AP 10th Class Telugu 1st Lesson Important Questions ప్రత్యక్ష దైవాలు

These AP 10th Class Telugu Important Questions 1st Lesson ప్రత్యక్ష దైవాలు will help students prepare well for the exams.

ప్రత్యక్ష దైవాలు AP Board 10th Class Telugu 1st Lesson Important Questions and Answers

అవగాహన – ప్రతిస్పందన

ఈ క్రింది పరిచిత పద్యాలను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. ఏ నిమ్మెయి నుత్తమ వి
జ్ఞానోన్నతి వడయుటకు నిజం బగు మూలం
జైనది గలదొక ధర్మము
భూనుత! యది నీకు దృష్టముగ నెఱిఁగింతున్.

ప్రశ్నలు- జవాబులు

ప్రశ్న 1.
విజ్ఞానం పొందడానికి కారణం ఏమిటి?
జవాబు:
విజ్ఞానం పొందడానికి మూలమైన ధర్మం ఒకటి ఉంది.

ప్రశ్న 2.
ఆ ధర్మాన్ని ఎలా తెలియజేస్తావు?
జవాబు:
అధర్మాన్ని నీ కంటికి కనిపించే విధంగా తెలియజేస్తాను.

ప్రశ్న 3.
ఈ పద్యాన్ని ఏ కవి రచించాడు?
జవాబు:
ఎఱ్ఱన

ప్రశ్న 4.
ఈ పద్యం ఏ పాఠంలోనిది?
జవాబు:
ప్రత్యక్షదైవాలు

AP 10th Class Telugu 1st Lesson Important Questions ప్రత్యక్ష దైవాలు

2. జనని జనకుఁడు సద్గురుఁడ నలుఁ దాత్ముఁ
దనఁగ నియ్యేపురును నే గృహస్థుచేత
సుగతివాంఛఁ బ్రసాదితు లగుదు రట్టి
వాఁడ నూనె ధర్మాత్ముండు వసుధమీఁద..

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
ఏ అయిదుగురుని పూజించాలి?
జవాబు:
తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ ఈ అయిదుగురిని పూజించాలి.

ప్రశ్న 2.
గృహస్థుడు దేన్ని కోరాలి?
జవాబు:
గృహస్థుడు పుణ్యాన్ని కోరాలి.

ప్రశ్న 3.
పుణ్యాన్ని కోరే గృహస్థుడు ఎటువంటివాడు?
జవాబు:
పుణ్యాన్ని కోరే గృహస్థుడు ధర్మాత్ముడు.

ప్రశ్న 4.
ఈ పద్యాన్ని వ్రాసిన కవి ఎవరు?
జవాబు:
ఎఱ్ఱున

3. నీక వగచి వగచి నిర్భిన్నహృదయులై
విగతచక్షులైరి వినవె ? వారః
లరిగి యింక నైన నమ్ముదుసళ్ల యు
దగ్రశోకవహ్ని నార్పవయ్య!

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
ఎవరు వగచివగచారు?
జవాబు:
కౌశిక మహాముని తల్లిదండ్రులు.

ప్రశ్న 2.
కౌశిక మహాముని తల్లిదండ్రులకు ఏం జరిగింది?
జవాబు:
గుండెలు పగిలేదట్లుగా ఏడ్చి, ఏడ్చి అంథులయ్యారు.

ప్రశ్న 3.
ఎవరు వెళ్ళి వారి దుఃఖాన్ని చల్లార్చాలి?
జవాబు:
కౌశిక మహాముని

ప్రశ్న 4.
కౌశిక మహామునిని వెళ్ళమని చెప్పిందెవరు?
జవాబు:
ధర్మవ్యాధుడు

4. నీయధ్యయనమ్మును సుకృ
తాయానము నిష్ఫలంబులై చను గురుసే
వాయుక్తి లేక తక్కినఁ
జేయుము నాపలుకు, మేలు సేకుఱు నీకున్.

ప్రశ్నలు- జవాబులు

ప్రశ్న 1.
సంపాదించిన విద్య ఎందుకు అక్కరకురాదు?
జవాబు:
తల్లిదండ్రుల సేవ చేయకపోతే సంపాదించిన విద్య అక్కరకు రాదు.

ప్రశ్న 2.
పుణ్యం కోసం ఎంత శ్రమపడినా రాదు ఎందుకు?
జవాబు:
తల్లిదండ్రుల సేవ చేయకపోతే,

ప్రశ్న 3.
“నా పలుకు, మేలు సేకుఱు నీకున్” – అని ఎవరన్నారు?
జవాబు:
ధర్మవ్యాధుడు

ప్రశ్న 4.
ఈ పద్యం ఎవరు ఎవరితో అన్నారు?
జవాబు:
ధర్మవ్యాధుడు, కౌశికునితో అన్నాడు.

5. ఇది యట్టిద నీ చెప్పిన
సదమలహితవాక్యభంగి సకలము వింటిన్;
వదలక యిమ్మెయిన చరిం
చెద గురుజనములకుఁ బ్రీతిఁ జేసెద వనఘా!

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
ధర్మవ్యాధుడు చెప్పిన మాటలు ఎటువంటివి?
జవాబు:
ధర్మవ్యాధుడు చెప్పిన మాటలు సరైనవి. శ్రేష్ఠమైనవి.

ప్రశ్న 2.
ధర్మవ్యాధుడు చెప్పిన మాటలు ఎటువంటి ప్రయోజనాన్ని కలిస్తాయి?
జవాబు:
మేలు కలిగిస్తాయి.

ప్రశ్న 3.
ధర్మవ్యాధుని మాటలను శ్రద్ధగా విన్నదెవరు?
జవాబు:
కౌశిక మహర్షి,

ప్రశ్న 4.
ఎవర్ని సేవించి తరిస్తావని కాశిక మహర్షి చెప్పాడు?
జవాబు:
తల్లిదండ్రులను.

AP 10th Class Telugu 1st Lesson Important Questions ప్రత్యక్ష దైవాలు

6. నాదైన భాగ్యవశమునఁ
గాదే నీతోడి చెలిమి గలిగెం, బరమా
హ్లాదమనస్కుంద నైతి, శు
భోదయముల కెల్ల నింక యుక్తుండ నైతిన్

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
ఎవరితో స్నేహం కలగడం అదృష్టమని కౌశిక మహర్షి చెప్పాడు?
జవాబు:
ధర్మవ్యాధునితో

ప్రశ్న 2.
ఎవరి మనస్సు అపరిమిత సంతోషంతో నిండింది?
జవాబు:
కౌశిక మహర్షి

ప్రశ్న 3.
ధర్మవ్యాధునితో కౌశిక మహర్షి ఏమని చెప్పాడు?
జవాబు:
నాకు కలగబోయే శుభాలన్నిటికి ఇది సూచకం.

ప్రశ్న 4.
ఈ పద్యం ఎవరు వ్రాశారు?
జవాబు:
ఎఱ్ఱన

వ్యక్తీకరణ – సృజనాత్మకత

ఆ) ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
“ప్రత్యక్షదైవాలు” పాఠ్యభాగ రచయిత ఎవరు? అతని గూర్చి రాయండి.
జవాబు:
“ప్రత్యక్ష దైవాలు” పాఠ్యభాగ రచయిత ఎఱ్ఱన. మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో ఎఱ్ఱన మూడవ కవి. ఈయన క్రీ.శ. 14వ శతాబ్దపు కవి. వీరి తల్లిదండ్రులు పోతమ్మ, సూరనలు. పాకనాడు సీమ (నెల్లూరు జిల్లా కందుకూరు సమీపంలో గుడ్లూరు గ్రామం)లో జన్మించారు.

అద్దంకిని రాజధానిగా చేసుకొని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవిగా ఉన్నారు. ఈయన రచనలు రామాయణం, హరివంశం, అరణ్య పర్వశేషం, నృసింహపురాణం మున్నగునవి. వీరి బిరుదులు శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు. వీరి రచనా శైలిలో ‘సూక్తి వైచిత్రి’ పేరెన్నికగన్నది.

ప్రశ్న 2.
‘ప్రత్యక్ష దైవాలు’ పాఠం ఉద్దేశం ఏమిటి?
జవాబు:
ఈ లోకంలో కంటికి కనిపించే దేవతలు అమ్మానాన్నలు. వారిని ఎల్లప్పుడూ సేవించడమే ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మం. ఆ ధర్మాన్ని అనుసరించాలని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం.

ప్రశ్న 3.
“ఇతిహాసం” సాహిత్య ప్రక్రియను తెల్పుము.
జవాబు:
ఇతిహాసం అంటే “ఇలా జరిగింది” అని అర్థం. ఇది ఒక కాలంలో ఒక రాజ వంశానికో, ఒక జాతికో సంబంధించిన చారిత్రకాంశం గల బృహద్రచన. ఇవి తొల్లిటి కథలు. ఇవి గ్రంథ రూపంలోకి రాకముందు ఆశు రూపంలో ఉండేవి. ఇతిహాసాలు చతుర్విధ పురుషార్ధాలు, ఉపదేశాలు, పూర్వ వృత్తాంత కథలతో కూడి ఉంటాయి. ఇతిహాసాలలో కథ కథనానికి ప్రాధాన్యం ఉంటుంది. రామాయణ, మహాభారతాలు ఇతిహాసాలు.

ప్రశ్న 4.
ధర్మవ్యాధుని పాత్ర స్వభావం తెల్పుము.
జవాబు:
ధర్మవ్యాధుడు సద్గుణ సంపన్నుడు. ధర్మానికి ప్రతిరూపం. గృహస్థాశ్రమ స్వీకారం చేసిన తర్వాత తల్లిదండ్రులను ప్రేమిస్తూ సేవ చేస్తుండేవాడు. మార్గదర్శకుడు. మనస్సు, మాట, ఆచరణల చేత తల్లిదండ్రులను ప్రేమించాడు. తల్లిదండ్రులకు సేవ చేయడం వల్ల ధర్మవ్యాధుడు ఉత్తమ జ్ఞానాన్ని పొందాడు. వేదాధ్యయనం, యజ్ఞాలు, వ్రతాలను చేసిన ఫలితం ఇతనికి లభించింది. ఇతడు ధర్మాత్ముడైన గృహస్థుడు.

ప్రశ్న 5.
కౌశికుని పాత్ర స్వభావాన్ని తెల్పండి.
జవాబు:
కౌశిక మహర్షి తనపై ఆధారపడి జీవిస్తున్న వృద్ధ దంపతులైన తన తల్లిదండ్రులను వదలి వేదాధ్యయనకై వెడలిపోయాడు. కొడుకు లేదని ఏడ్చి ఏడ్చి చివరకు అతని తల్లిదండ్రులు అంథులయ్యారు. కౌశిక మహర్షికి అనాలోచిత కోపం ఎక్కువ. పిట్ట తనపై రెట్ట వేసిందని తలచి, చెట్టు పైకి చూశాడు. వెంటనే చెట్టుపైన ఉన్న పిట్ట భస్మమైపోయింది. అదే విధంగా ఒక పతివ్రత ఇంటికి భిక్షాటనకు వెళ్ళి భిక్షను అడిగాడు. కాని ఎంతసేపటికి ఆమె రాలేదు. సరికదా ! కౌశిక మహర్షికి కోపం ఎక్కువైంది. వెంటనే ఆ మహాతల్లి కౌశిక మహర్షిని మందలించి ధర్మవ్యాధుని దగ్గరకు వెళ్ళి ధర్మాలను నేర్చుకొమ్మని పంపింది. ఆమె పంపగా కౌశిక మహర్షి ధర్మవ్యాధుని దగ్గరకు వెళ్ళాడు.

AP 10th Class Telugu 1st Lesson Important Questions ప్రత్యక్ష దైవాలు

ప్రశ్న 6.
ధర్మవ్యాధునితో అతని తల్లిదండ్రులేమన్నారు?
జవాబు:
ధర్మవ్యాధునితో అతని తల్లిదండ్రులు కుమారా! నీ వంటి ఉత్తముడు కుమారుడై ఉండగా మాకేమి లోటు ఉంటుంది. నీవు పాటించే ధర్మం నిన్ను రక్షిస్తోంది. చక్కని సంపదలతో చిరకాలం జీవించగలవు. నీ ప్రవర్తన చేత మన వంశం పవిత్రమైంది. మానవుడిగా జన్మించావే గాని దేవతలలో గొప్ప దేవతవు. అనుమానం లేదు. మనస్సు, మాట, ఆచరణల -చేత తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావు. ఉత్తమ గుణవంతుడైన నీ గురించి చెప్పి, తర్వాత పరశురాముని గురించి చెప్పాలి. మరెవ్వరు నీకు సాటి రారు.

ప్రశ్న 7.
తల్లిదండ్రులను గురించి ధర్మవ్యాధుడు కౌశికునితో ఏమన్నాడు?
జవాబు:
ధర్మవ్యాధుడు కౌశికునితో “ప్రజల చేత గౌరవింపబడే వాడా! వీరు నా తల్లిదండ్రులు. వీరికి సేవ చేయడం వల్ల మాత్రమే నాకు ఉత్తమ జ్ఞానం లభించింది. సాధారణంగా లోకంలో అందరూ కోరికతో దేవతల్ని పూజిస్తారు. నా తల్లిదండ్రులే నా పాలిటి దేవతలు. ఇతర దేవతల గురించి నాకు తెలియదు. వీరికి రుచికరమైన పండ్లు, పూలు, గంధం, అందమైన నగలు, వస్త్రాలు, ఇష్టమైన ఆహారపదార్థాలను అందిస్తాను. నా ఆలుబిడ్డలతో కలసి సేవ చేస్తుంటాను. అలా సేవించడం వల్ల వేదాధ్యయనం, యజ్ఞాలు, వ్రతాలను చేసిన ఫలితం వస్తుంది” అని చెప్పాడు.

ఆ) ఈ క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
ధర్మవ్యాధుడు కౌశిక మహర్షిని ఏమని మందలించాడు?
(లేదా)
ధర్మవ్యాధుడు కౌశికమహర్షికి కనువిప్పు కల్గించిన విధమెట్టిది?
జవాబు:
ధర్మవ్యాధుడు కౌశిక మహర్షితో – ఓ కౌశిక మహర్షీ ! నీవు నా వద్దకు పతివ్రత పంపగా వచ్చావు. ధర్మాన్ని గురించిన జ్ఞానాన్ని పొందాలని భావిస్తున్నావు. ఆమెపై ఉన్న గౌరవం కారణంగా ధర్మమార్గాన్ని వివరిస్తాను. నీపై ఉన్న ఇష్టం కాదు, నువ్వొక చేయకూడని పని చేశావు కనుక నువ్వంటే నాకిష్టం లేదు. అదేమిటంటే….. నీ తల్లిదండ్రులు వృద్ధులు. వారు నీపై ఎంతో ప్రేమతో జీవిస్తున్నారు. వారికి నీవే ఆధారం. కాని నీవు వేదాధ్యయనం చేసి జ్ఞానాన్ని పొందాలని భావించావు. తల్లిదండ్రుల అనుమతి లేకుండా వారిని వదిలిపెట్టావు. వారి స్థితిగతులను గురించి ఎలాంటి విచారణ చేయలేదు. ఈ కఠినమైన నీ ప్రవర్తన నాకు నచ్చలేదు. నీవు విడిచి వెళ్ళిన మరుక్షణం నీ కోసం నీ తల్లిదండ్రులు గుండెలు పగిలిపోయేటట్లుగా ఏడ్చి ఏడ్చి ఆంథులయ్యారు. ఇప్పటికైనా నీవు వెళ్ళి వారి దుఃఖాగ్నిని చల్లార్చు.
నువ్వు సంపాదించిన విద్యగానీ, పుణ్యం కోసం నువ్వు పడే శ్రమ గానీ, తల్లిదండ్రుల సేవ చేయకపోతే వ్యర్ధమవుతాయి. కాబట్టి నేను చెప్పిన విధంగా ఆచరించు. నీకు మేలు కలుగుతుంది అని చెప్పి కౌశికునికి కనువిప్పు కలిగించాడు.

ప్రశ్న 2.
తన తప్పు తెలుసుకున్న కౌశిక మహర్షి ధర్మవ్యాధునితో ఏమని పల్యాడు?
జవాబు:
కనువిప్పు కల్గిన కౌశికముని ధర్మవ్యాధునితో – “ఓ పుణ్యాత్ముడా! నీవు చెప్పిన మాటలు సరైనవి. శ్రేష్ఠమైనవి. మేలు కలిగించేవి. వాటిని శ్రద్ధగా విన్నాను. తప్పక ఆచరిస్తాను. తల్లిదండ్రులను సేవించి తరిస్తాను.

నీతో స్నేహం కలగడం నా అదృష్టం. నా మనస్సు అమితమైన సంతోషంతో నిండింది. నాకు కలగబోయే శుభాలన్నిటికి ఇది సూచకం. ధర్మమార్గం సాటిలేనిది. భూమిపై నివసించే పదివేలమందిలో ఏ ఒక్కడైనా ధర్మాచరణకు పూనుకుంటాడో లేదో! సందేహమే. నీలాగా ప్రయత్నపూర్వకంగా ధర్మాన్ని ప్రమాణంగా స్వీకరించి ఆచరించేవాడు. ఉండడు.” ఈ విధంగా కౌశికముని తన తప్పు తాను తెలుసుకుని ధర్మవ్యాధునితో మాట్లాడాడు.

ఇ) కింది అంశం గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.

ప్రశ్న 1.
“తల్లిదండ్రుల సేవను మించిన ధర్మం లేదు” అన్న సూక్తిని వివరిస్తూ స్నేహితునకు లేఖ వ్రాయండి.
జవాబు:

గుంటూరు,
X X X X X.

ప్రియమైన స్నేహితునకు నమస్కారములు.
నేను క్షేమంగా చదువుచున్నాను. నీవు కూడా క్షేమంగా చదువుచున్నావని తలుస్తాను.
ఈ రోజు మా తెలుగు మాష్టారు శ్రీవత్సగారు. మొదటి పాఠం “ప్రత్యక్ష దైవాలు” అను విషయాన్ని చెప్పారు. అది ధర్మవ్యాధుల, కౌశిక మునుల మధ్య జరిగిన కథ. ఈ కథ చాలా బాగుంది. కౌశిక మహర్షి చేసిన తప్పును చెప్తూ అతనికి ధర్మవ్యాధుడు కనువిప్పు కల్గించిన విధం బాగుంది. అందుకే కదా ! “తల్లిదండ్రులన్న దైవ సన్నిభులురా” అని కరుణశ్రీ చెప్పారు. నేను కూడా మా అమ్మానాన్నలను గౌరవిస్తూ ప్రేమతో చూసుకుంటాను. వినాయకుడు కూడా తన తల్లిదండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి విఘ్నాధిపత్యాన్ని పొందాడు. కనుక తల్లిదండ్రుల సేవను మించిన ధర్మం లేదు అని గ్రహించాను. నీవు కూడా నీకు కల్గిన అనుభవాన్ని తెలుపుతూ లేఖ వ్రాయుము. మన మిత్రులందరినీ అడిగానని చెప్పు, ఉంటా!

ఇట్ల
– నీ స్నేహితుడు,
కె. పావనీ రఘురామ్.

చిరునామా :
కె. శ్రీనాథ పద్మచరణ్,
10వ తరగతి, గాంధీ మున్సిపల్ హైస్కూలు,
విజయవాడ – 1.

AP 10th Class Telugu 1st Lesson Important Questions ప్రత్యక్ష దైవాలు

భాషాంశాలు (పదజాలం వ్యాకరణాంశాలు)

కింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి.

అలంకారాలు

ఈ క్రింది వాక్యంలోని అలంకారాన్ని గుర్తించి రాయండి.

1. “ఇంక నైన నమ్ముదుసళ్ళయు
దగ్రశోకవహ్ని నార్చవయ్య !”
జవాబు:
రూపకాలంకారం

గణవిభజన పద్యపాదం పేరు

కింది పద్య పాదాలకు గురులఘువులు గుర్తించి, గణ విభజన చేసి, ఏ పద్య పాదమో రాయండి.

2. ఎంతయు వృద్ధులై తమకు నీ వొకరుండవ తెప్ప గాఁగ న
జవాబు:
AP 10th Class Telugu 1st Lesson Important Questions ప్రత్యక్ష దైవాలు 1
ఇది ఉత్పలమాల పద్యపాదం.
యతి: 1
ప్రాస : రెండవ అక్షరముత(పూర్ణబిందువుతోనున్న తకారము)

3. అనుపమ మెట్టివారలకు నందదు ధర్మపథంబు ధాత్రిలో
జవాబు:
AP 10th Class Telugu 1st Lesson Important Questions ప్రత్యక్ష దైవాలు 2
ఇది చంపకమాల పద్యపాదం.
యతి 1 – 11 (అ-న్ + అం)
ప్రాస: రెండవ అక్షరము ‘ను’.

అర్థాలు

అ) గీత గీసిన పదానికి అర్థం రాయండి.

1. అతిథులను గౌరవించుట ఉత్తమ ధర్మం.
జవాబు:
గొప్పదైన

2. ఎప్పుడూ నిజమునే మాట్లాడాలి.
జవాబు:
సత్యము

3. అక్కడకు చని రాము బస్సెక్కాడు.
జవాబు:
వెళ్ళి

4. ఆ పువ్వుల తోట మనోహరంగా ఉంది.
జవాబు:
మనస్సు ఆకర్షించుట, అందం

5. గులాబీ పువ్వుల సౌరభాలు అత్యంత మనోహరం.
జవాబు:
సువాసనలు

6. జననీ జనకులను పూజించాలి.
జవాబు:
తల్లిదండ్రులు

7. ధర్మవ్యాధుడు సత్పుత్రుడు.
జవాబు:
మంచి కుమారుడు

8. అతని చరిత్ర గొప్పది.
జవాబు:
ప్రవర్తన, నడవడిక

9. మానుష దేహము వృథా.
జవాబు:
శరీరము

10. పెద్దలకు శుశ్రూష చేయాలి.
జవాబు:
సేవ

AP 10th Class Telugu 1st Lesson Important Questions ప్రత్యక్ష దైవాలు

ఆ) గీత గీసిన పదానికి సరియైన అర్ధాన్ని గుర్తించండి.

11. గురువులకు శుశ్రూష చేయాలి.
అ) పరిచర్య
ఆ) భక్తి
ఇ) ద్రోహం
ఈ) మోసం
జవాబు:
అ) పరిచర్య

12. అమరులు మరణం లేనివారు.
అ) రాక్షసులు
ఆ) దేవతలు
ఇ) కిన్నరులు
ఈ) కింపురుషులు
జవాబు:
ఆ) దేవతలు

13. వృద్ధుల్ని ప్రేమించాలి.
అ) మోసగాళ్ళు
ఆ) పడుచువాళ్ళు
ఇ) ముసలివాళ్ళు
ఈ) పసిహృదయులు
జవాబు:
ఇ) ముసలివాళ్ళు

14. శ్రీరాముని దార సీత.
ఆ తల్లి
ఆ) తండ్రి
ఇ) సోదరి
ఈ) భార్య
జవాబు:
ఈ) భార్య

15. ప్రతిరోజూ ఫలములను తినాలి.
అ) పండ్లు
ఆ) పూలు
ఇ) ఆకులు
ఈ) కాయలు
జవాబు:
అ) పండ్లు

16. కల్మషం తలపులో కూడా ఉండరాదు.
అ) తల
ఆ) ఆలోచన
ఇ) వల
ఈ) కల
జవాబు:
ఆ) ఆలోచన

17. వసుధలో బంగారపు నిధులు కలవు.
అ) ఆకాశము
ఆ) దిక్కు
ఇ) భూమి
ఈ) సముద్రము
జవాబు:
ఇ) భూమి

18. అతని చిత్తము నిండా దుర్మార్గపు ఆలోచనలు ఉన్నాయి.
అ) తల
ఆ) వల
ఇ) కల
ఈ) మనస్సు
జవాబు:
ఈ) మనస్సు

19. క్రూరముగా మాట్లాడరాదు.
అ) కఠినత్వము
ఆ) మృదుత్వము
ఇ) సున్నితత్వము
ఈ) మోసము
జవాబు:
అ) కఠినత్వము

పర్యాయపదాలు

అ) గీత గీసిన పదానికి పర్యాయపదాలు రాయండి.

20. సత్యంవద, ధర్మం చర.
జవాబు:
పొడి, న్యాయము, అశేషము

21. నిజమునే పలుకవలయును.
జవాబు:
సత్యము, నిక్కము, యధార్ధము

22. విద్యతో జ్ఞానం పెరుగుతుంది.
జవాబు:
అభిజ్ఞానము, ఎఱుక, సంభూతి

23. ప్రతి ఒక్కరికి గృహము ఉండాలి.
జవాబు:
ఇల్లు, గీము, గేహము

24. పువ్వుల సౌరభం నలుదెసల వ్యాపించింది.
జవాబు:
సువాసన, గంధము, తావి

25. ఆ పూలతోట మనోహరంగా ఉంది.
జవాబు:
అన్నువ, ఇంపు, రమణీయము

26. ఆ హర్మ్యాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
జవాబు:
మేడలు, ప్రాసాదములు, భవనములు

27. జనని నడిచే దేవత.
జవాబు:
తల్లి, అమ్మ, అంబ, మాత

28. జనకుడు గురువుతో సమానము.
జవాబు:
తండ్రి, అయ్య, నాన్న, అప్ప

29. పుత్త్రుడు పున్నామ నరకము నుండి రక్షిస్తాడు.
జవాబు:
కొడుకు, కుమారుడు, తనయుడు

30. స్వామి మెడలో మాల సుందరంగా ఉంది.
జవాబు:
హారము, గొలుసు, లలంతిక, సరము

AP 10th Class Telugu 1st Lesson Important Questions ప్రత్యక్ష దైవాలు

ఆ) గీత గీసిన పదానికి సరియైన పర్యాయపదాలు గుర్తించండి.

31. పేదవారి యింట సంపదలుండవు.
అ) ఆస్తి, ఐశ్వర్యము
ఆ) దరిద్రము, లేమి
ఇ) చెలిమి, బలిమి
ఈ) లేవి, కలిమి
జవాబు:
అ) ఆస్తి, ఐశ్వర్యము

32. రంతిదేవుని చరిత్ర గొప్పది.
అ) చరిత, జరిత
ఆ) కథ, ఇతివృత్తము
ఇ) గాధ, వ్యధ
ఈ) బాధ, గాధ
జవాబు:
ఆ) కథ, ఇతివృత్తము

33. రఘువంశము చాలా పవిత్రమైంది.
అ) కాయము, గాయము
ఆ) గాయత్రి, సావిత్రి
ఇ) కులము, అన్వయము
ఈ) కల, వల
జవాబు:
ఇ) కులము, అన్వయము

34. ఈ దేహము అశాశ్వతము.
అ) గేహము, మోహము
ఆ) ద్రోహము, సందోహము
ఇ) వ్యామోహము, శోకము
ఈ) శరీరము, గాత్రము
జవాబు:
ఈ) శరీరము, గాత్రము

35. రామ తత్త్వము తెలిసికొనుట కష్టము.
అ) స్వభావము, ప్రవృత్తి
ఆ) వృత్తి, ప్రవృత్తి
ఇ) ప్రకృతి, వికృతి
ఈ) సుకృతి, దుష్కృతి
జవాబు:
అ) స్వభావము, ప్రవృత్తి

36. ఈ దేహము సందియముల పుట్ట.
అ) దేహము, గేహము
ఆ) సందేహము, సంశయము
ఇ) సత్వము, తత్త్వము
ఈ) మనిషి, మానిసి
జవాబు:
ఆ) సందేహము, సంశయము

37. మంచి వాక్కుతో లోకాల్ని జయించవచ్చు.
అ) పాట, శక్తి
ఆ) ఆట, రక్తి
ఇ) మాట, ఉక్తి
ఈ) తేట, భక్తి
జవాబు:
ఇ) మాట, ఉక్తి

38. మా మాష్టారు గార్కి ప్రభుత్వం సత్కారం చేసింది.
అ) సంస్కారం, సంతసం
ఆ) పరిష్కారం, పరాభవం
ఇ) భారము, కారము
ఈ) గౌరవము, సన్మానము
జవాబు:
ఈ) గౌరవము, సన్మానము

ప్రకృతి – వికృతులు

అ) గీత గీసిన పదానికి సరియైన ప్రకృతి పదం

39. విద్యతో నానం కలుగుతుంది.
జవాబు:
జ్ఞానం

40. నిక్కమునే పలుకవలయును.
జవాబు:
నిజము

41. పున్నామ నరకము నుండి బొట్టె రక్షిస్తాడు.
జవాబు:
పుత్రుడు

42. రఘు వంగడము గొప్పది.
జవాబు:
వంశము

43. తల్లిదండ్రులను సేవించుట గొప్ప దమ్మము.
జవాబు:
ధర్మము

44. ప్రతి మనిషికి గీము ఉండాలి.
జవాబు:
గృహము

ఆ) గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.

45. అనవసరమైన సందేహాలు పనికిరావు.
అ) సందియములు
ఆ) సంతసములు
ఇ) సమయాలు
ఈ) సాధనాలు
జవాబు:
అ) సందియములు

46. మానవులు కర్మజీవులు.
అ) ధర్మము
ఆ) కమ్మ
ఇ) బొమ్మ
ఈ) బామ్మ
జవాబు:
ఆ) కమ్మ

47. వృద్ధులను ప్రేమించాలి.
అ) గడ్డ
ఆ) పద్దతి
ఇ) పెద్ద
ఈ) విధము
జవాబు:
ఇ) పెద్ద

AP 10th Class Telugu 1st Lesson Important Questions ప్రత్యక్ష దైవాలు

48. విద్యలేనివాడు వింత పశువు.
అ) సద్య
ఆ) పద్దియము
ఇ) సత్య
ఈ) విద్దె, వియ
జవాబు:
ఈ) విద్దె, విద్దియ

49. దైవం మానుష రూపేణ.
అ) దయ్యము
ఆ) కయ్యము
ఇ) వియ్యము.
ఈ) సయ్యాట
జవాబు:
అ) దయ్యము

50. ఆమె రూపము, మనోహరం.
అ) పాపము
ఆ) రూపు
ఇ) శాపము
ఈ) కోపము
జవాబు:
ఆ) రూపు

51. విధిగా అగ్నిని ప్రార్ధించాలి. రాయండి.
అ) బుగ్గి
ఆ) గుగ్గిలం
ఇ) ఆగ్గి
ఈ) సిగ్గు
జవాబు:
ఇ) ఆగ్గి

52. మానవుడు మంచి కార్యం చెయ్యాలి.
అ) ఖర్జూరం
ఆ) సర్జము
ఇ) కారము
ఈ) కర్ణము
జవాబు:
ఈ) కర్ణము

53. ధర్మవ్యాధుని హృదయం గొప్పది.
అ) ఎద, ఎడద
ఆ) ఉదయం
ఇ) దయ
ఈ) గయ
జవాబు:
అ) ఎద, ఎడద

54. అనాథలకు దేవుడే దిక్కు
అ) పస
ఆ) దెస
ఇ) రుస
ఈ) ఆస
జవాబు:
ఆ) దెస

55. బ్రాహ్మణుడు యజ్ఞము చెయ్యాలి.
అ) కన్నము
ఆ) అన్నము
ఇ) జన్నము
ఈ) దున్న
జవాబు:
ఇ) జన్నము

నానార్థాలు

అ) గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి.

56. సత్యం వద. ధర్మం చర.
జవాబు:
స్వభావము, న్యాయము

57. నిజమునే పల్కాలి.
జవాబు:
సత్యము, విధము

58. పువ్వుల సౌరభము అద్భుతం.
జవాబు:
ఎద్దు, స్నేహము, పరిమళము

59. ఆ సరోవరం మనోహరం.
జవాబు:
బంగారం, రమణీయం

60. దేవుని మెడలో పూలమాల వేశారు.
జవాబు:
చండాలుడు, హారము

61. పేదవాని యింట సంపద ఉండదు.
జవాబు:
ఆస్తి లక్ష్మి

AP 10th Class Telugu 1st Lesson Important Questions ప్రత్యక్ష దైవాలు

ఆ) గీత గీసిన పదానికి సరైన నానార్థాలు గుర్తించండి.

62. రాముని చరిత్ర గొప్పది.
అ) ప్రవర్తన, కథ
ఆ) గాధ, గాయము
ఇ) వర్తమానం, సంవర్తనం
ఈ) కాయము, గాయము
జవాబు:
అ) ప్రవర్తన, కథ

63. వంశానికి అపవాదు తేరాదు.
అ) వంగడము, వంగదేశం.
ఆ) వెదురు, కులం
ఇ) కలం, కులం
ఈ) వెదురు, ముదురు
జవాబు:
ఆ) వెదురు, కులం

64. వాక్కు మంచిదైతే ప్రజలందరు గౌరవిస్తారు.
అ) పాట, ఆట
ఆ) ఆట, మాట
ఇ) మాట, వాణి
ఈ) పాట, పాడి
జవాబు:
ఇ) మాట, వాణి

65. ఆమె మనసు మంచిది.
అ) కోరిక, ప్రేమ
ఆ) భామ, దోమ
ఇ) తీరిక, సారిక
ఈ) ప్రేమ, దోమ
జవాబు:
అ) కోరిక, ప్రేమ

66. కవులకు సత్కారము చేయుట పరిపాటి.
అ) భాజనము, భజన
ఆ) గౌరవము, భోజనము
ఇ) రవము, గారవము
ఈ) రవము, భజన
జవాబు:
ఆ) గౌరవము, భోజనము

67. కష్టపడితే ఫలము లభిస్తుంది.
అ) సింగారము, బంగారము
ఆ) శృంగారము, బంగారము
ఇ) పండు, ప్రయోజనము
ఈ) యోజనం, ప్రయోజనం
జవాబు:
ఇ) పండు, ప్రయోజనము

68. గంధముతో స్వామికి అభిషేకం చేస్తారు.
అ) సర్వము, గర్వము
ఆ) సర్వము, ఖర్వము
ఇ) సాధన, ధనం
ఈ) పరిమళము, గర్వము
జవాబు:
ఈ) పరిమళము, గర్వము

69. చింతలేని మానవుడు లేడు.
అ) దుఃఖము, తింత్రిణి
ఆ) సుఖము, సౌఖ్యము
ఇ) బాధ, గాధ
ఈ) వ్యధ, వ్యామోహము
జవాబు:
అ) దుఃఖము, తింత్రిణి

70. అగ్నిని ఆరాధించాలి.
అ) వహ్ని, స్నేహము
ఆ) బంగారం, అగ్ని హోత్రము
ఇ) వ్యామోహము, స్నేహము
ఈ) సింగారం, బంగారం
జవాబు:
ఆ) బంగారం, అగ్ని హెూత్రము

71. వత్సము మీద ప్రేమ గొప్పది.
అ) దూడ, పేడ
ఆ) పేడ, మేద
ఇ) దూడ, ఱొమ్ము
ఈ) సొమ్ము, ఱొమ్ము
జవాబు:
ఇ) దూడ, ఱొమ్ము

వ్యుత్పత్త్యర్థాలు

అ) గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్థం రాయండి.

72. భూలోక దేవుడు విప్రుడు.
జవాబు:
సర్వ ధర్మ క్రియలను విశేషముగా పూరించువాడు. – బ్రాహ్మణుడు.

73. పుత్రుడు తల్లిదండ్రులను సేవించాలి.
జవాబు:
పున్నామ నరకము నుండి రక్షించువాడు – కొడుకు

74. జనని నడచే దేవత.
జవాబు:
కొడుకులను కనునది – తల్లి

AP 10th Class Telugu 1st Lesson Important Questions ప్రత్యక్ష దైవాలు

ఆ) గీత గీసిన పదానికి సరైన వ్యుత్పత్త్యర్థాన్ని గుర్తించండి.

75. జామదగ్న్యు 21 సార్లు దండెత్తి రాజుల్ని నిర్మూలనం చేశాడు.
అ) జమదగ్ని కుమారుడు – పరశురాముడు
ఆ) దశరథుని కుమారుడు – శ్రీరాముడు
ఇ) జనకుని కుమార్తె – సీత
ఈ) పురుగులను చంపునది – బల్లి
జవాబు:
అ) జమదగ్ని కుమారుడు పరశురాముడు

76. వసుధ భర్త శ్రీమన్నారాయణుడు.
అ) రెండు రకముల దేహములు కలవాడు – నరసింహస్వామి
ఆ) బంగారం గర్భము నందు కలది – భూమి
ఇ) ఆకాశాన మణి వంటివాడు – సూర్యుడు
ఈ) ద్రవించు శీలము కలది – ధనము
జవాబు:
ఆ) బంగారం గర్భము నందు కలది – భూమి

77. సీత మహా పతివ్రత.
అ) భూ పుత్రిక – సీత
ఆ) విశ్వమును ధరించునది – భూమి
ఇ) మగని సేవించుటే వ్రతముగా కలది – సాధ్వి
ఈ) ధనము నిచ్చువాడు దాత
జవాబు:
ఇ) మగని సేవించుటే వ్రతముగా కలది – సాధ్వి

78. ధర్మ వ్యాధుదు అనఘుడు.
అ) పాపాలు చేసేవాడు – పాపి
ఆ) మోసాలు చేయువాడు – మోసకారి
ఇ) ఆనందాన్ని కల్గించునది ఆహ్లాద
ఈ) పాపము లేనివాడు – పుణ్యాత్ముడు
జవాబు:
ఈ) పాపము లేనివాడు – పుణ్యాత్ముడు

జాతీయాన్ని గుర్తించడం

వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి విడిగా రాయండి.

79. రాము చిచ్చరపిడుగై విజయాలను సాధించాడు.
జవాబు:
చిచ్చరపిడుగు

80. చీటికి మాటికి పిల్లలు విసిగిస్తారు.
జవాబు:
చీటికి మాటికి

81. కొందరు గోడమీది పిల్లిలా వ్యవహరిస్తారు.
జవాబు:
గోడమీది పిల్లి

82. మా వీథిలో తామరతంపరలా దుకాణాలు పుట్టాయి.
జవాబు:
తామరతంపర

83. వాడు తేనె పూసిన కత్తి, జాగ్రత్తగా ఉండాలి.
జవాబు:
తేనె పూసిన కత్తి

84. రాము అందరి తలలో నాలుక వలె వ్యవహరిస్తాడు.
జవాబు:
తలలో నాలుక

85. నేటి ప్రభుత్వం అభివృద్ధికి తిలోదకాలు విడిచింది.
జవాబు:
తిలోదకాలు విడుచు

జాతీయము – సందర్భము

ఈ జాతీయాన్ని ఏ అర్థంలో / సందర్భంలో ఉపయో గిస్తారో రాయండి.

86. తేలు కుట్టిన దొంగ
జవాబు:
అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లు వ్యవహరించే రీతిలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

87. నడుమంత్రపుసిరి
జవాబు:
చాలాకాలం దరిద్రాన్ని అనుభవించిన పిదప మధ్యలో వచ్చిన సంపద వలె వ్యవహరించే వానిని గురించి చెప్పు సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

88. నివురు గప్పిన నిప్పు
జవాబు:
పైకి అమాయకుడుగా కన్పించే తేజశ్శాలిని గురించి చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

89. పులుగడిన ముత్యము
జవాబు:
పైకి అమాయకుడిగా కన్పించే తేజశ్మాలిని గురించి చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

90. ఎటువంటి దోషాలు లేని పుణ్యాత్ముని గూర్చి చెప్పు సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. పక్కలో బల్లెము
జవాబు:
దుర్మార్గుని గురించి వివరించే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

91. మూడుకాళ్ళ ముసలి
జవాబు:
మిక్కిలి ముసలితనంలో ఉన్న వాణ్ని గురించి చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

AP 10th Class Telugu 1st Lesson Important Questions ప్రత్యక్ష దైవాలు

92. రెండు నాలుకలు
జవాబు:
రెండు విధాలుగా మాట్లాడే వాని విషయంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

సంధి పదాలను విడదీయడం

గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి.

93. తల్లిదండ్రులకు శుశ్రూషసేసి తరించాలి.
జవాబు:
శుశ్రూష + చేసి

94. ధర్మవ్యాధుడు ధర్మాత్ముడు.
జవాబు:
ధర్మ + అత్ముడు

95. జనని జనకుడు సద్గురుడ నలుఁడాత్ముడు.
జవాబు:
సత్ + గురుడు

96. అభ్యంతర గృహంబునకు రమ్మనెను.
జవాబు:
అభి + అంతర

97. ఆ కొలను మనోహరముగా ఉంది.
జవాబు:
మనః + హరము

98. విజ్ఞానోన్నతి వడయుటకు నిజము.
జవాబు:
విజ్ఞాన + ఉన్నతి

99. తత్త్వమారయ పరదేవతవీపు,
జవాబు:
తత్త్వము + ఆరయ

100. అతను హార్మ్యమందు మహితాసనాసీనులైరి.
జవాబు:
మహిత + ఆసన + ఆసీనులైరి

101. వాడు సనాతన ధర్మమూది చెప్పెను.
జవాబు:
ధర్మము + ఊది

102. మేలుసేకుఱు నీకున్.
జవాబు:
మేలు + చేకుఱు

సంధి పదాలను కలపడం

క్రింది సంధి పదాలను కలిపి రాయండి.

103. ఏ + వనికి
జవాబు:
ఎవ్వనికి

104. ధర్మము + ఊది
జవాబు:
ధర్మమూర్తి

105. శుభ + ఉదయము
జవాబు:
శుభోదయము

106. పరమ + ఆహ్లాద
జవాబు:
పరమాహ్లాద

107. ప్రియము + పడి
జవాబు:
ప్రియంపడి

AP 10th Class Telugu 1st Lesson Important Questions ప్రత్యక్ష దైవాలు

108. అతి + అంత
జవాబు:
అత్యంత

109. ఉత్ + అగ్ర
జవాబు:
ఉదగ్ర

110. అట్టిది + అ
జవాబు:
అట్టిద

111. ప్రీతిన్ + చేసెద
జవాబు:
ప్రీతింతే పెద

112. విగతచక్షులు + ఐరి
జవాబు:
విగతచక్షులైరి

సంధి నామాలు

గీత గీసిన పదం ఏ సంధికి చెందినదో గుర్తించండి.

113. నాదైన భాగ్య వశమున గాదె!
అ) ఇత్వ సంధి
ఆ) అత్వ సంధి
ఇ) ఉత్వ సంధి
ఈ) యడాగమ సంధి
జవాబు:
అ) ఇత్వ సంధి

114. వాడ సూవె ధర్మాత్ముండు వసుధ మీద.
అ) గుణసంధి
ఆ) సవర్ణదీర్ఘ సంధి
ఇ) యణాదేశ సంధి
ఈ) వృద్ధి సంధి
జవాబు:
ఆ) సవర్ణదీర్ఘ సంధి

115. మనోహరమైన చతుశ్శాలలు కలవు.
అ) ఉత్వ సంధి
ఆ) ఇత్వ సంధి
ఇ) విసర్గ సంధి
ఈ) గుణ సంధి
జవాబు:
ఇ) విసర్గ సంధి

116. అభ్యంతర గృహానికి వారు వచ్చారు.
అ) ఉత్వ సంధి
ఆ) గుణ సంధి
ఇ) యడాగమ సంధి
ఈ) యణాదేశ సంధి
జవాబు:
ఈ) యణాదేశ సంధి

117. వారు శుభోదయము అని చెప్పారు.
అ) గుణసంధి
ఆ) వృద్ధి సంధి
ఇ) ఇత్వ సంధి
ఈ) ఇత్వ సంధి
జవాబు:
అ)గుణసంధి

విగ్రహవాక్యాలు

గీత గీసిన పదానికి విగ్రహవాక్యం రాయండి.

118. జననీ జనకులను పూజించాలి.
జవాబు:
జననియు, జనకుడును

119. ధర్మపధములో నడవాలి.
జవాబు:
ధర్మమైన పథము

120. ప్రతిరోజూ నేను ఫలపుష్పములను భగవంతునికి సమర్పిస్తాను.
జవాబు:
ఫలములను, పుష్పములను

121. మనం సనాతన ధర్మాన్ని పాటించాలి.
జవాబు:
సనాతనమైన ధర్మం

122. మానుషదేహం అశాశ్వతం.
జవాబు:
మానుషుని యొక్క దేహం.

123. అతడు శోకాగ్నిని భరించలేదు.
జవాబు:
శోకమనెడి అగ్ని

AP 10th Class Telugu 1st Lesson Important Questions ప్రత్యక్ష దైవాలు

సమాన నామాలు

గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.

124. వారింట భక్ష్యభోజ్యాలు విందులో ఉంచారు.
అ) ద్వంద్వ సమాసం
ఆ) రూపక సమాసం
ఇ) షష్ఠీ తత్పురుష సమాసం
ఈ) విశేషణ పూర్వపద కర్మధారయము
జవాబు:
అ) ద్వంద్వ సమాసం

125. కౌశిక మహర్షి జ్ఞానార్థంబు వెళ్ళెను.
అ) రూపక సమాసం
ఆ) షష్ఠీ తత్పురుష సమాసం
ఇ) ద్వంద్వ సమాసం
ఈ) బహువ్రీహి సమాసం
జవాబు:
ఆ) షష్ఠీ తత్పురుష సమాసం

126. ధర్మవ్యాధుడు ధర్మాత్ముడు.
అ) ద్వంద్వ సమాసం
ఆ) షష్ఠీ తత్పురుష సమాసం
ఇ) బహువ్రీహి సమాసం
ఈ) విశేషణ పూర్వపద కర్మధారయం
జవాబు:
ఇ) బహువ్రీహి సమాసం

127. అతని భాగ్యవశమున పోయిన ధనం లభించింది.
అ) ద్విగు సమాసం
ఆ) ద్వంద్వ సమాసం
ఇ) బహువ్రీహి సమాసం
ఈ) షష్ఠీ తత్పురుష సమాసం
జవాబు:
ఈ) షష్ఠీ తత్పురుష సమాసం

128. ప్రతిరోజూ శుభోదయమున నిద్రలేస్తాను.
ఆ) విశేషణ పూర్వపద కర్మధారయము
ఆ) విశేషణ ఉత్తరపద కర్మధారయము
ఇ) విశేషణ ఉభయపద కర్మధారయము
ఈ) సంభావనా పూర్వపద కర్మధారయము
జవాబు:
ఆ) విశేషణ పూర్వపద కర్మధారయము

129. అతడు మహితాసనము పై కూర్చుండెను.
అ) విశేషణ ఉత్తరపద కర్మధారయము
ఆ) విశేషణ పూర్వపద కర్మధారయము
ఇ) సంభావనా పూర్వపద కర్మధారయము
ఈ) ఉపమాన పూర్వపద కర్మధారయము
జవాబు:
ఆ) విశేషణ పూర్వపద కర్మధారయము

ఆధునిక వచనాలు

క్రింది వాక్యాలకు సరియైన ఆధునిక వచనాన్ని గుర్తించండి.

130. ధర్మవ్యాధుండు కౌశికునితో యిట్లనియె.
అ) ధర్మవ్యాధుడు కౌశికునితో ఈ విధంగా పల్కాడు.
ఆ) ధర్మవ్యాధుండు కౌశికునితో యిట్లున్నాడు.
ఇ) ధర్మవ్యాధుడు కౌశికునితో ఏమీ అనలేదు.
ఈ) ధర్మవ్యాధుండు కౌశికునితో ఏమన్నాడు?
జవాబు:
అ) ధర్మవ్యాధుడు కౌశికునితో ఈ విధంగా పల్కాడు.

131. గృహంబునకు రమ్మని యతనిం దోడ్కొని చనియె.
అ) గృహంబునకు రమ్మని ఆహ్వానించాడు.
ఆ) ఇంటికి రమ్మని అతణ్ని తీసుకెళ్ళాడు.
ఇ) గృహమునకు రమ్మని పిలిచి వెళ్ళాడు.
ఈ) గృహానికి రావద్దని చెప్పి, వెళ్ళాడు.
జవాబు:
ఆ) ఇంటికి రమ్మని అతణ్ని తీసుకెళ్ళాడు.

132. ఇమ్మహాత్ముందు మనలన్ జూచువేద్య నిటవచ్చెనని చెప్పిన.
అ) ఇమ్మహాత్ముందు మనలను చూడటానికి వచ్చాడు.
ఆ) ఇమ్మహాత్ముండు మనలను చూడటానికి వస్తానని చెప్పాడు.
ఇ) ఈ మహాత్ముడు మనల్ని చూడాలని కోరికతో ఇక్కడకు వచ్చాడు.
ఈ) ఈ మహాత్ముడు మనల్ని చూడటానికి రాలేదు.
జవాబు:
ఇ) ఈ మహాత్ముడు మనల్ని చూడాలని కోరికతో ఇక్కడకు వచ్చాడు.

AP 10th Class Telugu 1st Lesson Important Questions ప్రత్యక్ష దైవాలు

133. అతివ్రత పనుపునం జేసి నీవు ధర్మ జ్ఞానార్థంబు నాయున్న యెడకుం జనుదెంచితివి.
అ) బతివ్రత పనుపునం జేసి నీవు వచ్చావు.
ఆ) బతివ్రత పనుపునం జేసి ధర్మజ్ఞానం కొఱకు వెళ్ళావు.
ఇ) బతివ్రత పనుపునం జేసి ధర్మ జ్ఞానార్ధంబు వచ్చావు.
ఈ) పతివ్రత పంపగా, ధర్మాన్ని గురించిన జ్ఞానాన్ని పొందాలని నా దగ్గరకు వచ్చావు.
జవాబు:
ఈ)పతివ్రత పంపగా, ధర్మాన్ని గురించిన జ్ఞానాన్ని పొందాలని నా దగ్గరకు వచ్చావు.

వ్యతిరేకార్థక వాక్యాలు

కింది వాక్యాలకు వ్యతిరేకార్థక వాక్యం రాయండి.

134. ధర్మవ్యాధుడు కౌశికుణ్ని ఆహ్వానించాడు.
జవాబు:
ధర్మవ్యాధుడు కాశికుణ్ని ఆహ్వానించలేదు.

135. నీవు పతివ్రత పంపగా వచ్చావు.
జవాబు:
నీవు పతివ్రత పంపగా రాలేదు.

136. పుణ్యాన్ని కోరే గృహస్థుడే ధర్మాత్ముడు.
జవాబు:
పుణ్యాన్ని కోరే గృహస్థుడే ధర్మాత్ముడు కాడు.

137. అందరూ కోరికతో దేవతల్ని పూజిస్తారు.
జవాబు:
అందరూ కోరికతో దేవతల్ని పూజించరు.

138. నా తల్లిదండ్రులే నా పాలిట దేవతలు కారు.
జవాబు:
నా తల్లిదండ్రులే నా పాలిట దేవతలు.

వ్యతిరేకార్థక క్రియలు

కింది క్రియా పదాలలో వ్యతిరేకార్థక క్రియను గుర్తించండి.

139. అ) వచ్చి
ఆ) వస్తాడు
ఇ) రాడు
ఈ) వస్తున్నాడు.
జవాబు:
ఇ) రాడు

140. అ) చావక
ఆ) చస్తూ
ఇ) చస్తాడు
ఈ) చస్తున్నాడు
జవాబు:
అ) చావక

141. అ) తిని
ఆ) తినక
ఇ) తింటాడు
ఈ) తిన్నాడు.
జవాబు:
ఆ) తినక

142. అ) చూశాడు
ఆ) చూసి
ఇ) చూడక
ఈ) చూస్తున్నాడు
జవాబు:
ఇ) చూడక

143. అ) వెళ్ళాడు.
ఆ) వెడుతున్నాడు
ఇ) వెళ్ళి
ఈ) వెళ్ళక
జవాబు:
ఈ) వెళ్ళక

సంక్లిష్ట వాక్యాలు

ఇవి ఏ రకమైన సంక్లిష్టవాక్యాలో రాయండి.

144. వాన కురిస్తే పంటలు పండుతాయి.
జవాబు:
చేదర్థకం

145. రాధా కృష్ణులు నగరవాసం చేశారు.
జవాబు:
సంయుక్త వాక్యం

146. గోపి అన్నం తిని, బడికి వెళ్ళాడు.
జవాబు:
క్త్వార్థకం

147. రాధిక పాట వింటూ, పనిచేస్తోంది.
జవాబు:
శత్రర్థకం

148. కల్యాణ్ కు ఆటలు, పాటలు వచ్చును.
జవాబు:
సంయుక్త వాక్యం

149. వర్షాలు కురిసినా చెరువులు నిండలేదు.
జవాబు:
అర్థం

కర్మణి వాక్యాలు

సరియైన కర్మణి వాక్యాన్ని గుర్తించండి.

150. వారెందరినో ఇంటర్వ్యూ చేశారు.
అ) వారిచేత ఎందరో ఇంటర్వ్యూ చేయబడ్డారు.
ఆ) వారెందరి చేతనో ఇంటర్వ్యూ చేయబడ్డారు.
ఇ) ఎందరి చేతనో వారు ఇంటర్వ్యూ చేయబడ్డారు.
ఈ) ఎందరెందరో వారి చేత ఇంటర్వ్యూ చేయబడ్డారు.
జవాబు:
అ) వారిచేత ఎందరో ఇంటర్వ్యూ చేయబడ్డారు.

151. హనుమ సముద్రం లంఘించెను.
అ) హనుమ చేత లంఘించబడెను.
ఆ) సముద్రం లంఘించబడెను హనుమ.
ఇ) హనుమ చేత సముద్రం లంఘించబడెను.
ఈ) లంఘించబడెను సముద్రం.
జవాబు:
ఇ) హనుమ చేత సముద్రం లంఘించబడెను.

152. హనుమ గిరిని తొక్కెను.
అ) హనుమ చేత తొక్కబడెను.
ఆ) హనుమ చేత గిరి తొక్కబడెను.
ఇ) గిరి తొక్కబడెను.
ఈ) తొక్కబడెను గిరి.
జవాబు:
ఆ) హనుమ చేత గిరి తొక్కబడెను.

153. ప్రకృతిని మానవుడు అనుకరిస్తున్నాడు.
అ) మానవుని చేత అనుకరించబడుతోంది.
ఆ) ప్రకృతి మానవుని చేత అనుకరించబడుతోంది.
ఇ) ప్రకృతి మానవుని చేత అనుకరించబడింది.
ఈ) ప్రకృతి మానవుని చేత అనుకరించబడుతుంది.
జవాబు:
ఈ)ప్రకృతి మానవుని చేత అనుకరించబడుతుంది.

154. జానపదుడు జాబు వ్రాస్తాడు.
అ) జానపదుని చేత జాబు వ్రాయబడుతుంది.
ఆ) జానపదుని చేత జాబు వ్రాయబడింది.
ఇ) జానపదుని చేత జాబు వ్రాయబడదు.
ఈ) జానపదుని చేత జాబు వ్రాయబడుతోంది.
జవాబు:
అ) జానపదుని చేత జాబు వ్రాయబడుతుంది.

వాక్య రకాలు

ఇవి ఏ రకమైన సామాన్య వాక్యాలో రాయండి.

155. నేను పరీక్ష బాగా వ్రాయగలను.
జవాబు:
సామర్థ్యార్థక వాక్యం

156. మీరు రావద్దు.
జవాబు:
నిషేధార్థక వాక్యం

AP 10th Class Telugu 1st Lesson Important Questions ప్రత్యక్ష దైవాలు

157. వారందరికి ఏమైంది?
జవాబు:
ప్రశ్నార్ధక వాక్యం

158. తోట రామయ్యదో! కృష్ణయ్యదో!
జవాబు:
సందేహార్థక వాక్యం

159. రాధాకృష్ణులు ఆదర్శ ప్రేమికులు.
జవాబు:
సంయుక్త వాక్యం

160. ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాను ఎగురవేశారు.
జవాబు:
సామాన్య వాక్యం

161. రాము చదవక మార్కులు రాలేదు.
జవాబు:
హేశ్వర్థక వాక్యం

162. ఆహా ! ఈ సంగీతం ఎంత వీనుల విందుగా ఉంది.
జవాబు:
ఆశ్చర్యార్థక వాక్యం

163. దయచేసి నన్ను కాపాడు!
జవాబు:
ప్రార్థనార్థక వాక్యం

164. మీరు దేనినైనా సాధించగలరు.
జవాబు:
సామర్థ్యార్థక వాక్యం

165. అనవసరంగా బైట తిరగవద్దు.
జవాబు:
నిషేధార్థక వాక్యం

166. వారందరికి ఏమైంది?
జవాబు:
ప్రశ్నార్థక వాక్యం

వాక్య రకాలు

ఇవి ఏ రకమైన సామాన్య వాక్యాలో గుర్తించండి.

167. కీర్తన అన్నమాచార్య సంకీర్తనలు బాగా పాడగలదు.
అ) అనుమత్యర్థకం
ఆ) ఆశీరార్థకం
ఇ) సామర్థ్యార్థకం
ఈ) ప్రార్థనార్థకం
జవాబు:
ఇ) సామర్థ్యార్థకం

168. జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యం కాపాడుకోండి.
అ) సంయుక్తం
ఆ) సంక్లిష్టం
ఇ) విద్యర్థకం
ఈ) చేదర్థకం
జవాబు:
ఆ) సంక్లిష్టం

169. చెట్లు పెంచితే వర్షాలు వస్తాయి.
అ) అనుమత్యర్థకం
ఆ) ఆశీరార్థకం
ఇ) చేదర్థకం
ఈ) అప్యర్థకం
జవాబు:
ఇ)చేదర్థకం

170. వానలు పడితే పంటలు బాగా పండుతాయి.
అ) శత్రర్థకం
ఆ) విధ్యర్థకం
ఇ) చేదర్థకం
ఈ) సామర్థ్యార్థకం
జవాబు:
ఇ) చేదర్థకం

AP 10th Class Telugu 1st Lesson Important Questions ప్రత్యక్ష దైవాలు

171. మీకు శుభం కలుగుగాక!
అ) చేదర్థకం
ఆ) శత్రర్థకం
ఇ) విధ్యర్థకం
ఈ) ఆశీరార్థకం
జవాబు:
ఈ) ఆశీరార్థకం

172. వాడు చదవక మార్కులు రాలేదు.
అ) చేదర్థకం
ఆ) సంయుక్తం
ఇ) హేత్వర్థకం
ఈ) నిశ్చయార్థకం
జవాబు:
అ) చేదర్థకం

173. వాడు వస్తాడో! రాడో!
అ) ఆశ్చర్యార్థకం
ఆ) విధ్యర్థకం
ఇ) నిశ్చయార్థకం
ఈ) సందేహార్థకం
జవాబు:
ఈ) సందేహార్థకం

174. మీరు ఆడుకోవచ్చు.
అ) అనుమత్యర్థకం
ఆ) విధ్యర్థకం
ఇ) ఆశ్చర్యార్థక
ఈ) ప్రశ్నార్థకం
జవాబు:
అ) అనుమత్యర్థకం

175. సముద్రం ఎవరు దాటారు?
అ) అనుమత్యర్థకం
ఆ) ప్రశ్నార్థకం
ఇ) విధ్యర్థకం
ఈ) నిశ్చయార్థకం
జవాబు:
ఆ) ప్రశ్నార్థకం

176. దీర్ఘాయుష్మాన్ భవ!
అ) నిశ్చయార్థకం
ఆ) విధ్యర్థకం
ఇ) ఆశీరార్థకం
ఈ) అనుమత్యర్థకం
జవాబు:
ఇ) ఆశీరార్థకం

177. దయచేసి చదువుకోండి.
అ) విధ్యర్థకం
ఆ) అనుమత్యర్థకం
ఇ) నిశ్చయార్థకం
ఈ) ప్రార్థనార్థకం
జవాబు:
ఈ) ప్రార్థనార్థకం

178. దేనికీ భయపడవద్దు.
అ) ఆశీరార్థకం
ఆ) అప్యర్థకం
ఇ) నిషేధార్థకం
ఈ) విధ్యర్థకం
జవాబు:
అ) ఆశీరార్థకం

Leave a Comment