Regularly solving AP 10th Class Maths Model Papers Set 1 in Telugu Medium contributes to developing problem-solving skills.
AP 10th Class Maths Model Paper Set 1 with Solutions in Telugu
Time: 3 Hours
Maximum Marks: 100
సూచనలు :
- ఈ ప్రశ్నాపత్రంలో 4 విభాగాలు మరియు 33 ప్రశ్నలు ఉండును.
- నాలుగవ విభాగంలోని ప్రశ్నలకు మాత్రమే అంతర్గత ఎంపికకు అవకాశం కలదు.
- 3 గం॥ 15 నిమిషాలలో 15 నిమిషములు ప్రశ్నాపత్రమును చదువుటకై కేటాయించబడినది.
- అన్ని సమాధానములు మీకివ్వబడిన సమాధాన పత్రములోనే రాయవలెను.
- అన్ని సమాధానములు స్పష్టంగాను శుభ్రంగాను వ్రాయవలెను.
విభాగం – I (12 × 1 = 12)
సూచనలు :
- క్రింది అన్ని ప్రశ్నలకు ఒక పదం లేదా మాటలో సమాధానము వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 1 మార్కు.
ప్రశ్న 1.
“2 కలములు మరియు 5 పెన్సిళ్ళు వెల రూ.20” ఈ సమాచారమును రేఖీయ సమీకరణముగా వ్యక్తపరుచుము.
సాధన:
2x + 5y = 20.
ఇక్కడ ఒక పెన్ను వెల = ₹x
మరియు ఒక పెన్సిలు వెల = ₹y.
ప్రశ్న 2.
క్రింది ప్రవచనాలను తృప్తిపరచు సమాధానమును ఎన్ను కొనుము.
ప్రవచనం (A) : ఒక ఘనబహుపది యొక్క గరిష్ట శూన్యముల సంఖ్య 3.
ప్రవచనం (B) : x – 2 రేఖీయ బహుపది శూన్య విలువ ‘-2′.
i) (A) మరియు (B) రెండూ సత్యము.
ii) (A) సత్యము, (B) అసత్యము.
iii)(A) అసత్యము, (B) సత్యము.
iv) (A) మరియు (B) రెండూ అసత్యము.
సాధన:
ii) (A) సత్యము, (B) అసత్యము.
ప్రశ్న 3.
log6 36 విలువను కనుగొనుము.
సాధన:
log6 36 = log6 62 = 2 log6 6 = 2(1) = 2
(∵ logaxm = m logax)
ప్రశ్న 4.
x2 – 5x + 6 = 0 వర్గసమీకరణము యొక్క విచక్షణి కనుగొనుము.
సాధన:
విచక్షణి = b2 – 4ac
= (-5)2 – 4 (1) (6)
= 25 – 24 = 1
ప్రశ్న 5.
3 సెం.మీ. భూవ్యాసార్ధం, 7 సెం.మీ. ఎత్తు కలిగిన స్థూపము యొక్క ఘనపరిమాణం కనుగొనుము.
సాధన:
స్థూపం వ్యాసార్థం r = 3 సెం.మీ.
ఎత్తు h = 7 సెం.మీ.
స్థూపం ఘనపరిమాణము = πr2h
– \(\frac{22}{7}\) × (3)2 × 7 = \(\frac{22}{7}\) × 9 × 7 = 198 సెం. మీ.3
ప్రశ్న 6.
n(A) = 10, n(B) = 6 మరియు n (A∪B) = 12 అయిన n(A∩B) = ……………..
సాధన:
n(A) = 10, n(B) = 6 మరియు n(A∪B) = 12
n(A∪B) = n(A) + n(B) − n (A∩B)
12 = 10 + 6 − n (A∩B)
n(A∩B) = 16 – 12 = 4.
ప్రశ్న 7.
సరూప పటాల జతకు రెండు వేర్వేరు ఉదాహరణలివ్వండి.
సాధన:
i) రెండు సమబాహు త్రిభుజములు
ii) రెండు వృత్తములు
ప్రశ్న 8.
క్రింది వాటిని జతపరుచుము.
A) tan 6 = ( ) i) \(\frac{\cos \theta}{\sin \theta}\)
B) cot 0 = () ii) \(\sqrt{1+\cot ^2 \theta}\)
C) cosec 0 = ( ) iii) \(\sqrt{\sec ^2 \theta-1}\)
a) A → (i), B→ (ii), C → (iii)
b) A → (ii), B → (iii), C → (i)
c) A → (iii), B → (i), C → (ii)
d) A → (ii), B → (i), C → (iii)
సాధన:
c) A → (iii), B → (i), C → (ii)
ప్రశ్న 9.
(0, 0) మరియు (4, 6) బిందువులను కలుపు రేఖ యొక్క మధ్య బిందువు ………………….
సాధన:
(0, 0) మరియు (4, 6) బిందువులను కలుపు రేఖా ఖండపు మధ్య బిందువు
= (\(\frac{\mathrm{x}_1+\mathrm{x}_2}{2}\), \(\frac{\mathrm{y}_1+\mathrm{y}_2}{2}\)) = (\(\frac{0+4}{2}\), \(\frac{0+6}{2}\))
= (\(\frac{4}{2}\), \(\frac{6}{2}\)) = (2, 3)
ప్రశ్న 10.
“ఒక వ్యక్తి ఒక చెట్టు యొక్క మొదల నుండి 10 మీ. దూరములో ఉండి ఆ చెట్టుపై భాగాన్ని 45° ఊర్ధ్వ కోణంతో పరిశీలించినాడు.” ఈ సందర్భానికి చిత్తు పటమును గీయుము.
సాధన:
BC = చెట్టు యొక్క ఎత్తు
ప్రశ్న 11.
ప్రకటన : sin 0°, cos 0°, sin 90° మరియు tan45° ల బాహుళకం ‘0’
కారణం :
\(\bar{x}\) = \(\frac{\sum f_1 x_i}{\sum f_i}\)
A) ప్రకటన, కారణం రెండూ సత్యమే. కారణం ప్రకటనని సమర్థించదు.
B) ప్రకటన, కారణం రెండూ సత్యమే. కానీ కారణం ప్రకటనని సమర్థించదు.
C) ప్రకటన సత్యం, కానీ కారణం అసత్యం.
D) ప్రకటన అసత్యం, కానీ కారణం సత్యం.
సాధన:
D) ప్రకటన అసత్యం, కానీ కారణం సత్యం.
ప్రశ్న 12.
రెండు ఏకకేంద్ర వృత్తాలకు గీయగల ఉమ్మడి స్పర్శరేఖల సంఖ్య ………………
సాధన:
0.
విభాగం – II (8 × 2 = 16)
సూచనలు :
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.
- ప్రతి ప్రశ్నకు 2 మార్కులు.
ప్రశ్న 13.
x + 2 y = 7 మరియు 4x – ay = 10 సమీకరణాలకు సాధన లేనిచో ‘a’ విలువను కనుగొనుము.
సాధన:
x + 2y = 7 మరియు 4x – ay – 10 సమీకరణమునకు సాధన లేదు.
∴ \(\frac{a_1}{a_2}\) = \(\frac{b_1}{b_2}\) ≠ \(\frac{c_1}{c_2}\)
x + 2y – 7 = 0, 4x – ay – 10 = 0
a1 = 1, b1 = 2, c1 = -7
a2 = 4, b2 = -a, c1 = -10
⇒ \(\frac{1}{4}\) = \(\frac{2}{-a}\)
⇒ – a = 2 × 4 = 8
∴ a = -8.
ప్రశ్న 14.
ఒక పాఠశాలలో వంటగది నిర్మించుటకు ఒక ట్రక్కు ఇసుకను శంఖు ఆకారములో (పోసినది) దిగుమతి చేసినది. శంఖువు భూవ్యాసార్థం 2.7 మీ., ఎత్తు 7మీ. అయిన దిగుమతి చేసిన ఇసుక ఘనపరిమాణంను కనుగొనుము.
సాధన:
శంఖువు వ్యాసార్ధము (r) = 2.7 మీ.
ఎత్తు (h) = 7 మీ.
శంఖువు ఘనపరిమాణము = \(\frac{1}{2}\)πr2h
= \(\frac{1}{3}\) × \(\frac{22}{7}\) × (2.7)2 × 7
∴ ఇసుక బరువు = 53.46 మీ3.
ప్రశ్న 15.
క్రింది సమితులను సమితి నిర్మాణ రూపంలో వ్రాయుము.
i) A = {1, 8, 27, 64}
ii) B = {-3, -2, -1, 0, 1, 2}
సాధన:
i) A = {x : x = n3, n ∈ N మరియు n < 5}
ii) B = {x : -3 ≤ x ≤ 2, x ∈ I}
(లేదా)
i) A = {x : X అనేది 65 కన్నా తక్కువైన ఘనసంఖ్య}
ii) B = {x : x అనేది – 4 మరియు 3 మధ్యగల పూర్ణసంఖ్య }
ప్రశ్న 16.
220 మరియు 40 ల గ.సా.భా.ను యూక్లిడ్ భాగహార పద్ధతిలో కనుగొనుము.
సాధన:
220 = 40 × 5 + 20
40 = 20 × 2 + 0.
∴ 220 మరియు 40 ల గ.సా.భా = 20
ప్రశ్న 17.
ఒక వృత్తాన్ని గీయండి. వృత్తానికి బాహ్యంలో గల ఒక రేఖకు సమాంతరముగా ఒక స్పర్శరేఖనూ, ఒక ఛేదన రేఖను గీయుము.
సాధన:
ప్రశ్న 18.
tan θ = \(\frac{7}{24}\) అయిన sec θ విలువను కనుగొనుము.
సాధన:
tan θ = \(\frac{7}{24}\)
sec2 θ – tan2 θ = 1
sec2 θ – (\(\frac{7}{24}\))2 = 1
sec2 θ = 1 + \(\frac{49}{576}\) = \(\frac{576+49}{576}\) = \(\frac{625}{576}\)
sec θ = \(\sqrt{\frac{625}{576}}\) = \(\frac{25}{24}\)
(లేదా)
ప్రశ్న 19.
వర్గీకృత దత్తాంశానికి ప్రత్యక్ష పద్ధతిలో సగటు కనుగొను సూత్రమును వ్రాసి, అందలి పదములను వివరించుము.
సాధన:
అంకమధ్యమము \(\overline{\mathrm{X}}\) = \(\frac{\Sigma \mathrm{f}_{\mathrm{i}} \mathbf{x}_{\mathrm{i}}}{\Sigma \mathrm{f}_{\mathrm{i}}}\)
ఇక్కడ, fi = పౌనఃపున్యము
xi = తరగతి మధ్య విలువ
ప్రశ్న 20.
(0, 0), (2, 0) మరియు (1, 3) బిందువులు శీర్షములుగా గల త్రిభుజ గురుత్వ కేంద్రము (1, 1) అని చూపుము.
సాధన:
(0, 0), (2, 0) మరియు (1, 3) బిందువుల శీర్షాలు గాగల త్రిభుజ గురుత్వ కేంద్రం
= (\(\frac{x_1+x_2+x_3}{3}\), \(\frac{y_1+y_2+y_3}{3}\))
= (\(\frac{0+2+1}{3}\), \(\frac{0+0+3}{3}\))
= (\(\frac{3}{3}\), \(\frac{3}{3}\) ) = (1, 1)
∴ గురుత్వ కేంద్రం = (1, 1)
విభాగం – III (8 × 4 = 32)
సూచనలు :
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.
- ప్రతి ప్రశ్నకు 4 మార్కులు.
ప్రశ్న 21.
x2 + 7x + 10 అనే బహుపది శూన్యాలు కనుగొని, దాని గుణకాలకు, శూన్యాలకు మధ్యగల సంబంధాన్ని సరిచూడుము.
సాధన:
ఇచ్చిన బహుపది p(x) = x2 + 7x + 10
x2 + 7x + 10 = 0
x2 + 5x + 2x + 10 = 0
x (x + 5) + 2 (x + 5) = 0
(x + 5) (x + 2) = 0
x + 5 = 0 లేదా x + 2 = 0
∴ x = -5 లేదా x = -2
∴ p(x) బహుపది శూన్యాలు -5 మరియు -2
α = -5, β = -2 అనుకొనుము.
శూన్యాల మొత్తం α + β = (−5) + (−2) = -7
= \(\frac{-b}{a}\) = \(\frac{-7}{1}\) = – 7
శూన్యాల లబ్ధం αβ = (-5) (-2) = 10
= \(\frac{c}{a}\) = \(\frac{10}{1}\)
ప్రశ్న 22.
కవిత రూ.8,000 తీసుకొనుటకు బ్యాంకుకు వెళ్ళినది. ఆమె క్యాషియర్ను ఆ మొత్తానికి రూ.100 మరియు రూ.500 నోట్లు మాత్రమే ఈయమని కోరినది. మొత్తము ఆమెకు 32 నోట్లు వచ్చిన, ఆమెకు ఎన్ని రూ.100 నోట్లు, ఎన్ని రూ.500 నోట్లు వచ్చినవో చెప్పగలరా ?
సాధన:
కవిత తీసుకొన్న₹ 100 నోట్ల సంఖ్య = x
₹ 500 నోట్ల సంఖ్య = y
మొత్తం నోట్ల సంఖ్య = 32
∴ x + y = 32 → (1)
ఇచ్చిన మొత్తం సొమ్ము = ₹ 8,000
∴ 100x + 500y = 8000 → (2)
x = 20 ని (1) లో ప్రతిక్షేపించగా
20 + y = 32 ⇒ y = 32 – 20 = 12
₹ 100 నోట్ల సంఖ్య x = 20
₹ 500 నోట్ల సంఖ్య y = 12
ప్రశ్న 23.
A = {x : x అనేది 6 యొక్క కారణాంకము},
B = {x : x అనేది 10 కంటే చిన్నదైన ధన సరిసంఖ్య}
అయిన (i) A∪B, (ii) A∩B, (iii) A – B లను వెన్ చిత్రము ద్వారా కనుగొనుము.
సాధన:
A = {x : x అనేది 6 యొక్క కారణాంకము}
= {1, 2, 3, 6}
B = {x : x అనేది 10 కంటే చిన్నదైన ధన సరిసంఖ్య}
= {2, 4, 6, 8}
i) A∪B = {1, 2, 3, 4, 6, 8}
ii) A∩B = {2, 6}
iii) A- B = {1, 3}
ప్రశ్న 24.
162, 54, 18, …………. గుణశ్రేఢి మరియు \(\frac{2}{81}\) , \(\frac{2}{27}\) ,\(\frac{2}{9}\)
……………… గుణశ్రేఢుల nవ పదాలు సమానము అయిన n విలువను కనుగొనుము.
సాధన:
గుణశ్రేఢి 162, 54, 18, → (1)
a = 162, r = \(\frac{\mathrm{a}_2}{\mathrm{a}_1}\) = \(\frac{54}{162}\) = \(\frac{1}{3}\)
n వ పదము an = arn – 1 = 162(\(\frac{1}{3}\))n – 1
గుణశ్రేఢి \(\frac{2}{81}\), \(\frac{2}{27}\) ,\(\frac{2}{9}\), …… → (2)
a = \(\frac{2}{81}\), r = \(\frac{\mathrm{a}_2}{\mathrm{a}_1}\) = \(\frac{\frac{2}{27}}{\frac{2}{81}}\)
= \(\frac{2}{27}\) × \(\frac{81}{2}\) = 3
an = \(\frac{2}{81}\) (3)n – 1
లెక్క ప్రకారం n వ పదములు సమానము
∴ 16(\(\frac{1}{3}\))n – 1 = \(\frac{2}{81}\) (3)n – 1
162 × \(\frac{81}{2}\) = (3n – 1) × \(\frac{3^{n-1}}{1}\)
(81)2 = (3n – 1)2
∴ 3n – 1 = 81 ⇒ 3n – 1 = 34
n – 1 = 4
∴ n = 4 + 1 = 5 ⇒ n = 5
ప్రశ్న 25.
క్రింది పటములో ABCD చతురస్ర భుజము 10.5 సెం.మీ. మరియు APD, BPC లు అర్ధవృత్తములు అయిన షేడ్చేసిన ప్రాంత వైశాల్యమును కనుగొనుము.
(π = \(\frac{22}{7}\) ను తీసుకొనుము).
సాధన:
చతురస్రం ABCD = 10.5 సెం.మీ.
∴ అర్ధవృత్త వ్యాసార్ధం (r) = \(\frac{10.5}{2}\) సెం.మీ.
షేడ్చేసిన ప్రాంత వైశాల్యము = చతురస్ర వైశాల్యం – రెండు అర్ధవృత్తాల వైశాల్యం
= (భుజము)2 – 2 × \(\frac{\pi r^2}{2}\)
= (10.5)2 – \(\frac{22}{7}\) (\(\frac{10.5}{2}\))2
= (10.5)2 [1 – \(\frac{22}{7}\) × \(\frac{1}{4}\))
= (10.5)2 [latex]\frac{6}{28}[/latex]
= 110.25 × \(\frac{3}{14}\) = 23.625 సెం.మీ 2
ప్రశ్న 26.
క్రింది వాటిని 0° మరియు 45° మధ్య త్రికోణమితీయ నిష్పత్తులలో తెలుపుము.
i) sin 81° + tan 75°
ii) cos 65° + cot 75°
సాధన:
i) sin 81° + tan 75°
= sin (90 – 9)° + tan (90 – 15)°
= cos 9° + cot 15°
[∵ cos (90 – θ) = sin θ cot (90 – θ) = tan θ]
ii) cos 65° + cot 75°
= cos (90 – 25)° + cot (90 – 15)°
= sin 25° + tan 15°
[∵cos (90 – θ) = sin θ cot (90 – θ) = tan θ]
ప్రశ్న 27.
ఒక పాచికను ఒకసారి దొర్లించిన దాని పై ముఖంపై
i) 8
ii) 6 కంటే చిన్నదైన సంఖ్య
ii) ప్రధాన సంఖ్య
iv) సంయుక్త సంఖ్య అగు సంభావ్యతను కనుగొనుము.
సాధన.
పాచికను ఒకసారి దొర్లించినపుడు సాధ్యపడు
పర్యవసనాలు (S) = {1, 2, 3, 4, 5, 6}
మొత్తం పర్యవసనాల సంఖ్య n(S) = 6
ఘటన యొక్క సంఖ్యావత E
i) 8 పడు సంభావ్యత = 0
పాచికపై 8 పడుట అసాధ్యం ఘటన.
ii) 6 కన్నా తక్కువైన సంభావ్యత
E = { 1, 2, 3, 4, 5}, n(E) = 5
∴ P(E) = \(\frac{n(E)}{n(S)}\) = \(\frac{5}{6}\)
iii) ప్రధాన సంఖ్య E = {2, 3, 5}, n(E) = 3
∴ P(E) = \(\frac{n(E)}{n(S)}\) = \(\frac{3}{6}\) = \(\frac{1}{2}\)
iv) సంయుక్త సంఖ్య E = {4, 6}, n(E) = 2
∴ P(E) = \(\frac{n(E)}{n(S)}\) = \(\frac{2}{6}\) = \(\frac{1}{3}\)
ప్రశ్న 28.
ట్రెపీజియం ABCD లో AB || DC. దాని కర్ణములు పరస్పరం బిందువు ‘O’ వద్ద ఖండించుకొంటాయి.
అయిన \(\frac{\mathrm{AO}}{\mathrm{BO}}\) = \(\frac{\mathrm{CO}}{\mathrm{DO}}\) అని చూపుము.
సాధన:
దత్తాంశము : ట్రెపీజియము ABCD లో AB II CD మరియు AC, BD కర్ణాలు ‘O’ వద్ద ఖండించుచున్నవి.
సారాంశము : \(\frac{\mathrm{AO}}{\mathrm{BO}}\) = \(\frac{\mathrm{CO}}{\mathrm{DO}}\)
నిర్మాణము : EF అనురేఖను CD మరియు AB లకు సమాంతరంగా ఉంటూ ‘O’ గుండా పోవు విధంగా గీయుము.
ఉపపత్తి : ΔACDలో EO // CD కావున
\(\frac{\mathrm{AO}}{\mathrm{CO}}\) = \(\frac{\mathrm{AE}}{\mathrm{DE}}\) ………….. (1) [ప్రాథమిక అనుపాత సిద్ధాంతం నుండి]
ΔABD లో, EO || AB కావున
\(\frac{\mathrm{DE}}{\mathrm{AE}}\) = \(\frac{\mathrm{DO}}{\mathrm{BO}}\) [ప్రాథమిక అనుపాత సిద్ధాంతం నుండి]
\(\frac{\mathrm{BO}}{\mathrm{DO}}\) = \(\frac{\mathrm{AE}}{\mathrm{DE}}\) …………….. (2) [విలోమము చేయగా]
(1), ల నుండి
\(\frac{\mathrm{AO}}{\mathrm{CO}}\) = \(\frac{\mathrm{AE}}{\mathrm{DE}}\) ⇒ \(\frac{\mathrm{BO}}{\mathrm{DO}}\) = \(\frac{\mathrm{AE}}{\mathrm{DE}}\)
నిరూపించబడినది.
విభాగం – IV (5 × 8 = 40)
సూచనలు :
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.
- ప్రతి ప్రశ్నకు 8 మార్కులు.
- ప్రతి ప్రశ్నకు అంతర్గత ఎంపిక కలదు.
ప్రశ్న 29.
a) √2 + √5 ఒక కరణీయ సంఖ్య అని నిరూపించుము
సాధన:
√2 + √5 ఒక అకరణీయ సంఖ్య అనుకొనుము.
√2 + √5 = \(\frac{p}{q}\) ఇక్కడ, p, q లు పరస్పర ప్రధానాంకాలు q ≠ 0, p, q ∈ I
.:: √5 = \(\frac{p}{q}\) = √2
ఇరువైపులా వర్గం చేయగా
(√5)2 = (\(\frac{p}{q}\) – √5)2)
p, q లు పూర్ణసంఖ్యలు అయిన \(\frac{p^2-3 q^2}{2 p q}\) ఒక అకరణీయ సంఖ్య, కావున √2 కూడా ఒక అకరణీయ సంఖ్య అవుతుంది. ఇది అసత్యం.
ఎందుకంటే √2 అనేది ఒక కరణీయ సంఖ్య అనే
సత్యానికి విరుద్ధభావన. కావున √2 + √5 ఒక కరణీయ సంఖ్య అగును.
(లేదా)
b) అంకశ్రేఢి 11, 8, 5, 2, ………… లో – 150 ఒక పదంగా ఉంటుందో, ఉండదో సరిచూడుము.
సాధన:
ఇచ్చిన అంకశ్రేఢి 11, 8, 5, 2, ……….. లో n వ పదం – 150 అనుకుందాము.
అప్పుడు,
a = 11, d = a2 – a1 = 8 – 11 = – 3 మరియు
an = – 150
an = a + (n – 1) d = – 150
⇒ 11 + (n – 1) × (- 3) = – 150
⇒ 11 – 3n + 3 = – 150
⇒ – 3n = – 150 – 14
⇒ – 3n = – 164
⇒ 3n = 164
∴ n = \(\frac{164}{3}\)
అంకశ్రేఢిలోని పదాల సంఖ్య n ఎల్లప్పుడూ ఒక సహజ సంఖ్య. కాని n = \(\frac{164}{3}\) సహజసంఖ్య కాదు. కావున
11, 8, 5, 2, ………… అంకశ్రేఢిలో – 150 ఒక పదంగా ఉండదు.
ప్రశ్న 30.
a) x2 + 3x – 18 = 0 వర్గసమీకరణం యొక్క మూలా లను వర్గంను పూర్తి చేయుట ద్వారా కనుగొనుము.
సాధన:
x2 + 3x – 18 – 0
x2 + 3x = 18
x2 + 2 · \(\frac{3 x}{2}\) = 18
x2 + 2 · x · \(\frac{3}{2}\) = 18
(\(\frac{3}{2}\))2 ని ఇరువైపులా కూడగా
x2 + 2 · x · \(\frac{3}{2}\) + (\(\frac{3}{2}\))2 = 18 + (\(\frac{3}{2}\))2
(లేదా).
b) 64 ఘ. సెం.మీ. ఘనపరిమాణం గల రెండు ఘనములు కలుపబడినవి. అయిన ఏర్పడిన క్రొత్త దీర్ఘఘనము యొక్క ప్రక్కతల వైశాల్యము మరియు సంపూర్ణతల వైశాల్యమును కనుగొనుము.
సాధన:
ఘనం ఘనపరిమాణము
V = a3 = 64 సెం.మీ3
⇒ a3 = (4)3 సెం.మీ3
⇒ a = 4 సెం.మీ.
రెండు సమఘనములను కలుపగా ఏర్పడిన
దీర్ఘఘనం పొడవు (1) = 8 సెం.మీ.
ఎత్తు (h) = 4 సెం.మీ.
వెడల్పు (b) = 4 సెం.మీ.
i) దీర్ఘఘనం ప్రక్కతల వైశాల్యం = 2h (l + b)
= 2 × 4 (8 + 4)
= 96 సెం.మీ.2
ii) దీర్ఘఘనం సంపూర్ణతల వైశాల్యం
= 2(lb + bh + lh)
= 2 (8 × 4 + 4 × 4 + 8 × 4)
= 2 (32 + 16 + 32) = 2 × 80 = 160 సెం.మీ.2
ప్రశ్న 31.
a) A(1, 1), B(7, −3), C(12, 2), D(7, 21) బిందువులు వరుసగా శీర్షములుగా గల చతుర్భుజ వైశాల్యమును కనుగొనుము.
సాధన:
చతుర్భుజం యొక్క శీర్షాలు వరుసగా
A (1, 1), B (7, −3), C (12, 2), D (7, 21)
ΔABC వైశాల్యం
= \(\frac{1}{2}\)│x1 (y2 – y3) + x2 (y3 – y1) + x3 (y1 – y2) |
= \(\frac{1}{2}\)| 1 (- 3 – 2) + 7 (2 – 1) + 12 [1 – (-3)] |
= \(\frac{1}{2}\)|- 5 + 7 + 48| = \(\frac{1}{2}\) |50| = 25 చ|| యూ.
ΔACD వైశాల్యం
= \(\frac{1}{2}\)|1(2 – 21) + 12 (21 – 1) + 7 (1 – 2) |
= \(\frac{1}{2}\)|1 – 19 + 240 – 7| = \(\frac{1}{2}\)|214|
= 107 చ„యూ.
∴ ΔBCD చతుర్భుజం యొక్క వైశాల్యం
= ΔABC వైశాల్యం + ΔACD వైశాల్యం
= 25 + 107 = 132 చ„యూ.
(లేదా)
b) క్రింది పట్టికలో ఇవ్వబడిన 60 రాశుల మధ్యగతం 28.5 అయిన x, y విలువలు కనుగొనుము.
సాధన:
దత్తాంశము ప్రకారము
మధ్యగతము = 28.5
∴ మధ్యగతము l + \(\frac{\left[\frac{\mathrm{n}}{2}-\mathrm{cf}\right]}{\mathrm{f}}\) × h
l = మధ్యగత తరగతి దిగువ హద్దు = 20
\(\frac{n}{2}\) = \(\frac{60}{2}\) = 30
cf = సంచిత పౌనఃపున్యము = 5 + x, f = 20, h = 10
∴ మధ్యగతము
⇒ 20 + \(\frac{30-(5+x)}{20}\) × 10 = 28.5
⇒ \(\frac{30-5-x}{2}\) = 28.5 – 20 = 8.5
⇒ 25 – x = 17 ⇒ x = 25 – 17 = 8
N = 60 (ఇచ్చినది)
N = 45 + x + y
∴ 45 + x + y = 60
⇒ x + y = 60 – 45 = 15
∴ 8 + y = 15 [∵ x = 8]
y = 7
∴ x = 8, y = 7.
ప్రశ్న 32.
a) ఒక టవర్ పాదం వరకు ఒక తిన్నని (straight) రహదారి ఉంది. ఆ టవర్పై నిలబడి ఉన్న రామయ్య అనే వ్యక్తి దూరం నుండి వస్తున్న కారును 30° ల నిమ్నకోణంలో చూసాడు. సమవేగంతో వస్తున్న కారును 6 సెకండ్ల తర్వాత 60° నిమ్నకోణంలో గమనించాడు. ఈ స్థానం నుండి కారు టవర్ను చేరడానికి పట్టుకాలం ఎంత ?
సాధన:
పటం నుండి,
6 సెకండ్లలో కారు ప్రయాణించిన దూరం = AB = x మీటర్లు
టవర్ ఎత్తు CD = h మీటర్లు
కారు ప్రయాణించాల్సిన మిగిలిన దూరం BC = d మీటర్లు
AC = AB + BC = (x + d) మీటర్లు
∠PDA = ∠DAC = 30°
∠PDB = ∠DBC = 60°
ΔBCD నుండి,
tan 60° = \(\frac{\mathrm{CD}}{\mathrm{BC}}\)
√3 = \(\frac{h}{d}\) ⇒ h = √3d …………. (1)
ΔACD నుండి,
tan 30° = \(\frac{\mathrm{CD}}{\mathrm{AC}}\)
\(\frac{1}{\sqrt{3}}\) = \(\frac{h}{(x+d)}\) ⇒ h = \(\frac{(\mathrm{x}+\mathrm{d})}{\sqrt{3}}\) …………… (2)
(1) మరియు (2)ల నుండి,
\(\frac{x+d}{\sqrt{3}}\) = √3d
x + d = 3d
x = 2d ⇒ d = \(\frac{x}{2}\)
‘x’ మీటర్ల దూరం ప్రయాణించడానికి పట్టు కాలం = 6 సెకండ్లు
‘d’ = \(\frac{x}{2}\) మీటర్ల దూరం ప్రయాణించడానికి పట్టు కాలం = 3 సెకండ్లు.
(లేదా)
b) బాగుగా కలుపబడిన 52 పేకముక్కల కట్ట నుండి ఒక కార్డును తీసిన అది ఈ క్రింది కార్డు అగు సంభావ్యతను
కనుగొనుము.
i) నలుపు రాణి
ii) ముఖ కార్డు
iii) డైమండ్ జాకీ
iv) కళావరి
సాధన:
మొత్తం’ పేకకార్డుల సంఖ్య n(S) = 52
i) నలుపు రాణి.
పేక కట్టనుండి నలుపురాణి కార్డు తీయుటకు గల అనుకూల పర్యవసనాల సంఖ్య
n(Q) = 2
∴ P(Q) = \(\frac{n(Q)}{n(S)}\) = \(\frac{2}{52}\) = \(\frac{1}{26}\)
ii) ముఖ కార్డు
ముఖ కార్డు పొందుటకు గల అనుకూల పర్యవసనాల సంఖ్య = 12
∴ P(F) = \(\frac{n(F)}{n(S)}\) = \(\frac{12}{52}\) = \(\frac{3}{13}\)
iii) డైమండు గుర్తు గల జాకీ
డైమండు గుర్తు గల జాకీ పొందుటకు అనుకూల పర్యవసనాల సంఖ్య = 1
∴ P(J) = \(\frac{n(J)}{n(S)}\) = \(\frac{1}{52}\)
iv) కళావరు
కళావరు కార్డు పొందుటకు గల అనుకూల పర్య వసనాల సంఖ్య = 13
కళావరు కార్డు పొందు సంభావ్యత
∴ P(C) = \(\frac{n(C)}{n(S)}\) = \(\frac{13}{52}\) = \(\frac{1}{4}\)
ప్రశ్న 33.
a) P(x) = x2 – 2x – 8 బహుపది రేఖాచిత్రము గీచి, శూన్యాలు కనుగొనుము.
సాధన:
p(x) = x2 – 2x – 8
y = x2 – 2x – 8
ఇచ్చిన బహుపది p(x) = x2 – 2x – 8, గ్రాఫ్ X – అక్షాన్ని (-2, 0) మరియు (4, 0) బిందువుల వద్ద ఖండిస్తున్నది. కావున p(x) = x2 – 2x – 8 యొక్క శూన్యాలు – 2, 4.
(లేదా)
b) భూమి 6 సెం.మీ. మరియు దానికి గీసిన లంబము 3 సెం.మీ. వుండునట్లు ఒక సమద్విబాహు త్రిభుజమును గీయుము.
ఈ త్రిభుజ భుజాలకు 1\(\frac{1}{3}\) రెట్లు అనురూప భుజాల పొడవులు కలిగి ఇచ్చిన త్రిభుజానికి సరూపంగా వుండేటట్లు వేరొక
త్రిభుజాన్ని నిర్మించండి.
సాధన:
నిర్మాణక్రమము
1) భూమి AB = 6 సెం.మీ., ఎత్తు DC = 3 సెం.మీ. లతో ఒక సమద్విబాహు త్రిభుజాన్ని గీయాలి.
2)∠AX ఒక అల్పకోణం అయ్యే విధంగా \(\overrightarrow{\mathrm{AX}}\) గీయాలి.
3) \(\overrightarrow{\mathrm{AX}}\) పై సమాన దూరంలో AA1 = A1A2 = A2A3 = A3A4 అయ్యే విధంగా 4 బిందువులు A1, A2, A3, A4 లను గుర్తించాలి.
4) A3B లను కలిపి, A3B కి సమాంతరంగా A4 ద్వారా గీచిన రేఖ పొడగించిన AB ని B’ వద్ద ఖండిస్తుంది.
5) BC కి సమాంతరంగా B’ ద్వారా గీచిన రేఖ పొడగించిన AC ని C’ వద్ద ఖండిస్తుంది.
6) ΔAB’C’ మనకు కావలసిన త్రిభుజము.