These AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు will help students prepare well for the exams.
AP Board 10th Class Biology 8th lesson Important Questions and Answers అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు
10th Class Biology 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 1 Mark Important Questions and Answers
ప్రశ్న 1.
ఫ్లోచార్టును పరిశీలించి, క్రింది ప్రశ్నకు సమాధానము ఇవ్వండి. శిశువు యొక్క లింగ నిర్ధారణ చేసేది తల్లా? తండ్రా? ఏ విధంగానో వివరించండి.
జవాబు:
- శిశువు యొక్క లింగ నిర్ధారణ చేసే తండ్రి.
- తల్లిలో XX క్రోమోజోములు ఉంటాయి.
- తండ్రిలో XY క్రోమోజోములు ఉంటాయి
- Y క్రోమోజోమ్ లింగ నిర్ధారణ చేస్తుంది. కాబట్టి తండ్రి లింగ నిర్ధారణ కారణం.
ప్రశ్న 2.
ఈ క్రింది పట్టికను పరిశీలించి, దృశ్యరూప, జన్యురూప నిష్పత్తిని వ్రాయండి.
(లేదా)
మెండల్ తన సంకరణ ప్రయోగాలలో విషమయుగ్మజ పసుపురంగు (YY) విత్తనాలు గల బఠాణీ మొక్కను, అదే రకపు మొక్కతో సంకరణం జరిపినపుడు వచ్చిన ఫలితాలను దృశ్యరూప మరియు జన్యురూప నిష్పత్తులలో తెలపండి.
జవాబు:
దృశ్యరూపం – 3 : 1; జన్యురూపం – 1 : 2 : 1
ప్రశ్న 3.
దృశ్యరూపం, జన్యురూపంలను నిర్వచించండి. .
జవాబు:
దృశ్యరూపం :
కంటికి కనిపించే జీవుల యొక్క బాహ్య లక్షణాలను దృశ్యరూపం అంటారు. ఉదా : పొడవు, పొట్టి
జన్యురూపం :
దృశ్యరూపాన్ని నిర్ణయించే జన్యుస్థితిని జన్యురూపం అంటారు.
ఉదా : TT, tt
ప్రశ్న 4.
నీవు సేకరించిన సమాచారం ఆధారంగా కార్బన్ డేటింగ్ పద్దతి గురించి వివరింపుము.
జవాబు:
- శిలాజాలు, ఖనిజ లవణాలు మరియు రాళ్ళ యొక్క వయస్సును నిర్ణయించుటకు కార్బన్ డేటింగ్ పద్ధతిని ఉపయోగిస్తారు.
- ఇందుకు రేడియో ధార్మిక పదార్థాలైన కార్బన్, యురేనియం, పొటాషియం యొక్క ఐసోటోపులను ఉపయోగిస్తారు.
- పురాజీవ శాస్త్రవేత్తలు C14 విచ్చిన్నాన్ని ఉపయోగించి శిలాజాల మరియు శిలల వయస్సును నిర్ధారిస్తారు.
- భూ వాతావరణంలో C12 మరియు C14 ఐసోటోపులు ఉంటాయి.
- ఒక జీవి జీవించి ఉన్నప్పుడు దానిలో C14 మరియు C12 లు స్థిర నిష్పత్తిలో ఉంటాయి.
- కాని, జీవి మరణించినప్పుడు దానిలో గల C14 విచ్చిన్నం చెందడం ప్రారంభమై దాని పరిమాణం ఒక స్థిరరేటుతో తగ్గుతుంది.
- C14 సగభాగం విచ్చిన్నమవటానికి పట్టే కాలాన్ని అర్థ జీవిత కాలం అంటారు. ఇది 5730 సంవత్సరాలు.
- C14 డేటింగ్ ద్వారా ఒక నమూనా శిలాజిం లేదా రాయి వయస్సు కనుగొనుటకు ఈ క్రింది సూత్రమును ఉపయోగిస్తారు.
ప్రశ్న 5.
మీ అమ్మమ్మ తాతయ్యల నుండి, మీ అమ్మా నాన్నల నుండి లక్షణాలు నీకు ఎలా సంక్రమించాయి?
జవాబు:
జన్యువుల ద్వారా
ప్రశ్న 6.
లామార్క్ వాదం తప్పు అని నిరూపించుటకు అవసరమైన ఉదాహరణలు వ్రాయండి.
జవాబు:
- ఆగస్టస్ వీస్మాన్ లామార్క్ “ఆర్జిత గుణాల అనువంశికత” సిద్ధాంతాన్ని ఎలుకలపై ప్రయోగించాడు.
- అతడు 22 తరాల వరకు ఎలుకల తోకలను తొలగించుకుంటూ ప్రయోగాలు చేశాడు. అయితే ప్రతిసారి ఎలుకలు తోకలతోనే పుట్టాయి.
- శారీరకమైన మార్పులు పరిసరాల కారణంగా ఏర్పడినా సరే అది తమ సంతతికి అందించబడవని లామార్క్ వాదం తప్పు అని నిర్ధారించాడు.
ప్రశ్న 7.
మానవులలో లింగ నిర్ధారణ చేసే క్రోమోసోములేవి?
జవాబు:
అల్లోజోములు (లేదా) లైంగిక క్రోమోజోములు. అవి XX (బాలికలు), Xy (బాలురు).
ప్రశ్న 8.
మానవుడిని నడిచే అవశేషావయవాల మ్యూజియం అంటారు. ఎందుకు ?
జవాబు:
మానవునిలో దాదాపు 180 వరకు అవశేషావయవాలు ఉన్నాయి. కావున మానవుడిని నడిచే అవశేషావయవాల మ్యూజియం అంటారు.
ప్రశ్న 9.
ఉండుకమును అవశేషావయవం అని ఎందుకు అంటారు?
జవాబు:
- మానవ జీర్ణవ్యవస్థలో ఉండే ఉండుకము జీర్ణక్రియలో ఏవిధంగానూ తోడ్పడదు.
- పరిణామ క్రమంలో భాగంగా అవసరం లేని అవయవాలు క్షీణించి పోకుండా నిరుపయోగంగా మిగిలిపోతాయి.
ప్రశ్న 10.
ఏ ప్రత్యుత్పత్తి విధానంలో వైవిధ్యాలకు అధిక అవకాశం ఉంటుంది? ఎందుకు?
జవాబు:
లైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో వైవిధ్యాలకు అవకాశం అధికం. ఈ ప్రక్రియలో స్త్రీ, పురుష సంయోగ బీజాలు కలిసిపోతాయి వాటిలోని జన్యుపదార్థం మధ్య వినిమయం జరగటం వలన సంతతిలో కొత్త లక్షణాలు (వైవిధ్యాలు) ఏర్పడతాలు.
ప్రశ్న 11.
వైవిధ్యాల ప్రాముఖ్యత ఏమిటి? జీవులకు వైవిధ్యాలు ఏ విధంగా ఉపయోగపడతాయి?
జవాబు:
జీవుల మధ్యగల భేదాలను వైవిధ్యాలు అంటారు. ఇవి జీవులను గుర్తించటానికి, మనుగడకు, ప్రకృతి వరణానికి తోడ్పడతాయి.
ప్రశ్న 12.
జనక మొక్కలు తమ లక్షణాంశాలను విత్తనాలకు ఏ విధంగా పంపిస్తాయి?
జవాబు:
జనక మొక్కలలోని లక్షణాంశాలు కణ విభజన వలన సంయోగబీజాలలో చేరతాయి. సంయోగబీజాలు కలిసి విత్తనాలు ఏర్పడతాయి. కావున జనక మొక్కల లక్షణాంశాలు సంయోగబీజాల ద్వారా విత్తనాలలోనికి చేరతాయి.
ప్రశ్న 13.
పొడవైన మొక్కలు ఎల్లప్పుడు పొడవు మొక్కలనే ఉత్పత్తి చేస్తాయా?
జవాబు:
సాధారణంగా పొడవు మొక్కల నుండి పొడవు మొక్కలే ఏర్పడతాయి. కానీ పొట్టి మొక్కతో పరపరాగ సంపర్కం వలన పొట్టి మొక్కలు ఏర్పడే అవకాశం ఉంది.
ప్రశ్న 14.
అనువంశికత అనగానేమి?
జవాబు:
అనువంశికత :
జనకుల లక్షణాలు తరువాత తరానికి అందించే ప్రక్రియను “అనువంశికత” అంటారు.
ప్రశ్న 15.
వైవిధ్యాలు అనగానేమి?
జవాబు:
వైవిధ్యాలు :
జీవుల మధ్య ఉండే భేదాలను “వైవిధ్యాలు” అంటారు.
ప్రశ్న 16.
పరిణామం అనగానేమి?
జవాబు:
పరిణామం : మార్పుచెందే ప్రక్రియను “పరిణామం” అంటారు.
ప్రశ్న 17.
అనుకూలనాలు అనగానేమి?
జవాబు:
అనుకూలనాలు:
జీవి మనుగడ సాగించటానికి ఉపయోగపడే లక్షణాలను “అనుకూలనాలు” అంటారు.
ప్రశ్న 18.
మెండల్ తన ప్రయోగానికి ఎన్నుకున్న మొక్క ఏమిటీ?
జవాబు:
మెండల్ తన ప్రయోగానికి బరానీ మొక్క (ఫైసమ్ సటైవమ్) ను ఎన్నుకున్నాడు.
ప్రశ్న 19.
మెండల్ బఠానీ మొక్కలో ఎన్నుకున్న వ్యతిరేక లక్షణాల సంఖ్య ఎంత?
జవాబు:
మెండల్ బఠానీ మొక్కలో 7 జతల వ్యతిరేక లక్షణాలను ఎన్నుకున్నాడు.
ప్రశ్న 20.
లక్షణాంశాలు అనగానేమి?
జవాబు:
లక్షణాంశాలు :
జీవి లక్షణాలను నిర్ణయించే కారకాలను లక్షణాంశాలు (Traits) అంటారు . వీటినే నేడు జన్యువులు (Genes) అని అంటాం.
ప్రశ్న 21.
ప్రతి లక్షణానికి ఎన్ని లక్షణాంశాలు ఉంటాయి?
జవాబు:
ప్రతి లక్షణానికి ఒక జత లక్షణాంశాలు ఉంటాయి.
ప్రశ్న 22.
జన్యువు అనగానేమి?
జవాబు:
జన్యువు :
ప్రతి లక్షణానికి కారణమైన లేదా నియంత్రించే ఒక జత కారకాలుంటాయని మెండల్ భావించాడు. ప్రస్తుతం ఆ కారకాలనే మనం జన్యువులు (Genes) అంటాం.
ప్రశ్న 23.
యుగ్మ వికల్పకాలు అనగానేమి?
జవాబు:
ముగ్మవికల్పకాలు :
ప్రతి లక్షణానికి కారణమైన ఒక జత జన్యువులను “యుగ్మవికల్పకాలు” (Allele) అంటారు.
ప్రశ్న 24.
సమయుగ్మజం అనగానేమి?
జవాబు:
సమయుగ్మజం :
ఒక లక్షణానికి రెండూ ఒకేరకమైన కారకాలుంటే దానిని “సమయుగ్మజం” (Homozygous) అంటారు.
ప్రశ్న 25.
విషమయుగ్మజం అనగానేమి?
జవాబు:
విషమయుగ్మజం :
ఒక లక్షణానికి వ్యతిరేక లక్షణాలున్న జన్యువులు జతగా ఉంటే దానిని “విషమయుగ్మజం” (Heterozygous) అని అంటారు.
ప్రశ్న 26.
మెండల్ ప్రయోగాలలో జనకతరం యొక్క స్థితి ఏమిటీ?
జవాబు:
మెండల్ (శుద్ధ జాతులను) సమయుగ్మజ స్థితిలో ఉన్న మొక్కలను ప్రయోగానికి ఎన్నుకున్నాడు.
ప్రశ్న 27.
జనకతరం మొక్కల సంకరణం వలన ఏర్పడిన సంతతిని ఏమంటారు?
జవాబు:
జనకతరం మొక్కల సంకరణం వలన ఏర్పడిన సంతతిని F1 తరం అంటారు.
ప్రశ్న 28.
F1 తరపు మొక్కల జన్యుస్థితి ఏమిటి?
జవాబు:
F1 తరపు మొక్కలు విషమయుగ్మజ స్థితిలో ఉంటాయి.
ప్రశ్న 29.
F1 తరపు మొక్కల సామాన్య లక్షణం ఏమిటి?
జవాబు:
F1 తరపు మొక్కలన్నీ ఒకే దృశ్యరూపం మరియు జన్యురూపం కలిగి ఉంటాయి. ఇవి విషమయుగ్మజ స్థితిలో ఉండి, బహిర్గత లక్షణాలను ప్రదర్శిస్తాయి.
ప్రశ్న 30.
F2 తరం ఎలా ఏర్పడుతుంది?
జవాబు:
F2 తరం మొక్కలలో ఆత్మపరాగసంపర్కం జరపగా F2 తరం ఏర్పడుతుంది.
ప్రశ్న 31.
ఏక సంకరణ ప్రయోగంలో F1 తరం యొక్క దృశ్య, జన్యురూప నిష్పత్తులు ఏమిటి?
జవాబు:
F2 తరం యొక్క దృశ్యరూప నిష్పత్తి : 3 : 1
F2 తరం యొక్క జన్యురూప నిష్పత్తి : 1 : 2 : 1
ప్రశ్న 32.
బహిర్గత సూత్రంను తెలపండి.
జవాబు:
బహిర్గత సూత్రం :
విషమయుగ్మజ స్థితిలో ఏదో ఒక లక్షణం మాత్రమే బహిర్గతమౌవుతుంది. దీనినే “బహిర్గత సూత్రం” అంటారు.
ప్రశ్న 33.
పృథక్కరణ సూత్రం తెలపండి.
జవాబు:
పృథక్కరణ సూత్రం :
జనకుల యుగ్మవికల్పకాలలో ఏదో ఒక కారకం యథేచ్చగా సంతతికి అందించబడుతుంది. దీనినే ‘పృథక్కరణ’ లేదా ‘అలీనత సూత్రం’ అంటారు.
ప్రశ్న 34.
అనువంశిక లక్షణాలు అనగానేమి?
జవాబు:
అనువంశిక లక్షణాలు :
తల్లిదండ్రుల నుండి పిల్లలకు సంక్రమించే లక్షణాలను “అనువంశిక లక్షణాలు” అంటారు.
ప్రశ్న 35.
‘వంశపారంపర్యం’ అనగానేమి?
జవాబు:
వంశపారంపర్యం:
అనువంశికత వలన ఒక తరం నుండి మరొక తరానికి లక్షణాలు అందించడాన్ని “వంశపారంపర్యం” అంటారు.
ప్రశ్న 36.
జన్యువు అనగానేమి?
జవాబు:
జన్యువు :
లక్షణాలు నిర్ణయించే కారకాలను జన్యువులు అంటారు. జన్యువు అనేది న్యూక్లియిక్ ఆమ్లం. అంటే DNA యొక్క కొంత భాగం.
ప్రశ్న 37.
DNA అనగా నేమి? దాని ఆకారం ఏమిటి?
జవాబు:
డీ ఆక్సీరిబో న్యూక్లిక్ ఆమ్లాన్ని సంక్షిప్తంగా DNA అంటారు. ఇది సర్పిలాకారంగా ఉండే మెట్ల మాదిరిగా (మెలితిరిగిన నిచ్చెన) ఉంటుంది. ఈ ఆకారాన్నే ద్వంద్వకుండలి (Double helix) అని కూడా అంటారు.
ప్రశ్న 38.
‘న్యూక్లియోటైడ్’ అనగానేమి?
జవాబు:
న్యూక్లియోటైడ్
DNA అణువులోని ఒక పోచను న్యూక్లియోటైడ్ అంటారు. రెండు న్యూక్లియోటైడ్స్ కలయిక వలన DNA ఏర్పడుతుంది.
ప్రశ్న 39.
న్యూక్లియోటైడ్ లోని అణువులు ఏమిటి?
జవాబు:
న్యూక్లియోటైడ్ లో చక్కెర అణువు, ఫాస్ఫేట్ అణువు మరియు నత్రజని క్షారము ఉంటాయి.
ప్రశ్న 40.
DNA లోని నత్రజని క్షారాలు ఏమిటి?
జవాబు:
DNA లో నాలుగు రకాల నత్రజని క్షారాలు ఉంటాయి. అవి:
1. అడినిన్ – (A) 2. గ్వా నిన్ – (G) – 3. థైమిన్ – (T) 4. సైటోసిన్ – (C).
ప్రశ్న 41.
ఆటోసోమ్స్ అనగానేమి?
జవాబు:
ఆటోసోమ్స్ :
శారీరక లక్షణాలను నిర్ణయించే క్రోమోజోమ్స్ ను ‘శారీరక క్రోమోజోమ్స్’ లేదా ‘ఆటోసోమ్స్’ అంటారు. మానవునిలో వీటి సంఖ్య 22 జతలు.
ప్రశ్న 42.
ఎల్లోసోమ్స్ అనగానేమి?
జవాబు:
ఎల్లోసోమ్స్ :
లైంగికతను నిర్ణయించే క్రోమోజోమ్ లను ‘లైంగిక క్రోమోజోమ్ లు లేదా ఎల్లోసోమ్స్’ అంటారు. మానవునిలో వీటి సంఖ్య ఒక జత.
ప్రశ్న 43.
ప్రకృతి వరణం అనగా నేమి?
జవాబు:
ప్రకృతి వరణం :
అనుకూలతలు కలిగిన జీవులు మాత్రమే ప్రకృతిలో జీవించగలిగి తదుపరి తరాన్ని ఉత్పత్తి చేస్తాయి. మిగిలిన జీవులు నశిస్తాయి. ప్రకృతి చేసే ఈ ఎంపికను “ప్రకృతి వరణం” అంటారు.
ప్రశ్న 44.
జన్యువిస్థాపనం (Genetic drift) అనగానేమి?
జవాబు:
జన్యువిస్థాపనం :
జనాభాలో ఆకస్మికంగా లేదా హఠాత్తుగా సంభవించే సంఘటనల వలన జన్యువుల పౌనఃపున్యంలో మార్పులు వస్తాయి. దీనినే “జన్యువిస్థాపనం” అంటారు.
ప్రశ్న 45.
ఆర్జిత గుణాలు అనగానేమి?
జవాబు:
ఆర్జిత గుణాలు :
జీవి తన మనుగడ కోసం, అవసరం కొద్దీ అభివృద్ధి చేసుకున్న లక్షణాలను “ఆర్జిత గుణాలు” అంటారు.
ప్రశ్న 46.
ఆర్జిత గుణాల అనువంశికత అనగానేమి?
జవాబు:
ఆర్జిత గుణాల అనువంశికత :
లామార్క్ అభిప్రాయం ప్రకారం- ఆర్జించిన గుణాలు తమ సంతతికి అందించబడుతూ ఉంటాయి. దీనినే ‘ఆర్జిత గుణాల అనువంశికత’ అంటారు.
ఉదా : జిరాఫీ మెడ.
ప్రశ్న 47.
సూక్ష్మ పరిణామం అనగానేమి?
జవాబు:
సూక్ష్మపరిణామం : జాతిలోని చిన్న చిన్న మార్పులను “సూక్ష్మపరిణామం” అంటారు.
ప్రశ్న 48.
స్థూలపరిణామం అనగానేమి?
జవాబు:
స్థూలపరిణామం :
కొత్త జాతులు ఏర్పడే ప్రక్రియను జాతుల ఉత్పత్తి లేదా “స్థూలపరిణామం” అంటారు.
ప్రశ్న 49.
సమజాత అవయవాలు అనగానేమి?
జవాబు:
సమజాత అవయవాలు:
ఒకే నిర్మాణం కలిగి విభిన్న జీవులలో వేరు వేరు పనులను నిర్వహించే అవయవాలను “సమజాత అవయవాలు” అంటారు.
ఉదా : తిమింగలం చెయ్యి, గబ్బిలం చెయ్యి.
ప్రశ్న 50.
సమానమైన అవయవాలు అనగానేమి?
జవాబు:
సమానమైన అవయవాలు :
విభిన్న నిర్మాణం కలిగిన, వేరు వేరు జీవులలో ఒకే పనిని నిర్వహించే అవయవాలను సమానమైన అవయవాలు అంటారు.
ఉదా : పక్షి రెక్క, గబ్బిలం రెక్క ఎగరటానికి తోడ్పడతాయి.
ప్రశ్న 51.
పిండాభివృద్ధిశాస్త్రం అనగానేమి?
జవాబు:
పిండాభివృద్ధిశాస్త్రం :
ఒక జీవి అండం మొదలుకొని, సంపూర్తిగా ఎదగడం వరకు గల వివిధ అభివృద్ధి దశలను గురించి అధ్యయనం చేయడాన్ని “పిండాభివృద్ధిశాస్త్రం” అంటారు.
ప్రశ్న 52.
శిలాజాలు అనగానేమి?
జవాబు:
శిలాజాలు :
ప్రాచీన జీవ యుగాల్లో నివసించిన జీవుల ఉనికిని తెలియజేసే నిర్జీవ పదార్థాలను “శిలాజాలు” అంటారు.
ప్రశ్న 53.
శిలాజాల వయస్సును ఎలా నిర్ణయిస్తారు?
జవాబు:
కార్బన్ డేటింగ్ పద్ధతి ఆధారంగా శిలాజాల వయస్సును నిర్ణయిస్తారు.
ప్రశ్న 54.
అవశేష అవయవాలు అనగానేమి?
జవాబు:
అవశేష అవయవాలు :
పరిణామ క్రమంలో భాగంగా అవసరంలేని అవయవాలు క్రమంగా క్షీణించిపోతాయి. కానీ అలా క్షీణించిపోకుండా నిరుపయోగంగా మిగిలిపోయిన అవయవాలనే “అవశేషావయవాలు” (Vestigial organs) అంటారు.
ప్రశ్న 55.
జన్యుశాస్త్ర పిత అని ఎవరిని పిలుస్తారు?
జవాబు:
“గ్రెగర్ జోహాన్ మెండల్” ను జన్యుశాస్త్ర పిత అంటారు.
ప్రశ్న 56.
లింగ సహలగ్నత పైన పరిశోధన చేసినవారు ఎవరు?
జవాబు:
వాల్టర్ స్టటన్, థామస్ హంట్ మోర్గాలు లింగ సహలగ్నతపై పరిశోధన చేశారు.
ప్రశ్న 57.
వాల్టర్, మోర్గాన్లు ఏ జీవిపై ప్రయోగాలు చేశారు?
జవాబు:
వాల్టర్, మోర్గాన్లు చిన్న పండ్ల ఈగ ( సోఫిలా మెలనోగాసర్) పై పరిశోధనలు చేశారు.
ప్రశ్న 58.
లామార్కిజాన్ని ఖండించిన శాస్త్రవేత్త ఎవరు?
జవాబు:
ఆగస్టస్ వీస్మస్ లామార్కిజాన్ని తప్పు అని నిరూపించాడు. అతను ఎలుక తోకను 22 తరాల వరకూ కత్తిరించి, ఆ లక్షణం తరువాత తరానికి రావటం లేదని నిరూపించాడు.
ప్రశ్న 59.
ప్రకృతివరణం సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు?
జవాబు:
చార్లెస్ డార్విన్ “ప్రకృతివరణం” సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
ప్రశ్న 60.
డార్విన్ రచించిన గ్రంథం పేరు ఏమిటి?
జవాబు:
డార్విన్ రచించిన ప్రముఖ గ్రంథం పేరు, జాతుల ఉత్పత్తి (The origin of species).
ప్రశ్న 61.
మానవునిలో క్రోమోజోమ్ ల సంఖ్య ఎంత?
జవాబు:
మానవునిలో 23 జతలు లేదా 46 క్రోమోజోమ్లు ఉంటాయి.
ప్రశ్న 62.
ఆడవారిలోని లైంగిక క్రోమోజోమ్స్ ఏమిటి?
జవాబు:
ఆడవారిలో ‘XX’ అనే లైంగిక క్రోమోజోమ్స్ ఉంటాయి.
ప్రశ్న 63.
పురుషులలోని లైంగిక క్రోమోజోమ్స్ ఏమిటి?
జవాబు:
పురుషులలో ‘XY’ అనే లైంగిక క్రోమోజోమ్స్ ఉంటాయి.
ప్రశ్న 64.
మానవుడిని ‘నడిచే అవశేషావయవాల మ్యూజియం’ అంటారు. ఎందుకు?
జవాబు:
మానవునిలో దాదాపు 180 అవశేష అవయవాలు ఉన్నాయి. ఉదాహణకు చెవితమ్మె, చర్మంపై కేశాలు, మగవారిలో క్షీరగ్రంథులు మొదలగునవి. అందుచేతనే మానవుడిని “నడిచే అవశేషాయవాల మ్యూజియం” అంటారు.
ప్రశ్న 65.
మానవులనందరినీ ఏ ఖండం నుండి వలస చెందినవారుగా భావిస్తున్నారు?
జవాబు:
మానవుల అతిపురాతనజీవి హోమోసెఫియన్స్. దీనిని ఆఫ్రికాలో కనుగొన్నారు. కావున మనుషులందరూ ఆఫ్రికా ఖండం నుండి వచ్చిన వారుగా భావిస్తున్నారు.
10th Class Biology 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 2 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
బిడ్డ యొక్క లింగ నిర్ధారణ ఎవరి వల్ల జరుగుతుంది ? తండ్రి వల్లనా, తల్లి వల్లనా? శిశువులలో లింగ నిర్ధారణను ప్లోచార్టు రూపంలో వివరించండి.
జవాబు:
లింగ నిర్ధారణ తండ్రి వలన జరుగును.
ప్రశ్న 2.
శిలాజాల గురించి తెలుసుకొనుటకు పురాజీవ శాస్త్రవేత్తను మీరు ఏ ప్రశ్నలు అడుగుతారు?
జవాబు:
- శిలాజాల వయస్సును ఏవిధంగా కనుగొంటారు?
- శిలాజాలు ఎక్కువగా ఎక్కడ లభ్యమవుతాయి?
- శిలాజాలలో ఏ మూలకాలు ఎక్కువగా ఉంటాయి?
- పరిణామక్రమం తెలుసుకోవడానికి శిలాజాలు ఏవిధంగా ఉపయోగపడతాయి?
ప్రశ్న 3.
క్రింది గళ్ళ చదరమును పరిశీలించి దిగువనీయబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
i) ఏక సంకరణం యొక్క దృశ్యరూప నిష్పత్తిని వ్రాయుము.
ii) పై చదరంలో ఎన్ని విషమయుగ్మజ మొక్కలు కలవు?
జవాబు:
i) 3 : 1
ii) రెండు విషమయుగ్మజ మొక్కలు (YY) మరియు (YY)
ప్రశ్న 4.
జీవ పరిణామం జరిగినదనడానికి పిండోత్పత్తి శాస్త్ర నిదర్శనాలు ఏ విధంగా తోడ్పడుతున్నాయి?
జవాబు:
నిదర్శనాలు :
- చేప నుండి మానవుని వరకు గల వివిధ జీవుల పిండాలలో గుర్తించతగిన పోలికలు వుంటాయి.
- కప్ప డింభకము, కప్ప కన్నా చేపను పోలివుండును.
- ప్రతి జీవి జీవిత చరిత్ర, పూర్వీకుల నిర్మాణాత్మక లక్షణాలను ప్రదర్శిస్తుంది.
- తొలిదశలో వున్న పిండాన్ని వేరొక దాని నుండి వేరుగా గుర్తించటము కష్టము.
ప్రశ్న 5.
జీవ పరిణామం జరగకపోతే ఏం జరగొచ్చు?
జవాబు:
- క్రొత్త జాతులు ఏర్పడవు / జాతుల ఉత్పత్తి ఉండదు
- జీవుల మనుగడ ఉండదు.
- వైవిధ్యాలు ఉండవు.
- అనుకూలనాలు ఉండవు.
- నిదర్శనాలు ఉండవు.
ప్రశ్న 6.
F1 తరం అనగానేమి? దాని లక్షణాలు ఏమిటి?
జవాబు:
మెండల్ సంకరీకరణ ప్రయోగంలో, రెండు శుద్ధ జాతుల మధ్య పరపరాగ సంపర్కం జరపగా ఏర్పడిన మొదటి తరాన్ని ‘F1 తరం’ అంటారు.
లక్షణాలు:
- ఇవన్నీ దృశ్యరూపం పరంగా ఒకే విధంగా ఉంటాయి.
- బహిర్గత లక్షణాలు ప్రదర్శిస్తాయి.
- కానీ జన్యురూపం పరంగా విషమయుగ్మజ స్థితిలో ఉంటాయి.
ప్రశ్న 7.
పరిణామం అనగానేమి? అందలి రకాలు తెలపండి.
జవాబు:
మార్పు చెందే ప్రక్రియను పరిణామం (Evolution) అంటారు. Evolution అనే పదానికి ‘మడత విప్పుట’ అని అర్ధం (పెద్దదిగా మారటం). సరళంగా, సూక్ష్మంగా ఉండే జీవులు స్థూల, సంక్లిష్టంగా మారే ప్రక్రియ పరిణామం. దీనిలో రెండు రకాలు కలవు. అవి:
1. సూక్ష్మపరిణామం :
జాతులలోని చిన్న చిన్న మార్పులను “సూక్ష్మపరిణామం” అంటారు.
ఉదా : జీవులలోని రంగుల లక్షణం.
2. స్టూలపరిణామం :
కొత్త జాతులు ఏర్పడటాన్ని జాతుల “ఉత్పత్తి లేదా స్థూలపరిణామం” అంటారు.
ప్రశ్న 8.
లామార్క్ సిద్ధాంతం తప్పు అని ‘వీస్మస్’ ఎలా నిరూపించాడు?
జవాబు:
ఆగస్టస్ వీస్మస్ లామార్క్ సిద్ధాంతాన్ని ఎలుకలపై ప్రయోగాలు చేసి పరీక్షించాడు. అతడు ఎలుకల తోకలు తొలగించాడు. కానీ సంతతి మామూలుగానే తోకలతో జన్మించాయి. తరువాత తరం ఎలుకల తోకలు కూడా తొలగించుకుంటూ అలా 22 తరాల వరకు చేశాడు. అయితే ప్రతిసారి ఎలుకలు తోకలతోనే పుట్టాయి. శారీరకమైన మార్పులు పరిసరాల కారణంగా ఏర్పడినా సరే అది తమ సంతతికి అందించవని వీస్మస్ నిర్ధారించాడు.
ప్రశ్న 9.
జీవ పరిణామానికి ఏ ఏ శాస్త్రాల నుండి నిదర్శనాలు లభిస్తున్నాయి?
జవాబు:
జీవ పరిణామానికి క్రింది శాస్త్రాల నుండి మద్దతు లభిస్తుంది.
- శరీరధర్మ శాస్త్రము – సహజాత అవయవాలు, సమానమైన అవయవాలు
- పిండోత్పత్తి శాస్త్రము – పిండాభివృద్ధిలో పూర్వజీవుల లక్షణాలు
- పురాజీవ శాస్త్రం – శిలాజాలు
వీటి నుండే కాకుండా, వర్గీకరణ శాస్త్రం, జన్యుశాస్త్రం, శరీర నిర్మాణ శాస్త్రం నుండి అనేక నిదర్శనాలు జీవ పరిణామాన్ని సమర్థిస్తున్నాయి.
ప్రశ్న 10.
శిలాజాలు అనగానేమి? అవి ఎలా ఏర్పడతాయి?
జవాబు:
- ప్రాచీన జీవయుగాల్లో నివసించిన జీవుల ఉనికిని తెలియజేసే నిర్జీవ పదార్థాలనే “శిలాజాలు” అంటారు.
- పురాతన జీవులు లేదా వృక్షాల ఏ భాగమైనా శిలాజాలుగా ఏర్పడవచ్చు.
- కొన్ని ప్రత్యేక పరిస్థితులలో జీవులలోని కర్బన పదార్థాలు క్షీణించి, పూర్తి నిర్మూలన చెందకుండా ఉండటం వల్ల శిలాజాలు ఏర్పడతాయి.
- శిలాజాలు భూమి లోపలి పొరల్లో, నీటి లోపలి నిక్షేప శిలల్లో (Sediments) లభించవచ్చు.
ప్రశ్న 11.
శిలాజాలు ఏర్పడే విధానం వివరించండి.
జవాబు:
ప్రాచీన జీవుల పూర్తి దేహం కాకుండా ఏవేని భాగాలు – ఎముకలు, దంతాలు, – కొమ్ములు, విత్తనాలు, పత్రాలు లేదా ముద్రలు శిలాజాలుగా లభిస్తాయి. డైనోసార్ల పాదాల శరీరం కుళ్ళి నశించిపోతుంది. ఆ తరువాత కనిపించదు. కానీ కొన్నిసార్లు శరీరం మొత్తం లేదా ఏవైనా కొన్ని భాగాలు సహజంగా నశించిపోకుండా ఉండి శిలాజాలుగా మిగిలిపోతాయి. ఉదాహరణకు ఏదేని చనిపోయిన కీటకం బురదలో చిక్కుకుపోయిందనుకుంటే, అది అంత సులువుగా నశించదు. బురద క్రమంగా ఎండి, గట్టిపడే పరిస్థితులుంటే ఆ మట్టి లోపలి కీటకం దేహం, భాగాలు, ముద్రలుగా ఉండిసోతాయి. ఇలా చెడిపోకుండా ఉండిపోయిన ముద్రలను కూడా శిలాజాలే అంటారు.
ప్రశ్న 12.
శిలాజ వయస్సును ఎలా నిర్ణయిస్తారు?
జవాబు:
భూగర్భ శాస్త్రవేత్తలు (Geologists) ఒక శిలాజ కాలాన్ని చెప్పగలరు. శిలాజాలను గురించిన అధ్యయనాన్ని పురాజీవశాస్త్రం (Palaeontology) అని అంటారు. పురాజీవ శాస్త్రవేత్తలు కార్బన్ డేటింగ్ పద్దతిని ఉపయోగించి శిలాజాల వయస్సును లేదా అవి నివసించిన కాలాన్ని కనుగొంటారు. అందుకు రేడియోధార్మిక పదార్థాలైన కార్బన్, యురేనియం మరియు పొటాషియం యొక్క ఐసోటోప్లను ఉపయోగిస్తారు. శిలాజాల లోపలి ఖనిజ లవణాల లేదా శిలాజాలున్న శిలలలోని ఐసోటోప్ల అర్ధజీవిత కాలాన్ని లెక్కించడం ద్వారా శిలాజాల కాలాన్ని అంచనా వేస్తారు.
ప్రశ్న 13.
అవశేష అవయవాలు అనగానేమి? ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
అవశేష అవయవాలు :
పరిణామక్రమంలో భాగంగా అవసరంలేని అవయవాలు క్రమంగా క్షీణించిపోతాయి. కానీ అలా క్షీణించి పోకుండా, నిరుపయోగంగా మిగిలిపోయిన అవయవాలనే అవశేషావయవాలు (Vestigial organs) అంటారు.
ఉదా :
మన జీర్ణవ్యవస్థ ‘ఉండుకం’ (Appendix) లోని జీర్ణక్రియలో అది ఏ విధంగానూ తోడ్పడదు. కానీ కుందేలు వంటి శాకాహారులలో మాత్రం జీర్ణక్రియలో ముఖ్యమైన విధినే నిర్వర్తిస్తుంది. అలా నిరుపయోగంగా మానవునిలో దాదాపు 180 అవశేషావయవాలున్నాయి. ఉదాహరణకు చెవితమ్మె, చర్మంపై కేశాలు, మగవారిలో క్షీరగ్రంథులు మొదలగునవి. అందుచేతనే మానవుడిని “నడిచే అవశేషావయవాల మ్యూజియం” అని అంటారు.
ప్రశ్న 14.
ప్రక్క పటాన్ని పరిశీలించి నీవు గమనించిన తేడాలు తెలపండి.
జవాబు:
ప్రక్క పటంలో అన్ని గులాబి పూలు ఉన్నప్పటికి వాటి మధ్య తేడాలు ఉన్నాయి. కొన్ని ఎరుపు, పసుపు, తెలుపు, నీలం రంగులలో ఉన్నాయి. పుష్పాల పరిమాణంలో కూడా వ్యత్యాసం ఉంది. కొన్ని పెద్దవిగా ఉంటే, మరి కొన్ని చిన్నవిగా ఉన్నాయి. వాటితో పాటు ఆకర్షక పత్రదళాల సంఖ్య, ఆకుపరిమాణం, కాండం, ముళ్లు మొదలైన లక్షణాలలో కూడా భేదాలు గమనించవచ్చు.
ప్రశ్న 15.
‘జీవులలో భిన్న లక్షణాలు ఏర్పడటానికి జన్యువులు కారణం’ దీనిని సమర్థిస్తూ చిన్న వ్యాసం రాయండి.
జవాబు:
క్రోమోజోమునందలి DNA లో ఒక భాగమైన జన్యువు జీవులలో ఒక నిర్దిష్టమైన లక్షణమును నియంత్రిస్తుంది. DNA ఒక ప్రోటీనును ఉత్పత్తి చేయుట ద్వారా లక్షణమును నియంత్రిస్తుంది. క్రోమోజోమునందు వేల సంఖ్యలో ఉండు జన్యువులు రకరకాల లక్షణములను నియంత్రిస్తాయి.
జన్యువులు ఒక తరం నుండి మరియొక తరానికి లక్షణాలను అందించడానికి ఉపయోగపడే అనువంశికత ప్రమాణాలు, జన్యువులు జతలుగా పనిచేస్తాయి. ఒకే విధమైన లక్షణాలను నియంత్రించే జన్యువులకు ఒక ఇంగ్లీషు అక్షరము ఇవ్వబడింది. ఉదాహరణకు ఎత్తును నియత్రించే జన్యువు ‘T’ గాను, పొట్టిని నియంత్రించే జన్యువు ‘t’ గాను సూచించబడుతుంది.
ప్రతి లక్షణానికి కారణమైన ఒక జత జన్యువులను యుగ్మ వికల్పకాలు అంటారు. ఒక లక్షణానికి కారణమైన రెండు కారకాలు ఉన్నా, వాటిలో ఒకటి మాత్రమే సంతతిలో బహిర్గతమవుతుంది. అటువంటి జన్యువును బహిర్గత జన్యువు అంటారు. రెండవ జన్యువు బహిర్గతం కాకుండా అంతర్గతంగా ఉంటుంది.
10th Class Biology 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 4 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
పురాతన జీవుల సమాచారం మనకు తెలుపుటకు ప్రకృతి భద్రపరిచిన విలువైన ఆధారాలు శిలాజాలు. శిలాజాల గూర్చి నీవు సేకరించిన సమాచారం తెలుపుము.
జవాబు:
- ప్రాచీన జీవ యుగాలలో నివశించిన జీవుల ఉనికిని తెలియజేసే, ప్రకృతిసిద్ధంగా భద్రపరిచిన నిర్జీవ పదార్థాలనే శిలాజాలు అంటారు.
- పురాజీవశాస్త్రం ప్రాచీనయుగాలలో జీవించిన జీవుల సమాచారాన్ని తెలియజేస్తుంది.
- కార్బన్ రేటింగ్ పద్దతినుపయోగించి జీవులు, జీవించిన కాలాన్ని భూగర్భశాస్త్రవేత్తలు కనుగొంటారు.
- శిలాజాల యందు లభించే క్రోమోజోమ్ సమాచారం ద్వారా వంశపారంపర్య లక్షణాలు లభిస్తాయి.
- ఆహారపు అలవాట్లు, జీవనవిధానాలు – శరీర నిర్మాణం గురించి తెలుస్తుంది.
- కాలగమనంలో జీవులు పొందిన వివిధ రూపాంతరాలు, క్రొత్తజీవులు ఏర్పడిన విధానం గురించిన సమాచారం లభిస్తుంది.
ప్రశ్న 2.
మనతో పాటు భూమి మీద జీవించే హక్కు జీవులన్నిటికీ కలదు. జీవ వైవిధ్య పరిరక్షణపై ప్రజలలో చైతన్యం కలిగించే నినాదాలను వ్రాయండి.
జవాబు:
- జీవించు – జీవించనివ్వు
- ప్రకృతిని ప్రేమించు – జీవవైవిధ్యాన్ని సంరక్షించు
- జీవకారుణ్యాన్ని చూపించు – జీవ వైవిధ్యాన్ని విస్తరించు
- తోటి జీవరాశిని కాపాడు – అందమైన ప్రకృతిని చూడు
- అన్ని జీవులను ఆదరించు – వైవిధ్యాన్ని సంరక్షించు
- పలు కాలుష్యాలను తగ్గించండి – జీవ వైవిధ్యాన్ని కాపాడండి
ప్రశ్న 3.
మెండల్ తన ప్రయోగాల కోసం బఠాణీ మొక్కను ఎంచుకోవడానికి గల కారణాలు ఏమిటి?
జవాబు:
మెండల్ తన ప్రయోగాల కోసం బఠాణీ మొక్కను ఎంచుకోవటానికి గల కారణాలు :
1. ‘బఠాణీ అధిక వైవిధ్యాలు కలిగిన మొక్క :
మెండల్ తన ప్రయోగాల కోసం దాదాపు ఏడు విభిన్న లక్షణాలను ఎన్నుకున్నాడు. ఇవన్నీ స్పష్టంగా ఉండి పరిశీలించటానికి అనువుగా ఉన్నాయి.
ఉదా : పువ్వురంగు, పువ్వుస్థానం.
2. బఠాణీ ద్విలింగ పుష్పం కలిగిన మొక్క :
కావున ఇది పరపరాగ సంపర్కం, ఆత్మపరాగ సంపర్కం జరపటానికి వీలుగా ఉంటుంది.
3. పుష్ప నిర్మాణం :
పుష్పంలో కేసరావళి, అండకోశం పెద్దవిగా ఉండుట వలన పరాగ సంపర్కం సులభం.
4. బఠాణీ మొక్క ఏకవార్షికం :
కావున ప్రయోగ ఫలితాలు త్వరగా తెలుస్తాయి. తక్కువ కాలంలో ఎక్కువ ప్రయోగాలు నిర్వహించవచ్చు.
ప్రశ్న 4.
మానవులలో లింగ నిర్ధారణను ఫ్లో చార్టు గీసి, వివరించండి.
(లేదా)
మానవునిలో లింగ నిర్ధారణ తెలియజేయు ఫ్లో చార్టు గీయుము.
జవాబు:
- ఆడవారిలో రెండు X క్రోమోజోములు, మగవారిలో X, Y క్రోమోజోమ్ లు ఉంటాయి.
- స్త్రీ సంయోగ బీజాలలో ఒకే రకమైన X క్రోమోజోమ్లు , పురుష సంయోగ బీజాలలో X మరియు Y క్రోమోజోమ్లు ఉంటాయి.
- Y క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం, X క్రోమోజోమ్ ఉన్న అండంతో కలిస్తే ఫలదీకరణ జరి X, Y క్రోమోజోమ్ తో ఏర్పడే శిశువు అబ్బాయి అవుతుంది.
- అదే X క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం, X క్రోమోజోమ్ ఉన్న అండంతో కలిస్తే ఏర్పడే శిశువు అమ్మాయి అవుతుంది.
ప్రశ్న 5.
జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి నీ వంతుగా నీవు చేస్తున్న ప్రయత్నాలేవి?
జవాబు:
- భూమిపై నివసిస్తున్న జీవులలో గల వైవిధ్యమే జీవ వైవిధ్యం.
- జీవ వైవిధ్యాన్ని సంరక్షించడానికి, వేటాడటాన్ని నిషేధించాలి.
- సుస్థిర అడవుల సంరక్షణా పద్ధతులను అవలంబించాలి.
- నేను నావంతుగా వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాను.
- ప్రజలను చైతన్య పరుస్తూ వారిని వివిధ జీవ వైవిధ్య సంరక్షణా కార్యక్రమాలలో పాల్గొనేలా ప్రోత్సహిస్తాను.
- పాఠశాల పరిసర ప్రాంతాలలో చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తాను.
- జీవ వైవిధ్యానికి సంబంధించిన నినాదాలు, గోడ పత్రికలు ముద్రిస్తాము.
- విద్యుత్తును సాధ్యమైనంత వరకు పొదుపుగా వినియోగిస్తాను.
- ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగించుకుంటాము.
- ఆవాస ప్రాంతాలలో చెట్లను నరికివేస్తే మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతాను.
- సామాజిక అడవుల పెంపకాన్ని ప్రోత్సహిస్తాను.
ప్రశ్న 6.
i) ఈ షో చార్డ్ ఏమి తెలియజేస్తుంది?
జవాబు:
మానవునిలో లింగ నిర్ధారణ తెలియజేయును.
ii) ‘X’ క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం అండంతో కలిసి ఫలదీకరణ జరిగితే ఏమి జరుగుతుంది?
జవాబు:
ఆడపిల్ల పుడుతుంది.
iii) శిశువు లింగ నిర్ధారణ చేసేది అమ్మా, నాన్నలలో ఎవరు?
జవాబు:
తండ్రి
iv) సంతతిలో ఎన్ని క్రోమోజోమ్ జతలు ఉంటాయి?
జవాబు:
23 జతలు
ప్రశ్న 7.
ఈ చిత్రాన్ని పరిశీలించండి. సమాధానములు రాయండి.
వంశీ, ప్రియలు నూతన దంపతులు. వారు మగపిల్లవానిని కనాలనుకొంటున్నారు.
a) మగ పిల్లవాడు జన్మించాలంటే జరుగవలసిన క్రోమోజోముల బదిలీని తెలిపే సంభావ్యతా చిత్రాన్ని గీయండి.
జవాబు:
b) శిశువు లింగ నిర్ధారణలో ఎవరు పాత్ర పోషిస్తారు? ఎలా చెప్పగలవు?
జవాబు:
శిశువు లింగ నిర్ధారణలో తండ్రి పాత్ర పోషిస్తారు. ఎందుకనగా మగశిశువును నిర్థారించే “Y” క్రోమోసోమ్ తండ్రిలోనే ఉత్పత్తి అవుతుంది.
ప్రశ్న 8.
దృశ్యరూపం మరియు జన్యురూపం అనగానేమి? మెండల్ ఏకసంకరణ పద్ధతి ద్వారా వీటిని వివరించండి.
జవాబు:
దృశ్యరూపం :
జీవులలో బయటకు కన్పించే (బహిర్గతం) అయ్యే లక్షణాన్ని దృశ్యరూపంగా గుర్తిస్తాం.
జన్యురూపం :
జీవులు ప్రదర్శించే స్వరూప స్వభావాల సంభావ్యత క్రమాన్ని జన్యురూపంగా గుర్తిస్తాం.
పసుపు (YY) ఆకుపచ్చ (YY), విత్తనాలు ఉన్న శుద్ధజాతుల బఠాణీల మొక్కల మధ్య పరపరాగ సంపర్కం చేయగా F1 తరంలో మొక్కలన్నీ పసుపు రంగు విత్తనాలు కల్గి ఉన్నాయి. అంటే F1 తరంలో పసుపు రంగు దృశ్యరూపంగా గుర్తించటం జరిగింది.
ఈ F1 తరంలో ఏర్పడే విత్తనాల జన్యురూపం ‘Yy’
F2 తరం : F1 తరం మొక్కల మధ్య (YY) స్వపరాగ
సంపర్కం చేయగా F2 తరం మొక్కలు ఏర్పడ్డాయి.
దృశ్యరూప నిష్పత్తి : 3 : 1; జన్యురూప నిష్పత్తి : 1 : 2 : 1
ప్రశ్న 9.
మెండల్ అనువంశికతా సూత్రాలను తెలుపుము. మెండల్ తన ప్రయోగాలకు ఐరాణీ మొక్కను ఎంచుకోవడానికి గల కారణాలు రాయండి.
జవాబు:
మెండల్ అనువంశికతా సూత్రాలు:
- బహిర్గతత్వ సూత్రం,
- పృథక్కరణ సూత్రం,
- స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం.
మెండల్ తన ప్రయోగానికి బఠానీ మొక్కను ఎంపిక చేసుకోవడానికి కారణాలు :
- స్పష్టమైన లక్షణాలు కల్గి ఉండటం
- ద్విలింగ పుష్పాలు కల్గి ఉండటం
- ఆత్మ పరాగసంపర్కం జరపడం
- సంకరీకరణానికి అనువుగా ఉండటం
- బఠానీ ఏకవార్షిక మొక్క
ప్రశ్న 10.
ప్రక్కన ఉన్న ఫ్లోచార్టు గమనించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
i) ఈ ఫ్లోచార్టు దేనిని తెలియచేస్తుంది?
జవాబు:
శుద్ధ పొడవు మరియు పొట్టి మొక్కల మధ్య మెండల్ ఏక సంకరీకరణము.
ii) F1 తరపు మొక్కల దృశ్యరూపం ఏమిటి?
జవాబు:
అన్నీ మొక్కలూ పొడవైనవి.
iii) తరం యొక్క దృశ్యరూప మరియు జన్యురూప నిష్పత్తులు తెల్పండి.
జవాబు:
దృశ్యరూప నిష్పత్తి 3 : 1
జన్యురూప నిష్పత్తి 1 : 2 : 1
iv) ఈ ఫ్లోచార్టు ద్వారా నీవు ఏ అనువంశిక సూత్రాలను అర్థం చేసుకుంటావు?
జవాబు:
బహిర్గతత్వ సూత్రము మరియు పృథక్కరణ సూత్రము
ప్రశ్న 11.
జీవ పరిణామం గురించి డార్విన్ ప్రతిపాదించిన సిద్ధాంతం నందలి ముఖ్యాంశాలను రాయంది.
జవాబు:
డార్విన్ సిద్ధాంతము నందలి ముఖ్యాంశాలు :
- పరిణామం అనేది నెమ్మదిగా నిరంతరాయంగా జరుగుతుంది.
- ఒక జనాభాలోని ఏదేని సమూహం వైవిధ్యాలను సంతరించుకోవచ్చు.
- వైవిధ్యాలు జనకుల నుండి సంతతికి అనువంశికంగా అందించబడతాయి.
- సంతతి అధిక సంఖ్యలో వుంటే అది మనుగడ కోసం పోరాటానికి దారితీస్తుంది.
- ఉపయుక్తమైన లక్షణాలు గల జీవులు మనుగడ కోసం జరిగే పోరాటంలో విజయం సాధిస్తాయి.
- పర్యావరణంలో మార్పులు వస్తే జీవులు వాటికి అనుగుణంగా మార్పులు లేదా అనుకూలనాలను సంతరించుకొని కొత్త పరిస్థితులలో జీవించగల్గుతాయి.
- ప్రతి జీవజాతిలో సుదీర్ఘకాలం మార్పులు చోటుచేసుకుంటూ వుంటే అది ఒక కొత్త జాతి ఏర్పడటానికి దారితీస్తుంది.
ప్రశ్న 12.
జీవ పరిణామంను నిరూపించే ఏవైనా రెండు ఆధారాలను గురించి వివరించండి.
జవాబు:
1. నిర్మాణ సామ్య అవయవాలు :
తిమింగలాల్లో వాజాలు (ఈదడానికి), గబ్బిలాల్లో రెక్కలు (ఎగరడానికి), చిరుతల్లో కాళ్ళు (పరిగెత్తడానికి), మనుషుల్లో చేతులు (పట్టుకోవడానికి), చుంచు ఎలుకల్లో కాళ్ళు (తవ్వడానికి) ఇలా వివిధ రకాలుగా ఉపయోగపడే ముందరి చలనాంగాల అంతర్నిర్మాణము ఒకేలా ఉంటుంది. వీటన్నింటి ఎముకల అమరిక ఒకేలా ఉంటాయి. సకశేరుకాలన్నీ ఒకే పూర్వీకుల నుండి పరిణామం ఫలితంగా ఏర్పడినవేనని ఈ రుజువులు తెలుపుతున్నాయి. ఈ అవయవాలనే నిర్మాణసామ్య అవయవాలు’ అంటారు. ఈ విధమైన పరిణామాన్ని (అపసారి పరిణామం) అందురు.
2. క్రియాసామ్య అవయవాలు :
పక్షులు, గబ్బిలాల రెక్కలు గురించి పరిశీలిస్తే, గబ్బిలం రెక్కలలో పొడవుగా ఉన్న వేళ్ళ మధ్యలో సాగడానికి, ముడుచుకోవడానికి వీలుగా ఉన్న చర్మపంకం కనిపిస్తుంది. కానీ పక్షులలో రెక్కలు ఈకలతో కప్పబడిన ముందరి చలనాంగాలు. ఈ రెండింటిలో నిర్మాణం, అవయవాలు వేరువేరుగా ఉన్నప్పటికీ అవి నిర్వర్తించే విధి మాత్రం ఒక్కటే. నిర్మాణం వేరువేరుగా ఉన్నప్పటికీ ఒకేరకమైన పనిని నిర్వర్తించే వాటిని క్రియాసామ్య అవయవాలు అంటారు. ఈ విధమైన పరిణామాన్ని (అభిసారి పరిణామం) అంటారు.
3. పిండోత్పత్తి శాస్త్ర నిదర్శనాలు :
చేప నుండి మానవుని వరకు గల వివిధ జీవుల పిండాలలో గుర్తించదగిన పోలికలు ఉంటాయి. ప్రతి జీవి జీవిత చరిత్ర పూర్వీకుల నిర్మాణాత్మక లక్షణాలను ప్రదర్శించును. జీవులన్నింటికీ ఒకే సామాన్య పూర్వీకులు ఉన్నారని, దాని నుండే జీవులన్నీ పరిణామం చెందాయనే భావనకు బలం చేకూరుతుంది.
4. శిలాజ నిదర్శనాలు :
ప్రాచీన జీవ యుగాల్లో నివసించిన జీవుల ఉనికిని తెలియజేసే ప్రకృతి సిద్ధంగా భద్రపరచబడిన నిర్జీవ పదార్థాలను శిలాజాలు అంటారు. శిలాజాలను గురించిన అధ్యయనాన్ని పురాజీవ శాస్త్రం అని అంటారు. భూగర్భ శాస్త్రవేత్త శిలాజకాలాన్ని లెక్కించి చెప్పగలుగుతారు. కార్బన్ డేటింగ్ పద్దతిని ఉపయోగించి శిలాజాల వయస్సును, అవి నివసించిన కాలాన్ని కనుగొందురు.
ఉదా : రాక్షస బల్లులు (డైనోసారస్) కీటోసారస్ ప్రస్తుతం మనకు లభించిన శిలాజ నిదర్శనాలు.
ప్రశ్న 13.
బఠానీ మొక్కలలో బహిర్గత, అంతర్గత లక్షణాలను బట్టి F2 తరంలో వాటి నిష్పత్తిని తెలపండి.
జవాబు:
ప్రశ్న 14.
ఈ క్రింది పదాలను వివరించండి.
ఎ) యుగ్మవికల్పకాలు బి) సమయుగ్మజ స్థితి సి) విషమయుగ్మజ స్థితి డి) F1 తరం ఈ) F1 తరం ఎఫ్) దృశ్యరూపం జి) జన్యురూపం హెచ్) బహిర్గతం ఐ) స్వతంత్ర జన్యువ్యూహనం
జవాబు:
ఎ) యుగువికల్పకాలు :
ప్రతి లక్షణాన్ని నియంత్రించే ఒక జత కారకాలను యుగ్మ వికల్పకాలు అంటారు. ప్రస్తుతం ఈ కారకాలనే ‘జన్యువులు’ అంటారు.
ఉదా : పొడవు (TT), పొట్టి (tt).
బి) సమయుగ్మజ స్థితి :
ఒక లక్షణానికి రెండూ ఒకే రకమైన కారకాలుంటే దానిని ‘సమయుగ్మజం’ (Homozygous) అంటారు.
ఉదా : పసుపురంగు (YY), గుండ్రని విత్తనం (RR),
సి) విషమయుగ్మజ స్థితి :
ఒక లక్షణానికి వ్యతిరేక లక్షణాలున్న జన్యువులు జతగా ఉంటే దానిని “విషమయుగ్మజం” అంటారు. (Heterozygous) అంటారు.
ఉదా: పసుపురంగు (YY), గుండ్రం (Rr),
డి) F1 తరం :
సంకరణ ప్రయోగంలో, సమయుగ్మజ మొక్కల మధ్య పరపరాగ సంపర్కం జరపగా ఏర్పడిన మొదటి తరాన్ని “F1 తరం” అంటారు. ఇవి దృశ్యరూపం పరంగా ఒకే విధంగా ఉండి జన్యురూపంగా విషమయుగ్మజ స్థితిలో ఉంటాయి.
ఈ) F2 తరం :
F1 తరం మొక్కల మధ్య ఆత్మపరాగ సంపర్కం జరపగా ఏర్పడిన సంతతిని “F2 తరం” అంటారు. ఇవి దృశ్యరూపంగా 3:1 నిష్పత్తిని, జన్యుపరంగా 1 : 2 : 1 నిష్పత్తిని కలిగి ఉంటాయి.
ఎఫ్) దృశ్యరూపం :
ఒక జీవిలో బయటకు కనిపించే లక్షణాలను “దృశ్యరూపం” అంటారు.
ఉదా : పొడవు, పొట్టి.
జి) జన్యురూపం :
జీవి ప్రదర్శించే లక్షణాలకు కారణమైన జన్యుస్థితిని “జన్యురూపం” అంటారు.
ఉదా : పొడవు (TT లేదా TI).
హెచ్) బహిర్గతం :
విషమయుగ్మజ స్థితిలో జీవి ఏదో ఒక లక్షణం మాత్రమే ప్రదర్శింపబడుతుంది. ఈ ధర్మాన్ని బహిర్గతం అని, అటువంటి లక్షణాన్ని బహిర్గత లక్షణం అంటారు.
ఉదా : విషమయుగ్మజ పొడవు మొక్క (TV) పొడవు మరియు పొట్టి లక్షణాల కారకాలను కలిగి ఉన్నప్పటికి అది పొడవు మొక్కగా ఉంటుంది. ఇక్కడ పొడవు బహిర్గత లక్షణం. పొట్టి అంతర్గత లక్షణం.
ఐ) స్వతంత్ర జన్యువ్యూహనం :
యుగ్మవికల్పకాలలో రెండు కారకాలు ఉన్నప్పటికీ, సంయోగ బీజాలు ఏర్పడేటప్పుడు ఒక్కో కారకం విడిపోయి ప్రవేశిస్తాయి. ఈ సందర్భంలో ప్రతి కారకం స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. ఈ జన్యు ధర్మాన్ని పృధక్కరణ లేదా వేరుపడే సూత్రం లేదా స్వతంత్ర జన్యువ్యూహనం (Law of Segregation) అంటారు.
ఉదా: విషమయుగ్మజ పొడవు మొక్క (T) నుండి, రెండు రకాల సంయోగబీజాలు (T) (1) ఏర్పడతాయి. ఇవి ఏర్పడేటప్పుడు ఒక కారకం, మరొక కారకంపై ప్రభావాన్ని చూపుతుంది.
ప్రశ్న 15.
మెండల్ సిద్ధాంతాన్ని వివరించండి.
జవాబు:
వైవిధ్యాలు గురించి అవి అనువంశికంగా సంక్రమించే విధానం గురించి 1857లో గ్రెగర్ జోహాన్ మెండల్ పరిశోధన చేశాడు. ఇతను బఠానీ మొక్కలపై సంకరణ ప్రయోగాలు చేసి అనువంశికతను వివరించాడు. ఇతని సిద్ధాంతంలో మూడు పరికల్పనలు, రెండు సూత్రాలు ఉన్నాయి.
పరికల్పనలు :
మొదటి పరికల్పన :
జీవిలోని ప్రతి ప్రత్యేక లక్షణానికి రెండు కారకాలు ఉంటాయి. (వీటిని నేడు మనం జన్యువులు అంటున్నాము. ఈ జన్యువుల జతను యుగ్మవికల్పకం అంటారు.)
రెండవ పరికల్పన :
సంతతిలోని రెండు కారకాలు ఒక్కో జనకుని నుండి ఒక్కొక్కటి పొందును.
వివరణ :
సంయోగబీజాల కలయిక వలన జీవి ఏర్పడుతుంది. సంయోగబీజం ఒకటి తల్లి నుండి మరొకటి తండ్రి నుండి వస్తాయి. కావున సంతతిలోని యుగువికల్పకంలో ఒకటి తల్లి మరొకటి తండ్రికి చెంది ఉంటాయి.
మూడవ పరికల్పన :
సంతతికి లభించిన రెండు భిన్న కారకాలలో ఒక కారకం మాత్రమే బహిర్గతమవుతుంది.
వివరణ :
సంతతి విషమయుగ్మజ స్థితిలో ఉంటే ఒక లక్షణం మాత్రమే ప్రదర్శిస్తుంది. ఈ ధర్మాన్ని బహిర్గతం అంటారు.
సిద్ధాంతాలు :
తన పరికల్పనల ఆధారంగా మెండల్ రెండు సిద్ధాంతాలను సూత్రీకరించాడు. అవి
1. బహిర్గత సిద్ధాంతం :
జీవి విషమయుగ్మజ స్థితిలో ఉన్నప్పుడు ఒక లక్షణం మాత్రమే ప్రదర్శింపబడుతుంది. మరొకటి అంతర్గతంగా ఉండిపోతుంది.
ఉదా : విషమయుగ్మజ పొడవు (Tt) మొక్కలో పొడవు లక్షణం ప్రదర్శింపబడి పొట్టి లక్షణం అంతర్గతంగా ఉంటుంది.
2. వేరుపడే సూత్రం :
యుగ్మవికల్పకాలలో ఒక్కొక్కటి ఒక్కో జనకుడి నుండి సంతతికి లభిస్తాయి. అయితే జనకుల యుగ్నవిక్సలకాలలో ఏదో ఒక కారకం యథేచ్చగా (Random) సంతతికి అందించటం జరుగుతుంది.
ఉదా :
విషమయుగ్మజ పొడవు మొక్క (Tt) నుండి రెండు రకాల సంయోగబీజాలు (T), (t) సమ సంఖ్యలో ఏర్పడతాయి.
ప్రశ్న 16.
దార్విన్ సిద్ధాంతాన్ని వివరించండి.
జవాబు:
చార్లెస్ రాబర్ట్ డార్విన్ (1809-1882)
ప్రకృతి వరణం (natural selection) అనే ప్రఖ్యాత సిద్ధాంతాన్ని డార్విన్ ప్రతిపాదించాడు. డార్విన్ తన 22వ యేట HMS బీగిల్ అనే నౌకలో ప్రపంచ సర్వే కోసం బయలుదేరి 5 సంవత్సరాలు ప్రయాణించాడు. గాలాపాగస్ దీవులతో సహా ఎన్నెన్నో ప్రదేశాలను అతడు సందర్శించాడు. ఆయా ప్రదేశాలలోని మొక్కలు, జంతువుల గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. అలాగే ఎంతో సమాచారాన్ని, ఋజువులను కూడా సేకరించాడు.
డార్విన్ సిద్ధాంతంలో ప్రధానంగా మూడు సత్యాలు (పరిశీలనలు), రెండు సూత్రీకరణలు (సిద్ధాంతాలు) ఉంటాయి. అవి
1. అత్యుత్పత్తి :
(మొదటి సత్యం) జీవులు తమ సంతతిని అధికసంఖ్యలో ఉత్పత్తి చేస్తాయి. ఒక ఆవాలు చెట్టు, తన జీవితకాలంలో 10 వేల విత్తనాలు ఉత్పత్తి చేస్తుంది. ఇవన్నీ మొక్కలుగా మారితే భూమి అంతా ఆవాల మొక్కలతో నిండిపోతుంది.
2. జనాభా నిర్ణీత సంఖ్య :
(రెండవ సత్యం) జీవులు తమ సంతతిని అధికంగా ఉత్పత్తి చేసినా, ఏ జీవి భూమి అంతటినీ ఆక్రమించలేదు. ప్రతి జాతి సంఖ్య నిర్దిష్టంగా నియంత్రించబడుతుంది. జనాభా నిర్ణీత సంఖ్యలో ఎందుకు ఉంటుందని డార్విన్ ఆలోచించాడు.
3. మనుగడ కోసం పోరాటం :
(మొదటి సిద్ధాంతం) జీవులు అధిక సంఖ్యలో ఏర్పడిన్పటికి, అవి జీవించటంలో అధికమైన పోటీని ఎదుర్కొంటున్నాయి. వాటి అవసరాలు ఒకే విధంగా ఉండుట వలన తీవ్రమైన పోటీ ఉంటుంది. దీనినే ‘మనుగడ కోసం పోరాటం’ అంటారు. మరి ఈ పోరాటంలో ఏ జీవులు గెలుస్తాయి? ఏవి మరణిస్తాయి? అని ఆలోచించాడు.
4. వైవిధ్యాలు :
(మూడవ సత్యం) జీవులన్నీ ఒకే విధమైన లక్షణాలలో లేవు. జీవుల మధ్య ఉండే ఈ వ్యత్యాసాలను వైవిధ్యాలు అంటారు. పించ్ పక్షుల ముక్కుల ఆకారం వాటి ఆహార అలవాట్లకు గల సంబంధాన్ని పరిశీలించి, డార్విన్ వైవిధ్యాలు మనుగడకోసం పోరాటానికి తోడ్పడతాయని భావించాడు.
5. యోగ్యతను సార్థక జీవనం :
(రెండవ సిద్ధాంతం) మనుగడ కోసం జరిగే పోరాటంలో వైవిధ్యాలు తోడ్పడితే అవి సమర్థవంతంగా జీవించగలుగుతాయి. మనుగడకు తోడ్పడే ఇటువంటి లక్షణాలను అనుకూలనాలు అంటారు. అనుకూలనాలు లేని జీవులు నశించి ప్రకృతి నుండి తొలగించబడతాయి. ప్రకృతిచే ఎన్నుకొనబడే ఈ ప్రక్రియను ‘ప్రకృతి వరణం’ అంటారు.
1. అత్యుత్పత్తి 2. జనాభా నిర్ణీత సంఖ్య – మనుగడ కోసం పోరాటం 3. వైవిధ్యాలు యోగ్యతమ సార్థక జీవనం
ప్రశ్న 17.
మెండల్ స్వతంత్ర జన్యువ్యూహన సిద్ధాంతంను వివరించండి.
జవాబు:
మెండల్ స్వతంత్ర వ్యూహన సిద్దాంతం :
బఠానీ మొక్కలలో పై విధంగా ద్విసంకర సంకరణం జరపగా, సంతతిలో పసుపు (Yy), గుండ్రని (RR) మరియు ముడతలు (rr), ఆకుపచ్చ (yy) లక్షణాలు కనిపించాయి. F1 తరం మొక్కల మధ్య స్వపరాగ సంపర్కం జరిపినపుడు ఆయా లక్షణాలు, ఇతర లక్షణాలతో స్వతంత్రంగా కలిసిపోయి F2 తరం ఏర్పడింది.
– (1) RRYY (2) RRYy (3) RrYY (4) RrYy (5) RRYy (6) RrYY (7) RrYy (8) RrYy (9) RrYy అనేవి గుండ్రని మరియు పసుపు విత్తనాలనిచ్చేవి.
– (1) RRyy(2) Rryy (3) Rryy అనేవి గుండ్రని మరియు ఆకుపచ్చనివి.
– (1) rr Yy(2) rr Yy (3) Ir YY అనేవి ముడతలు మరియు పసుపువి.
– rryy అనేవి ముడతలు మరియు ఆకుపచ్చనివి.
పై ఫలితాలను బట్టి ప్రతి లక్షణానికి కారణమైన కారకం స్వతంత్రంగా ఉంటూ సంయోజబీజాలలో మనగలిగనట్లు నిర్ధారణకు రావచ్చు. అంటే కారకాలనేవి (factors) స్వతంత్రమైనవి మరియు సంయోగబీజాల ద్వారా అనువంశికంగా సంతతికి అందించబడతాయి. ఈ ఒక జతకన్నా ఎక్కువ లక్షణాల యొక్క అనువంశికతను గమనిస్తే, ఆ జత లక్షణాలకు కారణమైన కారకాలు చేరే లక్షణాలపై ఆధారపడకుండా స్వతంత్రంగా సంతతికి లభించుటనే లేదా అందించుటనే “స్వతంత్ర వ్యూహన సిద్ధాంతమని” అంటారు.
ప్రశ్న 18.
లామార్క్ సిద్ధాంతాన్ని వివరించండి. (లేదా) ఆర్తిత గుణాల అనువంశికత అనగానేమి?
జవాబు:
ఒక జీవి తన మనుగడ కోసం అవసరం కొద్ది అభివృద్ధి చేసుకొన్న లక్షణాలను ఆర్జిత గుణాలు (Acquired characters) అంటారు. లామార్క్ అభిప్రాయం ప్రకారం- ఇలా ఆర్జించిన గుణాలు తమ సంతతికి అందించబడతాయి. దీనిని ఆర్జిత గుణాల అనువంశికత అంటారు.
ఉదా :
జీన్ బాప్టిస్ట్ లామార్క్ జీవపరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మొదటి వ్యక్తి. కొన్ని వేల సంవత్సరాల క్రితం జిరాఫీలు జింకల వలెనే ఉండేవని లామార్క్ భావించాడు. ఆహార కొరత కారణంగా నేలపైన మరియు చెట్ల యొక్క కింది శాఖలు లేకుండా పోయాక జిరాఫీలు మెడసాచి పైన ఉన్న శాఖలను అందుకోవాల్సిన అవసరం ఏర్పడి ఉండవచ్చు. కనుక మెడనిసాచి పై శాఖలను అందుకోవడం వలన మెడ నెమ్మదిగా సాగడం మొదలై ఉండవచ్చు.
ఎందుకంటే ఎల్లప్పుడూ మెడను సాచి ఉపయోగించడం మూలంగా కొన్ని తరాల తరవాత జిరాఫీల మెడ సాగిపోయి ఇప్పుడు ఉన్నట్లు సాగిన మెడ గల జిరాఫీల ఆవిర్భావం జరిగి ఉంటుంది. ఇలా ఒక జీవి తన మనుగడ కోసం అవసరం కొద్దీ అభివృద్ధి చేసుకున్న లక్షణాలను లేదా గుణాలను ఆర్జిత గుణాలు (Acquired characters) అంటారు. లామార్క్ అభిప్రాయం ప్రకారం ఈ విధంగా ఆర్జించిన గుణాలు తమ సంతతికి అందించబడుతూ ఉంటాయి. దీనినే ‘ఆర్జిత గుణాల అనువంశికత’ అంటారు. ఉదా : సాగిన మెడ మరియు పొడవు ఎదిగిన ముందుకాళ్ల జిరాఫీ.
ప్రశ్న 19.
DNA గురించి తెలపండి.
జవాబు:
- DNA అనగా డీ ఆక్సీరిబో న్యూక్లిక్ ఆమ్లం. ఇది కేంద్రకంలో ఉండే ఒక ఆమ్లం.
- జేమ్స్ వాట్సన్ మరియు ఫ్రాన్సిస్ క్రిక్ అనే శాస్త్రవేత్తలు 1953లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నందు DNA యొక్క పూర్తి నిర్మాణాన్ని కనుగొన్నారు.
- మీరు DNA అణువు సర్పిలంగా ఉండే మెట్ల మాదిరిగా ఉంటుందని వాట్సన కనుగొన్నారు. ఈ ఆకారాన్నే ద్వంద్వ కుండలి (Double helix) అని అంటారు.
- ఇది ఏకాంతరంగా అమర్చబడిన చక్కెరలు మరియు ఫాస్పేట నిర్మితం.
- దీనిలో మెట్ల వలె ఉండేవి నత్రజని క్షారాలు. అవి అడినిన్, గ్వానిస్, థైమిన్ మరియు సైటోసిన్.
- ఫ్రాంక్లిన్ మరియు మౌరిస్ విల్కిన్స్ తో పాటుగా వాట్సన్ మరియు క్రికు నోబెల్ బహుమతి వచ్చింది.
- జుట్టు యొక్క రంగు, చర్మం మొదలగు లక్షణాలు దీనికి ఉదాహరణలు.
- DNA యొక్క రసాయనిక నిర్మాణంలో ఏ చిన్న మార్పు కలిగినా అది సంతతి యొక్క లక్షణాలలో మార్పునకు కారణమవుతుంది. ఆ మార్పులే వైవిధ్యాలకు దారితీస్తాయి.
ప్రశ్న 20.
దార్విన్ సిద్ధాంత సారాంశం తెలపండి.
జవాబు:
డార్విన్ సిద్ధాంత సారాంశం :
- ఒక జీవి జనాభాలోని ఏదేని సమూహం వైవిధ్యాలను సంతరించుకోవచ్చు. కానీ సమూహంలోని అన్ని జీవులూ ఒకే రకంగా కాదు.
- వైవిధ్యాలు జనకుల నుండి సంతతికి అనువంశికంగా అందించబడతాయి.
- అధిక సంఖ్యలో సంతతి ఉంటే అది మనుగడ కోసం పోరాటానికి దారితీస్తుంది.
- తగిన ఉపయుక్త లక్షణాలు లేని జీవులకన్నా, ఉన్నవి మనుగడ కొనసాగించడానికి, ప్రత్యుత్పత్తి ద్వారా అధిక సంతానం ఉత్పన్నం చేస్తుంది.
- ఉపయుక్త వైవిధ్యాలుండి, మనుగడ సాగిస్తున్న జీవులు అనువంశికంగా సంతతికి వాటిని అందజేస్తాయి. అలాగే ప్రతి తరంలోనూ జరగడం వలన ఆ వైవిధ్యాలు సర్వసాధారణ లక్షణాలవుతాయి.
- పర్యావరణంలో మార్పులు వస్తే జీవులు వాటికి అనుగుణంగా మార్పులు లేదా అనుకూలనాలను సంతరించుకుని కొత్త పరిస్థితులలో జీవించగలుగుతాయి.
- ప్రతి జీవజాతిలో సుదీర్ఘకాలం మార్పులు చోటుచేసుకుంటూ ఉంటే, అది ఒక కొత్త జాతి ఏర్పడటానికి దారితీస్తుంది. కొత్త జాతి, నిజమైన జాతికి భిన్నంగా ఉంటుంది.
- భూమిపైన అన్ని జాతులు ఈ విధంగా ఏర్పడినవే.
ప్రశ్న 21.
కొత్త జాతులు ఏర్పడే విధానాన్ని ఉదాహరణతో వివరించండి.
జవాబు:
కొత్త జాతులు ఏర్పడటాన్ని జాతుల ఉత్పత్తి (Speciation) అని లేదా స్థూలపరిణామం (Macro evolution) అనీ అంటారు.
ఉదా : ఎర్ర, ఆకుపచ్చ కుమ్మరి పురుగులు లైంగికంగా కలిసి సంతతిని పొందగలవని మనకు తెలుసు. కానీ ఎర్ర, ఆకుపచ్చ కుమ్మరి పురుగులు ఏవేని కారణాలచేత చాలా కాలం వేరైపోయాయని ఊహించుకోండి (ఉదాహరణకు కాయలు తినడానికై నోట కరచుకొని తీసుకెళ్ళి దూరంగా ఎక్కడో జారవిడిచాయనుకోండి).
కొన్ని సంవత్సరాలలో రెండు రకాల కుమ్మరి పురుగులలోనూ ఎంతో వైవిధ్యం ఏర్పడుతుంది. ఆ తరువాత అవి అనుకోకుండా కలిసినప్పటికీ ప్రత్యుత్పత్తి జరపలేవు. సంతతిని ఉత్పత్తి చేయలేవు. ఏదైనా జీవులు వాటి జాతి జీవులతోనే కలవడం, సంతానాన్ని పొందడం జరుగుతుంది. ఈ విధంగా కొత్త జాతులు ఏర్పడుతుంటాయి.
ప్రశ్న 22.
మానవ పరిణామక్రమం తెలపండి.
జవాబు:
ఆధునిక మానవుడి రూపు సంతరించుకొనే వరకు జరుగుతూ ఉన్న పరిణామ ప్రక్రియనే మానవ పరిణామం అంటారు. ఇతర మొక్కలు, జంతువులన్నింటి వలెనే మనకు కూడా పరిణామ చరిత్ర ఉంది. ఆదిమానవుని వలె కనిపించే జీవులు 7 లక్షల 50 వేల సంవత్సరాలకు పూర్వమే ఉండేవారు. మానవులకు (హోమో సెపియన్స్) చెందిన అతి పురాతన శిలాజం భూమిపై మానవుల ఉనికి 2 లక్షల 50 వేల సంవత్సరాలకు పూర్వమే ఉన్నట్లు తెలుపుతున్నది.
మానవ పరిణామ క్రమం :
హోమో హెబిలస్ – 1.6 – 2.5 మిలియన్ సంవత్సరాల పూర్వం నివసించేవారు.
హోమో ఎరెక్షన్ – 1-1.8 మిలియన్ సంవత్సరాల పూర్వం నివసించేవారు.
హోమో సెపియన్స్ నియండర్తలెన్సిస్ – 2.3-3 లక్షల సంవత్సరాల క్రితం నివసించేవారు.
హోమో సియన్స్ (ప్రస్తుత మానవులు) – 40 వేల సంవత్సరాల పూర్వం నుండే నివసిస్తున్నారని తెలియుచున్నది.
ప్రశ్న 23.
పరిణామక్రమంలో మానవ వలస ప్రయాణం తెలపండి. (లేదా) మానవులలోని వేరు వేరు జాతులు ఒకే జాతి నుండి పరిణామం చెందాయని ఎలా చెప్పగలవు?
జవాబు:
- మానవులంతా ఆఫ్రికా నుండి వచ్చినవారే! మానవుల అతిపురాతన జీవులు హెమో సెపియన్స్ అక్కడే కనుగొనబడ్డారు.
- మన జన్యు సమాచారం కూడా ఆఫ్రికన్ మూలాలనే సూచిస్తోంది.
- అంటే రెండు మిలియన్ సంవత్సరాల పూర్వం అక్కడే మానవులుండేవారు. తర్వాతే వివిధ కారణాలతో మన పూర్వీకులు ఆఫ్రికాను వదిలి బయటకు వచ్చారు. కొందరేమో అక్కడే ఉండిపోయారు.
- వలసకు బయలుదేరిన వారు ఆఫ్రికా నుండి ఆసియా, తరవాత ఆసియా మధ్యభాగం, యురేషియా, దక్షిణ ఆసియా, తూర్పు ఆసియా అలా చేరుకున్నారు.
- వారిలో కొందరు ఇండోనేషియా దీవుల నుండి ప్రయాణిస్తూ ఫిలిప్పైన్స్ మీదుగా ఆస్ట్రేలియా చేరారు.
- అలాగే బేరింగ్ జలసంధి దాటి అమెరికా చేరుకున్నారు.
- వారంతా ఒకే దారిలో లేదా ఒకే కాలంలో పయనించలేదు. కేవలం ప్రయాణించాలనే ప్రయాణించలేదు. అప్పటి అవసరాలు, కారణాలు వారు ప్రయాణించేలా పురికొల్పి ఉంటాయి.
- ముఖ్యంగా ముందుకు, వెనుకకు, గుంపులుగా, ఒకసారి కొంత కొంత మంది వేరవుతూ, ఒకరికొకరు విడిపోతూ ఆఫ్రికా నుండి దూరంగా, ఆఫ్రికాలోనికి అలా ప్రయాణించారు.
ప్రశ్న 24.
ఒక ప్రయోగంలో F1 తరంలో అన్ని గుండ్రని పసుపు విత్తనాలు ఏర్పడినాయి (Yy Rr). F2 తరంలో గుండ్రని పసుపు (YYRr లేదా YY RR), గుండ్రని ఆకుపచ్చ (vy RRor YyRr), ముడతలు పడిన పసుపు (Yyrr లేదా YYrr) ముడతలు పడిన ఆకుపచ్చ (vy rr) గింజలు వచ్చాయి.
జవాబు:
1. ఒక్కొక్క రకం మొక్కలు ఎంతెంత శాతం ఏర్పడినవి?
గుండ్రని పసుపు గింజల మొక్కలు : 9 %
ముడతలు పడిన పసుపు గింజల మొక్కలు : 3%
గుండ్రని ఆకుపచ్చ గింజల మొక్కలు : 3%
ముడతలు పడిన ఆకుపచ్చ గింజల మొక్కలు : 1% గా ఏర్పడినవి.
అంటే వీటి జన్యురూప నిష్పత్తి 9 : 3 : 3 : 1 గా ఉంది.
2. ఏ మొక్కలు ఏర్పడటానికి ఎంత సంభావ్యత ఉందో కనుగొనగలరా?
ఔను. నాలుగు రకాల మొక్కలు 9:3:3:1 నిష్పత్తిలో ఏర్పడ్డాయి.
3. మెండల్ పరిశోధనలతో మీరు ఏకీభవిస్తున్నారా?
ఔను, మెండల్ పరిశోధనల ఫలితాలు కూడా ఇదే విధంగా ఉన్నాయి.
ప్రశ్న 25.
‘మానవుడు ఆఫ్రికా ఖండంలోనే మొదట జన్మించాడు’ అన్న అంశంపై మీ అనుమానాల నివృత్తి కొరకు మీరు ఒక చరిత్రకారుడిని కలిసినపుడు మీరు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు?
జవాబు:
- మానవ పరిణామము అనగానేమి?
- మానవుని పోలివుండే ఆదిమానవుడు ఎప్పుడు భూమిపై కనిపించడం జరిగినది?
- ఆదిమానవుడు ఎక్కడ జీవించాడు?
- ప్రస్తుత మానవ సమాజాలు ఎక్కడ నివసిస్తున్నప్పటికి వారి మూలాలు ఎక్కడ ఉన్నాయి?
- మానవులకు చెందిన అతిపురాతన శిలాజం భూమిపై మానవుల ఉనికి ఎప్పటి నుండి ఉందని చెపుతుంది?
- మానవజాతి అయిన ‘హోమోసెపియన్సు’ ఎన్ని సంవత్సరాల క్రితం నుండి నివసిస్తున్నారని తెలుస్తోంది?
- ఆఫ్రికా నుండి కొన్ని మానవ సమాజాలు ఎప్పుడు అక్కడ నుండి బయలుదేరినాయి?
- మానవులందరూ ఒకే మానవుని నుండి ఉద్భవించినారా?
ప్రశ్న 26.
మానవ పరిమాణ క్రమాన్ని ఫ్లోచార్ట్ ద్వారా చూపండి.
జవాబు:
మానవ పరిణామక్రమం (Human evolution) :
10th Class Biology 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు ½ Mark Important Questions and Answers
ఫ్లో చార్టులు
1.
జవాబు:
పృథక్కరణ సూత్రం
2.
జవాబు:
సూక్ష్మ పరిణామం
3.
జవాబు:
అనువంశిక లక్షణాలు
4.
జవాబు:
మనుగడ కోసం పోరాటం
5.
జవాబు:
ఆహారం మరియు ఆశ్రయం కోసం వివిధ జాతుల మధ్య పోరాటం
6.
జవాబు:
పురాజీవ శాస్త్ర నిదర్శనాలు
7.
జవాబు:
అవశేషావయవాలు
8.
జవాబు:
Tt
9.
జవాబు:
బీజ ద్రవ్య సిద్ధాంతం
10.
జవాబు:
Tt
11.
జవాబు:
పసుపు, ముడతలు
సరైన గ్రూపును గుర్తించండి
12. మెండల్ ప్రయోగాల సంఘటనలు ఏవి వరుస క్రమంలో ఉన్నాయి?
A. స్వచ్ఛమైన జాతి ఎంపిక – స్వచ్చమైన మొక్కలను సంకరణం – F1 మొక్కలు స్వయం ఫలదీకరణం
B. F1 మొక్కలు స్వయం ఫలదీకరణం – F1 మొక్కలను సంకరణం చేయడం – మొత్తం F2 మొక్కలు శుద్ధ జాతీ
జవాబు:
గ్రూపు – A
13. మెండల్ ఏక సంకర సంకరణంలో ఏ గ్రూపు లక్షణాలు సరైనవి?
A. F1 లక్షణాలు : సమయుగ్మజ పొడవు, విషమ యుగ్మజ పొడవు
B. F2 లక్షణాలు : సమయుగ్మజ పొడవు, విషమ యుగ్మజ పొడవు, సమయుగ్మజ పొట్టి
జవాబు:
F2 లక్షణాలు
14. క్రింది వానిలో మెండల్ ప్రయోగానికి అనువైన బఠానీ మొక్కల లక్షణాలు ఏవి?
A. ఏక వార్షిక మొక్క ద్విలింగ పుష్పాలు, ఎక్కువ మొత్తంలో విత్తనాలు ఉత్పత్తి చేయడం.
B. ద్వివార్షిక మొక్క ఏకలింగ పుష్పాలు, తక్కువ మొత్తంలో విత్తనాలు ఉత్పత్తి చేయడం.
జవాబు:
గ్రూపు – A
15. బఠాణీ మొక్కల్లో మెండల్ అధ్యయనం చేసిన పరస్పర విరుద్ధ లక్షణాలు ఏవి ?
A. కాండం పొడవు – పొడవు & పొట్టి
పూల రంగు – ఎరుపు & నీలం
కాయ రంగు – ఆకుపచ్చ & పసుపు
B. కాండం పొడవు – పొడవు & పొట్టి
పూల రంగు – ఊదారంగు & తెలుపు
విత్తనం రంగు – పసుపు & ఆకుపచ్చ
జవాబు:
గ్రూపు – B
16. బరాణీ మొక్కల్లో దిగువ పేర్కొన్న ఏ గ్రూపు బహిర్గత లక్షణాలు?
A. పొడవైన, ఊదారంగు, గ్రీవ, గుండ్రని
B. పొట్టి, తెలుపు, శిఖరపు, ముడతలు
జవాబు:
గ్రూపు – A
17. ఈ దిగువ పేర్కొన్న ఏ సముదాయం అభిసారి పరిణామాన్ని సూచిస్తున్నాయి?
A. గబ్బిలం రెక్క – మానవుని చేయి
B. గబ్బిలం రెక్క – సీతాకోకచిలుక రెక్క
జవాబు:
గ్రూపు – B
18. దిగువ పేర్కొన్న ఏ మొక్క భాగాలు నిర్మాణ సామ్య అవయవాలు?
A. ముళ్ళు – నులి తీగలు & కొక్కేలు – ముళ్ళు
B. క్యారెట్ – బంగాళదుంప & మొక్క యొక్క ఆకు – ఒపర్షియా యొక్క కాండం
జవాబు:
గ్రూపు – A
19. దిగువ పేర్కొన్న ఏ జీవులు లామార్క్ వాదానికి చెందినవి?
A. ఫించ్ పక్షులు, సాల్మన్ చేపలు
B. జిరాఫీ, పాములోని చలనాంగాలు
జవాబు:
గ్రూపు – B
20. దిగువ పేర్కొన్న ఏ సముదాయం పరిణామానికి సంబంధించిన స్వరూప శాస్త్ర నిదర్శనాలు కావు?
A. నిర్మాణసామ్య అవయవాలు, క్రియాసామ్య అవయవాలు
B. శిలాజాలు, పిండ దశలు
జవాబు:
గ్రూపు – B
21. దిగువ పేర్కొన్న ఏ గ్రూపు మానవ పరిణామం సరైన క్రమంలో ఉన్నది?
A. హోమో హెబిలిస్ – హోమో ఎరెక్టస్ – హోమో సెపియన్స్ నియాండర్తాలెన్సిస్ – హోమో సెపియన్స్
B. హోమో ఎరెక్టస్ – హోమో హెబిలిస్ – హోమో సెపియన్స్ – హోమో సెపియన్స్ నియాండర్తాలెన్సిస్
జవాబు:
గ్రూపు – A
22. దిగువ పేర్కొన్న ఏ పరిస్థితి వారసత్వంగా సంక్రమిస్తుంది?
A. రెక్కల పురుగు జనాభాలో బరువు తగ్గడం
B. ఎర్ర రెక్కల పురుగు నుండి ఉత్పరివర్తన ఆకుపచ్చ రెక్కల పురుగు ఉద్భవం
జవాబు:
B
23. దిగువ పేర్కొన్న ఏ వైవిధ్యం ప్రకృతి వరణానికి దారి తీస్తుంది?
A. బీజకణ వైవిధ్యం
B. శారీరక కణాల వైవిధ్యం
జవాబు:
A
24. దిగువ పేర్కొన్న ఏ గ్రూపు అవశేష అవయవాలు?
A. గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, చర్మం
B. జ్ఞాన దంతాలు, ఉండుకం, బాహ్య చెవి కండరాలు, పురుషుల శరీరం మీద వెంట్రుకలు
జవాబు:
గ్రూపు – B
25. దిగువ పేర్కొన్న వాటిలో ఏవి శిలాజాలుగా సంరక్షించ బడుతున్నాయి?
A. బాహ్య అస్థిపంజరం, ఎముకలు, దంతాలు, వెంట్రుకలు
B. కండరాలు, నాలుక, చర్మం, గోళ్లు
జవాబు:
గ్రూపు – A
26. శిలాజాల వయస్సును లెక్కించడానికి ఏ సమూహ ఐసోటోపులను ఉపయోగిస్తారు?
A. ఆక్సిజన్, హైడ్రోజన్, సల్ఫర్
B. కార్బన్, యురేనియం, పొటాషియం
జవాబు:
గ్రూపు – B
ఉదాహరణలు ఇవ్వండి
27. సమయుగ్మజ పొడవు యొక్క జన్యురూపం TT. పొట్టి మొక్క యొక్క జన్యు రూపం ఏమిటి ?
జవాబు:
tt
28. పొడవు బఠాణి మొక్క యొక్క ఒక లక్షణం. దీనికి విరుద్ధమైన లక్షణం ఏమిటి?
జవాబు:
పొట్టి
29. సీతాకోకచిలుక మరియు దోమ యొక్క ముఖ భాగాలు నిర్మాణ సామ్య అవయవాలకు ఉదాహరణ. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
చిరుత మరియు మానవుడు యొక్క పూర్వాంగాలు
30. కీటకాల రెక్కలు మరియు పక్షి రెక్కలు క్రియాసామ్య అవయవాలకు ఉదాహరణ. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
సీతాకోకచిలుక రెక్కలు మరియు గబ్బిలం యొక్క రెక్కలు.
31. పెరిపీటస్, ఎకిడ్నా సంధాన సేతువులకు ఉదాహరణలు. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ఆర్కియోటెరిక్స్
32. ‘X’ స్త్రీ బీజం యొక్క లైంగిక క్రోమోజోము. పురుష లైంగిక క్రోమోజోముకు ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
X మరియు Y
33. డార్వినిజం అనేది పరిణామ సిద్దాంతాలలో ఒకటి. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
లామార్కిజం
34. 3: 1 ఏక సంకర సంకరణం యొక్క దృశ్యరూప నిష్పత్తి. ఏక సంకర సంకరణం యొక్క జన్యురూప నిష్పత్తి ఏమిటి?
జవాబు:
1 : 2 : 1
35. డోడో విలుప్త జీవికి ఉదాహరణ. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
డైనోసార్లు
36. స్వరూప శాస్త్రం, అంతర నిర్మాణ శాస్త్రం, పిండోత్పత్తి శాస్త్రం అనేవి పరిణామ సిద్ధాంతానికి సాక్ష్యాలను అందించే విజ్ఞానశాస్త్ర శాఖలు. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
పురాజీవశాస్త్రం
పోలికను గుర్తించుట
37. 44 : మానవులలో శారీరక క్రోమోజోములు : : ? : మానవులలో లైంగిక క్రోమోజోములు
జవాబు:
2
38. XX; స్త్రీలలో లైంగిక క్రోమోజోములు : : ? : పురుషులలో లైంగిక క్రోమోజోములు
జవాబు:
XY
39. X, Y : శుక్రకణాలు : : ? : అండం
జవాబు:
X
40. Tt : F1 తరం : : TT, Tt, tt 😕
జవాబు:
F2 తరం
41. ఎలుకలు : వీస్మన్ : : ఫించ్ పక్షులు 😕
జవాబు:
డార్విన్
42. ఉండుకం : అవశేష అవయవం : : తోకతో ఉన్న బేబీ 😕
జవాబు:
అటావిస్టిక్ అవయవం
43. TT: సమయుగ్మజ పొడవు : : ? : సమయుగ్మజ పొట్టి
జవాబు:
tt
44. యోగ్యతముల సార్లక జీవనం :: డార్విన్ : : ఆర్జిత లక్షణాల అనువంశికత 😕
జవాబు:
లామార్క్
45. బీజద్రవ్య సిద్ధాంతం : వీసమన్ : : An essay on the principles of population.
జవాబు:
మాల్టస్
46. నిటారైన మనిషి : నియాండర్తలెన్సిస్ : : ఆధునిక మానవుడు 😕
జవాబు:
హోమో సెపియన్స్
శాస్త్రవేత్తను గుర్తించండి
47. ఈయన ఆస్ట్రియా దేశానికి చెందిన మతగురువు. ఆయన దాదాపు 34 రకాలకు చెందిన 10000 బఠాణీ మొక్కలపై అధ్యయనం చేశారు. ఆయన ‘జన్యు శాస్త్ర పితామహుడు’ గా పేరొందాడు.
జవాబు:
గ్రెగర్ జోహన్ మెండల్
48. DNA అణువు సర్పిలంగా ఉండే మెట్ల మాదిరి ద్వంద్వ కుండలి ఆకారాన్ని కలిగి ఉంటుంది అని వీరు ఇరువురు కనుగొన్నారు.
జవాబు:
ఫ్రాన్సిస్ క్రీక్ & జేమ్స్ వాట్సన్
49. డ్రోసోఫిలాలో లింగ సహలగ్న లక్షణాలను వారు కనిపెట్టారు. డ్రోసోఫిలాలో వంశపారంపర్యత గురించి అధ్యయనం చేశారు.
జవాబు:
వాల్టర్ సటన్ & థామస్ హంట్ మోర్గాన్
50. పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించే మొదటి వ్యక్తి ఆయన. ఆర్జిత గుణాల అనువంశికత అనే పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
జవాబు:
జీన్ బాప్టిస్ట్ లామార్క్
51. ఆయన ‘ప్రకృతి వరణం’ అనే ప్రసిద్ధ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. HMS బీగిల్ అనే నౌకలో గాలాపాగస్ దీవులను సందర్శించి, ఫించ్ పక్షులలో వైవిధ్యాలను గమనించాడు.
జవాబు:
చార్లెస్ డార్విన్
52. ఆయన రాసిన పుస్తకం ‘Principles of geology’. భౌగోళిక మార్పులు క్రమబద్ధంగా జరుగుతాయి అని ప్రతిపాదించారు.
జవాబు:
చార్లెస్ లైల్
53. జనాభా గుణ శ్రేణిలో పెరుగుతుంటే (1, 2, 4, 8, …..) వాటి ఆహార అవసరాలు అంక శ్రేడి పద్దతిలో పెరుగుతున్నాయి. (1, 2, 3, 4, …..) అని వివరించాడు.
జవాబు:
మాల్టస్
54. ప్రకృతి వరణం కొత్త జాతుల పుట్టుకకు దోహద పడిందని స్వతంత్రంగా ప్రకృతి వరణం సిద్ధాంతాన్ని నిర్ధారించింది.
జవాబు:
ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలెస్
నేను ఎవరు?
55. నేను ఒక రకమైన పరిణామం, పెద్ద ఎత్తున మార్పులు సంభవించడం వలన కొత్త జాతులు ఏర్పడతాయి.
జవాబు:
స్థూల పరిణామం
56. ఆర్జిత గుణాలు దాని సంతానానికి అందజేయబడతాయి అని వివరించే లామార్క్ ప్రతిపాదించిన పరిణామ సిద్ధాంతాన్ని.
జవాబు:
ఆర్జిత గుణాల అనువంశికత
57. ఈ పరిణామ సిద్ధాంతం ప్రకారం సొమాటో ప్లాస్మాలో సంభవించే మార్పులు తరువాతి తరానికి సంక్రమించవు. కానీ బీజద్రవ్యంలో సంభవించే మార్పులు తరువాతి తరానికి సంక్రమిస్తాయి.
జవాబు:
బీజద్రవ్య సిద్ధాంతం
58. అవయవాలు ఒకే విధమైన నిర్మాణాన్ని కలిగి ఉండి, భిన్నమైన విధిని కలిగి ఉండటం అనే స్వరూప శాస్త్ర నిదర్శనాన్ని నేను.
జవాబు:
నిర్మాణ సామ్య అవయవాలు
59. మానవ శరీరంలోని కొన్ని అవయవాలు జీవక్రియల్లో ఎటువంటి పాత్ర కలిగి ఉండవు. పరిణామ క్రమంలో ఈ అవయవాలు పనిచేయకుండా పోయాయి.
జవాబు:
అవశేషావయవాలు
60. నేను శిలాజాలను అధ్యయనం చేసే విజ్ఞానశాస్త్ర విభాగాన్ని.
జవాబు:
పురాజీవశాస్త్రం
61. ఐసోటోపులు , కలిగియున్న రాయి లేదా మూలకాల వయసును ఈ పద్ధతి ద్వారా గణించవచ్చు.
జవాబు:
కార్బన్ డేటింగ్ పద్ధతి
62. నేను శీతాకాలం పంటను. లక్షణాలు వారసత్వంగా ఎలా వస్తాయో నిరూపించడానికి మెండల్ నన్ను తన ప్రయోగాలకు ఉపయోగించాడు. నా శాస్త్రీయ నామం ఏమిటి?
జవాబు:
పైసం సెటైవం
63. నేను అనువంశికత ప్రమాణాన్ని. మెండల్ నన్ను కారకంగా పిలిచాడు.
జవాబు:
జన్యువులు
64. జన్యువుల యొక్క అన్ని సంభావ్యతలను లెక్కించడానికి సహాయపడే ఒక రేఖాత్మక చిత్రరూపాన్ని?
జవాబు:
పన్నేట్ స్క్వేర్
దోషాన్ని గుర్తించి, సరిచేసి రాయండి
65. విభిన్న లక్షణాలు తల్లిదండ్రుల నుండి సంతతి పొందే ప్రక్రియను వంశపారంపర్యం అంటారు.
జవాబు:
విభిన్న లక్షణాలు తల్లిదండ్రుల నుండి సంతతి పొందే ప్రక్రియను అనువంశికత అంటారు.
67. ఒక జత విభిన్న లక్షణాలు గల రెండు బఠాణీ మొక్కల మధ్య సంకరణం చేయడాన్ని ద్విసంకర సంకరణం అని అంటారు.
జవాబు:
ఒక జత విభిన్న లక్షణాలు గల రెండు బఠాణీ మొక్కల మధ్య సంకరణం చేయడాన్ని ఏకసంకర సంకరణం అని అంటారు.
68. ఒక వ్యక్తి యొక్క లింగ నిర్ధారణలో సహాయపడే క్రోమో జోమ్ జతను శారీరక క్రోమోజోములు అని అంటారు.
జవాబు:
ఒక వ్యక్తి యొక్క లింగ నిర్ధారణలో సహాయపడే క్రోమోజోమ్ జతను లైంగిక క్రోమోజోములు అని అంటారు.
69. ఆర్తిత లక్షణాలు అనేవి ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమించే లక్షణాలు.
జవాబు:
అనువంశికత లక్షణాలు అనేవి ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమించే లక్షణాలు.
70. నిర్మాణ సామ్య అవయవాలు విభిన్న నిర్మాణం కలిగి మరియు ఒకే విధిని కలిగి ఉంటాయి.
జవాబు:
క్రియాసామ్య అవయవాలు విభిన్న నిర్మాణం కలిగి మరియు ఒకే విధిని కలిగి ఉంటాయి.
71. మానవులలో శిశువు యొక్క లింగ నిర్ధారణ అనేది స్త్రీ బీజము యొక్క రక్తాన్ని బట్టి నిర్ణయింపబడుతుంది.
జవాబు:
మానవులలో శిశువు యొక్క లింగ నిర్ధారణ అనేది పురుష బీజము యొక్క రక్తాన్ని బట్టి నిర్ణయింపబడుతుంది.
72. బీజ కణాలు ఏర్పడేటప్పుడు ఒక జత లక్షణాలకు కారణమైన కారకాలు వేరే లక్షణాలపై ఆధారపడకుండా స్వతంత్రంగా సంతతికి లభించడాన్ని బహిర్గతత్వ సూత్రం అంటారు.
జవాబు:
బీజ కణాలు ఏర్పడేటప్పుడు ఒక జత లక్షణాలకు కారణమైన కారకాలు వేరే లక్షణాలపై ఆధారపడకుండా స్వతంత్రంగా సంతతికి లభించడాన్ని స్వతంత్ర జన్యు
వ్యూహన సిద్దాంతం అంటారు.
73. ఒక జీవి అండం మొదలుకొని సంపూర్ణంగా ఎదగడం వరకు గల వివిధ అభివృద్ధి దశలను గురించిన అధ్యయనం చేయడాన్ని పురాజీవశాస్త్రం అంటారు.
జవాబు:
ఒక జీవి అండం మొదలుకొని సంపూర్ణంగా ఎదగడం వరకు గల వివిధ అభివృద్ధి దశలను గురించిన అధ్యయనం చేయడాన్ని పిండోత్పత్తి శాస్త్రం అంటారు. 66. మొక్కల పెంపకం, సంకరణం గురించి డార్విన్ తన ప్రయోగాల్లో ఇలా పేర్కొన్నాడు. అనువంశికత సూత్రాలను ఆయన ప్రతిపాదించారు. జ. మొక్కల పెంపకం, సంకరణం గురించి మెండల్ తన – ప్రయోగాల్లో ఇలా పేర్కొన్నాడు. అనువంశికత సూత్రాలను ఆయన ప్రతిపాదించారు.
74. ఒక జీవి యొక్క జీవిత కాలంలో అభివృద్ధి చేసుకున్న లక్షణాలను వంశపారంపర్య లక్షణాలుగా పిలుస్తారు.
జవాబు:
ఒక జీవి యొక్క జీవిత కాలంలో అభివృద్ధి చేసుకున్న లక్షణాలను ఆర్జిత లక్షణాలుగా పిలుస్తారు.
జతపరచుట
75. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
లామర్కిజం – లామార్క్
బీజద్రవ్య సిద్ధాంతం – మెండల్
డార్వినిజం – డార్విన్
జవాబు:
బీజద్రవ్య సిద్ధాంతం – మెండల్
76. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
ఉపయుక్త నిరుపయుక్త అవయవాలు – వీస్మన్
ఎలుకలపై ప్రయోగాలు – లామార్క్
ఫించ్ పక్షులలో వైవిధ్యం – డార్విన్
జవాబు:
ఫించ్ పక్షులలో వైవిధ్యం – డార్విన్
77. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
ముళ్ళు మరియు నులి తీగలు – క్రియాసామ్య అవయవాలు
క్యారెట్ మరియు అల్లం – నిర్మాణసామ్య అవయవాలు
ఆర్కియోటెరిక్స్ – సంధాన సేతువు
జవాబు:
ఆర్కియోటెరిక్స్ – సంధాన సేతువు
78. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
కార్బన్ డేటింగ్ – హైడ్రోజన్
జన్యుపదార్థం – DNA
కెటోసారస్ – శిలాజం
జవాబు:
కార్బన్ డేటింగ్ – హైడ్రోజన్
79. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
F1 తరం – TT, Tt, it
జనక తరం – Tr, it
F2 తరం – It
జవాబు:
జనక తరం – TT, tt
80. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
విషమయుగ్మజం – YY
సమయుగ్మజం – Yy
YY, Yy- యుగ్మ వికల్పాలు
జవాబు:
YYYy – యుగ్మ వికల్పాలు
81. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
దృశ్యరూపం – 3 : 1
జన్యురూపం – 1 : 2 : 1
పన్నేట్ స్క్వేర్ – డార్విన్
జవాబు:
పన్నేట్ స్క్వేర్ – డార్విన్
82. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
లైంగిక క్రోమోజోములు – 44
పురుష లైంగిక క్రోమోజోములు – X,Y
స్త్రీ లైంగిక క్రోమోజోములు – Y
జవాబు:
స్త్రీ లైంగిక క్రోమోజోములు – Y
83. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
పూల రంగు – నీలం
విత్తనం రంగు – పసుపు
కాయ రంగు – ఎరుపు
జవాబు:
విత్తనం రంగు – పసుపు
బొమ్మలపై ప్రశ్నలు
84.
ఈ పటాలు దేనిని సూచిస్తున్నాయి?
జవాబు:
చెవి తమ్మెలలో వైవిధ్యాన్ని సూచిస్తున్నాయి.
85.
ఈ కాయ సహాయంతో మొక్కను గుర్తించండి.
జవాబు:
బఠానీ మొక్క
86.
ఈ చతురస్రము అభివృద్ధి చేసినది ఎవరు?
జవాబు:
ఆర్.సి. పన్నెట్
87.
ఈ జన్యుపదార్థం యొక్క నిర్మాణం పేరేమిటి?
జవాబు:
ద్వికుండలిని నిర్మాణం
88.
ఏరకమైన పరిణామ సిద్ధాంతాన్ని ఈ చిత్రం సూచిస్తుంది?
జవాబు:
బీజ ద్రవ్య సిద్ధాంతం
89.
ఏ వర్గాలకు ఈ జీవి సంధాన సేతువుగా ఉంటుంది?
జవాబు:
సరీసృపాలు మరియు పక్షులు
90.
తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రదేశంలో ఈ శిలాజాన్ని భద్రపరచారు?
జవాబు:
BM బిర్లా సైన్స్ సెంటర్, హైదరాబాదు
91.
లాగూర్క్ ప్రతిపాదించిన సూత్రం ఏమిటి?
జవాబు:
కణాల అనువంశికత
92.
ఈయన ప్రతిపాదించిన పరిణామ సిద్ధాంతం పేరు?
జవాబు:
ప్రకృతివరణం
93.
ఈయన ఏ శాస్త్రానికి పితామహుడు?
జవాబు:
పురాజీవశాస్త్రం
ఖాళీలను పూరించండి
94. జీవుల మధ్య గల స్యల ను…………
జవాబు:
వైవిధ్యం
95. జీవుల లక్షణాలు తరువాతి తరానికి సంక్రమించడాన్ని ……….. అంటారు.
జవాబు:
అనువంశికత
96. జన్యుశాస్త్ర పితామహుడు ……………
జవాబు:
మెండల్
97. బఠానీ మొక్క శాస్త్రీయ నామం ………..
జవాబు:
పైసమ్ సటైవమ్
98. ఏక సంకరణ ప్రయోగ దృశ్యరూప నిష్పత్తి
జవాబు:
3 : 1
99. ………. శాస్త్రం శిలాజాలను అధ్యయనం చేస్తుంది.
జవాబు:
జన్యుశాస్త్రం
10th Class Biology 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 1 Mark Bits Questions and Answers
1. గాలాపాగన్ దీవులలోని ఈ జీవుల నిర్మాణంలోని వైవిధ్యాలను డార్విన్ గుర్తించాడు
A) ఏనుగులు
B) జిరాఫీలు
C) ఎలుకలు
D) ఫించ్ పక్షులు
జవాబు:
D) ఫించ్ పక్షులు
2. క్రింది పటంలోని జీవుల శరీర భాగాలు ……… కు ఉదాహరణ.
A) నిర్మాణ సామ్య అవయవాలు
B) క్రియాసామ్య అవయవాలు
C) సహజాత అవయవాలు
D) పైవేవీ కావు
జవాబు:
A) నిర్మాణ సామ్య అవయవాలు
3. జాతుల ఉత్పత్తి (The Origin of Species) రచయిత ………
A) ఛార్లెస్ డార్విన్
B) బాప్టిస్ట్ లామార్క్
C) ఛార్లెస్ లైల్
D) గ్రిగర్ జోహాన్ మెండల్
జవాబు:
A) ఛార్లెస్ డార్విన్
4. జెనిటిక్స్ పితామహుడు ….
(లేదా)
జన్యుశాస్త్ర పిత ఎవరు?
A) మెండల్
B) డార్విన్
C) వాట్సన్
D) లామార్క్
జవాబు:
A) మెండల్
5. DNA నిర్మాణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త
A) వాట్సన్
B) క్రిక్
C) పై ఇద్దరూ
D) వీరిద్దరూ కాదు
జవాబు:
A) వాట్సన్
6. పురా జీవశాస్త్రం దీని గురించి తెల్పుతుంది …………
A) ?
B) శిలాజాలు
C) విత్తనాలు
D) ఫలాలు
జవాబు:
B) శిలాజాలు
7. క్రింది వ్యాఖ్యలలో సరికానిది.
A) మాలాస్ సిద్ధాంతము ‘An Essay on the Principles of Population’ లో ఉంది.
B) జీవ పరిణామ సిద్ధాంతమును చార్లెస్ ఎల్ వ్రాశాడు.
C) ప్రకృతి వరణము అనే ప్రఖ్యాత సిద్ధాంతమును
D) “ఆర్జిత గుణాల అనువంశికత” అనే సిద్ధాంతాన్ని లామార్క్ ప్రతిపాదించాడు.
జవాబు:
B) జీవ పరిణామ సిద్ధాంతమును చార్లెస్ ఎల్ వ్రాశాడు.
8. ఒక సమయుగ్మజ పొడవు మొక్కను, ఒక సమయుగ్మజ పొట్టి మొక్కతో సంకరీకరణం జరిపినప్పుడు F1 తరంలో జన్యురూప నిష్పత్తి
A) 2 : 1 : 1
B) 1 : 1 : 2
C) 1 : 2: 1
D) 2 : 2 : 2
జవాబు:
C) 1 : 2: 1
9. క్రింది వాటిని జతపరుచుము.
1. DNA ( ) a. జన్యుశాస్త్ర పిత
2. మెండల్ ( ) b. ప్రకృతి వరణం
3. డార్విన్ ( ) c. ద్వికుండలి
A) 1 – a, 2 – b, 3 – c
B) 1 – b, 2 – c, 3 – a
C) 1 – c, 2 – b, 3 – a
D) 1 – c, 2 – a, 3 – b
జవాబు:
D) 1 – c, 2 – a, 3 – b
10. క్రింది వాటిలో మెండల్ తన ప్రయోగాలకు బరానీ
A) స్పష్టమైన లక్షణాలు కలిగి ఉండడం
B) ద్విలింగ పుష్పాలు కలిగి ఉండడం
C) ఆత్మపరాగ సంపర్కం జరపడం
D) తక్కువ ఖరీదు
జవాబు:
D) తక్కువ ఖరీదు
11. కింది వానిలో డార్విన్ సిద్ధాంతంకు సంబంధించనిది.
A) ఒక సమూహంలోని అన్ని జీవులు ఒకే రకంగా ఉండవు.
B) వైవిధ్యాలు జనకుల నుండి సంతతికి అందవచ్చు.
C) పరిణామం నెమ్మదిగా, నిరంతరాయంగా జరుగుతుంది.
D) జనాభా గుణ శ్రేణిలో పెరగదు.
జవాబు:
D) జనాభా గుణ శ్రేణిలో పెరగదు.
12. క్రియాసామ్య అవయవాలు
A) మేక పూర్వాంగం మరియు పక్షి రెక్క
B) తిమింగలం వాజం మరియు పక్షి రెక్క
C) మనిషి చేయి మరియు పక్షి రెక్క
D) గబ్బిలం రెక్క మరియు పక్షి రెక్క
జవాబు:
D) గబ్బిలం రెక్క మరియు పక్షి రెక్క
13. i) చాలా దగ్గర సంబంధం గల జీవులలో వైవిధ్యాలు కనిపిస్తాయి.
ii) జనకులు తమ యుగ్మ వికల్పాలలోని ఏదో ఒక యుగ్మ వికల్పాన్ని యధేచ్చగా సంతతికి అందిస్తారు. చార్లెస్ డార్విన్ ప్రతిపాదించాడు.
A) (i) సరైనది; (ii) సరైనది.
B) (i) సరికాదు; (ii) సరికాదు.
C) (i) సరైనది; (ii) సరికాదు.
D) (i) సరికాదు; (ii) సరైనది.
జవాబు:
A) (i) సరైనది; (ii) సరైనది.
14. బరానీ మొక్క నందు కింది ఏ లక్షణాన్ని మెండల్ ఎంపిక చేయలేదు?
A) విత్తనం రంగు
B) పుష్పం ఉన్న స్థానం
C) విత్తన బరువు
D) కాండం పొడవు
జవాబు:
C) విత్తన బరువు
15. ప్రకృతి వరణం అనగా ………..
A) ప్రకృతి యోగ్యత కలిగిన లక్షణాలను ఎంపిక చేయడం
B) ఉపయోగం లేని లక్షణాలను ప్రకృతి ఎంపిక మొక్కను ఎంపిక చేసుకోవడానికి కారణం కానిది చేయడం
C) ప్రకృతి యోగ్యత కల్గిన లక్షణాలను వ్యతిరేకించడం
D) పైవేవి కావు
జవాబు:
A) ప్రకృతి యోగ్యత కలిగిన లక్షణాలను ఎంపిక చేయడం
16. మెండల్ ఏక సంకరణ ప్రయోగాలలో F2 తరంలో దృశ్యరూప నిష్పత్తి
A) 2: 1 : 1
B) 1 : 2 : 1
C) 3 : 1
D) 9 : 3 : 3 : 1
జవాబు:
C) 3 : 1
17. కింది వాటిలో సరయిన జతను గుర్తించండి.
A) గ్రిగర్ జోహన్ మెండల్ – పృథక్కరణ సూత్రం
B) జీన్ బాప్టిస్ట్ లామార్క్ – ప్రకృతి వరణం
C) చార్లెస్ డార్విన్ – ఆర్జిత గుణాల అనువంశికత
D) అగస్ట్ వీస్మాన్ – జనాభా సిద్ధాంతం
జవాబు:
A) గ్రిగర్ జోహన్ మెండల్ – పృథక్కరణ సూత్రం
మీకు తెలుసా?
• మెండల్ చేసిన ప్రయోగాలకు ఉదాహరణలు
మెండల్ ఏ ప్రయోగం చేసినా దానికి సంబంధించిన అంశాలన్నింటినీ ఎప్పటికప్పుడు రాసిపెట్టుకునేవాడు. కింది అంశాలను పరిశీలిస్తే మెండల్ ఎన్ని ప్రయోగాలు నిర్వహించాడో, ఎన్ని ఫలదీకరణలు జరిపాడో, ఎన్ని మొక్కలపై ప్రయోగాలు చేశాడో మనం తెలుసుకోవచ్చు.
- మొదటి ప్రయోగం 15 మొక్కలపై 60 ఫలదీకరణలు.
- రెండవ ప్రయోగం 10 మొక్కలపై 58 ఫలదీకరణలు
- మూడవ ప్రయోగం 10 మొక్కలపై 35 ఫలదీకరణలు
- నాల్గవ ప్రయోగం 10 మొక్కలపై 40 ఫలదీకరణలు.
- ఐదవ ప్రయోగం 5 మొక్కలపై 23 ఫలదీకరణలు
- ఆరవ ప్రయోగం 10 మొక్కలపై 34 ఫలదీకరణలు
- ఏడవ ప్రయోగం 10 మొక్కలపై 37 ఫలదీకరణలు.
మెండల్ ఎన్నో రకాలుగా ప్రయోగాలు నిర్వహించినప్పటికి వాటినన్నిటిని క్రోడీకరించి ఒక సాధారణ రూపంలోనికి మార్చడాన్ని మనం గమనించవచ్చు.
• బఠానీ ఏకవార్షిక మొక్క. ఇది తన జీవిత చక్రాన్ని ఒక సంవత్సరంలో పూర్తి చేస్తుంది. ప్రపంచంలో అనేక ప్రాంతాలలో బఠానీ సులభంగా పెరగగలుగుతుంది. క్రీ.పూ. 2000 సం॥లో ఆఫ్ఘనిస్తాన్లో బఠానీ ఉన్నట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. క్రీ.పూ. 2250 – 1750 కాలంలో హరప్ప ప్రస్తుత పాకిస్తాన్ వాయవ్య భారతదేశ ప్రాంతంలో బఠానీని పండించినట్లుగా రుజువులున్నాయి. అలాగే గంగానదీ పరివాహక ప్రాంతంలోని దక్షిణ భారతదేశంలోని బఠానీ పంట పండించేవారు. దీనిలో విటమిన్ ‘ఎ, సి, ఇ, కె మరియు బి కాంప్లెక్స్’లు Ca, Fe, Mg, Mn, P, S మరియు Zn లవణాలు కూడా ఉన్నాయి.
• జేమ్స్ వాట్సన్ మరియు ఫ్రాన్సిస్ క్రిక్ అనే శాస్త్రవేత్తలు 1953లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చేసిన పరిశోధనల్లో DNA యొక్క పూర్తి నిర్మాణాన్ని కనుగొన్నారు. DNA అణువు సర్పిలంగా ఉండే మెట్ల మాదిరిగా ఉంటుందని గుర్తించారు.
ఈ ఆకారాన్నే ద్వంద్వ కుండలి (Double helix) అని అంటారు. ఇది ఏకాంతరంగా అమర్చబడిన చక్కెరలు మరియు ఫాస్ఫేట్లతో నిర్మితమై ఉంటుంది. దీనిలో అడినిన్, గ్వానిస్, థైమిన్ మరియు సైటోసిన్ అనే నత్రజని క్షారాలు మెట్లవలె అమరి ఉంటాయి. ఫ్రాంక్లిన్ మరియు మౌరిస్ విల్కిన్లు కూడా DNA ఆవిష్కరణలో వాట్సన్, లతో కలిసి పనిచేశారు. జన్యుశాస్త్రంలో నూతన ప్రయోగాలకు దారితీసిన ఈ అద్భుత ఆవిష్కరణకు గాను వాట్సన్ మరియు క్రిక్స్ బృందానికి నోబెల్ బహుమతి వచ్చింది. DNA యొక్క రసాయనిక స్వభావం జీవులలో లక్షణాలను నిర్ధారిస్తుంది. జుట్టు, చర్మపు రంగు మొదలైనవి ఇలాంటి లక్షణాలకు ఉదాహరణలు. DNA యొక్క రసాయనిక నిర్మాణంలో ఏ చిన్న మార్పు కలిగినా అది సంతతి యొక్క లక్షణాలలో మార్పుకు కారణమవుతుంది. ఆ మార్పులే వైవిధ్యాలకు దారితీస్తాయి.
• లైంగిక క్రోమోజోమ్ ఆవిష్కరణ :
వాల్టర్ స్టటన్ మరియు థామస్ హంట్ మోర్గాన్లు 1956వ సంవత్సరంలో చిన్న పండ్ల ఈగ –సోఫిలా మెలనోగాస్టర్) గురించి కొలంబియా యూనివర్సిటీలో అధ్యయనం చేశారు. గ్రాసోఫిలాలో లింగ సహలగ్నత లక్షణాలను కనుగొనేటప్పుడు లక్షణాలకు కారణమయ్యే జన్యువులు క్రోమోజోమ్ లో ఉన్నట్లు నిర్ధారించబడినది. డ్రాసోఫిలాలలోని వంశపారంపర్యత గురించి వాళ్ళు పూర్తిగా అధ్యయనం చేశారు.
• చారెస్ డార్విన్, ఆల్బెడ్ రస్పెల్ వాలెట్ల ఆలోచనలు ఒకేలా ఉండేవి. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని రూపొందిస్తున్న సమయంలో వాలెస్ రాసిన ఉత్తరాన్ని అందుకున్నాడు. వాలెస్ ఇండోనేషియా దీవులలో తన పరిశోధనల గురించి, ప్రకృతి వరణం గురించి రాశాడు. తాను ఆలోచించినట్లుగానే వాలెస్ సిద్ధాంతం కూడా ఉండటం డార్విన్‌ను చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. తరవాత డార్విన్, వాలెస్ కలిసి Journal of Linnaean Society పత్రికలో ప్రకృతి వరణం గురించి ఒక వ్యాసాన్ని ప్రచురించారు.
దాని తరవాతే డార్విన్ తన ప్రముఖమైన గ్రంథం ‘జాతుల | ఆల్ఫ్రెడ్ రస్సెల్ ఉత్పత్తి (The Origin of Species)’ ప్రచురించి, ప్రకృతి వరణం గురించి వివరించాడు.
• ఆర్కియోప్టెరిక్స్ అనే సంధాన సేతువు దేనిని పోలి ఉంటుంది. పక్షులనా? సరీసృపాలనా? లేదా రెండింటినా? రెండు విభిన్న సమూహాలకు చెందిన లక్షణాలను కలిగి ఉండే జీవులను సంధాన సేతువులు అంటారు. ఆర్కియోప్టెరిక్స్ యొక్క శిలాజం పక్షులు, సరీసృపాల నుండి పరిణామ క్రమంలో ఉద్భవించాయని తెలియజేస్తుంది. అందువల్ల దీనిని పక్షులకు, సరీసృపాలకు మధ్య సంధానంగా భావిస్తారు.
పునశ్చరణ