Solving AP 10th Class Physical Science Model Papers and AP 10th Class Physical Science Model Paper 2024 in Telugu Medium regularly is an effective strategy for time management during exams.
AP 10th Class Physical Science Model Paper 2024 with Solutions in Telugu
Time: 2 Hours
Maximum Marks: 50
సూచనలు :
- ఈ ప్రశ్నాపత్రంలో 4 విభాగాలు మరియు 17 ప్రశ్నలు ఉండును.
- III వ విభాగం నందు కేవలం 12వ ప్రశ్నకు మాత్రమే మరియు IV వ విభాగం నందు గల అన్ని ప్రశ్నలకు అంతర్గత ఎంపిక కలదు.
- 2 గంటల సమయంలో, 15 నిమిషాల సమయం ప్రశ్నపత్రం చదువుటకై కేటాయింపబడినది.
- అన్ని సమాధానములు మీకివ్వబడిన సమాధాన పత్రంలోనే రాయవలెను.
- అన్ని సమాధానములు స్పష్టంగాను, గుండ్రంగాను రాయవలెను.
విభాగము – I 8 × 1 = 8 మా.
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 1 మార్కు.
ప్రశ్న 1.
25°C ను కెల్విన్లోకి మార్చండి.
జవాబు:
(25 + 273) K = 298 K
ప్రశ్న 2.
సువాసన సూచికకు ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ఉల్లి, వెనిల్లా మరియు లవంగనూనె.
ప్రశ్న 3.
పట్టికలో ఇచ్చిన సమాచారం ఆధారంగా ఏ పదార్థ యానకంలో కాంతి వేగంగా ప్రయాణిస్తుంది ?
జవాబు:
గాలిలో కాంతి వేగంగా ప్రయాణిస్తుంది.
ప్రశ్న 4.
పటంలో ఇచ్చిన పదార్థయానకంలలో ఏది సాంద్రతర యానకం ?
జవాబు:
‘A’ సాంద్రతర యానకం.
ప్రశ్న 5.
ద్వి కుంభాకార కటక ఆకృతి యొక్క చక్కని పటం గీయండి.
జవాబు:
ద్వి కుంభాకార కటకం.
ప్రశ్న 6.
అంశం 1 : కాంతి పరిక్షేపణం వలన ఆకాశం నీలిరంగులో కనిపిస్తుంది.
అంశం 2 : తెల్లని కాంతిలో గల రంగులలో నీలిరంగు కాంతి అధిక తరంగదైర్ఘ్యం కలిగి ఉంటుంది.
A) అంశం 1, అంశం 2 రెండూ సత్యం
B) అంశం 1, అంశం 2 రెండూ అసత్యం
C) అంశం 1 మాత్రమే సత్యం
D) అంశం 2 మాత్రమే సత్యం
జవాబు:
(C) అంశం 1 మాత్రమే సత్యం.
ప్రశ్న 7.
1వ గ్రూప్, 1వ పీరియడ్కు చెందిన మూలకంను ఊహించి రాయండి.
జవాబు:
H
ప్రశ్న 8.
నిత్యజీవితంలో సబ్బు యొక్క పాత్రను నీవెట్లు అభినందిస్తావు ?
జవాబు:
- సబ్బులు బట్టలను శుభ్రపరచటంలో బహుముఖ పాత్రను పోషిస్తాయి.
- బట్టలపై ఉన్న నూనె, గ్రీజు మరకలను తొలగిస్తాయి.
- అందువలన మనం నిత్యజీవితంలో బట్టలను శుభ్రపరచుటకు సబ్బులను ఉపయోగిస్తాము.
విభాగము – II 3 × 2 = 6 మా.
సూచనలు :
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 2 మార్కులు.
ప్రశ్న 9.
60°ల పట్టకకోణం (A) గల పట్టక వక్రీభవన గుణకం 30°. అయిన పట్టక పదార్థ వక్రీభవన గుణకంను కనుక్కోండి.
జవాబు:
పట్టకకోణం A = 60° ; వక్రీభవన గుణకం D = 30°
∴ పట్టక పదార్ధ వక్రీభవన గుణకము = √2
ప్రశ్న 10.
బోర్ – సోమర్ఫెల్డ్ పరమాణు నమూనాను అవగాహన చేసుకొనుటకు ఏవైనా రెండు ప్రశ్నలు రాయండి.
జవాబు:
- బోర్-సోమర్ ఫెల్డ్ పరమాణు నమూనా ఏ విధంగా అణు నిర్మాణాన్ని తెలియజేసింది ?
- బోర్ కక్ష్యలకు సోమర్ఫెల్డ్ ఎన్ని దీర్ఘ వృత్తాకార కక్ష్యలను కలిపారు ?
ప్రశ్న 11.
రెండవ అయనీకరణ శక్తి విలువ, మొదటి అయనీకరణ శక్తి విలువ కంటే ఎక్కువ. ఎందుకు ? కారణాన్ని ఊహించి
జవాబు:
రాయండి.
- వేలన్సీ ఆర్బిటాల్లోని ఎలక్ట్రాన్ మీద కేంద్రక ఆకర్షణ, తటస్థ పరమాణువులో కంటే ధన అయాన్లో ఎక్కువ ఉంటుంది.
- అందువలన రెండవ ఎలక్ట్రాన్ తొలగించుటకు ఎక్కువ శక్తి అవసరము. కనుక రెండవ అయనీకరణ శక్తి, మొదటి అయనీకరణ శక్తి కంటే ఎక్కువ.
విభాగము – III 3 × 4 = 12 మా.
సూచనలు :
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 4 మార్కులు.
ప్రశ్న 12.
ఈ క్రింది వాటిలో ఏదైనా ఒక పటం గీయండి :
a) ఒక కుంభాకార కటకం ముందు ఈ క్రింది స్థానాలలో వస్తువును ఉంచినప్పుడు ఏర్పడు ప్రతిబింబం యొక్క చక్కని కిరణచిత్రంను గీయండి.
i) F వద్ద
ii) F, P ల మధ్య
జవాబు:
i) F వద్ద వస్తువును ఉంచినపుడు :
ii) F, P ల మధ్య వస్తువును ఉంచినపుడు :
b) ఆక్సిజన్ (O2) అణువు ఏర్పడు విధానంను చక్కని పటం ద్వారా చూపండి.
జవాబు:
ప్రశ్న 13.
ఉప కర్పరం | ఆర్బిటాల్ | ఆర్బిటాల్ల సంఖ్య | గరిష్ఠ ఎలక్ట్రాన్ల సంఖ్య |
l = 0 | 1 | ||
l = 1 | p | ||
l = 2 | 10 | ||
l = 3 | 7 |
పై పట్టికను పూరించండి.
జవాబు:
ఉప కర్పరం | ఆర్బిటాల్ | ఆర్బిటాల్ల సంఖ్య | గరిష్ఠ ఎలక్ట్రాన్ల సంఖ్య |
l = 0 | s | 1 | 2 |
l = 1 | p | 3 | 6 |
l = 2 | d | 5 | 10 |
l = 3 | f | 7 | 14 |
ప్రశ్న 14.
మన నిత్యజీవితంలో విద్యుత్ వలయాలలో సమాంతర మరియు శ్రేణీ సంధానం యొక్క ప్రయోజనాలు రాయండి.
జవాబు:
1) సమాంతర సంధానం యొక్క ప్రయోజనాలు :
- సమాంతర సంధానంలో అన్ని పరికరాలు పూర్తి వోల్టేజిని గ్రహిస్తాయి.
- సమాంతర సంధానంలో విద్యుత్ పరికరాలలో ఒక పరికరం ఆగిపోతే, మిగిలిన పరికరాలు మామూలుగా పనిచేస్తాయి.
- సమాంతర సంధానంలో కలుపుట వలన పరికరాల మధ్య పొటెన్షియల్ భేదం సమానంగా ఉండి, వాటికి సరిపడేంత విద్యుత్ను వినియోగించుకుంటాయి.
2) శ్రేణి సంధానం యొక్క ప్రయోజనాలు :
- శ్రేణి సంధానంలోని పరికరాలు ఎక్కువ వోల్టేజిని గ్రహిస్తాయి.
- ఘటాల సంఖ్యను పెంచిన వోల్టేజి పెరుగుతుంది.
- వలయంలో నిరోధం పెరిగితే విద్యుత్ ప్రవాహం తగ్గుతుంది.
విభాగము – IV 3 × 8 = 24 మా.
సూచనలు :
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 8 మార్కులు.
- ప్రతి ప్రశ్నకు అంతర్గత ఎంపిక కలదు.
ప్రశ్న 15.
A) క్రింది వాటిని నిర్వచించండి.
1) తుషారం
2) పొగమంచు
3) బాష్పీభవన గుప్తోష్టం
4) ద్రవీభవన గుప్తోష్ణం
జవాబు:
1) తుషారం : శీతాకాలంలో భూమిపై ఉన్న ఘనపదార్థాలు తక్కువ ఉష్ణోగ్రతలో ఉంటాయి. ఈ చల్లటి పదార్థాలను తాకిన గాలిలోని నీటి ఆవిరి చిన్న చిన్న బిందువులుగా మారి వాటి ఉపరితలంపై ఏర్పడతాయి. దీనినే తుషారం
అంటారు.
2) పొగమంచు : భూమి ఉపరితలంపై ఉన్న గాలి ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు గాలి పొరలలోని నీటి ఆవిరి గాలిలోని ధూళికణాలపై సాంద్రీకరణం చెంది చిన్న చిన్న నీటి బిందువులుగా ఏర్పడతాయి. ఈ నీటి బిందువులు గాలిలో తేలియాడుతూ పలుచని మేఘం వలె కనిపిస్తాయి. పొగవలె గాలిలో తేలియాడే నీటి బిందువులను పొగమంచు అంటారు.
3) భాష్పీభవన గుప్తోష్ణం : స్థిర ఉష్ణోగ్రత వద్ద 1గ్రా. ద్రవ పదార్థం పూర్తిగా ఆవిరిగా మారటానికి కావలసిన ఉష్ణాన్ని బాష్పీభవన గుప్తోష్టం అంటారు. నీటి బాష్పీభవన గుప్తోష్టం విలువ 540 Cal/gram.
4) ద్రవీభవన గుప్తోష్ణం : స్థిర ఉష్ణోగ్రత వద్ద 1 గ్రా. ఘనపదార్థం పూర్తిగా ద్రవంగా మారటానికి కావల్సిన ఉష్ణాన్ని ద్రవీభవన గుప్తోష్ణం అంటారు. మంచు ద్రవీభవన గుప్తోష్ణం విలువ 80 Cal/gram.
(లేదా)
B) మోటారు పనితీరును గూర్చి రాయండి.
జవాబు:
విద్యుచ్ఛక్తిని యాంత్రిక శక్తిగా మార్చే సాధనం విద్యుత్ మోటర్.
పనిచేసే విధానం :
- పటంలో చూపిన విధంగా ఒక దీర్ఘచతురస్రాకార ABCD తీగచుట్టను సమ అయస్కాంత క్షేత్రంలో ఉంచామనుకొనుము.
- ఇప్పుడు విద్యుత్ వలయాన్ని స్విచ్ ఆన్ చేసి దీర్ఘచతురస్రాకారపు తీగచుట్టలో విద్యుత్ ప్రవహించునట్లు చేయుము.
- తీగచుట్ట యొక్క AB, CD భుజాలు అయస్కాంతక్షేత్రంతో 90° కోణం చేస్తాయి.
- AB వద్ద అయస్కాంత బలం పేజీకి లోపలివైపుగా, CD వద్ద అయస్కాంత బలం పేజి నుండి బయటకు పనిచేస్తుంది.
- BC, DA లు అయస్కాంత క్షేత్రంతో చేసే కోణం మారుతూ ఉంటుంది.
- BC వద్ద అయస్కాంత బలం పై వైపుకు, DA వద్ద కిందివైపుకు పనిచేస్తుంది.
- AB, CD ల వద్ద పనిచేసే బలాల వల్ల తీగచుట్ట భ్రమణంలోకి వస్తుంది.
- కానీ తీగచుట్ట సగం భ్రమణం చెందాక AB, CD ల వద్ద పనిచేసే అయస్కాంత బలాలు వ్యతిరేక దిశలోకి మారడం వల్ల తీగచుట్ట తిరిగి వెనుకకు భ్రమణం చేస్తుంది.
- కనుక ప్రతి అర్ధ భ్రమణం తర్వాత తీగచుట్టలో ప్రవహించే విద్యుత్ దిశ వ్యతిరేక దిశలోకి మార్చితే తీగచుట్ట నిరంతరంగా ఒకే దిశలో భ్రమణం చేస్తుంది.
- దీని కొరకు పటంలో చూపినట్లు తీగచుట్ట రెండు కొనలకు C1 C2 స్లిప్రింగ్లు ఏర్పాటు చేసి అవి B1B2 బ్రష్లకు తాకే విధంగా అమర్చాలి.
- అప్పుడు తీగచుట్ట అయస్కాంత క్షేత్రంలో నిరంతరంగా ఒకే దిశలో భ్రమణం చేస్తూ విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది.
- ఈ పరికరమే విద్యుత్ మోటార్.
ప్రశ్న 16.
A) క్రింది వాటిని గూర్చి క్లుప్తంగా రాయండి.
1) ప్లాస్టర్ ఆఫ్ పారిస్
2) బ్లీచింగ్ పౌడర్
3) సోడియం బై కార్బోనేట్
4) సోడియం కార్బోనేట్
జవాబు:
1) ప్లాస్టర్ ఆఫ్ పారిస్ :
- కాల్షియం సల్ఫేట్ హెమి హైడ్రేట్ను ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అంటారు.
- దీనిని CaSO41/2H2O తో సూచిస్తారు.
- ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తెల్లగా ఉండే చూర్ణ పదార్థం. దీనిని సాధారణ వాతావరణంలో ఉంచినపుడు వెంటనే తేమను గ్రహించి దృఢమైన ఘనపదార్థంగా మారును.
- దీనినే జిప్సం అంటారు.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఉపయోగాలు :
- విరిగిన ఎముకలకు కట్లు కట్టడానికి ఉపయోగిస్తారు.
- బొమ్మల తయారీలోనూ, సీలింగ్ చేయడానికి, వాటర్ ఫిల్టర్ లో క్యాండిల్స్ ను వాడతారు.
2) విరంజన చూర్ణం (లేదా) బ్లీచింగ్ పౌడర్ :
A) బ్లీచింగ్ పౌడర్ తయారీ :
- సజల సోడియం క్లోరైడ్ ద్రావణాన్ని (బ్రైన్ ద్రావణం) విద్యుత్ విశ్లేషణ చేయడం వలన క్లోరిన్ వాయువు లభిస్తుంది.
- ఈ క్లోరిన్ వాయువు బ్లీచింగ్ పౌడర్ తయారీలో ఉపయోగించబడుతుంది.
- తేమలేని కాల్షియం హైడ్రాక్సైడ్ [(Slaked lime) Ca(OH)2] పై క్లోరిన్ వాయువు చర్య వలన బ్లీచింగ్ పౌడర్ ఏర్పడుతుంది.
- దీనిని CaOCl2 అనే సంకేతంతో సూచిస్తారు.
- Ca (OH)2 + Cl2 → CaOCl2 + H2O
B) బ్లీచింగ్ పౌడర్ ఉపయోగాలు :
- వస్త్ర పరిశ్రమలలో కాటన్ మరియు నారలను విరంజనం చేయడానికి, కాగితం పరిశ్రమలో కలప గుజ్జును విరంజనం చేయడానికి, బట్టలను విరంజనం చేయడానికి దీనిని ఉపయోగిస్తారు.
- రసాయన పరిశ్రమలలో దీనిని ఆక్సీకారిణిగా ఉపయోగిస్తారు.
- తాగే నీటిలోని క్రిములను సంహరించడానికి క్రిమిసంహారిణిగా ఉపయోగిస్తారు.
- క్లోరోఫాం తయారీలో కారకంగా (reagent) ఉపయోగిస్తారు.
3. సోడియం బై కార్బోనేట్ :
- సోడియం బైకార్బోనేట్ను బేకింగ్ సోడా లేదా వంట సోడా అని అంటారు.
- కొన్ని సందర్భాలలో పదార్థాలను తొందరగా ఉడికించడానికి బేకింగ్ సోడాను ఉపయోగిస్తారు. దీని రసాయన నామం సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ (NaHCO3).
- దీనిని ఈ క్రింది విధంగా తయారు చేస్తారు.
NaCl + H2O + CO2 + NH3 → NH4Cl + NaHCO3 - వంటసోడా ఒక క్షయం చెందని (non-corrosive) బలహీనమైన క్షారం.
- ఆహారాన్ని ఉడికించేటప్పుడు ఆహారంతో పాటు దీనిని వేడిచేసినప్పుడు ఈ కింది రసాయనక చర్య జరుగుతుంది.
సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఉపయోగాలు :
- బేకింగ్ సోడాను, టార్టారిక్ ఆమ్లం వంటి బలహీనమైన తినదగిన ఆమ్లం (edible acid) తో కలుపగా ఏర్పడిన మిశ్రమాన్ని బేకింగ్ పౌడర్ అంటాం.
- బేకింగ్ పౌడర్ను వేడిచేసినప్పుడు లేదా నీటిలో కలిపినప్పుడు కింది రసాయన చర్య జరుగుతుంది.
NaHCO3 + H2 → CO2 + H2O + ఆమ్లం యొక్క సోడియం లవణం. - ఈ రసాయనక చర్యలో విడుదలైన కార్బన్ డై ఆక్సైడ్ వాయువు రొట్టె లేదా కేక్ (Cake) నుండి రంధ్రాలు చేసుకొని బయటకు పోవుట వలన రొట్టె లేదా కేక్ (Cake) వ్యాకోచించడమే కాకుండా మెత్తగా స్పాంజివలె మారుతుంది.
- సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ను ఏంటాసిడ్లలో ఒక ముఖ్య అనుఘటకంగా ఉపయోగిస్తాం. ఇది బలహీనమైన క్షారం కాబట్టి విడుదలైన జఠర ఆమ్లాన్ని తటస్థీకరించి ఉపశమనం కలగచేస్తుంది.
- అగ్నిమాపక యంత్రాలలో దీనిని సోడా ఆమ్లంగా ఉపయోగిస్తాం.
- బలహీనమైన’ ఏంటిసెప్టిక్ (గాయాన్ని కుళ్ళిపోకుండా చేసేది) గా కూడా ఇది ఉపయోగపడుతుంది.
4. సోడియం కార్బోనేట్ లేదా వాషింగ్ సోడా :
- సోడియం క్లోరైడ్ (సాధారణ ఉప్పు) నుండి తయారు చేయగల మరొక రసాయనం వాషింగ్ సోడా లేదా బట్టలు సోడా. (Na2CO3 . 10H2O))
- సోడియం కార్బోనేట్ను పునః స్ఫటికీకరణం (Recrystallisation) చేస్తే వాషింగ్ సోడా లభిస్తుంది.
Na2CO3 + 10H2O → Na3CO2. 10H2O - వాషింగ్ సోడా ఉపయోగాలు :
- గాజు, సబ్బులు, కాగితం పరిశ్రమలలో సోడియం కార్బోనేట్ (వాషింగ్ సోడా) ఉపయోగిస్తారు.
- బోరాక్స్ (borax) వంటి సోడియం సమ్మేళనాల తయారీకి దీనిని ఉపయోగిస్తారు.
- గృహావసరాలలో, సోడియం కార్బోనేట్ను వస్తువులను శుభ్రపరచడానికి ఉపయోగిస్తారు.
- నీటి యొక్క శాశ్వత కాఠిన్యతను తొలగించడానికి కూడా దీనిని ఉపయోగిస్తారు.
(లేదా)
B) మీథేన్ క్లోరిన్తో చర్యనొంది కార్బన్ టెట్రాక్లోరైడ్ను ఏర్పరచు శృంఖల చర్యను వివరించండి.
- ఏదైనా రసాయనచర్యలో ఒక సమ్మేళనంలోని ఒక పరమాణువు లేదా పరమాణు సమూహం, వేరొక పరమాణువు లేదా పరమాణు సమూహంతో ప్రతిక్షేపించబడితే ఆ చర్యను ప్రతిక్షేపణ చర్య అంటాం.
- ఆల్కేన్లు ఏక బంధాన్ని కలిగి, ఈ ప్రతిక్షేపణ చర్యలలో పాల్గొంటాయి.
- ఉదాహరణకు,
- మీథేన్ (CH4) సూర్యకాంతి సమక్షంలో క్లోరిన్తో చర్యనొందుతుంది.
- CH4లోని హైడ్రోజన్ పరమాణువులు, క్లోరిన్ పరమాణువులతో ప్రతిక్షేపించబడతాయి.
- ఈ శృంఖల చర్య అవిచ్ఛిన్నంగా జరిగి కార్బన్ టెట్రాక్లోరైడ్ ఏర్పడుతుంది.
ప్రశ్న 17.
A) గాజుపలక పార్శ్వ విస్తాపనను అవగాహన చేసుకొనుటకు ఒక ప్రయోగశాల కృత్యంను రాయండి.
జవాబు:
ఉద్దేశ్యం : గాజుదిమ్మెను ఉపయోగించి పార్శ్వవిస్థాపనం అవగాహన చేసికొనుట.
కావలసిన వస్తువులు : డ్రాయింగ్బోర్డు, డ్రాయింగ్ చార్టు, క్లాంప్లు, స్కేలు, పెన్సిల్, పలుచని గాజుదిమ్మె మరియు గుండుసూదులు.
నిర్వహణ పద్ధతి :
- డ్రాయింగ్ బోర్డుపై డ్రాయింగ్ చార్టును ఉంచి దానికి క్లాంప్లు పెట్టుము.
- డ్రాయింగ్ చార్టు మధ్య భాగంలో గాజు దిమ్మెను ఉంచి, చార్టుపై దిమ్మె దాని అంచువెంబడి పెన్సిల్తో గీత గీయుము. ఇది దీర్ఘచతురస్రంలో ఉంటుంది.
- ఈ దీర్ఘచతురస్ర శీర్షాలకు A, B, C, D అని పేర్లు పెట్టుము.
- దీర్ఘచతురస్రం పొడవులలో ఒక దానికి (AB) ఏదైనా బిందువు వద్ద ఒక లంబరేఖను గీయుము.
- మరలా గాజు దిమ్మెను యథాస్థానంలో ఉంచుము.
- రెండు గుండుసూదులను మీరు గీసిన లంబంపై నిలువుగా ఒకే ఎత్తులో గుచ్చుము.
- మరో రెండు గుండుసూదులను తీసుకొని గాజు దిమ్మెకు రెండోవైపు నుండి చూస్తూ మొదటి రెండు గుండుసూదులతో ఒకే సరళరేఖలో ఉండు విధంగా గుచ్చుము.
- గాజు దిమ్మెను, గుండుసూదులను తీసివేసి గుండుసూదుల వల్ల ఏర్పడిన గుర్తులను కలుపుతూ AB వరకు గీత గీయుము.
- గాజు దిమ్మె ఉపరితలంపై లంబంగా పతనమైన కాంతి కిరణం ఎటువంటి విచలనం పొందకుండా గాజు దిమ్మె రెండోవైపు నుండి బయటకు వస్తుంది.
- ఇప్పుడు మరొక డ్రాయింగ్ చార్టును కార్డుబోర్డు షీట్పై ఉంచి అది కదలకుండా క్లాంప్లు పెట్టుము. పై విధంగానే గాజు దిమ్మె అంచును తెలిపే ABCD దీర్ఘచతురస్రాన్ని, AB లంబాన్ని గీయుము.
- ఈ లంబంతో 30° కోణం చేస్తూ, లంబం మరియు AB రేఖలు కలిసే బిందువును చేరే విధంగా మరొక రేఖను గీయుము. ఇది పతన కిరణాన్ని సూచిస్తుంది. లంబంతో ఈ రేఖ చేసే కోణం పతనకోణం అగును.
- ఇప్పుడు గాజు దిమ్మెను ABCD దీర్ఘచతురస్రంలో ఉంచుము. పతనకిరణంపై రెండు గుండుసూదులను నిలువుగా, ఒకే ఎత్తులో గుచ్చుము.
- గాజు దిమ్మె యొక్క రెండోవైపు నుండి చూస్తూ మొదటి రెండు గుండుసూదులతో సరళరేఖలో ఉండే విధంగా మరో రెండు గుండుసూదులను దిమ్మెకు రెండోవైపు గుచ్చుము.
- ఈ గుండుసూదుల గుర్తులను కలుపుతూ CD వరకు రేఖను గీయుము. ఈ రేఖ బహిర్గత కాంతికిరణాన్ని తెలుపును.
- ఈ బహిర్గత కిరణం CD ని తాకే బిందువు వద్ద, CD రేఖకు ఒక లంబంను గీయుము.
- ఆ లంబానికి, బహిర్గత కిరణానికి మధ్య కోణాన్ని కొలువుము. దీనినే “బహిర్గత కోణం” అంటాము.
- ఈ పతన, బహిర్గత కోణాలు సమానము. ఈ పతన, బహిర్గత రేఖలు సమాంతరాలు. ఈ రెండు సమాంతర రేఖల మధ్య దూరాన్ని “పార్శ్వ విస్థాపనం” అంటాం.
(లేదా)
B) ఇనుము తుప్పు పట్టుట గాలి మరియు నీరు సమక్షంలో జరుగుతుందని అవగాహన చేసుకొనుటకు ఒక కృత్యం రాయండి.
జవాబు:
ప్రయోగం :
లక్ష్యం : ఇనుప వస్తువులు క్షయం చెందడానికి గాలి, నీరు అవసరం అని నిరూపించుట.
కావలసిన వస్తువులు : 3 పరీక్షనాళికలు, 9 ఇనుప మేకులు, నూనె, నీరు, రబ్బరు కార్కులు, అనార్ధ కాల్షియం క్లోరైడ్.
ప్రయోగ పద్ధతి :
- మూడు పరీక్షనాళికలు తీసుకుని, వాటిని A, B, C లుగా గుర్తించండి. ఒక్కోక్క దానిలో శుభ్రంగా ఉన్న మూడేసి ఇనుప మేకులను వేయండి.
- పరీక్షనాళిక A లో కొంత నీటిని తీసుకొని, దానిని రబ్బరు బిరడాతో బిగించండి.
- పరీక్షనాళిక B లో మరిగించిన స్వేదన జలాల్ని ఇనుప మేకు మునిగేంత వరకు తీసుకొని, దానికి 1 మి.లీ. నూనెను కలిపి, రబ్బరు బిరడాతో బిగించండి.
- పరీక్షనాళిక ‘C’ లో కొంచెం అనార్ద్ర కాల్షియం క్లోరైడు తీసుకొని, రబ్బరు బిరడాను బిగించండి.
- అనార్ద్ర కాల్షియం క్లోరైడ్ గాలిలో తేమను గ్రహించును.
- పై పరీక్షనాళికలను కొన్ని రోజుల వరకూ అలా ఉంచేసి తర్వాత వచ్చిన మార్పులను పరిశీలించండి.
పరిశీలనలు :
- పరీక్షనాళిక A లో మేకు తుప్పు పట్టును.
- కానీ B మరియు C పరీక్షనాళికలోని మేకులు తుప్పు పట్టవు.
కారణం :
- పరీక్షనాళిక ‘A’ లోని మేకులు గాలి, నీరు ఉన్న వాతావరణంలో ఉంచబడ్డాయి. అందుకే తుప్పుపట్టాయి.
- ‘B’ పరీక్షనాళికలోని మేకులు కేవలం నీటిలోను, ‘C’ పరీక్షనాళికలోని మేకులు పొడి గాలిలో ఉంచబడ్డాయి. తుప్పు పట్టలేదు.
నిర్ధారణ : కనుక ఈ ప్రయోగం ద్వారా లోహక్షయానికి గాలి, నీరు అవసరం అని నిర్థారించవచ్చును.