These AP 10th Class Telugu Important Questions 11th Lesson యుద్ధ విజేత will help students prepare well for the exams.
యుద్ధ విజేత AP Board 10th Class Telugu 11th Lesson Important Questions and Answers
అపరిచిత గద్యాలు
1. ఈ క్రింది అపరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
నేను నాలో ఉన్నట్లు చెప్పుకునే సుగుణాలు సత్యం, అహింస. మానవాతీత శక్తులున్నట్లు నేను చెప్పుకోజాలను. అటువంటి వాటిని నేను కోరుకోను. సిసలైన మతం సంకుచితమైన పిడివాదం కాదు. అది భగవంతునిలో విశ్వాసం ఉంచడం. భగవంతుని సన్నిధిలో జీవించడం. ఆలోచనలో సత్యం, వాక్కులో సత్యం, కార్యాచరణలో సత్యం ఉండాలి. సత్యం లేని చోట సిసలైన జ్ఞానం ఉండదని గాంధీజీ అంటారు.
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
గాంధీ గారు తనలో ఉన్న సుగుణాలు ఏవని అన్నారు?
జవాబు:
సత్యం, అహింస.
ప్రశ్న 2.
సిసలైన మతం ఎలా ఉంటుంది?
జవాబు:
భగవంతునిలో విశ్వాసముంచడం.
ప్రశ్న 3.
వాక్కు అంటే ఏమిటి?
జవాబు:
వాక్కు అనగా మాట.
ప్రశ్న 4.
జ్ఞానం ఎక్కడ ఉంటుంది?
జవాబు:
సత్యం ఉన్న చోట జ్ఞానం ఉంటుంది.
2. ఈ క్రింది అపరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
శ్రీశ్రీ పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. ఆయన మహాప్రస్థానం గొప్ప కవితా సంకలనం. అందులో ఆయన అభ్యుదయ భావాలతో రాసిన కవితలు, పాఠకుల్ని ఎంతగానో ఆలోచింప చేశాయి. “ప్రపంచమొక పద్మవ్యూహం – కవిత్వమొక తీరని దాహం” అని శ్రీశ్రీ అన్నారు. శ్రీశ్రీ రచించిన ‘మరో ప్రస్థానం’ అనే కవితా సంకలనంలో విప్లవ భావాలను పలికించారు. శ్రీశ్రీ రచించిన ‘ఖడ్గ సృష్టి’ అనే కవితా సంపుటికి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
అభ్యుదయ భావాలు పలికించిన శ్రీశ్రీ రచన ఏది?
జవాబు:
మహాప్రస్థానం
ప్రశ్న 2.
కవిత్వం గురించి శ్రీశ్రీ ఏమన్నారు?
జవాబు:
కవిత్వం తీరని దాహం
ప్రశ్న 3.
‘ఖడ్గ సృష్టి’ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏమిటి?
జవాబు:
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందింది.
ప్రశ్న 4.
పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
శ్రీశ్రీ పూర్తి పేరు ఏమిటి?
3. కింది ప్రకటనను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
పత్రికా ప్రకటన
ఫిబ్రవరి 21, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఓజిలి నందు సాహితీ పోటీలు నిర్వహించబడును. కవిత, కథలు రాయడం, ఉపన్యాసం, గేయాలు పాడడం మొదలైన అంశాలపై పోటీలు జరుపబడును.
8, 9, 10 తరగతుల విద్యార్థులు పాల్గొనవచ్చు. మొదటి మూడుస్థానాలలో నిలిచిన విద్యార్థులకు ధృవీకరణ పత్రము, నగదు బహుమతి ఇవ్వబడును.
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
పోటీలు ఎక్కడ జరుగుతాయి?
జవాబు:
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఓజిలి నందు జరుగుతాయి.
ప్రశ్న 2.
ఫిబ్రవరి – 21 ప్రత్యేకత ఏమిటి?
జవాబు:
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం.
ప్రశ్న 3.
పోటీ జరిపే అంశాలు ఏమిటి?
జవాబు:
కవిత్వం, కథ, గేయాలు,
ప్రశ్న 4.
పై ప్రకటన ఆధారంగా ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
ఏయే తరగతుల విద్యార్థులు పోటీలలో పాల్గొనవచ్చు?
4. కింది పేరా చదవండి. ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి.
ఎం. ఎస్. స్వామినాథన్ మనదేశానికి చెందిన ఒక వ్యవసాయ శాస్త్రవేత్త, గొప్ప మానవతావాది. హరిత విప్లవానికి నాయకుడు. అధిక దిగుబడినిచ్చే గోధుమలు మరియు వరి రకాలను పరిచయం చేయడంలో మరియు మరింత అభివృద్ధి చేయడంలో వారి కృషి ఎనలేనిది. ఆయన తమిళనాడులోని తంజావూరు ప్రాంతంలో జన్మించారు. సెప్టెంబర్ 28, 2023న మరణించారు. వారికి భారత ప్రభుత్వం, దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నను ప్రకటించింది.
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
హరిత విప్లవ పితామహుడు ఎవరు?
జవాబు:
ఎం.ఎస్. స్వామినాథన్
ప్రశ్న 2.
స్వామినాథన్ ఏ రంగంలో కృషి చేశారు?
జవాబు:
వ్యవసాయరంగం
ప్రశ్న 3.
స్వామినాథన్ ఏ ప్రాంతానికి చెందినవారు?
జవాబు:
తమిళనాడులోని తంజావూరు
ప్రశ్న 4.
పై పేరా ఆధారంగా ఒక ప్రశ్నను తయారుచేయండి.
జవాబు:
భారతదేశ అత్యున్నత పురస్కారం ఏది?
వ్యక్తీకరణ సృజనాత్మకత
అ) ఈ క్రింది ప్రశ్నకు నాలుగైదు వాక్యాల్లో సమాధానం రాయండి.
1. ‘యుద్ధ విజేత’ కవి గురించి రాయండి.
జవాబు:
‘యుద్ధ విజేత’ పాఠ్యాంశాన్ని నేతల ప్రతాప్ కుమార్ గారు రచించారు. ఆయన రచించిన ‘సమతా వసంత గానం’ అనే ‘ – కవితా సంపుటి నుండి ప్రస్తుత పాఠ్యాంశం గ్రహించారు. వీరు నేటి తూర్పు గోదావరి జిల్లా (ఒకప్పుడు పశ్చిమ గోదావరి), నిడదవోలు మండలం విజ్జేశ్వరం గ్రామంలో జన్మించారు. శాంతకుమారి, సత్యం వీరి తల్లిదండ్రులు. పాలకంకి, దళితనానీలు, అన్నంగిన్నె, భీంపాలరాగం, పుట్టినరోజు ఒక్కటే, బౌద్ధ భాషితాలు, బుద్ధిజం శాస్త్రీయత, నా భూమికి నేనే, సమతా వసంత గానం, పిల్లల కోసం అంబేడ్కర్ కథ, నాగపూర్ యాత్ర మొదలైన గ్రంథాలు రాశారు. విమల శాంతి జాతీయ కవితా పురస్కారం అందుకున్నారు.
ఆ) ఈ క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాల్లో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
‘యుద్ధ విజేత’ పాఠ్యాంశం నుండి గ్రహించిన విషయాలు ఏమిటి?
జవాబు:
- ‘యుద్ధం’ అనేది అనివార్యం కాదు.
- యుద్ధం వలన నష్టాలే గానీ లాభాలు ఉండవు.
- ‘యుద్ధం’ ఒక ఉన్మాద చర్య,
- రాజ్య విస్తరణ, పదవీ వ్యామోహాలు, ఆధిపత్యం తదితర కారణాలు యుద్ధానికి దారితీస్తాయి.
- యుద్ధం మానవజాతి నాశనానికి కారణమౌతుంది.
- బలహీనుడి మీద బలవంతుడు గెలవడం యుద్ధం కాదు.
- యుద్ధంలో విజేత అయిన వాడి కంటే యుద్ధాన్ని జయించినవాడు నిజమైన విజేతగా నిలుస్తాడు.
- పచ్చగా ఉన్న నేల రక్తంతో తడుస్తుంది.
- ప్రకృతిలో సమస్త జీవులు వినాశనం అవుతాయి.
- శాంతి, త్యాగం లక్షణాల ద్వారా యుద్ధాన్ని జయించవచ్చు.
- మానవజాతిని, సమస్త విశ్వాన్ని నాశనం చేసే యుద్ధమనే ఆటలో గెలవడం వీరత్వం కాదు. అది పశు స్వభావం. 12) యుద్ధం వద్దు – శాంతి ముద్దు.
ప్రశ్న 2.
యుద్ధాలు జరగడానికి గల కారణాలను తెలపండి.
జవాబు:
పూర్వకాలంలో యుద్ధాలు పశువుల కోసం జరిగేవి. కొంతకాలం తరువాత స్త్రీల కోసం జరిగాయి. వీటన్నింటి కంటే ‘రాజ్య విస్తరణ’ కాంక్ష ప్రధానమైనది. ఒక దేశం మీద మరొక దేశం ఆధిపత్యం, అధికారం సాధించడానికి యుద్ధాలు చేస్తారు.
మహాభారత యుద్ధం అన్నదమ్ముల మధ్య రాజ్యంలో భాగం కోసం జరిగింది. పాండవులకు, కౌరవులకు మధ్య కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. ఈ యుద్ధం దాయాదులైన కౌరవులకు, పాండవులకు మధ్య హస్తినాపుర సింహాసనం కోసం జరిగింది.
అలాగే ఆధునిక కాలంలో జూలై 28, 1914న మొదటి ప్రపంచయుద్ధం ప్రారంభమై, నవంబర్ 11, 1918న ముగిసింది. సైనిక పొత్తులు, జాతీయవాదం, సామ్రాజ్యవాదం ఈ యుద్ధానికి కారణాలుగా చెబుతారు. ఈ యుద్ధంలో లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయారు.
1939లో రెండవ ప్రపంచయుద్ధం ప్రారంభమైనది. చైనా-జపాన్ ల మధ్య ఆధిపత్య పోరు, 1939లో జర్మనీ, పోలాండ్ పై జరిపిన దురాక్రమణ కారణంగా ఈ యుద్ధం సంభవించి, 1945 వరకు సాగింది. ఈ యుద్ధంలో కూడా లక్షలాది మంది మరణించారు.
రాజ్యకాంక్ష, రాణివాసం పట్ల వ్యామోహం, సరిహద్దు వివాదాలు, పదవీకాంక్ష, పౌరుషాల ప్రదర్శన కారణంగా యుద్ధాలు జరుగుతున్నాయి.
ఇ) కింది అంశాల గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.
ప్రశ్న 1.
‘యుద్ధం లేని ప్రపంచం’ అనే అంశంపై ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:
సోదర సోదరీమణులారా!
మన కంటిముందే రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని చూస్తున్నాం. ఇజ్రాయిల్ యుద్ధాన్ని గమనిస్తున్నాం. పసి ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోతున్నాయి. నిండు గర్భవతులు ప్రాణాలు విడుస్తున్నారు. ఇట్లు, |
ప్రశ్న 2.
యుద్ధము-శాంతి గురించి ’10’ నినాదాలు రాయండి.
జవాబు:
- యుద్ధం చంపుతుంది – శాంతి బ్రతికిస్తుంది.
- శాంతి కోసం ఏకమవుదాం.
- యుద్ధం విభజిస్తుంది – శాంతి ఏకం చేస్తుంది.
- శాంతియుత్వ హృదయాలు, శాంతియుత ప్రపంచం.
- తుపాకులను ద్వేషించండి – శాంతిని ఆహ్వానించండి.
- ఒక కన్ను కోసం మరో కన్ను మొత్తం ప్రపంచాన్ని అంతం చేస్తుంది.
- శాంతి, సత్యం మన ఆయుధాలు.
- యుద్ధాన్ని జయించినవాడే హృదయ విజేత.
- యుద్ధం వద్దు – శాంతే ముద్దు.
- చేయి చేయి కలుపుదాం – యుద్ధాన్ని అపుదాం.
ప్రశ్న 3.
యుద్ధ నష్టాల గురించి వ్యాసం రాయండి.
జవాబు:
ఉపోద్ఘాతం:
యుద్ధం ఎప్పుడు, ఎక్కడ జరిగినా తీవ్ర వినాశనానికి దారితీస్తుంది. యుద్ధం విధ్వంసానికి నిదర్శనం. గెలుపు, ఓటమిల మధ్య ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. యుద్ధం అమానుషం. రెండు ప్రపంచ యుద్ధాలు తీవ్ర వినాశనాన్ని, విషాదాన్ని మిగిల్చాయి.
విషయ విశ్లేషణ :
యుద్ధం వలన జన నష్టంతో పాటూ, ఆర్ధిక వ్యవస్థలో అపసవ్యత ఏర్పడుతుంది. శాంతియుత జీవనం కనుమరుగవుతుంది. సామాన్య జనంపై తీవ్రమైన ప్రభావం కలుగుతుంది. యుద్ధరంగంలో లక్షలాది మంది సైనికులు చనిపోతారు. చాలామంది అంగవైకల్యానికి గురి అవుతారు. యుద్ధం శారీరక, మానసిక, ఆర్థిక, సాంఘిక రంగాలపై ప్రభావం చూపుతుంది.
సమాజంలో అసమానతలు పెరుగుతాయి. అసూయ, ద్వేషాలు హెచ్చు మీరతాయి. దేశాల మధ్య ఆధిపత్య భావజాలం పెరుగుతుంది. అధికార మార్పిడి గురించి ఒత్తిడి పెరుగుతుంది. దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం దెబ్బతింటుంది. సమాజంలో నైతిక విలువలు పతనం అవుతాయి. ఆహారధాన్యాల కొరత ఏర్పడుతుంది. నిత్యావసర వస్తువుల కోసం గొడవలు జరుగుతాయి.
పర్యావరణ నష్టాలు :
యుద్ధం కారణంగా పచ్చని నేల రక్తపంకిలం అవుతుంది. చెట్లు, మొక్కలు, పూలు శాశనం అచ్చుతాయి. ప్రకృతిలోని అన్ని జీవుల మనుగడ కష్టం అవుతుంది. వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. రసాయనిక దాడుల కారణంగా విషవాయువులు వ్యాప్తి చెందుతాయి. గాలి, నేల, నీరు కలుషితం అవుతాయి. అణ్వాయుధాల దాడుల వలన వందల సంవత్సరాల పాటూ, నష్టాలు ఎదుర్కోవలసి ఉంటుంది.
దౌత్య సంబంధాలు :
దేశాల మధ్య ఉండే దౌత్య సంబంధాలు విచ్ఛిన్నం అవుతాయి. విదేశాంగ విధానం సరిగా ఉండదు. పర్యాటక రంగంపై ప్రభావం ఉంటుంది. పొరుగు దేశాల మధ్య పరస్పర సహకారం ఉండదు.
ముగింపు:
‘యుద్ధం’ మనుషులను ఉన్మాదులుగా తయారుచేస్తుంది. సాటిమనిషిని శత్రువుగా చూస్తుంది. మానవ జాతిని, ప్రకృతిని, సమస్త విశ్వాన్ని వినాశనం చేసే యుద్ధమనే ఆటలో గెలవడం వీరత్వం కాదు. అది పశు స్వభావం. కాబట్టి యుద్ధం లేని ప్రపంచాన్ని మనం ఆకాంక్షిద్దాం.
ప్రశ్న 4.
‘యుద్ధాన్ని’ వ్యతిరేకిస్తూ కవిత రాయండి.
జవాబు:
యుద్ధం మీద
ఎన్ని కవితలు రాసినా
యుద్ధం ఆగడం లేదు.
రాజ్య విస్తరణ అన్నారు
సంపద కోసం అన్నారు
ముందు నుంచి చంపారు
యుద్ధ నీతి దారి తప్పి
ఎలా అయినా చంపడమే అని కుటిల నీతి రాశారు.
ప్రపంచాన్ని యుద్ధ మైదానం చేస్తున్నారు.
యుద్ధంతో కూలిన నాగరికతలన్నీ
నేలంతా రోదిస్తున్నా
యుద్ధాన్ని ప్రేమించడం
మనిషితనం కాదు
మన లోపల
పూలను పూయించాలి.
దయా వర్షం కురవాలి
రాజ్యం మెదడులో
యుద్ధాన్ని చెరిపేయాలి
ప్రపంచంతో ప్రేమలో పడు
యుద్ధం మాయమౌతుంది.
భాషాంశాలు (పదజాలం వ్యాకరణాంశాలు)
కింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి.
అలంకారాలు
ఈ క్రింది వాక్యాల్లోని అలంకారాన్ని గుర్తించి రాయండి.
1. పూసే పూలను తుంచేయడం, ఎగిరే పక్షుల రెక్కలు విరిచెయ్యడం.
జవాబు:
ఇది అంత్యానుప్రాస అలంకారం.
లక్షణం : ఒక పద్యపాదంలో గానీ, వాక్యంలో గానీ ఒకే విధమైన పదాలు పునరావృతం కావడం అంత్యాను ప్రాస.
2. ఆ నగరంలోని మేడలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
జవాబు:
ఇది అతిశయోక్తి అలంకారం.
లక్షణం: గోరంతల్ని, కొండంతలు చేసి చెప్పడం అతిశయోక్తి అవుతుంది.
3. శ్రీనాథ వర్ణించు జిహ్వ జిహ్వ.
జవాబు:
ఇది లాటానుప్రాస అలంకారం.
లక్షణం : అర్థభేదంతో కాకుండా తాత్పర్యభేదంతో పదాలు పునరావృతం కావడం లాటానుప్రాస.
అర్ధాలు
అ) గీత గీసిన పదానికి అర్థం రాయండి.
4. మానవాళి ప్రకృతిని కాపాడాలి.
జవాబు:
మానవుల సమూహం
5. ఆటలో గెలవాలంటే వ్యూహం ప్రధానం.
జవాబు:
ప్రణాళిక
6. సుజాత, పాపకి నామకరణం చేసింది.
జవాబు:
పేరు పెట్టడం
7. ప్రకృతిని ధ్వంసం చేస్తే మనుగడ కష్టం.
జవాబు:
నాశనం
8. సమరంలో సైనికులు పోరాడారు.
జవాబు:
యుద్ధం
ఆ) గీత గీసిన పదానికి సరియైన అర్థాన్ని గుర్తించండి.
9. వర్షం కురవడంతో రైతుల ముఖంలో దరహాసం వెళ్లి విరిసింది.
అ) చిరునవ్వు
ఆ) ఆనందం
ఇ) సంతోషం
ఈ) దుఃఖం
జవాబు:
అ) చిరునవ్వు
10. బుద్ధుడు సర్వస్వాన్ని త్యజించి భిక్షువుగా మారాడు.
అ) తీసుకొని
ఆ గ్రహించి
ఇ) విడిచిపెట్టి
ఈ) స్వీకరించి
జవాబు:
ఇ) విడిచిపెట్టి
11. ఆ రమణి నాట్యం చేసింది.
అ) పక్షి
ఆ) నెమలి.
ఇ) స్త్రీ
ఈ) పాప
జవాబు:
ఇ) స్త్రీ
12. కష్టపడితే భోగాలు దక్కుతాయి.
అ) కష్టాలు
ఆ) సుఖాలు
ఇ) విజయాలు
ఈ) ఫలితాలు
జవాబు:
ఆ) సుఖాలు
13. పసిపాప మోములో సంతోషం కలిగింది.
అ) ముఖం
ఆ) హృదయం
ఇ) మనసు
ఈ) బుద్ధి
జవాబు:
అ) ముఖం
పర్యాయపదాలు
అ) గీత గీసిన పదానికి పర్యాయ పదాలు రాయండి.
14. పరీక్షలో మంచి మార్కులు రావడానికి వ్యూహం ఉండాలి.
జవాబు:
ప్రణాళిక, ఉపాయం
15. పశువులు పొలాల్లో తిరుగుతున్నాయి.
జవాబు:
జంతువులు, సొమ్ములు
16. పచ్చని నేల రక్తసిక్తమయ్యింది.
జవాబు:
భూమి, ధర
17. ‘రాజ్యం‘ కోసం యుద్ధాలు జరిగాయి.
జవాబు:
దేశం, భూభాగం
18. పసిపిల్లల మోముపై చిరునవ్వులు విరిశాయి.
జవాబు:
ముఖం, అరవిందం
19. మనిషికి, మనిషి శత్రువు కారాదు.
జవాబు:
వైరి, రిపువు
20. యుద్ధాల్లో నెత్తురు పారుతుంది.
జవాబు:
రక్తం, రుధిరం
21. జింకలు చెంగు చెంగున ఎగురుతున్నాయి.
జవాబు:
లేడి, హరిణము
22. నెమలి పురివిప్పింది.
జవాబు:
కలాపి, మయూరం
ఆ) గీత గీసిన పదానికి సరియైన పర్యాయ పదాలు గుర్తించండి.
23. వేటగాడు శరం విడిచాడు.
అ) ఈటె, కర్ర
ఆ) అమ్ము, బాణం
ఇ) బాణం, కోల
ఈ) ఈటె, అమ్ము
జవాబు:
ఇ) బాణం, కోల
24. నెమలి పింఛం విప్పింది.
అ) కలిపి, కపి
ఆ) మయూరం, మణి
ఇ) కలపి, మయూరం
ఈ) కలాపం, కోడి
జవాబు:
ఇ) కలాపి, మయూరం
25. పక్షి గూడు కట్టింది.
అ) పిట్ట, పెట్ట
ఆ) ఖగం, మృగం
ఇ) విహంగం, ఖగము
ఈ) విహాయసం, కపి
జవాబు:
ఇ) విహంగం, ఖగము
26. యుద్ధం జరగకూడదు.
అ) పోరు, జోరు
ఆ) సమరం, తిమిరం
ఇ) రణం, పోరు
ఈ) సంగ్రామం, గ్రామం
జవాబు:
ఇ) రణం, పోరు
27. రక్తదానం మంచిది.
అ) నెత్తురు, జలం
ఆ) సింధూరం, వారం
ఇ) నెత్తురు, రుధిరం
ఈ) రుధిరం, తిమిరం
జవాబు:
ఇ) నెత్తురు, రుధిరం
28. కండ బలం కన్నా గుండె బలం మిన్న.
అ) బలగం, బలుపు
ఆ) శక్తి, లావు
ఇ) సామర్ధ్యం, పని
ఈ) సత్తువ, భరోసా
జవాబు:
ఆ) శక్తి, లావు
29. రాజ్యం కోసం యుద్ధాలు వద్దు.
అ) ఏలుబడి, దొరతనం
ఆ) ప్రదేశం, ఊరు
ఇ) రాష్ట్రం, పేరు
ఈ) పేరు, దేశం
జవాబు:
ఆ) ప్రదేశం, ఊరు
30. యుద్ధాల్లో మరణాలు అధికంగా ఉంటాయి.
అ) గాయాలు, దెబ్బలు
ఆ) చావు, బతుకు
ఇ) మృత్యువు, చావు
ఈ) గాయం, కాయం
జవాబు:
ఇ) మృత్యువు, చావు
31. గెలుపు కోసం ప్రయత్నం చేయాలి.
అ) పతకం, పథకం
ఆ) ఫలితం, ఫలం
ఇ) విజయం, జయం
ఈ) జయం, భయం
జవాబు:
ఇ) విజయం, జయం
32. తిరుపతిలో జింకల వనం ఉంది.
అ) లేడి, హరిణం
ఆ) మృగం, మెకం
ఇ) హరిణం, చరణం
ఈ) లేడి, పశువు
జవాబు:
అ)లేడి, హరిణం
ప్రకృతి వికృతులు
గీత గీసిన పదానికి సరియైన ప్రకృతి పదం రాయండి.
33. పక్కి చెట్టు మీద వాలింది.
జవాబు:
పక్షి
34. మన పున్నెము మనల్ని కాపాడుతుంది.
జవాబు:
పుణ్యము
35. ఉదయమే మొగము కడగాలి.
జవాబు:
ముఖము
36. యుద్ధంలో గెలవడం పరుసము కాదు.
జవాబు:
పౌరుషము
ఆ) గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
37. ఎన్నో రాజ్యాలు కాలగర్భంలో కలసిపోయాయి.
అ) గబ్బం
ఆ) గర్వం
ఇ) కడుపు
ఈ) గాబు
జవాబు:
ఇ) కడుపు
38. చెట్టు మీద పక్షి వాలింది.
అ) పక్షం
ఆ) పక్కి
ఇ) ప్రక్క
ఈ) పెట్ట
జవాబు:
ఆ) పక్కి
39. అనవసరమైన పౌరుషం పనికిరాదు.
అ) పరుషం
ఆ) పరుసం
ఇ) పరసం
ఈ) పరస
జవాబు:
ఆ) పరుసం
40. విద్యలేనివాడు వింత పశువు.
అ) పాశం
ఆ) పసువు
ఇ) జంతువు
ఈ) పసి
జవాబు:
ఆ) పసువు
41. మనిషి స్వార్థాన్ని విడనాడాలి.
అ) నరుడు
ఆ) మనిసి
ఇ) మానవుడు
ఈ మానుష
జవాబు:
ఆ) మనిసి
42. హృదయంలో దయ ఉండాలి.
అ) హృది
ఆ) ఎద
ఇ) గుండె
ఈ) మది
జవాబు:
ఆ) ఎద
43. పుష్పాలు కోయరాదు.
అ) పుషాలు
ఆ) సుమాలు
ఇ) పూలు
ఈ) ప్రోలు
జవాబు:
ఇ) పూలు
44. ఎదుటివారి శక్తిని గ్రహించాలి.
అ) బలం
ఆ) సత్తి
ఇ) శకితి
ఈ) లావు
జవాబు:
ఆ) సత్తి
నానార్థాలు
అ) గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి.
45. శక్తికి శక్తి ఎక్కువ.
జవాబు:
పార్వతి, సామర్థ్యం
46. జీవనానికి, జీవనం ఉండాలి.
జవాబు:
బ్రతుకు, నీరు
47. అర్జునుడు ‘శరం‘ భూమిలోకి వేసి శరం తెప్పించాడు.
జవాబు:
బాణం, నీరు
48. గోపు కి గోపు కన్పించడం లేదు.
జవాబు:
ఆవు కన్ను
49. వెల వెల ఎంత?
జవాబు:
భూమి, ధర
50. ఆ రాజు బలానికి, బలం ఎక్కువ.
జవాబు:
సైన్యం, సత్తువ
ఆ) గీత గీసిన పదానికి సరైన నానార్థాలు గుర్తించండి.
51. యుద్ధానికి మూలం ఏమిటో, మూలం తెలియదు.
అ) కారణం, మొదలు
ఆ) కారణం, మార్గం
ఇ) మొదలు, తుది
ఈ) మార్గం, మొదలు
జవాబు:
అ) కారణం, మొదలు
52. గోవు మీద వేటగాడు గోవు వేశాడు.
అ) ఆవు, చేయి
ఆ) ఆవు, బాణం
ఇ) బాణం, చేయి
ఈ) కన్ను, బాణం
జవాబు:
ఆ) ఆవు, బాణం
53. సంపద పెడితే సంపద వస్తుంది.
అ) ధనం, లాభం
ఆ) ఐశ్వర్యం, ఆస్తి
ఇ) ధనం, ఆస్తి
ఈ) డబ్బు, సంపద
జవాబు:
అ) ధనం, లాభం
54. మతం మీద మీ అభిమతం ఏంటో!
అ) సమ్మతి, అభిప్రాయం
ఆ) శాస్త్రం, అభిప్రాయం
ఇ) కులం, అభిప్రాయం
ఈ) శాస్త్రం, ఇష్టం
జవాబు:
ఆ) శాస్త్రం అభిప్రాయం.
55. ఈ రాజ్యం ఏ రాజ్యంలో ఉంది?
అ) ప్రదేశం, రాష్ట్రం
ఆ) ఏలుబడి, స్థలం
ఇ) రాష్ట్రం దేశ
ఈ) రాష్ట్రం, ప్రదేశం
జవాబు:
అ) ప్రదేశం, రాష్ట్రం
56. అంగంలో ఒక అంగానికి గాయం అయ్యింది.
అ) అవయవం, భాగం
ఆ) శరీరం, దెబ్బ
ఇ) భాగం, కాయం
ఈ) అవయవం, దేహం
జవాబు:
అ) అవయవం, భాగం
వ్యతృత్వర్థాలు
అ) గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్ధం రాయండి.
57. యుద్ధంలో వ్యూహం ముఖ్యం.
జవాబు:
విశిష్టమైన ఊహా రచన – ప్రణాళిక
58. యుద్ధంలో మరణాలు ఎక్కువ.
జవాబు:
దీనివలన చనిపోతారు – చావు
59. కలాపి పింఛం విప్పింది.
జవాబు:
పింఛం కలది నెమలి
60. ధరణిలో యుద్ధాలు ఉండరాదు.
జవాబు:
విశ్వాన్ని ధరించేది – భూమి
61. యుద్ధాన్ని జయించినవాడు విజేత.
జవాబు:
విజయం సాధించినవాడు – విజయుడు.
ఆ) గీత గీసిన పదానికి సరైన వ్యుత్పత్వర్ణాన్ని గుర్తించండి.
62. ఆ తోటలో షష్పాలు ఎంతో అందంగా ఉన్నాయి.
అ) సువాసన ఇచ్చేది – గంధం
ఆ) వికసించేది – పువ్వు
ఇ) రెక్కలు కలిగినది – పువ్వు
ఈ) రాలిపోయేది – పుష్పం
జవాబు:
ఆ) వికసించేది పువ్వు
63. మానవుడు యుద్ధాన్ని త్యజించాలి.
అ) మనువు నుండి పుట్టినవాడు – మనిషి
ఆ) మాటలు నేర్చినవాడు – మనిషి
ఇ) తెలివితేటలు కలిగినవాడు – జ్ఞాని
ఈ) ఇంద్రియాలను జయించినవాడు – జితేంద్రియుడు
జవాబు:
అ) మనువు నుండి పుట్టినవాడు – మనిషి
64. భాస్కరుడు తీక్షణంగా ఉన్నాడు.
అ) వేడి కలవాడు – సూర్యుడు
ఆ) కాంతిని ఇచ్చేవాడు – రవి
ఇ) కిరణాలు కలవాడు – ఉగ్రుడు
ఈ) ఉదయించేవాడు – మిత్రుడు
జవాబు:
ఆ) కాంతిని ఇచ్చేవాడు – రవి
65. యుద్ధంలో గెలవడం పౌరుషం కాదు.
అ) బాధ కలిగి ఉన్నవాడు – పురుషుడు
ఆ) పురుషుని భావం – ఉద్యమం
ఇ) పరుషంగా మాట్లాడేవాడు – పురుషుడు
ఈ) కోపం కలిగి ఉండడం – కోపి
జవాబు:
ఆ) పురుషుని భావం – ఉద్యమం
66. పక్షి గూడు కట్టింది.
తీక్షణమైన చూపు కలది – పక్షి
ఆ) పక్షములు కలది – పిట్ట
ఇ) పురుగులను తినేది – బల్లి
ఈ) విహాయసంలో ఎగిరేది – ఖగం.
జవాబు:
ఆ) పక్షములు కలది – పిట్ట
జాతీయాన్ని గుర్తించడం
వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి విడిగా రాయండి.
67. యుద్ధంలో గెలిచిన ఔరంగజేబు గర్వాన్ని నెత్తికెక్కించు కున్నాడు.
జవాబు:
నెత్తికెక్కించుకొను
68. అందరూ ప్రపంచశాంతికి నడుం కట్టాలి.
జవాబు:
నడుం కట్టు
69. కళింగ యుద్ధంలో అశోకుడు విజయభేరి మోగించాడు.
జవాబు:
విజయభేరి
జాతీయము – సందర్భము
ఈ జాతీయాన్ని ఏ అర్థంలో/ సందర్భంలో ఉపయో గిస్తారో రాయండి.
70. కనువిప్పు
జవాబు:
అసలు విషయాన్ని గ్రహించి, జ్ఞానం కలిగిన సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.
71. పశ్చాత్తాపం
జవాబు:
ఒక వ్యక్తి తాను చేసిన తప్పును తెలుసుకొని బాధపడే సందర్భంలో ఈ జాతీయం వాడతాం.
72. విజయగర్వం
జవాబు:
మిక్కిలి గెలుపుచే వచ్చు అహంకారం అను సందర్భంలో వాడతాం.
సంధి పదాలను విడదీయడం
గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి.
73. విజయాన్ని నెత్తికెక్కించుకోకూడదు.
జవాబు:
నెత్తికి + ఎక్కించు
74. మానవాళి బాగు కోసం యుద్ధాలు మానేయాలి.
జవాబు:
మానవ + అళి
75. గంతులేసే పిల్లలను చూస్తే ఆనందమౌతుంది.
జవాబు:
గంతులు + వేసే
76. రెండవ ప్రపంచయుద్ధం ఆరు సంవత్సరాలు జరిగింది.
జవాబు:
సంవత్సరము + లు
సంధి పదాలను కలవడం
సంధి పదాలను కలిపి రాయండి.
77. అతను + ఎప్పటికీ
జవాబు:
అతనెప్పటికీ
78. ఎందుకు + అవుతుంది
జవాబు:
ఎందుకవుతుంది
79. కాలరు + ఎగరేస్తున్నాడు.
జవాబు:
కాలరెగరేస్తున్నాడు
80. ఒక్క + ఒక్క
జవాబు:
ఒక్కొక్క
సంధి నామాలు
గీత గీసిన పదం ఏ సంధికి చెందినదో గుర్తించండి.
81. యుద్ధం కారణంగా నేల మాంసపు ముద్దగా మారుతుంది.
అ) అత్వ సంధి
ఆ) పుంప్వాదేశ సంధి
ఇ) నుగాగమ సంధి
ఈ) త్రికసంధి
జవాబు:
ఆ) పుంప్వాదేశ సంధి.
82. చరాచర ప్రకృతిలో మానవుడు గొప్పవాడు.
అ) అత్వసంధి
ఆ) ఉత్వసంధి
ఇ) సవర్ణదీర్ఘ సంధి
ఈ) గుణసంధి
జవాబు:
ఇ) సవర్ణదీర్ఘసంధి
83. యుద్ధోన్మాదిగా మారకూడదు.
అ) సవర్ణదీర్ఘ సంధి
ఆ) గుణసంధి
ఇ) వృద్ధిసంధి
ఈ) యణాదేశ సంధి
జవాబు:
ఆ) గుణసంధి
84. బలమైన పశువులు కొమ్ములెగరేసినట్లు.
అ) అత్వసంధి
ఆ) ఉత్వసంధి
ఇ) ఇత్వసంధి
ఈ) లులనలసంధి
జవాబు:
ఆ) ఉత్వసంధి
విగ్రహవాక్యాలు
గీత గీసిన పదానికి విగ్రహవాక్యం రాయండి.
85. యుద్ధాన్ని గెలిచినవాడు యుద్ధ విజేత.
జవాబు:
యుద్ధంలో విజేత
86. యుద్ధంలో అంగబలం ఒక్కటే సరిపోదు.
జవాబు:
అంగము చేత బలం
87. పర్యావరణం బాగుంటే మానవాళికి మంచిది.
జవాబు:
మానవుల యొక్క ఆళి
88. పసిపిల్లలు సంతోషంగా ఆడుతున్నారు.
జవాబు:
పసివారైన పిల్లలు
సమాస నామాలు
గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.
89. భార్యాబిడ్డలను ప్రేమగా చూడాలి.
అ) షష్ఠీ తత్పురుష సమాసం
ఆ) పంచమీ తత్పురుష సమాసం
ఇ) ద్విగు సమాసం
ఈ) ద్వంద్వ సమాసం
జవాబు:
ఈ) ద్వంద్వ సమాసం
90. వారి ముఖాల్లో చిరుదరహాసం వెల్లి విరిసింది.
అ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఆ) ద్వంద్వ సమాసం
ఇ) ద్విగు సమాసం
ఈ) షష్ఠీ తత్పురుష సమాసం
జవాబు:
అ) విశేషణ పూర్వపద కర్మధారయం
91. ఉక్రెయిన్ యుద్ధంలో మరణమృదంగం మోగుతోంది.
అ) ద్వంద్వ సమాసం
ఆ) రూపక సమాసం
ఇ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఈ) ద్విగు సమాసం
జవాబు:
ఆ) రూపక సమాసం
92. అర్ధబలంతో గర్వించకూడదు.
అ) షష్ఠీ తత్పురుష సమాసం
ఆ) రూపక సమాసం
ఇ) తృతీయా తత్పురుష సమాసం
ఈ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
జవాబు:
ఇ) తృతీయా తత్పురుష సమాసం
వ్యతిరేకార్థక వాక్యాలు
ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం రాయండి.
93. ప్రపంచశాంతికి యుద్ధాలు అవసరం.
జవాబు:
ప్రపంచశాంతికి యుద్ధాలు అవసరం లేదు.
94. యుద్ధంలో గెలవడం వీరత్వం.
జవాబు:
యుద్ధంలో గెలవడం వీరత్వం కాదు.
95. బుద్ధుడు రాజ్యాన్ని త్యజించాడు.
జవాబు:
బుద్ధుడు రాజ్యాన్ని త్యజించలేదు.
96. అశోకుడు పశ్చాత్తాపం చెందలేదు.
జవాబు:
అశోకుడు పశ్చాత్తాపం చెందాడు.
97. యుద్ధంలో గెలిచినవాడు విజేత.
జవాబు:
యుద్ధంలో గెలిచినవాడు విజేత కాదు.
వ్యతిరేకార్థక క్రియలు
కియా లలో వ్యతిరేకార్థక క్రియను గుర్తించండి.
98. అ) గెలిచాడు.
ఆ) గెలవలేదు
ఇ) గెలుస్తుంది.
ఈ) గెలవాలి
జవాబు:
ఆ) గెలవలేదు
99. అ) ఉన్నవాడు
ఆ) లేనివాడు
ఇ) కావలసినవాడు
ఈ) ఉంటాడు
జవాబు:
ఆ) లేనివాడు
100. అ) ఆగింది
ఆ) ఆగలేదు
ఇ) ఆగాలేమో
ఈ) ఆగుతుందా
జవాబు:
ఆ) ఆగలేదు
101. అ) ఉంటాయి
ఆ) ఉండాలి
ఇ) ఉండవు
ఈ) ఉంటారు
జవాబు:
ఇ) ఉండవు
సంక్లిష్ట వాక్యాలు
ఇవి ఏ రకమైన సంక్లిష్టవాక్యాలో రాయండి.
102. యుద్ధంలో ఒకరు గెలిస్తే మరొకరు ఓడిపోతారు.
జవాబు:
చేదర్థక వాక్యం
103. విచ్చుకున్న పూలను కోసి పారవేస్తున్నారు.
జవాబు:
క్వార్థక వాక్యం
104. యుద్ధం చేస్తూ, లక్షలాదిమంది మరణించారు.
జవాబు:
శత్రర్థక వాక్యం
105. శాంతి వచనాలు పలికినా, యుద్ధం ఆగడం లేదు.
జవాబు:
అప్యర్థక వాక్యం
106. అద్దం కింద పడి, పగిలింది.
జవాబు:
హేత్వర్థక వాక్యం
107. దీప దిక్కులు చూస్తూ, సైకిలు తొక్కుతోంది.
జవాబు:
శత్రర్థక వాక్యం
108. ఇరు దేశాల మధ్య సంధి కుదిరితే, యుద్ధం ఆగుతుంది.
జవాబు:
చేదర్థక వాక్యం
109. రైలు వచ్చినా చుట్టాలు రాలేదు.
జవాబు:
అప్యర్థక వాక్యం
కర్మణి వాక్యాలు
సరియైన కర్మణి వాక్యాన్ని గుర్తించండి.
110. అశోకుడు యుద్ధం నిలిపేశాడు.
అ) యుద్ధం అశోకుడు నిలిపాడు.
ఆ) అశోకుని చేత యుద్ధం నిలువబడింది.
ఇ) అశోకుడు యుద్ధం చేత నిలిచాడు.
ఈ) అశోకుడు యుద్ధాన్ని నిలిపేశాడు.
జవాబు:
ఆ) అశోకుని చేత యుద్ధం నిలుపబడింది.
111. అశోకుడు పశ్చాత్తాపం ప్రకటించాడు.
అ) పశ్చాత్తాపం ప్రకటించాడు అశోకుడు.
ఆ) అశోకుని చేత పశ్చాత్తాపం ప్రకటించబడింది.
ఇ) ప్రకటించాడు అశోకుడు పశ్చాత్తాపం.
ఈ) అశోకుని చేత ప్రకటించబడలేదు.
జవాబు:
ఆ) అశోకుని చేత పశ్చాత్తాపం ప్రకటించబడింది.
112. బుద్ధుడు అసలు యుద్ధాన్ని గెలిచాడు.
అ) బుద్ధుని చేత అసలు యుద్ధం గెలువబడింది.
ఆ) యుద్ధం చేత బుద్ధుడు గెలిచాడు.
ఇ) అసలు యుద్ధం బుద్ధుడే గెలిచాడు.
ఈ) అసలు యుద్ధం బుద్ధుడుచే గెలువబడును.
జవాబు:
అ) బుద్ధుని చేత అసలు యుద్ధం గెలువబడింది.
113. మానవులు ప్రకృతిని ధ్వంసం చేస్తున్నారు.
అ) ప్రకృతిని, మానవులే ధ్వంసం చేస్తున్నారు.
ఆ) మానవులుచే ప్రకృతి ధ్వంసం చేయబడును.
ఇ) మానవుల చేత ప్రకృతి ధ్వంసం చేయబడుతోంది.
ఈ) ప్రకృతి ధ్వంసం మానవులు చేశారు.
జవాబు:
ఇ) మానవుల చేత ప్రకృతి ధ్వంసం చేయబడుతోంది.
114. ‘యుద్ధ విజేత’ను ప్రతాప్ కుమార్ రచించాడు.
అ) ప్రతాప్ కుమార్ యుద్ధ విజేత రాశాడు.
ఆ) ప్రతాప్ కుమార్ చేత యుద్ధ విజేత రచింపబడింది.
ఇ) ప్రతాప్ కుమార్చే యుద్ధ విజేత రాయబడాలి.
ఈ) యుద్ధ విజేత ప్రతాప్కుమార్చి రచింపబడుతోంది.
జవాబు:
ఆ) ప్రతాప్ కుమార్ చేత యుద్ధ విజేత రచింపబడింది.
115. సిద్ధార్థుడు యుద్ధాన్ని తిరస్కరించాడు.
అ) సిద్ధార్థునిచే యుద్ధం తిరస్కరింపబడింది.
ఆ) యుద్ధం సిద్ధార్థునిచే తిరస్కరింపబడాలి.
ఇ) సిద్ధార్థుడుచే యుద్ధం తిరస్కరింపబడలేదు.
ఈ) యుద్ధం సిద్ధార్థునిచే తిరస్కరింపబడిందా?
జవాబు:
అ) సిద్ధార్థునిచే యుద్ధం తిరస్కరింపబడింది.
116. నెమలి పురివిప్పి నాట్యం చేస్తోంది.
అ) నెమలిచే పురివిప్పి నాట్యం చేయబడుతోంది.
ఆ) నాట్యం నెమలి చేత చేయబడును.
ఇ) నెమలిచే నాట్యం చేయబడలేదు.
ఈ) పురివిప్పి నాట్యం నెమలి చేసింది.
జవాబు:
అ) నెమలిచే పురివిప్పి నాట్యం చేయబడుతోంది.
వాక్య రకాలు
ఇవి ఏ రకమైన సామాన్య వాక్యాలో రాయండి.
117. పశువు, పశువు కాకుండా పోతుందా!
జవాబు:
ఆశ్చర్యార్థక వాక్యం
118. యుద్ధం ఆగిపోయిందా?
జవాబు:
ప్రశ్నార్థక వాక్యం
119. యుద్ధాలు చేయవద్దు.
జవాబు:
నిషేధార్థక వాక్యం
120. దయచేసి పసిపిల్లల్ని కాపాడండి.
జవాబు:
ప్రార్థనార్థక వాక్యం
121. ఆహా ! బుద్ధుడు ఎంత దయామయుడు.
జవాబు:
ఆశ్చర్యార్థక వాక్యం
122. ప్రపంచ శాంతికి తప్పనిసరిగా పాటుపడాలి.
జవాబు:
నిశ్చయార్థక వాక్యం
123. సైనికులు యుద్ధం చేయగలరు.
జవాబు:
సామర్థ్యార్థక వాక్యం
14. అశోకుడు, బుద్ధుడు శాంతి ప్రియులు.
జవాబు:
సంయుక్త వాక్యం
వాక్య రకాలు
ఇవి ఏ రకమైన సామాన్య వాక్యాలో గుర్తించండి.
125. యుద్ధంలో గెలవడం తథ్యం.
అ) నిశ్చయార్థకం
ఆ) సామర్థ్యార్థకం
ఇ) హేత్వర్థకం
ఈ) అప్యర్థకం
జవాబు:
అ) నిశ్చయార్థకం
126. ప్రకృతిని ధ్వంసం చేస్తే, మనుగడ కష్టం.
అ) క్వార్థకం
ఆ) చేదర్థకం
ఇ) అప్యర్థకం
ఈ) శత్రర్థకం
జవాబు:
ఆ) చేదర్థకం
127. సైనికుడు చనిపోయాడా?
అ) ఆశ్చర్యార్థకం
ఆ) ప్రశ్నార్థకం
ఇ) అప్యర్థకం
ఈ) విద్యర్థకం
జవాబు:
అ) ఆశ్చర్యార్థకం
128. ప్రపంచశాంతి కలుగుగాక!
అ) హేత్వర్థకం
ఆ) నిశ్చయార్థకం
ఇ) ఆశీరర్థకం
ఈ) అనుమత్యర్థకం
జవాబు:
ఇ) ఆశీరార్థకం
129. మీరు రావచ్చు.
అ) విద్యర్థకం
ఆ) నిషేధార్థకం
ఇ) అప్యర్థకం
ఈ) అనుమత్యర్థకం
జవాబు:
ఈ) అనుమత్యర్థకం