AP 10th Class Telugu 10th Lesson Questions and Answers కన్యాశుల్కం

Access to the AP 10th Class Telugu Guide 10th Lesson కన్యాశుల్కం Questions and Answers are aligned with the curriculum standards.

కన్యాశుల్కం AP 10th Class Telugu 10th Lesson Questions and Answers

చదవండి ఆలోచించి చెప్పండి.

అన్ని సాహిత్య స్వరూపాలకన్నా నాటకం సమాజాన్ని గాఢంగా బంధిస్తుంది. అనుభవాలను ప్రతిబింబిస్తుంది. అందునా సాంఘిక నాటకం సమకాలీన సమాజంలోని ప్రతి సమస్యకు ప్రతిస్పందిస్తుంది. ప్రతిఘటనను ప్రతిఫలింప చేస్తూ ప్రజా జీవనాన్ని ప్రతిబింబింప చేస్తుంది సాంఘిక నాటకం. కాలానికి అనుగుణమైన ఇతివృత్తాలనే నాటక రచయితలు స్వీకరించాలని అంటాడు భాసుడు. సాంఘిక స్థితిగతులను సమగ్రంగా ప్రతిఫలింప చేయడమే సాంఘిక నాటక పరమ ప్రయోజనమని ఆర్ధర్ మిల్లర్ పేర్కొన్నాడు. సమకాలీన సమాజానికి ఫోటోగ్రాఫ్ వంటిదిగా నాటకాన్ని మనం పరిగణనలోనికి తీసుకోవాలి.
(తెలుగు సాంఘిక నాటకం – పరిణామ క్రమం)

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
సమాజాన్ని గాఢంగా బంధించే సాహిత్య స్వరూపం ఏది?
జవాబు:
సమాజాన్ని గాఢంగా బంధించే సాహిత్య స్వరూపం ‘నాటకం’.

ప్రశ్న 2.
భాసుడు నాటక ఇతివృత్తాల గురించి ఏం చెప్పాడు?
జవాబు:
కాలానికి అనుగుణమైన ఇతివృత్తాలనే నాటక రచయితలు స్వీకరించాలని భాసుడు చెప్పాడు.

AP 10th Class Telugu 10th Lesson Questions and Answers కన్యాశుల్కం

ప్రశ్న 3.
మిల్లర్ సాంఘిక నాటకం ప్రయోజనాన్ని గురించి ఏం చెప్పాడు?
జవాబు:
సాంఘిక స్థితిగతులను సమగ్రంగా ప్రతిఫలింప చేయడమే సాంఘిక నాటక పరమ ప్రయోజనమని ఆర్థర్ మిల్లర్ పేర్కొన్నాడు.

ఇవి చేయండి

అవగాహన – ప్రతిస్పందన

అ) ఈ కింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి, రాయండి.

ప్రశ్న 1.
కన్యాశుల్కం నాటకంలో ప్రధాన ఇతివృత్తం ఏమిటో రాయండి.
జవాబు:
కన్యాశుల్కం తెలుగు జీవనాన్ని, వాతావరణాన్నీ మనుషుల శ్వాసనిశ్వాసాల్నీ, అంతరంగ వ్యథల్నీ, భ్రష్టుపట్టిన మానవ స్వభావాల్నీ ఆవిష్కరించే మొదటి సాంఘిక నాటకం. ఆనాటి హేయమైన మానవ నైజాలూ, జీవచ్ఛవాల్లాంటి బాలవితంతువులూ, సారా మత్తులో ఉండే బైరాగులూ, దొంగసాక్షులూ, వేశ్యలూ, లాయర్లూ,….. నాటి సమాజ సమగ్ర స్వరూపాన్ని గురజాడ“ఫొటో తీసి మనముందుంచారు. కన్యాశుల్కం నాటకంలోని ప్రధాన ఇతివృత్తం “సంఘసంస్కరణ”కి ఉద్దేశించింది.

ప్రశ్న 2.
కన్యాశుల్కం నాటకం రాయడానికి గురజాడకు ప్రేరణ కల్గించిన సంఘటన ఏది?
జవాబు:
గురజాడ కన్యాశుల్కం నాటకం రాయడానికి స్ఫూర్తి అప్పటి విజయనగరం రాజా ఆనంద గజపతిగారు. ఆనాటి విజయనగర చుట్టుపక్కల ఉన్న అనేక అగ్రహారాల్లో అధిక సంఖ్యలో బాల్యవివాహాలు జరుగుతుండేవి. డబ్బు కోసం చిన్న పిల్లలను వృద్ధులకు ఇచ్చి పెళ్ళి చేయడం, చివరికి గర్భస్థ శిశువుకు కూడా బేరం పెట్టడం జరిగేవి. అది చూసి రాజావారు ఎంతో బాధపడ్డారు. ఈ పెళ్ళిళ్ళపై రాజావారు ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో గురజాడ కూడా పాల్గొన్నాడు. ఈ సర్వే ద్వారా ఏటా దాదాపు 344 బాల్యవివాహాలు జరిగేవని తెలుసుకొన్న గురజాడ కలత చెంది, 1887లో తన పాతికేళ్ళ వయసులో ‘కన్యాశుల్కం’ నాటక రచనకు పూనుకున్నారు. ఈ సామాజిక దురాచారాన్ని ఇతివృత్తంగా తీసుకొని, జనరంజకమైన నాటకంగా రూపొందించి, ప్రజలను చైతన్యం చేయాలని ప్రేరణ కలిగించింది ఈ సంఘటన.

AP 10th Class Telugu 10th Lesson Questions and Answers కన్యాశుల్కం

ఆ) కింద ఇచ్చిన ప్రహసనం చదివి ప్రశ్నలకు సమాధానములు రాయండి.

ఇంద్రుడు : నారద మునీంద్రా! మీరిప్పుడేలోకము నుండి దయచేయుచున్నారు?
నారదుడు : నేనిప్పుడు భూలోకం నుండి వచ్చుచున్నాను.
ఇంద్రుడు : అక్కడ వింతలు విశేషములు ఏమి?
నారదుడు : చెప్పెదను వినుండు. భూలోకంలో జనులు కొత్త గ్రహము నొకదానిని కట్టిపెట్టినారు.
ఆ గ్రహము యొక్క లక్షణములేవో సెలవియ్యవలయును. వినుటకు నాకెంతో ఆత్రముగ నున్నది.
నారదుడు : చెప్పుటకు గూడా నాకెంతో యాత్రముగానున్నది. కొత్తగా కనిపెట్టిన ఈ దశమగ్రహము భూమి మీదనే | సంచరించుచుండును.
ఇంద్రుడు : ఇది క్రూర గ్రహమా? శాంతగ్రహమా?
నారదుడు : ఇది ఎల్లప్పుడూ వక్ర గ్రహము. ఎల్లప్పుడూ క్రూర గ్రహము.
ఇంద్రుడు : ఈ గ్రహమెవరికి కీడు కలుగజేయును? ఎవరికి మేలు కలుగజేయును?
నారదుడు : ఈ గ్రహము జన్మస్థానమునకు మేలు కలగజేయుచు ఆడపిల్లలు గల తల్లిదండ్రులకు సదా. కీడు చేయుచుండును.
ఇంద్రుడు : ఈ గ్రహమునకు శాంతి ఎట్లు?
నారదుడు : ఆడపిల్లలు గల వారు నిరంతరము హిరణ్యదానము చేయుచున్న పక్షమున ఈ గ్రహం యొక్క క్రూరత్వము కొంతవరకు శమించును. అప్పటికి శాశ్వతముగా శమింపదు. తాత్కాలికముగా శమించును.
ఇంద్రుడు : ఈ గ్రహమునకు శని గ్రహమునకు భేదమేమి?
నారదుడు : ఈ గ్రహము కంటే శని గ్రహమే చాలా మంచిది. ఎందుచేతననగా? శని యేడు సంవత్సరాలు మాత్రమే మనుష్యు నాశ్రయించి బాధపెట్టును. ఈ గ్రహము ఆశ్రయించిన వారిని యావజ్జీవము బాధ పెట్టును. వెయ్యేల? ఇంత పొడుగ్రహము లేదు. ఈ గ్రహము వలన బాధపడని వారు లేరు.
ఇంద్రుడు : ఆ గ్రహము పేరేదో చెప్పి నన్ను సంతోషపెట్టు.
నారదుడు : ఇది జామాత గ్రహము. అనగా అల్లుడు గ్రహము.
ఇంద్రుడు : ఇదటయ్యా! నువ్వు చెప్పిన గ్రహము. మిక్కిలి చమత్కారముగా చెప్పినావే. పరమేశ్వరానుగ్రహము చేత! నీ పదవ గ్రహ బాధ మన స్వర్గలోకమునకు లేదు.
నారదుడు : బాధ గీధో నేనెరుగను స్వామి చదువుకున్నవాడని లేదు. చదువు లేనివాడనియు లేదు. ఆస్తి కలవాడనీ లేదు లేనివాడనియు లేదు. గుడ్డిగవ్వ చేయనివాడు, గడ్డిపరక చేయని వాడు కూడా అల్లుడు కావాలని కట్నములు, కానుకలు తెమ్మని ఆడపిల్లల తండ్రి సంసారములు దిబ్బ చేయును. ఈ దురవస్థకు అంతు! పారము లేక యున్నది.
ఇంద్రుడు : ఈ దశమగ్రహమునకు దగిన శాంతి ఎట్లు చేయవలెనో నేను బృహస్పతితో నాలోచించెదను. రండి వెళ్ళుదాము. – చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి ప్రహసనాల నుండి

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
పై సంభాషణ ఎవరెవరి మధ్య జరిగింది?
జవాబు:
పై సంభాషణ ఇంద్రుడు, నారదుడు మధ్య జరిగింది.

ప్రశ్న 2.
ఈ ప్రహసనంలో కవి ఏ దురాచారాన్ని ఎత్తి చూపాడు?
జవాబు:
ఈ ప్రహసనంలో కవి ‘వరకట్న’ దురాచారాన్ని ఎత్తి చూపాడు.

ప్రశ్న 3.
భూలోకంలో ఉన్న గ్రహం ఎలాంటిది?
జవాబు:
భూలోకంలో ఉన్న దశమ గ్రహం, వక్రగ్రహమే కాదు క్రూరగ్రహం కూడా,

ప్రశ్న 4.
సంభాషణ ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
శని గ్రహానికి దశమ గ్రహానికి గల భేదమేమిటి?

AP 10th Class Telugu 10th Lesson Questions and Answers కన్యాశుల్కం

ఇ) కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.

ఆధునిక రష్యన్ సాహిత్యమంతా నికొలాయ్ గొగోల్ రాసిన ‘ఓవర్ కోట్’ అనే కథలోంచే పుట్టిందని మహారచయిత దాస్తోయవిస్కీ ప్రకటించాడు. అమెరికాలోనూ, ఐరోపా ఖండంలోనూ, ల్యాటిన్ అమెరికాలోనూ, ఆఫ్రికాలోనూ వచ్చిన ప్రాంతీయ సాహిత్యమంతా కూడా మార్క్ ట్వాయిన్ సాహిత్యంలోంచే పుట్టింది. ప్రాంతీయ జీవితమూ, భాషా సంబంధమైన పలుకుబళ్ళు, ఆ మట్టిన పుట్టిన సజీవ వ్యక్తుల జీవితాల్లోని వెలుగునీడలూ ఇవన్నీ కూడా ఆ ఇద్దరు మహారచయితలు తమ రచనల్లో పరమాద్భుతంగా చిత్రించారు. వారి ప్రభావంతో ఆయా దేశాల్లో, భాషల్లో తదనంతర రచయితలందరూ కథలూ, నవలలూ, నాటకాలూ రాశారు.

పందొమ్మిదో శతాబ్దంలో ఆ మహానుభావులు వేసిన బీజాల వల్ల ఆ శతాబ్దంలోనే కాక, ఇరవయ్యవ శతాబ్దిలోనూ, ఇప్పుడు నడుస్తున్న 21వ శతాబ్దిలో కూడా ఆ ప్రభావం అవిచ్ఛిన్నంగా, సముజ్జ్వలంగా కొనసాగుతున్నది. తెలుగు సాహిత్యంలో నేడు విరాజిల్లుతున్న ప్రాంతీయ జీవన చిత్రణ, వివిధ సామాజిక, మత వర్గాల వారి జీవన విధాన వర్ణన, ప్రాంతీయ భాషల సొగసు, వైవిధ్యం ఇవన్నీ కూడా గురజాడ అప్పారావు గారి కన్యాశుల్యం నుంచి పుట్టినట్టేనని నేను 1 నమ్ముతున్నాను. ఆధునిక తెలుగు సాహిత్యానికి ‘కన్యాశుల్కం’ అమ్మ. – కె.ఎన్.వై.పతంజలి.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
‘ఓవర్ కోట్’ కథను రాసింది ఎవరు?
జవాబు:
‘ఓవర్ కోట్’ కథను రాసింది నికొలాయ్ గొగోల్.

ప్రశ్న 2.
19వ శతాబ్దంలో ఏ రచయితల ప్రభావం ఎక్కువ?
జవాబు:
19వ శతాబ్దంలో నికొలాయ్ గొగోల్, మార్క్ట్వయిన్ రచయితల ప్రభావం ఎక్కువ.

ప్రశ్న 3.
ఆధునిక తెలుగు సాహిత్యానికి ‘అమ్మ’ ఎవరని రచయిత అభిప్రాయం?
జవాబు:
ఆధునిక తెలుగు సాహిత్యానికి ‘కన్యాశుల్కం’ అమ్మని రచయిత అభిప్రాయం.

ప్రశ్న 4.
పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
‘కన్యాశుల్కం’ నాటకంలోని కథావస్తువులు ఏమిటి ?-

ఈ) కింది వానికి అర్థసందర్భములు రాయండి.

ప్రశ్న 1.
డబ్బు ఖర్చయిపోతుందని మీకు బెంగా…….
జవాబు:
కవి పరిచయం : ఈ, వాక్యం గురజాడ అప్పారావు రచించిన “కన్యాశుల్కం” ద్వితీయాంకం మొదటిభాగం నుండి గ్రహించబడినది.
సందర్భం : వెంకటేశంకు ఇంగ్లీషు చదువు చెప్పించాలనే కోరికతో భర్త అగ్నిహోత్రావధానులతో వెంకమ్మ పలికిన సందర్భంలోనిది.
భావం : డబ్బు ఖర్చయిపోతుందని బెంగపడితే ఎలా ఎంత కష్టమైనా చదివించాలని భావము.

ప్రశ్న 2.
పుస్తకం చేతబడితే వేళ్ళకి అంటుకుపోవాలి.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం గురజాడ అప్పారావు రచించిన “కన్యాశుల్కం” ద్వితీయాంకం మొదటిభాగం నుండి గ్రహించబడినది.
సందర్భం : గిరీశం, అగ్నిహోత్రావధాన్లతో వెంకటేశం చదువును గురించి చెప్తున్న సందర్భంలోనిది.
భావం : దండించడం వలన ఉపయోగం లేదనీ, పుస్తకాన్ని చదివితే ఇక ఆ విషయం వచ్చే వరకు వదలకుండా కంఠతా పెట్టాలని భావము.

AP 10th Class Telugu 10th Lesson Questions and Answers కన్యాశుల్కం

ప్రశ్న 3.
తాంబోలం యిచ్చేశాను. యిహ తన్నుకు చావండి.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం గురజాడ అప్పారావు రచించిన “కన్యాశుల్కం” ద్వితీయాంకం మొదటిభాగం నుండి గ్రహించబడినది.
సందర్భం : అగ్నిహెూత్రావధాన్లు తన బావమరిది కరటకశాస్త్రితో పలికిన సందర్భంలోనిది.
భావం : పెళ్ళికి తాంబూలాలు ఇచ్చేశాను. ఏ గొడవలు వచ్చినా సంబంధం లేదు. తన్నుకొంటారో, లేదా మాట్లాడుకొంటారో. మీ ఇష్టం అని భావం.

ఉ) కింది ప్రశ్నలకు ఏకవాక్య సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
కన్యాశుల్కం నాటకం ఏ మాండలికంలో రచించారు?
జవాబు:
కన్యాశుల్కం నాటకం ఉత్తరాంధ్ర మాండలికంలో రచించారు.

ప్రశ్న 2.
వెంకటేశం చదివిన పద్యం ఏది?
జవాబు:
వెంకటేశం చదివిన పద్యం – “నలదమయంతులిద్దరు మనః ప్రభవానల…. దహ్యమానులై సలిపిరి దీర్ఘవాసరనిశలో, ఈ పద్యం ఆంధ్ర మహాభారతం అరణ్యపర్వం రెండవ అశ్వాసంలోని 24వ పద్యం.

ప్రశ్న 3.
“పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు” ఈ మాటలు అన్నది ఎవరు?
జవాబు:
“పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు” అని ఈ మాటలు కరటక శాస్త్రి అన్నారు.

వ్యక్తీకరణ సృజనాత్మకత

ఆ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘కరటక శాస్త్రి ఎవరిని తొందరగా తోవ పెట్టాలనుకున్నాడు? ఎందుకు?
జవాబు:
గిరీశం శిష్యరికం చేస్తున్న మేనల్లుడు వెంకటేశం చదువు మీద మొదటి నుంచీ సందేహమే కరటకశాస్త్రికి గురుశిష్యులిద్దరూ ఇంగ్లీషులో మాట్లాడుకున్నప్పుడే ఎక్కడో ఏదో తేడా జరుగుతోందని స్ఫూరించింది. గిరీశాన్ని తొందరగా తోవ పెట్టకపోతే మోసం వస్తుందనుకున్నాడు. అందుకే, “అన్బీ ఒక తెలుగు పద్యం చదవరా” అని అడగడమూ, గిరీశం, “నలదమయంతులిద్దరు” పద్యం చదువుమని మెల్లగా చెప్పడం, వెంకటేశం పద్యం చెప్పడం కరటకశాస్త్రి ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. పద్యానికి అర్థం చెప్పమంటే మేనల్లుడు ముఖం తేలేశాడు. వెంటనే గిరీశం అందుకుని, పసిపిల్లలకి అలాంటి కఠినమైన పద్యానికి అర్ధం ఏం తెలుస్తుంది?” అన్నీ వివరణ వింటూనే “తర్ఫీదు మా చక్కగా ఉంది. వీణ్ణి (గిరీశాన్ని) పెందరాళే తోవ పెట్టకపోతే మోసం వస్తుందని అనుకున్నాడు..

ప్రశ్న 2.
అగ్నిహోత్రావధానుల పాత్ర స్వభావం ఎలాంటిది?
జవాబు:
“తాంబోలం ఇచ్చేశాను ఇహ తన్నుకు చావండి” – అంటూ కన్యాశుల్కం నాటకంలో అగ్ని హెూత్రావధానులు పలికిన మాట తెలుగు భాషల్లో జాతీయమై నిలిచిపోయింది. చాలామంది తండ్రుల్లాగే కొడుకు చదువుకి బోల్డంత ఖర్చయిపోతోందని బెంగ. కన్యాశుల్కం ద్వితీయాంకంలో అగ్నిహోత్రావధాన్లు పరిచయం అయింది మొదలు, మళ్ళీ అతగాడు ఎప్పుడెప్పుడు కనిపిస్తాడా అన్న ఆత్రుత కలిగిస్తాడు. గిరీశంతో పాటు బండి దిగిన వెంకటేశాన్ని చూడగానే, ‘వెధవాయా, ఈ మారైనా పరీక్ష పాసయినావా ?” అని సూటిగా విషయంలోకి వచ్చేస్తాడు.

గిరీశం విషయంలో పూర్తిగా అవగాహన కల్గినవాడిగా అగ్నిహోత్రావధానులు కనిపిస్తాడు. గిరీశం అతిమాటలు నచ్చక, “ఈ శషభిషలు నాకేం పనికిరావు. ఇతడి వైఖరి. చూస్తుంటే ఇక్కడే బసవేసేట్టు కనిపిస్తోంది. మా ఇంట్లో భోజనం ఎంతమాత్రం వీలుపడదు” అని కుండబద్దలు కొట్టేస్తాడు కూడా. ఇంకా డబ్బు విషయంలోనూ మొహమాటం లేనివాడిగా కనబడతాడు. మనుషుల నైజాలని పసిగట్టగలిగీ, అవతలి వాళ్ళ బుట్ట పడిపోవడం, తాను నిర్ణయించుకున్నదే తప్ప మరో ఆలోచన చేయకపోవడం అగ్నిహోత్రావధాన్ల వ్యక్తిత్వం.

AP 10th Class Telugu 10th Lesson Questions and Answers కన్యాశుల్కం

ప్రశ్న 3.
గిరీశం ఎలాంటివాడు?
జవాబు:
గిరీశం కన్యాశుల్యం నాటకంలో గురజాడ అప్పారావు సృష్టించిన కాల్పనిక పాత్ర, కన్యాశుల్కం నాటకంలో గిరీశం పాత్ర ప్రధానపాత్రే అయినా నాయకపాత్ర కాదు. గిరీశం వ్యక్తిత్వం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. అసలు స్వభావాన్ని లోపల్లోపలే దాచుకుంటూ పైకి ఉదాత్తమైన వ్యక్తిగా ఆదర్శ పురుషుడిగా, సంఘసంస్కర్తగా తనని తాను చూపించుకుంటూ ఉంటాడు. తన మాటతీరుతో ఎంతటి ఘనులైన బురిడీ కొట్టించేస్తాడు.

అతని మాటల్లో దొర్లే ఇంగ్లీషు పదాలు, సమయం దొరికినప్పుడల్లా చెప్పేసే పొయెమ్స్….. మనల్ని డంగయిపోయేలా చేస్తాయి. తాను చెప్పింది అబద్ధమైనా సరే…… ఏదో ఒక పుస్తకం పేరు చెప్పి తాను చెప్పింది ఒప్పని నిరూపించుకునే ప్రయత్నం చేస్తాడు. అందరికీ మంచి లక్షణాల గురించి చెబుతూ ఆచరణలోకి వచ్చే సరికి మాత్రం తనకు ఉపయోగపడేవి మాత్రమే చేసుకునే టైపు గిరీశం. స్వకార్యం నెరవేర్చుకోవడానికి ఏమైనా చేస్తాడు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే గిరీశం పాత్రను అంత అద్భుతంగా గురజాడ తీర్చిదిద్దారు.

ఆ) కింది ప్రశ్నలకు ఎనిమిది నుండి పది వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
కన్యాశుల్కం పాఠ్యభాగం ద్వారా కవి చెప్పదలచుకున్న అభిప్రాయం ఏమిటో రాయండి.
జవాబు:
కన్యాశుల్కం పాఠ్యభాగం ద్వారా కవి చెప్పదలచుకున్న అభిప్రాయం ఆధునిక సాహిత్యానికి వేగుచుక్క గురజాడ. బాల్యవివాహాల వల్ల ఆడ పిల్లలు చిన్నవయసులోనే వైధవ్యాన్ని పొంది, వారి జీవితాలు ఎంత దుర్భరంగా గడుస్తున్నాయో చూసిన గురజాడ మనసు చలించింది. ఈ సామాజిక దురాచారాన్ని ఇతివృత్తంగా తీసుకొని, జనరంజకమైన నాటకంగా రూపొందించి, ప్రజలను చైతన్యం చేయాలనుకున్నారు గురజాడ.

భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానం అడుగిడుతున్న తొలిరోజులలో ఆనాటి సమాజంలో ఆంగ్ల విద్యను గురించి ప్రజలలో ఉన్న ఆలోచన ధోరణిని తెలియ చెప్పడం, కొత్త కొత్త కొలువులు కావాలంటే ఆధునిక విద్యను అభ్యసించాల్సిందేనని వెంకమ్మ లాంటి సాధారణ గృహిణి ఆనాడే గ్రహించిందని తెలియజేశారు. సమాజంలోని దురాచారాలు, సంఘసంస్కరణ పై అవగాహన కల్పించి మనలను జాగృతం చేయదలచారు.

కన్యాశుల్యం పాఠంలో మనకు కనిపించే పాత్రలు ఐదు. వీరంతా సమాజంలో మన చుట్టూనే ఉన్నారు. పిల్లలు చదువుకొని వృద్ధిలోకి రావాలని కోరుకునే తల్లులు. కొడుకుల చదువుల కోసం ఇంత ఖర్చు పెట్టాలా అని బెంగ పడే తండ్రులు. చదివించే శక్తి ఉన్న తల్లిదండ్రులకు చదువు పట్ల ఆసక్తి లేని పిల్లలు. సమాజంలోని దొంగ సంస్కర్తలకు ప్రతినిధిగా గిరీశం. తోబుట్టువుకి కొండంత అండగా నిలబడే అన్నగారు. మేనల్లుడు పట్ల బాధ్యత ఉన్న మేనమామ. ఇలా సమాజంలోని వ్యక్తుల వ్యక్తిత్వానికి అద్దం పట్టే విధంగా పాత్రలను తీర్చిదిద్దారు గురజాడ. సంఘసంస్కరణే కథావస్తువుగా తీసుకొని ఆనాటి హేయమైన మానవనైజాలను, జీవచ్ఛవాల్లాంటి బాలవితంతువులూ ఆనాటి అసమగ్ర సమాజ సమగ్ర స్వరూపాన్ని ఈ పాఠం ద్వారా మనకు కళ్ళకు కట్టినట్లు చూపించాలనుకున్నారు గురజాడ.

ప్రశ్న 2.
వెంకటేశం ఇంగ్లీషు చదువు విషయంలో వెంకమ్మ పట్టుపట్టడంలో ఉద్దేశాన్ని మీ సొంత మాటల్లో రాయండి.
జవాబు:
వెంకటేశం ఇంగ్లీషు చదువు విషయంలో వెంకమ్మ పట్టుపట్టడంలో ఉద్దేశం: వెంకమ్మ అగ్ని హెూత్రావధాన్ల భార్య. మహాదొడ్డ ఇల్లాలు. భర్త తిట్లన్నీ కాస్తూ, తనకు పుట్టింటి నుండి వచ్చిన ఆస్తి అమ్మైనా కొడుకు వెంకటేశాన్ని చదివించుకోవాలని ఆ తల్లి ఆశ. మనిషిని మంచి మనిషిగా తీర్చిదిద్దేది విద్య. సంస్కారవంతంగా చేస్తుంది విద్య. అది గ్రహించింది కాబట్టే వెంకమ్మ, కొడుకు చదువు విషయంలో పట్టు పట్టింది.

భారతదేశంలో ఆంగ్ల విద్యావిధానం అడుగుపెడుతున్న తొలిరోజులలో ఆనాడు సమాజంలో ఆంగ్ల విద్యను గురించి ఆసక్తి కలిగి, తన బిడ్డను బాగా చదివించి గొప్ప స్థానంలో ఉంచాలనుకొంది వెంకమ్మ. కానీ భర్తకు ఇంగ్లీషు చదువు పట్ల ఇష్టం లేకపోవడం, కొడుకు శ్రద్ధ పెట్టకపోవడం ఆమెను కలత పెట్టాయి. కొడుకు చదువు విషయమై తన భర్తతో, “మీలాగే వాడూ జంఝాలు ఒడుక్కుంటూ బతకాలా ఏంటి ? మీకంత భారమైతే మా వాళ్ళు నాకు పసుపూ కుంకానికి ఇచ్చిన భూమి అమ్మేసి కుర్రాడికి చదువు చెప్పిస్తా” అని తెగేసి చెప్పేసింది వెంకమ్మ.

AP 10th Class Telugu 10th Lesson Questions and Answers కన్యాశుల్కం

ప్రశ్న 3.
ఆధునిక విద్య వలన కలిగే ప్రయోజనాలను విపులీకరించండి.
జవాబు:
ఆధునిక విద్య వలన కలిగే ప్రయోజనాలు : మానవుడు పూర్తి సామర్థ్యాన్ని సాధించడానికి, సమానమైన సమాజాన్ని అభివృద్ధి చేయడానికి విద్య తప్పనిసరి. సంప్రదాయ సంస్కృతి మరియు ఆధునిక విద్య మధ్య అంతరాన్ని తగ్గించడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. ఈ రెండూ మనిషికి సంపూర్ణ అభ్యాస అనుభవాన్ని ఇవ్వగలవు. ఆత్మవిశ్వాసంతో, స్వతంత్రంగా, బాధ్యతాయుతమైన వ్యక్తులుగా జీవించడానికి ఆధునిక విద్య చక్కగా తోడ్పడుతుంది. మన మూలాలను మరచిపోకుండా చేసే విద్య, మనలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి సహకరిస్తుంది.

ఈ ఆధునిక విద్య వ్యక్తిగత వృద్ధికి మరియు స్వీయ ఆవిష్కరణలకు అవకాశాలను అందిస్తుంది. ఇందులో విస్తృతశ్రేణి సబ్జెక్టులు, సౌకర్యవంతమైన ఎంపికలుంటాయి. ఇది వేగంగా మారుతున్న ప్రపంచంలో విద్యార్థులను విజయం కోసం సిద్ధం చేయడానికి, సాంకేతికత, విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలను సమగ్రపరిచే విద్యకు సమకాలీన విధానాన్ని సూచిస్తుంది. ఆధునిక విద్య ఆచరణాత్మక నైపుణ్యాలు, విజ్ఞానం, విలువలను అభివృద్ధిపరుస్తుంది.

మొదటగా ఈ ఆధునిక విద్య “ఒక పిల్లవాడు మనం బోధించిన విధంగా నేర్చుకోలేకపోతే, బహుశా వారు నేర్చుకునే విధానాన్ని మనం నేర్పించాలి” అని చెబుతుంది. దీనినే “లెర్నర్ – ఫోకస్” అనవచ్చు. ఇక రెండవది “బహుళ క్రమశిక్షణా విధానం” – ఇది విజ్ఞానం యొక్క పరస్పర అనుసంధానాన్ని విద్యార్థులు గుర్తించేలా చేస్తుంది.

వ్యక్తిగత ప్రాధాన్యత : దీని ద్వారా విద్యార్థులకు వారి సామర్థ్యాలకు తగిన ప్రాధాన్యతలను అందించడంపై దృష్టి సారిస్తుంది. లైఫ్ స్కిల్స్ : ఇవి విద్యార్థుల సమగ్రాభివృద్ధికి తోడ్పడతాయి.

బోధనాశాస్త్రం : దృశ్య, శ్రవణ మాధ్యమాల ప్రాధాన్యత ఇచ్చి, విద్యార్థికి అవగాహన పూర్తి స్థాయిలో కలిగించేలా బోధన ఉంటుంది.

బట్టీ పట్టే విధానంలా కాకుండా అవగాహనతో, ఆలోచనతో విద్య నేర్చుకోవడం ఆధునిక విద్యలో ఒక భాగం. ఇలా ఆధునిక విద్య వల్ల అనేక ప్రయోజనాలున్నాయి.

ఇ) కింది ప్రశ్నలకు సృజనాత్మకంగా సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
కన్యాశుల్కం పాఠాన్ని సొంతమాటలలో కథగా మార్చి రాయండి.
జవాబు:
కన్యాశుల్కం ‘కథ’
కృష్ణరాయపురం అగ్రహారంలో అగ్నిహోత్రావధాన్లు ‘జట’ (వేదంలో ఒక భాగం) చదువుకున్న పండితుడు. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు జంఝాలు వడుకుతుంటాడు. అతని భార్య వెంకమ్మ. మంచి ఇల్లాలు. కొడుకు వెంకటేశం విజయనగరంలో ఇంగ్లీషు చదువుతుంటాడు. కొడుకును విడిచి ఉండలేని వెంకమ్మ. పిల్లవాడి భవిష్యత్తు కోసం బస్తీలో ఉంచి చదివిస్తోంది. క్రిస్మస్ సెలవులకు ఇంటికి వస్తున్నానని కొడుకు రాసిన ఉత్తరం చూసుకొని మురిసిపోతోంది ఆ తల్లి, ఇంగ్లీషు చదువుల మీద ఆసక్తి లేని అవధాన్లకు, కొడుకు కోసం అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం ఎందుకనుకుంటాడు.

కానీ భార్య కోసం మౌనం వహించాడు. కొడుకు బాగా చదువుకుంటే కన్యాశుల్కం ఇవ్వకుండా, డబ్బు మిగుల్చుకోవచ్చనే పిసినారి తండ్రి అవధాన్లు. పిల్లవాడి చదువుకు అవసరమైతే తన పుట్టింటి వారిచ్చిన పొలం ‘సరే కొడుకును చదివిస్తానంటుంది వెంకమ్మ. ఇంతలో వెంకటేశం, అతని (దొంగ) మాస్టారు గిరీశం వస్తారు. కొడుకుని చూసి వెంకమ్మ ఎంతో సంతోషిస్తుంది. గిరీశం వెంకటేశానికి చదువు చెప్పే గురువని తెలిసి, నీడే కాదు కూడు కూడా పెట్టనని తెగేసి చెప్తాడు అవధాన్లు. గిరీశం తన మాయ మాటలతో అందరినీ బురిడీ కొట్టిస్తాడు. వెంకమ్మ తన బిడ్డను సరైన దారిలో పెట్టమని గిరీశాన్ని అడుగుతుంది అతని మాయలో పడి.

గిరీశం ఆ ఇంటిలో తిష్టవేయడానికి కావల్సిన మార్గాలన్నీ అన్వేషిస్తాడు. ముందుగా అవధానులను తన మాటల గారడితో బుట్టలో వేసుంటాడు. కానీ మొదటి నుంచీ కరటకశాస్త్రికి గిరీశం వైఖరి నచ్చలేదు. అతని మాటల్లో దొర్లే ఇంగ్లీషు పదాలు, పోయిమ్స్ అక్కడి వారిని ఆశ్చర్యపోయేలా చేస్తాయి.

అవధాన్లు తన పెద్దకూతురు బాల్యవివాహం వల్ల చిన్న వయసులోనే వైధవ్యం పొంది, ఏ సుఖం లేకుండానే ఇంట్లో కాలం గడుపుతోందనే జాలి లేకపోగా రెండవ కూతుర్ని కూడా డబ్బు మీద ఆశతో (కన్యాశుల్కం) 60 ఏళ్ళ ముసలాడికి ఇవ్వడానికి సిద్ధపడ్డ ఒక చెడ్డ తండ్రి, భార్య, బావమరిది పెళ్ళి వద్దని వారించినా “తాంబోలం ఇచ్చేశాను, ఇహ తన్నుకు చావండి” అని మొహమాటం లేకుండా కూతురు బంగారు భవిష్యత్తును డబ్బు కోసం పణంగా పెడతాడు. పిల్లకు ఈ పెళ్ళి కాకుండా మీరే కాపాడాలని వెంకమ్మ అన్నగారైన కరటకశాస్త్రిని, గిరీశాన్ని ప్రాధేయపడుతుంది. కరటకశాస్త్రి ఉపాయంతో ఆ పెళ్ళి కానీయకుండా చేయడంతో కథ సుఖాంతం అవుతుంది.

ప్రశ్న 2.
మీ ఊరిలో జరిగే నాటక ప్రదర్శనకు ప్రేక్షకులకు ఆహ్వానం పలుకుతూ కరపత్రాన్ని తయారు చేయండి.
జవాబు:
మా ఊరిలో జరిగే నాటక ప్రదర్శనకు ప్రేక్షకులకు ఆహ్వానం పలుకుతూ కరపత్రం..

ఆహ్వానం

సోదర సోదరీ మణులారా! ఈ రోజు మన ఊరిలో బ్రహ్మాండమైన నాటక ప్రదర్శన జరుగుతుంది. విజ్ఞానమూ, వినోదమూ అందించే గొప్ప నాటకం గురజాడ అప్పారావు గారి కలం నుండి జాలువారిన అద్భుత సృష్టి ఈ నాటకం, అదేమిటంటే ‘కన్యాశుల్కం’ నాటకం, గిరీశం, మధుర వాణి, రామప్పపంతులు, అగ్నిహోత్రావధాన్లు, సౌజన్యారావు, కరటకశాస్త్రి….. ఇలా సమాజంలోని వ్యక్తులను అద్దం పట్టే పాత్రలు, వారి సంభాషణలు మిమ్మల్ని ఆనందం, ఆశ్చర్యాలలో ముంచెత్తుతాయి. ఈ నాటకాన్ని మన గ్రామంలో కంచిభొట్ల సాహితీ సమితి వారు ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పుడో కాదు. తేది : XXXX న మన గ్రామంలోని పార్కులో ఈ ఉచిత నాటక ప్రదర్శన జరుగుతుంది. కావున పిల్లా, పెద్దా, ఆడా, మగా అందరూ ఈ ‘కన్యాశుల్కం’ నాటకం చూసి ఆనందించగలరని ఆశిస్తున్నాం. మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం.

ఇట్లు,
కంచిభొట్ల సాహితీ సమితి,
XXXX.

AP 10th Class Telugu 10th Lesson Questions and Answers కన్యాశుల్కం

భాషాంశాలు

పదజాలం

ఆ) కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి వాటితో సొంతవాక్యాలు రాయండి.

1. ఏటేట పొలం శిస్తు పెరగడం వల్ల చెల్లించడం భారమవుతుంది.
శిస్తు = పన్ను సొంతవాక్యం
కరువుకాటకాలతో బాధపడే రైతులపై పన్నుల భారం వేయకూడదు.

2. వూష్టం వచ్చినప్పుడు వైద్యుడిని సంప్రదించాలి.
పూష్టం = జ్వరం
సొంతవాక్యం జ్వరం వచ్చినప్పుడు విశ్రాంతిగా ఉండాలి.

3. ఖాయిలా పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రభుత్వం కమిటీ వేసింది.
ఖాయిలా = దివాళా
సొంతవాక్యం అతిగా అప్పులు ఇచ్చినా, వేరే చోట తెచ్చినా దివాళా తీయటం ఖాయం.

4. గ్రామీణ ప్రాంత ఆటలలో గొట్టికాయలు ఆట ఒకటి.
గొట్టి కాయలు = గోళి కాయలు –
సొంతవాక్యం : ప్రస్తుతకాలంలో గోళికాయ సోడాలు అరుదుగా కనిపిస్తున్నాయి.

5. ఈ వాక్యం కాస్త తర్జుమా చేసి పెట్టు.
తర్జుమా = అనువాదం
సొంతవాక్యం : ‘వేయి పడగలు’ నవలను పి.వి. నరసింహారావు గారు హిందీలోకి అనువాదం చేసారు.

ఆ) కింది వాక్యాలను చదివి, ఇచ్చిన పదాలకు పర్యాయపదాలు రాయండి.

1. జాబు రాయడానికి జాగు సేయకు. నీ బాగోగులు లేఖలో తెలియజేయి.
ఉత్తరం : జాబు, లేఖ

2. కష్టపడే వారికి తగిన వేతనం ఇవ్వాలి. ఆ భృతి వారికి జీవనాధారం.
జీతం : వేతనం, భృతి

3. ధనమే జగత్తుకు మూలం. ఆ ద్రవ్యాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి.
సొమ్ము : ధనం, ద్రవ్యం

ఇ) కింది పదాలకు నానార్థాలను జతపరచండి.
AP 10th Class Telugu 10th Lesson Questions and Answers కన్యాశుల్కం 1

1. తల్లి (ఆ) అ) దొరతనం, అధ్యక్షత, ఆశ్రయం
2. పెద్ద (ఈ) ఆ) మాత, పెద్దది, పూజ్యురాలు
3. అధికారం (అ) ఇ) ఆనందం, తృప్తి, ధైర్యం
4. అర్థం (ఉ) ఈ) వృద్ధుడు, గొప్పవాడు, జ్యేష్ఠుడు
5. సంతోషం (ఇ) ఉ) ధనము, కారణం, శబ్దార్థం

ఈ) కింది పదాలలో ప్రకృతి వికృతులను వేరుచేసి రాయండి.
పురము, నీరు, దర్శనం, ఛాత్రుడు, ప్రోలు, దరిసెనము, వఱువాత, ప్రభాతము, నీరము, చట్టు
AP 10th Class Telugu 10th Lesson Questions and Answers కన్యాశుల్కం 2

ప్రకృతి – వికృత
పురము – ప్రోలు
నీరము – నీరు
దర్శనం – దరిసెనము
ఛాత్రుడు – చుట్టు
ప్రభాతము – వఱువాత

ఉ) కింది జాతీయాలను వివరించి సొంతవాక్యాలు రాయండి.
AP 10th Class Telugu 10th Lesson Questions and Answers కన్యాశుల్కం 3

1. కళ్ళు కాయలు కాదు: “ఎదురుచూచుట” అనే అర్థంలో ఈ జాతీయాన్ని ప్రయోగిస్తారు.
సొంతకాళ్యం ఉదయాన్నుంచి నీ కోసం చూసి చూసి నా కళ్ళు కాయలు కాచాయి.

2. చెవికోసుకొను : “ఆసక్తితో విను” లేదా “ఎక్కువ ఇష్టపడుట” అనే అర్థంలో ఈ జాతీయాన్ని ప్రయోగిస్తారు.
సొంతవాక్యం : ఎస్.పి. బాలు పాటలంటే నేను చెవి కోసుకుంటాను.

3. కడుపులో పెట్టుకొను : “మిక్కిలి ఆదరణ చూపు” లేదా “తప్పులు మన్నించు” అనే అర్థంలో ఈ జాతీయాన్ని ప్రయోగిస్తారు.
సొంతవాక్యం : ఇక నా బిడ్డ కాదు మీ బిడ్డ కడుపులో పెట్టుకొని చూసుకోండి అని అప్పగింతలు చేసే తండ్రిని చూసి ఏ ఆడపిల్లైనా బాధపడుతుంది.

4. చర్మం చెప్పులు కుట్టించు కృతజ్ఞతకు పరాకాష్ట లేదా అతికృతజ్ఞతను చూపు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ప్రయోగిస్తారు.
సొంతవాక్యం నా చర్మంతో మీకు చెప్పులు కుట్టించినా మీ ఋణం తీరదు.

AP 10th Class Telugu 10th Lesson Questions and Answers కన్యాశుల్కం

ఊ) కింది పదాలకు వ్యవహార రూపాలు రాయండి.
AP 10th Class Telugu 10th Lesson Questions and Answers కన్యాశుల్కం 4

1. వోఘాయిత్తం – అఘాయిత్తం
2. అంచూవుంచారు – అంటూ ఉంటారు
3. అగ్ఘురారం – అగ్రహారం
4. అపృచ్ఛపు – అప్రాచ్యపు
5. వచ్చావషోయ్ – వచ్చావటోయ్
6. రాజమహేంద్రంషండీ – రాజమహేంద్రం అండీ

వ్యాకరణాంశాలు

అ) కింది పదాలను విడదీసి, సంధి పేర్లు రాయండి.
AP 10th Class Telugu 10th Lesson Questions and Answers కన్యాశుల్కం 5
1. అభ్యంతరం : అభి + అంతరం = యణాదేశ సంధి
2. రవ్వంత : రవ్వ + అంత = అత్త్వ సంధి
3. సావకాశం : స + అవకాశం = సవర్ణదీర్ఘ సంధి
4. కళ్ళెదుట : కళ్ళు + ఎదుట = ఉత్త్వ సంధి

పుంప్వాదేశ సంధి:

కింది ఉదాహరణలు పరిశీలించండి.
1. ఆదరము + మాట = ఆదరపు మాట, ఆదరంపు మాట
2. నీలము + కండ్లు = నీలపు కండ్లు, నీలంపు కండ్లు
3. మధురము + కావ్యము = మధురపు కావ్యము, మధురంపు కావ్యము

పై పదాలలో కర్మధారయ సమాసం ఉంది. వీటిని విడదీసినపుడు మొదటి పదానికి (విశేషణానికి) చివర ‘ము’ ఉంది. సంధి జరిగినపుడు ‘ము’ వర్ణకము పోయి ‘పు’ అనే అక్షరం గానీ లేదా ‘ంపు’ గానీ వస్తుంది. ఇలా రావడాన్ని పుంప్వాదేశ సంధి అంటారు.
సూత్రం ‘కర్మధారయము నందు ము వర్తకమునకు పుంపు లగు’
మరికొన్ని ఉదాహరణలు చూద్దాం.
AP 10th Class Telugu 10th Lesson Questions and Answers కన్యాశుల్కం 6

1. అపృచ్ఛపు మాటలు : అపృచ్ఛము + మాటలు = పుంప్వాదేశ సంధి
2. విరసపు మాట : విరసము + మాట = పుంప్వాదేశ సంధి
3. ఉన్నతపు గొడుగు : ఉన్నతము + గొడుగు = పుంప్వాదేశ సంధి
4. కోమలపు జ్ఞానము : కోమలము + జ్ఞానము = పుంప్వాదేశ సంధి
5. సరసపు మాట : సరసము + మాట = పుంప్వాదేశ సంధి

ఆ) కింది సమాసాలకు విగ్రహవాక్యాలు రాసి, ఏ సమాసాలో రాయండి.
AP 10th Class Telugu 10th Lesson Questions and Answers కన్యాశుల్కం 7

1. నూరు రూపాయలు : నూరు అను సంఖ్య గల రూపాయలు – ద్విగు సమాసం
2. దొడ్డప్రభువు : దొడ్డవాడైన ప్రభువు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
3. కలిమిలేములు : కలిమి మరియు లేమి – ద్వంద్వ సమాసం
4. లక్షాధికారి : లక్షలకు అధికారి – షస్టీ తత్పురుష సమాసం

ఇ) కింది తరగతిలో నేర్చుకున్న ఉత్ప్రేక్షాలంకారమును గుర్తు చేసుకుందాం.

1. ఈ వెన్నెల పాలవెల్లియో అన్నట్లున్నది.
2. ఆకాశం కాటుకను వర్షిస్తున్నట్లుంది.
3. ఆ ఏనుగు నడుస్తున్న కొండా అన్నట్లుంది.

పై వాక్యాలలో ఊహ ప్రధానంగా ఉంది. కనుక ఇది ఉత్ప్రేక్షాలంకారం.
ధర్మస్వామ్యాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే అది ఉత్ప్రేక్షాలంకారం అవుతుంది.

ఈ) కింద ఇచ్చిన వాక్యాలను క్రియ ఆధారంగా వ్యతిరేకార్థక వాక్యాలుగా మార్చండి. ఆ కప్పు ఖాళీగా లేదు.
AP 10th Class Telugu 10th Lesson Questions and Answers కన్యాశుల్కం 8

1. ఆ కప్పు ఖాళీగా ఉంది – ఆ కప్పు ఖాళీగా లేదు.
2. వానలు ఎక్కువగా పడ్డాయి – వానలు ఎక్కువగా పడలేదు.
3. ఆ చిత్రాన్ని చూసి అందరూ మెచ్చుకున్నారు – ఆ చిత్రాన్ని చూసి అందరూ మెచ్చుకోలేదు.
4. నాటక ప్రదర్శన జరిగింది – నాటక ప్రదర్శన జరగలేదు.
5. ఆలోచింపచేసే ప్రక్రియ నాటకం అని భావించారు – ఆలోచింపచేసే ప్రక్రియ నాటకం అని భావించలేదు.

అదనపు భాషాంశాలు

పర్యాయపదాలు

కన్యాశుల్కం : ఓలి, ఉంకువ, అభిహరణం
జంఝం : జందెం, జంధ్యం, యజ్ఞోపవీతం
ఒట్టినే : రిక్త, ఊరకనే, ఏమీలేని
బెంగ : దుఃఖం, బాధ
కొవ్వు : అహం, మదం
దర్శనం : చూపు, కన్ను
భోజనం : బోసం, అన్నం
మోస్తరు : మాదిరి పద్దతి
దమము : అణచుకొను, సహించు
భారం : జవాబుదారి, బాధ్యత
భావ్యం : యుక్తం, తగిన
భోగట్టా : సమాచారం, విషయం
దావా : కోర్టు కేసు, వ్యాజ్యం
దాఖలా : ఋజువు, సాక్ష్యం
వకీలు : న్యాయవాది, ప్లీడరు, లాయరు
గళగ్రాహి : తడబడకుండా చదివేవాడు, గళానికి అడ్డు లేకుండా చదివేవాడు
పేలపిండి : కరంభం, సత్తువు, చూర్ణం
తెరిపి : ఖాళీ, తీరిక
సావకాశం : నిదానం, నెమ్మది, నింపాది
ఉపాయం : ఎత్తుగడ, తంత్రం
క్లుప్తం : సంక్షిప్తం, సంగ్రహం, టూకీ
కోర్టు : న్యాయస్థానం, న్యాయసభ, ధర్మాసనం
కంటె : కంఠాభరణం, మెడ నగ
చాకచక్యం : నేర్పు, తెలివి, దక్షత
విదూషకుడు : హాస్యగాడు, పరిహాసకుడు
నిష్క్రమించు : వెడలు, వెళ్ళు

నానార్థాలు

అంకం – నాటక భాగం, ఒడి
సిస్తు – పన్ను ఆదాయం
ఖాయలా – దివాళా, అనారోగ్యం
గొట్టికాయ – గోలీకాయ, చురుకైన చిన్న కుర్రాడు
కడతేరు – చచ్చు, సమాప్తం
దొడ్డ – గొప్ప, మంచి, పెద్దమ్మ
దర్శనం – చూపు, అద్దం
శషభిషలు – బెదిరింపులు, గొప్పులు, తిరకాసు చర్చలు
తోవపెట్టు – దారిచూపు, పంపించు
సాధనం – పనిముట్టు, కారణం
తట్టుబడి – తాకిడి, ఖర్చు

ప్రకృతి-వికృతులు

ప్రకృతి – వికృతి

కన్య – కన్నె, కన్నియ
శుల్కము – సుంకము
యజ్ఞోపవీతం – జందెం, జందియం
భూమి – బూమి
కోల, కోడ – కౌగిలి
ఘటి, ఘటికా – గడియ
భాష – బాస
నీరము – నీరు
భోజనం – బోనం
పట్టణం – పట్నం
ప్రాణం – పానం
గర్భం – కడుపు
వాసము – బస
పుస్తకం – పొత్తం
రూప్యము – రూపాయ, రూపాయి
అక్షరం – అక్కరం
పిష్టము – పిండి
త్రిలింగ – తెనుగు, తెలుగు
నిర్మల – నిమ్మళం
కంఠికా – కంటె
కథ – కత
అంబ – అమ్మ
మరక – మెరక (మెట్ట)
శ్రమ – సరమ (కష్టం)
ప్రశ్న – పన్నము

AP 10th Class Telugu 10th Lesson Questions and Answers కన్యాశుల్కం

వ్యుత్పత్త్యర్థాలు

శాస్త్రి : శాస్త్రాలు తెలిసినవాడు (పండితుడు)
కన్యాశుల్కము : వధువును గ్రహించుటకు ఇచ్చు ధనం (ఓలి)

సంధులు

మేనత – మేన + అత్త – అత్వ సంధి
చచ్చినంత – చచ్చిన – అంత – అత్వ సంధి
పెద్దన్న – పెద్ద + అన్న – అత్వ సంధి
రవ్వంత – రవ్వ + అంత – అత్వ సంధి
తెరిపుండదు – తెరిపి + ఉండదు – ఇత్వ సంధి
రుణాలిచ్చి – రుణాలు + ఇచ్చి – ఉత్వ సంధి
వారిచ్చే – వారు + ఇచ్చే – ఉత్వ సంధి
మూడేళ్ళు – మూడు + ఏళ్ళు – ఉత్వ సంధి
శ్రమపడి – శ్రమము + పడి – పడ్వాది సంధి
అపృచ్ఛపు మాటలు – అపృచ్ఛము + మాటలు – పుంప్వాదేశ సంధి
అగ్నిహెూత్రావధాన్లు – అగ్నిహోత్ర + అవధాన్లు – సవర్ణదీర్ఘ సంధి
లుబ్ధావధాన్లు – లుబ్ధ + అవధాన్లు – సవర్ణదీర్ఘ సంధి
లక్షాధికారి – లక్ష + అధికారి – సవర్ణదీర్ఘ సంధి
సావకాశం – స + అవకాశం – సవర్ణదీర్ఘ సంధి
అభ్యంతరం – అభి + అంతరం – యణాదేశ సంధి
మనఃప్రభవ – మనః + ప్రభవ – విసర్గ సంధి
దురాచారాలు – దుః + ఆచారాలు – విసర్గ సంధి
ప్రభవానల – ప్రభవ + అనల – సవర్ణదీర్ఘ సంధి
ఈయేడు – ఈ + ఏడు – యడాగమ సంధి
మీకంత – మీకు + అంత – ఉత్వ సంధి
ఇంతెందుకు – ఇంత + ఎందుకు – అత్వ సంధి

సమాసాలు

లక్షాధికారి – లక్షలకు అధికారి – షష్ఠీ తత్పురుష సమాసం
నా ప్రాణాలు – నా యొక్క ప్రాణాలు – షష్ఠీ తత్పురుష సమాసం
మీ దయ – మీ యొక్క దయ – షష్ఠీ తత్పురుష సమాసం
మీ ముఖం – మీ యొక్క ముఖం – షష్ఠీ తత్పురుష సమాసం
అగ్రహారం భూములు – అగ్రహారమందలి భూములు – సప్తమీ తత్పురుష సమాసం
అసాధ్యం – సాధ్యం కానిది – నఞ తత్పురుష సమాసం
సావకాశం – అవకాశాన్ని బట్టి – అవ్యయీభావ సమాసం
నూరు రూపాయలు – నూరు సంఖ్య గల రూపాయలు
చప్పన్న భాషలు – 56 సంఖ్యల గల భాషలు – ద్విగు సమాసం
నాలుగష్టాలు – నాలుగు సంఖ్య గల అష్టాలు – ద్విగు సమాసం
మూడేళ్ళు – మూడు సంఖ్య గల ఏళ్ళు – ద్విగు సమాసం
82 పన్నాలు – 82 సంఖ్య గల పన్నాలు – ద్విగు సమాసం
కలిమిలేములు – కలిమి మరియు లేమి – ద్వంద్వ సమాసం
ముందువెనుకలు – ముందు, వెనుక – ద్వంద్వ సమాసం
నలదమయంతులు – నలుడు, దమయంతి – ద్వంద్వ సమాసం
పసుపుకుంకుమలు – పసుపు, కుంకుమ – ద్వంద్వ సమాసం
మంచిచెడులు – మంచి, చెడు – ద్వంద్వ సమాసం
నుయ్యోగొయ్యో – నుయ్యో, గొయ్యో – ద్వంద్వ సమాసం
మెరకపొలం – మెరక పొలం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
అపృచ్ఛపు మాటలు – చెడ్డవైన మాటలు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ప్రథమ కోపం – ప్రథమదైన కోపం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
అవకతవక మనిషి – అవకతవకయైన మనిషి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
పసి పిల్లలు – పసివారైన పిల్లలు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
దొడ్డ ప్రభువు – దొడ్డవాడైన ప్రభువు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

ప్రాజెక్టు పని

ప్రశ్న 1.
మీ ప్రాంతంలో ఉన్న నటులు, నాటక సంస్థల వివరాలు సేకరించి పట్టికను తయారు చేయండి.
జవాబు:

నాటకసంస్థలు, వివరాలు నటులు
1. సురభి నాటక సంస్థ, పామర్రు వాసిరెడ్డి సీత, పాకల సుగుణ మొ॥
2. కళా వెంకట్రావు భవనం, కాకినాడ పాటిబండ్ల ఆనందరావు, భాస్కరరావు మొ॥
3. సత్యకళానికేతన్, పామర్రు టి. విశ్వనాథశాస్త్రి, బి. ఆనందరావు మొ॥
4. వెంకటేశ్వర కళానికేతన్, సామర్లకోట టి. ఆనందరావు బృందం
5. సూర్యకళామందిరం, కాకినాడ జి. మహాలక్ష్మి బృందం
6. సురభి నాటక సంస్థ, యానం చాగంటి నరసింహారావు, టి. ఆనందరావు మొ॥
7. శ్రీరామసత్యకళానాటక సంస్థ, కిర్లంపూడి మహాలక్ష్మి, సత్యదుర్గ బృందం
8. సత్యకళానికేతన్, సర్పవరం రాచకొండ రవి బృందం
9. వెంకటేశ్వర ఫంక్షన్ హాలు, కాకినాడ శరచ్చంద్ర బృందం
10. ఆనందభారతి నాటక సంస్థ పందిరి నరసింహారావు, పాటిబండ్ల భాస్కరరావు బృందం

(లేదా)

ప్రశ్న 2.
నేటి సమాజంలో దురాచారాలను ప్రతిఘటిస్తూ ఒక నాటికను రాసి ప్రదర్శించండి.
జవాబు:
సీత, గీత, శ్యామల, లలిత పాత్రలు
సీత : గీతా ! ఎందుకు విచారంగా ఉన్నావు?
గీత : మా అక్కకు మంచి సంబంధం వచ్చింది. పెళ్ళికొడుకు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరు.
శ్యామల : మంచి సంబంధమే కదా! విచారమెందుకు?
గీత : 2 లక్షలు కట్నం కావాలట. ఆడపడుచు లాంఛనాలు, పెళ్ళి ఖర్చంతా మేమే పెట్టుకోవాలట.
లలిత : అమ్మో! అంత ఖర్చుందా?!
సీత : మరి డబ్బు ఖర్చు సంగతి ఎలా?
గీత : మా చదువుల గురించి పొలం అమ్మేశారు. ఇక ఇల్లు మాత్రం మిగిలింది.
లలిత : ఉన్న ఇల్లు అమ్ముకొంటే ఎలాగ? మరి వెనుక నీవు ఉన్నావు కదా!
గీత : అదే కదా మా నాన్న గారి బాధ. మా నాన్న గారిది చిన్న ఉద్యోగం. అమ్మ ప్రైవేట్ స్కూలు టీచరు.
శ్యామల : మీ తమ్ముడు చిన్నవాడు. చదువా పూర్తికాలేదు. నిజమే ఈ వరకట్న సమస్య సమాజాన్ని నాశనం చేస్తోంది.
సీత : ఎంతమంది సంస్కర్తలు వచ్చినా, సమాజంలో ఎంత మార్పు తెచ్చినా ఈ సమస్యను పరిష్కరించే నాధులే కరువైనారు.
శ్యామల : ఎందుకలా అనుకుంటారు. మనందరం లేమా! ఈ సమస్యను మనమే పరిష్కరించుకోవాలి.
గీత, సీత, లలిత : ఎలా ?
శ్యామల : కట్నం తీసుకొనే వాళ్ళను మేము చేసుకునేందుకు సిద్దపడము అని ముందుగానే పెళ్ళిచూపుల నాడే చెప్పేద్దాం.
గీత : మన పెద్దవాళ్ళు ఊరుకోరు కదే
శ్యామల : మనమే ధైర్యం చేసి, పురుషహంతారాన్ని అణగ ద్రొక్కాలి.
సీత, లలిత : శ్యామల చెప్పినది నిజమే.
గీత : దీనికై మనమేం చేయాలి?
సీత : మన తల్లిదండ్రులకు కట్నం తీసుకొనేవారిని వివాహం చేసుకోము, ఉద్యోగాలు చేసుకుంటాం అని చెప్పేద్దాం.
గీత : ఇది కుదరదు.
శ్యామల : కట్నం తీసుకుంటే తన కుటుంబాన్ని కూడా భర్త తరపువారు పోషించే బాధ్యతను తీసుకోవాలని చెప్పేద్దాం.
సీత లలిత : ఇది జరిగే పనేనా ?
శ్యామల : సమస్య ఉన్న చోటే పరిష్కార మార్గం ఉంటుంది. మనం అబలలం కాదు సబలలం. ఎదిరిద్దాం – ధైర్యంగా పోరాడుదాం.
సీత, గీత, లలిత : ధైర్యంగా ముందడుగు వేద్దాం. మన సమస్యను పరిష్కరించుకుందాం.

AP 10th Class Telugu 10th Lesson Questions and Answers కన్యాశుల్కం

పాఠ్యాంత పద్యం

తీరమై సంపదలెల్ల వెంటనౌకరీతిన్ సాంగిరా వేరి కే
సరికేపాటు విధించినో విధి యవశ్యప్రాప్య మద్దానివె
వ్వరు దప్పించెద రున్నవాఁడనని గర్వంబేరికిన్ గాదు కిం
కరుఁడే రాజగు రాజే కింకరుఁడగున్ గాలానుకూలంబుగన్. – (బలిజేపల్లి లక్ష్మీకాంతం సత్యహరిశ్చంద్ర నాటకం)

భావం: సంపదలు ఎప్పుడు ఒకరి దగ్గరనే స్థిరంగా ఉండవు. కాలం ఎవరికి ఎప్పుడు ఏది అనుగ్రహిస్తుందో అదే అందుతుంది. దానిని ఎవ్వరూ తప్పించలేరు. సంపదలున్నవన్న గర్వం ఎప్పుడూ పనికిరాదు. కాలం రాజునే కింకరుడిని (సేవకుడిని) చెయ్యగలదు. కింకరుడినే రాజును చెయ్యగలదు. కనుక గర్వాన్ని విడిచి అందరూ మానవత్వంతో ఒకరికొకరు సహకరించుకోవాలి.

సూక్తి : గతం నశోదామి, కృతం స్మరామి.
జరిగిపోయినదాన్ని పట్టించుకోను కాని పొందిన ఉపకారాన్ని మాత్రం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను.

రచయిత పరిచయం

రచయిత పేరు : గురజాడ అప్పారావు.
కాలం : 21.09.1862 30.11.1915

తల్లిదండ్రులు : కౌసల్యమ్మ, వేంకట రామదాసు

జన్మస్థలం : విశాఖపట్నం సమీపంలో ఉన్న రాయవరం.

రచనలు : కన్యాశుల్కం, కొండుభట్టీయం, విలణీయం (నాటకాలు), ముత్యాలసరాలు (కవితాసంపుటి) దిద్దుబాటు, పెద్ద మసీదు, మీ పేరేమిటి ? సంస్కర్త హృదయం, మెటిల్దా (కథలు), దేశభక్తి గేయం (దేశమును ప్రేమించుమన్నా), పూర్ణమ్మ, కన్యక, లవణరాజు కల, నీలగిరి పాటలు మొదలైనవి.

బిరుదులు : అభ్యుదయ కవితా పితామహుడు, కవిశేఖర.

విశేష : ఆధునిక సాహిత్యానికి వేగుచుక్క గురజాడ. 13.08.1892న విజయనగరంలో కన్యాశుల్కం మొదటి నాటక ప్రదర్శన జరిగింది. ఈ నాటకం 1897వ సం॥లో అచ్చయ్యి, చేర్పులు మార్పులతో 1909వ సం॥లో రెండవ కూర్పు వచ్చింది.

ప్రస్తుత పాఠ్యభాగం కన్యాశుల్కం నాటకంలోని ద్వితీయాంకం మొదటి భాగం నుండి స్వీకరించబడింది.

కఠిన పదాలకు అర్థాలు

114వ పేజి

కన్యాశుల్కం = ఓలి, ఉంకువ, అభిహరణం
అంకము = నాటకభాగము, ఒడి, అంకె, తొడ, ఆక్షేపం, తగవు, గుర్తు
సన్నివేశం = స్థితిస్థానం, అవస్థ
అగ్రహారం = బ్రాహ్మణులు నివసించు గ్రామం
అవధాన్లు = వేదం చదివినవాడు
జందెం = జందియం, జన్నిదం, బ్రహ్మ సూత్రం, యజ్ఞోపవీతం, జంద్యం
వడుకు = దూదిని నూలుగా తీర్చు, నూలు వడుకు
పేలు = పేను, సెగచేత ఉబుకు
కిశిమీశ్శలవులు = క్రిస్మస్ సెలవులు
కళ్ళు కాయలు కాయు = “ఎదురు చూచుట” అనే అర్థంలో వాడే ఒక జాతీయం
వగచు = ఏడ్చు
ఒట్టినే = రిక, ఏమీ లేని (ఊరకనే)
ఇంగిలీసు = ఇంగ్లీష్
మెరక పొలం = మెట్టనేల, మెట్టపొలం
సిస్తు = పన్ను, అందం, ఆదాయం
వూష్టం = జ్వరం
కొట్టేసింది = చంపేసింది
ఖాయలా = అనారోగ్యం, సుస్తీ, అస్వస్తత, దివాళా
వోఘాయిత్తం = కీడు, క్రూరత్వం, దౌర్జన్యం, అఘాయిత్యం
అంచూ ఉంఛారు = అంటూ ఉంటారు
బెంగ = దుఃఖం, బాధ
గొట్టికాయ = గోళీకాయ, చిన్న చురుకైన కుర్రాడు
మునసబీ = న్యాయాధికారి, గ్రామాధికారి
కడతేరు = చచ్చు, సమాప్తమగు (జాతీయపదం)
అష్టాలు = వేదభాగం
అగ్ఘురారం = అగ్రహారం
చిప్ప = అడుక్కు తినే బొచ్చె
రుణం = అప్పు
కొవ్వు = అహంకారం, మదం
అక్షేపణ = నింద, విసురు
వుంచానంఛావు = ఉంటానంటావు
గూబ = కర్ణమూలం
అపృచ్ఛపు మాటలు = ప్రశ్నించుటకు అనర్హుడైనవాని మాటలు, చెడ్డమాటలు

ఆలోచించండి- చెప్పండి

ప్రశ్న 1.
కన్యాశుల్కం అంటే ఏమిటి?
జవాబు:
కన్యాశుల్కం అంటే పెళ్ళి చేసుకుంటున్నందుకు వరుడు, వధువుకి ఇచ్చే రొక్కం. ఇది వరకట్నం అనే దురాచారం కన్నా ప్రాచీనమైంది. వధువు పారితోషికం అనేది వరుడు లేదా అతని కుటుంబం వివాహం చేసుకోబోయే స్త్రీ కుటుంబానికి చెల్లించే డబ్బును కన్యాశుల్యం అంటారు.

AP 10th Class Telugu 10th Lesson Questions and Answers కన్యాశుల్కం

ప్రశ్న 2.
అగ్నిహోత్రావధాన్లు ఇంగ్లీషు చదువు వద్దనడానికి కారణం ఏమిటి?
జవాబు:
అగ్నిహోత్రావధాన్లు ఇంగ్లీషు చదువు మనకు అచ్చి రాదని భావించాడు. దానికి తోడు, వారి పెద్దన్న గారి కొడుకు ఈ ఇంగ్లీషు చదువుకోసమని పట్నం వెళ్ళగా ఆరోగ్యం పాడయింది. బుచ్చబ్బి కొదుకైతే చచ్చినంత పనైంది. అందుకని కొడుకును ఇంగ్లీషు చదువు కోసం బస్తీకి పంపడం ఇష్టపడలేదు అగ్నిహోత్రావధాన్లు.

115వ పేజి

దొడ్డ = గొప్ప, మంచి, పెద్దమ్మ (తల్లికి అక్క)
చప్పున్న భాషలు = చాలా, (56) భాషలు
మంచినీళ్ళ ప్రవాహం = చాలా సులభం
ప్రవాహం = ప్రవహించు, వెల్లువ
చెవికోసుకొను = ఆసక్తితో విను
విదూషకుడు = పరిహాసకుడు, హాస్యగాడు, వికటకవి, నాయకసఖుడు
దర్శనం = చూపు, కన్ను, అద్దం
ధుమధుమలాడు = కోపించు
శషభిషలు = ప్రయోజనం లేని రకాసులతో కూడిన చర్చలు, గొప్పలు, బెదిరింపులు, హెచ్చరికలు
వైఖరి = పద్ధతి
బస = ఉనికిపట్టు, ఇల్లు, తాత్కాలిక విడిది
బలపడు = అధికమగు
భోజనం = ఆహారం, బోనం, బువ్వ, కూడు, అన్నం, సాపాటు
ఎంతమాత్రం = ఏపాటి
గణించు = లెక్కించు
మోస్తరు = మాదిరి పద్ధతి
ముక్క = ఒక పదం లేదా రెండు
అభ్యంతరం = ఆటంకం
బతిమాలు = వేడుకొను
కుఱ్ఱవాడు = యువకుడు
శ్రమ = కష్టము
దమము = అణచుట, కష్టమును సహించుట
కడుపులో పెట్టుకొని = తప్పులను మన్నించి
భారం = పూచీ, బాధ్యత, బరువు, జవాబుదారి
ఇంతదూరం = ఇన్ని మాటలు, ఇంత ఎక్కువగా
శలవియ్యాలా = చెప్పాలా
ఎన్నిక చేసిన = ఎంచిన, గుర్తించిన
ఇంతెందుకు = ఇన్ని మాటలెందుకు

116వ పేజి

క్రిమినల్లో = ఐ.పి.సి. కోడ్ ఆఫ్ క్రిమినల్ / ప్రొసీజర్ – పోలీసుల విధి – విధానాలు ఇందులో ఉంటాయి.
తరిఫీదు = అలవరుచు, శిక్షణ
దమ్మిడి = అయిదు కాసుల నాణెం / రెండు కాసుల నాణెం (కొందరి మాట)
టోపీ వ్యవహారం = వంచన పని
భావ్యం = యుక్తం, కాదగినది
శలవు పుచ్చుకుంటాను = వెళ్ళిపోతాను.
రవ్వంత = కొంచెం
అంచుంచాడు = అంటుంటాడు
ఈ పట్టెని = ఈ ప్రాంతంలో
జట = వేద విభాగం
భోగట్టా = = విచారణ, సమాచారం, విషయం, ప్రస్తావన
ప్రథమ కోపం = చిఱు కోపం
విధాయకం = ఏర్పాటు, విధించుట, పద్ధతి, ఆచరించతగ్గది
వట్టి = ప్రయోజనం లేనిది
అవకతవక = అసంగతం, అసంబద్ధం, సందర్భశుద్ధి లేనిది
దావా = వ్యాజ్యం, కోర్టు కేసు
దాఖలా = రుజువు, సాక్ష్యం
వకీలు = న్యాయవాది, ప్లీడరు, లాయరు
గుమాస్తా = లెక్క రాయువాడు, వ్రాయసగాడు

ఆలోచించండి- చెప్పండి

ప్రశ్న 1.
కడుపులో పెట్టుకు చదువు చెప్పడం అన్న వెంకమ్మ మాట మీకు ఎలా అర్థమైంది?
జవాబు:
ఏ తల్లికైనా పిల్లలు గొప్పవాళ్ళు కావాలని ఉంటుంది. అలాగే వెంకమ్మ, తన కొడుకైన వెంకటేశం గొప్పవాడు కావాలని అనుకుంది. పిల్లవాడిలోని తప్పులను సవరించి, వాడు గొప్పవాడయ్యేట్లు చేయు అనే భావన ఆమె మాటల్లో ఉంది.

117వ పేజి

గళగ్రాహి = తడబడకుండా, అనర్గళంగా, గళానికి అడ్డు లేకుండా చదివే వాడు, గడగడ మాట్లాడేవాడు
పేలపిండి = కరంభం, జరబు, సత్తువు, చూర్ధకం, పేలాలు విసిరి చేసిన పిండి
అరటిపండు విప్పినట్టు = అరటిపండు పై తోలు తీసినంత తేలికగా
తర్జుమా = అనువాదం
దాఖలు = నమోదు
అబ్బీ = కొడుకు, వాత్సల్యం కలవాడి పట్ల ఉపయోగించే పదం
మనఃప్రభవుడు = మనసులో పుట్టేవాడు, మన్మథుడు
మనః ప్రభవానలం = ఆ మన్మథుడికి సంబంధించిన అగ్ని, మన్మధ తాపం
దహ్యమానులై = బాధింపబడిన మనసు కలవారై
దీర్ఘవాసరనిశల్ = పొడవైన పగళ్ళు కల రాత్రులు
సలిపిరి = గడిపారు
భట్టీయం వేయించు = వల్లె వేయించు, కంఠస్థం
హడలు = భయం
పెందరాళె = వేగంగా
తోవపెట్టు = దారిచూపు, పంపించడం
అన్నోటు = అంత ఎక్కువ
తెరిపి = వీలు, ఖాళీ, విశ్రాంతి, తీరిక
ఖాయిదా చేయించు = కట్టడి చేయు కాపలా / అదుపు ఉంచు
సాధనం = ఒక మార్గం, కారణం, పని ముట్టు

ఆలోచించండి- చెప్పండి.

ప్రశ్న 1.
అగ్నిహోత్రావధాన్లు దృష్టిలో కరటక శాస్త్రి ఎలాంటి మనిషి?
జవాబు:
అగ్నిహోత్రావధాన్లు దృష్టిలో కరటక శాస్త్రి “వట్టి అవక తవక మనిషి! మంచీ చెడ్డా యేమీ వాడి మనసుకెక్కడు” అంటూ గిరీశం దగ్గర వాపోయాడు.

AP 10th Class Telugu 10th Lesson Questions and Answers కన్యాశుల్కం

ప్రశ్న 2.
‘గళగ్రాహి’ అంటే ఏమిటి?
జవాబు:
‘గళగ్రాహి’ అంటే గళానికి అడ్డు లేకుండా అని అర్థం.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
గిరీశం వల్ల మోసం వస్తుందని కరటకశాస్త్రి ఎందుకు అనుమానించాడు?
జవాబు:
గిరీశం శిష్యరికం చేస్తున్న మేనల్లుడు వెంకటేశం చదువు మీద మొదటి నుంచీ సందేహమే కరటకశాస్త్రికి. గురుశిష్యులిద్దరూ ఇంగ్లీషులో మాట్లాడుకున్నప్పుడే ఎక్కడో ఏదో తేడా జరుగుతోందని ఆయనకు స్ఫురించి ఉండాలి. అందుకే, “అబ్బీ, ఒక తెనుగు పద్యం చదవరా? అని” అడగడమూ, గిరీశం మెల్లగా ‘నలదమయంతు లిద్దరు’ చదుమని వెంకటేశానికి చెప్పడం, ‘మనః ప్రభవానలం’ అంటే ఏమిట్రా అని అడిగితే, వెంకటేశాన్ని వెనకేసుకు రావడం…… ఇవన్నీ కరటకశాస్త్రికి గిరీశం మీద అనుమానం కలిగించాయి.

ప్రశ్న 2.
ఎలా చదివిస్తే చదువు బాగా వస్తుందని అగ్నిహోత్రా ప్రధాన అభిప్రాయం?
జవాబు:
ఒక నిముషం అయినా తెరిపి లేకుండా చదవాలి. పుస్తకం చేతపడితే వేళ్ళకి పుస్తకం అంటుకుపోవాలి అలా చదివితే చదువు బాగా వస్తుందని అగ్నిహోత్రావధాన్ల అభిప్రాయం.

118వ పేజి

నైజం = స్వభావం
చిఱ్ఱు = కోపం
గొట్టాలమ్మ = కలరా దేవత
అర్జీ = వ్రాతపూర్వకమైన మనవి, వినతి
తట్టుబడి = తాకిడి, ఖర్చు
తిండిపోతు = విపరీతంగా తినేవాడు
తాంబూలం = వీడెము, వక్క, ఆకు
అసాధ్యం = సాధ్యం కానిది, ఆశక్యమైనది
పాలుపోకుండా = చేయవల్సింది తెలియకుండా, తోచక
సావకాశం = నిదానంగా, నింపాది, నెమ్మది, ఖాళీ సమయం
చర్మం చెప్పులు కుట్టిస్తా (నానుడి) = కృతజ్ఞతకు, పరాకాష్టకు, పరమ దైన్యానికి నిదర్శనమైన మాట
ఉపాయం = ఎత్తుగడ, నేర్పు, తంత్రం, వెరవు, సాధనం
నిష్క్రమించు = వెడలు, వెళ్ళు
క్లుప్తం = సంక్షిప్తం, సంగ్రహం, టూకి
ముహూర్తం = 12 క్షణాలు
కోర్టు = న్యాయస్థానం, న్యాయసభ, ధర్మాసనం
కీలకపాత్ర = ముఖ్య పాత్ర
కంటె = బంగారంతో గాని, వెండితో గాని చేసిన కడ్డీ లాంటి గుండ్రని మెడ నగ, కంఠాభరణం
ఒత్తిడి = రాపు, బాధ, సమ్మర్దము
కేసు = దావా, వ్యవహారం
సంస్కర్త = సంస్కరించేవాడు, మార్పు కోరేవాడు
చాకచక్యం = నేర్పు, తెలివి, దక్షత, చురుకుదనం
దురాచారం = చెడు ప్రవర్తన / నడవడి

ఆలోచించండి- చెప్పండి

ప్రశ్న 1.
కొడుకు పెళ్ళి విషయమై అగ్నిహోత్రావధాన్ల ఆలోచన ఏమిటి?
జవాబు:
బాగా చదువుకొని అన్ని పరీక్షలూ ప్యాసవుతే ఉద్యోగం తేలికగా తెచ్చుకోవచ్చు. ఆ రోజుల్లో ఆడపిల్లను పెళ్లి చేసుకోవాలంటే కన్యాశుల్కం చెల్లించాలి. కాబట్టి అగ్నిహెూత్రావధాన్లు తన కొడుకుని బాగా చదివించి ఉద్యోగం సంపాదిస్తే డబ్బు ఖర్చు లేకుండా పెళ్ళయ్యే సాధనంగా భావించాడు.

AP 10th Class Telugu 10th Lesson Questions and Answers కన్యాశుల్కం

ప్రశ్న 2.
వెంకమ్మ చిన్నకూతురు పెళ్ళి విషయమై ఎవరెవరిని ప్రాధేయపడింది?
జవాబు:
వెంకమ్మ చిన్న కూతురు సుబ్బమ్మ పెళ్ళి విషయమై తన అన్నగారైన కరటక శాస్త్రిని, అట్లాగే గిరీశాన్ని ప్రాధేయపడింది.

Leave a Comment