంబంధము, పరిమళము, చందనము
చింత – తింత్రిణి, దుఃఖము
అగ్ని – అగ్నిహెూతము, బంగారము
వత్సము – దూడ, ఱొమ్ము, సంవత్సరము
వ్యుత్పత్త్యర్థాలు
పుత్తుడు – సర్వ ధర్మ క్రియలను విశేషముగా పూరించువాడు – బ్రాహ్మణుడు
జుత్తుడు – పున్నామ నరకము నుండి రక్షించువాడు – కుమారుడు
జనని – కొడుకులను కనునది – తల్లి
జామదగ్న్యూ – జమదగ్ని మహర్షి కుమారుడు – పరశురాముడు
వసుధ – బంగారము గర్భము నందు కలది – భూమి
పటప్రత – మగని సేవించుటే వ్రతముగా కలది – సాధివ
అనఘుడు – పాపము లేనివాడు – పుణ్యాత్ముడు
ప్రకృతి – వికృతులు
ప్రకృతి – వికృతి
జ్ఞానము – నానము
నిజము – నిక్కము
పుత్తుడు – బోట్టె
వంశము – వంగడము
ధర్మము – దమ్మము
శృహము – గీము
అర్ధ – అద్ద, అఱ
సందేహము సందియము
కర్మ – కమ్మ
వృద్ధ – పెద్ద
విద్య – విద్దె, విద్దియ
దైవము – దయ్యము
యజ్ఞము – జన్నము
దిక్కు – దెస
హృదయము – ఎద, ఎడద, డెందము
భాగ్యము – బాగెము
రూపము – రూపు
విజ్ఞానము – విన్నాణము
విధము – వితము
అగ్ – అగ్గి
గృహస్థు – గేస్తు
కార్యము – కర్జము
ఫలము – పండు
సంతోషము – సంతసము
హార – ఆలము
సంధులు
1. సవర్షదీర్హ సంథి :
మషితాసనాసీనులు – మహిత+ఆసన+ఆటీనులు
అభిమతాహోర – అభిమత + ఆహార
పరమాంబరాథరణ – పరమ+అంబర+ఆభరణ
మాల్యాలంకృత – మాల్య + అలంకృత
ఫত్మాత్ముండు – ధర్మ + ఆత్ముండు
జ్ఞానార్థంబు – జ్ఞాన + అర్థంబు
సుకృతాయాసము – సుకృత + ఆయాసము
పరమాహ్లోద – పరమ + ఆహ్లాద
2. గుణసంధి :
విజ్ఞానోన్నతి – విజ్ఞాన + ఉన్నతి
శుథోదయము – శుభ + ఉదయము
3. యఙాదేశ సంధి :
అత్యంత – అతి + అంత
అఫ్యంతర – అభి + అంతర
4. విసర్గ సంధి :
మనోరథము – మనః + రథము
మనోహరము – మనః + హరము
చతుశ్శాల – చతుః + శాల
ఆయుర్థ సంపదలు – అయుః + అర్థ సంపదలు
వాజ్మనఃకర్మములు – వాజ్మనః + కర్మములు
5. శ్చుత్వ సంధి :
ని్చంతుడు – నిః + చింతుడు
6. అనునాసిక సంథి :
వాజ్మన – వాక్ + మనః
7. జశ్త్ర సంథి :
సదాధ్యయన – సత్ + అధ్యయన
సద్గుణాకరు – సత్ + గుణాకరు
సద్గురుడు – సత్ + గురుడు
8. ఉత్వ సంధి :
పుత్తుసకిట్లరి – పుత్తునకు+ఇట్లు+అనిరి
తత్తమారయ – తత్తము + ఆరయ
మూలంజైనది – మూలంబు + ఐనది
తోడయ్యెడు – తోడు + అయ్యెడు
పవిత్రితమయ్య్ – పవిత్రితము + అయ్యె
పూజింతరర్థి – పూజింతురు + అర్థి
వేల్పులనఘ – వేల్పులు + అనఘ
ప్రసాదితులగుదురు – ప్రసాదితులు + అగుదురు
నీవొకరుండవు – నీవు + ఒకరుండవు
యుక్తుడనైతిన్ – యుక్తుడను + ఐతిన్
అనుపమమెట్టి – అనుపమము + ఎట్టి
పదివేవురం దొకఁడు – పదివేవురు+అందు+ఒకడు
ధర్మమూది – ధర్మము + ఊది
కుశలంబడిగిన – కుశలంబు + అడిగిన
లుబ్దకుండిట్లనియె – లుబ్దకుండు+ఇట్లు+అనియె
9. ఇత్వ సంధి :
కలదొక – కలది + ఒక
వీరికెపుడు – వీరికి + ఎపుడు
అట్టిది – అట్టిది + అ
పలికిరప్పుడు – పలికిరి + అప్పుడు
10. యడాగమ సంధి:
నాయున్నయెడకు – నా + ఉన్న + ఎడకు
భూనుతయది – భూనుత + అది
రమ్మనియతని – రమ్మని + అతని
11. గసడదవాదేశ సంధి :
ప్రణామంబు సేసి – ప్రణామంబు + చేసి
కడమసెపుమ – కడమ + చెపుమ
శుశ్రూషసేసి – శుశ్రూష + చేసి
వాడూవె – వాడ + చూవె
మేలుసేకుఱు – మేలు చేకుఱు
12. పడ్వాది సంధి:
ప్రియంపడి – ప్రియము + పడి
సమాసాలు
1. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం :
ధర్మాత్మ – ధర్మమైన ఆత్మ
పరమాహ్లాద – పరమమైన ఆహ్లాద
శుభోదయము – శుభమైన ఉదయము
సనాతన ధర్మము – సనాతనమైన ధర్మము
సదమల హితవాక్యము – సదమల హితమైన వాక్యము
నిర్భిన్న హృదయులు – నిర్భిన్నమైన హృదయులు
అత్యంత ముదంబు – అత్యంతమైన ముదంబు
ఉదగ్రశోకవహ్ని – ఉదగ్రమైన శోకవహ్ని
సుకృతాయాసము – సుకృతమైన ఆయాసము
మహితాసనాసీనులు – మహితమైన ఆసనాసీనులు
పరమాంబరాభరణ – పరమమైన అంబరాభరణ
సద్గుణము – మంచిదైన గుణము
మనోహర భక్ష్య భోజ్యములు – మనోహర భక్ష్య భోజ్యములు
వివిధ సౌరభములు – వివిధములైన సౌరభములు
2. షష్ఠీ తత్పురుష సమాసం :
మానుష దేహము – మనిషి యొక్క దేహము
భాగ్యవశము – భాగ్యము యొక్క వశము
గురుసేవాయుక్తి – గురువు యొక్క సేవా యుక్తి
ధర్మజ్ఞానము – ధర్మము యొక్క జ్ఞానము
3. రూపక సమాసం :
గురుజనములు – గురువులనెడి జనములు
శోకవహ్ని- శోకమనెడి వహ్ని
4. బహువ్రీహి సమాసం :
మహాత్ముడు – గొప్ప ఆత్మ కలవాడు
ధర్మాత్ముడు – ధర్మమైన ఆత్మ కలవాడు
నిర్భిన్న హృదయులు – నిర్భిన్నమైన హృదయము కలవారు
విగత చక్షులు – విగతమైన చక్షులు కలవారు
ఆహ్లాద మనస్కుడు – ఆహ్లాదమైన మనస్సు కలవాడు
ధర్మ పరాయణుడు – ధర్మమే ప్రమాణంగా కలవాడు
5. నఞ తత్పురుష సమాసం :
నిష్ఫలము – ఫలము కానిది
అనఘ – అఘము లేనివాడు
6. ద్వంద్వ సమాసం :
జననీ జనకులు – జననియు, జనకుడును
భక్ష్య భోజ్యములు – భక్ష్యములును, భోజ్యములును
వాఙ్మనః కర్మములు – వాక్కును, మనస్సును,కర్మమును
అంబరాభరణములు – అంబరములును,ఆభరణములును
కవి పరిచయం
పేరు : ఎఱ్ఱన
కాలం : క్రీ.శ. 14 శతాబ్దం
స్వస్థలం : పాకనాడు సీమ (నెల్లూరు జిల్లాలో కందుకూరు సమీపంలోని గుడ్లూరు (గ్రామం) లో జన్మించారు.
ఉద్లోగ० : అద్దంకిని రాజధానిగా చేసుకొని పరిపాలించిన ప్రోలయవేమారెడ్డి ఆస్థాన కవి.
రచనలు : రామాయణం, హరివంశం, నృసింహపురాణం, ఆంర్రమహాభారతంలోని అరణ్యపర్వశేషం.
బిరుడులు : శంభుడాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు
తల్లిదండ్రులు : పోతమ్మ, సూరనలు
ప్రశ్యేకతలు : కవిత్రయం (నన్నయ, తిక్కన, ఎఱ్ఱన) లో 3వ కవి. రచనాైలిలో ససూక్తితైత్రి, ప్రబంధవర్ణనుకు పేరెన్నిక గన్నవాడు. ఆంధ్రమహాభారతంలోని అరణ్యపర్వంలోని ఐదవ ఆశ్వాసం నుండి ప్రస్తుత (ప్రత్యక్ష దైవాలు) పాఠ్యాంశం గ్రహించబడింది.
ఉద్దేశం
లోకంలో కంటికి కనిపించే దేవతలు అమ్మానాన్నలు. వారిని ఎల్లప్పుడూ సేవించడమే ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మం. ఆ ధర్టాన్ని అనుసరించాలని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం.
ప్రక్రియ-ఇతిహాసం
ఇతిహాసం అంటే ‘ఇలా జరిగింది’ అని అర్థం. ఇది ఒక కాలంలో ఒక రాజవంశానికో, ఒక జాతికో సంబంధించిన చారిత్రకాంశం గల బృహర్రచన. ఇవి శొల్లిటి కథలు. ఇవి గ్రంథ రూపంలోకి రాకముందు ఆశు రూపంలో ఉండేవి. ఇతిహాసాలు చతుర్విధ పురుషార్థాలు, ఉపదేశాలు, పూర్వ వృత్తాంత కథలతో కూడి ఉంటాయి. ఇతిహోసాలలో కథాకథనానికి ప్రాధాన్యం ఉంటుంది. రామాయణ, మహాభారతాలు ఇతిహసాలు.
నేపథ్యం
షాండవులు జూదంలో ఓడిపోయారు. లరణ్యాసాగిక వెళ్ళిపోయారు. లరణ్యానాసంలో ధర్షరాఱు ఋషుల దగ్గర వురాణాలు వినేఎాడు. ఒకసారి మార్కండేయ మహర్షి కాశికుని గాథను చెప్పాడు. కాశికుగి వద్యాభ్యాసం ముగినినట్లు గురువుగారు ప్రకటించారు. గృహస్థాశయం స్వీకరించి, తల్లిదంష్రులను ఆయనపై రెట్ట వేస్తుంది.
కోపంతో డాగి వంక చాడగా అది మాతి మసయ్యింది. ఆ తర్వాత మధ్యాహ్నం ఒక ఇంటె ముండు నిలటతి ఖిక్ష కోరతాడు, ఆ ఇంటి ఇల్లాలు అదే సమయంలో ఇంటక వచ్చిన భర్తను సేవించడంతో భిక్ష వేయడం ఆలస్యం చేస్తుంది. ఆ నిర్లక్షం సహించలేని కాశికుడు చాలా కోపంతో ఆ ఇల్లాలి వైపు చూస్తాడు. “మహాత్మా ! నేను పక్షిలికాను. సన్ట్రాలికి ఇంత కోపం తగదు” లగి నాలుగు మంచి మాటలు చెబుతుంది. మిథలా నగరంలోగి ధర్షవ్యాధుగి కలిస్తే ధర్షసూక్ష్యాలు చెబుతాడశి అంటుంది. కాశికుడు ధర్శవ్యాధుని దర్గరకు వెళ్తాడు. ఇది ఈ పాఠ్శాంశ నేపథ్రం.