Solving AP 10th Class Physical Science Model Papers Set 9 in Telugu Medium regularly is an effective strategy for time management during exams.
AP 10th Class Physical Science Model Paper Set 9 with Solutions in Telugu
Time: 2 Hours
Maximum Marks: 50
సూచనలు :
- ఈ ప్రశ్నాపత్రంలో 4 విభాగాలు మరియు 17 ప్రశ్నలు ఉండును.
- III వ విభాగం నందు కేవలం 12వ ప్రశ్నకు మాత్రమే మరియు IV వ విభాగం నందు గల అన్ని ప్రశ్నలకు అంతర్గత ఎంపిక కలదు.
- 2 గంటల సమయంలో, 15 నిమిషాల సమయం ప్రశ్నపత్రం చదువుటకై కేటాయింపబడినది.
- అన్ని సమాధానములు మీకివ్వబడిన సమాధాన పత్రంలోనే రాయవలెను.
- అన్ని సమాధానములు స్పష్టంగాను, గుండ్రంగాను రాయవలెను.
విభాగము – I 8 × 1 = 8 మా.
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 1 మార్కు.
ప్రశ్న 1.
కటక సామర్థ్యం, దాని ప్రమాణాలు రాయుము.
జవాబు:
- కటక నాభ్యంతరం యొక్క విలోమమును కటక సామర్థ్యం అంటారు. P = \(\frac{1}{f(\mathrm{~m})}=\frac{100}{f(\mathrm{~cm})}\)
- దీనిని డయాప్టర్ అనే ప్రమాణాలలో కొలుస్తారు.
ప్రశ్న 2.
సందిగ్ధ కోణంను నిర్వచింపుము.
జవాబు:
సాంద్రతర యానకం నుండి విరళ యానకంలోకి ప్రయాణించే కాంతి కిరణం ఏ పతనకోణం వద్ద యానకాలను విభజించే తలానికి సమాంతరంగా ప్రయాణిస్తుందో ఆ పతనకోణాన్ని ఆ రెండు యానకాలకు సంబంధించిన “సందిగ్ధ కోణం” అంటారు.
ప్రశ్న 3.
ఖనిజం మరియు ధాతువుల మధ్య తేడాలను తెలుసుకొనుటకు రెండు ప్రశ్నలను తయారు చేయుము.
జవాబు:
- ఖనిజం మరియు ధాతువులలో దేనినుండి లోహాన్ని లాభదాయకంగా సంగ్రహించవచ్చును?
- అన్ని ఖనిజాలు ధాతువులు అవుతాయా?
ప్రశ్న 4.
క్రింది పట్టికను పరిశీలించి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులిమ్ము.
1) పై పదార్థాలలో ఏది మంచి విద్యుద్వాహకం ?
2) పై పదార్థాలలో అర్ధవాహకం ఏది ?
జవాబు:
1) వెండి
2) సిలికాన్
ప్రశ్న 5.
మీథేన్ అణువు పటం గీయండి.
జవాబు:
ప్రశ్న 6.
నిజ జీవితంలో ఎస్టర్ల ఉపయోగాన్ని రాయండి.
జవాబు:
ఎస్టర్లను కృత్రిమ సౌందర్య లేపనాలలోను, ఎసెన్స్ తయారీలోనూ వినియోగిస్తారు.
ప్రశ్న 7.
క్రింది పట్టిక ఆధారంగా, ప్రశ్నలకు జవాబులివ్వండి.
మూలకం | ఎలక్ట్రాన్ విన్యాసం |
హైడ్రోజన్ | 1s1 |
క్లోరిన్ | 1s2 2s2 2p6 3s2 3p5 |
సోడియం | 1s2 2s2 2p6 3s1 |
నియాన్ | 1s2 2s2 2p6 |
1) పై మూలకాలలో ఏవి బంధాలను ఏర్పరచవు ?
2) సోడియం, క్లోరిన్ మధ్య ఎటువంటి బంధం ఏర్పడును ?
3) ఏయే మూలకాలు బంధాలను ఏర్పరిచినపుడు ఎలక్ట్రాన్లను బదిలీ చేస్తాయి ?
4) పై మూలకాలు కలసి ఏర్పరచే అణువుల పేర్లు కొన్నింటిని రాయండి.
జవాబు:
1) నియాన్
2) అయానిక బంధం
3) సోడియం
4) HCl, NaCl, H2, Cl2 మొ||
ప్రశ్న 8.
క్రింది పట్టికను గమనించండి.
పదార్దం | వక్రీభవన గుణకం | పదార్దం | వక్రీభవన గుణకం |
మంచు | 1.31 | బెంజీన్ | 1.5 |
నీరు | 1.33 | కార్బన్ డై సల్ఫైడ్ | 1.63 |
పై విలువల ఆధారంగా, ఏ పదార్థంలో కాంతి వేగం స్వల్పం ?
జవాబు:
యానకంలో కాంతివేగం దాని వక్రీభవన గుణకంకు విలోమానుపాతంలో ఉండును. పై పట్టిక నుండి కార్బన్ డై సల్ఫైడ్ నందు కాంతి వేగం స్వల్పం.
విభాగము – II 3 × 2 = 6 మా.
సూచనలు :
-
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 2 మార్కులు.
ప్రశ్న9.
ఆర్బిటాల్ అనగానేమి? బోర్ యొక్క కక్ష్యతో పోల్చినప్పుడు ఇది విధంగా భిన్నమైనది?
జవాబు:
- కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ను కనుగొనే సంభావ్యత అధికంగా గల ప్రాంతాన్ని ఆర్బిటాల్ అని అంటారు.
- వీటిని s, p, d, f లతో సూచిస్తారు.
- కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ తిరిగే మార్గాన్ని ఆర్బిట్ (కక్ష్య) అని అంటారు.
- దీనిని బోర్ K, L, M, N లతో సూచించాడు.
- ఎలక్ట్రాన్ ఆర్బిట్లో వృత్తాకార/దీర్ఘవృత్తాకారంలో తిరుగుతుంది. ఆ ఆర్బిట్లో తిరుగుతున్న ఎలక్ట్రాన్ను కనుగొనే ప్రదేశమే ఆర్బిటాల్.
ప్రశ్న10.
i) శుద్ధ జలం విద్యుత్ వాహకతను ఎందుకు ప్రదర్శించదు ?
ii) ప్లాస్టర్ ఆఫ్ పారిస్ను తడి లేని, గాలి సోకని పాత్రలో నిల్వ చేస్తారు. ఎందుకు ?
జవాబు:
i) శుద్ధజలంలో ఒక కోటి H2O అణువులతో, కేవలం ఒకటి మాత్రమే H3O+ అయాను గానో లేదా OH– అయాను గానో ఉండును. అనగా విద్యుత్ ప్రవాహానికి మోసుకు వెళ్ళటానికి ఎక్కువగా అయాన్లు లేవు. అందువల్ల శుద్ధజలం విద్యుత్ వాహకతను ప్రదర్శించదు.
శుద్ధ జలంలో ఎటువంటి మలినాలూ ఉండవు. అందువలన శుద్ధజలం విద్యుత్ వాహకతను ప్రదర్శించదు.
ii) ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తెల్లగా ఉండే చూర్ణ పదార్థం. దీనిని సాధారణ వాతావరణంలో ఉంచినపుడు వెంటనే తేమను గ్రహించి దృఢమైన ఘనపదార్థంగా మారును.
దీనినే జిప్సం అంటారు. అందువలన ప్లాస్టర్ ఆఫ్ పారిస్ను గాలి సోకని, తడి లేని పాత్రలలోనే నిల్వ చేస్తారు.
ప్రశ్న11.
వేసవి రోజుల్లో ఒక నిర్దిష్ట దిశలో చూస్తున్నప్పుడు కొన్ని సందర్భాలలో ‘ఆకాశం తెలుపురంగులో కనిపిస్తుంది. ఎందుకో
జవాబు:
ఊహించి రాయండి.
- వాతావరణంలో వివిధ పరిమాణాలు గల కణాలుంటాయి. వాటి పరిమాణాలకనుగుణంగా అవి వివిధ తరంగదైర్ఘ్యాలు గల కాంతిని పరిక్షేపణం చేస్తాయి.
- ఉదాహరణకు N2, O2 అణువుల కన్నా నీటి అణువు పరిమాణం ఎక్కువ. కాబట్టి అది నీలిరంగు కాంతి కంటే తక్కువ పౌనఃపున్యాలు (ఎక్కువ తరంగదైర్ఘ్యాల) గల కాంతులకు పరిక్షేపణ కేంద్రంగా పనిచేస్తుంది.
- వేసవి రోజుల్లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల వాతావరణంలోకి నీటి ఆవిరి చేరుతుంది.
- తద్వారా వాతావరణంలో నీటి అణువులు అధిక స్థాయిలో ఉంటాయి.
- ఈ నీటి అణువులు ఇతర పౌనఃపున్యాలు (నీలిరంగు కానివి) గల కాంతులను పరిక్షేపణం చేస్తాయి.
- N2, O2 ల పరిక్షేపణం వల్ల వచ్చే నీలిరంగుకాంతి, నీటి అణువుల పరిక్షేపణం వల్ల వచ్చే ఇతర రంగుల కాంతులు అన్నీ కలిసి మన కంటిని చేరినప్పుడు తెలుపు రంగు కాంతి కనబడుతుంది.
విభాగము – III 3 × 4 = 12 మా.
సూచనలు :
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 4 మార్కులు.
ప్రశ్న12.
ఈ క్రింది వాటిలో ఏదైనా ఒక పటం గీయండి :
a) క్రింది సందర్భాలలో కుంభాకార కటకం వలన ఏర్పడే ప్రతిబింబాలకు కిరణ చిత్రాలను గీయండి.
i) వస్తువును 2F2 మీద ఉంచినప్పుడు
ii) వస్తువును F2 కటకం మధ్య ఉంచినప్పుడు
జవాబు:
b) అమ్మోనియా అణువు, నీటి అణువు పటాలు గీయండి.
జవాబు:
అమ్మోనియా అణువు :
నీటి అణువు :
ప్రశ్న13.
ఒక పరమాణువులోని M – కర్పరంలో ఎలక్ట్రానులు K మరియు Lకర్పరంలోని ఎలక్ట్రానుల సంఖ్యకు సమానం అయిన ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలివ్వండి.
a) బాహ్య కర్పరం ఏది ?
b) దాని బాహ్యకర్పరంలో ఎన్ని ఎలక్ట్రానులు ఉంటాయి ?
c) ఆ పరమాణు సంఖ్య ఎంత ?
d) ఆ మూలకానికి ఎలక్ట్రాన్ విన్యాసం రాయండి.
జవాబు:
a) N కక్ష్య
b) రెండు
c) 22
d) \(\begin{gathered}
\mathrm{Ti} \\
\mathrm{Z}=22
\end{gathered}\) (టైటానియం) 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d2 8 [Ar] 4s2 3d2
ప్రశ్న14.
క్రింది లవణాల ఉపయోగాలు రాయండి.
i) బేకింగ్ సోడా
ii) వాషింగ్ సోడా
iii) బ్లీచింగ్ పౌడర్
iv) జిప్సం
జవాబు:
i) బేకింగ్ సోడా :
- ఆహారపదార్థాలు త్వరగా ఉడకడానికి
- ఏంటాసిడ్గాను
- పాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి
- అగ్నిమాపక యంత్రాలలో సోడా ఆమ్లంగాను
ii) వాషింగ్ సోడా :
- గాజు, సబ్బులు, కాగితం పరిశ్రమలలో ఉపయోగిస్తారు.
- బోరాక్స్ వంటి సోడియం సమ్మేళనాల తయారీకి ఉపయోగిస్తారు.
- గృహావసరాలలో వస్తువులను శుభ్రపరచడానికి ఉపయోగిస్తారు.
- నీటి యొక్క శాశ్వత కాఠిన్యతను తొలగించడానికి ఉపయోగిస్తారు.
iii) బ్లీచింగ్ పౌడర్ :
- వస్త్ర పరిశ్రమలలో కాటన్ మరియు కాగితాలను విరంజనం చెయ్యటానికి వాడతారు.
- అనేక రసాయన పరిశ్రమలలో దీనిని ఆక్సీకరణిగా వాడతారు.
- తాగే నీటిలోని క్రిములను సంహరించటానికి క్రిమిసంహారిణిగా వాడతారు.
- క్లోరోఫాం తయారీలో కారకంగా ఉపయోగిస్తారు.
iv) జిప్సం :
- దీనిని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తయారీలో ఉపయోగిస్తారు.
- పొలాలలో ఆమ్లత్వాన్ని తటస్థీకరించడానికి జిప్సం చల్లుతారు.
- ఇళ్లకు, షాపులకు సీలింగ్ చెయ్యటానికి జిప్సం షీట్లను విరివిగా వాడుచున్నారు.
విభాగము – IV 3 × 8 = 24 మా.
సూచనలు :
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 8 మార్కులు.
- ప్రతి ప్రశ్నకు అంతర్గత ఎంపిక కలదు.
ప్రశ్న15.
మూడు నిరోధాలను శ్రేణిలో కలిపినప్పుడు వాటి ఫలిత నిరోధాన్ని తెలుసుకొనుటకు ఒక సూత్రాన్ని ఉత్పాదించండి.
జవాబు:
శ్రేణి సంధానం : ఒక వలయంలో, చివరి నుండి – చివరికి కలిపిన నిరోధాల గుండా ఒకే విద్యుత్ ప్రవాహం ఒకే మార్గంలో ప్రవహిస్తున్నట్లయితే అవి శ్రేణి సంధానంలో ఉన్నాయంటాము.
- ‘V’ పొటెన్షియల్ భేదం ఉన్న ఘటాన్ని తీసుకొని శ్రేణి సంధానంలో ఉన్న మూడు నిరోధాలను పటంలో చూపిన విధముగా కలుపుము.
- నిరోధాలను శ్రేణిలో కలిపినప్పుడు విద్యుత్ ప్రవాహానికి ఒకటే మార్గం, కావున వలయంలో విద్యుత్ ప్రవాహం (I) ఒకటే ఉండును.
- శ్రేణిలో గల నిరోధాల వల్ల వలయంలో ఏర్పడే విద్యుత్ ప్రవాహానికి సమానమైన విద్యుత్ ప్రవాహాన్ని కలుగజేసే మరొక నిరోధంను ఆ నిరోధాల ఫలిత నిరోధం (Req) అంటాము.
- శ్రేణి సంధానంలో గల ఫలిత నిరోధం విలువను ఓమ్ నియమం ద్వారా Req = \(\) ⇒ V = IReq గా వ్రాయవచ్చును.
- R1, R2, R3, అను నిరోధాల చివరల యందు గల పొటెన్షియల్ భేదాలు వరుసగా V1, V2, V3 లు అయిన ఓమ్ నియమం ప్రకారము,
V1 = IR, ; V2 = IR2 మరియు V3 = IR3 - శ్రేణి సంధానంలో గల వేర్వేరు పొటెన్షియల్ భేదాల మొత్తం, వాటి ఫలిత పొటెన్షియల్ భేదానికి సమానం.
V = V1 + V2 + V3 …………….. (1) - V1, V2, V3 ల మరియు V విలువలను సమీకరణం (1) లో ప్రతిక్షేపించగా
I Req = IR1 + IR2 + IR3 I Req = I (R1 + R2 + R3)
Req = R1 + R2 + R3 + …………… + Rn
పై సమీకరణాన్ని బట్టి శ్రేణిలో కలిపిన నిరోధాల వల్ల ఏర్పడే ఫలిత నిరోధం, ఆయా విడివిడి నిరోధాల మొత్తానికి సమానము.
(లేదా)
a) క్రింది వాని మధ్య తేడాలు రాయండి.
i) ఉష్ణం మరియు ఉష్ణోగ్రత
ii) తుషారం మరియు పొగ మంచు
జవాబు:
i) ఉష్ణం మరియు ఉష్ణోగ్రత :
ఉష్ణ | ఉష్ణోగ్రత |
1) అధిక ఉష్ణోగ్రత ప్రాంతం నుండి అల్ప ఉష్ణోగ్రత ప్రాంతం వైపునకు ప్రవహించే శక్తి స్వరూపాన్ని ఉష్ణం అంటారు. | 1) చల్లదనం, వెచ్చదనం స్థాయిని ఉష్ణోగ్రత అంటారు. |
2) ఉష్ణం కారణం (Cause). | 2) ఉష్ణోగ్రత ఫలితం (Effect). |
3) ఉష్ణాన్ని కెలోరీమీటరుతో లెక్కిస్తారు. | 3) ఉష్ణోగ్రతను థర్మామీటరుతో లెక్కిస్తారు. |
4) S.I. యూనిట్ : జౌల్ | 4) S.I. యూనిట్ : కెల్విన్ |
ii) తుషారం మరియు పొగ మంచు
తుషారం (Dew) | పొగమంచు (Fog) |
1. ఉదయం లేదా సాయంత్రం సమయాలలో వివిధ ఉపరితలాలపై (ఆకులు, గడ్డి, మొక్కలు మొ॥) సాంద్రీకరణం చెందిన నీటి బిందువులను తుషారం అంటారు. | 1. పొగ వలె గాలిలో తేలియాడే నీటి బిందువులను పొగ మంచు అంటాం. |
2. తుషారం వస్తువులను కనబడనీయకుండా చేయదు. | 2. పొగమంచు మనకు దూరంగా ఉన్న వస్తువులను కనబడనీయకుండా చేస్తుంది. |
3. సాపేక్ష ఆర్ద్రత, ఉష్ణోగ్రత కన్నా ఎక్కువగా ఉన్నపుడు తుషారం ఏర్పడుతుంది. | 3. పరిసరాలలోని సముద్రాలు లేదా పెద్ద నీటి వనరుల ఉష్ణోగ్రత కన్నా భూ ఉష్ణోగ్రత అధికంగా ఉన్నపుడు పొగమంచు ఏర్పడుతుంది. |
b) క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
100°C వద్ద గల 1 గ్రా. నీటి ఆవిరి 0°C వద్ద గల మంచుగా మారడానికి ఎంత ఉష్ణం బదిలీ అవ్వాలి ?
జవాబు:
100°C వద్ద గల 1 గ్రా. నీటి ఆవిరి, 0°C వద్ద మంచుగా మారటానికి 520 కేలరీల శక్తి విడుదల అవ్వాలి.
వివరణ : నీటి ఆవిరి ద్రవ్యరాశి = 1 గ్రా.
నీటి ఆవిరి → నీరు → నీరు → మంచు
100°C → 100°C → 0°C → 0°C
100°C వద్దనున్న నీటి ఆవిరి, 100°C లోనున్న నీరుగా మారడానికి కావలసిన ఉష్ణరాశి
Q1 = mL = 1 × 540 = 540 కేలరీలు.
100°C వద్దనున్న నీరు, 0°C లోనున్న నీరుగా మారడానికి కావలసిన ఉష్ణరాశి
Q2 = mSΔT = 1 × 1 × (100 – 0) = 100 కేలరీలు.
0°C వద్దనున్న నీరు, 0°C లోనున్న మంచుగా మారడానికి కావలసిన ఉష్ణరాశి
Q3 = mL = 1 × 80 = 80 కేలరీలు.
మొత్తం వ్యవస్థలోని ఉష్ణరాశి Q = Q1 + 2 + Q3
= 540 + (100) + 80
= 720 కేలరీలు.
ప్రశ్న16.
సంకరీకరణం అనగానేమి ? సంకరీకరణం ఆధారంగా BF3 అణువు ఏర్పడే విధానాన్ని రాయండి.
జవాబు:
సంకరీకరణం : పరమాణువులు చివరి కక్ష్యలో ఉండే దాదాపు సమాన శక్తి గల పరమాణు ఆర్బిటాళ్ళు పరస్పరం కలిసిపోయి, పునర్వ్యవస్థీకరించబడడం ద్వారా అదే సంఖ్యలో బంధశక్తి, ఆకారం వంటి ధర్మాలు ఒకే విధంగా ఉండే . సర్వసమాన ఆర్బిటాళ్ళను ఏర్పరచే దృగ్విషయాన్ని సంకరీకరణం (hybridization) అంటారు.
సంకరీకరణము ఆధారంగా BF3 అణువు ఏర్పడుట :
- బోరాన్ పరమాణువు (5B) యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2px1.
- బోరాన్ పరమాణువు (5B) ఉత్తేజిత స్థితిలోనికి వెళ్ళినపుడు దాని ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s1 2px1 2py1 గా
మారుతుంది. - BF3 అణువులోని బోరాన్ పరమాణువు మూడు ఫ్లోరిన్ (9F) పరమాణువులతో కలిసి మూడు సమానమైన B-F బంధాలను ఏర్పరుస్తుంది.
- ఇలా జరగడానికి కారణం బోరాన్ ఉత్తేజిత స్థితిలో సంకరీకరణం చెందటం అని చెప్పవచ్చు.
- ఉత్తేజిత స్థితిలో ఉన్నప్పుడు బోరాన్ పరమాణువులో ఉండే 2s, 2px, 2py ఆర్బిటాళ్ళు పరస్పరం కలిసిపోయి, పునర్వ్యవస్థీకరణ వలన సర్వసమానమైన మూడు sp- సంకర ఆర్బిటాళ్ళుగా ఏర్పడతాయి.
- ఈ మూడు sp2 సంకర ఆర్బిటాళ్ళ మధ్య కనీస వికర్షణ ఉండటం వలన ఏ రెండు సంకర ఆర్బిటాళ్ళ మధ్యనైనా . బంధకోణం 120° ఉంటుంది.
- ప్రతి Sp2 సంకర ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది.
- ఫ్లోరిన్ ఎలక్ట్రాన్ విన్యాసం (9F) 1s22s22px2 2py2 2pz1అని మనకు తెలుసు.
- బోరాన్ యొక్క మూడు sp2 సంకర ఆర్బిటాళ్ళు, మూడు ఫ్లోరిన్ పరమాణువులలో ఉండే 2pz ఆర్బిటాళ్ళలోని ఒంటరి ఎలక్ట్రాన్లతో జతకూడి, మూడు σsp2 – p బంధాలను ఏర్పరుస్తాయి.
(లేదా)
ఆల్కేనులను పారాఫిన్లు అని ఎందుకు అంటారు? ఆల్కేనుల ప్రతిక్షేపణ చర్యలు రాయండి.
జవాబు:
a) పారాఫిన్లు అనే పదం parum = little; affins = affinity అనే పదాల నుండి వచ్చింది. దీని అర్థం చర్యాశీలత తక్కువ. ఆల్కేన్ల చర్యాశీలత తక్కువ. కావున ఆల్కేన్లను పారాఫిన్లు అంటారు.
b) ఆల్కేనుల ప్రతిక్షేపణ చర్యలు : ఒక రసాయన చర్యలో ఒక సమ్మేళనంలోని మూలకం లేక సమూహం, వేరొక మూలకం లేక సమూహం చేత ప్రతిక్షేపించబడితే దానిని ప్రతిక్షేపణ చర్య అంటారు. ఆల్కేన్లు ప్రతిక్షేపణ చర్యలో పాల్గొంటాయి.
ఉదా : సూర్యకాంతి సమక్షంలో మీథేన్ క్లోరిన్తో చర్య జరిపి మీథేన్ లోని అన్ని హైడ్రోజన్ పరమాణువులు క్లోరిన్ చేత వరుసగా ప్రతిక్షేపించబడతాయి.
ప్రశ్న17.
కటక నాభ్యంతరాన్ని U, V పద్ధతిలో ఎలా కనుగొంటారో రాయండి.
జవాబు:
ఉద్దేశ్యం : కుంభాకార కటక నాభ్యంతరమును UV పద్ధతిలో కనుగొనుట.
కావలసిన పరికరాలు : టేబుల్, V – స్టాండ్, కుంభాకార కటకం, మీటరు స్కేలు, కొవ్వొత్తి (వస్తువు), తెర.
పద్ధతి : ఉజ్జాయింపుగా కటక నాభ్యంతరంను కనుగొనుట :
- కటకంను V – స్టాండుపై ఉంచుము.
- కటకంకు చాలా దూరంగా కటక ప్రధానాక్షంపై వెలుగుతున్న కొవ్వొత్తి నుంచుము.
- కటకంకు రెండోవైపున కొవ్వొత్తి ప్రతిబింబంను తెరపై ఏర్పడునట్లు అమర్చుము.
- ఇప్పుడు కటకం నుండి ప్రతిబింబానికి గల దూరంను కొలిచిన మనకు ఉజ్జాయింపు కటక నాభ్యంతరం తెలియును.
ప్రయోగ లెక్కింపు పద్ధతి (లేదా) u – v పద్ధతి :
- ఈ పద్ధతిలో కొవ్వొత్తిని కటకంకు 60 సెం.మీ. దూరంలో కటక ప్రధానాక్షంపై ఉంచుము.
- కటకమునకు మరోవైపున తెరపై స్పష్టమైన ప్రతిబింబాన్ని ఏర్పరచు స్థానంలో ఉంచుము.
- ఇపుడు ప్రతిబింబ దూరము (v) ను కొలువుము.
- ఈ విధంగా వస్తువును కటకమునకు 50 సెం.మీ., 40 సెం.మీ., 30 సెం.మీ. మొ॥గు దూరాలలో ఉంచుతూ, ప్రతి సందర్భంలో ప్రతిబింబదూరం (v) ను కొలువుము.
- పైన పొందిన U,V విలువలను పట్టికలో నమోదు చేయుము.
వస్తు దూరం (u) | ప్రతిబింబ దూరం (v) | నాభ్యంతరం (f) |
6) u, v విలువల నుండి f = \(\frac{u v}{u+v}\) ద్వారా కటక నాభ్యంతరంను లెక్కించి ప్రతి సందర్భంలోనూ స్థిరమని గమనించుము.
మరొక పద్ధతి :
- కుంభాకార కటకాన్ని సూర్యునికి అభిముఖంగా ఉంచండి.
- కటకానికి రెండోవైపు ఒక తెరని అమర్చి, ఆ తెరను కటకం వద్ద నుండి మెల్లగా వెనుకకు జరుపుతూ తెరపై ఎక్కడ ప్రకాశవంతమైన, దాదాపు బిందురూపంలో ఉండే సూర్యుని ప్రతిబింబం ఏర్పడుతుందో గుర్తించండి. కటకంపైన పడిన సూర్యకిరణాలన్నీ ఒక చోట కేంద్రీకరింపబడటం వలన ఇలా జరుగుతుంది.
- ఇప్పుడు కటకం నుండి తెరకు గల దూరాన్ని కొలవండి. ఈ విలువే కటక నాభ్యంతరం అవుతుంది.
(లేదా)
తటస్థీకరణ చర్యలు అనగానేమి? ఒక కృత్యం ద్వారా వివరించండి.
జవాబు:
క్షారంతో ఒక ఆమ్లం చర్య జరిపి లవణాన్ని, నీటిని ఏర్పరచే చర్యను తటస్థీకరణ చర్య అంటారు. సాధారణంగా తటస్థీకరణ చర్యను ఈ కింది విధంగా రాయవచ్చు.
ఆమ్లం + క్షారం → లవణం + నీరు
ఆమ్లం – క్షారం తటస్థీకరణ చర్య :
- శుభ్రపరచిన పరీక్షనాళికలో 2 మి.లీ. సజల NaOH ద్రావణాన్ని తీసుకొని దానికి ఒక చుక్క ఫినాఫ్తలీన్ ద్రావణాన్ని కలపండి. ద్రావణం పింక్ రంగులోకి మారుతుంది.
- ఈ రంగు ద్రావణానికి సజల HCl ద్రావణాన్ని చుక్కలుగా కలుపుతూ మార్పులను గమనించండి. ద్రావణం రంగు పోవడం గమనించవచ్చు. ఈ మిశ్రమానికి మరలా ఒకటి లేదా రెండు చుక్కలు NaOH ను కలపండి.
- ద్రావణం పింక్ రంగులోకి మారుతుంది.
- పై కృత్యంలో పరీక్షనాళికలోని ద్రావణానికి HCl ద్రావణాన్ని కలిపినపుడు ఆ ద్రావణం పింక్ రంగును కోల్పోతుంది. 5) దీనికి కారణం ద్రావణంలోని HClతో NaOH పూర్తిగా చర్యనొందడం. ఈ చర్యలో క్షారం యొక్క ప్రభావం ఆమ్లం చేత తటస్థీకరించబడుతుంది.
- ఈ స్థితిలో ఉన్న ద్రావణానికి కొన్ని చుక్కల NaOH ద్రావణంను కలిపితే ఆ ద్రావణం తిరిగి క్షార లక్షణాన్ని పొంది మరలా పింక్ రంగులోనికి మారుతుంది.
NaOH + HCl → NaCl + H2O