Teachers often recommend practicing with AP 10th Class Biology Model Papers Set 6 in Telugu Medium to enhance exam readiness.
AP 10th Class Biology Model Paper Set 6 with Solutions in Telugu
Time: 2 Hours
Maximum Marks: 50
సూచనలు :
- ఈ ప్రశ్నాపత్రంలో 4 విభాగాలు మరియు 17 ప్రశ్నలు ఉండును.
- III వ విభాగం నందు కేవలం 12వ ప్రశ్నకు మాత్రమే మరియు IV వ విభాగం నందు గల అన్ని ప్రశ్నలకు అంతర్గత ఎంపిక కలదు.
- 2 గంటల సమయంలో, 15 నిమిషాల సమయం ప్రశ్నపత్రం చదువుటకై కేటాయింపబడినది.
- అన్ని సమాధానములు మీకివ్వబడిన సమాధాన పత్రంలోనే రాయవలెను.
- అన్ని సమాధానములు స్పష్టంగాను, గుండ్రంగాను రాయవలెను.
విభాగము – I 8 × 1 = 8 మా.
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 1 మార్కు.
ప్రశ్న 1.
కిరణజన్య సంయోగ క్రియకు కావలసిన కారకాలు ఏవేవి ?
జవాబు:
కిరణజన్య సంయోగ క్రియకు నాలుగు కారకాలు అవసరమవుతాయి.
- సూర్యకాంతి
- నీరు
- కార్బన్ డై ఆక్సైడ్
- హరితరేణువు
ప్రశ్న 2.
దారువు, ప్రసరణ కణజాలానికి మధ్యగల సారూప్యతను రాయండి.
జవాబు:
దారువు, పోషక కణజాలాలు రెండూ మొక్కలలో నీరు, పోషకాల ప్రసరణకు సహాయపడతాయి. వీటిని ప్రసరణ కణజాలం అని అంటారు.
ప్రశ్న 3.
రెండు మూత్రపిండాలు చెడిపోతే జరిగే పర్యవసానాలు రాయండి.
జవాబు:
రెండు మూత్రపిండాలు పూర్తిగా చెడిపోతే శరీరంలోని వ్యర్థాలు విసర్జితం కావు. అవి రక్తంలో పేరుకొనిపోయి శరీరానికి హాని కలుగచేస్తాయి.
ప్రశ్న 4.
ప్రతీకార చర్యలో వెన్నుపాము పాత్రను ఎలా అభినందిస్తావు ?
జవాబు:
వెన్నుపాము శరీరానికి ఆధారాన్ని ఇవ్వడమే కాకుండా శరీరభాగాల నుంచి వచ్చే సమాచారాన్ని మెదడుకు చేరుస్తుంది. అకస్మాత్తుగా చర్యలకు వెంటనే ప్రతిస్పందనలను చూపుతుంది. అలా మనల్ని రక్షిస్తుంది.
ప్రశ్న 5.
మానవ శుక్రకణం యొక్క చిత్రం గీయండి.
జవాబు:
ప్రశ్న 6.
క్రింది పట్టికను దేనిని తెలియజేస్తుంది ?
జవాబు:
ఇది మెండల్ ఏక సంకర సంకరీకరణను తెలుపుతుంది.
విభాగము – II 4 × 2 = 8 మా.
సూచనలు :
- క్రింది ప్రశ్నలన్నింటికి సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 2 మార్కులు.
ప్రశ్న 7.
ఆహారపు గొలుసు నుంచి ఉత్పత్తిదారులను తొలగిస్తే ఏమవుతుంది ?
జవాబు:
- ఆహారపు గొలుసులో ఉత్పత్తిదారులు మొదటి పోషకస్థాయిని చూపుతాయి.
- ఉత్పత్తిదారులు స్వయంగా ఆహారాన్ని తయారుచేసుకునే స్వయంపోషకాలు. దీనిపై ఇతర జీవులు ఆధారపడతాయి.
- ఉత్పత్తిదారులను తొలగిస్తే ఆహారగొలుసులోని మిగిలిన పోషకస్థాయిలు కనుమరుగవుతాయి.
ప్రశ్న 8.
ఈ క్రింది పై (Pie) చార్టును విశ్లేషించి దిగువనీయబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
1) శిలాజ ఇంధనాలను గుర్తించండి.
జవాబు:
బొగ్గు, సహజవాయువు, నూనెలు.
2) వ్యర్థాలను ప్రధాన ఇంధన వనరులుగా భవిష్యత్తులో ఎందుకు అభివృద్ధి చేసుకోవాలి ?
జవాబు:
భవిష్యత్ , శిలాజ ఇంధనాలు తరిగిపోవచ్చు కనుక ప్రత్యామ్నాయ ఇంధనముగా వ్యర్థాలను భవిష్యత్తులో ఉపయోగించవచ్చును.
ప్రశ్న 9.
ఆహారవాహికలో శ్లేష్మం లేకపోతే ఏం జరుగుతుంది ?
జవాబు:
- పెరిస్టాలిటిక్ చలనముకు అవరోధం ఏర్పడును.
- ఆహారపు బోలస్, జారడంకు కష్టమగును.
- ఆహారం మ్రింగడం కష్టతరమగును.
- ఆహారవాహిక గోడలు దెబ్బతినును.
- వివిధ గాఢతలు గల ఆహార పదార్థాల నుండి ఆహారవాహిక రక్షించబడదు.
ప్రశ్న 10.
అంటుకట్టుట వలన కలిగే ఉపయోగాలు ఏమిటి ?
జవాబు:
- అంటుకట్టుట చాలా సులభమైన పద్ధతి. ఎలాంటి శాస్త్రీయ జ్ఞానం అవసరం లేదు.
- రెండు వేర్వేరు లక్షణాలను కలిపి మరింత మేలైన లక్షణాలు గల మొక్కను ఏర్పరచవచ్చును.
- ఈ పద్ధతి ద్వారా త్వరగా మొక్కలను ఏర్పరచవచ్చును.
విభాగము – III 5 × 4 = 20 మా.
సూచనలు :
-
- క్రింది ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 4 మార్కులు.
ప్రశ్న 11.
రంగయ్యకు ఆరోగ్యం సరిగా లేదు. డాక్టర్ నిర్వహించిన పరీక్షల్లో క్రింది ఫలితాలు వచ్చాయి. పట్టికను విశ్లేషించండి. కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
పరీక్షలు | ప్రస్తుతం ఉన్నది | సాధారణ స్థాయి |
రక్తపరీక్ష | ||
1. రక్తపీడనం (బి.పి.) | 160/90 | 120/80 |
2. గ్లూకోజ్ (ఆహారం తినక ముందు) | 120 | 60 – 100 |
3. గ్లూకోజ్ (ఆహారం తిన్న తర్వాత) | 220 | 160 – 180 |
4. బైలిరూబిన్ | 1.0 | 0.1 – 0.8 |
మూత్రపరీక్ష | ||
1. 24 గంటల ప్రోటీన్లు | 150 మి.గ్రా. | 100 మి.గ్రా. |
2. సోడియం | 140 | 125 – 250 |
అ) రంగయ్యకు చక్కెర వ్యాధి ఉన్నది అని ఎలా చెప్పవచ్చు ?
ఆ) బైలిరూబిన్ గురించి తెలుసుకోవడానికి ఏ పరీక్షలు నిర్వహించాలి ?
ఇ) పై నివేదిక ఆధారంగా నీవేం గ్రహించావు ?
ఈ)పై నివేదిక ఆధారంగా డాక్టరును నీవు ఏ ఏ ప్రశ్నలు అడుగుతావు ?
జవాబు:
అ) ఆహారం తినకముందు సాధారణ చక్కెర స్థాయి (గ్లూకోజ్) 60 – 100 మధ్య ఉండాలి. కాని రంగయ్యకు చక్కెర స్థాయి ఆహారం తినకముందు 120 ఉన్నది. ఆహారం తిన్న తర్వాత గ్లూకోజు సాధారణ స్థాయి 160 180 మధ్య ఉండాలి. కాని రంగయ్యకు 220గా ఉన్నది. రెండు సందర్భాలలోను గ్లూకోజు స్థాయిలు రక్తం నందు ఎక్కువగా ఉండుట వలన రంగయ్యకు చక్కెర వ్యాధి ఉన్నట్లు చెప్పవచ్చు.
ఆ) బైలిరూబిన్ గురించి తెలుసుకోవడానికి రక్తపరీక్ష చేయాలి.
ఇ) పై నివేదిక ఆధారంగా రంగయ్యకు అధిక రక్త పీడనము, చక్కెర వ్యాధి ఉన్నదని, రక్తం నందు 24 గంటల ప్రోటీను స్థాయి కూడా ఎక్కువగా ఉన్నదని తెలియుచున్నది. మూత్రం నందు సోడియం స్థాయి సాధారణముగానే ఉన్నదని తెలియుచున్నది. రక్తం నందు పరిమాణం సాధారణ స్థాయి కంటే హెచ్చుగా నున్నది.
ఈ)
- చక్కెర వ్యాధి వలన కలిగే నష్టాలు ఏమిటి ?
- చక్కెర వ్యాధి కలుగుటకు కారణమేది ?
- రక్తంలో గ్లూకోజు స్థాయిలను నియంత్రించు హార్మోను ఏది ? –
- అధిక రక్త పీడనము ఎందువలన కలుగుతుంది ?
- అధిక రక్త పీడనము వలన కలిగే అనర్థాలు ఏమిటి ?
- మూత్రం నందు 24 గంటల ప్రోటీను ఎక్కువైతే ఏం జరుగుతుంది ?
- మన శరీరానికి సోడియం ఏ విధంగా అవసరం అవుతుంది ?
- బైలిరూబిన్ వర్ణక స్థాయి రక్తమునందు ఎక్కువ అయితే కలిగే అనర్థాలు ఏమిటి ?
ప్రశ్న12.
క్రింది పటములలో ఒక పటము గీసి, భాగాలను వ్రాయండి.
A) శ్వాసక్రియా మార్గాన్ని తెలియజేసే బొమ్మ గీసి, భాగాలు గుర్తించండి.
జవాబు:
(లేదా)
B) మానవుని విసర్జక వ్యవస్థ పటం గీచి భాగాలను గుర్తించండి.
జవాబు:
ప్రశ్న 13.
కేంద్రీయ నాడీవ్యవస్థ మరియు పరిధీయ నాడీవ్యవస్థ మధ్యగల భేదాలు ఏవి ?
జవాబు:
కేంద్రీయ నాడీవ్యవస్థ | పరిధీయ నాడీవ్యవస్థ |
1. మెదడు, వెన్నుపామును కలిపి కేంద్రీయ నాడీవ్యవస్థ అంటారు. | 1. కపాలనాడులు, వెన్నునాడులను కలిపి పరిధీయ నాడీవ్యవస్థ అంటారు. |
2. ఇవి శరీరంలో మధ్య (కేంద్ర) ప్రాంతంలో అమరి ఉంటాయి. | 2. ఇవి శరీర మధ్య ప్రాంతం నుండి ప్రక్కలకు విస్తరిస్తాయి. |
3. ఇవి నాడీవ్యవస్థలో కీలకమైనవి ప్రధానపాత్ర పోషిస్తాయి. | 3. ఇవి కేంద్రీయ నాడీవ్యవస్థకు అనుబంధంగా సహాయకంగా పనిచేస్తాయి. |
4. సమాచార విశ్లేషణకు, ప్రతిచర్యల ఆదేశాలకు ప్రాధాన్యత నిస్తాయి. | 4. సమాచార రవాణాలో ప్రధానంగా పాల్గొంటాయి. |
ప్రశ్న 14.
సహజ వనరులను సద్వినియోగం చేసుకోడమే దేశానికి మనం చేసే సేవ అని చెప్పవచ్చు. దీనిని నీవు సమర్థిస్తావా? ఎందుకు?
జవాబు:
సహజ వనరులను సద్వినియోగం చేసుకోవటమే దేశానికి మనం చేసే సేవ అని చెప్పటాన్ని నేను సమర్థిస్తున్నాను.
- పెరుగుతున్న జనాభా వలన వనరుల వినియోగం విపరీతంగా పెరిగింది. ఈ పరిస్థితి కొంతకాలం కొనసాగితే, భవిష్యత్ తరాలకు వనరులు లభించవు.
- ప్రధానంగా శిలాజ వనరుల కొరత ఏర్పడుతుంది. పెట్రోలు, బొగ్గు నిల్వలు అడుగంటిపోతాయి. మనం సాధించిన అభివృద్ధి అంతా శక్తిపైన ఆధారపడి ఉంది.
- శక్తి రహిత ప్రపంచంలో ఏ పరిశ్రమలూ పనిచేయవు. ఏ రవాణా సాధనం నడవదు. అంటే మరలా మనం మధ్యయుగం నాటి పరిస్థితులకు వెళ్ళిపోతాము.
- ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలంటే వనరుల సద్వినియోగం ప్రతి పౌరుడు తన బాధ్యతగా భావించాలి.
- వనరుల వినియోగంలో విచక్షణ ఉపయోగించి భావితరాలకు వాటిని అందించాలి.
- తరిగిపోయే వనరులను తగ్గించి వాడటం అలవాటు చేసుకోవాలి.
- సౌరశక్తి, అలలశక్తి, పవనశక్తి వంటి ప్రత్యామ్నాయ వనరులకు ప్రాధాన్యం ఇవ్వాలి.
- వనరుల వినియోగంలో సాంకేతిక జ్ఞానం పెంచాలి. అప్పుడే భవిష్యత్ తరాలకు మనం శక్తిమయ ప్రపంచం అందించగలం. అదే మనం మన దేశానికి, రేపటి తరానికి చేసే సేవ.
ప్రశ్న 15.
డార్విన్ యొక్క ‘ప్రకృతివరణం’ సిద్ధాంతాన్ని ఒక ఉదాహరణతో వివరించండి.
జవాబు:
ప్రకృతివరణ సిద్ధాంతాన్ని ‘చార్లెస్ డార్విన్’ ప్రతిపాదించాడు. దీని ప్రకారం ప్రకృతి మాత్రమే ఒక జీవి మనుగడ సాగించాలా లేక నశించాలా అని నిర్ణయిస్తుంది. ఏ జీవి మనుగడకు అవసరమైన లక్షణాలు కలిగి ఉంటాయో అవి మాత్రమే ప్రకృతిలో జీవించగలిగి మిగిలినవి మరణిస్తాయి. దీనిని ‘ప్రకృతి వరణం’ (Natural Selection) అంటారు.
ఉదా : ఒక కుందేలుకు పుట్టిన ఐదు పిల్లలలో మూడు వేగంగా పరిగెత్తే ధర్మం కలిగి ఉన్నాయి. రెండు వేగంగా పరిగెత్తలేవు. శత్రువు దాడి చేసినపుడు వేగంగా పరిగెత్తే కుందేళ్లు తప్పించుకొని జీవించగలుగుతాయి. పరిగెత్తలేనివి మరణిస్తాయి.
ఈ సందర్భంలో వేగంగా పరిగెత్తటం వాటి మనుగడకు తోడ్పడింది. ఈ అనుకూలనం ఉన్న జీవులను ప్రకృతి మనుగడకు ఎన్నిక చేసింది.
విభాగము – IV 2 × 8 = 16 మా.
సూచనలు :
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 8 మార్కులు.
- ప్రతి ప్రశ్నకు అంతర్గత ఎంపిక కలదు.
ప్రశ్న 16.
ఎ) క్రింది భాగాలలో పెరిస్టాలిసిస్ విధులను తెల్పండి.
ఎ) ఆహారవాహిక
బి) జీర్ణాశయం
సి) చిన్నప్రేగు
డి) పెద్దప్రేగు
జవాబు:
ఎ) ఆహారవాహిక : ఆహారవాహికలోని ‘పెరిస్టాల్సిస్’ చలనం వలన ఆహారం నోటి నుండి జీర్ణాశయంకు చేరుతుంది.
బి) జీర్ణాశయం : జీర్ణాశయంలోని పెరిస్టాల్సిస్ చలనం వలన ఆహారం జఠర రసంతో బాగా కలపబడి జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. ఆహారాన్ని చిలకటానికి, కదపటానికి జీర్ణాశయంలో ‘పెరిస్టాల్సిస్’ తోడ్పడుతుంది.
సి) చిన్నప్రేగు : చిన్నప్రేగులో పెరిస్టాల్సిస్ వలన ఆహారం నెమ్మదిగా ముందుకు కదిలి పెద్దప్రేగును చేరుతుంది.
డి) పెద్దప్రేగు : పెద్దప్రేగులో పునఃశోషణ జరిగిన పిదప, వ్యర్థపదార్థాలు క్రమేణా ముందుకు జరిగి పాయువు ద్వారా విసర్జింపబడతాయి.
(లేదా)
బి) సమ విభజన, క్షయకరణ విభజనకు గల తేడాలేమిటి ?
జవాబు:
సమవిభజన – క్షయకరణ విభజన :
సమవిభజన | క్షయకరణ విభజన |
1. శాఖీయ కణాలలో జరుగుతుంది. | 1. లైంగిక కణాలలో జరుగుతుంది. |
2. కేంద్రకం ఒక్కసారే విభజన చెందుతుంది. | 2. కేంద్రకం రెండుసార్లు విభజన చెందుతుంది. |
3. పిల్లకణాలు రెండు ఏర్పడతాయి. | 3. నాలుగు పిల్లకణాలు ఏర్పడతాయి. |
4. పిల్లకణాలు ద్వయస్థితికంలో ఉంటాయి. | 4. పిల్లకణాలు ఏకస్థితికంలో ఉంటాయి. |
5. చాలా తరచుగా జరుగుతుంది. | 5. అరుదుగా జరుగుతుంది. |
6. పిల్లకణాలు శాఖీయ భాగాలను ఏర్పరుస్తుంది. | 6. పిల్లకణాలు సంయోగబీజాలను ఏర్పరుస్తాయి. |
7. ప్రథమదశ, మధ్యదశ, చలనదశ మరియు అంత్యదశ అనే పదశలు ఉంటాయి. | 7. ప్రతి దశ రెండుసార్లు ఉంటుంది. ప్రథమదశ 1 లో 5 ఉపదశలు ఉంటాయి. |
8. క్రోమోజోమ్ల సంఖ్య మారదు. | 8. పిల్లకణాలలో క్రోమోజోమ్ల సంఖ్య సగానికి తగ్గించబడుతుంది. |
9. విభజనకు ముందు క్రోమోజోమ్లు రెట్టింపు అవుతాయి. | 9. ప్రథమ క్షయకరణ విభజన తరువాత క్రోమోజోమ్స్ సంఖ్య రెట్టింపు అవుతుంది. |
10. వినిమయం జరగదు. | 10. వినిమయం జరుగుతుంది. |
ప్రశ్న17.
ఎ) శ్వాసక్రియలో కార్బన్ డై ఆక్సైడ్ వెలువడునని అర్థము చేసుకొనుటకు నీవు ప్రయోగశాలలో నిర్వహించిన ప్రయోగ
జవాబు:
విధానము తెలుపుము.
ఉద్దేశం : శ్వాసక్రియలో CO2 వెలువడుతుందని నిరూపించుట.
పరికరాలు : వెడల్పు మూతిగల రెండు గాజు సీసాలు, మొలకెత్తుతున్న శనగగింజలు, పొడి శనగగింజలు, సున్నపునీరు ఉన్న బీకర్లు.
ప్రయోగ విధానం :
- వెడల్పు మూతిగల రెండు గాజుసీసాలు తీసుకోవాలి. ఒకదానిలో మొలకెత్తుతున్న శనగగింజలు ఉంచాలి. రెండవ దానిలో పొడి శనగగింజలు ఉంచవలెను.
- రెండు గాజుసీసాలలో సున్నపుతేటతో నింపిన బీకర్లు ఉంచాలి. తరువాత రెండు సీసాల రబ్బరు బిరడాలను గట్టిగా బిగించాలి.
- సీసామూతి చుట్టూ గాలి చొరబడకుండా వేజిలైన్ పూయవలెను. సీసాలను కదపకుండా రెండు రోజులు ఉంచవలెను.
పరిశీలన : - ఒకటి రెండు రోజులు గమనించినట్లయితే మొలకెత్తుతున్న శనగగింజలు ఉండే సీసాలోని బీకరులో ఉన్న సున్నపు తేట ఎక్కువగా తెల్లటి పాలవలె మారుతుంది.
- దీనికి కారణము మొలకెత్తే విత్తనాలు శ్వాసక్రియ జరపడం వల్ల వెలువడిన కార్బన్ డై ఆక్సైడ్ వల్లనే సున్నపు తేట పాల వలె మారిందని చెప్పవచ్చు.
- పొడిగింజలు గల సీసాలోని సున్నపు తేట తెల్లగా పాలవలె అంతగా మారదు.
ఫలితం : - కనుక శ్వాసక్రియలో కార్బన్ డై ఆక్సైడ్ విడుదల అవుతుందని నిరూపించడమైనది.
(లేదా)
బి) జాన్ కాగితం కప్పు, ప్లాస్టిక్ గొట్టాలను ఉపయోగించి స్టెతస్కోపును తయారుచేశాడు. అతడు అనుసరించిన విధానాన్ని రాయండి.
జవాబు:
జాన్ స్టెతస్కోప్ నిర్మించటానికి ఈ క్రింది విధానం అనుసరించాడు.
- ఒక కాగితం కప్పు తీసుకొని దాని మధ్యన రంధ్రం చేసి, ఒక చిన్న గొట్టం అమర్చాడు.
- రెండు ప్లాస్టిక్ గొట్టాలను తీసుకొని వాటిని రబ్బరు ట్యూబ్లో కలిపాడు.
- రబ్బరు ట్యూబ్ను కాగితం కప్పుకు అమర్చిన గొట్టానికి కలిపాడు.
- అందువలన Y ఆకారంలో ప్లాస్టిక్ గొట్టాలు అమర్చబడ్డాయి.
- దానికి క్రిందుగా కాగితం కప్పు వ్రేలాడుతూ ఉంది.
- ప్లాస్టిక్ గొట్టాలను చెవిలో ఉంచుకొని గుండెపై కాగితం కప్పు ఆన్చి హృదయ స్పందనను వినవచ్చు.
- ఇది హృదయస్పందనను పరిశీలించే స్టెతస్కోప్లో పని చేస్తుంది.