These AP 10th Class Social Studies Important Questions 13th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I will help students prepare well for the exams.
AP Board 10th Class Social 13th Lesson Important Questions and Answers ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I
10th Class Social 13th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium
1. మొదటి ప్రపంచ యుద్ధంలో ఎంతమంది భారతీయ సైనికులు మరణించారు?
జవాబు:
75,000.
2. అణుబాంబుల వల్ల కలిగే ప్రాణాంతక వ్యాధులేవి?
జవాబు:
ల్యుకేమియా, క్యాన్సర్.
3. సెర్బియన్ చేతిలో హత్యకు గురైన ఫెర్డినాండ్ ఏ దేశానికి చెందిన ఆర్చ్ డ్రుకీ?
జవాబు:
ఆస్టియా.
4. పోలాండ్ ఏ రేవును జర్మనీకి అప్పగించటానికి నిరాకరించింది?
జవాబు:
డాంజింగ్.
5. ఏ సంవత్సరం నుంచి ఇటలీలో ఫాసిజం దురహంకార పూరిత జాతీయతావాదంగా ఉంది?
జవాబు:
1923.
6. 19 శతాబ్దం ముగిసే నాటికి ఏ శక్తుల మధ్య వలస ప్రాంతాలకోసం పోటీ మొదలయ్యింది?
జవాబు:
ఐరోపా.
7. కొత్త పారిశ్రామిక (దేశాలు) శక్తులకు ఉదాహరణ నిమ్ము?
జవాబు:
జర్మనీ, జపాన్, ఇటలీ.
8. 1870లో ఫ్రాన్సి ని ఓడించిన తరువాత జర్మనీ ఛాన్సలర్ అయినది ఎవరు?
జవాబు:
బిస్మార్క్.
9. మిత్రదేశాల కూటమి ఏ సంవత్సరంలో ఏర్పడింది?
జవాబు:
1907.
10. 1880 నుంచి 1914 నాటికి ఆరు ప్రధాన శక్తుల (దేశాల) సైనిక ఖర్చు ఎంత శాతానికి పెరిగింది?
జవాబు:
300%
11. మొదటి ప్రపంచ యుద్ధం ఏ సంధితో ముగిసింది?
జవాబు:
వర్సయిల్స్ సంధి.
12. 1934 నాటికి నానాజాతి సమితిలో ఎన్ని దేశాలు సభ్యత్వం కల్గి ఉన్నాయి?
జవాబు:
58.
13. USSRని విస్తరింపుము.
జవాబు:
సోవియట్ సోషలిస్టు దేశాల సమాఖ్య (Union of Soviet Socialist Republic).
14. UNESCO ని విస్తరింపుము.
జవాబు:
విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ.
15. WHOని విస్తరింపుము.
జవాబు:
ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation)
16. UNICEF ని విస్తరింపుము.
జవాబు:
అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి.
17. ILOని విస్తరింపుము.
జవాబు:
అంతర్జాతీయ కార్మిక సంస్థ (International Labour Organisation)
18. ఐక్యరాజ్య సమితి ఎన్ని సిద్ధాంతాల ఆధారంగా ఏర్పడిన ప్రపంచ ప్రభుత్వం లాంటిది?
జవాబు:
నాలుగు.
19. వైమర్ గణతంత్రంగా ఏర్పడిన దేశమేది?
జజవాబు:
జర్మనీ.
20. 1922లో ఇటలీలో ఎవరి విజయంతో ఫాసిజం మొదలయ్యింది?
జజవాబు:
బెనిటో ముస్సోలినీ.
21. 1918లో ఏ దేశ ఓటమితో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది?
జవాబు:
జర్మనీ.
22. మొదటి ప్రపంచ యుద్ధ కాలం …….. ?
జవాబు:
1914 – 1918.
23. హెల్ కాస్ట్లో ఎంతమంది యూదులు చంపబడ్డారు?
జవాబు:
60 లక్షలు.
24. వలస ప్రాంతాలను తిరిగి విభజించాలని ఎవరు కోరుకున్నారు?
జవాబు:
కొత్త పారిశ్రామిక శక్తులు.
25. ఫ్రాన్స్ నుంచి 1871లో స్వాధీనం చేసుకున్న ఏ ప్రాంతాలను జర్మనీ వదులుకుంది?
జవాబు:
అల్సెస్, లోరైస్.
26. భవిష్యత్తులో యుద్ధాలను నివారించటానికి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటైన ప్రపంచ సంస్థ ఏది?
జవాబు:
నానాజాతి సమితి.
27. ఎవరి కింద జర్మనీ తిరిగి వేగంగా పారిశ్రామికీకరణ చెందింది?
జవాబు:
నాజీల.
28. మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణమేమి?
జవాబు:
Murder of Ferdinand (1914, జూన్ 28)
29. రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణమేమి?
జవాబు:
పోలెండ్ పై జర్మనీ దండెత్తటం. (1939, సెప్టెంబర్ 1)
30. ఒట్టోవాన్ సామ్రాజ్యం ఏర్పడిన దేశమేది?
జవాబు:
టర్కీ
31. ఫ్లోరెన్స్ ఓవెన్ ఏ దేశానికి చెందిన వ్యక్తి?
జవాబు:
పోలెండ్.
32. బ్రిటన్ లో మహిళలకు ఓటుహక్కు లభించిన సంవత్సరం ఏది?
జవాబు:
1918.
33. ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంలో స్థాపించారు?
జవాబు:
1945.
34. రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు ముగిసింది?
జవాబు:
1945 ఆగస్టు.
35. రెండవ ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారకుడు ఎవరు?
జవాబు:
హిట్లర్.
36. జర్మనీ, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్ లో భిన్నమైన దేశమేది?
జవాబు:
ఫ్రాన్స్,
37. అంతర్జాతీయ మహిళల ఓటుహక్కు ఉద్యమ సంస్థ ఏ సంవత్సరంలో ఏర్పడింది?
జవాబు:
1914.
38. నానాజాతి సమితి రూపశిల్పి ఎవరు?
జవాబు:
ఉడ్రోవిల్సన్ (అమెరికా).
39. జపాన్లోని ఏ నగరాలపై అణుబాంబు దాడి జరిగింది?
జవాబు:
హిరోషిమా, నాగసాకి.
40. జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రియా, ఇటలీలో తైపాక్షిక కూటమిలో లేని దేశమేది?
జవాబు:
ఫ్రాన్స్
41. USSR ఏ సంవత్సరంలో ఏర్పాటయ్యింది?
జవాబు:
1924.
42. అక్షరాజ్యాల / కేంద్ర రాజ్యాల కూటమికి నాయకత్వం వహించిన దేశమేది?
జవాబు:
జర్మనీ.
43. బ్రిటన్, అమెరికా, ఆస్ట్రియా, రష్యాలలో భిన్నమైనది ఏది?
జవాబు:
ఆస్ట్రియా.
44. రష్యా విప్లవం ఏ సంవత్సరంలో సంభవించింది?
జవాబు:
1917.
45. సామ్రాజ్య వాదానికి మూల కారణమేమి?
జవాబు:
పారిశ్రామిక విప్లవం.
46. వర్సయిల్స్ సమావేశానికి ఎన్ని దేశాలు హాజరయ్యాయి?
జవాబు:
32 దేశాలు.
47. అమెరికా పార్లమెంట్ ను ఏమని పిలుస్తారు?
జవాబు:
కాంగ్రెస్.
48. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) ఫాసిజమ్ ( ) a) ఇటలీ
ii) నాజియిజమ్ ( ) b) జర్మనీ
iii) సోషలిజం ( ) c) రష్యా
iv) పారిశ్రామిక విప్లవం ( ) d) ఇంగ్లండు
జవాబు:
i -a, ii – b, iii – c, iv – d
49. క్రింది వానిని జతపరచండి.
i) ముస్సోలిని ( ) a) ఆస్ట్రియా
ii) ఉడ్రోవిల్సన్ ( ) b) రష్యా
iii)జార్ నికొలస్ ( ) c) అమెరికా
iv) ఫెర్డినాండ్ ( ) d) ఇటలీ
జవాబు:
i – d, ii – c, iii – b, iv – a
50. 20వ శతాబ్దాన్ని “తీవ్ర సంచలనాల యుగం” అని అభివర్ణించింది ఎవరు?
జవాబు:
ఎరిక్ హాక్బీమ్.
51. తీవ్ర ఆర్థిక మాంద్యం ఏ సంవత్సరంలో ఏర్పడింది?
జవాబు:
1929.
52. నానాజాతి సమితి ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?
జవాబు:
జెనీవా.
53. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?
జవాబు:
న్యూయార్క్.
54. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి.
→ ఫాసిజం – ఫ్రాన్స్
→ నాజీజం – జర్మనీ
→ సామ్యవాదం – రష్యా
→ పెట్టుబడిదారీ దేశం – అమెరికా
జవాబు:
ఫాసిజం – ఫ్రాన్స్,
55. మొదటి ప్రపంచ యుద్ధంలో శక్తి కూటములకు సంబంధించి భిన్నమైన దానిని గుర్తించండి
బ్రిటన్, ఆస్ట్రియా, ఫ్రాన్స్, రష్యా.
జవాబు:
ఆస్ట్రియా.
56. చరిత్రకారుడైన ఎరిక్ హాబ్స్ బామ్ 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగంగా పేర్కొనడానికి కారణం కాని అంశం?
తీవ్ర ఆర్థికమాంద్యం సంభవించటం.
ప్రపంచ యుద్ధాలు జరగడం.
మూఢ విశ్వాసాలు పెరిగిపోవటం.
సినిమాలు వంటి కొత్తకళలు ఆవిర్భవించటం.
జవాబు:
మూఢ విశ్వాసాలు పెరిగిపోవటం.
57. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) UNESCO ( ) a) పారిస్
ii) WHO ( ) b) జెనీవా
iii) UNICEF ( ) c) న్యూయార్క్
iv) అంతర్జాతీయ న్యాయస్థానం ( ) d) ది హేగ్
జవాబు:
i – a, ii – b, iii – c, iv – d
58. క్రింది వానిలో సరికాని జతను గుర్తించి రాయండి.
→ తీవ్ర ఆర్థిక మాంద్యం – 1929
→ రష్యా విప్లవం – 1917
→ రెండవ ప్రపంచ యుద్ధ ఆరంభం – 1939
→ ఐక్యరాజ్య సమితి ఏర్పాటు – 1947
జవాబు:
ఐక్యరాజ్య సమితి ఏర్పాటు – 1947
59. ప్రపంచ యుద్ధాలకు ప్రధాన కారణం సామ్రాజ్యవాదం అయితే ఈ సామ్రాజ్యవాదానికి మూలం ఏది?
జవాబు:
పారిశ్రామిక విప్లవం.
60. ILO, WHO, అంతర్జాతీయ న్యాయస్థానం, UNESCO లలో నానాజాతి సమితిలో ఏర్పడిన సంస్థ కానిది ఏది?
జవాబు:
UNESCO
61. హిట్లర్ పోలెండను ఆక్రమించిన సంవత్సరం?
జవాబు:
1939.
62. యుద్ధాన్ని నివారించ వలసిందిగా హిట్లరుకు విన్నపాన్ని పంపిన భారత జాతీయ నాయకుడు ఎవరు?
జవాబు:
మహాత్మా గాంధీ.
63. నానాజాతి సమితి ఉద్దేశ్యాన్ని కొనసాగించడానికి ఏర్పడిన సంస్థ ఏది?
జవాబు:
ఐక్యరాజ్య సమితి.
64. ప్రపంచ శాంతి కోసం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటయిన సంస్థ?
జవాబు:
ఐక్యరాజ్య సమితి.
65. 1870లో బిస్మార్క్. ఏ దేశాన్ని ఒంటరిని చేయాలని చూశాడు?
జవాబు:
ఫ్రాన్స్
66. నానాజాతి సమితిలో చేరడానికి ఆహ్వానించబడని దేశాలు ఏవి?
జవాబు:
జర్మనీ, రష్యా.
67. రష్యా విప్లవం ఏ సంవత్సరంలో సంభవించింది?
జవాబు:
1917.
68. బోల్షివిక్ పార్టీ స్థాపకుడు ఎవరు?
జవాబు:
లెనిన్.
69. నాజీ పార్టీ యొక్క అసలు పేరు?
జవాబు:
నేషనల్ సోషలిస్టు పార్టీ.
70. ఏ సంవత్సరంలో హిట్లర్ రష్యాపై దండెత్తాలని నిర్ణయించు కున్నాడు?
జవాబు:
1942.
71. 1939లో ఏ రెండు దేశాలు పరస్పరం దండెత్తకుండా ఉండటానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి?
జవాబు:
జర్మనీ, రష్యా,
72. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ఫ్రాన్స్, బెల్జియంలపై దాడిచేసిన దేశమేది?
జవాబు:
జర్మనీ.
73. రష్యా – జపాన్ యుద్ధం జరిగిన సంవత్సరం ఏది?
జవాబు:
1905.
74. ఏ సంవత్సరంలో నానాజాతి సమితి రద్దు చేయబడింది?
జవాబు:
1946.
75. ఆస్ట్రో – హంగేరియన్, ఒట్టోమాన్ సామ్రాజ్యాలను విచ్ఛిన్నం చేసిన సంధి ఏది?
జవాబు:
వర్సయిల్స్.
76. స్పెయిన్లో జనరల్ ఫ్రాంకో అధికారంలోకి వచ్చిన సంవత్సరం?
జవాబు:
1939.
77. ఏ సంవత్సరంలో హిట్లర్, అతడి నాజీ పార్టీ అధికారంలోకి వచ్చింది?
జవాబు:
1933.
78. రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్లు మూడు మిదేశాల కూటమిగా ఏ సంవత్సరంలో ఏర్పడ్డాయి?
జవాబు:
1907.
79. 1880 నుంచి 1914 నాటికి జర్మనీ, రష్యా, ఆస్ట్రియా, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల సైనిక ఖర్చు 192 మి|| పౌండ్ల నుంచి ఎంతకు పెరిగింది?
జవాబు:
397 మి|| పౌండ్లకు.
80. ఏ శతాబ్దం ముగిసే నాటికి ఐరోపా శక్తుల మధ్య వలస ప్రాంతాలకోసం పోటీ మొదలయ్యింది?
జవాబు:
19వ శతాబ్దం
81. 1871లో ఏ దేశం నుండి స్వాధీనం చేసుకున్న అల్సెన్, లోరైన్ వంటి ప్రాంతాలను జర్మనీ వదులుకుంది?
జవాబు:
ఫ్రాన్స్
82. ప్రపంచ యుద్ధాల్లో మరణించిన వాళ్ళల్లో అధిక శాతం మంది ఎన్ని సంవత్సరాలలోపు వారున్నారు?
జవాబు:
40 ఏళ్ళలోపు.
10th Class Social 13th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
UNICEF ను విస్తరింపుము.
జవాబు:
అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి (యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్)
ప్రశ్న 2.
ఈ క్రింది కాలపట్టికను పరిశీలించి, ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
కాలపట్టిక
మొదటి ప్రపంచ యుద్ధ ప్రారంభం ఆగస్టు 1 | 1914 |
రష్యా విప్లవము | 1917 |
మొదటి ప్రపంచ యుద్ధం ముగింపు | 1918 |
వర్సెయిల్స్ ఒప్పందము | 1919 |
నానాజాతి సమితి ఏర్పాటు | 1919 |
జర్మనీలో హిట్లర్ ప్రాభవం | 1933 |
రెండవ ప్రపంచ యుద్ధ ప్రారంభం | 1939 |
రష్యాపై జపాన్ దండెత్తడం | 1942 |
ఐక్యరాజ్యసమితి ఏర్పాటు | 1945 |
రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు | 1945 |
ప్రశ్న. రెండు ప్రపంచ యుద్ధాల అనంతరము ఏర్పడిన శాంతికాముక సంస్థలు ఏవి?
జవాబు:
- నానాజాతి సమితి
- ఐక్యరాజ్య సమితి (యు.ఎన్.ఓ)
ప్రశ్న 3.
ఈ క్రింది ను పరిశీలించి ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.
యుద్ధ మరణాలు, మిలియన్లలో ప్రతి వెయ్యి మందికి మరణాలు
1) 20వ శతాబ్దంలో ప్రతి వెయ్యిమందిలో ఎంతమంది యుద్ధాల వల్ల చనిపోయారు?
జవాబు:
20వ శతాబ్దంలో ప్రతి వెయ్యిమందిలో 44.4 మంది యుద్ధాల వల్ల చనిపోయారు.
2) ఏ శతాబ్దంలో యుద్ధ మరణాలు తక్కువగా ఉన్నాయి?
జవాబు:
16వ శతాబ్దంలో యుద్ధ మరణాలు తక్కువగా ఉన్నాయి.
3) 1900-1999లో యుద్ధ మరణాల సంఖ్య అధికంగా ఎందుకు ఉన్నది?
జవాబు:
- ప్రపంచ యుద్ధాలు జరగడం వలన
- ఆధునిక ఆయుధాలు ఉపయోగించడం వలన
ఉదా : అణ్వాయుధాలు, విషవాయువులు
ప్రశ్న 4.
ఆయుధ పోటీకి సంబంధించిన బార్ గ్రాఫ్ ను పరిశీలించి కింది ప్రశ్నలకు సమాధానం రాయండి.
→ ఏ సంవత్సరాల మధ్య ఆయుధ పోటీ పెరిగినట్లు తెలుస్తుంది?
జవాబు:
1880వ సంవత్సరం నుండి 1914 సంవత్సరాల మధ్య కాలంలో ఆయుధాల పోటీ కొనసాగింది.
→ సైనిక ఖర్చులు 1900 నుండి 1914 వరకు ఎంత పెరిగింది?
జవాబు:
పై గ్రాఫ్ 1880-1914, మధ్య ప్రధాన శక్తులైన జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ, బ్రిటన్, రష్యా, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల – సైనిక ఖర్చుని సూచిస్తోంది.
ప్రశ్న 5.
మొదటి ప్రపంచ యుద్ధానికి గల తక్షణ కారణం ఏమిటి?
జవాబు:
ఆస్ట్రియా యువరాజు ఆర్చ్ డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ ఒక సెర్బియన్ ఉన్మాది చేతిలో హత్య కావింపబడటం మొదటి ప్రపంచ యుద్ధానికి గల తక్షణ కారణం.
ప్రశ్న 6.
వర్సయిల్స్ సంధి షరతుల్లోని ఒకదానిని పేర్కొనండి.
జవాబు:
వర్సయిల్స్ సంధి షరతులు :
- ఆర్థికపరమైన
- భూభాగపరమైన
- సైనిక, నౌకా పరమైన
ప్రశ్న 7.
శాంతి యొక్క ఆవశ్యకతను తెలుపుతూ రెండు నినాదాలు రాయండి.
జవాబు:
- యుద్ధాన్ని ద్వేషిద్దాం – శాంతిని ప్రేమిద్దాం
- శాంతియే నాగరికత
ప్రశ్న 8.
బిస్మార్క్ ఏ దేశాలతో రహస్య ఒప్పందాలను చేసుకున్నాడు?
జవాబు:
బిస్మార్క్ ఆస్ట్రియా, ఇటలీ దేశాలతో రహస్య ఒప్పందాలను చేసుకున్నది.
ప్రశ్న 9.
రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఏమిటి?
జవాబు:
రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం : పోలండ్ లోని డాంజిన్, రేవు కోసం జర్మనీ పోలండ్ పై దాడి చేయడం.
ప్రశ్న 10.
ఈ చిత్రంలోని వ్యక్తి నానాజాతి సమితి స్థాపనలో కీలక పాత్ర పోషించాడు. అతను ఎవరు?
జవాబు:
ఉడ్రోవిల్సన్.
ప్రశ్న 11.
20వ శతాబ్దపు ఆరంభంలో ప్రపంచ జనాభా ఎంత?
జవాబు:
20వ శతాబ్దపు ఆరంభంలో ప్రపంచ జనాభా 160 కోట్లు.
ప్రశ్న 12.
ఫాసిజం అనే పదానికి అర్థం ఏమిటి?
జవాబు:
ఫాసిజం అనే పదానికి అర్ధం కడ్డీల కట్ట.
ప్రశ్న 13.
హిట్లర్ ఏర్పరచిన పార్టీ ఏది?
జవాబు:
హిట్లర్ ఏర్పరచిన పార్టీ నాజీ పార్టీ.
ప్రశ్న 14.
రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణమేమి?
జవాబు:
రెండవ ప్రపంచ యుద్ధానికి ట్లర్ పోలెండ్ పై దాడిచేయడం తక్షణ కారణం.
ప్రశ్న 15.
జపాన్‌లోని ఏ నగరాలప్పై ఆ సంయుక్త రాష్ట్రాలు అణుబాంబులు వేసాయి?
జవాబు:
జపాన్లోని హిరోషిమా, నాగసాలపై అమెరికా సంయుక్త రాష్ట్రాలు రెండవ ప్రపంచయుద్ధాన్ని త్వరితంగా సమాప్తం చేయడానికి అణుబాంబులను వేసింది.
ప్రశ్న 16.
నానాజాతి సమితి ఎప్పుడు ఏర్పడింది?
జవాబు:
నానాజాతి సమితి 1920లో ఏర్పడింది.
ప్రశ్న 17.
నానాజాతి సమితి రూపశిల్పి ఎవరు?
జవాబు:
నానాజాతి సమితి రూపశిల్పి అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడైన ఉడ్రోవిల్సన్.
ప్రశ్న 18.
త్రైపాక్షిక కూటమిలో ఏ ఏ దేశాలున్నాయి?
జవాబు:
తైపాక్షిక కూటమిలో ఇంగ్లాండ్, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలున్నాయి.
ప్రశ్న 19.
త్రైపాక్షిక సంధిలో ఏ ఏ దేశాలున్నాయి?
జవాబు:
త్రైపాక్షిక సంధిలో ఆస్ట్రియా, ఇటలీ, హంగరీ దేశాలున్నాయి.
ప్రశ్న 20.
మొదటి ప్రపంచ యుద్ధం ఏ ఏ సం||ల మధ్య జరిగింది?
జవాబు:
మొదటి ప్రపంచ యుద్ధం 1914 – 18 సం||ల మధ్య జరిగింది.
ప్రశ్న 21.
రష్యాలో విప్లవం ఏ సం||లో సంభవించింది?
జవాబు:
రష్యాలో విప్లవం 1917లో సంభవించింది.
ప్రశ్న 22.
మొదటి ప్రపంచ యుద్ధంలో విజేతలైన 5 పెద్ద దేశాలు ఏవి?
జవాబు:
అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్.
ప్రశ్న 23.
సామ్రాజ్యవాదం అనగానేమి?
జవాబు:
వలసరాజ్య విస్తరణలో ఏర్పడ్డ శత్రుత్వమే సౌమ్రాజ్యవాదం.
ప్రశ్న 24.
బోల్షివిక్ పార్టీ స్థాపకుడెవరు?
జవాబు:
బోల్షివిక్ పార్టీ స్థాపకుడు లెనిన్.
ప్రశ్న 25.
మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణమేమి?
జవాబు:
ఆస్ట్రియా రాకుమారుడైన ఫెర్డినాండును, సతీసమేతంగా సరయోవో నగరంలో ఒక సెర్బియన్ హత్య గావించాడు.
ప్రశ్న 26.
బిస్మార్క్ జర్మనీ చాన్నలగా ఎప్పుడు నియమించబడ్డాడు?
జవాబు:
జర్మనీ చాన్సలర్ గా బిస్మార్క్ 1870లో నియమించబడ్డాడు.
ప్రశ్న 27.
వర్సయిల్స్ ఒప్పందం నానాజాతి సమితిని ఎందుకు ఏర్పాటు చేసింది?
జవాబు:
వర్సయిల్స్ ఒప్పందం నానాజాతి సమితిని భవిష్యత్తులో యుద్ధాలను నివారించటానికి ఏర్పాటు చేసింది.
ప్రశ్న 28.
యు.ఎస్.ఎస్.ఆర్ ను విస్తరించుము.
జవాబు:
యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్టు రిపబ్లిక్.
ప్రశ్న 29.
బ్రిటిష్ మహిళలకు ఏ సం||లో ఓటు హక్కు లభించింది?
జవాబు:
బ్రిటిష్ మహిళలకు 1918లో ఓటు హక్కు లభించింది.
ప్రశ్న 30.
రెండవ ప్రపంచ యుద్ధం ఏ ఏ సం||ల మధ్య కొనసాగింది?
జవాబు:
రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుండి 1945 సం||ల మధ్య కొనసాగింది.
ప్రశ్న 31.
రెండవ ప్రపంచ యుద్ధానికి నాందిగా దేనిని భావిస్తారు?
జవాబు:
హిట్లర్ పోలెండ్ పై దండెత్తడాన్ని రెండవ ప్రపంచ యుద్ధానికి నాందిగా భావిస్తారు.
10th Class Social 13th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
కింది పేరాగ్రాను చదివి ‘మహిళలకు ఓటు హక్కు లభించడం అనేది ఒక పెద్ద ముందడుగు’ అని ఎలా సమర్థిస్తావో రాయుము.
ఓటు హక్కు వంటి రాజకీయ హక్కుల కోసం సుదీర్ఘ పోరాటం తర్వాత 1918లో బ్రిటిషు మహిళలకు ఓటు హక్కు లభించింది. ప్రపంచ యుద్ధాల మాదిరి దీర్ఘ కాలం పాటు జరిగే యుద్ధకాలంలో పారిశ్రామిక ఉత్పత్తి ఇతర సేవలు కొనసాగవలసిన అవసరం ఉంది. మగవాళ్ళు యుద్ధభూమిలో ఉండటంతో ఫ్యాక్టరీలు, దుకాణాలు, కార్యాలయాలు, స్వచ్చంద సేవలు, ఆసుపత్రులు, పాఠశాలల వంటి వాటిలో మహిళలు పని చేయాల్సి వచ్చింది. సంపాదనపరులు కావటంతో పెరిగిన ఆత్మ విశ్వాసంతో జీవితంలోని అన్ని అంశాలలో మహిళలు సమానత్వాన్ని కోరసాగారు. ఆ దిశలో ఓటు హక్కు లభించడం అనేది ఒక పెద్ద ముందడుగు.
జవాబు:
‘మహిళలకు ఓటుహక్కు లభించడం అనేది ఒక పెద్ద ముందడుగు’ అనడంలో సందేహం లేదు. ఎలాగంటే
- మహిళలకు ఓటుహక్కు కల్పించకుండా ఉంటే అది దేశ విధానాలను చాలా ప్రభావితం చేస్తుంది.
- పౌరులు అందరికీ (మహిళలకు) ఓటుహక్కు లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. నేటి ప్రభుత్వాలన్ని ప్రజాస్వామ్యాలే కాబట్టి మహిళలకు ఓటుహక్కు అవసరం.
- మహిళలకు ఓటుహక్కు లేనట్లయితే ‘వివక్షత’ చూపించినట్లవుతుంది. సామాజిక న్యాయం అనేది నేతిబీరకాయ చందంగా ఉండేది.
- దేశంలో సగం జనాభా మహిళలే, అందువల్ల ప్రభుత్వ ఏర్పాటులో, పాలనలో వీరి భాగస్వామ్యం తప్పనిసరి.
- మహిళలకు సమాన అవకాశాలు, (రాజకీయ) హక్కులు ఉన్నట్లయితే మరింత సామాజిక సమానత్వంవైపు తీసుకెళ్లటం సాధ్యమయ్యేది. అందుకని చట్టసభల్లో రిజర్వేషన్లు కూడా కల్పించి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి.
ప్రశ్న 2.
ఈ క్రింది కాలపట్టికను పరిశీలించి, ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
కాలపట్టిక
మొదటి ప్రపంచ యుద్ధ ప్రారంభం ఆగస్టు 1 | 1914 |
రష్యా విప్లవము | 1917 |
మొదటి ప్రపంచ యుద్ధం ముగింపు | 1918 |
వర్సెయిల్స్ ఒప్పందము | 1919 |
నానాజాతి సమితి ఏర్పాటు | 1919 |
జర్మనీలో హిట్లర్ ప్రాభవం | 1933 |
రెండవ ప్రపంచ యుద్ధ ప్రారంభం | 1939 |
రష్యాపై జపాన్ దండెత్తడం | 1942 |
ఐక్యరాజ్యసమితి ఏర్పాటు | 1945 |
రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు | 1945 |
ప్రశ్నలు :
1) రష్యా విప్లవం ఎప్పుడు సంభవించినది?
2) రెండవ ప్రపంచ యుద్ధానంతరము ప్రపంచ శాంతి స్థాపనకు ఏర్పడిన శాంతికాముక సంస్థ ఏమిటి?
(లేదా)
A) మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత శాంతి స్థాపనకు ఏర్పాటు చేయబడిన అంతర్జాతీయ సంస్థ పేరేమి?
B) హిట్లర్ జర్మనీకి చాన్సలర్‌గా ఏ సంవత్సరంలో అవతరించాడు?
C) యుద్ధం ముగియక ముందే రష్యా మొదటి ప్రపంచ యుద్ధం నుండి ఎందుకు విరమించుకుంది?
D) మొదటి ప్రపంచ యుద్ధం ఏ శాంతి సమావేశంతో ముగిసింది?
జవాబు:
1) రష్యా విప్లవం 1917లో సంభవించినది.
2) ఐక్యరాజ్య సమితి
(లేదా)
A) నానాజాతి సమితి.
B) 1933వ సం||రంలో
C) అంతర్గత విప్లవం కారణంగా, 1917లో రష్యా మొదటి ప్రపంచ యుద్ధం నుంచి విరమించుకుంది.
D) వర్సయిల్స్ (సంధి) ఒప్పందం.
ప్రశ్న 3.
కింది పట్టికను పరిశీలించి మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న దేశాల సైనిక ఖర్చును విశ్లేషించండి.
సంవత్సరం | సైనిక ఖర్చు (మిలియన్ పౌండ్లలో) |
1. 1880 | 132 |
2. 1890 | 158 |
3. 1900 | 205 |
4. 1910 | 288 |
5. 1914 | 397 |
జవాబు:
- 1880వ సంవత్సరంలో 132 మిలియన్ పౌండ్లలో డబ్బును ప్రధాన దేశాలు ఆయుధాల తయారీకి ఉపయోగించినట్లుగా తెలుస్తుంది.
- 1890వ సంవత్సరంలో ఆయుధ పోటీ మూలంగా 158 మిలియన్ పౌండ్లు ఖర్చు పెట్టబడిందని తెలుస్తుంది.
- 1900లలో 205 మిలియన్ పౌండ్లు, 1910లో 288 మిలియన్ పౌండ్లు, 1914లో 397 మిలియన్ పౌండ్లు ఆయుధాల ఉత్పత్తి కొరకు అగ్రరాజ్యాలు ఉపయోగించాయి.
- ఆయుధాల ఉత్పత్తిని గమనించినట్లయితే ఈ అగ్రరాజ్యాలన్ని కూడా తమ ఆదాయంలో అధిక భాగాన్ని ఆయుధ సేకరణ కొరకు వినియోగించారని తెలుస్తుంది. తద్వారా యుద్ధాలను కోరుకున్నాయని కూడా చెప్పవచ్చు.
- పైగా ఈ విధంగా ఆయుధ సేకరణ పెరగడానికి ముఖ్య కారణం తమ దగ్గర ఎంత ఎక్కువ ఆయుధ సంపత్తి ఉంటే, అంత ఎక్కువ భద్రత” అనే భావన అయి ఉండవచ్చు.
కావున 1880 నుండి 1914 వరకు ఆయుధ ఉత్పత్తి కొరకు అత్యధిక ధనాన్ని వినియోగించారని ఈ పట్టిక ద్వారా తెలుస్తున్నది.
ప్రశ్న 4.
ఈ క్రింది గ్రాఫ్ ను పరిశీలించి, ఆయుధ పోటీ గురించి ఒక పేరాగ్రాఫ్ రాయండి.
(లేదా)
క్రింద ఇవ్వబడిన గ్రాలోని సమాచారాన్ని విశ్లేషిస్తూ కొన్ని వాక్యాలు వ్రాయండి.
1880-1914 మధ్య ప్రధాన శక్తులైన జర్మనీ, ఆస్ట్రియా-హంగరీ, బ్రిటన్, రష్యా, ఇటలీ, ఫ్రాన్ల సైనిక ఖర్చు (మూలం : టైమ్స్ ప్రపంచ చరిత్ర అట్లాసు, లండన్, 1978)
జవాబు:
- పై బార్ గ్రాఫ్ 1880-1914 మధ్య ప్రధాన శక్తులైన జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ, బ్రిటన్, రష్యా, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల సైనిక ఖర్చును సూచిస్తుంది.
- 1880లో 132 మిలియన్ పౌండ్లు ఉన్న ఖర్చు, 1914లో 397 మిలియన్ పౌండ్లకు పెరిగిపోయింది.
- ఆయా దేశాలు అధిక ఆయుధాలు సమకూర్చుకోవడంతో ప్రతి 10 సం||లకు ఖర్చు పెరుగుతూ పోయింది. తద్వారా యుద్ధాలను కోరుకొని ప్రపంచ శాంతికి భంగం కలిగించాయి.
- ఈ ఆయుధ పోటీతో రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. దాని వలన ధన, మాన, ప్రాణ నష్టాలు సంభవించాయి. కనుక మున్ముందు రాజ్యాల మధ్య ఈ ఆయుధ పోటీ లేకుండుటయే మంచిది.
ప్రశ్న 5.
‘శాంతి’ ని ప్రోత్సహించేలా రెండు నినాదాలు రూపొందించండి.
జవాబు:
శాంతిని ప్రోత్సహించేలా రెండు నినాదాలు
i) యుద్ధం వద్దు – శాంతి ముద్దు
ii) ఆయుధాలు వద్దు – అభివృద్ధి ముద్దు
iii) యుద్ధం జన నష్టం – శాంతి ప్రాణ రక్షణం
iv) పోరు నష్టం – పొందు లాభం
ప్రశ్న 6.
20వ శతాబ్దాన్ని ‘తీవ్ర సంచలనాల యుగము’ అని పిలవడాన్ని సమర్థించే ఏవైనా రెండు సంఘటనలను పేర్కొనండి.
జవాబు:
- ఈ కాలంలోనే రెండు ప్రపంచ యుద్ధాలు సంభవించాయి.
- ఇదే సమయంలో తీవ్ర ఆర్థిక మాంద్యం చోటు చేసుకున్నది.
- విజ్ఞాన శాస్త్రం కొత్త శిఖరాలను అందుకుంది.
- మొదటిసారిగా మహిళలకు ఓటుహక్కు లభించింది.
కనుక 20వ శతాబ్దాన్ని ‘తీవ్ర సంచలనాల యుగము’ అని పిలుస్తారు.
ప్రశ్న 7.
క్రింది పట్టికలోని సమాచారాన్ని ఒక బార్ గ్రాఫ్ పై చూపండి.
జవాబు:
ప్రశ్న 8.
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, మరో ప్రపంచ యుద్ధం సంభవిస్తే జరిగే పరిణామాలను రాయండి.
జవాబు:
మరో ప్రపంచ యుద్ధం వస్తే సంభవించే పరిణామాలు
- అత్యధిక మరణాలు, జీవకోటికి తీవ్ర నష్టం
- ఆస్తుల వినాశనం
- పర్యావరణ కాలుష్యం పెరగడం
- జీవకోటి మనుగడకు కష్టం
ప్రశ్న 9.
ప్రపంచ శాంతి పరిరక్షణకు కొన్ని సూచనలు వ్రాయండి.
జవాబు:
ప్రపంచ శాంతి పరిరక్షణకు సూచనలు :
- అన్ని దేశాలు పరస్పరం స్నేహపూరిత సంబంధాలను సాగించాలి.
- ప్రతి దేశము ఇతర దేశాల హోదాను, సార్వభౌమత్వాన్ని గౌరవించాలి.
- దేశాలు, యుద్ధాలకు పోకుండా శాంతియుత చర్చల ద్వారా విభేదాలను పరిష్కరించుకోవాలి.
ప్రశ్న 10.
మొదటి ప్రపంచయుద్ధ ఫలితాలు ఏవి?
జవాబు:
1914 నుండి 1918 వరకు మొదటి ప్రపంచయుద్ధం కొనసాగింది.
ఫలితాలు :
- యుద్దానికి ముఖ్య కారకుడైన జర్మన్ చక్రవర్తి రెండో కైజర్ విలియం మిత్రరాజ్యాల చేతులలో పరాజయం పొంది హాలెండ్ కు పారిపోయాడు.
- దాదాపు కోటి మంది చనిపోయారు. సుమారు 65 లక్షల మంది గాయపడ్డారు.
- జర్మనీ తన భూభాగాలనే కాకుండా సైనికబలాన్ని కూడా కోల్పోయింది.
- నానాజాతి సమితి ఏర్పడడానికి మొదటి ప్రపంచయుద్ధం మూలం.
- వర్సయిల్స్ సంధి 1919 లో నిర్వహించారు.
ప్రశ్న 11.
ఎరిక్ హాకీ బామ్ కు 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగంగా ఎందుకు పేర్కొన్నాడు?
(లేదా)
ఇరవయ్యవ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగమని పిలవడానికి గల కారణాలను వివరించండి.
జవాబు:
చరిత్రకారుడైన ఎరిక్ హ్బా ్బమ్ కు 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగంగా పేర్కొన్నాడు.
- రాజకీయంగా చూస్తే ప్రపంచంలోని ఇతర ప్రజల పట్ల ద్వేషం, అవధులు లేని అధికారంతో ఫాసిజం భావజాలం తీవ్రరూపం దాలుస్తున్న క్రమంలోనే ప్రజలలో ప్రజాస్వామిక ఆకాంక్షలు చిగురులు వేశాయి.
- అంతటా అందరికీ అక్షరాస్యతాస్థాయి, సగటు జీవితకాలం అపారంగా పెరిగాయి.
- ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాలు స్వాతంత్ర్యం పొంది స్వేచ్ఛావాయువులు పీల్చసాగాయి.
- ఇది గొప్ప ప్రయోగాల కాలం కూడా.
- విజ్ఞానశాస్త్రం కొత్త శిఖరాలను అందుకుని పరమాణువు, జీవుల రహస్యాన్ని ఛేదించింది.
ప్రశ్న 12.
దురహంకారపూరిత జాతీయవాదం అంటే ఏమిటి?
జవాబు:
- 1923 నుంచి ఇటలీలో ఫాసిజం, జర్మనీలో నాజీయిజం రెండూ కూడా విధ్వంసకర రూపంలోని దురహంకార పూరిత జాతీయవాదాలు.
- జర్మనీ, ఇటలీలు ఏకీకరణ సాధించి స్వతంత్ర దేశాలుగా అవతరించాయి.
- ముఖ్యంగా జర్మనీలో జాత్యహంకారం పెల్లుబికింది. ఇంగ్లాండుతో జర్మనీ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
- ఇటలీపై ఆస్ట్రియా పాలన ఉంది. ఈ 5) బాల్కన్ దీవులలో దురాక్రమణపూరిత జాతీయవాదం, కల్లోలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి.
- జర్మనీ నౌకాదళశక్తిని, పారిశ్రామికోత్పత్తులను విపరీతంగా పెంచుకున్నది.
ప్రశ్న 13.
రహస్య ఒప్పందాలు, కూటముల గూర్చి వివరించుము.
జవాబు:
- 1870లో ఫ్రాన్స్ ని ఓడించిన తరువాత జర్మనీ ఛాన్సలర్ అయిన బిస్మార్క్, ఫ్రాన్స్ ని ఒంటరిని చెయ్యాలని చూశాడు.
- దీనికి అనుగుణంగా అతడు ఆస్ట్రియాతో 1879 లోనూ, ఇటలీతో 1882 లోనూ రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నాడు.
- 1907లో రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్లు మూడు మిత్రదేశాల కూటమిగా ఏర్పడ్డాయి.
- జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ కేంద్ర రాజ్యాలకూటమిగా ఏర్పడ్డాయి.
- ఐరోపా దేశాలు తమ స్వాతంత్ర్యంతో పాటు వాణిజ్య, ఆర్ధిక ప్రయోజనాలను కాపాడుకోడానికి రహస్య కూటములుగా ఏర్పడ్డాయి.
ప్రశ్న 14.
రెండవ ప్రపంచయుద్ధ ఫలితాలు తెలుపుము.
జవాబు:
రెండవ ప్రపంచయుద్ధం 1939 నుండి 1945 వరకు కొనసాగింది.
ఫలితాలు :
- అగ్ర రాజ్యంగా రష్యా అవతరించింది.
- సుమారు 2.2 – 2.5 కోట్ల మంది సైనికులు చనిపోయారు.
- బ్రిటన్, ఫ్రాన్లు తమ ప్రాబల్యాన్ని కోల్పోవటంతో ఆసియా, ఆఫ్రికా దేశాలలోని వలస రాజ్యాలు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాయి.
- జర్మనీ రెండు భాగాలుగా విభజింపబడింది.
- సుమారు 4, 5 కోట్ల మంది పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
- నార్వే, డెన్మార్క్, నెదర్లాండ్స్, బెల్జియంలలో ప్రజాస్వామ్య రాజ్యాలు పునః ప్రతిష్టించబడ్డాయి.
- ప్రపంచ శాంతికి దోహదం చేసే ఐక్యరాజ్యసమితి ఏర్పడినది.
ప్రశ్న 15
మొదటి ప్రపంచయుద్ధం ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగింది? దాని ప్రధాన కారణాంశాలేవి?
జవాబు:
మొదటి ప్రపంచయుద్ధం 1914 నుండి 1918 వరకు కొనసాగింది.
ప్రధాన కారణాలు :
- దురహంకారపూరిత జాతీయవాదం
- సామ్రాజ్యవాదం
- సైనికవాదం
- రహస్య ఒప్పందాలు
- ఆస్ట్రియా యువరాజైన ఫెర్డినాండ్ సతీసమేతంగా హత్య చేయబడటం
- జర్మనీ జాత్యహంకారం
ప్రశ్న 16.
రెండవ ప్రపంచయుద్ధ కారణాలు ఏవి?
జవాబు:
రెండవ ప్రపంచయుద్ధం 1939 – 1945 వరకు కొనసాగింది.
కారణాలు :
- వర్సయిల్స్ సంధిలోని అవమానకర షరతులు
- వివిధ దేశాల మధ్య సిద్ధాంతపర విభేదాలు
- సైనిక ఏర్పాట్లు
- నానాజాతి సమితి వైఫల్యం
- పోలెండ్ పై హిట్లర్ దాడి
ప్రశ్న 17.
నానాజాతి సమితి ఎందుకు విఫలమైంది?
(లేదా)
నానాజాతి సమితి వైఫల్యాలకు రెండు కారణాలు రాయండి.
జవాబు:
భవిష్యత్తులో యుద్దాలను నివారించటానికి వర్సయిల్స్ సంధి ఆలోచనలకు అనుగుణంగా 1920లో నానాజాతి సమితి ఏర్పడింది.
- ఈ కూటమిలో చేరటానికి రష్యా, జర్మనీలను ఆహ్వానించలేదు.
- కూటమి ఏర్పడటంలో అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్ చురుకైన పాత్ర పోషించినప్పటికీ అతని ప్రతిపాదనను అమెరికా కాంగ్రెస్ ఆమోదించటానికి తిరస్కరించటంతో అది కూడా సభ్యత్వం పొందలేదు.
- అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించకుండా, ఇతర దేశాలపై దండెత్తకుండా జర్మనీ, ఇటలీలను ఇది నివారించలేక పోయింది.
ప్రశ్న 18.
సామ్రాజ్యవాదం అంటే ఏమిటి?
జవాబు:
బ్రిటన్, జర్మనీ వంటి ఐరోపా దేశాలలోనూ, అమెరికాలోనూ పారిశ్రామిక మూలధనం అభివృద్ధి పొందడంతో తమ ఉత్పత్తులకు మార్కెట్, ముడిసరుకుల అందుబాటు అవసరమయ్యాయి. సైనికశక్తిని ఉపయోగించుకొని, వలసలను స్థాపించి సామ్రాజ్యాలను విస్తరించుకున్నారు. ఇతర దేశాలలో వలసలను స్థాపించుకొని తమ రాజ్యాధికారాన్ని విస్తృత పరచుకొనుటయే సామ్రాజ్యవాదం.
ప్రశ్న 19.
మొదటి ప్రశంచ యుద్ధానికి తక్షణ కారణం ఏమిటి?
జవాబు:
- ప్రతి యుద్ధానికి దీర్ఘకాలంగా మసులుతున్న కారణాలతోపాటు తక్షణ కారణాలు ఉంటాయి.
- మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం 1914 జూన్ 28న ఆస్ట్రియాకు చెందిన ఆర్చ్ డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ను ఒక సెర్బియన్ ఉన్మాది హత్య చేయడం.
- దీనితో ఆస్ట్రియా సెర్బియాపై యుద్ధం ప్రకటించింది.
ప్రశ్న 20.
ఆయుధ పోటీకి సంబంధించిన బార్ గ్రాఫ్ ను పరిశీలించి కింది ప్రశ్నలకు సమాధానం రాయండి.
1) పై గ్రాఫ్ దేనిని సూచిస్తుంది?
జవాబు:
పై గ్రాఫ్ 1880-1914 మధ్య ప్రధాన శక్తులైన జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ, బ్రిటన్, రష్యా, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల సైనిక ఖర్చుని సూచిస్తోంది.
2) ఏ దేశాలు ఆయుధాలపై ఎక్కువ ఖర్చు పెట్టాయి?
జవాబు:
ఆయుధాలపై ఎక్కువ ఖర్చు పెట్టిన దేశాలు : జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ, బ్రిటన్, రష్యా, ఇటలీ, ఫ్రాన్స్ మొ||.
3) ఆయుధాలపై ఖర్చు ప్రతి 10 సంవత్సరాలకి ఎందుకు పెరుగుతూ పోయింది?
జవాబు:
ఆయా దేశాలు అధిక ఆయుధాలు సమకూర్చుకోవడంతో ప్రతి 10 సం||లకు ఖర్చు పెరుగుతూ పోతోంది.
4) 1914లో ఆయుధాలపై ఎంత ఖర్చు జరిగింది?
జవాబు:
1914లో ఆయుధాలపై పెట్టబడిన మొత్తం ఖర్చు : 397 మి|| పౌండ్లు.
ప్రశ్న 21.
కింది పేరా చదివి ఇచ్చిన ప్రశ్నకు జవాబు రాయండి.
ప్రపంచ యుద్ధాల కారణంగా ఎంతోమంది చనిపోయారు. గాయపడ్డారు. మొదటి ప్రపంచ యుద్ధంలో దాదాపు కోటిమంది. రెండవ ప్రపంచ యుద్ధంలో 2-2.5 కోట్ల మంది చనిపోయారు. చనిపోయిన వాళ్లల్లో అధిక శాతం 40 ఏళ్లలోపు పురుషులే. ఈ రెండు యుద్ధాల వల్ల మారణాయుధాల పోటీ ప్రత్యేకించి అణుబాంబులు, రసాయనిక ఆయుధాల పోటీ పెరిగింది. ఇటువంటి ఆయుధాలు ప్రమాదవశాత్తు పేలిపోయినా పూర్తి వినాశనం, మానవ నష్టం జరిగే ముప్పు కలుగుతుందనే భయంతో ప్రపంచం ఈనాటికీ జీవిస్తూ ఉంది.
ప్రశ్న : మరో ప్రపంచ యుద్ధం గనుక వస్తే అది ప్రపంచ మానవులందరికీ అత్యంత ప్రమాదకరం – వ్యాఖ్యానించండి.
జవాబు:
- ప్రపంచ యుద్దాల కారణంగా ఎంతోమంది చనిపోయారు, గాయపడ్డారు.
- మొదటి ప్రపంచ యుద్ధంలో 1 కోటి మంది చనిపోయారు. రెండవ ప్రపంచ యుద్ధంలో 2-2.5 కోట్ల మంది చనిపోయారు.
- వీరిలో అధిక శాతం 40 సం॥లలోపు పురుషులే.
- రెండు యుద్ధాలలో అణుబాంబులు, రసాయనిక ఆయుధాల పోటీ జరిగింది.
- ఇవి ప్రమాదవశాత్తు పేలినా పూర్తి వినాశనం, మానవనష్టం జరిగే ముప్పుతో ప్రపంచం నేటికీ జీవిస్తుంది.
- మరొక ప్రపంచ యుద్ధం వస్తే కనుక అది ప్రపంచ మానవులందరికీ ప్రమాదకరం.
10th Class Social 13th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
రెండు ప్రపంచ యుద్ధాలకు దారితీసిన కారణాలు ఏవి?
(లేదా)
ప్రపంచంలో సంభవించిన రెండు ప్రపంచ యుద్ధాలకు గల ప్రధాన కారణములను పేర్కొనండి.
జవాబు:
రెండు ప్రపంచ యుద్ధాలకు దారితీసిన కారణాలు :
దురహంకారపూరిత జాతీయవాదం :
జాతీయవాదం అనే భావజాలం ఒక మంచి ప్రేరణ. అయితే ఈ భావజాలం తమపట్ల గర్వాన్ని, ఇతరులపట్ల ద్వేషాన్ని కలిగించడానికి కూడా వాడుకున్నారు. 1923 నుంచి ఇటలీ ఫాసిజం, జర్మనిలో నాజీజం రెండూ కూడా విధ్వంసకర రూపంలోని దురహంకారపూరిత జాతీయవాదాలు.
సామ్రాజ్యవాదం :
వలసల ఏర్పాటులో ఐరోపా దేశాల మధ్య ఏర్పడిన పోటీనే (ఘర్షణ) సామ్రాజ్యవాదం అనవచ్చు. కొత్త పారిశ్రామిక శక్తులు (జపాను, జర్మనీ, ఇటలీ) ఏర్పడటంతో ఇవి వలస ప్రాంతాలను తిరిగి విభజించాలని తీవ్ర ఒత్తిడులకు, తరడు యుద్ధాలకు కారణం అవుతుండేది.
ఆయుధ పోటీ :
పెద్దసంఖ్యలో ఆయజధాలు సమకూర్చుకోవటంలో ఈ దేశాలు ఒకదానితో ఒకటి పోటీపడ్డాయి. ఆయుధాలను ఉత్పత్తి బేసే పెద్ద పారిశ్రామిక సంస్థలు ఆవిర్భవించి దౌత్య సతుస్యల పరిష్కారానికి యుద్దాన్ని ఉపగించటాన్ని ప్రోత్సహించాయి.
సైనికవాదం :
భద్రతకు సైనికశక్తి మంచి మార్గమని, సమస్యల పరిష్కారానికి యుద్ధమే సరైన విధానమని నమ్మటాన్ని సైనికవాదం అంటారు. 1880 నుంచి 1914 నాటికి ఐరోపా ప్రధాన దేశాల సైనిక ఖర్చు మూడింతలు పెరిగింది.
రహస్య ఒప్పందాలు :
మిత్రదేశాల కూటమి, త్రైపాక్షిక కూటమి మొదలైన ఒప్పందాల వల్ల ఐరోపా దేశాలు ఒకదానినొకటి శంకించసాగాయి. ఈర్యపడసాగాయి. ఈ కూటముల వల్ల సాయుధ శాంతి, భయ వాతావరణం నెలకొన్నాయి.
వర్సెయిల్స్ ఒప్పందం :
మొదటి ప్రపంచ యుద్ధం 1919 లో వర్సయిల్స్ శాంతి సమావేశంతో ముగిసింది. జర్మనీ బలహీనపర్వతానికిగాను ఈ ఒప్పందం దాని మీద సైనిక కోతలు, భౌగోళిక పరిమితులను విధించింది. ఈ ఒప్పందం బలవంతంగా జర్మనీపై రుద్దినదిగా భావించటం జరిగింది.
నానాజాతి సమితి వైఫల్యం :
భవిష్యత్తులో యుద్ధాలను నివారించటానికి తర్పయిల్స్ ఒప్పందం నానాజాతి సమితిని ఏర్పాటు చేసింది. కానీ అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించకుండా, ఇతర దేశాల పై దండెత్తి కూడా జర్మనీ, – ఇటలీలను ఇది నివారించలేకపోయింది.
జర్మనీ ప్రతీకారేచ్ఛ :
వర్సయిల్స్ ఒప్పందం వల్ల తాము కోల్పోయిన ప్రాంతాలను తిరిగి సాధించుకోవాలని, మధ్య యూరపుపై జర్మనీ తిరిగి ఆధిపత్యం పొందాలని, జర్మనీ ఆయుధాలపై ఉన్న పరిమితులకు అంతం పలకాలని జర్మన్స్ కోరుకున్నారు.
సామ్యవాదం, ఈష్యా షట్ల భయాలు :
రష్యాలో 1917లో విప్లవం సంభవించి అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది. 1924లో USSR గా మారింది. పాశ్చాత్య పెట్టుబడిదారీ దేశాలు యూరపులోని ఇతర దేశాలలో కూడా ఇలాంటి విప్లవాలే సంభవిస్తాయని భయపడి సోమియట్ సోషలిజానికి వ్యతిరేకశక్తిగా ఉంటుందని హిట్లర్, సౌజీలు బలపడటాన్ని మొదట్లో బలపరిచాయి. చివరికి బ్రిటన్, ఫ్రాన్స్ కూటమికి వ్యతిరేకంగా హిట్లర్ నిలిచాడు.
తక్షణ కారణం :
19.14లో ఆస్ట్రియా-హంగరీకి వారసుడైన రాకుమారుడిని సెర్బియతి చెందిన తీవ్రవాది హత్య 1. చేశాడు. దానితో 1914 జులై 28న సెర్బియాపై ఆస్ట్రియా దాడి చేసింది. ఈ విధంగా అందటి ప్రపంచ యుద్ధం
మొదలైంది. అలాగే 1939లో హిట్లర్ పోలాండ్ పై దండెత్తడంతో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది.
ప్రశ్న 2.
ప్రపంచ యుద్ధాలకు జాతీయవాదం ఎలా దోహదపడింది?
జవాబు:
- జాతీయ రాజ్యాలలో జాతీయతా భావం ఒక ప్రముఖ ప్రేరేపణ.
- నూతన శక్తికి అంకురార్పణ.
- ఆధునిక రాజ్యా లు ఏర్పడడానికి, జర్మనీ, ఇటలీ వంటి దేశాలు ఏకీకరణ సాధించడానికి ఇది మూలమైంది.
- జాతీయతా భావం ఆయా దేశాల అహంకారానికి, గర్వానికి పరాకాష్ఠ. అంతేకాకుండా ఇతరుల పట్ల ద్వేషాన్ని కలిగించడానికి కూడా ఈ దేశస్థులు జాతీయభావాన్ని ఉపయోగించుకున్నారు.
- ఈ ద్వేషం, అహంకారం యూరప్ లోని దేశాల మధ్య వైరం పెరగడానికి, అభద్రతాభావం ఏర్పడడానికి మూలమైంది.
- మరో ప్రక్క ఇటలీలో ఫాసిజం, జర్మనీలో నాజీయిజం రెండూ కూడా విధ్వంసకర రూపంలో దురహంకారపూరిత జాతీయవాదాన్ని రెచ్చగొట్టి, జర్మనీయే ప్రపంచానికి మార్గదర్శకత్వం వహిస్తుందని, విజేతయై ప్రపంచాన్ని పాలిస్తుందని, పుకార్లు షికార్లు చేయించి, ప్రపంచంలోని దేశాల మధ్య ద్వేషాలు, అభద్రతాభావం పెంచి యుద్ధకాంక్షను పురిగొల్పడానికి కారణమైంది.
ప్రశ్న 3.
వర్సయిల్స్ ఒప్పందంలోని నిబంధనలు ఏవి ? రెండవ ప్రపంచ యుద్ధానికి వర్సయిల్స్ ఒప్పందం ఎంతవరకు కారణమయినదో వివరించండి.
జవాబు:
మొదటి ప్రపంచ యుద్ధం 1919లో వర్సయిల్స్ శాంతి సమావేశంతో ముగిసింది. ఓటమి పాలైన దేశాలను ఈ సమావేశానికి ఆహ్వానించకపోవడం వలన వాళ్ళ భావాలను పరిగణన లోనికి తీసుకోలేక పోయినారు. దాని వలన వర్సయిల్స్ సంధి తమ మీద బలవంతంగా రొద్దబడినదని భావించి వారి దానిని వ్యతిరేకించారు.
వర్సయిల్స్ నిబంధనలు :
- జర్మనీని బలహీన పరచటానికి వర్సయిల్స్ ఒప్పందం దాని మీద సైనిక కోతలను, భౌగోళిక పరిమితులను విధించినవి.
- ఆల్సెస్, లోరైన్లను ఫ్రాన్సుకు తిరిగి ఇచ్చివేసింది.
- సైనిక బలాన్ని తగ్గించుకోమని జలాంతర్గాములు ఉండకూడదని ఆరు యుద్ధ నౌకలకు సరిపోయిన నౌకాదళం మాత్రమే ఉండాలని నిర్దేశించింది.
- పోలిష్ కారిడార్‌ను ఏర్పాటు చేయడం ద్వారా జర్మనీని రెండు భాగాలుగా చీల్చినారు.
- జర్మనీ బొగ్గు, ఉక్కు వనరులను కోల్పోయింది.
- జర్మనీ తన చెల్లింపు సామర్థ్యానికి మించిన నష్టపరిహారాలను చెల్లించాల్సి వచ్చింది.
- ఆర్థికంగా, సైనికంగా వర్సెటల్స్ సంధి జర్మనీని బలహీనపరచింది.
కారణం :
వర్సయిల్స్ సంధిని జర్మనీ మరియు ఓడిపోయిన మిగతా దేశాలు చాలా అవమానకరమైన సంధిగా భావించి దానిని వ్యతిరేకించి వారు గెలిచిన వారి మీద ప్రతికారం తీర్చుకోవడాని రెండవ ప్రపంచ యుద్ధానికి సన్నద్ధమైనారు.
ఈ విధంగా వర్సయిల్స్ సంధి రెండవ ప్రపంచ యుద్ధానికి ఒక కారణమయినది.
ప్రశ్న 4.
యూరప్ పటాన్ని పరిశీలించి వార్సా కూటమికి చెందిన రెండు దేశాలను మరియు నాటో కూటమికి చెందిన రెండు దేశాలను రాయుము.
జవాబు:
వార్సా పోల్ | నాటో పోల్ |
పోలెండ్ | U.S.A. |
అల్బేనియా | కెనడా |
రుమేనియా | బెల్జియం |
బల్గేరియా | డెన్మార్క్ |
హంగరీ | ఫ్రాన్సు |
మొదలైనవి | మొదలైనవి పోర్చుగల్, బ్రిటన్ మొదలైనవి. |
ప్రశ్న 5.
మీకియబడిన యూరప్ పటాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నకు జవాబు రాయుము.
అక్షరాజ్యాలను మరియు మిత్రరాజ్యాల జాబితాను తయారుచేయుము.
జవాబు:
కేంద్రరాజ్యా లు | మిత్ర రాజ్యాలు |
1) ఆస్ట్రేలియా | USSR |
2) జర్మనీ | బ్రిటన్ |
3) టర్కీ | రుమేనియా |
4) బల్గేరియా | ఫ్రాన్స్ |
5) ఇటలీ | USA |
6) జపాన్ | పోలెండ్ |
ప్రశ్న 6.
ఈ క్రింది గ్రాను పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.
1880-1914 మధ్య ప్రధాన శక్తులైన జర్మనీ, ఆస్ట్రియా-హంగరీ, బ్రిటన్, రష్యా, ఇటలీ, ఫ్రాన్ల సైనిక ఖర్చు
1) 1914లో ప్రధాన శక్తుల సైనిక ఖర్చు ఎంత?
జవాబు:
397 మిలియన్ పౌండ్లు
2) త్రైపాక్షిక కూటమిలోని దేశాలు ఏవి?
జవాబు:
జర్మనీ, ఆస్ట్రియా-హంగరీ, ఇటలీ
3) మిత్ర రాజ్యాలు అని వేటినంటారు?
జవాబు:
గ్రేట్ బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్
4) 1880 నుండి 1914 మధ్య కాలంలో ప్రధాన రాజ్యా ల సైనిక ఖర్చు ఎన్ని రెట్లు పెరిగినది?
జవాబు:
3 రెట్లు
ప్రశ్న 7.
ప్రపంచ యుద్ధాల పరిణామాలను వర్ణించండి.
జవాబు:
ప్రపంచ యుద్ధాల పరిణామాలు :
- ప్రపంచ యుద్ధాల కారణంగా ఎంతోమంది చనిపోయారు మరియు గాయపడ్డారు. ఆయుధ పోటీ పెరిగింది.
- అధికారం ప్రజాస్వామ్యబద్ధంగా ఉండవలసిన ఆవశ్యకతను గుర్తించారు.
- అనేక సామ్రాజ్యాలు అంతం అయ్యాయి. వలసలు స్వాతంత్ర్యం పొందాయి.
- ప్రపంచశాంతి కోసం నానాజాతి సమితి, ఐక్యరాజ్యసమితి వంటి నూతన అంతర్జాతీయ సంస్థలు ఏర్పడ్డాయి.
- బ్రిటన్లో మహిళలకు మొదటిసారిగా ఓటుహక్కు లభించింది.
ప్రశ్న 8.
క్రింది బార్ గ్రాఫ్ ని పరిశీలించి, విశ్లేషణ చేయండి.
జవాబు:
- ఈ బార్ గ్రాలో రెండు పారిశ్రామిక దేశాలయిన బ్రిటన్ మరియు జర్మనీ దేశాలు తయారుచేస్తున్న ప్రేలుడు పదార్థాల గురించిన సమాచారం ఉంది.
- రెండు దేశాలు వివిధ శత్రుకూటములకు చెందిన దేశాలు.
- 1914వ సంవత్సరంలో ప్రేలుడు పదార్థాల ఉత్పత్తి బ్రిటన్లో 4 టన్నులు మరియు జర్మనీలో 8 టన్నులు మాత్రమే.
- కాని ఆ సంవత్సరం నుండి ప్రేలుడు పదార్థాల ఉత్పత్తి గణనీయంగా పెరిగినది.
- 1914తో పోల్చినట్లయితే ప్రేలుడు పదార్థాల ఉత్పత్తి జర్మనీ కంటే బ్రిటన్లో చాలా తక్కువగా ఉంది.
- 1917వ సంవత్సరం నాటికి పరిస్థితి మొత్తం తారుమారు అయినది.
- బ్రిటన్లో పేలుడు పదార్థాల ఉత్పత్తి 184 టన్నులు అంటే గడచిన 4 సంవత్సరాలలో 45 రెట్లు పెరిగినది.
- జర్మనీలో 1914తో పోల్చితే 1917లో ప్రేలుడు పదార్థాల ఉత్పత్తి 140 టన్నులు. అంటే 18 రెట్లు పెరిగినది అని అర్థం అవుతుంది.
- ఈ ప్రేలుడు పదార్థాల ఉత్పత్తి మొదటి ప్రపంచ యుద్ధంలో దేశాలు ఆర్థికంగా బాగా నష్టపోవడానికి కారణం అయ్యింది.
ప్రశ్న 9.
13వ శతాబ్దంలో సంభవించిన ప్రపంచ యుద్ధాలలో జాతీయ రాజ్యాలు, జాతీయతా భావం యుద్ధకాంక్షను ఎలా ప్రభావితం చేశాయి.
జవాబు:
జాతీయ రాజ్యాలు, జాతీయతా భావం :
- జాతీయతావాదం అనే భావజాలం ఒక మంచి ప్రేరేపణ. ఈ భావజాలం ఆధునిక జాతీయ రాజ్యాలు ఏర్పడడానికి, జర్మనీ, ఇటలీల ఏకీకరణకు కారణం అయింది.
- కానీ దీనిని తమపట్ల గర్వాన్ని ఇతరుల పట్ల ద్వేషాన్ని కలిగించడానికి ఎక్కువగా వాడారు.
- 19వ శతాబ్దంలో యూరప్ లోని దేశాల మధ్య ఈ ద్వేషం క్రమేపీ పెరుగుతూ వచ్చింది.
- ఇటలీలో ఫాసిజం, జర్మనీలో నాజీజం రెండూ కూడా విధ్వంసకర రూపంలోని దురహంకారపూరిత జాతీయతావాదాలు. ఇవి ఆ రెండు దేశాల ప్రజలను యూరప్ లోని ఇతర దేశాలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టాయి.
ప్రశ్న 10.
క్రింది గ్రాఫ్ లోని సమాచారం ఆధారంగా దిగువ ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
ప్రశ్నలు:
1) ఏ సంవత్సరంలో సైనిక వ్యయం అధికంగా వుంది? ఎందుకు?
2) ఒక దేశ అభివృద్ధిని ఆయుధపోటీ ఏ విధంగా ప్రభావితం చేస్తుంది?
జవాబు:
1) సైనిక వ్యయం అధికంగా గల సంవత్సరం : 1914
కారణం : మొదటి ప్రపంచయుద్ధం ప్రారంభం కావడం.
2) దేశాభివృద్ధిపై ఆయుధపోటీ ప్రభావం :
a) దేశ అభివృద్ధి కుంటుపడుతుంది.
b) సంక్షేమ పథకాల అమలు కష్టతరమవుతుంది.
ప్రశ్న 11.
క్రింది గ్రాఫ్ ని పరిశీలించి, విశ్లేషణ చేయండి.
జవాబు:
పైన ఇవ్వబడిన గ్రాఫ్ మొదటి ప్రపంచ యుద్ధంలో వివిధ దేశాలు చేసిన ఖర్చును గురించి వివరించారు.
ఇక్కడ జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రియాహంగేరి, అమెరికా మరియు రష్యా దేశాలు చేసిన ఖర్చును వివరించారు.
పై గ్రాఫ్ ను పరిశీలించినట్లయితే జర్మనీ ఎక్కువగా 37,500 మిలియన్ పౌండ్లను ఖర్చు పెట్టగా, జపాన్ అతితక్కువగా 1000 మిలియన్ పౌండ్లను మాత్రమే ఖర్చు పెట్టింది.
ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఎక్కువ ఖర్చు చేసినా, తక్కువ ఖర్చు చేసినా అన్ని దేశాలు యుద్ధం వలన చాలా బాగా మరియు ఎక్కువగానే నష్టపోయాయి అని చెప్పవచ్చు.
1914-1918 మరియు 1939 – 1945 సంవత్సరాల మధ్య ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలకు 50 సం||రాల ముందు నుండే దేశాలు ఒకరితో ఒకరు భవిష్యత్తులో యుద్ధం వస్తే వాటి నుండి కాపాడుకోవడానికి, సైనిక, ఆర్థిక మరియు రాజకీయ పరమైన ఒప్పందాలను చేసుకోవడం కూడా జరిగింది. వీటి వలన దేశాల మధ్య శత్రుత్వం పెరిగి యుద్ధాలకు దారి తీసింది.
ప్రపంచంలో చాలా ప్రాంతాలలో తన వలస పాలన కొనసాగించిన గ్రేట్ బ్రిటన్ కూడా ఇక్కడ 36,000 మిలియన్ పౌండ్లను ఖర్చు చేసింది. పూర్వకాలంలో యుద్ధం జరిగితే ఉదా : రామాయణం మరియు మహాభారతాలను తీసుకొంటే ఎవరు యుద్ధంలో పాల్గొంటారో వారు మాత్రమే చనిపోవడం జరిగేది. కాని ప్రస్తుతం మనం వాడుతున్న రసాయనిక ఆయుధాల వలన ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ప్రజలు ప్రభావితం అవడమే కాకుండా పర్యావరణ కాలుష్యం జరిగి మన మనుగడ అంతమయ్యే స్థితికి చేరుకుంటున్నాం.
యుద్ధాలకు ప్రధాన కారణం ఒకరి మీద మరొకరు ఆధిపత్యం చెలాయించాలని కోరుకోవడం, నా సలహా ఏమిటంటే మనం సైన్యానికి ఆయుధాల కోసం చేసే ఖర్చుని, ప్రపంచశాంతి కోసం మరియు ప్రపంచ ప్రజల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టినట్లయితే, ప్రతిదేశం పేదరికాన్ని మరియు నిరుద్యోగాన్ని అనారోగ్య రుగ్మతలను ప్రపంచం నుండి పారద్రోల వచ్చును.
ప్రశ్న 12.
ఈ క్రిందివాటిని ప్రపంచపటంలో గుర్తించుము.
- ఆస్ట్రియా
- సెర్బియా
- జపాన్
- చైనా
- అమెరికా
- రష్యా
- ఫ్రాన్స్
- ఇంగ్లండ్
- జర్మనీ
- ఇటలీ
- హంగేరీ
- టర్కీ
- బల్గేరియా
- రుమేనియా
- ఇండియా
ప్రశ్న 13.
యుద్ద మరణాల గ్రాఫ్ ను పరిశీలించి, 1500 – 1999 మధ్య జరిగిన మరణాలను విశ్లేషించుము.
యుద్ధ మరణాలు, మిలియన్లలో ప్రతి వెయ్యిమందికి మరణాలు
జవాబు:
- యుద్ధమరణాలు 1500-1999 గ్రాఫ్ ను పరిశీలిస్తే ఆందోళన కలిగించే విషయాలు విదితమవుతాయి.
- 1500-1599 మధ్య ప్రతి వెయ్యిమందికి చనిపోతున్న వారి సంఖ్య గమనిస్తే నలుగురు కంటే తక్కువ చనిపోయారు.
- 1900-1999 మధ్య మరణాలను పరిశీలిస్తే ఆందోళన కలిగించే అంశం ఏంటంటే, మొదటి, రెండవ ప్రపంచయుద్దాల వలన ప్రతి వెయ్యిమందికి 44 మంది వరకు చనిపోవడం గమనించవచ్చు. అంటే సుమారు 4.5% ప్రజలు.
- అత్యాధునిక అణుబాంబులు వంటివి యుద్ధంలో ప్రయోగించడం మూలంగా, లక్షల్లో సైనికులు మరణించడం వలన ఈ విపరీత పరిణామాలు ఏర్పడ్డాయి.
- ఈ మరణాలకు యుద్ధ బీభత్సమే కాకుండా ఆ తర్వాత పలు వ్యాధులు సోకిన రోగులు గాయపడ్డవారు క్రమేపి మరణించడం జరిగింది.
ప్రశ్న 14.
ప్రక్క ను పరిశీలించి వివిధ దేశాల మధ్య పెరిగిన ఆయుధ పోటీని విశ్లేషించుము.
జవాబు:
ఇవ్వబడిన గ్రాఫు అధ్యయనం చేస్తే ఈ క్రింది అంశాలు తెలుస్తున్నాయి.
- 1880 వ సంవత్సరంలో 132 మిలియన్ పౌండ్లలో డబ్బును ప్రధాన దేశాలు ఆయుధాల తయారీకి ఉపయోగించినట్లుగా తెలుస్తుంది.
- 1890వ సంవత్సరంలో ఆయుధ పోటీ మూలంగా 158 మిలియన్ పౌండ్లు ఖర్చు పెట్టబడిందని తెలుస్తుంది.
- 1900లలో 205 మిలియన్ పౌండ్లు, 1910లో 288 మిలియన్ పౌండ్లు, 1914లో 397 మిలియన్ పౌండ్లు ఆయుధాల ఉత్పత్తి కొరకు అగ్రరాజ్యాలు ఉపయోగించాయి.
- ఆయుధాల ఉత్పత్తిని గమనించినట్లయితే ఈ అగ్రరాజ్యాలన్నీ కూడా తమ ఆదాయంలో అధిక భాగాన్ని ఆయుధ సేకరణ కొరకు వినియోగించారని తెలుస్తుంది. తద్వారా యుద్ధాలను కోరుకున్నాయని కూడా చెప్పవచ్చు.
- పైగా ఈ విధంగా ఆయుధ సేకరణ పెరగడానికి ముఖ్య కారణం “తమ దగ్గర ఎంత ఎక్కువ ఆయుధ సంపత్తి ఉంటే, అంత ఎక్కువ భద్రత” అనే భావన అయి ఉండవచ్చు.
కావున 1880 నుండి 1914 వరకు ఆయుధ ఉత్పత్తి కొరకు అత్యధిక ధనాన్ని వినియోగించారని ఈ గ్రాఫ్ ద్వారా తెలుస్తున్నది.
ప్రశ్న 15.
రెండవ ప్రపంచయుద్ధ సమయంలో జర్మనీ సామ్రాజ్యంలోని దేశాలను పట సహాయంతో గుర్తించుము.
జవాబు: