These AP 10th Class Telugu Important Questions 10th Lesson కన్యాశుల్కం will help students prepare well for the exams.
కన్యాశుల్కం AP Board 10th Class Telugu 10th Lesson Important Questions and Answers
అవగాహన – ప్రతిస్పందన
ప్రశ్న 1.
క్రింది సంభాషణలను చదివి, నాలుగు ప్రశ్నలను తయారు చేయండి.
అగ్ని : మనవెధవాయకి చదువొచ్చేదేం కనపడదు కాని పుస్తకాల కిందా జీతం కిందా యిహ నాలుగేళ్లయేసరికి మనభూమి కడతేరిపోయింది. ఆ పైని చిప్పా దొప్పా పట్టుకు బయల్దేరాలి. నిమ్మళంగా యింటి దగ్గరుంటే యీపాటికి నాలుగష్టాలు చెప్పేదును. వొద్దంటూంటే యీ యింగిలీషు చదువులో పెట్టేవు.
వెంకమ్మ : మనవాడికో మునసబీ ఐనా పోలీసుపనైనా ఐతే రుణాలిచ్చి యీ అర్హురారం భూవుఁలన్నీ కొనేస్తాడు. యాడాదికోనూఱూపాయలు కర్చు పెట్టడాని కింత ముందూవెనకా చూస్తున్నారు. మీలాగే వాడూ జంఝూలు వొడుక్కుంటూ బతకాలని వుందా యేవిఁషి? మీకంత భారవం తోస్తే మావాళ్లు నాకు పసుపూ కుంకానికి యిచ్చిన భూవఁమ్మేసి కుఱ్ఱాడికి చదువు చెప్పిస్తాను.
కరటక : నీ భూ వెందు కమ్మాలమ్మా? మనసొమ్ము చడతిని కొవ్వున్నాడు అతడే పెట్టుకుంటాడు.
అగ్ని : ఐతే నన్ను ఆక్షేపణ చేస్తావషే? యీమారంటే నీఅన్న వున్నాడని వూరుకునేది లేదు.
ప్రశ్నలు:
1. ‘నాలుగు అష్టాలు’ లోని ‘అష్టా’లకు అర్థం ఏమిటి?
2. ‘కడతేరు’ జాతీయాన్ని వివరించండి.
3. ‘అర్హురారం’ అనే పదానికి వ్యవహార రూపం రాయండి.
4. పసుపు కుంకానికి ఇచ్చిన భూమి అంటే మీకేమి అర్థమయ్యింది?
2. క్రింది సంభాషణలను చదివి, నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయండి.
కరట : అవును మీ మొఖం చూసిన జ్ఞాపకము ఉంది. డిష్టీకలక్టరుగారు మాదొడ్డ ప్రభుప్
గిరీశం : మీలాంటి చప్పన్నభాషలూ వచ్చిన మనిషి యెక్కడా లేడనీ, సంస్కృతం మంచినీళ్ల ప్రవాహంలా తమరు మాట్లాడతారనీ, తమ లాంటి విదూషకుణ్ణి యక్కడా చూళ్లేదనీ డిష్టీకలక్టరుగారు శలవిస్తూండేవారు. కవితారసం ఆయన్ల గ్రహించేవారేరి? నాకవిత్వమంటే అయ్న చెవి కోసుకుంటారు. మహారాజావారి దర్శనం కూడా నాకు చేయించారండి.
అగ్ని : (ధుమధుమలాడుతూ) ఈ శషభిషలు నాకేం పనికిరావు. యితడి వైఖరి చూస్తే యిక్కడే బసవేసేటట్టు, బలపడుతుంది. మా యింట్లో భోజనం యంత మాత్రం వీలుపడదు.
ప్రశ్నలు – జవాబులు
1. ‘మంచినీళ్ళ ప్రవాహం’ లా అన్న జాతీయానికి అర్థం ఏమిటి?
జవాబు:
అతిసులభం
2. ‘ఆసక్తితో విను’ అనే అర్ధం గల పదాన్ని గుర్తించండి.
జవాబు:
చెవికోసుకొను
3. ‘ధుమధమలాడు” అంటే అర్ధం ఏమిటి?
జవాబు:
కోపించు
4. ‘దొద్ద’ పదానికి నానార్థాలు రాయండి.
జవాబు:
గొప్ప, మంచి, పెద్దమ్మ
3. క్రింది సంభాషణలను చదివి, ప్రశ్నలకు తప్పు (✗), ఒప్పు (✓) లను గుర్తించండి.
అగ్ని : మీది రాజమహేంద్రవండీ. ఆ మాట చెప్పేరు కారేం? రామావృధాన్లు గారు బాగున్నారా?
గిరీశం : బాగున్నారండి. ఆయన మా మేనమావ గారండి.
అగ్ని : ఆ మాట చెప్పారు కారూ?
గిరీశం : మా మానవఁయీదేశ బ్బోగట్టా వొచ్చినప్పుడల్లా తమర్ని యెన్నిక చేస్తూంటారండి.
అగ్ని : నాకూ వారికి చాలా స్నేహం. చూశారా కొంచం నాకు ప్రథమ కోపం, యెవరో తెలియకుండా అన్నమాటలు, గణించకండేం.
గిరీశం : దానికేవండి, తమవంటి పెద్దలు అనడం మాలాంటి కుఱ్ఱవాళ్ళు పడడం విధాయకవేంగదండీ.
కరట : (తనలో) యిన్నాళ్లకి మా అగ్నిహోత్రుడికి తగినవాడు దొరికేడు.
అగ్ని : చూచారండీ మీ పేరేవిఁటండీ?.
గిరీశం : గిరీశం అంటారండి.
అగ్ని : చూశారండి, గిరీశంగారూ! మా కరటక శాస్తుల్లు వట్టి అవక తవక మనిషి మంచీ చెడ్డా యేమీ వాడి మనసు కెక్కదు. అల్లుడు చచ్చిపోయినాడంటే అందువల్ల యెంత లాభం కలిగింది. భూవుఁలకి దావా తెచ్చానా లేదా ? నేను యీ మధ్య దాఖల్చేయించిన పిటీషనుమీద అర్థడు చదివి పెట్టండి. (గదిలోకి వెళ్లి కాగితం తెచ్చి గిరీశం! చేతికి యిచ్చును).
ప్రశ్నలు:
1. రామావుధాన్లు గిరీశానికి మేనమామ. (✓)
2. అగ్నిహోత్రావధాన్లు ఉండేది రాజమహేంద్రవరం. (✗)
3. కుఱ్ఱవాళ్ళు అనడం, పెద్దవాళ్ళు పడడం విధాయకం. (✗)
4. భూవులకి దావా తెచ్చింది కరటకశాస్త్రి. (✗)
అపరిచిత గద్యాలు
1. క్రింది పేరా చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
కాశీరాజుకు అంబ, అంబిక, అంబాలిక అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారికి కాశీరాజు స్వయంవరం ప్రకటించాడు. తమ్ముడు విచిత్రవీర్యుని కోసం స్వయంవరానికి భీష్మాచార్యులవారు వెళ్ళారు. అక్కడివాళ్ళందరూ ఆయనను చూసి విచిత్రంగా మాట్లాడారు. బ్రహ్మచర్యంతో ఉంటానని ప్రతిజ్ఞ చేసిన భీష్ముడు స్వయంవరానికి వచ్చాడని ఆశ్చర్యపోయారు. భీష్ముడు ముగ్గురినీ చేయిపట్టి తీసుకువెళ్తుంటే అక్కడున్న రాజులందరూ భీష్ముని మీదికి యుద్ధానికి వచ్చారు. భీష్ముడు వారందరినీ ఓడించాడు.
ప్రశ్నలు – జవాబులు
అ) కాశీరాజు కుమార్తెలు ఎవరు?
జవాబు:
అంబ, అంబిక, అంబాలికలు కాశీరాజు కుమార్తెలు.
ఆ) విచిత్రవీర్యుని అన్న ఎవరు?
జవాబు:
విచిత్రవీర్యుని అన్న భీష్ముడు.
ఇ) భీష్ముడు ఏమని ప్రతిజ్ఞ చేశాడు?
జవాబు:
బ్రహ్మచర్యంతో ఉంటానని భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు.
ఈ) పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
భీష్ముని చూసి ఎందుకు ఆశ్చర్యపోయారు?
2. కింది అపరిచిత గద్యాన్ని చదివి, నాలుగు ప్రశ్నలను తయారుచేయండి.
“శ్రీ రావూరి భరద్వాజగారు స్వయంకృషితో సామాన్యుడి స్థాయి నుండి సమున్నత స్థాయి వరకు ఎదిగిన తపస్వి, ఆయన చదువు అంతంతమాత్రమే. ఆంగ్లం అసలే తెలియని ఆయన తన బలహీనతలన్నీ సవరించుకొని, తనదైన సొంత శైలిలో రచనలు చేపట్టారు. అనేక కథలు, నవలలు రాశారు. ‘పిడికెడు మెతుకుల కోసం నేను వ్యవసాయ కూలీగా పనిచేశాను.” వారి గురించి వారే చెప్పిన మాటలివి. ‘ఒకానొక అవమానం, నన్ను చదువు వైపు మళ్ళించింది.” ఇవి కూడా వారి మాటలే……… అటువంటి వీరిని “జ్ఞానపీఠం” అనే అత్యున్నత పురస్కారం వరించింది.
ప్రశ్నలు:
అ) రావూరి భరద్వాజగారి ప్రత్యేకత ఎట్టిది?
ఆ) భరద్వాజగారు తన గురించి తానే చెప్పుకున్న మాటలు ఏవి?
ఇ) భరద్వాజగారిని వరించిన విశిష్ట పురస్కారం ఏది?
ఈ భరద్వాజ గారి పాండిత్యం ఎటువంటిది?
3. ఈ కింది అపరిచిత గద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన వాక్యాలలో తప్పొప్పులను గుర్తించండి.
పూర్వం నుండి మనకు తులసి, రావి, వేపచెట్లను పూజించే సంప్రదాయం ఉంది. అనాది నుండి మనం తులసిని దేవతగా పూజిస్తూ వస్తున్నాం. తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నట్లు శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. పూర్వకాలంలో తట్టు, ఆటలమ్మ వంటి వ్యాధులు వచ్చినప్పుడు రోగి దగ్గర వేపాకులు ఉంచేవారు. వేపాకులతోను ఒంటికి రాసేవారు. స్నానం చేయించే ముందు వేపాకులు ముద్దగా నూరి, నూనె, పసుపు కలిపి ఒంటికి రాసేవారు. ఎందుకనగా, తట్టు, ఆటలమ్మ వస్తే దేహంపై పొక్కులు వస్తాయి. కొన్ని పచ్చిగా ఉండి దురద పెస్తుంది. అలా దురద రాకుండా ఉండడానికి, గోకటం మానడానికి, ఈ వేపాకు, పసుపు దోహదపడతాయి. ఈ రకంగా వైద్యశాస్త్రానికి సంబంధించిన వేప, సంస్కృతీపరంగా కూడా ప్రాధాన్యతను సంతరించుకొంది.
వాక్యాలు:
అ) తులసిని మనము నేడు దేవతగా పూజిస్తున్నాం. (తప్పు)
ఆ) తులసిలో ఔషధ గుణాలున్నాయని శాస్త్రజ్ఞుల కథనం. (ఒప్పు)
ఇ) వేపకు వైద్యశాస్త్రంలోనే ప్రాధాన్యత ఉంది. (తప్పు)
ఈ)దురద రాకుండా, గోకకుండా పసుపు, వేపాకులు ఉపయోగపడతాయి. (ఒప్పు)
4. ఈ కింది అపరిచిత గద్యాన్ని చదివి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
మనందరి మాతృభాష తెలుగు. తెలుగు చాలా తీయనైన భాష, తెలుగును పాశ్చాత్యులు “ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్” అంటారు. మన భాషలో అనేక సామెతలు, జాతీయాలు, పదబంధాలు ఉన్నాయి. తెలుగులో చాలామంది కవులు, రచయితలు కలరు. విదేశీయులు కూడా మెచ్చుకొన్న భాష మన తెలుగు భాష, తెలుగు భాషలో ఎవరి ప్రాంతపు మాండలికము వారికిష్టం. ఎవరి ప్రాంతపు యాస వారికిష్టం. ఎవరి ప్రాంతపు నుడికారాలు, పదబంధాలు, సామెతలు వారికి మక్కువ. ఎవరు ఎలా మాటలాడినా అతి మధురమైనది మన తెలుగు భాషయే. అందుకే మాతృభాషాభివృద్ధికి మనందరం పాటుపడదాం !
ప్రశ్నలు – జవాబులు
అ) తెలుగు ఎటువంటిది?
జవాబు:
తెలుగు చాలా తీయనైన భాష
ఆ) తెలుగు భాషను పాశ్చాత్యులు ఏమన్నారు?
జవాబు:
ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్
ఇ) తెలుగు భాషలో ఏమేమి ఉన్నాయి?
జవాబు:
తెలుగు భాషలో అనేక సామెతలు, జాతీయాలు, పదబంధాలు ఉన్నాయి.
ఈ) పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
మాతృభాషాభివృద్ధికి మనం ఏం చేయాలి?
5. క్రింది లేఖను చదివి, దాని ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి.
హైదరాబాద్ ప్రియమైన శారదకు, తెలుగు భాషలో ఎవరి ప్రాంతపు మాండలికము వారికిష్టం, ఎవరి ప్రాంతపు యాస వారికిష్టం. ఎవరి ప్రాంతపు నుడికారాలు, పదబంధాలు, సామెతలు వారికి మక్కువ. ఎవరు ఎలా మాటలాడినా అది మధురమైన మన తెలుగు భాషే! అందుకే మన భాషాభివృద్ధికి మనమందరం పాటుపడదాం! సెలవు తీసుకుంటాను. ఇట్లు, |
ప్రశ్నలు – జవాబులు
అ) తెలుగు భాషను పాశ్చాత్యులు ఏమన్నారు?
జవాబు:
ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్నారు.
ఆ) తెలుగు భాషలో ఏమి ఉన్నాయి?
జవాబు:
తెలుగులో అనేక సామెతలు, జాతీయాలు, పదబంధాలు ఉన్నాయి.
ఇ) పై లేఖ ఎవరు ఎవరికి రాశారు?
జవాబు:
అమృత, శారదకు రాసింది.
ఈ) పై లేఖ ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
ఈ లేఖకు ఒక శీర్షికను పెట్టండి.
6. కింది అపరిచిత గద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయి పటేల్ స్వాతంత్య్రానంతరం సంస్థానాల విలీనానికి గట్టి కృషిచేసి సఫలుడైన ప్రముఖుడు. అంబేద్కర్ను డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా నియమించుటలో ముఖ్య పాత్ర పోషించాడు. భారత రాజ్యాంగ సభలో ప్రాథమిక హక్కుల కమిటీకి ఛైర్మన్ గా పనిచేశాడు. గుజరాత్లోని నర్మదా నదీ తీరంలోని సాధు బెట్ అనే చిన్న దీవిలో పటేల్ గారి విగ్రహాన్ని నిర్మించి, 2018 అక్టోబర్ 31న ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం ఇది. దీని ఎత్తు 182 మీటర్లు. ఈ విగ్రహాన్ని ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ (ఏకత్వ చిహ్నము) అని పిలుస్తున్నారు.
ప్రశ్నలు – జవాబులు
అ) భారత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడు ఎవరు?
జవాబు:
అంబేద్కర్
ఆ) ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మన్ ఎవరు?
జవాబు:
సర్దార్ వల్లభాయి పటేల్
ఇ) సర్దార్ వల్లభాయి పటేల్ విగ్రహానికి ఏ పేరు పెట్టారు?
జవాబు:
స్టాట్యూ ఆఫ్ యూనిటీ
ఈ) పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం ఏది? దాని ఎత్తు ఎంత?
7. ఈ కింది వార్తను చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
ప్రపంచశాంతి
మిత్రులారా! ఈ విషయాన్ని గూర్చి ఒక్కసారి ఆలోచించండి. చిన్న చిన్న విషయాల కోసం దెబ్బలాటలకు దిగి, తలలు బద్దలు కొట్టుకోకండి. న్యాయస్థానాలకు వెళ్ళి డబ్బు తగులబెట్టకండి. మనది ఎందరో మహాత్ములు, మహర్షులు, ప్రవక్తలు పుట్టిన దేశం. వారి శాంతి బోధలు తలకు ఎక్కించుకోండి.
ప్రపంచంలో ఇప్పటికే రెండు ప్రపంచయుద్ధాలు జరిగాయి. ఇంకా ఎన్నో చిన్న చిన్న తగవులు జరిగాయి. యుద్ధాల వల్ల ఎంతో ధన వ్యయం, ప్రాణనష్టం జరుగుతుంది. యుద్ధాల్లో పాల్గొన్నదేశాలు, అభివృద్ధి లేకుండా వెనుకబడతాయి. కాబట్టి యుద్ధాలు వద్దు. శాంతి మనకు ముద్దు. ప్రపంచ పౌరులంతా సోదరుల వలె మెలగుదాం. స్నేహం, ప్రేమ, కరుణ, వాత్సల్యం మనకు మంచిదారిని చూపిస్తాయి. శాంతి మంత్రాన్ని అంతా జపిద్దాం. సరేనా?
ఇట్లు, ప్రపంచబాలబాలికల సంఘం.
ప్రశ్నలు – జవాబులు
అ) మనదేశంలో ఎలాంటి గొప్పవ్యక్తులు జన్మించారు?
జవాబు:
మహాత్ములు, మహర్షులు, ప్రవక్తలు.
ఆ) ఇప్పటికి ఎన్ని ప్రపంచయుద్ధాలు జరిగాయి?
జవాబు:
రెండు.
ఇ) యుద్ధం వల్ల కలిగే నష్టాలు ఏమిటి?
జవాబు:
ధనవ్యయం, ప్రాణనష్టం.
ఈ) ఏవి మనకు మంచిదారిని చూపిస్తాయి?
జవాబు:
స్నేహం, ప్రేమ, కరుణ, వాత్సల్యం.
వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
‘కన్యాశుల్కం’ పాఠ్యభాగ నేపథ్యం రాయండి.
జవాబు:
వెంకమ్మ, అగ్నిహెూత్రావధానులు పెద్ద కూతురు బుచ్చమ్మ, చిన్న కూతురు సుబ్బి, కొడుకు వెంకటేశం. వెంకటేశం ఇంగ్లీషు చదువు కోసం విజయనగరంలో ఉంటాడు. అతని ప్రైవేట్ మాస్టారు గిరీశం. పరీక్ష తప్పి సెలవుల్లో ఇంటికి ఏ మొహం పెట్టుకొని వెళ్లాలా ? అని వెంకటేశం ఇబ్బంది పడుతున్న సమయంలో గిరీశం అతనికి భరోసా ఇస్తాడు. వెంకటేశంతో పాటు సెలవుల్లో అతనికి చదువు చెప్పే నెపంతో ఊరికి వెళ్తాడు. ఆ తరువాత సన్నివేశమే ప్రస్తుత పాఠ్యాంశం.
ప్రశ్న 2.
‘కన్యాశుల్కం’ పాఠ్యభాగ ఉద్దేశం రాయండి.
జవాబు:
భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానం అడుగిడుతున్న తొలిరోజులలో ఆనాటి సమాజంలో ఆంగ్ల విద్యను గురించి ప్రజలలో ఉన్న ఆలోచన ధోరణిని తెలియచెప్పడం, కొత్త కొత్త కొలువులు కావాలంటే ఆధునిక విద్యనభ్యసించాల్సిందేనని వెంకమ్మ లాంటి సాధారణ గృహిణి ఆనాడే గ్రహించిందని చెప్పడం, సమాజంలోని దురాచారాలు, సంఘసంస్కరణపై అవగాహన కల్పించి, విద్యార్థులను చైతన్యపరచడం ఈ పాఠం ఉద్దేశం.
ప్రశ్న 3.
‘నాటకం’ ప్రక్రియ గురించి రాయండి.
జవాబు:
దశవిధ రూపకాల్లో నాటకమే ఉత్తమమైనదని సద్విమర్శకుల అభిప్రాయం. ‘కావ్యేషు నాటకం రమ్యం” అని మన అలంకారికులు చెప్పడాన్ని బట్టి ప్రక్రియలన్నింటిలోనూ నాటకమే గొప్పదని చెప్పవచ్చు. సమస్త సాహితీ ప్రక్రియల సమాహారం నాటకం. ఇతర సాహిత్య ప్రక్రియల లక్షణాలు ఇందులో ఇమిడిపోయి ఉండడం వల్ల నాటక ప్రక్రియ అగ్రస్థానం పొందింది. నటుల చేత ప్రదర్శింపబడేది నాటకం. నాటకంలో నాలుగు నుండి పదివరకు అంకాలు ఉంటాయి. నాటకంలో సంభాషణలకి, అభినయానికి, నటుల హావ, భావ ప్రదర్శనకి అవకాశం ఉంటుంది. దీనిలో రసపోషణ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది.
ఆ) ఈ క్రింది ప్రశ్నకు 8 నుండి 10 వాక్యాల్లో సమాధానం రాయండి.
ప్రశ్న 1.
‘కన్యాశుల్కం’ పాఠంలో ఉన్న జాతీయాలను, సామెతలను రాయండి.
జవాబు:
“కన్యాశుల్కం” పాఠంలో ఉన్న జాతీయాలు:
- కళ్ళు కాయలు కాచాయి
- కడతేరిపోవు
- పసుపుకుంకుమకు
- మంచినీళ్ళ ప్రవాహం
- చెవికోసుకొను
- శషభిషలు
- కడుపులో పెట్టుకొని
- టోపీ వ్యవహారం
- ప్రథమ కోపం
- అవకతవక మనిషి
- అరటిపండు విప్పినట్టు
- తోవలో పెట్టు
- చిరుకాను
- చర్మంతో చెప్పులు కుట్టించు.
- రొమ్ము మీద కుంపట్లాగా
- పాలుపోక
సామెతలు :
1) పుచ్చకాయల దొంగంటే భుజాలు తడుపుకున్నట్లు.
2) తాంబూలం ఇచ్చేశాను, ఇహ తన్నుకు చావండి.
ఇ) కింది అంశం గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.
ప్రశ్న 1.
బాల్యవివాహాలు తప్పని తెలుపుతూ మీ స్నేహితుడికి లేఖ రాయండి.
జవాబు:
మిత్రునికి లేఖ నర్సాయపాలెం, ప్రియమైన మిత్రుడు విష్ణుదత్తకు, నేను మాత్రం బాల్య వివాహాలను సమర్థించను. ఏ వయసులో చేయాల్సిన పనులు ఆ వయసులో చేయాలే గాని, ముందుగా చేయకూడదు. మంచి – మంచి విషయాలను పాఠ్యాంశాలుగా పెట్టిన పెద్దలకు నమస్కరిస్తూ, ఈ పాఠంపై నీ అభిప్రాయాన్ని లేఖ ద్వారా తెలియజేయవల్సిందిగా కోరుతూ…… ఇట్లు, చిరునామా |
ప్రశ్న 2.
బాల్యవివాహాలు తప్పని నినాదాలు రాయండి.
జవాబు:
నినాదాలు
- పిల్లల బాల్యాన్ని కాపాడేందుకు బాల్య వివాహాలు ఆపండి.
- మీ పిల్లలను జీవితాంతం కన్నీళ్ళు పెట్టించకండి.
- నా బాల్యం, నా హక్కు
- బాల్యవివాహం జీవితకాల శాపం.
- పిల్లలను పిల్లలుగా ఉండనివ్వండి.
- బాల్య వివాహాలను అరికడదాం భావితరాలను కాపాడుదాం.
- బాల్యవివాహం వద్దు – చదువే ముద్దు.
- బాల్యవివాహం ఒక సాంఘిక దురాచారం.
- బాల్యవివాహం చట్టరీత్యా నేరం.
- బాల్యవివాహాలను వ్యతిరేకిద్దాం – ఆడపిల్లలను కాపాడుకుందాం.
- బాల్యవివాహాలను ఆపుదాం – ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం.
ప్రశ్న 3.
బాలికా విద్య ఆవశ్యకతను తెలియజేస్తూ / వివరిస్తూ ఒక కరపత్రం రాయండి.
జవాబు:
బాలికల విద్య – సమాజానికి ప్రగతి
తల్లిదండ్రులారా!
బాలికలు విద్యావంతులైనచో సమాజం వివేకవంతమవుతుంది. బాలికలు విద్యావంతులైనచో ప్రయోజనం ఇంత అని చెప్పలేము.
ఇటీవల కాలంలో రాజకీయ దాస్యంతోను, భావ దాస్యంతోను సంఘం మునిగి ఉంది. అందువల్ల బాలికల విద్య వెనుకబడి ఉంది.
మన దేశానికి స్వాతంత్ర్యం సంపాదించుటకు గాంధీ మహాత్ముడు తన నిర్మాణ కార్యక్రమంలో మహిళాభ్యుదయం ప్రధానంగా చేర్చారు. బాలికల విద్యకు ప్రాధాన్యతనిచ్చారు. ఆధునిక కాలంలో కందుకూరి వీరేశలింగం గారు. విద్యకు కృషి చేస్తూ మొట్టమొదటిగా ఒక పాఠశాలను స్థాపించారు.
సాంకేతిక విద్యలో నైపుణ్యం సంపాదించుటకై బాలికలకు ప్రత్యేకంగా “పాలిటెక్నిక్” కళాశాలను ఏర్పరిచారు. కనుక స్త్రీలు గృహకృత్యాలు నిర్వహించుటలో విద్యావంతులైనచో బహుముఖ ప్రజ్ఞను వెల్లడించి సంఘసేవలోనూ, దేశ సేవ లోనూ రాణించగలరు. తమ సంతానానికి విద్యాబుద్ధులు నేర్పుటలో శ్రద్ధ వహించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దుతారు. కనుక బాలికా విద్యకు ఇతోధికంగా ప్రోత్సహిస్తే సమాజ శ్రేయస్సు కల్గుతుంది.
భాషాంశాలు (పదజాలం వ్యాకరణాంశాలు)
కింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి.
అర్ధాలు
అ) గీత గీసిన పదానికి అర్థం రాయండి.
1. మెరక పొలం సిస్తంతా వాడి కిందయిపోతూంది.
జవాబు:
పన్ను
2. ఇంగ్లీషు చదువు కోసం పార్వతీపురం పంపే సరికి వూష్టం వచ్చింది.
జవాబు:
జ్వరం
3. ఈ శషభిషలు నాకేం పనికిరావు.
జవాబు:
గొప్పలు
4. అంతకన్నా గళగ్రాహిగా చదువుతాను.
జవాబు:
తడబడకుండా
ఆ) గీత గీసిన పదానికి సరియైన అర్ధాన్ని గుర్తించండి.
5. ఇంగ్లీషు చెప్పిద్దావనుకుంటుండగానే చచ్చినంత ఖాయలా చేసింది.
అ) రోగం
ఆ) దివాళా
ఇ) పని
ఈ) బాధ
జవాబు:
ఆ) దివాళా
6. నిమ్మళంగా ఇంటి దగ్గరే ఉంటే ఈ పాటికి నాలుగష్టాలు చెప్పేదును.
అ) రోగం
ఆ) చికాకు
ఇ) నింపాది
ఈ) నిశ్శబ్దం.
జవాబు:
ఇ) నింపాది
7. ఐతే నన్ను ఆక్షేపణ చేస్తావా?
అ) నింద
ఆ) గౌరవం
ఇ) మర్యాద
ఈ) బురద
జవాబు:
అ) నింద
8. డిప్టీ కలక్టరు గారు మా దొడ్డ ప్రభువు.
అ) పెద్దమ్మ
ఇ) పెరడు
ఆ) అమ్మక్క
ఈ) గొప్ప
జవాబు:
ఈ) గొప్ప
పర్యాయపదాలు
అ) గీత గీసిన పదానికి పర్యాయ పదాలు రాయండి.
9. విజయనగరంలో కన్యాశుల్కం మొదటి నాటక ప్రదర్శన జరిగింది.
జవాబు:
ఓలి, ఉంకువ
10. మీలాగే వాడూ జంఝాలు ఒడుక్కుంటూ బతకాలా?
జవాబు:
జందెం, యజ్ఞోపవీతం
11. ఇతడి వైఖరి చూస్తే ఇక్కడే బస వేసేటట్టు బలపడుతుంది.
జవాబు:
నివాసం, విడిది
12. మీ వాడు బతిమాలుకుంటే పోనీ పనికొచ్చే కుఱ్ఱవాడు. కదా అని వచ్చాను.
జవాబు:
వేడుకొను, ప్రార్ధించు
ఆ) గీత గీసిన పదానికి సరియైన పర్యాయ పదాలు గుర్తించండి.
13. నేను ఇక ఇక్కడ ఉండడం భావ్యం కాదు.
అ) యుక్తం, తగిన
ఆ) సబబు, మర్యాద
ఇ) గౌరవం, సభ్యత
ఈ) మంచి, చెడు
జవాబు:
అ) యుక్తం, తగిన
14. మా మావ ఈ దేశ భోగట్టా వచ్చినప్పుడల్లా తమర్ని యెన్నిక చేస్తుంటారండి.
అ) వార్త సందేశం
ఆ) సమాచారం, విషయం
ఇ) మాట, సంశయం
ఈ) పైవన్నీ
జవాబు:
ఆ) సమాచారం, విషయం
15. నేను ఈ మధ్య దాఖలా చేయించిన పిటీషన్ మీద ఆర్డరు చదివి పెట్టండి.
అ) రసీదు, చీటి
ఆ) నిదర్శనం, దర్శనం.
ఇ) ఋజువు, సాక్ష్యం
ఈ) సందర్భం, సమయం
జవాబు:
ఇ) ఋజువు, సాక్ష్యం
16. చదువుకునేవాడికి ఒక నిముషమైనా తెరిపి ఉండదు.
అ) ఖాళీ, ఆలస్యం
ఇ) సమయం, కాలం
ఆ) తీరిక, ఆలోచన
ఈ) ఖాళీ, తీరిక
జవాబు:
ఈ) ఖాళీ, తీరిక
ప్రకృతి వికృతులు
అ) గీత గీసిన పదానికి సరియైన ప్రకృతి పదం రాయండి.
17. నాకిది పేలపిండి కాదు.
జవాబు:
పిష్టము
18. ఎల్లా కడుపులో పెట్టుకు చెబుతారో మీదే భారం.
జవాబు:
గర్భం
19. కంటె ఇప్పించమని లుబ్ధావధాన్ల మీద ఒత్తిడి తెచ్చాడు.
జవాబు:
కంఠికా
20. వీళ్ళిద్దరూ కూడి ఆ రూపాయలు పంచుకుతినేటట్టు న్నారు.
జవాబు:
రూప్యము
ఆ) గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
21. పట్నంలో మునసబుగారింట భోజనం చేదని వచ్చానా.
అ) బువ్వ
ఆ) బోనం
ఇ) కూడు
ఈ) ముద్ద
జవాబు:
ఆ) బోనం
22. నా ప్రాణాలు ఎప్పుడూ అక్కణ్ణి ఉంటాయి.
అ) ఉసురు
ఆ) ఊపిరి
ఇ) పానం
ఈ పేనం
జవాబు:
ఇ) పానం
23. ఈ సంవత్సరం పుస్తకాలకు ఎంతవుతుందిరా.
అ) పుస్తకం
ఆ) పుతకం
ఇ) పొట్లం
ఈ) పొత్తం
జవాబు:
ఈ) పొత్తం
24. అక్షర పోలికే లేదండి.
అ) అక్కరం
ఆ) రాత
ఇ) వర్ణం
ఈ) అచ్చరం
జవాబు:
అ) అక్కరం
నానార్థాలు
అ) గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి.
25. కన్యాశుల్కం నాటకం గురజాడ వారి రచన.
జవాబు:
సుంకం, బహుమానం, లంచం, కట్నం
26. కుఱ్ఱవాడు ఉత్తరం రాశాడు.
జవాబు:
జాబు, ఉత్తరపు దిక్కు, తరువాత
27. మహారాజా వారి దర్శనం కూడా చేయించారు.
జవాబు:
చూపు, అద్దం
28. మనకి తట్టుబడి అట్లే ఉండదు.
జవాబు:
తాకిడి, ఖర్చు
ఆ) గీత గీసిన పదానికి సరైన నానార్థాలు గుర్తించండి.
29. పుస్తకాల కిందా, జీతాల కిందా ఇహ మన భూమి కడతేరి పోయింది.
అ) మునిగి, తేలి
ఆ) చచ్చు, సమాప్తం
ఇ) జారు, కదులు
ఈ) ముగింపు, శుభం
జవాబు:
ఆ) చచ్చు, సమాప్తం
30. ఈ శషభిషలు నాకేం పనికిరావు.
అ) గొప్పలు, బెదిరింపులు
ఆ) తిరకాసు, చర్చ
ఇ) ధూంధాం అనుట, పొగడ్తలు
ఈ) నటన, దొంగలు
జవాబు:
అ) గొప్పలు, బెదిరింపులు
31. వీణ్ణి పెందరాళే తోవపెట్టకపోతే మోసం వస్తుంది.
అ) దారి ఇచ్చు, ఈవి
ఆ) దారి చూపు, త్రోవ!
ఇ) పంపు, అంపు
ఈ) పంపు, దారి చూపించు
జవాబు:
ఈ) పంపు, దారి చూపించు
32. మా అబ్బాయి, మీరు ఒక పర్యాయం ఇంగ్లీషు మాట్లాడండి.
అ) తడవ, అవసరం
ఆ) క్రమం, వరుస
ఇ) సారి, క్షమాపణ
ఈ) వారం, పక్షం
జవాబు:
అ) తడవ, అవసరం
వ్యుత్పత్త్యర్థాలు
అ) గీత గీసిన పదానికి వ్యుత్పత్యర్థం రాయండి.
33. కన్యాకుల్మం ద్వితీయాంకం మొదటి సన్నివేశం.
జవాబు:
వధువును గ్రహించుటకు ఇచ్చు ధనం (ఓలి).
ఆ) గీత గీసిన పదానికి సరైన వ్యుత్పత్వర్ణాన్ని గుర్తించండి.
34. మా కరటక శాస్త్రి వట్టి అవకతవక మనిషి.
అ) బ్రాహ్మణుడు (బాపడు)
ఆ) శాస్త్రాలు తెలిసినవాడు (పండితుడు)
ఇ) బ్రహ్మజ్ఞానం కలవాడు (పండితుడు)
ఈ) శాస్త్రం చదవగలవాడు (విద్యార్ధి)
జవాబు:
ఆ) శాస్త్రాలు తెలిసినవాడు (పండితుడు).
జాతీయాన్ని గుర్తించడం
వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి విడిగా రాయండి.
35. ఎన్నాళ్ళో అయింది వాణ్ణి చూసి, కళ్ళు కాయలు కాసి పోయినాయి.
జవాబు:
కళ్ళు కాయలు కాయు.
36. నా కవిత్వమంటే ఆయన చెవికోసుకొంటారు.
జవాబు:
చెవికోసుకొను
37. వాడికి తల్లీ, తండ్రి ఇక మీరే, ఎల్లా కడుపులో పెట్టుకు చెబుతారో మీదే భారం.
జవాబు:
కడుపులో పెట్టుకొని
38. కొంచెం నాకు ప్రథమ కోపం, ఎవరో తెలియకుండా అన్నమాటలు, గణించకండేం.
జవాబు:
ప్రథమ కోపం
జాతీయము సందర్భము
ఈ జాతీయాన్ని ఏ అర్థంలో / సందర్భంలో ఉపయోగిస్తారో రాయండి.
39. మంచినీళ్ళ ప్రవాహం
జవాబు:
‘అతి సులభం’ అనే అర్థంలో ప్రయోగిస్తారు.
40. టోపీ వ్యవహారం
జవాబు:
‘పంచన’ అనే అర్థంలో ప్రయోగిస్తారు.
41. పాలుపోక
జవాబు:
‘ఏమి చేయాలో తోచక’ అనే అర్థంలో వాడతారు.
42. అరటిపండు విప్పినట్లు
జవాబు:
‘విశదంగా తెలుపు’ అనే అర్థంలో వాడతారు.
సంధి పదాలను విడదీయడం
గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి.
43. మాయింట్లో భోజనం ఎంతమాత్రం వీలుపడదు.
జవాబు:
మా + ఇంట్లో
44. ఇక మూడేళ్ళు నా తరిఖీదులో ఉంచితే క్రిమినల్లో వరుసగా పోలీసు పరీక్ష ప్యాసు చేయిస్తాను.
జవాబు:
మూడు + ఏళ్ళు
45. ఒక నిమిషమైనా తెరిపుండదు.
జవాబు:
తెరిపి + ఉండదు
46. అవధాన్లు గారు సావకాశంగా ఉన్నప్పుడు లెక్చరిచ్చి మనసు మళ్ళిస్తాను.
జవాబు:
స + అవకాశం
సంధి పదాలను కపోవడం
సంధి పదాలను కలిపి రాయండి.
47. దుః + ఆచారాలు
జవాబు:
దురాచారాలు
48. ద్వితీయ + అంకం
జవాబు:
ద్వీతీయాంకం
49. వివాహము + లు
జవాబు:
వివాహాలు
50. అభి + అంతరం
జవాబు:
అభ్యతరం
సంధి నామాలు
గీత గీసిన పదం ఏ సంధికి చెందినదో గుర్తించండి.
51. ఆ తరువాత సన్నివేశమే ప్రస్తుత పాఠ్యంశం.
అ) సవర్ణదీర్ఘ సంధి
ఆ) గుణ సంధి
ఇ) వృద్ధి సంధి
ఈ) యణాదేశ సంధి
జవాబు:
అ) సవర్ణదీర్ఘ సంధి
52. నిరక్షరాస్యులను సైతం ఆకట్టుకొని, ఆలోచింపచేసే ప్రక్రియ నాటకం.
అ) రుగాగమ సంధి
ఆ) విసర్గ సంధి
ఇ) సవర్ణదీర్ఘ సంధి
ఈ) గుణ సంధి
జవాబు:
ఆ) విసర్గ సంధి
53. మెరకపొలం సిస్తంతా వాడికిందయిపోతూంది.
అ) అత్వ సంధి
ఆ ఇత్వ సంధి
ఇ) ఉత్వ సంధి
ఈ) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
ఇ) ఉత్వ సంధి
54. ఆయన లక్షాధికారి.
అ) గుణ సంధి
ఆ) వృద్ధి సంధి
ఇ) విసర్గ సంధి
ఈ సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
ఈ) సవర్ణదీర్ఘ సంధి
విగ్రహవాక్యాలు
గీత గీసిన పదానికి విగ్రహవాక్యం రాయండి.
55. మెరక పొలం సిస్తంతా వాడి కిందయిపోతూంది.
జవాబు:
మెరకడైన పొలం
56. ఇంటి దగ్గరుంటే ఈ పాటికి నాలుగష్టాలు చెప్పేదును.
జవాబు:
నాలుగు సంఖ్య గల అష్టాలు.
57. రుణాలిచ్చి ఈ అగ్రహారం భూములన్నీ కొనేస్తాడు.
జవాబు:
అగ్రహారమునందలి భూములు
58. అవధాన్లుగారు సావకాశంగా ఉన్నప్పుడు లెక్చరిచ్చి మనసు మళ్ళిస్తాను.
జవాబు:
అవకాశాన్ని బట్టి (అనుసరించి)
సమాస నామాలు
గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.
59. గట్టి అసాధ్యం తెచ్చి పెట్టావే.
అ) నఞ్ తత్పురుష
ఆ) అవ్యయీభావ
ఇ) బహువ్రీహి
ఈ) రూపక సమాసం
జవాబు:
అ) నఞ్ తత్పురుష సమాసం
60. ఈ సంబంధం చేస్తే నేను నుయ్యోగొయ్యో చూసుకుంటాను.
అ) సప్తమీ తత్పురుష
ఆ) ద్వంద్వ సమాసం
ఇ) షష్ఠీ తత్పురుషు
ఈ) ద్విగు సమాసం
జవాబు:
ఆ) ద్వంద్వ సమాసం
61. అవును మీ మొఖం చూసిన జ్ఞాపకం ఉంది.
అ) ప్రథమా
ఆ) ద్వితీయా
ఇ) షష్ఠీ
ఈ) సప్తమీ
జవాబు:
ఇ) షష్ఠీ
62. మా కరటక శాస్త్రులు వట్టి అవకతవక మనిషి.
అ) తృతీయా
ఆ) చతుర్థీ
ఇ) పంచమీ
ఈ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
జవాబు:
ఈ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఆధునిక వచనాలు
ఈ వాక్యానికి సరియైన ఆధునిక వచనాన్ని గుర్తించండి.
63. మా యింట్లో భోజనము యంత మాత్రము వీలుపడదు.
అ) మా ఇంటిలో భోజనం ఏం కుదరదు.
ఆ) మా ఇంట్లో భోజనం ఏ మాత్రం కుదరదు.
ఇ) మా ఇల్లులో బోనం కుదరదు.
ఈ) మా కొంపలో బువ్వ పెట్టం.
జవాబు:
ఆ) మా ఇంట్లో భోజనం ఏ మాత్రం కుదరదు.
64. యీ చదువుల కోసవని పిల్లాణ్ణి వొదులుకొని వుండడం.
అ) ఈ చదువుల కోసమే పిల్లాణ్ణి వదలుకోవడం.
ఆ) ఈ చదువులకే పిల్లాడ్డి వదులుకొని ఉండాలి.
ఇ) ఈ చదువుల కోసం పిల్లాణ్ణి వదలలేక ఉండడం.
ఈ) ఈ చదువుల కోసం పిల్లాణ్ణి ఒదులుకొని ఉండడం.
జవాబు:
ఈ) ఈ చదువుల కోసం పిల్లాణ్ణి ఒదులుకొని ఉండడం.
65. అదుగో చదువంటే అష్టాగే చదువుకోవాలి.
అ) అదిగో చదువంటే అట్లాగే చదువుకోవాలి.
ఆ) అదిగో చదువు అలానే చదవాలి.
ఇ) అదిగో అట్లా చదివితేనే అది చదువు.
ఈ) అదిగో చదివే చదువు అలా చదవాలి.
జవాబు:
అ) అదిగో చదువంటే అట్లాగే చదువుకోవాలి.
66. యిప్పటి మట్టుకు వేదం లాగే భట్టీయం వేయిస్తారు.
అ) ఎప్పుడూ కూడా వేదం వల్లె వేస్తారు.
ఆ) ఇప్పటిలాగే వేదం కూడా వల్లె వేస్తాయి.
ఇ) ఇప్పుడు కూడా వేదం లాగే వల్లె వేస్తారు.
ఈ) అప్పుడు మటికి వేదంలాగే బట్టీ పట్టిస్తారు.
జవాబు:
ఇ) ఇప్పుడు కూడా వేదం లాగే వల్లె వేస్తారు.
వ్యతిరేకార్థక వాక్యాలు
ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం రాయండి.
67. కుఱ్ఱాడికి చదువు చెప్పిస్తాను.
జవాబు:
కుఱ్ఱాడికి చదువు చెప్పించను.
68. ఈ మారంటే నీ అన్న ఉన్నాడని ఊరుకునేది లేదు.
జవాబు:
ఈ మారు నీ అన్న ఉన్నాడని ఊరుకుంటా.
69. ఈయన నాకు చదువు చెప్పే మాస్టారు.
జవాబు:
ఈయన నాకు చదువు చెప్పే మాస్టారు కాదు.
70. మహారాజా వారి దర్శనం కూడా నాకు చేయించారండి.
జవాబు:
మహారాజా వారి దర్శనం కూడా నాకు చేయించలేదండి.
వ్యతిరేకార్థక క్రియలు
కింది క్రియా పదాలలో వ్యతిరేకార్థక క్రియను గుర్తించండి.
71. అ) ఇచ్చి
ఆ) ఇవ్వక
ఇ) ఇస్త
ఈ) ఇస్తే.
జవాబు:
ఆ) ఇవ్వక
72. అ) శ్రమపడక
అ) శ్రమపడుతూ
ఇ) శ్రమపడి
ఈ) శ్రమపడితే
జవాబు:
అ) శ్రమపడక
73. అ) అని
ఆ) అంటూ
ఇ) అనక
ఈ) అనగల
జవాబు:
ఇ) అనక
74. అ) చదివి
ఆ) చదువుతూ
ఇ) చదివితే
ఈ) చదవక
జవాబు:
ఈ) చదవక
సంక్లిష్ట వాక్యాలు
ఇవి ఏ రకమైన సంక్లిష్టవాక్యాలో రాయండి.
75. సమాజంలో దురాచారాలను విమర్శిస్తూ కథ ముందుకు సాగుతుంది కన్యాశుల్కంలో.
జవాబు:
శత్రర్థక వాక్యం
76. సావకాశంగా ఉన్నప్పుడు లెక్చరిచ్చి మనసు మళ్ళిస్తాను.
జవాబు:
క్వార్థకం
77. బావా! ఈ సంబంధం చేస్తే నీ కొంపకి అగే.
జవాబు:
చేదర్థక వాక్యం
78. పద్దెనిమిది వందలు పెట్టి వెంకడికి పెళ్ళి చేస్తాను.
జవాబు:
క్వార్థకం
కర్మణి వాక్యాలు
సరియైన కర్మణి వాక్యాన్ని గుర్తించండి.
79. దమ్మిడీ ఖర్చు లేకుండా చదువుకున్నాడు.
అ) చదువుకు దమ్మిడీ ఖర్చు కాలేదు.
ఆ) దమ్మిడీ ఖర్చు కాకుండా చదువు రాదు.
ఇ) దమ్మిడీ ఖర్చు లేకుండా చదువుకోబడినాడు.
ఈ) దమ్మిడి ఖర్చు లేకుండా చదువగలడా.
జవాబు:
ఇ) దమ్మిడీ ఖర్చు లేకుండా చదువుకోబడినాడు.
80. అగ్ని హోత్రుడికి తగినవాడు దొరికాడు.
అ) అగ్నిహోత్రుడికి దొరకబడినవాడు తనవాడు.
ఆ) అగ్నిహెూత్రుడికి తగినవాడు దొరకబడినాడు.
ఇ) తగినవాడే దొరికాడు అగ్నిహోత్రునికి
ఈ) దొరకబడినాడు తగినవాడు.
జవాబు:
ఆ) అగ్ని హెూత్రుడికి తగినవాడు దొరకబడినాడు.
81. గిరీశం తర్జుమా చేశాడు.
అ) గిరీశం చేత తర్జుమా చేయబడినాయి.
ఆ) తర్జుమా చేసింది గిరీశం.
ఇ) గిరీశం వలన తర్జుమా చేయబడినాయి.
ఈ) తర్జుమా చేయబడినవి చేత గిరీశం.
జవాబు:
అ) గిరీశం చేత తర్జుమా చేయబడినాయి.
82. లుబ్ధావధాన్లు కరటకశాస్త్రి శిష్యుణ్ణి పెళ్ళి చేసుకున్నాడు.
అ) లుబ్ధావధాన్ల చేత కరటక శాస్త్రి శిష్యుడు పెండ్లి ఆడాడు.
ఆ) లుబావధాన్ల చేత పెళ్ళి చేయించాడు.
ఇ) కరటకశాస్త్రి శిష్యుడు పెళ్ళి చేయబడింది.
ఈ) లుబ్ధావధాన్ల చేత కరటక శాస్త్రి శిష్యుడి పెండ్లి చేయబడింది.
జవాబు:
ఈ) లుబ్ధావధాన్ల చేత కరటక శాస్త్రి శిష్యుడి పెండ్లి చేయబడింది.
వాక్య రకాలు
ఇవి ఏ రకమైన సామాన్య వాక్యాల్లో రాయండి.
83. మీరు ఎందుకలా విచారిస్తారు?
జవాబు:
ప్రశ్నార్థక వాక్యం
84. మీ కాళ్ళు పట్టుకుంటా, ఆయన మనసు మళ్ళించండి.
జవాబు:
ప్రార్థనార్థక వాక్యం
85. తాంబోలం ఇచ్చేశాను, ఇహ తన్నుకు చావండి.
జవాబు:
నిశ్చయార్థక వాక్యం
86. ఇలా ఇంగ్లీషు కాగితాలు ఏమన్నా నా మీద పారెయ్యండి. తర్జుమా చేసి పెడతాను.
జవాబు:
సామర్థ్యార్థక వాక్యం
87. ఇదంతా టోపీ వ్యవహారంలా కనబడుతోంది.
జవాబు:
సందేహార్థక వాక్యం
88. మా కరటక శాస్త్రులు అవకతవక మనిషి.
జవాబు:
నిశ్చయార్దక వాక్యం
89. అబ్బీ ఒక తెనుగు పద్యం చదవరా?
జవాబు:
ప్రశ్నార్థక వాక్యం
90. ప్రజలను చైతన్యపరచాలి.
జవాబు:
విధ్యర్థక వాక్యం
వాక్య రకాలు
ఇవి ఏ రకమైన సామాన్య వాక్యాలో గుర్తించండి.
91. ఐతే నన్ను ఆక్షేపణ చేస్తావటే?
అ) ప్రశ్నార్థకం
ఆ) అశ్చర్యార్థకం
ఇ) విధ్యర్థకం
ఈ) ఆశీర్వార్థకం
జవాబు:
అ) ప్రశ్నార్థకం
92. వెధవాయ్ ఈ మారైనా పాసయినావా!
అ) నిశ్చయార్థకం
ఆ) సందేహార్థకం
ఇ) అనుమత్యర్థకం
ఈ) నిషేధార్థకం
జవాబు:
ఆ) సందేహార్థకం
93. మీ దయవల్ల మా వాడికో ముక్కల్బితే మీ మేలు మరచిపో.
అ) వ్యతిరేకార్థకం
ఆ) విధ్యర్థకం
ఇ) ప్రార్థనార్థకం
ఈ) భావార్థకం
జవాబు:
ఇ) ప్రార్థనార్థకం
94. తమరేనా! అగ్ని హెూత్రావధాన్లు గారు.
అ) ఆశీర్వార్థకం
ఆ) నిశ్చయార్థకం
ఇ) సందేహార్థకం
ఈ) ఆశ్చర్యార్థకం
జవాబు:
ఈ) ఆశ్చర్యార్థకం
95. నా తరిఫీదులో ఉంచితే క్రిమినల్లో వరుసగా పోలీసు పరీక్ష ప్యాసు చేయిస్తాను.
అ) సామర్థ్యార్థకం
ఆ) ప్రశ్నార్థకం
ఇ) ఆశ్చర్యార్థకం
ఈ) నిషేధార్థకం
జవాబు:
అ) సామర్థ్యార్థకం
96. మా ఇంట్లో భోజనం ఎంతమాత్రం వీలుపడదు.
అ) భావార్థకం
ఆ) నిషేధార్థకం
ఇ) అప్యర్థకం
ఈ) సందేహార్థకం
జవాబు:
ఆ) నిషేధార్థకం
97. మీరే వాడికి తల్లీ తండ్రీని.
అ) నిశ్చయార్థకం
ఆ) విధ్యర్థకం.
ఇ) ప్రార్థనార్థకం
ఈ) అనుమత్యర్థకం
జవాబు:
ఈ) అనుమత్యర్థకం
98. లుబ్ధావధాన్లగార్ని ఎరుగుదువా?
అ) అనుమత్యర్థకం
ఆ) ఆశ్చర్యార్థకం
ఇ) సామర్థ్యార్థకం
ఈ) ప్రశ్నార్థకం
జవాబు:
అ) అనుమత్యర్థకం