Solving AP 10th Class Physical Science Model Papers Set 3 in Telugu Medium regularly is an effective strategy for time management during exams.
AP 10th Class Physical Science Model Paper Set 3 with Solutions in Telugu
Time: 2 Hours
Maximum Marks: 50
సూచనలు :
- ఈ ప్రశ్నాపత్రంలో 4 విభాగాలు మరియు 17 ప్రశ్నలు ఉండును.
- III వ విభాగం నందు కేవలం 12వ ప్రశ్నకు మాత్రమే మరియు IV వ విభాగం నందు గల అన్ని ప్రశ్నలకు అంతర్గత ఎంపిక కలదు.
- 2 గంటల సమయంలో, 15 నిమిషాల సమయం ప్రశ్నపత్రం చదువుటకై కేటాయింపబడినది.
- అన్ని సమాధానములు మీకివ్వబడిన సమాధాన పత్రంలోనే రాయవలెను.
- అన్ని సమాధానములు స్పష్టంగాను, గుండ్రంగాను రాయవలెను.
విభాగము – I 8 × 1 = 8 మా.
ప్రశ్న 1.
40°C ను కెల్విన్మానంలోకి మార్చండి.
జవాబు:
40°C = (40 + 273) K = 313 కెల్విన్లు
ప్రశ్న 2.
క్రింది పట్టికను పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానమును వ్రాయండి.
పదార్థము | వక్రీభవన గుణకము |
నీరు | 1.33 |
మంచు | 1.31 |
A) ఏది సాంద్రతర యానకం ?
B) ఏ యానకంలో కాంతి వేగం ఎక్కువ ?
జవాబు:
A) నీరు సాంద్రతర యానకం
B) మంచులో కాంతి వేగం ఎక్కువ.
ప్రశ్న 3.
‘s’ ఆర్బిటాల్ ఆకృతిని గీయండి.
జవాబు:
‘s’ ఆర్బిటాల్
ప్రశ్న 4.
3Ω, 3Ω నిరోధాలను శ్రేణి సంధానం చేసినపుడు ఫలిత నిరోధాన్ని గణించండి.
జవాబు:
Rఫలితం = R1 + R2 = 3Ω + 3Ω = 6Ω
ప్రశ్న 5.
ప్రకృతిలో ఆక్సైడ్ రూపంలో లభించే ఏవేని రెండు లోహాలను పేర్కొనండి.
జవాబు:
ప్రకృతిలో ఆక్సైడ్ రూపంలో లభించే మూలకాలు :
- హెమటైట్ (Fe2O3) – Fe,
- జింకైట్ (ZnO) – Zn
ప్రశ్న 6.
వాక్యం 1 : ఆల్కేనులు ప్రతిక్షేపణ చర్యలలో మాత్రమే పాల్గొంటాయి.
వాక్యం 2 : ఆల్కేనులు సంకలన చర్యలలో మాత్రమే పాల్గొంటాయి.
సరియైన సమాధానాన్ని ఎంచుకొని సమాధాన పత్రంలో దానిని వ్రాయండి.
A) వాక్యం 1 మాత్రమే సత్యం
B) వాక్యం 2 మాత్రమే సత్యం
C) వాక్యాలు 1,2 సత్యములు
D) వాక్యాలు 1,2 అసత్యములు
జవాబు:
A) వాక్యం 1 మాత్రమే సత్యం
ప్రశ్న 7.
a, b, c భాగాల pH ఇండికేటర్ రంగు
A) a → ఎరుపు, b → ఆకుపచ్చ, c → ఊదారంగు
B) a → ఊదారంగు, b ఆకుపచ్చ, c → ఎరుపు
C) a → పసుపు, b → ఆకుపచ్చ, c → నీలి ఆకుపచ్చ
D) a ఆకుపచ్చ, b → ఎరుపు, c → పసుపు
జవాబు:
(C) a → పసుపు, b → ఆకుపచ్చ, c → నీలి ఆకుపచ్చ
ప్రశ్న 8.
BeCl2 మరియు BF3 ల బంధకోణాలు వ్రాయండి.
జవాబు:
BeCl2 లో బంధ కోణం – 180°
BF3 లో బంధ కోణం – 120°
విభాగము – II 3 × 2 = 6 మా.
సూచనలు :
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 2 మార్కులు.
ప్రశ్న 9.
ఆకాశం నీలంగా ఎందుకు ఉంటుందో ఊహించి వ్రాయండి.
జవాబు:
- ఆకాశం నీలిరంగుగా ఉండుటకు కారణము కాంతి యొక్క పరిక్షేపణము.
- కాంతి పరిక్షేపణమనగా ఒక కణం శోషించుకున్న కాంతిని తిరిగి అన్ని దిశలలో వివిధ తీవ్రతలతో విడుదల చేయడాన్ని “కాంతి పరిక్షేపణం” అంటాము.
- వాతావరణంలో వివిధ పరిమాణాలు గల కణాలుంటాయి.
- వాతావరణంలోని నైట్రోజన్, ఆక్సిజన్ అణువు పరిమాణం నీలి రంగు కాంతి తరంగదైర్ఘ్యంతో పోల్చదగిన
విధముగా ఉంటుంది. - ఈ అణువులు నీలి రంగు కాంతికి పరిక్షేపణ కేంద్రాలుగా పనిచేస్తాయి.
- వాతావరణంలో నైట్రోజన్, ఆక్సిజన్ అణువులు ఎక్కువగా వుండటం వల్ల, అవి నీలిరంగు కాంతికి పరిక్షేపణ కేంద్రాలుగా పనిచేయడం వల్ల ఆకాశం నీలిరంగులో కనిపిస్తుంది.
ప్రశ్న 10.
నవీన ఆవర్తన పట్టికను గురించి ఏవేని రెండు ప్రశ్నలు అడగండి.
జవాబు:
1. ఏ ధర్మము ఆధారంగా నవీన ఆవర్తన పట్టిక నిర్మింపబడినది ?
2. నవీన ఆవర్తన పట్టికలో ఎన్ని బ్లాక్ లు కలవు ?
ప్రశ్న 11.
పైన ఉన్న మూలకాలలో ఏ రెండు మూలకాల వేలన్సీ (సంయోజకత) శూన్యము ?
జవాబు:
He మరియు Ne
విభాగము – III 3 × 4 = 12 మా.
సూచనలు :
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 4 మార్కులు.
ప్రశ్న 12.
ఈ క్రింది వాటిలో ఏదైనా ఒక పటం గీయండి :
a) కుంభాకార కటకం ముందు 2F2 వద్ద వస్తువునుంచినపుడు ఏర్పడే ప్రతిబింబ రేఖాచిత్రాన్ని గీయండి.
జవాబు:
b) నీటిలో కరిగిన ఆమ్ల ద్రావణం విద్యుద్వాహకతను కలిగిస్తుందని చూపే పటాన్ని గీయండి.
జవాబు:
ప్రశ్న 13.
X నుండి M కు విలువలు ఆరోహణ క్రమంలో ఉన్నాయి. A యొక్క విలువ 7.
1. ఏ అక్షరాలు బలమైన ఆమ్లాన్ని సూచిస్తాయి ?
2. K, L లలో ఏది బలమైన క్షారం ?
3. ఏ అక్షరాలు బలహీనమైన క్షారాన్ని సూచిస్తాయి ?
4. ఏ అక్షరం ‘తటస్థం’ను సూచిస్తుంది ?
జవాబు:
1) ‘X’ బలమైన ఆమ్లం
2) ‘L’ బలమైన క్షారం
3) ‘K’ బలహీన క్షారం
4) ‘A’ తటస్థం
ప్రశ్న 14.
కార్బన్ మరియు దాని రూపాంతరాల ఉపయోగాలు ఏవేని నాల్గింటిని వ్రాయండి.
జవాబు:
- గ్రాఫైట్ : దీనిని విద్యుద్వాహకంగాను మరియు కందెనగాను వినియోగిస్తారు.
- వజ్రం : దీనిని గాజు కోత యంత్రాలలోను, ఆభరణాలలోను వినియోగిస్తారు.
- ఫుల్లరిన్ : దీనిని మెలనోమా వంటి క్యాన్సర్ల నివారణలో ఉపయోగిస్తారు.
- నానో ట్యూబులు : వీటిని అణు తీగలుగా వినియోగిస్తారు.
విభాగము – IV 3 × 8 = 24 మా.
సూచనలు :
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 8 మార్కులు.
- ప్రతి ప్రశ్నకు అంతర్గత ఎంపిక కలదు.
ప్రశ్న 15.
బాష్పీభవనం, సాంద్రీకరణల మధ్య పోలికలను, తేడాలను వ్రాయండి.
జవాబు:
బాష్పీభవనం | సాంద్రీకరణం |
తేడాలు : 1. ద్రవంలోని అణువులు ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ద్రవ ఉపరితలాన్ని వీడిపోయే ప్రక్రియను బాష్పీభవనం అంటారు. | 1. వాయువు, ద్రవంగా మారే ప్రక్రియను సాంద్రీకరణం అంటారు. |
2. ఇది శీతలీకరణ ప్రక్రియ. | 2. ఇది ఉష్టీకరణ ప్రక్రియ. |
3. ద్రవ స్థితి నుండి వాయుస్థితికి మారుతుంది. | 3. వాయుస్థితి నుండి ద్రవస్థితికి మారుతుంది. |
4. ద్రవ స్థితిలో అణువులు ఉష్ణాన్ని గ్రహించి వాయుస్థితిలోకి మారుతాయి. | 4. వాయుస్థితిలోని అణువులు ఉష్ణాన్ని కోల్పోయి ద్రవస్థితిలోకి మారుతాయి. |
5. దీని వలన వ్యవస్థ ఉష్ణోగ్రత తగ్గుతుంది. | 5. దీని వలన వ్యవస్థ ఉష్ణోగ్రత పెరుగుతుంది. |
6. ఏ ఉష్ణోగ్రత వద్దనైనా జరుగును. | 6. నిర్ధిష్ట ఉష్ణోగ్రత వద్ద జరుగును. |
7. ఉదా : తడి బట్టలలో నీరు బాష్పీభవనం వలన ఆవిరి అయి పొడిగా మారుతుంది. | 7. ఉదా : శీతాకాలంలో ఉదయం పూట గడ్డి మొక్కలపై నీటి బిందువులు ఏర్పడడం. |
పోలికలు : 1. స్థితి మార్పు జరుగును. | 1. స్థితి మార్పు జరుగును. |
2. అణువుల గతిశక్తిలో మార్పు వస్తుంది. | 2. అణువుల గతిశక్తిలో మార్పు వస్తుంది. |
(లేదా)
మోటారు పనిచేసే విధానాన్ని వివరించండి.
జవాబు:
విద్యుచ్ఛక్తిని యాంత్రిక శక్తిగా మార్చే సాధనం విద్యుత్ మోటర్.
పని చేసే విధానం :
- పటంలో చూపిన విధంగా ఒక దీర్ఘచతురస్రాకార ABCD తీగచుట్టను సమ అయస్కాంత క్షేత్రంలో ఉంచామనుకొనుము.
- ఇప్పుడు విద్యుత్ వలయాన్ని స్విచ్ ఆన్ చేసి దీర్ఘచతురస్రాకారపు తీగచుట్టలో విద్యుత్ ప్రవహించునట్లు చేయుము.
- తీగచుట్ట యొక్క AB, CD భుజాలు అయస్కాంత క్షేత్రంతో 90° కోణం చేస్తాయి. అయస్కాంత క్షేత్రం (B)
- AB వద్ద అయస్కాంత బలం పేజీకి లోపలివైపుగా, CD వద్ద అయస్కాంత బలం పేజి నుండి బయటకు పనిచేస్తుంది.
- BC, DA లు అయస్కాంత క్షేత్రంతో చేసే కోణం మారుతూ ఉంటుంది.
- BC వద్ద అయస్కాంత బలంపై వైపుకు, DA వద్ద కిందివైపుకు పనిచేస్తుంది.
- AB, CD ల వద్ద పనిచేసే బలాల వల్ల తీగచుట్ట భ్రమణంలోకి వస్తుంది.
- కానీ తీగచుట్ట సగం భ్రమణం చెందాక AB, CD ల వద్ద పనిచేసే అయస్కాంత బలాలు వ్యతిరేక దిశలోకి మారడం వల్ల తీగచుట్ట తిరిగి వెనుకకు భ్రమణం చేస్తుంది.
- కనుక ప్రతి అర్ధ భ్రమణం తర్వాత తీగచుట్టలో ప్రవహించే విద్యుత్ దిశ వ్యతిరేక దిశలోకి మార్చితే తీగచుట్ట నిరంతరంగా ఒకే దిశలో భ్రమణం చేస్తుంది.
- దీని కొరకు పటంలో చూపినట్లు తీగచుట్ట రెండు కొనలకు C1C2 స్లిపింగ్లు ఏర్పాటు చేసి అవి B1B2 బ్రష్లకు తాకే విధంగా అమర్చాలి.
- అప్పుడు తీగచుట్ట అయస్కాంత క్షేత్రంలో నిరంతరంగా ఒకే దిశలో భ్రమణం చేస్తూ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది. ‘
- ఈ పరికరమే విద్యుత్ మోటార్.
8) పటంలో చూపిన విధంగా NN యొక్క రెండు చివరల నుండి అనగా 0°- 90° కోణాలను గుర్తించుము.
9) ఈ విధంగా NN కు రెండోవైపు కూడా కోణాలను గుర్తించుము.
10) పటంలో చూపిన విధముగా ఈ కోణరేఖలన్నింటినీ ఒక వృత్తంపై వచ్చునట్లుగా గుర్తించుము.
ప్రయోగ నిర్వహణ పద్ధతి :
- క్రింది పటంలో చూపిన విధంగా అర్ధవృత్తాకారపు గాజు పలకను MM వెంబడి అమర్చుము.
- గాజు పలక వ్యాసం MM తో ఏకీభవించాలి. దాని కేంద్రం (O) బిందువుతో ఏకీభవించాలి.
- ఇప్పుడు లేజర్ లైట్ తో NN వెంబడి కాంతిని ప్రసరింపజేయుము. ఈ కాంతి మొదట గాలిలో ప్రయాణించి రెండు యానకాలను వేరుచేయు తలం అయిన MM గుండా ‘O’ బిందువు వద్ద గాజులోకి ప్రవేశిస్తుంది.
- పటంలో చూపినట్లుగా గాజు నుండి బయటకు వచ్చు కాంతి యొక్క మార్గాన్ని గమనించుము.
- ఇప్పుడు NN రేఖకు 15° కోణం (పతన కోణం) చేసే రేఖ వెంబడి లేజర్ కాంతిని ప్రసరింపజేసిన అది ‘O’ బిందువు గుండా పోయే విధంగా జాగ్రత్త తీసుకొనుము.
- ఈ కాంతి గాజుపలక యొక్క వక్రతలం గుండా బయటకు వచ్చు కాంతిని పరిశీలించి, దాని వక్రీభవన కోణమును కొలువుము.
- ఈ విధంగా వివిధ పతన కోణాలు 20°, 30°, 40°, 50° మరియు 60° లతో ఈ ప్రయోగాన్ని చేసి, వాటి వక్రీభవన కోణాలను క్రింది పట్టికలో నమోదు చేయుము.
- ప్రతీ i, r విలువలకు sini, sin rలను లెక్కించి, \(\frac{\sin i}{\sin r}\) విలువను గణించుము.
- ప్రతీ సందర్భంలో sin i, sin r నిష్పత్తి విలువ ‘స్థిరము.
(లేదా)
ఆమ్లంతో లోహం చర్యను ప్రయోగపూర్వకంగా వివరించండి.
జవాబు:
కావలసిన పరికరాలు : పరీక్ష నాళిక, వాయు వాహక నాళం, డెలివరీ గొట్టం, గాజు తొట్టె, కొవ్వొత్తి, సబ్బు నీరు, సజల HCl, జింకు ముక్కలు, రబ్బరు బిరడా, స్టాండ్.
పద్ధతి :
- పరికరాలను పటంలో చూపిన విధంగా అమర్చండి.
- పరీక్ష నాళికలో 10 మి.మీ. సజల HCl ను తీసుకోండి. దానికి కొన్ని జింకు ముక్కలు కలపండి.
- పరీక్షనాళికలో వెలువడిన వాయువును సబ్బు నీటి గుండా పంపండి.
- సబ్బు నీటి గుండా వచ్చే వాయువు బుడగల దగ్గరకు వెలుగుతున్న కొవ్వొత్తిని దగ్గరకు తీసుకురండి.
- వెలువడిన వాయువును మండించినపుడు టవ్ మనే శబ్దం రావటాన్ని మీరు గమనిస్తారు. దీనిని బట్టి వెలువడిన వాయువు హైడ్రోజన్ (H2) అని చెప్పవచ్చు.
- ఈ రసాయన చర్యను ఈ కింది విధంగా రాయవచ్చు.
ఆమ్లం + లోహం → లవణం + హైడ్రోజన్. - పై కృత్యాన్ని H2SO4, HNO3 వంటి ఆమ్లాలతో నిర్వహించండి.
- సజల HNO3 హైడ్రోజన్ వాయువును విడుదల చేయదు.
నిర్ధారణ : ఆమ్లాలు, లోహంతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి.