Teachers often recommend practicing with AP 10th Class Biology Model Papers and AP 10th Class Biology Board Model Paper 2024 in Telugu Medium to enhance exam readiness.
AP 10th Class Biology Model Paper 2024 with Solutions in Telugu
Time: 2 Hours
Maximum Marks: 50
సూచనలు :
- ఈ ప్రశ్నాపత్రంలో 4 విభాగాలు మరియు 17 ప్రశ్నలు ఉండును.
- III వ విభాగం నందు కేవలం 12వ ప్రశ్నకు మాత్రమే మరియు IV వ విభాగం నందు గల అన్ని ప్రశ్నలకు అంతర్గత ఎంపిక కలదు.
- 2 గంటల సమయంలో, 15 నిమిషముల సమయం ప్రశ్నాపత్రం చదువుటకై కేటాయింపబడినది.
- అన్ని సమాధానములు మీకివ్వబడిన సమాధాన పత్రంలోనే రాయవలెను.
- అన్ని సమాధానాలు స్పష్టంగాను, గుండ్రంగాను రాయవలెను.
సెక్షన్ – I 6 × 1 = 6 మా.
సూచనలు :
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 1 మార్కు.
ప్రశ్న 1.
ఎంజైమ్లు లేని జీర్ణరసం ఏది ?
జవాబు:
పైత్యరసంలో ఎంజైమ్స్ ఉండవు.
ప్రశ్న 2.
క్రింది పటములోని చలనమును గుర్తించుము.
జవాబు:
ఆహారపు ముద్ద పెరిస్టాల్టిక్ చలనం
ప్రశ్న 3.
మెండల్ ఏకసంకర సంకరణంలోని దృశ్యరూప నిష్పత్తి :
A) 3 : 1
B) 1 : 2 : 1
C) 9 : 3 : 3 : 1
జవాబు:
A) 3 : 1
ప్రశ్న 4.
పంట ఉత్పత్తిని పెంచుటకు పర్యావరణ స్నేహపూర్వక పద్ధతిని సూచించండి.
జవాబు:
పంటమార్పిడి
ప్రశ్న 5.
వరుస సంఖ్య | ద్వితీయ జీవక్రియోత్పన్నం | ఉదాహరణ | ఉపయోగాలు |
1. | టానిన్ | తుమ్మ | తోళ్ళను పదును చేయడం |
2. | రెసిన్ | పైనస్ | వార్నిష్ తయారీ |
వార్నిష్ తయారీలో ఉపయోగించే ద్వితీయ జీవక్రియోత్పన్నం ఏది ?
జవాబు:
పైన్ మొక్కలో లభించే రెసిన్.
ప్రశ్న 6.
భూమిపై శిలాజ ఇంధనాలు పూర్తిగా అంతరించిపోతే ఏమి జరుగుతుందో ఊహించండి.
జవాబు:
శిలాజ ఇంధనాలు లేకపోతే టెక్నాలజీతో కూడిన అభివృద్ధి కుంటుపడుతుంది.
సెక్షన్ – II 4 × 2 = 8 మా.
సూచనలు :
- క్రింది ప్రశ్నలన్నింటికి సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 2 మార్కులు.
ప్రశ్న 7.
బోలస్ మరియు కైమ్ మధ్య భేదాలను వ్రాయుము.
జవాబు:
బోలస్ | కైమ్ |
1. నోటిలో ఏర్పడిన ముద్దను “బోలస్” అంటారు. | 1. పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని “కైమ్” అంటారు. |
2. ఇవి లాలాజలంతో కలిసి ఏర్పడుతుంది. | 2. ఇది జీర్ణరసాల చర్య వలన ఏర్పడుతుంది. |
3. ఘనస్థితిలో ఉండే ముద్ద వంటి నిర్మాణము. | 3. ద్రవస్థితిలో ఉండే ఆహారపదార్థం. |
4. ఆహార వాహిక ద్వారా జీర్ణాశయం చేరుతుంది. | 4. సంవరిణీ కండరము ద్వారా ఆంత్రమూలాన్ని చేరుతుంది. |
5. లాలాజల ప్రభావం వలన క్షారయుతంగా ఉంటుంది. | 5. జఠర రస ప్రభావం వలన ఆమ్లయుతంగా ఉంటుంది. |
ప్రశ్న 8.
మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే జరిగే పరిణామాలు ఏవి ?
జవాబు:
- మూత్రపిండాలు పనిచేయకపోవడాన్ని “ఎండ్ స్టేజ్ రెనాల్ డిసీజ్” (ESRD) అని అంటారు.
- మూత్రపిండాలు పనిచేయడం ఆగిపోతే శరీరంలో నీరు, వ్యర్థ పదార్థాలు నిండిపోతాయి.
- కాళ్ళు, చేతులు ఉబ్బిపోతాయి.
- రక్తం శుద్ధి కాకపోవడం వలన నీరసం, అలసట వస్తాయి.
- ఈ దశను “యూరేమియా” అంటారు.
ప్రశ్న 9.
క్రింది పట్టికను పరిశీలించండి.
వరుస సంఖ్య | శాఖీయ ప్రత్యుత్పత్తిలో పాల్గొను మొక్క యొక్క భాగము | ఉదాహరణ |
1. | పత్రము | రణపాల |
2. | వేరు | క్యారెట్, ముల్లంగి |
క్రింది ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
a) వేరు ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి జరుపు మొక్కకు ఉదాహరణ వ్రాయుము.
జవాబు:
క్యారెట్, ముల్లంగి
b) రణపాలలో శాఖీయ ప్రత్యుత్పత్తిలో పాల్గొను మొక్క యొక్క భాగము ఏది ?
జవాబు:
పత్రము లేదా ఆకు
ప్రశ్న 10.
దంతాల విధులను గూర్చి దంతవైద్యుని అడుగుటకు రెండు ప్రశ్నలను తయారుచేయండి.
జవాబు:
ప్రశ్నలు :
- దంతాల పని ఏమిటి ?
- అన్ని దంతాలు ఒకే విధమైన విధిని నిర్వర్తిస్తాయా ?
సెక్షన్ – III 5 × 4 = 20 మా.
సూచనలు :
- క్రింది ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 4 మార్కులు.
ప్రశ్న 11.
డెండ్రైట్లు మరియు తంత్రికాక్షము మధ్య భేదాలను వ్రాయుము.
జవాబు:
ఏక్సాను | డెండ్రైటు |
1) ప్రతి నాడీకణానికి ఒకటే ఏక్సాను ఉంటుంది. | 1) నాడీకణం నుండి ఏర్పడే డెండ్రైటుల సంఖ్య ఒకటి నుండి అనేక వేలు ఉంటుంది. |
2) పొడవుగా ఉంటుంది. | 2) పొట్టిగా ఉంటుంది. |
3) శాఖలు ఉండవు. | 3) శాఖలు ఉంటాయి. |
4) కొన్ని ఏక్సానులు మయలిన్ తొడుగును కలిగి ఉంటాయి. | 4) వీనిలో మయలిన్ తొడుగు, రన్వీర్ కణుపులు ఉండవు. |
ప్రశ్న 12.
క్రింది పటములలో ఒక పటము గీచి, భాగాలను వ్రాయండి.
A) పుష్పం అంతర్నిర్మాణం
జవాబు:
(లేదా)
B) మూత్రనాళిక నిర్మాణం
జవాబు:
ప్రశ్న 13.
క్రింది పట్టికను పరిశీలించండి.
వరుస సంఖ్య | సమవిభజన దశ | జరిగే మార్పులు / చర్యలు |
1. | ప్రథమ దశ | క్రోమోసోమ్లు ఏర్పడతాయి. |
2. | మధ్యస్థ దశ | క్రోమోసోమ్లు కండె ఫలకం దగ్గరకు చేరతాయి. |
3. | చలన దశ | క్రోమాటిడ్లు ధ్రువాల వైపుకు లాగబడతాయి. |
4. | అంత్య దశ | రెండు కణాలు ఏర్పడతాయి. |
క్రింది ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
1) కండెఫలకం ఏర్పడు దశ ఏది ?
జవాబు:
మధ్యస్థ దశ
2) అంత్య దశలో ఏమి జరుగుతుంది ?
జవాబు:
రెండు కణాలు ఏర్పడతాయి
3) సమవిభజనలోని మొదటి దశ ఏది ?
జవాబు:
ప్రథమ దశ
4) చలన దశలో ధ్రువాల వైపుకు ఏమి లాగబడతాయి
జవాబు:
క్రొమాటిడ్ లు ధ్రువాల వైపుకు లాగబడతాయి.
ప్రశ్న 14.
జైవిక నియంత్రణ అనగానేమి ? దీని వలన మనకు కలుగు ప్రయోజనాలు ఏవి ?
జవాబు:
- జైవిక నియంత్రణ : కలుషితాలు ఆహారపు గొలుసులోకి ప్రవేశించే ప్రక్రియను నిలువరించటమే జైవిక నియంత్రణ.
- ప్రయోజనాలు : ఎ) గాలి, నీరు, భూమి కలుషితం కాకుండా కాపాడుకోవచ్చును. బి) పంటలను తెగుళ్ళ నుండి కాపాడుకోవచ్చును.
ప్రశ్న 15.
జీవ వైవిధ్య సంరక్షణను గూర్చి నినాదాలు వ్రాయండి.
జవాబు:
- జీవ వైవిధ్యాన్ని కాపాడండి – సంతోషంగా జీవించండి.
- నీవు జీవ వైవిధ్యాన్ని రక్షిస్తే – అది నీ జీవితాన్ని కాపాడుతుంది.
- జీవ వైవిధ్య రక్షణ – మన జీవిత రక్షణ.
- జీవ వైవిధ్య పరిరక్షణ – మన జీవిత కాలం పెరుగుదల.
సెక్షన్ – IV 2 × 8 = 16 మా.
సూచనలు :
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 8 మార్కులు.
- ప్రతి ప్రశ్నకు అంతర్గత ఎంపిక కలదు.
ప్రశ్న 16.
A) మొక్కలలో మూలకేశాలు ద్రవాభిసరణ పద్ధతి ద్వారా నీటిని ఏ విధంగా శోషించుకుంటాయో వివరించండి.
జవాబు:
- మృత్తిక నీరు, లవణాలతో కూడిన సజల ద్రావణం.
- మూలకేశాలలోని కణరసం గాఢత మృత్తిక నీరు ద్రావణ గాఢతకంటే ఎక్కువ ఉంటుంది. అందువలన ద్రవాభిసరణ ద్వారా మూలకేశాలలోని రిక్తికలలోకి నీరు ప్రవహిస్తుంది.
- మూలకేశాలలోని పదార్థాల గాఢత నీరు లోపలికి ప్రవేశించడం వలన తగ్గుతుంది. దీని ఫలితంగా నీరు పక్కనున్న కణాలకు ప్రవహించి వాటి గాఢతను కూడా తగ్గిస్తుంది. చివరిగా నీరు దారు నాళాలలోకి చేరుతుంది.
- ఎక్కువ సంఖ్యలో మూలకేశాలు మరియు వేరు కణాలు ఈ ప్రక్రియలో పాల్గొనటం వలన దారు నాళాలలో పీడనం ఏర్పడుతుంది. ఈ పీడనం నీటిపైకి నెట్టడానికి ఉపయోగపడుతుంది. ఈ మొత్తం పీడనాన్ని వేరు పీడనం (root pressure) అంటారు.
(లేదా)
B) మానవులలో లింగనిర్ధారణను వివరించండి.
జవాబు:
- మగవారు XY అనే లింగ నిర్ధారణ క్రోమోజోమ్స్ కలిగి ఉంటారు.
- ఆడవారు XX అనే లింగ నిర్ధారణ క్రోమోజోమ్స్ కలిగి ఉంటారు.
- కావున పురుష సంయోగబీజాలు X లేదా Y క్రోమోజోమ్స్ కలిగి ఉంటే, స్త్రీ సంయోగబీజాలు మాత్రం X క్రోమోజోమ్స్ కలిగి ఉంటాయి.
- స్త్రీ సంయోగబీజం (X) తో పురుష X క్రోమోజోమ్ కలిగిన సంయోగబీజం కలిస్తే సంయుక్తబీజం XX క్రోమోజోమ్స్ కలిగి ఆడశిశువు ఏర్పడుతుంది.
- స్త్రీ సంయోగబీజం (X) తో పురుష Y క్రోమోజోమ్ కలిగిన సంయోగబీజం కలిస్తే సంయుక్తబీజం XY క్రోమోజోమ్స్ కలిగి మగశిశువు ఏర్పడుతుంది.
- దీనిని బట్టి ఆడ, మగ వ్యత్యాసం స్త్రీ సంయోగబీజంతో కలిసే పురుష సంయోగబీజంపై ఆధారపడి ఉంటుంది.
ప్రశ్న 17.
A)అవాయు శ్వాసక్రియను గూర్చి తెలుసుకొనుటకు నీవు ఏ ప్రయోగాన్ని నిర్వహిస్తావు ?
జవాబు:
ఉద్దేశం : అవాయు శ్వాసక్రియను గూర్చి తెలుసుకొనుట.
కావలసిన పరికరాలు : గాజుసీసా, గ్లూకోజ్ ద్రావణం, ఈస్టు కణాలు, చిన్నబీకరు.
ప్రయోగం చేయు విధానం : వెడల్పు మూతిగల ఒక గాజుసీసా తీసుకొనవలెను. సున్నపుతేట నింపిన చిన్న బీకరును ఆ గాజు సీసాలో ఉంచవలెను. గాజు సీసాలో 200 మి.లీ. వేడి చేసి, ఆక్సిజన్ తొలిగించిన గ్లూకోజు ద్రావణం తీసుకుని దానికి కొంచెం రొట్టెలలో ఉపయోగించే ఈస్టు కలపవలెను. గ్లూకోజ్ ద్రావణంపైన ఫారాఫిన్ ద్రవాన్ని పోసి కప్పవలెను. దీని వలన గాలి గ్లూకోజ్లో ప్రవేశించదు. గాజు సీసాకు గట్టి బిరడాను బిగించవలెను. ఒకటి రెండు రోజులు పరికరాలను గమనించవలెను.
గమనించినది :
- ఈస్ట్ కలిపిన గ్లూకోజ్ ద్రావణం నుండి ఆల్కహాల్ వాసన వచ్చినది. సున్నపుతేట పాల వలె మారినది.
- థర్మామీటరులోని ఉష్ణోగ్రతలో పెరుగుదల కనిపించినది.
పరిశీలన :
- అవాయు పరిస్థితులలో శ్వాసక్రియ జరగడం వల్ల గ్లూకోజు ద్రావణం ఆల్కహాలుగా మారినది.
- కార్బన్ డై ఆక్సైడు విడుదలగుట వలన సున్నపు తేట పాలవలె మారినది.
- అవాయు శ్వాసక్రియలో ఉష్ణం వెలువడుట వలన ఉష్ణమాపకంలో ఉష్ణోగ్రత పెరుగుదల కనిపించినది.
నిర్ధారణ : దీనిని బట్టి అవాయు శ్వాసక్రియలో కార్బన్ డై ఆక్సైడ్, ఉష్ణం విడుదలగునని నిర్ధారించవచ్చును.
(లేదా)
B) పత్రాలలో పిండిపదార్థాల ఉనికిని తెలియజేయు ప్రయోగమును వివరించండి.
జవాబు:
పద్ధతి :
- ఎండలో పెరుగుతున్న మెత్తని మరియు పలుచని ఆకులు గల మొక్క నుండి ఒక ఆకును తీసుకోండి.
- పటంలో చూపిన విధంగా ప్రయోగానికి కావలసిన పరికరాలను చేసుకోండి.
- పరీక్ష నాళికలో మిథైలేటెడ్ స్పిరిట్ను తీసుకొని అందులో ఆకును ఉంచండి.
- మొదట ఆకును నీటిలో మరిగించి తరువాత ఆ ఆకును మిథైలేటెడ్ స్పిరిట్ కలిగిన పరీక్షనాళికలో ఉంచండి.
- పరీక్షనాళికను నీరు కలిగిన బీకరులో ఉంచి, మరిగేలా వేడి చేయండి.
- వేడి చేసినపుడు ఆకులోని పత్రహరితం (Chlorophyll) తొలగించబడుతుంది. అందువల్ల ఆకు పాలిపోయినట్లుగా మారుతుంది. 7. పరీక్ష నాళిక నుండి ఆకును, బ్రష్ సహాయంతో జాగ్రత్తగా బయటకు తీయాలి.