Solving AP 10th Class Physical Science Model Papers Set 1 in Telugu Medium regularly is an effective strategy for time management during exams.
AP 10th Class Physical Science Model Paper Set 1 with Solutions in Telugu
Time: 2 Hours
Maximum Marks: 50
సూచనలు :
- ఈ ప్రశ్నాపత్రంలో 4 విభాగాలు మరియు 17 ప్రశ్నలు ఉండును.
- III వ విభాగం నందు కేవలం 12వ ప్రశ్నకు మాత్రమే మరియు IV వ విభాగం నందు గల అన్ని ప్రశ్నలకు అంతర్గత ఎంపిక కలదు.
- 2 గంటల సమయంలో, 15 నిమిషాల సమయం ప్రశ్నపత్రం చదువుటకై కేటాయింపబడినది.
- అన్ని సమాధానములు మీకివ్వబడిన సమాధాన పత్రంలోనే రాయవలెను.
- అన్ని సమాధానములు స్పష్టంగాను, గుండ్రంగాను రాయవలెను.
విభాగము – I 8 × 1 = 8 మా.
-
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 1 మార్కు.
ప్రశ్న 1.
30°C ను కెల్విన్మానంలోకి మార్చండి.
జవాబు:
30 + 273 = 303K
ప్రశ్న 2.
విశిష్టోష్ణంనకు ఒక అనువర్తనము వ్రాయుము.
జవాబు:
ఫ్రిజ్ నుండి బయటకు తీసి ఉంచిన పుచ్చకాయ ఎక్కువ సమయం పాటు చల్లదనాన్ని నిలిపి ఉంచుకుంటుంది.
ప్రశ్న 3.
నీకు తెలిసిన ఏదైనా కటకం ఆకృతిని గీయండి.
జవాబు:
కుంభాకార కటకం
ప్రశ్న 4.
భావన (A) : K – కర్పరంతో పోల్చినపుడు N – కర్పరం యొక్క శక్తి ఎక్కువ.
కారణం (R) : N – కర్పరం కేంద్రకంనకు దూరంగా ఉంటుంది.
క్రింది వాటి నుండి సరియైనది ఎన్నుకోండి.
P) A మరియు R రెండూ సత్యము మరియు Aకు R సరియైన వివరణ.
Q) A మరియు R రెండూ సత్యము మరియు Aకు R సరియైన వివరణ కాదు.
R) A సత్యము మరియు R అసత్యము.
S) A మరియు R రెండూ అసత్యములు.
జవాబు:
(P) A మరియు R రెండూ సత్యము మరియు A కు R సరియైన వివరణ.
ప్రశ్న 5.
ఈ క్రింది పట్టికను పూరించి, సమాధానాన్ని మీ సమాధాన పత్రంలో రాయండి.
మూలకము | గ్రూపు సంఖ్య | వేలన్సీ ఎలక్ట్రాన్లు |
హైడ్రోజన్ | 1 | |
బెరీలియం | 2 |
జవాబు:
మూలకము | గ్రూపు సంఖ్య | వేలన్సీ ఎలక్ట్రాన్లు |
హైడ్రోజన్ | 1 | 1 |
బెరీలియం | 2 | 2 |
ప్రశ్న 6.
– COOH ప్రమేయ సమూహం కలిగి ఉన్న ఒక పదార్థం పేరు రాయండి.
జవాబు:
ఎసిటిక్ ఆమ్లము (లేదా) CH3COOH
ప్రశ్న 7.
దిగువనీయబడిన పట్టికను పరిశీలించండి మరియు దిగువనీయబడిన ప్రశ్నలకు సమాధానాలు మీ సమాధాన పత్రంలో రాయండి.
పదార్థం | నిరోధకత 20°C వద్ద Ω-m లో |
రాగి | 1.68 × 10-8 |
టంగస్టన్ | 5.60 × 10-8 |
జర్మేనియం | 4.60 × 10-1 |
గాలి | 1.30 × 1016 |
1) ఇచ్చిన పై నాల్గింటిలో ఉత్తమ వాహకం ఏది ?
2) ఇచ్చిన పై నాల్గింటిలో విద్యుత్ బంధకం ఏది ?
జవాబు:
1) రాగి
2) గాలి
ప్రశ్న 8.
శుద్ధ ఎసిటిక్ ఆమ్లం విద్యుద్వాహకతను ఎందుకు ప్రదర్శించదు ?
జవాబు:
శుద్ధ ఎసిటిక్ ఆమ్లంలో అయాన్లుగా విడిపోవటం జరగదు. ఆమ్ల ధర్మాలకు కారణమైన H30+ అయాను లేకపోవుట వలన శుద్ధ ఎసిటిక్ ఆమ్లం విద్యుద్వాహకతను ప్రదర్శించదు. ఎసిటిక్ ఆమ్లానికి కొంత నీటిని కలిపినప్పుడు అతి తక్కువగా వియోగం చెంది తక్కువ పరిమాణంలో HO+ అయాన్లు కలిగి ఉండును. అందువలన దీనిని బలహీనమైన ఆమ్లం అంటారు.
విభాగము – II 3 × 2 = 6 మా.
సూచనలు :
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 2 మార్కులు.
ప్రశ్న 9.
భాష్పీభవన ప్రక్రియను అవగాహన చేసుకొనుటకు ఏవైనా రెండు ప్రశ్నలు రాయండి.
జవాబు:
- భాష్పీభవనం అంటే ఏమిటి ?
- భాష్పీభవనమును ప్రభావితము చేయు అంశాలేవి ?
ప్రశ్న 10.
పరమాణు ఆర్బిటాళ్ళ సంకరీకరణం అవగాహన చేసుకొనుటకు ఏవైనా రెండు ప్రశ్నలు రాయండి.
జవాబు:
- పరమాణు ఆర్బిటాళ్ళ సంకరీకరణం అనగానేమి ?
- పరమాణు ఆర్బిటాళ్ళ సంకరీకరణం ఎన్ని రకాలు ?
ప్రశ్న 11.
ఎలక్ట్రిక్ షాక్ (విద్యుత్ ఘాతం) అంటే ఏమిటి ? ఇది ఎలా సంభవిస్తుంది ?
జవాబు:
- విద్యుత్ పొటెన్షియల్ భేదం, విద్యుత్ ప్రవాహం మరియు శరీర నిరోధాల యొక్క ఫలిత ప్రభావమే విద్యుత్ ఘాతం.
- 240V తీగను శరీరం తాకినపుడు 0.00244 కరెంటు శరీరం గుండా ప్రవహిస్తూ శరీరంలోని అవయవాల పనితీరుకు ఆటంకం కలిగిస్తుంది. దీనినే విద్యుత్ ఘాతం అంటాం.
- శరీరం గుండా ఇంకా విద్యుత్ ప్రవహిస్తూ ఉంటే, శరీర కణజాలం దెబ్బతిని శరీర నిరోధం తగ్గిపోతుంది.
- శరీర నిరోధం తగ్గిపోవడం వలన మరింత కరెంటు శరీరం ద్వారా ప్రవహించడం కొన్ని సందర్భాలలో మరణానికి దారితీస్తుంది.
విభాగము – III 3 × 4 = 12 మా.
సూచనలు :
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 4 మార్కులు.
ప్రశ్న 12.
ఈ క్రింది వాటిలో ఏదైనా ఒక పటం గీయండి :
a) ఒక కుంభాకార కటకం ముందు 2F2 మరియు F2 ల మధ్య వస్తువునుంచినపుడు ఏర్పడు ప్రతిబింబ కిరణ రేఖా చిత్రం గీయండి.
జవాబు:
b) నీటితో నింపబడిన ఒక బీకరు, బర్నరు, థర్మామీటరు మరియు స్టాండు పరికరాలతో నీటి యొక్క భాష్పీభవన స్థానమును కనుగొనే ప్రయోగ పటం గీయండి.
జవాబు:
ప్రశ్న 13.
క్రింది పట్టికను పరిశీలించి మరియు ఖాళీలకు సరియగు సమాధానాలను మీ సమాధాన పత్రంలో రాయండి.
ఉపకర్పరం | ఆర్బిటాళ్ళ సంఖ్య | గరిష్ఠ ఎలక్ట్రాన్ల సంఖ్య |
s | – | 2 |
– | 3 | 6 |
d | 5 | – |
f | – | 14 |
జవాబు:
ఉపకర్పరం | ఆర్బిటాళ్ళ సంఖ్య | గరిష్ఠ ఎలక్ట్రాన్ల సంఖ్య |
s | 1 | 2 |
p | 3 | 6 |
d | 5 | 10 |
f | 7 | 14 |
ప్రశ్న 14.
నిత్య జీవితంలో కార్బన్ యొక్క పాత్రను నీవెట్లు అభినందిస్తావు ?
జవాబు:
- జీవులు జీవించుటకు తోడ్పడే కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, హార్మోన్లు మరియు విటమిన్లు మొదలైన అణువులన్నీ కార్బన్ను కలిగి ఉంటాయి.
- జీవవ్యవస్థలలో జరిగే రసాయనిక చర్యలన్నీ కర్బన సమ్మేళనాలకు సంబంధించినవి.
విభాగము – IV 3 × 8 = 24 మా.
సూచనలు :
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 8 మార్కులు.
- ప్రతి ప్రశ్నకు అంతర్గత ఎంపిక కలదు.
ప్రశ్న 15.
ఒక వ్యక్తి దగ్గరగా ఉండే వస్తువులను స్పష్టంగా చూడగలడు కాని దూరంగా ఉండే వస్తువులను స్పష్టంగా చూడలేడు. అతనికి గల దృష్టిదోషం ఏది ? దీనిని ఎలా సరిచేస్తారు ? వివరించండి.
జవాబు:
- కొందరు దగ్గరగా ఉన్న వస్తువులను చూడగలరు. కానీ దూరంలో ఉన్న వస్తువులను స్పష్టంగా చూడలేరు. ఇటువంటి దృష్టి దోషాన్ని “హ్రస్వదృష్టి” అంటారు.
- ఈ హ్రస్వదృష్టి దోషం గల వ్యక్తులలో దూరంలో ఉన్న వస్తువుల నుంచి వచ్చే కాంతి కిరణాలు కంటి కటకం ద్వారా వక్రీభవనం పొందాక రెటీనాకు ముందు కొంతదూరంలో ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి.
- ద్విపుటాకార కటకాన్ని ఉపయోగించి హ్రస్వదృష్టి దోషాన్ని నివారించవచ్చును.
(లేదా)
విద్యుత్ మోటార్ పనిచేసే విధానాన్ని వివరించండి.
జవాబు:
విద్యుత్ మోటారు విద్యుచ్ఛక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది.
పనిచేయు విధానం :
- ABCD అను దీర్ఘ చతురస్రాకారపు తీగచుట్ట (ఆర్మేచర్)ను సమ అయస్కాంత క్షేత్రములో ఉంచాము అనుకుందాము. 2) దీర్ఘ చతురస్రాకార తీగచుట్ట గుండా విద్యుత్ను ప్రవహింపచేయాలి. తీగచుట్ట యొక్క AB మరియు CD భుజాలు అయస్కాంత క్షేత్రంలో లంబంగా ఉంటాయి.
- బాహ్య అయస్కాంత క్షేత్రము వల్ల AB మరియు CD భుజాలపై సమానబలాలు వ్యతిరేకదిశలో ఉంటాయి. ఈ బలాలు తీగచుట్ట యొక్క రెండు అంచులలో పనిచేయడం వల్ల తీగచుట్ట సవ్యదిశలో భ్రమణం చేస్తుంది.
- అర్ధ భ్రమణం తర్వాత తీగచుట్ట భుజాలపై పనిచేసే, బలాలు ఇంతకుముందు పనిచేసే బలాలు ఇంతకుముందు పనిచేసిన దిశకు వ్యతిరేకదిశలో ఉంటాయి.
- బ్యాటరీకి రెండు బ్రష్లు కలుపబడి ఉంటాయి మరియు తీగచుట్ట కొనలు, దానితోపాటు తిరిగే స్లిపింగ్లకు కలపబడి ఉంటాయి.
- ప్రతీ అర్ధ భ్రమణం తర్వాత బ్రష్లకు తాకే స్లిపింగ్ల స్థానాలు పరస్పరం మారడం వలన తీగచుట్టలో విద్యుత్ ప్రవాహదిశ అంతకుముందున్న దిశకు వ్యతిరేక దిశలోకి మారుతుంది.
- ఫలితంగా తీగచుట్ట భ్రమణదిశ ఎల్లప్పుడూ ఒక దిశలో ఉంటుంది. ఈ విధంగా విద్యుత్, విద్యుత్ మోటారు పనిచేస్తుంది.
ప్రశ్న 16.
క్రింది ధర్మాలు ఆధునిక ఆవర్తన పట్టికలోని గ్రూపులలో, పీరియడ్లలో ఏ విధంగా మార్పు చెందుతాయి ?
a) పరమాణు వ్యాసార్ధం
b) అయనీకరణ శక్తి
c) ఎలక్ట్రాన్ ఎఫినిటీ
d) ఋణవిద్యుదాత్మకత
జవాబు:
a) పరమాణు వ్యాసార్ధం గ్రూపులలో పై నుంచి క్రిందికి పెరుగుతుంది. పరమాణు వ్యాసార్ధం పీరియడ్లలో ఎడమ నుంచి కుడికి తగ్గుతుంది.
b) అయనీకరణ శక్తి గ్రూపులలో పై నుంచి క్రిందికి తగ్గుతుంది. అయనీకరణ శక్తి పీరియడ్లలో ఎడమ నుంచి కుడికి పెరుగుతుంది.
c) ఎలక్ట్రాన్ ఎఫినిటీ గ్రూపులలో పై నుంచి క్రిందికి తగ్గుతుంది. ఎలక్ట్రాన్ ఎఫినిటీ పీరియడ్లలో ఎడమ నుంచి కుడికి పెరుగుతుంది.
d) ఋణవిద్యుదాత్మకత గ్రూపులలో పై నుంచి క్రిందికి తగ్గుతుంది. ఋణవిద్యుదాత్మకత పీరియడ్లలో ఎడమ నుంచి కుడికి పెరుగుతుంది.
(లేదా)
(లేదా)
క్రింది వానిని నిర్వచించండి.
జవాబు:
- భర్జనం : ముడి ఖనిజాన్ని నిర్విరామంగా గాలి సరఫరాతో (లేదా) ఆక్సిజన్తో వేడిచేసే ప్రక్రియను భర్జనం అంటారు.
- భస్మీకరణం : ధాతువును గాలి అందుబాటులో లేకుండా వేడిచేసే ప్రక్రియను భస్మీకరణం అంటారు.
- ప్రగలనం : ధాతువును ద్రావకారి (flux) తో కలిపి, ఇంధనంతో వేడిచేసే ఉష్ణరసాయన ప్రక్రియను ప్రగలనం అంటారు.
- ఖనిజ మాలిన్యం (గ్యాంగ్) : లోహ ధాతువుతో కలిసి ఉన్న మలినాలను ఖనిజమాలిన్యం (గ్యాంగ్) అంటారు.
ప్రశ్న 17.
sin i/sin r విలువ స్థిరమని ప్రయోగపూర్వకంగా ఎలా సరిచూస్తారు ?
జవాబు:
ఉద్దేశ్యం : \(\frac{\sin i}{\sin r}\) స్థిరం అని నిరూపించుము.
కావలసిన పరికరాలు : వైట్ ఛార్ట్, కార్డు బోర్డు షీట్, కోణమానిని, పెన్సిల్, లేజర్ లైట్, అర్ధ వృత్తాకార గాజు దిమ్మె.
పద్ధతి :
- కార్డు బోర్డుపై తెల్లని చార్టు అతికించి పటంలో చూపినట్లు MM, NN అనే రెండు లంబాలు ‘O’ వద్ద ఖండించుకునేటట్లు గీయండి.
- NN రేఖ వెంబడి కోణమానిని ఉంచి, కోణమానిని కేంద్ర బిందువు ‘O’ తో ఏకీభవించేటట్లు చేయండి. NN యొక్క రెండు చివరల నుండి 0° నుండి 90° కోణాలను గుర్తించండి.
- రెండువైపులా కోణాలు గుర్తించండి.
- అర్ధవృత్తాకార గాజు పలకను MM తో ఏకీభవించేటట్లు ఉంచండి.
- 15° పతన కోణం చేసే రేఖ వెంబడి లేజర్లైట్ వేసి వక్రీభవన కోణం గుర్తించండి. ఇదే విధంగా
- పతనకోణపు విలువలను మారుస్తూ వివిధ పతన కోణాలకు వక్రీభవన కోణాలను గుర్తించి పట్టికలో రాయండి.
ఇప్పుడు పట్టికలోనే \(\frac{\sin i}{\sin r}\) విలువ గణించండి.
- ఫలితం : అన్ని సందర్భాలలోను \(\frac{\sin i}{\sin r}\) విలువ స్థిరంగా ఉంటుంది. (పట్టిక నుంచి)
(లేదా)
ఆమ్ల జలద్రావణాలు విద్యుత్వాహకతను ప్రదర్శిస్తాయని నిరూపించు ప్రయోగాన్ని వివరించండి.
జవాబు:
ఉద్దేశ : ఆమ్ల జలద్రావణాలు విద్యుత్ వాహకతను ప్రదర్శిస్తాయి. పరికరాలు : బీకరు, గ్రాఫైట్ కడ్డీలు, బల్బ్, వైరు, సజల HCl ద్రావణం.
పద్ధతి :
- పటంలో చూపిన విధంగా పరికరాలను అమర్చాలి.
- బీకరులో కొంచెం సజల HCl ద్రావణాన్ని పోసిన తరువాత వలయంలో విద్యుత్ను ప్రవహింపజేయండి. వలయంలో బల్బు వెలగడాన్ని పరిశీలిస్తాము.
- బల్బు వెలుగుతుందంటే ఆ ద్రావణం గుండా విద్యుత్ ప్రసరిస్తుందని తెలుస్తుంది.
- ఆమ్ల ద్రావణాలలో అయానులుంటాయి. ఈ అయానుల చలనం వల్లే ఆ ద్రావణాలలో విద్యుత్ ప్రసారం జరుగుతుంది.
ఫలితం : దీనిని బట్టి ఆమ్ల జలద్రావణాలు విద్యుత్ వాహకతను ప్రదర్శిస్తాయి అని నిరూపించబడింది.