Teachers often recommend practicing with AP 10th Class Biology Model Papers Set 5 in Telugu Medium to enhance exam readiness.
AP 10th Class Biology Model Paper Set 5 with Solutions in Telugu
Time: 2 Hours
Maximum Marks: 50
సూచనలు :
- ఈ ప్రశ్నాపత్రంలో 4 విభాగాలు మరియు 17 ప్రశ్నలు ఉండును.
- III వ విభాగం నందు కేవలం 12వ ప్రశ్నకు మాత్రమే మరియు IV వ విభాగం నందు గల అన్ని ప్రశ్నలకు అంతర్గత ఎంపిక కలదు.
- 2 గంటల సమయంలో, 15 నిమిషాల సమయం ప్రశ్నపత్రం చదువుటకై కేటాయింపబడినది.
- అన్ని సమాధానములు మీకివ్వబడిన సమాధాన పత్రంలోనే రాయవలెను.
- అన్ని సమాధానములు స్పష్టంగాను, గుండ్రంగాను రాయవలెను.
విభాగము – I 6 × 1 = 6 మా.
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 1 మార్కు.
ప్రశ్న 1.
క్రింది విటమిన్లను వర్గీకరించుము.
1) రైబోఫ్లావిన్
2) రెటినాల్
3) టోకోఫెరాల్
4) థయమీన్
జవాబు:
1) నీటిలో కరిగే విటమిన్లు : టోకోఫెరాల్, రెటినాల్
2) కొవ్వులో కరిగేవి : రైబోఫ్లావిన్, థయమీన్
ప్రశ్న 2.
లెంటిసెల్స్ ఏవి ? వాటి విధులను తెల్పండి.
జవాబు:
మొక్కలోని బెరడులో అనేక సంఖ్యలో ఉండే సూక్ష్మ ఖాళీ ప్రదేశాలు ఇవి వాయువుల రవాణాకు సహాయపడతాయి.
ప్రశ్న 3.
చిత్రంలోని రక్త ప్రసరణ వ్యవస్థ పేరేమిటి ? ఏ జీవిలో చూస్తాము ?
జవాబు:
ఏకవలయ రక్తప్రసరణ. ఉదా : చేపలు
ప్రశ్న 4.
అధిక రక్తపీడనాన్ని తగ్గించుకోవడానికి మీరు అవలంబించే మంచి అలవాట్లను పేర్కొనుము.
జవాబు:
- మంచి పోషకాహారం తీసుకోవాలి.
- బరువు పెరగకుండా చూసుకోవాలి.
- వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.
ప్రశ్న 5.
పరాగరేణువు చిత్రాన్ని గీయండి.
జవాబు:
ప్రశ్న 6.
పెరిస్టాలిటిక్ చలనాల యొక్క దిశ ఆవులో వలె అపసవ్య దిశలో జరిగితే ఏమవుతుంది ?
జవాబు:
పెరిస్టాలిటిక్ చలనం తిరోగామిగా లేకపోతే జంతువులు ఆహారాన్ని నమలడం కుదరదు. నెమరువేయడం అనే ప్రక్రియ జరగదు.
విభాగము – II 4 × 2 = 8 మా.
సూచనలు :
- క్రింది ప్రశ్నలన్నింటికి సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 2 మార్కులు.
ప్రశ్న 7.
క్రింది పట్టికను పూరించండి.
జీర్ణాశయంలో-స్రవించబడే హార్మోనులు | విధులు |
జవాబు:
జీర్ణాశయంలో-స్రవించబడే హార్మోనులు | విధులు |
గ్రెలిన్ | ఆకలి కోరికలు ప్రేరేపించుట |
లెప్టిన్ | ఆకలి కోరికను తగ్గించుట |
ప్రశ్న 8.
ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రసరణ గురించి వివరంగా తెలుసుకోవాలంటే నీవేమి ప్రశ్నలు అడుగుతావు ?
జవాబు:
- ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రసరణ అవసరం ఏమిటి ?
- ఆవరణ వ్యవస్థలో శక్తిపిరమిడ్ ఏ ఆకారంలో ఉంటుంది?
- ఆహారపు గొలుసులో ప్రతి స్థాయి వద్ద శక్తి నష్టం ఎంత ఉంటుంది ?
- ఎంత శక్తి శాతం ఆహారపు గొలుసులో స్థాయి పెరిగినపుడు రవాణా అవుతుంది ?
- ఆవరణ వ్యవస్థలో శక్తి ఉత్పత్తిదారులు ఏమిటి ?
- శక్తిపిరమిడ్లో ఉత్పత్తిదారుల సంఖ్య అధికంగా ఉండవలసిన అవసరం ఏమిటి ?
ప్రశ్న 9.
-మీ ప్రాంతంలోని నీటిని పునఃచక్రీయం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటావు ?
జవాబు:
- పంటకాలువ మీద ఆనకట్ట కట్టి, మినీ హైడల్ ప్రాజెక్టును నిర్వహించడం.
- విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించిన నీటిని తిరిగి పంట కాలువలకు పంపి పునర్వినియోగం చేయడం.
- వంటగదిలో ఉపయోగించిన నీటిని తోటలోని మొక్కలకు పోయడం.
- ఒకసారి ఉపయోగించిన నీటితో వాహనాలను శుభ్రపరచడం.
- స్నానానికి ఉపయోగించిన నీటిని టాయిలెట్ ఫ్లష్కు ఉపయోగించడం మొదలైనవి.
ప్రశ్న 10.
జీవ వైవిధ్యత అంటే ఏమిటి ? దాని ప్రాముఖ్యత ఏమిటి ?
జవాబు:
భూమిపై నివసిస్తున్న జీవులలో గల వైవిధ్యమే జీవవైవిధ్యం. ప్రకృతి నుండి మనకు లభించే ఉత్పత్తులు మరియు లాభాలన్నీ జీవవైవిధ్యం నుండి పొందుతున్నవే. ఆహార పదార్థాలు, వాటి నిర్మాణాలకు ఉపయోగించే పదార్థాలు, ఔషధాలు లభించాలన్నా మరియు పరిశుభ్రమైన, ఉపయోగకరమైన నేల ఉండాలన్నా జీవవైవిధ్యం ఎంతో అవసరం.
ఆహార వనరులు వైవిధ్యంగా, సమృద్ధిగా ఉండేవిధంగా మనం జీవవైవిధ్యాన్ని కాపాడుకోవలసిన అవసరం ఉంది. ఆహారం కన్నా జీవవైవిధ్యం గొప్పది. ఉదాహరణకు ప్రపంచంలో మొత్తంలో 50,000 నుండి 70,000 వృక్ష జాతులను ఔషధాల తయారీలో వినియోగిస్తున్నారు.
విభాగము – III 5 × 4 = 20 మా.
సూచనలు :
- క్రింది ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 4 మార్కులు.
ప్రశ్న 11.
జీర్ణాశయం సొంత ఆమ్లాల స్రావాల నుండి తనను తాను ఎలా రక్షించుకుంటుందో అర్థం చేసుకొనుటకు నిర్వహించిన ఆమ్లం మరియు పత్ర ప్రయోగం విధానాన్ని రాయండి. ఫలితాలను మానవ జీర్ణ వ్యవస్థలో జరిగే అంశాలతో పోల్చండి.
జవాబు:
కావలసిన పరికరాలు : రెండు ఆకులు, పెట్రోలియం జెల్లీ / వాజీన్, బలహీన ఆమ్లం, రెండు పెట్రిడిష్ లు, డ్రాపర్. ప్రయోగ విధానం :
- రెండు ఆకుపచ్చని పత్రాలు సేకరించాలి. ఒక పత్రానికి పెట్రోలియం జెల్లీ లేదా వాజ్న్ పూయాలి. మరొక దానిని అలాగే వదిలేయాలి.
- రెండు ఆకులను పెట్రిడిష్లో ఉంచి 1 లేదా చుక్కల బలహీన ఆమ్లాన్ని రెండు పత్రాలపై డ్రాపర్ సహాయంతో వేయాలి.
- అరగంట తరువాత పత్రాలను పరిశీలించాలి. వాజ్మీన్ పూసిన ఆకులో ఏ మార్పు ఉండదు.
- వాజీన్ పూయని ఆకు ఆమ్లం ప్రభావం నుండి రక్షించబడలేదు. (కాలినట్లుగా మారింది).
పోలిక :
- శ్లేష్మ పదార్థం జీర్ణాశయపు గోడలపై ఒక పలుచని పొరలా ఏర్పడుతుంది. ఇది ఆమ్ల ప్రభావం నుండి జీర్ణాశయాన్ని రక్షిస్తుంది.
- పెట్రోలియం జెల్లీ చేసే పనిని జీర్ణాశయపు గోడలలోని శ్లేష్మం చేసే పనితో పోల్చవచ్చు.
ప్రశ్న 12.
క్రింది పటములలో ఒక పటము గీసి, భాగాలను వ్రాయండి.
A) ఆకు అడ్డుకోత పటం గీసి, భాగాలు గుర్తించండి.
జవాబు:
(లేదా)
B) ఏకవలయ, ద్వివలయ రక్తప్రసరణను తెలియజేసే రేఖా చిత్రాలను గీయండి.
జవాబు:
ప్రశ్న 13.
క్రిమి సంహారకాల వాడకాన్ని ఆపివేసి నేలకాలుష్యం నివారించడానికి సహాయపడే ఏవైనా మూడు ‘ కార్యక్రమాలను సూచించండి.
జవాబు:
క్రిమిసంహారకాల వాడకాన్ని ఆపివేయటానికి ఈ కింది కార్యక్రమాలు తోడ్పడతాయి.
- జీవనియంత్రణ పద్ధతులు : కీటకాలను అదుపులో ఉంచటానికి వాటిని తినే పరభక్షకాలను ఉపయోగించవచ్చు. కొన్నిసార్లు పరాన్నజీవులను ప్రవేశపెట్టి వ్యాధికారక కీటకాలను నిర్మూలించవచ్చు.
- జీవరసాయనాలు వాడటం : హానికర రసాయనిక మందుల స్థానంలో మొక్కల నుండి లభించే నింబిన్ (వేప) వంటి పదార్థాలను పిచికారీ చేసి, కీటకాలను అదుపులో ఉంచవచ్చు. పొగాకు, వెల్లుల్లి, పంచగవ్య, ఎన్పీవి ద్రావణం దీనికి ఉదాహరణలు.
- లింగాకర్షణ బుట్టలు : మగ కీటకాలను ఆకర్షించటానికి పంట పొలాలలో లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసి కీటకాలను బంధించవచ్చు. వీటిలో ‘ఫిరొమోన్’ రసాయనాలు వాడి మగకీటకాలను బంధిస్తారు.
ప్రశ్న 14.
కింది సమాచారాన్ని పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
వ.సం. | హార్మోనులు | ఉపయోగాలు |
1) | ఆక్సీనులు | కణం పెరుగుదల, కాండం, వేరు విభేదనం చూపడం |
2) | ఆబ్సైసిక్ ఆమ్లం | పత్రరంధ్రాలు మూసుకోవడం, విత్తనాలలో సుప్తావస్థ |
3) | ఇథిలీన్ | ఫలాలు పక్వానికి రావడం |
4) | సైటోకైనిన్లు | కణ విభాజనను ప్రేరేపించడం, పార్శ్వ కోరకాల పెరుగుదలను ప్రేరేపించడం, ఆకులు రాలకుండా చూడడం. |
i) మొక్కలలో ఉండే హార్మోనులను ఏమంటారు ?
ii) మొక్కల పెరుగుదలకు తోడ్పడే హార్మోను ఏది ?
iii) రైతులు వచ్చి మామిడికాయల మధ్యలో కార్బైడ్ను ఉంచుతారు. దీనికి కారణం ఏమిటి ? నాలుగైదు రోజుల తర్వాత ఏమి గమనించవచ్చు ?
iv) మొక్కలు కూడా జంతువుల మాదిరిగా ప్రతిస్పందిస్తాయి. నీవు దీనిని అంగీకరిస్తావా ? నీ సమాధానాన్ని సమర్థించండి.
జవాబు:
i) మొక్కలలో ఉండే హార్మోన్లను ‘ఫైటోహార్మోన్లు’ అంటారు.
ii) మొక్కల పెరుగుదలకు ఆక్సిన్స్, సైటోకైనిన్స్ తోడ్పడతాయి.
iii) కార్బైడ్ నుండి విడుదలయ్యే ఇథిలీన్ కాయలను పండిస్తుంది. అందువలన పచ్చి మామిడికాయలు నాలుగు రోజుల తరువాత పండినట్టు కనిపిస్తాయి.
iv) అవును. మొక్కలు వేసవికి పత్రాలను రాల్చుతాయి. వర్షానికి ఆకులు వేస్తాయి. వసంత ఋతువులో పుష్పిస్తాయి. అత్తిపత్తి వంటి మొక్కలు తాకగానే ముడుచుకుపోతాయి.
ప్రశ్న 15.
సుస్థిరాభివృద్ధి అంటే ఏమిటి? వనరుల యాజమాన్యంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది?
జవాబు:
అభివృద్ధి, సంరక్షణ రెండింటికి ప్రాధాన్యమిస్తూ, భావితరాలకు అవసరమయ్యే సహజ వనరులను అందుబాటులో ఉండే విధంగా మనం పర్యావరణాన్ని ఉపయోగించుకున్నట్లయితే అది సుస్థిరాభివృద్ధి అవుతుంది.
అభివృద్ధి పేరుతో మనం అడవులను, పరిసరాలను ధ్వంసం చేస్తూ ముందుకు సాగటం మంచి పరిణామం కాదు. దీనివలన భవిష్యత్ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనవలసి వస్తుంది. చెట్లను నరికి ఎ.సి.లు వాడుకోవటం అభివృద్ధి అవుతుందా? అభివృద్ధితో పర్యావరణం సంరక్షించబడాలి. మనిషి పర్యావరణంలో ఒక ప్రాణి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎంత ఎదిగినా ప్రకృతిలో ఒదిగినపుడే తన మనుగడకు క్షేమమని మరచిపో కూడదు. దీనికోసం ప్రకృతి ప్రసాదించిన వనరులను విచక్షణాయుతంగా, పొదుపుగా, పునఃచక్రీయంగా, సమతాస్థితి కాపాడే విధంగా వాడుకోవాలి.
విభాగము – IV 2 × 8 = 16 మా.
సూచనలు :
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 8 మార్కులు.
- ప్రతి ప్రశ్నకు అంతర్గత ఎంపిక కలదు.
ప్రశ్న 16.
ఎ) మెండల్ సిద్ధాంతాన్ని తను బఠాణి మొక్కలో నిర్వహించిన ప్రయోగాల ఆధారంగా వివరించండి.
జవాబు:
వైవిధ్యాలు గురించి అవి అనువంశికంగా సంక్రమించే విధానం గురించి 1857లో గ్రెగర్ జోహాన్ మెండల్ పరిశోధన చేశాడు. ఇతను బఠానీ మొక్కలపై సంకరణ ప్రయోగాలు చేసి అనువంశికతను వివరించాడు. ఇతని సిద్ధాంతంలో మూడు పరికల్పనలు, రెండు సూత్రాలు ఉన్నాయి.
పరికల్పనలు :
మొదటి పరికల్పన : జీవిలోని ప్రతి ప్రత్యేక లక్షణానికి రెండు కారకాలు ఉంటాయి. (వీటిని నేడు మనం జన్యువులు అంటున్నాము. ఈ జన్యువుల జతను యుగ్మ వికల్పకం అంటారు.)
రెండవ పరికల్పన : సంతతిలోని రెండు కారకాలు ఒక్కో జనకుని నుండి ఒక్కొక్కటి పొందును.
వివరణ : సంయోగబీజాల కలయిక వలన జీవి ఏర్పడుతుంది. సంయోగబీజం ఒకటి తల్లి నుండి మరొకటి తండ్రి నుండి వస్తాయి. కావున సంతతిలోని యుగ్మకల్పకంలో ఒకటి తల్లి మరొకటి తండ్రికి చెంది ఉంటాయి. మూడవ పరికల్పన : సంతతికి లభించిన రెండు భిన్న కారకాలలో ఒక కారకం మాత్రమే బహిర్గతమవుతుంది. వివరణ : సంతతి విషమయుగ్మజ స్థితిలో ఉంటే ఒక లక్షణం మాత్రమే ప్రదర్శిస్తుంది. ఈ ధర్మాన్ని బహిర్గతం అంటారు. సిద్ధాంతాలు : తన పరికల్పనల ఆధారంగా మెండల్ రెండు సిద్ధాంతాలను సూత్రీకరించాడు. అవి-
- బహిర్గత సిద్ధాంతం : జీవి విషమయుగ్మజ స్థితిలో ఉన్నప్పుడు ఒక లక్షణం మాత్రమే ప్రదర్శింపబడుతుంది. మరొకటి అంతర్గతంగా ఉండిపోతుంది.
ఉదా : విషమయుగ్మజ పొడవు (Tt) మొక్కలో పొడవు లక్షణం ప్రదర్శింపబడి పొట్టి లక్షణం అంతర్గతంగా
ఉంటుంది. - వేరుపడే సూత్రం : యుగ్మ వికల్పకాలలో ఒక్కొక్కటి ఒక్కో జనకుడి నుండి సంతతికి లభిస్తాయి. అయితే జనకుల యుగ్మవిక్పలకాలలో ఏదో ఒక కారకం యథేచ్ఛగా (Random) సంతతికి అందించటం జరుగుతుంది.
ఉదా : విషమయుగ్మజ పొడవు మొక్క (Tt) నుండి రెండు రకాల సంయోగబీజాలు (T), (t) సమ సంఖ్యలో ఏర్పడతాయి.
(లేదా)
బి) స్వయంచోదిత నాడీవ్యవస్థను ఉదాహరణతో వివరించండి.
జవాబు:
పరిధీయ నాడీవ్యవస్థ శరీరంలోని కొన్ని ప్రాంతాలలో ఉదాహరణకు శరీర అంతర్భాగాలు. రక్తనాళాలు, సరళ మరియు హృదయ కండర భాగాలలో అనియంత్రిత విధిని నిర్వహిస్తుంది. అటువంటి పరిధీయ నాడీవ్యవస్థను స్వయంచోదిత నాడీవ్యవస్థ (Automatic Nervous System) అని అంటారు. అంతేకాకుండా చర్మంలోని కొన్ని కండర ప్రాంతాలలో మరియు అస్థి కండరాలలో నియంత్రిత విధిని కలిగి ఉంటుంది.
స్వయంచోదిత నాడీవ్యవస్థ ద్వారా మన శరీరంలో జరిగే అనియంత్రిత విధి యొక్క ఉదాహరణను చూస్తే మన కంటిపాప చిన్నదిగా పెద్దదిగా మారడం అని చెప్పవచ్చు.
మనం ఎప్పుడైతే చీకటి గదిలో ప్రవేశిస్తామో వెళ్ళిన వెంటనే మనకు ఏమీ కనబడదు. మెల్ల మెల్లగా గదిలోని వస్తువులు చూస్తుంటాం. ఎందుకంటే అప్పుడు మన కంటిపాప యొక్క వ్యాసం పెరగడం వలన ఎక్కువ కాంతి లోపలికి వస్తుంది. చీకటి గది నుండి బయటకు అధిక వెలుతురులోకి వచ్చినప్పుడు కంటిపాప వ్యాసం తగ్గిపోయి తక్కువ కాంతి పడేటట్లు చేస్తుంది. ఈ రెండు ప్రక్రియలను స్వయంచోదిత నాడీవ్యవస్థ ప్రభావితం చేస్తుంది.
ప్రశ్న 17.
ఎ) మనం విడిచేగాలిలో CO2 ఉంటుందని ఎలా నిరూపిస్తావు ?
జవాబు:
ఉద్దేశం : మనం విడిచే గాలిలో CO2 ఉంటుందని నిరూపించుట.
పరికరాలు : రెండు పరీక్షనాళికలు, సున్నపుతేట, గాజునాళాలు, సిరంజి విధానం : రెండు పరీక్షనాళికలు తీసుకొని ఒకదానిలో సున్నపుతేట, మరొక దానిలో నీటిని తీసుకోవాలి. రెండింటిలోనికి గాజు నాళాలు అమర్చి గాలి ఊదాలి. పరిశీలన : గాలి ఊదినపుడు పరీక్షనాళికలోని సున్నపుతేట తెల్లగా పాలవలె మారింది. నిర్ధారణ : మరొక సున్నపుతేట ఉన్న పరీక్షనాళికలోనికి సిరంజి ద్వారా గాలి ఊదినపుడు అది రంగు మారలేదు. అంటే మనం విడిచే గాలిలో ఉన్న వాయువు సున్నపుతేటను పాలవలె మార్చింది. సున్నపునీటిని పాలవలె మార్చే వాయువు CO2. నిరూపణ : మనం విడిచే గాలిలో CO2 ఉండి సున్నపుతేటను పాలవలె మార్చుతుందని నిరూపించుటమైనది.
(లేదా)
బి) వేరు పీడనాన్ని నిరూపించడానికి నీవు ప్రయోగశాలలో నిర్వహించిన ప్రయోగాన్ని వివరించండి.
జవాబు:
వేరు పీడనం : వేరు నీటిని పీల్చుకొన్నప్పుడు వెలువర్చే పీడనాన్ని వేరు పీడనం అంటారు. దీనివలన నీరు వేరు నుండి కాండములోనికి చేరుతుంది. వేరు పీడనాన్ని మానోమీటరు సహాయంతో కొలుస్తారు.
ప్రయోగం :
ఉద్దేశం : వేరు పీడనం నిరూపించుట.
పరికరాలు : కుండీలో పెరుగుతున్న మొక్క, గాజుగొట్టం, రబ్బరు గొట్టం.
విధానం :
- కుండీలో పెరుగుతున్న మొక్కను తీసుకొని, భూమి ఉపరితలం కంటే 1 సెం.మీ పైన ఉండే విధంగా కాండం భాగాన్ని కోయాలి.
- గాజు గొట్టాన్ని కోసిన కాండ భాగానికి, రబ్బరు గొట్టంతో కట్టాలి.
- గాజు గొట్టంలో నీరు పోసి నీటి మట్టాన్ని (M1) కొలిచి నమోదు చేయాలి.
- 2 – 3 గంటల పాటు, ప్రయోగ అమరికను కదపకుండా ఒకచోట ఉంచాలి.
పరిశీలన : రెండు గంటల తరువాత గాజు గొట్టంలో నీటి మట్టం పెరుగుదల (M2) ను గుర్తించాను. వివరణ : గాజు గొట్టంలో నీటి మట్టం పెరుగుదల, వేరు నీరు పీల్చడం వలన జరిగింది. వేరు నీటిని పీల్చి గాజు గొట్టంలోని నీటిని పైకి నెట్టింది. నీటిని పైకి నెట్టిన ఈ బలాన్ని వేరు పీడనం అంటారు.
నిరూపణ : మొక్కలలో వేరు పీడనం ఉంటుందని నిరూపించటమైనది.