Solving AP 10th Class Physical Science Model Papers Set 7 in Telugu Medium regularly is an effective strategy for time management during exams.
AP 10th Class Physical Science Model Paper Set 7 with Solutions in Telugu
Time: 2 Hours
Maximum Marks: 50
సూచనలు :
- ఈ ప్రశ్నాపత్రంలో 4 విభాగాలు మరియు 17 ప్రశ్నలు ఉండును.
- III వ విభాగం నందు కేవలం 12వ ప్రశ్నకు మాత్రమే మరియు IV వ విభాగం నందు గల అన్ని ప్రశ్నలకు అంతర్గత ఎంపిక కలదు.
- 2 గంటల సమయంలో, 15 నిమిషాల సమయం ప్రశ్నపత్రం చదువుటకై కేటాయింపబడినది.
- అన్ని సమాధానములు మీకివ్వబడిన సమాధాన పత్రంలోనే రాయవలెను.
- అన్ని సమాధానములు స్పష్టంగాను, గుండ్రంగాను రాయవలెను.
విభాగము – I 8 × 1 = 8 మా.
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 1 మార్కు.
ప్రశ్న 1.
కంటి కటకం యొక్క గరిష్ఠ, కనిష్ఠ నాభ్యంతరాలను రాయండి.
జవాబు:
- fగరిష్ట = 2.5 సెం.మీ.
- fకనిష్ఠం = 2.27 సెం.మీ.
ప్రశ్న 2.
వాహక నిరోధం అనగానేమి?
జవాబు:
వాహకంలో ఎలక్ట్రాన్ చలనానికి కలిగే ఆటంకమును “వాహక నిరోధం” అంటారు.
ప్రశ్న 3.
4 కార్బన్లతో ‘X’ అనే అణువు వుంది. అది ఒక ఆల్కేన్ కూడా. అయిన ఆ పదార్థాన్ని ఊహించి రాయండి.
జవాబు:
‘X’ అనేది బ్యూటేన్ (CH4)
ప్రశ్న 4.
క్రింద ఇవ్వబడిన పట్టికను పరిశీలించి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులిమ్ము.
పదార్థం | విశిష్టోష్టం కాలరీ / గ్రా-°C |
సీసం | 0.031 |
నీరు | 1 |
రాగి | 0.095 |
1) తక్కువ ఉష్ణంతోనే వేగంగా వేడెక్కే పదార్థం ఏది ?
2) శీతలీకరణిగా వినియోగించే పదార్థం ఏది?
జవాబు:
1) సీసం
2) నీరు
ప్రశ్న 5.
అమ్మోనియా అణువు పటం గీయండి.
జవాబు:
ప్రశ్న 6.
గ్రాఫైట్ ఉపయోగాలు రాయండి.
జవాబు:
- గ్రాఫైట్ను మంచి విద్యుత్ వాహకంగా వినియోగిస్తారు.
- దీనిని కందెనగా వినియోగిస్తారు.
ప్రశ్న 7.
క్రింది పట్టికను పరిశీలించి, ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
1) పట్టికలో గల ఆల్కేనులు రాయుము.
2) త్రిబంధం గల అసంతృప్త హైడ్రోకార్బన్లు ఏమిటి ?
జవాబు:
1) ఆల్కేనులు : మీథేన్ (CH4), ఈథేన్ (C2H6)
2) పెంటైన్ (C5H8), హెక్సెన్ (C6H10) లు
ప్రశ్న 8.
కింది పట్టికలో ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించి, పట్టిక కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
పదార్థం (జల ద్రావణంలో) | నీలి లిట్మస్తో సూచించే రంగు మార్పు | రెడ్ లిట్మస్తో సూచించే రంగు మార్పు |
A | ఎరుపు | మార్పు లేదు. |
B | మార్పు లేదు | నీలం |
C | మార్పు లేదు | మార్పు లేదు |
1) A, B, C పదార్థాలలో తటస్థ లవణం ఏది ?
2) B పదార్థానికి కొన్ని చుక్కల ఫినాఫ్తలీన్ కలిపితే ఏం జరుగుతుంది?
జవాబు:
1) C
2) పింక్ (గులాబి) రంగులోకి మారుతుంది.
విభాగము – II 3 × 2 = 6 మా.
సూచనలు :
-
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 2 మార్కులు.
ప్రశ్న 9.
ఆఫ్ బౌ నియమాన్ని రాసి, ఉదాహరణతో వివరించండి.
జవాబు:
నియమం : ఎలక్ట్రాను తక్కువ శక్తి గల ఆర్బిటాల్లోనికి ముందు ప్రవేశించును.
(లేదా)
ఎలక్ట్రాను ఏ ఆర్బిటాల్ యొక్క (n + l) విలువ కనిష్ఠమో దానిలోనికి ముందు ప్రవేశించును.
పొటాషియంలో చిట్టచివరి ఎలక్ట్రాన్ 3d లోనికి ప్రవేశించకుండా, 4s లోనికి ప్రవేశించింది. కారణం 4s యొక్క n + l విలువ తక్కువ.
ఆర్బిటాల్ | n | l | n + l |
4s | 4 | 0 | 4 + 0 = 4 |
3d | 3 | 2 | 3 + 2 = 5 |
ఉదా 3 : స్కాండియం 21Sc 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d1
స్కాండియంలో చిట్టచివరి 21వ ఎలక్ట్రాన్ 4p లోనికి ప్రవేశించకుండా 3d లోనికి ప్రవేశించింది. దీనికి కారణం 4p, 3dల n + l విలువలు సమానం అయినప్పటికీ n విలువ 3d ఆర్బిటాల్కు కనిష్ఠం కాబట్టి ఎలక్ట్రాన్ 3d లోనికి ప్రవేశించింది.
ప్రశ్న 10.
ఆర్బిటాల్ మరియు ఆర్బిట్ల మధ్య తేడాలు తెలుసుకొనుటకు కొన్ని ప్రశ్నలను తయారు చేయుము.
జవాబు:
- బోర్ పరమాణు నిర్మాణం ప్రకారం ఎలక్ట్రాన్లు పరమాణువులో ఎక్కడ తిరుగుతాయి ?
- ఆర్బిట్ను ఏ క్వాంటం సంఖ్య సూచిస్తుంది ?
- కోణీయ ద్రవ్య వేగ క్వాంటం సంఖ్య దేనిని సూచిస్తుంది ? .
- పరమాణువులో ఎలక్ట్రాను కనుగొనే సంభావ్యత ఎక్కడ వుంటుంది ?
ప్రశ్న 11.
కంటిలో శంఖువులు, దండాలు లేకపోతే ఏమి జరుగునో ఊహించి రాయండి.
జవాబు:
- కంటిలో శంఖువులు లేకపోతే ప్రకృతిలో గల వివిధ రంగులను గుర్తించలేము. వర్ణ అంధత్వం ఏర్పడుతుంది.
- కంటిలో దండాలు లేకపోతే అన్ని వస్తువులు వెలుతురు తగ్గి మసకగా కనిపిస్తాయి.
విభాగము – III 3 × 4 = 12 మా.
సూచనలు :
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 4 మార్కులు.
ప్రశ్న 12.
ఈ క్రింది వాటిలో ఏదైనా ఒక పటం గీయండి :
a) సోలినాయిడ్ వల్ల ఏర్పడే అయస్కాంత క్షేత్ర పటం గీయుము.
జవాబు:
b) ఆరోహణ క్రమంలో పరమాణు ఆర్బిటాళ్ళ విశిధ శక్తిస్థాయిలను చూపే మాయిలర్ పటాన్ని గీయుము.
జవాబు:
(n + l) విలువలు పెరిగే క్రమాన్ని చూపే పటం
ప్రశ్న 13.
పట్టికను పరిశీలించి జవాబులిమ్ము.
పదార్థం | ఎర్ర లిట్మస్ | మిథైల్ ఆరెంజ్ | విశ్వ సూచిక |
A | మార్పు లేదు | మార్పు లేదు | ఆకుపచ్చ |
B | నీలం | పసుపు | ఊదా |
C | మార్పు లేదు | ఎరుపు | ఎరుపు |
D | నీలం | పసుపు | నీలం |
1) పై పదార్థాలలో ఏవి ఆమ్లాలు ?
జవాబు:
పదార్థం ‘C’ ఆమ్లం
2) పదార్థం ‘A’ పేరును ఊహించి రాయండి.
జవాబు:
పదార్థం ‘A’ నీరు అవ్వవచ్చును.
3) పై పదార్థాలలో ఏది ఫినాఫ్తలీన్ సూచిక రంగును మార్చగలదు ?
జవాబు:
పదార్థం B మరియు D లు ఫినాఫ్తలీన్ సూచిక రంగును మార్చగలవు.
4) ఏ పదార్థానికి తక్కువ pH విలువ ఉంటుంది?
జవాబు:
పదార్ధం ‘C’ తక్కువ pH కలిగి ఉంటుంది.
ప్రశ్న 14.
రోజువారీ జీవితంలో ఎస్టర్ల పాత్రను నీవు ఎలా ప్రశంసిస్తావు ?
జవాబు:
ఎస్టర్లు ప్రత్యేక సువాసన కలిగిన సమ్మేళనాలు. కాబట్టి వీటిని
- సెంట్లు, సబ్బులు, నెయిల్ పాలిష్ మొదలైన సౌందర్యాత్మక సాధనాలలో ఉపయోగిస్తారు.
- ఆల్కహాళ్ళు, ఫాటీ ఆమ్లాల తయారీలో ఉపయోగిస్తారు.
- పువ్వులు, పండ్లు ప్రత్యేక వాసన కలిగి ఉండడానికి వాటిలోని ఎస్టర్లు తోడ్పడుతున్నాయి.
- ఎస్టర్లను కొన్ని ప్రత్యామ్నాయ మందులుగాను, విటమిన్లలోను ఉపయోగిస్తున్నారు.
ఈ విధంగా అనేక నిత్యజీవిత అంశాలలో ఎస్టర్లు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. కాబట్టి వాటి పాత్ర ఎంతో అభినందనీయం.
విభాగము – IV 3 × 8 = 24 మా.
సూచనలు :
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 8 మార్కులు.
- ప్రతి ప్రశ్నకు అంతర్గత ఎంపిక కలదు.
ప్రశ్న 15.
క్రింది వానిని వివరింపుము.
1) ఆప్టికల్ ఫైబర్ పని చేయు విధానం
2) వజ్రాల ప్రకాశం
జవాబు:
ఆప్టికల్ ఫైబర్స్ సంపూర్ణాంతర పరావర్తనంపై ఆధారపడి పనిచేస్తాయి.
- ఆప్టికల్ ఫైబర్ అనునది గాజు లేదా ప్లాస్టిక్ తో తయారు చేయబడిన అతిసన్నని తీగ.
- ఇటువంటి సన్నని తీగలు కొన్ని కలిసి లైట్పైపై ఏర్పడతాయి.
- పని చేయు విధానం:
- ఆప్టికల్ ఫైబర్లో కాంతి ప్రయాణించే విధానాన్ని పక్క పటం వివరిస్తుంది.
- ఆప్టికల్ ఫైబర్ యొక్క అతి తక్కువ వ్యాసార్ధం వల్ల దానిలోకి ప్రవేశించు కాంతి, దాని లోపలి గోడలకు తగులుతూ పతనం చెందుతుంది.
- పతన కోణం, సందిగ్ధ కోణం కన్నా ఎక్కువ ఉండడం వల్ల సంపూర్ణాంతర పరావర్తనం జరుగుతుంది.
- తద్వారా ఆప్టికల్ ఫైబర్ గుండా కాంతి ప్రయాణిస్తుంది.
- ఆ కాంతి పొట్ట లోపలి భాగాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.
- ఆ లోపలి కాంతి, లైట్పైపులోని మరికొన్ని ఆప్టిక్ ఫైబర్స్ ద్వారా బయటకు వస్తుంది.
- ఆ ఫైబర్స్ `రెండవ చివర నుండి వచ్చు కాంతిని పరిశీలించడం ద్వారా పొట్ట లోపలి భాగాల చిత్రాన్ని పరిశీలకులు తెలుసుకుంటారు.
2) వజ్రాల ప్రకాశం :
- వజ్రం యొక్క సందిగ్ధ కోణము విలువ చాలా తక్కువ (24.4°).
- కావున వజ్రంలోనికి ప్రవేశించిన కాంతి సంపూర్ణాంతర పరావర్తనం చెందును.
- ఈ లక్షణం వలన వజ్రం ప్రకాశించును.
- వజ్రమును కోసినపుడు పతన కోణం, సందిగ్ధ కోణం కన్నా ఎక్కువై సంపూర్ణాంతర పరావర్తనం పదేపదే జరుగును.
- అనగా వజ్రంలోకి ప్రవేశించిన కాంతి సులభంగా సంపూర్ణాంతర పరావర్తనం చెంది వజ్రం మిరుమిట్లు గొలిపే కాంతిలో ప్రకాశవంతంగా మెరయును.
(లేదా)
i) కుంభాకార, పుటాకార కటకాల మధ్య భేదాలు రాయుము.
కుంభాకార కటకం | పుటాకార కటకం |
1. దీని అంచులు పలుచగాను, మధ్యలో మందంగాను ఉంటుంది. | 1. దీని అంచులు మందముగాను, మధ్యలో పలుచగాను ఉంటుంది. |
2. కాంతి కిరణాలు దీని మీద పడి వక్రీభవనం చెందిన తరువాత కేంద్రీకరించబడతాయి. | 2. కాంతి కిరణాలు దీని మీద పడినపుడు వక్రీభవనం తరువాత వికేంద్రీకరణం చెందుతాయి. |
3. దీని ద్వారా వస్తువులను చూచినపుడు పెద్దవిగా కనబడతాయి. | 3. దీని ద్వారా వస్తువులను చూచినపుడు కుంచించుకొని పోయినట్లు కనబడతాయి. |
4. ఇది సాధారణంగా నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. | 4. ఇది ఎల్లప్పుడు మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. |
ii) 10 సెం.మీ. నాభ్యంతరం గల కుంభాకార కటకాన్ని ఒక గోడ నుండి 12 సెం.మీ. దూరంలో ఉంచితే గోడపై ప్రతిబింబం ఏర్పడింది. అయిన కటకానికి, వస్తువుకి మధ్య దూరాన్ని లెక్కించండి.
సాధన. f = 10 సెం.మీ. ⇒ v = 12 సెం.మీ.
కటక సూత్రం = \(\frac{1}{f}\) = \(\frac{1}{v}\) – \(\frac{1}{u}\)
⇒ \(\frac{1}{10}\) = \(\frac{1}{12}\) – \(\frac{1}{u}\) ⇒ \(\frac{1}{u}\) = \(\frac{1}{12}\) – \(\frac{1}{10}\) = \(\) = –\(\frac{1}{60}\) ⇒ u = 60 సెం.మీ.
∴ వస్తు దూరం 60 సెం.మీ.
ప్రశ్న 16.
ఈ క్రింది అణువులు ఏర్పడే విధానాన్ని వేలన్సీ బంధ సిద్ధాంతం ఆధారంగా వివరించండి.
a) N2 అణువు
b) O2 అణువు
జవాబు:
a) N2 అణువు ఏర్పడే విధానం – వేలన్సీ బంధ సిద్ధాంతం ఆధారంగా :
- నైట్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2px1 2py1 2pz1.
- ఒక నైట్రోజన్ పరమాణువులోని Px ఆర్బిటాల్, మరొక నైట్రోజన్ పరమాణువులోని Px ఆర్బిటాల్తో అక్షంపై అతిపాతం చెందడం వల్ల (px – px) రా బంధం ఏర్పడుతుంది.
- రెండు పరమాణువులలో మిగిలిన Py, Py ఆర్బిటాళ్ళు మరియు Pz, Pz, ఆర్బిటాళ్ళు పార్శ్వ అతిపాతం చెందడం వలన రెండు T బంధాలు ఏర్పడతాయి.
- ఫలితంగా రెండు నైట్రోజన్ పరమాణువుల మధ్య బంధాలతో నైట్రోజన్ అణువు ఏర్పడుతుంది.
b) O2 అణువు ఏర్పడుట :
- ఆక్సిజన్ పరమాణువు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2px2 2py1 2pz1
- ఆక్సిజన్ పరమాణువులోని Py ఆర్బిటాల్, మరొక ‘ఆక్సిజన్ పరమాణువులోని Py ఆర్బిటాల్తో అక్షీయరేఖ వెంబడి అతిపాతం చెందడం వల్ల (py – py) రా బంధం ఏర్పడుతుంది.
- రెండు పరమాణువులలో మిగిలిన Pz, Pz ఆర్బిటాళ్ళు పార్శ్వ అతిపాతం చెందడం వలన (pz – pz) π బంధం ఏర్పడుతుంది.
- ఫలితంగా రెండు ఆక్సిజన్ పరమాణువుల మధ్య 2 బంధాలతో ఆక్సిజన్ అణువు ఏర్పడుతుంది.
(లేదా)
నవీన ఆవర్తన నియమాన్ని రాయండి. విస్తృత ఆవర్తన పట్టిక ఏ విధంగా నిర్మించబడిందో వివరించండి.
జవాబు:
నవీన ఆవర్తన నియమము : మూలకాల భౌతిక, రసాయన ధర్మాలు వాటి ఎలక్ట్రాన్ విన్యాసాల ఆవర్తన ప్రమేయాలు. విస్తృత ఆవర్తన పట్టిక నిర్మాణము :
- ఆవర్తన నియమము ప్రకారం నిర్మించబడినది.
- దీనినే విస్తృత ఆవర్తన పట్టిక అంటారు.
- ఈ పట్టికలో 18 నిలువు వరుసలు (గ్రూపులు), ? అడ్డు వరుసలు (పీరియడ్లు) ఉంటాయి.
- సాంప్రదాయబద్ధంగా గ్రూపులను I నుండి VIII వరకు రోమన్ సంఖ్యలను ఉపయోగించి సూచిస్తూ వాటికి A, B అక్షరాలను జోడించి చూపుతారు.
- గ్రూపులలో ఒకే ఎలక్ట్రాన్ విన్యాసం కలిగిన మూలకాలను అమర్చారు.
- ఆవర్తన పట్టికలో 7 పీరియడ్లను 1 నుండి 7 వరకు అరబిక్ సంఖ్యలచే సూచిస్తారు.
- పీరియడ్లలో మూలకాలను పరమాణు సంఖ్యల ఆరోహణ క్రమంలో అమర్చారు.
- మూలకం యొక్క పరమాణువులో చిట్టచివరి ఎలక్ట్రాన్ లేదా భేదపరిచే ఎలక్ట్రాన్ ఏ ఉపకక్ష్యలో చేరుతుందో దానిని ఆధారంగా చేసుకుని మూలకాలను s, p, d, f బ్లాకు మూలకాలుగా వర్గీకరించారు.
- మొదటి పీరియడ్ 2 మూలకాలను, 2వ మరియు 3వ పీరియడ్లు 8 మూలకాలను, 4వ మరియు 5వ పీరియడ్లు 18 మూలకాలను, 6వ పీరియడ్ 32 మూలకాలను మరియు 7వ పీరియడ్ అసంపూర్తిగా నిండి ఉంటాయి.
ప్రశ్న 17.
లోహ క్షయంనకు గాలి, నీరు అవసరం అని నిరూపించుటకు ప్రయోగాన్ని ఎలా నిర్వహిస్తారో వివరించండి.
జవాబు:
లోహక్షయానికి గాలి మరియు నీరు అవసరం అని నిరూపించుట :
ప్రయోగం :
- మూడు పరీక్షనాళికలను తీసుకొని, వాటిని A, B, C లుగా గుర్తించండి. ఒక్కొక్క దానిలో శుభ్రంగా ఉన్న ఒక్క ఇనుపమేకును వేయండి.
- పరీక్షనాళిక ‘A’ లో కొంత నీటిని తీసుకొని, దానిని రబ్బరు బిరడాతో బిగించండి.
- పరీక్షనాళిక ‘B’ లో మరిగించిన స్వేదన జలాన్ని ఇనుపమేకు మునిగేంతవరకు తీసుకొని దానికి 1మి.లీ. నూనెను కలిపి రబ్బరు బిరడాతో బిగించండి.
- పరీక్షనాళిక ‘C’ లో కొంచెం అనార్థ కాల్షియం క్లోరైడ్ను తీసుకొని రబ్బరు బిరడాను బిగించండి.
- అనార్ధ కాల్షియం క్లోరైడ్ గాలిలోని తేమను గ్రహించును.
- పై పరీక్షనాళికలను కొన్ని రోజుల వరకూ అలా ఉంచేసి తర్వాత వచ్చిన మార్పులను పరిశీలించండి.
- పరీక్షనాళిక ‘A’ లోని ఇనుపమేకు త్రుప్పు పట్టును. కానీ ‘B’ మరియు ‘C’ పరీక్షనాళికలోని మేకులు తుప్పు పట్టవు.
- పరీక్షనాళిక ‘A’ లోని మేకులు గాలి, నీరు ఉన్న వాతావరణంలో ఉంచబడ్డాయి.
- ‘B’ పరీక్షనాళికలోని మేకులు కేవలం నీటిలోను, పరీక్షనాళిక ‘C’ లోని మేకులు పొడిగాలిలో ఉంచబడ్డాయి.
- కనుక ఈ ప్రయోగం ద్వారా లోహక్షయానికి (corrosion) గాలి మరియు నీరు అవసరం అని నిరూపించవచ్చు.
(లేదా)
ఓమ్ నియమాన్ని తెల్పండి. దానిని సరి చూడడానికి ప్రయోగాన్ని తెల్పి, ప్రయోగ విధానాన్ని రాయండి.
జవాబు:
ఓమ్ నియమము : స్థిర ఉష్ణోగ్రత వద్ద, వాహకం రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదం వాహకం గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది.
ఓమ్ నియమంను సరిచూచుట :
ఉద్దేశ్యం : ఒక వాహకానికి సంబంధించిన VI విలువ స్థిరమని చూపడము. కావలసిన వస్తువులు : 6V బ్యాటరీ ఎలిమినేటర్, 0-1A అమ్మీటర్, 0-6V ఓల్ట్ మీటరు, వాహక తీగలు (రాగి తీగలు), 50 సెం.మీ. పొడవు గల సర్పిలాకార మాంగనీస్ తీగ, రియోస్టాట్, స్విచ్ మరియు 3V LED.
నిర్వహణ పద్ధతి :
- పటంలో చూపిన విధముగా వలయాన్ని కలపండి. (బ్యాటరీ ఎలిమినేటర్లో గరిష్ఠంగా 4.5V దగ్గర నాబన్ను ఉంచాలి.
- రియోస్టాట్ను ఉపయోగించి మాంగనీస్ తీగ రెండు కొనల వద్ద పొటెన్షియల్ భేదమును 0V నుంచి గరిష్ఠంగా 4.5V మధ్య వరకు మార్చాలి.
- రియోస్టాట్ ఉపయోగించి మాంగనీస్ తీగ రెండు కొనల వద్ద కనీసం 1V పొటెన్షియల్ భేదం ఉంచాలి.
- ఈ సందర్భానికి వలయంలో విద్యుత్ ప్రవాహంను అమ్మీటరు ద్వారా గుర్తించి, పట్టికలో నమోదు చేయండి.
- రియోస్టాట్ను ఉపయోగించి పొటెన్షియల్ భేదం (V) 4.5V వరకు మార్చుతూ విద్యుత్ ప్రవాహం (I) విలువలను గుర్తించండి.
- ఈ విధంగా V మరియు I విలువలను కనీసం 5 రీడింగులను గుర్తించి, పట్టికలో నమోదు చేయండి.
- ప్రతి సందర్భానికి \(\frac{\mathrm{V}}{\mathrm{I}}\) విలువను కనుగొనండి.
- \(\frac{\mathrm{V}}{\mathrm{I}}\) విలువ స్థిరమని మనము గమనించవచ్చును. V ∝ I అయిన \(\frac{\mathrm{V}}{\mathrm{I}}\) = స్థిరము
- ఈ స్థిరాంకంను వాహక విద్యుత్ నిరోధం అంటాము. దీనిని ‘R’ తో సూచిస్తాము. \(\frac{\mathrm{V}}{\mathrm{I}}\) = R ⇒ V = IR
∴ ఓమ్ నియమము నిరూపించబడినది.