Solving AP 10th Class Physical Science Model Papers Set 4 in Telugu Medium regularly is an effective strategy for time management during exams.
AP 10th Class Physical Science Model Paper Set 4 with Solutions in Telugu
Time: 2 Hours
Maximum Marks: 50
సూచనలు :
- ఈ ప్రశ్నాపత్రంలో 4 విభాగాలు మరియు 17 ప్రశ్నలు ఉండును.
- III వ విభాగం నందు కేవలం 12వ ప్రశ్నకు మాత్రమే మరియు IV వ విభాగం నందు గల అన్ని ప్రశ్నలకు అంతర్గత ఎంపిక కలదు.
- 2 గంటల సమయంలో, 15 నిమిషాల సమయం ప్రశ్నపత్రం చదువుటకై కేటాయింపబడినది.
- అన్ని సమాధానములు మీకివ్వబడిన సమాధాన పత్రంలోనే రాయవలెను.
- అన్ని సమాధానములు స్పష్టంగాను, గుండ్రంగాను రాయవలెను.
విభాగము – I 8 × 1 = 8 మా.
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 1 మార్కు.
ప్రశ్న 1.
ఆర్ద్రత అనగానేమి ?
జవాబు:
గాలిలోని నీటి ఆవిరి పరిమాణాన్ని ఆర్ద్రత అంటారు.
ప్రశ్న 2.
లెంజ్ నియమాన్ని రాయండి.
జవాబు:
తీగ చుట్టలో అభివాహ మార్పును వ్యతిరేకించే దిశలో ప్రేరణ విద్యుత్ ప్రవాహం వుంటుంది.
ప్రశ్న 3.
క్రింది పటాన్ని పరిశీలించి ‘X’ మరియు ‘Y’ మూలకాలను ఊహించుము.
జవాబు:
X = హైడ్రోజన్ (H)
Y = ఆక్సిజన్ (O)
ప్రశ్న 4.
క్రింది పట్టికను పరిశీలించి, జవాబులు రాయండి.
పదార్థం | విశిష్ట నిరోధం ρ (Ω-m) at 20°C |
A | 1.59 × 10-8 |
B | 4.60 × 10-1 |
C | 1.30 × 1016 |
1) ఏ పదార్థం మంచి విద్యుత్ వాహకము ?
2) పదార్థ విశిష్ట నిరోధం యొక్క ప్రమాణాలు ఏమిటి ?
జవాబు:
1) పదార్థం A
2) Ω – m (ఓమ్ – మీటర్)
ప్రశ్న 5.
సబ్బు కణం పటం గీయండి.
జవాబు:
ప్రశ్న 6.
నిజ జీవితంలో చేతితో ఏరివేయడం, నీటితో కడగడం వంటి ప్రక్రియలు వినియోగించే సందర్భాలు రాయండి.
జవాబు:
- చేతితో ఏరివేయడం : బియ్యంలో రాళ్లు ఏరివేత
- నీటితో కడగడం : బంగాళాదుంపలపై గల మట్టిని తొలగించుటకు నీటితో కడుగుట.
ప్రశ్న 7.
పట్టికలోని ఏ రెండు పదార్థాల జలద్రావణాల మధ్య రసాయనిక చర్య వలన ఎక్కువ ఉష్ణం విడుదల అవుతుంది ? ఈ ఉష్ణమును ఏమంటారు ?
జవాబు:
“B” మరియు “D” ల మధ్య రసాయన చర్య వలన అధిక ఉష్ణం వెలువడును. ఈ వెలువడిన ఉష్ణాన్ని తటస్థీకరణోష్ణం అంటారు.
ప్రశ్న 8.
క్రింది పట్టిక ఆధారంగా, ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులిమ్ము.
1) ఆర్గాన్ యొక్క వేలన్సీ ఎంత ?
2) Ne యొక్క లూయిస్ చుక్కల పటం గీయండి.
జవాబు:
1) ఆర్గాన్ యొక్క వేలన్సీ సున్న
2)
విభాగము – II 3 × 2 = 6 మా.
సూచనలు :
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 2 మార్కులు.
ప్రశ్న 9.
అయస్కాంత బలరేఖలు సంవృతాలా ? వివరించండి.
జవాబు:
అయస్కాంత బలరేఖలు కచ్చితంగా సంవృత రేఖలే. ఎందుకనగా ఇవి ప్రక్కపటంలో చూపిన విధంగా అయస్కాంతమునకు బాహ్యంగా ఉత్తర ధ్రువాన్ని వదలి, దక్షిణ ధ్రువానికి చేరుతాయి. అంతరంగా ఇవి దక్షిణ ధ్రువం నుండి ఉత్తర ధ్రువానికి ప్రయాణిస్తాయి.
ప్రశ్న 10.
ఇథనోల్లో చిన్న సోడియం ముక్కను వేస్తే ఏమి జరుగుతుంది ?
జవాబు:
ఇథనోల్లో సోడియం ముక్కను వేస్తే బుసలు పొంగుతూ హైడ్రోజన్ వాయువు వెలువడుతుంది మరియు ఈ ప్రక్రియలో సోడియం ఇథాక్సైడ్ కూడా ఏర్పడుతుంది.
ప్రశ్న 11.
మీ స్నేహితుడు దృష్టి లోపంతో బాధపడుతున్నాడు. అది ఎటువంటి దృష్టి లోపమో అడిగి తెలుసుకొనుటకు రెండు ప్రశ్నలు తయారు చేయుము.
జవాబు:
- నీవు దగ్గర వస్తువులను స్పష్టంగా చూడగలుగుతున్నావా ?
- నీవు దూరంగా వున్న వస్తువులను స్పష్టంగా చూడగలుగుతున్నావా ?
విభాగము – III 3 × 4 = 12 మా.
సూచనలు :
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 4 మార్కులు.
ప్రశ్న 12.
ఈ క్రింది వాటిలో ఏదైనా ఒక పటం గీయండి :
a) హ్రస్వ దృష్టి లోపం మరియు దానిని సవరించే విధానాన్ని చూపు కిరణ చిత్రాలను గీయండి.
జవాబు:
b) ముడిఖనిజం గానీ లేదా ఖనిజ మాలిన్యం గానీ ఏదో ఒకటి అయస్కాంత పదార్థం అయివుంటే వాటిని వేరుచేసే పద్ధతి పేరు తెల్పండి. ఆ పద్ధతిని సూచించే చక్కని పటాన్ని గీయండి.
జవాబు:
ముడిఖనిజం గానీ లేదా ఖనిజ మాలిన్యం గానీ ఏదో ఒకటి అయస్కాంత పదార్థం అయి ఉంటే వాటిని వేరు చేసే పద్ధతి అయస్కాంత వేర్పాటు పద్ధతి.
ప్రశ్న 13.
ఇవ్వబడిన పట్టికను పరిశీలించి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
మూలకం | ఎలక్ట్రాన్ విన్యాసం |
A | 1s2 2s2 |
B | 1s2 2s2 2p6 3s2 |
C | 1s2 2s2 2p6 3s2 3p3 |
D | 1s2 2s2 2p6 |
1) ఏ ఏ మూలకాలు ఒకే పీరియడ్కు చెందినవి ?
2) ఏ ఏ మూలకాలు ఒకే గ్రూపునకు చెందినవి ?
3) జడవాయువులు ఏవి ?
4) ‘C’ మూలకం ఏ పీరియడ్ మరియు గ్రూపునకు చెందినది ?
జవాబు:
1) A మరియు D లు 2వ పీరియడ్కు చెందినవి. B మరియు C లు 2వ పీరియడ్కు చెందినవి.
2) A మరియు B లు 2వ గ్రూపునకు చెందినవి.
3) మూలకం ‘D’ ఒక జడవాయువు.
4) మూలకం ‘C’ ఏ పీరియడ్ మరియు గ్రూపునకు చెందినది?
ప్రశ్న 14.
i) నీటి విశిష్టోష్ణం అనువర్తనాలను రాయుము.
జవాబు:
- సూర్యుడు ప్రతిరోజు అధిక పరిమాణంలో శక్తిని విడుదల చేస్తాడు. వాతావరణ ఉష్ణోగ్రతను సాపేక్షంగా, స్థిరంగా ఉంచడానికి భూమిపై ఉన్న నీరు, ప్రత్యేకంగా సముద్రాలు ఈ శక్తిని గ్రహించుకొని పరిసరాల ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తాయి.
- ఫ్రిజ్ నుండి బయటకు తీసి ఉంచిన వివిధ రకాల పండ్లతో పోల్చినపుడు పుచ్చకాయ ఎక్కువ సమయం పాటు చల్లదనాన్ని నిలిపి ఉంచుకుంటుంది. దీనికి కారణం పుచ్చకాయలో అధికంగా నీరు ఉండటం మరియు నీటి విశిష్టోష్టం విలువ అధికంగా ఉండటం.
- సమోసాను చేతితో తాకినపుడు వేడిగా అనిపించకపోయినా, దానిని తింటే లోపలి పదార్థాలు వేడిగా ఉన్నాయని తెలుస్తుంది. దీనికి కారణం సమోసా లోపల ఉన్న పదార్థాల విశిష్టోష్ణం ఎక్కువ.
- నీటికున్న అధిక విశిష్టోష్ణ విలువ వలన దానిని థర్మల్ విద్యుత్ కేంద్రాలలోను, కార్ల రేడియేటర్లలోను శీతలీకరణిగా వాడుతారు.
- నీటి యొక్క అధిక విశిష్టోష్ట విలువ వలననే జంతువుల మరియు మొక్కల జీవనం సాధ్యపడుతున్నది.
ii) రవి 80°C వద్ద గల 300 గ్రా నీటిని, 20°C వద్ద గల 500 గ్రా నీటితో కలిపాడు. ఆ మిశ్రమం ఫలిత ఉష్ణోగ్రత ఎంత?
సాధన:
T = \(\frac{\mathrm{m}_1 \mathrm{~T}_1+\mathrm{m}_2 \mathrm{~T}_2}{\mathrm{~m}_1+\mathrm{m}_2}\) = \(\frac{(300 \times 80)+(500 \times 20)}{300+500}\) = \(\frac{24000+10000}{800}\) = \(\frac{34000}{800}\) = 42.5°C
విభాగము – IV 3 × 8 = 24 మా.
సూచనలు :
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 8 మార్కులు.
- ప్రతి ప్రశ్నకు అంతర్గత ఎంపిక కలదు.
ప్రశ్న 15.
ఎండమావులు ఏర్పడే విధానాన్ని వివరించండి.
జవాబు:
ఎండ తీవ్రంగా ఉన్న మధ్యాహ్న సమయంలో తారురోడ్డుపై కొన్నిసార్లు నీరు ఉన్నట్లు కన్పించును, కానీ అక్కడ నీరుండదు. ఈ దృగ్విషయాన్ని “ఎండమావి” అంటారు.
- ఎండమావులు దృక్ భ్రమ వల్ల ఏర్పడు ఒక ఊహాత్మక చిత్రం.
- ఎండమావులు యానకపు వక్రీభవన గుణకాలలోని తేడాల వలన మరియు కాంతి సంపూర్ణాంతర పరావర్తనం వలన ఏర్పడతాయి.
ఏర్పడు విధానం : - వేసవికాలంలో రోడ్డు ఉపరితలానికి దగ్గరగా ఉన్న గాలి వేడిగానూ, రోడ్డు ఉపరితలానికి చాలా ఎత్తులో ఉన్న గాలి చల్లగానూ ఉండును.
- దీనిని బట్టి ఎత్తుపై ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీనివలన గాలి సాంద్రత పెరుగుతుంది.
- ఎత్తు పెరుగుతున్న కొలదీ గాలి వక్రీభవన గుణకం పెరుగును. కావున రోడ్డు ఉపరితలానికి దగ్గరగా ఉన్న వేడిగాలి కంటే పైన ఉన్న చల్లగాలి వక్రీభవన గుణకం ఎక్కువ.
- కాబట్టి పైన ఉన్న చల్లని సాంద్రత గాలి కంటే, క్రింద ఉన్న వేడి విరళగాలిలో కాంతి వేగంగా ప్రయాణించును.
- కాంతి పై నుండి కిందకు, సాంద్రత మారుతున్నటువంటి గాలి గుండా ప్రయాణిస్తూ రోడ్డుకు దగ్గరగా వచ్చినపుడు వక్రీభవనానికి లోనై సంపూర్ణాంతర పరావర్తనం వల్ల పటంలో చూపిన విధంగా ప్రయాణిస్తుంది.
- ఈ విధంగా కాంతి నేలపై పరావర్తనం చెంది వస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది.
- ఇలా జరగడం వల్లనే ఆకాశం యొక్క మిథ్యాప్రతిబింబం పటంలో చూపినట్లు మనకు రోడ్డుపై నీళ్ళ వలె కనబడుతుంది. దీనినే “ఎండమావి” అంటాం.
(లేదా)
మూడు నిరోధాలను సమాంతరంగా కలిపినపుడు వాటి ఫలిత నిరోధానికి ఒక సూత్రాన్ని ఉత్పాదించండి.
జవాబు:
సమాంతర సంధానం : ఒక వలయంలో నిరోధాలు ఉమ్మడి టెర్మినల్కి కలపబడి, వాటి మధ్య ఒకే పొటెన్షియల్ భేదం ఉంటే అవి సమాంతర సంధానంలో ఉన్నాయంటాము.
- ‘V’ పొటెన్షియల్ భేదం ఉన్న ఘటమును తీసుకుని సమాంతర సంధానంలో ఉన్న మూడు నిరోధాలను పటంలో చూపిన విధముగా కలుపుము.
- వలయంలో ప్రవహించే ఫలిత విద్యుత్ ప్రవాహం విడివిడి నిరోధాల ద్వారా ప్రవహించు విద్యుత్ ప్రవాహాల మొత్తానికి సమానము. దీనిని బట్టి I = I1 + I2 + I3 అగును.
- నిరోధాల సమాంతర సంధానంలో పొటెన్షియల్ భేదం ‘V’ మారదు, మూడు నిరోధాల ఫలిత నిరోధాన్ని ‘Req‘ తో సూచిస్తాము.
- సమాంతర సంధానంలో ఫలిత నిరోధం ‘Req‘. ఓమ్ నియమం ప్రకారం,
Req = \(\frac{V}{I}\) ⇒ I = \(\frac{\mathrm{V}}{\mathrm{R}_{\mathrm{eq}}}\) - R1, R2, R3 నిరోధాల గుండా వరుసగా I1, I2, I3, విద్యుత్ ప్రవహించిన, ఓమ్ నియమం ప్రకారం
I1 = \(\frac{\mathrm{V}}{\mathrm{R}_1}\) I2 = \(\frac{\mathrm{V}}{\mathrm{R}_2}\) మరియు I3 = \(\frac{\mathrm{V}}{\mathrm{R}_3}\) - నిరోధాలు సమాంతర సంధానంలో ఉన్నందున I = I1 + I2 + I3 ……….. (1)
- విద్యుత్ ప్రవాహం యొక్క విలువలను సమీకరణం (1) లో ప్రతిక్షేపించిన,
పై సమీకరణం నుండి సమాంతర సంధానంలో ఉన్న నిరోధాల ఫలిత నిరోధం విలువ, ఆ విడివిడి నిరోధాల విలువ కన్నా తక్కువగా ఉంటుంది. (లేదా) సమాంతర సంధానంలో ఫలిత నిరోధం యొక్క వ్యుత్రమణం, విడి నిరోధాల వ్యుత్రమణాల మొత్తానికి సమానము.
ప్రశ్న 16.
క్రింది నియమాలను ఉదాహరణలతో వివరించండి.
i) హుండ్ నియమం
ii) పౌలీవర్ణన నియమం
జవాబు:
i) హుండ్ నియమం : ఈ నియమం ప్రకారం సమాన శక్తి కలిగిన అన్ని ఖాళీ ఆర్బిటాళ్ళు ఒక్కొక్క ఎలక్ట్రాన్చే ఆక్రమింపబడిన తర్వాతనే ఎలక్ట్రాన్లు జతగూడడం ప్రారంభిస్తాయి.
కార్బన్ పరమాణు సంఖ్య Z = 6. ఎలక్ట్రాన్ విన్యాసం 1s22s22p2 ఇందులో మొదటి నాలుగు ఎలక్ట్రాన్లు 1s మరియు 2S ఆర్బిటాళ్ళలోకి చేరతాయి. తరువాత రెండు ఎలక్ట్రానులు వేరు వేరు 2p ఆర్బిటాళ్ళని ఆక్రమిస్తాయి. ఆ రెండు ఎలక్ట్రానుల స్పిన్ ఒకేవిధంగా ఉంటుంది.
ii) పౌలీవర్ణన నియమం : ఒకే పరమాణువుకి చెందిన ఏ రెండు ఎలక్ట్రాన్లకి నాలుగు క్వాంటం సంఖ్యలు సమానంగా ఉండవు.
ఉదా : He, Z = 2
ఎలక్ట్రాన్ విన్యాసం : 1s2
నాలుగు క్వాంటం సంఖ్యలు :
n | l | ml | ms | |
మొదటి ఎలక్ట్రాన్ | 1 | 0 | 0 | +1/2 |
రెండవ ఎలక్ట్రాన్ | 1 | 0 | 0 | -1/2 |
(లేదా)
క్రింది ఇవ్వబడిన ప్రక్రియల గూర్చి రాయండి.
i) భర్జనం
ii) భస్మీకరణం
iii) ప్రగలనం
iv) ప్లవన ప్రక్రియ
జవాబు:
i) భర్జనం :
- భర్జనం ఒక ఉష్ణ రసాయన ప్రక్రియ.
- ఈ ప్రక్రియలో ధాతువును ఆక్సిజన్ లేదా గాలి సమక్షంలో అధిక ఉష్ణోగ్రత (లోహ ద్రవీభవన స్థానం కన్నా తక్కువ ఉష్ణోగ్రత) వద్ద వేడిచేస్తారు.
- ఈ ప్రక్రియలో పొందిన ఉత్పన్నాలు (సల్ఫైడ్ ధాతువు నుండి పొందే లోహ ఆక్సైడ్ వంటివి) ఘన స్థితిలో ఉంటాయి.
- సాధారణంగా భర్జన ప్రక్రియకు రివర్బరేటరీ కొలిమిని వాడతారు.
- ఉదాహరణ : 2 ZnS + 3O2 → 2 ZnO + 2 SO2
ii) భస్మీకరణం :
- భస్మీకరణం ఒక ఉష్ణ రసాయన ప్రక్రియ.
- ఈ ప్రక్రియలో ధాతువును గాలి లేదా ఆక్సిజన్ అందుబాటులో లేకుండా వేడిచేయడం వలన ధాతువు విఘటనం చెందుతుంది.
- ఉదాహరణ : MgCO3 → MgO + CO2 ; CaCO3 + CaO + CO2
iii) ప్రగలనం :
- ప్రగలనం అనేది ఒక ఉష్ణ రసాయన ప్రక్రియ.
- ఈ ప్రక్రియలో ఒక ధాతువును ద్రావకారితో కలిపి, ఇంధనంతో బాగా వేడిచేస్తారు.
- ఉష్ణశక్తి చాలా తీవ్రంగా ఉండటం వలన ధాతువు, లోహంగా క్షయీకరింపబడుతుంది.
- అలాగే లోహాన్ని ద్రవస్థితిలో పొందవచ్చు.
- ప్రగలన ప్రక్రియలో ధాతువులోని మలినాలు ద్రవకారితో చర్యపొంది, సులువుగా తొలగించగల లోహమలంగా ఏర్పడతాయి.
- హెమటైట్ (Fe2O3) ధాతువు విషయంలో కోకు ఇంధనంగాను, సున్నపురాయి (CaCO3) ని ద్రవకారిగాను వాడతారు.
- ప్రగలన ప్రక్రియను బ్లాస్ట్ కొలిమి అనే ప్రత్యేకంగా నిర్మించబడిన కొలిమిలో చేస్తారు.
iv) ప్లవన ప్రక్రియ :
- ఈ పద్ధతి ముఖ్యంగా సల్ఫైడ్ ధాతువుల నుండి ఖనిజ మాలిన్యాన్ని తొలగించడానికి అనువుగా ఉంటుంది.
- ఈ ప్రక్రియలో ఖనిజాన్ని మెత్తని చూర్ణంగా చేసి, నీటితో ఉన్న తొట్టెలో ఉంచుతారు.
- గాలిని ఈ తొట్టెలోకి ఎక్కువ పీడనంతో పంపి నీటిలో నురుగు వచ్చేటట్లు చేస్తారు.
- ఏర్పడిన నురుగు ఖనిజ కణాలను పై తలానికి తీసుకుపోతుంది.
- తొట్టె అడుగు భాగానికి మాలిన్య కణాలు చేరుకుంటాయి.
- ప్లవన ప్రక్రియ ద్వారా సల్ఫైడ్ ధాతువు సాంద్రీకరణ 6) నురుగు తేలికగా ఉండడం వల్ల తెట్టు లాగా ఏర్పడిన ఆ నురుగును దాని నుండి వేరుచేసి, ఆరబెట్టి ధాతుకణాలను పొందవచ్చు.
ప్రశ్న 17.
కటకపు నాభ్యంతరం పరిసర యానకంపై ఆధారపడి వుంటుందని నిరూపించు ప్రయోగాన్ని రాయండి.
జవాబు:
ఉద్దేశ్యం : కుంభాకార కటకంను నీటిలో ఉంచినపుడు, నాభ్యంతరం పెరుగుతుందని పరిశీలించుట.
కావలసిన పరికరాలు : నాభ్యంతరం తెలిసిన కుంభాకార కటకం, కటకంను ఉంచే రింగు, రాయి, స్థూపాకార గాజు పాత్ర మరియు నీరు.
పద్ధతి :
- నాభ్యంతరం తెలిసినటువంటి కుంభాకార కటకంను తీసుకొని, దాని విలువను నోట్ చేసుకొనుము.
- గాజు గ్లాసు వంటి ఒక స్థూపాకార పాత్రను తీసుకొనుము.
- పాత్ర ఎత్తు కటకపు నాభ్యంతరం కంటే చాలా ఎక్కువ (దాదాపు 4 రెట్లు) ఉండేటట్లు చూడాలి.
- పాత్ర అడుగున నల్లటి రాయిని ఉంచుము.
- రాయిపై నుండి కటక నాభ్యంతరం కన్నా ఎక్కువ ఎత్తు వరకు ఉండునట్లు పాత్రలో నీరు నింపుము.
- పటంలో చూపినట్లుగా కటకాన్ని నీటి ఉపరితలానికి సమాంతరంగా ఉండేటట్లు లోతు వరకు కటకాన్ని సమాంతరంగా ముంచుము.
- రాయి ఉపరితలం నుండి కటకానికి గల దూరం కటక నాభ్యంతరానికి ఎక్కువగా ఉండే విధంగా కటకాన్ని పట్టుకొనుము.
- కటకం గుండా రాయిని గమనించుము.
- కటకం గుండా రాయిని చూడగలము, కానీ గాలిలో రాయి, కటకంకు మధ్యదూరం నాభ్యంతరం కంటే తక్కువ దూరం లోపే రాయి ప్రతిబింబాన్ని చూడగలిగాము. దీనినిబట్టి నీటిలో ఉన్నప్పుడు కటక నాభ్యంతరం పెరిగిందని తెలుస్తుంది.
- ఈ కృత్యం ద్వారా కటక నాభ్యంతరం పరిసర యానకంపై ఆధారపడుతుందని మనం నిర్ధారించవచ్చును.
(లేదా)
సోడియం కార్బోనేట్లు, సోడియం హైడ్రోజన్ కార్పోనేట్లు ఆమ్లాలతో చర్య జరిపి CO2 నీటిని విడుదల చేస్తాయని నిరూపించు ప్రయోగాన్ని రాయండి.
జవాబు:
కావలసిన పరికరాలు: రెండు పరీక్ష నాళికలు, సోడియం కార్బొనేట్, సోడియం బై కార్బొనేట్. రెండు రంధ్రాలు గల రబ్బరు బిరడా, థిసిల్ గరాటు, వాయు వాహక నాళం, స్టాండు.
- రెండు పరీక్షనాళికలను తీసుకొని వాటిపై A మరియు B అక్షరాలను రాసిన కాగితాలు అతికించండి.
- A పరీక్షనాళికలో 0.5 గ్రా॥ సోడియం కార్బొనేట్ను, B పరీక్షనాళికలో 0.5గ్రా॥ సోడియం బైకార్బొనేట్ను తీసుకోండి.
- రెండు పరీక్ష నాళికలకు 2 మి.లీ. చొప్పున సజల HCl ద్రావణాన్ని కలపండి.
- రెండు పరీక్షనాళికలలో నుండి వెలువడిన వాయువులను వేర్వేరుగా సున్నపు తేట ద్వారా పటంలో చూపినట్లు పంపి మీ పరిశీలనలు నమోదు చెయ్యండి.
- ఈ కృత్యాలలో జరిగిన చర్యలను ఈ కింది విధంగా రాయవచ్చు.
Na2CO3 + 2HCl → 2NaCl + H2O + CO2
NaHCO3 + HCl → NaCl + H2O + CO2 - పై కృత్యం నుండి అన్నీ లోహకార్బొనేట్లు మరియు లోహ హైడ్రోజన్ కార్బొనేట్లు ఆమ్లాలతో చర్య జరిపి ఆయా లోహలవణాలతో పాటు CO2 వాయువును మరియు నీటిని ఏర్పరుస్తాయని మీరు నిర్ధారించగలరు.
- పై రసాయన చర్యల సాధారణ రూపాలను ఈ విధంగా రాయవచ్చు.
- లోహ కార్బొనేట్ + ఆమ్లం → లవణం + CO2 + నీరు
- లోహ హైడ్రోజన్ కార్బొనేట్ + ఆమ్లం → లవణం + CO2 + నీరు.