Solving AP 10th Class Physical Science Model Papers Set 6 in Telugu Medium regularly is an effective strategy for time management during exams.
AP 10th Class Physical Science Model Paper Set 6 with Solutions in Telugu
Time: 2 Hours
Maximum Marks: 50
సూచనలు :
- ఈ ప్రశ్నాపత్రంలో 4 విభాగాలు మరియు 17 ప్రశ్నలు ఉండును.
- III వ విభాగం నందు కేవలం 12వ ప్రశ్నకు మాత్రమే మరియు IV వ విభాగం నందు గల అన్ని ప్రశ్నలకు అంతర్గత ఎంపిక కలదు.
- 2 గంటల సమయంలో, 15 నిమిషాల సమయం ప్రశ్నపత్రం చదువుటకై కేటాయింపబడినది.
- అన్ని సమాధానములు మీకివ్వబడిన సమాధాన పత్రంలోనే రాయవలెను.
- అన్ని సమాధానములు స్పష్టంగాను, గుండ్రంగాను రాయవలెను.
విభాగము – I 8 × 1 = 8 మా.
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 1 మార్కు.
ప్రశ్న 1.
కటక తయారీ సూత్రాన్ని రాయండి.
జవాబు:
\(\frac{1}{f}\) = (n – 1) (\(\frac{1}{R_1}\) – \(\frac{1}{R_2}\))
ప్రశ్న 2.
ఓమ్ నియమాన్ని రాయండి.
జవాబు:
స్థిర ఉష్ణోగ్రత వద్ద, వాహకం యొక్క రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదం వాహకం గుండా ప్రవహించు విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది.
V ∝ I ⇒ \(\frac{V}{I}\) = R
ప్రశ్న 3.
ఒక మూలకం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 2, 8, 6. ఆవర్తన పట్టికలో ఆ మూలక స్థానాన్ని ఊహించండి.
జవాబు:
మూలకం 3వ పీరియడ్, 16వ గ్రూపులో ఉంటుంది.
ప్రశ్న 4.
పట్టికను పరిశీలించి, ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
వ్యక్తి | కటక సామర్థ్యం | కటక రకం |
A | – 2D | ద్విపుటాకార |
B | + 1.5D | ద్వికుంభాకార |
1) వ్యక్తి ‘B’ యొక్క కంటి దోషము ఏమిటి ?
2) వ్యక్తి ‘A’ వినియోగిస్తున్న కటక నాభ్యంతరం ఎంత ?
జవాబు:
1) వ్యక్తి ‘B’ కి దీర్ఘ దృష్టి కంటి దోషము కలదు.
2) వ్యక్తి ‘A’ వినియోగిస్తున్న కటకం – 2D సామర్థ్యం కలదు. అనగా దాని నాభ్యంతరం (f) = \(\frac{100}{2}\) = 50 సెం.మీ.
ప్రశ్న 5.
Px-ఆర్బిటాల్ పటం గీయండి.
జవాబు:
ప్రశ్న 6.
నిత్య జీవితంలో థర్మైట్ ప్రక్రియ వినియోగాన్ని రాయండి.
జవాబు:
ఐరన్ ఆక్సైడ్ (Fe2O3) అల్యూమినియంతో చర్య పొందినప్పుడు ఏర్పడిన ద్రవ ఇనుమును విరిగిన రైలు కమ్మలు, పగిలిన యంత్ర పరికరాలను అతికించడానికి వినియోగిస్తారు.
ప్రశ్న 7.
A) ప్రవచనం: ఆల్కేనులు అన్నీ అసంతృప్త హైడ్రోకార్బన్లే.
B)కారణం : ఆల్కేనులలో కార్బన్ల మధ్య ఏక బంధాలుంటాయి.
A) A మరియు R లు సరియైనవి. A ను R సమర్థించును.
B) A మరియు R లు సరియైనవి. A ను R సమర్థించదు.
C) A సరియైనది. R సరియైనది కాదు.
D) A సరియైనది కాదు. R సరియైనది.
జవాబు:
D) A సరియైనది కాదు. R సరియైనది.
ప్రశ్న 8.
క్రింది ఇవ్వబడిన పట్టికను పరిశీలించి, ప్రశ్నలకు జవాబులిమ్ము.
మూలకం | ఎలక్ట్రాన్ విన్యాసం |
A | 1s2 2s2 2p6 3s2 3p5 |
B | 1s2 2s2 2p6 |
C | 1s2 2s2 2p6 3s2 |
1) 17వ గ్రూపునకు చెందిన మూలకం ఏది ?
2) S – బ్లాకునకు చెందిన మూలకం ఏది ?
జవాబు:
1) మూలకం – A
2) మూలకం C
విభాగము – II 3 × 2 = 6 మా.
సూచనలు :
-
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 2 మార్కులు.
ప్రశ్న 9.
సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలలో సూర్యుడు ఎర్రగా కనబడడానికి కారణాన్ని ఊహించి రాయుము.
జవాబు:
- సూర్యోదయం, సూర్యాస్తమయ సమయంలో సూర్యుని నుండి వెలువడే కాంతి మీ కంటిని చేరడానికి భూ వాతావరణంలో అధిక దూరం ప్రయాణించాల్సి ఉంటుంది.
- ఎరుపు రంగు కాంతి తప్ప మిగిలిన అన్ని రంగుల కాంతులు అధికంగా పరిక్షేపణం చెంది కాంతి మీ కంటిని చేరే లోపే ఆ రంగులన్నీ కనుమరుగవుతాయి.
- ఎరుపు రంగు కాంతి తక్కువగా పరిక్షేపణం చెందడం వల్ల అది మీ కంటిని చేరును.
- ఫలితంగా సూర్యుడు, సూర్యోదయం మరియు సూర్యాస్తమయ సమయాలలో ఎరుపుగా కన్పిస్తాడు.
ప్రశ్న 10.
కర్బన సమ్మేళనాల సమజాత శ్రేణులను నిర్వచించండి. సమజాత శ్రేణుల ఏవేని రెండు లక్షణాలను తెల్పండి.
జవాబు:
ఒకే ప్రమేయ సమూహాలున్న కర్బన సమ్మేళనాలను సమజాతీయ శ్రేణులు అంటారు.
ఉదా : ఆల్కేనులు, ఆల్కీనులు, ఆల్కెనులు, హాలో ఆల్కేనులు మొదలైనవి.
లక్షణాలు :
- ఇవి ఒకే సాధారణ ఫార్ములా కలిగి ఉంటాయి.
ఉదా : ఆల్కేనుల సాధారణ ఫార్ములా CnH2n + 2· - వరుస సమ్మేళనాల మధ్య తేడా -CH2 ఉంటుంది.
- ఒకే ప్రమేయ సమూహాన్ని కలిగి ఉండటం వలన ఒకే రసాయన ధర్మాలు కలిగి ఉంటాయి.
- భౌతిక ధర్మాలలో ఒక క్రమపద్ధతిలో పెరుగుదల కనబడుతుంది.
ప్రశ్న 11.
ఇండ్లలో విద్యుత్ పరికరాలను సమాంతరంగా ఎందుకు కలుపుతారు ? శ్రేణిలో కలిపితే ఏమి జరుగుతుందో ఊహించండి.
జవాబు:
- మన ఇంటిలోని విద్యుత్ సాధనాలన్నీ కరెంట్ లైన్లకు వివిధ బిందువుల వద్ద సమాంతర సంధానంలో కలుపుతారు.
- ఎందుచేతనంటే శ్రేణిలో కలిపితే ఆ విద్యుత్ పరికరాలలో ఏదైనా ఒక పరికరాన్ని ఆపివేస్తే మిగతా పరికరాలు కూడా పనిచేయటం ఆగిపోతాయి.
- ఇదియే కాకుండా ఆ పరికరాలలో మొత్తం పొటెన్షియల్ భేదం విభజించబడును. కానీ ఇండ్లలోని పరికరాలకు పొటెన్షియల్ భేదం సమానముగా ఉండాలి.
విభాగము – III 3 × 4 = 12 మా.
సూచనలు :
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 4 మార్కులు.
ప్రశ్న 12.
ఈ క్రింది వాటిలో ఏదైనా ఒక పటం గీయండి :
a) వస్తువును F2 మరియు 2F2 ల మధ్య ఉంచినపుడు ఏర్పడే ప్రతిబింబాన్ని సూచించు పటాన్ని గీయండి.
జవాబు:
b) వివిధ పదార్థాల pH విలువలను చూపు సార్వత్రిక పట్టికను గీయండి.
జవాబు:
ప్రశ్న 13.
క్రింది పట్టికను పరిశీలించి, ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
1) పై ద్రావణాలలో ఏది తటస్థం ?
2) పై ద్రావణాలలో ఏవి క్షార ధర్మాలను కలిగి యుంటాయి ?
3) పై ద్రావణాలలో ఏవి బలమైన ఆమ్ల, క్షారాలు ?
4) ద్రావణాలు ‘E’ మరియు ‘G’ లలో మిథైల్ ఆరెంజ్ సూచిక రంగు ఏమిటి ?
జవాబు:
1) ద్రావణం – B
2) ద్రావణాలు C, D మరియు E లు
3) బలమైన ఆమ్లం – G ; బలమైన క్షారం – C
4) ద్రావణం ‘E’ లో మిథైల్ ఆరెంజ్ – పసుపు రంగునిస్తుంది. ద్రావణం ‘G’ లో మిథైల్ ఆరెంజ్ – ఎరుపు రంగునిస్తుంది.
ప్రశ్న 14.
లోహ క్షయాన్ని ఎలా నివారిస్తారు ?
జవాబు:
- లోహ ఉపరితలాన్ని పెయింట్తో గాని, కొన్ని రసాయనాలతోగాని కప్పి ఉంచడం వల్ల లోహక్షయాన్ని నివారించవచ్చు.
- అల్ప చర్యాశీలత కలిగి ఉండి వాతావరణంలో తామే ముందుగా చర్య జరిపి, వస్తువును రక్షించగలిగే లోహాలైన Sn, Zn వంటి వాటిలో లోహవస్తువును కప్పి ఉంచడం.
- విద్యుత్ రసాయన పద్ధతిలో Zn, Mg వంటి లోహ ఎలక్ట్రోడ్లు తమకు తామే క్షయం చెంది వస్తువును క్షయం కాకుండా రక్షిస్తాయి.
విభాగము – IV 3 × 8 = 24 మా.
సూచనలు :
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 8 మార్కులు.
- ప్రతి ప్రశ్నకు అంతర్గత ఎంపిక కలదు.
ప్రశ్న 15.
క్రింది వాటి మధ్య భేదాలు రాయండి.
1) బాష్పీభవనం – మరగడం
2) ఉష్ణం – ఉష్ణోగ్రత
జవాబు:
1) బాష్పీభవనం – మరగడం :
బాష్పీభవనం | మరగటం |
1) ద్రవంలోని అణువులు ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ఉపరితలాన్ని వీడిపోయే ప్రక్రియను బాష్పీభవనం అంటారు. | 1) స్థిర ఉష్ణోగ్రతా పీడనాల వద్ద ద్రవస్థితిలోని పదార్థం వాయుస్థితిలోనికి మారే ప్రక్రియను మరగటం అంటారు. |
2) బాష్పీభవనం ఏ ఉష్ణోగ్రత వద్దనైనా జరగవచ్చు. | 2) మరగటం స్థిర ఉష్ణోగ్రత వద్ద మాత్రమే జరుగును. |
2) ఉష్ణం, ఉష్ణోగ్రత :
ఉష్ణ | ఉష్ణోగ్రత |
1) అధిక ఉష్ణోగ్రత ప్రాంతం నుండి అల్ప ఉష్ణోగ్రత ప్రాంతం వైపునకు ప్రవహించే శక్తి స్వరూపాన్ని ఉష్ణం అంటారు. | 1) చల్లదనం, వెచ్చదనం స్థాయిని ఉష్ణోగ్రత అంటారు. |
2) ఉష్ణం కారణం (Cause). | 2) ఉష్ణోగ్రత ఫలితం (Effect). |
3) ఉష్ణాన్ని కెలోరీమీటరుతో లెక్కిస్తారు. | 3) ఉష్ణోగ్రతను థర్మామీటరుతో లెక్కిస్తారు. |
4) S.I. యూనిట్ : జౌల్ | 4) S.I. యూనిట్ : కెల్విన్ |
(లేదా)
AC జనరేటర్ పనిచేయు విధానాన్ని పటం సహాయంతో వివరించండి.
జవాబు:
పనిచేయు నియమము : విద్యుదయస్కాంత ప్రేరణ నియమం ప్రకారం, తీగచుట్ట గుండా ప్రసరించే అయస్కాంత అభివాహం మారడం వల్ల తీగచుట్టలో విద్యుత్ ప్రేరేపింపబడుతుంది.
పనిచేయు విధానము :
- మొదట తీగచుట్ట గుండా అయస్కాంత అభివాహం ప్రసరించే విధంగా తీగచుట్టను అమర్చుము.
- ఆ తీగచుట్ట నిశ్చలస్థితిలో ఉన్నప్పుడు దాని భుజం ‘A’ పై వైపునకు వేరొక భుజం B కింది వైపునకు ఉందనుకొనుము.
- ఈ స్థితిలో తీగచుట్టలో విద్యుత్ ప్రేరేపింపబడదు. కావున విద్యుత్ ప్రవాహం శూన్యము.
- తీగచుట్టను సవ్యదిశలో త్రిప్పినపుడు దానిలో ప్రేరిత విద్యుత్ ప్రవాహం ఏర్పడి A నుండి Bకి ప్రవహిస్తుంది.
- తీగచుట్ట మొదటి పావు భాగం భ్రమణంలో విద్యుత్ ‘0’ నుండి గరిష్ఠ విలువకు పెరిగి తీగచుట్ట క్షితిజ సమాంతర స్థితిలోకి వచ్చే సరికి అందులో ప్రవహించు విద్యుత్ అత్యధిక విలువకు చేరుకుంటుంది.
- ఈ విధంగా పదే పదే తీగచుట్ట భ్రమణం చేయడం వలన విద్యుత్ ప్రవాహం మరల తగ్గి శూన్యానికి చేరుకుంటుంది.
- ఈ విధంగా పటంలో చూపినట్లుగా మొదటి, రెండవ అర్ధభాగాలలో కూడా విద్యుత్ ప్రవహిస్తుంది. కానీ దిశలు వేర్వేరుగా ఉంటాయి.
- ఇలా పొందిన విద్యుత్ పటంలో చూపినట్లు తీగచుట్ట ప్రతి అర్ధభ్రమణానికి తన దిశను మార్చుకొంటూ ఉంటుంది.
- ఈ విద్యుత్తును ‘ఏకాంతర విద్యుత్’ అంటాము.
ప్రశ్న 16.
ఒక పరమాణువులో ఎలక్ట్రాన్ యొక్క స్థానాన్ని అంచనా వేయడానికి మూడు క్వాంటం సంఖ్యలు ఏ విధంగా ఉపయోగ పడతాయో వివరించండి.
జవాబు:
- పరమాణువు ప్రధాన శక్తిస్థాయి లేదా కర్పరాలను కలిగి ఉండును.
- ప్రధాన శక్తిస్థాయిలు ఉప శక్తిస్థాయిలను కలిగి ఉండును.
- ఉప శక్తిస్థాయిలు ఆర్బిటాళ్ళను కలిగి ఉండును.
- ఆర్బిటాళ్లలో నిండిన ఎలక్ట్రానులను గుర్తించటానికి స్పష్టమైన సమాచారం కావలెను.
- పరమాణువు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రానులు ఉన్న ప్రాంతాన్ని గురించి, వాటి శక్తుల గురించి సమాచారాన్ని తెలిపే వాటిని “క్వాంటం సంఖ్యలు” అంటారు.
- ముఖ్యంగా క్వాంటం సంఖ్యలు 3 రకాలు. అవి :
1) ప్రధాన క్వాంటం సంఖ్య,
2) కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య,
3) అయస్కాంత క్వాంటం సంఖ్య
1. ప్రధాన క్వాంటం సంఖ్య :
1) ప్రధాన క్వాంటం సంఖ్యను నీల్స్ బోర్ ప్రవేశపెట్టాడు.
2) దీనిని n తో సూచిస్తారు.
3) n విలువ 1, 2, 3, 4, ∞
ధన పూర్ణాంక విలువను కలిగి ఉండును.
n | 1 | 2 | 3 | 4 |
కర్పరం | K | L | M | N |
4) n విలువ పెరిగితే కేంద్రకానికి, ఎలక్ట్రాన్కు మధ్య దూరం పెరుగును.
5) n విలువ పెరిగితే కక్ష్య పరిమాణం, శక్తి పెరుగును.
2. కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య :
1) దీనిని సోమర్ ఫెల్డ్ ప్రతిపాదించాడు.
2) దీనిని l తో సూచిస్తారు.
3) ప్రతి కక్ష్యలో l విలువలు 0 నుండి n – 1 వరకు ఉంటాయి. అనగా 2 విలువ nపై ఆధారపడి ఉండును.
4) l విలువను s, p, d, f సంకేతాలతో సూచిస్తారు.
l | 0 | 1 | 2 | 3 |
కర్పరం | s | p | d | f |
5) ఇది ఆర్బిటాళ్ల ఆకృతిని, ఆర్బిటాళ్ల ఆకారాన్ని తెలియజేయును.
3.ఎ) అయస్కాంత క్వాంటం సంఖ్య :
1) దీనిని “లాండే” ప్రతిపాదించాడు.
2) దీనిని ml తో సూచిస్తారు.
3) ml విలువ l విలువపై ఆధారపడుతుంది.
4) m విలువ – l, 0, + l వరకు ఉండును.
5) ఒక నిర్దిష్ట l విలువకు అయస్కాంత క్వాంటం సంఖ్య (ml) విలువలు (2 (l) + 1) కలిగి ఉండును.
6) ఇది పరమాణువులో గల ఆర్బిటాళ్ల ప్రాదేశిక దృగ్విన్యాసాన్ని తెలుపుతుంది.
3. బి) స్పిన్ క్వాంటం సంఖ్య :
1) దీనిని ఉలెన్ బెక్, గౌడ్ స్మిత్ ప్రవేశపెట్టారు.
2) దీనిని msతో సూచిస్తారు.
3) ఈ క్వాంటం సంఖ్య ఎలక్ట్రానులకు రెండు రకాల దిగ్విన్యాసాలను సూచిస్తుంది.
4) మొదటి ఎలక్ట్రాన్ సవ్యదిశలో తిరిగితే
ms = + \(\frac{1}{2}\) తో సూచిస్తారు. దీనిని బ్లాక్ డయాగ్రం పద్ధతిలో సూచిస్తారు.
5) రెండవ ఎలక్ట్రాన్ అపసవ్యదిశలో తిరుగుతుంది.
ms – \(\frac{1}{2}\) తో సూచిస్తారు. దీనిని తో తెలియజేయవచ్చు.
(లేదా)
సంకరీకరణం అనగానేమి ? సంకరీకరణం ఆధారంగా BeCl2 అణువు ఏర్పడే విధానం వివరించండి.
జ. సంకరీకరణం : పరమాణువులు చివరి కక్ష్యలో ఉండే దాదాపు సమాన శక్తి గల పరమాణు ఆర్బిటాళ్ళు పరస్పరం కలిసిపోయి, పునర్వ్యవస్థీకరించబడడం ద్వారా అదే సంఖ్యలో బంధశక్తి, ఆకారం వంటి ధర్మాలు ఒకే విధంగా ఉండే సర్వసమాన ఆర్బిటాళ్ళను ఏర్పరచే దృగ్విషయాన్ని సంకరీకరణం (hybridization) అంటారు.
సంకరీకరణము ఆధారంగా BeCl2 అణువు ఏర్పడుట :
- బెరీలియం (4Be) యొక్క భూస్థాయి ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2.
- ఉత్తేజిత స్థితిలో దాని ఎలక్ట్రాన్ విన్యాసము 1s2 2s1 2px1గా మారుతుంది.
- క్లోరిన్ పరమాణువు (17Cl) యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p6 3s2 3px2 3py2 3p1.
- బెరీలియం పరమాణువు ఉత్తేజిత స్థితిలో ఉన్నప్పుడు దానిలోని జత కూడని ఒంటరి ఎలక్ట్రాన్లను కలిగి ఉన్న 2s ఆర్బిటాల్ మరియు 2px ఆర్బిటాళ్ళను పరస్పరం కలిసిపోయి (intermix) పునర్వ్వస్థీకరించబడటం ద్వారా రెండు సర్వసమానమైన ఆర్బిటాళ్ళు ఏర్పడతాయి.
- హుండ్ నియమం ప్రకారం, సంకరీకరణం ద్వారా ఏర్పడిన ప్రతి ఆర్బిటాల్ ఒక ఎలక్ట్రానన్ను కలిగి ఉంటుంది.
- సంకరీకరణంలో పాల్గొన్న ఆర్బిటాళ్ళ రకాలను బట్టి ఏర్పడిన ఈ నూతన ఆర్బిటాళ్ళను sp ఆర్బిటాళ్ళు అంటాం.
- రెండు sp ఆర్బిటాళ్ళ మధ్య బంధకోణం 180°గా ఉంటుంది.
- బెరీలియంతో బంధంలో పాల్గొనే రెండు క్లోరిన్ పరమాణువులలో ప్రతి క్లోరిన్ పరమాణువు యొక్క 3pz2 ఆర్బిటాల్, బెరీలియం యొక్క sp సంకర ఆర్బిటాల్తో పటంలో చూపినట్లు అతిపాతం చెందటం వలన రెండు సర్వసమానమైన Be-Cl సిగ్మా బంధాలు. (σ sp-p బంధాలు) ఏర్పడతాయి.
- అందుకే Cl\(\hat{B e}\)Cl బంధకోణం 180° గా ఉండే సమాన బలాలు గల రెండు బంధాలు ఏర్పడతాయి.
ప్రశ్న 17.
గాజు దిమ్మె యొక్క వక్రీభవన గుణకాన్ని కనుగొనుటకు ఒక కృత్యాన్ని రాయండి.
జవాబు:
- గాజు దిమ్మె మందాన్ని కొలిచి మీ నోట్బుక్ రాసుకొనుము.
- గాజు దిమ్మెను డ్రాయింగ్ చార్టుపై మధ్య భాగంలో ఉంచుము.
- గాజు దిమ్మె అంచు ABCD దీర్ఘచతురస్రాన్ని గీయుము.
- AB రేఖకు ఏదేని బిందువు వద్ద లంబాన్ని గీయుము.
- గాజు దిమ్మెను ABCD దీర్ఘ చతురస్రంలో ఉంచుము.
- ఒక గుండుసూదిని తీసుకొని, AB రేఖకు గీసిన లంబంపై గాజు దిమ్మె నుండి 15 సెం.మీ. దూరంలో P బిందువు వద్ద ఉంచుము.
- ఆ గుండుసూదిని గాజు దిమ్మె యొక్క రెండోవైపు నుండి చూస్తూ మరొక గుండుసూదిని మొదటిదానితో ఒకే సరళరేఖలో ఉండునట్లు అమర్చుము.
- గాజు దిమ్మెను తొలగించి గుండుసూదుల స్థానాన్ని పరిశీలించుము.
- రెండవ గుండుసూది కొన నుండి మొదటి గుండుసూది ఉంచిన రేఖపైకి ఒక లంబాన్ని గీయుము.
- వాటి ఖండన బిందువు Q గా గుర్తించుము.
- P, Q ల మధ్య దూరాన్ని కొలిచిన, ఇది లంబ విస్థాపనం అగును.
- గాజు దిమ్మె నుండి గుండుసూది దూరాన్ని మార్చి ఈ ప్రయోగాన్ని మరలా చేయుము.
- లంబ విస్థాపనం మారదని మనము గుర్తించవచ్చును.
- గాజు వక్రీభవన గుణకాన్ని క్రింది సూత్రం ద్వారా కనుగొనవచ్చును.
(లేదా),
ఆల్కహాలు, గ్లూకోజ్ వంటి లవణాలు హైడ్రోజన్ ను కలిగి ఉన్నప్పటికీ అవి ఆమ్లాలు కావు. దీనిని ఒక కృత్యం ద్వారా వివరించండి.
జవాబు:
కావలసిన పరికరాలు : గ్లూకోజ్, ఆల్కహాల్, HCl ద్రావణం, బీకరు, గ్రాఫైట్ కడ్డీలు, బల్బు, హోల్డర్, వేర్వేరు రంగులు గల విద్యుత్ వాహక తీగలు.
పద్ధతి :
- ఒక గాజు బీకరులో రెండు గ్రాఫైట్ కడ్డీలను ఉంచుము.
- ఒక గ్రాఫైట్ కడ్డీకి వాహకం యొక్క మొదటి కొనను అమర్చవలెను. రెండవ కొనను 230 వోల్టుల పవర్ సప్లైకి కలపటానికి సిద్ధంగా ఉంచవలెను.
- వేరే రంగులోని వాహక తీగల యొక్క మొదటి కొనను రెండవ గ్రాఫైట్ కడ్డీకి అమర్చవలెను. తీగ యొక్క రెండవ కొనను బల్బు కలిగిన హోల్డరుకు కలపవలెను.
- ఇదే రంగు గల వాహక తీగను హోల్డర్ యొక్క రెండవ కొనకు కలిపి, 230 వోల్టుల పవర్ సప్లైకి కలపటానికి సిద్ధంగా ఉంచాలి.
- మొదట బీకరులో HCl జలద్రావణాన్ని తీసుకొని వలయంలో రెండు చివరలను 230 వోల్టుల ఎ.సి. విద్యుత్ ప్రవాహానికి
- బల్బు వెలుగుతుందంటే ఆ ద్రావణం గుండా విద్యుత్ ప్రసరిస్తుందని తెలుస్తుంది.
- HCl వంటి ఆమ్లాలు జలద్రావణంలో ఆమ్ల ధర్మాలకు కారణమైన హైడ్రోజన్ అణువుల (H+) ను ఇస్తాయి. అందువలన విద్యుత్ ప్రసారం జరిగినది.
- ఇపుడు బీకరులో గ్లూకోజ్ ద్రావణాన్ని తీసుకొని ప్రయోగాన్ని కొనసాగించండి. బల్బు వెలగలేదు. అనగా విద్యుత్ ప్రసారం జరగలేదు.
- బీకరులో ఆల్కహాల్ ద్రావణాన్ని తీసుకొని ప్రయోగాన్ని కొనసాగించండి. బల్బు వెలగలేదు. అనగా విద్యుత్ ప్రసారం
జరగలేదు. - విద్యుత్ ప్రసారానికి కావల్సిన అయాన్లు గ్లూకోజ్లోనూ, ఆల్కహాల్లోనూ లేవు.
- గ్లూకోజ్ (C12H22O11), ఆల్కహాల్ (C2H5OH) సంఘటనాలలో హైడ్రోజన్ ఉన్నప్పటికీ జలద్రావణంలో H+ అయానులను ఇచ్చే వాటిని మాత్రమే ఆమ్లాలంటారు. కాబట్టి గ్లూకోజ్, ఆల్కహాల్ ఆమ్లాలు కావు.
నిర్ధారణ : దీనిని బట్టి ఈ ద్రావణాలలో H+ అయానులు ఉండవని అర్థమవుతుంది. ద్రావణాలలో విడుదలైన H+ అయాన్లు మాత్రమే ఆమ్లాల యొక్క స్వభావాన్ని నిర్ధారిస్తాయి.