AP 10th Class Telugu 12th Lesson Important Questions సూక్తి సుధ

These AP 10th Class Telugu Important Questions 12th Lesson సూక్తి సుధ will help students prepare well for the exams.

సూక్తి సుధ AP Board 10th Class Telugu 12th Lesson Important Questions and Answers

అవగాహన – ప్రతిస్పందన

1. ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

పరనింద పనికి రాదు. అంతమాత్రాన ఆత్మప్రశంస మంచిదని కాదు. మనలో ఎన్ని దోషాలున్నా ఇతరుల్ని దూషించడం మానవ సహజం. అది తప్పు. బుద్ధి స్థిరంగా ఉండడం అవసరం. నిమిష నిమిషానికి మతి చలించే తత్వం మంచిది కాదు. ఈ మంచిని పెంచుకుంటేనే మానవులకు సద్గతి కలుగుతుందని అన్నమాచార్యుల ప్రబోధం.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
మానవ సహజమైన గుణం ఏమిటి?
జవాబు:
మనలో ఎన్ని దోషాలు ఉన్నా ఇతరుల్ని దూషించడం మానవ సహజ గుణం.

ప్రశ్న 2.
బుద్ధి లక్షణం ఏమిటి?
జవాబు:
బుద్ధి స్థిరంగా ఉండదు.

ప్రశ్న 3.
అన్నమయ్య ప్రబోధం ఏమిటి?
జవాబు:
మంచిని పెంచుకుంటే మానవులలో సద్గతి కలుగుతుందని అన్నమయ్య ప్రబోధించారు.

ప్రశ్న 4.
పై పేరాను చదివి ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
మానవులకు సద్గతి ఎప్పుడు కలుగుతుంది?

2. ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

సోమరితనం మంచిది కాదని తెలియజేస్తూ… అలాంటి సోమరిపోతుల్ని, పరుల సొమ్ము సొంతం చేసుకోవాలని | ప్రయత్నించే వారిని మిక్కిలి గర్వించారు. ఛాయాపహారులైన వారిని అసహ్యించుకున్నారు. దేనినైనా సాధించడానికి శక్తిని కూడగట్టుకోవాలి. ఆ శక్తి సామర్థ్యాలతో అనుకొన్న దాన్ని సాధించగలగాలని చెపుతూ ఇతరుల సొమ్ములతో గొప్పవారం కావాలనే భావన గల వాళ్ళని ఈ విధంగా గరించాడు అన్నమాచార్యులు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
అన్నమయ్య ఎటువంటి వారిని అసహ్యించుకున్నారు?
జవాబు:
ఇతరుల సొమ్ము ఆశించేవారిని, వారి నీడలో బతికేవారిని అన్నమయ్య అసహ్యించుకున్నాడు.

ప్రశ్న 2.
దేనినైనా ఎలా సాధించగలం?
జవాబు:
శక్తిసామర్థ్యాలు ఉంటే దేనినైనా సాధించగలం.

ప్రశ్న 3.
అన్నమయ్య పై పేరాలో చెప్పిన రెండు చెడు లక్షణాలను గుర్తించండి.
జవాబు:
సోమరితనం, పరుల సొమ్ము ఆశించడం అనేవి రెండు చెడు లక్షణాలు.

ప్రశ్న 4.
పై పేరాను చదివి ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
మనిషి దేనిని విడిచి పెట్టాలి?

AP 10th Class Telugu 12th Lesson Important Questions సూక్తి సుధ

3. ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

కులము, జాతి, మతము వీటికి ఏనాడూ ప్రాధాన్యం లేదు. అయితే స్వార్థపరులు వాటికి భేదాలు, అంతస్తులు కల్పించి, సుఖమయ జీవితాలలో చిచ్చు పెడుతుంటారు. ఈనాడు మనమావిషయం గమనించగలం. ఒక వేళ కొందరి కల్పనలో అధిక, హీన అనే తేడా ఉన్నా నిక్క మెరిగిన వాడే మహాత్ముడంటారు అన్నమాచార్యులు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
ప్రాధాన్యం లేని అంశాలు ఏవి?
జవాబు:
కులము, జాతి, మతము అనేవి ప్రాధాన్యం లేని అంశాలు.

ప్రశ్న 2.
మహాత్ముడు ఎవరని అన్నమాచార్యులు అంటున్నారు?
జవాబు:
ఎక్కువ, తక్కువ భేదాలు లేకుండా కుల, మతాలకు ప్రాధాన్యం ఇవ్వనివారు మహాత్ములు.

ప్రశ్న 3.
స్వార్ధపరులు ఏం చేస్తారు?
జవాబు:
జాతి, మత, ఎక్కువ, తక్కువ తేడాలు చూపి, సుఖమయ జీవితాల్లో చిచ్చు పెడతారు.

ప్రశ్న 4.
‘నిక్కము’ అంటే అర్థం ఏమిటి?
జవాబు:
‘నిక్కము’ అంటే నిజము అని అర్ధం.

4. ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

పరధనాపేక్ష పనికిరాదు అన్నారు అన్నమయ్య. ఈనాడు సమాజంలో ఎందరినో చూస్తున్నాము. సులభ ధనం కావాలి. కష్టం లేకుండా ధనం సంక్రమించాలి. ప్రాణాపాయముంటే ఉండవచ్చుగాక. అయినా కొందరు దోపిడీ మూలంగా సంపాదిస్తున్నారు. ఇది మంచిది కాదు. నిందలపాలు కాకుండా జీవించడం ఉత్తమ లక్షణం. కానీ ఒక్కోసారి మన తప్పిదం లేకున్నా నిందలూ, అనుమానాలు వస్తూంటాయి. అలాంటి వాటికి చోటివ్వకుండా బతకడం ముఖ్యం. ఇది కష్టసాధ్యమే కావచ్చు గాక. కానీ అలవరచుకోవడం అవసరం. సరస జీవనం గడపడం మానవుని మనుగడకు మంచిది.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
పరధనాపేక్ష అంటే ఏమిటి?
జవాబు:
పరధనాపేక్ష అంటే ఇతరుల ధనాన్ని ఆశించడం.

ప్రశ్న 2.
సమాజంలో కొందరి ఆలోచనలు ఎలా ఉన్నాయి?
జవాబు:
సమాజంలో కొందరు కష్టపడకుండా సులభంగా ధనం సంపాదించాలని అనుకుంటున్నారు.

ప్రశ్న 3.
మానవులకు ఉత్తమ లక్షణం ఏమిటి?
జవాబు:
నిందలపాలు గాకుండా జీవించడం మానవులకు ఉత్తమ లక్షణం.

ప్రశ్న 4.
పై పేరాను చదివి ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
సరస జీవనం అంటే ఏమిటి?

అపరిచిత గద్యాలు

1. ఈ క్రింది అపరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులకు సమకాలికుడు. వీరు ముగ్గురిని కలిపి కర్ణాటక సంగీతత్రయంగా పిలుస్తారు. ఆయన శ్రీరామునిపై కీర్తనలు రచించారు. త్యాగరాజు తమిళనాడులోని తంజావూరులో పుట్టినా, ఆయన తెలుగు, సంస్కృతాల్లో కీర్తనలు రచించి, గానం చేశారు. ఆయన పేరు మీద జరిగే త్యాగరాజు ఆరాధనోత్సవాలు చాలా ప్రసిద్ధి చెందాయి.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
కర్ణాటక సంగీత త్రయం అనగా ఎవరు?
జవాబు:
త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులను కర్ణాటక సంగీత త్రయంగా పిలుస్తారు.

ప్రశ్న 2.
త్యాగరాజు కీర్తనలు ఏ భాషలో అలపించారు?
జవాబు:
తెలుగు, సంస్కృతాల్లో కీర్తనలు ఆలపించారు.

ప్రశ్న 3.
త్యాగరాజు కీర్తనలు ఎవరిపై రచించారు?
జవాబు:
శ్రీరామునిపై త్యాగరాజు కీర్తనలు రచించారు.

ప్రశ్న 4.
పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
త్యాగరాజు గారు ఎక్కడ జన్మించారు?

AP 10th Class Telugu 12th Lesson Important Questions సూక్తి సుధ

2. ఈ క్రింది కరపత్రాన్ని చదివి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Telugu 12th Lesson Important Questions సూక్తి సుధ 1

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
అన్నమయ్య సంకీర్తన పాదయాత్ర కార్యక్రమ ఉద్దేశం ఏమిటి?
జవాబు:
సమ సమాజ స్థాపన, శాంతి కోసం ప్రచారం.

ప్రశ్న 2.
ఈ కరపత్రాన్ని ఎవరు ప్రకటించారు?
జవాబు:
మానవతా సంస్థ, నెల్లూరు

ప్రశ్న 3.
పాదయాత్ర ఎప్పుడు ప్రారంభం అవుతుంది?
జవాబు:
16.5.2024న ప్రారంభమౌతుంది.

ప్రశ్న 4.
పై కరపత్రం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
పాదయాత్రలో చేయనున్న సంకీర్తనలు ఎవరివి?

3. ఈ క్రింది వార్తను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

ఘనంగా నెహ్రూ జయంతి నిర్వహణ

న్యూస్టుడే: నెల్లూరు నగరపాలక ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీలు, కవిత్వం, కథల వంటి సాహిత్య పోటీలు నిర్వహించి, జిల్లా విద్యాశాఖాధికారి ఎ. సుబ్బారెడ్డి గారిచే బహుమతి ప్రధానం జరిగింది. మన మొట్టమొదటి ప్రధానమంత్రి శ్రీ జవహర్లాల్ నెహ్రూ పుట్టిన తేది నవంబర్ 14ను బాలల దినోత్సవంగా జరుపుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడిన ఉపాధ్యాయులు మంచి నడవడిక, క్రమశిక్షణతో విద్యార్థులు బంగారు భవిష్యత్ను సాధించగలరని సందేశం ఇచ్చారు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
నెహ్రూ గారి జయంతి ఎప్పుడు జరుపుకుంటారు?
జవాబు:
నవంబర్
14న నెహ్రూ గారి జయంతిని జరుపుకుంటాము.

ప్రశ్న 2.
బాలల దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఎవరు విచ్చేశారు?
జవాబు:
జిల్లా విద్యాశాఖాధికారి వి. సుబ్బారెడ్డిగారు అతిథిగా విచ్చేశారు.

ప్రశ్న 3.
ఈ వార్త ఏ ప్రాంతానికి చెందినది?
జవాబు:
నెల్లూరు ప్రాంతానికి చెందినది.

ప్రశ్న 4.
పై వార్త ఆధారంగా, ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
మన మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు?

4. ఈ క్రింది పేరా చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

ఆంధ్రప్రదేశ్లో కందుకూరి వీరేశలింగం, రఘుపతి వేంకటరత్నం నాయుడు, గురజాడ అప్పారావు వంటివారు. సంఘసంస్కరణ ఉద్యమాలను ప్రారంభించారు. స్త్రీల చదువు, బాల్య వివాహాల నిర్మూలన, మూఢ నమ్మకాలపై చైతన్యం కలిగించేందుకు రచనలు చేశారు. కందుకూరి రాజశేఖర చరిత్ర నవల రాస్తే, గురజాడ కన్యాశుల్కం రచించారు. కందుకూరి బాలికల కోసం రాజమండ్రిలో మొట్టమొదటి పాఠశాల స్థాపించారు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
సంఘసంస్కరణ ఉద్యమాలు ప్రారంభించింది ఎవరు?
జవాబు:
కందుకూరి వీరేశలింగం, రఘుపతి వేంకటరత్నం, గురజాడ అప్పారావు.

ప్రశ్న 2.
‘రాజశేఖర చరిత్ర’ నవల రచించింది ఎవరు?
జవాబు:
కందుకూరి వీరేశలింగం.

ప్రశ్న 3.
ఆనాడు సంఘంలో ఉన్న దురాచారాలేవి?
జవాబు:
మూఢనమ్మకాలు, బాల్య వివాహాలు.

ప్రశ్న 4.
పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
మొట్టమొదటి పాఠశాల ఎవరు, ఎక్కడ స్థాపించారు?

AP 10th Class Telugu 12th Lesson Important Questions సూక్తి సుధ

5. ఈ కింది కరపత్రం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

యాచన మానండి – మాన్పించండి

ఆత్మాభిమానానికి గొడ్డలిపెట్టు యాచన. మర్యాదకు సమాధి యాచన. దరిద్రానికి పునాది యాచన. అందుకే యాచన మానండి. కష్టపడండి. సంపాదించండి. దరిద్రాన్ని తరిమికొట్టండి. మీకెదురైన యాచకులకు ఆత్మస్థైర్యాన్ని కల్గించండి. జీవనమార్గాన్ని నిర్దేశించండి. ఉపాధి మార్గాలు చూపండి. వృద్ధులైతే వృద్ధాశ్రమాల్లో చేర్చండి. అనాథలైతే అనాధాశ్రమాలలో చేర్పించండి. వారూ మన సోదరులే అనే భావనతో మెలగండి. వారిని ఉద్దరించండి. వారిలో ఆత్మాభిమానం కల్గించడం మన సామాజిక బాధ్యత.

ఇట్లు,
యాచనా వ్యతిరేకసంఘం.

ప్రశ్నలు – జవాబులు

అ) ఆత్మస్థైర్యం ఎవరికి కలిగించాలి?
జవాబు:
యాచకులకు.

ఆ) పై పేరాలోని జాతీయాన్ని గుర్తించండి.
జవాబు:
గొడ్డలిపెట్టు.

ఇ) ఆత్మాభిమానం కల్గించడం అనేది?
జవాబు:
మన సామాజిక బాధ్యత.

ఈ) ‘అనాథ’ అంటే?
జవాబు:
దిక్కు మొక్కు లేనివారు (ఆదరించేవారు లేనివారు).

6. ఈ కింది కరపత్రం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

ఆపన్న హస్తం ఇవ్వండి

ఆదుకుందాం ! ఆదరిద్దాం!
వదాన్యులారా ! మా మనవి వినండి.’ మనతోపాటు ఈ సమాజంలో ఎందరో అనాథలు, అభాగ్యులు ఉన్నారు. వారిని ఆదుకోవల్సిన ధర్మం మనందరిపైనా ఉంది. అనాథలైన పిల్లలు చదువులకు దూరమవుతున్నారు. వృద్ధులేమో నిరాదరణకు గురవుతున్నారు.

అనాథలపై కనికరం చూపి భోజన వసతులు కల్పించండి. వారి చదువుకు ధన సహాయం చేయండి. మీలోని మానవతను చూపండి. అందరికీ ఆదర్శంగా నిలవండి. పేదలు లేని నవ సమాజాన్ని నిర్మించడానికి కృషి చేయండి. ఈ మహాయజ్ఞంలో మనందరం భాగస్వాములవుదాం.

ఇట్లు,
నిర్వాసిత బాలల సంరక్షణ సమితి
కనిగిరి.

ప్రశ్నలు – జవాబులు

అ)పై కరపత్రంలోని సంబోధన ఏమిటి?
జవాబు:
వదాన్యులారా!

ఆ) ‘మహాయజ్ఞం’ ఏది?
జవాబు:
పేదలు లేని నవ సమాజం నిర్మించడం.

ఇ) ఈ కరపత్రంలో ఎవరి సమస్యలు చెప్పబడ్డాయి?
జవాబు:
అనాథ పిల్లలు, వృద్ధులు.

ఈ) ఈ కరపత్రం ఏ ప్రాంతానికి చెందినది?
జవాబు:
కనిగిరి.

7. ఈ కింది లేఖ చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

మిత్రునికి లేఖ

చెరుకూరు,
X X X X X

మిత్రుడు జస్వంత్కు,
ఉభయ కుశలోపరి. నీవు రాసిన లేఖ చేరింది. మనం నైతిక విలువలు పాటించాలని రాశావు. సంతోషం. ముఖ్యంగా పేదవారికి, మనకు ఉన్నంతలో దానం చెయ్యాలి. మన తరగతిలోని పేదవారికి పుస్తకాలు, పెన్నులు దానం చెయ్యాలని రాశావు. నీవు చెప్పిన విషయం బాగుంది. నాకు నచ్చినది కూడా ఇదే. వైద్యసహాయం కోసం డబ్బులు అడిగే వారికి తప్పుక ఇవ్వాలి.

పేదలకు దానం చేస్తే మరుసటి జన్మలో మనకు భగవంతుడు మరింత ఇస్తాడు. పేదల ముఖాల్లో ఆనందం కనబడేలా చేస్తే, మన జీవితాలు సుఖసంతోషాలకు నిలయం అవుతాయి. నేను నాకు ఉన్నంతలో పేదలకు దానధర్మాలు చేస్తున్నాను.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
సాయిశ్రీ ప్రసాదు.

ప్రశ్నలు – జవాబులు

అ) ఇద్దరూ క్షేమమనే మాట పై లేఖలో ఏముంది?
జవాబు:
ఉభయ కుశలోపరి.

ఆ) మనం ఏం పాటించాలి అని లేఖలో ఉంది?
జవాబు:
నైతిక విలువలు.

ఇ) ఏ సమయంలో డబ్బులు అడిగేవారికి తప్పక ఇవ్వాలి?
జవాబు:
వైద్య సహాయం కోసం.

ఈ) భగవంతుడు మెచ్చాలంటే ఏమి చేయాలి?
జవాబు:
పేదలకు దానం చేయాలి.

AP 10th Class Telugu 12th Lesson Important Questions సూక్తి సుధ

8. ఈ కింది కరపత్రం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

ఆచార్య దేవోభవ

సంఘంలో మానవుల అభివృద్ధికి తల్లిదండ్రుల తర్వాత గురువులే ప్రధానపాత్ర వహిస్తారు. అందుకే మన ఉపనిషత్తులు ‘ఆచార్యదేవోభవ’ అని గురువును దైవంగా సేవించమని చెప్పాయి.

గురువులు తమకు అప్పగించిన విద్యార్థులకు ఎంతోకష్టపడి విద్యను బోధిస్తారు. వారిని విద్యావంతులుగా తీర్చి దిద్దుతారు. అందువల్ల విద్యార్థులూ, వారి తల్లిదండ్రులూ గురువులను గౌరవించాలి. అందుకే సర్. యస్. రాధాకృష్ణన్ గారు తన పుట్టిన రోజును అధ్యాపక దినోత్సవంగా జరుపుకోమని చెప్పారు. ఆనాడు ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానిస్తారు.
అమరావతి

ఇట్లు,
ఆంధ్రప్రదేశ్ విద్యార్ధి బృందం.

ప్రశ్నలు – జవాబులు

అ) మానవుల అభివృద్ధికి ప్రధానపాత్ర వహించే వారిలో మొదటి వారెవరు?
జవాబు:
మానవుల అభివృద్ధికి ప్రధానపాత్ర వహించే వారిలో మొదటివారు తల్లిదండ్రులు.

ఆ) విద్యార్థులు తన గురువులనెందుకు గౌరవించాలి?
జవాబు:
గురువులు ఎంతో కష్టపడి విద్యావంతులుగా తీర్చిదిద్దుతారు కాబట్టి విద్యార్థులు తమ గురువులను గౌరవించాలి.

ఇ) ఉపాధ్యాయులు ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి?
జవాబు:
ఉపాధ్యాయులు సర్. యస్. రాధాకృష్ణన్ను ఆదర్శంగా తీసుకోవాలి.

ఈ) పై కరపత్రానికి తగిన ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
‘ఆచార్య దేవోభవ’ అని ఎందుకు అన్నారు?

9. కింది కరపత్రాన్ని చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

అమృత హృదయులారా! ఆదుకోండి

అనాథలను ఆదుకోవడం మన కర్తవ్యం. మానవసేవే మాధవసేవ అన్నారు పెద్దలు. తోటి మనిషిని ఆదరించండి. పట్టెడన్నం పెట్టండి. సమాజానికి ఉపయోగపడే మాణిక్యాలను మట్టిలో కలిసిపోనీయకండి. ఇది మన బాధ్యత. వాళ్ళు కూడా మన సోదరులే, భగవంతుడికి ‘దరిద్ర దామోదరుడ’ని పేరు. అనాథలలో దైవాన్ని సందర్శించండి. ఆదరించండి. తీర్చిదిద్దండి. భరతమాత సేవలో పునీతులవ్వండి.

ఇట్లు,
అనాథల పెద్ద అన్న.

ప్రశ్నలు – జవాబులు

అ) పెద్దలు ఏమన్నారు?
జవాబు:
మానవసేవే మాధవసేవ అన్నారు పెద్దలు

ఆ) భగవంతునికి ఏమని పేరు?
జవాబు:
దరిద్ర దామోదరుడు

ఇ) ‘పట్టెడన్నం’ పదం విడదీయండి.
జవాబు:
పట్టెడు+అన్నం

ఈ) ఈ కరపత్రంలో సంబోధన ఏది?
జవాబు:
అమృత హృదయులారా!

వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘సూక్తి సుధ’ పాఠ్యాంశం ఏ ప్రక్రియకు సంబంధించింది వివరించండి.
జవాబు:
సూక్తి సుధ అనే పాఠ్యాంశం వ్యాస ప్రక్రియకు సంబంధించినది. ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని పూర్వాపరాలను చర్చిస్తూ, విశ్లేషణాత్మకంగా విస్తరించి రాసేదాన్ని వ్యాసం అంటారు. ఇందులో పరిచయం, విషయ విస్తరణ, ముగింపు వంటివి ప్రధాన భాగాలుగా ఉంటాయి. వ్యాసంలోని విషయాన్ని బట్టి రాజకీయ, సాంస్కృతిక, శాస్త్ర, వైజ్ఞానిక, సాహిత్య, తాత్విక, ఆధ్యాత్మిక మొదలైన విభాగాలుగా విభజించవచ్చు.

ఆ) ఈ క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘స్వలాభాపేక్ష’ గురించి మరియు ఎవరిని మహాత్ముడని అన్నమయ్య అన్నాడు?
జవాబు:
స్వలాభాపేక్ష అంటే కేవలం తన శ్రేయస్సుని తాను చూసుకోవడం. దీనికొరకు మానవుడు బానిసగా బతకడానికి కూడా సిద్ధం అవుతాడు. స్వలాభం కోసం ఇతరులను కొలవడం, యాచించడం దైన్యమైన చర్యలుగా అన్నమయ్య అన్నారు. అడవిలో జంతువులు, పక్షులు పరుల మీద ఆధారపడకుండా బతుకుతాయి. మనిషి ‘స్వలాభాపేక్ష’ ను విడిచి పెట్టాలని, మంచి పనుల ద్వారా జీవించాలని తెలిపాడు.

కులమూ, జాతి, మతమూ వీటికి ప్రాధాన్యం ఇవ్వకుండా ఉండాలి. మనుషుల మధ్య భేదాలు, అంతస్తులు కల్పించకూడదు. సుఖమయ జీవితాలలో, తన స్వార్ధం కోసం చిచ్చు పెట్టకూడదు. అధిక, హీన లేదా కుల మత భేధాలు చూపుతున్నా కూడా వాటిలో వాస్తవాలను గ్రహించాలి. నీతిని గ్రహించి జీవనం సాగించినవాడు మహాత్ముడని అన్నమయ్య అన్నాడు.

ప్రశ్న 2.
‘సూక్తి సుధ’ పాఠ్యాంశం ద్వారా మనం నేర్చుకోదలచిన వ్యక్తిత్వ వికాస విషయాలు ఏమిటి?
జవాబు:
కవి పరిచయం :
సూక్తిసుధ అనే పాఠ్యాంశాన్ని అన్నమయ్య సంకీర్తనల ఆధారంగా ఎస్. గంగప్పగారు రచించారు. ఇందులో అన్నమయ్య సంకీర్తనల ద్వారా అనేక వ్యక్తిత్వ వికాస సంగతులు రచయిత తెలియజేశారు.

1. సచ్ఛీలత :
మానవుడికి శీలం చాలా ప్రధానమైనది. మనిషి తెలిసి కూడా తప్పులు చేస్తున్నాడు. పాండిత్యం, చదువు, ఉన్నా సరే చెడు మార్గంలో వెళ్ళకూడదు. సచ్ఛీలత కలిగి ఉండాలి.

2. స్థిరబుద్ధి :
మనిషి మనసు చంచలమైనది. నిమిష నిమిషాలు ఆలోచనలు మారుతూ ఉంటాయి. అందువలన స్థిర బుద్ధి కలిగి ఉంటే, మంచి వ్యక్తిత్వం అలవడుతుంది.

3. శ్రమించేతత్వం :
మానవులు శ్రమించే తత్వాన్ని అలవరచుకోవాలి. సులభదనం కోసం ఆశపడరాదు. దోపిడీ ద్వారా వచ్చే డబ్బు మంచిది కాదు. నిందల పాలు గాకుండా జీవించాలి. సోమరితనం విడనాడాలి, దేనినైనా సాధించగలమనే నమ్మకం ఉండాలి. మన శక్తి సామర్థ్యాలతో విజయం సాధించాలి.

4. అంతఃశత్రువులను జయించడం :
మానవుడు బయట శత్రువులను జయించే ముందు అరిషడ్వర్గాలను జయించాలి. ఆత్మ నిగ్రహంతో వాటికి లోనుగాకుండా ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనిషి ఎంతటి పనినైనా సాధించగలదు. 5. పుట్టుక చావు మానవ జీవితం ఒక నాటకం. జీవితంలో రెండే రెండు ఘట్టాలు ముఖ్యమైనవి. అవి పుట్టడం, గిట్టడం. ఈ బతుకు నుండి విముక్తి పొందాలి. జీవితం ఒక నాటకమని తెలుసుకొని మన పాత్రను మనం సమర్థవంతంగా పోషించాలి.

6. సమయపాలన :
అన్నమయ్య తన కీర్తనలలో వృథాగా కాలం గడపడం గురించి కూడా వ్యాఖ్యానించారు. కాలమూ, వయస్సు, రెండు గడచిపోతూ ఉంటాయి. ఇవి కాసేపు కూడా ఆగవు. అందువలన ఎప్పటి పనులు అప్పుడు చేసుకుంటూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి.

7. ఆత్మ పరిశీలన :
వ్యక్తిత్వ వికాసంలో ఆత్మపరిశీలన చాలా కీలకమైంది. విద్యార్థి లేదా మనిషి ఎప్పటికప్పుడు తనలోకి తాను చూసుకోవాలి. నేను ఏం చేస్తున్నాను? సరియైన మార్గంలో వెళ్తున్నానా? నా మనస్సు స్థిరంగా ఉంటుందా ఇలా ప్రశ్నించుకోవాలి. తనని తాను మెరుగులు దిద్దుకోవాలి. ఈర్ష్య, అసూయ, ద్వేషం వదిలివేయాలి.

8. గెలుపు ఓటమి :
గెలుపు గానీ, ఓటమి గానీ శాశ్వతం కావు. విజయం రాగానే గర్వపడకూడదు. ఓడిపోగానే ఇతరుల మీద నిందలు వేయకూడదు. మానవ ప్రయత్నం చేయాలి. ఫలితం ఏదైనా స్వీకరించాలి. ఓడిన వారిని గేలి చేయకూడదు.

AP 10th Class Telugu 12th Lesson Important Questions సూక్తి సుధ

ఇ) కింది అంశాల గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.

ప్రశ్న 1.
‘సూక్తి సుధ’ పాఠం ఆధారంగా 10 సూక్తులు తయారుచేయండి.
జవాబు:

  1. కులము కన్నా గుణము ప్రధానం.
  2. పరనింద పనికిరాదు.
  3. పరుల సొమ్ము పాము వంటిది.
  4. రాజు నిద్ర, బంటు నిద్ర ఒక్కటే.
  5. ఏనుగు మీద, కుక్కు మీద పడిన ఎండ ఒక్కటే.
  6. ఆత్మ ప్రశంస కంటే ఆత్మ పరిశీలనే ప్రధానం.
  7. వృథాగా కాలం గడపడం సముచితం కాదు.
  8. ఆత్మ నిగ్రహమే ఉత్తమ జీవన మార్గం.
  9. సులభ ధనం వద్దు – కష్టపడి సంపాదించిన ధనమే ముద్దు.
  10. సరస జీవనం గడపాలి విరస వర్తనం వదలాలి.
  11. ఎన్ని చదువులు చదివినా నీతిగా బ్రతకడమే ఉత్తమ మార్గం.
  12. సోమరితనం పెద్ద రోగం, దానికి మందు లేదు.
  13. బానిసగా బతకడం కంటే భగవంతునికి దాసుడుగా ఉండటమే మేలు..

ప్రశ్న 2.
‘క్రమశిక్షణాయుతమైన జీవితం’ గురించి మిత్రుడు/మిత్రురాలికి లేఖ రాయండి.
జవాబు:

నాయుడుపేట,
X X X X X.

ప్రియమైన మిత్రుడు అగస్త్యకు,

నేను క్షేమంగానే ఉన్నాను. అక్కడ మీ అమ్మా, నాన్న, అక్క మన మిత్రులంతా క్షేమంగా ఉన్నారు కదా! మా తెలుగు మాష్టారు మాకు ‘సూక్తి సుధ’ అనే పాఠ్యాంశాన్ని చక్కగా చెప్పారు. అందులో అన్నమయ్య మన జీవితాలు ఎలా ఉండాలో, హృద్యంగా తెలిపారు. నీకు కూడా అవి పంచుదామని ఈ లేఖ రాస్తున్నాను.

మనం ఆటల్లో గానీ, పరీక్షల్లో గానీ విజయం సాధించినపుడు గర్వపడకూడదు. మనల్ని మనమే ప్రశంసించుకోరాదు. అలాగే ఓడిపోయినప్పుడు కూడా, ఎవరినీ నిందించకూడదు. ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

జీవితంలో ఎంత చదువు చదివినా నీతి మార్గాన్ని వదలకూడదు. సోమరితనం పనికిరాదు. పరుల సొమ్ము ఆశించకూడదు. మనకున్న శక్తిసామర్థ్యాలతో దేన్నైనా సాధించగలగాలి. వృథాగా కాలం గడపకూడదు. ఆకారణంగా ఇతరుల్ని దూషించరాదు. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలనబడే అరిషడ్వర్గాలను సాధన ద్వారా జయించాలి. మిత్రమా ! అన్నమయ్య చాలా చక్కని విషయాలు చెప్పారు కదా ! మనం కూడా మన జీవితాన్ని క్రమశిక్షణా. యుతంగా గడుపుదాం.
ఉంటాను. మీ అమ్మా, నాన్నలకు నా నమస్కారాలు తెలియజేయగలవు. మన స్నేహితులందరినీ అడిగినట్లు చెప్పు.

ఇట్లు,
శ్రీకృష్ణప్రియ,

చిరునామా:
ఎస్. శ్రీకృష్ణప్రియ,
10వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
తాడేపల్లి గూడెం, పశ్చిమగోదావరి జిల్లా.

AP 10th Class Telugu 12th Lesson Important Questions సూక్తి సుధ

ప్రశ్న 3.
మన సమాజంలోని సాంఘిక దురాచారాల గురించి వ్యాసం రాయండి.
జవాబు:
పరిచయం :
మనం 21వ శతాబ్దంలో ఉన్నాము. అయినా ఇంకా సమాజంలో అనేక సాంఘిక దురాచారాలు, మూఢ నమ్మకాలు ఉన్నాయి. వాటిని అధిగమించి మనమంతా సంఘ సంస్కరణ వైపు నడవాలి.

విషయ వివరణ :
మన సమాజంలో బాల్య వివాహాలు, లంచగొండితనం, కులమత భేదాలు, వరకట్న సమస్య, మద్యపానం, ధూమపానం లాంటి సమస్యలు ఉన్నాయి.

బాల్య వివాహాలు :
మన దేశంలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో వివాహ వయస్సు (18 సం॥) ముందే వివాహాలు జరుగుతున్నాయి. వీటిని ఆపడానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉన్నాయి. కానీ కొన్ని ప్రాంతాలలోను, తెగల్లోను ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది.

లంచగొండితనం :
మనదేశం ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలలోనే ఇంకా ఉండటానికి లంచగొండితనం, అవినీతి ప్రధాన కారణం. సామాన్యంగా కాని పనుల కోసం లంచం డబ్బు, బంగారు, ఆస్తి రూపంలో ఇచ్చి ఒప్పిస్తారు. లంచం ఏ రూపంలో జరిగినా నేరమే. మన సమాజంలో అవినీతి ఏ రూపంలో ఉన్నా అరికట్టాల్సిన అవసరం ఉంది. కుల, మత భేదాలు భారతదేశం ప్రజాస్వామ్య దేశం. లౌకికవాద దేశం. అందరూ సమానమే అని చెప్తూనే ఉన్నా. కులం, మతం పేరు మీద కుట్రలు, అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. గ్రామాల్లో కులం పేరు మీద దూషించడం, మత భేదాలు చూపడం జరుగుతూ ఉంది. కొన్ని మతాల, కులాల వారికి ఇల్లు అద్దెకు దొరకడం కూడా కష్టంగా ఉంది.

వరకట్న సమస్య :
1961లో వరకట్న నిషేధ చట్టం తీసుకొచ్చారు. కానీ వరకట్నం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. ఒకప్పుడు కన్యాశుల్కం, ఇప్పుడు వరకట్నం. ఇది కూడా డబ్బు, వాహనం, బంగారు, ఆస్తి రూపాలలో అమ్మాయి (వధువు), అబ్బాయి (వరుదు)కి ఇస్తారు. ఆడపిల్ల తండ్రులకు వరకట్నం చాలా భారంగా మారింది. కానీ అది ఒక సంప్రదాయంగా మారడం విడ్డూరంగా ఉంది.

మద్యపానం :
మద్యపానం ఈనాటి సమాజంలో విపరీతంగా పెరిగింది. యువత మద్యపానానికి అలవాటు పడుతున్నారు. మత్తు పానీయాలు కూడా స్వీకరిస్తున్నారు. కూలీ నాలీ చేసుకొని బతికేవారు కూడా సంపాదించిన డబ్బుని, మద్యానికి బానిసలై ధారబోస్తున్నారు. తాగిన మైకంలో స్త్రీల మీద దాడులు, అసభ్యంగా ప్రవర్తించడం చేస్తున్నారు. మద్యపాన నిషేధం చేస్తే, సమాజం చాలా బాగుంటుంది.

ముగింపు :
ఈ దురాచారాలే గాకుండా రకరకాల మూఢనమ్మకాలు కూడా సమాజంలో ఉన్నాయి. విద్యావంతులు, ప్రభుత్వాలు వీటిని రూపుమాపడానికి కృషి చేయాలి. మంచి సమాజం కోసం పాటుపడాలి.

ప్రశ్న 4.
అన్నమయ్య ఆరాధనోత్సవాలను గురించి తెలుపుతూ ఒక కరపత్రాన్ని తయారుచేయండి.
జవాబు:

అన్నమయ్య అరాధనోత్సవాలు

23 మే 2024న అన్నమయ్య జయంతి సందర్భంగా విజయవాడ “సంగీత విభావరి” వారు అన్నమయ్య ఆరాధనోత్సవాలు జరుపుటకు నిశ్చయించినారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అన్నమయ్య కీర్తనల పోటీని యువతకు ఏర్పాటు చేయడమైనది. ఈ పోటీల్లో అన్నమయ్య కీర్తనల్లో శృంగార కీర్తనలు, ఆధ్యాత్మిక కీర్తనలు, జానపద కీర్తనలు వీటిని పాడవలసి యుంటుంది.

వయస్సు 16 సం|| నుండి 40 సం||లు వారు మాత్రమే అర్హులు.

పదకవితా పితామహుడు, సంకీర్తనాచార్యుడైన అన్నమయ్య తెలుగు పద కవితకు ఆద్యుడు. వీరు తెలుగు సాహిత్యంలో తొలిసారిగా సంకీర్తన రచనకు శ్రీకారం చుట్టి, యోగ, వైరాగ్య, శృంగార, ఆధ్యాత్మిక తత్వాలకు చెందినవి రచించి, పరమాత్మ ప్రణయాన్నీ, భక్తి, మధుర భక్తిప్రపత్తుల్ని ప్రకటించారు.

కనుక తామెల్లరూ విచ్చేసి, అన్నమయ్య ఆరాధనోత్సవాలను తిలకించి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము.
ప్రతులు: 5000
ప్రచురణ వి.జి.యస్. పబ్లిషర్సు,
విజయవాడ.

ఇట్లు,
సంగీత విభావరి,
అన్నమయ్య ఆరాధనోత్సవ కమిటీ,
విజయవాడ.

భాషాంతాలు (పదజాలం వ్యాకరణాంశాలు)

కింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి.

అలంకారాలు

కింది వాక్యంలోని అలంకారాన్ని గుర్తించి రాయండి.

1. సుదతీ నూతన మదనా
మదనాగ పూర్ణ మణి మయ సదనా
జవాబు:
ఇది ముక్తపదగ్రస్త అలంకారం.
ఒక పద్యపాదం గానీ / వాక్యం గానీ ఏ పదంతో పూర్తవుతుందో అదే పదం/వాక్యంతో తరువాత పాదం ప్రారంభం కావడం ముక్తపదగ్రస్తం.

2. గోదావరి గట్టు, గట్టు మీద చెట్టు, చెట్టు మీద, పిట్ట.
జవాబు:
ఇది ముక్తపదగ్రస్త అలంకారం.
ఒక పద్యపాదం గానీ / వాక్యం గానీ ఏ పదంతో పూర్తవుతుందో అదే పదం/వాక్యంతో తరువాత పాదం ప్రారంభం కావడం ముక్తపదగ్రస్తం.

3. మానవుడు పాప పంకిలంలో పడిపోక సచ్చీలుడై ఉండాలి.
జవాబు:
ఇది రూపకాలంకారం.
ఉపమేయానికి, ఉపమానానికి అభేదం చెప్పడం రూపకం,

4. కాచుక శ్రీహరి నీవే కరుణింతు గాక
అడవిలో మృగజాతియైన గావచ్చు గాక
జవాబు:
అంత్యానుప్రాసాలంకారం.
పద్యపాదం లేదా వాక్యం చివర ఒకే రకమైన పదాలు పునరావృతం కావడం అంత్యానుప్రాస, 5. శ్రీకాంత్ చొక్కా మల్లెపూవులాగా తెల్లగా ఉంది. జ. ఉపమాలంకారం.
ఉపమేయానికి, ఉపమానానికి మనోహరమైన పోలిక చెప్పడం ఉపమాలంకారం.

అర్ధాలు

అ) గీత గీసిన పదానికి అర్థం రాయండి.

6. తామర పంకిలంలో పూస్తుంది.
జవాబు:
బురద

7. అడవిలో చిచ్చు రేగింది.
జవాబు:
మంట

8. నరులు సచ్ఛీలంతో ఉండాలి.
జవాబు:
మానవులు

9. రాజు, బంటు నిద్ర ఒక్కటే
జవాబు:
సేవకుడు

10. కుజ్జన, సజ్జనుల మైత్రి ఛాయ పోలికలో ఉంటుంది.
జవాబు:
నీడ

11. రోజాపూల పరిమళం చాలా బాగుంది.
జవాబు:
సువాసన

12. వీథిలో శునకాల బెడద తీవ్రంగా ఉంది.
జవాబు:
కుక్కలు

13. మతి చంచలమైనది.
జవాబు:
బుద్ధి

14. ఎల్లప్పుడూ నిక్కమే మాట్లాడాలి.
జవాబు:
నిజం

15. ప్రాయం మీరకముందే జీవితం విలువ తెలుసుకోవాలి.
జవాబు:
వయస్సు

16. పరుల కొరకు చెట్లు పూలు పూస్తాయి.
జవాబు:
ఇతరులు

17. సమాజంలో నేరాలు అధికం అయ్యాయి.
జవాబు:
ఎక్కువ

AP 10th Class Telugu 12th Lesson Important Questions సూక్తి సుధ

అ) గీత గీసిన పదానికి సరియైన అర్థాన్ని గుర్తించండి.

18. సంపన్నులు పేదలను ఆదుకోవాలి.
అ) గొప్పవారు
ఆ) ధనవంతులు
ఇ) దరిద్రులు
ఈ) నాయకులు
జవాబు:
ఆ) ధనవంతులు

19. ఇతరులను దూషణ చేయడం తగదు.
అ) పొగడటం
ఆ) నిందించడం
ఇ) అరవడం
ఈ) కొట్టడం
జవాబు:
ఆ) నిందించడం

20. మానవుని వాంఛలకు హద్దులు ఉండాలి.
అ) కోరిక
ఆ) ఆశయం
ఇ) లక్ష్యం
ఈ) గమ్యం
జవాబు:
అ) కోరిక

21. ఎవరినీ హీనంగా చూడకూడదు.
అ) ఎక్కువ
ఆ) అధికం
ఇ) తక్కువ
ఈ) గొప్పగా
జవాబు:
ఇ) తక్కువ

22. ఆయనకు సంగీతంలో పాండిత్యం ఎక్కువ.
అ) జ్ఞానం
ఆ) ప్రవేశం
ఇ) అవగాహన
ఈ) అజ్ఞానం
జవాబు:
అ) జ్ఞానం

23. మంచి పనులు చేస్తే సద్గతి కలుగుతుంది.
ఆ) నరకం
అ) స్వర్గం
ఇ) మోక్షం
ఈ శాంతి
జవాబు:
ఇ) మోక్షం

24. అన్యులను తక్కువగా చూడకు.
అ) పేదలను
ఆ) ఉన్నతులను
ఇ) ఇతరులను
ఈ) స్త్రీలను
జవాబు:
ఇ) ఇతరులను

25. వృథాగా కాలం గడపరాదు.
అ) సరదా
ఆ) వ్యర్థం
ఇ) దుఃఖం
ఈ) వేగం
జవాబు:
ఆ) వ్యర్ధం

పర్యాయపదాలు

అ) గీత గీసిన పదానికి పర్యాయ పదాలు రాయండి.

26. పుడమి మీద మొక్కలు పెంచాలి.
జవాబు:
నేల, భూమి

27. అంతః శత్రువులను జయించాలి.
జవాబు:
రిపుడు, అరి

28. చిత్తంలో చింతలు ఉండకూడదు.
జవాబు:
మనస్సు, బుద్ధి

29. కాయమనే పూరికి తొమ్మిది కంతలు.
జవాబు:
తనువు, మేను

30. తన కోపమే తన శత్రువు,
జవాబు:
క్రోథము, క్రుధ

31. గరుత్మంతుడు ఒక పక్షి.
జవాబు:
ఖగము, విహంగము

32. ప్రమాదాల్లో ఎందరో ఉసురు కోల్పోతున్నారు.
జవాబు:
ప్రాణం, జీవం

33. మన శక్తి సామర్థ్యాలతో ఏదైనా సాధించగలం.
జవాబు:
చేవ, బలం

34. ఎవరి పట్ల ఈర్ష్య ఉండరాదు.
జవాబు:
అసూయ, మాత్సర్యం

35. విజయం సొంతం కావాలంటే కష్టపడాలి.
జవాబు:
గెలుపు, జయం

AP 10th Class Telugu 12th Lesson Important Questions సూక్తి సుధ

ఆ) గీత గీసిన పదానికి సరియైన పర్యాయ పదాలు గుర్తించండి.

36. నానాటి బతుకు నాటకం.
అ) కాలం, సమయం
ఆ) జీవితం, జీవనం
ఇ) కాయం, దేహం
ఈ) వయస్సు, సమయం
జవాబు:
ఆ) జీవితం, జీవనం

37. కడిగి యేనుగు మీద గాయు యెండొకటే.
అ) గుర్రం, అశ్వం
ఆ) కరి, దంతి
ఇ) శునకం, శలభం
ఈ) మహీషం, దున్న
జవాబు:
ఆ) కరి, దంతి

38. చింత మనిషిని ఇబ్బంది పెడుతుంది.
అ) పులుపు, చింతపండు
ఆ) చీకటి, అంధకారం
ఇ) బెంగ, దిగులు
ఈ) కోరిక, అశ
జవాబు:
ఇ) బెంగ, దిగులు

39. కుక్క మీద కాసే ఎండ ఒక్కటే.
అ) శునకము, గ్రామసింహం
ఆ) అజ్జవాలు, జ్ఞాని
ఇ) శిఖి, కోడి
ఈ) శిఖండి, చూలికం
జవాబు:
అ) శునకము, గ్రామసింహం

40. సుగంధ, దుర్గంధాలను మోసే వాయువు ఒక్కటే.
అ) పవనం, గాలి
ఆ) వాహకం, వాహనం
ఈ) నీడ, ప్రతిబింబం
ఇ) బండి, వాహనం
జవాబు:
అ) పవనం, గాలి

41. ఒకరి నీడలో బ్రతకకూడదు.
అ) ఛాయ, ప్రతిబింబం
ఆ) ఇల్లు, గృహం
ఇ) గది, వసతి
ఈ) చోటు, స్థలం
జవాబు:
అ) ఛాయ, ప్రతిబింబం

42. సింహం ఒక మృగం.
అ) రాజు, ఱేడు
ఆ) జంతువు, పశువు
ఇ) లేడి, నక్షత్రం
ఈ) క్రూరం, కఠినం
జవాబు:
ఆ) జంతువు, పశువు

43. కాముడనే రాజు గద్దె మీద ఉన్నాడు.
అ) గోడ, కుడ్యం
ఆ) పేట, కుర్చీ
ఇ) సింహాసనం, ఉన్నత పీఠం
ఈ) గద్యము, పద్యము
జవాబు:
ఇ) సింహాసనం, ఉన్నత పీఠం

44. ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి.
అ) మనస్సు, బుద్ధి
ఆ) కోరిక, ఆశ
ఇ) గమ్యం, లక్ష్యం
ఈ) జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు
జవాబు:
ఈ) జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు

45. దివిలో దేవతలు ఉంటారు.
అ) ఆకాశం, గగనం
ఆ) స్వర్గం, నాకం
ఇ) గుడి, దేవాలయం
ఈ) నీరు, జలం
జవాబు:
అ) ఆకాశం, గగనం

ప్రకృతి – వికృతులు

అ) గీత గీసిన పదానికి సరియైన ప్రకృతి పదం రాయండి.

46. మనసు తిరంగా ఉండదు.
జవాబు:
స్థిరం

47. సుకం కోసం అర్రులు చాచకూడదు.
జవాబు:
సుఖం

48. నిక్కమెరిగిన వాడు మహాత్ముడు.
జవాబు:
నిజం

49. ఆకాశంలో పక్కి ఎగిరింది.
జవాబు:
పక్షి

50. దేశం కోసం ఎన్ని చాగాలైనా చేయాలి.
జవాబు:
త్యాగం

51. అడవిలో చిచ్చు రేగింది.
జవాబు:
శుచి

52. బంటు నిద్దుర పోయాడు.
జవాబు:
నిద్ర

53. ఎవరి మీద ఈసు ఉండకూడదు.
జవాబు:
ఈర్ష్య

54. కులం కన్నా గొనం మిన్న.
జవాబు:
గుణం

55. అందరూ బోనం చేశారు.
జవాబు:
భోజనం

AP 10th Class Telugu 12th Lesson Important Questions సూక్తి సుధ

ఆ) గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.

56. విద్య లేనివాడు వింత పశువు,
అ) చదువు
ఆ) విద్దె
ఇ) సదువు
ఈ) విదియ
జవాబు:
ఆ) విదై

57. రాట్ గద్దె మీద ఉన్నాడు.
అ) ప్రభువు
ఆ) తేడు
ఇ) అధికారి
ఈ) నాయకుడు
జవాబు:
ఆ) తేడు

58. ఆశ ఉండాలి గానీ అత్యాశ పనికిరాదు.
అ) బాస
ఆ) ఆస
ఇ) కోరిక
ఈ) మూస
జవాబు:
ఆ) ఆస

59. దేవునీ దృష్టిలో అందరూ సమానమే.
అ) చూపు
ఆ) దిష్టి
ఇ) దుష్ట
ఈ) దర్శనం
జవాబు:
ఆ) దిష్టి

60. ఇంటికి దీపము ఇల్లాలు.
అ) వెలుగు
ఆ) దవ్వు
ఇ) దివ్వె
ఈ) దివ్యం
జవాబు:
ఇ) దివ్వె

61. చెట్టు ఛాయలో కూర్చున్నారు.
అ) నీడ
ఆ) చాయ
ఇ) సాయ
ఈ) చేయి
జవాబు:
ఆ) చాయ

62. ఏడుగడలు జీవితానికి ప్రాకారం లాంటివి.
అ) పాకారం
ఆ) ప్రహరి
ఇ) ఆధారం
ఈ ప్రకారం
జవాబు:
ఆ) ప్రహరి

నానార్థాలు

అ) గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి.

63. ఏనుగు మీద ఎండ, కుక్కమీద ఎండ ఒక్కటే.
జవాబు:
వెలుగు, ఆతపం

64. హరిని చూసి హరి చెట్టు ఎక్కింది.
జవాబు:
సింహం, కోతి

65. మీ పురంలో మీ పురమెక్కడ?
జవాబు:
పట్టణం, ఇల్లు

66. ఛాయ లో నిలబడినవాడు నీ ఛాయలో ఉన్నాడు.
జవాబు:
నీడ పోలిక

AP 10th Class Telugu 12th Lesson Important Questions సూక్తి సుధ

ఆ) గీత గీసిన పదానికి సరైన నానార్థాలు గుర్తించండి.

67. దోసము, చేసినవాడు దోసము అనుభవిస్తాడు.
అ) తప్పు, శిక్ష
అ) శిక్ష, పుణ్యం
ఇ) తప్పు, పాపము
ఈ) దోషం, శిక్ష
జవాబు:
ఇ) తప్పు, పాపము

68. ఈ జాడ, జాడ మీకు తెలుసా?
అ) మార్గం, రహదారి
ఆ) దారి, ఆచూకీ
ఇ) వీధి, కలుగు
ఈ) దారి, త్రోవ
జవాబు:
ఆ) దారి, ఆచూకీ

69. ఈ తగవు కి తగవు ఎవరు చెప్తారు?
అ) గొడవ, న్యాయం
ఆ) ధర్మం, కొట్లాట
ఇ) గొడవ, పరిష్కారం
ఈ) న్యాయం, సమస్య
జవాబు:
అ)గొడవ, న్యాయం

70. ఈ కాలంలో ఆకాశం కాలంగా ఉంది.
అ) సమయం, నలుపు
ఆ) దిక్కు, సమయం
ఇ) నలుపు, సమయం
ఈ) ఎరుపు, శరీరం
జవాబు:
అ) సమయం, నలుపు

71. మతికి మతి ఉండాలి.
అ) తెలివి, ఎఱుక
ఆ) ఎఱుక, శరీరం
ఇ) బుద్ధి, జ్ఞానం
ఈ) మనిషి, మహిమ
జవాబు:
అ) తెలివి, ఎఱుక

వ్యుత్పత్యరాలు

అ) గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్థం రాయండి.

72. కరి చెఱకు తింటోంది.
జవాబు:
కరము (తొండం) కలది – ఏనుగు

73. మోక్షం కొరకు వారిని ప్రార్థించాలి.
జవాబు:
జీవుడిని పాశం నుండి విడిపించేది. – ముక్తి

74. ఈ ధరణిలో అందరూ సమానమే.
జవాబు:
విశ్వాన్ని ధరించేది – భూమి

75. మానవుడు సచ్ఛీలత కలిగి ఉండాలి.
జవాబు:
మనువు నుండి పుట్టినవాడు – మనిషి

76. పరుల ద్రవ్యం ఆశించకూడదు.
జవాబు:
పొందదగినది – ధనం

AP 10th Class Telugu 12th Lesson Important Questions సూక్తి సుధ

ఆ) గీత గీసిన పదానికి సరైన వ్యుత్పశ్వరాన్ని గుర్తించండి.

77. గరుత్మంతుడు ఒక పక్షి.
అ) పురుగులను తినేది – బల్లి
ఆ) పక్షములు కలది – పిట్ట
ఇ) శరీరమును కప్పి ఉంచేది – బట్ట
ఈ) అన్నాన్ని దొంగిలించేది – ఎలుక
జవాబు:
ఆ) పక్షములు కలది – పిట్ట

78. ఈశ్వరుడు దృష్టిలో అందరూ సమానమే.
ఆ) స్వభావం చేత ఐశ్వర్యం కలవాడు – శివుడు
ఆ) ఐశ్వర్యం ఇచ్చేవాడు – ఇంద్రుడు
ఇ) మంగళప్రదమైన ఆలోచన కలిగించేవాడు – శివుడు
ఈ) ఆస్తిని పెంచేవాడు – కుమారుడు
జవాబు:
అ) స్వభావం చేత ఐశ్వర్యం కలవాడు – శివుడు

79. పుత్రుడు పుత్రికా సమానమే.
అ) వంశం పెంచేవాడు – కొడుకు
ఆ) వార్ధక్యంలో పోషించేవాడు – బిడ్డ
ఇ) పున్నామ నరకం నుండి రక్షించేవాడు – సుతుడు
ఈ) ఆస్తిని పెంచేవాడు – కుమారుడు
జవాబు:
ఇ) పున్నామ నరకం నుండి రక్షించేవాడు – సుతుడు

80. దేహికి సుఖదుఃఖాలు తప్పవు.
అ) దేహి అనేవాడు – యాచకుడు
ఆ) మానవత్వం కలవాడు. నరుడు
ఇ) దేహం కలది – జీవి
ఈ) మంచితనం కలవాడు – మనిషి
జవాబు:
ఇ) దేహం కలది – జీవి

81. పంకజం అద్భుతంగా ఉంది.
అ) బురద నుండి పుట్టినది – తామర
ఆ) నేల నుండి పుట్టింది – చెట్టు
ఇ) కలువ నుండి పుట్టింది – లక్ష్మీ
ఈ) హృదయంలో జనించేది – కోరిక
జవాబు:
అ) బురద నుండి పుట్టినది – తామర.

జాతీయాన్ని గుర్తించడం

వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి విడిగా రాయండి.

82. గెలిచినా సరే విజయగర్వం పనికిరాదు.
జవాబు:
విజయగర్వం

83. అన్నమయ్య సంకీర్తనలలోని విషయాలు కాలధర్మం చెందవు.
జవాబు:
కాలధర్మం

84. సంకీర్తనాకారులలో అన్నమయ్యది అగ్రతాంబూలం.
జవాబు:
అగ్రతాంబూలం

85. ఎంత పాండిత్యం గడిచినా పాప పంకిలంలో పడ కూడదు.
జవాబు:
పాప పంకిలం

86. భగవంతుని దృష్టిలో హెచ్చుతక్కువలు ఉండవు.
జవాబు:
హెచ్చుతక్కువలు

జాతీయము సందర్భము

ఈ జాతీయాన్ని ఏ అర్థంలో / సందర్భంలో ఉపయో గిస్తారో రాయండి.

87. కనువిప్పు
జవాబు:
జ్ఞానోదయం అనే సందర్భంలో ఉపయోగిస్తారు.

88. అగమ్యగోచరం
జవాబు:
ఏమి అర్థం కానీ పరిస్థితి అనే సందర్భంలో వాడతారు.

89. ఏకరువు పెట్టడం
జవాబు:
‘పదే పదే చెప్పడం’ అనే సందర్భంలో ఉపయోగిస్తారు.

AP 10th Class Telugu 12th Lesson Important Questions సూక్తి సుధ

90. వెన్నతో నేర్పిన విద్య
జవాబు:
చిన్నతనం నుండే నేర్చుకొను అనే సందర్భంలో ఉపయోగిస్తారు.

సంధి పదాలను విడదీయడం

గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి.

91. శ్రీరాముడు సచ్ఛీలుడు.
జవాబు:
సత్ + శీలుడు

92. స్వలాభాపేక్ష మంచిది కాదు.
జవాబు:
స్వలాభ + ఆపేక్ష

93. దేశం కోసం ఎలాంటి త్యాగాలైనా చేయాలి.
జవాబు:
త్యాగాలు + అయినా (ఐనా)

94. పేద, ధనికులకు ఆకలొకటే.
జవాబు:
ఆకలి + ఒకటే

95. మన ఎట్టమొదటనే ప్రమాదాలు జరుగుతుంటాయి.
జవాబు:
ఎదుట + ఎదుట

96. మంచివారికి సద్గతి కలుగుతుంది.
జవాబు:
సత్ + గతి

97. క్రమశిక్షణ కలిగిన మనిషి ఉన్నతుడౌతాడు.
జవాబు:
ఉన్నతుడు ఔతాడు.

98. భవిష్యత్ గురించి చింతయేల.
జవాబు:
చింత + ఏల

సంధి పదాలను కలవడం

సంధి పదాలను కలిపి రాయండి.

99. మనము + ఆ విషయం
జవాబు:
మనమావిషయం

100. వాయువు + ఒకటే
జవాబు:
వాయువొకటే

101. ధన + ఆఢ్యుడు-
జవాబు:
ధనాధ్యుడు

102. చోటు + ఇవ్వకుండా
జవాబు:
చోటివ్వకుండా

103. నడుమ + నడుమ
జవాబు:
నట్టనడుమ

104. ప్రాణ + అపాయం
జవాబు:
ప్రాణాపాయం

105. పాపము + తలారులు
జవాబు:
పాపపుతలారులు

106. మానవ + ఆళి
జవాబు:
మానవాళి

107. సత్ + జనులు
జవాబు:
సజ్జనులు

108. విద్యుత్ + శక్తి
జవాబు:
విద్యుచ్ఛక్తి

109. సత్ + చిత్
జవాబు:
సచ్చిత్

సంధి నామాలు

గీత గీసిన పదం ఏ సంధికి చెందినదో గుర్తించండి.

110. పార్వతీ దేవి జగజ్జనని.
అ) జశ్వ సంధి
ఆ) గసడదవాదేశ సంధి
ఇ) అనునాసిక సంధి
ఈ) శ్చుత్వ సంధి
జవాబు:
ఈ) శ్చుత్వ సంధి

111. ఋషులకు తపశ్చర్య వలన శక్తి వస్తుంది.
అ) శ్చుత్వ సంధి
ఆ) అనునాసిక సంధి
ఇ) విసర్గ సంధి
ఈ) జశ్వ సంధి
జవాబు:
అ) శ్చుత్వ సంధి

112. ఏనుగు, కుక్క మీద కాసే ఎందొక్కటే.
అ) అకారసంధి
ఆ) ఉకారసంధి
ఇ) ఇకారసంధి
ఈ) గుణసంధి
జవాబు:
అ) అకారసంధి

113. సంపన్నుడైనా సరే నీతి వదలకూడదు.
అ) ఉకారసంధి
ఆ) ఇకారసంధి
ఇ) గుణసంధి
ఈ) అకారసంధి
జవాబు:
అ) ఉకారసంధి

114. గాంధీజీ మహాత్ముడు.
అ) అకారసంధి
ఆ) సవర్ణదీర్ఘ సంధి
ఇ) గుణసంధి
ఈ) అనునాసిక సంధి
జవాబు:
ఆ) సవర్ణదీర్ఘ సంధి

115. విరస వర్తనము విడిచినగాక.
అ) అకారసంధి
ఆ) గసడదవాదేశ సంధి
ఇ) ఉకారసంధి
ఈ) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
ఆ) గసడదవాదేశ సంధి

116. పరధనాపేక్ష పనికిరాదు.
అ) అకార సంధి
ఆ) సవర్ణదీర్ఘ సంధి
ఇ) గుణ సంధి
ఈ) విసర్గ సంధి
జవాబు:
ఆ) సవర్ణదీర్ఘ సంధి

117. చీచీ నరులదేటి జీవనము.
అ) ఇకారసంధి
ఆ) టుగాగమ సంధి
ఇ) గసడదవాదేశ సంధి
ఈ) సరళాదేశ సంధి
జవాబు:
అ) ఇకారసంధి

118. శిష్టాన్నములు రుచికరంగా ఉన్నాయి.
అ) అకార సంధి
ఆ) ఇకార సంధి
ఇ) సవర్ణదీర్ఘ సంధి
ఈ) గుణ సంధి
జవాబు:
ఇ) సవర్ణదీర్ఘ సంధి

119. దుష్టాన్నములు తినే ఆకలి కూడా ఒకటే.
అ) సవర్ణదీర్ఘ సంధి
ఆ) అకార సంధి
ఇ) గుణ సంధి
ఈ) సరళాదేశ సంధి
జవాబు:
అ) సవర్ణదీర్ఘ సంధి

120. అన్నమయ్య సంకీర్తనాచార్యుడు.
అ) అకార సంధి
ఆ) ఇకార సంధి
ఇ) సవర్ణదీర్ఘ సంధి
ఈ) విసర్గ సంధి
జవాబు:
ఇ) సవర్ణదీర్ఘ సంధి

121. వైరాగ్యపు పద్ధతి అలవర్చుకోవాలి.
అ) పుంప్వాదేశ సంధి
ఆ) అకార సంధి
ఇ) త్రికసంధి
ఈ) పడ్వాదుల సంధి
జవాబు:
అ) పుంప్వాదేశ సంధి

AP 10th Class Telugu 12th Lesson Important Questions సూక్తి సుధ

122. యిత్తలము విషయాలు తెలుసుకోవాలి.
అ) అకార సంధి
ఆ) యడాగమ సంధి
ఇ) త్రికసంధి
ఈ) పుంప్వాదేశ సంధి
జవాబు:
ఇ) త్రికసంధి

విగ్రహవాక్యాలు

గీత గీసిన పదానికి విగ్రహవాక్యం రాయండి.

123. మీరాబాయిది మధురభక్తి.
జవాబు:
మధురమైన భక్తి

124. పరుల సొమ్ము పాపము సొమ్ము.
జవాబు:
పరుల యొక్క సొమ్ము

125. సరస వర్తనం మానవులకు ఉత్తమం.
జవాబు:
సరసమైన వర్తనం

126. పాప పంకిలం అంటుకోకూడదు.
జవాబు:
పాపమనెడి పంకిలం

127. మానవులకు ఆత్మనిగ్రహం వుండాలి.
జవాబు:
ఆత్మ యొక్క నిగ్రహం

128. ఉన్నతంగా ఎదగడం మన జీవిత లక్ష్యం కావాలి.
జవాబు:
జీవితం యొక్క లక్ష్యం

129. ధరల పెరుగుదలకు హెచ్చుతగ్గులు ఉంటాయి.
జవాబు:
హెచ్చు మరియు తగ్గులు

130. శక్తిసామర్థ్యాలతో ధనం సంపాదించుకోవాలి.
జవాబు:
శక్తి మరియు సామర్థ్యం

131. మానవ ప్రయత్నంతో ఏమైనా సాధించవచ్చు.
జవాబు:
మానవుని యొక్క

సమాన నామాలు

గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.

132. తేటతెలుగు మన భాష,
అ) షష్ఠీ తత్పురుష సమాసం
ఆ) సప్తమీ తత్పురుష సమాసం
ఇ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఈ) రూపక సమాసం
జవాబు:
ఇ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

133. ఆత్మప్రశంస మంచి విషయం కాదు.
అ) రూపక సమాసం
ఆ) ద్వంద్వ సమాసం
ఇ) సప్తమీ తత్పురుష సమాసం
ఈ) షష్ఠీ తత్పురుష సమాసం
జవాబు:
ఈ) షష్ఠీ తత్పురుష సమాసం

134. దినరాత్రములు ఎవరికైనా ఒకటే.
అ) సప్తమీ తత్పురుష సమాసం
ఆ) ద్వంద్వ సమాసం
ఇ) షష్టీ తత్పురుష సమాసం
ఈ) బహువ్రీహి సమాసం
జవాబు:
ఆ) ద్వంద్వ సమాసం

135. స్వలాభాపేక్ష ఏ వ్యక్తికీ మంచిది కాదు.
అ) చతుర్థీ తత్పురుష సమాసం
ఆ) పంచమీ తత్పురుష సమాసం
ఇ) షష్ఠీ తత్పురుష సమాసం
ఈ) ద్వంద్వ సమాసం
జవాబు:
అ) చతుర్థీ తత్పురుష సమాసం

136. అవివేకిని మార్చలేము.
అ) నఞ్ తత్పురుష సమాసం
ఆ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఇ) సప్తమీ తత్పురుష సమాసం
ఈ) షష్ఠీ తత్పురుష సమాసం
జవాబు:
అ) నఞ్ తత్పురుష సమాసం

AP 10th Class Telugu 12th Lesson Important Questions సూక్తి సుధ

137. ఉత్తమ లక్షణాలు విద్యార్థులు అలవర్చుకోవాలి.
అ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఆ) రూపక సమాసం.
ఇ) సప్తమీ తత్పురుష సమాసం
ఈ) షష్ఠీ తత్పురుష సమాసం
జవాబు:
అ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

ఆధునిక వచనాలు

ఈ వాక్యానికి సరియైన ఆధునిక వచనాన్ని గుర్తించండి.

138. నానాటి బదుకు నాటకము.
అ) ఈనాటి బదుకు నాటకం
ఆ) రోజు రోజుకు బ్రతుకు నాటకము
ఇ) రోజు రోజుకు బతుకు నాటకం
ఈ) నానాటి బ్రదుకు నాటకం
జవాబు:
ఇ) రోజు రోజుకు బతుకు నాటకం

139. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము.
అ) పుట్టుక నిజము, పోవుట నిజము
ఆ) పుట్టడం నిజం, పోవడం నిజం
ఇ) పుట్టుట, పోవుట నిజము
ఈ) పుట్టుక నిజము, పోవుటయు నీజము
జవాబు:
ఆ) పుట్టడం నిజం, పోవడం నిజం

140. యేనుగు మీద గాయు యెండొకటే.
అ) యేనుగు మీద కాయు ఎండొకటే
ఆ) ఏనుగు మీద కాసే ఎండొకటే
ఇ) ఏనుగు మీద కాయు ఎండొకటే
ఈ) యేనుగు మీఁద కాయు ఎండొకటే
జవాబు:
ఆ) ఏనుగు మీద కాసే ఎండొకటే

141. పరిమళముపై వీచే వాయు వొకటే.
అ) పరిమళముపై వీసే వాయువు ఒకటే.
ఆ) పరిమళంపై వీచే వాయువు ఒకటే.
ఇ) పరిమళం ఒకటే.
ఈ) పరిమళముపై వీచే వాయువు.
జవాబు:
ఆ) పరిమళంపై వీచే వాయువు ఒకటే

వ్యతిరేకార్థక వాక్యాలు

ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం రాయండి.

142. పరుల్ని నిందించాలి.
జవాబు:
పరుల్ని నిందించరాదు.

143. ఆత్మ ప్రశంస మంచిది.
జవాబు:
ఆత్మ ప్రశంస మంచిది కాదు.

144. బుద్ధి స్థిరంగా ఉండటం అవసరం.
జవాబు:
బుద్ధి స్థిరంగా ఉండటం అవసరంలేదు.

145. కుల, మతాలకు ప్రాధాన్యం ఉంది.
జవాబు:
కుల, మతాలకు ప్రాధాన్యం లేదు.

146. అసూయ, ద్వేషాలు వదిలివేయాలి.
జవాబు:
అసూయ, ద్వేషాలు వదలకూడదు.

147. సోమరితనం మంచిది.
జవాబు:
సోమరితనం మంచిది కాదు.

148. మానవులంతా ఉన్నతంగా ఎదగాలి.
జవాబు:
మానవులంతా ఉన్నతంగా ఎదగరాదు.

149. స్వలాభాపేక్ష ఉండాలి.
జవాబు:
స్వలాభాపేక్ష ఉండకూడదు,

వ్యతిరేకార్థక క్రియలు

కింది క్రియా పదాలలో వ్యతిరేకార్థక క్రియను గుర్తించండి.

150. అ) వెళ్ళకు
ఇ) వెళ్ళగలవు
ఆ) వెళ్ళు
ఈ) వెళ్ళుతూ ఉండు
జవాబు:
అ) వెళ్ళకు

151. అ) పెట్టు
ఆ) పెడతారు
ఇ) పెట్టలేదు
ఈ) పెడుతూ ఉండు
జవాబు:
ఇ) పెట్టలేదు

152. అ) తిరిగి
ఆ) తిరగక
ఇ) తిరిగితే
ఈ) తిరుగుతుంది
జవాబు:
ఆ) తిరగక

153. అ) అని
ఆ) అనక
ఇ) అంటూ
ఈ) అన్నారు.
జవాబు:
ఆ) అనక

154. అ) చేయాలి
ఆ) చేయకూడదు
ఇ) చేస్తారుజవాబు
ఈ) చేశారు
జవాబు:
ఆ) చేయకూడదు

AP 10th Class Telugu 12th Lesson Important Questions సూక్తి సుధ

155. అ) వదలక
ఆ) వదిలి
ఇ) వదులుతూ
ఈ) వదిలెను
జవాబు:
అ) వదలక

సంక్లిష్ట వాక్యాలు

ఇది ఏ రకమైన సంక్లిష్టవాక్యమో రాయండి.

156. మానవుడు ఎన్ని చదువులు చదివినా పుణ్యమార్గం విడువరాదు.
జవాబు:
అప్యర్ధకం

157. జీవితంలో కొన్ని త్యాగాలు చేస్తే, విజయం తథ్యం.
జవాబు:
చేదర్థకం

158. బయట శత్రువుల్ని జయించి, అంతః శత్రువుల్ని జయించాలి.
జవాబు:
క్వార్థకం

159. శ్రీనివాస్ అన్నమయ్య కీర్తనలు పాడుతూ, నృత్యం చేశాడు.
జవాబు:
శత్రర్ధకం

160. మొక్కలు నాటితే పర్యావరణం బాగుంటుంది.
జవాబు:
చేదర్థకం

161. పాప, పాలు తాగి నిద్రబోయింది.
జవాబు:
క్వార్థకం

162. కృష్ణ తిని బాగా బలిశాడు.
జవాబు:
హేత్వార్థకం

163. రాము కష్ట పడినా ఫలితం దొరకలేదు.
జవాబు:
అప్యర్ధకం

కర్మణి వాక్యాలు

సరియైన కర్మణి వాక్యాన్ని గుర్తించండి.

164. అన్నమయ్య సంకీర్తనలు రచించాడు.
అ) అన్నమయ్య చేత సంకీర్తనలు రాయబడాలి
ఆ) అన్నమయ్యచే సంకీర్తనలు రచింపబడ్డాయి.
ఇ) సంకీర్తనలు అన్నమయ్యచే రచింపబడాలి
ఈ) అన్నమయ్యచే సంకీర్తనలు రాయబడలేదు.
జవాబు:
ఆ) అన్నమయ్యచే సంకీర్తనలు రచింపబడ్డాయి.

165. అంతః శత్రువుల్ని ఆత్మ నిగ్రహంతో జయించాలి.
అ) అంతః శత్రువుల్ని ఆత్మ నిగ్రహం చేత జయింపబడాలి.
ఆ) ఆత్మనిగ్రహం చేత అంతఃశత్రువుల్ని జయించాలి.
ఇ) ఆత్మనిగ్రహంచే అంతఃశత్రువుల్ని జయించాలి.
ఈ) ఆంతఃశత్రువుల చేత ఆత్మనిగ్రహం జయించాలి.
జవాబు:
అంతః శత్రువుల్ని ఆత్మ నిగ్రహం చేత జయింపబడాలి.

166. అన్నమయ్య మానవాళికి ప్రబోధం చేశాడు.
అ) అన్నమయ్య చేత, మానవాళికి ప్రబోధం చేయబడింది.
ఆ) అన్నమయ్య చేత మానవాళికి ప్రబోధం చేయబడాలి.
ఇ) అన్నమయ్య చేత మానవాళికి ప్రబోధం చేయాలి.
ఈ) అన్నమయ్య మానవాళికి ప్రబోధం’ చేయలేదు.
జవాబు:
అ) అన్నమయ్య చేత, మానవాళికి ప్రబోధం చేయబడింది.

167. అన్నమయ్య 32 వేల సంకీర్తనలు రచించాడు.
అ) అన్నమయ్య చేత 32 వేల సంకీర్తనలు రచింపబడ్డాయి
ఆ) అన్నమయ్య చేత 32 వేల సంకీర్తనలు రాయబడాలి
ఇ) అన్నమయ్య చేత 32 వేల సంకీర్తనలు రాయబడ్డాయి
ఈ) అన్నమయ్య చేత 32 వేల సంకీర్తనలు రాయబడలేదు
జవాబు:
అ) అన్నమయ్య చేత 32 వేల సంకీర్తనలు రచింపబడ్డాయి.

168. మానవుడు అరిషడ్వర్గాలను జయించాలి.
అ) అరిషడ్వర్గాల చేత మానవుడు జయింపబడాలి
ఆ) మానవుడు చేత అరిషడ్వార్గాలు జయింపబడాలి
ఇ) అరిషడ్వర్గాలు జయింపబడాలి
ఈ) మానవునిచే జయించాలి అరిషడ్వార్గాలు
జవాబు:
ఆ) మానవుడు చేత అరిషడ్వార్గాలు జయింపబడాలి.

169. ‘సూక్తిసుధ’ గంగప్ప రాశాడు.
అ) గంగప్ప చేత సూక్తి సుధ రాయబడింది
ఆ) గంగప్ప చేత సూక్తీసుధ రాయబడాలి
ఇ) గంగప్పచే సూక్తిసుధ రాయబడలేదు
ఈ) సూక్తిసుధను గంగప్ప రచించారు.
జవాబు:
అ) గంగప్ప చేత సూక్తిసుధ రాయబడింది.

వాక్య రకాలు

ఇవి ఏ రకమైన సామాన్య వాక్యాలో రాయండి.

170. అన్నమయ్య సంకీర్తనలు విన్నావా?
జవాబు:
ప్రశ్నార్థక వాక్యం

171. నేను పాటలు పాడగలను.
జవాబు:
సామర్థ్యార్థక వాక్యం

172. సోమరితనం మంచిది కాదు.
జవాబు:
నిషేధార్థక వాక్యం

173. దయచేసి క్యూలో రండి.
జవాబు:
అనుమత్యర్థక వాక్యం

174. మంచిని పెంపొందించండి.
జవాబు:
విధ్యర్థక వాక్యం

175. మీకు కీర్తి లభించుగాక.
జవాబు:
ఆశీరార్థక వాక్యం

176. ఇతరులను విమర్శించవద్దు.
జవాబు:
నిషేధార్థక వాక్యం

177. మోసకారులకు దూరంగా ఉండాలి.
జవాబు:
విధ్యర్థక వాక్యం

178. వర్షం వస్తుందో! రాదో!
జవాబు:
సందేహార్థక వాక్యం

179. ఆహా! ఎంత బాగా పాడారు.
జవాబు:
ఆశ్చర్యార్థక వాక్యం

180. ఆదివారం శెలవు.
జవాబు:
నిశ్చయార్థక వాక్యం

వాక్య రకాలు

ఇవి ఏ రకమైన సామాన్య వాక్యాలో గుర్తించండి.

181. బాగా చదివితే మార్కులు వస్తాయి.
అ) శత్రర్థకం
ఆ) అప్యర్థకం
ఇ) చేదర్థకం
ఈ) క్వార్థకం
జవాబు:
ఆ) అప్యర్థకం

182. పాప, పాలు తాగి నిద్రబోయింది.
అ) శత్రర్థకం
ఆ) అప్యర్థకం
ఇ) క్వార్థకం
ఈ) చేదర్థకం
జవాబు:
ఇ) క్వార్థకం

183. రైలు వచ్చినా చుట్టాలు రాలేదు.
అ) అప్యర్థకం
ఆ) హేత్వర్థకం
ఇ) చేదర్థకం
ఈ) శత్రర్థకం
జవాబు:
అ) అప్యర్థకం

184. కవి ఏదైనా చెప్పగలడు.
అ) అనుమత్యర్థకం
ఆ) సామర్థ్యార్థకం
ఇ) అప్యర్థకం
ఈ) నిషేధార్థకం
జవాబు:
ఆ) సామర్థ్యార్థకం

AP 10th Class Telugu 12th Lesson Important Questions సూక్తి సుధ

185. సత్యాన్నే పలుకు, ధర్మాన్నే అనుసరించు.
అ) నిశ్చయార్థం
ఆ) ప్రశ్నార్థకం
ఇ) విధ్యర్థకం
ఈ) నిషేధార్థకం
జవాబు:
ఇ) విధ్యర్థకం

186. దీప దిక్కులు చూస్తూ సైకిలు తొక్కుతోంది.
అ) క్వార్థకం
ఆ) శత్రర్థకం
ఇ) చేదర్థకం
ఈ) ప్రశ్నార్థకం
జవాబు:
ఆ) శత్రర్థకం

187. నూరేళ్ళు చల్లగా వర్ధిల్లు.
అ) ఆశీరర్థకం
ఆ) ప్రార్థనార్థకం
ఇ) నిశ్చయార్థకం
ఈ) చేదర్థకం
అ) ఆశీరార్థకం

Leave a Comment