Solving AP 10th Class Physical Science Model Papers Set 5 in Telugu Medium regularly is an effective strategy for time management during exams.
AP 10th Class Physical Science Model Paper Set 5 with Solutions in Telugu
Time: 2 Hours
Maximum Marks: 50
సూచనలు :
- ఈ ప్రశ్నాపత్రంలో 4 విభాగాలు మరియు 17 ప్రశ్నలు ఉండును.
- III వ విభాగం నందు కేవలం 12వ ప్రశ్నకు మాత్రమే మరియు IV వ విభాగం నందు గల అన్ని ప్రశ్నలకు అంతర్గత ఎంపిక కలదు.
- 2 గంటల సమయంలో, 15 నిమిషాల సమయం ప్రశ్నపత్రం చదువుటకై కేటాయింపబడినది.
- అన్ని సమాధానములు మీకివ్వబడిన సమాధాన పత్రంలోనే రాయవలెను.
- అన్ని సమాధానములు స్పష్టంగాను, గుండ్రంగాను రాయవలెను.
విభాగము – I 8 × 1 = 8 మా.
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 1 మార్కు.
ప్రశ్న 1.
కటక సూత్రాన్ని రాసి అందలి పదాలను వివరింపుము.
జవాబు:
- కటక సూత్రం : \(\frac{1}{f}\) = \(\frac{1}{v}\) – \(\frac{1}{u}\)
- f = నాభ్యంతరం; v = ప్రతిబింబ దూరం, u – వస్తు దూరం
ప్రశ్న 2.
ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ నియమాన్ని రాయండి.
జవాబు:
ఒక సంవృత వలయంలో ఏర్పడ్డ విద్యుచ్ఛాలక బలం యొక్క విలువ దానిగుండా పోయే అయస్కాంత అభివాహపు మార్పు రేటుకు సమానం.
ప్రశ్న 3.
అధిక చర్యాశీలత గల లోహాల నిష్కర్షణకు ఏ పద్ధతిని సూచిస్తావు? ఎందుకు?
జవాబు:
- అధిక చర్యాశీలత గల లోహాల నిష్కర్షణకు అత్యంత మేలైన పద్ధతి విద్యుత్ విశ్లేషణ.
- సాధారణ క్షయకరణ పద్ధతులైన వేడి చేయటం వంటి పద్ధతులలో, చాలా ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే క్షయకరణం సాధ్యపడుతుంది. దీనికి ఎక్కువ ఖర్చు కూడా అవుతుంది.
ప్రశ్న 4.
క్రింద ఇవ్వబడిన పట్టిక ఆధారంగా, ప్రశ్నలకు జవాబులిమ్ము.
కుంభాకార కటక నాభ్యంతరం | వస్తు దూరం | ప్రతిబింబ దూరం |
5 20.మీ. | 10 సెం.మీ. | 10 సెం.మీ. |
1) ప్రతిబింబ లక్షణాలు ఏమిటి ?
2) ఆవర్ధనం ఎంత ?
జవాబు:
1) నిజ, తలక్రిందుల ప్రతిబింబం
2) ఆవర్ధనం = 1 (∵ \(\frac{10}{10}\) = 1
ప్రశ్న 5.
dxy ఆర్బిటాల్ పటం గీయుము.
జవాబు:
dxy – ఆర్బిటాల్
ప్రశ్న 6.
వాషింగ్ సోడా ఉపయోగాలు రెండింటిని రాయుము.
జవాబు:
వాషింగ్ సోడా ఉపయోగాలు :
- గాజు, సబ్బులు, కాగితం పరిశ్రమలలో ఉపయోగిస్తారు.
- బోరాక్స్ వంటి సోడియం సమ్మేళనాల తయారీకి ఉపయోగిస్తారు.
- గృహావసరాలలో వస్తువులను శుభ్రపరచడానికి ఉపయోగిస్తారు.
- నీటి యొక్క శాశ్వత కాఠిన్యతను తొలగించడానికి ఉపయోగిస్తారు.
ప్రశ్న 7.
పట్టికను పరిశీలించి, ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఉప కర్పరం (l) | గరిష్ట ఎలక్ట్రానుల సంఖ్య |
s | 2 |
p | 6 |
d | 10 |
f | 14 |
1) P – ఆర్బిటాల్లో ఎన్ని గరిష్ఠ ఎలక్ట్రానులు నిండుతాయి ?
2) ఉప కర్పరానికి, గరిష్ఠ ఎలక్ట్రాన్లకి మధ్య సంబంధంనకు సూత్రం రాయుము.
జవాబు:
1) 6
2) 2(2l + 1)
ప్రశ్న 8.
వివిధ సమయాల్లో రెండు పట్టణాలకు సంబంధించి ఉష్ణోగ్రతలు ఇవ్వబడ్డాయి.
పై పట్టిక ఆధారంగా క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.
జవాబు:
A) ‘B’ పట్టణంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది.
B) 11 : 30 AM వద్ద రెండు పట్టణాలలో ఒకే ఉష్ణోగ్రత కలదు.
విభాగము – II 3 × 2 = 6 మా.
సూచనలు :
-
-
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 2 మార్కులు.
-
ప్రశ్న 9.
1s0 2s2 2p4 అనే ఎలక్ట్రాన్ విన్యాసం ఏ నియమాన్ని ఉల్లంఘించింది? ఎలా?
జవాబు:
1s0 2s2 2p4 సూచించిన ఎలక్ట్రాన్ విన్యాసం ఆఫ్ బౌ నియమాన్ని ఉల్లంఘించింది.
ఆఫ్ బౌ నియమం : ఎలక్ట్రానులు మొదట తక్కువ శక్తి గల ఆర్బిటాల్లో నిండిన తర్వాతనే ఎక్కువ శక్తి గల ఆర్బిటాల్లోనికి ప్రవేశిస్తాయి.
1) ఆర్బిటాళ్ళ శక్తులను n + l విలువలతో లెక్కగడతారు.
n | l | n + l | |
1s | 1 | 0 | 1 + 0 = 1 |
2s | 2 | 0 | 2 + 0 = 2 |
2) n + l విలువ 1s ఆర్బిటాల్క తక్కువ కాబట్టి మొదటి, రెండవ ఎలక్ట్రాన్లు 1s లోనికి ప్రవేశించాలి. కానీ పై విన్యాసం అలా జరగలేదు.
3) మూడవ, నాలుగవ ఎలక్ట్రాన్లు 26 లోనికి ప్రవేశించాలి.
4) తర్వాత ఆర్బిటాళ్లు సమ శక్తి గల ఆర్బిటాళ్లు కాబట్టి హుండ్ నియమాన్ని పాటిస్తూ ఎలక్ట్రానులను నింపాలి.
5) పరమాణువు సంఖ్య 6 గల కార్బన్ పరమాణువు ఎలక్ట్రాన్ విన్యాసం ఈ క్రింది విధంగా ఉండాలి.
1s22s22p2
6) రేఖా చిత్ర పద్ధతిలో ఈ క్రింది విధంగా ఉండవలెను.
ప్రశ్న 10.
ఒక మూలకం యొక్క పరమాణు సంఖ్య 19. అయితే ఆవర్తన పట్టికలో దీని స్థానం ఏది? దాని స్థానాన్ని ఎలా చెప్పగలరు?
జవాబు:
మూలకపు పరమాణు సంఖ్య = 19
ఎలక్ట్రానుల అమరిక = 1s2 2s2 2p6 3s2 3p6 4s1 ⇒ (2, 8, 8, 1)
భేదిత ఎలక్ట్రాను 4వ కర్పరంలో ప్రవేశించును. కనుక మూలకం 4వ పీరియడ్కు చెందును.
వేలన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య = 1, కావున ఇది 1వ గ్రూపుకు చెందును.
పరమాణు సంఖ్య 19 కల మూలకము 4వ పీరియడ్ మరియు 1 గ్రూపుకు చెందును.
ప్రశ్న 11.
బాష్పీభవనానికి, మరగడానికి గల తేడాను మీ స్నేహితుడు గుర్తించలేకపోయాడు. అతను ఆ తేడాను గుర్తించడానికి కొన్ని ప్రశ్నలను అడగండి.
జవాబు:
- బాష్పీభవనం ఏ ఉష్ణోగ్రత వద్ద జరుగును ?
- నీరు మరగటం ఏ ఉష్ణోగ్రత వద్ద జరుగును ?
- నీటిని వేడిచేసినపుడు ఆవిరిగా మారును ఈ ప్రక్రియను ఏమంటారు ?
- రోడ్ల ప్రక్కన నిల్వ ఉన్న నీరు ఏ ప్రక్రియ వలన ఆవిరగును ?
- తడిబట్టలు ఆరడం ఏ ప్రక్రియ వలన జరుగును ?
- శరీరంపై చెమట ఆరడం ఏ ప్రక్రియ వలన జరుగును?
- 100°C వద్ద నీరు ఆవిరిగా మారే ప్రక్రియను ఏమంటారు ?
విభాగము – III 3 × 4 = 12 మా.
సూచనలు :
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 4 మార్కులు.
ప్రశ్న 12.
ఈ క్రింది వాటిలో ఏదైనా ఒక పటం గీయండి :
a) పట్టకం ద్వారా కాంతి ప్రయాణ మార్గాన్ని చూపు కిరణ చిత్రాన్ని గీసి, విచలన కోణాన్ని గుర్తించండి.
జవాబు:
b) 1) సబ్బు అణువు ఆకృతిని గీయండి.
2) మీథేన్ అణువు ఆకృతిని గీసి, అణువులో బంధకోణం రాయండి.
జవాబు:
1) సబ్బు అణువును చూపు పటం
2) మీథేన్ అణువులోని బంధకోణం 109°28′
ప్రశ్న 13.
పట్టికను పరిశీలించి, ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
1) ఆక్సైడ్ ధాతువులను రాయండి.
జవాబు:
ఆక్సైడ్ ధాతువులు : బాక్సైట్, మాగ్నటైట్, జింకైట్
2) ప్లవన ప్రక్రియకు అనువుగా ఉండే ధాతువు ఏది?
జవాబు:
గెలీనా (PbS) ప్లవన ప్రక్రియకు అనువైనది.
3) మాగ్నటైట్, బాక్సైట్లలో గల లోహాలు ఏవి ?
జవాబు:
మాగ్నటైట్లో గల లోహం : Mg (మెగ్నీషియం); బాక్సైట్ లో గల లోహం : Al (అల్యూమినియం)
4) మెగ్నీషియం ధాతువులను రాయండి.
జవాబు:
మెగ్నీషియం ధాతువులు : మాగ్నటైట్, ఎప్సమ్ లవణం.
ప్రశ్న 14.
క్రింది సమ్మేళనాల IUPAC పేర్లు రాయండి.
1) CH3 – CH2 – CH2 – CH2OH
2) CH3 – CH2 – CH = CH – CH2 – C = CH
3) CH3 – CH2 – CH2 – CH2 – CHO
4) CH3 – CH2 – CH2 – CH2 – COOH
జవాబు:
1) బ్యుటనోల్ (butanol)
2) 4-ఈన్-1 హెప్టైన్ (4ene-1 heptyne)
3) పెంటనాల్ (pentanal)
4) పెంటనోయికామ్లం (pentanoic acid)
విభాగము – IV 3 × 8 = 24 మా.
సూచనలు :
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 8 మార్కులు.
- ప్రతి ప్రశ్నకు అంతర్గత ఎంపిక కలదు.
ప్రశ్న 15.
కిర్ఛాఫ్ నియమాలు రాసి, ఉదాహరణలతో వివరించండి.
జవాబు:
1) ఒక DC వలయంలో కొన్ని బ్యాటరీలు, నిరోధాలను ఏ విధంగా కలిపినా, దాని ఫలితంను అవగాహన చేసుకునేందుకు అవసరమగు సరళ నియమాలను కిర్ఛాఫ్ నియమాలంటారు.
2) కిర్ఛాఫ్ నియమాలు రెండు రకాలు. అవి :
a) జంక్షన్ నియమం,
b) లూప్ నియమం.
a) జంక్షన్ నియమం : వలయంలో విద్యుత్ ప్రవాహం విభజించబడే ఏ.జంక్షన్ వద్దనైనా, ఆ జంక్షన్కు చేరే విద్యుత్ ప్రవాహాల మొత్తం, ఆ జంక్షన్ను వీడిపోయే విద్యుత్ ప్రవాహాల మొత్తానికి సమానము.
ఉదాహరణ :
i) పటంలో చూపిన విధంగా మూడు లేదా అంతకంటే ఎక్కువ వాహక తీగలు కలిసే బిందువును జంక్షన్ ‘P’ అంటారు.
ii) వలయంలో విద్యుత్ ప్రవాహం విభజించబడే ఏ జంక్షన్ వద్దనైనా, జంక్షన్ ను చేరే విద్యుత్ ప్రవాహాల మొత్తం ఆ జంక్షన్ను వీడిపోయే విద్యుత్ ప్రవాహాల మొత్తానికి సమానము.
iii) అనగా వలయంలోని ఏ జంక్షన్ వద్దనైనా ఆవేశాలు పోగుకావడం అనేది జరుగదు. అందుచే I1 + I4 + I6 = I2 + I3 + I5.
b) లూప్ నియమం : ఒక మూసిన వలయంలోని పరికరాల రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదాల్లో పెరుగుదల, తగ్గుదలల బీజీయ మొత్తం శూన్యం.
ఉదాహరణ : లూప్ నియమాన్ని ప్రక్క పటంలోని వలయానికి అన్వయించగా
ACDBA లూప్ నందు,
– V2 + I2R2 – I1R1 + V1 = 0
EFDCE లూప్నందు,
– (I1 + I2) R3 – I2 R2 + V2 = 0
EFBAE లూప్ నందు,
– (I1 + I2) R3 – I1R1 + V1 = 0
(లేదా)
ఇంద్రధనుస్సు ఏర్పడే విధానాన్ని వివరించండి.
జవాబు:
- ప్రకృతిలోని తెల్లని సూర్యకాంతి, అనేక లక్షల నీటి బిందువుల చేత విక్షేపణం చెందడం వల్ల ఇంద్రధనుస్సు ఏర్పడును.
- పటంలో చూపినట్లుగా నీటి బిందువు పై ప్రాంతం నుండి సూర్యుని కాంతికిరణం లోపలికి ప్రవేశించును.
- అక్కడ జరిగే మొదటి వక్రీభవనంలో తెల్లని కాంతి వివిధ రంగులుగా విక్షేపణం చెందును.
- అన్ని రంగులు నీటి బిందువు రెండో వైపుకు చేరాక, సంపూర్ణాంతర పరావర్తనం వల్ల నీటి బిందువులోనే వెనుకకు పరావర్తనం చెందుతాయి.
- ఫలితముగా నీటి బిందువు మొదటి ఉపరితలాన్ని చేరాక, ప్రతీ రంగు మరలా గాలిలోకి వక్రీభవనం చెందును.
- నీటి బిందువులోకి ప్రవేశించే కిరణాలు, బయటకు వెళ్ళే కిరణాల మధ్య కోణం 0° నుండి 42° మధ్య ఎంతైనా ఉండవచ్చు.
- ఆ కోణం 42° లకు దాదాపు సమానంగా ఉన్నప్పుడు ప్రకాశవంతమైన ఇంద్రధనుస్సును మనం చూడగలము.
- ప్రతి నీటిబిందువు కాంతిని ఏడు రంగులలోకి విడగొట్టినా, ఒక పరిశీలకుడు తాను ఉన్న స్థానాన్ని బట్టి, ఒక నీటి బిందువు నుండి వచ్చే రంగులలో ఏదో ఒకదానిని మాత్రమే చూడగలడు.
- సూర్యకాంతి పుంజానికి, నీటి బిందువుచే వెనుకకు పంపబడిన కాంతికి మధ్యకోణం 42° ఉన్నప్పుడే మనకు ఎరుపు రంగు కనబడుతుంది.
- 40° ల నుండి 42° ల మధ్య కోణంలో VIBGYOR లోని మిగిలిన రంగులు కనిపిస్తాయి.
- ఈ విధముగా ప్రకృతిలో ఇంద్రధనుస్సు ఏర్పడును.
ప్రశ్న 16.
సబ్బు యొక్క శుభ్రపరిచే చర్యను వివరించండి.
జవాబు:
- సబ్బులు, డిటర్జెంట్లు బట్టలలో ఉన్న నూనె మరియు మలినాలను నీటిలోకి వచ్చేటట్లు చేస్తాయి. దాని వలన బట్టలు శుభ్రపరచబడతాయి.
- సబ్బుకు ఒక వైపు కార్బాక్సిల్ (ధృవ) కొన, మరొక వైపు హైడ్రోకార్బన్ గొలుసు (అధృవ) కొన ఉంటాయి.
- ధృవపు చివర హైడ్రోఫిలిక్గా ఉంటుంది. అనగా ఇది నీటిని ఆకర్షిస్తుంది.
- అధృవపు చివర హైడ్రోఫోబిక్గా ఉంటుంది. కాబట్టి బట్టలలోని గ్రీజు లేదా నూనెను ఆకర్షిస్తుంది. కాని నీటిని ఆకర్షించదు.
- సబ్బును నీటిలో కరిగించినపుడు హైడ్రోఫోబిక్ చివర తనంతటతాను మలినాలతో కలిసిపోయి బట్టలలోని మలినాలను తొలగిస్తుంది. దీనిని పక్కన ఇవ్వబడ్డ పటంలో గమనించవచ్చు.
- సబ్బులోని హైడ్రోఫోబిక్ చివర మలినాలు లేక గ్రీజు వైపుకు ఆకర్షించబడుతుంది.
- హైడ్రోఫోబిక్ చివర మలినాలతో కలిసిపోయి మలిన కణాలను బట్టల నుంచి బయటకు లాగటానికి ప్రయత్నిస్తాయి.
- సబ్బు అణువులు మలిన కణాల చుట్టూ చేరి ఒక గోళాకృత నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. దీనిని మిసిలి అంటారు.
- ఈ మిసిలిలు కొల్లాయిడల్ ద్రావణంలోని కణాల లాగ నీటి అడుగున ఉండిపోతాయి.
- వివిధ రకాల మిసిలిలు ఒకదానితో ఒకటి అయాన్-అయాన్ బలాలచే వికర్షించబడటం వలన అవక్షేపాన్ని ఏర్పరచవు.
- కాబట్టి మిసిలిలలో ఉన్న మలిన పదార్థాలను ఉతకటం ద్వారా తేలికగా తొలగించవచ్చు.
- ఈ విధంగా సబ్బు మిసిలిలు నీటిలో కరిగి బట్టలలోని మలినాలను తొలగిస్తాయి.
(లేదా)
i) బోర్ పరమాణు నమూనాను, దాని పరిమితులను రాయండి.
జవాబు:
- పరమాణువులో ఎలక్ట్రానులు, కేంద్రకం నుండి నిర్దిష్ట దూరాలలో ఉన్న నియమిత శక్తిస్థాయిలలో లేదా స్థిర కర్పరాలలో వుంటాయి.
- ఎలక్ట్రాన్ తక్కువ శక్తి స్థాయి (భూస్థాయి) నుండి ఎక్కువ శక్తిస్థాయి (ఉత్తేజిత స్థాయి) లోకి చేరినపుడు శక్తిని గ్రహిస్తుంది. అదేవిధంగా ఎక్కువ శక్తిస్థాయి నుండి తక్కువ శక్తిస్థాయికి దూకినప్పుడు శక్తిని విడుదల చేస్తుంది.
- పరమాణువులో గల ఎలక్ట్రానులకు నిర్దిష్టమైన శక్తి విలువలు ఉంటాయి. అవి E1, E2, E3 …….. అంటే ఎలక్ట్రానుల శక్తి క్వాంటీకరణం చెందుతుంది. ఈ శక్తులకు సంబంధించిన స్థాయిలను స్థిర స్థాయిలు అని, వీటికుండే శక్తి విలువలను శక్తిస్థాయిలు అని అంటారు.
పరిమితులు :
బోర్ పరమాణు నమూనా, రేఖా వర్ణపటంలోని రేఖలు కొన్ని ఉపరేఖలుగా విడిపోవటాన్ని వివరించలేకపోయింది.
ii) క్రోమియం, రాగి ఎలక్ట్రాన్ విన్యాసాలు రాసేటపుడు మినహాయింపులు ఎందుకు ఉంటాయి?
జవాబు:
- పరమాణువు యొక్క బాహ్యస్థాయిలోని సమశక్తి గల ఆర్బిటాళ్ళు సగం నిండినపుడు గానీ, పూర్తిగా నిండినపుడు గానీ పరమాణువుకు అధిక స్థిరత్వం వచ్చును.
- కాపర్ (Cu), క్రోమియం (Cr) పరమాణువులు అధిక స్థిరత్వం కోసం సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం నియమాలను అతిక్రమిస్తాయి.
- క్రోమియం \(\begin{gathered}
\mathrm{Cr} \\
\mathrm{Z}=24
\end{gathered}\) సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం : 1s2 2s2 2p6 3s 2 3p6 4s2 3d4. - కానీ అధిక స్థిరత్వం కోసం క్రోమియం 4s లోని ఒక ఎలక్ట్రాన్ని 4d లోనికి తరలించటం ద్వారా ఎలక్ట్రాన్ విన్యాసంను మార్చుకొంటుంది.
- కాబట్టి క్రోమియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ప్రయోగాత్మకంగా ఈ క్రింది విధంగా ఉండును.
1s2 2s2 2p6 3s2 3p6 4s1 3d5 (లేదా) [Ar] 4s1 3d5 - కాపర్ \(\begin{gathered}
\mathrm{Cu} \\
\mathrm{Z}=29
\end{gathered}\) యొక్క సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం : 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d9 - కానీ అధిక స్థిరత్వం కోసం కాపర్ 4s లోని ఒక ఎలక్ట్రాన్ 44 లోనికి తరలించటం ద్వారా ఎలక్ట్రాన్ విన్యాసాన్ని మార్చుకొనును.
8) కాబట్టి కాపర్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ప్రయోగాత్మకంగా ఈ క్రింది విధంగా ఉండును.
\(\begin{gathered}
\mathrm{Cu} \\
\mathrm{Z}=29
\end{gathered}\) – 1s2 2s2 2p6 3s2 3p6 4s1 3d10 (లేదా) [Ar] 4s1 3d10
ప్రశ్న 17.
ఘన పదార్థాల విశిష్టోష్టాన్ని ప్రయోగపూర్వకంగా ఎలా కనుగొంటారో వివరించండి.
జవాబు:
ఉద్దేశ్యం : ఇచ్చిన ఘనపదార్థాల విశిష్టోష్టం కనుగొనుట.
కావలసిన పరికరాలు : కెలోరిమీటర్, ఉష్ణమాపకం, మిశ్రమాన్ని కలిపే కాడ, నీరు, నీటి ఆవిరి గది, చెక్కపెట్టె, సీసపు గుళ్లు.
- కెలోరీ మీటరు ద్రవ్యరాశి = m1 gr.;
- కెలోరీ మీటరు విశిష్టోష్ణం = Sc కేలరీ/గ్రాం × °C
- నీటితో సహా కెలోరీ మీటరు ద్రవ్యరాశి = m2 gr.
- నీటి ద్రవ్యరాశి = నీటితో సహా కెలోరీ మీటరు ద్రవ్యరాశి – కెలోరీ మీటరు ద్రవ్యరాశి
నీటి ద్రవ్యరాశి = m2 – m1 - నీటి విశిష్టోష్ణం = Sw కేలరీ/గ్రాం × °C;
- నీటి తొలి ఉష్ణోగ్రత = T1 °C
- సీసపు గుళ్లను తీసుకొని వేడి నీటిలో లేదా హీట్ చాంబర్ లో ఉంచి 100°C వరకు వేడి చెయ్యండి.
- సీసపు గుళ్ల ఉష్ణోగ్రత = T2 °C;
- సీసపు గుళ్ల విశిష్టోష్ణం = Sl =
- నీరు, సీసపు గుళ్లు, కెలోరీ మీటరు ద్రవ్యరాశి = m3 గ్రా.
- నీరు, సీసపు గుళ్లు, కెలోరీమీటరు ఉష్ణోగ్రత = T3 °C
- సీసపు గుళ్ల ద్రవ్యరాశి = m3 – m2
- సీసపు గుళ్లు కోల్పోయిన ఉష్ణరాశి Q = m × S × ΔT
Q1 = (m3 – m2) × Sl x (T2 – T3) - నీరు గ్రహించిన ఉష్ణరాశి Q2 = (m2 – m1) × Sw × (T3 – T1)
- కెలోరీ మీటరు గ్రహించిన ఉష్ణరాశి Q3 = m1 × Sc × (T3 – T1)
- కానీ సీసపు గుళ్లు కోల్పోయిన ఉష్ణం = కెలోరీ మీటరు + నీరు గ్రహించిన ఉష్ణరాశి
(m3 – m2) × Sl × (T2 – T1) = m1 × Sc (T3 – T1) + (m2 – m1) × Sw × (T3 – T1)
(m3 – m2) × Sl × (T2 – T1) = (T3 – T1) [m1 × Sc + (m2 – m1) × SW]
Sl = \(\frac{\left(\mathrm{T}_3-\mathrm{T}_1\right)\left[\mathrm{m}_1 \mathrm{~S}_{\mathrm{c}}+\left(\mathrm{m}_2-\mathrm{m}_1\right) \mathrm{S}_{\mathrm{w}}\right]}{\left(\mathrm{T}_2-\mathrm{T}_1\right)\left(\mathrm{m}_3-\mathrm{m}_2\right)}\)
(లేదా)
లవణాల స్ఫటిక జలం అంటే ఏమిటి? దీనిని ఒక కృత్యం ద్వారా వివరింపుము.
జవాబు:
స్ఫటిక జలం : ఏదైనా లవణం యొక్క ఫార్ములాలో నిర్దిష్ట సంఖ్యలో ఉండే నీటి అణువులను స్ఫటిక జలం అంటారు. కావలసిన పరికరాలు : బున్సెన్ బర్నర్, పరీక్ష నాళిక, పట్టకారు, కాపర్ సల్ఫేట్ స్ఫటికాలు.
పద్ధతి :
- కాపర్ సల్ఫేట్ స్ఫటికాల యొక్క నీలిరంగును పరిశీలించండి.
- కొన్ని కాపర్ సల్ఫేట్ స్ఫటికాలను పొడి పరీక్ష నాళికలో తీసుకొని వేడి చెయ్యండి.
- పరీక్షనాళిక లోపలి గోడలపై నీటి బిందువులు ఏర్పడతాయి. ఈ నీటి బిందువులు కాపర్ సల్ఫేట్ నుండి వియోగం చెందిన స్ఫటికజలంగా గుర్తించండి.
- ఇపుడు కాపర్ సల్ఫేట్ యొక్క రంగు తెల్లగా మారటం గుర్తించండి.
- దీనికి కారణం కాపర్ సల్ఫేట్ నుండి స్ఫటికజలం విడిపోవుట వలన తెల్లగా మారిందని గుర్తించండి.
- తెల్లటి కాపర్ సల్ఫేట్ లవణానికి నీటిని కలిపిన వెంటనే నీలిరంగుకు మారుతుంది. దీని ఫార్ములా CuSO45H2O.
- ఈ దృమం ద్వారా కాపర్ మేట్ ముడి బలం కనికి ఉందలి విచారణ జరిగింది.