Teachers often recommend practicing with AP 10th Class Biology Model Papers Set 2 in Telugu Medium to enhance exam readiness.
AP 10th Class Biology Model Paper Set 2 with Solutions in Telugu
Time: 2 Hours
Maximum Marks: 50
సూచనలు :
- ఈ ప్రశ్నాపత్రంలో 4 విభాగాలు మరియు 17 ప్రశ్నలు ఉండును.
- III వ విభాగం నందు కేవలం 12వ ప్రశ్నకు మాత్రమే మరియు IV వ విభాగం నందు గల అన్ని ప్రశ్నలకు అంతర్గత ఎంపిక కలదు.
- 2 గంటల సమయంలో, 15 నిమిషాల సమయం ప్రశ్నపత్రం చదువుటకై కేటాయింపబడినది.
- అన్ని సమాధానములు మీకివ్వబడిన సమాధాన పత్రంలోనే రాయవలెను.
- అన్ని సమాధానములు స్పష్టంగాను, గుండ్రంగాను రాయవలెను.
సెక్షన్ – I 6 × 1 = 6 మా.
సూచనలు :
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 1 మార్కు.
ప్రశ్న 1.
రక్తం గడ్డ కట్టడానికి అవసరం అయిన విటమిన్ ఏది ?
జవాబు:
విటమిన్ – K
ప్రశ్న 2.
నాళికా రంధ్రాలు
నాశికా కుహరం
గ్రసని
వాయునాళం
శ్వాసనాళాలు
జవాబు:
స్వరపేటిక
ప్రశ్న 3.
క్రింది పట్టికను పరిశీలించి ఇవ్వబడిన ప్రశ్నకుక సమాధానం వ్రాయండి.
| జంతువు పేరు | శరీరం బరువు | గుండె బరువు | నిమిషానికి హృదయ స్పందన |
| నీటి తిమింగలం | 1,50,000 కి.గ్రా. | 750 కి.గ్రా. | 7 |
| ఏనుగు | 3000 కి.గ్రా. | 12 – 21 కి.గ్రా. | 46 |
| మానవుడు | 60 – 70 కి.గ్రా. | 300 గ్రా. | 72 |
| కోయల్టి పక్షి | 8 గ్రా. | 0.15 గ్రా. | 1200 |
జంతువుల గుండె బరువుకు, హృదయ స్పందన రేటుకు మధ్య గల సంబంధం ఏమిటి ?
జవాబు:
జంతువుల గుండె బరువు పెరిగితే, హృదయ స్పందన రేటు తగ్గుతుంది.
![]()
ప్రశ్న 4.
క్లోమ గ్రంథి నుండి ‘ఇన్సులిన్’ ఉత్పత్తి ఆగిపోతే ఏమి జరుగుతుంది ?
జవాబు:
- రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.
- గ్లూకోజ్, గ్లైకోజిన్గా మార్చబడుతుంది.
- మధుమేహము అనే వ్యాధి సంక్రమిస్తుంది.
ప్రశ్న 5.
A – భాగమును గుర్తించి రాయండి.

జవాబు:
కీలాగ్రము
ప్రశ్న 6.
భౌగోళిక వెచ్చదనం వల్ల కలిగే దుష్ప్రభావాలు తగ్గించడానికి ఏదైనా ఒక సూచన ఇవ్వండి.
జవాబు:
- చెట్లు నాటడం
- శిలాజ ఇంధనాల వాడకం తగ్గించడం
సెక్షన్ – II 4 × 2 = 8 మా.
సూచనలు :
- క్రింది ప్రశ్నలన్నింటికి సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 2 మార్కులు.
ప్రశ్న 7.
నీకు ఒక నెఫ్రాలజిస్ట్ ని కలిసే అవకాశం వస్తే మూత్రపిండాలు పనిచేయకపోవడానికి సంబంధించి ఏ ప్రశ్నలు అడుగుతావు ?
జవాబు:
- మూత్రపిండాలు ఎప్పుడు పనిచేయడం మానేస్తాయి ?
- మూత్రపిండాలు పనిచేయకపోవటం వలన కలిగే లక్షణాలు ఏవి ?
- ఏ రకమైన నివారణోపాయాలను తీసుకోవటం ద్వారా మూత్రపిండాల వ్యాధిని నివారించవచ్చు ?
- ఒకవేళ మూత్రపిండం పనిచేయుట మానేస్తే ఎటువంటి ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి ?
ప్రశ్న 8.
అభివాహి నాడులు లేదా జ్ఞాన నాడుల ప్రధాన విధి ఏమిటి
జవాబు:
అభివాహి నాడుల (Afferent nerves) ప్రధాన విధి : ఈ నాడులు కేంద్రీయ నాడీ వ్యవస్థ (మెదడు + వెన్నుపాము) వైపు సమాచారాన్ని తీసుకొని వెళ్తాయి. ఇవి సమాచారాన్ని పరిసరాలలో మార్పును కండరాలపై నున్న నాడీ అంత్యాల ద్వారా (వీటికి stimulus detections ఉద్దీపనల నిర్ధారణ) ద్వారా మెదడు తీసుకొని వెళ్తాయి. వీటిని జ్ఞాననాడులు అని కూడా అంటారు.
ప్రశ్న 9.
పట్టికలోని ఖాళీలు (a) మరియు (b) లను పూరిచండి.
| దంతం పేరు | సంఖ్య | విధులు |
| 1. ? (a) | 8 | కొరుకుట |
| 2. రదనికలు | ? (b) | చీల్చుట |
| 3. అగ్ర చర్వణకాలు | 8 | నములుట, విసురుట |
| 4. చర్వణకాలు | 12 | నములుట, విసురుట |
జవాబు:
a) కుంతకాలు
b) 4
ప్రశ్న 10.
ఒక ఆవరణ వ్యవస్థలో ప్రాథమిక వినియోగదారుల సంఖ్య తగ్గిపోతే ఏమి జరుగుతుంది ?
జవాబు:
- ఆవరణ వ్యవస్థలో ప్రతి వినియోగదారునికి నిర్దిష్టమైన, ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఏ ఒక్క వినియోగదారుని తొలగించినా దాని ప్రభావం ఇతర వినియోగదారులపైనా, పర్యావరణం పైనా ప్రభావం చూపుతుంది.
- ఆవరణ వ్యవస్థ నుండి ప్రాథమిక వినియోగదారులను తొలగిస్తే ద్వితీయ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. వాటి జనాభా అదుపు తప్పుతుంది.
- ఆహారం లభించక ద్వితీయ వినియోగదారులు కొన్ని మరణించటమో లేక మరియొక ఆవరణవ్యవస్థలోనికి మారతాయి.
![]()
సెక్షన్ – III 5 × 4 = 20 మా.
సూచనలు :
- క్రింది ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 4 మార్కులు.
ప్రశ్న 11.
నాలుగు స్థాయిలతో ఏదైనా ఆహారపు గొలుసు పటం గీయండి. ఆహారపు గొలుసులో ఉత్పత్తిదారులు, విచ్ఛిన్నకారులు ఏవి ?
జవాబు:
- నాలుగు స్థాయిలలో ఆహారపు గొలుసు
గడ్డి → మిడుత → కప్ప → పాము - పై ఆహారపు గొలుసులో ‘గడ్డి’ ఉత్పత్తిదారు.
- విచ్ఛిన్నకారులు ఆహారపు గొలుసులో ఎటువంటి స్థాయిని ఆక్రమించవు.
- అవి పనికిరాని, చనిపోయిన పదార్థాలను విచ్ఛిన్నం చేస్తాయి.
- సాధారణంగా ‘బాక్టీరియా’ మరియు ‘ఫంగై’ను విచ్ఛిన్నకారులు అంటారు.
ప్రశ్న 12.
ఈ క్రింది పటములలో ఒక పటము గీచి, భాగాలను వ్రాయండి.
A) ఆస్యకుహరం పటం గీచి, భాగాలు గుర్తించండి.
జవాబు:

(లేదా)
B) ఊపిరితిత్తులు మరియు రక్తకేశనాళికల మధ్య జరిగే వాయు మార్పిడిని చూపు పటం గీయండి.
జవాబు:

ప్రశ్న 13.
| ఆల్కలాయిడ్ | మొక్క పేరు | మొక్కలోని భాగం | ఉపయోగం |
| క్వినైన్ | సింకోనా అఫిసినాలిస్ (సింకోనా) | బెరడు | మలేరియా నివారణ |
| నికోటిన్ | నికోటియానా టొబాకమ్ (పొగాకు) | ఆకులు | క్రిమిసంహారిణి |
| మార్ఫిన్, కొకైన్ | పపావర్ సోమ్నిఫెరమ్ (గంజాయి) | ఫలం | మత్తుమందు, నొప్పి నివారిణి |
| రిసర్పిన్ | రవుల్ఫియా సర్పంటైన్ (సర్పగంధి) | వేరు, బెరడు | పాము కాటు నుండి రక్షణ |
| కెఫిన్ | కాఫియా అరాబికా (కాఫీ మొక్క) | విత్తనాలు | నాడీవ్యవస్థ ఉత్తేజ కారకం |
| నింబిన్ | అజాడిరక్టా ఇండికా (వేప) | విత్తనాలు, బెరడు, ఆకులు | యాంటిసెప్టిక్ |
| స్కోపోలమైన్ | ఉమ్మెత్త | పండు, పువ్వు | మత్తుమందు |
| పైరిత్రాయిడ్స్ | గడ్డి చామంతి | పుష్పాలు | కీటకనాశనులు |
పై పట్టికను పరిశీలించి క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
1. పాముకాటుకు మందుగా ఉపయోగించే ఆల్కలాయిడ్ ఏది ?
జవాబు:
రిసర్పిన్
2. వేప మొక్క యొక్క శాస్త్రీయ నామం ఏమిటి ?
జవాబు:
అజాడిరక్టా ఇండికా
3. సింకోనా మొక్క యొక్క ఏ భాగం నుండి ‘క్వినైన్’ అనే ఆల్కలాయిడ్ లభిస్తుంది ?
జవాబు:
బెరడు
4. మార్ఫిన్ యొక్క ఉపయోగం ఏమిటి ?
జవాబు:
నొప్పి నివారణిగా ఉపయోగపడుతుంది.
ప్రశ్న 14.
ఏవైనా రెండు ఫైటో హార్మోన్లు, వాటి ఉపయోగములు వ్రాయండి.
జవాబు:
- ఫైటో హార్మోన్లు : 1) ఆక్సిన్లు, 2) సైటోకైనిన్లు
- ఆక్సిన్ల ఉపయోగాలు : కణం పెరుగుదల మరియు కాండం, వేరు విభేదనం
- సైటోకైనిన్ల ఉపయోగాలు : ఎ) కణ విభజనను ప్రేరేపించడం, బి) పార్శ్వ కోరకాల పెరుగుదలను ప్రేరేపించడం సి) ఆకులు రాలకుండా చేయడం, డి) పత్ర రంధ్రాలు తెరుచుకునే విధంగా చేయడం.
ప్రశ్న 15.
చెట్ల సంరక్షణకు సంబంధించి కొన్ని నినాదాలు వ్రాయండి.
జవాబు:
- చెట్లు నాటండి – ప్రకృతిని కాపాడండి.
- చెట్ల సంరక్షణ మన సంరక్షణ.
- చెట్లు నరకటం నిషిద్ధం.
- చెట్లు నాటుదాం పచ్చదనాన్ని పెంచుదాం
సెక్షన్ – IV 2 × 8 = 16 మా.
సూచనలు :
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 8 మార్కులు.
- ప్రతి ప్రశ్నకు అంతర్గత ఎంపిక కలదు.
ప్రశ్న 16.
A) ధమనులకు, సిరలకు మధ్య తేడాలు వ్రాయండి.
జవాబు:
| ధమనులు | సిరలు |
| 1. గుండె నుండి రక్తాన్ని తీసుకెళ్ళే రక్తనాళాలను ధమనులు అంటారు. | 1. శరీర భాగాల నుండి రక్తాన్ని గుండెకు చేర్చే రక్త నాళాలను సిరలు అంటారు. |
| 2. మందమైన గోడలు ఉంటాయి. | 2. గోడలు పలుచగా ఉంటాయి. |
| 3. నాళ కుహరం చిన్నదిగా ఉంటుంది. | 3. నాళ కుహరం పెద్దదిగా ఉంటుంది. |
| 4. కవాటాలు ఉండవు. | 4. కవాటాలు ఉంటాయి. |
| 5. రక్తనాళాలపై పీడనం ఎక్కువ. | 5. రక్తనాళాలపై పీడనం తక్కువ. |
| 6. ఆమ్లజనిసహిత రక్తం ఉంటుంది. | 6. ఆమ్లజనిరహిత రక్తం ఉంటుంది. |
| 7. రక్తకేశనాళికలతో అంతమౌతాయి. | 7. రక్తకేశనాళికల నుండి ప్రారంభమౌతాయి. |
(లేదా)
B) మానవునిలో ‘లింగ నిర్ధారణ’ గురించి వివరించండి.
జవాబు:

- ఆడవారిలో రెండు X క్రోమోజోములు, మగవారిలో X, Y క్రోమోజోమ్లు ఉంటాయి.
- స్త్రీ సంయోగ బీజాలలో ఒకే రకమైన X క్రోమోజోమ్లు, పురుష సంయోగ బీజాలలో X మరియు Y క్రోమోజోమ్లు ఉంటాయి.
- Y క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం, X క్రోమోజోమ్ ఉన్న అండంతో కలిస్తే ఫలదీకరణ జరిగి X, Y క్రోమోజోమ్లతో ఏర్పడే శిశువు అబ్బాయి అవుతుంది.
- అదే X క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం, X క్రోమోజోమ్ ఉన్న అండంతో కలిస్తే ఏర్పడే శిశువు అమ్మాయి అవుతుంది.
![]()
ప్రశ్న 17.
A) శ్వాసక్రియలో ఉష్ణం విడుదలవుతుందని ఎలా నిరూపిస్తారు ?
జవాబు:
పరికరాలు : మొలకెత్తిన గింజలు, థర్మాస్ ఫ్లాస్కు, థర్మామీటరు, బిరడా.
ప్రయోగ విధానం :
- మొలకెత్తిన గింజలను ఒక థర్మాస్ ఫ్లాస్కులో తీసుకోవాలి.
- బిరడాను తీసుకొని రంధ్రం చేసి దాని గుండా థర్మామీటరును అమర్చాలి.
థర్మామీటరు నొక్కు మొలకెత్తిన గింజలలో మునిగి ఉండేలా జాగ్రత్తపడాలి. - థర్మాస్ ఫ్లాస్కును బిరడాతో బిగుతుగా బిగించాలి.
- ప్రతి రెండు గంటలకు థర్మామీటరులో ఉష్ణోగ్రత నమోదు చేయాలి.
- మంచి ఫలితాల కొరకు 24 గంటలు పరిశీలించాలి.
పరిశీలన : ప్రతి రెండు గంటలకు నమోదు చేసిన ఉష్ణోగ్రతలో పెరుగుదల కన్పించింది.
పరికల్పన : ఈ ప్రయోగం పొడి విత్తనాలలో నిర్వహిస్తే ఉష్ణోగ్రతలో ఎటువంటి మార్పు ఉండకపోవచ్చు.

(లేదా)
B)

పై పటాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
1. ఈ ప్రయోగ ఉద్దేశం ఏమిటి ?
జవాబు:
కిరణజన్య సంయోగక్రియకు CO2 అవసరమని నిరూపించుట ఈ ప్రయోగ ఉద్దేశం.
2. గాజు సీసాలో ఏ ద్రావణం తీసుకుంటారు ?
జవాబు:
గాజు సీసాలో పొటాషియం హైడ్రాక్సైడ్ (KOH) ద్రావణం.
3. అయోడిన్ పరీక్ష చేసిన తరువాత సీసా లోపలి ఆకు భాగము నీలి నలుపు రంగులోకి మారలేదు. కారణం ఏమిటి ?
జవాబు:
సీసాలో ఉన్న ఆకుకు CO2 లభించనందున ఆ భాగము నీలి నలుపు రంగులోనికి మారలేదు.
4. ఈ ప్రయోగం చేయడానికి ముందు మొక్కను ఎక్కడ ఉంచాలి ?
జవాబు:
ఈ ప్రయోగానికి ముందు మొక్కను కనీసం మూడురోజులపాటు చీకటిలో ఉంచాలి.