Teachers often recommend practicing with AP 10th Class Biology Model Papers Set 3 in Telugu Medium to enhance exam readiness.
AP 10th Class Biology Model Paper Set 3 with Solutions in Telugu
Time: 2 Hours
Maximum Marks: 50
సూచనలు :
- ఈ ప్రశ్నాపత్రంలో 4 విభాగాలు మరియు 17 ప్రశ్నలు ఉండును.
- III వ విభాగం నందు కేవలం 12వ ప్రశ్నకు మాత్రమే మరియు IV వ విభాగం నందు గల అన్ని ప్రశ్నలకు అంతర్గత ఎంపిక కలదు.
- 2 గంటల సమయంలో, 15 నిమిషాల సమయం ప్రశ్నపత్రం చదువుటకై కేటాయింపబడినది.
- అన్ని సమాధానములు మీకివ్వబడిన సమాధాన పత్రంలోనే రాయవలెను.
- అన్ని సమాధానములు స్పష్టంగాను, గుండ్రంగాను రాయవలెను.
విభాగము – I 6 × 1 = 6 మా.
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 1 మార్కు.
ప్రశ్న 1.
క్రింది సమీకరణము దేనిని తెలియజేస్తుంది ?
C6H12O6 + 6O2 → 6CO2 + శక్తి
జవాబు:
శ్వాసక్రియ
ప్రశ్న 2.
కర్ణికా-జఠరికాంతర విభాజకాల వద్ద గల కవాటాలేవి ?
జవాబు:
త్రిపత్ర కవాటం, మిట్రల్ కవాటం
ప్రశ్న 3.
సహజ వనరులు అతి త్వరగా అంతరించిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్ పరిణామాలను ఊహించండి.
జవాబు:
నీరు, ఆహార సంక్షోభం ఏర్పడుతుంది.
ప్రశ్న 4.
ఈ క్రింది ఇవ్వబడిన కొల్లేరు సరస్సు గూర్చిన సమాచారమును చదివి, ప్రశ్నలకు జవాబులివ్వండి.
క్ర.సం. | సరస్సు క్షీణతకు కారణాలు | 1967 నాటికి వైశాల్యం (చ.కి.మీ.) | 2004 నాటికి వైశాల్యం (చ.కి.మీ.) |
1. | అరుదైన కలుపుతో నిండిన భాగము | 0 | 47.45 |
2. | రొయ్యల చెరువులు | 0 | 99.74 |
3. | వరిపండే పొలాలు | 8.40 | 16.62 |
4. | ఆక్రమణలు | 0.31 | 1.37 |
ఎ) సరస్సు వైశాల్యము తగ్గిపోవుటకు గల కారణాలేవి ?
బి) మానవ సంబంధమైన ఏ చర్యవల్ల సరస్సు వైశాల్యము గణనీయముగా తగ్గిపోయినది ?
జవాబు:
ఎ) చేపల చెరువులు, భూ ఆక్రమణలు
బి) చేపల చెరువుల ఏర్పాటు, పంటపొలాల కోసం భూ ఆక్రమణలు
ప్రశ్న 5.
జీర్ణాశయములో ఆకలి సంకేతాలకు కారణమయ్యే హార్మోన్ల పాత్రను నీవెట్లు ప్రశంసిస్తావు ?
జవాబు:
గ్రెలిన్ హార్మోన్ ఆకలి ప్రేరేపించడం వలననే మనకు ఆకలి అవుతుంది.
ప్రశ్న 6.
పునఃచక్రీయము (recycling) ను సూచించు లోగో పటమును గీయుము.
జవాబు:
విభాగము – II 4 × 2 = 8 మా.
సూచనలు :
- క్రింది ప్రశ్నలన్నింటికి సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 2 మార్కులు.
ప్రశ్న 7.
కిరణజన్య సంయోగక్రియలో క్లోరోప్లాస్ నందు జరుగు ముఖ్య సంఘటనలేవి ?
జవాబు:
హరితరేణువులో క్రింది చర్యలు జరుగుతాయి.
- కాంతి శక్తి రసాయనిక శక్తిగా మారుతుంది.
- నీటి అణువు విచ్ఛిన్నం చెందడం.
- కార్బోహైడ్రేట్ విచ్ఛిన్నం చెంది CO2 ఏర్పడటం.
ప్రశ్న 8.
వ్యవసాయములో రసాయన ఎరువుల వాడకం వల్ల కలుగు దుష్ఫలితాల గూర్చి మరింత సమాచారమును సేకరించుటకు వ్యవసాయ శాస్త్రవేత్తను ఎటువంటి ప్రశ్నలడుగుతావు ?
జవాబు:
- రసాయన ఎరువులను వాడటం లాభమా ? నష్టమా ?
- రసాయన ఎరువులను అతిగా వాడటం వలన కలిగే నష్టాలేమిటి ?
- రసాయన ఎరువులకు, సేంద్రీయ ఎరువులకు గల తేడాలేమిటి ?
- రసాయన ఎరువులు వాడటం వలన భూసారం ఏమవుతుంది ?
ప్రశ్న 9.
మానవ పరిణామ కాలమును సూచించు దిగువ పట్టికను గమనించి, క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయుము.
క్ర.సం. | మానవ జాతి | జీవించిన / కనిపించిన కాలం |
1. | హెూమో హేబిలస్ | 1.6 – 2.5 మిలియన్ సం॥ల క్రితం |
2. | హెూమో ఎరక్టస్ | 1 – 1.8 మిలియన్ సం॥ల క్రితం |
3. | హెూమో నియాండర్తలెన్సిస్ | 1,00,000 – 40,000 మిలియన్ సం||ల క్రితం |
4. | హెూమో సెపియన్స్ | 15,000 – 10,000 మిలియన్ సం||ల క్రితం |
1) ప్రస్తుతమున్న మానవజాతికి ముందు జీవించిన మానవజాతి ఏది ?
2) 1 – 1.8 మిలియన్ సం||ల క్రితం జీవించిన మానవ జాతి ఏది ?
జవాబు:
1) హోమో నియాండర్తలెన్సిస్
2) హోమో ఎరక్టస్
ప్రశ్న 10.
కార్బన్ డై ఆక్సైడ్ గాఢతను నిరంతరం పెంచుతూ పోతుంటే, కిరణజన్య సంయోగక్రియా రేటు ఏమవుతుంది ?
జవాబు:
- కిరణజన్య సంయోగక్రియా రేటు గాలిలో CO2 శాతాన్ని బట్టి పెరుగుతుంది.
- CO2 శాతం ఒక శాతం వరకు పెరిగినా కిరణజన్య సంయోగక్రియ సహజంగానే జరుగుతుంది.
- ఇంకా పెంచుతూ పోతే CO2 విషంగా మారి మొక్కకు హాని చేస్తుంది.
విభాగము – III 5 × 4 = 20 మా.
సూచనలు :
- క్రింది ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 4 మార్కులు.
ప్రశ్న 11.
సిరలకు, ధమనులకు గల భేదాలేవి ?
జవాబు:
ధమనులు | సిరలు |
1) వీటి గోడలు మందంగా ఉండి ఇరుకైన కుహరాన్ని కలిగి ఉంటాయి. | 1) వీటి గోడలు పలుచగా ఉండి వెడల్పైన కుహరాన్ని కలిగి ఉంటాయి. |
2) గుండె నుండి శరీర భాగాలకు రక్తాన్ని తీసుకు వెళతాయి. | 2) శరీర భాగాల నుండి రక్తాన్ని గుండెకు తీసుకువెళతాయి. |
3) వీటిలో కవాటాలు ఉండవు. | 3) వీటిలో కవాటాలు ఉంటాయి. |
4) అన్ని ధమనులు ఆమ్లజనియుత రక్తాన్ని తీసుకొని వెళతాయి. (ఒక్క పుపుస ధమనిలో తప్ప) | 4) అన్ని సిరలు ఆమ్లజని రహిత రక్తాన్ని తీసుకొని వెళతాయి. (ఒక్క పుపుస సిరలో తప్ప) |
ప్రశ్న 12.
క్రింది పటములలో ఒక పటము గీసి, భాగాలను వ్రాయండి.
A) మూత్రపిండము అంతర్నిర్మాణము పటము గీచి, భాగాలను గుర్తించుము.
జవాబు:
(లేదా)
B) మానవునిలోని శ్వాస నాళికలు మరియు వాయుగోణుల పటాన్ని గీయండి.
జవాబు:
ప్రశ్న 13.
క్రింది సమాచారమును చదవండి.
క్ర.సం. | శ్వాసక్రియ రకము | శ్వాసావయవాలు | శ్వాసక్రియ జరుపు జీవులె |
1. | చర్మీయ శ్వాసక్రియ | చర్మము | గుండ్రని పురుగులు, వానపాము, కప్ప |
2. | వాయునాళ శ్వాసక్రియ | వాయునాళాలు | బొద్దింక, మిడత |
3. | మొప్పల ద్వారా శ్వాసక్రియ | మొప్పలు | చేప |
4. | పుపుస శ్వాసక్రియ | ఊపిరితిత్తులు | సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు |
క్రింది ప్రశ్నలకు సమాధానములు రాయండి.
1. కాకిలో ఎటువంటి శ్వాసక్రియ జరుగుతుంది ?
2. మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుపు జీవులలో శ్వాసాంగాలేవి ?
3. వాయునాళ శ్వాసక్రియ జరుపు జీవులేవి ?
4. వానపాములోని శ్వాసాంగం ఏది ?
జవాబు:
1) పుపుస శ్వాసక్రియ
2) మొప్పలు
3) బొద్దింక, మిడుత
4) చర్మము
ప్రశ్న 14.
మానవునిలో లింగ నిర్ణయ ప్రక్రియను వివరింపుము.
జవాబు:
- శిశువు నిర్ధారణకు మగవారే కారణము.
- మగవారు XY అనే లింగ నిర్ధారణ క్రోమోజోమ్స్ కలిగి ఉంటారు.
- ఆడవారు XX అనే లింగ నిర్ధారణ క్రోమోజోమ్స్ కలిగి ఉంటారు.
- కావున పురుష సంయోగబీజాలు X లేదా Y క్రోమోజోమ్స్ కలిగి ఉంటే, స్త్రీ సంయోగబీజాలు మాత్రం X క్రోమోజోమ్స్ కలిగి ఉంటాయి.
- స్త్రీ సంయోగబీజం (X) తో పురుష X క్రోమోజోమ్ కలిగిన సంయోగబీజం కలిస్తే సంయుక్తబీజం XX క్రోమోజోమ్స్ కలిగి ఆడశిశువు ఏర్పడుతుంది.
- స్త్రీ సంయోగబీజం (X) తో పురుష Y క్రోమోజోమ్ కలిగిన సంయోగబీజం కలిస్తే సంయుక్తబీజం XY క్రోమోజోమ్స్ కలిగి మగశిశువు ఏర్పడుతుంది.
- దీనిని బట్టి ఆడ, మగ వ్యత్యాసం స్త్రీ సంయోగబీజంతో కలిసే పురుష సంయోగబీజంపై ఆధారపడి ఉంటుంది.
ప్రశ్న 15.
మొక్కలలో పెరుగుదలను సాధించుటకు ఫైటోహార్మోన్లు ఒకదానికొకటి సహకరించుకుంటాయి / వ్యతిరేకిస్తాయి. ఈ జ్ఞానము నీవు నిత్యజీవితంలో ఎలా ఉపయోగించుకుంటావు ?
జవాబు:
- మొక్కలలో సమన్వయం చేయడానికి విడుదలయ్యే రసాయనిక పదార్థాలను ఫైటోహార్మోన్లు అంటారు.
- ఆక్సిన్, జిబ్బరెల్లిన్, సైటోకైనిన్, ఇథిలీన్లు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. కాని అబ్సైసిక్ ఆమ్లం పెరుగుదలను నిరోధిస్తుంది.
- కాండం, వేర్లు, పార్శ్వకోరకాలు పెరుగుదల, కణాల విభేదనం, కణ విభజన పొడవు పెరగడం, ఫలాలు పక్వస్థితికి రావడం పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.
- అబ్ సైసిక్ ఆమ్లం సుప్తావస్థను ప్రోత్సహించడం, ఆకులు రాలే విధంగా చేయడం వలన పెరుగుదల ఆగుతుంది.
- పెరుగుదల, నియంత్రణను నిత్య జీవితంలో మనం ఉపయోగించుకుంటూ పనులను సమన్వయంతో చేసుకోవాలి.
విభాగము – IV 2 × 8 = 16 మా.
సూచనలు :
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 8 మార్కులు.
- ప్రతి ప్రశ్నకు అంతర్గత ఎంపిక కలదు.
ప్రశ్న 16.
ఎ)మొక్కలలో గల వివిధ రకాల అలైంగికోత్పత్తి పద్ధతులు ఏవి ? ఉదాహరణలతో వాటిని వివరించండి.
జవాబు:
అలైంగికోత్పత్తి : సంయోగబీజాల కలయిక లేకుండా, కేవలం ఒక జనకజీవి ప్రమేయంతోనే జరిగే ప్రత్యుత్పత్తిని “అలైంగిక ప్రత్యుత్పత్తి” అంటారు. దీనిలో క్రింది రకాలు కలవు.
- విచ్ఛిత్తి : ఒక జీవి కణ విభజన ద్వారా, రెండుగా విడిపోవడాన్ని “ద్విధావిచ్ఛిత్తి” అని, అంతకంటే ఎక్కువ భాగాలుగా విడిపోతే, దానిని “బహుధావిచ్ఛిత్తి” అని అంటారు. ఉదా : పారమీషియం
- కోరకీభవనం : ఒక జీవి శరీరం నుండి అవే పోలికలతో ఉన్న నిర్మాణం బయటకు పెరుగుతాయి. అది జనక జీవి నుండి వేరై స్వతంత్రంగా జీవిస్తుంది. ఈ ప్రక్రియను “కోరకీభవనం” అంటారు. ఉదా : ఈస్ట్
- ముక్కలగుట : కొన్ని జీవులు ప్రమాదవశాత్తు, తెగిపోయి, శరీర ఖండాల నుండి పూర్తి జీవిగా పెరుగుతాయి. ఈ ప్రక్రియలో శరీరంలోని ఏ ఖండమైనా మొత్తం శరీరాన్ని ఏర్పరుస్తుంది. ఉదా : స్పైరోగైరా, చదునుపురుగులు
- అనిషేక ఫలాలు : ఫలదీకరణం జరగకపోయినా అండం పిల్ల జీవులుగా ఎదగటాన్ని ‘పార్థినోజెనెసిస్’ అంటారు. దీని వలన మొక్కలలో విత్తన రహిత కాయలు ఏర్పడతాయి. ఉదా : తేనెటీగలు, చీమలు
- పునరుత్పత్తి : పూర్తిగా విభేదనం చెందిన అనేక జీవులు తమ శరీరఖండాల నుండి నూతన జీవిని ఇచ్చే సామర్థ్యాన్ని “పునరుత్పత్తి” అంటారు. ఉదా : ప్లనేరియా, స్పంజికలు
- శాఖీయ ప్రత్యుత్పత్తి : కొన్ని మొక్కలు శాఖీయ భాగాలైన వేరు, కాండం, పత్రం వంటి శాఖీయ భాగాల నుండి కొత్త మొక్కలను ఏర్పరుస్తాయి. దీనిని “శాఖీయోత్పత్తి” అంటారు. ఉదా : మందార, రణపాల
(లేదా)
బి) క్రింది వాని మధ్య గల భేదాలను తెల్పుము.
i) బోలస్ (ఆహారపు ముద్ద) మరియు కైమ్
బోలస్ | కైమ్ |
1. నోటిలో ఏర్పడిన ముద్దను “బోలస్” అంటారు. | 1. పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని “కైమ్” అంటారు. |
2. ఇవి లాలాజలంతో కలిసి ఏర్పడుతుంది. | 2. ఇది జీర్ణరసాల చర్య వలన ఏర్పడుతుంది. |
3. ఘనస్థితిలో ఉండే ముద్ద వంటి నిర్మాణము. | 3. ద్రవస్థితిలో ఉండే ఆహారపదార్థం. |
4. ఆహార వాహిక ద్వారా జీర్ణాశయం చేరుతుంది. | 4. సంవరిణీ కండరము ద్వారా ఆంత్రమూలాన్ని చేరుతుంది. |
5. లాలాజల ప్రభావం వలన క్షారయుతంగా ఉంటుంది. | 5. జఠర రస ప్రభావం వలన ఆమ్లయుతంగా ఉంటుంది. |
ii) చిన్న ప్రేగు మరియు పెద్ద ప్రేగు
చిన్నప్రేగు | పెద్దప్రేగు |
1. ఇది జీర్ణాశయం తరువాత భాగం. | 1. జీర్ణవ్యవస్థలో చిన్నప్రేగు, పెద్దప్రేగుగా కొనసాగించబడుతుంది. |
2. పరిమాణం చిన్నదిగా ఉంటుంది. | 2. పరిమాణం పెద్దదిగా ఉంటుంది. |
3. ఎక్కువ పొడవు కలిగి ఉంటుంది. | 3. పొడవు తక్కువగా ఉంటుంది. |
4. మెలి తిరిగి చుట్టుకొని ఉంటుంది. | 4. చతురస్రాకారంలో అమరి ఉంటుంది. |
5. పాక్షిక జీర్ణక్రియ జరుగుతుంది. | 5. జీర్ణక్రియ జరగదు. |
6. ఆహార పదార్థాల శోషణ దీని ప్రధానవిధి. | 6. నీటి పునఃశోషణ దీని ప్రధానవిధి. |
7. జీర్ణం కాని పదార్థాలను పెద్దప్రేగుకు చేర్చుతుంది. | 7. జీర్ణం కాని పదార్థాలను మలం రూపంలో విసర్జిస్తుంది. |
ప్రశ్న 17.
ఎ)ఆకులలో పిండి పదార్థపు ఉనికిని నిర్ణయించు ప్రయోగ విధానమును వ్రాయుము.
జవాబు:
కావలసిన పరికరాలు : త్రిపాది, బీకరు, నీరు, మిథైలేటెడ్ స్పిరిట్, పరీక్షనాళికలు, అయోడిన్ ద్రావణం, పెట్రిడిష్, డ్రాపర్, బున్సెన్ బర్నర్.
ప్రయోగ విధానం :
- కుండీలో పెరుగుతున్న ఏదైనా మొక్క నుండి ఒక ఆకును తీసుకోండి. ఆ ఆకు మెత్తగా పలుచనదై ఉండాలి.
- బొమ్మలో చూపిన విధంగా ప్రయోగానికి కావలసిన పరికరాలను సిద్ధం చేసుకోండి.
- పరీక్షనాళికలో మిథైలేట్ స్పిరిట్ను తీసుకొని అందులో ఆకును ఉంచండి.
- పరీక్షనాళికను నీరు కలిగిన బీకరులో ఉంచి వేడి చేయండి.
- వేడి చేసినపుడు ఆకులోని పత్రహరితం (Chlorophyll) తొలగించబడుతుంది. అందువల్ల ఆకు లేత తెలుపు రంగులోకి మారుతుంది.
ఫలితం : ఆకు ముదురునీలం రంగులోకి మారినది.
గ్రహించినది : ఆకులలో పిండిపదార్థం ఉంటుందని గ్రహించితిని.
(లేదా)
బి) శ్వాసక్రియలో ఉష్ణం విడుదలగునని నిరూపించుటకు ఎటువంటి ప్రయోగమును నీవు సూచిస్తావు ?
జవాబు:
పరికరాలు : మొలకెత్తిన గింజలు, థర్మాస్ ప్లాస్కు, థర్మామీటరు, బిరడా. ప్రయోగ విధానం :
- మొలకెత్తిన గింజలను ఒక థర్మాస్ ప్లాస్కులో తీసుకోవాలి.
- బిరడాను తీసుకొని రంధ్రం చేసి దాని గుండా థర్మామీటరును అమర్చాలి. థర్మామీటరు నొక్కు మొలకెత్తిన గింజలలో మునిగి ఉండేలా జాగ్రత్తపడాలి.
- థర్మాస్ ఫ్లాసున్న బిరడాతో బిగుతుగా బిగించాలి.
- ప్రతి రెండు గంటలకు థర్మామీటరులో ఉష్ణోగ్రత నమోదు చేయాలి.
- మంచి ఫలితాల కొరకు 24 గంటలు పరిశీలించాలి.
పరిశీలన : ప్రతి రెండు గంటలకు నమోదు చేసిన ఉష్ణోగ్రతలో పెరుగుదల కన్పించింది.
పరికల్పన : ఈ ప్రయోగం పొడి విత్తనాలలో నిర్వహిస్తే ఉష్ణోగ్రతలో ఎటువంటి మార్పు ఉండకపోవచ్చు.
జాగ్రత్తలు :
- థర్మామీటరు బల్బు మొలకెత్తిన గింజలలో మునిగి ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
- ప్లాస్కులోనికి గాలి చొరబడకుండా చూడాలి.