AP 10th Class Physical Science Model Paper Set 8 with Solutions in Telugu

Solving AP 10th Class Physical Science Model Papers Set 8 in Telugu Medium regularly is an effective strategy for time management during exams.

AP 10th Class Physical Science Model Paper Set 8 with Solutions in Telugu

Time: 2 Hours
Maximum Marks: 50

సూచనలు :

  1. ఈ ప్రశ్నాపత్రంలో 4 విభాగాలు మరియు 17 ప్రశ్నలు ఉండును.
  2. III వ విభాగం నందు కేవలం 12వ ప్రశ్నకు మాత్రమే మరియు IV వ విభాగం నందు గల అన్ని ప్రశ్నలకు అంతర్గత ఎంపిక కలదు.
  3. 2 గంటల సమయంలో, 15 నిమిషాల సమయం ప్రశ్నపత్రం చదువుటకై కేటాయింపబడినది.
  4. అన్ని సమాధానములు మీకివ్వబడిన సమాధాన పత్రంలోనే రాయవలెను.
  5. అన్ని సమాధానములు స్పష్టంగాను, గుండ్రంగాను రాయవలెను.

విభాగము – I 8 × 1 = 8 మా.

  1. అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
  2. ప్రతి ప్రశ్నకు 1 మార్కు.

ప్రశ్న 1.
మిశ్రమాల పద్ధతి సూత్రాన్ని రాయుము.
జవాబు:
వేడి వస్తువులు కోల్పోయిన ఉష్ణం = చల్లని వస్తువులు గ్రహించిన ఉష్ణం.

ప్రశ్న 2.
క్రింది ప్రమేయ సమూహాల పేర్లు రాయండి.
1) – CHO
2) AP 10th Class Physical Science Model Paper Set 8 with Solutions in Telugu 1
జవాబు:
1) – CHO ప్రమేయ సమూహం పేరు – ఆల్డిహైడ్
2) AP 10th Class Physical Science Model Paper Set 8 with Solutions in Telugu 1 ప్రమేయ సమూహం పేరు – కీటోన్

ప్రశ్న 3.
భావన (A) : నీటిలో ఉన్న చేపకు ఒడ్డున ఉన్న మనిషి అతని వాస్తవ ఎత్తు కంటే ఎక్కువ ఎత్తుగా కనిపిస్తాడు.
కారణం (R) : నీటి నుండి వచ్చే కాంతికిరణం గాలిలోకి ప్రవేశించేటప్పుడు లంబానికి దూరంగా విచలనమవుతుంది. కింది వాటిలో ఏది సరియైనది ? వివరించండి.
a) A, R లు రెండూ సరియైనవి. మరియు A కు R సరైన వివరణ.
b) A, R లు రెండూ సరియైనవి. కానీ A కు R సరైన వివరణ కాదు.
c) A సరియైనది. R సరియైనది కాదు.
d) A, R లు రెండూ సరైనవి కావు.
e) A సరైనది కాదు. కానీ R సరియైనది.
జవాబు:
‘c’ సరియైన సమాధానము.
వివరణ :

  1. కాంతి విరళ యానకం నుండి సాంద్రతర యానకంలోకి ప్రయాణించునపుడు లంబానికి దగ్గరగా వంగును.
  2. ఈ లక్షణం వలన చేపకు వాస్తవ ఎత్తు కంటే ఎక్కువ ఎత్తుగా మనిషి కనిపిస్తాడు.

ప్రశ్న 4.
క్రింది దత్తాంశాన్ని పరిశీలించి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయుము.
AP 10th Class Physical Science Model Paper Set 8 with Solutions in Telugu 2
1) పై లోహాలలో ఏవి ప్రకృతిలో లోహ స్థితిలో లభిస్తాయి ?
2) Mg లోహాన్ని ఏ పద్ధతిలో శుద్ధి చేస్తారు ?
జవాబు:
1) Ag, Au
2) విద్యుద్విశ్లేషణ పద్ధతిలో

ప్రశ్న 5.
వాహకాల యొక్క V – I గ్రాఫు ఆకృతిని గీయుము.
జవాబు:
AP 10th Class Physical Science Model Paper Set 8 with Solutions in Telugu 3

AP 10th Class Physical Science Model Paper Set 8 with Solutions in Telugu

ప్రశ్న 6.
ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణకు రెండు అనువర్తనాలను రాయండి.
జవాబు:

  1. అయస్కాంత పట్టీగల ATM కార్డు పని చేయుట.
  2. సెక్యూరిటీ అలారమ్లు (3) ఇండక్షన్ స్టవ్.

ప్రశ్న 7.
క్రింది ఇవ్వబడిన పట్టికను పూర్తిచేసి రాయండి.

వస్తువు స్థానం ప్రతిబింబ స్థానం ప్రతిబింబ స్వభావం
2F2 కి వెలుపల క్షీణించిన, నిజ, తలక్రిందులు
2F2 వద్ద
నాభికి, కటకానికి మధ్య కటకంలో కనిపించును

జవాబు:

వస్తువు స్థానం ప్రతిబింబ స్థానం ప్రతిబింబ స్వభావం
2F2 కి వెలుపల F1, 2F1 ల మధ్య క్షీణించిన, నిజ, తలక్రిందులు
2F1 వద్ద 2F2 వద్ద సమాన పరిమాణం, నిజ, తలకిందులు
నాభికి, కటకానికి మధ్య కటకంలో కనిపించును ఆవర్ధనం చెందిన, మిథ్యా, నిటారు

ప్రశ్న 8.
అధిక చర్యాశీలత గల లోహాల నిష్కర్షణకు ఏ పద్ధతిని సూచిస్తావు ? ఎందుకు ?
జవాబు:

  1. అధిక చర్యాశీలతగల లోహాల నిష్కర్షణకు అత్యంత మేలైన పద్ధతి విద్యుత్ విశ్లేషణ.
  2. సాధారణ క్షయకరణ పద్ధతులైన వేడి చేయటం వంటి పద్ధతులలో, చాలా ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే క్షయకరణం సాధ్యపడుతుంది. దీనికి ఎక్కువ ఖర్చు కూడా అవుతుంది.

విభాగము – II 3 × 2 = 6 మా.

సూచనలు :

  1. అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
  2. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు.

ప్రశ్న 9.
“ఎలక్ట్రాన్ ‘3p’ ఆర్బిటాల్ నిండిన తర్వాత ‘3d’ లోకి కాకుండా ‘4s’ లోకి వెళ్తుంది.” దీనికి గల కారణం వివరించండి.
జవాబు:
(n + l) విలువల ఆధారంగా 3d ఆర్బిటాల్ శక్తి విలువ 3 + 2 = 5. 4s ఆర్బిటాల్ శక్తి విలువ 4 + 0 = 4. 3d ఆర్బిటాల్ కన్నా 4s ఆర్బిటాల్ శక్తి తక్కువ. ఆఫ్భ నియమం ప్రకారం ఎలక్ట్రాన్ తక్కువ శక్తి గల ఆర్బిటాల్లోకి ముందుగా చేరుతుంది. కనుక 3p ఆర్బిటాల్ నిండిన తర్వాత ఎలక్ట్రాన్ ‘3d’ లోకి కాకుండా 4s లోకి వెళ్తుంది.

ప్రశ్న 10.
బల్బులో ఫిలమెంట్ తయారీకి టంగ్స్టన్ను వినియోగించడానికి గల కారణాలను ఊహించి రాయండి.
జవాబు:

  1. సాధారణంగా విద్యుత్ బల్బులో వాడే ఫిలమెంట్ను “టంగ్స్టన్” తో తయారుచేస్తారు.
  2. దీనికి కారణం, టంగ్స్టన్ విశిష్ట నిరోధం, ద్రవీభవన స్థానం విలువలు చాలా ఎక్కువ.
  3. విశిష్ట నిరోధం ఎక్కువగా గల లోహాలు మంచి విద్యుత్ నిరోధాలుగా పని చేస్తాయి. కనుకనే టంగ్స్టన్ వంటి లోహాలను ఫిలమెంట్ల తయారీకి ఉపయోగిస్తాము.

ప్రశ్న 11.
దండాయస్కాంతం వలన ఏర్పడిన బలరేఖలు సంవృతాలు అని తెలుపుటకు కొన్ని ప్రశ్నలను తయారు చేయుము.
జవాబు:

  1. దండాయస్కాంతం బల రేఖలు ఏ దిశనుండి ఏ దిశకు వెళ్తున్నాయి ?
  2. సాలినాయిడ్ గుండా విద్యుత్ను పంపినపుడు ఎటువంటి ఆకారంలో బలరేఖలు ఏర్పడినాయి ?
  3. సాలినాయిడ్ వలన ఏర్పడిన బలరేఖలు సంవృతాలు అయితే, దండాయస్కాంత బలరేఖలు ఏమై వుంటాయి ?
  4. విద్యుత్ పంపిన సాలినాయిడ్ మరియు దండాయస్కాంత బలరేఖలు ఒకేలా వున్నాయా ?

AP 10th Class Physical Science Model Paper Set 8 with Solutions in Telugu

విభాగము – III 3 × 4 = 12 మా.

సూచనలు :

  1. అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
  2. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు.

ప్రశ్న 12.
ఈ క్రింది వాటిలో ఏదైనా ఒక పటం గీయండి :
a) మాయిలర్ చిత్రాన్ని గీయండి.
జవాబు:
AP 10th Class Physical Science Model Paper Set 8 with Solutions in Telugu 4

b) మానవుని కంటి నిర్మాణము పటము గీసి, భాగాలను గుర్తించండి.
జవాబు:
AP 10th Class Physical Science Model Paper Set 8 with Solutions in Telugu 5

ప్రశ్న 13.
కొన్ని పదార్థాల (ఆమ్ల / క్షార / తటస్థ)కు మరియు సూచికలకు మధ్య జరిగే చర్యల ఫలితాలకు సంబంధించి క్రింద ఇవ్వబడిన పట్టికను పూర్తిచేయండి.

సూచిక → పదార్థం ↓ నీలి లిట్మస్ పేపర్ ఎరుపు లిట్మస్ పేపర్ మిథైల్ ఆరెంజ్ ద్రావణం ఫినాఫ్తలీన్ ద్రావణం
HCl చర్యలేదు
NaOH పసుపురంగుకు మారును
టమాట రసం చర్య లేదు
సబ్బునీరు నీలిరంగు మారును

జవాబు:
AP 10th Class Physical Science Model Paper Set 8 with Solutions in Telugu 6
AP 10th Class Physical Science Model Paper Set 8 with Solutions in Telugu 7

ప్రశ్న 14.
i) ఒక ఇంటిలో మూడు బల్బులు, రెండు ఫ్యాన్లు, ఒక టెలివిజన్ ను వాడుతున్నారు. ప్రతి బల్బు 40 W విద్యుత్ను వినియోగిస్తుంది. టెలివిజన్ 60 W, ఫ్యాన్ 80 W విద్యుత్ను వినియోగిస్తున్నాయి. సుమారు ప్రతి బల్బును ఐదు గంటలు, ప్రతి ఫ్యానును 12 గంటలు, టెలివిజన్ ను 5 గంటల చొప్పున ప్రతిరోజు వినియోగిస్తున్నారు. ఒక యూనిట్ (KWH) కు 3 రూ. చొప్పున విద్యుత్ ఛార్జీ వేస్తే 30 రోజుల్లో చెల్లించాల్సిన సొమ్ము ఎంత ?
జవాబు:

  1. 40 W ల 3 బల్బులు రోజుకి 5 గం॥ల చొప్పున వినియోగించు విద్యుత్ శక్తి = 3 × 40 × 5 = 600 WH
  2. 80 W ల 2 ఫ్యానులు రోజుకి 12 గం॥ల చొప్పున వినియోగించు విద్యుత్ శక్తి = 2 × 80 × 12 = 1920 WH
  3. 60 W ల టెలివిజన్ రోజుకు 5 గం॥ల చొప్పున వినియోగించు విద్యుత్ శక్తి = 1 × 60 × 5 = 300 WH
    1 రోజుకు వినియోగించిన మొత్తం విద్యుత్ శక్తి = 600 + 300 + 1920 = 2,820 WH
    WHను KWH లోకి మార్చగా
    \(\frac{2820}{1000}\) = 2.82 KWH
    30 రోజులలో వాడిన విద్యుత్ శక్తి = 2.82 × 30 = 84.6 KWH
    1 యూనిట్ (KWH) ధర = ₹ 3.00
    84.6 యూనిట్లకు చెల్లించవలసిన సొమ్ము = 84.6 × ₹ 253.80

ii) ఒక విద్యుత్ వలయంలో 12 V బ్యాటరీకి 4Ω, 12Ω ల నిరోధాలను సమాంతరంగాను, దీనికి 3Ω ల నిరోధమును శ్రేణిలోను కలుపబడ్డాయి. ఈ దత్తాంశానికి సరిపడు విద్యుత్ వలయాలు గీయండి. ఈ వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని కనుగొనండి.
జవాబు:
AP 10th Class Physical Science Model Paper Set 8 with Solutions in Telugu 8
4Ω, 12Ω ల సమాంతర సంధానం వల్ల ఫలిత నిరోధం
\(\frac{1}{\mathrm{R}}\) = \(\frac{1}{R_1}\) = \(\frac{1}{R_2}\)
\(\frac{1}{\mathrm{R}}\) = \(\frac{1}{4}\) + \(\frac{1}{12}\) ⇒ \(\frac{1}{\mathrm{R}}\) = \(\frac{3+1}{12}\)
∴ \(\frac{1}{\mathrm{R}}\) = \(\frac{4}{12}\) R = \(\frac{12}{4}\)
∴ R = 3Ω
మొత్తం వలయం ఫలిత నిరోధం :
R = R1 + R2 ⇒ R = 3 + 3 = 6
∴ R = 6Ω
వలయంలో విద్యుత్ ప్రవాహం :
I = \(\frac{V}{R}\) ⇒ I = \(\frac{12}{6}\)
∴ I = 2A

AP 10th Class Physical Science Model Paper Set 8 with Solutions in Telugu

విభాగము – IV 3 × 8 = 24 మా.

సూచనలు :

  1. అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
  2. ప్రతి ప్రశ్నకు 8 మార్కులు.
  3. ప్రతి ప్రశ్నకు అంతర్గత ఎంపిక కలదు.

ప్రశ్న 15.
i) దీర్ఘ దృష్టి లోపాన్ని సవరించే విధానాన్ని రాయండి.
జవాబు:

  • దీర్ఘదృష్టి గల వ్యక్తి దూరంలో వున్న వస్తువులను స్పష్టంగా చూడగలడు. కానీ దగ్గరి వస్తువులను చూడలేడు.
  • దీనికి గల కారణము కంటి కటక కనిష్ఠ నాభ్యంతరం 2.27 సెం.మీ. కన్నా ఎక్కువగా ఉండడమే.

AP 10th Class Physical Science Model Paper Set 8 with Solutions in Telugu 9

  • పై పటంలో చూపినట్లుగా ఈ సందర్భంలో దగ్గరలోని వస్తువు నుండి వచ్చే కాంతి కిరణాలు కంటి కటకం ద్వారా వక్రీభవనం చెంది ప్రతిబింబం రెటీనాకు ఆవల ఏర్పడుతుంది.
  • వస్తువు కనిష్ఠ దూర బిందువుకు ఆవల ఉంటే, కంటి కటకం రెటీనాపై ప్రతిబింబాన్ని ఏర్పరచగలదు.

AP 10th Class Physical Science Model Paper Set 8 with Solutions in Telugu 10

  • కనుక దీర్ఘదృష్టిని నివారించడానికి ద్వికుంభాకార కటకాన్ని ఉపయోగించాలి.
  • ఈ కటకం వలన ఏర్పడే ప్రతిబింబం కంటి కటకానికి వస్తువుగా పనిచేస్తుంది.
  • అందువలన చివరకు కంటి కటకం వలన ఏర్పడే ప్రతిబింబం పటంలో చూపినట్లుగా రెటీనాపై ఏర్పడును.

ii) దీర్ఘ దృష్టి గల వ్యక్తికి 100 సెం.మీ. నాభ్యంతరం గల కటకాన్ని వాడమని డాక్టర్ సలహా ఇచ్చారు. ఆ కటక నాభ్యంతరం మరియు కటక సామర్థ్యం కనుగొనండి.
సాధన:
d = 1 మీ = 100 సెం.మీ.
వాడే కటకం కుంభాకార కటకం
AP 10th Class Physical Science Model Paper Set 8 with Solutions in Telugu 11
(లేదా)

క్రింది ఇవ్వబడిన వానిని నిర్వచించండి.
i) ద్రవీభవన గుప్తోష్ణం
ii) భాష్పీభవన గుప్తోష్టం
iii) విశిష్టోష్ణం
iv) ఉష్ణ సమతాస్థితి
జవాబు:
i) ద్రవీభవన గుప్తోష్ణం : స్థిర ఉష్ణోగ్రత వద్ద 1గ్రాం. ఘన పదార్థం పూర్తిగా ద్రవంగా మారడానికి కావలసిన ఉష్ణాన్ని “ద్రవీభవన గుప్తోష్టం” అంటారు.

  • m ద్రవ్యరాశి గల ఘన పదార్థం ద్రవంగా మారడానికి ‘Q’ కెలోరీల ఉష్ణం అవసరం అనుకుందాం. 1 గ్రాం ద్రవ్యరాశి గల ఘన పదార్థం ద్రవంగా మారడానికి కావలసిన ఉష్ణం \(\frac{Q}{M}\) అవుతుంది.
  • ద్రవీభవన గుప్తోష్ణం L = \(\frac{Q}{M}\)
  • మంచు ద్రవీభవన గుప్తోష్ణం విలువ 80 కెలోరీలు / గ్రాం.

ii) బాష్పీభవన గుప్తోష్ణం : నీరు ద్రవ స్థితి నుండి వాయుస్థితికి మారడానికి వినియోగింపబడే ఉష్ణాన్ని “బాష్పీభవన గుప్తోష్టం” అంటారు.

  • బాష్పీభవన గుప్తోషాన్ని ‘L’ తో సూచిస్తారు.
  • L = \(\frac{Q}{M}\)
  • నీటి బాష్పీభవన గుప్తోష్టం విలువ 540 కెలోరీలు / గ్రాం.

iii) విశిష్టోష్ణం : ఏకాంక ద్రవ్యరాశి గల పదార్థ ఉష్ణోగ్రతను ఒక డిగ్రీ పెంచడానికి కావలసిన ఉష్ణరాశిని ఆ పదార్థ విశిష్టోష్టం అంటారు.
CGS ప్రమాణాలు : Cal/g°C
SI ప్రమాణాలు : J/kg-K

iv) ఉష్ణ సమతాస్థితి : అధిక, అల్ప ఉష్ణోగ్రతలున్న రెండు వస్తువులు ఒకదానితో ఒకటి తాకుతున్నప్పుడు రెండు వస్తువుల ఉష్ణోగ్రతలు సమానం అయ్యే వరకు ఉష్ణ ప్రసారం జరుగును. ఇప్పుడు రెండు వస్తువులు ఉష్ణ సమతాస్థితిలో ఉంటాయి. ఉష్ణ సమతాస్థితి అంటే ఒక వస్తువు ఉష్ణం బయటకు ఇవ్వలేని, స్వీకరించలేని స్థితి.

ప్రశ్న 16.
sp2 సంకరీకరణాన్ని ఉదాహరణలతో వివరించండి.
జవాబు:
sp2 సంకరీకరణానికి ఉదాహరణ ఈథేన్.

  1. ఉత్తేజిత స్థాయిలో కార్బన్ ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s1 2px1 2py1 2pz1.
  2. రెండు కర్బన పరమాణువులు ఒక s మరియు రెండు p ఆర్బిటాళ్ళు కలిసి మూడు sp2 ఆర్బిటాళ్ళను ఏర్పరుస్తాయి.
  3. ప్రతి కార్బన్ పరమాణువుపై అసంకరీకరణ Pz ఆర్బిటాల్ మిగిలిపోతుంది.
  4. ఒక్కొక్క ఎలక్ట్రాన్ కలిగిన మూడు sp2 ఆర్బిటాళ్ళు కేంద్రకం చుట్టూ 120° కోణంతో వేరు చేయబడతాయి.
  5. రెండు కర్బన పరమాణువుల ఒక్కొక్క sp2 ఆర్బిటాళ్ళు అంత్య అతిపాతం చెందడం వల్ల సిగ్మా బంధాన్ని ఏర్పరుస్తాయి.
  6. ప్రతి కర్బన పరమాణువు యొక్క మిగిలిన రెండు sp’ ఆర్బిటాళ్ళు ఒంటరి ఎలక్ట్రానులు కలిగిన రెండు హైడ్రోజన్ పరమాణువులతో అంత్య అతిపాతం చెందుతాయి.
  7. అసంకరీకరణ P ఆర్బిటాళ్ళు పార్శ్వ అతిపాతం చెంది గా బంధాన్ని ఏర్పరుస్తాయి.
  8. కావున ఈథీన్లో కార్బన్ పరమాణువుల మధ్య 1 సిగ్మా మరియు 1 పై బంధం ఏర్పడుతుంది.

AP 10th Class Physical Science Model Paper Set 8 with Solutions in Telugu 12
(లేదా)

మూలకాల వర్గీకరణ నియమం పరమాణు ద్రవ్యరాశుల నుండి పరమాణు సంఖ్యలకు ఎందుకు మారింది? వివరించండి.
జవాబు:

  1. 18వ శతాబ్దంలో లూయీస్ ప్రాస్ట్ హైడ్రోజన్ పరమాణువును ఒక నిర్మాణాత్మక ప్రమాణమని తెలిపాడు.
  2. ప్రాస్ట్ కాలంలోనే అన్ని మూలకాల పరమాణుభారాలను పూర్ణాంక సంఖ్యలుగా తెలుపబడ్డాయి.
  3. క్రీ.శ. 1829లో డాబరీనర్ అను జర్మన్ రసాయన వేత్త పరమాణు భారాలను ఆధారముగా చేసుకొని త్రిక సిద్ధాంతంను ప్రతిపాదించెను.
  4. క్రీ.శ. 1865లో జాన్ న్యూలాండ్స్ పరమాణుభారాలను ఆధారముగా చేసుకుని అష్టక నియమమును ప్రతిపాదించెను.
  5. కానీ ఈ అష్టక నియమము కాల్షియం కంటే ఎక్కువ పరమాణు ద్రవ్యరాశి ఉన్న మూలకాలకు వర్తించలేదు.
  6. ఆ తర్వాత మెండలీవ్ అను రష్యన్ శాస్త్రవేత్త మూలకాల పరమాణు ద్రవ్యరాశులను ఆరోహణ క్రమంలో అమర్చి ఒక పట్టికను రూపొందించారు.
  7. మెండలీవ్ ఆవర్తన నియమమును పరమాణుభారాల ఆధారంగా ప్రతిపాదించాడు.
  8. ఆ తర్వాత క్రీ.శ. 1913లో బ్రిటీష్ శాస్త్రవేత్త అయిన మోస్లే X – కిరణ స్వభావాన్ని విశ్లేషించి, మూలక పరమాణువులలో ఉండే పరమాణు సంఖ్యను కనుగొన్నాడు.
  9. దీనినిబట్టి ఏదైనా మూలకానికి పరమాణువుల ద్రవ్యరాశి కన్నా పరమాణు సంఖ్యయే విలక్షణమైన ధర్మమని మోస్లే ప్రతిపాదించాడు.
  10. పరమాణు సంఖ్యలను తెలుసుకున్న తర్వాత ఆవర్తన పట్టికలో పరమాణు సంఖ్యల ఆధారంగా మూలకాలను అమర్చడం జరిగినది.
  11. ఈ అమరిక ఇంతకు మునుపు అనుసరించిన పద్ధతి కన్నా మేలైనదిగా గుర్తించాడు.
  12. పరమాణుభారం అనే భావన నుండి పరమాణు సంఖ్య భావనకు ఆవర్తన నియమం మార్చబడి, నవీన ఆవర్తన నియమంగా పిలువబడుతుంది.

AP 10th Class Physical Science Model Paper Set 8 with Solutions in Telugu

ప్రశ్న 17.
బాష్పీభవనం అనేది ద్రవ ఉపరితలం, పరిసరాలలో ఉన్న గాలిలోని ద్రవ బాష్పం వంటి అంశాలపై ఆధారపడుతుందని నిరూపించడానికి ఒక ప్రయోగాన్ని రాయండి.
జవాబు:

  1. ఒక పరీక్షనాళిక, పింగాణీ పాత్రలో విడివిడిగా 5 మి.లీ. నీటిని తీసుకోండి.
  2. రెండింటిని తిరుగుతున్న ఫ్యాన్ క్రింద ఉంచండి.
  3. మరొక పింగాణీ పాత్రలో 5 మి.లీ. నీటిని తీసుకొని దానిని బీరువాలో ఉంచండి.
  4. గది ఉష్ణోగ్రతను నమోదు చెయ్యండి.
  5. మూడు సందర్భాలలో నీరు బాష్పీభవనానికి పట్టిన కాలాన్ని నమోదు చెయ్యండి.
  6. వర్షం కురిసిన రోజున కూడా ఇదే కృత్యం నిర్వహించండి. పరిశీలన నమోదు చెయ్యండి.
  7. ఫ్యాన్ క్రింద ఉంచిన పింగాణీ పాత్రలో నీరు బాష్పీభవనం చెందటం మనం గమనిస్తాం.
  8. కారణం పరీక్షనాళిక కంటే పింగాణీ పాత్ర యొక్క ఉపరితల వైశాల్యం ఎక్కువ.
  9. బాష్పీభవనం ఉపరితల దృగ్విషయం. ఉపరితల వైశాల్యం పెరిగితే ఎక్కువ కణాలు బాష్పంగా మారే అవకాశం ఏర్పడుతుంది.
  10. బాష్పీభవనం మరొక అంశం ఆర్ధత.
  11. గాలిలోని తేమశాతాన్ని ఆర్ద్రత అంటారు.
  12. పరిసరంలోని గాలి నిర్దిష్ట పరిమాణం మేరకు మాత్రమే నీటి బాష్పాన్ని నిలిపి ఉంచుకోగలుగుతుంది.
  13. గాలిలో నీటి బాష్పం అనగా అర్ద్రత ఎక్కువ ఉంటే బాష్పీభవన వేగం తగ్గుతుంది.
  14. ఇందువల్ల తడిబట్టలు వర్షాకాలంలో నెమ్మదిగానూ, గాలి వేగంగా వీచే రోజులలో వేగంగానూ ఆరతాయి.

(లేదా)

సాంద్రతర యానకం నుండి విరళయానకంలోకి కాంతి ప్రయాణించినప్పుడు, పతన కోణం కన్నా వక్రీభవన కోణం విలువ ఎక్కువని ప్రయోగపూర్వకంగా ఎలా సరిచూస్తారు?
జవాబు:
ఉద్దేశ్యం : సాంద్రతర యానకం నుండి విరళ యానకంలోకి కాంతి ప్రయాణించినప్పుడు లంబానికి దూరంగా
వంగుతుందని లేదా r > i అగునని నిరూపించుట.
కావలసిన పరికరాలు : కోణమాని, రెండు స్ట్రాలు, నీరు.

నిర్వహణ పద్ధతి :

  • ఒక వృత్తాకారపు కోణమానిని తీసుకొని దానిపై కేంద్రం వద్ద రెండు ‘స్ట్రా’లను, కేంద్రం చుట్టూ సులభంగా తిరిగేటట్లు అమర్చండి.
  • ఒక స్ట్రాను 10° కోణరేఖ వెంబడి అమర్చుము.
  • ఈ కోణమానిని పటం (బి) లో చూపినట్లు పారదర్శక పాత్రలో గల నీటిలో సగం వరకు ముంచుము.
  • కోణమానిని నీటిలో ముంచినపుడు 10° కోణరేఖ వద్ద ఉంచిన స్ట్రా నీటిలో మునిగి ఉండేటట్లు జాగ్రత్త వహించాలి.
  • పాత్ర పై భాగం నుండి నీటిలో మునిగి ఉన్న స్ట్రాను చూస్తూ, నీటి బయట ఉన్న స్ట్రాను లోపల ఉన్న స్ట్రాతో సరళరేఖలో ఉండే విధంగా అమర్చుము.
  • తరువాత కోణమానిని నీటి నుండి బయటకు తీసి రెండు స్ట్రాలను పరిశీలించుము.
  • పరిశీలించగా రెండూ ఒకే సరళరేఖలో లేవని గుర్తించవచ్చును.
  • రెండవ స్ట్రాకు, లంబానికి మధ్య కోణాన్ని కొలవండి.
  • పట్టికలో i, r విలువలు నమోదు చేయండి.

AP 10th Class Physical Science Model Paper Set 8 with Solutions in Telugu 13

వ.సంఖ్య పతనకోణం (i) పరావర్తన కోణం (r) sin i sin r sin i/sin r
1 10°
2 15°
3 20°
4 25°

 

  • ప్రయోగంలో పతనకోణం 48°లను మించకుండా i, r విలువలకు వక్రీభవన గుణకాలను కనుగొనుము.
  • నీటి నుండి గాలిలోకి కాంతి ప్రయాణించేటపుడు ప్రతి సందర్భంలోనూ r విలువ i విలువ కన్నా ఎక్కువ ఉంటుందని గమనించవచ్చును.
  • దీనినిబట్టి సాంద్రతర యానకం నుండి విరళయానకంలోకి కాంతి ప్రయాణించేటప్పుడు లంబానికి దూరంగా వంగుతుందని, r > i అని చెప్పవచ్చును.

Leave a Comment