Solving AP 10th Class Physical Science Model Papers Set 2 in Telugu Medium regularly is an effective strategy for time management during exams.
AP 10th Class Physical Science Model Paper Set 2 with Solutions in Telugu
Time: 2 Hours
Maximum Marks: 50
సూచనలు :
- ఈ ప్రశ్నాపత్రంలో 4 విభాగాలు మరియు 17 ప్రశ్నలు ఉండును.
- III వ విభాగం నందు కేవలం 12వ ప్రశ్నకు మాత్రమే మరియు IV వ విభాగం నందు గల అన్ని ప్రశ్నలకు అంతర్గత ఎంపిక కలదు.
- 2 గంటల సమయంలో, 15 నిమిషాల సమయం ప్రశ్నపత్రం చదువుటకై కేటాయింపబడినది.
- అన్ని సమాధానములు మీకివ్వబడిన సమాధాన పత్రంలోనే రాయవలెను.
- అన్ని సమాధానములు స్పష్టంగాను, గుండ్రంగాను రాయవలెను.
విభాగము – I 8 × 1 = 8 మా.
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 1 మార్కు.
ప్రశ్న 1.
ఉష్ణోగ్రత గురించి ఒక ప్రశ్న అడగండి.
జవాబు:
ఉష్ణోగ్రత అంటే ఏమిటి ?
ప్రశ్న 2.
ఒక కాంతికిరణం విరళయానకం A నుండి సాంద్రతర యానకం B లోనికి పటంలో చూపిన విధంగా ప్రవేశిస్తున్నట్లయితే కాంతికిరణం యొక్క మార్గాన్ని B యానకంలో పూరించే పూర్తి పటాన్ని మీకీయబడిన సమాధాన పత్రంలో గీయండి.
జవాబు:
ప్రశ్న 3.
ఒక మూలకం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s22s22p4, అయిన అది ఏ పీరియడ్కు చెందినది ?
జవాబు:
రెండవ పీరియడ్
ప్రశ్న 4.
‘X’ అనే ఒక మూలకం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 2, 8, అయిన దాని వేలన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్యను వ్రాయండి.
జవాబు:
ఎనిమిది
ప్రశ్న 5.
విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే పరికరం పేరు ఏమి ?
జవాబు:
ఎలక్ట్రిక్ మోటారు
ప్రశ్న 6.
థర్మైట్ ప్రక్రియ యొక్క ఏదైనా ఒక నిత్యజీవిత అనువర్తనాన్ని రాయండి.
జవాబు:
థర్మైట్ ప్రక్రియను విరిగిన రైలు కమ్మీలను, పగిలిన యంత్రపరికరాలను అతికించడానికి ఉపయోగిస్తారు.
ప్రశ్న 7.
ఒక రాగి తీగ చుట్టలో దండాయస్కాంతము స్థిరంగా ఉంచబడింది. అయిన, ఈ క్రింది వాటిలో సరైన వాక్యము.
A) తీగచుట్టలో విద్యుత్ ప్రేరేపించబడును.
B) తీగచుట్టలో విద్యుత్ ప్రేరేపించబడదు.
C) తీగచుట్ట వలన అయస్కాంత క్షేత్రం ఏర్పడును.
D) తీగచుట్టలో విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాలు ఏర్పడును.
జవాబు:
B) తీగచుట్టలో విద్యుత్ ప్రేరేపించబడదు.
ప్రశ్న 8.
పై పటంలో ఏర్పడిన ప్రతిబింబ లక్షణాలు వ్రాయండి.
జవాబు:
తలక్రిందుల, నిజ, చిన్న ప్రతిబింబం.
విభాగము – II 3 × 2 = 6 మా.
సూచనలు :
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 2 మార్కులు.
ప్రశ్న 9.
కటక సూత్రము అనగానేమి ? అందలి పదాలను వివరించుము.
జవాబు:
కటక తయారీ సూత్రము :
1) \(\frac{1}{f}\) = (n – 1) (\(\frac{1}{\mathrm{R}_1}\) – \(\frac{1}{\mathrm{R}_2}\))
ఈ సూత్రమును కటకంను గాలిలో ఉంచిన సందర్భంలో వాడతారు. దీనిలో
R1, R2 లు వక్రతావ్యాసార్ధాలు ; n – వక్రీభవన గుణకము ; f – నాభ్యంతరము
2) కటకంను ఏదైనా యానకంలో ఉంచిన సందర్భంలో \(\frac{1}{f}\) = (nba – 1) (\(\frac{1}{\mathrm{R}_1}\) – \(\frac{1}{\mathrm{R}_2}\))
దీనిలో R1, R2లు వక్రతా వ్యాసార్ధాలు.
f – నాభ్యంతరం
nba – యానకం పరంగా కటకపు వక్రీభవన గుణకం.
nb – కటకం తయారుచేసిన పదార్థపు వక్రీభవన గుణకం.
na – కటకం ఉంచిన యానకపు వక్రీభవన గుణకం.
ప్రశ్న 10.
Na మరియు Na+ లలో పరమాణు పరిమాణం దేనికి ఎక్కువ ఉండునో ఊహించండి. ఎందుకు ?
జవాబు:
- Na+ కంటే Na పరమాణు పరిమాణం ఎక్కువ.
- Na+ అయానులోని కేంద్రకము, Na పరమాణువులోని కేంద్రకము కంటే ఎక్కువ శక్తితో బాహ్య కర్పరములోని ఎలక్ట్రానులను ఆకర్షిస్తుంది.
- అందువలన Na+ అయాను సంకోచింపబడి Na పరమాణువు కంటే చిన్నదిగా ఉంటుంది.
ప్రశ్న 11.
“అయస్కాంత క్షేత్ర బలరేఖల” ను అర్థం చేసుకొనుటకు ఏవైనా రెండు ప్రశ్నలు అడగండి.
జవాబు:
- అయస్కాంత బలరేఖలన్నీ సంవృతాలేనా ?
- అవి ఒకదానికొకటి ఖండించుకుంటాయా ?
- అయస్కాంత బలరేఖల దిశ ఏమిటి ?
విభాగము – III 3 × 4 = 12 మా.
సూచనలు :
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 4 మార్కులు.
ప్రశ్న 12.
ఈ క్రింది వాటిలో ఏదైనా ఒక పటం గీయండి :
a) s మరియు p ఆర్బిటాళ్ళ యొక్క ఆకృతులను గీయండి.
జవాబు:
b) 4 సెం.మీ. నాభ్యంతరం గల ద్వి పుటాకార కటకం ముందు 3 సెం.మీ., 5 సెం.మీ.ల వద్ద ప్రధానాక్షంపై వస్తువును ఉంచినపుడు ఏర్పడే ప్రతిబింబాలకు కిరణచిత్రాలను గీయండి.
జవాబు:
ప్రశ్న 13.
వజ్రం ప్రకాశించడానికి కారణమేమిటి ? దీనిని మీరు ఎలా అభినందిస్తారు ?
జవాబు:
- వజ్రం యొక్క సందిగ్ధ కోణము విలువ చాలా తక్కువ (24.4°).
- కావున వజ్రంలోనికి ప్రవేశించిన కాంతి సంపూర్ణాంతర పరావర్తనం చెందును.
- ఈ లక్షణం వలన వజ్రం ప్రకాశించును.
- వజ్రమును కోసినపుడు పతనకోణం, సందిగ్ధకోణం కన్నా ఎక్కువై సంపూర్ణాంతర పరావర్తనం పదేపదే జరుగును.
- అనగా వజ్రంలోకి ప్రవేశించిన కాంతి సులభంగా సంపూర్ణాంతర పరావర్తనం చెంది వజ్రం మిరుమిట్లుగొలిపే కాంతిలో ప్రకాశవంతంగా మెరయును.
ప్రశ్న 14.
పట్టికను ఉపయోగించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయుము.
ధాతువు | ఫార్ములా |
బాక్సైట్ | Al2O3.2H2O |
మాగ్నసైట్ | MgCO3 |
ఎప్సమ్ లవణం | MgSO4.7H2O |
హెమటైట్ | Fe2O3 |
గెలీనా | PbS |
జిప్సం | CaSO4.2H2O |
a) గెలీనా …………….. లోహం యొక్క ధాతువు.
జవాబు:
లెడ్ లేదా Pb
b) ఇనుము యొక్క ఒక ధాతువును రాయండి.
జవాబు:
హెమటైట్ లేదా Fe2O3
C) పై పట్టికలో కార్బోనేట్ ధాతువు ఏది ?
జవాబు:
మాగ్నసైట్ లేదా MgCO3
d) ఎప్సమ్ లవణంలో ఎన్ని నీటి అణువులు కలవు ?
జవాబు:
ఏడు
విభాగము – IV 3 × 8 = 24 మా.
సూచనలు :
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 8 మార్కులు.
- ప్రతి ప్రశ్నకు అంతర్గత ఎంపిక కలదు.
ప్రశ్న 15.
భాష్పీభవనం, మరగటం ల మధ్య ఏవైనా నాలుగు భేదాలను తెల్పండి.
జవాబు:
భాష్పీభవనం | మరగటం |
1) ద్రవ అణువులు ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ద్రవ ఉపరితలాన్ని వీడిపోయే ప్రక్రియ భాష్పీభవనం. | 1) స్థిరపీడనం, స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలోని పదార్థం వాయుస్థితిలోనికి మారటమే మరగటం. |
2) భాష్పీభవనం అనేది ఉపరితలానికి చెందిన దృగ్విషయం. | 2) మరగటం అనేది ద్రవంలోని అంతర్గత అణువుల మధ్య జరుగుతుంది. |
3) భాష్పీభవనం ఒక శీతలీకరణ ప్రక్రియ. | 3) మరగటం ఉష్ణ ప్రక్రియ. |
4) ఒక ద్రవం యొక్క భాష్పీభవన రేటు ఆ ద్రవ ఉపరితల వైశాల్యం, ఉష్ణోగ్రత మరియు దాని పరిసరాలలో ఉన్న గాలిలో అంతకుముందే చేరి యున్న ద్రవభాష్పం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. | 4) ద్రవం మరగడం ప్రారంభమవగానే ఎంత ఉష్ణాన్ని అందించినా, ద్రవ ఉష్ణోగ్రతలో పెరుగుదల ఆగిపోతుంది. |
(లేదా)
హ్రస్వదృష్టి దోషాన్ని నిర్వచించి, దానిని సవరించు విధానాన్ని వివరించండి.
జవాబు:
హ్రస్వదృష్టి : ఒక వ్యక్తి గరిష్ఠ దూర బిందువుకు ఆవల ఉన్న వస్తువును చూడలేకపోవు దోషాన్ని “హ్రస్వదృష్టి” అంటారు.
- ఏ దూరం వద్ద నున్న బిందువుకు లోపల గల వస్తువుకు మాత్రమే కంటి కటకం రెటీనాపై ప్రతిబింబాన్ని ఏర్పరచుకోగలదో ఆ బిందువును గరిష్ఠ దూర బిందువంటారు.
- గరిష్ఠ దూరబిందువుకు, స్పష్ట దృష్టి కనీస దూరాన్ని తెలిపే బిందువుకు మధ్య వస్తువు ఉన్నప్పుడు కంటి కటకం రెటీనాపై ప్రతిబింబమును ఏర్పరచగలదు.
- గరిష్ఠ దూరబిందువు ఆవల ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబాన్ని కంటి కటకం రెటీనా కంటె ముందు ఏర్పరుస్తుంది.
- కావున ఒక కటకంను ఉపయోగించి గరిష్ఠ దూర బిందువుకు ఆవల ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబాన్ని గరిష్ఠ దూర బిందువు మరియు స్పష్ట దృష్టి కనీస దూరాన్ని తెలిపే బిందువుల మధ్యకు తేగలిగితే ఆ ప్రతిబింబం కంటి కటకానికి వస్తువులా పని చేస్తుంది.
- హ్రస్వదృష్టిని నివారించేందుకు అనంతదూరంలో ఉండే వస్తువు యొక్క ప్రతిబింబాన్ని గరిష్ఠ దూర బిందువు వద్ద ఏర్పరచగలిగే కటకాన్ని ఎంచుకోవాలి.
- దీని కొరకు ద్విపుటాకార కటకమును వాడాలి.
- ఈ ద్విపుటాకార కటకం ఏర్పరిచే ప్రతిబింబం కంటి కటకానికి వస్తువు వలె పనిచేసి, చివరకు వస్తు ప్రతిబింబంను రెటీనాపై ఏర్పరచును.
ప్రశ్న 16.
‘N2‘ అణువు ఏర్పడే విధానాన్ని వివరించండి.
జవాబు:
N2 అణువు ఏర్పడుట :
- 7N యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం (z = 7) = 1s22s2 2px22py2 2pz2
- ఒక నైట్రోజన్ పరమాణువులోని ‘Px‘ ఆర్బిటాల్, వేరొక నైట్రోజన్ పరమాణువులోని ‘Px‘ ఆర్బిటాల్తో అతిపాతం చెందటం ద్వారా సిగ్మా (σ) px – Px బంధం ఏర్పడుతుంది.
- నైట్రోజన్ పరమాణువులో మిగిలిన Py మరియు Pz ఆర్బిటాళ్ళు వేరొక నైట్రోజన్ పరమాణువులోని Py, Pz, ఆర్బిటాళ్ళతో పార్శ్వ అతిపాతం చెంది రెండు పై (π) (py – Pz, మరియు Pz – Pz) బంధాలను ఏర్పరుస్తాయి.
- ఈ విధంగా N2 అణువులోని రెండు నైట్రోజన్ పరమాణువుల మధ్య ఒకటి సిగ్మా(σ), రెండు పై(π) బంధాలు ఏర్పడుతాయి. మొత్తం 3. బంధాలు ఏర్పడుట వలన N2 అణువులో “త్రి బంధం” ఏర్పడుతుంది.
(లేదా)
సబ్బు యొక్క శుభ్రపరిచే చర్యను వివరించండి.
జవాబు:
- సబ్బులు, డిటర్జెంట్లు బట్టలలో ఉన్న నూనె మరియు మలినాలను నీటిలోకి వచ్చేటట్లు చేస్తాయి. దానివలన బట్టలు శుభ్రపరచబడతాయి.
- సబ్బుకు ఒక వైపు కార్బాక్సిల్ (ధృవ) కొన, మరొక వైపు హైడ్రోకార్బన్ గొలుసు (అధృవ) కొన ఉంటాయి.
- ధృవపు చివర హైడ్రోఫిలిక్గా ఉంటుంది. అనగా ఇది నీటిని ఆకర్షిస్తుంది.
- అధృవపు చివర హైడ్రోఫోబిక్ గా ఉంటుంది. కాబట్టి బట్టలలోని గ్రీజు లేదా నూనెను ఆకర్షిస్తుంది. కాని నీటిని ఆకర్షించదు.
- సబ్బును నీటిలో కరిగించినపుడు హైడ్రోఫోబిక్ చివర తనంతటతాను మలినాలతో కలిసిపోయి బట్టలలోని మలినాలను తొలగిస్తుంది. దీనిని పక్కన ఇవ్వబడ్డ పటంలో గమనించవచ్చు.
- సబ్బులోని హైడ్రోఫోబిక్ చివర మలినాలు లేక గ్రీజువైపుకు ఆకర్షించబడుతుంది.
- హైడ్రోఫోబిక్ చివర మలినాలతో కలిసిపోయి మలిన కణాలను బట్టల నుంచి బయటకు లాగటానికి ప్రయత్నిస్తాయి.
- సబ్బు అణువులు మలిన కణాల చుట్టూ చేరి ఒక గోళాకృత నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. దీనిని మిసిలి అంటారు.
- ఈ మిసిలిలు కొల్లాయిడల్ ద్రావణంలోని కణాల లాగ నీటి అడుగున ఉండిపోతాయి.
- వివిధ రకాల మిసిలిలు ఒకదానితో ఒకటి అయాన్- అయాన్ బలాలచే వికర్షించబడటం వలన అవక్షేపాన్ని ఏర్పరచవు.
- కాబట్టి మిసిలిలలో ఉన్న మలిన పదార్థాలను ద్వారా తేలికగా తొలగించవచ్చు.
- ఈ విధంగా సబ్బు మిసిలిలు నీటిలో కరిగి బట్టలలోని మలినాలను తొలగిస్తాయి.
ప్రశ్న 17.
ఓమ్ నియమం తెలపండి. దానిని సరిచూడటానికి ప్రయోగాన్ని తెల్పి, ప్రయోగ విధానాన్ని వివరించండి.
జవాబు:
ఓమ్ నియమము : స్థిర ఉష్ణోగ్రత వద్ద, వాహకం రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదం వాహకం గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది.
ఓమ్ నియమంను సరిచూచుట :
ఉద్దేశ్యం : ఒక వాహకానికి సంబంధించిన V/I విలువ స్థిరమని చూపడము. కావలసిన వస్తువులు : 6V బ్యాటరీ ఎలిమినేటర్, 0-1A, అమ్మీటర్, 0-6V ఓల్టీమీటరు, వాహక తీగలు (రాగి తీగలు), 50 సెం.మీ. పొడవు గల సర్పిలాకార మాంగనీస్ తీగ, రియోస్టాట్, స్విచ్ మరియు 3V LED.
నిర్వహణ పద్ధతి :
- పటంలో చూపిన విధముగా వలయాన్ని కలపండి. (బ్యాటరీ ఎలిమినేటర్లో గరిష్ఠంగా 4.5V దగ్గర నాబ్నుఉంచాలి.
- రియోస్టాట్ను ఉపయోగించి మాంగనీస్ తీగ రెండు కొనల వద్ద పొటెన్షియల్ భేదమును OV నుంచి గరిష్ఠంగా 4.5V మధ్య వరకు మార్చాలి.
- రియోస్టాట్ ఉపయోగించి మాంగనీస్ తీగ రెండు కొనల వద్ద కనీసం 1V పొటెన్షియల్ భేదం ఉంచాలి.
- ఈ సందర్భానికి వలయంలో విద్యుత్ ప్రవాహంను అమ్మీటరు ద్వారా గుర్తించి పట్టికలో నమోదు చేయండి.
- రియోస్టాట్ను ఉపయోగించి పొటెన్షియల్ భేదం (V) 4.5V వరకు మార్చుతూ విద్యుత్ ప్రవాహం (I) విలువలను గుర్తించండి.
- ఈ విధంగా V మరియు I విలువలను కనీసం 5 రీడింగులను గుర్తించి పట్టికలో నమోదు చేయండి.
- ప్రతి సందర్భానికి \(\frac{\mathrm{V}}{\mathrm{I}}\) విలువను కనుగొనండి.
- \(\frac{\mathrm{V}}{\mathrm{I}}\) విలువ స్థిరమని మనము గమనించవచ్చును. V & I అయిన \(\frac{\mathrm{V}}{\mathrm{I}}\) = స్థిరము
- ఈ స్థిరాంకంను వాహక విద్యుత్ నిరోధం అంటాము. దీనిని ‘R’ తో సూచిస్తాము.
\(\frac{\mathrm{V}}{\mathrm{I}}\) = R ⇒ V = IR
∴ ఓమ్ నియమము నిరూపించబడినది.
(లేదా)
లవణాల యొక్క స్ఫటికజలం అనగానేమి ? దీనిని వివరించడానికి ఒక కృత్యాన్ని సూచించండి.
జవాబు:
స్ఫటికజలం : ఏదైనా లవణం యొక్క ఫార్ములాలో నిర్దిష్ట సంఖ్యలో ఉండే నీటి అణువులను స్ఫటిక జలం అంటారు.
కృత్యం:
కావలసిన పరికరాలు : బున్సెన్ బర్నర్, పరీక్షనాళిక, పట్టకారు, కాపర్ సల్ఫేట్ స్ఫటికాలు.
పద్ధతి :
- కాపర్ సల్ఫేట్ స్ఫటికాల యొక్క నీలిరంగును పరిశీలించండి.
- కొన్ని కాపర్ సల్ఫేట్ స్ఫటికాలను పొడి పరీక్ష నాళికలో తీసుకొని వేడి చెయ్యండి.
- పరీక్షనాళిక లోపలి గోడలపై నీటి బిందువులు ఏర్పడతాయి. ఈ నీటి బిందువులు కాపర్ సల్ఫేట్ నుండి వియోగం చెందిన స్ఫటికజలంగా గుర్తించండి.
- ఇపుడు కాపర్ సల్ఫేట్ యొక్క రంగు తెల్లగా మారటం గుర్తించండి.
- దీనికి కారణం కాపర్ సల్ఫేట్ నుండి స్ఫటికజలం విడిపోవుట వలన తెల్లగా మారిందని గుర్తించండి.
- తెల్లటి కాపర్ సల్ఫేట్ లవణానికి నీటిని కలిపిన వెంటనే నీలిరంగుకు మారుతుంది. దీని ఫార్ములా CuSO45H2O.
- ఈ కృత్యం ద్వారా కాపర్ సల్ఫేట్ స్ఫటిక జలం కలిగి ఉందని నిర్ధారణ జరిగింది.